Sunday, January 31, 2010

ఆరోగ్య చిట్కాలు -రహస్యాలు , Health tips & tricks




ఆరోగ్య చిట్కాలు - రహస్యాలు టూకీగా - >
  • ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే పాలు, చేపలు వంటి ఆహారం తీసుకునేవారికి చత్వారం వచ్చే ముప్పు తక్కువ.
  • తమ శరీర సౌష్ఠవం, అందచందాల గురించి సానుకూల దృక్పథంతో ఉండే మహిళలు మిగతావారితో పోలిస్తే చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించగలరని ఒక అధ్యయనం.
  • తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
  • రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.
  • బాదం నూనె చక్కటి మాయిశ్చరైజర్‌. క్రమం తప్పకుండా దాంతో మర్దన చేస్తే పొడిచర్మం సున్నితంగా మారుతుంది.
  • నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుంటే... ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.
  • ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో కోరికలు రేకెత్తిస్తాయట. ఆ ఫ్లేవర్‌ ఉన్న అత్తరును స్త్రీలు తమ మెడమీద చల్లుకుంటే పురుషులు వారి కొంగు పట్టుకు తిరుగుతారు. (స్మెల్‌ అండ్‌ టేస్ట్‌ రీసెర్చి ఫౌండేషన్‌, చికాగో).
  • ఎరుపు రంగు ప్రేమకూ శృంగారానికీ చిహ్నం. ఆ దుస్తుల్లో ఉన్న మహిళల వైపు మగవారు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఎక్కువ. గర్ల్‌ఫ్రెండ్‌ ఎర్రటి వస్త్రాలు ధరించి వచ్చినరోజు అబ్బాయిలు వారిని సంతోషంగా ఉంచేందుకు మిగతా రోజుల్లో కన్నా ఎక్కువగా ఖర్చుపెడతారని అనేక పరిశోధనల్లో తేలింది.(జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ)
  • అండోత్పత్తి సమయంలో అమ్మాయిలకు... కండలు తిరిగిన మగాళ్లే నచ్చుతారు. మిగతా సమయాల్లో కాస్త సున్నితంగా ఉండే పురుషులు (మెట్రోసెక్సువల్‌) నచ్చుతారు. ఇది సృష్టిధర్మం. ఆరోగ్యవంతులైన బలమైన పిల్లలు పుట్టాలంటే అలాంటి పురుషులే కావాలనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో తనను ప్రేమగా సున్నితంగా చూసుకునే మగవారిని మాత్రమే ఇష్టపడతారు. (నేచర్‌ జర్నల్‌)
  • ఆందోళన, ఒత్తిడి... వీటిలో ఏది ఎక్కువైనా శరీరంలో అడ్రినలిన్‌ ఉత్పత్తి అధికం అవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి అమ్మాయి అయినా మగవారికి అమిత సౌందర్యరాశిలా కనపడుతుంది. (జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ అండ్‌ సైకాలజీ)
  • దృఢమైన ఛాతీ విశాలమైన భుజాలూ ఉండే మగవారు మహిళల్ని ఇట్టే ఆకర్షిస్తారు. ఇలాంటి వారిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అధికంగా ఉంటుందని అధ్యయనాల ఫలితం. ('సైజ్‌ మ్యాటర్స్‌' గ్రంథం)
  • తన తల్లి ముఖాన్ని పోలి ఉండే మహిళలను మగవారు ఎక్కువగా ఇష్టపడతారు. 'పోలిక' అంటే అచ్చుగుద్దినట్టు కాదు, ఎముకల నిర్మాణం, ముఖ సౌష్ఠవం... ఇవి ఒకేలా ఉంటే చాలు. ఇలాంటి పోలికను 'సెక్సువల్‌ ఇంప్రింటింగ్‌' అంటారు. (ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద రాయల్‌ సొసైటీ)
  • మందులు వేసుకున్న వెంటనే పండ్లరసాలు తాగితే ఆ మందులు అనుకున్న ఫలితాలు ఇవ్వవని వెస్ట్రన్‌ ఆంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
  • రోజుకు కనీసం అరవైగ్రాముల పెరుగు తినేవారిలో చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
  • ఇతరులతో పోలిస్తే ముతక ధాన్యాలు తినేవారిలో రక్తపోటు వచ్చే ముప్పు 19 శాతం తక్కువ.
  • అధిక కొవ్వుతో బాధపడేవారు అవిసెనూనెను ఆహారంలో భాగం చేసుకుంటే... శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రతగలిగిన కొవ్వు(ఎల్‌డీఎల్‌) త్వరగా కరిగిపోతుంది.
  • అలా తింటేనే...క్యారెట్లలో ఉండే ఫాల్‌కారినాల్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ... వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తరిగినవాటితో పోలిస్తే పూర్తి క్యారెట్‌ను ఉడకబెట్టినప్పుడు ఫాల్‌కారినాల్‌ 25శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. క్యారెట్లను తరిగి ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. క్యారెట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచినిచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయట.
  • తలకు రాసుకునే నూనె పరిమాణంలో తేనె తీసుకుని కుదుళ్లకు అంటేలా మర్దన చేయండి. అరగంట తర్వాత పొడిజుట్టుకు ప్రత్యేకించిన షాంపూతో స్నానం చెయ్యండి. వారానికొకసారి ఇలా చేస్తే... బిరుసుగా ఉండే జుట్టు మళ్లీ జీవంతో నిగనిగలాడుతుంది.
  • * కీవోథెరపీ చేయించుకునే క్యాన్సర్‌ బాధితులు థెరపీకి మూడు రోజులు ముందూ తర్వాతా ఆహారంలో కొద్దివోతాదులో 'అల్లం' తీసుకుంటే మంచిది. కీవోథెరపీ వల్ల కలిగే అలసటను అల్లం దాదాపు 40శాతం దాకా తగ్గిస్తుంది.
  • * రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరి ముద్దలాగా చేయండి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరిచేరదు.
  • * చెవిపోటు వచ్చినప్పుడు చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లిరసం వేస్తే కాస్తంత ఉపశమనం లభిస్తుంది.
  • * మిక్సీ నుంచి మసాలా వాసన వస్తుంటే ఎండిన బ్రెడ్‌ముక్కలు వేసి పొడి చెయ్యండి. వాసనలు మాయం.
  • అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.అవును ఇది పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది.
  • గొంతు ఇన్‌ఫెక్షన్‌కి వేడిపాలల్లో పసుపు కలిపితే.. మంచిది.పసుపులో యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇక వేడిపాలు.. పసుపు సులువుగా నొప్పిని నివారిస్తాయి. దాంతో శరీరానికి సాంత్వన.మిగతా సమయంతో పోలిస్తే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.ఇందుకు ప్రత్యేకమైన ఆధారాలు లేకపోయినా.. నిపుణులు ఏమంటారంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలనేది వాస్తవం. అయితే ఏదిపడితే అది కాకుండా.. వేడివేడి సూప్‌లు.. విటమిన్‌ ఇ ఉండే ఆహారపదార్థాలు.. ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
  • తలనొప్పిని దూరం తగ్గించేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి.వేడి కారణంగా డిహైడ్రేషన్‌ సమస్య వచ్చి.. తద్వారార తలనొప్పి బాధిస్తే.. మాత్రమే ఈ చిట్కా ఫలిస్తుంది. విద్యార్థులు పాలు కలపని కాఫీ తాగితే.. రాత్రిళ్లు నిద్ర రాదు.కెఫీన్‌ నిద్ర పట్టకుండా చేస్తుంది. పైగా దీని ప్రభావం 20 గంటల దాకా ఉంటుంది. ప్రయత్నించవచ్చు. అయితే ఓ మాట. అతిగా తాగితే అనర్థమే. ఎందుకంటే.. మీకూ నిద్ర అవసరమని మరవకండి.
  • దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది.లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు.. మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం.. లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే.. దాని తాలూకు ఇన్‌ఫెక్షన్‌ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.

  • ==============================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కొవ్వులొ ఏది మంచిదో ?, fats of which is good for health?




కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids అంటారు . ఇది జంతు జీవనానికి ప్రధానమైనది . మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము . ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు తెలియదు . అందుకే మన గుడెను మనం రక్షించుకొవాలంటే కొలెస్ట్రాల్ ని పెరగనివ్వకుండా నియంత్రంచుకోవాలి . ఈ పెరిగిన కొలెస్ట్రాల్ గుండెనే కాదు ఇతర చోట్ల కూడా తన ప్రభావాని చూపుతుంది . అందుకే మంచి ఆహారపు అలవాట్ల తో , మంచి నడవడికతో దీన్ని మనము కంట్రోల్ చేసుకో్వచ్చును .

ఉపయోగాలు :
కొలెస్ట్రాల్‌ను చాలామంది మన శరీరానికి హాని కలిగించే పదార్థంగానే భావిస్తుంటారు. కానీ నిజానికిది మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక రకం కొవ్వు పదార్థం అని తెలియదు.కొలెస్ట్రాల్‌(ఫ్యాట్స్ +ప్రోటీన్స్ ) అన్నది ఒక రకం కొవ్వు. ఇది నూనెలు, వృక్ష సంబంధ కొవ్వులో అసలు ఉండదు. వెన్నతీయని పాలు, గుడ్లు, మాంసాహారం వంటి జంతు సంబంధమైన ఆహారం నుంచి వస్తుంది. అయితే దీనికంటే కూడా ఎక్కువ భాగం మన శరీరమే లోపల లివర్‌లో తయారు చేసుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ అవసరం చాలా ఎక్కువ.
  • శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికీ,
  • కీలకమైన హార్మోన్ల తయారీకీ,
  • జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తి కావటానికీ..
  • A,D,E,K విటమిన్లు శరీరము గ్రహించుటకు ,
ఇలా ఎన్నో విధాలుగా కొలెస్ట్రాల్‌ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేరుగా ఆహారం రూపంలో తీసుకున్నా, తీసుకోకున్నా శరీరమే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. మనం బయటి నుంచి తీసుకునేది, లోపల తయారయ్యేది.. ఇలా ఏ రూపంలోనైనాగానీ రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం పెద్ద సమస్య! ఇదే అనర్థాలకు మూలం! కాబట్టి.. ఎవరైనా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాల్సిందే.

కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.

కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?

టోటల్ కొలెస్టిరాల్ :
  • 200 మి.గా% వరకు -- మంచిది .
  • 200 - 239 %--కొంతవరకు రిష్క్ ,
  • 240 - కంటే ఎక్కువ % -- హై రిష్క్ ,
LDL :
  • 100 లోపు -- మంచిది ,
  • 100-129 --- ఉండవచ్చును ,
  • 130-159---కొంతవరకు రిష్క్ ,
  • 160-- అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,
HDL :
  • 50 మి.గ్రా% -- మంచిది ,
  • 50- 35 -------కొద్దిక రిష్క్ ,
  • 35 -- తక్కువ - హై రిష్క్ .... ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .

ఏ కొవ్వులో ఏమున్నదో. ( మానవ శరీరము లోని కొవ్వును - కొలెస్టిరాల్ అనే పేరుతో కొలుస్తారు)
శాచ్యురేటెడ్‌, అన్‌శాచ్యురేటెడ్‌, మోనో అన్‌శాచ్యురేటెడ్‌, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌... ఇలా రకరకాల కొవ్వుల గురించి చదువుతుంటాం. కానీ వీటిలో ఏది శరీరానికి మేలుచేసేదో, హానిచేసేదో ఎప్పుడూ సంశయమే.


