Monday, December 26, 2011

పార్శ్వపు నొప్పి,Partial headach,మైగ్రేన్,Migraine





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి )ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి కి మనిషి కి వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.
  • లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.



* ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
* కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.

* ఆకలి మందగిస్తుంది.
* ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
* స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.


  • కారణాలు
* మానసిక వత్తిడి – తలనొప్పి
* అధిక శ్రమ
* ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు
* రుతు క్రమములో తేడాలు.
* కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
* మత్తుపానీయాలు – పొగత్రాగుట
* మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది.

  • మెదడుకు నొప్పి తెలియదు
శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు. మనకు కలిగే వివిధ రకాల తలనొప్పుల గురించి తెలుసుకుందాం.

మైగ్రేన్‌ రకాలు : Migraine Types-పార్శ్వపు నొప్పి రకాలు

    • * ఉదర మైగ్రైన్-Abdominal Migraine,
    • * అడుగు భాగపు మైగ్రైన్-Basilar Migraine,
    • * క్లిష్టమైన మైగ్రైన్-Complicated Migraine,
    • * చక్రీయ మైగ్రైన్ సిండ్రోమ్-Cyclic Migraine Syndrome,
    • * పక్షవాతం మైగ్రైన్-Hemiplegic Migraine,
    • * నాక్టర్నల్ మైగ్రైన్-Nocturnal Migraine,
    • * కంటి సంభందిత మైగ్రైన్-Ophthalmoplegic Migraine,
    • * గర్భధారణ మరియు మైగ్రైన్-Pregnancy and Migraine.

మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి - క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

  • క్లాసికల్‌ మైగ్రేన్‌ :
ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని 'థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.
ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

  • కామన్‌ మైగ్రేన్‌ :
సాధారంగా కనిపించే మైగ్రేన్‌ రకం ఇది. మధ్యవయస్కుల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాంటల్‌, టెంపొరల్‌, ఆక్సిపిటల్‌, ఆర్బిటాల్‌ భాగాల్లో ఎక్కడైనా ఈ తలనొప్పి కలుగవచ్చు. తరచూ రెండువైపులా ఈ రకమైన తలనొప్పి కలుగుతుంది. నొప్పి మంద్రంగా, కళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌ :


కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.
  • ట్రిగ్గర్స్‌గా పని చేసిఆహార పదార్థాలు
  • ఏదైనా, ప్రాసెస్ పులియబెట్టిన, పిక్లింగ్, లేదా marinated ఆహారాలు ,
  • కాల్చిన వస్తువులు,
  • చాక్లెట్,
  • పాల ఉత్పత్తులు,
  • Monosodium గ్లుటామాటే (MSG) కలిగి ఉన్న ఆహారాలు,
  • ఎరుపు వైన్,
  • జున్ను , వెన్న.
  • tyramine కలిగిన ఆహారాల చేపలు,
  • చికెన్ livers,
  • figs, మరియు కొన్ని బీన్స్ ,
  • ధూమపానం
  • పండ్లు (అవెకాడో పండు, అరటి, సిట్రస్ పండు),
  • నైట్రేట్స్ (బేకన్) కలిగి ఉన్న మాంసాలు,
  • కాయలు,
  • ఉల్లిపాయలు,
  • వేరు శనగ,

చికిత్స .

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఇక మళ్లీ రాకుండా ఇచ్చే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్‌లో మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వుందులు వాడాల్సి ఉంటుంది.
కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్--Amlodepin,
బీటా బ్లాకర్స్ -Propanolol, Atenolol,
యాంటి హిస్టమిన్‌(H1blockers)  - Levo cetrazine , Cetrazine,
యాంటి ఎమిటిక్స్(CTZ supressants) - Stemtil ,Ondensetran,
వంటి వుందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా ఇటీవల బోటాక్స్ ఇంజెక్షన్లతోనూ సత్ఫలితాలు ఉంటున్నాయి.

పార్శ్వనొప్పికి బొటాక్స్‌
తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.

patch treatment for migrine,పార్శనొప్పికి పట్టీ చికిత్స

తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతి, వికారం, కళ్లల్లో మిరుమిట్లు గొలిపే కాంతి వంటి లక్షణాలతో వేధించే పార్శ్వనొప్పి రోజువారీ పనులను సైతం దెబ్బతీస్తుంది. అందుకే ఈ బాధల నుంచి తప్పించేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా దీనికి ఓ కొత్తరకం 'పట్టీ' చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జెక్యూటీ ప్యాచ్‌ అనే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీన్ని చేతికి గానీ తొడకు గానీ చుట్టుకోవచ్చు. పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు. గంటకు 6.5 మి.గ్రా. చొప్పున మందును చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీంతో తలనొప్పితో పాటు వాంతి, వికారం కూడా చాలావరకు తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. పార్శ్వనొప్పిలో తలనొప్పితో పాటు వికారమూ చాలా ఇబ్బంది పెడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లకుండా నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే ఇలాంటి మందులతో చికిత్స ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అధిక రక్తపోటు నియంత్రణలో లేనివారు, గుండెజబ్బు సమస్యలు గలవారు జెక్యూటీ ప్యాచ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
  •  ------- source : Medicine updates Magazine.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.