Wednesday, April 6, 2011

మూర్చ (ఫిట్స్ )వ్యాధి , Epilepsy(Fits)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది. మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూ తెలుసుకోలేరు.

అపుడప్పుడు కొందరు క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పిపోతుంటారు. వారిచేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం పక్కవారు చేస్తుంటారు. కొందరికి ఈ సమయంలో నోట్లోనుంచి నురగ రావడం కూడా కనిపిస్తుంటుంది. వీరిని మూర్ఛవ్యాధి గ్రస్తులుగా మనం గుర్తిస్తాం. ఈ మూర్ఛనే ఫిట్స్‌గా వైద్యులు చెప్తారు. ఆయుర్వేద శాస్త్రం మాత్రం ఈ ఫిట్స్‌ను గాని స్పృహను కోల్పోయి పడిపోవడం లాంటి లక్షణాలను అపస్మారకం అంటోంది. స్మారకం అంటే జ్ఞాపకశక్తి, అప అంటే నాశనం కావడం అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడమే నంటారు.

  • వ్యాధి లక్షణాలు

మూర్చ పోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుండి చొంగ కారుట ఒక్కోసారి నాలుక కరుచుకొనుట జరుగును. ఆ తర్వాత కొంత సేపటికి మరల మామూలు స్థితికి వస్తారు.


  • మూర్ఛ వ్యాధి ఎవరికి వస్తుంది...?
ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు. 0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్‌ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికి ఉందన్న మాట.

  • మూర్ఛ వ్యాధిని కలిగించేది ఏది...?
మెదడులో విద్యుత్‌ కార్యకలాపాల ను ప్రారంభింపచేసే అంశాలకు, దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యం ఉంది. విద్యుత్‌ కా ర్యకలాపాలను వ్యాపింపచేయడాన్ని పరిమితం చేసే వ్యవస్థలు కూడా ఉంటాయి. మూర్ఛ వచ్చిన సమయంలో ఈ పరిమితులు విచ్చిన్నమవుతాయి. దీంతో పాటు విపరీతమైన విద్యుత్‌ విడుదలలు సంభవించవచ్చు. ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛ రెండు సార్లు వచ్చి నప్పుడు దానిని మూర్ఛ వ్యాధి అని అంటారు.

  • వ్యాధి రావడానికి కారణాలు...
జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదుడలో లోపాలు లేదా మెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్‌), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితో మాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతు క్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.

అసలు ఈ మూర్ఛ ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది అంటే మెదడు, కిడ్నీ, కాలేయపు వ్యాధుల వల్ల ఈ మూర్ఛరోగం రావచ్చు. ఎవరికీ అంటే దీనికి స్ర్తి పురుష భేదం కాని వయస్సు కాని అడ్డంకి కాదు. ఎవరైనా ఈ వ్యాధి బారినపడవచ్చు. సాధారణంగా ఆల్కహాలు తీసుకొనే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక రక్తంలో కాల్షియం, సోడియం, గ్లూకోజ్, ఆక్సిజన్ మోతాదు తగ్గినప్పుడూ ఈ ఫిట్స్ కనపడుతుంది. అంతేకాదు డిప్రెషన్‌కు వాడే మందులకూ, మెట్రొనిడజోల్‌కూ లోకల్ ఎనస్థిటిక్ మందులకూ కూడా ఈ ఫిట్స్ కలిగించే గుణాలున్నాయని తేలింది.

మహిళల్లో హార్మోన్ల తేడావల్ల కూడా ఈ ఫిట్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల గర్భధారణలోనూ, బహిస్టు సమయాల్లోనూ, సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నపుడూ ఈ ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మిరుమిట్లు గొలిపే కాంతిని చూసినా, వెల్డింగ్ సమయంలో జనించే కాంతిని చూసినపుడూ, మధ్యాహ్నం పూట మిలమిలా మెరిసే నీళ్లను చూసినా కూడా ఫిట్స్ మొదలవుతాయని వైద్యులు చెప్తారు.

చికిత్సలను కూడా వైద్యుని పర్యవేక్షణలోనే చేయాలి. మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులను సంప్రదించి తెలుసుకొని దాని నివారణకు ప్రయత్నించాలి.