శాచ్యురేటెడ్కొవ్వులు: శరీరానికి హాని చేస్తాయి.
  • జంతు సంబంధమైనవి. మేక, ఎద్దు, పంది మాంసాల్లో అధికంగా ఉంటాయి.
  • వెన్న, నెయ్యి, ఐస్క్రీమ్వంటి పాలఉత్పత్తుల్లోనూ
  • గుడ్లూ సీఫుడ్స్లోనూ ఉంటాయి.
  • కొబ్బరినూనెలోనూ ఎక్కువగా ఉంటాయి.
  • నెయ్యిలో
‌ ‌ఈ ప్రమాదకర కొవ్వులు నెయ్యిలో ఉన్నప్పటికీ దానికి ఉండే ఇతర గుణాల వల్ల త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి వోతాదు మించకుండా నెయ్యి తిన్నా కొంతమేరకు ఫర్వాలేదు. మిగతావాటిని కూడా పూర్తిగా మానేయక్కర్లేదు. రోజువారీ ఆహారంలో 10శాతం మించకుండా చూసుకుంటే చాలు.

అన్శాచ్యురేటెడ్కొవ్వులు: ఇవి వృక్షసంబంధిత కొవ్వులు. శరీరానికి మేలుచేస్తాయి. వీటిలో మళ్లీ రెండు రకాలున్నాయి.

* మోనో అన్శాచ్యురేటెడ్‌... శరీరానికి హానిచేసే చెడుకొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించి మేలుచేసే కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెంచుతాయి. గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • ఆలివ్‌ (72%),
  • ఆవ నూనె (70% ) ,
  • వేరుసెనగపప్పులు (55 %),
  • తవుదు నూనె (41%) ,
  • నువ్వుల నూనె (41% ),
  • పీనట్బటర్‌,
  • క్యానోలా నూనె,
  • అవకాడో పండ్లలో ............ యెక్కువగా ఉంటాయి.


* పాలీ అన్శాచ్యురేటెడ్‌... ఇవి శరీరంలోని చెడుకొలెస్ట్రాల్‌తో పాటు మంచి కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని కూడా ఒకింత తగ్గిస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. వీటిని రెండు విసృతమైన వర్గాలుగా వర్గీకరించ వచ్చును . 1-లైనోలిక్ (ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ) ,2-లైనోలెనిక్ (ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ) . శరీరము వీటిని తయారు చేసుకొలేదు . . . కాబట్టి అవి ఆహారము నుంచే రావాలి .

  • పొద్దుతిరుగుడు నూనె(60%),
  • కుసుమ నూనె(74%),
  • నువ్వుల నూనె(1%),
  • మొక్కజొన్నలు(50%),
  • పత్తిగింజల నూనె,
  • సోయాబీన్‌...(20%)
వీటిలో పాలీఅన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులుంటాయి. మంచినీటి చేపల్లోనూ లభ్యమవుతాయి. ఇంకా అన్నిరకాల పప్పులు, సోయా, ఆకుకూరల్లోనూ ఉంటాయి.

* ఈ రెండూ కాకుండా 'ట్రాన్స్ఫ్యాట్స్' మూడోరకం కొవ్వులు. శరీరానికి అత్యంత హాని కలిగించేవి ఇవే. ద్రవరూపంలో ఉండే నూనెలలోకి హైడ్రోజన్‌ వాయువు పంపించడం ద్వారా (హౖడ్రోజినేటెడ్‌) తయారుచేసే ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా నూనెలను ఉపయోగించి చేసే పదార్ధాలు చానా రుచికరముగా ఉంటాయి .
  • బంగాళదుంప చిప్స్లాంటి ప్యాకేజ్డ్ఫుడ్స్‌,
  • బిస్కెట్లు,
  • పాప్కార్న్‌,
  • కేకులు,
  • ఫ్రెంచ్ఫ్రైస్‌...
‌‌‌ఇవన్నీ ట్రాన్స్‌ఫ్యాట్స్‌కు నిలయాలే. ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌పై 'దిస్‌ ప్యాక్‌ కంటెయిన్స్‌ హైడ్రోజినేటెడ్‌ ఆయిల్‌' అనిగానీ 'పార్షియల్లీ హైడ్రోజినేటెడ్‌ ఆయిల్‌' అనిగానీ ఉంటే వాటిలో హానికరమైన ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉన్నట్టే. అలాంటివాటిని కొనకపోవడమే మేలు.

ఏ నూనె వాడాలి :
నానవ శరీరము ఓ అద్భుత యంత్రము . శరీరము లో ప్రతి అవయము విలువైనదే , శక్తివంతమైనదే , శరీర అవయవాలు కలిసికట్టుగా పనిచేయడం పైన మనిషి మనుగడ ఆధారపడి ఉంటుంది . మారుతున్న జీవనశైలి తో మన ఆహార అలవాట్లు మారుతూ ఉన్నాయి .

ఉడికించిన పదార్ధాలు కంటే నూనె లో వేయించిన పదార్ధాలే రుచిగాఉంటాయి . రుచిని చూసుకుంటే మన ఆరోగ్యము చెడిపోతుంది . వేయించిన పదార్ధాలు తింటే గుండెకు మంచిదికాదు . నూనె లేకుండా ఏ వంటకానికీ రుచి రాదు .

ఏ నూనె మేలు :
వాడుతున్న నూనెల తయారీలో కొవ్వులేని నూనెలు తయారవుతున్నాయి . ఇవాళ మార్కెట్ లో ర్న్నో బ్రాండ్ లలో రకరకాల కుకంగ్ ఆయిల్స్ లభిస్తున్నాయి . శ్రేయస్కరమైన నూనెను ఎంచుకోవడం లోనె అసలైన సవాలు ఉంది . సాదారణముగా ఇళ్ళల్లో సంప్రదాయక నూనెలను లేదా రిఫైన్డ్ నూనెలు ఎక్కువగా వాడుతారు . హొటళ్ళు , రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , మిర్చిబజ్జీ బండ్లు , నూడిల్సు బండ్లు , చాట్ మసలా సెంటర్లు లలో బజారులో దొరికే రకరకాల చవక నూనెలు వాడుతూ ఉంటారు .

వేరుశనగ నూనె : భారతదేశం లో గ్రామీణ ప్రాంతాలలో దీన్ని ఎక్కువగా వాదుతారు . ఈ నునెలో గుండెకు మేలు చేసే మోనో అంసాచ్యురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్ చెదు కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి .నేరుశనగ నూనె భారతీయ అభిరుచులకు , రుచులకు తగ్గ నూనె . ఈ నూనె లో గుణాలు ఆలివ్ నూనె గుణాలతో బాగా సరిపోలుతాయి .వార్ధక్యము దరిచేరకుండా తోడ్పడే యాంటి ఆక్షిడెంట్సు , సర్వొన్నతమైన పోషకాలు ఉన్నాయి . వేరుశనగ నూనె " హైస్మోకింగ్ " పాయింట్ తో సహజం గా ఆరోగ్యకరమైనది .బహుళ ప్రయోజనం గల వంటనూనె .

ఆలివ్ నీనె : ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము . మధ్యధరా ప్రాంత దేశాలలో ఈ వంటనూనె ఎక్కువగా వాడతారు . రుచిని , పరిమళాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తుంది .

సోయాచిక్కుడు నూనె : మానవాళి ఆరోగ్యానికి అవసరమైన పాలి-అన్క్ష్ సాచ్యురేటేడ్ కొవ్వు ఆమ్లాలు సోయాబీన్ నూనె లో సరైన సంతుల్యము లో ఉన్నాయి . వేపుళ్ళు మినహా అన్ని రకాల కుకింగ్ పద్దతులకు ఇది అనువైంది . వేపుళ్ళు చేసేటప్పుడు ఈ నూనె కాగపెట్టే ఉష్ణోగ్రతల వద్ద ఆక్షీకరణం చెందడము వలన విషపూరిత పదార్ధాలు యేర్పడతాయి .

ఆవనూనె : ఈ నూనె ను పశ్చిమ బెంగాల్ లో సంప్రదాయకం గా వాడుతుంటారు . సహజ సిద్ధమైన రుచి , పరిమళానికి , ఇది పేరెన్నికగన్నది .పచ్చ్ళ్లు తయారుచేయడానికి మామూలుగా దీన్ని వాడుతారు . హెచ్చు మోతాదులో ' మోనో మరియు పాలీ అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి .

పొద్దుతిరుగుడు పువ్వు నూనె : ఎన్నో బ్రాండ్ పేర్ల కింద లభ్యమయ్యే ఈ నూనె ప్రజాదరణ పొందిన కుకింగ్ ఆయిల్ . దీనిలో పాలీ అన్క్ష్ సాచ్యురేటెడ్ కొ్వ్వు ఆమ్లాలు , ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమ్వృద్ధిగా ఉంటాయి . ఇవి చెడ్డ కొలెస్టిరాల్ స్థాయిలను గననీయం గా తగ్గిస్తాయి .

రైస్ బ్రాన్ ఆయిల్ : ఎన్నో పోషకాహార ప్రయోజనాలతో పౌస్టిక విలువల్తో ఇది అద్వితీయమైన వంట నూనె . మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు , అరిజినాల్ అనే కాంపొనెంట్ , ఒమెగా 3 ఫాతీ అమ్లాలు , ఉన్నాయి . చెడు కొలెస్టిరాల్ ను తగ్గించే గుణము ఉన్న వంటనూనె ఇది .

కొబ్బరి నూనె : దక్షిణాది రాస్ట్రాలలో , ఇతర ఆసియా దేశాల వంటకాలలో ఈ నూనె విరివిగా ఉపయోగిస్తారు . కొబ్బరినూనె లో సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి . ఆరోగ్యానికి మంచిది కాదు .

అవిసె గింజల నూనె : ఈ నూనె లో ఎన్నో పోషక విలువలు , మేలు చేసే కొ్వ్వు ఆమ్లాలు ఉన్నప్పటికీ భారత దేశం లో దీని వాడకము చాలా పరిమితము . శాకాహారులకు ఇది ఒమెగా 3 ఫాటీ అమ్లాలు ఇస్తుంది . చాలామంచి వంట నూనె .

సలహా :
గుండెకు మేలు చేసే నూనె-- రైస్ బ్రాన్క్ష్ నూనె ను వాడడం చాలా మంచిది . వీలుంటే ఒమెగా 3 & 6 ఫాటీ ఆమ్లాలు ఉన్న చేపలను ప్రతిరోజూ తింటె గుండె జబ్బులకు దూరం గా ఉండవచ్చును .


  • ===============================================================


Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, January 21, 2010

చెమట వాసన , Sweat Smelling




మనిషి శరీరములో సుమారు 2 నుండి 4 మిలియన్ల స్వేదగ్రంధులు ఉంటాయి .ఇవి చర్మము కింద డెర్మిస్ (Dermis)-క్రింది చర్మ పొర లో ఉంటాయి .ఈ గ్రంధులు రెండు రకాలు ...1.ఎక్రిన్(eccrine)‌,2.ఎపొక్రైన్‌(apocrine) --- సింపాథటిక్ నెర్వస్ సిస్టం అదుపులో పనిచేస్తాయి .

ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట వస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా వస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చెమట ఉప్పగావుంటుంది.చెమట రావడంవలన చర్మం చెమ్మగావుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట వస్తుందని వైద్యులు తెలిపారు.నిజానికి చెమటకి వాసన ఉండదు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా దానితో చేరినపుడు విపరీతమైన వాసన పుడుతుంది.


చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు మరియు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.

చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.

స్నానం చేసిన కొద్ది సేపటికే చెమటపడుతుంది. దుర్వాసనతో చిరాకు పడే వారికి పరిష్కార మార్గాలు ->

ఈ సమస్యను హైపర్‌హైడ్రోజిన్‌ అంటారు. ఇది కొన్నిశరీర భాగాలని వేధిస్తుంది. బాహుమూలలు, అరిచేతులు, అరికాళ్లకు చెమట ఎక్కువగా పడుతుంది. కొంతమందికి దుర్వాసనా ఎక్కువగా ఉంటుంది.

చెమట రావడం చెడ్డ ఎమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయమే. ఇలాంటి సమస్య అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. చెమట ఎండిపోయిన తర్వాత చర్మంనుంచి యూరియా లేక్ ఉప్పులాంటి కారకాలు అధికంగా స్రవించి రోగ కారకాలను ఆకర్షిస్తాయి. ఇవే దుర్గంధానికి మూల కారణము .
కొంతమందికి అత్యధిక చెమట వచ్చినాకూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినాకూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది. దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదు

దీనికి కారణం-
  • అజీర్తి, ఏదిపడితే అది ఆహారంగా తీసుకోవడం,
  • ఎక్కువగా ఉప్పు తీసుకోవడంకూడా ఒక కారణం.
  • తీసుకునే ఆహారం- ఎక్కువగా మాంసాహారము తినడం ,
  • ఇన్ఫెక్షన్‌,
  • బ్యాక్టీరియా .
  • ముఖ్యంగా వెల్లుల్లి తీసుకోవడం తగ్గించాలి.

నివారణోపాయాలు
  • * ఘాటు వాసన వచ్చే ఆహారపదార్థాలు--ఉల్లి , వెల్లుల్లి మానేయాలి.
  • * బాహుమూలలు పరిశభ్రంగా ఉంచుకోవాలి.
  • * డియోడరంట్లు బదులు ' యాంటీపెరిస్పెరెంట్ " వాడాలి.‌
  • సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగాలి,
  • రెండుపూటలా స్నానం చేయండి.స్నానం చేసేటప్పుడు డెట్టాల్, యుడుకొలోన్, రోజ్ వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకుని స్నానం చేయండి.
  • స్నానం చేసిన తర్వాత మంచి కంపెనీకి చెందిన బాడీ స్ప్రే వాడండి.
  • ఎవరికైతే తమ చెమటలోంచి భరించలేనంత దుర్గంధం వస్తుందో వారు బాత్ సాల్ట్ నీటిలో కలిపి స్నానం చేయండి. సువాసనను వెదజల్లే పౌడరు వాడండి.
  • స్నానం చేసిన తర్వాత మీరు ధరించే బట్టలపై పర్ఫ్యూమ్ వాడండి. ఆ పర్ఫ్యూమ్ ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదు.
  • ఎండాకాలంలో కాటన్ బట్టలనే వాడండి. అదికూడా పల్చటి గుడ్డలనే వాడండి. సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదు . ఇవి చెమటను మరింత అధికంగా వచ్చేలా చేస్తాయి
  • ఇలా చెమట వాసననుండి విముక్తి కలగాలంటే బబూల్ ఆకులను రుద్ది శరీరానికి పూయండి.
  • ఆ తర్వాత చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకుని శరీరానికి పూయండి. ఆ తర్వాత స్నానమాచరించండి. ఇలా కొద్దిరోజులపాటు చేస్తుంటే శరీరంనుంచి చెమట ద్వారా వచ్చే దుర్వాసన మటుమాయమవుతుంది.
* వీటితో సమస్య నియంత్రణలోకి రాకపోతే నిపుణులను సంప్రదించాలి. కంగారు పడాల్సిందేం లేదు. వైద్యంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
===============================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, January 16, 2010

Ichthyosis vulgaris , పొలుసు చర్మ వ్యాధి



ఇక్థియోసిస్ వల్గారిస్

మనుషులలో చుండ్రు, సోరియాసిస్, ఇక్థియోసిస్ వల్గారిస్ వంటి కొన్ని రకాల చర్మవ్యాధులలో పొలుసులుగా వెండి లాంటి పొట్టు రాలుతుంది.
ఇక్థియోసిస్ వల్గారిస్ (Ichthyosis vulgaris) అనునది వంశ పారంపర్యంగా సంక్రమించు చర్మ సంబంధ అసాధారణ స్థితి. ఈ వ్యాధి ఉన్నవారి చర్మం పొడిబారి, పొలుసులుగా విడిపోతుంది. ప్రతి 250 మందిలో ఒక్కరు దీని బారిన పడతారు. తల్లిదండ్రులలో ఎవరి ద్వారా నైనా ఒక అసాధారణ జన్యువు సంక్రమించటంతో ఈ వ్యాధి సోకుతుంది.

ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. చాలా తక్కువగా దురద ఉండటం, శరీరం కనిపించే లాగా బట్టలు వేసుకోలేకపోవటం తప్పితే వేరే ఎటువంటి హాని ఉండదు.

తీసుకొనవలసిన జాగ్రత్తలు
  • స్వేదం ఈ వ్యాధి తీవ్రతని తగ్గించటం మూలాన- వేసవి కాలను మంచిది ,
  • తేమ వాతావరణం ఉన్న ప్రదేశాలు వ్యాధిగ్రస్తులకి క్షేమం.
  • ఎయిర్-కండిషన్, మద్యం దీని తీవ్రతని పెంచవచ్చును
  • మాయిశ్చరైజింగ్ క్రీములు, లోషన్ లు, స్నోలు వాడాలి
  • మరీ వేడినీటితో కాకుండా, గోరువెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి (చలికాలంలో కూడా).
  • స్నానం చేసి, తువ్వాలుతో తుడుచుకొన్న వెంటనే, ఆ తడి ఆరక ముందే, క్రీము రాయాలి.
  • ప్యారాఫిన్ మైనం గల క్రీములు శ్రేయస్కరం. (ఉదా: వ్యాజ్లిన్). వీటివల్ల జిడ్డు ఎక్కువగా ఉంటే ఎమోలియంట్, హ్యూమెక్టెంట్ మరియు కెరటాలిటిక్ క్రీములు వాడాలి. (ఉదా: మాయిశ్చరెక్స్ , కోటరిల్)

మాయిశ్చరెక్స్ అనునది ఇక్థియోసిస్ వల్గారిస్, ఫిషర్ పాదాలు మరియు పొడి చర్మానికి వాడే ఒక పూత మందు. ఇది ఒక ఎమోలియంట్, హ్యూమెక్టంట్ మరియు కెరటోలిటిక్ క్రీం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని బడ్డీ అను ప్రాంతానికి చెందిన సాల్రెక్స్ ఫార్మస్యూటికల్స్ అను సంస్థచే తయారు చేయబడును.

ఇందులో వాడే రసాయనాలు

* యూరియా
* ల్యాక్టిక్ యాసిడ్
* ప్రొపిలీన్ గ్లైకోల్
* లైట్ లిక్విడ్ ప్యారాఫిన్
* క్రీం బేస్
* మిథైల్ పారబెన్
* ప్రొపైల్ పారబెన

ట్రీట్మెంట్ :
  • ఖచ్చితమైన చికిత్స ఏమీ లేదు . వేసలిన్ వంటి క్రీములు రాయవచ్చును .
  • స్నానము చేసినపుడు పొలుసులు బాగా రాలినట్లు చూడాలి .,
  • కళ్ళు పొడిబారకుండా " EyeToneDrops" వాడాలి , పడుకునేటప్పుడు కళ్ళు ముతబడవు కావున స్తేరైల్ ఆయింట్మెంట్ వాడాలి .
  • చెవులు ఎక్కువగా దురద పెట్టినచో " zenfloxD" చెవి చుక్కల మందు ప్రతిరోజూ రాత్రే వాడవచ్చును . గులిమి మచినీతితో క్లీన్ చేయాలి . అవసరమైతే దురద తగ్గడానికి "Cetrazine"మాత్రలు రోజు ఒకటి వాడవచ్చును .
  • తల పైన దురద తగ్గడానికి మోయిస్చారైజ్ ఉన్న షాంపూ వాడాలి .. దాడ్రుఫ్ లా పొట్టు రాలకుండా " keratex" హెయిర్ ఆయిల్ వాడవచ్చును .
  • ఈ వ్యక్తులు రూములో వాతావరణము వేడి గా ఉండేటట్లు చూసుకోవాలి , చెమట పట్టేటట్లు వ్యాయామము చాలా మంచిది .
  • పెదాలు పొడిబారకుండా "Lipguard" క్రీములను వాడాలి .
  • యాంటి ఆక్షిడెమ్ట్స్ (AntiOxydent) ముఖ్యము గా విటమిన్ ఎ వాడాలి . చాల మటుకు పోలుసుబారడం తగ్గుతుంది .


=============================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

గజ్జి , Scabies




స్కేబీస్ – గజ్జి

* ఇది చాలా సాధారణమైన, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, పెద్దలలోను కనిపిస్తుంది .గజ్జి ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి. ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు మరియు వాపు కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.

స్కేబీస్ ఎలా వ్యాపిస్తుంది?

* తవుట ఇబ్బ్ మైట్ పురుగులు చాలా సున్నితమైనవి. అవి శరీరం లో 24 – 36 గంటలు మాత్రమే ఉండగలవు.
* తవుట ఇబ్బ్ మైట్ పురుగులు దగ్గర దగ్గరగా మెసిలే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సోకుతుంది.
* చాలా తక్కువగా కుక్క పిల్లి నుండి సంక్రమిస్తుంది. ఎందుకంటే వీటికి వేరే వ్యాధి కారకమైన పురుగులు సోకుతాయి,

ట్రీట్ మెంట్ :
  • బెంజైల్ బెంజయేట్ (Benzyl Benzoate) అనే లోషను లేదా క్రీము ముఖము తప్పించి , ఒళ్ళంతా రాసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి.
  • వేసుకున్న దుస్తులు , ఇంటిలోని మిగతా అందరి బట్టలు వేడినీటిలో ఉడకబెట్టి ఉతకాలి (MaasCleanig) ,
  • itch mite చనిపోవడానికి " tab . BandyPlus " ఒక్క మాత్ర ఉదయాన్నే పరగడుపున మింగాలి .
  • ఇన్ఫెక్షన్ ఉంటే antibiotic - pencillin లేదా doxyCyclin 5 రోజులు తీసుకోవాలి .
మరికొంత సమాచారము కొరకు -> గజ్జి (Scabies)

=============================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Pimples , మొటిమలు




టీనేజ్‌ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.

మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.

కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.

  • హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు.. 
  • చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
  •  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. 
  • పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి. 
  • పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య, 
  • కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, 
  • గర్భనిరోధక మాత్రలు, 
  • క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.

ఏర్పడే విధానము:

మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.

ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.


మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు

* మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
* ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
* వంశపారంపర్యము (కొంతవరకు)
* ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం

పర్సనల్  జాగ్రత్తలు :-

* ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
* జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
* ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
* మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.
* గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.
నివారణ
- పింపుల్స్‌ను గిల్లకూడదు
- మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
- తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
- నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
- మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
- స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
- గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
- మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.
- సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
- రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.

వైద్యం

శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు.

