Monday, June 13, 2011

ఒంట్లో నీరు చేరుట లో అవగాహన , Edema in the body awareness




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వంట్లోనీరు చేరుట - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవ శరీరము బరువు లో సుమారు 70 శాతము బరువు నీరే . శరీర కణము లోన , కణము బయట , రక్తనాళాలలోన సీరం రూపమ్లో ఈనీరు ఉంటుంది . నీరు జీవి బ్రతికేందుకు అత్యవసరము . నీటి పరిమాణము , నిష్పత్తి సమపాల్ళలో ఉండేందుకు శరీర అవయవాలు నిరరంతము పనిచేస్తూ ఉంటాయి . ముఖ్యము గా మూత్రపిండాలు , చర్మము ఈ పనిలో ముఖ్యమైనవి .

శరీరములో అక్కడక్కడ నీరి చేరి(fluid accumulation in body tissues) , లోపల ఉన్న నీరు బయటికి వెళ్ళకుండా శరీరము లో ఉండిపోవడం ఎక్కువ బాధ పెట్టె పెద్ద సమస్య కాకపోయినా ఇది శరీరము కొన్ని ముఖ్యమైన అవయవాల క్రియాశక్తి లోపాలకు సూచన . ఒక్కోసారి మనిషి దీనివల్ల చనిపోయే అవకాశము ఉండవచ్చును . కొందరిలో ఇది కాళ్ళలోనూ , ముఖం లోనూ , పొట్టలోనూ లేదా ఏదో ఒక అవయానికే పరిమితం అవవచ్చును.
శరీరములో నీరు చేరడం 3 రకాలు ---
ఏదైనా ఒక బాగానికి నీరు చేరి వాపు రావడం --Lacal edema .. అంటారు .
శరీరమంతా ఏకరీతిగా నీరు చేరడం -- generalized edema ... ఆంటారు .
శరీరము లో ఉన్న క్యావిటీలలో (body cavities) నీరు చేరడం . ఉదా: జలోదరము , ఫ్లూరల్ ఎఫ్యూషన్‌ మున్నగునవి .
ఇందులో వేలి తో నొక్కితే చొట్ట పడేది , చొట్ట పడనిది అని రెండు విధాలు గా ఉంటుంది . చొట్టపడని ఎడీమా లింఫాటిక్ మండలము (Lymphatic system) వ్యాదిగ్రస్తమవడం వల్ల ఏర్పడుతుంది ... దీనిని Lymphedema అంటాము . చొట్టపడని ఎడీమా కి ఇంకో కారణము థైరాడ్ వ్యాదులలో ఒకటైన మిక్షెడిమా(due to Hypo-thyroidism)

చొట్టపడే ఎడీమ చాలా సాదారణము కనిపించే ఈరకం నీరుచేరడం . ఇది రక్త నాళాలలో ఉన్న ద్రవము లీకు అవడం వలన కణాల మధ్యలోనికి వచ్చి వాపుగా యేర్పడుతుంది . నాళాలళొ pressure ఎక్కువ అయినపుడు ఇది జరుగుతూ ఉంటుంది .

కారణాలు / వ్యాధులు :
గుండె జబ్బులు (heart failure, CCF),
మూత్రపిండాల వ్యాధులు (nephrotic syndrome),
కాలేయ సంబంధిత వ్యాధులు (liver failure-cirrhosis),
varicose veins ,
Thromboplebitis,
Dermatitis ,
Skin allerty ,
filaria edema ,
Lipo edema ,
myxedema .
ఎక్కువ సేపు నిలబడడం మూలం గా వచ్చే వాపులు .(hypostatic postural edema),
ఎక్కువ ఉప్పు పదార్ధములు తినడం మూలాన వచ్చే వాపులు ,
స్త్రీలలో భహిస్టలు ముందు జరిగే హార్మోనుల అసమతుల్యము వలన వచ్చే వాపులు ,
కొంతమంది గర్భిణీ లలో ఎక్కువ నీరు నిలవా అవడం మూలాన వచ్చే వాపులు ,

కొన్నిరకాల మందులు వాపులకు కారణము కావచ్చును : అవి ->
వ్యాసోడైలేటర్స్ (vasodilators)-- ఈ మందులు రక్తనాళము లోపల పరిమాణము పెరిగేందుకు , చిన్న చిన్న రక్తనాళాలు తెరుచుకునేందుకు వాడుతారు . ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
కాల్సియం చేనల్ బ్లోకర్స్ (calcium channel blockers) : వీటిని క్యాల్చియం యాంటాగొనిస్ట్స్ అంటాము . ఇవి కూడా రక్తపోటును నియంత్రిస్తాయి.
NSAIDs -- నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇంఫ్లమేటరీ డ్రగ్స్ అని వ్యవరిస్తారు . నొప్పులు తగ్గడానికి వాడుతారు . ఎక్కువకాలము వాడినవారిలో శరీరం వాపులు వస్తాయి.
స్త్రీల సంభందిత హార్మోన్‌ అయిన సంతాననిరోదక మాత్రలు (Estrogens)ఎక్కువకాలము వాడినా ,
మధుమేహ బాదితులు ఇన్సులిన్‌ సెన్‌సిటైజర్స్ ... ఉదా : thiazolidinidiones group drugs ఎక్కువకాలము వాడినా ఈ వాపులు కనిపిస్తాయి.

