Tuesday, August 25, 2009

నిద్ర , Sleep




నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము . నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగు తుంది . . . కలతపడ్డ మనసు కుదుట పడుతుంది . చాలినంత నిద్రలేక పోతే అది చాలా రుగ్మతల్కు దారి తీస్తుంది . మనసు మీద ప్రభావము చూపుతుంది . శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి.


ఎన్ని గంటలు నిద్రపోవాలి

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.


  • వయసు ---------రోజుకు కావలసిన సగటు నిద్ర
  • పురిటిబిడ్డ -------సుమారు 18 గంటలు
  • 1–12 నెలలు--------------14–18 గంటలు
  • 1–3 సంవత్సరాలు---------12–15 గంటలు
  • 3–5 సంవత్సరాలు ---------11–13 గంటలు
  • 5–12 సంవత్సరాలు ---------9–11 గంటలు
  • యువకులు -----------------9-10 గంటలు
  • పెద్దవారు --------------------7–8 గంటలు
  • గర్భణీ స్త్రీలు -----------------8 (+) గంటలు

ప్రయోజనం

  • నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
  • నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
  • హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
నిద్రలో దశలు :
్రి ి్రపోయే ్ని ెం్తి్తు. " మ్‌ " , "నన్‌ మ్‌"  ి .
మ్‌ అంటే " ిడ్ ూవ్ ెంట్ " నేిి ంక్షి్త ు . ఇంలో ుంటాయి.  
1. తి 5 ిలే . ి ి్రలోి వ్ళే . ్పిం ్ళఉంటాయి. లో ి్నిా వెంనే ువ్తుంి .
 
నిద్ర లేమి :
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :
  • దైనందిన జీవితం లో పని వత్తిడి ,
  • మానషిక వత్తిడి ,
  • టీవీ చూడడం ,
  • కంప్యుటర్ పై పనిచేయడం ,
  • కుటుంబ సమస్యలు ,
  • ఆర్ధిక సమస్యలు ,
  • ఆహార నియమాలు ,
  • చెడ్డ అలవాట్లు ,

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :
  • రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
  • రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
  • నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

    • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
    • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

    • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

    • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ట్రీట్మెంట్ :
  • అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .
నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :

నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...


* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

రాత్రిపూట గాఢనిద్ర తగ్గితే--పురుషులకు గుండె జబ్బులే!

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషులు రాత్రివేళ గాఢ నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో మధ్యమధ్యలో నిద్ర లేవడం పురుషుల్లోనే అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్నిసార్లు తమ సొంత గురకవల్లే నిద్ర లేస్తారని చెప్పారు. ఫలితంగా నిరంతరాయ నిద్ర సమయం తగ్గిపోతుందని వివరించారు. అంతరాయాలులేని నిద్ర తక్కువగా ఉండేవారిలో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదిగుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా 65ఏళ్లు పైబడ్డ 784మంది పురుషుల నిద్ర అలవాట్లను పరిశీలించారు. రాత్రిళ్లు చాలా తక్కువగా గాఢనిద్ర పోయేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది.

ఏడు గంటల నిద్ర చాలు : 
ఆరు , ఏడు , ఎనిమిది ... ఎన్ని గంటల నిద్ర అవసరము ? ... అని ప్రశ్నించుకుంటే ఏడు గంటల గాడనిద్ర అని చెప్పుకోవాలి. 7 గంటలకంటే తక్కువ  లేదా ఎక్కువ నిద్ర పోతే గుండే జబ్బులు వచ్చే ఆస్కారము ఎక్కువ అని పరిశోధనలలో గుర్తించారు . ఈ నియమము 20 సంవత్సరాలు దాటినవారికే.

Extra sleep is good,అదనపు నిద్ర మంచిదే!

అతిగా నిద్రపోవటమనేది మంచి అలవాటేమీ కాదు. కానీ తక్కువ సమయం నిద్రపోయేవారు అదనంగా రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోవటం మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చురుకుదనం మాత్రమే కాదు.. నొప్పిని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తగినంత నిద్రపోనివారు మరింత ఎక్కువసేపు నిద్రపోతే నొప్పి తీవ్రత తగ్గటానికి దోహదం చేస్తోందని అమెరికాలోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన థామస్‌ రోథ్‌ పేర్కొంటున్నారు. దీర్ఘకాల వెన్నునొప్పి వంటి అన్నిరకాల నొప్పులపైనా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. ఒకవేళ ఇప్పటికే 8 గంటల సేపు నిద్రపోతుంటే మాత్రం మరింత నిద్ర అవసరం లేదని గుర్తించాలని వివరిస్తున్నారు. ఇంతకీ నొప్పికి, నిద్రలేమికి సంబంధం ఏంటి? ఈ రెండూ శరీరంలో వాపు సంకేతాల స్థాయులను పెంచుతాయని.. అందువల్ల మరింత ఎక్కువ నిద్రపోవటం వాపు తగ్గేందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ------ source : Medicine update (magazine).

  • జ్ఞాపకశక్తికి నిద్రే మందు!
ఎంత చదివినా గుర్తుండటం లేదా? అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను, ఎదురైన సంఘటనలను బలమైన జ్ఞాపకాలుగా పదిల పరచుకోవటానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. గత జ్ఞాపకాలతో కొత్తవాటిని కలపటానికీ, సృజనాత్మక ఆలోచనలు పుట్టుకురావటానికీ దోహదం చేస్తుంది. ఇంతకీ నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని జ్ఞాపకాలు ఎలా స్థిరపడతాయి? నిద్ర సరిగా లేకపోతే నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? వీటిని పసిగట్టేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచటానికి, వృద్ధుల్లో మతిమరుపును తగ్గించటానికి కొత్త పద్ధతులను రూపొందించటంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

మనం నిద్రపోతున్నప్పుడు తేలికైన నిద్ర, గాఢనిద్ర, కంటి కదలికలు వేగంగా ఉండే (రెమ్‌) నిద్ర వంటి దశలుంటాయి. సాధారణంగా రెమ్‌ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలన్నీ క్రమంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి ఏర్పడుతుంటాయి. విషయాలను నేర్చుకోవటంలో రెమ్‌ దశ చాలా కీలకపాత్ర పోసిస్తుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే నేర్చుకునే సామర్థ్యమూ 40% వరకు పడిపోతుంది. కొత్త జ్ఞాపకాలు స్థిరపడేందుకు తోడ్పడే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ఆయా సంఘటనల వారీగా మెదడులో కొత్త జ్ఞాపకాలు పోగుపడుతుంటాయి. వీటిలో చాలావరకు మరచిపోతుంటాం కూడా. జ్ఞాపకాలు తొలిసారి ఏర్పడినప్పుడు అంత బలంగా ఉండవు. చాలా అపక్వంగా, సున్నితంగా ఉంటాయి. కానీ నిద్ర పోయినప్పుడు వాటిని నెమరువేసుకోవటానికి మెదడుకు తగినంత సమయం దొరుకుతుంది. ఏయే సంఘటనలను గుర్తుంచుకోవాలో, వేటిని వదిలించుకోవాలో కూడా నిర్ణయించుకుంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు జ్ఞాపకాలు బలోపేతమవుతాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌ చెబుతున్నారు. పియానోపై మంచి గేయాన్ని వాయించటం వంటి కొన్ని పనులకు సంబంధించిన జ్ఞాపకాలు నిద్రపోతున్నప్పుడు మెరుగుపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. గాఢనిద్ర దశలో జ్ఞాపకాలు మరింత స్థిరంగా కొనసాగుతాయి. రెమ్‌ దశలోనేమో ఈ జ్ఞాపకాల్లో ఒకదాంతో మరోదానికి సంబంధం గల వాటి మధ్య బంధాలు ఏర్పడతాయి. భావోద్వేగ జ్ఞాపకాల విశ్లేషణకూ రెమ్‌ దశ తోడ్పడుతుంది. దీంతో భావోద్వేగాల తీవ్రతా తగ్గుతుంది.

నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ నిద్రా పద్ధతులు కూడా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు 30 ల చివర్లో బలమైన జ్ఞాపకాలకు తోడ్పడే నిద్ర తగ్గిపోవటం మొదలవుతుంది. 18-25 ఏళ్ల వారితో పోలిస్తే 60 ఏళ్లు పైబడినవారిలో గాఢనిద్ర 70% వరకు తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ముందురోజు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇందుకు గాఢ నిద్ర తగ్గిపోవటంతో సంబంధం ఉంటోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ పేర్కొంటున్నారు. అందువల్ల వృద్ధుల్లో గాఢనిద్రను పెంచటానికి తోడ్పడే పద్ధతుల మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంపొందించే చికిత్సలు అంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా పట్టే చికిత్సలు రూపొందిస్తే గణనీయమైన ఫలితాలు కనబడతాయని వాకర్‌ చెబుతున్నారు. యువకులు కూడా ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకున్న తర్వాత రాత్రిపూట నిద్రపోతే మంచి ఫలితాలు ఉంటాయని, ఆయా విషయాలు బాగా గుర్తుండటానికిది తోడ్పడుతుందని స్టిక్‌గోల్డ్‌ సూచిస్తున్నారు.

చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

  • స్త్రీ-పురుషుల నిద్ర వేరువేరుగా ఉంటుందా?
నిద్ర.. స్త్రీ పురుషులకి సమానమేనా? ఇంత వరకూ అలాగే భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు! అయితే నిద్ర పద్ధతీ, మోతాదూ, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులకి వేర్వేరని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాకి చెందిన ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త మోనికా మల్లంపల్లి నేతృత్వంలోని సొసైటీ ఫర్‌ విమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (ఎస్‌డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఈ పరిశోధన నిర్వహించింది. మగవారికంటే మహిళల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉందని ఇందులో తేల్చారు. పురుషుల కంటే స్త్రీలు నిద్రలోకి జారుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోందని కనిపెట్టారు. పగటివేళ మగతగా ఉందనే ఫిర్యాదూ ఎక్కువగా మన నుంచే ఎదురవుతోందట. వీటన్నింటికీ మహిళల్లోని ప్రత్యేక హార్మోన్ల ప్రభావమే కారణమని చెబుతున్నారు. నెలసరికి ముందూ, నెలసరప్పుడూ స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారట. పెళ్లయ్యాక గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలూ, వీటికి తోడు ఇల్లూ, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని పరిశోధన తేల్చింది. పురుషులకు ఇటువంటి సమస్యలు ఎప్పుడో కానీ ఉండవనీ అంటోంది. 'నిద్ర విషయంలో స్త్రీలకు ఇన్ని సమస్యలున్నా, ఇంతవరకూ దానిపై ప్రత్యేకంగా ఆశించినంతగా ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిద్రలేమి పరీక్షలన్నీ కూడా పురుషుల నిద్ర తీరుల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు' అంటున్నారు అధ్యయనకర్తలు.
  • =======================
visit my website : Dr.seshagirirao.com



Monday, August 24, 2009

స్వైన్ ఫ్లూ , Swine Flue


స్వైన్ ఫ్లూ (swine flue) అంటే ఏమిటి ?: పందులు వలన కలిగే ఒక రకమైన ఉపిరితిత్తుల వ్యాధి . . . ఇది స్వైన్ ఇంఫ్లు ఎంజా --H1N1 వైరస్ కారణము గా పందులలో తరచుగా వచ్చే వ్యాధి . గాలి ద్వార జంతువుల నుండి మనుషులకు .. మనిషి నుండి మనిషికి సులువుగా వ్యాప్తి చెందుతుంది . ఇది మొదటి సారిగా అమెరికా లో ఏప్రిల్ 2009 లో కనుగొనబడినది .

స్వైన్ ఫ్లూ అంటు వ్యాదా ? ఎలా వ్యాపిస్తుంది ?:
అవును ఇది అంటు వ్యాధే . గాలి ద్వారా దగ్గు , తుమ్ము , ఉపిరి , చేతులతో ముట్టుకోవడం (touching) వలన మనిషి నుండి మనిషికి వస్తుంది . బయట ఈ క్రిములు 2 నుండి 3 గంటలు బ్రతికి ఉంటాయి . వ్యాధి ప్రభలి ఉన్న ప్రదేశాలలో సంభందిత వ్యక్తులు వాడే సామానులను తాకకూడదు . వైరస్ సంఖ్య (వైరస్ లోడ్) ను తగ్గించడానికి ముక్కు మాస్క్ లు ధరించాలి . దగ్గేటపుడు , తుమ్మేటపుడు గుడ్డ అడ్డుపెట్టుకోవాలి . జబ్బుతో భాదపాడు తున్నవారు వారివారి పనులకు వెళ్ళకుండా ప్రత్యేకము గా (ఐసోలేట్-isolate) అయిఉండాలి .

లక్షణాలు ఏమిటి ? : సాదారణ ఫ్లూ జలుబు లక్షణాలు గానే ఉంటాయి .
  • చలి తో జ్యరము ,
  • దగ్గు , గొంతు నొప్పి,
  • వాళ్ళు నొప్పులు ,
  • తలనొప్పి ,
  • నీరసము గా ఉండడము .
  • కొంతమందికి వాంతి , నీళ్ళ విరోచనాలు ఉండవచ్చును ,


ఎలా నిర్ధరిస్తాము ?:
రెగ్యులర్ ఫ్లూ లాగానే ఉన్నందున ఉపిరి తిత్తుల నుండి తీసుకున్న స్పెసిమన్ (కెల్లా , ఉమ్మి , మూకస్ ద్రవాలు) లేబరిటరి లో తనికీ చేయడం వలన మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించగలము . ఒక రోజు నుండి ఇదు రోజు లలో ఈ వైరస్ లు ఎక్కువగా టెస్టింగ్ కి దొరుకు తాయి .

ఒక వ్యక్తీ ఎంతకాలము జబ్బును వ్యాప్తి చేస్తాడు ? :
1 రోజునుండి 7 రోజులు వరకు ఆ తరువాత ఈ వ్యాధి తీవ్రత తగ్గి పోవును .

వ్యాధికి వ్యాక్సిన్ లబిస్తుందా ?:
ఈ వైరస్ కొత్తది అయినందున ఇంకా టీకా మందు తాయారు కాలేదు .. సాధారణ జలుబు కి , ఇతర ఇంఫ్లుఎంజా కి పనిచేసే వ్యాక్సిన్ పనికి రాదు . ఒక సం. కాలము లో వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలున్నాయి.

చికిత్స (ట్రీట్మెంట్) :
ఇది శరీర వ్యాధి నిరోధక శక్తి పై ఆధారపడి దానంతట అదే వారం .. పది రోజులలో తగ్గిపోతుంది . తాత్కాలిక భాధలు నివారణకు
  • జ్వరానికు : పేరా సిటమాల్ మాత్రలు 1 మాత్ర రోజుకు మూడు సార్లు
  • జలుబుకి .. జలుబు మందు , దగ్గుకి ... దగ్గు మందు వాడుతూ వ్యాధి తీవ్రతను బట్టి
  • Oseltamivir(Tamiflu) కాని Zanamivir (Relanza) కాని జబ్బు నయము కావడానికి , వ్యాధి నిరోధించడానికి వాడాలి . ఎంత తొందరగా వైద్యం మొదలపెడితే అంత మంచిది .
  • విశ్రాంతి , మంచి ఆహారము , విటమిన్లు తీసుకోవాలి .

ఎవరికి ప్రమాదకరము :
  • 65 సం .దాటినవారికి ,
  • 5 సం . లోపు పిల్లలకు ,
  • గర్భిణీ స్త్రీలు కు ,
  • బాలింతరాల్ల కు ,
  • మధుమేహము , ఉబ్బసము , గుండె జబ్బులు , మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి ,

గర్భిణుల్లో స్వైన్‌ఫ్లూ కలవరం Updated on 26/07/2010.


రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయిగానీ.. ఈ దఫా వైరస్‌ విజృంభణ తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో మరణించిన 10 మందిలో.. ఆరుగురు మహిళలే కావటం ఆందోళనకరమైన విషయమైతే.. మళ్లీ ఈ ఆరుగురిలోనూ కూడా నలుగురు గర్భిణులు, ఇద్దరు బాలింతలుండటం పెద్ద కలకలాన్ని రేపుతోంది.
మృతుల్లో గర్భిణులు, లేదంటే ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన బాలింత తల్లులే ఎక్కువగా ఉండటం తప్పకుండా గుర్తించాల్సిన అంశం! ఈ నేపథ్యంలో వైద్యులందరూ గర్భిణులను, బాలింతలను చూసేటప్పుడు వారికి స్వైన్‌ఫ్లూ లక్షణాలేమైనా ఉన్నాయా? అన్నదీ చూడాలని వైద్య విభాగం సూచిస్తోంది.
  • అపురూపంగా చూసుకోవాల్సిన గర్భిణులకు.. స్వైన్‌ఫ్లూ వస్తే ఏం చెయ్యాలి?
సాధారణ జనాభాకు వస్తే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదన్న దానిపై స్పష్టత ఉంది, దానిపై ఇప్పటికే ఎంతో ప్రచారం కూడా జరిగింది. కానీ గర్భిణులకు వస్తే ఏం చెయ్యాలన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా కేసుల నేపథ్యంలో దీనిపై రకరకాల అనుమానాలు, ఆందోళనలు, అపోహలు పెరుగుతున్నాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనబడితే గర్భిణులకు 'టామిఫ్లూ' ఇవ్వచ్చా? ఇచ్చినా బిడ్డకుగానీ, తల్లికిగానీ ఎటువంటి హానీ ఉండదా? గర్భిణులకు స్వైన్‌ఫ్లూ టీకా ఇస్తే ఫర్వాలేదా? సాధారణ ప్రజానీకంలోనే కాదు.. వైద్య వర్గాల్లో కూడా దీనిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి.