మూర్చవ్యాధి సోకితో గతంలో వ్యాధి సోకిన వారికి మెడలో ఇనుప వస్తువును వేసేవారని, చేతిలో ఇనుప తాళాలు పెట్టడం, నోటిలో వస్తువులు దూర్చడం వంటి పనులు చేసేవారన్నారు. అయితే రానురాను పెరుగుతున్న ఆధునిక వైద్య విధానాల వలన మూర్చ వ్యాధి నివారణకు మార్గం సుగమం అయిందన్నారు. అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కొరవడిందని, ప్రజల్లో మూర్చ వ్యాధిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మూర్చ వ్యాధి వంశపారపర్యంగా వస్తుందని, బ్రెయిన్‌లో ట్యూమర్లు ఏర్పడి వచ్చే అవకాశాలున్నాయని, ఆహారం ద్వారా వచ్చే క్రిముల వలన ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు మూర్చలో ఉన్నట్లైతే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.


  • మూర్ఛలో రకాలు

1. జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛ


  • ఇది అనారోగ్యంతో బాధపడుతూ వుండే పిల్లలలో వస్తుంది – అంటే చెవిలో వస్తూవుండే అంటువ్యాధి (ఇన్ఫెక్షన్), జలుబు లేక ఆటలమ్మ, మశూచి వంటి వ్యాధి జ్వరంతో పాటు ఉన్నప్పుడు.

  • * ఈ జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛ వ్యాధి చిన్న పిల్లలలో కనిపిస్తూ వుండే సాధారణ రకమైన మూర్ఛ.
  • * బాల్యంలో 2 నుండి 5 శాతం పిల్లలు ఏదో ఒక టైములో ఈ జ్వరంతో ఉండే మూర్ఛ వ్యాధి బారిన పడిన వారే.
  • * కొంతమంది పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఈ మూర్ఛ అనేది ఎందుకు వస్తుందో తెలియని విషయం. అయితే, అనేక ప్రమాదకరమైన ఇతర అంశాలను కనిపెట్టడం జరిగింది.
  • o ఈ జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛను అనుభవించిన బంధువులతోనూ, ముఖ్యంగా సోదరులతోనూ, సోదరిలతోనూ వుండే పిల్లలు ఇదే మాదిరి పరిస్ధితికి గురయ్యే అవకాశం ఉంది.
  • o పెరుగదల ఆలస్యంగా వుండే పిల్లలలో లేక 28 రోజులు కంటే ఎక్కువగా నియో నాటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గడిపి ఉన్నట్లయితే, ఇటువంటి జ్వరంతో కూడుకుని ఉన్న మూర్ఛకు గురయ్యే అవకాశం మెండుగా ఉంటుంది.
  • o ఈ జ్వరంతో వాటు వచ్చే మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలలో 4 గురిలో ఒకరికి మరోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది, అదికూడా, మామూలుగా అయితే, ఒక సంవత్సరం లోపునే.
  • o గతంలో, ఇంతకుముందు ఈ వ్యాధికి గురైన పిల్లలు రెండోసారి కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగానే వుంటుంది.


2. నియో నెటల్ మూర్ఛలు

మూర్ఛ, శిశువు పుట్టిన 28 రోజుల లోపునే సంభవించవచ్చును. బిడ్డ పుట్టిన వెంటనే ఇది ఎక్కువగా రావచ్చును. ఇది ఇంకా అనేక కారణాలు, పరిస్ధితుల వల్ల కూడా రావచ్చును. అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ వ్యాధి ఉందా అన్న విషయాన్ని కనిపెట్టడం కష్టమైనది, ఎందుకంటే వారు వెంటనే ఈ రోగ లక్షణాలతో వణికిపోతూ, ఊగిపోతూ వుండడాన్ని ప్రదర్శించరు కాబట్టి. దీనికి బదులుగా వీరు (బిడ్డలు) కళ్లను ఇటు, అటు తిప్పుతూ, నలు దిక్కులపైపు దృష్టిని సారిస్తూ వుండడం జరుగుతుంది. పెదాలను కొరుక్కోవడం మరియు అసంబధ్దంగా, సక్రమంగా లేని విధంగా ఊపిరిని పీలుస్తూ వుండడం జరుగుతుంది.


3. పాక్షిక మూర్ఛలు

మెదడులో ఒక భాగం దీనికి గురికావచ్చు. అందుచేత శరీరంలో కేవలం ఒక భాగం మాత్రమే దీని ప్రభావానికి గురవుతుంది.

