Monday, August 29, 2011

How to Control diabetes (sugar)?,మధుమేహము వ్యాధి ని ఎలా నియంత్రించుకోవాలి ?



  • [diabetes_2.jpg]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How to Control diabetes (sugar)?,మధుమేహము వ్యాధి ని ఎలా నియంత్రించుకోవాలి ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆ పేరు తెలియనివాళ్లు ఉండరు. కానీ దాని గురించి ఎప్పుడు చెప్పినా కొత్తగానే ఉంటుంది. అదే మధుమేహం. దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడతారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో.. హైదరాబాద్ మధుమేహ రాజధానిగా పేరు పొందుతోందంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. 14.8 శాతం మంది హైదరాబాదీలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా ఈ మధుమేహం కథాకమామిషు....

ఎంత తిన్నా ఒంటబట్టడం లేదు... అన్న మాట చాలాసార్లు వినే ఉంటాం. మధుమేహం ఉన్నవాళ్లలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఎంత ఆహారం తీసుకున్నా దాని నుంచి శరీరానికి శక్తి అందదు. ఆకలి మాత్రం అవుతుంది. ఆహారాన్ని శక్తిగా మార్చే హార్మోన్ పనిచేయకపోవడం వల్లే ఈ తిప్పలన్నీ. నిజానికి మధుమేహ వ్యాధి ఒక జబ్బు కాదు. చాలా రకాల జబ్బుల లక్షణాల సముదాయం. అందుకే దీన్ని సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు.

ముందే సిగ్నల్స్

మధుమేహం రాబోయే ముందు దశనే ప్రీడయాబెటిక్ దశ అంటారు. కొన్నేళ్ల ముందు కూడా ఈ దశ ఉండవచ్చు. ఈ దశ నుంచి ఇన్సులిన్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అందువల్ల ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిపోదు. ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ అవసరం అవుతుంది. కాబట్టి రక్తంలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది మధుమేహం రాబోతున్నదనడానికి సంకేతం. దీనివల్ల రక్తనాళాలు సన్నబడతాయి.

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చక్కెరలు నార్మల్‌గా ఉండి తిన్న తరువాత 200 కన్నా ఎక్కువ ఉంటే గ్లూకోజ్ ఇన్‌టాలన్స్ లేదా ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలన్స్ (ఐజిటి) అంటారు. తినకముందు గ్లూకోజ్ విలువ 110 నుంచి 126 ఉండి తిన్న తరువాత నార్మల్ అంటే 200 లోపే ఉంటే ఆ స్థితిని ఇంపెయిర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ (ఐఎఫ్‌జి) అంటారు. ఈ రెండు స్థితులూ మధుమేహ సంకేతాలే. ప్రీడయాబెటిక్ దశలో రక్తనాళాలు క్రమేణా మూసుకుపోవచ్చు. ఈ దశలోనే గుర్తించి జాగ్రత్తపడితే 50 శాతం మంది మధుమేహం రాకుండా తప్పించుకోవచ్చు.
ఇలా గుర్తించొచ్చు
- తేలిగ్గా అలసిపోతారు.
- అతిగా మూత్రవిసర్జన (పాలీయూరియా)
- దాహం ఎక్కువ కావడం
- ఆకలి ఎక్కువగా ఉండటం - ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల గ్లూకోజ్ శక్తిగా మారదు. శరీరానికి శక్తి అందకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. మళ్లీ ఆకలి అవుతుంటుంది.

- తిన్నది ఒంటికి పట్టదు కాబట్టి బరువు తగ్గుతారు.
- గాయాలు త్వరగా మానవు.
ఈ పరీక్షలు తప్పనిసరి
- రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఆధారంగా మధుమేహాన్ని నిర్ధారణ చేయవచ్చు. ఫాస్టింగ్‌లో 120, భోజనం తరువాత చేసే పరీక్షలో 200కు మించి గ్లూకోజ్ మోతాదు ఉంటే అది మధుమేహం అని నిర్ధారించవచ్చు.

