Tuesday, September 29, 2009

వ్యాది , Disease


వ్యాధి

అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగము (Disease) అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది.

వ్యాధి కారణాలు

చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి అంతర్గత కారణాలు. పోషకాహార లోపాలు, వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.

వ్యాధి కారకాలను
  • సంఘ,
  • మానసిక,
  • రసాయన మరియు
  • జీవ
కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు : వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.

వ్యాధుల వ్యాప్తి

ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా, ఫంగస్ మరియు ఇతర పరాన్న జీవుల (parasites) వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, మరియు పొట్టపురుగులు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ(touch) వలన, సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.


వ్యాధుల నివారణ

కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే వ్యాధి నివారణ (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి..

వ్యాధుల రకాలు : Types Of Diseases

There are many terms to describe different types of diseases. Diseases are given

different names on the mode of their transmission, geographic area of distribution,

extent of severity etc.

1. Communicable Diseases-Communicable Diseases are illnesses caused by

microorganisms and transmitted from an infected person or animal to another person

or animal. Some diseases are passed on by direct or indirect contact with infected

persons or with their excretions.

2. Noncommunicable Diseases
3. Endemic Diseases
4. Epidemic Diseases
5. Pandemic Diseases
6. Other Type of Diseases

Infections and Diseases Caused by Bacteria and Viruses :

Microorganisms are responsible for a wide range of diseases in man. Diseases caused

by different groups of microbes have been considered in some of the other topics.

some alongwith a particular group of microorganisms. Some important diseases of

man caused by different groups of microbes indicating the etiology and notes on

relevant aspects of individual diseases.

Types of diseases

Diseases are classified according to the following, though a great deal of overlapping

may be found in the different classes:

1. Infectious diseases
1. Parasital
2. Bacterial
3. Viral
4. Fungal
2. Environmental diseases
1. Nutritional
2. Diseases due to unfavourable environmental factors
3. Other diseases
1. Diseases connected with eggs and fry
2. Tumors, genetic disorders

  • ===================================
డా.శేషగిరిరావు MBBS

Medicine Definition, వైద్యము నిర్వచనం,వైద్యవిధానాలు ,Medical Systmes




వైద్యము లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.

వివిధ రకాల వైద్యవిధానాలు

దారులు వేరైనా గమ్యము ఒక్కటే అన్నట్లుగా వైద్యవిధానాలు ఏవైనా రోగిని స్వస్థత చేకూర్చేందుకే అనే విషయము గుర్తించాలి .ఒక వైవిధానములో లొంగని జబ్బు మరొక విధానములో తగ్గవచ్చును . ఈక్రింద పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైనవి.







ఆహారము , Food




ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని వృత్తిగా స్వీకరించారు.


ఆహారం ఆధారాలు

ఆహారం కోసం మొక్కల మీద ఆధార పడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి పాడి చేయడం ద్వారాను లభిస్తుంటాయి.

మొక్కలనుండి లభించే ఆహారం

2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహరం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది.

పిండిపదార్ధాలను అందించే బియ్యము, గోదుమలు, ఇతర చిరు దాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు , మినపప్పు, చెనగబేడలు, పెసలు, అలసందలు మొదలైన పప్పుదాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.

పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది.

తోటకూర, ఉల్లి, అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గాంగూర, తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసు కుంటాము.వంకాయ,బెండకాయ,ఆకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము.వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ,చామగడ్డ,కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్,కుకుమపువ్వు,అవిసిపువ్వు,మునగపువ్వు,అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి.
జంతువుల నుండి లభించే ఆహారం

క్షీరదాలనుండి పాలను సేకరించి,పాలనుండి అనేక ఇతర ఆహారపదార్ధాలను తయారుచేసి ఆహారలో ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగు,జున్ను,చీజ్,పనీర్,యోగర్ట్,వెన్న,నెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తాయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.జలచరాలను,పక్షులను, పక్షిగుడ్లను,జంతువుల మాంసం,కొన్ని చోట్ల ,జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.కొన్నితూర్పుఆసియా ఖండంలోని దేశాలైన జపాన్,బర్మాలలో లో పాములను,చైనాలో ఎలుకలు ఆహాంగా తీసుకుంటారు.ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం భారతదేశలో అలవాటే.
సంప్రదాయంలో ఆహారం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం.దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.ఇవి ఆహారానికి ఉన్న ప్రాదాన్యాన్ని సూచిస్తున్నాయి.పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాదాన్యత ఉంది.సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి.అథిధి అభ్యాగతులకు భోజనసదుపాయం చేయడం సంప్రదాయమే.పరిచయస్తులకు కాఫీ,టీ లనైనా అందిచడం సంప్రదాయమే.జబ్బున పడిన వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడూ,పసిపిల్లను చూడటనికి వెళ్ళేటప్పుడూ,బధి మిత్రులను చూడటానికి వేళ్ళే సమయాలలో పడ్లు మొదలైన ఆహారాన్ని తీసుకు వెళతారు.సత్రాలు కట్టి బాటసారులకు,దేవుని దర్శనానికి వచ్చే భక్తులకూ ఉచితబోజనాలను అందించడం సంప్రదాయమే.ఆహారాన్ని ప్రసాదంగా అందించడం కోవెల సాంప్రదాయాలలో ఒకటి.

పచనం చేసే విధానాలు

పచనం అంటే వండటం. కొన్ని ఆహారాలను అలాగే తీసుకున్నా చాలా వరకు ఆహారం బాక్టీరియా నూండి రక్షణ కోసం, సులభంగా జీర్ణం కావడం కోసం, రుచి కోసం వండటం ద్వారా ఆహారంగా మారుస్తారు. కడిగి, ముక్కలుచేసి, ఇతర ఆహార పదార్ధాలను చేర్చి వేడిచేయడం, చల్లబరచడం, వేగించడం, నీటితో చేర్చి వండటం, ప్రెషర్ కుక్కర్ మరియు ఇతర సాదనాలతో ఆవిరిలో వండటం, నూనెలో దేవటం, కాల్చటం మొదలైన పద్దతులలో ఆహారాన్ని పచనం చేస్తారు. ఇవి కాక నిలవ చేయటం ఉదాహరణగా ఊరగాయలు, వడీయాలు, వొరుగులు మొదలైన పద్దతులలో ఆహారాన్ని తయారు చేస్తారు. పండ్లు, కూరగాయలు నుండి తీసిన రసాలు ద్రవాహారాలలో ఒకటి. చట్నీలు,పచ్చళ్ళు నూరి వేడిచేయకుండానే ఆహారంగా చేస్తారు. తరిగిన పండ్లు, కూరగాయ ముక్కలతో ఇతర పదార్ధాలను చేర్చిన సలాడ్స్ ఆహారమే. పులవ పెట్టడంద్వారా ఇడ్లీ, దోశలు, పెరుగు మొదలైనవి ఆహారంలో భాగమే.
ఆహారం ఉత్పత్తి

ఆహారం తోటలు,పైరు మొదలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తారు.కబేళాలు,పాడి ప్రిశ్రమ ,చేపలు పట్టడం ,అడవిలో లభించే వస్తుసేకరణ ద్వారా అహారం లభిస్తుంది.వేట కూడా ఒక పద్దతే అయినా అది ఇప్పుడు నిషేదం.వ్యవసాయంలో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.

Sunday, September 13, 2009

పొగ తాగడం వలన వచ్చే అనారోగ్యము , Health hezards of Smoking




  • పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చినది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది.