  • గర్భిణులకు స్వైన్‌ఫ్లూ ముప్పు ఎక్కువా?
గర్భిణులకు సహజంగానే 'రోగ నిరోధక శక్తి' బాగా తక్కువగా ఉంటుంది. గర్భం ధరించిన తర్వాత స్త్రీ శరీరంలో హార్మోన్లపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల వీరు రకరకాల ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువ. వేగంగా విజృంభించే 'స్వైన్‌ఫ్లూ' వంటి వైరల్‌ వ్యాధులూ ఇందుకు మినహాయింపేం కాదు. పైగా స్వైన్‌ఫ్లూ వస్తే... గర్భిణులపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. అందుకే అసలు స్వైన్‌ఫ్లూ దరిజేరే అవకాశమే లేకుండా గర్భిణులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఒకవేళ ఫ్లూ జ్వర-లక్షణాలు కనబడితే తక్షణం వైద్యులను సంప్రదించటం కూడా.. అంతే అవసరం.

* బాలింతలు కూడా... కేవలం గర్భిణులే కాదు, ఇటీవలే ప్రసవించిన బాలింతలు, గర్భస్రావాలైన (అబార్షన్లు) స్త్రీలలో కూడా 2 వారాల వరకూ రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. కాబట్టి స్వైన్‌ఫ్లూతో వీరికీ సమస్యలు ఎక్కువేనని గుర్తించాలి.

  • * గర్భిణీలలో స్వైన్‌ఫ్లూ వస్తే కనిపించే లక్షణాలేమిటి?
స్వైన్‌ఫ్లూ లక్షణాలన్నీ సాధారణ ఫ్లూ జ్వర లక్షణాల్లాగే ఉంటాయి. ఒళ్లు కాలిపోయే జ్వరం, దానితో పాటుగా విపరీతమైన అలసట, పొడి దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారటం, ఆకలి తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటివే ఉంటాయి.

* గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే.. దానికి సంబంధించిన దుష్ప్రభావాలు తీవ్రస్థాయిలో ఉంటాయా?
చాలామంది గర్భిణులు, బాలింతల్లో స్వైన్‌ఫ్లూ మరీ అంత తీవ్రంగా ఏమీ ఉండదు. మిగతా అందరిలో మాదిరే.. వ్యాధి తీవ్రత ఓ మోస్తరుగా ఉండి, వీరు కూడా ఓ వారంలో కోలుకుంటారు. అయితే ఈ సమయంలో వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి కొందరిలో న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, ఒంట్లో నీరు తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్‌ ఒళ్లంతా వ్యాపించటం(సెప్సిస్‌), ఫ్లూ మరింత తీవ్రతరమైతే స్పృహ తప్పటం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశమూ ఉంటోంది. ముఖ్యంగా- గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే సాధారణ స్వైన్‌ఫ్లూ రోగుల కంటే వీరిని ఐసీయూ (ICU)లో ఉంచి చికిత్స చెయ్యాల్సిన అవసరం పదిరెట్లు ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. నెలలు నిండిన వారిలో ఈ దుష్ప్రభావాల బెడద మరీ ఎక్కువ. అందుకే గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

* గర్భిణికి 'స్వైన్‌ఫ్లూ' వచ్చిందా.. అనుమానంగా ఉంది. ఏం చెయ్యాలి?
ఫ్లూజ్వర లక్షణాలు కనబడుతూనే గర్భిణులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వెంటనే వైద్యులు అది 'స్వైన్‌ఫ్లూనా?' అన్నది నిర్ధారించేందుకు రక్తం సేకరించి పరీక్షకు పంపిస్తారు. అయితే పరీక్ష ఫలితం వచ్చి, అది నిర్ధారణ అయ్యే వరకూ చికిత్స చెయ్యకుండా ఆగాల్సిన పని లేదు. వెంటనే చికిత్స మొదలుపెట్టెయ్యటం అవసరం. పరీక్షా ఫలితం రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ వేచి చూడటం.. గర్భిణుల విషయంలో శ్రేయస్కరం కాదు. గర్భిణులకు స్వైన్‌ఫ్లూ దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి పరిస్థితి అంత వరకూ వెళ్లక ముందే.. అనుమానించిన వెంటనే చికిత్స ఆరంభించాలి.

  • * గర్భిణులకు 'టామిఫ్లూ' ఇవ్వటం.. తల్లీబిడ్డలకు సురక్షితమేనా?
గర్భిణులకూ, రెండు వారాల్లోపు బాలింతలకు.. స్వైన్‌ఫ్లూ అని అనుమానంగా ఉన్నా, లేక పరీక్షల్లో నిర్ధారణ అయినా కూడా.. యాంటీవైరల్‌ మందు 'ఒసాల్టిమివిర్‌' (టామిఫ్లూ)తో చికిత్స ఆరంభించాలి. నెలలు నిండిన వారితో సహా ఎన్నో నెల గర్భిణులైనా ఈ మందు తీసుకోవచ్చు. వీటిని గర్భిణులపై ప్రత్యేకంగా పరీక్షించి చూడలేదుగానీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సమాచారమంతా కూడా.. స్వైన్‌ఫ్లూ కారణంగా తలెత్తే తీవ్ర దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. గర్భిణులకు ఈ మందును ఇవ్వటమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తోంది. ఈ యాంటీవైరల్‌ మందును ఫ్లూ లక్షణాలు ఆరంభమైన తర్వాత ఎంత త్వరగా ఆరంభిస్తే అంత మంచిది. 48 గంటల్లోపు ఆరంభిస్తే ఇది సమర్థంగా పనిచేస్తుంది. తాజా అనుభవాల ప్రకారం- లక్షణాలు ఆరంభమైన 7 రోజుల్లోపు ఇచ్చినా కూడా వీటితో ప్రయోజనం ఉంటోందని వెల్లడైంది.

  • * గర్భిణులు టామిఫ్లూతో పాటు యాంటిబయాటిక్స్‌ కూడా వేసుకోవాలా?
ఇతరత్రా దుష్ప్రభావాలేమీ లేకపోతే గర్భిణులకు ఈ ఒక్క మందు ఇస్తే చాలు. ప్రత్యేకించి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫ్లూ జ్వర లక్షణాలతో పాటు శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన గొంతు-టాన్సిల్స్‌ వాపు నొప్పి, చెవి పోటు వంటి లక్షణాలు కూడా ఉంటే యాంటీబయాటిక్స్‌ కూడా అవసరమవుతాయి. ఈ సమయంలో వీరికి కో-అమోక్సిక్లావ్‌ (పెన్సిలిన్‌/అమోక్సిసిలిన్‌ పడనివారికైతే క్లారిత్రోమైసిన్‌) వంటి యాంటీబయాటిక్స్‌ ఇవ్వచ్చు.

* గర్భిణులు, బాలింతలు తెలిసో తెలియకో ఫ్లూ లేదా స్వైన్‌ఫ్లూ బాధితుల దగ్గరకు వెళ్లటం వల్ల వ్యాధి సోకుతుందేమోనని అనుమానంగా ఉంటే..?
ఫ్లూ/స్వైన్‌ఫ్లూ రాకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా ఈ ఒసాల్టిమివిర్‌(టామిఫ్లూ) మందును తీసుకోవచ్చు. దీనికోసం 75 ఎంజీ కాప్స్యూల్సు రోజుకు 2 చొప్పున, 5 రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయే తప్పించి అస్సలు రాదని మాత్రం చెప్పలేం. కాబట్టి ఈ మందు వాడుతున్నా కూడా ఫ్లూ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లటం మంచిది.

  • * బాలింతలకు స్వైన్‌ఫ్లూ వస్తే..?
గర్భిణుల్లో మాదిరిగా... బాలింతల్లో కింది నుంచి ఊపిరితిత్తుల మీద పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి వీరిలో శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కొంత తక్కువ. ఇతరత్రా సమస్యల ముప్పు మాత్రం ఉంటుంది. బిడ్డను వీరికి దూరంగా ఉంచటం మంచిది. వీరు శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. యాంటీవైరల్‌ (టామిఫ్లూ) మందు తీసుకోవాలి.

  • * ఈ ఫ్లూ మందు వేసుకుంటున్న బాలింతలు బిడ్డకు పాలివ్వచ్చా?
బాలింతలు టామిఫ్లూ వంటి యాంటీవైరల్‌ మందులు వేసుకుంటూ కూడా బిడ్డకు పాలివ్వచ్చు. తల్లికి జ్వరంగా ఉన్నా పాలివ్వచ్చు, కాకపోతే రోజూకంటే ఎక్కువసార్లు ఇవ్వాల్సి వస్తుంది. యాంటీవైరల్‌ మందులు తల్లిపాలలో చాలా స్వల్ప మోతాదులో వెళతాయిగానీ దానివల్ల బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తల్లికి స్వైన్‌ఫ్లూ ఉన్నాబిడ్డకు పాలివ్వటాన్ని ప్రోత్సహించాలి.