- హెచ్‌బిఎ1సి పరీక్ష కూడా ఇందుకు సహాయపడుతుంది. దీని విలువ 5.5 ఉండాలి.
- రక్తంలో కొలెవూస్టాల్, ట్రైగ్లిజరైడ్స్ మోతాదు పెరిగినా మధుమేహ అవకాశాలుంటాయి.
- ఎల్‌డిఎల్ (చెడు కొలెవూస్టాల్) విలువ ఆరోగ్యవంతుల్లో 130 లోపు ఉండాలి. మధుమేహుల్లో అయితే 100 లోపే ఉండాలి. గుండెజబ్బులున్నవారిలో 80 కన్నా తక్కువ ఉండాలి.
- ఇసిజి, కిడ్నీ పనితీరు, కంటి పరీక్షలు, మూత్ర పరీక్షలు కూడా అవసరం.
- చక్కెర వ్యాధి వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

చక్కెర ముదిరితే...
మధుమేహం వల్ల పెద్ద పెద్ద రక్తనాళాలే (మాక్రో వాస్కులర్) కాకుండా అతి చిన్న రక్తనాళాలు (మైక్రో వాస్కులర్) కూడా ప్రభావితం అవుతాయి. కిడ్నీలు (నెవూఫోపతి), కళ్లు (టినోపతి), నాడుల (న్యూరోపతి)కు సంబంధించిన సమస్యలన్నీ మైక్రోవాస్కులర్ సమస్యలు. కరొనరీ వ్యాధులు, మెదడులో రక్తనాళాల సమస్యలు (సెరివూబల్ వాస్కులర్ డిసీజ్) లాంటివి పెద్ద రక్తనాళాలు ప్రభావితం కావడం వల్ల వస్తాయి.

నెఫ్రోపతి - మధుమేహం వల్ల మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా వెళ్లిపోతాయి. దీన్నే మైక్రో అల్యూమిన్యూరియా అంటారు. మూత్రం ద్వారా 30 శాతం అల్బుమిన్ బయటకు వెళ్లిపోతుంది.
రెటినోపతి - చక్కెరలు పెరగడం వల్ల కంటిలోని రెటీనాలో సమస్యలు వస్తాయి. అనవసరమైన కొత్త రక్తనాళాలు, మలినపదార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల కంటిచూపు దెబ్బతింటుంది. లేజర్ చికిత్స అవసరం అవుతుంది.

న్యూరోపతి - నాడీకణాలకు రక్తవూపసరణ తగ్గుతుంది. నాడుల్లో సమాచార ప్రసారంలో అంతరాయం కలుగుతుంది. కణాల్లో హానికర పదార్థాలు ఏర్పడతాయి. అందువల్ల నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే మధుమేహుల్లో లైంగిక సమస్యలు కూడా ఎక్కువ. వంధ్యత్వ లక్షణాలు కనిపిస్తాయి.

మందుల నుంచి ఇన్సులిన్ దాకా..
ప్రారంభంలో మెట్‌ఫార్మిన్ మందుతో ప్రారంభమైన మధుమేహ చికిత్స అవసరమైతే ఇన్సులిన్ రూపంలో కూడా అందివ్వాల్సి ఉంటుంది. మెట్‌ఫార్మిన్ అదనంగా ఉన్న గ్లూకోజ్ వినియోగం చెందేలా చేస్తుంది. సల్ఫొనైల్ మందులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. బీటా కణాలను ఆరోగ్యంగా ఉంచే డిపిపి 4 ఇన్‌హిబిటర్లు, జిఎల్‌పి 1 అనలాగ్స్ లాంటి మందులు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం వచ్చిన 10 నుంచి 13 ఏళ్ల లోపు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం 90 శాతం మందిలో ఉంటుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ -
గర్భంతో ఉన్నప్పుడు చాలామందిలో మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటప్పుడు గానీ, మధుమేహం ఉన్నవాళ్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు గానీ మధుమేహానికి మందులు వాడకూడదు. ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. ఇలాంటప్పుడు తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. మందులు ఇవ్వడం వల్ల బిడ్డపై దుష్ర్పభావాలు కలిగే అవకాశం ఉంటుంది.