అయితే వినియోగించిన విధానాన్ని,
  • పొగ త్రాగడం -- చుట్ట , బీడీ , సిగరెట్ ,
  • ముక్కు పొడి రూపంలో పీల్చడం -- నశ్యము ,
  • నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
  • గుడాకు --ఒక రకము పొగాకు ఉత్పత్తి ,
  • జర్దా --ఒక రకము పొగాకు ఉత్పత్తి,
  • పాన్ పరాగ్ --ఒక రకము పొగాకు ఉత్పత్తి,

పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి

  • ఊపిరితిత్తుల కాన్సర్
  • టి.బి .
  • గుండె వ్యాధులు.-గుండె పోటు ,
  • నోటి కాన్సర్ ,
  • -బ్రోన్కైటిస్ -bronchitis ,
  • ఉబ్బసము -Asthma ,
  • ఏమ్ఫసిమ-Emphesema ,
  • రక్త నాళాల వ్యాధులు ,

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.. అమెరికాలోని వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉన్నది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.
  • పొగ తాగడం వలన కాన్సర్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. ధూమపానం ఆపటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 ను వరల్డ్ నో టుబాకో డే గా ప్రకటించింది. 2010 నాటికి మనదేశంలో ధూమపానం వల్ల మరణించేవారి సంఖ్య ఒక ఏడాదికి అక్షరాలా 10 లక్షలకు చేరుకుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ హెచ్చరించింది. సిగరెట్ తాగుతున్న పొగరాయుళ్ల ఆయుష్షు సుమారుగా పదేళ్లు తగ్గుతుందని వైద్యులు వెల్లడించారు. 39-69 ఏళ్ల నడుమ మరణిస్తున్న ధూమపాన ప్రియుల్లో 38 శాతం టి.బి, 32 శాతం క్యాన్సర్, 20 శాతం మందికి రక్తనాళాల సమస్యలు కారణమని పరిశోధనలో తేలింది. మనదేశంలో ఒక కోటీ 20 లక్షల మంది పొగరాయుళ్లు ఉన్నారు.
ధూమపానానికి టీకా పొగ!

  • ఒక్కసారి అలవాటైతే జీవితాంతం అంటుకుపోయే దురలవాటు ధూమపానం. దీన్ని మానేయడానికి ఇప్పుడు మార్కెట్లో నికోటిన్‌ ప్యాచ్‌లూ గమ్‌లూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ దీటుగా మద్యపానానికి పొగపెట్టే టీకానొకదాన్ని తయారుచేసిందో మందుల తయారీసంస్థ. ఆ టీకా పేరు నిక్‌వాక్స్‌(NicVAX). సాధారణంగా సిగరెట్‌ తాగినప్పుడు శరీరంలోకి ప్రవేశించే నికోటిన్‌ మెదడుకు చేరుతుంది. క్రమంగా మెదడు ఆ నికోటిన్‌కి బానిసవుతుంది. అదే ఈ టీకా వేయడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ నికోటిన్‌ను వ్యతిరేకించే యాంటీబాడీలను తయారు చేస్తుంది. నికోటిన్‌ శరీరంలోకి ప్రవేశించగానే ఈ యాంటీబాడీలు అప్రమత్తమై ఆ రేణువులకు అతుక్కుపోయి వాటిని మెదడుకు చేరకుండా చేస్తాయి. దాంతో సిగరెట్‌ తాగడం వల్ల కలిగే ఆనందం ధూమపానప్రియులకు కలగదు. ఒక్కో సిగరెట్‌ తాగే విరామ సమయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చి చివరకు మానేస్తారు. పొగతాగే అలవాటుకు పొగపెట్టే ఈ వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసి విపణిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది ప్రముఖ ఫార్మాకంపెనీ గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌.

పొగతాగే అలవాటు--అపోహలు

మనదేశంలో పొగతాగే అలవాటు రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యువకుల్లో సిగరెట్లు కాల్చే ధోరణి విజృంభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పొగతాగటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటితో పాటు వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. అయినా ఎంతోమంది ఈ 'పొగ'కు బానిసలు అవుతూనే ఉన్నారు. పొగతాగటం, సిగరెట్లపై నెలకొన్న అపోహలు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తున్నాయి. అసలు ఈ అపోహల్లో నిజమెంత?

* పొగ తాగితే మూడ్‌ బాగుంటుంది.
*ఇది పూర్తిగా తాత్కాలిక భావన. అప్పటికే కుంగుబాటు బారిన పడినవారు సిగరెట్లు తాగితే పరిస్థితి మరింత ముదురుతుండటమే ఇందుకు నిదర్శనం. పొగతో అతిగా స్పందించటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలూ పొడసూపుతాయి. రోజూ సిగరెట్లు తాగే యువకుల్లో కుంగుబాటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది.

* అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్లు తాగుతాను. కావాలంటే ఎప్పుడైనా ఈ అలవాటును మానగలను.
* సిగరెట్లు తాగేవారు అందులోని నికోటిన్‌కు బానిసలయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాలుస్తున్న కొద్దీ శరీరం నికోటిన్‌ మీద ఆధారపడడం ఆరంభిస్తుంది. కాబట్టి దీన్నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. రోజుకి మూడు సిగరెట్లు కాల్చినా గుండెజబ్బుల ముప్పును కొని తెచ్చుకుంటున్నట్టే. ముఖ్యంగా మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువ.

* చాలాకాలంగా సిగరెట్లు కాలుస్తుంటేనే ప్రమాదం.
* ఇది పూర్తిగా అపోహే. మొదటి సిగరెట్‌ కాల్చటం దగ్గర్నుంచే శరీరంలోని కణాలు దెబ్బతినటం మొదలవుతుంది.

* పొగతాగితే కేవలం వృద్ధులకే ప్రమాదం.
* పొగ తాగితే ఎవరికైనా ముప్పు తప్పదు. దీంతో వూపిరితిత్తుల పనితీరు దెబ్బతినటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, దగ్గు, త్వరగా అలసిపోవటం వంటివి దాడి చేస్తాయి. వాసన, రుచి తెలియకపోవటంతో పాటు చర్మం కూడా త్వరగా ముడతలు పడుతుంది.

* పొగ తాగటం మానేస్తే బరువు పెరుగుతారు.
* ఇది అపోహ. నిజానికి పొగ మానటంతో ఆకలి పెరుగుతుంది. దీంతో తిండి ఎక్కువ తినటానికి ఇష్టపడతారు. అందువల్ల పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకర ఆహారం ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయటం వంటివి చేస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

* కేవలం పొగతాగే అలవాటు గలవారికి మాత్రమే వూపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుంది.
* పొగతాగేవారికి వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువే అయినప్పటికీ.. ఇతరులు వదిలిన పొగను పీల్చే వారికీ ముప్పు పొంచి ఉంటుంది. రేడియేషన్‌, విషతుల్యమైన పారిశ్రామిక వ్యర్థాలు, వాతావరణ కాలుష్యం, క్షయ కూడా వూపిరితిత్తుల క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి.

* జీవితాంతం పొగ తాగినా నా తల్లిదండ్రులకు ఈ క్యాన్సర్‌ రాలేదు. కాబట్టి సిగరెట్లు కాల్చినా నాకు రాదు.
* ఇలా అనుకోవటం పొరపాటు. వారికి రాలేదంటే మీకూ రాదని అర్థం కాదు. వూపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితుల్లో 90 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొగ పీల్చినవారే! చాలాకాలంగా పొగ తాగుతుండటం, ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాలుస్తుండటం వంటివన్నీ ముప్పును పెంచేవే.

* పైప్‌, చుట్టలు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీయవు.
* వీటితో వూపిరితిత్తుల క్యాన్సర్‌ మాత్రమే కాదు.. గొంతు, నోరు, అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదమూ ఉంది. చుట్టలతో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

* 'లైట్‌' సిగరెట్లు మిగతావాటికన్నా మంచివి.
* అన్ని సిగరెట్ల మాదిరిగానే ఇవీ ప్రమాదకరమైనవే. మెంథాల్‌ సిగరెట్లు కూడా సురక్షితమైనవి కావు. ఈ మెంథాల్‌ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి మాత్రమే కాదు, వీటి అలవాటును మానుకోవటం అంత తేలిక కాదనీ పరిశోధనల్లో తేలింది. వీటిల్లోని చల్లదనం మూలంగా పొగను మరింత లోనికి పీల్చుకునేలా చేస్తుంది.