  • * జ్వరం తగ్గటానికి గర్భిణులు మందులు వేసుకోవచ్చా?
జ్వరం, నొప్పుల వంటి బాధలు తగ్గేందుకు గర్భిణులు 'ప్యారాసెటమాల్‌' బిళ్లలు వేసుకోవచ్చు. అవి సురక్షితమే. అయితే నొప్పి నివారిణి మందులైన ఐబూప్రోఫెన్‌ (బ్రూఫెన్‌) వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడీ-NSAIDs' రకం మందులు మాత్రం వాడకూడదు.

  • * కాన్పు దగ్గరపడిన గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే..?
సాధారణంగా ఫ్లూ లక్షణాలున్నప్పటికీ కాన్పు నొప్పుల వంటివన్నీ బాగానే తట్టుకోగలుగుతారు. అయితే నెలలు నిండిన గర్భిణికి స్వైన్‌ఫ్లూతో పాటు తీవ్రమైన శ్వాస సమస్యల వంటివి కూడా తలెత్తితే.. ఆమె శ్వాస పరిస్థితి మెరుగయ్యేందుకు ముందుగానే కాన్పు చెయ్యాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆమె పరిస్థితి నిలకడగా తయారైన తర్వాత.. సిజేరియన్‌ చెయ్యాల్సి రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో ప్రసూతి నిపుణులు, మత్తు వైద్యులు, వూపిరితిత్తుల నిపుణులు ఒక బృందంగా కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది.
  • స్వైన్‌ఫ్లూ రాకుండా గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
* గర్భిణులు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు పెట్టుకోకపోవటం మేలు. బయట ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. అలాగే సినిమా హాళ్లు, పెద్దపెద్ద షాపులు, బజార్లు.. ఇలా జనసమర్దంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం అవసరం.

* బాలింతలు కూడా రెండుమూడు వారాల పాటు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇంటికి పరిమితమవ్వటం మేలు. బిడ్డ పుట్టిన సంబరంలో ఇంటికి బంధువులు, అతిథులు వచ్చినా వారికి కొంత దూరంగా ఉండటం మేలు.

* చక్కటి శుభ్రత పాటించాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఇంట్లోగానీ, చుట్టుపక్కలగానీ ఎవరికైనా ఫ్లూజ్వర లక్షణాలు ఉంటే వారికి సాధ్యమైనంత దూరంగా ఉండటం అవసరం.

* ఈ సీజన్లో బయట తిరుగుతుంటే ముక్కు, నోరు కవర్‌ అయ్యేలా మాస్కు పెట్టుకోవటం ఉత్తమం. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ముక్కుకు, నోటికి టిష్యూ పేపర్లు అడ్డుపెట్టుకోవటం, వెంటనే వాటిని పారెయ్యటం మంచిది.

* గర్భిణులంతా స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) రాకుండా టీకా తీసుకోవటం ఉత్తమం. ఈ టీకాలను ఎన్నో నెలలోనైనా తీసుకోవచ్చు. ఈ టీకాలతో ప్రత్యేకించి గర్భిణులకు హాని జరిగినట్టు ఎక్కడా దాఖలాల్లేవు. పైగా గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బ్రిటన్‌తో సహా చాలా ఐరోపా దేశాల్లో గర్భిణులకు ప్రత్యేక ప్రాధాన్యంతో టీకాలు ఇస్తున్నారు. ఈ టీకా ఇప్పుడు మన దగ్గరా అందుబాటులో ఉంది కాబట్టి స్వైన్‌ఫ్లూ ముప్పు దరిజేరకుండా.. గర్భిణులతో సహా ఎవరైనా దీనిని తీసుకోవచ్చు.
గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు పెట్టుకోకపోవటం మేలు. బయట ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. బిడ్డ పుట్టిన సంబరంలో ఇంటికి బంధువులు, అతిథులు వచ్చినా వారికి కొంత దూరంగా ఉండటం మేలు. చుట్టుపక్కల ఎవరికైనా ఫ్లూ లక్షణాలుంటే వారికి దూరంగా ఉండాలి.
గర్భిణులకూ, రెండు వారాల్లోపు బాలింతలకు.. స్వైన్‌ఫ్లూ అని అనుమానంగా ఉన్నా, లేక పరీక్షల్లో నిర్ధారణ అయినా కూడా.. యాంటీవైరల్‌ మందు 'ఒసాల్టిమివిర్‌' (టామిఫ్లూ)తో చికిత్స ఆరంభించాలి. నెలలు నిండిన వారితో సహా ఎన్నో నెల గర్భిణులైనా ఈ మందు తీసుకోవచ్చు.

  • Source : Article by ...
-డా|| ఎ.ప్రణతీ రెడ్డి క్లినికల్‌ డైరెక్టర్‌ మాటర్నల్‌, ఫీటల్‌ మెడిసిన్‌ రెయిన్‌బో హాస్పిటల్‌, హైదరాబాద్‌


  • =======================================
Visit my Website -> dr.seshagirirao.com/

Saturday, August 22, 2009

సూక్ష్మజీవులు ప్రాముఖ్యము,Micro Organisms importence




మానవుడి కంటికి కనిపించకుండా సూక్స్మదర్శిని తో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మ జీవులు అంటారు . వీటి ఉనికిని మొదట గుర్తించినది " ఆంతోవాని లువెన్ హుక్ " సూక్ష్మ జీవుల్లో జన్యుపదార్దము " డి.యాన్.ఎ." లేదా "ఆర్.యన్.ఎ." గా ఉంటుంది . వీటిలో నిర్దిష్ట కేంద్రకం నుదని జీవులను "కేంద్రక పూర్వ జీవులు (prokariats) అని , కేందకం ఉన్నా వాటిని నిజ కేంద్రక జీవులు (eukariats) అని అంటారు .సూక్ష్మ జీవుల్లో కొన్ని స్వయం పోషకాలు ఉంటాయి ... చాలావరకు పరపోషితం గా ఇతర జీవుల పై ఆధారపడి బతుకుతాయి. సూక్ష్మ జీవుల గురించి తెలిపే శాస్త్రము ను " Microbiology " అంటారు .
రకాలు : వీటిలో నిర్మాణాన్ని బట్టి ఇదు రకాలు .. అవి
వైరస్లు ,
బ్యాక్తీరియలు ,
ప్రోటోజోవాలు ,
శైవలాలు ,
శిలీంధ్రాలు ,

వైరస్ లు :
ఇవి అతి చిన్న సుక్స్మజీవులు , వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలము . వీటి లో జన్యుపదార్ధము చుట్టూ ప్రోటీన్ తో కప్పిన కవచము ఉంటుంది . జీవుల కానాల బయట వైరస్ లు నిర్జీవము గా ఉంటాయి , కానము లోకి వెళ్ళినప్పుడు వాటిలో ప్రత్యుప్తట్టి జరుపుకొని సంఖ్యా ను వృద్ధి చేసుకుంటాయి . వైరస్లు బక్టేరియ పైన కూడా దడి చేసి వాటిని నాశనం చేస్తాయి . వీటి గురించి తెలిపే శాస్త్రము ను " వైరాలజీ " అంటారు . వైరస్ లను సజీవులకు - నిర్జీవులకు వంతెన లాంటి జీవులంటారు .
కలిగించే వ్యాధులు : మొక్కలలోను , జంతువుల్లోను అనేక వ్యాధులను కలిగిస్తాయి .. మొక్కలలో ఇవి కీటకాలు , కలుపుమొక్కలు , పనిముట్లు ద్వార వ్యాప్తి చెందుతాయి . మొక్కలలో ఇవి -- మొజాయిక్ ,కణజాల క్షయము (necrosis) వంటి తెగుళ్ళు కలిగిస్తాయి . మానవుడిలో -- పోలియో ,ఫ్లూ జ్వరము , ఎయిడ్స్ , జలుబు , స్వయిన్ ఫ్లూ , వంటి అనేక జబ్బులును కలిగిస్తాయి .

