Thursday, September 30, 2010

మూత్రపిండాల్లో రాళ్ళు , Kidney Stones





ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం.

  • మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటిశాతం తగ్గి, లవణాల గాఢత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండడటమే.

  • మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రపిండాలు శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి, శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూస్తు జీవక్రియ నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి.

  • కారణాలు :
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మూత్రవయావాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌. నీరు తగినంత తాగకపోవడం. ఆహారపు అలవాట్లు. కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు.

  • రాళ్లలో రకాలు :
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో కొన్ని ప్రధాన రకాలు కాల్షియం ఆగ్జలేట్స్‌, కాల్షియం ఫాస్పేట్‌, సిలికాన్‌ స్టోన్స్‌, యూరిక్‌ యాసిడ్‌ స్టోన్స్‌. మూత్రపిండాల్లో రాళ్లను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే యూరినరీ ట్రాక్ట్‌లో ఆటంకం ఏర్పడి మూత్రవ్యవస్థ సమస్యలు తీవ్రం అవుతాయి.

  • మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్ళు మూత్రప్రవాహాన్ని అడ్డగించినపుడు ఇన్‌ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలే కాకుండా మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా చోటుచేసుకోవచ్చు. జనాభాలో 4-8 శాతం మంది వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నారని అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య స్ర్తి పురుషుల్లో ఒకే మాదిరిగా కాకుండా కొద్దిపాటి తేడాలతో వ్యక్తమవుతుంది. ఉదాహరణకు పురుషుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలోనూ ఒకరికి రాళ్లు వస్తాయి. అదే మహిళల్లో అయితే ప్రతి 35 మందిలోనూ ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

మూత్రమార్గం అనేది మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం, మూత్రప్రసేకం(urethra) తదితర భాగాలతో నిర్మితమవుతుంది. మూత్రపిండాలు రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోస్తాయి. అంతేకాకుండా రక్తంలో ఉండే లవణాలకు, ఇతర పదార్థాలకు మధ్య సమతుల్యతను మూత్రపిండాలు కాపాడతాయి. మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని కిడ్నీలనుంచి బయల్దేరే మూత్రనాళాలు మూత్రకోశానికి చేరవేస్తాయి. మూత్రకోశం అనేది ఒక తిత్తివంటి నిర్మాణం. వ్యాకోచం చెందటం ద్వారా మూత్రాన్ని విసర్జన సమయం వరకూ నిల్వ చేస్తుంది. మూత్రకోశం పూర్తిస్థాయి సామర్థ్యం వరకూ నిండిన తరువాత నాడీ సంకేతాలను అనుసరించి మూత్రప్రసేకం తెరుచుకొని మూత్రాన్ని వెలుపలకు పంపిస్తుంది.

  • మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాలవల్ల రాళ్లు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ప్రక్రియను వైద్య పరిభాషలో ‘యూరోలిథియాసిస్’ అంటారు. మూత్రపిండాల్లో తయారైన రాళ్లు, చిన్న ఆకృతిలో ఉంటే మూత్రప్రవాహం ద్వారా వెలుపలకు మూత్రంతో సహా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి ఆకారం పెద్దగా తయారైతే మూత్రమార్గాన్ని అడ్డగించి తదనుగుణమైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి పెద్ద రేగు కాయంత పరిమాణం వరకూ తయారయ్యే అవకాశం ఉంది. ఇవి చూడ్డానికి నునుపుగాగాని లేక గగ్గురుగా గాని ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ రాళ్లు ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే తయారీ తరువాత స్వస్థానంలోనే కాకుండా మూత్రమార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు.


పరీక్షలు

  • 1. అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు
  • 2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
  • 3. ‘X’ రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
  • 4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
  • 5. మూత్ర పరీక్షలు

ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.

  • నివారణ
రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.
కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్‌క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.
ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.
ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.
విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.
మద్యం అలవాటు ఉంటే మానేయాలి.

  • గృహ చికిత్సలు
*పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి


  • చికిత్స

1. మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం
ద్వారా వెలుపలకు వస్తుంది

  • 2.శస్త్రచికిత్స :
కొన్ని మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకుని, రాళ్ళను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల పాటు ఆస్పత్రిలో వుండాలి. ఆరు నుండి పన్నెండు వారాల విశ్రాంతి అవసరం. తరువాత మూత్రపిండంలో రాళ్లు తయారవకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
3. ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది
4. యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, లితోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును

  • ఔషధాలు
నొప్పి తగ్గడానికి :
అవసరాన్ని బట్టి నొప్పితగ్గడానికి ఇంజక్షన్లు , మాత్రలు తీసుకోవాలి . Tramadal , Fortwin , Morphin -injections ... , Urispas , Drotin-M , colinol-M మున్నగు Tablets వాడ వచ్చును .
దీర్ఘకాలము ఉన్న ప్రోబ్లం అయితే ..
Cystone 2 tabs 3 times daily for 4-6 weeks ,
Urispas 1 tab 3 times daily for 2-3 weeks
Alakaline citrate liquid 5ml in 30 ml water 3 times /day


కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా?
  • ఇఎస్‌డబ్ల్యుఎల్‌ : ఇది జర్మనీ రూపొందించిన యంత్రం. దీని ద్వారా రోగిని ఒక నీటితొట్టిలో పడుకోబెడ్తారు. మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములును పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లుగా మార్చవచ్చును. మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వాడినవాటిని మూత్రము ద్వారా బయటకు పంపవచ్చు. దీనికి మూడు రోజులు పడుతుంది. ఇలా కత్తితో పనిలేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు.

మూత్రపిండంలో చేరిన రాళ్ళలో ఏ ఒకటికో చికిత్స అవసరమొస్తుంది. మిగతావి కరిగిపోవడమో, మూత్రం ద్వారా బయటకు రావటమో జరుగుతుంది. ఇవి రీనెల్‌ మార్గంలో పెద్దవిగా లేదా వికృతంగా ఏర్పడ్డ రాళ్ళ వల్లనే ప్రమాదానికి లోనవడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కలిగే నొప్పిని సర్జికల్‌ పుస్తకాల్లో లోయిన్‌- టు- గ్రోయిన్‌ అని పేర్కొన్నారు. కొంతమంది యూరాలజిస్టులు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను విద్యుదయస్కాంత తరంగాలను ప్రయోగించి రాళ్ళను ఇసుకంత పరిమాణం ఉన్న చిన్న కణాలుగా చేస్తుంటారు. దీనిని ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్సీ అని అంటారు. కేవలం 3 రోజుల్లో ఈ పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్ళను తొలగిం చుకోవడం జరుగుతుంది. డయాబెటిస్‌, బి.పి., గుండెజబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్ళను తొలగించుకోవచ్చు.

  • కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను పగలగొట్టేందుకు మరోపద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబును కిడ్నీలోనికి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతి వేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతి ధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్నముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్‌ ద్వారా తీస్తారు. దీనినే 'పర్క్యుటేనియస్‌ సెప్రోలిథోటోనమి' అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి గాటుపెట్టడం జరుగుతుంది. అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం ఇద్దరు వ్యక్తులకైనా అవసరమొస్తుంది. ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగా లను కావలసిన చోటికి పంపుతారు. టాన్యుడ్యూజర్‌ ద్వారా సుమారు నూరు స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంప బడతాయి. తరంగాలు ఒకదాని వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల వత్తిడి కిడ్నీలో రాళ్ళున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్ళుబ్రద్ధలై చిన్నముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్‌టర్‌ పద్ధతి వల్ల ప్రయో జనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు.



  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పెదాల అందము చిట్కాలు , Lips beauty Tips



అధరాల(పెదాల) అందం కోసము చిట్కాలు : -> ప్రతి జీవి అందము గా ఉండాలని అనుకుంటుంది . అందులో మానవులు సంగతి వేరేగా చెప్ప్ప్పనక్కరలేదు . శీతాకాలము కాలంలో పెదాలు పొడిబారి పగులుతుంటాయి. ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే అందమైన అధర సౌందర్యం కోసం ఈ నియమాలు పాటించాలి.

పెదాలు పొడి బారినపుడు నాలుకతో తడిచేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ దాని వల్ల చర్మం పొలుసులుగా వూడిపోతుంది. ఇంకా ఎక్కువ పొడి బారుతుంది. లిప్‌బామ్‌ను అందుబాటులో ఉంచుకొని తడారిన ప్రతిసారీ రాస్తుండాలి.

మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. టూత్‌బ్రష్‌తో వలయాకారంలో మృదువుగా రుద్దాలి. దానివల్ల మురికి, జిడ్డు తొలగిపోయి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

పంచదార లేదా ఉప్పుతో పెదాల మీద రుద్దినా మృతకణాలు తొలగిపోతాయి. అధరాలకు తేమ అందుతుంది. అయితే పెదవులకు పగుళ్లు ఉంటే మాత్రం ఈ ప్రయోగం చేయకపోవడం మంచిది.

వంటనూనెను మునివేళ్లతో తీసుకొని పెదాల మీద వలయాకారంలో మర్దన చేయాలి. పదినిమిషాల తరవాత వేణ్నీళ్లతో శుభ్రపరచుకుంటే మురికి తొలగిపోయి తాజాదనాన్ని సంతరించుకుంటాయి.

అర చెంచా వెన్నలో నాలుగు చుక్కల తేనె కలిపి అధరాలకు పట్టించి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. తరవాత మెత్తని తువాలుతో తుడిచేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదాలు అందంగా తయారవుతాయి.

కొబ్బరిపాలు, గులాబీనీళ్లు, ఆలివ్‌నూనె సమపాళ్లలో తీసుకొని పెదవులకు పట్టించాలి. ఫలితంగా పగుళ్లు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా.. ఆరోగ్యంగా కనిపిస్తాయి.

రాత్రిపూట పెట్రోలియం జెల్లీని రెండుసార్లు పూతగా పూసి అలా వదిలేయాలి. దానివల్ల పెదవులకు తేమ అందుతుంది.

గుప్పెడు గులాబీ రేకలు కప్పు పాలలో నానబెట్టి.. మర్నాడు మిక్సీలో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి తరచూ పెదాలకు రాస్తుంటే నలుపు రంగు తగ్గి.. క్రమంగా ఎర్రగా మారతాయి.

రాత్రిపూట పాలమీగడతో పెదాలను బాగా రుద్ది.. కడిగేయకుండా అలా వదిలేస్తే పెదాలకు తేమ అందుతుంది. పొడిబారకుండా ప్రకాశవంతంగా తయారవుతాయి.

కీరదోస కళ్లకే కాదు పెదాలకూ మేలు చేస్తుంది. ముక్కలుగా తరిగి.. వీలున్నప్పుడల్లా పెదాలకు రుద్దుతూ ఉండాలి. అవి పెదాలను మృదువుగా తయారుచేస్తాయి.

చెంచా తేనెకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పూత వేయాలి. తేనెకు ఉండే మాయిశ్చరైజింగ్‌ గుణం పెదాలకు మేలు చేస్తుంది. అలాగే అలాబీ రేకలను ముద్దగా చేసి.. దానికి నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి పెదాలకు తరచూ పూత వేస్తుంటే పగుళ్లు తగ్గిపోతాయి.

అరకప్పు నీళ్లలో చెంచా ఉప్పు వేసి దాన్లో దూదిని ముంచి అధరాలకు రుద్దితే వాటికి తేమ అందుతుంది. విటమిన్‌ 'ఇ' మాత్రలో ఉండే పదార్థాన్ని రాసినా చక్కటి ఫలితం ఉంటుంది.
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

గొంతు బొంగురు , Hoarseness of voice


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEie-X29kyy-D2CF2uGihVA0o1b4Xd9bP_NuVhHCboI62imu6QAevWKOMEwZH-Wf4hfDEhiVSbwCI4lHVcdkR58ePPqcW29-4x-kLj-LuNtkAHlVzjxfqLs667FgvWw679wfqL7enaEWDWI/s1600/Throat+testing.jpg
  • గొంతు 'బొంగురు' (హోర్స్‌నెస్‌ ఆఫ్‌ వాయిస్‌)

స్వరపేటికలో అతి ముఖ్యమైనది కంఠముడి. దీనినే వైద్యపరిభాషలో ''ఏడమ్స్‌ యాపిల్‌'' అంటుంటారు. స్వరపేటిక ఊపిరితిత్తులకు ద్వారం వంటిదని చెప్పవచ్చు. దీని ప్రధాన కర్తవ్యం శబ్దం చేయటంతో పాటు మాట స్పష్టంగా రూపుదిద్దుకోవటానికి సహాయపడటం. దీనికి తోడుగా ఊపిరితిత్తులకు హాని కలగకుండా కూడా ఈ స్వరపేటిక సహాయపడుతూవుంటుంది.



గొంతు బొంగు పోవడానికి కారణాలు , Causes for hoarseness of voice
  • మన గొంతులో స్వరపేటిక, దానిలో రెండు ఓకల్ కార్డ్‌లు ఉంటాయి. వీటి అంచులు సున్నితంగా ఉంటాయి. ఇవి సాఫీగా ఉండి, వాటిమీద ఎటువంటి ఎత్తుపల్లాలు లేనంత కాలం మృదుమధురంగా, సంభాషించవచ్చు. పాటలు పాడవచ్చు. శబ్దం ఓకల్ కార్డులనుండి వెలువడిన తరువాత నాలుక, పెదవులు ఆ శబ్దాన్ని మాటగా మారుస్తాయి. ఓకల్ కార్డ్స్‌కు ఇన్‌ఫెక్షన్ వచ్చినా, వాటి ఆకృతి మారినా, స్వరంలో అపశృతి వచ్చి గొంతు బొంగురుపోతుంది. గొంతు రాపుడునే లారింజైటిస్ అంటారు.

