Monday, March 7, 2011

పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌,periferal vascular disease



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-గుండెకు, మెదడుకు వెలుపల ఉండే రక్తనా ళాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు దానిని పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌ అని వ్యవహరిస్తారు. దీనిలో ప్రధానంగా జీర్ణకోశం, మూత్రపిండాలు, కాళ్లు, చేతులకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు కుంచించుకుపోవడం జరు గుతుంది.
రక్త సరఫరాకు చెందిన రుగ్మతల్లో ప్రధాన మైన రకాలు రెండు ఉన్నాయి. అవి - ఫంక్ష నల్‌, ఆర్గానిక్‌ రకాలు.

ఫంక్షనల్‌
ఫంక్షనల్‌ పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌లో వ్యాధి సోకడానికి ఎలాంటి స్పష్టమైన కార ణమూ కనిపించదు. రక్తనాళాల నిర్మాణంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోవు.
ఈవ్యాధి సాధారణంగా తాత్కాలికంగా సోకు తుంటుంది. ముఖ్యంగా బిగుసుకుపోయినట్లు ఉండే నొప్పి (స్పాజమ్‌) వల్ల ఈ వ్యాధి వచ్చి పోతుంటుంది. రేనాడ్స్‌ వ్యాధిని దీనికి ఉదాహ రణగా పేర్కొనచ్చు.
శీతల వాతావరణం, భావోద్రేకాల ఒత్తిడి, ధూమపానం, వైబ్రేషన్‌తో కూడిన యంత్రాలపై పని చేయడం మొదలైన అంశాలు ఈ వ్యాధికి ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి.

ఆర్గానిక్‌
ఈ రకమైన పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీ జ్‌లో రక్తనాళాల్లో మార్పులు చోటు చేసు కుంటాయి.
ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడం, కణజాలం నశిం చడంవంటి మార్పులు కలుగుతాయి. దీనికి పెరి ఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ ఒక ఉదాహరణ. ధమ నుల్లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల లోపలి భాగం సన్నగా మారి రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. తద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ అంటే?

పెరిఫెరల్‌ ఆర్టరీ వ్యాధి కూడా గుండె కండ రాలకు రక్తాన్ని సరఫరా చేసే కరొనరీ ఆర్టరీలకు సోకే వ్యాధి వంటిదే. ఈ వ్యాధిలో ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది.
ముఖ్యంగా మూత్రపిండాలు, జీర్ణకోశం, చేతులు, కాళ్లు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఈ సమస్య తలెత్తుతుంది.
పెరిఫెరల్‌ ఆర్టరీ వ్యాధి సోకిన తొలిదశలో నడుస్తున్న సమయంలో కాళ్లలో, నడుము భాగంలో నొప్పి ఉంటుంది. ఇటువంటి నొప్పి విశ్రాంతి దశలో తగ్గు తుంది. ఇటువంటి స్థితిని వైద్యపరిభాషలో ఇంటర్‌ మిటెంట్‌ క్లాడికేషన్‌ అంటారు.

ఈ వ్యాధికి గురైన వ్యక్తుల్లో గుండెకు, మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఈ స్థితి ఏర్పడినప్పుడు రోగి గుండెజబ్బుతో మరణిం చవచ్చు. లేదా పక్షవాతానికి గురి కావచ్చు.

ఎలా గుర్తిస్తారు?
రోగి వ్యాధికి సంబంధించిన ఇతివృత్తాన్ని తెలుసుకోవడం, రోగిని శారీరకంగా పరీక్షించడం ఈ వ్యాధిని గుర్తించడానికి మొదటి మెట్టు. తరువాత రోగికి అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే యాంజి యోగ్రఫీ, ఎం.ఆర్‌.ఎ. వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
పెరిఫెరల్‌ ఆర్టరీ వ్యాధికి గురైన అనేకమంది రోగులకు వారి జీవన విధానాల్లో మార్పులు తీసుకు రావడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. అలాగే జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధి సోకే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు.

- ధూమపానం చేసే అలవాటు ఉంటే వెంటనే దానిని త్యజించాలి. ఎందు కంటే ధూమపానం అలవాటు ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
- మధుమేహాన్ని నియంత్రణలో ఉంచు కోవాలి.
- అధిక రక్త పోటును నియంత్రిం చుకోవాలి.
- శారీరకంగా చురు కుగా ఉండాలి.
- కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదా ర్థాలను, కొలెస్టరాల్‌ తక్కువగా ఉండే ఆహా రాన్ని తీసుకోవాలి.

పెరిఫెరల్‌ ఆర్టరీ వ్యాధి చికిత్సకు కొన్ని ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నడకను మెరుగు పరచడానికి కొన్ని మందులను ఇవ్వవలసి ఉంటుంది. అలాగే యాంటిప్లేట్‌లెట్‌ ఏజెం ట్స్‌ను, కొలెస్టరాల్‌ను తగ్గించడానికి మందు లను ఇవ్వవలసి ఉంటుంది.
కొద్దిమంది రోగుల్లో మాత్రం వారి జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యమ వుతుంది.
కొన్ని కేసుల్లో యాంజియోప్లాస్టీ, శస్త్ర చికిత్స వంటివి అవసరమవుతాయి.

యాంజియోప్లాస్టీ
యాంజియోప్లాస్టీ అనేది శస్త్ర చికిత్సతో అవ సరం లేకుండా రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని తొలగించి వెడల్పు చేసే ప్రక్రియ.
ఈ ప్రక్రియలో ఒక సన్నటి గొట్టం (దీనిని కేథటర్‌ అంటారు) మొదలు భాగానికి ఒక బెలూన్‌ను అమర్చి రక్తనాళంలోకి ప్రవేశపెడ తారు. తరువాత అడ్డంకి కారణంగా సన్నబడిన భాగంలో ఆ బెలూన్‌ ఉబ్బేలా చేస్తారు.
తద్వారా రక్తనాళం లోపలి గోడలకు అతు క్కున్న కొవ్వుపై ఒత్తిడి కలిగించి, అది అణగి పోయేలా చేసి, సన్నబడిన రక్తనాళాన్ని వెడల్పు చేస్తారు.

ఫలితంగా రక్త సరఫరా మెరుగవు తుంది. ఆ తరువాత నెమ్మదిగా బెలూన్‌ను బైటికి తీసివేస్తారు.
కొన్నిసార్లు ఇలా కొవ్వుతో అడ్డంకి ఏర్పడిన భాగంలో ఒక సన్నటి లోహపు గొట్టాన్ని (స్టెంట్‌)ను అమరుస్తారు. ఈ గొట్టం ద్వారా రక్తం సాఫీగా సరఫరా అవుతుంది.
రక్తనాళంలో ఏర్పడిన ఆటంకం కారణంగా రక్తనాళంలో అధిక భాగం సన్నబడి ఉంటే, అప్పుడు శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

శరీరంలోని ఇతర భాగాలనుంచి మరొక రక్తనాళాన్ని తీసి, అడ్డంకి ఏర్పడిన రక్తనాళంలో అడ్డంకి ఏర్పడిన చోట పైన, కింద అమరుస్తూ చికిత్స చేస్తారు.
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.