స్మోకింగ్‌తో సమస్మలెన్నో,smoking problesms(--డా బి.శ్యామ్‌ సుందర్‌ రాజ్‌,ఎం.డి., డిఎమ్‌ (పి.జి.ఐ.) డి.ఎన్‌.బి,.పల్మనాలజిస్ట్‌).

సరదా సరదా సిగరెట్టు.. అంటూ సరదాగా మొదలు పెట్టే స్మోకింగ్‌ ఎన్నో రుగ్మతలకు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు మూలకారణంగా ఉంటున్నది. చాలామంది వ్యాధులు మొదలయ్యే వరకు స్మోకింగ్‌ చేస్తూ ఆ తరువాత దానిని ఎలా వదిలెయ్యాలో తెలియక తికమక పడుతుంటారు. తరచుగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు క్రానిక్‌ బ్రాంకైటిస్‌, న్యుమోనియా, లంగ్‌ కేన్సరు పొగతాగని వారికన్నా పొగ తాగేవారిలో ఎన్నోరెట్లు ఎక్కువ. లంగ్‌ కేన్సరు కనిపించే వారిలో 90 శాతం పైగా స్మోకర్స్‌ కావడం గమనార్హం.మొత్తానికి నాన్‌- స్మోక ర్స్‌ కన్నా స్మోకర్స్‌లో లంగ్‌ క్యాన్సర్‌ 8-20 రెట్లు అధికం. స్మోకింగ్‌ మానేసిన వారిలో ఈ రిస్క్‌ 2-3 రెట్లు మాత్రమే. అది కూడా 10 సంవత్సరాల తర్వాతే!

స్మోకింగ్‌ చేసేవారు బీడి, సిగరెట్‌, సిగార్‌, చుట్ట, రివర్స్‌ చుట్ట, హుక్కా ఇలా వేర్వేరు విధాలుగా పొగను పీలుస్తారు. దీంట్లో టార్‌ అని పార్టిక్యులేట్‌ మాటరు, నికోటిన్‌, కార్బన్‌ మోనాకై్సడ్‌ అనేవి గాస్‌ రూపంలో పదార్ధాలుం టాయి. టార్‌లో ఉండే ఆర్గానిక్‌ కాంపౌండ్లు, రేడియమ్‌, ఆస్బెస్టాస్‌, నికెల్‌, క్రోమియం వంటి పదార్ధాలు కేన్సరు కారకాలు. నికొటిన్‌లో అడిక్షన్‌ చేసే గు ణం ఉంటుంది. పోతే కార్బన్‌ మోనాకై్సడ్‌ రక్తంలో ఆక్సి హిమోగ్లోబిన్‌ శాతా న్ని తగ్గిస్తుంది. వీటన్నిటినీ పొగ ద్వారా పీల్చుతారు కాబట్టి శ్వాసకోశ వ్యాధులు వీరిలో ఎక్కువగా వస్తుంటాయి. ఇవే కాకుండా హై బి.పి., అసిడిటీ, పెరాలసిస్‌, హార్ట్‌ ఎటాక్‌, బర్జర్స్‌ డిసీజ్‌, అంగస్థంభన సమస్యలు కూడా వస్తాయి.

వివిధఅవయవాలు, ల్యారింక్స్‌, ట్రేకియా, బ్రాంకస్‌, ఆహార నాళం, జీర్ణకోశం, పెద్ద పేగు, ఓరల్‌ కేవిటీస్‌కు వచ్చే కేన్సర్లు. పొగ, పొగాకు ఉత్పత్తులకు సంబం ధించినవే. గర్భిణీ స్ర్తీలల్లో పొగ త్రాగడం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, అబార్షన్‌, ప్రిమెచ్యూర్‌ డెలివరీ వస్తాయి. బిడ్డ ఊపిరితిత్తులు సరిగా పెరగవు. ఇలాంటి పిల్లల్లో తరచూ శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. పొగ తాగడం వలన శ్వాసకోశాల కెపాసిటీ తగ్గుతుంది. కనీసం 30-80 ఎమ్‌.ఎల్‌. ఏడాదికి వీరిలో ఫోర్స్‌డ్‌ ఎక్స్‌పిరేటరీ వాల్యూమ్‌ తగ్గుతుంది. శ్వాస నాళాలు, చుట్టూ ఉండే లంగ్‌ పేరంకైమా బిగుతు తగ్గిపోవడం వలన సి.ఒ.పి.డి.- క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరి డిసీజ్‌ వస్తుంది. వీరిలో తరచు దగ్గు కఫం, ఎడతెరపి లేని ఆయాస ఉంటాయి. రాను రాను లంగ్స్‌, హార్ట్‌ కూడా ఫెయిల్‌ కావచ్చు. ఒకరి పొగను ఇంకొకరు పీల్చడం వల్ల కూడా ఈ రుగ్మతలు వస్తాయి. పొగాకు ఉత్పత్తులు వాడటం మూలాన ప్రతి ఎనిమిది సెకండ్లకు ఒకరు మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

  • 'పొగ' మెదడుకూ హాని
పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్నది తెలిసిందే. ఇది మెదడుకూ హాని కలిగిస్తుందని మీకు తెలుసా? పొగతాగేవారిలో ప్రత్యేకించి పురుషుల్లో మేధో క్షీణత వేగంగా జరుగుతున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో చాలాకాలంగా పొగ అలవాటుగల మధ్యవయసువారిని ఎంచుకొని పరిశీలించారు. ముందు వారికి మేధస్సుకు సంబంధించిన పరీక్షలు పెట్టి, ఆలోచనా సామర్థ్యాన్ని అంచనా వేశారు. తర్వాత ప్రతి ఐదేళ్లకు మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. పొగ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నవారిలో మేధో క్షీణత చాలా వేగంగా జరుగుతున్నట్టు గుర్తించారు. వీరిలో సంక్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలు గణనీయంగా దెబ్బతిన్నట్టు కనుగొన్నారు. అయితే పొగ అలవాటును పదేళ్ల కిందటే మానేసినవారిలో అంత ముప్పు ఉండటం లేదని తేలటం గమనార్హం. పొగ అలవాటును దీర్ఘకాలం పాటు మానేస్తే జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలపై అది చూపే దుష్ప్రభావాలు చాలావరకు తొలగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిజానికి పొగ మెదడును దెబ్బతీస్తుందనేది కొత్త సంగతేమీ కాదు. ఇది డిమెన్షియా ముప్పును తెచ్చిపెడుతున్నట్టు గతంలోనే తేలింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకూ దోహదం చేస్తుందన్నది తెలిసిందే. ఈ రెండూ కూడా జ్ఞాపకశక్తి సమస్యలతో ముడిపడినవే కావటం విశేషం. పొగ అలవాటుతో మేధో క్షీణత ప్రభావం కనిపించటానికి 20-30 ఏళ్ల ముందు నుంచే మెదడులో మార్పులు మొదలవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నాయని.. కాబట్టి ఇప్పటికైనా పొగ అలవాటును మానుకుంటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.