గొంతు బొంగు పోవడానికి కారణాలు --
  • జలుబు,
  • రొంప వచ్చినప్పుడు,
  • అతిగా మాట్లాడటం వలన స్వరం రాపిడివలన ,
  • పొగ త్రాగడం వలన గొంతు బొంగురుపోవచ్చు,
  • గాలిలో కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో జీవించే వారికి గొంతు బొంగురు పోవచ్చు,
  • ఆహార నియమం లేకపోవడం,
  • చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు,
  • మద్యపానీయాలు తాగడంవలన,
  • పొగాకును నమలడంవలన ,
  • స్వరపేటిక చుట్టుప్రక్కల ఉండే శరీర భాగాలకు ఇన్‌ఫెక్షన్ రావడంవలన ఉదాహరణకు సైనుసైటిస్, టాన్సిలైటిస్, ఎడినాయిడైటిస్ వలన .
  • నోటి ఇన్‌ఫెక్షన్స్, పుచ్చిన పళ్లు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్ మొదలైన వాటివలన .
  • ఈ క్రింద పేర్కొన్న వ్యాధులు ఉన్నవారికి గొంతు బొంగురుపోవడం ఒక నెలలోకాని, ఒక సంవత్సరంలోకాని పలు దఫాలుగా రావచ్చు. 1.మధుమేహం 2.మూత్రపిండాల వ్యాధి 3.రక్తలేమి 4.ఎయిడ్స్.
  • సాధారణంగా వచ్చే వ్యాధులు : ఓకల్ నాడ్యూల్స్, ఓకల్ పాలిప్స్, కెరటోసిస్, పాపిల్లోమా, సల్‌కస్ వోకాలిస్, ఫ్యూబర్ ఫోనియా మొదలైనవి.
  • అతి తక్కువగా వచ్చేవి : కేన్సర్, పెరాలిసిస్, కీచుగొంతు (హైపర్ కైనెటిక్ డిస్‌ఫోనియా) మొదలైనవి.
ఓకల్ నాడ్యూల్స్: ఇవి చిన్న ఆవగింజ మొదలు, పెసర గింజ ప్రమాణంలో సాధారణంగా రెండు స్వర తంత్రులపై రావచ్చును. చిన్నవారిలోనూ, పెద్దవారిలోనూ వస్తాయి. ఇలా వచ్చినపుడు సాధారణంగా మందులు వాడటం, మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం చేస్తే తగ్గిపోతాయి. కంఠస్వరం మునుపటిలాగా రావాలంటే స్వరపేటికకు మైక్రో శస్తచ్రికిత్స చేసి, వీటిని తొలగించి ఆ కణాలను పరీక్ష చేయించడం మంచిది.
  • ఓకల్ పాలిప్స్: ఇవి పరిమాణంలో నాడ్యూల్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఒకవైపే వస్తుంది. ఆకారంలో ఏ విధంగానైనా ఉండవచ్చును. వీటిని కూడా శస్తచ్రికిత్స ద్వారా తీసివేయవచ్చును.
చిన్నపిల్లల్లోవచ్చే పాపిల్లోమా: చిన్నపిల్లలో వైరస్‌వలన చిన్న చిన్న పులిపిరి కాయలలా స్వపేటిక అంతా వ్యాపించి పిల్లల్లో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనికి ఆపరేషన్ అవసరమవుతుంది. ఇవి తీసినప్పటికీ ఇలా వస్తూనే ఉంటాయి. కనుక శస్తచ్రికిత్స ద్వారా తీసివేయాల్సి ఉంటుంది. సాధారణంగా వైరల్ పాపిల్లోమా యుక్తవయస్సు వచ్చిన తరువాత తగ్గిపోతుంది.
  • పెద్దవారిలో వచ్చే పాపిల్లోమా: ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ రావటంవలన కేన్సర్‌గా మారవచ్చును.
కెరటోసిస్:దీనిలో ఓకల్ కార్డులమీద తెల్లటి పొలుసులలాగా, పొరలలాగా ఏర్పడుతుంటాయి. వీటిని కూడా శస్తచ్రికిత్స చేసి తీసివేయాల్సి ఉంటుంది.అదేవిధంగా స్వరతంత్రులపై చిన్న చిన్న కణాలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకు పైబ్రోమా మొదలైనవి. వీటిని వాటి పరిణామాన్ని బట్టి మైక్రోస్కోప్ ఉపయోగించి తీసివేయవచ్చు.
  • సల్‌కస్ ఓకాలిస్: ఓకల్ కార్డులో చిన్న చీలికలాగా రావడంవలన గొంతు జీరగా వస్తుంది. ఉదయం అంతా మాట శబ్దంలాగా వస్తుంది. తరువాత మాట సరిగా రాదు. గొంతు అలసిపోతుంది.
ఓకల్ కార్డు పక్షవాతం: కారణమేదైనా, ఓకల్ కార్డు పక్షవాతం ఒక పక్కన వస్తే గొంతు బొంగురుపోతుంది. రెండు ప్రక్కలావస్తే గాలి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది.
  • హైపర్ కైనెటిక్ డిస్‌ఫోనియా: దీనినే మనం కీచుగొంతు అంటాం. కొందరు ఎప్పుడూ బాగా టెన్షన్‌లో ఉండటంవలన బిగబట్టి మాట్లాడటంలన గొంతు ఇలా మారుతుంది.
ఫ్యూబరో ఫోనియా: బాలురు యువకులుగా మారే వయస్సులో వారి కంఠస్వరం మార్పు చెంది మగవారికి ఉండాల్సిన గొంతు స్వరం వస్తుంది. కాని కొందరిలో ఆడవారి స్వరంలాగా, లేదా కీచుగొంతులాగా వస్తుంది. ఇలా వచ్చినవారు తగిన చికిత్స తీసుకుంటే మగవారిలాగా మాట్లాడవచ్చు.
  • స్వరతంత్రుల /స్వరపేటిక కేన్సర్--పొగ తాగడంవలన అధికంగా ఆల్కహాల్ సేవించడంవలన పొగాకు నమలడం వలన ఈ వ్యాధి వస్తుంది. మెడకు రేడియో ధార్మిక కరెంటు పెట్టడంవలన, పెద్దలలో వచ్చే పాపిల్లోమా వలన ఇది కలుగుతుంది. ఈ వ్యాధి స్ర్తిలలో 50 నుంచి 60 సంవత్సరాల లోపురావచ్చు. మగవారిలో 60 నుంచి 70 సంవత్సరాల లోపు రావచ్చును. ఈ విధంగా కేన్సర్ సోకిన రోగులలో గొంతు మారుతుంది. దగ్గు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. నోటి వెంట రక్తం పడుతుంది. గొంతులో ఏదో ఉన్నట్లు ఫీలవుతారు. ఎక్కువగా కళ్లెపడుతుంది. ఈ వ్యాధి ముదిరితే అన్నం సరిగ్గా మింగలేకపోతారు. ఆకలి లేకుండా పోతుంది. మనిషి బాగా తగ్గిపోతాడు. నోటి వెంట రక్తం పడుతుంది.

వ్యాధి నిర్థారణా పరీక్షలు
  • రోగి తన బాధలు చెప్పినప్పుడు తగిన వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రోగి రక్తాన్ని, మూత్రాన్ని పరీక్షించడం, ఎక్స్‌రేలు, ఎండోస్కోపి తదితర పరీక్షలను నిర్వహించాల్సి రావచ్చును.
  • ఎండోస్కోపి ద్వారా పరీక్ష చేయడంవలన స్వరపేటిక ఎలా ఉన్నదీ నేరుగా చూసి అనుమానం ఉన్న భాగాలనుంచి కొంత పదార్థాన్ని తీసి బయాప్సి పరీక్షకు పంపించవచ్చు.
వ్యాధిని నిర్థారించిన తరువాత చికిత్సా మార్గాలను ఎంచుకోవలసి ఉంటుంది.

  • ఇన్‌ఫెక్షన్ కలుగజేసే క్రిములు
రైనో వైరస్, ఇన్‌ఫ్లుయంజా వైరస్, ఎడినో వైరస్, మీజిల్స్ వైరస్, బీటా హీమోలైటిక్ స్ట్రెప్టోకోకస్, హెచ్ ఇన్‌ఫ్లూయంజా, న్యూమైకొకై, సాల్‌మొనెల్లా టైఫి, డిఫ్తీరియా, టిబి, లెప్రసి మొదలైనవి.
స్వరపేటిక ఇన్‌ఫెక్షన్స్ వచ్చినపుడు రోగికి ఎలా ఉంటుంది.-- దీనివలన గొంతు బొంగురు పోవడమే కాక, దగ్గు, గొంతు తడారిపోయినట్లు ఉంటుంది. మింగడం కష్టంగా ఉంటుంది. జ్వరం, ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఇన్‌ఫెక్షన్స్ తీవ్రత అధికంగా ఉంటే గాలి తీసుకోవడం కష్టంగా కూడా ఉండవచ్చును. పదే పదే గొంతులో ఉన్న కళ్ళె శుభ్రపరచుకోవాలనిపించడం, గొంతులో ఏదో ఉన్నట్లు, శుభ్రపరచుకోవాలనే తపన కలుగుతాయి.

  • చికిత్స స్వరపేటికకు చుట్టుప్రక్కల ఉండే భాగాలైన చెవి, ముక్కు, సైనస్‌లు, నోరు, పళ్ళు, టాన్సిల్స్ మొదలైన వాటిలో వ్యాధులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించాలి. వాటికి తగిన విధంగా చికిత్స చేయించుకోవాలి.మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఎలా మాట్లాడాలనే విషయంలో స్పీచ్ థెరపిస్ట్ ద్వారా చికిత్స తీసుకోవాలి. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం మొదలైనవి మానేయాలి. కాలుష్య ప్రాంతాలలో నివసించేవారు ఆ ప్రాంతాలనుంచి మరొక చోటికి మారవలసి ఉంటుంది.ఇన్‌ఫెక్షన్‌ను యాంటి బయాటిక్ మందులు మొదలయినవి వాడటం ద్వారా సరిచేయవచ్చును.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 29, 2010

గొంతు నొప్పి,ఫారింజైటిస్‌ , Pharyngitis,Throat pain,Sore throat



గొంతు రొంప - గొంతు నొప్పి---ఫారింజైటిస్‌ : గొంతు, గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.


Sore throat, Pharyngitis,గొంతు నొప్పి

పిల్లలకు సంక్రమించే అతి సామాన్యమైన బాధ గొంతు నొప్పి. చాలాసార్లు వైద్యుల వద్దకు కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. గొంతు నొప్పితో పాటు ముక్కు, చెవులు, సైనసులు కూడా ఈ బాధలకు గురి కావచ్చు. ఇవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానంగా ఉండటమే ఇందుకు కారణం. గొంతులో టాన్సిల్స్‌ కూడా ఉంటాయి గనుక అవీ ఈ బాధలకు ప్రభావితమవుతుంటాయి. ఏడాదిలోపు పిల్లలకు టాన్సిల్స్‌ చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాళ్లీ బాధలకు గురికాకపోవచ్చు. 4-8 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో ఈ బాధలు ఎక్కువ. కొందరిలో ఈ నొప్పితోపాటు చెవిపోటు, కడుపునొప్పి కూడా కన్పించవచ్చు. అంతేకాదు, ఈ బాధలు ప్రబలంగా వుండి గొంతునొప్పి మరుగునపడే అవకాశమూ ఉంటుంది. అందుకని ఇటువంటి లక్షణాలున్న పిల్లల్లో గొంతును కూడా పరీక్షించటం అవసరం.
టాన్సిల్స్‌ పెరిగాయా అన్నదాన్ని ఇన్ఫెక్షన్‌ను సూచించే ప్రమాణంగా పెట్టుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామంది పిల్లల్లో టాన్సిల్స్‌ పెద్దవిగానే ఉండొచ్చు.

ఈ 'సోర్‌ త్రోట్‌' విషయంలో నూటికి 80 కేసుల్లో వైరస్‌లు కారణమైతే మిగిలిన 20 కేసుల్లో బ్యాక్టీరియా క్రిములు కారణం అవుతుంటాయి. బ్యాక్టీరియా కారణంగా తలెత్తిన గొంతునొప్పిని 'స్ట్రెప్‌ త్రోట్‌' అని వ్యవహరిస్తారు. దీనికి 'స్ట్రెప్టోకాకస్‌ హెమోలిటికస్‌' అనే బ్యాక్టీరియా కారణం. ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగానే కీళ్లవాపుతో కూడిన జ్వరం (రుమాటిక్‌ ఫీవర్‌), కిడ్నీ వాపు (గ్లోమరూలో నెఫ్రైటిస్‌) వంటి తీవ్ర సమస్యలూ చోటు చేసుకోవచ్చు. 'స్కార్లెట్‌ ఫీవర్‌'కూ ఇదే మూలం.

గొంతునొప్పికి కారణం వైరస్సా లేక బ్యాక్టీరియానా అన్నది నిర్ధారించటం కష్టతరమైన అంశం. దేనివల్ల వచ్చినా జ్వరం, నీరసం, ఆకలి మందగించటం, దగ్గు, మాట బొంగురుపోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా మూలంగానైతే త్వరగా గొంతు నొప్పి మొదలవుతుంది. ఈ బాధలకు గురైన వారికి పరీక్షలు జరిపి 'బీటా హెమోలిటికస్‌ స్ట్రెప్టోకాకస్‌' క్రిమిని గుర్తించటం జరిగింది. అయినా ఈ క్రిముల మూలంగానే గొంతునొప్పి వచ్చిందని చెప్పలేం. గొంతులో ఈ క్రిములున్నా నొప్పి లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. రోగులలో క్రిములకన్నా వారి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ప్రధానమైన అంశమన్నది గమనార్హం. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో కూడా నూటికి 10-20 మందిలో బీటా హెమోలిటికస్‌ క్రిములు కనిపిస్తాయి.

గొంతునొప్పి కేసుల్లో ఎక్కువ శాతానికి యాంటీబయాటిక్‌ ఔషధాలు నిరర్ధకం. వీరిలో చెవిలో చీము, మెడలో గ్రంథులు వాయటం, సైనసైటిస్‌, కీళ్ల వ్యాధులు, కిడ్నీల వాపు మొదలైన బాధలు చోటుచేసుకుంటాయి. వీటన్నింటి కారణంగా గొంతు వాపు (ఫారింజైటిస్‌) ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది.

వింటర్ సీజన్‌లో చాలామంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. వాతావరణం మారుతున్నప్పుడు గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటంవలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడంవల్ల, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతు నొప్పి వేధిస్తుంది. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటీస్ వంటి వ్యాధుల వలన కూడా గొంతు నొప్పి రావొచ్చు.

లక్షణాలు :
ఆహారం మింగటం, నీరు త్రాగటం, గాలి పీల్చటం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురుపోవటం, గొంతు తడారిపోవటం, నోరు దుర్వాసన వస్తుంది. గొంతు నొప్పి, చెవినొప్పి జలుబుతో జ్వరం రావటం నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయ.

జాగ్రత్తలు :
చల్లటిగాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని త్రాగకుండా, కాచి వడపోసిన నీటిని తీసుకోవటం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీమ్‌లను, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ల స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స  తీసుకోవాలి.

చికిత్స :
జ్వరానికి : పరాసిటమాల్ మాత్రలు 500 మి.గ్రా. రోజుకి 2 లేదా 3 మాత్రలు చొప్పున్న 3-5 రోజులు ,
ఇంఫెక్షన్‌ తగ్గడానికి : ఎరిత్రోమైసిన్‌ 250 మి.గ్రా. రోజుకి 3 సార్లు  3-5 రోజులు  ,
ఎక్కువగా మినరల్ వాటర్ త్రాగాలి ,
బిటాడిన్‌ మౌత్ వాస్ ద్రావకము తో గొంతు పుక్కలించాలి.
సాత్వికాహారము మాత్రమే తీసుకోవాలి ,
ఒక వారము రోజులు విశ్రాంతి తీసుకోవాలి .


ముసలి వాళ్ళలో :
ఆహారాన్ని సరిగ్గా మింగలేక పోవటం, సరిగ్గా మాట్లాడ లేకపోవటం, గొంతు బొంగుపోవటం, తెమడరావటం గొంతునొప్పి లక్షణాలు. ఇవి కనిపించినప్పుడు వృద్ధుల్ని వెంటబెట్టుకుని సంబంధిత డాక్టరుచేత చికిత్స చేయించాలి. ఆరోగ్యకర అలవాట్లను పాటించాలి. ఐసుముక్కలు, అతి చల్లని పదార్థాలు తీసుకోరాదు. అతి కారం, అతి మసాలా వస్తువుల్ని, పులుపు వస్తువుల్ని తక్కువగా వాడాలి.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

టాన్సిలైటిస్‌(గొంతులో పిక్కలు) ,Tonsillitis



టాన్సిలైటిస్‌ : టాన్సిల్స్‌కి చీము పట్టినప్పుడు ఆ వ్యాధిని ''టాన్సిలైటిస్‌'' అంటారు.

  • - గొంతులో నాలిక వెనుక భాగానికి పక్కగా యిరువైపులా ఉండే రెండు బాదంకాయల వంటి కంతులను''టాన్సిల్స్‌'' అంటారు.
  • - టాన్సిల్స్‌ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లలలో యివి వాస్తూ ఉంటాయి
  • - వయస్సు పెరుగుతున్న కొద్ది యివి క్షీణిస్తాయి.
  • - ఈ టాన్సిల్స్‌ అనేవి లింఫాయిడ్స్‌ టిష్యూ సముదాయం. వీటి వల్ల దేహానికి ఉప యోగం ఏమిటి అన్నది యిప్పటికి స్పష్టం గా తెలియనప్పటికీ, ఆరోగ్యవం తంగా ఉండే ''టాన్సిల్స్‌'' పిల్లలలో దేహ రక్షణకు తోడ్పడతాయని చెప్పవచ్చును.
  • - టాన్సిల్స్‌కు చీము పడితే అవి దేహాన్ని రక్షంచే విధులను సరిగా నిర్వర్తించకపోగా ఈ చీము రక్తనాళాల ద్వారా యితర అవ యవాలకు ప్రాకి అనేక రోగాలకు దారి తీయవచ్చు.

