Tuesday, December 13, 2011

Vitamin A , విటమిన్‌ ఎ


  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Vitamin A , విటమిన్‌ ఎ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

విటమిన్ A రసాయన నామం 'రెటినాల్'. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది. అనారోగ్యాన్ని ప్రతిఘటించటానికి, దృష్టిదోషాలను నివారించటానికి పిల్లలకు విటమిన్ -'ఎ' చాలా అవసరం. శిశువుకు ఆరునెలలు వయస్సు వచ్చే వరకు తల్లిపాల ద్వారా తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. అయితే, తల్లి తాను భోజనం లో విటమిన్ - ఎ ఎక్కువగా వున్న పదార్థాలు ఉన్నపుడే, ఆమె రొమ్ముపాల ద్వారా శిశువుకు విటమిన్ - ఎ లభిస్తుంది. ఆరు నెలలు పైబడిన పిల్లలకు ఇతర ఆహారం ద్వారా విటమిన్ -' ఎ' పొందవలసి ఉంటుంది.

చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి పెంపొందించుకోవడానికి, అంధత్వ నివారణ కు విటమిన్‌-ఎ చాలా అవసరం. మన దేశంలో 1 నుండి 5 శాతం పిల్లలు ఏదో ఒక స్థాయిలో విటమిన్‌-ఎ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్‌-ఎ లోపం వల్ల రేచీకటి వస్తుంది. విటమిన్‌-ఎ లోపం నిరోధించడానికి పిల్లలకు పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలి. ముర్రుపాలు చాలా ముఖ్యం. పచ్చని ఆకు కూరలు, కేరట్‌, మామిడి, బొప్పాయి, కోడిగుడ్డు, పాలు, వెన్న, నెయ్యి, చేపలు లాంటి ఆహారపదార్థాల్లో విటమిన్‌-ఎ ఉంటుంది. మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా శక్తివంతమైన విటమిన్‌-ఎ ద్రవం 3 సంవత్సరాలలోపు పిల్లలకు, 9 నెలల వయసులో తట్టు సూదితోపాటు, 18 నెలల వయసులో డిపిటి, పోలియో బూస్టర్‌తోపాటు, ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి 5 మోతాదులు వేయించాలి.
లభించే ఆహారపదార్ధాలు :
  • ఇది ముఖ్యంగా చేప కాలేయపు నూనె,
  • పాలు - పాల ఉత్పత్తులు , తల్లిపాలు ;
  • పండ్లు-మామిడి పండ్లు , బొప్పాయి , క్యారెట్ ,
  • వెన్న,
  • గుడ్డు సొన ........మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది.
  • ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది.
ఉపయోగము :
  • ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటి చూపు మామూలుగా ఉంచడంలో విటమిన్ A ముఖ్య పాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడాప్సిన్ పునః సంశ్లేషణకు ఇది అత్యావసరం. చర్మము , చర్మ కణాలు నిగనిగ లాడేటట్లు , మృదువుగా ఉండేటట్లు చేసేందుకు ఉపయోగపడుతుంది .


విటమిన్ A లోపంవల్ల కలిగే నష్టము :
  • రేచీకటి(Night blindness),
  • జిరాఫ్తాల్మియా(Xerophthalmia),
  • కెరటోమలేసియా(Keratomalasia).,
  • బైటాట్స్ స్పాట్శ్ (Bitot spots),
  • ప్రీనోడెర్మా (phrenoderma),...........కలుగుతాయి.
వివిధ ఆహార పదార్ధాలలో బీటా-కెరోటిన్ పరిమాణం

ఆహార పదార్ధం పేరు------- ప్రతి 100 గ్రాముల్లో లభించే బీటా కెరోటిన్ (మై.గ్రాములు)

  • కొత్తిమీర----------------- 4800,
  • కరివేపాకు--------------- 7110
  • మునగాకు--------------- 19690,
  • మెంతికూర --------------- 9100,
  • క్యారట్టు------------------ 6460,
  • మామిడి పండు------------ 1990,
  • బొప్పాయి పండు----------- 880,
  • గుమ్మడికాయ------------- 1160,
చిన్నారులకు 'ఎ' విటమిన్‌
కొందరు చిన్నారులను తరచూ జలుబూ, జ్వరం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటప్పుడు వారిలో తగినంత వ్యాధినిరోధక శక్తి లోపించిందని అర్థం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు జింక్‌, ఐరన్‌, క్యాల్షియం వంటి వాటితో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే 'ఎ' విటమిన్‌ తగిన మోతాదులో అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కంటి చూపుని మెరుగుపరిచి, ఎముక బలాన్ని పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. ఆటపాటల్లో ముందుండేలా వారిని ప్రోత్సహిస్తుంది. పాలూ, గుడ్లూ, క్యారెట్లూ, పాలకూర, గుమ్మడికాయ, బొప్పాయీ, శుద్ధి చేయని తృణధాన్యాల నుంచి ఎ విటమిన్‌ అందుతుంది. తియ్యగా ఉండే బొప్పాయీ, చిలగడదుంప, క్యారెట్‌ వంటి వాటిని ముక్కలుగా కోసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అలా తినడం లేదనుకొన్నప్పుడు బొమ్మలూ, పువ్వుల రూపంలో కార్వింగ్‌ చేసినా ఇష్టపడతారు. ఇక గుడ్డులోని తెల్లసొనను ఏ రూపంలో ఇచ్చినా మంచిదే. దోశ, ఇడ్లీ వంటి వాటిని క్యారెట్‌, పాలకూరతో కలిపి చేస్తే వారికి కంటికింపుగా కనిపించడమే కాదు శరీరానికి కావలసిన విటమిన్లూ అందుతాయి.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

Your comment is very important to improve the Web blog.