మితిమీరిన 'పొగ'తో --మూత్రాశయ క్యాన్సర్‌

సిగరెట్లు, చుట్ట, బీడీల వంటివి మరీ ఎక్కువగా కాలుస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఎందుకంటే పొగ అలవాటు లేనివాళ్లతో లేదా తక్కువగా తాగేవాళ్లతో పోలిస్తే మితిమీరి పొగ తాగేవారికి తీవ్రమైన, ప్రాణాంతక మూత్రాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మూత్రాశయ క్యాన్సర్‌ ప్రధాన కారకాల్లో పొగ అలవాటు కూడా ఒకటి. అయితే క్యాన్సర్‌ ముదరటానికి పొగ ఎలా దోహదం చేస్తోందనేది ఇప్పటివరకు బయటపడలేదు. అందుకే అమెరికా పరిశోధకులు తాజా అధ్యయనంలో దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. చాలా ఎక్కువగా పొగ తాగే అలవాటు గలవారికి ప్రాణాంతక మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. వీరిలో 6-9 ప్రోటీన్లలో మార్పులు తలెత్తుతున్నట్టూ తేలింది. ఇలా ఎక్కువ సంఖ్యలో ప్రోటీన్లలో మార్పులు జరుగుతున్నకొద్దీ క్యాన్సర్‌ చికిత్సలతో ఫలితం కనబడటమూ తగ్గుతుంటుంది. మూత్రాశయ క్యాన్సర్‌ చికిత్సకు చాలా ఖర్చవుతున్న నేపథ్యంలో తమ అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని మియామీ మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ రిచర్డ్‌ కోట్‌ అంటున్నారు. మూత్రాశయ క్యాన్సర్‌ బాధితుల విషయంలో తక్షణం ఆయా వ్యక్తులకు సరిపోయేలా చికిత్సలను రూపొందించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు కూడా.
  • ============================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Tuesday, September 8, 2009

మొలలు (ఫైల్స్ ),Piles(Haemorrhoids)




మొలలు , ఫైల్స్ , హేమరాయిడ్స్ , పేరేదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి . వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్శమొలలు ఒకటి. అంతేగాక ఆనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారంలోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు ఏర్పడతాయి. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం , మలబద్ధకం , వంటి వాటితో ఈ సమస్య తలెత్తుతుంది . మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెలు రూపం లో మొలలేర్పడి ఇబ్బంది పెడతాయి . మలద్వారము చివరిలో సిరలు గోడలలో మార్పులవల్ల అవి ఉబ్బి మొలలు గా ఏర్పడతాయి. వీటిలో నాలుగు డిగ్రీలు ఉన్నాయి . 1st డిగ్రీ -ఏభాదలేకుండా చిన్న మొలలు ఉండడం , 2nd డిగ్రీ -- మొలలు బయటకు కనిపిస్తాయి , విరోచనం అయినపుడు మంటా , దురద ఉంటుంది , 3rd డిగ్రీ -- మొలలు పెద్దవిగా ఉంది విరోచనం అయినప్పుడు రక్తం పడుతూ .. నొప్పి , మంట ఉంటుంది . 4th డిగ్ర్రీ ఫైల్స్ -- ప్రోలాప్సుడ్ (prolapsed) మొలలు పెద్దవిగా ఉంటూ రక్తం కారుతుంది . . నొప్పి , మంట ఉంటాయి .

సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :
  • నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .
  • పొడిగా ఉండే ఆహారమే తీసుకున్తు పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.
  • గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .
ఆహార నియమాలు :
  • మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడంఅన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
  • కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
  • వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
ట్రీట్మెంట్ :
  • pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
  • Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
  • Duolaxin ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
  • Hedensa ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి .
పై మందుల వల్ల తగ్గనిచో ఆపరేసన్ చేయించుకోవాలి . దీనికి లేజార్ ట్రీట్మెంట్ కలదు .. బాగానే ఫలితాలు ఉన్నాయి.

మొలలు ముళ్ల మీది జీవితం! /Dr.Varghees Mattaih Ano-Rectal surgeon... ,yasoda hos hyd@eenadu sukhibhava.

    ప్రాణాల మీదికేమీ రాకపోవచ్చుగానీ....అనుక్షణం ముల్లుగా గుచ్చుకుంటూ.. నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొలలు. కూర్చోవాలంటే కష్టం. నడవాలంటే నరకం. ఇక మలవిసర్జనకు వెళ్లాలంటే మహా భయం. తెల్లారుతోందంటే చాలు... ఎక్కడ రక్తం కళ్ల జూడాల్సి వస్తుందో.. చివరికి ఇదెక్కడికి దారి తీస్తుందో... ఈ భయాల పరంపరకు అంతుండదు. దినదిన గండంలా అనిపించే... నిత్యం ఎంతోమందిని వేధించే ఈ సర్వసాధారణ మొలలకు పరిష్కారం ఎక్కడ? బయటకు చెప్పుకోలేక.. భయాలు దాచుకోలేక.. చాలామంది నాటువైద్యాలను ఆశ్రయించి తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటారు. నిజానికి అవగాహన పెంచుకుంటే మొలలను తేలికగానే వదిలించుకోవచ్చు. దీనికి అత్యాధునికమైన విధానాలూ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా... గత దశాబ్దకాలంలో మొలల పట్ల వైద్యరంగం అవగాహనే చాలా వరకూ మారిపోయింది.

నిజం చెప్పాలంటే...'పైల్స్‌' అనేవి ఒక స్థాయిలో అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని 'పైల్స్‌' అని పిలవకుండా మలద్వారంలో ఉండే మొత్తటి పొరలు (యానల్‌ కుషన్స్‌) అంటాం. ఈ పొరలే సాగి, పెరిగి, జారి, ముదిరి సమస్యాత్మకంగా తయారైతే అప్పుడు వీటిని వ్యాధిలా గుర్తిస్తూ.. 'పైల్స్‌' అనీ, 'హెమరాయిడ్స్‌' అనీ పిలుస్తారు.

ఒకప్పుడు ఈ మలద్వారంలోని మెత్తటి పొరలకు ప్రత్యేకమైన ప్రయోజనమేదీ లేదని భావించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో వీటిపై అవగాహనలో చాలా మార్పు వచ్చింది. ఈ మెత్తటి పొరలకు రెండు రకాల ప్రత్యేక ప్రయోజనాలున్నాయని గుర్తించారు.

1. సాంప్లింగ్‌ రిఫ్లెక్స్‌: మలద్వారం నుంచి బయటకు వస్తున్నదేమిటి? అనేది గుర్తించి మనకు తెలియజెప్పే అతి ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించేది ఈ పొరలే. బయటకు వస్తున్నది గ్యాసా? విరేచనమా? వచ్చేది మెల్లగా వస్తోందా? మెత్తగా వస్తోందా? గ్యాసైతే దాన్ని నలుగురిలో ఉన్నప్పుడు విసర్జించొచ్చా? లేదా? ఇవన్నీ గుర్తించి మన మెదడుకు ఈ సమాచారాన్ని చేరవేసి.. దానికి తగ్గట్టుగా మలద్వారం స్పందించేలా చేసేది ఈ పొరలే. ఈ ప్రక్రియ అంతా మనకు తెలియకుండానే.. రేయింబవళ్లు జరిగిపోతూనే ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మల విసర్జన జరిగే అవకాశమున్నా ఇవి ఆ విషయాన్ని కూడా మనకు తెలిసేలా చేస్తాయన్నమాట.