మొదటిసారి సరైన మోతాదులో మందులను వాడితే వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. తరచుగా టాన్సిలైటిస్‌ వ్యాధి వస్తున్నా, దీనిని సరైన కాలంలో సరైన మోతాదులతొ పూర్తిగా చికిత్స చేయకపోయినా అతి దీర్ఘకాలిక (క్రానిక్‌) టాన్సిలైటిస్‌ వ్యాధిగా మారుతుంది.

ఈ వ్యాధికి గల కారణాలు
  • 1.అపరిశుభ్ర వాతావరణం,
  • 2. కిక్కిరిసి ఉన్న ఇల్లు, పరిసరాలు,
  • 3. దుమ్ముధూళి ద్వారాను, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు గాలి ద్వారా మాటల తుంపర్లలో బాక్టీరియా, వైరస్‌లు ఒకరి వద్ద నుండి యింకొకరికి పాకి టాన్సిలైటిస్‌ వ్యాధి సంక్రమించవచ్చు, చిన్నపిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది.

వ్యాధి లక్షణాలు
- గొంతునొప్పి, ఆహారం మింగటంలో కష్టం, జ్వరం (102-103 డిగ్రీ ఎఫ్‌) ఉంటుంది. వొళ్ళు నొప్పులు, చెవిపోటు, మలబద్ధకం,

ఎక్యూట్‌ టాన్సిలైటిస్‌--

- యిది మొదటి సరిగా వచ్చే టాన్సిలైటిస్‌ వ్యాధి. ఈ రోగికి జ్వర తీవ్రత ఎక్కువ. దవడ క్రింద బిళ్ళలు వాచి (టాన్సిల్‌ లింఫ్‌నోడ్స్‌) నొప్పిగా ఉంటుంది.

చికిత్స

- యిలా ఎక్యూట్‌టాన్సిలైటిస్‌ వ్యాధి వస్తే పిల్లలకు విశ్రాంతి నిచ్చి వ్యాధి నివారణకు - యాంటిబయోటిక్స్‌, ఎనాల్జసిక్స్‌ (వొంటి నొప్పులకు) వాడాలి. ఉప్పు నీళ్ళతో రోజు కుర 3-4 మార్లు నోరు పుక్కిలించాలి.

మొదటిసారి సరైన మోతాదులో మందు లను వాడితే వ్యాధిని పూర్తిగా నివారించ వచ్చు. తరచుగా టాన్సిలైటిస్‌ వ్యాధి వస్తున్నా, దీనిని సరైన కాలంలో సరైన మోతాదు లతొ పూర్తిగా చికిత్స చేయక పోయినా అతి దీర్ఘకాలిక (క్రా నిక్‌) టాన్సిలైటిస్‌ వ్యాధిగా మారు తుంది. టాన్సిల్స్‌ తరచుగా వాస్తూ చీము పట్టినప్పు డు అశ్రద్ధ చేస్తే ఆ వ్యాధికి రక్తనాళాల ద్వారా యితర అవ యవాలకు, గుండెకు, మూత్రపిండాలకు, కీళ్ళకు ప్రాకి ప్రమాదకరం కావచ్చు. అసం పూర్ణమైన చికిత్స వలన టాన్సిలైటిస్‌ వ్యాధి ముదిరి చెవిలో చీముకు దారి తీయవచ్చు.

పెరిటాన్సిలార్‌ ఏబ్సెస్‌

కొందరిలో టాన్సిలైటిస్‌ వ్యాధి ప్రమాద కరం కావచ్చు. ''టాన్సిల్‌ పొరలో చీము గడ్డ'' ఏర్పడితే దానిని పెరిటాన్సిలార్‌ ఏబ్సెస్‌ అంటారు. యిది అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదకరం.

లక్షణాలు:

- తీవ్ర జ్వరం. ఉమ్ము కూడా మింగలేక ముద్దగా మాట్లాడుతూ, తీవ్రమైన చెవి పోటుతో రోగి చాలా భాదపడతాడు. యిది గొంతుకలో ఒకే వైపు వస్తుంది.

చికిత్స:

- వ్యాధిని గుర్తించిన వెంటనే యాంటీ బయోటిక్స్‌, ఎనాల్జసిక్స్‌ యితర మందులు ప్రారంభించి, చెవి-ముక్కు -గొంతు నిపుణులు శస్త్ర చికిత్స ద్వారా ఈ చీము తీసివేస్తారు.

-అశ్రద్ధ చేస్తే ఈ చీము బయటకు రాక, దేహంలో యితర ప్రాంతా లకు ప్రాకి ప్రాణాపాయ స్థితికి దారి తీయవచ్చు.

- అందుకే ఈ వ్యాధి వచ్చిన రోగులకు వెంటనే తగిన చికిత్స చేసి 4-6 వారాల తరువాత టాన్సిల్స్‌ మీద మరల చేరుకునే అవకాశం యివ్వకుండా టాన్సిలెక్టమీ (టాన్సిల్స్‌ని తోలగించటం) ఆపరేషన్‌ చేయవలసి ఉంటుంది.

డిఫ్తిరియా టాన్సల్స్‌

పూర్వం డి.పి.టి. నిరోధక టీకాలు వేయనప్పుడు చాలా తరచుగా పిల్లలలో టాన్సిల్స్‌కు దిఫ్తీరియా వ్యాధి వచ్చి ప్రాణాంతకం అయ్యేది.

లక్షణాలు:
- జ్వరం, గొంతువాపు, గొంతునొప్పితో ఆహారం తినటం కష్టమౌతుంది.
- వ్యాధి గనక ముదిరి స్వరపేటికకు ప్రాకితే ఊపిరి పీల్చటం కష్టమై, ఆయాసం రావచ్చు. ఒక్కొక్కప్పుడు అది ప్రాణాంతకం కావచ్చు.
- ఈ వ్యాధి సోకిన టాన్సిల్స్‌ పై పొర ఏర్పడుతుంది. ఈ పొరే అంగిలి పైకి కూడా ప్రాకవచ్చు. డిఫ్తిరియా క్రిమి నుండి విషపదార్ధం విడుదల అయితే అది శ్వాసకోశానికి, గుండె నరాలకి, స్వరపేటికకి ప్రాకి శ్వాస ఆడక రోగి ప్రాణాలు కోల్పోవచ్చు.
డిఫ్తిరియా నిర్ధారణకు నిపుణులు పరీక్ష చేస్తారు. రోగం నిర్ధారణ కాగానే ఆసుపత్రిలో విడిగా (ఐసోలేషన్‌) ఉంచి, డిఫ్తిరియాకి చేయవలసిన ప్రత్యేక చికిత్స చేయవలసి ఉంటుంది. సంపూర్ణంగా డిపిటి టీకాల కార్యక్రమాలు జయప్రదం కావటంతో డిఫ్తిరియా వ్యాధి గణనీయంగా తగ్గింది.


టాన్సిల్స్‌ వ్యాధి రాకుండా తీసుకోవలసన జాగ్రత్తలు:
- పిల్లలకు పరిశుభ్రమై నీరు, ఆహారం యివ్వాలి.
- యింటిలోనికి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
- తరచు గొంత నొప్పి, జలుబు వస్తుంటే తగిన వైద్య సలహాలు పాటించాలి.
శస్త్ర చికిత్స ఎప్పుడు చేయాలి? దీనివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉన్నాయా?
- తరచు గొంతునొప్పి, చీటికి మాటికి చీముపడుతున్న టాన్సిల్స్‌ మాత్రమే శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తే వారు మామూలుగా చక్కని ఆరోగ్యంతో పెరుగుతారు.
- 5సం||లోపు పిల్లలకు, 50దాటిన పెద్దలకు ఈ టాన్సిల్స్‌ ఆపరేషన్‌ చేయవలసిన అవసరం ఉండదు.
- టాన్సిల్స్‌ తీసివేస్తే పిల్లల బాగా పొడుగ్గా, బోద్దుగా పెరుగుతారన్న నమ్మకం మనలో ఉంది. పిల్లలో ఏ మాత్రం నలత కనబడినా టాన్సిల్సే తీస్తే పిల్లలు ఎదుగుతారన్నది నిజం కాదు. కానీ భాదపడకుండా మామూలుగా ఆరోగ్యం కుదుటపడుతుంది.
సక్రమ పద్ధతిలో శస్త్ర చికిత్సలు చేస్తే మనిషి గొంతుకలో గాని, మాటలలో కానీ ఏమీ మార్పుులు రావు.
- టాన్సిల్స్‌కి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయం జరిగాక రోగికి మూర్ఛ, గుండె జబ్బులు, రక్తస్రావ వ్యాధి (బ్లిdడింగ్‌ డిస్‌ఆర్డర్స్‌, ఎలర్జీల గురించి ఏమైనా యిబ్బందులు ఉంటే వాటి గురించి రోగి బంధువులు వైద్య నిపుణులకు ముందుగానే చెప్పటం మరచిపోకూడదు. ఈ సమాచారం పూర్తి మత్తు మందు (జనరల్‌ ఎనస్తీషియా) ఇవ్వటానికి కూడా పనికి వస్తుంది.
- తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ టాన్సిల్సు ఆపరేషన్‌ చేస్తే కనుక - ఈ ఆపరేషన్‌ గురించి ఏ మాత్రం భయపడనక్కర్లేదు.
- యిది సాధారణంగా పిల్లలో ఎక్కువగా వస్తుంది కావున శస్త్ర చికిత్స కూడా ఎక్కువగా పిల్లలలోనే జరుగుతుంది. ఆని పెద్దలలో టాన్సిల్స్‌ వ్యాధి అరుదుగా వస్తూ ఉంటుంది. వారికి కూడా అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్స చేయవచ్చును.

- టాన్సిల్స్‌ వ్యాధి- చికిత్సగా యిప్పటికీ పల్లెలలో గోళ్లతో గాని, చిన్న ముక్కతో గాని టాన్సిల్స్‌ని వొత్తి మీకు ఆపరేషన్‌ అవసరం లేదు అంటారు. దీనితో అప్పుడు టాన్సిల్స్‌ కనబడకుంగా లోపలికి పోతాయి. కాని యిలాంటి నాటు, మోటు పద్ధతులతో టాన్సిల్స్‌ సెప్టిక్‌ అయి రోగి ప్రాణానికే ముప్పు తేవచ్చు.

గమనిక: -- కాబట్టి పిల్లలో తరుచుగా వచ్చే టాన్సిల్స్‌ వ్యాధి గురించి తల్లిదండ్రులు సరిగ్గా వైద్య సలహాలను అడిగి తెలుసుకొని పూర్తి అవగాహనతో చికిత్స చేయిస్తే ఎటువంటి యిబ్బందులు ఉండవు.

Tonsils are importent in body immune system,టాన్సిల్స్‌ శరీర రక్షణ వ్యవస్థలో ముఖ్యం

శరీరం కణనిర్మితం. మానవ శరీరంలో సుమారు 60 లక్షల కోట్ల కణాలున్నాయని ఒక అంచనా. కణాలు ధాతువులు(Primitives)గా, అవయవాలు(organs) గా రూపొందుతాయి. మొదటిగా మృతదేహాన్ని కోసి పరీక్ష చేసినవాడు వెసాలియస్‌.

మన శరీరంలో వున్న రకరకాల ధాతువుల్లో 'లింఫాయిడ్‌' ధాతువు ఒకటి. ఇది శరీర రక్షణ బాధ్యతలు నిర్వర్తించే ధాతువు. గొంతులోపల వెనకాలగా రెండు వైపులా ముద్దల్లా కనిపించే 'టాన్సిల్స్‌' ఈ విభాగానికి చెందినవే. పసిపిల్లల్లో తొలి ఏడాది టాన్సిల్స్‌ చాలా చిన్నవిగా కన్పిస్తాయి. వయస్సుతో పాటే పెరుగుతూ 4-7 సంవత్సరాల మధ్య వయస్సులో పెద్ద సైజుకు
చేరుకుంటాయి. అయితే ఇలా ఒక దానికొకటి తాకే పరిమాణానికి వచ్చినా కూడా ఇవి ఆరోగ్యంగానే వుంటాయి. అలా పెరగటమేమీ సమస్య కాదు. ఆహారం మింగటానికీ ఇబ్బంది ఉండదు. శ్వాసమార్గానికి అవరోధం కావు. ఇది గుర్తుంచుకోదగ్గ అంశం.

సంవత్సరంలోపు పిల్లల్లో ఈ టాన్సిల్‌ ఇన్ఫెక్షన్‌కు గురవటం అరుదు. ఆపై వయస్సు గలవారిలో గొంతు ఇన్ఫెక్షన్‌లో భాగంగానే ఈ టాన్సిల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా చోటుచేసుకుంటుంది. ఈ కేసుల్లో 85% మంది వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు, మిగిలిన 15% మంది బాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు గురికావడం జరుగుతుంది. వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు యాంటిబయాటిక్‌ ఔషధాలు నిరర్థకం. ఇది గమనార్హం. దీర్ఘకాలంగా టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్‌ చోటుచేసుకున్నట్లయితే నోటి దుర్వాసన, ఆహారం తినడం కష్టంగా పరిణమిస్తుంది. గొంతులో లింఫ్‌ గ్రంధులు వాచి వుంటాయి. ఈ దశలో కొన్నిసార్లు టాన్సిల్స్‌కు ఆపరేషన్‌ అవసరం కావచ్చు. అయితే ఇటువంటి బాధలున్నా 4 ఏళ్లలోపు పిల్లల్లో శస్త్రచికిత్స చేయరు. పెద్ద వయస్సు పిల్లలలో కూడా ఔషధ చికిత్సతో ఫలితాలుంటే.. శస్త్రచికిత్స చేసి టాన్సిల్స్‌ను తీసివేసినా ఆశించిన ప్రయోజనం ఉండదు.

టాన్సిల్స్‌కు చీముపట్టి, శుష్కించి, నిరర్థకమని భావించిన పక్షంలో మాత్రమే ఆపరేషన్‌ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్‌ చేసినంత మాత్రాన వీరికి చికిత్స పూర్తయిపోయిందని భావించటానికి లేదు. టాన్సిల్స్‌ తొలగించక ముందున్నట్లే వీరికి తరచూ ఛాతీలో ఇన్ఫెక్షన్లు, ముక్కు ఎలర్జీల వంటి బాధల్లో తగ్గుదలేమీ ఉండదు. సైనుసైటిస్‌, చెవిలో ఇన్ఫెక్షన్‌ల వంటివాటిలోనూ మార్పు కన్పించదు. ఆపరేషన్‌ ముందు లాగా గొంతులో నొప్పి కూడా తగ్గకుండా వస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ఈ టాన్సిల్స్‌ తొలగించటమన్నది- కాపలా కుక్కలను తీసివేస్తే ఇంటికి దొంగలు రారనుకోవటం లాంటిది! ముక్కు, గొంతు బాధలను టాన్సిల్స్‌కు ఆపాదించటం సరికాదు. టాన్సిల్స్‌ ఈ శరీర రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్య అంశమన్నది మరువరాదు!