బాక్టీరియాలు :
వీటిని మొదట లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు .వీటిలో ధృడమైన కనకవచము(CellWall) దాని కింద కనత్వచము (cellMembrane) ఉంటాయి కణము లో కేంద్రకము , హరిత రేణువులు వంటి భాగాలు ఉండవు . బాక్టీరియం లో కనిపించే సన్నని పోగులవంటి నిర్మాణాలను కశాబాలు (psudopodia) అంటారు .. ఇవి ఈదడానికి సహకరిస్తాయి . బాక్టీరియాలు గుండ్రముగా ,కాదీ , కామా , వంటి ఆకారాల్లో ఒంటరిగాను గుమ్పులుగాను ఉంటాయి . వీని గుంపులను కాలనీలు అంటారు . బాక్టీరియాలు అతిశీతల , అధిక ఉస్నోగ్రత ఇన్న ప్రాంతాలలోను , సరస్సులలోను , మొక్కలపైన , జంతువుల్లోను అన్ని ప్రదేశాల లోను .. నివసిస్తాయి. పరిస్థితులు అనుకూలము గా లేనపుడు ఇవి "స్పోర్స్ " అనే నిర్మాణాలు గా మారుతాయి ... వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి . వీటి గురించి తెలోపే శాస్త్రము ను " bactiriology" అంటాము .
కలిగించే వ్యాధులు : అనేక వ్యాడు వస్తాయి . కలరా , టైఫాయిడ్ , నుమోనియా , చర్మము పై గడ్డలు , సుఖవ్యాదులు (గనేరియా) , టి.బి .మున్నగునవి .
ప్రోటో జోవ జీవులు :
ఈ జీవులు ఎక్కువగా నీటిలో రాళ్ళను లేదా మొక్కలకు అంటిపెట్టుకొని ఉంటాయి . మరిక్న్ని తేలుతూ స్వేఛ్చ గా ఉంటాయి . ఇవి కుల్లుతున్న మొక్కలు , జంతు పదార్దముల పై ఉంది వాటిని ఆహారము గా తీసుకుంటా బుడగ వంటి రిక్తికల్లో జీర్ణము చేసుకుంటాయి .పోతోజోవా జీవులు కొన్ని సిధ్య పదము సహాయం తో కదులుతాయి.. మరికొన్ని శైలికలు ,కశాభాల సహాయము తో కదులుతాయి. ఇవి సాదరముగా " ద్విదవిచ్చిట్టి (BinarayFishion) అనే ప్రక్రియ ద్వార ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి. పరిస్థితులు అనుకూలము గా లేనపుడు శిస్తులు ,కోశాలు అనే నిర్మాణాలు ఏర్పరచుకొని జీవిస్తాయి. అమీబా , పెరమేశియం , వర్తిసేల్ల కొన్ని వుదాహరణలు .
కలిగించే వ్యాదులు : అమీబా వల్ల - జిగట , రక్త విరోచాలు , ప్లాస్మోడియం వల్ల - మలేరియా మున్నగు వ్యాదులు వస్తాయి .
శైవలాలు (Algae) :
శైవలాలు ఎక్కువగా నీతిలును , తడి నేలలలోను తడి రాళ్ళపైన ఉంటాయి . వీటిలో ఆకు పచ్చ , నీలి ఆకుపచ్చ , నీలము , ఎరుపు , గోధుమ రంగు శైవలాలు ఉన్నాయి. వీటి లో నిర్దిష్ట కేంద్రకం ,హరితరేణువులు ,కణాంగాలు ఉనతాయి . శైవలాలు ఎక్కువగా స్వయం పోషకాలు . సముద్రము పై తేలుతూ ఉంటాయి .. కొన్ని సముద్రము అడుగున పరుపల ఉనతాయి వీతివల్లో ఆ సముద్రం రంగు వస్తుంది . . . ఎర్రసముద్రము , పాలసముద్రము , నీలిసముద్రము అనరు పేర్లు . ఇవి వివిధ జీవరాసులకు ఆహారము గా ఉపయోగపడతాయి.
Some Human Diseases Caused by Algae

1. Amnesiac shellfish poisoning
2. Ciguatera
3. Paralytic shellfish poisoning
4. Protothecosis

Toxic algal blooms

Human disease:
1. Various algae can produce substances toxic to humans (and other non-sea-living animals). These toxins may accumulate, to no harmful effect (but especially following algal blooms) in certain sea organisms such as filter feeding shellfish.
2. Consumption of contaminated shellfish is associated with such human conditions as:
1. paralytic shellfish poisoning (which numbs the face and extremities for a few days post-ingestion)
2. ciguatera (which causes distress and dysfunction in all sorts of systems including the respiratory system, the nervous system, and the gastrointestinal system)
3. amnesiac shellfish poisoning (which leads to a loss of short term memory---the ultimate "lost car keys" syndrome)

శిలీంద్రాలు (fungus) :
శిలీంద్రాలు నీటిలోనూ , తేమ ప్రదేశాలు లోను , ఆహారపదర్దాలపై , కుల్లుతున్న జెవుల పై పెరుగుతాయి. ఇవి వృక్ష రాజ్యానికి చెందుతాయి . శిలీంద్రాలు తమ ఆహారాన్ని తామూ తారు చేసుకోలేవు ., ఆహారము కోసం ఎక్కువగా నిర్జీవపదర్దాల పైన ఆదారపడతాయి . శిలింద్రాలలో దారపు పోగుల్ల పెరిగే వాటిని 'బూజులు ' అంటారు . శిలీంద్రాల వల్ల మానవులకు కొన్ని లాభాలు , కొన్ని నష్టాలు ఉన్నాయి ... ఇవి ననవుడ్లో తామర ,అథ్లెట్ పుట్ , వంటి వ్యాదులు కలిగిస్తాయి . ఆహారపదార్దములు , ఉరగాయలు , పండ్లు ,కాగితము వంటి వాటిపై శిలీంద్రాలు పెరిగివాటి నాణ్యతను దెబ్బతీస్తాయి.
కొన్ని శిలీంద్రాలు అనగా పుట్ట గొడుగులు ఆహారముగా వాడుతారు . శిలీన్ద్రలనుండి పెంసిల్లిన్ మందులు తాయారు చేస్తారు.
సూక్ష్మ జీవులు ఉపయోగములు :
సూక్ష్మ జీవులు వల్ల మానవునికి నష్టాలతో పటు అనేక లాబాలు ఉన్నాయి . శిలీంద్రాలు వృక్ష , జంతు కళేబరాల పై పెరిగి వాటిని నెలలో కలిపి నెల సారాన్ని పెంచుతాయి . పరిసరాలను శుభ్రపరుస్తాయి . పెనిసిల్లియం నోటేతం అనే శిలీంద్రం పెన్సిల్లిన్ అనే మందును తాయారు చేస్తుంది .
ఈస్ట్ అనే శిలీంద్ర మును ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు .
శాకాహార జంతువుల జీర్ణాశయం లో ఉండే బాక్తీరియంలు , చెదపురుగుల ఆహారనలము లో ఉండే ప్రోటోజోవన్లు సెల్యులోజ్ జీర్ణానికి ఉపయోగ పడతాయి .
మానవుని జీర్ణ నలము లో ఉండే సుక్ష్మ జీవులు ఆహారము జీర్ణము కావడానికి , విటమిన్ల తయారీకి ,ఉపయోగపడతాయి .
పాలను పెరుగు గా మార్చేందుకు లక్తో బాసిల్లస్ బాకటీరియా , జున్ను తయారీకి ఉపయోగ పడతాయి .
బాక్టీరియం లు వాతావరణము లోని నత్రజనిని భూమిలో స్తాపిస్తాయి , మరియు నైట్రేట్ గా మర్చుతాయి.
బయో గ్యాస్ తయారీకి కొన్ని బాక్టీరియాలు ,
మందులు తయారీకి కొన్ని బాక్టీరియాలు ,
శరీర ఇమ్యునిటీని అభివృద్ది చెన్డేందుకు దోహద పడతాయి .
వాక్షిన్లు తయారీకి ఉపయోగపడతాయి .

Thursday, August 20, 2009

దోమలవల్ల కలిగే జబ్బులు , Mosquito spread diseases




దోమ "కులిసిడే(culicidae)"ఫ్యామిలీ కి చెందిన కీటకము (insect) . ప్రపంచము లో సుమారు 3,500 జాతులు (మూలము వికీపీడియా) దోమలో కొన్నిరకాల ఆడ దోమలు మానవుల రక్తం తాగుతూ ఎన్నో అంటు వ్యాధుల వ్యాప్తికి దేహడ పడుతున్నాయి . ఆన్ని రకాల వ్యాధుల వ్యాప్తికి ఆడ దోమలే కారణము ... మగదోమలు మానవుల రక్తము తాగలేవు ... వీటి తొండము పొట్టిగాను , లావుగాను చివర మొండిగాను ఉన్నందున ఇవి చర్మము లోనికి తోన్దాన్ని గుచ్చి రక్తాన్ని పీల్చలేవు ... కుళ్ళిన ఆకులు , పండ్లు , పూల పుప్పెడి ఆహారముగా తీసుకొని బ్రతుకుతాయి .ఆడ దోమల తొండము పొడవుగాను , సన్నముగాను , దారుగాను ఉండడము తో ఇవి మనుషుల , జంతువుల రక్తాన్ని సునాయాసముగా పీల్చివేయగాలవు . మగదోమలు సంతానోత్పత్తి సమయములో ఆడదోమలతో కలిసిన తరువాత చనిపోవును ... ఆడదోమలె ఎక్కువకాలము బ్రతుకుతాయి . దోమల సగటు జీవన కాలము -- ఆడదోమలు 3 నుంచి 100 రోజులు బ్రతికితే మగదోమలు 10 నుంచి 20 రోజులు మాత్రమె బ్రతుకుతాయి .

ప్రపంచ దోమల నివారణ దినము (World Mosquito eradication day) :

20 ఆగష్టు 1897 లో అమెరికా కు చెందిన ' రోనాల్డ్ రాస్ ' అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాప్తికి దోవలె కారణమని


కనుగొన్నారు .. దినాన్నే ప్రపంచ దోమల నివారణ దినము గా జరుపుకుంటున్నారు .

