Monday, March 1, 2010

కండ్లకలక , Conjunctivitis






కండ్లకలక ( Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.

వ్యాధి లక్షణాలు

వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు

* కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
* రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
* రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.

కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది.

చికిత్స :
వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.

  • ఒఫ్లక్షాసిన్ కంటి చుక్కల మందును 4 - 5 రోజులు వాడాలి .
  • సిట్రజిన్ (Tab-Cetzine) 10mg రోజుకి ఒకట చొ. దురద తగ్గినా వరకు 4-5 రోజులు వాడాలి .
  • జ్వరము , నొప్పి తగ్గడానికి నిమ్సులిడ్ మాత్రలు (Nimulid) 100 మగ్ రోజుకి రెండు చొప్పున్న 4-5 రోజులు వాడాలి .
  • ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటి బయోటిక్ మాత్రలు (Megapen) 250/500 మగ్ రోజుకి మూడు సార్లు 4-5 రోలులువాడాలి


  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.