Sunday, June 26, 2011

జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులు 30, 40ఏళ్ల వయసు వారిలోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి జబ్బుల్ని 'సాంక్రామికేతర జబ్బులు' (నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) అని అంటున్నారు. ఈ జబ్బులు సూక్ష్మజీవులవల్ల వచ్చేవి కావు. వీటినే జీవనశైలి జబ్బులనీ అంటున్నారు. జీవన విధానాల్లోని తేడాలవల్ల, భోజన పద్ధతులవల్ల, ప్రవర్తనవల్ల సంక్రమించే జబ్బులివి. మరో విధంగా చెప్పాలంటే- ఆధునిక ప్రపంచం మోసుకొచ్చిన మార్పులు తెచ్చిపెడుతున్న కొత్త సమస్యలివి. సగటు ఆయుఃప్రమాణం పెరగడం, జనాభాలో వృద్ధుల సంఖ్య అధికం కావడం, అంటువ్యాధులను నయం చేయడానికి తగిన వైద్యసౌకర్యాలు ఇనుమడించడం, పట్టణీకరణ వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు సిగరెట్లు, మద్యం వాడకం పెరిగితే గుండె జబ్బులు, వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతాయి. వాతావరణ కాలుష్యంవల్ల మితిమీరితే శ్వాసకోశ వ్యాధులూ ముట్టడిస్తాయి. శారీరక శ్రమతో సంబంధంలేని జీవన విధానాలవల్లా స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ముసురుకుంటాయి. గుండె-రక్తనాళ జబ్బులు (కార్డియోవాస్కులార్‌ డిసీజెస్‌), మెదడు-రక్తనాళ జబ్బులు (సెరిబ్రో వాస్కులార్‌ డిసీజెస్‌), గుండెపోటు, పక్షవాతం, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఆస్తమా, కీళ్లు అరుగుదల, ఎముకల బలహీనత, పంటి సమస్యలు, మానసిక జబ్బులు లాంటివన్నీ సాంక్రామికేతర జబ్బుల జాబితాలోకి వస్తాయి. దేశంలో 36శాతం మధ్యవయసు మరణాలకు కారణం ఈ జబ్బులే. కనీస జాగ్రత్తలతో మెలిగితే ఈ మరణాల్లో కనీసం నాలుగోవంతునైనా నివారించవచ్చన్నది ఓ అంచనా.

నిర్లక్ష్యమే మరణశాసనం
ప్రపంచవ్యాప్తంగా కూడా సాంక్రామికేతర వ్యాధుల విజృంభణ పెరుగుతోంది. 2015నాటికి ఆసియాలో ప్రతి నాలుగు మరణాల్లో మూడు ఈ కారణంగానే సంభవిస్తాయన్నది ఓ అంచనా. 2008లో అయిదు కోట్ల 70లక్షల మంది మరణించగా- అందులో 63శాతం (మూడుకోట్ల 60లక్షలు) మరణాలకు సాంక్రామికేతర జబ్బులే కారణం. ధనిక దేశాల్లో ఇలాంటి జబ్బులవల్ల చనిపోయేవారు 13శాతం; 80శాతం మరణాలు పేద, మధ్యస్థాయి దేశాల్లోనే (ఆఫ్రికా మినహా) సంభవిస్తున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సరు, దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులే ఈ మరణాలకు చాలావరకు కారణం. దక్షిణ తూర్పు ఆసియా దేశాల్లో (ఇండియా, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, కొరియా, ఇండొనేసియా, మియన్మార్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌) 29శాతానికిపైగా మరణాలు వీటివల్లే సంభవిస్తున్నట్లు జకార్తాలో జరిగిన ఓ సమావేశంలో అంచనా వేశారు. రాష్ట్రంలోనూ ఎన్నో ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఒక సర్వే జరిగింది. శారీరక శ్రమ చాలా తక్కువ చేసేవారి సంఖ్య 68శాతంగా అందులో తేలింది. రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నవారు 43శాతం, అధిక బరువు ఉన్నవారు 23శాతం ఉన్నారు. ఇక 35ఏళ్ల వయసున్న పట్టణవాసుల్లో 16-20శాతం దాకా మధుమేహ వ్యాధి ఉండవచ్చని ఒక అంచనా. రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో 45గ్రామాల్లో జరిగిన ఒక అధ్యయనంలో 55శాతం మరణాలకు కారణం అంటురోగాలేనని స్పష్టమైంది.

సాంక్రామిక వ్యాధులు ముమ్మరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశంపై దృష్టిసారించింది. ఏప్రిల్‌ 28, 29న మాస్కోలో జరిగిన వివిధ దేశాల ఆరోగ్యశాఖామాత్యుల సమావేశంలో ఈ విషయంమీదే లోతైన చర్చ జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం అందులో పాలుపంచుకొంది. మనదేశంలో ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్య అంటువ్యాధులే. స్వాతంత్య్రం తరవాత అంటువ్యాధులపై పైచేయి సాధించే అవకాశం మనకు ఉండేది. కానీ, గడచిన అరశతాబ్దంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. దానివల్ల అంటువ్యాధులు తగ్గకపోగా ఇతర వ్యాధులూ విజృంభించాయి. ఐరోపా దేశాల ఆరోగ్య చరిత్ర తరచిచూస్తే- ప్రభుత్వ విధానాల్లో క్రమబద్ధమైన రీతులు అక్కడ గోచరిస్తాయి. వారు తొలుత అంటువ్యాధుల్ని నియంత్రించిన తరవాతే సాంక్రామికేతర వ్యాధుల సమస్యమీద దృష్టి సారించారు. మనదేశం ప్రస్తుతం ఈ రెండు రకాల వ్యాధుల భారాలను ఒకేసారి మోయాల్సి వస్తోంది. అంతేకాక ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన జబ్బులు నేడు పేదలకూ సంక్రమిస్తున్నాయి. పేదరికంవల్ల జబ్బులు పెరుగుతుంటే... వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో మరింత పేదరికంలోకి దిగజారుతున్న వైనం కళ్లముందే కనిపిస్తోంది. సాంక్రామికేతర జబ్బులు జీవితాంతం వెంటాడతాయి. వీటికి ఏళ్ళతరబడి వైద్యం అవసరమవుతుంది. చికిత్సా పద్ధతులూ ఖరీదైనవే. మనదేశంలో గుండె జబ్బు బారినపడ్డ కుటుంబాల్లో 20శాతం మేర పేదరికంలోకి కుంగిపోతున్నాయి. అదేవిధంగా క్యాన్సరు వస్తే 25శాతం కుటుంబాలు దారిద్య్రంలో కూరుకుపోతున్నాయి. అల్పాదాయ కుటుంబంలో ఒకరు మధుమేహం బారినపడితే, వారి ఆదాయంలో 34శాతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యంపట్ల ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్యకరమైన అలవాట్లను పౌరుల్లో పెంపొందించేందుకు ప్రభుత్వాలు ఏ రోజూ చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలెప్పుడూ మద్యాన్ని, పొగాకును ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలుగానే చూశాయి. 92శాతం వూపిరితిత్తుల క్యాన్సర్‌కు, 42శాతం దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులకు, 20శాతం గుండె, రక్తనాళ జబ్బులకు పొగతాగడమే కారణం! ఆల్కహాలు అధికంగా సేవించడంవల్ల ప్రపంచంలో రెండుకోట్ల 30లక్షల మంది మరణిస్తున్నారు. ఈ జబ్బుల్ని అరికట్టడంలో పొగాకు, ఆల్కహాలుపై నియంత్రణ చాలా కీలకమైనది. పొగాకుపై 20శాతం పన్ను పెంచితే పొగతాగేవారి సంఖ్య ఎనిమిది శాతం తగ్గవచ్చన్నది ఒక అధ్యయనం. పొగాకు, ఆల్కహాలు దుష్పరిణామాలమీద ప్రజల్లో అవగాహన తీసుకురావడం, వాటి వాణిజ్య ప్రకటనల్ని నిషేధించడం, అవి విచ్చలవిడిగా లభ్యం కాకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం సర్కారు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు. ప్రపంచీకరణ ముందుకు తెస్తున్న ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తరహా జీవన విధానాలు సాంక్రామికేతర జబ్బులు పెరగడానికి సారవంతమైన భూమికను అందిస్తున్నాయి. అందుకే వీటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాల స్థాయిలోనే నివారణ, నియంత్రణలకు పథకాలు రచించాల్సి ఉంది. 2007-2008లో కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్వేలో మనదేశంలో అంటువ్యాధులవల్ల సంభవించే మరణాలకంటే సాంక్రామికేతర వ్యాధులవల్ల జరిగే మరణాలు రెండింతలని తేలింది. ఇప్పటికైనా ఈ ముప్పును ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలంటే అందుకు ప్రజాపంపిణీ వ్యవస్థలో వైవిధ్యభరితమైన ఆహారపదార్థాలు దొరికేటట్లు, అవి మధ్య తరగతికీ అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమవల్ల చాలా జబ్బులను తగ్గించవచ్చు. ఇందుకు సైకిళ్ల వాడకం పెరగాలి. సామాజిక ఆటస్థలాలను, పార్కులను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టాలి. సింగపూర్‌లో ఉన్నట్టుగా పాఠశాలలో 'స్లిం అండ్‌ ట్రిమ్‌ పాలసీ'ని అమలుచేయాలి. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో రోజుకు గంటన్నర సమయాన్ని క్రీడలకోసం తప్పనిసరిగా కేటాయించాలి.

