Saturday, April 9, 2011

వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు, Hints for protection in exercise


  • ఫొటో--source : Eenadu vasundara
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు(Hints for protection in exercise)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-తరచూ జిమ్‌, యోగా కేంద్రాలకు వెళ్లేవారు.. సౌకర్యంగా ఉండటానికి వెంట కొన్ని వస్తువులు తీసుకెళ్లాలి. తరచూ వాటిని ఉపయోగిస్తే ఆనందం, ఆరోగ్యం.

షూ జత : జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా షూలు ధరించాలి. అవి అరికాళ్ల నొప్పులు, మంటను దూరం చేస్తాయి కొందరు మామూలు చెప్పులు వేసుకోవడం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క జిమ్‌కు మాత్రమే కాదు ఏ ఇతర వ్యాయామాలు చేసినా అవి తప్పనిసరి. ప్రత్యేకంగా వ్యాయామానికి అయితే నాణ్యమైనవి, సౌకర్యవంతంగా ఉండేలా ఎంచుకోవాలి. కొన్ని రకాల సాధనాలు చేస్తున్నప్పుడు పాదాల మీద ఒత్తిడి పడుతుంది. అలాంటప్పుడు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందే!

సాక్సులు : పాదాలు కోమలత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే సాక్సులు తప్పనిసరిగా ధరించాలి. అయితే చెమటతో ఇబ్బంది రాకుండా వాటిని ధరించే ముందు పాదాలకు యాంటీబ్యాక్టీరియల్‌ పౌడర్‌ రాసుకొంటే సమస్య ఉండదు. అలానే చేతులకూ గ్లవుజులు తొడుక్కోవాలి.

చేతికి స్ట్రాప్స్‌ : వ్యాయామ సాధనలో ముఖ్యమైంది వెయిట్‌ లిఫ్టింగ్‌. బరువైన డంబెల్స్‌ పట్టుకొన్నప్పుడు చేతులు మృదుత్వాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బరువుకు కందిపోతాయి కూడా. అందుకే క్రీడాకారుల మాదిరి స్ట్రాప్స్‌ ధరించాలి. వాటిని జిమ్‌కు తీసుకెళ్లే బ్యాగులో పెట్టుకొంటే ఇక మర్చిపోవడం అనేదే ఉండదు.

చాప : యోగాసాధన చేయడానికి చిన్నచాపలు అందుబాటులో ఉంటున్నాయి. పనిలో పనిగా వాటిని తీసుకొని బ్యాగులో సర్దుకున్నామనుకోండి రోజూ జిమ్‌కు తీసుకెళ్లవచ్చు. జిమ్‌ కేంద్రంలో కింద కూర్చొని ఆసనాలు, వ్యాయామం చేయాల్సి వస్తుంది. కింద ఏమీ లేకుండా సాధన చేసినప్పుడు శరీరం ఒత్తిడి గురవుతుంది. అలాకాకుండా ఉండాలంటే తప్పనిసరిగా జిమ్‌ మ్యాట్‌ వెంట పెట్టుకోవాల్సిందే!

అనువైన దుస్తులు : వ్యాయామసాధన చేసినప్పుడు చెమట పడుతుంది. అందుకే చెమటను పీల్చే దుస్తులు ధరించినప్పుడు చిరాకు అనిపించదు. అలానే వదులుగా ఉండే వాటికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బ్రాలు వేసుకోవాలి. జిమ్‌నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి దుస్తులు మార్చుకోవాలి. అవి చెమట పట్టి ఉంటాయి. కాబట్టి ఏ రోజుకారోజు ఉతకాలి.

తువాలు : మధ్యమధ్యలో చెమట తుడుచుకోవడానికి చిన్న తువాలును బ్యాగులో ఉంచుకోవాలి. అలానే టిష్యూకాగితాలూ కొన్ని పెట్టుకోవాలి. అలసట అనిపించినప్పుడు ముఖం కడుక్కొని తుడుచుకొంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు చర్మం తాజాగానూ కనిపిస్తుంది.


  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.