పెద్ద మొటిమలు వున్నవాళ్ళు -

  • క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ , కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment)
  • Femcinol -A skin ointment ... apply daily two times.
  • డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
  • మచ్చలు పోవడానికి "అలొవెరా " తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
ప్రత్యామ్నాయాలున్నాయి...
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.

లేజర్‌ చికిత్సలున్నాయ్‌...
మోముపై గుంటలకు లేజర్‌, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్‌ చికిత్సల్లో ఫ్రాక్షనల్‌ సీఓ2, అర్బియం గ్లాస్‌, ఎన్డీయాగ్‌, ఐపీఎల్‌.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్‌ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు.

ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్‌, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్‌ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్‌తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.


ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు...

  • ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
  • మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
  • దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
  • రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
  • ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
  • కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
  • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
  • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
మొటిమలతో జాగ్రత్తలు :

చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.

* రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.

* మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.

* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.

* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.



===============================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, January 9, 2010

చుండ్రు (Dandruff) , Dandruff





శిరోజాల పరిరక్షణలో తరచూ చిరాకు పెట్టి , ఇబ్బంది కలిగించే సమస్య చుండ్రు . ఈ చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి. కొన్ని సమయాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ తోడుఅవుతుంది . ప్రతిరోజూ కొన్ని లక్షల చర్మం కణాలు పుడుతూ ఉంటాయి , కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఇలా తల పైన కొత్త కణాలు కంటే మృతకనాలు ఎక్కువయితే అవి పెచ్చులుగా తలపై కనిపిస్తాయి ... అదే చుండ్రు . వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం రావచ్చును .
వైద్య భాషలో దీన్ని "సేబోరిక్ డెర్మటైటిస్ " అంటారు . చుండ్రు తల కపాలానికి వచ్చే సాదహరణ , దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ చర్మ పరిస్థితి .
రకాలు : చుండ్రు ప్రధానము గా రెండు రకాలు .
  1. పొడి చుండ్రు -తెల్లగా చిన్న చిన్న పొలుసులు పొట్టు రూపం లో రాలుతుంది . చల్లని వాతావరణం లో కనిపిస్తుంది .
  2. జిడ్డు చుండ్రు - గ్రీజీ రకము లేత పచ్చ రంగులో ఉండి ఒక్కో సారి చెడువాసన తో కూడి ఉంటుంది . వేడి వాతావరణం లో కనిపిస్తుంది .

ఏ కాలంలోనైనా.... ఎల్లప్పుడూ... అందరినీ వేధించే ప్రధాన సమస్య తలలో చుండ్రు. వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అనే తేడా లేకుండా... అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం.

చుండ్రు రావడానికి కారణాలు ఏమిటి ? చుండ్రు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి చుండ్రుకు ఇదీ కారణము అని ఖచ్చితం గా చెప్పలేము .

  • చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంటుంది.
  • ఎక్కువ ఒత్తిడికి లోనైనా తలలో చుండ్రు వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి సంబంధించి వత్తిడికి గురికావడం జరుగుతోంది.
  • ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, కూలర్ కింద కూర్చున్నా , తల మీది చర్మం పొడి బారిపోయి పొట్టులాలేస్తుంది.
  • షాంపూ లతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా... చుండ్రు వచ్చే అవకాశం వుంది .
  • తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ.
  • కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది.
  • వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లోనివసించినా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
  • ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రు రావడానికి కారణమవుతాయి.
  • మన శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా,
  • శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వచ్చేస్తుంది.

దీనివల్ల వచ్చే మానసిక అందోళన నుంచి బయటపడలన్నా, చుండ్రు పోవలన్నా ఎప్పుడూ మందులపై అధారపడకూడదు. ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ట్రీట్మెంట్ : పరిరక్షణ (Prevention)
  • ఉసిరి , అలోవేరా అరటి , నిమ్మ లాంటివి మూల పదార్ధాలుగా ఉండే హెర్బల్ షాంపూ లు మాడును (Scalp) రక్షిస్తాయి.
  • కీటోకెనజోల్ , సెలీనియం సల్ఫిడ్ ఉన్న యాంటి డేండ్రఫ్ షాంపూ లు పనిచేస్తాయి . ఉదా: Candid TV, Keto-B shampoo, Selsun shampoo .. etc.

తెలుసుకోవలసిన విషయాలు :
  • చుండ్రు ఒకరినుంచి ఒకరికి అంటుకుంటుంది అనడం లో వాస్తవం లేదు .
  • ఇతరుల దువ్వెనలు , బ్రష్ లు వాడినట మాత్రాన చుండ్రు వస్తుందనుకోవడం సరికాదు . సమస్య శారీక వ్యవస్థలో దాగిఉంటుంది .
  • షాంపూ లు తరచూ వాడడం వల్ల తల చర్మం లో పొలుసులు లేస్తాయనడము వాస్తవం కాదు . షాంపూ పూర్తీ గా వదిలేలా స్నానం చేయక పోవడం మాడు (scalp) సమస్యలకు దారి తీస్తుంది . కాబట్టి షాంపూ లను శుబ్రం గా స్నానము చేసి వదిలించుకోవాలి .
ఇంటి వైద్యము (చిట్కాలు):

* ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు బాగా పట్టించాలి. ఇవిధంగా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలపాటు చేస్తే చుండ్రు తగ్గుతుంది.

* వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాయాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.

* చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి

* ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు తినాలి. కాయగూరలు, చేపలను సమతూలంగా ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకపోవడం మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భుజించాలి.

* తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ను వాడితే చర్మం పొడిగా అవదు.

* తలస్నానం చేయడానికి అరగంట ముందుగానే... పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

* ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

చుండ్రును అరికట్టేందుకు ఫ్రూట్ థెరపీ లేదా వెజిటెబుల్ థెరపీని ఉపయోగిస్తే సమస్యను అధిగమించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

టమోటా థెరపీ : టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది అంటునారు సౌందర్యనిపుణులు .

యాపిల్ థెరపీ : రెండు యాపిల్ పండ్లను గుజ్జుగా చేసుకోండి. ఈ గుజ్జును వెంట్రుకలకు దట్టించండి. ఇలా దట్టించిన ఈ యాపిల్ గుజ్జును 45 నిమిషాల వరకు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటునారు సౌందర్యనిపుణులు .
==================================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, January 8, 2010

జుట్టు ఊడకుండా చిట్కాలు , HairFalling prevention-Hints




జుట్టు రాలిపోవడము :
మాములుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్ లో భాగమే . జుట్టు ఎదుగుదల దశ ఏడాది నుంచి మూడేళ్ళు సాగవచ్చు . ఇది 90% జుట్టుకు వర్తిస్తుంది . తరువాత దశ తాత్కాలికం . ఇది ఆరు వారలు ఉంటుంది . తుది దశ విశ్రాంత దశ . ఇది పది శాతం జుట్టుకు వర్తిస్తుంది . జుట్టు ఊడి కొత్తది రావడానికి కొద్ది నెలలు సమయం పడుతుంది . తోలి దశను వైద్య భాషలో " ఎనాజేన్ " (గ్రోత్ స్టేజ్) అని , మోడో దశకు " తెలోజేన్ " (రెస్తింగ్ స్టేజ్) అని అంటారు . ఈ ఎనాజేన్ దశ నుండి తెలోజేన్ దశ కు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతూ ఉంటుంది .

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెరటిన్‌ అనే పదార్థంతో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి. శరీరం మాదిరి వాటికీ పోషక విలువలు అవసరం. సహజంగా రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలుతాయి. అయితే అంత కంటే ఎక్కువ రాలినపుడే సమస్యగా భావించాలి.


సహజ కారణాలు
  • * వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.
  • * సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.
  • * మానసిక ఒత్తిడి, వృత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం.
  • * వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.
  • * స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.

ఇతరకారణాలు
బట్టతల లేదా జట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జన జీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోనుకాని వారుండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది. అది వంశపారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టురాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు.

కంప్యూటర్‌తో సహ జీవనం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫాస్ట్‌ఫుడ్‌ నూడుల్స్‌, పిజ్జా, బర్గర్‌... ఇలా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఖర్జూరం తదితర పౌష్టికాహారం తగ్గించుకోవడంతో శరీరానికి తగినంత పోషక ఆహారం లభించడం లేదు. ఈ పోషకాహారలోపానికి మరోవైపు మానసిక ఒత్తిడి తోడవడంతో ఆరోగ్యం దెబ్బతిని జుట్టురాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఆధునిక యువతలో కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ ఉన్నారు. రేడియేషన్‌ ప్రభావంతో జుట్టురాలిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు. చిన్న వయసులోనే యువతీ, యువకులలో విపరీతమైన ఆందోళన చోటు చేసుకుంటోంది.మరి రాలిపోయిన జుట్టును తిరిగి తలపైకి తెచ్చుకోగలగడం సాధ్యమా? అవును.
* హార్మోన్‌ లోపం.. హైపోథైరాయిడిజం, రక్తాల్పత.. ఇనుము, విటమిన్‌ బి12 లోపం, ఇన్‌ఫెక్షన్‌, డైటింగ్‌ , ఒత్తిడి , హార్మోన్ల అసమతుల్యం వల్ల , పోశాకాహారలోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది . జుట్టు రాలడం లో 30 నుంచి 40 రకాలు ఉన్నాయి . ప్రధానము గా రెండు రకాలు కనిపిస్తాయి . అవి

నడినెత్తిపై డడం : ఈ రకము హెయిర్ లాల్ ప్రధానము గా హార్మోనుల అసమతుల్యము వల్ల కలుగు తుంది . మెనోపాజ్ , పాలిసిస్తిక్ ఒవేరియన్ డిసీజ్ , థైరాయిడ్ సమస్యలు కారణము కావచ్చును .
పూర్తిస్థాయి హెయిర్ లాస్ : ఏదో ఒక ప్రదేశం లో కాకుండా తలబాగామంతా జుట్టు ఊడిపోతుంది . Diffused అంటారు .
మరికొన్ని కారణాలు -- బాగా డైటింగ్ , సంతాన నిరోధక మాత్ర చేడుప్రభావము , ఐరన్ స్థాయి రక్తం లో తగ్గిపోవుటవలన .

జాగ్రత్తలు
  • * ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలైతే రెండు రోజులకోసారి తప్పనిసరి.
  • * కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.
  • * సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందుతుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమినులు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డైరీ ఉత్పత్తుల్లో అవి సమృద్ధిగా దొరుకుతాయి.
  • * అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

చికిత్సా చిట్కాలు :
మారుతున్న కాలానికి తగ్గట్లు అందానికి గల ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. స్త్రీలే గాక పురుషులు కూడా అందం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అందానికి మరింత వన్నె తెచ్చేది శిరోజాలు. కురులు అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడంకోసం అనేక రకాలైన పద్ధతులు నేడు అందుబాటులోకి వచ్చాయి.


తేనెలోని విటమిన్లు, ఖనిజ లవణాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. తేనె చక్కని కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. జట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే, తలస్నానం చేశాక మగ్గు నీటిలో అరకప్పు తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టును తడిపి, రెండు నిమిషాల తరువాత తలపై నుంచి చల్లటి నీటిని ధారలా పోయాలి.

* తలస్నానం చేసిన అరగంట తరువాత కప్పు తేనెకు పావుకప్పు ఆలీవ్‌నూనె కలిపి, తలకు మర్దనా చేయాలి. పావుగంట అయ్యాక కడిగేస్తే కురులు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే మంచిది. కప్పు ఆలీవ్ నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి మర్దనా చేసి, అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

శిరోజాలు దట్టంగా పెరిగి నిగనిగలాడాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్ లేదా బేబీ నూనె, కప్పు నీళ్లు కలిపి శిరోజాలకు దట్టించండి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో శుభ్రపరచాలి. అరగంట తరవాత షాంపూతో తలస్నానం చేస్తే అది జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.

