Friday, December 9, 2011

Colon cancer awareness,కోలన్ క్యాన్సర్‌పై అవగాహన,పెద్దపేగు క్యాన్సర్ అవగాహన



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Colon cancer awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...స్


  • పెద్ద పేగు... జీర్ణక్రియకు కీలక కేంద్రం--పెద్ద పేగు... పేరులోనే కాదు... ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్ద... కాని జీర్ణవ్యవస్థలో ఉండేది చివరన. వ్యవస్థలోఉండేది చివరనైనా ప్రాముఖ్యంలో మాత్రం కాదు. ఆహారం జీర్ణవుయ్యే ప్రక్రియులో కాలేయుం వంటి కీలక అవయువాలతో పోలిస్తే అందరూ అంతగా పట్టించుకోని ఆ అవయువానికి ఎంతో ప్రాధాన్యం. మరెంతో ప్రాముఖ్యం. సాధారణ నీళ్లవిరేచనాల వంటి చిన్న సవుస్య మొదలుకొని కోలన్ క్యాన్సర్ వంటి అత్యంత తీవ్రమైన సవుస్య వరకూ పెద్దపేగులకు వచ్చే ఆరోగ్య సవుస్యలను ఆహార పదార్థాల్లో పీచుపదార్థాలు తీసుకోవడంలాంటి అతి సాధారణ చర్యతో నివారించవచ్చు.


ప్రాణం నిలుపుకోడానికి ఆహారం ముఖ్యం. ఆ ఆహారం జీర్ణవుయ్యే ప్రక్రియులో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుంది పెద్దపేగు. ఇంగ్లిష్ అక్షరం ‘యూ’ను తిరగేసినట్లు శరీరంలో అవురి ఉండే ఈ పెద్ద పేగుకూ, చిన్న పేగులకూ జంక్షన్‌గా ఉన్నట్లుగా మధ్యన అపెండిక్స్ అనే చిన్న భాగం ఉంటుంది. చిన్న పేగుల్లోని చివరన ఇలియుమ్ అనే భాగం నుంచి కుడిపైపు డొక్కలో మొదలై... కాలేయుం కింద తిరగేసిన ‘యూ’ ఆకారంలో ఒంపు తిరుగుతుంది పెద్ద పేగు. అలా ఒంపు తిరిగాక కడుపు పైభాగంలోకి (అప్పర్ అబ్డామెన్) కొంత పొడవుండే అది మళ్ళీ ప్లీహం (స్ప్లీన్) దగ్గర కింది వైపునకు మరోమారు ఒంపు తిరుగుతుంది. ఇలా రెండు చోట్ల కిందికి ఒంపు తిరగడంతో పెద్దపేగు ఇన్వర్టెడ్ ‘యూ’ ఆకారంలో ఉంటుంది. అది చివరగా వులద్వారం వద్ద ముగుస్తుంది. దాదాపు 1.5 మీటర్ల పొడవుండే ఈ కీలక భాగమే ఈ ‘పెద్దపేగు’.

  • ఏం చేస్తాయివి... ?
* దాదాపు ఆహారం అంతా చిన్న పేగుల్లోనే జీర్ణవువుతుంది. అయితే అలా జీర్ణమైన పదార్థంలోని నీరు, లవణాలనూ (ఎలక్ట్రోలైట్స్‌ను) పెద్దపేగు మళ్ళీ శరీరంలోకి పీల్చుకుంటుంది. ఇలా దేహంలోని ద్రవాలను బ్యాలెన్స్ చేసే కార్యక్రవూన్ని నిర్వహిస్తుంది.
* ఇంకా ఏదైనా జీర్ణం కాని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని జీర్ణం చేస్తుంది.
* పీచు పదార్థాలను ప్రాసెస్ చేస్తుంది.
* బయుటకు పంపే ముందర విసర్జన చేయూల్సిన పదార్థాలను కాసేపు నిల్వ ఉంచుతుంది.