క్యాన్సరుకు సంబంధించిన హైటెక్‌ వైద్యసదుపాయాలపై శ్రద్ధపెడుతున్నారుగానీ- నివారణపై ఎలాంటి దృష్టీ పెట్టడం లేదు. మధుమేహం నియంత్రణకై పైలెట్‌ ప్రాజెక్టులు ప్రారంభించినా అవేవి సక్రమంగా జరగడంలేదు. జబ్బు తొలిదశలోనే గుర్తించగలిగితే వైద్యఖర్చులు పెరగకుండా చూసుకోవచ్చు. మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా చూడటం, 'పారామెడికల్‌ వర్కర్‌'లు, నర్సులు, ఇంటిదగ్గరే వైద్య చికిత్స అందించగలిగేవారి సంఖ్య పెరిగేలా చూడాలి. దీర్ఘకాలిక వైద్యసేవలను అందించగల వైద్య వ్యవస్థలను రూపొందించుకోవాలి. అందుకోసం కొంతమేర ఎక్కువ డబ్బే వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నిరాసక్తతకు అసలు కారణమిదే. సాంక్రామికేతర జబ్బులకు నిధులు ఏ స్థాయిలోనూ తగినంతగా లేవు. పౌరుడు తన ఆరోగ్య పరిరక్షణకోసం వెచ్చిస్తున్న దాంట్లో కేవలం 20శాతం మాత్రమే ప్రభుత్వం వైపునుంచి అందుతోంది. మిగిలినదంతా వ్యక్తిగతంగా ఎవరి ఖర్చులు వారు పెట్టుకుంటున్నారన్నమాట. రోజుకు ఇరవై రూపాయలైనా ఆదాయంలేనివారే అత్యధికులున్న మనదేశంలో ఈ పరిస్థితి సహించరానిది.

ముందుచూపు ముఖ్యం
ఈ ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ- సాంక్రామికేతర జబ్బుల నివారణ నియంత్రణలమీదే ప్రధానంగా జరగబోతోంది. ఇటీవల మాస్కోలో జరిగిన ఆరోగ్యశాఖా మంత్రుల సదస్సు ఇందుకు సన్నాహకంగా జరిగిందే! కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థమీద అనేక అవాంఛనీయ ఒత్తిళ్ళు వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సాంక్రామికేతర జబ్బుల ప్రణాళికలో వ్యాధినిరోధంతోపాటు వైద్యానికీ ప్రాధాన్యం ఉంది. మాస్కో ప్రకటనలో ఈ తరహా జబ్బులకు కావలసిన ఉపశమన వైద్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ జబ్బుల వైద్యానికి, నాణ్యమైన మందులకు సంబంధించిన ప్రస్తావనే ఆ ప్రకటనలో లేదు. అదేవిధంగా ముసాయిదాలో ఉన్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాలు తుది ప్రకటనలో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సామాజిక ఆరోగ్య ఉద్యమకార్యకర్తలు, మూడో ప్రపంచదేశాల ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించాల్సిన సమయమిది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసేవలను పటిష్ఠంచేసి వాటికి సాంక్రామికేతర వ్యాధుల ప్రణాళికను అనుసంధానించాలి. రాష్ట్రంలోనూ ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ మీద దాదాపు 3000కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. కానీ, ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసే ఒక సమగ్ర పథకం ప్రభుత్వం వద్ద లేదనేది వాస్తవం. అటువంటి దార్శనికతే సర్కారు ప్రదర్శించి, ఈ రూ.3000కోట్లు ప్రభుత్వాసుపత్రులమీద వ్యయంచేసి ఉంటే- ఇప్పటికే సకల సౌకర్యాలతో చక్కని ప్రభుత్వాసుపత్రులు తయారై ఉండేవి. సాంక్రామికేతర జబ్బులను ఎదుర్కోవడం సాధ్యమయ్యేది. ప్రపంచమంతా ఈ జబ్బులమీద యుద్ధం ప్రకటిస్తున్న ఈ సమయంలోనైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య విధానంవైపు దృష్టిసారించాలి.

(రచయిత శాసనమండలి సభ్యులు,జనవిజ్ఞానవేదిక ఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ / డాక్టర్‌ గేయానంద్‌.)
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, June 22, 2011

లైకెన్‌ ప్లానస్‌ , Lichen Planus



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లైకెన్‌ ప్లానస్‌(Lichen Planus)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



లైకెన్‌ ప్లానస్‌ అనేది దురద, బుడిపెలు, పొక్కులు, పొలుసులతో కూడిన చర్మవ్యాధి. లేత వంగపండు రంగులో అనేక కోణాలు కలిగిన ఆకృతిలో కొద్దిపాటి పొలుసులతో కనిపిస్తుంది. చేతులను మోచేతుల వద్ద ముడిచే చోట, పాదాలన మడమల వద్ద వంచే చోట, జననేంద్రియాలపైన, నోటిలోపల ఎక్కువగా ఈ రకం బుడిపెలు, మచ్చలు తయారవుతుం టాయి. వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధుల్లో వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించే రసాయన చికిత్సలు అవసరమవుతాయి.


కారణాలు
లైకెన్‌ ప్లానస్‌ వ్యాధికి ఇతమిద్ధమైన కారణాలు తెలియనప్పటికీ, కణ మధ్యవర్తిత్వ చర్య (సెల్‌ మీడియేటెడ్‌ రెస్పాన్స్‌) కారణంగా ప్రాప్తిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే వాటిలో ప్రతిజనక, ప్రతి రక్షక పదార్థాల తయారీ కీలకమన్నది తెలిసిందే. వ్యాధి నిరోధక శక్తి నియంత్రణ తప్పి స్వయం ప్రేరితంగా మారే ఇతర వ్యాధుల్లో కూడా లైకెన్‌ ప్లానస్‌ అనుబంధ లక్షణంగానో, లేదా పరతంత్ర లక్షణం గానో కనిపిస్తుంది.

పెద్దపేగులో వ్రణాలు తయార వడం, తల మీద జుట్టు వలయాకారపు మచ్చలుగా రాలిపోవడం, బొల్లి మచ్చలు, చర్మం కింద ఉండే రక్తనాళాలు వాపునకు గురై చర్మాన్ని, కండరాలను ఇన్‌ఫ్లమేషన్‌కు గురి చేయడం, అదుపాజ్ఞల్లో ఉండే కండరాలు అదుపు తప్పి వాలిపోవడం వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో లైకెన్‌ ప్లానస్‌ కనిపించే అవకాశం ఉంది. కాగా, హెపటైటిస్‌ సి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ, దీర్ఘ కాలపు కాలేయపు వ్యాధుల్లో నూ, కాలేయపు కణజాలం గట్టిపడటం వల్ల ప్రాప్తించే లివర్‌ సిరోసిస్‌ వ్యాధిలోనూ సమాంత రంగా లైకెన్‌ ప్లానస్‌ ఉండటాన్ని పరిశీలకులు గమనించారు.

కొంతమందిలో వ్యాధి ఆనువంశికంగా ప్రాప్తిస్తుం టుంది. హెచ్‌.ఎల్‌.ఎ-బి 27 లేదా హ్యూమన్‌ ల్యూకో సైట్‌ యాంటిజెన్‌ ఉండే కుటుంబాల్లో ఈ వ్యాధి ఉనికి కనిపించడాన్నిబట్టి ఈ వ్యాధికి జన్యు పరమైన అంశ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి వికటించి లైకెన్‌ప్లానస్‌ మచ్చలు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. జనాభాలో దాదాపు 1 నుంచి 2 శాతం మంది లైకెన్‌ ప్లానస్‌తో బాధపడుతున్నారని అంచనా. పురుషుల్లో కంటే స్త్రీలలో దీని ఉనికి ఎక్కువ. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఏ వయస్సులోనైనా రావచ్చు. కాని 30 - 60 సంవత్సరాల మధ్య వయస్సులో ఎక్కు వగా కనిపిస్తుంది.