తేనె, బాదం నూనె, పెరుగు ఒక్కో చెంచా చొప్పున కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తరవాత చల్లటి నీళ్లతో కడిగితే శిరోజాలు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఈ ప్యాక్ జుట్టుకు మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

మీ శిరోజాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటే కొబ్బరిపాలను తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేయాలి. దీనివల్ల శిరోజాలు పట్టుకుచ్చుల్లా జాలువారతాయి. కొత్త నిగారింపును సంతరించుకుంటాయి.

మీ వెంట్రుకలు తెల్లబడుతుంటే కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ మీ శిరోజాలకు రాసుకుంటే అవి నిగనిగలాడుతూ ఏపుగా పెరగడమేకాకుండా, తెల్లబడకుండా వుంటాయి. అలాగే వెంట్రుకులు రాలిపోకుండా పటిష్టంగావుంటాయని ఆయుర్వేద వైద్యనిపుణులు పేర్కొన్నారు.
తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జట్టు తెల్లబడకుండా ఉంటుంది. పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది.

జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరు వెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15 నిమిషాల పాటు మర్ధన చేస్తే జట్టు పెరుగుతుంది. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదిన తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఇండేవిధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలను కలపండి. షాంపూలా ఈ మిశ్రమాన్ని కలుపుకుని శిరోజాలను పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే రెండు నెలల్లో నల్లటి, దట్టమైన, అందమైన శిరోజాలు మీ సొంతం.

చలికాలం శిరోజాల రక్షణకు మొదటి షరతు నీరు తగినంత తాగడమే. శరీరంలో నీరు లేకపోతే శిరోజాలు పిడచబారి పోవడం ఖాయం దప్పిక వేయదు అని సాకు చూపి తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మంతోపాటు శిరోజాలు కూడా పొడిబారిపోతాయి.

శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన సమయం కాబట్టి జుట్టు కొసలను తరచు కత్తిరించుకుంటూ ఉండాలి.

చలికాలంలో డ్రయర్లను వాడొద్దు. మెత్తని తువాలుతో తుడుచుకుని, గాలికి ఆరనివ్వడం మంచిది.

తీవ్రంగా చలువ చేసే హెర్బల్ నూనెలు వేసవికి పనికొస్తాయి తప్ప చలికాలానికి అనువుగా ఉండవు. కాబట్టి తలకు నూనెలు పట్టించేవారు చలికాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోరాదు.

వారంలో కనీసం రెండు సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జవజీవాలు సంతరించుకుంటాయి.

చల్లగాలులు శిరోజాలను పొడి బారేటట్లు చేస్తాయి కాబట్టి అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.

శీతాకాలంలో బయటకు వెళ్లవలసి వస్తే తలకు ఊలు స్పార్క్ కంటే సిల్క్ స్పార్క్‌లో మంచివి.

శిరోజాలే ముఖారవిందాన్ని పెంపొందిస్తాయనడంలో సందేహంలేదు. ఆ శిరోజాల అందం కోసం రకరకాల రంగులు వాడుతుంటారు. కాని ముఖ్యంగా కొందరు హెయర్ డై వాడుతుంటారు. ఈ హెయర్ డైని వాడకూడదు .

** హెయర్ డైని వాడుతుంటే మీ శిరోజాలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఇవి రాలిపోతాయి .

** నెలకు రెండుసార్లు హెయర్ స్పాకు వెళ్ళి చికిత్స చేసుకుంటుండండి. దీంతో మీ శిరోజాలు మెరుపుతోపాటు బలిష్టంగాను తయారవుతాయి.

** మీరు స్విమ్మింగ్ ప్రియులైతే స్విమ్మింగ్ క్యాప్‌ను తప్పక ధరించండి. ఇలా చేస్తే స్విమ్మింగ్ పూల్‌లోనున్న నీటిలో కలిపే క్లోరిన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్విమ్మింగ్ ‌పూల్‌లో కలిపే క్లోరిన్ కారణంగా మీ శిరోజాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

** ముఖ్యంగా యువత వెంట్రుకలకు హెయర్ కలర్ వేస్తున్నారు. హెయర్ కలర్ వేసే అలవాటుంటే వెంటనే మానుకోండి.

** కొందరు తలను మాటిమాటికి దువ్వుతుంటారు. ఇలా చేయడం వలన వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోయే ప్రమాదం ఉందంటుంది .

శిరోజాలకు సంబంధించి ఎన్నో సమస్యలు. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం.. ఇలా ఏన్నో సమస్యలు ఆడా మగా అనే తేడా లేకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎదుర్కొని శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడే మంచి తైలం ఉందని ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ తైలాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం...

తైలం తయారీకి కావల్సినవి: పావుకిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందారపూలు, ఒక చెంచా అతిమధురం, కొబ్బరినూనె, తగినన్ని నీళ్లు

తయారుచేసే విధానం : ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగుకల ఓ వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటతో కలబెడుతూ బాగా మరగేవరకూ వేడిచేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు నాలుగోవంతు వచ్చిన తర్వాత కొబ్బరినూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి.

కొంతసేపటికి నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దళసరి వస్త్రం ద్వారా మరోపాత్రలోకి వడకట్టాలి. అంతే.. మీకు కావలసిన తైలం సిద్ధమైనట్లే. ఈ తైలం సుమారు ఏడాది వరకూ నిల్వ ఉంటుంది.

ఈ తైలంతో మర్దన చేస్తే... తలనొప్పి, పార్వ్శపు నొప్పి, ఒత్తిడితో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అలవాట్లు :జుట్టు పై ప్రభావము >

దూమపానము : దీనివల్ల రక్తనాళాలు మందముగా మారి జుట్టుకుడుల్లకు రక్త సరఫరా సరిగా జరగదు . క్రమము గా జట్టు సహజరంగును కోల్పోతుంది . కుదుళ్ళు బలహీనపడి చవరికి రాలిపోతాయి. అందుకే ఆ అలవాటు మానెయ్యాలి .

నిద్ర : మనిషికి రోజుకు ఎనిమిది గంటలు నిద్ర అవసరము ( కనీసము ఆరు గంటలు) ఆ పాటి నిద్ర లేకపోతే ఒత్తిడి పెరిగి హార్మోన్లు హానికర రసాయనాలు గా మారుతాయి . జుట్టు బలహీనమై , తెల్లబదదము , రాలిపోవడము జరుగుతుంది ,

వ్యాయామము : శరీరములోని విషపదార్ధాలను సమ్ర్ధవంతం గా బయటికి పంపే ఏకైక మార్గము వ్యాయామము . రోజు చెమటలు పట్టేలా వ్యాయామము చేస్తే చర్మానికి జుట్టుకుడుల్లకు రక్తసరఫరా బాగా జరిగి ఆరోగ్యము గా ఉంటాయి .

వాతావరణము : డైరెక్ట్ గా ఎ.సి కింద కూర్చొని చేసే ఉద్యోగమా ... అయితే మీ జట్టుకు రోజులు మూడినట్లే . అధిక వేడి , అదిక చల్లదనము రెండు కురులకు శత్రువులే . . ఎ.సి. లో పనిచేసే వారు ఉలు తో తయారుచేసిన టోపీలు ధరించడం మంచిది .

ఆహారపదార్థాలు విషయంలో వీటితో జాగ్రత్త ->

అందమైన కురుల కోసం రకరకాల సౌందర్యసాధనాలు వాడటం కద్దు. వాటితో పాటు ఆహారం విషయంలోనూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అందంతోపాటు ఆరోగ్యాన్నీ సంతరించుకుంటాయట కేశాలు. ప్రత్యేకించి కొన్ని రకాల ఆహారపదార్థాలు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లలో మార్పులు కలగజేసి హానికర రసాయనాలుగా మారుస్తాయి. ఆ రసాయనాలు కేశగ్రంథులను బలహీనపరచి జుట్టురాలిపోయేలా చేస్తాయి. కాబట్టి అలాంటి ఆహారపదార్థాలను అతిగా కాకుండా ఒక పరిమితిలో తీసుకోమని చెబుతారు సౌందర్యనిపుణులు. అవేంటంటే... వేపుళ్లు, రెడ్‌మీట్‌(కోడి, మేక, చేప తప్ప మిగిలిన మాంసాలు), ఉప్పు, పంచదార అధికంగా ఉండే బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, పాస్తా, నూడుల్స్‌, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, బఠానీలు. ఎప్పుడన్నా ఒకసారైతే ఫర్వాలేదు కానీ వీటిని తరచుగా పరిమితికి మించి తింటే జుట్టుకే కాదు, మిగతా శరీరభాగాల ఆరోగ్యానికీ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.

జాలువారు కురుల కోసం..

జుట్టు రాలుతోంది.. చుండ్రు ఇబ్బందిపెడుతోంది.. తలనెరుస్తోంది... ఇలా కేశ సంబంధ సమస్యలు.. ఈ రోజుల్లో చాలామందిని ఏదో ఒక రూపంలో బాధిస్తూనే ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, నిర్లక్ష్యం, కేశసంరక్షణపై అవగాహన లేకపోవడం.. ఈ సమస్యల్ని మరింత పెంచుతున్నాయి. అయితే.. వీటిల్లో చాలామటుకు సొంతంగానే నివారించవచ్చు.

ఒత్తిడి వద్దు: జుట్టు ఆరోగ్యాన్నీ దెబ్బతీయడంలో ఒత్తిడిది కీలకపాత్ర. ఇది పెరిగే కొద్దీ హార్మోన్ల అసమతూకం తప్పదు. జుట్టూ విపరీతంగా రాలడం మొదలవుతుంది. దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటనల వల్ల ఒత్తిడికి లోనవుతుంటాం కొన్నిసార్లు. దీనివల్ల జుట్టు ఎదుగుదల ఆగిపోతుంది. మారుతున్న జీవన విధానం వల్ల ఒత్తిడి తప్పదు కాబట్టి రోజులో కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తలలో రక్తప్రసరణ వేగవంతమై కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

అనారోగ్యాలు: నిపుణుల ప్రకారం.. రోజులో 50-100 వరకు కురులు రాలవచ్చు. ఇది మరింత పెరిగినా.. విపరీతంగా రాలుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. థైరాయిడ్‌, పీసీఓడీ వంటివి.. కొన్నిసార్లు పోషకాల లోపాలూ ఇందుకు కారణం కావచ్చు. అలాగే టైఫాయిడ్‌, మలేరియా.. వంటి జ్వరాలు వచ్చినా శిరోజాలు వూడిపోతాయి. వైద్యుల్ని సంప్రదిస్తే.. పరీక్షలు చేసి.. చికిత్స సిఫారసు చేస్తారు. పోషకాల లేమి కారణమైతే.. వాటి సప్లిమెంట్లు సూచిస్తారు.

వాతావరణంలో మార్పులూ శిరోజాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. రాలిపోతాయి. తల, ముఖం విపరీతంగా దురదపెడుతుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇందుకు చుండ్రు కారణం కావచ్చు. అదే వాస్తవమైతే.. చికిత్స తీసుకోవాలి. లేదంటే కుదుళ్ల చుట్టూ చుండ్రుపేరుకుంటుంది. దాంతో ప్రాణవాయువు అందక.. రాలిపోతాయి.