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 25, 2010

దంత కళ అరవిరిసిన అందం , Dental arrangements and face beauty




ముఖానికి చిరునవ్వే అసలైన అందం! ఆ అరనవ్వులో.. ఎన్నెన్నో భావాలు. ఎంతో సోయగం. ఆ క్షణంలో ఆనందం తాండవిస్తుంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలువరస పలకరిస్తుంది. అన్నీకలిసి... ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది.
అందుకే చిరునవ్వుకూ, ఆత్మవిశ్వాసానికీ, పలువరుసకూ, అందానికీ.. అంతటి విడదీయరాని బంధం!
ఎగుడుదిగుడు పళ్లు.. రంగుమారిపోయిన దంతాలు.. విరిగిపోయిన ముందుపళ్లు.. మరీ ముందుకు తోసుకొచ్చే ఎత్తుపళ్లు.. పళ్ల మధ్య పెద్దపెద్ద సందులు.. అసహజంగా తయారైన చిగుళ్లు... ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్నే కాదు.. మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మనసులో న్యూనత పేరుకుపోయేలా చేసి ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి. అయితే ఇవేవీ సరిచెయ్యలేనివి కాదు. అందుకే... ఆధునిక దంత వైద్యంలో 'సౌందర్య' విభాగానికి అంతటి ప్రాముఖ్యం పెరిగింది. వీటన్నింటినీ సరిచేసేందుకు ఇప్పుడు ఎన్నో అత్యాధునికమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా చిరునవ్వునే కళాత్మకంగా తీర్చిదిద్దే 'స్మైల్‌ డిజైన్‌' ప్రక్రియలూ వూపందుకున్నాయి.

రంగు మారితే?
పళ్లు చక్కగా తెల్లగా, సహజంగా ఉండాలి. వాటి సౌందర్యం తెల్లదనం మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ రంగుమారే పళ్లు, గారకట్టే పళ్లు, టీ-కాఫీలు పొగాకు నమలటం వంటి అలవాట్ల వల్ల సహజ రంగును కోల్పోతుంటాయి. టెట్రాసైక్లిన్‌ వంటి యాంటీబయోటిక్‌ మందులు కూడా పళ్ల మీద మచ్చల వంటి వాటికి కారణమవుతాయి. వీటిని తిరిగి మళ్లీ తెల్లగా మార్చేందుకు 'బ్లీచింగ్‌' ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. రసాయనాలతో దంతాలను 'బ్లీచ్‌' చేసే ఈ విధానంలో రకరకాల పద్ధతులున్నాయి. వీటి ద్వారా పళ్లు క్రమంగా తిరిగి సహజరంగులోకి వస్తాయి. ఫలితాలు చాలాకాలం పాటు ఉంటాయి.
పంటి పైపొర కింది డెంటిన్‌ మీద మచ్చలు ఏర్పడటం వల్ల కూడా పళ్ల రంగు మారుతుంది. దీన్నీ కొన్నిరకాల బ్లీచింగ్‌ పద్ధతుల ద్వారా సరిదిద్దొచ్చు. ఒకవేళ బ్లీచింగ్‌తో ఫలితం ఉండదనుకుంటే 'బాండింగ్‌' పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. పంటిపై భాగంలో అదే రంగు పూతతో సరిచెయ్యటం దీని ప్రత్యేకత. ఇది దంత సౌందర్య చికిత్సలో చాలా తేలికైన, చౌకైన ప్రక్రియ. దీంతో విరిగిన పళ్లు, పళ్ల సందులను కూడా సరిచేయొచ్చు. పంటి ఆకారం మార్చటం కూడా సాధ్యమే.
పళ్లు విరిగితే?
ప్రమాదాల్లోనో, కింద పడినప్పుడో తరచుగా ఎంతోమందికి ముందు పళ్లు విరుగుతుంటాయి. కొన్నిసార్లు ఇవి సగానికన్నా పైగా కూడా విరగొచ్చు. అలాంటి సమయాల్లో రక్తస్రావం జరగకుండా ఉండి, దంతమూలం, రక్తనాళాలు దెబ్బతినకుండా బాగున్నట్టయితే.. విరిగిన పన్ను వరకు 'కాంపోజిట్‌ ఫిల్లింగ్‌' చేస్తారు. ఇవి కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే ఆ పళ్ల మీద 'సిరామిక్‌ లామినేట్‌' చేయాల్సి ఉంటుంది. ఇందులో అసలు పన్ను ఆకారంలోనే 2 మి.మీ. మందం గల సిరమిక్‌ పొరను తయారు చేసి పంటి మీద అతికిస్తారు. ఇవేగాకుండా అవసరమైతే పన్ను పైన 'సిరామిక్‌ క్రౌన్‌' కూడా బిగిస్తారు.
వరుసగా ఒకటి కన్నా ఎక్కువ పళ్లు విరిగిపోతే ఆ ఖాళీని 'బ్రిడ్జెస్‌' ద్వారా పూరిస్తారు. అటుపక్క, ఇటుపక్క ఉండే దంతాల ఆధారంగా వాటిని అంటిపెట్టుకుని ఉండేలా వీటిని రూపొందిస్తారు. అయితే వీటిని కట్టుడుపళ్లలా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించటానికి వీలుకాదు. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది. వీటివల్ల మాట కూడా సరి అవుతుంది. నోటి శుభ్రతను పాటిస్తే ఇవి చాలాకాలం బాగుంటాయి.
విరిగిన పళ్లకు క్రౌన్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి పన్ను ఆకారంలో తొడుగులాగా ఉంటాయి. అసలు పన్ను సైజుని అన్ని వైపుల నుంచి కొద్దిగా తగ్గించిన తర్వాత.. దానిపైన వీటిని గట్టిగా అమరుస్తారు. ఈ క్రౌన్స్‌తో పళ్ల ఆకారం, పరిమాణం, బలం, అందం మెరుగవుతాయి. వీటిల్లో పింగాణీ అతికిన లోహం, రెజిన్‌, సెరామిక్‌ వంటి చాలా రకాలున్నాయి. ఒకసారి ఈ క్రౌన్‌ను అమరిస్తే సాధారణంగా 10-15 ఏళ్ల వరకూ సమస్య ఉండదు.
ఫ్లోరోసిస్‌ దుష్ప్రభావానికి?
తాగునీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరోసిస్‌ కారణంగా పళ్లు రంగు మారిపోయి.. అవి చూడ్డానికి వికారంగా తయారవుతాయి. పళ్లు కొద్దిగానే పసుపు రంగులోకి మారితే బ్లీచింగ్‌ వంటివి ప్రయత్నిస్తారు. ముందు రెండు పళ్లు రంగు మారితే.. వీటి మీద కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియలో రంగు మారిన పొరలను తొలగించి, పళ్ల రంగులోనే ఉన్న పదార్థాన్ని అతికిస్తారు. దాని మీద అతి నీలలోహిత కిరణాలను ప్రసరింప జేయటం ద్వారా అది గట్టిగా అవుతుంది. ఇది పది పదిహేను నిమిషాల్లోనే ముగుస్తుంది. కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేసిన పళ్లు సహజమైన దంతాల మాదిరిగానే ఉంటాయి. కొద్దికాలం తర్వాత ఇవి ఎప్పుడైనా రంగు మారితే పాలిష్‌ చేస్తారు. ఫిల్లింగ్‌ ఊడిపోయినా తిరిగి అతికించుకోవచ్చు.
ఒకవేళ ఎక్కువ సంఖ్యలో పళ్లు రంగు మారితే కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ అంతగా పనికిరాదు. అప్పుడు లామినేట్స్‌ వేస్తారు. రంగు మారిన పొరను తొలగించి, తిరిగి అంతే మందంలో, ఆకారంలో సిరమిక్‌ పొరను తయారు చేసి పన్ను మీద అతికిస్తారు.

కొందరికి దెబ్బ తగలటం వల్ల కూడా పళ్లు నల్లగా అవుతుంటాయి. వీరికి లామినేట్స్‌గానీ, క్రౌన్స్‌ గానీ బాగా ఉపయోగపడతాయి. పన్ను సైజు అన్నివైపులా తగ్గించి అదే ఆకారంలో సిరమిక్‌తో చేసిన క్రౌన్‌ని బిగిస్తారు.
పళ్ల సందులు
పళ్లు, చిగుళ్ల ఆకారంలో తేడా ఉంటే పళ్లసందులు ఏర్పడుతుంటాయి. కొందరిలో పై రెండు మధ్యపళ్ల నడుమ పెదవి కణజాలం (ఫ్రేనలమ్‌) అతుక్కుపోయి ఉంటుంది. దీనిని మిడ్‌లైన్‌ డయాస్టెమా అంటారు. దీంతో చిగుళ్ల మధ్య ఖాళీ ఏర్పడి పళ్ల సందులు ఏర్పడతాయి. ఇలాంటి వారికి 'కాంపోజిట్‌ ఫిల్లింగ్‌'తో ఖాళీలను సరిచేయొచ్చు. అవసరమైతే చిగురును కత్తిరించి తర్వాత లామినేట్‌ చేస్తారు. ఇందులో పన్నుని కత్తిరించి ముందుకు కనిపించే భాగాన్ని లామినేట్‌ చేయటం ద్వారా పన్ను ఆకారాన్ని కొద్దిగా పెంచుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్రౌన్‌ కూడా బిగించొచ్చు.
దంత సౌందర్య చికిత్సల్లో ఎక్కువగా క్లీనింగ్‌, పాలిషింగ్‌, బ్లీచింగ్‌ వంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. పంటి మీద లామినేట్స్‌, వినీర్స్‌ అతికించటం, క్రౌన్స్‌, బ్రిడ్జెస్‌, ఇంప్లాంట్స్‌ అమర్చటం వంటి

ప్రక్రియలు అందంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ కాపడతాయి. ముందుపళ్లు అందంగా తీర్చిదిద్దటం, ఎత్తుపళ్లు సరిచేయటం వంటివీ తరచుగా అవసరమయ్యేవే.
స్మైల్‌ డిజైనింగ్‌
చిరునవ్వును.. అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చికిత్సలన్నీ దీని కిందకు వస్తాయి. కొందరికి చిగుళ్లపై వరకూ ఉండటం వల్ల దంతాలు చిన్నగా కనిపిస్తాయి. మరికొందరిలో చిగుళ్లు ఒకేరకంగా కాకుండా ఎగుడు దిగుడుగానూ ఉంటాయి. దీంతో నవ్వినపుడు అంత అందంగా కనిపించరు. చిగుళ్ల పరిమాణాన్ని తగ్గించటం ద్వారా దీనిని సరిచేయొచ్చు. ఆపరేషన్‌ చేసి కొంత చిగురు భాగాన్ని తొలగిస్తారు. దీంతో పళ్లు పొడవుగా కనిపించి, నవ్వినపుడు అందాన్ని తెచ్చిపెడతాయి. ఇది చిగురు ఉబ్బెత్తుగా, ఎక్కువగా ఉన్న ఒక పన్నుకి గానీ బయటకు కనిపించే అన్ని పళ్లకు గానీ చేస్తారు. అవసరాన్ని బట్టి అందం ఇనుమడించేలా పళ్ల ఆకృతినీ సరిచేస్తారు.
వజ్రాల మెరుపు
ఇటీవల కొందరు ఫ్యాషన్‌ కోసం పళ్ల మీద డైమండ్స్‌, రంగు రాళ్లు, కలర్‌ చిప్స్‌ పొదిగించుకుంటున్నారు. రంధ్రం చేయకుండా వీటిని పన్ను మీదనే అమరుస్తారు. పన్నుకు రంధ్రం చేసి అందులో డైమండ్స్‌ను అమరిస్తే దానిని తొలగించినపుడు పన్ను దెబ్బతింటుంది. అందుకే వెనకవైపు నున్నగా ఉండే డైమండ్స్‌ని అతికించటం ద్వారా ఆ ఇబ్బందేమీ ఉండదు. రంగురాళ్లు, చిప్స్‌ని కూడా ఇదే పద్ధతిలో అమరుస్తారు.
ఎత్తుపళ్లు
ఎత్తుపళ్లు ఉన్నవారికి బ్రేసెస్‌తో సరిచేస్తారు. ముందుగా దంతాల నమూనా తీసుకొని, పళ్లు తొలగించకుండా సరిచేసే అవకాశాన్ని పరిశీలిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు పళ్లు తొలగించాల్సిన అవసరముంటుంది. బ్రేసెస్‌ను పళ్ల మీద అమర్చి, వాటి మధ్య నుంచి సన్నటి తీగను తొడుగుతారు. దానిని బిగించటం ద్వారా పళ్ల మీద ఒత్తిడి పెరిగేలా చేస్తారు. దీంతో క్రమంగా అవి లోపలి వైపు నెట్టుకొని వెళ్తాయి. మూడు వారాలకు ఒకసారి తీగను తిరిగి గట్టిగా బిగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సాధారణంగా 6-8 నెలల్లో ఎత్తుపళ్లు సరి చేసుకోవచ్చు. ఎత్తుపళ్లు ఉన్నవారు చిన్నతనంలోనే బ్రేసెస్‌ వాడటం మంచిది. వీటిల్లో అవసరమైనప్పుడు తీయటానికి వీలైనవి (రిమూవబుల్‌), ఎప్పుడూ లోపలే ఉండేవి (ఫిక్స్‌డ్‌) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పారదర్శకంగా ఉండే సిరమిక్‌ బ్రేసెస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మెటల్‌ బ్రేసెస్‌లా పైకి ఎబ్బెట్టుగా కనిపించవు.
వంకర పళ్లు: పాలపళ్లు ఊడకముందే శాశ్వతపళ్లు రావటం ప్రారంభిస్తే వంకరపళ్లకు దారి తీస్తుంది. కొంతమందికి చిగుళ్లు చిన్నగా ఉండి, పెద్ద పళ్లు రావటం, ఉండాల్సిన సంఖ్యకన్నా ఎక్కువ పళ్లు రావటం కూడా దీనికి కారణమవుతాయి. ఇలాంటివారికి ముందే ఎక్స్‌రే తీసి పరిస్థితిని గమనిస్తారు. పాలపళ్లను ముందే తీసేస్తారు. శాశ్వత పళ్లు సరిగా ఉన్నాయో లేవో చూసుకున్నాక ఎత్తుపళ్లు, వంకరపళ్లను సరిచేయటం మొదలెడతారు. వీటిని క్లిప్స్‌ (బ్రేసెస్‌) అమర్చి సరిచేస్తారు. సాధారణంగా వీటిని పళ్ల ముందే అమరుస్తారు గానీ కొందరికి వెనకవైపున కూడా అమరుస్తారు. కాకపోతే వీటి ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఎత్తుపళ్లు, వంకర పళ్లకు బ్రేసెస్‌ ఉపయోగపడకపోతే ఆపరేషన్‌ చేసి ఒకేసారి సరిచెయ్యాల్సిన అవసరం కూడా ఉంటుంది. వంకర పళ్లను దవడ ఎముక గట్టిగా ఉంటే ఏ వయసులోనైనా చేస్తారు.
ఇంప్లాంట్‌
పళ్లు విరిగినప్పుడు కొందరికి దంత మూలం కూడా దెబ్బతింటుంది. అప్పుడు ఆ మూలాన్ని పూర్తిగా తీసేసి దవడ ఎముకలో టైటానియంతో చేసిన ఇంప్లాంట్‌ బిగిస్తారు. దాని మీద క్రౌన్‌ని (కృత్రిమ పన్ను) అమరుస్తారు. దీంతో ఖాళీలు పూర్తిగా తొలగిపోయి, మిగతా పళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఇంప్లాంట్‌ దవడ ఎముకలో ఇమిడిపోయి కదలకుండా గట్టిగా ఉంటుంది. బ్రిడ్జెస్‌, కట్టుడుపళ్లతో ఎదురయ్యే ఇబ్బందులేమీ దీనిలో ఉండవు. ఒకటి, అంతకన్నా ఎక్కువ పళ్లు విరిగినవారికి.. ఎముక బలంగా ఉన్నవారికి ఇది ఉత్తమమైన పద్ధతి.