2. మలంపై పట్టు: మలవిసర్జన పైన మనకు గట్టి పట్టు, నియంత్రణ ఉన్నాయంటే దానికి మలద్వారం లోపల ఉండే రెండు దృఢమైన కండర బంధనాలు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ యానల్‌ స్ఫింక్టర్స్‌), పొత్తికడుపు నుంచి పురీషనాళం వరకూ ఉండే 'ప్యూబో రెక్టాలిస్‌' కండరం.. ఇవి 99% వరకూ బలంగా తోడ్పడతాయి. ఆ మిగిలిన ఒక్కశాతం నియంత్రణకు.. ఈ మలద్వార పొరలు దోహదం చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. వీటికి రక్తసరఫరా అధికంగా ఉంటుంది. ఈ పొరలు రోజంతా ఉబ్బుతూ, తిరిగి మామూలు స్థాయికి వస్తూ ఉంటాయి. ఇవి ఉబ్బినపుడు మలద్వారం బిగుతుగా మూసుకుపోతుంది. ఇవి మామూలు స్థాయికి వచ్చినపుడు కాస్త వదులవుతుంటుంది. ఇలా ఈ మలద్వార పొరలు మలంపై పట్టుకు కూడా దోహదం చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తిచటం.. మొలల పట్ల, అలాగే మొలలకు చేసే చికిత్సల పట్ల మన అవగాహనలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఒకప్పుడు మొలలకు చికిత్సలో భాగంగా మలద్వారాన్ని తెరిచి.. సర్జరీ చేసి.. ఉబ్బి ఉన్న మొలలను పూర్తిగా తొలగించేవారు. కానీ వీటిని సాధ్యమైనంత వరకూ తొలగించాల్సిన అవసరం లేకుండా సమస్యను సరిదిద్దటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని గుర్తించి ప్రస్తుతం 'స్టేప్లర్‌' విధానాన్ని ఆవిష్కరించారు.
ఎప్పుడు సమస్య?
మలద్వారంలో పైల్స్‌ వంటి మెత్తటి పొరలు అందరికీ ఉంటాయి, అవసరం కూడా. అయితే వాటిల్లోంచి రక్తం పడుతున్నా, నొప్పిగా ఉంటున్నా, అవి పైకి పొడుచుకొచ్చినా, అవి మలద్వారం నుంచి బయటికి వస్తూ-పోతున్నా సమస్యగా పరిణమిస్తాయి. దీన్నే మనం సాధారణ భాషలో మొలల సమస్యగా (పైల్స్‌, హెమరాయిడల్‌ డిసీజ్‌) భావిస్తుంటాం. సమస్యగా పరిణమించినప్పుడు మాత్రమే వీటికి చికిత్స తప్పనిసరి అవుతుంది.
సమస్యగా ఎందుకు మారతాయి?
మొలల సమస్యకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యకారణం మల బద్ధకం, మల విసర్జన సమయంలో ముక్కటం! కొందరిలో వంశపారంపర్యంగా స్ఫింక్టర్లను మలద్వారానికి పట్టి ఉంచే కొలాజెన్‌ పొర బలహీనంగా ఉంటుంది. ఇదీ మొలలకు దోహదం చెయ్యొచ్చు. మల విసర్జన సమయంలో ముక్కితే పైల్స్‌తో కూడిన కండర బంధనం (లిగమెంట్‌) సాగిపోతుంది. తరచూ ఇలా జరుగుతుంటే కండర బంధనం పల్చబడుతుంది. దీంతో మలం గట్టిగా వచ్చినపుడు అది ఆ భాగానికి రుద్దుకొని రక్త స్రావమవుతుంది. కొన్నిసార్లు ఇవి బయటకు పొడుచుకొని రావొచ్చు. మలబద్ధకమే కాదు.. అతిగా విరేచనాలు కావటం కూడా మొలలకు దారితియ్యొచ్చు.

ముక్కినపుడు మలద్వారం వెనక భాగం లోపలికి పొడుచుకు రావటం ఆరంభమవుతుంది. ఇలా తరచుగా ముక్కుతుంటే కొద్దికొద్దిగా కిందికి వస్తూ.. చివరికి మొత్తమంతా తోసుకొస్తుంది. ఒకరకంగా దీన్ని పైల్స్‌ సమస్య తొలిదశ అనుకోవచ్చు.
పిల్లలకూ రావచ్చు!
పైల్స్‌ సమస్య పెద్దల్లో తరచుగా కనబడుతుంది. వయసుతో పాటు మొలల ముప్పూ పెరుగుతుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు బలహీనపడుతుంటాయి, అదే సమయంలో పెద్దపేగు కదలికలు తగ్గి మలబద్ధకం సమస్యా పెరుగుతుంటుంది. దీంతో ముక్కటం, మొలల బారినపడటం చాలా ఎక్కువ. అయితే మొలలు పెద్దలూ, వృద్ధులకే కాదు... పిల్లల్లోనూ రావచ్చు. ముఖ్యంగా మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ. చాలామంది పిల్లలు రోజూ మల విసర్జన చేయరు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తుంటారు. దీంతో ముక్కటం మొదలై మొలలకు దారి తీస్తుంది. అలాగే నేటి యువతరంలో పాశ్చాత్య జీవనశైలి, ఆహారపుటలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిలోనూ మొలల సమస్య ఎక్కువగానే కనబడుతోంది.
అపోహ
* చాలాసేపు కూచొని పనిచేసే ఉద్యోగులకు మొలల సమస్య ఎక్కువని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మొలలకూ, చేసే ఉద్యోగాలకూ సంబంధం లేదు. అయితే సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్ధకం సమస్య ఎక్కువ. కాబట్టి వారికి మొలల బెడద ఎక్కువగానే ఉంటుంది.
మొలలు దశలు
* గ్రేడ్‌-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదుగానీ రక్తం మాత్రం పడుతుంది. వీరిలో సాధారణంగా మల విసర్జనకు ముందుగానీ, తర్వాత గానీ రక్తం పడటం కనిపిస్తుంది. మలంతో కలిసిపోకుండా, విసర్జన సమయంలో తాజా రక్తం పడుతుంటే మొలల సమస్యగానే భావించాల్సి ఉంటుంది. కానీ మలంతో కలిసి రక్తం పడుతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. క్యాన్సర్‌ ఉందేమో నిర్ధరించుకోవాలి.

* గ్రేడ్‌-2: ఈ దశలో రక్తం పడొచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తుంటాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ దశలో సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలిని పాటిస్తే.. మొలల సైజు తగ్గి, మొదటి దశలోకి మారిపోవచ్చు కూడా.

* గ్రేడ్‌-3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్‌ బయటకు వస్తాయి. కానీ విసర్జన అనంతరం వాటంతట అవే లోపలికి పోవు. వేలితో నెడితే లోనికి వెళ్తాయి.

* గ్రేడ్‌-4: ఈ దశలో ఉన్న పైల్స్‌ మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

మొలల సమస్య సాధారణంగా లోపలే ఆరంభమవుతుంది. మొలలతో కూడిన పొర కిందికి జారుతున్నకొద్దీ అవి బయటకు పొడుచుకురావటం, తోసుకురావటం ఎక్కువ అవుతుంది.

చికిత్సలు
సమస్యగా మారిన మొలలు ఉబ్బినట్టుగా, కాస్త పెద్దగా ఉంటాయి. ప్రోక్టోస్కోప్‌తో చూస్తే వాటిపై రక్తస్రావం అవుతున్న గుర్తులు కనిపిస్తాయి.

* మొలల సమస్య మొదటి దశలో ఉన్నవారికి- ముందు తగు ఆహారపుటలవాట్లు, జీవనశైలిని సూచిస్తారు. సమస్య చాలావరకూ వీటితోనే తగ్గిపోవచ్చు. అవసరమైతే వీరికి రక్తనాళాల బిగువును పెంచి, రక్తస్రావం కాకుండా చూసే కొన్ని రకాల మందులూ సూచిస్తారు. అయితే ఇవి అందరిలోనూ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మందులు వాడినా రక్తస్రావం తగ్గకపోతే- దాన్ని ఆపేందుకు ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో అక్కడి రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స లేదా ఆ రక్తనాళంలోకి మందును ఎక్కించి అది మూసుకుపోయి, తొలగిపోయేలా చేసే 'స్ల్కెరోథెరపీ' వంటివి చేస్తారు.

* మొలలు రెండో దశలో ఉంటే 'రబ్బర్‌బ్యాండ్‌ లైగేషన్‌' బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్‌ను పైకి లాగి, దాని మూలం దగ్గర గట్టిగా రబ్బరు బ్యాండు వేసేస్తారు. దాంతో దానికి రక్తసరఫరా నిలిచిపోయి, పైల్స్‌ ఎండి, వారంలో రాలిపోతాయి. ఈ దశలో అవసరమైతే స్ల్కెరోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్‌ చికిత్సలూ ఉపకరిస్తాయి.

