Wednesday, November 30, 2011

స్త్రీ పురుష లింగ బేధం , Female-Male Gender difference,మానవుల్లో లింగ భేదాల ప్రభావం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --స్త్రీ పురుష లింగ బేధం , Female-Male Gender difference,మానవుల్లో లింగ భేదాల ప్రభావం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీ పురుష లింగ బేధం ఏ దశలో ఏర్పడుతుందనే విషయాన్ని అనేక పరిశోధనల ద్వారా తెలుసుకొన్నారు. పురుష బీజం స్త్రీ గర్భంలోని అండాన్ని చేరుకొన్న క్షణంలోనే స్త్రీ పురుష లింగ బేధం ఏర్పడుతుందని నిర్ధారించ బడింది. కాని భౌతికంగా బాహ్య చిహ్నాలు కన్పించటానికి కొంతకాలం పడుతుంది. గర్భం దాల్చిన ఆరు వారాలకు పురుషలింగ చిహ్నం కన్పిస్తుంది. స్త్రీ మర్మావయవాలు రూపురేఖలు దిద్దుకోవడానికి మూడు నెలలు పడుతుంది. మెదడు లింగబేధానికి అవసరమైన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి కార్యప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తుంది. గర్భస్త శిశువు తన భావిజీవితానికి అవసరమైన శక్తి యుక్తులను పుట్టకపూర్వమే సంతరించుకొంటుంది. అందువల్లే పుట్టిన క్షణం నుండి ఆడపిల్లల, మగ పిల్లల ప్రవర్తనలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జన్యుకణాల ద్వారాను, హార్మోనుల ద్వారాను గర్భస్థ శిశువు తన కవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొంటుంది.

ఆడపిల్లలకు తల్లులు అవవలసిన అవసరం వుంది. కాబట్టి పుట్టినప్పటి నుండి మాటలను విని మనుష్యులను గుర్తించగలుగుతారు. శబ్దాలకు త్వరగా స్పందిస్తారు. మాట్లాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తూ వివిధ శబ్దాలను చేస్తారు. నవ్వుతూ అందర్ని ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు. మగపిల్లలు మనుష్యుల పోలికను బట్టి వ్యక్తులను గుర్తిస్తారు. ఇంపైన రంగులను చూసినప్పుడు ఆనందిస్తారు. బొమ్మలంటే ఇష్టపడ్తారు. మగపిల్లలకు మనుష్యుల కంటే బొమ్మలు ఇస్తే వూరుకుంటారు. ఆడ పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఓదార్చితే వూరుకొంటారు. ఆడపిల్లలు ఎదుటివారి భావాలను తేలికగా అర్థంచేసుకోగలుగుతారు.

  • పరిణామ క్రమంలో
ప్రకృతి స్త్రీపురుషులకు వేరువేరు విధులను నిర్ణయించింది. మగవారు వేటాడి ఆహారాన్ని సంపాదించాలి కాబట్టి జంతువులకు తమకు వుండే దూరాన్ని అంచనా కట్టగల స్థోమత కలిగి వుంటారు. గురి చూసి బాణాన్ని వేయగల సామర్థ్యం వారికి వుంటుంది. అలాగే కుటుంబ పోషణ బాధ్యత వున్న స్త్రీలకు సమాజ స్పురణ, మాటల చాకచక్యం పుట్టుకతోనే వస్తాయి. మగ పిల్లలు ఆటలు, వ్యాయామ క్రీడల లోను యంత్రాలను ఉపయోగించటంలోను ప్రావీణ్యత కలిగివుంటారు. ఆడపిల్లలు ఇతరులను గౌరవించటంలోనూ, ఇతరులకు తమకు మధ్య వున్న అంతరాన్ని గుర్తించటంలోనూ చాకచక్యం చూపిస్తారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఎంపిక చేసుకొనే బొమ్మలలోను, ఆట వస్తువులలోను కూడా వ్యత్యాసం కనిపిస్తుంది.

  • మెదడు పనితీరులో
మగ పిల్లలకు, ఆడపిల్లలకు కొంత తేడా కనిపిస్తుంది. ఆడ పిల్లలు మొదటి సంవత్సరాంతానికి స్పష్టంగా మాటలు చెప్పగలుగుతారు. ఐదారు సంవత్సరాల మగపిల్లలు, అదే వయస్సు వున్న ఆడపిల్లల కంటే తక్కువ మాటలు చెప్పుతారు. ఆ దశలో ఆడపిల్లల విషయ పరిజ్ఞానం మగపిల్లల కంటే ఒక సంవత్సరం ఎక్కువ వున్నట్లు వుంటుంది. ఈ వ్యత్యాసం క్రమ క్రమంగా వృద్ధి చెంది 9 లేక 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒకటిన్నర సంవత్సరాలుగా తేడా కన్పిస్తుంది. 14 లేక 15 సంవత్సరాల ఆడపిల్లలు అదే వయస్సు వున్న మగపిల్లల కంటే 2 సంవత్సరాలు పెద్దవారిలా ప్రవర్తిస్తారు. సుమారు 20 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికీ మగ పిల్లలకు, ఆడ పిల్లలకు మధ్య తేడా అంతగా కనిపించదు. అప్పటికి ఇరువురు సమానంగా వ్యవహరిస్తారు.