ఈ వ్యాధి అనేక సందర్భాల్లో అప్రధా నంగా, అస్పష్టంగా మొదలవుతుంది. ముందుగా మణికట్టు, మోచేతుల మడతల్లో మచ్చలు మొదల వుతాయి. వారం, పదిరోజుల్లో శరీరమంతా మచ్చలు వస్తాయి. 2 నుంచి 16 వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతాయి. ఈ వ్యాధిలో దురద ఉంటుంది. అయితే మచ్చల తత్వాన్నిబట్టి దురద ఉంటుంది. గట్టిపడి గాట్లుగా తయారైన మచ్చల మీద ఎక్కువవ స్థాయిలో దురద ఉంటుంది. నోటిలో కనిపించే పొడలు లక్షణరహితంగా ఉండ వచ్చు. లేదా మంటను కలిగించవచ్చు.

వ్యాధిని సకాలంలో గుర్తించి వ్యాధి నిరోధక శక్తిని సక్రమమార్గంలో నడిపించే ఆయుర్వేద రసాయన చికిత్సలను, స్వస్థస్యోర్జస్కర చికిత్సలను చేస్తే చర్మంపైన మచ్చలు 50 శాతం కేసుల్లో ఆరు నెలల్లో తగ్గిపోతాయి. 18 నెలల్లో 85 శాతం కేసుల్లో మచ్చలు పూర్తిగాపోతాయి. అయితే నోటి లోను, శ్లేష్మపు పొరల మీద ఏర్పడే మచ్చలు తగ్గడానికి రెండునుంచి మూడేళ్లు పడుతుంది. శ్లేష్మపు పొరలు వ్యాధి ప్రభావానికి లోనవడం సర్వ సాధారణం. చర్మం మీద వ్యాధి లక్షణాలు కనిపిం చక పోయినప్పటికీ, శ్లేష్మపు పొరలు మాత్రమే వ్యాధి చిహ్నాలను ప్రదర్శించవచ్చు. నోటిలో నాలుక అంచుమీద, బుగ్గల లోపలా మచ్చలు కనిపిస్తాయి. లేత వగపండు రంగు మీద బూడిద రంగులో కాని, తెల్లని రంగులో కాని చారికలు కనిపిస్తాయి. మచ్చలు చిన్నవిగా ఆరంభమై విస్తరిస్తాయి. చిగుళ్ల మీద మాత్రం అరుదుగా కనిపిస్తాయి.

-నోరు తడారిపోవడం, నోటిలో ఒక రకమైన లోహపు రుచి అనిపిస్తుండటం కొంతమందిలో కని పించే లక్షణాలు. తంబాకు, పొగాకు వంటివి వినియోగించే వారిలో ఈ మచ్చలు కేన్సర్‌గా పరిణ మించే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ తరహా మచ్చలు గొంతు లోపల, టాన్సిల్స్‌ గ్రంథుల మీద, యోని పెదవుల మీద, మలద్వారం చుట్టుప్రక్కల ప్రదేశంలోనూ కనిపించవచ్చు. పురుషాంగపు మణి మీద వవ్తే సంభోగ సమయం లో నొప్పి వస్తుంది. దురద కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రమార్గం ఇరుకుగా తయారయ్యే అవకాశం ఉంది.వ్యాధి ప్రభావానికి లోనైన వారిలో 10 శాతం మందికి గోళ్లు దెబ్బ తినే అవకాశం ఉంది. గోళ్ల రంగు ముదురు రంగులో కనిపించడం, గోళ్ల మీద నిట్ట నిలువుగా ఉబ్బెత్తుగా గాట్లు, గాడి వంటివి ఏర్పడటం జరుగవచ్చు. చర్మంపైన లైకెన్‌ ప్లానస్‌ మచ్చలు ఏర్పడిన వారిలో కొంతమందికి తలలోని చర్మం మీద దురద, పొలుసులతో కూడిన బొడిపెలు తయారై జుట్టు ఊడిపోతుంది.

మడమల మడతల్లో మచ్చలు తయారైన సంద ర్భాల్లో దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. ఇలాంటి సందర్భాల్లో చర్మం రంగు మారడమే కాకుండా విపరీ తమైన దురద ఉంటుంది. లైకెన్‌ ప్లానస్‌ వ్యాధిలో కనిపించే మచ్చలను వాటి రూపాన్ని బట్టి, ప్రదర్శితమయ్యే తీరునుబట్టి వివిధ వర్గాలు గా విభజించారు.ఎక్కువ మందంగా తయార వడం, ఎండిపోయి అట్టకట్టడం, పై పొర తినే యడం వల్ల వ్రణం మాదిరిగా తయారవడం, వెంట్రుక కుదురు వద్ద బొడిపెలు తయారవడం, వలయాలుగా తయారవడం, నిలువు గీతలుగా మచ్చలు కనిపించడం, నీటి పొక్కుల రూపంలో ఉండటం, బిందువులుగా కనిపించడం వంటివి కొన్ని రూపాలు.

లక్షణాలు
లైకెన్‌ ప్లానస్‌ వ్యాధి లక్షణాలు కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక వ్యాధి నిర్ధారణ నిదానం అవసరమవుతుంది. ముఖ్యంగా పిటీరియా సిస్‌ రోజియా, గట్టేట్‌ సొరియాసిస్‌, ప్లేక్‌ సొరియా సిస్‌, సిఫిలిస్‌, టీనియా కార్పోరిస్‌ వంటి వ్యాధుల ను పరిగణించడం అవసరం.ఈ వ్యాధి వల్ల సాధారణంగా ప్రాణహాని ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే 18 నెలల్లో తగ్గిపోతుంది. అయితే అసాత్మ్యకర ఆహార విహారాల వల్ల వ్యాధి తిరగబెట్టి దీర్ఘకాలం బాధించే అవకాశాలున్నాయి. చర్మం మీద తయారైన మచ్చల వల్ల కేన్సర్‌ భయం లేకపోయినప్పటికీ, నోటిలో తయారైన మచ్చలు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఇది కూడా చాలా తక్కువ శాతం కేసుల్లోనే జరుగు తుంది. మహిళల్లో జననేంద్రం వద్ద తయారైన లైకెన్‌ ప్లానస్‌ మచ్చలు స్క్వామస్‌ సెల్‌ కార్సినోమాగా పరిణమించే అవకాశం కొంత ఉంది.

చికిత్స

సరియైన చికిత్స లేదు . . కాని దాని ప్రభావాన్ని కొన్ని మందులవలన తగ్గించవచ్చును .
స్టిరాయిడ్స్ -- నోటిద్వారాను , పైపూతగాను వాడాలి ,
విటిన్‌ ఎ , రెటినోయిడ్స్ వాడితే పొలుసులు గా ఉన్న చర్మము నున్నగా అవుతుంది .
ఇమ్మ్యునో సప్రెసెంట్శ్ (immuno suppressants) వాడాలి ,
Hydroxy choroquine కొంతవరకు పనిచేస్తుంది .
Tacrolimus
Dapsone ,
UVB phototherapy ,
Aloe vera ,
purslane
వంటి మందులు వాడుతున్నారు . మీకు దగ్గరి లో ఉన్న ఫామిలీ డాక్టర్ ని గాని , చర్మవ్యాదుల నిపుణులను గాని సంప్రదిస్తే మంచి సలహా ఇస్తారు .
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, June 18, 2011

గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు , Awareness in food habits of pregnancy


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFzX5MIum0dxa7IkoPZyFw93IS0jIjD4YXQfzP8KPtN-r_3XqT-4oKdL5hrvi6xqf4NItfLQxTUoGs3d-kYSbZch3VRpzYEiO2Gd0C0MacP_AJfN6iigFN0vhj9dKb1yY3FRD5eLy2qEs/s1600/Pregnancy.jpg

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



  • గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.

సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)
  • • గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

తీసుకోకూడని పదార్ధము :
  • బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్తును .

  • కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు (smoked seafoods)తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది .

  • అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.

  • పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో " Solmonella " అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.

  • పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు . పాచ్యురైజేషన్‌ చేయని పాలలో " Listeria " , Bovine T.B అనే బాక్టీరియా ఉంటుంది . దానివలన miscarriage అయ్యే ప్రమాధము ఉండును.

  • కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.

  • సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును. "foetal alcohol syndrome "కి దారితీయును . కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును,

  • కాయకూరలు బాగా కడిగి తినాలి . కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము .

  • విటమిన్‌ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు - దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్‌ తో కూడుకొని ఉన్న విటమిన్‌ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును .

food to avoid during pregnancy in brief:

  • Alcohol--మత్తుపానీయాలు ,
  • Caffeine--కాఫీ , కెఫినేటెడ్ డ్రింక్స్ ,
  • Raw eggs -- పచ్చి , సరిగా ఉడకని గుడ్లు ,
  • fish with mercury-- మెర్కురీ మూలకము ఉన్న చేపలు ,,
  • Smoked sea food-- కాల్చిన సముద్రపు ఉత్పత్తులు ,
  • fish exposed to Industrial pollution-- కర్మాగారాల కెమికల్ తో కూడుకొని ఉన్న చేపలు ,
  • Raw shelfish -- పచ్చి , సరిగా ఉడక్ని ఆల్చిప్పలు , ఎండ్రకాలయలు ,
  • soft cheese -- పాచ్యురైజ్డ్ చేయని పాలతో చేసిన జున్ను ,
  • unwashed vegetables-- శుబ్రముగా కడగని కాయలు ,కూరలు ,
  • unpasteurized milk -- వేడిచేయని పాలు , పాలు పదార్ధాలు ,
  • Pickle and chilly chetnys-- కారము , మసాలా ,ఇంగువతో కూడుకున్న పచ్చళ్ళు , ఊరగాగలు ,

అపోహలు
  • కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.