* సూక్ష్మ, పాక్షిక మూర్ఛలు (జాక్సోనియన్) ఒక మౌటారు (కదలికతో వుండే) పరికరం వంటి దానిని కలిగివుంటాయి, శరీరంలో ఏదో ఒక భాగంలో. ఈ మాదిరి మూర్ఛకు లోనైన పిల్లలు మెళుకువగా, చైతన్యవంతంగా, అసాధారణమైన కదలికలతో వుంటారు. అయితే ఈ వ్యాధి ఇంకా వేగంగా వ్యాప్తి పొందుతూ వుండడంతో ఇది శరీరంలో ఇతర భాగాలపైపు ‘దండయాత్ర’ ను చేస్తుంది,
* క్లిష్టమైన, పాక్షిక మూర్ఛలు ఇదే మాదిరిగా ఉంటాయి, అయితే పిల్లలకు వారికేమి జరుగుతోందో అన్నది తెలియదు. తరచుగా ఈ మాదిరి మూర్ఛకు గురవుతున్న పిల్లలు ఒక చేష్టను పదే పదే చేస్తూ వుంటారు – అంటే ఆ మూర్ఛ ఉన్నంతసేపూ చప్పట్లు కొడుతూ వుండడం, ఇటువంటి చర్యలు, చేష్టలు గురించి వారికేమీ జ్ఞాపకం ఉండదు. మూర్ఛ ఆగిపోయి, తొలగిపోయిన వెంటనే పిల్లలు తరచుగా భ్రాంతిపడే స్ధితిలోనూ, అస్తవ్యస్తంగానూ ఉన్నట్లు కనబడతారు, .


4. సాధారణీకరించబడిన మూర్ఛలు

ఇది మెదడులో పెద్ద భాగాన్ని లోబరచుకుంటుంది. ఇటువంటివి రెండు భాగాలుగా విభజించబడ్డాయిః ఊగిపోతూ, వణికిపోతున్నట్లుండి (కండరాలు బగుసుకుపోతూ) విరీతంగా ఊగిపోతూ, కుదుపుతో వుండడం మరో రకం కంపించిపోకుండా, వణుకు రానటువంటివి, ఉప-విభజన చేయబడిన వివిధ రకాలతో వుండేవి.

* వణుకుతో, విపరీతంగా ఊగిపోతూ వస్తూవుండే మూర్ఛలు అదుపుచేయలేని కండరాల ఊపుతో కొద్ది నిముషాలసేపు అలాగే కొనసాగుతూ వుండేవి – మామూలుగా 5 నిముషాలకంటే తక్కువగా – మగతగా, నిద్రావస్ధలోకి చేరుకున్నట్లుగా వుంటూ వుండే కొద్ది పాటి వ్యవధితో పోస్టిక్టల్ పీరియడ్ అనబడే స్ధితిలో వుంటున్నట్లు మనం గమనించవచ్చు. తిరిగి బిడ్డ తన మామూలు స్ధితికి చేరుకోవాలి - ఒత్తిడి, భారం, అలసట, ఆయాసం అన్నవాటిని తప్పిస్తే – 15 నిముషాల వ్యవధిలో తరచుగా బిడ్డ పల్చగా వుండే మల, మూత్ర విసర్జన కూడా చేయవచ్చు. పిల్లలు కూడా ఇటువంటి సంఘటనను తరువాత మరచిపోవడం అన్నది కూడా సాధారణమైన విషయమే. ఒకోసారి ఈ మాదిరిగా విపరీతంగా ఊగిపోవడం, వణికిపోతూ వుండడం వల్ల గాయాలు కూడా కావచ్చు – దీవి ప్రభావంతో నాలుక కరుచుకోవడం నుండి ఎముక విగిగి పోవడం వరకూ జరుగవచ్చు.

* గొంతుక బిగుసుకుపోయనట్లుండడంతో వచ్చే మూర్ఛలు కొంత సేపు నరాలు బిగుసుకుపోవడం మరియు గట్టిగా, కఠినంగా మారిపోవడానికి దారితీస్తాయి, గొంతుకలో నరాలు బిగుసుకుపోవడం, విచ్చుకోవడం జరుగుతూ, ఒక లయబధ్దంగా నరాల వణుకుతో వుండడం జరుగుతుంది.

* శిశుసంబంధిత కండరాలు బిగుసుకుపోవడం, సంకోచించుకుపోవడం వంటివి సామాన్యంగా 18 నెలల లోపు పిల్లలకు వస్తూ వుంటాయి. ఇవి తరచుగా మానసిక ఎదుగుదల లేకపోవడం అన్న అంశానికి సంబంధించి ఒక్కసారిగా నరాలు బిగుసుకుపోతూ, పిల్లలు సాగే స్ధితికి తీసుకెళుతూ ఉంటాయి. నిద్రలేచిన వెంటనే తరచుగా ఈ మాదిరి ఇబ్బందికరమైన నరాలు బిగుసుకుపోవడం అన్నది జరుగుతుంది.