  • ఆడపిల్లలు అన్నింటిలోనూ ముందుంటారు :
ఒక మగ పిల్లవాడు ఆడ పిల్ల కవలలుగా పుట్టారు. కూర్చోవటంలోను, ప్రాకటంలోను, నడవటంలోను ఆడ పిల్ల మగ పిల్లవాని కంటే మూడు నెలలు ముందువుందట. ఐదేళ్ళు వచ్చేటప్ప టికి ఆడపిల్ల అన్ని విషయాలలోను అక్కలాగ వ్యవహరించేదట. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నచెల్లిళ్ళ విషయంలో కూడా ఇట్టి తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సామాన్యంగా ఆడ పిల్లలు శైశవ దశలో మగ పిల్లలు కంటే దృఢకాయులుగా వుంటారు. మొదటి సంత్సరంలో తక్కువ జబ్బులు వస్తాయి.


తండ్రి బీజంలోని 'X' క్రోమోజం తల్లి అండం లోని 'X' క్రోమోజంతో కలిసి స్త్రీ శిశువు జనానికి కారణ భూతమౌతుంది. ఈ రెండు 'XX' క్రోమోజంలు ఒకదానికి ఒకటి వత్తాసుగా వుండి ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక క్రోమోజం లో ఏదయినా లోపం వుంటే రెండో క్రోమోజం ఆ లోపాన్ని సరిదిద్ది ఆడపిల్లల పురోభివృద్ధికి తోడ్పడుతుంది. స్త్రీలు ఇంకొక జీవిని ఉత్పత్తి చేయాలి కాబట్టి ప్రకృతి వారికి ఎక్కువ శక్తిని ప్రసాదించింది. అందువల్లే స్త్రీల సగటు ఆయుఃప్రమాణం పురుషుల కంటే సుమారు 6 లేక 7 సంవత్సరాలు ఎక్కువ వుంటుంది. ఈ వ్యత్యాసం అన్ని దేశాలలోను, అన్ని జాతులలోను స్పష్టంగా కన్పిస్తుంది.


తల్లి అండంలోని '×' క్రోమోజంతో తండ్రి బీజంలోని 'Y‌' క్రోమోజం కలిసినప్పుడు మగపిల్లవాడు పుడ్తాడు. 'Y‌' క్రోమోజం '×' క్రోమోజం కంటే చిన్నదిగా వుంటుంది. ఈ రెండు క్రోమోజంలు కలసి పని చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. అందువల్లే ఎక్కువ మంది మగశిశువులు పుట్టక ముందే చనిపోతారు. పుట్టిన తరువాత కూడ మొదటి వారంలో చనిపోయే శిశువులలో మగపిల్లల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

మగపిల్లలు ఎక్కువగా ఏడుస్తూ తల్లిని అంటిపెట్టుకొని వుంటారు. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మెదడు పనితీరు ఒక నెల వయస్సు వున్న మగపిల్లవాని మెదడులాగ పనిచేస్తుంది. మూడేళ్ళు వచ్చేటప్పటికి ఆడపిల్లలు చేతులతో చేసే పనులలో మగపిల్లల కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి వుంటారు. ముఖ్యంగా చేతివేళ్ళపై మంచి ఆధిక్యత కలిగి వుంటారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందు పుస్తకాలు చదవటం మొదలు పెడ్తారు. ఆడపిల్లలు శ్రద్ధగా వింటారు. తమకు తెలిసిన విషయాలను ఇతరులకు వివరంగా చెప్పగలుగు తారు. ప్రైమరీ విద్యాస్థాయి లో ఆడపిల్లలు లెక్కలలో ముందుంటారు. కాని హైస్కూలు స్థాయిలో మగపిల్లలు ముందుకు పోతారు.

  • ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు
మెదడు అన్ని అవయవాల పనితీరుని నిర్దేశిస్తుందని తెలుసు కదా! అయితే కొన్ని విషయాలలో ఆడవారు స్పందించే విధానానికి, మగవారు స్పందించే విధానానికి తేడా ఉంటుంది. దీనికి కారణం వారి మెదడులో జరిగే మార్పులే.
అనేకమంది మీద పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఆడ, మగ మెదళ్ళలోని కొన్ని తేడాలు కనిపెట్టారు. వీటిని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చదవచ్చు.