ఆహారంలో కొన్ని పోషకాల లేమి కూడా శిరోజాల ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. అందుకే కొన్ని పోషకాలు లోపించకుండా చూసుకోవాలి.

మాంసకృత్తులు: ఇవి జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంచుతాయి. ఇది లోపిస్తే.. జుట్టు నిర్జీవంగా మారుతుంది. కొంతకాలానికి విపరీతంగా పొడిబారి.. నెరిసిపోతుంది. అందుకే మన ఆహారంలో మాంసకృత్తులు తప్పనిసరి. ఇందుకోసం మాంసం, చేపలు, కోడిగుడ్లు తినాలి. శాకాహారులైతే.. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, సోయా, చిక్కుడు జాతి గింజలు సమృద్ధిగా తీసుకోవాలి.

ఇనుము: ఈ పోషకం తగ్గితే రక్తహీనత తప్పదు. శరీరానికి ప్రాణవాయువును అందించే రక్తకణాల సంఖ్యా తగ్గుతుంది. దాంతో జుట్టుకూ ప్రాణవాయువు అందక ఎదుగుదల ఆగిపోతుంది. ఇనుము ఆధారిత పోషకాలు ఎక్కువగా తీసుకుంటే... ఈ సమస్యను నివారించవచ్చు. పాలకూర, మెంతికూర, తోటకూర వంటి తాజా ఆకుకూరలు, బీట్‌రూట్‌వంటివన్నీ ఇనుము ఆధారిత పదార్థాలే.

జింక్‌: జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కణజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ పోషకం గుమ్మడిగింజలు, నట్స్‌, ఓట్స్‌, కోడిగుడ్లు, పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది.

బయోటిన్‌: బి7గా పరిగణించే ఈ విటమిన్‌ లోపిస్తే.. చర్మం పొడి బారుతుంది. జుట్టూ పొడిబారి రాలిపోతుంది. గుడ్డులోని పచ్చసొన, చిక్కుడుజాతి గింజలు వంటివన్నీ బయోటిన్‌ను అందిస్తాయి. అయితే కోడిగుడ్డును ఉడికించి తీసుకోవాలి.

ఒమెగా త్రీ ఫ్యాటీఆమ్లాలు: ఇవి సరిగ్గా అందకపోతే.. తలలో పొట్టు లాంటిది మొదలై.. జుట్టు విపరీతంగా రాలుతుంది. అందుకే అవిసె గింజలు, వాల్‌నట్లు.. మన ఆహారంలో ఉండాలి.

ఇవీ తప్పనిసరి
* వెడల్పాటి దంతాలున్న చెక్క దువ్వెనను వాడాలి. అప్పుడే కురులు దువ్వెనకు పట్టుకోవు. ఎక్కువగా వూడవు.
* జుట్టుకు పోషణ అందాలంటే.. తలస్నానం ఒక్కటే సరిపోదు. అదనంగా కండిషనింగ్‌ కూడా తప్పనిసరి.
* రోజూ తలస్నానం చేయడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయనుకోవడం పొరబాటు. దీనివల్ల జుట్టులోని సహజనూనెలు తగ్గుతాయి. ఫలితంగా పొడిబారి, చిట్లుతుంది. చుండ్రు సమస్య గనుక లేకపోతే.. వారంలో మూడుసార్లకు మించి తలస్నానం చేయకపోవడమే మంచిది.
* ప్రతిరోజూ రెండుపూటలా.. మునివేళ్లతో తలంతా సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ చురుగ్గా సాగుతుంది.
* తల తడిగా ఉన్నప్పుడు టోపీ, హెల్మెట్‌లు పెట్టుకోవడం.. స్కార్ఫ్‌ చుట్టుకోవడం వంటివి చేయకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. వీటిని ధరించడం వల్ల త్వరగా వూడుతుంది.

మరికొంత సమాచారము కోసం ->జుట్టు రాలడం

పట్టులాంటి కురులకోసం

జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చుండ్రు... నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ప్రశాంతంగా ఉండగలమా చెప్పండి? దీనికి ఆసుపత్రులూ బ్యూటీపార్లర్ల వెంట తిరగాలంటే పర్సు ఖాళీ అవుతుంది. ఇలాంటివారికి ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం ఉంది. ఎలా అంటే... గుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్‌నూనె, నిమ్మరసాల మిశ్రమం పై సమస్యలకు చక్కని పరిష్కారం. బయోటిన్‌తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు... కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. పెరుగు కుదుళ్లని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరిస్తే... అరటి, ఆలివ్‌ నూనె పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి. వెంట్రుకలకు మెరుపు తెస్తుంది నిమ్మ. ఈ మిశ్రమం తయారుచేయడానికి రెండు టేబుల్‌స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండూ, నిమ్మరసం- ఆలివ్‌నూనె ఒక్కో టీస్పూన్‌ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్‌ 'ఇ' క్యాప్సూల్‌ కూడా ఒకటి కలిపి బాగా కలియతిప్పి మిశ్రమాన్ని తయారుచేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకూ పట్టించాలి. 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి జుట్టు పట్టులా మెరుస్తుంది.


Prevent hail fall,జుట్టు రాలకుండా...updated on 14-08-2013

జుట్టుని ఆరోగ్యంగానే కాదు, అందంగానూ కనిపించేలా చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేదు. కొన్ని వస్తువుల్ని ఇంట్లో అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.

జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు. పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి. కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే చాలు. జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి. కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.


  • =============================

Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, January 7, 2010

యోగ , Yoga






యోగము అంటే ఏమిటి?

"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాళ ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధీంచడంవలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి.వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు

అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్‌ టెన్షన్‌), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.... వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు....... అలాంటి టెన్షన్‌‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగ పద్దతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగ పద్దతులను కూడా పాటించేవారు.

యోగాసనాలు :
యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.

ధ్యానం

ధ్యానం అంటే ఏదో ఒక సుఖవంతమైన స్థితిని కనుగొనడం కాదు. దేన్నో వెంపర్లాడి వెతికి పట్టుకోవడం కాదు. అన్ని వెంపర్లాటలు అంతం కావడమే ధ్యానం. ధ్యానం చేసి ఏదో అద్భుతమైన శక్తిని, అనుభవాన్ని పొందాలనుకోవడం ధ్యానం కిందికి రాదు.

ధ్యానం అంటే ఏమిటి..? ఎలా చేయాలి..?

ఏకాగ్రతను ఎడతెగకుండా పొడిగించడాన్నే ధ్యానం అంటారు. ఈ ధ్యానాన్ని నాలుగు ఆసనాల ద్వారా చేయవచ్చు. అవి.. వజ్రాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, సిద్థాసనం. ఈ నాలుగు ఆసనాల్లో పద్మాసనం చాలా శ్రేష్టమైనది మరియు సులభమైనదిగా చెపుతారు. అలాగే వజ్రాసనం, స్వస్తికాసనాలు కూడా చాలా ఉపయుక్తమైనవి. ఇక యోగులకు అనువైన ఆసనం సిద్ధాసనం.

ఈ ఆసనాల ద్వారా చేసే ధ్యానంతో బహిర్గత విషయములపై అంతర్గత విషయాలపై, సూక్ష్మ విషయాలపై వరుస క్రమంలో చేసినట్లయితే మనస్సును తటస్థీకరించుట సాధ్యమవుతుంది. ఇలా సాధన చేయడం ద్వారా ఏ సమస్యనైనా అవలీలగా అధిగమించగల శక్తి ఒనగూరుతుంది.

సూర్య నమస్కారాలు


యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్ధ్హానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ.

శృంగారానికీ యోగా మంచిదేగా!

  • ఆరోగ్యానికే కాదు... శృంగారానికీ భేషైన ఔషధం యోగా అంటున్నారు నిపుణులు. దాంపత్యజీవితాన్ని రసరమ్యం చేయడంలో యోగా చక్కటిపాత్ర పోషిస్తుందని హామీ ఇస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం...
  • * రోజూ యోగా చేయడం వల్ల ఒత్తిళ్లూ ఆందోళనలూ తగ్గుతాయి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా శృంగార పటుత్వం పెరుగుతుంది.
  • * కొన్ని రకాల ఆసనాలు వేయడం ద్వారా మహిళల పొత్తికడుపు కండరాలు బలపడతాయి. దానివల్ల భావప్రాప్తిలో ఆనందం మరింత పెరుగుతుందని గతంలో చాలా పరిశోధనల్లో తేలింది.
  • * ఆసనాలు వేయడంలో రకరకాల కదలికల కారణంగా శరీర సౌష్ఠవం పెరుగుతుంది. విభిన్న భంగిమల్లో శృంగారసౌఖ్యాన్ని పొందేందుకు వీలుగా తయారవుతుంది.
  • ఇవి మంచివి: యోగాలో ప్రత్యేకించి కొన్ని ఆసనాలు శృంగారజీవితంలో ఆనందాన్ని పెంచుతాయి. అవి... పద్మాసనం, ఉద్దియాన బంధం, హలాసనం, మత్స్యాసనం, సర్వాంగాసనం ఇలా చాలానే ఉన్నాయి.

పూర్తీ వివరాలకోసం _ యోగ వికీపీడియా చూడండీ .

నిండు జీవితానికి యోగ :

యోగా..రెండక్షరాల పదం. ఇందులోనే శత కోటి శతఘు్నల బలం. ఆధునిక మానవ జీవితానికి పరమౌషధం. వైద్య శాస్త్రం దగ్గర్నుంచి విజ్ఞాన శాస్త్రం దాకా ముక్త కంఠంతో యోగాకు యోగ్యతా పత్రం ఇచ్చాయి. ఊపిరి సలుపని జీవితానికి నిండు ఊపిరి...సకల దేహ దురవస్థలకు...అనారోగ్యాలకు ఈ యోగా దివ్యౌషధం ఎలా అయింది? మానసిక, భౌతిక సంబంధమైన రోగ నివారిణి ఎందుకయింది? హిందూ, బౌద్ధ, జైన మత ఆమోదాన్ని పొంది ఎలా విశ్వజనీనమైంది? రెండక్షరాల ఈ పదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగడమేమిటి? అసలీ యోగా ఏమిటి? యోగా అంటే ఏమిటి? ఉల్లాసంగా రోజును ప్రారం భించాలనుకుంటున్నారా? అయితే ఆరోగ్యపరంగా అనేక లాభాలను చేకూర్చే సూర్యనమస్కారాలతో ప్రారంభించవచ్చు. బొమ్మలలో చూపినట్టుగా పన్నెండు భంగిమలు ఇందులో ఉంటాయి. ఇవి కనుక రోజుకు ఒక్కసారి వేస్తే చాలు ఇతర ఆసనాలు వేయకున్నా మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పొద్దున్నే మనం తాగే కాఫీ కన్నా ఎక్కువ ఉల్లాసాన్ని ఇస్తాయివి.