కొన్ని ముఖ్యమైన వ్యాధులు .. వ్యాప్తికి దోహదపడే దోమలు :


ముఖ్యాంశాలు :
  • దోమ వల్ల ఏటా 35 - 50 కోట్ల మందికి మలేరియా సోకుతుంటే 10 లక్షల వరకు చనిపోతున్నారు .
  • దోమలు భూమి పై 3 కోట్ల ఏళ్ళ క్రితం నుంచి ఉంటున్నాయి .
  • మస్కిటో అనే పేరు దీనికి "స్పనిష " భాష నుంచి వచ్చింది .. పదనికు లిటిల్ ఫ్లయ్ అని అర్ధము .
  • ఇవి వంద అడుగుల దూరము నుంచే వాసన , వేడిమి ద్వారా మనుషుల్ని గుర్తు పట్టేస్తాయి ... మనము వదిలే carbondiaxide వల్లే ఇది సాధ్యపడుతుంది .
  • ఇవి తమ జీవితకాలములో 150 మైళ్ళు ప్రయాణిస్తాయి .... గంటకి ఇవి 1.5 మైళ్ళ దూరము ఎగరగలవు
  • ఆడ దోమ ఒకేసారి 300 గుడ్లను పెడుతుంది .జీవిత కాలములో 3000 వరకు గుడ్లు పెట్టె సామర్ధ్యముంది .
  • దోమలు సెకనుకు 500 సార్లు రెక్కల్ని టప టప లాడించగలవు .
  • దోమలు వెనక్కి , ముందుకి ,ప్రక్కలకు .. ఇలా అన్ని వైపులా ఎగరగాలవు .

దోమల నివారించే మార్గాలు :
  • పారిశుధ్యము మేరుగుపదితేనే దోమల నివారణ సాధ్య పడుతుంది . అర కోర బడ్జెట్ తో భాద్యరహితమైన ప్రభుత్వఉద్యోగుల పనితనము , సరి అయిన పర్యవెక్షనవిధనము లేకపోడము అనే అనేక అంశాలు దోమల పెరుగుదలముకారణాలు .
  • దోమల కాయిల్స్ కాల్చడము వలన దోమలను తరిమివేయవచ్చును .. పొగ వల్ల కళ్ళకు , గుండెకు మంచిది కాదు.
  • విద్యుత్ బాట్ లు వాడుకోవడం మంచిదే .
  • ఇంటి పరిసరాల వ్హుట్టు చెత్తను , నీరు నిలువుందే కొబ్బరి డొక్కులు , గోలులు , నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి.
  • ఇంటి పరిసరాలలో మురుగునీరు ఉంటే కిరోసిన్ చల్లితే దోమల వ్యాప్తి జరగదు .
  • వేప ఆకులను ఎండబెట్టి ఇంటిలో వారానికి ఒకసారి ధూపము వేస్తె దోమల సంతతి పెరగదు ,
  • మరుగుదొడ్ల గాలిపైపుల వద్ద జల్లెడలు ఏర్పాటు చేసుకోవాలి .
  • ఇంటిలో విడిచి దుస్తులు ఎక్కువగా ఉంచకూడదు .
దోమల కథ ... చరిత్ర :
దోమ మనిషిని భయంకర శత్రువుగా వేటాడుతూ ఆరోగ్యానికి చేటు తెస్తోంది. స్వల్పవ్యవధిలో విశేష సంఖ్యలో విస్తరించే దోమలు క్రిమి సంహారక మందుల్ని సైతం క్రమంగా తట్టుకుని మనగలవు. అందుకే మలేరియాను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. దోమలు ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి. కార్మికుల శ్రమ ఉత్పాదకతను 30 శాతం మేర తగ్గించేస్తున్నాయంటే వీటి బెడద ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. ఆడ దోమలు ఉష్ణరక్త జంతువుల రక్తం పీల్చుతాయి. ఇది ఒక మనిషిని గాని, కందిరీగను గాని 500 మీటర్ల దూరంలో ఉండగానే గుర్తిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఎలుగుబంట్లు తమ శరీరాలపై వాలిన దోమలను చంపివేయడానికి అవి నేలపై పడి దొర్లుతాయి. ఈ పద్ధతివల్ల దోమలు చావకపోతే అవి మంచుగడ్డకట్టే చలిగల నీటిలో దిగుతాయి. యుకుటియాలోని కోతిమానది ఒడ్డున ఇటువంటి దృశ్యాలు కన్పిస్తాయి.

అదనుచూసి మనిషి రక్తాన్ని నంజుకొంటూ ఒక్కో కాటుతో తమ సంతతిని వృద్ధిచేసుకుంటున్నాయి దోమలు. కరచి వెళ్లడం కాదు, మనిషి శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మజీవుల్ని ప్రవేశపెడతాయి. దోమకాటుతో ఒక్క మలేరియా మాత్రమేకాదు ఎల్లోఫీవరు, డెంగ్యూ ఫీవరు, మెదడువాపు వ్యాధి వంటివి మనుషుల మీద విరుచుకుపడి ప్రాణాలుకూడా తీస్తున్నాయి. ఎనాఫిలిస్ అనే ఆడ దోమకు ‘ప్లాస్మోడియం పాల్సిఫారమ్’అనే మైక్రోబ్‌తో మంచిస్నేహం. జన్యుపరమైన ఏర్పాట్లువల్ల ఈ మైక్రోబ్ ఎనాఫిలిస్ ఆడదోమ లాలాజల గ్రంథుల్లో తలదాచుకుంటుంది. మనిషిని ఎనాఫిలిస్ దోమకాటువేయగానే దాని లాలాజలంలోని మైక్రోబ్ మనిషి రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ మైక్రోబ్ మనిషి రక్తంలోని ఎర్ర కణాలపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. ఎర్ర కణాలు విరిగి పోవడంతో వాటికి ప్రాణవాయువును సరఫరాచేసే శక్తి నశిస్తుంది. ఫలితంగా మూర్చరోగం, మూత్ర పిండాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తాయి. ఇవే ప్రాణం తీస్తాయి.
ఎనాఫిలిస్ ఆడ దోమ నిశాచారి. పగలు నిద్ర, రాత్రి సంచారం. నిద్రిస్తున్న మనుషుల్ని కాటేస్తుంది. ఇది విపరీతంగా గుడ్లు పెడుతుంది. మానవ ఆవాసాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుని బతకగల సమర్థత దీనిది. ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలం చేసుకోగల్గడం జన్యుపరంగా దీనికి లభించిన వరం. ఇది సంచరించని ప్రాంతం మన దేశంలో లేదు.

జగత్ విజేతగా పేరుతెచ్చుకున్న అలెగ్జాండర్ క్రీ.పూ.323లో మరణించడానికి కారణం దోమకాటుకు బలై మలేరియా వ్యాధి సోకడం అని చరిత్ర చెబుతోంది. చివరకు ఈ దోమలకు భయపడి చెంఘిజ్‌ఖాన్ పశ్చిమ ఐరోపాపై దండయాత్రను విరమించుకున్నాడని చెబుతారు.

ఎనాఫిలిస్ దోమకు తోడుగా క్యూలెక్స్ దోమకూడా బోలెడంత విధ్వంసం సృష్టిస్తోంది. క్యూలెక్స్ దోమకాటు భరించలేని బాధను కల్గిస్తుంది. అయితే ఈ దోమల్లోని అన్ని తెగలు ప్రమాదకరమైనవి కావు. కొన్ని రకాలు కుడితే మాత్రం ప్రాణాలమీద ఆశవదులుకోవలసిందే. ఫైలేరియా వ్యాధి దీనివలన అధికం గా వ్యాప్తిచెందుతుంది .

బాతుల్లోను, కొంగల్లోను, పందుల్లోను నివాసం ఏర్పరచుకునే వ్యాధికారక సూక్ష్మజీవులను మనిషి శరీరంలో ఈ క్యూలెక్స్ దోమలు ప్రవేశపెట్టగల్గుతున్నాయి. ఈ సూక్ష్మజీవులు మనిషి రక్తం ద్వారా మనిషి మెదడును చేరుకుంటాయి. మెదడు కణ జాలాన్ని తీవ్రమైన వాపుకు గురిచేసి వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి నెట్టివేస్తాయి. దీనినే మెదడువాపు వ్యాధి అంటారు. వైద్య పరిభాషలో ‘జపనీస్ ఎన్‌సెఫలైటీస్’ అంటారు.