కొన్ని రకాల అపోహలు
  • - బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది.
  • - కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
  • - మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
  • - గుడ్లు తింటే వేడిచేసి, విరేచనాలు అవుతాయి. గర్భవతులు గుడ్లు తినకూడదు.
  • -నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
  • -నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
  • -క్యారెట్‌, బీట్‌రూట్‌ కన్నా బలమైనది.
  • -కాకరకాయ రసం తాగితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
  • - అరటి పండు తింటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారు.
  • - జున్ను తింటే వాతం చేస్తుంది.
  • నిజానికి ఇవన్నీ మనం తరచుగా వినే విషయాలు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవేవీ మనకు హాని చేసేవి కావన్న విషయం అర్థమవుతుంది. అందుకే వీటిని గురించి వాస్తవాలు తెలసుకోవలసిన అవసరం ఉంది.

-బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.


-కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో పొటాషియం+ లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.

-మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే.

- గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడక బెట్టినవితినాలి.

- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.

-నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.

-బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు... క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకూ మంచిదే.

- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.

-అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.

- జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు . అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.





  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, June 16, 2011

ధ్యానం -ఆరోగ్య ఉపయోగాలు : Meditation and medical uses



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ధ్యానం -ఆరోగ్య ఉపయోగాలు : (Meditation and medical uses)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందనీ, జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ మీకు తెలుసా? ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అల్ఫా రిథమ్‌ అనే తరంగం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. స్పర్శ, చూపు, చప్పుడు వంటి వాటికి జ్ఞానాలకు దోహదం చేసే మెదడులోని కణాల్లో ఈ అల్ఫా రిథమ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది చీకాకుపెట్టే అంశాల వైపు ధ్యాస మళ్లకుండా చేసి ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అందువల్ల ధ్యానం చేయటం ద్వారా మెదడులోని ఈ తరంగాలు నియంత్రణలో ఉంటున్నట్టు.. తద్వారా నొప్పి భావన తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచూ ఏకాగ్రత లోపంతో బాధపడేవారికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.


అశాంతితో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నా ప్రార్థన, ఫలితం దాదాపుగా చెడుగా ఉంటుంది. ఎదుటి వారికి ఏ విధంగా నష్టం చెయ్యకుండా ఉండటం వలన, వీలైతే తగినంత సహాయం చెయ్యడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవిత పరమార్థకత వస్తుంది. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాం… దానిని గుర్తించి, ఎదుటి వారు ఎవరైనా, ఎటువంటి వారైనా ఇబ్బంది పెట్టకుండా ఉందాం.

మరికొంత సమాచారము కోసం -> ధ్యానము ఉపయోగాలు

  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, June 15, 2011

వర్షాకాలం జబ్బుల బాధ లేకుండా.. అవగాహన...జాగ్రత్తలు, Rainy season diseases awareness


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జలుబు జ్వరం
ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటివి ప్రధానంగా వైరస్‌ల కారణంగా వచ్చే సమస్యలు. ఇవి చాలా వరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా కూడా ఇవి ఐదారు రోజుల్లో తగ్గుతాయి. ఈ సమయంలో జలుబు, ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పుల వంటివి ఎక్కువగా ఉంటే.. అవి తగ్గేందుకు ఉపశమన ఔషధాలు తీసుకోవచ్చు. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లు తుడుచుకోవటంతో పాటు ప్యారాసెటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవాలి. ముఖ్యంగా నీరు, ద్రవాహారం ఎక్కువగా తాగాలి. లంఖణం ఉండాల్సిన పని లేదు. తేలికగా జీర్ణమయ్యే ఇష్టమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించటం అవసరం.

టైఫాయిడ్‌
టైఫాయిడ్‌ ప్రధానంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సమస్య. దీనికి 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లోనే నివసిస్తుంది. టైఫాయిడ్‌ బారినపడినవారు, దాన్నుంచి కోలుకుంటున్నవారి రక్తం, పేగుల్లో ఇది ఉంటుంది. వారు మల విసర్జన చేసినప్పుడు ఇది బయటకొస్తుంది. ఈ సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే ఇతరులకు టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. మురుగునీటితో తాగునీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో టైఫాయిడ్‌ అధికంగా కనిపిస్తుంది. టైఫాయిడ్‌ నిర్ధారణ అయితే పూర్తి కోర్సు యాంటీబయోటిక్‌ మందులు తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో మానేస్తే టైఫాయిడ్‌ తిరగ బెడుతుంది. ఇతరులకు వ్యాపించే ప్రమాదమూ ఉంది.

లక్షణాలు
* విడవకుండా జ్వరం రావటం. సాధారణంగా జ్వరం 103 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది.
* కొద్దిగా వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించటం
* కడుపునొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం.

రాకుండా ఉండాలంటే?
* కలుషితమైన ఆహారం, నీటికి దూరంగా ఉండాలి.
* ఆహారం తీసుకునే ముందు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.రోడ్ల పక్కన అమ్మే తిను బండారాలు, పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
* అప్పుడే వండిన ఆహారాన్ని తినటం.. కాచి, చల్లార్చిన నీటిని తాగటం ఉత్తమం.
* టైఫాయిడ్‌ జ్వరం బారినపడకుండా టీకాలు కూడా వేయించుకోవచ్చు.

వర్షాకాలంలో ఏం జరుగుతుంది?
1. విజృంభించే వైరస్‌: వాతావరణ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే మార్పుల కారణంగా కొన్ని రకాల వైరస్‌లు, సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. ఫలితంగా ఈ సమయంలో తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరాల వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఎక్కువ.

2. నీరు కలుషితం: వర్షాల కారణంగా మనం తాగే నీరూ కలుషితమవుతుంది. ఫలితంగా కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు,కామెర్లు, టైఫాయిడ్‌ జ్వరాల వంటివి పెరుగుతాయి.

3. దోమల సంత: వర్షపునీరు నిల్వ ఉండి.. పరిసరాల్లో దోమల సంతతి అనూహ్యంగా పెరిగిపోతుంది. ఫలితంగా దోమకాటు మూలంగా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి సమస్యలూ పెరుగుతాయి.

అయితే వీటిపై అవగాహన పెంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నింటినీ నివారించుకునే వీలుంది.

డెంగీ
దోమలు తెచ్చే పెద్ద ముప్పు ఈ డెంగీ జ్వరాలు. అన్నిచోట్లా విపరీతమైన జనసాంద్రత, పారిశుద్ధ్యలోపం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత లోపించటం.. ఇవన్నీ డెంగీ ముప్పు తెచ్చిపెట్టే 'ఈడిస్‌ ఈజిప్త్టె' దోమ సంతతి పెరిగేందుకు అనువైన పరిస్థితులే. ఈ దోమ కాటు ద్వారా డెంగీ జ్వర కారకమైన ఫ్లావి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇవి ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఎక్కువగా కాళ్లు, చేతుల వంటి భాగాల మీద కుడతాయి. ఇవి స్వచ్ఛమైన నీటిలో పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన తర్వాత రెండు నుంచి ఏడు రోజుల మధ్యలో డెంగీ లక్షణాలు కనబడొచ్చు.

లక్షణాలు
అకస్మాత్తుగా వణుకుతో జ్వరం రావటం. 101 నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకోసారి వెలుతురు చూడటం కూడా కష్టం కావొచ్చు. బలహీనత, నోరు చేదు, ఆకలి మందగించటం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కొంతమందిలో ఛాతీ మీద, వీపు మీద ఎర్రటి చిన్నచిన్న మచ్చలు రావచ్చు. సాధారణంగా జ్వరం వారం పాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. కొంతమందిలో మొదటి రెండు రోజులు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువ.
* డెంగీ తీవ్ర రూపమైన డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌లో రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. శరీరం మీద రక్తపు మచ్చలు రావొచ్చు. కొంత మందిలో ముక్కు, పళ్లచిగుళ్ల నుంచి రక్తం కారొచ్చు. రక్తపు వాంతులు, నల్లని విరేచనాలు కూడా అవ్వొచ్చు.
* డెంగీ షాక్‌ సిండ్రోమ్‌లో.. హెమరేజిక్‌ ఫీవర్‌లో కనిపించే లక్షణాలన్నీ ఉంటాయి. రోగి నాడి కొట్టుకోవటం, రక్తపోటు తగ్గిపోతుంది. ఒళ్లు చల్లబడటం, బాగా చెమట పట్టటం, అస్థిమితం, ఒకోసారి అపస్మారక స్థితిలోకీ వెళ్లే ప్రమాదం ఉంది. ఇవి తీవ్రమైన రకాలు కాబట్టి అసలు డెంగీ జ్వరం రాకుండా చూసుకోవటం అత్యుత్తమం.