* ఆవేదన, ఉద్వేగంతో కూడుకుని వుండే మూర్ఛలు. ఇవి పెటిట్ మల్ సీజర్స్ అని కూడా పిలువబడతాయి. ఇది బహుకొద్దిసేపు పాటు సంభవించే సంఘటన వంటిది. బిడ్డలు కంటి రెప్పలార్చకుండా తేరి,పార చూడడం, లేక కళ్లను మిటకరిస్తూ వుండడం చేస్తారు, వారి చుట్టుపక్కల ఏమి జరుగుతోందో ఏ మాత్రం తెలియకుండా. ఈ సంఘటనలు కేవలం కొద్ది సెకన్లు కంటే ఎక్కువసేపు ఉండవు – ఒక్క సారిగా మొదలై, ఒక్క సారిగా, అర్ధాంతరంగా ఆగిపోతూ. అయితే, ఈ సంఘటనలను పిల్లలు ఏమాత్రం జ్ఞాపకం పెట్టుకోలేరు. ఇటువంటి సంఘటనలు బిడ్డను గమనించి పగటికలలను కంటున్నట్లున్నదని ఉపాధ్యాయుడు నివేదించినప్పుడు మాత్రమే గమనించబడతాయి, ఒకవేళ బిడ్డ చదువుతున్నప్పుడు అతని/ఆమె చదివే స్ధానాన్ని తప్పిపోయనపుడు లేక ఇవ్వబడిన పని (ఎసైన్ మెంట్) ని చేయడంలో అనుసరించవలసిన సూచనలను ఏమరుపాటుగా వదిలివేయడమో జరిగినప్పుడు గుర్తించవచ్చు.


5. స్ధిరంగా కొనసాగుతూ వుండే మూర్చ, మధ్యలో విరామమనేది లేకుండా, మనిషి తెలివిలోకి రాకుండా, ఆగకుండా వస్తూ వుండేది--ఈ మాదిరి మూర్ఛ ఎక్కువ సేపు – అంటే 30 నిముషాలకంటే ఎక్కువగా వుండేది లేక వరసగా, మరల మరల వస్తూవుండేది, మథ్యలో మామూలు స్ధితికి తిరిగి రావడానికి వీలు లేనంతగా. 2 ఏళ్ల కంటే తక్కువ వయుసున్న పిల్లలలో ఆతిసాధారణంగా సంభవిస్తూ వుంటుంది. ఇందులో అధికభాగం పిల్లలు సాధారణీకరణ చేయబడిన (జనరలైజ్డ్) గొంతుకు బిగుసుకుపోవడం, పిడిచి కట్టుకుపోయి, నరాలు బిగుసుకుపోవడంతో ఉండే మూర్ఛల బారినపడుతూ వుంటారు. ఈ విధంగా స్ధిరంగా, మధ్యలో ఏమాత్రం విరామావకాశం లేకుండా, ఆగకుండా వస్తూ వుండే మూర్ఛ చాలా తీవ్రమైనది, అపాయకరమైనది కూడా. చాలాసేపు దీర్ఘమైన మూర్ఛ రావచ్చనే అనుమానంతో ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి.

  • చికిత్సా సమయంలో ముందు జాగ్రత్తలు...
epilepsy వ్యాధి గురించి డాక్టర్‌కు సవివరంగా సమాచారాన్ని తెలియ జేయాలి. పుట్టుకతో గాయం, తలకు గాయం, నరాల వ్యవస్థ, కుటుంబ చరిత్ర గురించి సమాచారాన్ని అందజేయాలి. మూర్ఛ వ్యాధిగల వ్యక్తికి ఒక రకం కన్న ఎక్కువ మూర్చలు ఉండవచ్చు. మూర్ఛ వ్యాధి నియంత్రణకు, మూర్ఛలను గుర్తించడం, వైద్యపరమైన చికిత్సలు జరిపించడం ఎంతో ముఖ్యం. డాక్టర్‌ సలహా ప్రకారం మందులు తీసుకోవాలి. మందులను ఇంట్లో పెట్టుకొని నిర్దేశించిన మోతాదుల ప్రకారం వాటిని వాడాలి. ఏ బ్రాండ్‌ మందులు బాగా పనిచేస్తాయో అవే మందులను వాడడం మేలు. ఇతర బ్రాండ్ల మందులను వాడకూడదు. మూర్ఛలు వచ్చే సమయాన్ని, ఇతర పరిశీలనను ఒక డైరీలో ఎప్ప టికప్పుడు రాసుకోవాలి. కనీసం మూడు ఏళ్ల పాటు మూర్ఛలు రాకుండా ఉండాలంటే మందులను క్రమం తప్పకుండా తీసు కోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ ఆమోదంతో వ్యాధిగ్రస్తులు టివి చూడవచ్చు. క్రీడలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