పీచు పదార్థాలను ప్రాసెస్ చేసే ప్రక్రియులో భాగంగా పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియూ కొన్ని రసాయునిక చర్యల ద్వారా ఆ పీచుపదార్థాలను కొన్ని పోషకాలుగా మారుస్తుంది. అప్పుడా పోషకాలు పెద్దపేగుకు ఉండే లోపలి లైనింగ్‌ద్వారా శరీరంలోకి అబ్జార్బ్ అవుతాయి. కాబట్టే... పీచుపదార్థాలన్నవి పెద్దపేగు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక భూమిక పోషిస్తాయి. ఇక జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలను బయుటకు తోసేందుకు పెద్దపేగు కండరాలు క్రవుబద్ధంగా కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కదులుతూ జీర్ణమైన వ్యర్థాలన్నింటినీ మలము రూపంలో పాయువు (రెక్టమ్) వద్దకు చేర్చుతాయి. అక్కడికి చేరిన మలము ఓ పరిమితి దాటాక ఆ సవూచారాన్ని మెదడుకు చేరుతుంది. దాంతో మెదడు వ్యర్థాలను విసర్జించాలంటూ పాయువుకు ఆదేశాలిస్తుంది. ఫలితంగా మన వీలునుబట్టి విసర్జన క్రియు జరుగుతుంది. ఇదీ పెద్ద పేగుల్లో మొదటి నుంచి చివరి వరకు జరిగే ప్రక్రియుల వరస.

  • పెద్ద పేగుల్లో వచ్చే సవుస్యలతో ఇబ్బందులివీ...
సాధారణంగా పెద్ద పేగులో ఇబ్బందులు వస్తే కనిపించే లక్షణాలు ఇవే...
* మలబద్దకం,
* నీళ్ల విరేచనాలు,
* మల విసర్జన సవుయుంలో రక్తస్రావం,
* మలద్వారం వద్ద నొప్పి,
* కడుపులో నొప్పి,
* రక్తహీనత,
* బరువు తగ్గడం.

  • పెద్ద పేగులో సవుస్యలతో వచ్చే వ్యాధులివి...
* మొలలు: అంటే వులద్వారం వద్ద రక్తనాళాలు ఉబ్బి చిట్లడం వల్ల నొప్పి, రక్తస్రావం
* ఫిషర్: వులద్వారం చుట్టూ ఉండే లైనింగ్ చిట్లి పగులులా ఏర్పడటం,
* డైవర్టిక్యులై : పేగులో చిన్న సంచుల వంటివి తయూరు కావడం.
* ఇన్ఫెక్టివ్ కొలైటిస్ : పెద్దపేగులో ఇన్ఫెక్షన్ రావడం,
* అల్సరేటివ్ కొలైటిస్ / క్రోన్స్ డిసీజ్: పెద్దపేగులో పుండ్లు, కురుపులు, పూత వంటివి రావడం,
* ట్యూబర్క్యులోసిస్: పెద్దపేగుకు వచ్చే టి.బి.
* పాలిప్స్: పెద్దపేగులో ఏదైనా భాగంలో బఠాణీగింజ నుండి ఉసిరికాయుంత సైజుల్లో గడ్డలు పెరగడం,
* ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ : మానసిక ఒత్తిళ్ల ప్రభావం మెుదలుకొని అనేక కారణాల వల్ల పేగు బిగబట్టి నొప్పిరావడం, మలవిసర్జనకు ఇబ్బంది కలగడం.
* కోలన్ క్యాన్సర్: పెద్దపేగుల్లో వచ్చే క్యాన్సర్.

  • సవుస్యలూ... వాటికి పరిష్కారాలు :
పెద్దపేగులో బయుటకు కనిపించే లక్షణం ఒకటే అయినా కారణాన్ని బట్టి చికిత్స వూత్రం వేర్వేరుగా ఉండవచ్చు. అంతేకాదు... రోగి వయుసును, లక్షణాల తీవ్రత, లక్షణాలు కనిపించే వ్యవధిని బట్టి పరిష్కారాలు మారుతుంటాయి. ఉదాహరణకు నీళ్లవిరేచనాల (డయేరియూ) వంటి సవుస్య వస్తే చాలావుట్టుకు దానంతట అదే తగ్గిపోతుంది. ఆ సవుస్య ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఈ-కోలై అనే సూక్ష్మజీవుల వల్ల, అమీబియూసిస్ వల్ల కూడా రావచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నార్‌ఫ్లాక్సిన్, మెట్రోనిడజాల్ వంటి యూంటీబయూటిక్స్ వాడాల్సి ఉంటుంది. అదే సవుస్య కడుపులో నులిపురుగుల వల్ల వస్తే మరోరకం వుందులు వాడాలి.