రాకుండా ఉండాలంటే?
* పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా.. శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి.
* ముఖ్యంగా పగటి పూట దోమల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
* పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు వేయటం మంచిది. క్లాసు రూముల్లో, ప్రయాణాల్లో దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
మలేరియా
ఒకప్పుడు మలేరియా అంటే తీవ్రమైన చలితో, ఎక్కువగా సాయంత్రం పూట వచ్చే జ్వరమని భావించేవారు గానీ క్రమేపీ ఈ జ్వరం లక్షణాల్లో తేడాలు వస్తున్నాయి. ఈ మలేరియా.. ప్లాస్మోడియం జాతి సూక్ష్మక్రిముల మూలంగా వస్తుంది. ఈ సూక్ష్మక్రిమి ఎనాఫిలస్‌ దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ సూక్ష్మక్రిముల్లో నాలుగు రకాలున్నాయి. వీటిల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ చాలా ప్రమాదకరమైంది. మలేరియా మరణాలకు చాలావరకు ఈ వైరస్‌ కారణమవుతోంది. దోమ కుట్టటం ద్వారా రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు కాలేయాన్ని చేరుకుంటాయి. అనంతరం కాలేయంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అక్కడ్నుంచి రక్తప్రసరణలో కలిసి మలేరియా దాడి చేయటానికి దోహదం చేస్తాయి.

లక్షణాలు
* తొలిదశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.
* తర్వాత రోజు విడిచి రోజు జ్వరం వస్తూ పోతుంటుంది.
* చలితో వణకటం, దుప్పట్లు కప్పితే కొంతసేపటికే చెమటతో తడిసిపోయి ఒళ్లంతా చల్లబడుతుంది.
* అనీమియా, కొందరిలో ప్లీహం కాస్త పెద్దగా అవటం ఉంటుంది.
* సెరిబ్రల్‌ మలేరియా ప్రాణాంతకమైంది. ఇందులో నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది.
* కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యం కూడా కనబడుతుంది.

రాకుండా ఉండాలంటే?
* చేతులు కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
* దోమల బారినపడకుండా దోమతెరలు, రిపెలెంట్లు, కాయిల్స్‌, క్రీములు, లోషన్ల వంటి వాటితో దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలి.
* కిటికీలకు తప్పకుండా మెష్‌లు అమర్చుకోవాలి.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
* ఖాళీ పాత్రలు, వాడకుండా ఉన్న ఎయిర్‌కూలర్ల వంటి వాటిల్లో నీరు లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లోని ఖాళీ డ్రమ్ముల వంటి వాటిని బోర్లించాలి. టెంకాయ చిప్పలు, పాత టైర్ల వంటి వాటిని దూరంగా పారేయాలి.
* మలేరియా ప్రబలిన ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే వైద్యుడిని సంప్రదించి యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలాంటి చోట్లకు గర్భిణులు వెళ్లకపోవటమే మంచిది.
కామెర్లు
వాస్తవానికి కామెర్లు అనేది ఒక లక్షణం మాత్రమే. ఇది హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి వంటి ఎన్నో ఇన్ఫెక్షన్లలో రావచ్చుగానీ ఈ సీజన్లో విజృంభించే కామెర్లకు ఎక్కువగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ రకం వైరస్‌లు కారణమవుతాయి. ఇవి ప్రధానంగా కలుషితాహారం, కలుషితమైన తాగునీటి కారణంగా వ్యాపిస్తాయి. వర్షకాలంలో మురుగు నీరు తాగునీటితో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీంతో ఈ రకం కామెర్లు ప్రబలిపోయే ప్రమాదం పొంచి ఉంటోంది. కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారటం, రక్తంలో బిలురుబిన్‌ స్థాయి పెరగటం, శరీరంలోని సున్నితమైన చర్మం కూడా పచ్చబడే అవకాశాలుంటాయి. ఇలా హెపటైటిస్‌-ఎ, ఇ రకం వైరస్‌ల కారణంగా వచ్చే కామెర్ల సమస్య రెండు మూడు వారాల్లో సహజంగానే దానంతట అదే తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ఇది తేలికగానే తగ్గిపోతుంది గానీ పెద్దవయసు వారిలో నెలల తరబడి వేధించవచ్చు. దీన్ని అశ్రద్ధ చెయ్యటానికి లేదు.

లక్షణాలు
* హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-ఇ రకం వైరస్‌ల వల్ల కామెర్లలో ప్రధానంగా ఆకలి మందగిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లో కేవలం వాంతులు, కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లంతా నొప్పి వంటి ఉంటాయి. నాలుగైదు రోజుల తర్వాత మూత్రం పచ్చగా అవుతుంది. క్రమంగా చర్మం, కంట్లో తెల్లభాగం, గోళ్లు, నాలుక పసుపు పచ్చగా అవటం. మూత్రం కూడా పసుపు రంగులో రావటం. కొన్ని సందర్భాల్లో మలం తెల్లగా, నల్లగా రంగూ మారొచ్చు.
* కడుపునొప్పి, చికాకు, బలహీనత వంటివీ కనిపిస్తాయి.
* కామెర్లు ముదిరితే వాంతిలో రక్తం పడటం, కడుపులో ద్రవాలు పేరుకుపోవటం వంటి ప్రమాదకర లక్షణాలు కూడా ఉంటాయి.

రాకుండా ఉండాలంటే?
* పరిశుభ్రమైన నీటినే తాగాలి. తాగునీటిని బాగా మరగకాచి, వడకట్టి, చల్లారిన తర్వాత తాగటం మంచిది.
* సాధ్యమైనంత వరకూ ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. బయట రోడ్ల మీద అమ్మే పదార్థాలు, పండ్ల రసాల వంటివి కలుషితమయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.
* కూరగాయలు, ఆకుకూరలను బాగా కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించాలి. పండ్లను కూడా శుభ్రంగా కడిగాకే తినాలి.
* కామెర్ల లక్షణాలు కనబడితే ఆకుపసర్లు, చెట్టుమందులంటూ తాత్సారం చేయకుండా అసలు అవి ఏరకం కామెర్లన్నది నిర్ధారణ చేసేందుకు, తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్యులను సంప్ర దించాలి.

నీళ్ల విరేచనాలు
బ్యాక్టీరియా, వైరల్‌, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల మూలంగా నీళ్లవిరేచనాలు (డయేరియా) వస్తాయి. రోజుకి మూడు అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా భావించొచ్చు. సాధారణంగా ఇది రెండు మూడు రోజుల వరకు ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాంతులు విరేచనాలతో బాధపడే వారికి ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

వాంతులు విరేచనాలతో ఒంట్లో నీటితో పాటు ముఖ్యమైన లవణాలు కూడా బయటకు పోతాయి. వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోతే 'డీ హైడ్రేషన్‌'కు దారి తీస్తుంది. ఇలాంటి సమయాల్లో కొందరికి సెలైన్‌ పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అందువల్ల పరిస్థితి ముదరకుండా వాంతులు విరేచనాలు అవుతుంటే 'ఓఆర్‌ఎస్‌'ను అరగ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి.

ఎన్నిసార్లు విరేచనాలు అయితే అన్నిసార్లు ఓఆర్‌ఎస్‌ కలిపిన ద్రావణాన్ని తాగటం తప్పనిసరి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ, పప్పునీళ్ల వంటి వాటినీ తరచుగా తీసుకోవాలి.

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, June 13, 2011

ఒంట్లో నీరు చేరుట లో అవగాహన , Edema in the body awareness




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వంట్లోనీరు చేరుట - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవ శరీరము బరువు లో సుమారు 70 శాతము బరువు నీరే . శరీర కణము లోన , కణము బయట , రక్తనాళాలలోన సీరం రూపమ్లో ఈనీరు ఉంటుంది . నీరు జీవి బ్రతికేందుకు అత్యవసరము . నీటి పరిమాణము , నిష్పత్తి సమపాల్ళలో ఉండేందుకు శరీర అవయవాలు నిరరంతము పనిచేస్తూ ఉంటాయి . ముఖ్యము గా మూత్రపిండాలు , చర్మము ఈ పనిలో ముఖ్యమైనవి .