మధుమేహం అంటే...?
మనం తీసుకున్న ఆహారం ఏదయినా చివరికి గ్లూకోజ్ అనే సరళమైన చక్కెరగా మారుతుంది. ఈ గ్లూకోజ్ నుంచి శక్తి ఉత్పత్తి కావడానికి సహాయం చేసేది క్లోమక్షిగంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్. మనం ఆహారం తీసుకోనప్పుడు సరిపడినంత గ్లూకోజ్ ఉండదు. ఇలాంటప్పుడు కాలేయంలో నిలవ ఉన్న గె్లైకోజన్‌ని గ్లూకోజ్‌గా మారుస్తుంది గ్లూకగాన్ అనే హార్మోన్. ఈ రెండు హార్మోన్లు కలిసి గ్లూకోజ్ మోతాదు ఎక్కువ తక్కువలు కాకుండా కంట్రోల్ చేస్తుంటాయి. మధుమేహం ఉన్నవాళ్లలో ఇన్సులిన్ హార్మోన్ సక్రమంగా పనిచేయదు. తద్వారా గ్లూకోజ్ వినియోగింపబడక శక్తి ఉత్పన్నం కాదు. అలా గ్లూకోజ్ అంతా పేరుకుపోతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఏమీ తినక ముందు రక్తంలో చక్కెరల మోతాదు 80 నుంచి 120, తిన్న రెండు గంటల తరువాత 140 నుంచి 160 ఉంటుంది. ఈ పరిధి దాటితే అది మధుమేహం అవుతుంది. రక్తంలో గె్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ మూడు నెలల సగటు 5.5 నుంచి 6 ఉండాలి. (హెచ్‌బిఎ1సి టెస్ట్) ఇంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్టే.

వీరికి రిస్కు ఎక్కువ
తల్లిదంవూడులు, తోబుట్టువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే రిస్కు ఎక్కువ. తల్లిదంవూడులిద్దరూ షుగర్ పేషెంట్లే అయితే వంద శాతం అవకాశం ఉంటుంది. స్థూలకాయులు, శారీరక శ్రమ లేనివాళ్లు, అధిక ఒత్తిడిలో పనిచేసేవాళ్లు, స్వీట్లు ఎక్కువగా తినేవాళ్లలో మధుమేహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇదీ లైఫ్‌స్టయిల్

మధుమేహానికి మందుల కన్నా జీవనవిధానంలో మార్పులు చేసుకోవడమే ప్రధాన చికిత్స. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ప్రధాన పాత్ర వహిస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లు

- సరళ మైన చక్కెర పదార్థాలుండే స్వీట్లు, జామ్‌లు, ఐస్‌క్షికీమ్‌లు, మిల్క్‌షేక్స్, చాక్లెట్లు, బిస్కట్లు, బేకరీ ఫుడ్స్ జోలికి వెళ్లవద్దు.

- మామిడి, ఖర్జూరాలు, సీతాఫలాలు, అరటిపండ్లు తప్ప ఏ పండ్లయినా తినవచ్చు. పండ్ల రసాల కన్నా పండ్లు తినడమే మేలు.

- తేనె తీసుకోవద్దు.

- అన్నం, ఆలుగడ్డలు, కందగడ్డల్లో కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినకపోవడం మంచిది.
- కొలెవూస్టాల్‌ని పెంచే కొవ్వు పదార్థాలను తినకూడదు.

- క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, కీరాకాయల్లాంటి వాటితో తయారుచేసిన సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయల్ని ఎక్కువగా తినాలి.
- వారంలో రెండు సార్లు చేపలు, అప్పుడప్పుడు చికెన్ తినవచ్చు. కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి.

- రోజూ 40 నిమిషాలు వాకింగ్ తప్పనిసరి. జాగింగ్, ఈత కూడా మేలు చేస్తాయి. నడిచేటప్పుడు ముందు వార్మప్‌గా నెమ్మదిగా ప్రారంభించి తరువాత వేగం పెంచాలి. నడక ముగించే ముందు కూడా వేగం తగ్గించాలి.

- బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
- పొగతాగడం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయాలి.
- ఏటా రక్తపరీక్షలు చేయించుకోవాలి.


--Dr.N.paparao-(consultent physician Yasoda hospital Hyderabad)_for telangana News & talangana patrika .
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. Hi sur my name is murali i am 24 years old i have diabets ...is there any cure ...my levels are 260 fasting ...after lunch 460

    ReplyDelete
  2. Hi sur my name is murali i am 24 years old i have diabets ...is there any cure ...my levels are 260 fasting ...after lunch 460

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.