విరేచనాల్లో బయటకు కనిపించే లక్షణం ఒకటే అయినా చికిత్సకోసం అసలు కారణాన్ని కనుగొనాలి. అలాగే... మల విసర్జనలో రక్తం పడుతుంటే... అది పైల్స్ వంటి సాధారణ సవుస్య వల్లనైనా కావచ్చు. లేక పెద్దపేగుల్లో క్యాన్సర్ కారణంగానైనా కావచ్చు. అందుకే పెద్ద పేగుల సవుస్యలతో ఏవైనా లక్షణాలు కనిపిస్తే అప్పటికప్పుడు ఏదో ఓ మందు తీసుకోవడం వంటి సాధారణ ప్రక్రియులు మానేసి డాక్టర్‌కు చూపించుకోవడమే మంచిది.

  • పెద్ద పేగుల సవుస్యలూ... నిర్ధారణ పరీక్షలు :
సాధారణంగా పెద్ద పేగుల్లో వచ్చే సవుస్యల నిర్ధారణలో ప్రధానంగా ఉపయోగపడే పరీక్ష ‘కొలనోస్కోప్’. ఈ ప్రక్రియులో పెద్దపేగులను పరీక్షించేందుకు ఓ సాఫ్ట్ ట్యూబ్‌ను మలద్వారం గుండా లోపలికి పంపిస్తారు. ఫలితంగా పెద్దపేగులతో పాటు... చిన్నపేగు చివరి భాగాన్నీ పరీక్షించి చూడవచ్చు. ఏదైనా అవాంఛిత పెరుగుదల ఉంటే దాన్ని పరీక్షించడానికి బయూప్సీ అవసరం. కొన్ని సందర్భాల్లో బేరియుం పరీక్షలు, సీటీ స్కాన్, ఎవ్మూరై పరీక్షల ద్వారా కూడా పెద్దపేగుల్లోని సవుస్యలను నిర్ధారణ చేస్తారు. ఇక చికిత్స అన్నది సవుస్యపై ఆధారపడి ఉంటుంది.

  • కోలన్ క్యాన్సర్‌పై అవగాహన అవసరం...

పెద్ద పేగుకు వచ్చే ప్రధానమైన సవుస్య కోలన్ క్యాన్సర్. దీనిపై అందరికీ అవగాహన అవసరం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందిని బలితీసుకుంటున్న ఈ వ్యాధిని ముందే పసిగడితే నివారించడం పూర్తిగా సాధ్యం. అందరూ 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా వూర్పులు కనిపించినప్పుడు వెంటనే పరీక్షలు చేయించినా, 50 ఏళ్ల వయుసు దాటాక ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రతి ఐదేళ్లకోమారు ‘ప్రివెంటివ్ స్క్రీనింగ్ కార్యక్రవుం’ కింద క్రవుం తప్పకుండా పరీక్షలు చేయించుకున్నా తప్పనిసరిగా నివారించతగ్గ వ్యాధే కోలన్ క్యాన్సర్. అందునా గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిన కుటుంబ చరిత్ర ఉన్నా పరీక్షలు చేయించడం తప్పనిసరి. మలవిసర్జన సమయుంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్లవిరేచనాలు అవుతున్నా, ఈ రెండు సవుస్యలూ ఒకదాని తర్వాత వురొకటి కనిపిస్తున్నా, రక్తహీనత, కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, బరువు తగ్గడం... ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