* మూడు, నాలుగో దశల్లో ఉన్న మొలలకు సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. గతంలో వీటికి మలద్వారాన్ని తెరిచి, తొలగించే 'ఓపెన్‌ ఆపరేషన్‌' చేస్తుండేవారు. ప్రస్తుతం స్టేప్లర్‌, డిజీహాల్‌ ప్రక్రియలతో తేలికగా పూర్తిచేసే అధునాతన సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.
మొలలు-క్యాన్సర్లు
మొలలను చాలా వరకూ రోగి చెప్పే లక్షణాల ఆధారంగా, మలద్వారంలోకి ప్రోట్రోస్కోప్‌ పంపి చూడటం ద్వారానే నిర్ధరిస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలో మలద్వారం నుంచి రక్తం పడుతుంటే మొలలుగా కొట్టిపారెయ్యకుండా.. తప్పనిసరిగా కొలనోస్కోపీతో గానీ సిగ్మాయిండోస్కోపీతో గానీ పరీక్షించాలి. మలాశయంలో వారికి క్యాన్సరేమైనా ఉందేమో చూడాలి. ఎందుకంటే మలద్వార క్యాన్సర్‌లోనూ మలంలో రక్తం పడటం వంటి మొలల లక్షణాలే కనిపిస్తాయి. దాన్ని మనం గుర్తించలేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పైగా- మొలలతో పాటు క్యాన్సర్‌ కూడా ఉన్నవారికి ఆ విషయం గుర్తించకుండా కేవలం మొలలకు మాత్రమే ఆపరేషన్‌ చేస్తే... క్యాన్సర్‌ కణాలు అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడ పెరగటం మొదలుపెడతాయి. దీంతో మలద్వారం, పురీషనాళం మొత్తం తొలగించాల్సి ఉంటుంది. అదే క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తే సరిపోతుంది.

* మొలలు క్యాన్సర్‌గా మారతాయేమోనన్న భయం మాత్రం అక్కర్లేదు.
మొలలు- ముక్కొద్దు
అసలు మొలలు రాకుండా నివారించుకోవాలంటే... ప్రతి ఒక్కరూ కూడా విరేచనం మెత్తగా, సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా- విసర్జన కోసమని బలంగా గంటల తరబడి ప్రయత్నించకూడదు. ముక్కకూడదు. పీచు ఎక్కువగా ఉండే పళ్లూ కూరగాయలూ నిత్యం ఎక్కువగా తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తాగటం ముఖ్యం. దీంతో విరేచనం ముక్కాల్సిన అవసరం లేకుండా మెత్తగా, తేలికగా, సాఫీగా అవుతుంది. ఇప్పటికే మొలలు ఉన్నవాళ్లు అవి ముదరకుండా చూసుకునేందుకు, అలాగే ఇప్పటికే ఒకసారి మొలలకు సర్జరీల వంటి చికిత్సలు చేయించుకున్న వారు మళ్లీ వాటి బారినపడకుండా ఉండేందుకు కూడా ఇవే జాగ్రత్తలు పాటించటం అవసరం.
మొలలు సర్జరీలు
*ఓపెన్‌ ఆపరేషన్‌: మలద్వారాన్ని తెరిచి.. మొలలను పూర్తిగా తొలగించే విధానం ఇది. మొలలు మరీ పెద్దగా ఉన్నప్పుడు కొందరికి ఇది ఇప్పటికీ తప్పకపోవచ్చుగానీ.. ఈ ఆపరేషన్‌ను సరిగా చేయకపోతే మాత్రం మలవిసర్జన మీద పట్టు కోల్పోయే (ఇన్‌కాంటినెన్స్‌) ప్రమాదముంది. విసర్జన మీద పూర్తి పట్టు ఉండాలంటే ఆ మెత్తటి పొరలు (పైల్స్‌) అవసరం. కానీ ఆపరేషన్‌ ద్వారా మొలలను తొలగిస్తే ఈ మేరకు కొంత పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొలలను తొలగించే సమయంలో కొన్నిసార్లు- లోపలి కండర వలయం (స్ఫింక్టర్‌) కూడా కొద్దిగా దెబ్బతినొచ్చు. దానివల్లా విసర్జన మీద పట్టు తప్పే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా- మొలలు చాలా పెద్దగా ఉండి, పూర్తిగా బయటకు పొడుచుకొచ్చి, వేలితో నెట్టినా లోపలికి వెళ్లని వారికి ఇప్పటికీ ఈ పద్ధతి తప్పదు.
*స్టేప్లర్‌: ఇది విరివిగా వాడకంలోకి వచ్చిన అధునాతన పద్ధతి. ఉబ్బి బయటకు పొడుకొచ్చిన పైల్స్‌ను తొలగించకుండా.. వాటిని లోపలికి నెట్టి.. అవి మళ్లీ కిందికి జారకుండా దానికంటే పైభాగాన్ని కత్తిరించి, దగ్గరకు లాగి కుట్లు వేయటం దీని ప్రత్యేకత. దీనిలో- ముందుగా గొట్టంలాంటి పరికరంతో బయటకు పొడుచుకొచ్చిన పైల్స్‌ను లోపలికి.. అంటే పైకి నెడతారు. దీంతో మలద్వారం లోపల.. తిత్తిలాగా.. కొంతభాగం సాగినట్లుగా తయారవుతుంది. దాన్ని స్టేప్లర్‌తో కత్తిరించి, దగ్గరకులాగినట్లుగా గుండ్రంగా కుట్లు వేసేస్తారు. దీంతో ఇక మొలలు కిందికి జారవు. మలద్వారం తిరిగి బిగువుగా తయారైపోతుంది. ఈ ప్రక్రియలో మొలలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ కొద్దిగా కత్తిరిస్తారు. దాంతో ఉబ్బిఉన్న మొలలు కాస్తా... ఆరు వారాల నుంచి మూడు నెలల్లోపు కుంచించుకుపోయి తిరిగా మామూలు ఆకారానికి వచ్చేస్తాయి. ఈ విధానం ప్రత్యేకత ఏమంటే పైకి పుండు, రక్తస్రావం వంటివేమీ కనబడవు. సర్జరీ అంతా లోపలే జరుగుతుంది, తెరుచుకున్నట్టుగా ఉండే పుండు ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే పనులకు వెళ్లిపోయేటంత సౌకర్యం ఉంటుంది. సర్జరీ సమయంలో రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ. తర్వాత స్టేపుల్స్‌ (పిన్నులు) వాటంతట అవే వూడి పడిపోతాయి. 3-5 రోజుల్లోనే తిరిగి మామూలుగా పని చేసుకోవచ్చు. ఇందులో విసర్జన మీద పట్టుకోల్పోయే అవకాశం అసలే ఉండదు. ఇన్‌ఫెక్షన్ల బెడదా ఉండదు. అయితే ఒకసారి ఉపయోగించిన స్టేప్లర్‌ను తిరిగి వాడటానికి అవకాశముండదు కాబట్టి.. దీనికయ్యే ఖర్చుకాస్త ఎక్కువగా ఉంటుంది.