* ముందు పళ్లు దెబ్బతిన్నప్పుడు దవడ ఎముక బలంగా ఉన్నట్టయితే.. ఇంప్లాంట్‌ బిగించి, అదే రోజు లేదంటే మరునాడు క్రౌన్‌ కూడా అమరుస్తారు. దీన్నే 'ఇమ్మిడియేట్‌ లోడింగ్‌' అంటారు.
* వెనకపళ్లు దెబ్బ తిన్నవారికి దవడ ఎముక సరిగా లేకపోతే ఇంప్లాంట్‌ బిగించి, దాని మీద తాత్కాలికంగా పన్ను ఆకారం అమరుస్తారు. ఇంప్లాంట్‌ పూర్తిగా ఎముకలో స్థిరపడటానికి మూణ్నెల్లు పడుతుంది. అప్పుడు దానిపైన క్రౌన్‌ బిగిస్తారు. ఇది మధ్యవయసు వారికి, వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇంప్లాంట్‌ అనేది చాలా కష్టమైన ప్రక్రియగా భావించేవారు. ఇప్పుడు చాలా తేలికగా మారింది. కాకపోతే కొంత ఖర్చు ఎక్కువవుతుంది. మధుమేహం, బీపీ వంటి జబ్బులు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

- డా|| కడియాల రాజేంద్ర - డెంటల్‌ సర్జన్‌


  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కంట్లో ప్రమాదకారకాలు-మూలకణ చికిత్స , Eye foreign bodies and Stem cell treatment






కంట్లో రసాయనాలు పడటం పెద్ద ప్రమాదం! నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే ఎన్నో ఆమ్లాలు, ముఖ్యంగా క్షారాలు కనుగుడ్డును తినేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి:
* సున్నం కంటికి అతిపెద్ద శత్రువు. కిళ్లీల్లో ఉపయోగించే సున్నం కూడా ప్రమాదకరమైనదే.
* బ్లీచింగ్‌ పౌడర్‌. శుభ్రం చేసేందుకు ఉపయోగించే చాలా రకాల పౌడర్లలో అమ్మోనియా ఉంటుంది. ఇది ప్రమాదకరమైనది.
* అమ్మోనియా, పొటాష్‌ ఎరువులు
* బ్యాటరీల్లో ఉండే యాసిడ్‌, లోహాలను శుభ్రం చేసేందుకు పరిశ్రమల్లో బ్లీచ్‌గా వాడే సల్ఫరస్‌ ఆమ్లం, గ్లాసులకు పాలిష్‌ వేసేందుకు వాడే హైడ్రోఫ్లూరిక్‌ ఆమ్లం, నిత్యం ఇంట్లో వాడే వెనిగర్‌ (ఎసిటిక్‌ ఆమ్లం), అత్యంత ప్రమాదకరమైన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం.. ఇవన్నీ ప్రమాదకరమైనవే.
* ఇటువంటి ప్రమాదాల బారినపడుతున్న వారిలో దాదాపు 75% శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. పరిశ్రమల్లోనే కాదు.. సున్నం పడటం వంటి ప్రమాదాలు ఇళ్లలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కొద్దినిమిషాల పాటు శుభ్రంగా కడగటం చాలా చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా కంటి వైద్యులను సంప్రదించాలి. కంట్లో పడినదేమిటో కచ్చితంగా వైద్యులకు చెప్పటం చికిత్సా విధానానికి ఉపయోగపడుతుంది. వైద్యులు కూడా కంటి నుంచి ఆ రసాయనం, దాని అవశేషాలు మొత్తం పోయే వరకూ శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు.

కంట్లో కారం' గురించి మనం భయంకరంగా చెప్పుకొంటాం. కానీ కంటికి సంబంధించినంత వరకూ 'సున్నం' అతి భయంకరమైనది! ఒక్క సున్నమే కాదు.. మనం నిత్యం వాడే బ్లీచింగ్‌ పౌడర్‌.. రకరకాల యాసిడ్లు.. ఇవన్నీ కంట్లో విపత్తు సృష్టించేవే! ప్రమాదవశాత్తూ ఇవి ఒక్కసారి కంట్లో పడ్డాయంటే చాలు.. అతి సున్నితమైన కంటి భాగాలను తినేస్తాయి. దృష్టిని దెబ్బతీస్తాయి. ఆ కన్ను తిరిగి కోలుకునేలా చెయ్యటం.. తిరిగి చూపు తెప్పించటం.. ఎంతో కష్టంతో కూడుకున్న పని!

ముఖ్యంగా మన కంటిలోని నల్లగుడ్డు పైన ఉండే పారదర్శకమైన 'కార్నియా' పొర అత్యంత సున్నితమైనది. ఇదొక్కటే దెబ్బతింటే.. నేత్రదానం ద్వారా స్వీకరించిన కార్నియాను తెచ్చి మార్పిడి చెయ్యటం ద్వారా పరిస్థితి చక్కదిద్దచ్చు. కానీ ఈ కార్నియా పొరకు నిత్యం జవజీవాలను అందిస్తూ.. ఈ చుట్టూ ఉండే 'లింబస్‌' ప్రాంతం దెబ్బతింటే మాత్రం దీన్ని సరిచెయ్యటం మహాకష్టం. పదేళ్ల క్రితం వరకూ కూడా దీనికి సరైన పరిష్కారమే లేదు. ఫలితంగా... సున్నం వంటి ప్రమాదాల బారినపడిన ఎంతోమంది బాధితులు దృష్టికి దూరంగా, అంధకారంలో ఉండిపోయారు

నల్లగుడ్డు మీదికి తెల్లగుడ్డు దురాక్రమణ
కంటిలో లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే ఇలా నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో కనుగుడ్డే మూసుకుపోయి చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే.

కంటిలో రసాయనాలు పడటం సర్వసాధారణమైనదే కాదు, అత్యంత ప్రమాదకరమైన సమస్య కూడా! కంటికి సంబంధించి ఇదో అతిపెద్ద విపత్తు. మామూలుగానే మన కంట్లో ఏం పడినా క్షణాల్లో మంట, ఎర్రబడటం, వాపు, నీరుకారటం వంటివన్నీ మొదలవుతాయి. కాకపోతే సరైన చికిత్సతో ఇవన్నీ కొద్దిగంటల్లోనో, రోజుల్లోనో తగ్గిపోయి.. కన్ను మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అదే గాఢమైన ఆమ్లాలుగానీ, క్షారాలుగానీ పడినప్పుడు పరిస్థితి ఇంత తేలికగా ఉండదు. అవి కనుగుడ్డు మీద ఉండే సున్నితమైన, కంటి చూపునకు అత్యంత కీలకమైన పొరలను తినేస్తాయి. ముఖ్యంగా సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి క్షార రసాయనాలు కనుగుడ్డు పైభాగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి రెండు కళ్లలోనూ పడితే పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో కార్నియా పొర దెబ్బతిన్నప్పుడు తక్షణ వైద్యంతో పాటు చూపు పునరుద్ధరణ కోసం ఎంతో సంక్లిష్టమైన చికిత్సలూ అవసరమవుతాయి. మూలకణ మార్పిడి చికిత్సా విధానం వీటిలో అత్యంత కీలకమైనది.

ఏమిటీ మూలకణ చికిత్స?
మన కంట్లో నల్లగుడ్డు మీద పారదర్శకమైన పొర ఉంటుంది. దీన్నే 'కార్నియా' అంటారు. ఈ కార్నియా చుట్టూ తెల్లగుడ్డు ఉంటుంది, దీన్ని 'కంజెంక్త్టెవా' అంటారు. ఈ రెంటికీ మధ్య ఉండే రింగులాంటి ప్రాంతం 'లింబస్‌'. కార్నియా పొర బాగుండాలంటే దాని చుట్టూ ఉండే ఈ లింబస్‌ పొర అత్యంత కీలకం. ఎందుకంటే కార్నియా పొరకు కావాల్సిన కణాలన్నింటినీ ఈ లింబస్‌ రింగే అందిస్తుంటుంది. కార్నియా స్వచ్ఛమైన అద్దంలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి దానిలో రక్తనాళాలు, రక్తసరఫరా ఉండవు. కానీ శరీరంలో అన్నిభాగాల్లాగే అక్కడి కణాలు కూడా నిరంతరం క్షీణిస్తుంటాయి. మరి దానికి నిరంతరం కొత్తకణాలు అందుతుంటేనే అది చక్కగా ఉంటుంది. అందుకే దానిచుట్టూ అద్భుతమైన 'లింబస్‌' ఏర్పాటు ఉంది. ఈ లింబస్‌ రింగులో మూల కణాలుంటాయి. ఇవి నిరంతరం కార్నియా కణాలుగా మార్పుచెందుతూ.. పైకి వ్యాపిస్తుంటాయి. దీంతో కార్నియా ఎప్పుడూ చక్కగా ఉంటుంది. ఇదీ ప్రాథమికంగా కార్నియా, లింబస్‌ల నిర్మాణం.

ప్రమాదం జరిగితే..?
కంట్లో ఏవైనా రసాయనాలు పడి.. కార్నియా పొర దెబ్బతింటే.. వేరొక నేత్రదాత నుంచి స్వీకరించిన కార్నియా మార్పిడి చేస్తారు. ఆ తర్వాత దానికి అవసరమైన కణాలన్నింటినీ యథాప్రకారం లింబస్‌ అందిస్తుంటుంది. కానీ ప్రమాదంలో లింబస్‌ భాగం కూడా దెబ్బతింటే..? అప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది. కార్నియా మార్పిడి చేసినా.. దానికి నిరంతరం కణాలను సరఫరా చేసే లింబస్‌ ప్రాంతం లేక అది అట్టేకాలం నిలబడలేదు. రెండోది- లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే. ఇలాంటి వారికి కార్నియా మార్చినా.. లింబస్‌ లేదు కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడలేదు. కాబట్టి లింబస్‌ ప్రాంతం దెబ్బతిన్నప్పుడు.. దాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అత్యవసరం. ఒక కన్ను బాగుంటే దాని నుంచి కొద్దిభాగం తీసుకువచ్చి మార్పిడి చెయ్యచ్చు. కానీ లింబస్‌లో మరీ ఎక్కువ భాగం దెబ్బతినిపోతే ఎలా? అలాగే ఒక కన్ను దెబ్బతింది కాబట్టి బాగున్న కంటి నుంచి లింబస్‌ తెచ్చి అమర్చటమంటే.. ఆ బాగున్న ఒక్క కంటినీ కూడా దెబ్బతీసిన వాళ్లమవుతామా? అన్నదీ ముఖ్యమే. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నది అత్యంత క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారంగానే 'లింబస్‌ మూలకణాల మార్పిడి' విధానాన్ని రూపొందించారు.

మార్పిడి అద్భుతం!
బాధితుల రెండో కన్ను బాగుంటే.. దాని నుంచి చాలా తక్కువగా (2 మి.మీ.) లింబస్‌ రింగు పొరను తీసుకుంటారు. ఒకవేళ రెండోకన్నూ దెబ్బతింటే తలిదండ్రులు, లేదా సన్నిహిత బంధువుల నుంచి కొద్దిగా లింబస్‌ పొరను సేకరిస్తారు. దాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సాధ్యమైనంత పెద్దగా పెంచటమన్నది ఈ ప్రక్రియలోని మూలసూత్రం. ఇలా మూలకణాలను పెంచవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమవ్వటంతో ఎల్వీప్రసాద్‌ పరిశోధకులు.. దాన్ని కంటి లింబస్‌ కణాలకు వర్తింపజేస్తూ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో సాధించేందుకు కృషి చేసి విజయం సాధించారు.
బాగున్న కంటి నుంచి కేవలం 2 మి.మీ. లింబస్‌ మాత్రమే తీసుకుని.. దాన్ని ప్రయోగశాలలో పెద్దగా పెంచాలి. అందుకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చే మాయ (ఆమ్నియాన్‌) పొర సహాయం తీసుకున్నారు. మాయపొరను ప్రయోగశాలలో చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రత్యేక రసాయనాల్లో సిద్ధంగా ఉంచుతారు. రోగి కంటి నుంచి తీసుకున్న 2 మి.మీ.ల లింబస్‌ పొరను దాని మీద ఉంచి.. క్రమేపీ దాన్ని 2 వారాల్లో పెద్దగా పెంచుతారు. రెండు కళ్లూ బాగా దెబ్బతిన్నా కూడా చిన్న లింబస్‌ ముక్క బాగుంటే చాలు.. అదే రోగి నుంచి దాన్ని తీసుకుని.. ప్రయోగశాలలో పెంచుతారు. ఇలా పెంచిన పొరను తీసుకువెళ్లి.. దెబ్బతిన్న కంటిలో అతికిస్తారు. అది క్రమేపీ కుదురుకుని.. తన మూలకణాల నుంచి కార్నియా కణాలను తయారు చెయ్యటం ఆరంభిస్తుంది. క్రమేపీ కార్నియా చక్కబడుతుంది. లేదంటే నేత్రదాతల నుంచి కార్నియా తెచ్చి మార్పిడి చెయ్యచ్చు. ఇప్పటికే లింబస్‌ను బాగు చేశారు కాబట్టి కార్నియా చక్కగా స్థిరపడుతుంది. ఇదీ ఈ ప్రక్రియ ప్రత్యేకత!


  • source : L.V.prasad eye hospital Updates- Hyderabad
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, September 23, 2010

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్ , Irritable bowel Syndrome,IBS


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ప్రకృతిలో రోగాల బారినపడని ప్రాణి ఏదీ ఉండదు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం.

ఐబీఎస్‌--విచిత్ర వ్యాధికిది ప్రత్యక్ష నిదర్శనం! ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు. కానీ వ్యాధి మాత్రం వీడదు. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు.. లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు. వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం! అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా.. పేగుల్లో ఏమీ ఉండదు. దీన్నే 'ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌'గా నిర్ధారిస్తారు. అందుకే ఈ వ్యాధి విషయంలో మనం పేగులనూ, శరీరాన్నే కాదు.. మనసును, మొత్తం అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవటం అవసరమం.

పూర్వకాలంలో- వ్యాధులనేవి భూత, ప్రేతాల కారణంగా వస్తున్నాయని భావించేవారు. వ్యక్తితో సంబంధం లేకుండా ఏవో అదృశ్యశక్తులు, అతీంద్రియ శక్తులు వ్యాధులకు కారణమవుతాయని అనుకునేవారు. ఈ భూతప్రేతాల భావన తప్పని.. 'వ్యాధి'కి కారణమేమిటన్నది మనం పరిశీలించాల్సిన అంశమని హిపోక్రటీసు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రవేశపెట్టాడు. వ్యాధి చికిత్సకు ఆయన రెండు రకాల ఔషధాలను సూచించాడు. అవి ఒకటి: వ్యాధి లక్షణాలకు వ్యతిరేక లక్షణాలు కలిగించేవి. రెండు: వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలనే కలిగించేవి. 'ఐబీఎస్‌'ను అర్థం చేసుకోవటంలో వ్యక్తి, వ్యాధి లక్షణాలు కూడా చాలా కీలకమైన అంశాలు. ఐబీఎస్‌ లక్షణాలన్నీ పేగుల కదలికల్లో అస్తవ్యస్తాన్ని సూచించేవేగానీ.. ఆ అస్తవ్యస్తమన్నది పేగుల్లో కాదు.. మొత్తం దేహవ్యవస్థ క్కూడా సంబంధించినది!

వ్యాధి అంటే.?
మన మనసులోగానీ, శరీరంలోగానీ తలెత్తే అస్తవ్యస్తాలే వ్యాధికి మూలం! ఈ అస్తవ్యస్తాలనేవి మనసులో, శరీరంలో రెంటిలో ఒకేసారి సంభవిస్తున్నాయి. ఈ అస్తవ్యస్తాలు ఎందుకు తలెత్తుతాయి అన్న ప్రశ్నకు-బాహ్య, అంతర్గత అంశాల ప్రేరణే కారణమని చెప్పుకోవచ్చు. ఈ బాహ్య, అంతర్గత అంశాల పట్ల వ్యక్తిలో తలెత్తే స్పందనలే వ్యాధుల రూపంలో బయటపడుతుంటాయి.