  • పీచు పదార్థాలతో ప్రివెన్షన్...
పెద్ద పేగులో వచ్చే మలబద్దకం వంటి చాలా సాధారణ సవుస్యలను మంచి ఆహారంతోనే నివారించవచ్చు. అంతేకాదు... ఇదే ఆహారంతో పెద్ద పేగుకు వచ్చే తీవ్రమైన సవుస్య అయిన క్యాన్సర్‌లాంటి వాటినీ సవుర్థంగా నివారించవచ్చు. పెద్దపేగులో జీర్ణమైన ఆహారం తేలిగ్గా ముందుకు కదిలేందుకు ఉపయోగపడేది ఈ పీచు పదార్థాలే. పొట్టుతో ఉండే గోధువు, ఓట్స్, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి వంటి తృణధాన్యాల్లో, రాజ్మా, శనగలు, పెసలు, సోయూబీన్ వంటి పప్పుధాన్యాల్లో (పల్సెస్), తొక్కతో పాటే తినదగ్గ తాజా పళ్లు, తాజా కూరగాయుల్లో ఈ పీచుపదార్థాలు ఎక్కువ. రోజూ కనీసం 2 లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు, ద్రవాహారం కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణమయ్యూక మిగిలిన వ్యర్థాలు తేలిగ్గా ముందుకు కదులుతూ ఉంటాయి. దీనికి శారీరక శ్రమ (ఫిజికల్ యూక్టివిటీ) కూడా తోడైతే ఈ పేగుల కదలిక (బవెల్ మూవ్‌మెంట్) చురుగ్గా ఉంటుంది. అందుకే పేగుల కదలికకు ఆహారం ఎంత అవసరమో, వ్యాయామమూ అంతే అవసరం. ఫలితంగా బాధాకరంగా ఉండే పైల్స్ మొదలుకొని క్యాన్సర్ వరకూ చాలా వ్యాధులను నివారించవచ్చు. అందుకే జీవనశైలి(లైఫ్‌స్టైల్)లో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లతోనే పెద్దపేగుకు వచ్చే చాలా సవుస్యలను సమర్థంగా నివారించుకోవచ్చు.

  • మొదట్లోనే పసిగడితే...
మొదట్లోనే పసిగడితే పెద్దపేగుల (కోలన్) క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు. అయితే దురదృష్టవశాత్తు అవగాహనలోపం వల్ల ఈ వ్యాధిని ముందేపసిగట్టడం అనుకున్నంతగా జరగడం లేదు. ముందే గుర్తిస్తే దీన్ని పూర్తిగా నివారించవచ్చు. క్యాన్సర్ పుండు తన లక్షణాలతో బయుట పడటానికి చాలా కాలం పడుతుంది. అందుకే ముందుగానే పరీక్షలు చేయిస్తే రెండు లాభాలు. మొదటిది... పాలిప్‌ల వంటివి ఉంటే వాటిని ముందుగానే పసిగట్టి తొలగించవచ్చు. రెండోలాభం ఏమిటంటే... అవి క్యాన్సర్ కారకాలు కాకుండా నివారించనూవచ్చు.

  • courtesy with :
- డాక్టర్ చెరుకూరి అనిల్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఫోకస్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్.@ యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి.

  • updates :

పేగు క్యాన్సర్‌ను తగ్గించే ఆస్ప్రిన్‌`


పేగు క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయిన రోగులు రోజూ ఒక ఆస్ప్రిన్‌ టాబ్లెట్‌ను తొమ్మిది నెలలపాటు తీసుకుంటే జబ్బు వల్ల మరణించడం 30 శాతానికి తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌లో ప్రచురి తమైంది. నెదర్‌ల్యాండ్స్‌లో ఎండివన్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రిలో నమోదైన 4,500 మంది క్యాన్సర్‌ రోగులను పరిశీలించారు. వీరిలో 1998, 2007లో క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో పాతిక శాతం మంది ఆస్ప్రిన్‌ను తీసుకోలేదు. మిగతా పాతిక శాతం వ్యాధి నిర్ధారణ తర్వాత ఆస్ప్రిన్‌ను తీసుకున్నారు. మిగిలిన సగం మంది నిర్ధారణకు ముందు, తర్వాత ఆస్ప్రిన్‌ను తీసుకున్నారు. వృద్ధుల్లో పేగు క్యాన్సర్‌ రావడం సాధారణం. పేగు క్యాన్సర్‌ నిర్ధారణకు ముందు, తర్వాత ఆస్ప్రిన్‌ తీసుకోవడం కన్నా పేగు క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత ఆస్ప్రిన్‌ను తీసుకుంటే ప్రభావం ఎక్కువుంటుంది.

  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.