శరీరములో అక్కడక్కడ నీరి చేరి(fluid accumulation in body tissues) , లోపల ఉన్న నీరు బయటికి వెళ్ళకుండా శరీరము లో ఉండిపోవడం ఎక్కువ బాధ పెట్టె పెద్ద సమస్య కాకపోయినా ఇది శరీరము కొన్ని ముఖ్యమైన అవయవాల క్రియాశక్తి లోపాలకు సూచన . ఒక్కోసారి మనిషి దీనివల్ల చనిపోయే అవకాశము ఉండవచ్చును . కొందరిలో ఇది కాళ్ళలోనూ , ముఖం లోనూ , పొట్టలోనూ లేదా ఏదో ఒక అవయానికే పరిమితం అవవచ్చును.
శరీరములో నీరు చేరడం 3 రకాలు ---
ఏదైనా ఒక బాగానికి నీరు చేరి వాపు రావడం --Lacal edema .. అంటారు .
శరీరమంతా ఏకరీతిగా నీరు చేరడం -- generalized edema ... ఆంటారు .
శరీరము లో ఉన్న క్యావిటీలలో (body cavities) నీరు చేరడం . ఉదా: జలోదరము , ఫ్లూరల్ ఎఫ్యూషన్‌ మున్నగునవి .
ఇందులో వేలి తో నొక్కితే చొట్ట పడేది , చొట్ట పడనిది అని రెండు విధాలు గా ఉంటుంది . చొట్టపడని ఎడీమా లింఫాటిక్ మండలము (Lymphatic system) వ్యాదిగ్రస్తమవడం వల్ల ఏర్పడుతుంది ... దీనిని Lymphedema అంటాము . చొట్టపడని ఎడీమా కి ఇంకో కారణము థైరాడ్ వ్యాదులలో ఒకటైన మిక్షెడిమా(due to Hypo-thyroidism)

చొట్టపడే ఎడీమ చాలా సాదారణము కనిపించే ఈరకం నీరుచేరడం . ఇది రక్త నాళాలలో ఉన్న ద్రవము లీకు అవడం వలన కణాల మధ్యలోనికి వచ్చి వాపుగా యేర్పడుతుంది . నాళాలళొ pressure ఎక్కువ అయినపుడు ఇది జరుగుతూ ఉంటుంది .

కారణాలు / వ్యాధులు :
గుండె జబ్బులు (heart failure, CCF),
మూత్రపిండాల వ్యాధులు (nephrotic syndrome),
కాలేయ సంబంధిత వ్యాధులు (liver failure-cirrhosis),
varicose veins ,
Thromboplebitis,
Dermatitis ,
Skin allerty ,
filaria edema ,
Lipo edema ,
myxedema .
ఎక్కువ సేపు నిలబడడం మూలం గా వచ్చే వాపులు .(hypostatic postural edema),
ఎక్కువ ఉప్పు పదార్ధములు తినడం మూలాన వచ్చే వాపులు ,
స్త్రీలలో భహిస్టలు ముందు జరిగే హార్మోనుల అసమతుల్యము వలన వచ్చే వాపులు ,
కొంతమంది గర్భిణీ లలో ఎక్కువ నీరు నిలవా అవడం మూలాన వచ్చే వాపులు ,

కొన్నిరకాల మందులు వాపులకు కారణము కావచ్చును : అవి ->
వ్యాసోడైలేటర్స్ (vasodilators)-- ఈ మందులు రక్తనాళము లోపల పరిమాణము పెరిగేందుకు , చిన్న చిన్న రక్తనాళాలు తెరుచుకునేందుకు వాడుతారు . ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
కాల్సియం చేనల్ బ్లోకర్స్ (calcium channel blockers) : వీటిని క్యాల్చియం యాంటాగొనిస్ట్స్ అంటాము . ఇవి కూడా రక్తపోటును నియంత్రిస్తాయి.
NSAIDs -- నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇంఫ్లమేటరీ డ్రగ్స్ అని వ్యవరిస్తారు . నొప్పులు తగ్గడానికి వాడుతారు . ఎక్కువకాలము వాడినవారిలో శరీరం వాపులు వస్తాయి.
స్త్రీల సంభందిత హార్మోన్‌ అయిన సంతాననిరోదక మాత్రలు (Estrogens)ఎక్కువకాలము వాడినా ,
మధుమేహ బాదితులు ఇన్సులిన్‌ సెన్‌సిటైజర్స్ ... ఉదా : thiazolidinidiones group drugs ఎక్కువకాలము వాడినా ఈ వాపులు కనిపిస్తాయి.

Mechanism --ఎలా ఏర్పడుతుంది .: శరీరములో చిన్న రక్తనాళాలైన క్యాపిల్లరీస్ (capillaries) నుండి ద్రవము (సీరం) లీకు అవడం వలన ఎడీమా ఏర్పడుతుంది . ఈ లీకేకీ ఆయా రక్తనాళాలకు దెబ్బతగలడమో(damage)లేదా వాటిలో పీడనము(increased pressure) ఎక్కువ అవడము మూలానో జరుగుతుంది . ఈ ద్రవము లీకేజీ సాంకేతికాలు మూత్రపిండలకు చేరి ఎక్కువ సోడియం నిలవాకి దోహదం పడి ఆ లీకైన ద్రవాన్ని బర్తీచేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ వలనే మరింత ద్రవము కణాలచుట్టూ చేరి వాపులకు దారితీస్తుంది .
increased hydrostatic pressure --రక్తపోటు ఉన్నవారిలోను, మిగతా రక్తనాళాల వ్యాదులలో , సిరలు లో కవాటాలు నీరసత్వము ,
reduced Oncotic pressure with in blood vessels, -- రక్తములో ప్రోటీన్లు శాతము తగ్గినపుడు .
increased tissue oncotic pressure , -- సోడియం శాతము ఎక్కువైనపుడు ,
increased blood vessel wall permiability -- inflamation , -- కొన్ని రక్తనాళాల వ్యాధులలో,
obstruction of fluid clearance via lymphatic system ,-- ఫైలేరీయా వంటి వ్యాధులలో ,
Sodium retention conditions .,--- మూత్రపిండాల వ్యాదులలో ,

వాపులకు లోనయ్యే కొన్ని అవయవాలు ... ఉదాహరణ:
మెదడు పొరలు , కణాలు వాపు --Cerebral edema .
ఊపిరితిత్తుల లో వాపు --- pulmonary edema ,
కళ్లలో వాపు --- corneal edema , conjunctivitis , keratitis ,
కళ్ళ చుట్తూ , ముఖం లో వాపు ---- puppiness of face in Kidney diseases ,
జల ఉదరము -- cirrhosis liver ,
మిక్షెడిమా --- hypothyroid diseases ,
రక్తపోటు ఉన్నవారిలో -- legs in hypertension ,
కాళ్ళ వాపులు -- Heart diseases , ccf ,

ఎలా గుర్తించడం : Symptoms ->
ముఖం ఉబ్బరించినపుడు , కాళ్ళు , పాదాలు , మోచేతులు , కాళ్ళు గుత్తులు వాచినట్లుండడం ,
పొట్ట క్రమము గా ఉబ్బినట్లవడం నీటి కుండలా ఉండడం ,
శ్వాస చిన్నగా అవడం .. చాతిలో నొప్పి రావడం ఆయాశము గా ఉండడం ,
ముఖం ఉబ్బడం , కళ్ళచుట్టూ వాపులు గా ఉండడం ,
చర్మము సాగి పల్చబడి మెరిసే టట్లు కనిపించడం ,
వీటిలో ఏది ఉన్నా డా్క్టర్ ని సంప్రదించాలి . తగిన చికిత్స తీసుకోవాలి .

చేయవల్సిన పరీక్షలు :
యూనిన్‌ టెస్ట్ లు (urine analysis),
బ్లడ్ తనికీలు (Blood analysis) ),
బి.పి , సుగరు తనికీలు (B.P, diabetes tests),
చాతి ఎక్షురే (chest X-ray),

నివావరణ మార్గాలు :


శరీరము లో నీరు ఉండిపోవడానికి కారణం తెలుసుకొని మందు తీసుకోవాలి . తాత్కాలికం గా డయూరిటిక్స్ వాడవచ్చును . బార్లీ నీరు తాగితే ఫలితం ఉంటుంది .
Tab . Lasix 1-2 tab for day 3-4 days , దీనివల్ల వాపులు తగ్గినా సరియైన చికిత్సకోసం పరీక్షలు చేయించుకోవాలి అందుకొరకు మంచి వైద్యనిఫుణులను సంప్రదించాలి .





  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, June 2, 2011

బెణుకు, sprain


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బెణుకు, sprain- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



తరచుగా చాలామంది మడమ(ankle)బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి మరియు మణికట్టు కీళ్ళకు జరుగుతుంది. బెణికిన వారిలో 25 శాతం మందికి దీర్ఘకాలంపాటు జాయింట్లలో నొప్పి, కండరాలు బలహీనంగా మారటం ఉంటాయి.