Mechanism --ఎలా ఏర్పడుతుంది .: శరీరములో చిన్న రక్తనాళాలైన క్యాపిల్లరీస్ (capillaries) నుండి ద్రవము (సీరం) లీకు అవడం వలన ఎడీమా ఏర్పడుతుంది . ఈ లీకేకీ ఆయా రక్తనాళాలకు దెబ్బతగలడమో(damage)లేదా వాటిలో పీడనము(increased pressure) ఎక్కువ అవడము మూలానో జరుగుతుంది . ఈ ద్రవము లీకేజీ సాంకేతికాలు మూత్రపిండలకు చేరి ఎక్కువ సోడియం నిలవాకి దోహదం పడి ఆ లీకైన ద్రవాన్ని బర్తీచేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ వలనే మరింత ద్రవము కణాలచుట్టూ చేరి వాపులకు దారితీస్తుంది .
increased hydrostatic pressure --రక్తపోటు ఉన్నవారిలోను, మిగతా రక్తనాళాల వ్యాదులలో , సిరలు లో కవాటాలు నీరసత్వము ,
reduced Oncotic pressure with in blood vessels, -- రక్తములో ప్రోటీన్లు శాతము తగ్గినపుడు .
increased tissue oncotic pressure , -- సోడియం శాతము ఎక్కువైనపుడు ,
increased blood vessel wall permiability -- inflamation , -- కొన్ని రక్తనాళాల వ్యాధులలో,
obstruction of fluid clearance via lymphatic system ,-- ఫైలేరీయా వంటి వ్యాధులలో ,
Sodium retention conditions .,--- మూత్రపిండాల వ్యాదులలో ,

వాపులకు లోనయ్యే కొన్ని అవయవాలు ... ఉదాహరణ:
మెదడు పొరలు , కణాలు వాపు --Cerebral edema .
ఊపిరితిత్తుల లో వాపు --- pulmonary edema ,
కళ్లలో వాపు --- corneal edema , conjunctivitis , keratitis ,
కళ్ళ చుట్తూ , ముఖం లో వాపు ---- puppiness of face in Kidney diseases ,
జల ఉదరము -- cirrhosis liver ,
మిక్షెడిమా --- hypothyroid diseases ,
రక్తపోటు ఉన్నవారిలో -- legs in hypertension ,
కాళ్ళ వాపులు -- Heart diseases , ccf ,

ఎలా గుర్తించడం : Symptoms ->
ముఖం ఉబ్బరించినపుడు , కాళ్ళు , పాదాలు , మోచేతులు , కాళ్ళు గుత్తులు వాచినట్లుండడం ,
పొట్ట క్రమము గా ఉబ్బినట్లవడం నీటి కుండలా ఉండడం ,
శ్వాస చిన్నగా అవడం .. చాతిలో నొప్పి రావడం ఆయాశము గా ఉండడం ,
ముఖం ఉబ్బడం , కళ్ళచుట్టూ వాపులు గా ఉండడం ,
చర్మము సాగి పల్చబడి మెరిసే టట్లు కనిపించడం ,
వీటిలో ఏది ఉన్నా డా్క్టర్ ని సంప్రదించాలి . తగిన చికిత్స తీసుకోవాలి .

చేయవల్సిన పరీక్షలు :
యూనిన్‌ టెస్ట్ లు (urine analysis),
బ్లడ్ తనికీలు (Blood analysis) ),
బి.పి , సుగరు తనికీలు (B.P, diabetes tests),
చాతి ఎక్షురే (chest X-ray),

నివావరణ మార్గాలు :


శరీరము లో నీరు ఉండిపోవడానికి కారణం తెలుసుకొని మందు తీసుకోవాలి . తాత్కాలికం గా డయూరిటిక్స్ వాడవచ్చును . బార్లీ నీరు తాగితే ఫలితం ఉంటుంది .
Tab . Lasix 1-2 tab for day 3-4 days , దీనివల్ల వాపులు తగ్గినా సరియైన చికిత్సకోసం పరీక్షలు చేయించుకోవాలి అందుకొరకు మంచి వైద్యనిఫుణులను సంప్రదించాలి .





  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. Very good information Sir... Your idea of sharing your knowledge is awesome.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.