  • చెయ్యకూడనివి...
మందుల వాడకంతో ఏర్పడే దుష్ర్పభావాలు లేదా మందును సహించకపోవడం వంటి వాటిని వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. ఉన్నట్లుండి మందులను ఆపివెయ్యకండి. ఇది ఒక నరాల సంబంధిత అత్యవసర పరిస్థితిని, స్టేటస్‌ ఎపిలెప్టికస్‌(నియంత్రించలేని మూర్ఛ)ని తొందరగా తీసుకురావచ్చు. ఏకకాలంలో ఏవైనా ఇతర కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు లేదా ఇతరత్రా మందులను నిలిపివేయడం గానీ తగ్గించడం గానీ చెయ్యకండి. ఇవి నియంత్రించలేని మూర్ఛవ్యాధికి సామాన్య కారణాలు. మరీ కాం తివంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనుల నుండి తప్పించుకోండి. మూర్ఛ వ్యాధి ఉంటే ప్రాణ హాని కలిగించని ఉద్యోగాల్లో చేరాలి. సరైన సురక్షిత ఉపకరణాలను ధరించండి. వాహనాలను నడపడం, స్విమ్మింగ్‌ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం లేదా ఎత్తయిన చోట్ల పని చేయడం మంచిది కాదు. భారీ యంత్రాలతో లేదా విద్యుత్‌ ఉపకర ణాలతో పనిచేసే సమయంలో మూర్ఛ వస్తే హాని కలిగించవచ్చు.

  • మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి...
మూర్ఛను ఆపే ప్రయత్నం చెయ్యకండి. మూర్ఛ వచ్చిన సమయంలో బల వంతంగా నోట్లోకి ఏమీ కుక్కకండి. తగినంత గాలి ఆడేవిధంగా చూడాలి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్కకు తిరగాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్న వారు వైద్యుని సలహా మేరకు అన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది.


  • నిజాలు :
- మనదేశంలో ప్రతి 100 మందిలో 10 మందికి మూర్ఛ వ్యాధి ఉంది.

-మూర్ఛవ్యాధి మరో వ్యక్తికి గాలి, ఆహారం, నీరు, స్పర్శ లేదా మరే మార్గం ద్వారా సంక్రమించదు.

- వ్యక్తిని నిర్భధించే ప్రయత్నం చేయ్యకండి. ఇది గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైన వస్తువులను వేటినీ దగ్గరలో ఉంచకండి. తలకింద ఏమైనా మెత్తని వస్తువుని ఉంచాలి.

- ఎవరిలోనైనా గానీ ఏ సమయంలోనైనా మూర్ఛ వ్యాధి వృద్ధి కాగల అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా మొదట పిల్లల్లోనూ, యువకులలో ఇది కనిపిస్తుంది.

- మూర్ఛ వ్యాధి ఒక శారీరక స్థితేగానీ ఒక మానసిక వ్యాధిగానీ లేదా లోపంగానీ కాదు. మూర్ఛ వ్యాధి అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

- మూర్ఛవ్యాధికి సంబంధించిన మూర్ఛ వచ్చినప్పుడు రోగులను అదుపులో పెట్టలేని విధంగా ప్రవర్తిస్తారు. అయితే ఇది మానవాతీత శక్తి కాదు. వారికి వైద్య చికిత్సలు జరిపించి అందరిలాగే చూడాలి.

- దురదృష్టవశాత్తు మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తులు, కుటుంబాల పట్ల చిన్నచూపు చూస్తారు. ఇది సరైనది కాదు.

--Dr.Naveen kumar (Neurologist) Aware Global hospital -Hyd.

మూర్చతగ్గిందని మందులు వాడడం ఆపొద్దు

ఒక్కసారే ఫిట్స్ వచ్చి, పరీక్షలో అన్ని నార్మల్‌గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో రిపోర్ట్‌నిబట్టి ఆసుపత్రిలో 1-2 రోజులు ఉండాల్సి రావచ్చు. సాధారణంగా ఒకసారి మందులు వాడడం మొదలుపెట్టిన తరువాత అవసరాన్నిబట్టి రెండునుంచి మూడు సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది. జన్యుపరమైన కారణాలవలన ఫిట్స్ వచ్చినప్పుడు జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు.