‘ఎడెస్ ఎజిప్టి’అనే మరొక రకం దోమ కాలగమనంలో ఫ్లయింగ్ టైగర్‌గా పేరుతెచ్చుకుంది. మొదట్లో ఇది అడవుల్లో ఉండేది. క్రమంగా నగర ప్రవేశంచేసి చల్లదనం ఉండే ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా చేసుకుని తన సంతానాన్ని అభివృద్ధి పరచుకుంది. దీని కాటువల్ల ‘ఎల్లోఫీవర్’ వస్తుంది. ఈ ఫ్లయింగ్ టైగర్ లాలాజలంలో ‘చిక్‌న్‌గున్యా’అనే వైరస్ ఉంటుంది. ఈ వైరస్ దాని లాలాజల గ్రంథులనుండి లాలాజలంలోకి చేరుతుంది. మనిషిని ఇది కాటువేయగానే ఈ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించి జీర్ణాశయానికి చేరుకుంటుంది. అచట రక్తస్రావం మొదలయి, జ్వరం వచ్చి పచ్చకామెర్లు మొదలవుతాయి. చివరకు మృత్యువు సమీపిస్తుంది. దోమల్లో మొత్తం 3,500 తెగలు వున్నాయి. వీటిలో 100 తెగలు మాత్రమే హానికరమైనవి. ఎక్కువగా జంతు రక్తంమీద ఆధారపడినవి. మనిషి రక్తంమీద ఆధారపడినవి తక్కువే అయినా అవి సృష్టిస్తున్న బీభత్సం మనిషికి పెనుసవాలుగా మారింది. *

Sunday, August 16, 2009

పక్షవాతము , Paralysis




పక్ష వాతము మనిషి బ్రతికి ఉం అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు .

పెరాలసిస్‌ (పక్షవాతం) అంటే మనలో అందరికీ దాదాపుగా తెలిసే వుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో బామ్మలు, తాతయ్యలు వుంటారు కదా!వారిలో ఎవరో ఒకరికి పక్షవాతం రావడం ప్రస్తుతం సర్వ సాధారణంగా మారింది.

శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.

వారు తినాలన్నా లేదా ఏదైనా పని చేసుకోలేరు. వేరొకరి మీద ఆదారపడవలసిన వుంటుంది. ఎందువలనంటే శరీరం బిగుసుగా వుండటం వలన మనకు అనువుగా శరీరం వుండదు కాబట్టి. పైగా చేతులు,కాళ్ళు వంకరలు తిరగటం వలన లేచి నడవలేని వాళ్ళు కూడా వుంటారు. నోటి నుంచి మాట్లాడటమే కష్టం అవుతుంది.

ఏదైనా మాట్లాడాలి అనుకుంటే గంటలకొద్ది వారితో మాట్లాడాల్సి వుంటుంది. కొంతమంది అదీ కూడా చేయలేరు. మంచం మీద పడుకునే వుంటారు. అన్ని కార్యక్రమాలు మంచం మీదనే ముగిస్తారు.

ఈ స్తితి వచ్చిన శరీర భాగాన్ననుసరించి ఐదు రకాలు ...

శరీరము లో సగ భాగము చచ్చుబడి పోతుంది -పక్షవాతము (Hemiplegia) , - .
రెండు కాళ్ళు గాని , రెండు చేతులు గాని చచ్చుబడి పొతే - పెరప్లీజియా (paraplegia)
రెండు కాళ్ళు + రెండు చేతులు కలిపి చచ్చుబదిపోతే -- క్వడ్రి ప్లీజియా (Quadriplegia),
ఏదేని ఒక అవయవము , అవయవము లోని భాగము చచ్చుబదిపోతే --మొనోప్లేజియా(Monoplegia),
ఒక్క ముఖమే చచ్చుబడి పొతే -- బెల్చిపాల్చి (Bel'spalsy) అంటారు ,

కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది
ఎలా గుర్తు పట్టడం :
హటాత్తు గా ముఖము , కాళ్ళు ,చేతులు నీరసపడి తిమ్మిరిగా ఉండడం.. అదీ ఒక వైపు , హటాత్తు గా భ్రమ , ఏమీ తెలియని స్థితి , మాట్లాడలేక పోవడం , సరిగా చూడ లేకపోవడం ,హటత్తు గా విపఫీతమైన తలపోటు రావడం , సరిగా నిలబడలేక , లేవలేక , తెలిసీ తెలియని స్తితి లో ఉండడం .

స్వభావ రీత్యా రెండు రకాలు :
స్పస్తిక్ పెరాలసిస్ : కదలికలలో నియంత్రణ లేక , కండరాలు బండబారి ఉండటం ,
ప్లాసిడ్ పెరాలిసిస్ : దీని లో కండరాలు సన్నబడవు . కండర శక్తి పూర్తిగా పోతుంది .

చికిత్స :
వ్యాదిని బట్టి నిపులైన వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకోవాలి .

ఎవరికి వస్తుంది?

అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, అధిక బరువు ఉన్న వారికి, ధూమాపానం, మద్యపానం చేసే వ్యక్తులకు పక్షవాతం వస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ ఉండే వారిలో వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా 50 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య వ్యక్తులకు వచ్చే అవకాశముంది. కానీ ఈ మధ్య మనదేశంలో చిన్నవయసులోనే పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ధూమపానం, మద్యపానం అలవాట్లబారినపడడం, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పు ముఖ్య కారణాలు. మన దేశంలో ముఖ్యంగా 'ఆర్టిరరీ అథిరోస్క్లిరోసిస్‌' వల్ల పక్షవాతం ఎక్కువ కనిపిస్తుంది. దీనికి కూడా పైన చెప్పికారణాలే అధికం. కొంత మందిలో మరీ చిన్న వయసులో పక్షవాతం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వస్తుంది. అవి ఆటో ఇమ్యూన్‌ డిసిజ్‌ వంటి ఆంటి ఫాస్పో లిపిడ్‌ సిండ్రోం, ఎస్‌ఎల్‌ఇ. చిన్న పిల్లల్లో మోయ-మోయ డిసీజ్‌, గుండె జబ్బు వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది.

ఫిజియోథెరపీ పాత్ర

పక్షవాతానికి సంబంధించిన వైద్యంలో ఫిజియోథెరపి ముఖ్యపాత్ర వహిస్తుంది. చచ్చుబడిన అవయవాలను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. లేదంటే పక్షవాతం వచ్చిన భాగం బిగుసుకుపోయి కదలికలు మరీ తక్కువ అవుతాయి. పక్షవాతం వచ్చిన కండరాలు మరీ బిగుసుకుని కదలికలు తగ్గిన వారిలో బోటాక్స్‌ అనే ఇంజక్షన్‌ కండరాలను తీసుకోవడం వల్ల బిగుతు తగ్గి కదలికలు పెరిగే అవకాశముంది.

జీవనశైలి మారాల్సిందే

పక్షవాతం రాకుండా నివారించడంలో జీవనశైలిది కీలక పాత్ర. ధూమపానం, మద్యపానం, గుట్కా, మత్తుపదార్థాలు వాడే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు కచ్చితంగావాటిని మానడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం అంటే నడక, జాగింగ్‌, సైక్లింగ్‌, ఈతకొట్టడం చేయాలి. అధిక కొలెస్ట్రాల్‌ కలిగిన ఆహారాలను మానాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, విటమిన్‌-సి, విటమిన్‌ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వీటి వల్ల పక్షవాతం వచ్చే అవకాశాన్ని నివారించొచ్చు. ఇప్పటినుంచైనా ప్రతి ఒక్కరూ తమ జీనవశైలిని మార్చుకోవాలి.

వంశపారంపర్యంగా వస్తుందా?

ఇంత వరకు మనకు అధిక రక్తపోటు, మధుమేహం వంశపారంపర్యంగా వస్తుందని తెలుసు. ఇప్పుడు ఇదే కోవలోకి పక్షవాతం చేరింది. పక్షవాతం వంశపారంపర్యంగా వచ్చే అవకాశముందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కొన్ని వంశపారంపర్యంగా హై కొలస్ట్రాల్‌, హోమో సిస్టినిమియ వంటి వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది. కుటుంబంలో పక్షవాతం వచ్చిన వారు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య కొన్నిసాధారణపరీక్షలలో పక్షవాతం వచ్చేకారణాలను గుర్తించి జాగ్రత్తపడొచ్చు.

నివారణ కూడా ముఖ్యమే

పక్షవాతాన్ని నివారించేందుకు ఇప్పుడు అధునాతన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ వచ్చిన వారిలో మెదడులో రక్తం తిరిగి గడ్డకట్టకుండా ఆస్ప్రిన్‌, క్లోపోడ్రిగిల్‌ వంటి మందులు జీవితాంతం వాడాలి. దీని వల్ల రెండోసారి పక్షవాతం రాకుండా కాపాడొచ్చు. బ్రెయిన్‌ హెమరేజ్‌ సాధారణంగా అధికరక్తపోటు వల్ల వస్తుంది. దాన్ని నివారించేందుకు కచ్చితంగా బిపి మాత్రలు వాడడం ముఖ్యం. కొంతమందిలో గుండె నుండి మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులు-కెరోటెడ్‌ ఆర్టరీల్లో బ్లాక్స్‌ ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అతి చిన్న పరీక్ష 'కెరోటెడ్‌ డాప్లర్‌'తో గుర్తిస్తారు. అటువంటివారు ఈ పరీక్ష చేయించుకుంటే మేలు. ఒక వేళ బ్లాక్‌ 70 వాతం కంటే అధికంగా ఉంటే ఆపరేషన్‌ ద్వారా ఆ బ్లాక్‌ను తొలగించిపక్షవాతాన్ని నివారించొచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా డాక్టరు పర్యవేకణలో వ్యాధులకు చికిత్స తీసుకుని, పక్షవాతం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. గుండె జబ్బు ఉన్నవారు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. అటువంటివారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ డాక్టరు పర్యవేకణలో ఆరునెలలకోసారి పరీక్షలు చేయించుకుంటే పక్షవాతాన్ని నివారించొచ్చు.