చీలమండ బెణకడం అనేది రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటివైపునకు తిరగడం వలన పాదం లోపలికి ఒరగటం మొదటి విధానం. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. చీలమండ బైట వైపున ఉండే స్నాయువులు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇక రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలివైపునకు తిరగడం వలన పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి.

లక్షణాలు
బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది. అలాగే వాపు, ఎరుపుదనాలు కనిపిస్తాయి. దెబ్బ తిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పి వస్తుంది.ఒక మోస్తరు బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. కొంతమంది బెణికినప్పుడు చీరుకుపోయిన శబ్దాన్ని గాని, విరిగిన శబ్దాన్ని గాని వింటారు. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది

తీవ్రత బట్టి వర్గీకరణ

బెణుకు ని ఆంగ్లం లొ స్ప్రైయిన్ అని పిలుస్తారు. ఇది తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది.
* మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ప్రధమ చికిత్స

చికిత్సని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.

* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
* Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
* Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
* Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
* Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం,

వైద్యుణ్ణి ఎప్పుడు కలవాలి? బెణికినప్పుడు చీలమండ వద్ద ఏదో విరిగినట్లు శబ్దం రావడం. భరించలేనంత స్థాయిలో నొప్పి, వాపు, ఎరుపుదనాలు కనిపించడం లేదా రెండు వారాలకు మించి కొనసాగడం, పాదం మీద బరువు మోపలేకపోవడం, చీలమండ స్థిరత్వాన్ని కోల్పోవడం,దెబ్బ తగిలిన తరువాత తిమ్మిర్లు, మొద్దుబారటాలు ఉండటం తదితర సమయాల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

బెణికిన మడమకు ఏది మంచిది ?
ఎప్పుడైనా మడమ బెణికినపుడు వెంటనే వేడి కాపడం పెట్టటం మంచిదని చాలామంది చెబుతుండటం తెలిసిందే. ఇది నొప్పిని తగ్గిస్తుందని, రక్త ప్రసరణను ప్రేరేపించటం ద్వారా వాపు తగ్గేలా చేస్తుందని నమ్ముతుంటారు. కానీ మరికొందరు ఇందుకు పూర్తి విరుద్ధంగా బెణికిన చోట మంచుముక్కలు పెడితే మేలని భావిస్తుంటారు. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుందని, వాపు పెరగకుండా తోడ్పడుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో ఏది మంచిది? ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పరిశోధనలు మాత్రం మంచుకే ఓటేస్తున్నాయి. ఆటల్లో మడమ బెణికిన క్రీడాకారులపై శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేశారు. ఒకసారి వేడి కాపడం, మరోసారి మంచు పెట్టటం.. ఇలా రకరకాలుగా పరీక్షించారు. వీటితో పాటు నొప్పి నివారణ మందులు కూడా ఇచ్చారు. బెణికిన వెంటనే అక్కడ మంచుముక్కలను ఉంచటం ద్వారా త్వరగా ఉపశమనం కలుగుతున్నట్టు తేలింది. కాబట్టి బెణికిన మడమకు రక్షణ, విశ్రాంతి, మంచు పెట్టటం (20 నిమిషాల సేపు), బ్యాండేజీ చుట్టటం, కాలు ఎత్తుగా ఉంచటం.. అనే పద్ధతిని పాటించటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే.. మడమ బెణికితే వేడి కాపటం కన్నా మంచు ముక్కలను పెట్టటం మంచిదన్నమాట.

ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
తరచుగా చాలామంది మడమ బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి .

* మడమ బెణికినప్పుడు విశ్రాంతి తీసుకోవటం అన్నింటికన్నా ప్రధానం. పాదం మీద భారం పడకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం అవసరమైతే క్రచెస్‌, చేతికర్ర ఉపయోగించటానికి మొహమాట పడొద్దు.

* సాధ్యమైనంతవరకు పాదాన్ని తొడల కన్నా ఎత్తుగా ఉంచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.

* చిన్నపాటి బెణుకులైనా తగ్గటానికి రెండు వారాల సమయం పడుతుంది....ఇసుగుపోకూడదు .

* వీలైనంత త్వరగా మడమపై ఐస్‌ బ్యాగ్‌ని పెట్టాలి. రెండు మూడ్రోజుల వరకు తరచుగా ఇలా చేస్తుండాలి.

* వాపుని తగ్గించటానికి సాగే బ్యాండేజీని మడమకు చుట్టాలి.

లేదా............బామ్మ చెప్పిన చిట్కాలు మంచివే !

చింతపండు, పాత బెల్లం మిశ్రమాన్ని వేడి చేసి బెణుకు నొప్పులుండే చోట లేపనం చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది

యూకలిప్టస్‌ నూనె (ఆయిల్‌) చర్మానికి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన అనారోగ్యాలను పోగొడుతుంది. తలనొప్పిని, బెణుకు నొప్పులను యూకలిప్టస్‌ ఆయిల్‌ను పూయడం వల్ల ఆ బాధను తగ్గిస్తుంది.

బెణుకు, వాపుల నొప్పి తగ్గటానికి మెంతులను ఉడికించి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు, నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుకడితే నివారణ కలుగుతుంది. అయితే రెండు మూడుసార్లు ఈ విధంగా కట్టు కట్టాలి.

ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి.

ఇంగ్లిష్ (allopathy) చికిత్స :
నొప్పికి -> Tab . Aceclonac 750 one tab two time a day, for 7-10 days. or
->Tab . Dolomed MR one tab 3 times a day for 7- 10 days
పై మాత్రలు వాడినప్పుడు కడుపులో మంట రాకుండా tab pantop 40 daily one పరగడుపున వాడాలి .
Frimov ointment పై పూత గా రాయాలి . 3-4 రోజులు .
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, June 1, 2011

బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ , Awareness in Bypass surgery for Heart problem.




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ ( Awareness in Bypass surgery for Heart problem)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కొంతకాలం క్రితం వరకు బైపాస్ సర్జరీ అంటే అందరికీ భయమే. బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఎక్కువ కాలం బతకకపోవచ్చనీ ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. అదే సమయంలో సర్జరీలో కొత్తవిధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో గుండెను ఆపి, గుండె చేసే పనిని మరో యంత్రంతో చేయిస్తూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గుండె యథావిధిగా రక్తాన్ని పంపింగ్ చేస్తుండగానే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ వివరాలను ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు వివరిస్తున్నారు.
గుండెకు నిరంతరం రక్తం సరఫరా జరుగుతూ ఉండాలి. ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అథెరోస్క్లిరోసిస్ (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం)వల్ల గుండె రక్తనాళాల్లో(ధమనుల్లో) అడ్డంకులు ఏర్పడతాయి. ఇది ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనే జరిగిపోయేది కాదు. దీర్ఘకాలం పాటు కొనసాగి క్రమంగా రక్తనాళం మూసుకుపోతుంది. 60 నుంచి 70 శాతం రక్తనాళం మూసుకుపోయినపుడు రక్తసరఫరా బాగా తగ్గిపోతుంది.


ఈ సమయంలో ఛాతీ నొప్పి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది, ఆయాసం, భుజంలో నొప్పి, దవడ వైపు నొప్పి పాకుతుండటం వంటి లక్షణాలుంటాయి. కొందరిలో ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో ఛాతీ నొప్పి ఉండదు. ఎటువంటి లక్షణాలు లేకుండానే హార్ట్ఎటాక్ వస్తుంది. 70 శాతం కంటే తక్కువ బ్లాక్ ఉన్నప్పుడు యాంటీప్లేట్‌గగలెట్స్ వాడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది. చాలా మందిలో ఇసిజి, ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌టెస్ట్(టీఎమ్‌టీ)లో రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు బయటపడుతుంది.

కారణాలు
రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటానికి చాలా కారణాలుంటాయి. పొగతాగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, కుటుంబ సభ్యుల్లో గుండె జబ్బులు ఉన్న చరిత్ర, ఒబెసిటీ వంటివి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

ఎవరికి అవసరం?
మందులతో నొప్పి తగ్గకపోయినా, యాంజియోగ్రామ్‌లో రక్తనాళం బాగా మూసుకుపోయినట్లు తెలిసినా యాంజియోప్లాస్టీ లేదా సర్జరీ(సిఎబిజి) చేయాల్సి ఉంటుంది. యాంజీయోప్లాస్టీ వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే రక్తనాళాలు మూసుకుపోయిన అందరికీ యాంజియోప్లాస్టీ ఉపయోగపడకపోవచ్చు. రక్తనాళాల్లో ఎక్కువ చోట్ల బ్లాక్స్ ఉన్నప్పుడు, డయాబెటిస్ రోగులకు, గుండె పనితీరు బలహీనంగా ఉన్నప్పుడు, లెఫ్ట్ మెయిన్ కరొనరీ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.