* డిజీహాల్‌: 'డాప్లర్‌ గైడెడ్‌ హెమరాయిడ్‌ ఆర్టరీ లైగేషన్‌' అనే ఈ ప్రక్రియ అంత విస్తృత స్థాయిలో ప్రచారంలో లేదుగానీ దీనిలో- ధమనిలోని రక్తప్రవాహ శబ్దాన్ని పసిగట్టి వినిపించే డాప్లర్‌ గొట్టాన్ని మలద్వారంలోకి ప్రవేశపెడతారు. దాని సాయంతో సరిగ్గా ఆ ధమనిని పట్టుకుని, దాని మీద కుట్టు వేసేస్తారు. దీంతో పైల్స్‌కు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఉబ్బిన పైల్స్‌ కొద్దిగా కుంచించుకుపోతాయి. అయితే దీంతో పైల్స్‌ పూర్తిగా లోపలికి పోవటం లేదని గమనించి, ఈ ప్రక్రియను మరింత ఆధునికీరించారు. ఇదే 'డిజీహాల్‌ విత్‌ రెక్టో ఆనల్‌ రిపేర్‌'. ఇందులో చాలా కుట్లు కూడా వేసి మొలలు లోపలికి వెళ్లేలా చేస్తారు.

ఏ విధానంలో ఆపరేషన్‌ చేసినా... వీటితో మొలలు పూర్తిగా తగ్గిపోయినా కూడా.. ఆ తర్వాతా ముక్కకుండా ఉండటం, మలబద్ధకం తలెత్తకుండా ఆహార నియమాల వంటివి పాటించటం తప్పనిసరి. లేకపోతే తిరిగి మొలలు ఏర్పడే ప్రమాదముంటుంది.
ద్వారంలో రక్తపుగడ్డ.. పెరీయానల్‌ హెమటోమా
కొందరికి మలద్వారం వద్ద బుడిపెలా తోసుకొచ్చి విపరీతమైన బాధ మొదలవుతుంది. ఇది మొలల మాదిరిగానే కనబడుతుంది. కానీ నిజానికిది మొలల సమస్య కాదు. మొలలను నెడితే లోపలికి పోతాయి. కానీ ఇది మలద్వారం వద్ద చర్మానికే పరిమితమైంది కాబట్టి నెట్టినా అక్కడే ఉంటుంది. దీన్ని 'పెరీయానల్‌ హెమటోమా' అంటారు. మలద్వారం దగ్గర చర్మంలో చాలా రక్తనాళాలు ఉంటాయి. తీవ్రంగా ముక్కినపుడు ఆ రక్తనాళాలు పగిలి, అక్కడ రక్తం గడ్డ ఏర్పడుతుంది. ఇది విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. కానీ సాధారణంగా ఈ గడ్డ ఏడు రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అందుకే దీన్ని 'సెవెన్‌ డేస్‌ వండర్‌ పెయిన్‌' అంటారు. నొప్పి ఎక్కువగా ఉంటే చర్మానికి మత్తు మందు ఇచ్చి, గడ్డను తొలగిస్తారు. మొలలున్నవారికీ ఇలా రక్తపు గడ్డ ఏర్పడే అవకాశముంది.
వృద్ధులకే కాదు, మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ.

  • =====================
visit my website : Dr.Seshagirirao MBBS

Sunday, September 6, 2009

ఎలర్జీ , Allergy


  • Urticaria skin


ఎలేర్జీ అంటే ఏమిటి :

  • ఉన్నట్లుండి గొంతు గరమంతుంది , మరుసటి రోజు ముక్కునుండి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది . మరొ కరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరు కారడం ప్రారంభమవుతుంది . మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది . శ్వాస వదిలేటప్పుడు పిల్లికుతలవంటి శబ్దం వస్తూ ఉంటుంది . ఇంకొకరి హఠాత్తుగా కాళ్ళు ,చేతులు వేళ్ళ మధ్య దురద ప్రారంభమవుతుంది . ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి ... అదే అలర్జీ (allergy) అంటారు
. ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌(Allergen) అంటారు.


  • మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్యపదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దీన్నే ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం. దీని వల్ల మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఎలాంటి ప్రతీకూల పదార్థాలు బ్యాక్టీరియా, వైరస్‌, అన్యపదార్థాలు వచ్చినా తెల్ల రక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీన్నే 'హైపర్‌ సెన్సిటివిటీ' లేదా అలర్జీ అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో, రెండో తుమ్ములు రావడం సహజం. అయితే అలర్జీతో బాధపడేవారికి ఇక అదేపనిగా వరసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దాంతోపాటు కళ్లు ఎరుపెక్కి కళ్ల నుండి నీరుకారుతుంటుంది. ఈ పరిస్థితిని 'అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. దీనిని అశ్రద్ధ చేస్తే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కల్లె వస్తుండడం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే అలర్జిక్‌ సైనసైటిస్‌ అంటాం. క్రమంగా ఈ వ్యాధి గాలి గొట్టాలలోకి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, తర్వాత కల్లెతో కూడిన దగ్గుగా మొదలవుతుంది. దాన్ని అలర్జిక్‌ బ్రాంకైటిస్‌ అంటాం. ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జిక్‌ ఆస్తమా అంటాం.

  • కొన్ని పదార్ధాలకి శరీరము పొందే తీవ్రమైన ప్రతిబంధిత చలనాన్ని(Reaction) అంటాము . మనకి తెలియదు కాని మనచుట్టూ ఉండే చెట్టు , చేమ , జంతువులు వంటివి చిన్న చిన్న రేణువుల లాంటి పదార్ధాలను విడుదల చేస్తూ ఉంటాయి . వీటిని "పోలెన్ " (pollen) అంటాము . పదార్ధాలు ఇతరచోట్లకి వ్యాపొంచి వృక్ష జాతుల్ని మల్లీ పుట్టించడం వాటిధ్యేయం .. కాని ఇవి ధ్యేయానికి చేరక మునుపే చేరకూడని మనుష్యుల ముక్కు , గొంతుక , చర్మము , కళ్లు వంటివాటిని చేరుతాయి . శరీరము పై తనది కాని పదార్ధం తనలో చేరినపుడు వికటిస్తుంది ... అంటే రియాక్ట్ అవుతుంది .. అదే అల్లెర్జి .
  • ముక్కు దిబ్బడేసి జలుబు చేసే ఎలర్జిక్ రైనైటిస్ (allergicRhinitis)అంటాము , జ్వరం వస్తే "హే ఫెవెర్ " (Hay fever) అంటాము . ఎన్నో ఇలాంటి చిన్న చిన్న రేణువులు ప్రకృతిలో ప్రయాణించి మనుష్యులు వివిధ వ్యాధులను కలుగ జేస్తున్నా ... ఈ "పోలెన్ " అనే పడదార్ధం ఎక్కువగా అల్లెర్జీ ని తీసుకు వస్తుంది .
  • కొన్ని ఆహార పదార్ధాలు , కొన్ని జంతువుల స్పర్శ , దుమ్ము ,ధూళి , కొన్ని మందులు , కొన్ని రసాయనాలు , ఇలాంటి ఎలర్జీని కలుగజేస్తాయి . అన్ని అందరికి ఇలాంటి అలెర్జీ ని తీసుకురకపోవచ్చు . ఎందుకంటే ఎవరి శరీరం లో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుందో వారికి ఈ వికటించడం తక్కువలో ఉంటుంది .
  • కొందరి శరీరతత్వము సున్నితమై ఉంటుంది . వాళ్ళకి ఈ ఎలర్జీ సులభంగా వస్తుంది . అలాగే ఎలేర్జీ , ఆస్తమా ఉన్నటువంటి వాళ్ల పిల్లలకి ఈ సున్నితమైన శారీర తత్వము ఉన్న వారి పిల్లలకు ఈ స్థితి వస్తూ ఉంటుంది . దీనినే వంశపారంపర్యం అంటారు .
  • మన శరీరము లో న్యాది నిరోధక శక్తి తగ్గి ఉన్న సమయాల్లో అంటే - తీవ్ర జ్వరము వచ్చి తగ్గిన తర్వాత , ఆడపిల్లలు పెద్దమనిషి అయ్యే సమయం లోను , గర్భిణీ కాలం లోను , ఋతువులు మారే సంధి కాలంలోనూ , చాలా కాలం క్షయ (TB),రక్త హీనత (Anemia) సుగరు (Diabetes),ఉబ్బసము (Asthma) , కాన్సర్(Cancer),వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ ఎలర్జీ రావవచ్చు .
  • ఒక ప్రత్యేకమైన స్థితి ఏమంటే ... మిగతా కారణాలతో పాటు -- ఆత్రుత , ఆరాటం , మానసిక ఒత్తిడి , ఎక్కువ ఆలోచనలు ... ఉండే వాళ్ళలో ఈ ఎలర్జీ తొందరగా వస్తుంది .