మూడు గంటల్లోనే ఎందుకు?

పక్షవాతం వచ్చిందని గుర్తించిన వెంటనే చేయడం మంచిది. అంటే వ్యాధి కనిపించిన మూడు గంటల్లోపు మాత్రమే ఇస్కిమిక్‌ స్ట్రోక్‌కు చికిత్స చేయాలి. ఆ 3 గంటలలోపు ప్రతేకమైన 'ఆర్‌-టిపిఎ' అనే ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల ఆ రక్తనాళాల్లోని బ్లాక్‌ తొలగించి తిరిగి రక్తప్రసారాన్ని మెదడుకు పునరుద్ధరించొచ్చు. దాని వల్ల పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంది. 3 గంటల తర్వాత మెదడులోని నాడీకణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి వాటిని తిరిగి కోలుకునేటట్లు చేయడం సాధ్యంకాదు. కొంత మందిలో పక్షవాతం వల్ల మెదడులో వాపురావడం, ఫిట్స్‌ రావడం, కోమాలోకివెళ్లిపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశముంది. అటువంటి వారికి ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స చేయాల్సిరావొచ్చు.
పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి చేర్చటం ఎంత కీలకమో.. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కూడా ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మెరుగైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా గంటలోపు టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌ (టీపీఏ) ఇంజెక్షన్‌ ఇస్తే మరణించే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్టు అమెరికాలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆసుపత్రికి వచ్చాక చికిత్స చేసే సమయం తగ్గుతున్నకొద్దీ (ప్రతి 15 నిమిషాలకు) మరణించే అవకాశం 5 శాతం తగ్గుతున్నట్టు తేలింది. అలాగే మెదడులో తరచూ రక్తస్రావం కావటాన్నీ తగ్గిస్తున్నట్టు బయటపడింది. పక్షవాతం బాధితులు ఆసుపత్రికి వచ్చాక కేవలం 26.6 శాతం మందికే గంటలోపు టీపీఏని ఇస్తున్నట్టు పరిశోధకుల విశ్లేషణలో బయటపడింది. మూడు గంటల్లోపు చికిత్స మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ అంతకన్నా ముందే చికిత్స ఆరంభిస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

పక్షవాతం రక్తపరీక్షతోనే నిర్ధారణ!
పక్షవాతం లక్షణాలు కనబడుతున్నాయి. అది పక్షవాతమేనా? కాదా? నిర్ధారించుకునేదెలా? ప్రస్తుతం దీనికోసం సీటీ లేదా ఎమ్మారై స్కానింగుల మీదే ఆధారపడుతున్నారు. మళ్లీ వీటిలో కూడా సీటీ స్కాన్‌లో కంటే ఎమ్మారైలోనే ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇది చాలా ఖరీదైన పరీక్ష, పైగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఎమ్మారై సదుపాయం ఉండటం లేదు. ఒకవేళ రోగి ఇప్పటికే గుండెలో పేస్‌మేకర్ల వంటివి పెట్టించుకుని ఉంటే వారికి ఎమ్మారై చెయ్యటమూ కుదరదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని... పక్షవాతం సమస్యను తేలికైన రక్తపరీక్ష ద్వారా గుర్తించటం ఎలా? అన్నదానిపై పరిశోధకులు చాలా కాలంగా దృష్టిపెడుతున్నారు. తాజాగా తాము పురోగతి సాధించామని చెబుతున్నారు పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో.. మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం మూలంగా వచ్చే పక్షవాతం ముప్పును కేవలం రక్తపరీక్ష ద్వారానే వీరు 98% వరకూ కచ్చితంగా గుర్తించగలిగారు. మన మెదడులోని 'గ్లుటమేట్‌' అనే రసాయనం మోతాదులను గుర్తించటమే ఈ రక్త పరీక్ష ప్రత్యేకత. మెదడులో రక్త ప్రవాహం దెబ్బతిన్నప్పుడు ఈ గ్లుటమేట్‌ ఒకేసారి పెద్దమొత్తంలో రక్తంలోకి విడుదలవుతుందని ప్రొఫెసర్‌ కెర్‌స్టిన్‌ బెటర్‌మన్‌ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా పక్షవాతం తొలి లక్షణాలు కనిపించిన 24 గంటల్లోనే వారి రక్తంలో గ్లుటమేట్‌ మోతాదులను పరీక్షించారు. వీరికి పక్షవాతం వచ్చిన గంట తర్వాత గ్లుటమేట్‌ మోతాదు గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. పక్షవాతం నిర్ధారణలో మున్ముందు ఈ పరీక్ష కీలకం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

  • పక్షవాతం-తోడబుట్టిన ముప్పు

పక్షవాతం ముప్పు ఉందేమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ అన్నాదమ్ములు, అక్కాచెల్లెలను ఓసారి గమనించండి. ఎందుకంటే పక్షవాతం ముప్పు విషయంలో తోడబుట్టిన వారి మధ్య పోలికలు కనబడుతున్నట్టు స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. మొత్తం 20 ఏళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో పక్షవాతం బారినపడ్డవారిని, వారి తోడబుట్టిన వారిని పరిశీలించారు. ప్రధానంగా రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల సంభవించే 'ఇస్ఖీమిక్‌' పక్షవాతంపై ఇందులో దృష్టి పెట్టారు. గతంలో పక్షవాతం వచ్చిన అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లు గలవారికి పక్షవాతం ముప్పు 60% అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. ముఖ్యంగా తోడబుట్టిన వారిలో ఎవరైనా చిన్న వయసులోనే పక్షవాతం బారినపడతే మిగతావారికి కూడా ఈ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇందుకు వారి మధ్య ఉండే జన్యుపరమైన పోలిక ఒక కారణం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆయా కుటుంబాల్లో కనిపించే ఒకే రకమైన జీవనశైలి పద్ధతులూ దీనికి దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. జీవనశైలి పద్ధతులు మార్చుకునే వీలుండటం వల్ల ముందే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు. మంచి పోషకాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, అధిక బరువును తగ్గించుకోవటం వంటి వాటితో ఈ ముప్పును తప్పించుకోవచ్చు.

  • ఏడు సూత్రాలతో పక్షవాతం దూరం :



గుండెను ఆరోగ్యంగా కాపాడుకుంటుంటే పక్షవాతం ముప్పునూ తప్పించుకోవచ్చా? అవుననే అంటున్నారు పరిశోధకులు. గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడే తేలికైన ప్రశ్నలు పక్షవాతం ముప్పును అంచనా వేయటానికీ తోడ్పడుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మరణాలకు దారితీస్తున్నవాటిల్లో పక్షవాతానిది నాలుగోస్థానం. మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్లినా, వాటిల్లో అడ్డంకులు ఏర్పడినా పక్షవాతం ముంచుకొస్తుంది. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ 'లైఫ్స్‌ సింపుల్‌ 7 (ఎల్‌ఎస్‌7) ' పేరుతో కీలకమైన అంశాలతో ఒక జాబితా రూపొందించింది. ఇందులో శారీరకశ్రమ, ఆహారం, బరువు. రక్తపోటు, రక్తంలో చక్కెర మోతాదు, పొగతాగటం, కొలెస్ట్రాల్‌ను చేర్చింది. వీటి ఆధారంగా ఎల్‌ఎస్‌7 స్కోరును (మార్కులు) లెక్కిస్తారు. ఎక్కువ మార్కులు వచ్చినవారికి గుండె రక్తనాళాల జబ్బు, మరణించే ముప్పు తక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఎల్‌ఎస్‌7 స్కోర్‌తో పక్షవాతం ముప్పునూ అంచనా వేయొచ్చోలేదోననీ పరిశోధకులు ఇటీవల పరీక్షించారు. ఇందులో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి పక్షవాతం ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు తేలటం గమనార్హం. శారీరకశ్రమ, ఆహారం వంటి ఏడు అంశాల్లో ఒకదానిలోనైనా మంచి మార్కులు వచ్చినా పక్షవాతం ముప్పు తగ్గుతుండటం విశేషం. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవటం, బరువును అదుపులో ఉంచుకోవటం, పొగ మానెయ్యటంతో పాటు కొలెస్ట్రాల్‌, రక్తపోటు, రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రణలో ఉంచుకోవటం అన్నివిధాలా మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది గుండె ఆరోగ్యానికే కాదు.. పక్షవాతం ముప్పును నివారించుకోవటానికీ ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

  • ====================
Visit my website : Dr.Seshagirirao.com