ఆధునిక జీవనం సంక్లిష్టమైపోయింది. ఉరుకుపరుగుల జీవితం. గొంతు కోత పోటీ. ఏదో సాధించాలనే నిరంతర తపన.. లేకుంటే ఇతరులకన్నా వెనుకబడిపోతామన్న భయం... న్యూనత.. ఆనందంగా బాల్యాన్ని కానీ యవ్వనాన్ని కానీ అనుభవించలేని స్థితి. బస్తాలకు బస్తాల పుస్తకాలతో కరెంటు బిల్లులు పెరిగేలా చదువుకోవడం.. తర్వాత ఉద్యోగ జీవితంలో పైకి ఎదగాలనే తపనతో కుర్చీని వదలకుండా శ్రమించడం. ఇవన్నీ చిన్న వయసులోనే వ్యక్తులు పెద్ద పెద్ద రోగాల బారిన పడేందుకు దోహదం చేస్తున్నాయి. నిరంతర ఒత్తిడి కారణంగా మనశ్శాంతి లోపించడం, బిపి, షుగర్‌ వంటి వ్యాధుల బారిన పడడం జరుగుతున్నది. ఇదం తా కూడా జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే. ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ లేని జీవితం వెరసి ఆధునిక మానవుడిని అతలాకుతలం చేస్తున్నాయి. ఆరోగ్యం అనే పదానికి జీవితంలో అవకాశం లేకుండా చేస్తున్నాయి. స్థిరమైన మానసిక, శారీరక, సంతులన స్థితే ఆరోగ్యమని ఆధునిక సైన్సు నిర్వచిస్తోంది. ఆధునిక జీవనంలో ఇవన్నీ లోపిస్తున్నందునే వీటన్నింటికీ సమాధానంగా యోగ ప్రాముఖ్యత సంతరించుకుంది.

యోగ అన్న పదం సంస్కృతం నుంచి పుట్టింది. దీని అర్థం కలయిక లేదా సంయోగం అని. మానవుని శారీరక, బౌద్ధిక, ఆత్మిక కోణాలన్నింటినీ సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగ. భారత దేశంలో పుట్టిన యోగ ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ దర్శనమిస్తుంది. యోగుల సంభాషణల నుంచి పుట్టిందే యోగ అనే వాదనా ఉన్నది. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైందని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం యోగ విద్యను శివుడు తన పత్ని పా ర్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడుట. పతంజలి యోగ సూత్రాలు ఆధ్యాత్మికత లోతులను స్పృశిస్తాయి. సంస్కృతంలో ఆసనమనే పదానికి అర్థం భంగిమ. ప్రాథమికంగా ఆసనాలు ఎనభై నాలుగు ఉన్నాయి. అయితే ఏ ఆసనం ప్రత్యేకత దానిదే. ప్రతి దానికీ ఒక పేరు, చేయవలసిన పద్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. ఏది ఏమైనా యోగ ద్వారా వ్యక్తి ప్రశాంతతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా యోగాను సాధన చేస్తున్నారు.

ఆధునిక పరికరాలతో కూడిన జిమ్‌లు రోడ్డుకొకటి వెలుస్తున్నా, యోగాకు మాత్రం నానాటికీ క్రేజ్‌ పెరుగుతున్నది. దీనికి కారణం దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు లేకపోవడమే. శారీరక వ్యాయామంతో పాటుగా ప్రాణాయామం చేయడం ద్వారా అనేక వ్యాధులకు ఇట్టే దూరం కావచ్చు. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా వచ్చే బిపి, షుగర్‌, ఆస్తమా వంటి వాటికి దూరం కావచ్చు. అలాగే తేలికగా గుండె పోట్ల బారిన పడకుండా మనను మనం కాపాడుకోవచ్చు. కేవలం విశ్రాంతి పొందడానికో లేక శరీరానికి బద్ధకాన్ని వదిలించుకోవడానికో, సరిగా శ్వాసించేందుకో, ధ్యానించేందుకో లేక ప్రస్తుతం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ కనుకో.. ఎందుకోసం యోగా చేసినప్పటికీ దాని వల్ల వచ్చే ఆరోగ్య ఫలితాలు మాత్రం అపారం.

యోగ- ఆరోగ్యం
యోగ వల్ల కలిగే భౌతిక లాభాలు చెప్పలేనన్ని. ఏ వయసు వారైనా యోగసాధన చేయవచ్చు. ఎందుకంటే ఇది వేగంగా ఇతర వ్యాయామాల వలె కఠినంగా ఉండదు. వయసును బట్టి ఆసనాలను ఎంచుకొని వేయవచ్చు. ఆసనాన్ని ఎంత నిదానంగా వేస్తే అంత మంచిదని యోగ చెప్తుంది. అదే సరైన విధానం కూడా. చురుకుగా మన అంగాలను దిలించకపోవడం వల్ల అక్కడ పట్టేస్తుంది, ఇక్కడ విరుగుతుంది అనే భయం ఉండదు. నెమ్మదిగా చేయడం వల్ల కండరాలు కూ డా సహకరిస్తాయి. మొదటి వారం రోజు లూ కొంత శ్రమ అనిపించినా తర్వాత తర్వాత ఆసనాలు వేయడం ఇంత తేలికా అనిపించడమే కాదు. అవి వేయడం వల్ల మనలో వస్తున్న మార్పు స్పష్టంగా కనుపిస్తుంటుంది. నిటారుగా నిలబడడం, స్వస్థత చేకూరిన భావన కలగడం ప్రారంభమవుతుంది. ఇక అందం కోసం యోగ చేసే యువతకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా రుజవవుతూ వస్తున్నది.

యోగాసనాల వల్ల శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం అవుతుంది కనుక అది శరీరాన్ని బలంగా ఉంచుతుంది. వివిధ ఆసనాలు మన పాదాలను, కాళ్ళను, చేతులను, ఉదర భాగాన్ని, నడుము, భుజాలను బలంగా ఉంచుతాయి. ఆసనాలు వేసే సమయంలో కండరాలను సాగతీయడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయ డంతో మన కీళ్ళు, స్నాయువుల, కండరాలు ఎంతో బిగువు లేకుండా వదులు అయ్యి ఎలా కావాలనుకుంటే అలా వంచేం దుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్‌ లేదా రుమాటైడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్న వారు యోగ గురువు ఆధ్వర్యంలో వీటిని చేస్తే ఈ మార్పును స్పష్టంగా గమనించగలుగుతారు. సాధారణంగా ఈ సమస్య ఉన్నవారి కి కీళ్ళు వంచలేకపోవడం, విపరీతమైన నొప్పి వంటివి ఉంటాయి. కను క నిదానంగా వేసే ఆసనాల కారణంగా ఇవి వదులై నొప్పి తగ్గుతుంది.యోగ సాధనలో అనేక మార్గాలు ఉన్నాయి. అష్టాంగ యోగ, పవర్‌ యోగ, విన్యాస యోగ, బిక్రమ్‌ యోగ వంటివి ఎన్నో.... ఒక్కో గురువు తన అనుభవానికి సృజనాత్మకతను కూడా జోడించి నూతన పంథాలను సృష్టిస్తున్నారు.

గ్లామర్‌ ప్రపం చంలో పవర్‌ యోగాకు ఎంతో ప్రాచుర్యముంది. అయితే ఇది ఎంతో చురుకుగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఒక దశ సాధన పూర్తి అయిన తరువాత చేయవలసిన ఆసనాలు క్లిష్టంగా ఉంటాయి. వీటన్నింటి లో హఠ యోగ ఎంతో సరళమైంది. అయితే అష్టాంగ యోగ, పవర్‌ యోగ, విన్యాస యోగ, బిక్రమ్‌ యోగలో మన గుండెకు సంబంధించి న కండరాలకు వ్యాయామం జరుగుతుంది.

హఠ యోగ ద్వారా నడుం నొప్పి, మెడ నొ ప్పి వంటివాటిని తేలికగా తగ్గించుకోవచ్చు. ఇందులో వేసే ఆసనాలు ఎంతో నిదానంగా వేయవలసి ఉంటుంది. ఇవి మన నడుం వద్ద ఉండే కండరాలను, మెడకు సంబంధించిన కండరాలను బలోపేతం చేస్తుంది.

బరువు తగ్గించుకోవడానికే కాదు మన ఎముకల సాంద్రతను పెంచుకోవడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది. ముఖ్యం గా మెనోపాజ్‌ దశను సమీపిస్తున్న మహిళలకు ఇది అత్యుత్తమ ఔషధం. ఎందుకంటే ఆస్టియోపొరోసిస్‌, ఎముకలు సన్నబడడం వంటివి జరుగుతాయి. అంతేకాదు, అనేక రకాలైన గాయాల నుంచి కూడా స్వస్థత పొందవచ్చు. అయితే ఏదైనా గాయానికి చికిత్సగా యోగ సాధన చేయాలనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి.

గుండెకు యోగ మంచిదేగా...
నిదానంగా చేసే యోగ మన రక్తపోటును తగ్గిస్తుంది. ఈ ఆసనాలు వేసేటప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టవలసి వస్తుంది. ఈ కారణంగా శరీరమంతా రక్తసరఫరా క్రమబద్ధమవుతుం ది. హఠ యోగ సాధన ద్వారా బిపి రోగులు ఎంతో లబ్ధి పొందుతారు. ఎందుకంటే వీటికి సంబంధించిన ప్రాణాయామం, ఆసనాలు గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, రక్త పోటు ను నియంత్రిస్తుంది. యోగ సాధన వల్ల ఒత్తిడి కారణంగా వచ్చే చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది. పవర్‌ యోగ వల్ల మన కీలక కండరాలు బలోపేతం కావడమే కా కుండా శరీరంలో రక్తం, ప్రాణవాయువు సరఫరా క్రమబద్ధంగా జరుగుతాయి.

మానసిక ఆరోగ్యానికి..
యోగ ఎవరి మానసిక ఆరోగ్యానికైనా మేలే చేస్తుంది. ఎందుకంటే యోగ వ్యక్తి విశ్రాంత స్థితికి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఇది ఒక రకమైన మానసిక చికిత్సగా చెప్పవచ్చు. నిరంతర యోగ సాధన ఆందోళన, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం, మానసిక ఉద్వేగాలను నియంత్రితం చేసి, రోజంతా ఏకాగ్రతతో ఉండేందుకు సాయపడుతుంది.

తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌, మూడ్‌ స్వింగ్స్‌ వంటి వాటిని యోగ సాధన తగ్గించిన దాఖలాలున్నాయి. యోగ ద్వారా పిల్లలు కూడా లబ్ధి పొందవచ్చు. దేని మీదా దృష్టి ఎక్కువ సేపు నిలుపకుండా, హైపర్‌ యాక్టివ్‌గా ఉండే పిల్లలు యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా విశ్రాంతి స్థితితో లబ్ధి పొందుతారు. యోగ కూడా ఒక రకమైన ధ్యానమే కనుక మనకు మానసిక ప్రశాంతత చేకూరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చిత్రహింస, తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిన బాధితులకు స్వస్థత చేకూర్చేందుకు యోగను ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తరచుగా తలనొప్పి వచ్చే వారు జేబులో మాత్రలు పెట్టుకొని తిరిగే అవసరం లేకుండా చేస్తుంది యోగ. ఉద్రేకంతో వచ్చే తలనొప్పు లు, మైగ్రేన్ల బారి నుంచి కూడా బయటపడవ చ్చు. ఎందుకంటే ప్రాణాయామం, యోగాసనాలు మన మెదడుకు రక్తం, ప్రాణవాయువు సరిగా సరఫరా అయ్యేందుకు దోహదం చేసే తలనొప్పి ప్రారంభం కాకుండానే నివారిస్తుంది.

రోజువారీ యోగ సాధన మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగేందుకు దోహదం చేస్తుంది. దీనితో వ్యాధి నిరోధక శక్తి పెరగడ మే కాక ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెం టనే స్వస్థత చేకూరేందుకు దోహదం చేస్తుంది.