శరీరం-మనసు: మనం వ్యక్తిని 'శరీరం', 'మనసు'ల కలయికగా చూస్తాం. కానీ వాస్తవానికి శరీరానికీ, మనసుకూ భిన్నమైన వాడు వ్యక్తి. ఎందుకంటే 'నా శరీరం'.. 'నా మనసు' అంటాం. అంటే మనల్ని మనం ఈ శరీరానికి, మనసుకు భిన్నంగా భావిస్తున్నామనేగా అర్థం! అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవటానికి ఈ భావన బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా బీపీ ఉంటే కిడ్నీలు చెడిపోవచ్చు. కిడ్నీ సమస్య ఉంటే బీపీ రావొచ్చు. అంటే కిడ్నీకి గుండె అంతర్గత వాతావరణం అన్నమాట. వీటి మధ్య పరస్పరాధారమైన సంబంధం ఉంటుంది. ఒకవేళ గుండె రక్తాన్ని సరిగా పంప్‌ చేయలేదనుకుందాం. అప్పుడు రక్తం ఊపిరితిత్తుల్లో నిలిచిపోతుంది. ఆయాసం, దగ్గు వస్తాయి. ఇవన్నీ అంతర్గత వాతావరణ అంశాలకు ఉదాహరణలే. ఈ బాధల పట్ల వ్యక్తి స్పందనలే వ్యాధి లక్షణాలుగా వ్యక్తమవుతాయి. ఈ లక్షణాలు- వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉంటాయి కూడా. లక్షణాలను బట్టి ఔషధాలను ఎంపిక చేసేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ వ్యాధి చికిత్సకైనా ఈ అంశాల వివరాలు తెలియటం అవసరం. 'ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌' (ఐబీఎస్‌) చికిత్సకు ఇవి మరీ ముఖ్యం. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబడితే ఐబీఎస్‌ బాధితులకు చక్కటి మందులను ఎంపిక చేయటం సాధ్యమవుతుంది.

ఐబీఎస్‌
ఐబీఎస్‌ జీర్ణమండలానికి సంబంధించిన వ్యాధి. నోరు నుంచి మొదలుకొని.. నాలుక, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగులు, పెద్ద పేగులు, మలద్వారం.. అన్నీ జీర్ణమండలంలో భాగాలే. ఈ జీర్ణ వ్యవస్థను రెండు భాగాలుగా విభజించొచ్చు. నోరు నుంచి జీర్ణాశయం వరకు ఒకటి.. చిన్నపేగు నుంచి మలద్వారం వరకూ రెండో భాగం. మనిషిలో చిన్నపేగు, పెద్దపేగులు కలిసి సుమారుగా 30 అడుగుల పొడవుంటాయి. ఆహార నాళం గుండా ఆహారం ప్రయాణం చేస్తున్నప్పుడు పచనక్రియ, మల విసర్జన క్రియలు జరుగుతాయి. కడుపునిండా సుష్టుగా భోజనం చేసిన తర్వాత.. అది పూర్తిగా జీర్ణాశయాన్ని వదిలి పేగుల్లోకి వెళ్లటానికి 6 గంటల సమయం పడుతుంది. అక్కడ నుంచి ఆ ఆహారం పేగుల్లో యాణిస్తుంది. ఈ ప్రయాణంలో పేగుల కదలికలో తేడా వస్తే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. దీనికి బాహ్య కారణాలు దోహదం చెయ్యచ్చు. వీటిని సరిగా అర్థం చేసుకొని మందులు ఇస్తేనే వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
పేగుల కదలికలు త్వరత్వరగా జరిగితే వెంటనే విరేచనాలవుతాయి. అదే నెమ్మదిగా ఉంటే మలబద్ధకం ఏర్పడుతుంది. కదలికల అస్తవ్యస్తానికి నొప్పి కూడా తోడవుతుంది. అంతర్గత వాతావరణం వల్ల కూడా పేగుల కదలికలకు సంబంధించిన బాధలు వస్తుంటాయి. ఆందోళన ఎక్కువగా ఉంటే విరేచనాలు కావచ్చు. దిగులు పట్టుకుంటే మలబద్ధకం రావొచ్చు. ఐబీఎస్‌లో లింగ పరమైన అంశాలూ ప్రభావం చూపుతాయి. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే మూడింతలు ఎక్కువగా కనిపించటమే దీనికి ఉదాహరణ. లింగభేదమే కాక.. చిన్నపేగు, పెద్దపేగులను చాలా అంశాలుప్రభావితం చేస్తుంటాయి. మానసిక ఒత్తిడి, ఆహారం, మాదకద్రవ్యాల వంటి జీవనశైలీ పరమైన అంశాలు, హార్మోన్ల వంటివన్నీ పేగుల కదలికలను ప్రభావితం చేయచ్చు. ఐబీఎస్‌లో అస్తవ్యస్తంగా సాగే పేగుల కదలికలను బట్టి చికిత్స సాగుతుంది. వాటిని సరిచేస్తే వ్యాధి నయమవుతుంది. మానసిక ఒత్తిడి, భావోద్వేగపరమైన వైరుధ్యాలు (ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్స్‌).. కుంగుబాటు, ఆందోళనలకు దారి తీస్తాయి. ఇవి ఉన్నప్పుడు ఐబీఎస్‌ బాధలు ఎక్కువవుతాయి.

* ఐబీఎస్‌ లక్షణాలైన మలబద్ధకం, అతిసారం, నొప్పి ఎప్పుడూ ఉండవు. వస్తూ పోతుంటాయి.
* వీటితో క్యాన్సర్‌ భయం లేదు.
* ఐబీఎస్‌ బాధితులకు రక్తం, మలం వంటివి పరీక్షించినా ఏ దోషాలూ కనిపించవు. పేగులు కూడా చూడటానికి బాగానే ఉంటాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో మానసిక, శారీరక 'అస్తవ్యస్తాలకు' అంతటి ప్రాధాన్యం!

మందులు
ఐ.బి.య. లో చికిత్సావిధానము మూడు విదాలు గా ఉంటే మంచిఫలితాలు ఉంటాయి. 1. మానసికం  గా చికిత్స చేయడము ,
2. ఆహారములో మార్పులు చేయడము ,  
3. శారీరక చికిత్స .
ఐబీఎస్‌ జీర్ణవ్యవస్థకు మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. కొందరిలో విరేచనాలు, మరి కొందరిలో మలబద్ధకం, కొంతమందికి పొట్ట ఉబ్బటం.. ఇలా వ్యక్తి వ్యక్తికీ లక్షణాలు మారుతుంటాయి. కాబట్టి వ్యక్తిపరంగా.. శరీరతత్వం, మనస్తత్వం, జీవనశైలి, ఆలోచన, ఆవేశాలు, కుటుంబం.. పని.. సమాజం.. వీటి పరంగా వచ్చే ఒత్తిళ్లు, అలవాట్లు, వయసు, లింగ భేదం వంటి వాటన్నింటినీ పరిశీలించి మందులను ఎంపిక చేయాలి.

  • ఎక్కువ పీచుపదార్ధము ఉన్న ఆహారము తీసుకోవాలి ,
  • ఎక్కువ స్ట్రెస్ -స్ట్రైన్‌ ఉన్న పనులు మానుకోవాలి ,
  • పొగతాగడం పూర్తిగా పనికిరాదు ,
  • యాంటి స్పాజ్మాటిక్స్(Antispasmodics) -- డైసైక్లొమైన్‌(Dicyclomine)మాత్రలు
  • నొప్పి తీవ్రత బట్ట్టి రోజికి 1-2 వాడాలి ,లేదా.. హయోసిమైన్‌(Hyoscyamine)రోజుకి 1-3 వాడవచ్చును .
  • యాంటీ డయేరియల్స్(Anti diarrhoeals) : లోపరమైడ్ రోజుకి 1-3 మాత్రలు వాడవచ్చును .
  • యాంటీ డిప్రసెంట్స్(Anti depressents) : ఇమిట్రిప్టిలిన్‌ 10-25 మి.గ్రా. రోజుకి 1-3 వాడాలి. . . లేదా ఈక్విరెక్ష్ (clinium bromide + chlordizepam)రోజుకి 1-2 వాడవచ్చును .
  • ఎసిడిటి ఎక్కువగాఉంటే ... omeperazole + Domperadone కలిసి ఉన్న మాత్రలు రోజికి 1-2 వాడాలి .
  • ఇంకా ఎన్నో కొత్త మందులు వాడుకలో ఉన్నాయి . మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన మందులు ... జీవితాంతము వాడాలి .




ఐబీఎస్‌లో రెండు రకాలున్నాయి.
* నొప్పితో : ఇందులో తీసుకున్న ఆహారం మూలంగా మలబద్ధకం గానీ నొప్పితో కూడిన అతిసారం గానీ కనిపిస్తాయి. కొన్నిసార్లు మలబద్ధకం, అతిసారం ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయి. మలంలో జిగురు పడొచ్చు. నొప్పి స్వల్పంగా గానీ మెలి పెట్టినట్టు గానీ ఉండొచ్చు. త్రేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, నిస్త్రాణ, కుంగుబాటు, ఆందోళన, ఏకాగ్రత లోపించటం వంటివీ కనిపించొచ్చు.
* నొప్పి లేకుండా: ఇందులో అతిసారం గానీ, మలబద్ధకంగానీ ఉన్నా నొప్పి ఉండదు. అతిసారం చాలా వేగంగా మొదలవుతుంది. మల విసర్జన కూడా వెంటనే అవుతుంది. కొందరు నిద్ర లేస్తూనే విసర్జనకు పరుగెత్తాల్సి వస్తుంది. కొందరికి భోజనం చేసిన వెంటనే మల విసర్జన అవుతుంది. ఈ విరేచనాల బాధ నిద్రాసమయంలో ఉండదు. కొందరికి త్రేన్పులు, మల బద్ధకం, నొప్పి కనిపించవచ్చు.


ఐబీఎస్‌కు యాంటీబయోటిక్‌ మందు
మలబద్ధకం, విరేచనాలు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలతో ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) చాలామందిని తెగ ఇబ్బంది పెడుతుంటుంది. దీనికిప్పుడు కొత్త యాంటీబయోటిక్స్‌ చికిత్స అందుబాటులోకి రావటానికి మార్గం ఏర్పడింది. రెండు వారాల పాటు రిఫాక్సిమిన్‌ అనే యాంటీబయోటిక్‌ మందును వాడితే మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఈ మాత్రలు వేసుకోవటం ఆపేసిన 10 వారాల తర్వాత కూడా ప్రభావం చూపటమే కాదు మలబద్ధకం మూలంగా కలిగే కడుపు ఉబ్బరమూ తగ్గుతుండటం విశేషం. ఈ మందు మలబద్ధకంతో కూడిన, మలబద్ధకం లేని ఐబీఎస్‌లోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఐబీఎస్‌లో పేగుల్లోని సూక్ష్మజీవుల్లో ఏర్పడే మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీబయోటిక్‌ చికిత్స ప్రయోగాలకు ఇవే బీజం వేశాయి కూడా. కానీ ప్రయోగాల్లో నియోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ మిశ్రమ ఫలితాలను అందించటం నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు పేగులపై ప్రభావం చూపే రిఫాక్సిమిన్‌ మాత్రలు ఐబీఎస్‌లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలటం కొత్త ఆశలను రేకెత్తించింది.

ఐబీఎస్‌--ఆహారంతో దూరం

పేగుల్లో తలెత్తే పెద్ద చికాకు.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌). దీనితో బాధపడేవారికి గ్యాస్‌, త్రేన్పులు, కడుపునొప్పి వంటి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తే వీటి నుంచి చాలా వరకూ ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఐబీఎస్‌ బాధితులు సహజమైన చక్కెరలు తక్కువగా ఉండే పదార్థాలు (లో-ఫోడ్‌మ్యాప్‌) తినటం మంచిదని వివరిస్తున్నారు. ఎందుకంటే లో-ఫోడ్‌మ్యాప్‌ డైట్‌ పాటించటం వల్ల 80% మందికి త్రేన్పులు, కడుపునొప్పి, గ్యాస్‌ సమస్యలు తక్కువగా ఉంటున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వార్షిక సమావేశంలో ఆస్ట్రేలియా పరిశోధకులు ఈ లో-ఫోడ్‌మ్యాప్‌ ఆహార నియమాల గురించి వివరించారు. గోధుమలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోబీపువ్వు, పాల పదార్థాలు, తేనె, యాపిళ్లు, పుచ్చకాయ, మామిడి పండ్లు.. వంటి వాటిల్లో ఈ ఫోడ్‌మ్యాప్‌ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం సరిగా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల జీర్ణాశయంలోకి ఎక్కువ నీరు చేరటంతో ఐబీఎస్‌ లక్షణాలు ఉద్ధృతమయ్యేందుకు కారణమవుతోంది. అయితే ఇవి అందరిలోనూ ఎందుకు కనిపించవు? ఇందుకు కారణం జీర్ణాశయం ఆయా పదార్థాలకు అతిగా స్పందించటమే. ఐబీఎస్‌ బాధితుల్లో కడుపు ఉబ్బరం కొద్దిమోతాదులో ఉన్నప్పటికీ త్రేన్పులు, నొప్పి వంటివి తీవ్రంగా ఉంటాయి. సహజ చక్కెరలు గల పదార్థాలకు దూరంగా ఉంటే పోషక విలువలు తగ్గవా? ఇందుకోసం అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, టమోటాలు, బ్రెడ్లు, బియ్యం, ఓట్స్‌, క్యారట్లు, దోసకాయం, పచ్చి బఠానీలు, చిలగడ దుంపల వంటివి తీసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 22, 2010

Dengue fever in Telugu, డెంగూ జ్వరం



విషజ్వరాలు అంటే ... వైరల్ జ్వరాలు (Viral fevers) , ఈ విషజ్వరాలలో ఒక రకము డెంగూ జ్వరం .
ఈ వ్యాధి కారక క్రిమి ఆర్బోవైరసం జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు .ఈ వైరస్ ఏయిడిస్ ఈజిప్టి జాతి దోమద్వారా రోగగ్రస్తుల నుండి ఆరోగ్య వంతులకు సంక్రమించును. ఈ దోమను టైగర్ దోమ అనికూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటి పూటనే కుట్టును. ఈ దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజులలో వ్యాధి లక్షణాలు కన్పించును.

డెంగూ అనే డెన్‌ (DEN), గీ (gee) అని నాలుగు రకాల వైరస్లు . . . DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనేవి ఆ వైరస్లు .

రెండు రకాలు : 1. సాదారణ రకము , 2 . డెంగూ హెమరేజిక్ ఫీవరు (ప్రమాదకరమైనది),

డెంగూ వ్యాధి లక్షణాలు
1. ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వచ్చుట
2. తలనొప్పి అధికంగా నుండును, ఎక్కువగా నొసటిపై తలనొప్పి కల్గుట
3. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గించుట, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అగుట
4. కండరాలు, కీళ్ళ నొప్పి కల్గుట
5. వాంతి అగునట్లు భ్రాంతి కల్గుట
6. నోరు ఎండిపోవును, ఎక్కువ దాహముండును

పై లక్షణాలు కలిగి ఉన్నచో వెంటనే మీ సమీపములో గల ఆసుపత్రినందు చూపించుకొని వ్యాధి నివారణ కొరకు చికిత్స పొందగలరు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున ప్రజలు వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి పై తెలిపిన లక్షణాల నివారణ కొరకు వెంటనే తగిన చికిత్స పొందగలరు. ఈ విషయం సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియచేయవలెను.