  • * మగవారి మెదళ్ళు పెద్దగా ఉంటాయి. కానీ వయసుతోపాటు, అదే వయసున్న ఆడవారి మెదళ్ల కంటే త్వరగా కుంచించుకు పోతాయి.
  • * ఆలోచించేటప్పుడు మగవారి కంటే ఆడవారు మెదడుని ఎక్కువగా వాడతారు.
  • * మన మెదడులో గ్రే మాటర్, వైట్ మాటర్ అని రెండు ఉంటాయి. గ్రే మాటర్ తార్కిక శక్తికి, వైట్ మాటర్ జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. మగవారి మెదళ్ళలో గ్రే మాటర్ ఆడవారి మెదళ్ళలో కంటే 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆడవారి మెదళ్ళలో వైట్ మాటర్ మగవారి మెదళ్ళలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిశోధకులు ఏమంటున్నారంటే మగవారు లెక్కలు వంటివాటిలో నిష్ణాతులని, ఆడవారు సాహిత్యం, భాష వంటివాటిలో పండితులని.
  • * ఆడవారి మెదళ్ళు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ గ్లూకోస్ ని వాడుకుంటాయి.
  • * "ఇంటలిజెన్స్" పత్రిక 2006 లో చేసిన సర్వే ప్రకారం జ్ఞాపకశక్తి పరీక్షల్లో మగవారు సగటున నాలుగు నుండి ఐదు పాయింట్లు ఎక్కువగా సాధించారు.
  • * మగవారు సెక్స్ గురించి చాలా ఎక్కువగా అంటే నిముషానికి ఒకసారి చొప్పున, ఆడవారు చాలా తక్కువగా అంటే ఒకటి లేక రెండు రోజులకు ఒకసారి చొప్పున ఆలోచిస్తారు.
  • * శిశువుల మీద చేసిన పరిశోధనలలో డిస్టర్బ్ చేసే ధ్వనులకు మగశిశువుల కంటే ఆడశిశువులు ఎక్కువ ప్రతిస్పందించారు.
  • * ఆడవారు మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు. దీనికి కారణం వారి మెదళ్ళలోని కొన్ని గ్రంధుల చర్యలే. ఆడవారు, మగవారు రోజూ మాట్లాడే మాటల మధ్య తేడా సగటున 1000 నుండి 10,000 వరకు ఉంటుంది.
  • * ఆడవారు మగవారి కంటే ఎక్కువగా స్పర్శకు ప్రభావితమవుతారు. 20 సెకండ్ల కౌగిలింత ఆడవారి మెదడులో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇది తనను కౌగిలించుకున్న వ్యక్తి మీద నమ్మకాన్ని కలిగించటానికి దోహదపడుతుంది.

సమస్త జీవరాశిలో బుద్దిజీవులు గొప్పవారనేది జగమెరిగిన సత్యం. ఈ బుద్దిజీవుల్లో ఆడ, మగలలో ఎవరు గొప్ప అనేది ఒక తమాషా ప్రశ్న. కాని ఆడ, మగ వీరిరువురిని అనేక కోణాల్లో పరిశీలించి విశే్లషించి వారి ప్రత్యేకతలు చెప్పుకోవచ్చు. స్ర్తిలు శారీరకంగా, మేథోపరంగా మగవారికి తీసిపోరని ఆధునిక పరిశోధనలు చెపుతున్నాయి. జన్యుపరంగా స్ర్తిలు మగవారికన్నా బలవంతులని తెలుస్తోంది. మనిషిలో ఉండే 46క్రోమోజోమ్‌లలో రెండు లైంగిక క్రోమోజోమ్‌లు. స్ర్తిలలో ఎక్స్,ఎక్స్, పురుషులలో ఎక్స్,వై లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి. రెండు ఎక్స్‌క్రోమోజోమ్‌లుగల స్ర్తిలు జన్యుపరంగా పురుషులకన్నా పటిష్టంగా ఉంటారని పరిశోధకుల అభిప్రాయం.