సర్జరీ
బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండె చేసే పనిని నిర్వర్తించడానికి హార్ట్ లంగ్ మెషిన్ అమరుస్తారు. ఆపరేషన్ సమయంలో ఇది గుండె, ఊపిరితిత్తుల పనిని నిర్వర్తిస్తుంది. ఇటీవల ఒపిసిఎబి(ఆఫ్ పంప్ కరొనరీ ఆర్టరీ బైపాస్) అనే నూతన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బైపాస్ సర్జరీ నిర్వహించినపుడు గుండెను ఆపాల్సిన పనిలేదు. ఆపరేషన్ సమయంలో కూడా గుండె రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది. ఈ పద్ధతిలో గ్రాఫ్టింగ్ కోసం ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది.

కన్వెన్షనల్ బైపాస్ సర్జరీ కన్నా ఇందులో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. రోగి చాలా తక్కువ సమయంలో కోలుకుంటారు. మందులు, రక్తం తక్కువగా అవసరమవుతుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి, గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. గ్రాఫ్టింగ్ కోసం ఎడమ ఛాతీ గోడల్లోని ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీని, ముంజేతి భాగం నుంచి రేడియల్ ఆర్టరీని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఇంటర్నల్ మమ్మరీ అర్టరీని ఉపయోగించడం జరుగుతుంది. ఇందుకంటే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. సిఎబిజి సర్జరీ చేసిన పదేళ్ల తరువాత అర్టీరియల్ గ్రాఫ్ట్‌తో పోల్చితే వెయిన్ గ్రాప్ట్స్ 66 శాతం మాత్రమే తెరుచుకుని ఉంటోంది.


సర్జరీ తరువాత
సర్జరీ తరువాత ఐదారు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చు. అయితే ఆరు వారాల పాటు అధిక బరువులు లేవనెత్తకూడదు. ఛాతీకి దెబ్బతగలకుండా చూసుకోవాలి. వెహికిల్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఆరు వారాల తరువాత సాధారణ పనులు చేసుకోవచ్చు. మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం మరవద్దు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే కొత్తగా బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి.

బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లాలి. పొగతాగడం మానేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. అల్కహాల్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సర్జీరీ చేసి బ్లాక్స్‌ను మాత్రమే తొలగిస్తున్నామే తప్ప బ్లాకులు ఏర్పడే శరీర లక్షణాలను తగ్గించలేం. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే కొత్తగా బ్లాక్స్ ఏర్పడకుండా ఉంటాయి.


డా. నాగేశ్వర్‌రావు-కార్డియోథొరాసిక్ సర్జన్,-యశోద హాస్పిటల్స్, నల్లగొండ క్రాస్ రోడ్,-మలక్‌పేట్, హైదరాబాద్,-ఫోన్ : 9246271144.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep benefits.


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep and benefits.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధ్యాహ్నం అలా కునుకు తీయడం మీకో అలవాటా? హాయిగా ఓ గంటపాటు మిట్టమధ్యాహ్నం నిద్దరోతున్నారా? అయితే మీ ఆరోగ్యానికేం ఢోకా లేదంటున్నారు హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు. ఇకపై మీ వారు మధ్యాహ్నం ఆ మొద్దునిద్దరేమిటని అడిగితే అదో హెల్త్‌ సీక్రెట్‌ అని చెప్పండిక.

ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు కునుకు తీయడమే...! పగలు కొంతసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు...! కొందరు కాసేపు కునుకు తీసుకుంటాను. అని అంటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరికి అలవాటే. ఈ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవంటున్నారు పరిశోధకులు.

ఇలా కునుకు తీసేవారి జాబితాలో ప్రముఖులెందరో వున్నారు. వారిలో కొందరి పేర్లు మీకోసం... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్, రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, హెచ్‌డి. దేవెగౌడ తదితర ప్రముఖులున్నారు. కాబట్టి సమయం, సందర్భం అనుకోకుండా మీరు అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు.

మొదడు చురుగ్గా పనిచేసేందుకు..!
కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరి మరింత సమర్థవంతంగా, సృజనాత్మకతతో పని చేయవచ్చట. పగలు కాసేపు పడుకోవడం టైమ్‌ వేస్ట్‌ చేయడమనుకుంటే పొరపాటే. కళ్లకు కాసింత విశ్రాంతి ఇచ్చేందుకు మంచి మార్గం ఇది. మొదడు చురుగ్గా పనిచేసేందుకు పగలు కాస్త కునుకు తీస్తే మంచిది.

రిలాక్స్‌ అయ్యేందుకు
గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు పగటి నిద్ర ఉపకరిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండు తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాలు కాస్త తక్కువే.

మంచి డైట్‌ పాటించేవారిలో దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, ఆలివ్‌ ఆయిల్‌, కొద్దిపాటి రెడ్‌వైన్‌ తీసు కునే వారిని, సాధారణ డైట్‌తో మధ్యాహ్నం నిదురపోయే వారిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు ఆశ్చర్యకరంగా వున్నాయి. పగటి నిద్ర పోయేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం డైట్‌ పాటించేవారికన్నా తక్కువగా వుంది. వారానికి కనీసం మూడురోజులు అరగంట సేపు పగలు నిదురపోయేవారిలో గుండెజబ్బులతో మరణించే అవకాశం మామూలుకంటే 37% తక్కువ.

తిండివల్ల కాదు
మధ్యాహ్నం భోజనం మితిమీరి తినడం వల్ల నిద్రముంచుకొస్తుందని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది నిజం కాదని తేల్చారు శాస్త్రవేత్తలు. భోజనం చేయకున్నా మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. పైగా దీనివల్ల అలర్ట్‌గా వుండే శక్తి, ప్రొడక్టివిటీ పెరుగుతుందట కూడా.

నిర్ణయాత్మక శక్తి
క్లిష్ట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసు కునే శక్తి పెరిగేందుకు పగలు నిద్ర ఉపకరిస్తుంది. మెదడుకు రిఫ్రెష్‌నెస్‌ను కలిగించేది ఇదే. పగలు కాస్త కునుకు తీసి తరువాత ఏదైనా పనిని మొదలు పెడితే అది మరింత సమర్థవంతంగా వుంటుంది.

ఒత్తిడి మాయం
మనిషి పుట్టడం, చావడం మధ్యలో బ్రతకడం అంతా ఒత్తిడితోనే. ఈ ఒత్తిడి అనేది కొందరిలో ఎక్కువ పరిమాణంలో కొందరిలో తక్కువగానూ ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుంటేనే ఆయు ర్దాయం పెరుగుతుందనేది వాస్తవం. ఈ ఒత్తిడిని మాయం చేసే మార్గం కాసేపు కన్నులు మూసు కుని ప్రశాంతంగా నిద్రపోవడమే.

అందానికీ మందు
అలసటను తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖంలోని రక్త కణాలు నిద్రించే సమయంలో యాక్టివ్‌గా పనిచేయడమే ఇందుకు కారణం. సహజమైన వర్ఛస్సుకు తేలికైన మార్గం కదూ! తెలిసిందిగా పగలు పదినిమిషాలు ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఎన్ని ఉపయోగాలో. ఆరోగ్యం, అందం, విశ్రాంతి అన్నీ ఒక్కసారిగా దొరుకు తాయన్నమాట. మనమూ ఓ కునుకులాగిద్దామా!

అతినిద్ర

నాక్రొలెప్సీ సమస్య ఉన్నవారు అతినిద్ర జబ్బుతో ఉంటారు. చదువు తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కునుకు తీస్తుంటారు. పదివేల మందిలో నలుగురికి ఈ సమస్య ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య అధికం. నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పడిపోతారు. నడుస్తూ కలలుకంటారు. పరిసరాలను పట్టించుకోరు. ఏంచేస్తున్నారో మరచిపోతారు.

కొన్ని చిట్కాలు పాటిస్తే దీంతో మరింత మేలు కలిగేలా చూసుకోవచ్చు.

* ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ముఖ్యంగా పనులు చేసే సమయంలో దీని మరవొద్దు. చాలాసేపు కునుకు తీస్తే చాలాసేపటి వరకు మగతగా అనిపిస్తుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పగటిపూట 10-20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోవద్దు. సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది.

* చీకటి పడుతుండగా కునుకు తీయకపోవటమే మంచిది. రాత్రిపూట పడుకునే సమయానికి దగ్గర్లో కునుకు తీస్తే ఆనక నిద్ర పట్టకపోవచ్చు. నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం మేలు. సాధారణంగా ఈ సమయంలో మన జీవగడియారం నిద్ర వస్తున్న భావన కలగజేస్తుంటుంది.

* నిద్రలేమి, నిద్ర మధ్యలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం వంటి సమస్యలు గలవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.

* కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం. ఇలాంటివాళ్లు రాత్రిపూట తగినంత నిద్రపోయేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు.

Source : from Medical journals
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/