వ్యాధి వ్యాపించే విధానము
1. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమించును
2. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి జరుగును
3. ఈ దోమలు పగలే కట్టును
4. ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాలలో నీరు నిలుచుటకు ఆవకాశం వుండి, ఆ నీరు కనీసము వారం రోజులు నిల్వ ఉన్నచో, ఈ దోమలు వృద్ధి చెందును.
5. ఈ దోమలు గ్రుడ్డు పెట్టి పెరుగుటకు ఈ క్రింద తెలిపిన వస్తువులు / పరిసరాలు అనూకూలమైనవి.

ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ ల పైన నిల్చిన వాన నీరు.

1. ఇతర పనికిరాని, పగిలిపోయిన పస్తువులు
2. ఈ దోమ ఇంటిలో గల చీకటి ప్రదేశాలలో నివసించుచుండును
3. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్ళు
4. ఫ్లవర్ వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైనవి.

ఎ) దోమల నివాసాలను తొలగించుట :
నీరు నిల్వను, పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు ఇతరత్రా కనీస అవసరాలకు ఉంచుకొని పనికిరాని వాటిని తీసివేయవలెను, ఇండ్లలోని మరియు వెలుపల నీటి నిల్వలను పాలపారబోయవలెను. నీటి ట్యాంకునకు మూతలుంచవలెను. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించుచూ వారంలో ఒక రోజు డ్రైడే (Dry Day) విధానము తప్పక పాటించుచూ రావలెను. అదే విధముగా జనవాసములందు సంఘీభావముతో పై కార్యక్రమములను పాటింపచేయవలెను.

బి) వ్యక్తిగత జాగ్రత్తలు :
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చును. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించవలెను. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయవలెను.

చికిత్స :
స్వంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబిఫ్లామ్ మరియు అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు.

ముఖ్యంగా డెంగీ వస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయని భయపడుతూ ఎంతోమంది రక్తనిధులకు పరుగులు తీస్తున్నారు. ఈ ప్లేట్‌లెట్ల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం.

మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది.

ప్లేట్‌లెట్‌లు...
* 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు.
* 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావమవ్వొచ్చు.
* 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
* 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్‌ విపరీతంగా అవుతుంది.

- కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్‌లెట్‌ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం.

రక్తస్రావమయ్యే సూచనలు
* చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు (గుండుసూది సైజులో) ఉన్నట్టు కనబడటం.
* చిన్నపాటి దెబ్బకు కూడా ఆ ప్రాంతం కమిలిపోవటం.
* ఏదైనా గీరుకున్నప్పుడు చాలాసేపు రక్తస్రావం జరగటం.
ఈ లక్షణాలు కనబడితే మాత్రం అశ్రద్ధ చెయ్యకూడదు.

చికిత్సా విధానము :

అల్లోపతి :

డెంగూ విషజ్వరం చాలా ప్రమాదకరమైనది. ఎయిడ్స్‌ లాగే దీనికి నివారణ తప్ప చికిత్స లేదంటారు. అయితే ఈ విషజ్వరం సోకిన వారంతా మరణిస్తారనేది అపోహ. ఇది దానంతకు అదే తగ్గాలి తప్ప మందులతో నయం అయ్యేది కాదని వైద్యులు అంటున్నారు.

రోగికి విశ్రాంతి అవసరము ,
జ్వరానికి " పారాసిటమాల్ "
నొప్పులకు - కొడిన్‌ ,ట్రమడాల్ , పెథిడిన్‌, పారాసెటమాల్ ,
డీహైడ్రేషం తగ్గడానికి - సెలైన్లు ,
మరేవిధమైన బాక్టీరియల్ ఇంఫెక్షన్‌ రాకుండా మంచి బ్రాడ్ స్పెక్ట్రం యాంటిబయోటిక్ ఇవ్వాలి .
పౌస్టికాహారము , అన్ని వేడి చేసి తినాలి . కారము , పులుపు , మసాలా అహారము తినకూడదు .
బ్లీడింగ్ అవకాశముంటే styptochrome లాంటి మందులు ముందుగానే ఇవ్వాలి ,
ప్లేట్ లెట్ కౌంట్ తగ్గితే 1-2 యూనిట్స్ ప్లేట్ లెట్స్ ఇవ్వాలి .

ఆయుర్వేద వైద్యం
వ్యాధి లక్షణాలు తగ్గటానికి కూడా ఔషధాలు వాడుతుంది. వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క కషాయం, ఉమ్మెత్త మొక్క సారం జ్వరం నొప్పులు తగ్గడానికి వాడటం ఉంది. తులసి, పుదీనా, అల్లం, యాలకలు, దాల్చినచెక్క వగైరాలతో చేసిన కషాయం చెమట పట్టడానికి, జ్వరం తగ్గడానికి వాడతారు.

మూలికావైద్యం
1.డెంగ్యూ జ్వరానికి అద్భుతమైన మూలికా వైద్యాన్ని కనిపెట్టిన గౌరవం ఫిలిప్పీన్స్‌ దేశంలోని ఒక క్రిష్టియన్‌ మతాచార్యుడికి దక్కింది. అది అత్యంత సమర్థవంతమైనది. చాలా త్వరగా వ్యాధిని నయంచేసేది, చౌక అయింది. తేలికగా అందరికీ అన్ని చోట్లా లభించేది. పల్లె ప్రాంతాల్లో కూడా లభించేది. పర్పుల్‌ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కషాయం . చిలగడ దుంపల పర్పుల్‌ రంగు ఆకులు ఇంత సమర్థవంతంగా పనిచేయడానికి శాస్త్రీయమైన కారణాలే ఉన్నాయి.

శాస్త్రీయ కారణాలు
1992వ సంవత్సరంలో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ నే స్వచ్ఛంధ సంస్థ చిలగడ దుంపలలోని, చిలగడ దుంపల ఆకుల్లోని ప్రధాన సూక్ష్మ పోషక విలువలను లెక్కకట్టి చిలగడదుంపలు ఆలుగడ్డల కన్నా విలువైనవి, వాటి పర్పుల్‌ రంగుల ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని త్వరితంగా గణనీయంగా పెంచే యాంటీ ఆక్సిడైజింగ్‌ గుణాలు ఉన్నాయని నిర్ధారించారు. ఆ ఆకుల్లో వ్ఞన్న సహజ ఫోలిఫినోలిక్‌ రసాయన మిశ్రమాలు అందుకు కారణం అని కూడా తేల్చారు. కనుక చిలగడ దుంపల పర్పుల్‌కలర్‌ ఆకులు అందుబాటులో ఉన్నంత వరకు డెంగ్యూ జ్వరాన్ని గురించి భయపడవలసిన అవసరం లేదు.

2.బొప్పాయి రసంతో డెంగీకి విరుగుడు

బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగీ వ్యాధిని నివారించవచ్చు. బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దాన్ని వీలైనపుడల్లా తింటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆడ బొప్పాయి చెట్టు ఆకులు ... ఈనెలు ,కాండము లేకుండా మెత్తగా దంచి రసము(పసర) తీయాలి. సుమారు 10 మి.లీ చొప్పున్న ప్రతిరోజూ ఉదయము, సాయంత్రం  త్రాగాలి. ఇలా 5 రోజులు తీసుకుంటే డెంగీ జ్వరము తగ్గుతుంది. ముఖ్యముగా ప్లేట్-లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది. దీనికి తోడుగా పారాసెటమాల్ మాత్రలు కూడా ఇవ్వాలి. నీరసము , డీహైడ్రేషన్‌ ఉంటే సెలైన్‌ ఇవ్వవలసి ఉంటుంది.

---------updates : 25/10/2011

ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగీ చికిత్సకు సంబంధించి స్పష్టమైన విధానాలను రూపొందించింది. దీనికి అనుగుణంగానే వైద్యులు చికిత్స అందించాలి. డెంగీ నిర్ధారణ కాకున్నా యాంటీ బయాటిక్స్‌ ఇవ్వడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 26 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఎలీసా పరీక్షలు చేసే సదుపాయాలున్నాయి. చిన్నచిన్న పట్టణాల్లో ఈ సదుపాయాలులేవు. ఇలాంటి ప్రాంతాల్లోని ఆస్పత్రులు ఎలీసా పరీక్ష కోసం అనుమానిత రోగి నుంచి రక్తనమూనాలను తీసి జిల్లా ఆస్పత్రులకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జ్వరాలన్నీ డెంగీ కాదు. రెండు మూడు రకాల వైరస్‌ల కలయిక వల్ల వస్తున్న జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త తరహా జ్వరాలు దాదాపుగా డెంగీ లక్షణాలను పోలి ఉన్నాయని వైద్యనిపుణులు నిర్ధారించారు. తీవ్రమైన జ్వరం (102 డిగ్రీలకు పైగా), తలనొప్పి, కండరాలు, కడుపులో నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. జ్వరం సోకిన ప్రతి ఒక్కరికి రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం సాధారణం. కనుక భయపడాల్సిన పనిలేదు. రక్తకణాలు (ప్లేట్‌లెట్‌ కౌంట్‌) 80 వేల కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. ఈ సందర్భంలో మరోసారి 'ఎలీసా' పరీక్ష చేయించుకుని, అందులో డెంగీ అని నిర్ధారణ అయితే అందుకు తగ్గట్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారణ కాకుంటే సాధారణ చికిత్స సరిపోతుంది. రోగికి రక్తకణాల సంఖ్య 30 వేల వరకు ఉన్నా, డెంగీ కాకుంటే ప్రమాదం ఉండదనీ, చికిత్సతో తిరిగి రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వస్తారని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారికి రక్తం ఎక్కించాల్సిన పనిలేదంటున్నారు.

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, September 21, 2010

మెదడువాపు వ్యాధి , Viral Encephalitis



మెదడు వాపు వ్యాధి -- వైరల్‌ ఎన్‌కెఫలైటిస్ ‌ : వర్షాల వలన అయితే నేమి.పారిశుద్ద్యం క్షిణించడం పందులు విచ్చల విడిగా తిరగడం వలన అయితేనేమి దోమల వల్లనైతేనేమి శ్రీకా్కుళం జిల్లాలో మెదడువాపు కదలికలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ఆర్‌ఎన్‌ఎ గ్రూపునకు చెందిన ఆర్బోవైరసు వల్ల వస్తుంది. ఈ వ్యాధి పందులు, కొంగలు, నక్కల లాంటి జంతువుల నుండి మనిషికి వస్తుంది. క్యూలెక్స్‌దోమలు ఈ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. క్యూలెక్స్‌ దోమకాటుతో జపనీస్‌ ఎన్‌ఫలైటీస్‌ వైరస్‌ పిల్లల శరీరంలోకి వ్యాపిస్తుంది. ఫలితంగా మెదడుకు వాపు వస్తాది . సాయంత్రం సమయాల్లో క్యూలెక్స్‌ ప్రభావంతంగా ఉంటుంది. ఆ సమయంలో చిన్న పిల్లలను కాటు వేసే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ‘జపనీస్ బి. ఎన్‌సెఫలైటిస్’ అంటారు

చరిత్ర : ఈ వ్యాధిని మొట్టమొదట క్రీ.శ.1871లో జపాన్‌లో గుర్తించారు. 1924లో జపాన్‌లో ఎపిడెమిక్ (ఏకకాలంలో అనేకమందికి వ్యాధి రావడం)లా మెదడువాపు వచ్చింది. అప్పటినుంచి 1970 వరకు ప్రతి ఏటా ఎపిడమిక్‌లా వచ్చింది. ఈ వ్యాధి మన దేశంతోపాటు ఎక్కువగా జపాన్, కొరియా, మలేషియాలలో ఉంది. మన దేశంలో క్రీ.శ.1955లో ఈ వ్యాధి మొట్టమొదటి ఎపిడెమిక్‌గా వచ్చింది. మన దేశంలో ఆరు రాష్ట్రాలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అవి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు మరియు అస్సాం రాష్ట్రాలు.

వ్యాధి లక్షణాలు

*సూక్ష్మజీవి మెదడులో ప్రవేశించిన ప్రతి వ్యక్తిలో ఈ వ్యాధి రాదు. వ్యాధి నిరోధక శక్తి లోపించినవారే ఈ వ్యాధికి గురవుతారువైరస్‌ రోగి శరీరం లోకి ప్రవేశించిన తరువాత 5 నుంచి 16 రోజుల్లో పిల్లలకు జ్వరం రావడం శ్వాస పీల్చడంలో ఇబ్బంది కాళ్లు చేతులు లాగినట్లుగా ఉంటుంది. వాంతులు కావడం తద్వారా మెదడు వాపు వ్యాధి సోకి, జ్వరము, వణుకు, ప్రవర్తనలో మార్పు, వస్తూ అపస్మారక స్థితికి చేరుకోవడం, ఫిట్స్‌, నిద్రమత్తు, రోగ తీవ్రతని తెలియచేస్తుంది. దృష్టిలోపం కూడా కలుగవచ్చు. మూత్ర విసర్జనపై, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. సరైన సమయంలో రోగ నిర్థారణ కాకపోతే మరణం సంభవించును. జబ్బు నుండి కోలుకున్నాక కూడా
* ఆకస్మిక జ్వరం వచ్చుట, జ్వర తీవ్రత ఎక్కువగా ఉండుట
* కండ్లను అసాధారణంగా త్రిప్పుట
* అపస్మారక స్థితి సంభవించుట
* ఏదో ఒక పక్క శరీరం పక్షవాతానికి గురి అగుట
* వాంతులు, విరేచనాలు సంభవించుట
* శరీరం మెలికలు తిరిగి కొట్టుకొనుట
* మానసిక మాంద్యము
కొన్నాళ్ళ పాటు లేదా జీవితాంతము రోగి బాద పడవచ్చును . ఇదే దీనికున్న భయంకరమైన వ్యాధి లక్షణము .

వీరికి రక్త పరీక్షలు, వెన్నుపూసల నుంచి నీరు తీసి పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది

వ్యాప్తి చెందు విధానం

* జపనీస్ బి వైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా ఇతర జంతువుల ద్వారా (ముఖ్యంగా పందులు) ఈ వ్యాధి ని సంక్రమింప చేస్తాయి.
* పందులు, పశువులు, గుర్రాలు, కొంగలు ఈ వైరస్ ముఖ్యస్థావరాలు. దోమలు వీటిని కుట్టి మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ మనిషిలో ప్రవేశించి రోగాన్ని కలుగచేస్తాయి. మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందదు.
* పందులను కుట్టిన దోమలు ఆరోగ్యవంతుని కుట్టిన తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పించును. ఈ వ్యాధి ముఖ్యంగా 1 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశఁ వుంది.
సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నది. వర్షాధారంగా నిలువవున్న నీటి స్థావరాలు పెరిగిన కొలదీ దోమలు ఉత్పత్తి పెరుగును. క్యూలెక్స్ (గూని దోమ) దీని వ్యాప్తికి దోహదపడతాయి.

ప్రథమ చికిత్స...

మెదడు వాపు వ్యాధి సోకిన వారికి వెంటనే ప్రథమ చికిత్సలు కుటుంబ సభ్యులు చేయాలని డాక్టర్ల వద్దకు తీసుకుపోయేంత వరకు వ్యాధి సోకిన రోగి తలను కొద్దిగా వంచి పడుకోబెట్టాలని నోటి నుంచి లాలాజలం కారకుండా చూడాలని ఎప్పటికప్పుడు లాలాజలం తడుస్తుండాలని రోగి శరీరం చల్లబడితే వెచ్చడి దుస్తులనుకప్పాలని, రోగికి జ్వరం వస్తే మంచినీటిలో ముంచిన తడిగుడ్డతో తుడవాలని, కాంతి ధ్వని శబ్దాలకు రోగిని దూరంగా ఉంచాలని వైద్యులు పేర్కొన్నారు.

ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని హరించే మందులు ఏవీ లేవు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని దగ్గరలోని వైద్య నిపుణుల వద్దకుగానీ, ఆసుపత్రికిగానీ తీసుకెళ్లాలి. సహాయక చికిత్స - నర్సింగు చర్యలు రోగికి ప్రధానంగా అవసరం. రోగి పరిస్థితిని బట్టి మందుల వాడకం వుంటుంది.కొన్ని అంచనాల ప్రకారం ఈ వ్యాధి వచ్చిన వారిలో మూడొంతుల మంది మరణిస్తారు. మూడొంతుల మంది పూర్తిగా కోలుకుంటారు. మూడొంతుల మంది బతికి బట్టకట్టినా రకరకాల అంగవైకల్యం, పక్షవాతం, జ్ఞాపకశక్తి లోపించడం, బుద్ధిమాంద్యం, వినికిడి లోపాలు, దృష్టి లోపాలు లాంటి సమస్యలతో జీవిస్తారు.

*మెదడు వాపు వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా ఉంది. ఖరీదైనది. ఎక్కువసార్లు ఇవ్వాలి. ఈ టీకాను జాతీయ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పొందుపరచలేదు. కొన్ని ప్రాంతాలు అంటే తీవ్రంగా వ్యాధి వచ్చే ప్రాంతాలలో ఈ టీకాను మన దేశంలో ఇస్తున్నారు. 7 నుండి 14 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వవలసి ఉంటుంది. అప్పటినుండి 3 సంవత్సరాలకొకమారు రీవ్యాక్సినేషన్ ఇవ్వాలి. అన్ని మోతాదులు క్రమంగా తీసుకున్నవారిలో మాత్రమే పూర్తి రక్షణ ఉంటుంది.

వ్యాధిని అరికట్టడానికి కార్యాచరణ పథకం

* దోమల ఉత్పత్తి అరికట్టడం
* నీటి స్థావరాలని పూడ్చి వేయడం
* ప్రజలలో వ్యాధి అరికట్టడానికి ఒక నెల ముందే అవగాహన శిక్షణలు / సదస్సులు గ్రామ కమిటీలలో చర్చించడం.
* ఆరోగ్యశాఖ తీసుకొనే చర్యలలో ప్రజలని భాగస్వామం చేసి పాల్గొనేలా చేయడం.
* రోగిని గుర్తించి వెంటనే ఆసుప్రతికి తరలించడం.
* గ్రామ ప్రజలతో చర్చించి పందులను ఊరికి దూరంగా ఉంచేటట్లు చర్య తీసుకోవాలి.
* వ్యాక్సిన్ ఇచ్చు కార్యక్రమంలో సహకరించి పిల్లలకి వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలి.



వ్యాధి రాకుండుటకు ముందు జాగ్రత్త చర్యలు

* దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి
* ఇంటిలోనికి దోమలు రాకుండా కిటికీలకు తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి
* ఓడోమాస్ లాంటి క్రీములను శరీరానికి రుద్దుకోవాలి
* ఇంటిలో జెట్, మస్కిటో కాయిల్ ఉపయోగించాలి
* పందులను గ్రామానికి కనీసం 5 కి. మీ. దూరంలో ఉంచాలి
* జాలరి గుంటలు, ఇంటిచుట్టు ప్రక్కల నీటినిల్వ ఉన్నచో ఆ నీటిలో కిరోసిన్ లేక వాడిన ఇంజన్ ఆయిల్ చుక్కలు వేయాలి
* సెప్టిక్ట్ ట్యాంక్ గొట్టాలకు దోమలు వెళ్లకుండా, దోమ తెర గుడ్డ లాంటి ఇనుప జాలీని బిగించాలి
* ఒక వేళ పిల్లలకు జ్వరం వచ్చినచో ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి



  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, September 20, 2010

ఎల్లోఫీవర్ , Yellow fever in Telugu

కొన్ని దేశాల్లో, ఎల్లోఫీవర్ అనే వ్యాధి వ్యాపించి పిల్లల ప్రాణాలను ప్రమాదం లోకి నెడుతుంది. టీకా (వ్యాక్సినేషన్) మందుతో ఈ వ్యాధిని నివారించవచ్చు.

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

చికున్‌గున్యా జ్వరం , Chikungunya fever



చికున్‌గున్యా జ్వరం : ఇదొక వైరస్‌ వ్యాధి. ఈడిస్‌ ఈజిప్టై, ఈడిస్‌ ఆల్బోప్టికస్‌ అనే దోమలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి మనుష్యులకు సంక్రమిస్తుంది. డెంగ్యూ ఫీవర్‌, ఎల్లో ఫీవర్‌ వ్యాధులు కూడా ఈ దోమల కాటు వల్లనే వస్తాయి.

వ్యాధి చరిత్ర : ఆఫ్రికా ఖండంలోని టాంగన్యికా, మొజాంబిక్‌ దేశాల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉండే మకాండే పీఠభూమిలో 1952లో ఈ వ్యాధి మొదటిసారిగా వ్యాపించింది. మేరియన్‌ రాబిన్సన్‌, లమ్స్‌డెన్‌ అనే వైద్యులు ఈ వ్యాధి గురించి 'ట్రాన్సాక్షన్స్‌ ఆఫ్‌ రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసన్‌ అండ్‌ హైజీన్‌ అనే వైద్య పత్రికలో ప్రథమంగా 1955లో ప్రచురించారు.

అప్పటినుంచి ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోను ఈ వ్యాధి వస్తూనే ఉన్నది. ఆసియాలో ఇండియా, శ్రీలంక, మయన్మార్‌, థా§్‌ులాండ్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, కాంబోడియా, వియత్నాం, హాంకాంగ్‌, మలేషియా మొదలైన దేశాల్లో ఒకే సమయంలో వేలాదిమందికి (ఎపిడమిక్‌) ఈ వ్యాధి సోకింది.

భారతదేశంలో మొదటిసారి 1963లో కల కత్తాలోను, తరువాత 1964-65 సంవత్స రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ల్లోనూ ఈ వ్యాధి వ్యాపించింది. అప్పట్లో మద్రాసు నగరంలో సుమారు 3 లక్షల మందికి ఈ వ్యాధి సోకిందని నిపుణులు అంచనా వేసారు.
సుమారు 32 సంవత్సరాలు కనుమరుగై, తిరిగి 2005 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలలో అనేకమందికి ఈ వ్యాధి సోకింది. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కూడా వ్యాపించింది.

2007 సంవత్సరంలో జనవరినుంచి ఆగస్టు వరకు 12 రాష్ట్రాల్లో 30,710 మందికి ఈ వ్యాధి సోకిందనీ, ఎక్కువగా కేరళ రాష్ట్రంలో 22,583 మంది ఈ వ్యాధితో బాధపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలు తెలుపుతు న్నాయి. 2009లో మనరాష్ట్రంలో హైదరాబాద్‌ లోను, ఇతర జిల్లాల్లోనూ వేలాదిమందికి ఈ వ్యాధి సోకింది.

లక్షణాలు : దోమ కుట్టిన 2 నుంచి 12 రోజుల్లో (సాధా రణంగా 3 నుండి 7 రోజుల్లో) అకస్మాత్తుగా 102నుండి 105 డిగ్రీల జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి ఉంటాయి.

కళ్లు ఎర్రబడటం, కాళ్లు చేతుల మీద, శరీరం మీద దద్దుర్లు మొదలైన లక్షణాలు ఉండవచ్చు. మోకాళ్లు, మోచేతులు, మణికట్లు, మడమకీళ్లు, చేతి కీళ్లు వాచి బాధపెడతాయి. కదలికలతో ఈ నొప్పులు మరింత పెరుగుతాయి. తాకితే ఈ కీళ్లు, కండరాల బాధలు మరింత పెరుగుతాయి.

రాత్రిళ్లు నిద్ర లేకపోవచ్చు. తీవ్రమైన నొప్పులతో వంగిపోయే లక్షణాలు ఉండటం వల్ల ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది.
మకాండే స్థానిక భాషలోని క్రియాపదం 'కుంగున్యాల (వంకరపోవడం, వంగిపోవడం) నుంచి చికున్‌గున్యా అనే పేరు వచ్చింది. ఈ వ్యాధిలో జ్వరం 3నుంచి 4 రోజుల్లోనే తగ్గిపోతుంది. కొంతమందిలో కొద్ది రోజుల తరువాత మళ్లీ జ్వరం రావచ్చు. కీళ్ల నొప్పులు కూడా చాలామందిలో 1 నుండి 3 వారాల్లో తగ్గుతాయి. కొంత మందిలో కొన్ని వారాలపాటు నీరసం, అలసట ఉండవచ్చు.

వ్యాధి నిర్ధారణ : వ్యాధి నిర్ధారణకు ఐజిఎం(igM) రాపిడ్‌ టెస్ట్‌ వంటివి ఉపయోగపడతాయి. రోగి రక్తం లో ఎలిసా పద్దతిలొ ఐ.జి.యం. యాంటిబాడీ పరీక్ష ద్వారా వైరస్ ను గుర్తించవచ్చును . రక్తం లో తెల్ల రక్తకణాలు కౌంట్ తనికీచేసి అవి నార్మల్ కంటే తక్కువ (4-11 thosands /cubic Milli meter ) ఉంటే ఈ వ్యాధి గురించి ఆలోచించాలి .

చికిత్స :
క్వాలిఫైడ్‌ వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే చికిత్స జరగాలి. విచ్చలవిడిగా స్టీరాయిడ్స్‌ను, నొప్పులను తగ్గించే ఎన్‌ఎస్‌ఎఐడి(NSAID) మందులను వాడకూడదు. మందుల షాపులు, అన్‌క్వాలిఫైడ్‌ వైద్యుల సలహాతో పై మందులను విచక్షణా రహితంగా వాడకూ డదు. ఆస్పిరిన్‌, కొన్ని యాంటీబయాటిక్‌ మందులను వాడటం వల్ల వాంతులు, రక్త స్రావం, రక్తంలో ప్లేట్‌ లెట్‌ కణాలు తగ్గిపో వడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వ్యాధితో బాధపడుతున్న వారు విశ్రాంతి తీసుకుంటూ వైద్యుని పర్యవేక్షణలో పారాసిట మాల్‌ వంటి ఔషధాలను వాడవచ్చు. తగినంత ద్రవపదార్థాలను తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ ఉంటే సెలైన్స్ పెట్టాలి . యాంటి వైరల్‌ ఔషధాలు ఈ వ్యాధిలో పని చేయవు. కొద్ది రోజులు, వారాల్లో ఈ వ్యాధి తగ్గుతుంది.

నివారణ
చికున్‌గున్యా బాధి తులు తమను దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని కుట్టిన దోమలద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపిం చవచ్చు.
ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ ఉండే ఖాళీ డబ్బాలు, ఖాళీ కుండలు, కొబ్బరి చిప్పలు మొదలైన వాటిని తొలగించాలి. ఇటువంటి చోట్ల దోమలు ఉత్పత్తి అవుతాయి.
దోమల లార్వాలను నశింపజేసే డీజిల్‌ ఆయిల్‌, కిరోసిన్‌ మొదలైన నూనెలను మురుగు కాల్వల మీద, ఇతర చోట్ల వారానికి ఒకసారి చల్లాలి.
ఫెన్‌థియాన్‌ వంటి కీటక సంహార మందు లను ఇంటి గోడల మీద చల్లాలి. లార్వాలను నిర్మూలించడానికి గంబూసియా, లెబిస్టర్‌ వంటి చేపలను కాలవల్లో, చెరువుల్లో వదలాలి.
దోమల నివారణకు పరిసరాల్లో ఫాగింగ్‌ చేయించాల్సిన బాధ్యత ఆరోగ్యాధికారులపై ఉంది. జెనిటిక్‌ ప్రక్రియల ద్వారా దోమల ఉత్పత్తిని నిరోధించే కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంది.
వ్యక్తిగత జాగ్రత్తలలో ప్రతి వ్యక్తి దోమతెరను వాడటం, కిటికీలకు, ద్వారాలకు మెష్‌ ఏర్పాటు చేసుకోవాలి. డైఇథైల్‌టాల్యుమైడ్‌, డైఇథైల్‌ బెంజమైడ్‌ వంటి ఆయింట్‌మెంట్లను శరీరానికి పూసుకోవాలి.
దోమల నివారణకు ప్రజలు కూడా అవగా హనతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది మందిని బాధిస్తున్న చికున్‌గున్యా వ్యాధికి త్వర లోనే వ్యాక్సిన్‌ కనిపెడతారని ఆశిద్దాం.

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

మలేరియా Malaria

  • [Mosquito+day.jpg]


మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో మరియు మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. "ప్లాస్మోడియం" (Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు. కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి.

ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రజారోగ్య సమస్య మలేరియా. 108 దేశాల్లో మలేరియా ఉంది. క్రీ.శ. 2008లో మలేరియావల్ల ప్రపంచ వ్యాప్తంగా 10లక్షల మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోని చిన్న పిల్లలు, చిన్నపిల్లలో జరిగే మరణాలలో 20 శాతం మలేరియా వల్లనే. ప్రపంచ వ్యాప్తంగా మలేరియావల్ల జరిగే మరణాలలో 85 శాతం ఆఫ్రికా దేశాల్లో వస్తున్నవి. ప్రపంచంలోని 50 శాతం ప్రజలు మలేరియా వచ్చే పరిస్థితులలో జీవిస్తున్నారు.
మనదేశంలో జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఏటా మలేరియా ఏ మాత్రం ఉంది అని తెలుసుకొనుటకు దేశ జనాభాలో 10 శాతం మందికి మలేరియా పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో దాదాపు 1.5 నుండి 2 మిలియన్ల ప్రజలలో మలేరియా క్రిమి ఉన్నట్లు తెలుస్తున్నది. మన దేశంలో ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, త్రిపుర, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మన దేశంలో 95 శాతం ప్రజలు మలేరియా వ్యాధికి గురయ్యే పరిస్థితులలో జీవిస్తున్నారు. మన దేశంలో 80 శాతం మలేరియా 20 శాతం ప్రజలు జీవించే ప్రాంతాలయిన అడవులు, కొండ ప్రాంతాలు, ఆదివాసీలు జీవించే ప్రాంతాల్లో వస్తున్నవి.

మలేరియా రాకుండా..

వర్షకాలంతో పాటే దోమల బెడదా తీవ్రమవుతుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వృద్ధిచెందే ఇవి తెచ్చిపెట్టే సమస్యలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా దోమకాటు మూలంగా ఎంతోమంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. అందుకే జూన్‌ నెలను 'మలేరియా వ్యతిరేక మాసం'గా పాటిస్తుంటారు. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే ఈ మలేరియా బారినపడటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు.

* చేతులు కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరిస్తే దోమకాటు నుంచి కాపాడుకోవచ్చు.

* పడుకునేటప్పుడు తప్పనిసరిగా మంచం చుట్టూ దోమతెర వేసుకోవాలి. రిపెలెంట్లు, కాయిల్స్‌, క్రీములు, లోషన్ల వంటి వాటితోనూ దోమలు దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు.

* దోమలు బయటి నుంచి ఇంట్లోకి దూరకుండా కిటికీలకు తప్పకుండా జాళి అమర్చుకోవాలి.

* ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించటం మంచిది.

* సాధారణంగా నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడుతుంటాయి. అందువల్ల వీలైనంతవరకు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవాలి.

* ఇంట్లోగానీ వరండాల్లో గానీ వాడకుండా వదిలేసిన కుండలు, గిన్నెల్లో నీరు లేకుండా చూసుకోవాలి. ఖాళీ పాత్రలను తప్పకుండా బోర్లించి ఉంచాలి.

* తాగునీటి పాత్రలపై ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలి.

* మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలాంటి చోట్లకు గర్భిణులు వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే మలేరియా మూలంగా గర్భస్రావం, నెలలు నిండకముందే కాన్పు కావటం, మృత శిశు జననం వంటి ముప్పులు పెరిగే అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు వికీపిడియా ను చూడండి -> మలేరియా వ్యాధి .
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/