మగవారి మెదడుకన్నా ఆడవారి మెదడు చిన్నది కావున వారికి తెలివి తేటలు సాపేక్షంగా తక్కువగా ఉంటాయనేవారు కూడా వున్నారు. అయితే పరిశోధకులు నిర్వహించిన అనేక పరిశోధనల ఫలితంగా ఆడ-మగ మెదడుల మధ్య సున్నితమైన వ్యత్యాసాలు వున్నాయని, వాటికి ప్రాముఖ్యముందని అంటున్నారు. ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోవాలంటే పురుషులు మెదడులో ఎడమవైపున ఉండే చిన్న ప్రదేశాన్ని ఉపయోగించుకుంటారు. స్ర్తిలు ఈ ప్రదేశానే్న కాకుండా మెదడు కుడివైపున వున్న ఒక ప్రదేశాన్నికూడా ఉపయోగించుకుంటున్నారు.
  • ఆడవారు బలహీనులు
మగవారికన్నా ఆడవారి శరీర చట్రం చిన్నదిగా ఉంటుంది. పైగా మగవారి అవయవాలకన్నా ఆడవారి అవయవాలు చిన్నవి. మగవారితో పోలిస్తే ఆడవారిలో మెటబాలిక్ రేటు తక్కువ. స్ర్తిలకుండే రుతుస్రావం, సంతానోత్పత్తి ప్రక్రియలు, మెనోపాజ్ వంటి ప్రకృతిపరమైన సందర్భాలు కారణంగా పురుషులమాదిరి ఎల్లప్పుడూ శారీరక శ్రమతో కూడిన పనులు చేయలేరు. స్ర్తిలలో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వారిలో కండర శక్తి తక్కువగా ఉంటుంది.

  • స్ర్తి శక్తి
ఆడవారి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుచేత తిండి లేకపోయినా మగవారికన్నా బాగా తట్టుకోగలరు. స్ర్తిలలో ఎస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. అందువల్ల వారికి తొందరగా గుండె జబ్బులు రావు. ఆఫీసు, ఇంటిని ఒకేసారి మహిళలు సమర్ధవంతంగా నిర్వహించగలరు.
జీవ గడియారాలు
ఆడ- మగల్లో జీవ గడియారాలు భిన్నంగా ఉంటాయి. ఈ విషయం ఇటీవలనే శాస్తవ్రేత్తల దృష్టికి వచ్చింది. రుతుమార్పులకు మగవారికన్నా ఆడవారు బాగా స్పందిస్తారు. ఆడ-మగ రాత్రి సమయాల్లో సమాన కాలాలు నిద్రించవచ్చు. స్ర్తిలలో జీవ గడియారం సూర్యుడికి ప్రతిస్పందిస్తుంది. శీతాకాలంలో పగటికాలం తగ్గుతుంది. అటువంటప్పుడు స్ర్తిలలో రాత్రిపూట మెలటోనిన్ స్రావం ఎక్కువ అవుతుంది. వేసవిలో తగ్గుతుంది. మగవారిలో వేసవి, శీతాకాలాల్లో స్రవించే మెలటోనిన్ ఒకే విధంగా ఉంటుంది. శీతాకాలంలో ఆడవారు ఒక రకం డిప్రెషన్‌కు గురిఅవుతూ ఉంటారు.

  • ఆడ-మగ తేడాలు
స్ర్తికి సిగ్గే అలంకారం. స్ర్తికి సిగ్గుపడని శరీర భాగం అంటూ ఉండదు. స్ర్తిజాతికి ప్రకృతి ఎన్నో కామ, ప్రణయ కేంద్రాలను ప్రసాదించింది. స్ర్తిలకు పెదవులు, చెక్కిళ్లు, పాల భాగం, ముంగురులు, అందమైన నాసిక, బొడ్డు, బాహుమూలలు, నడుము ఇవన్నీ ప్రణయ కేంద్రాలే. స్ర్తికంటే పురుషుడు బలవంతుడు.
మగవాని అంగాలు స్ర్తిల అంగాలకన్నా బరువుగా ఉంటాయి. ఒక యువకుని మెదడు బరువు సగటున 1380 గ్రాములు ఉంటే అదే వయసుగల యువతి మెదడు బరువు సగటున 1250 గ్రాములు ఉంటుంది.
యవ్వనంలో స్ర్తి, పురుషుల మర్మాంగాల వికాసం, వాటి బలిష్టత, ఎస్ట్రోజన్, ఆండ్రోజన్ హార్మోనుల చర్యపై ఆధారపడి ఉంటుంది. ఆడవారి విషయంలో పొత్తికడుపు చుట్టూ ఉండే అస్థిపంజరంలో ఎదుగుదల యవ్వన దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్ట్రోజన్ హార్మోనువల్ల పెరిగే ఎముకలు కొంతవరకు ఎదిగిన తరువాత ఎదుగుదల ఆగిపోతుంది. అందువల్లనే ఆడవారి శరీర నిర్మాణం మగవారి శరీర నిర్మాణాన్ని మించదు.

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.