ప్రత్యేక పరిస్థితులు
ఫెబ్రెల్ సీజర్స్
6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లల్లో జ్వరంతోపాటు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇవి తరువాత ఆగిపోతాయి. అయితే వీరికి 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఫిట్స్ వచ్చినా, వరుసగా రెండు, మూడుసార్లు ఫిట్స్ వచ్చినా, ఫిట్స్ వచ్చాక తర్వాత కోలుకోకున్నా; ఇఇజి పరీక్షలో తేడా వచ్చినా వారికి ఫిట్స్ రాకుండా సిరప్ వాడవలసి ఉంటుంది. ఇవేవీ లేవన్నట్లయితే జ్వరం వచ్చిన మూడునాలుగు రోజులు ఫిట్స్ మందులు వాడితే సరిపోతుంది.

మెటబాలిక్ సీజర్స్
మన శరీరంలో వేరే కారణాలవలన, అంటే జ్వరం వలన, కిడ్నీ ప్రాబ్లం వలన, షుగరు, ఉప్పు శాతం తగ్గిపోవడంవలన వచ్చే ఫిట్స్ కొద్ది రోజులు ఫిట్స్ మందులు వాడాతే తగ్గిపోతాయి. వీరిలో రెండు వారాల నుండి మూడునెలల వరకు మందులు వాడితే సరిపోతుంది.

రిఫ్రాక్చరీ సీజర్స్
సాధారణంగా 80 శాతం మందిలో ఒకటి లేక రెండు మందులు పూర్తి డోసులో కనక వాడితే ఫిట్స్ అదుపులో ఉంటాయి. అయితే 20 శాతం మందిలో మందులు వాడినా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి వారిలో 3టి ఎంఆర్‌ఐ, వీడియో ఇసిజి, స్పెక్ట్, పిఇటి వంటి పరీక్షలు నిర్వహించి మెడలో ఏ భాగం నుంచి విద్యుత్తు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవాలి. ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించినట్లైతే ఫిట్స్ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆపరేషన్ చేసినాక కూడా కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుంది.

ఎపిలెప్సీ సిండ్రోమ్స్
కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన కారణాలవలన కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. వీరిలో కొంతమందిలో జీవితాంతం కూడా మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. మరికొంత మందిలో మందులు వాడినా కూడా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. వీరికి ఆపరేషన్ వలవ కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉండదు. వీరిలో కొంతమందికి కీటోజెనిక్ డైట్; వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి కొత్త పద్ధతుల ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు
1. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు ఆపినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2. రోజుకు 6-8 గంటలు నిద్ర ఉండేట్లు చూసుకోవాలి.
3. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం; చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఫిట్స్‌రాకుండా ఉపయోగపడతాయి. టీవీ వీక్షించడం కూడా తగ్గించాలి.
5. మత్తు మందులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
6. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
7. పదే పదే ఫిట్స్ వచ్చేవారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది.
8 ఎత్తయిన ప్రదేశాలకు, నీటిలోనికి, నిప్పు దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి.
8. పెళ్ళయిన అమ్మాయిలు ఫిట్స్ మందులతోపాటు, ఫోలేట్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాలి. దీనివలన వారికి కలిగే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి.
9. మూర్ఛవ్యాధి ఉన్న వారందరూ వారి పర్స్‌లో వారి జబ్బును గూర్చి తెలియజెప్పే కార్డుని పెట్టుకుంటే మంచిది.



  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

3 comments:

  1. మూర్ఛల గురించి చాలా సమాచారాన్ని అందించారు, ధన్యవాదములు. కానీ చాలా అచ్చుతప్పులు ఉన్నాయి. ఉదాహరణకు, విరీతంగా అని ఉంది, దీనిని విపరీతంగా అని వ్రాయాలి.

    ReplyDelete
  2. sir meeruchopinavi currect kani vatiki poorti treatment gurunchi chepite baguntadhi

    ReplyDelete
  3. Sir naaku nidralone morning timelo nidralo matrame gathe 4 years nunchi 2 years okaSaari ippati varaku 3 times fits vachindi tablets vaduthunna vachindi. mothanike rakunda vandalante emcheyyali sir please cheappandi sir.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.