శరీర రక్షక వ్యవస్థ :
  • మన్ శరీరమనే కోటను రక్షించడం కోసం శరీరమంతా ఎప్పుడు తిరుగుతూ ప్రమాదం వచ్చిన వెంటనే స్పందించే రక్షణ వ్యవస్థ మనలో ఉంది ... దానినే immunity Sysatem అంటాము . ఈ శరీరం లో ఏడారిలో నైనా నీరు ,గాలి , ఆహార , సంపర్క లాంటి మార్గాల ద్వారా వచ్చే సూక్ష్మ జీవుల ఆయుదాలైన "Toxins" ని ఎదుర్కొనేందుకు ఈ రక్షణ వ్యవస్థ
"Antibody" అనే పదార్ధానీ విడుదల చేస్తుంది దాన్ని " igE"అంటాము ... ఈ సూక్ష్మ జీవుల Toxin కి Antibody కి జరిగే పోరు లో వచ్చే చిన్న మార్పు ఈ ఎలర్జిక్ యాక్షన్ .

లక్షణాలు :
  • ముక్కు చీదడం ,
  • ముక్కునుండి నీరు కారుతూ ఉండడం ,
  • ముక్కులోపల , గొంతులోపల , కళ్ళలోపల దురదగా ఉండడం ,
  • చర్మము పై దద్దురులు రావడం ,
  • చర్మమంతా దురద గా ఉండడం ,
  • దగ్గు ఆయాసము రావడం ,
గుర్తించడం ఎలా?:
  • మొదట ఇది మాములుగా వచ్చే జలుబు అనుకుంటారు . తరచూ వస్తుంటే డాక్టర్ దగ్గరికెళ్ళి మందులు వాడుతారు . . తగ్గుతూ వస్తూ ఉంటుంది ... పూర్తిగా నయము కాదు ..
  • చర్మం పరీక్షలో తేలుతుంది . రక్తపరీక్షలు ముఖ్యం గా 'RAST' టెస్ట్ చేస్తారు . ఇది చాల ఖరీదైనదే కాక ఫలితం రావడానికి చాల సమయం పడుతుంది .
రక్షించుకోవడం ఎలా? :
  • ఎలర్జీని కలుగచేసే పరిసరాలని పదార్ధాలని దూరం గా ఉంచడం ,
  • ఎలర్జీ లక్షణాలకి వివిధ మందులు వేసుకోవడం ,
  • శరీర సహజ వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ,
  • శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు మానివేయాలి.
  • దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కు తప్పని సరిగా ధరించాలి.
  • సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి.
  • కాస్మొటిక్స్‌, స్ప్రేలు, పౌడర్లు, హెయిర్ డైలు వాడేముందు వైద్యుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి.
  • ప్రతి రోజు విధిగా శారీరక వ్యాయామం చేయాలి.

సన్నగా , లాలిత్యం గా , సున్నితం గా ఉండే వారిలో ఇది ఎక్కువగావస్తుంది .

ట్రీట్మెంట్ :
  • పడని ఆహార పదార్దములు గుర్తుపెట్టుకొని వాటిని ఎప్పుడు తీసుకోకూడదు ,
  • దుమ్ము , ధూళి , వాతావరణ మార్పులకు దూరము గా ఉండాలి .
  • మానసిక వత్తిడి కి లోనుకాకుండా మనసును ప్రశాంతము గా ఉంచుకోవాలి ,
  • నిద్ర , సమయానికి భోజనం , తగిన విశ్రాంతి తప్పనిసరిగా ఉండాలి ,
  • సమాజము లో వీరు ప్రత్యేకం గా జీవన విధానము సాగించాలి .
మందులు :
అలెర్జీ ఎక్కువగా ఉన్నపుడు

1. tab. betnesol-- tapering విదానము లో తీసుకోవాలి అంటే ... మొదటి రోజు> 2-2-2(6) , రెండవరోజు >2-1-2 (5) , మూడవరోజు > 2-0-2 (4) , నాల్గవరోజు > 1-1-1 (3) , ఇదవరోజు > 1-0-1 (2) , ఆరవ రోజు >౦-1-౦ (1)
2. cetrazine మాత్రలు రోజుకి ఒకటి చొప్పున్న తగ్గిన వరకు వాడాలి . కొంత మందికు నిత్యము వాడవలసి ఉంటుంది .
లేదా: . Avil మాత్రలు 50 mg రోజు కి 3 తగ్గినవరాలు 4-5 రోజులు వాడాలి .
గోరు వెచ్చని నీరు స్నానం చేయాలి . ఎక్కువ వేడి ఉండకూడదు .

మంచి వైద్యుని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి .

Saturday, September 5, 2009

పాదాల పగుల్లకు పరిష్కారము , foot cracks treatment





పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా కనిపిచి బాధపెడతాయి .

కారణాలు :
  • శరీరములో అధిక వేడి ,
  • పొడి చర్మము ,
  • ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
  • కటిన నేలపై నడవడం ,
  • ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
  • అధిక బరువు కలిగిఉండడం ,
  • పోషకాహార లోపము ,
  • మధుమేహ వ్యాది ,


పరిష్కార మార్గాలు >
  • రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి .
  • పగుల్లపై కొబ్బరి నూనె  తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
  • ప్రతిరోజూ ఉదయం పాత  బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటి లో కడిగితే మురికి , మృతకణాలు పోయి నున్న గాతయారవుతాయి .
  • అరటిపండు ను ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటి తో శుభ్రపరచుకుంటే పాదాలు మెత్త  బడతాయి .
  • గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ  నొప్పి తగ్గుతుంది .
  • ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
  • నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బు ద్రావనం లో పాదాలను పెట్టి 15 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
  • ఉదయం వేజలైన్‌ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
  • రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .
  • పాదాలు నిర్జీవంగా కనిపించినప్పుడు రెండు టేబుల్‌ స్పూన్ల పటికబెల్లం పొడిలో, పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి మృదువుగా రుద్దాలి. అలా పావుగంట పాటు చేశాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకొని, తడి ఆరనివ్వాలి. ఆ తరువాత కొంచెం ఆలివ్‌ నూనెను తీసుకొని మరోసారి పదినిమిషాల పాటు మర్దన చేస్తే మృదువుగా తయారవుతాయి.

  • అలాగే మృత-కణాల వల్ల కొన్నిసార్లు పాదాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు పెసర పిండిలో చెంచా చొప్పున పంచదార, తేనె కలుపుకొని దానిలో బాగా రుద్దితే సరి. తరువాత వేడినీటిలో తువాలును ముంచి, ఆ నీటిని పిండేసి పాదాలకు కప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే మురికీ, మృత కణాలూ దూరమవుతాయి.

  • కాలి పగుళ్లు కొందరిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు చొప్పున బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని రెండు చెంచాల గంధం పొడీ, చిటికెడు పసుపూ, చెంచా ఆలివ్‌ నూనె కలిపి మెత్తని పేస్టులా చేసుకుని, దాన్ని పాదాలకు పూతలా వేయాలి.
ointments :

  • "Healit cream రోజు రెండు సార్లు పపసల్కు రాయాలి ,
  • "Crackfoot Cream " రోజుకు రెండు సార్లు రాయాలి ,
  • "Beclate-S" రోజుకు ఒకసారి వాడవచ్చును .
  • ======================
visit my website : Dr.Seshagirirao.com