బరువు తగ్గించుకోవడానికి యోగ ఎంతో ఉత్తమ మార్గం. జీవితాంతం ఆరోగ్యవంతమైన బరువును కొనసాగించడానికి కూడా సాయపడుతుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు పవర్‌యోగాను ఆశ్రయించవచ్చు. ఇది చాలా చురుకుగా చేసేది కనుక కాలరీలు త్వరగా ఖర్చయ్యి తొందరగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

యోగాతో లాభాలు...
నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔ షధం. రోజూ యోగ చేస్తే అది మంచి గాఢమైన నిద్రలోకి జారుకునేందుకు సాయపడుతుంది.

అలసటను దూరం చేసి రోజంతా ఉల్లాసం గా, ఉత్సాహంగా ఉండేందుకు సాయపడుతుంది.
నీరసం, అలసట, స్తబ్దత వంటి లక్షణాలకు యోగ మంచి చికిత్స.

యోగ -ఆహారం...
కేవలం యోగాసనాలు వేయడం వల్లనే మనకు లబ్ధి చేకూరదు. యోగ ఒక జీవన విధానం. దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో యోగ సాత్వికాహారాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే పూర్తి స్థాయి శాకాహారాన్ని యోగ సూచిస్తుంది. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల శాంతి, ప్రేమ, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయని తెలుపుతుంది.

తెల్లవారు జామున ఉత్తమం...
యోగాసనాలు ఏ సమయంలో అయినా వేయవచ్చా? అసలు ఏ సమయంలో వేస్తే మంచిది? చాలా మందికి వచ్చే సందేహమిది. వాస్తవం చెప్పాలంటే యోగాసనాలు వేయడానికి ఉత్తమ సమయం తెల్లవారు జామే. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా లేలేత భానుడి కిరణాలు మేనుని తాకే సమయానికి ఆసనాలు వేస్తే మన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేనట్టే. భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు అసలు ఇతర ఆసనాల జోలికీ పోకుండా సూర్యనమస్కారాలను ఒకటి రెండు రౌండ్లు వేసినా సరిపోతుంది. ఇతర సమయాల్లో వేసినప్పటికీ తెల్లవారు జామున వేస్తే కలిగే అనుభవమే వేరు. అయితే ఏదో తమకు తీరిన సమయంలో ఆసనాలు వేయాలనుకునేవారు ఆహారం తీసుకున్న నాలుగు గంటల వరకూ వేయకుండా ఉండడం మంచిదని గుర్తుపెట్టుకోవాలి.

యోగా పై పరిశోధనలు
yogaయోగ వల్ల ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రచారం జరిగాక శాస్తవ్రేత్తలు దీనిపై దృష్టి కేంద్రీకరించారు. యోగాసనాలు- వాటివల్ల చేకూరే లబ్ధిపై అధ్యయనాలు, పరిశోధనలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, ఫిజియాలజీ శాఖ యోగ శిక్షణానంతరం ఆస్తమా పేషెంట్లపై ప్రభావం గురించి 1996లో చేసిన పరిశోధనలో బ్రాంకియల్‌ ఆస్తమా నుంచి స్వస్థత పొందేందుకు యోగ ఎంతో ఉపయుక్తమని తేల్చారు. తొమ్మిది మంది బ్రాంకియల్‌ ఆస్తమా పేషెంట్లను వారంపాటు యోగా క్యాంప్‌లో ఉంచి జరిపిన పరిశోధన చేసి సమగ్రమైన యోగ జీవన విధాన కార్యక్రమం ఒక్క వారం రోజుల్లోనే బ్రాంకియల్‌ ఆస్తమా రోగులపై ప్రభావం చూపిందని పరిశోధకులు పేర్కొన్నారు.

అలాగే యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన గ్రూప్‌ ఫర్‌ మైండ్‌-బాడీ డైనమిక్స్‌ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిసార్డర్‌కు చికిత్సగా యోగ ఎంత వరకూ ఉపయుక్తమో చేసిన పరిశోధన ఫలితాలను 1996 మార్చి నెల ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్‌ ఒసిడి చికిత్సలో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని కనుగొన్నట్టు పేర్కొంది. కేవలం ఒసిడి రోగులకే కాక సాధారణంగా ఒత్తిడి, ఆందోళనకు లోనయ్యేవారు కూడా ఈ టెక్నికల్‌ వల్ల లాభపడ్డారని పేర్కొంది. 2008లో యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా నొప్పికి సంబంధించి యోగాసనాలు వేసే వారు, వేయని వారిపై అధ్యయనం జరిపింది. యోగ సాధన చేసేవారు నొప్పిని ఎక్కువగా భరించగలిగారని ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ద్వారా పరీక్షించి మరీ వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో యుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన సైనికులకు వాషింగ్టన్‌ డిసిలోని వాల్టర్‌ రీడ్‌ ఆర్మీ మెడికల్‌ సెంటర్‌లోని పరిశోధకులు ప్రాణాయామానికి సంబంధించిన పూర్తి విశ్రాంతినిచ్చే టెక్నిక్‌లను నేర్పుతున్నారుట. వాల్టర్‌ రీడ్‌లో సైకాలజిస్ట్‌ అయిన డా క్రిస్టీ గొరే మాట్లాడుతూ, సంప్రదాయక సైకో థెరపీకన్నా ఈ యోగా ఆధారిత చికిత్సలను సైనికులు ఎంచుకునేందుకు ముందుకు వస్తారని సైన్యం ఆశిస్తున్నట్టు పేర్కొనడం యోగ, ప్రాణాయామాల ప్రాముఖ్యతను, ప్రాచుర్యాన్ని వెల్లడిస్తోంది.

యోగా అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఒక జాతీయ సర్వే ప్రకారం అమెరికాలోని వయోజనులలో 7.5 శాతం మంది యోగా కనీసం ఒక్కసారైనా ప్రయత్నించారు. మరో నాలుగు శాతం మంది అంతకు ముందు సంవత్సరం యోగ సాధన చేసి ఉన్నారుట. ఇక సెలబ్రిటీలు అయితే యోగ ఫ్యాన్స్‌ అయిపోయారు. మరికొంత కాలం పోతే యోగ మాదే అని అమెరికా పేటెంట్‌ తీసుకునే ప్రమాదమూ లేకపోలేదు. గతంలో వేప విషయంలో రగడ జరిగిన విషయం తెలిసిందే.

యోగ ఒక సమగ్ర జీవన విధానం. యోగ సాధన అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు. ఇందులో అనేక ప్రక్రియలు ఉంటాయి. ప్రాణాయామంతో పాటుగా అనేక భౌతిక పద్ధతుల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి దోహదం చే స్తాయి. కనుక ‘యోగ’ అంటే ఆసనాలతో సరిపెట్టుకోవడం కాదు. ఇది వ్యక్తి జీవితంలో సంభవించే విప్లవం. అప్పటివరకూ స్తబ్దుగా, నిర్లక్ష్యంగా జీవించిన వారు క్రమశిక్షణను పాటించడం. అస్తవ్యస్తంగా ఉన్న జీవన విధానాన్ని సరి చేసుకోవడం. నిద్ర లేచే సమ యం దగ్గర నుంచి నిద్రించే వరకూ, ఆహారపు అలవాట్లతో సహా అన్ని విషయాలలోనూ ఒక సమతుల్యాన్ని సాధించడం.

తీసుకోవలసిన ఆహారం
అన్ని రకాల తాజా పళ్ళు తీసుకోవడం మంచిది.

- ఉల్లి, వెల్లుల్లి మినహా అన్ని కాయగూరలు

- బియ్యం, గోధుమ, ఓట్లు వంటి సమీకృత ఆహారం

- చిక్కుడు, గోరు చిక్కుడు, పెసరపప్పు వంటివి మితంగా

- బాదం, కొబ్బరి, నువ్వులు, అక్రూట్లు వంటివి మితంగా తీసుకోవాలి.

- వెన్న, నెయ్యి, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వు నూనె, ఆలివ్‌ ఆయిల్‌ వంటివి (మితంగా).

- పాలు, పెరుగు, వెన్న

- తేనె, బెల్లం వంటి సహజసిద్ధ పదార్ధాలు

- అల్లం, దాల్చిన చెక్క, ఏలకులు, కొత్తిమీర, పసుపు, తులసి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వంటి దినుసులు

- హెర్బల్‌ టీలు, తాజా పళ్ళ రసాలు, మంచినీరు.

నివారించవలసిన ఆహారం

- మాంసం, చేపలు, గుడ్లు

- జంక్‌ఫుడ్స్‌, కాన్డ్‌ ఫుడ్స్‌

- నిల్వ ఉంచిన వెన్న వంటి పాల పదార్ధాలు

- మసాలాతో కూడిన ఆహారం

- చక్కెర, మైదా వంటి పదార్ధాలు

- కృత్రిమ స్వీటెనర్లు

- చద్ది ఆహారాన్ని తిరిగి వేడి చేసి తినడం

- మద్యం, పొగాకు వంటి వాటికి దూరం

- కూల్‌డ్రింకులు

- మైక్రవేవ్‌లో వండిన ఆహారం

- జన్యుపరమైన మార్పిడి చేసిన ఆహారం.

- గందరగోళ వాతావరణంలో తినడం లేదా హడావిడిగా తినడాన్ని ముగించడం.

యోగాపై సెలబ్రిటీల మోజు
-భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు యోగపై మోజు పెంచుకుంటున్నారు. బాలీవుడ్‌ నటులే కాదు హాలీవుడ్‌ నటులు, ప్రముఖ పాప్‌ గాయకులు కూడా యోగ చేస్తున్న వారిలో ఉన్నారు. నిన్నటి తరం నటి రేఖ మొదలుకొని నేటి సోనాక్షి వరకూ యోగ చేస్తున్నవారిలో ఉండగా అమెరికాకు చెందిన హాలీవుడ్‌ తారలు మెగ్‌రెయాన్‌, జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ వంటి తారలు అక్కడి యువతకు యోగ ఐకాన్లుగా మారారు. ప్రముఖ గాయకుడు రిక్కీ మార్టిన్‌, గాయని మడోన్నా కూడా యోగాను ఆశ్రయించారు. వీరంతా కూడా తాము నిత్యం యోగాను చేస్తుండడం వల్లే ఇన్ని విజయాలు సాధించగలిగామని చెప్పడం విశేషం. తాను యోగా చేయడం ప్రారంభించి ఐదేళ్ళు అయిందని, అది తను మరింత ప్రశాంతంగా ఉండేందుకు దోహదం చేసి జీవితాన్నే మార్చి వేసిం దని మెగ్‌రెయాన్‌ వంటి తార పేర్కొనడం విశేషమే మరి. తాను యోగ నేర్చుకుంటున్నానని, ఇది మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో దోహదం చేస్తుందని లాటిన్‌ పాప్‌ గాయకుడు రిక్కీ మార్టిన్‌ అంటున్నాడు. అది మన హృదయాన్ని, మేదడును అనుసంధానం చేసి జీవితంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నివారిస్తుందని పేర్కొన్నాడు. వ్యక్తి నిరాడంబరంగా ఉండటాన్ని యోగ నేర్పుతుందని రిక్కీ తన అనుభవంగా చెప్తున్నాడు. ఇక మన తారలు శిల్పా శెట్టి, అనుష్క వంటి వారు యోగ సాధన కారణంగా ఇనుమడించిన అందచందాలతో తమ రంగాలలో ఎలా దూసుకుపోతున్నారో తెలిసిందే.

=============================================

Visit my website - > Dr.Seshagirirao.com/