Sunday, October 30, 2011

మన ఆరోగ్య పరిరక్షణలో బ్యాక్టీరియా , Bacteria in protecting our health


  • image courtesy with Eenadu newspaper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మన ఆరోగ్య పరిరక్షణలో బ్యాక్టీరియా , Bacteria in protecting our health-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఒకప్పుడు చాలా వ్యాధులు మనకు పెద్ద మిస్టరీ! అవి ఎందుకు వస్తున్నాయో కారణమేమిటో తెలియక కొన్ని యుగాల పాటు మనిషి అయోమయంలో, అపోహల్లో గడిపేశాడు. కానీ సూక్ష్మజీవులు మన కంటబడిన తర్వాత వ్యాధుల పట్ల మన అవగాహనే మారిపోయింది. 18వ శతాబ్దంలో బలంగా మన ముందుకు వచ్చిన ఈ 'సూక్ష్మజీవుల సిద్ధాంతం (జెర్మ్‌ థియరీ) వ్యాధుల పట్ల మన అవగాహననే మార్చేసింది.మన కంటికి కనిపించని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వ్యాధులకు కారణమవుతున్నాయని గ్రహించగానే... వాటిని మట్టుబెట్టే యాంటీబయాటిక్స్‌ రంగం మీదికి వచ్చాయి. ఆ సూక్ష్మజీవులను అడ్డుకోవటానికి పరిశుభ్రత పాటించటం వంటివి ఆరంభించాం. దీంతో ఎన్నో వ్యాధులను అడ్డుకోగలిగాం, ఎన్నో ప్రాణాలనూ కాపాడుకోగలిగాం. కానీ వీటన్నింటి వల్లా.. మనందరిలో 'బ్యాక్టీరియా' అంటే చెడ్డది, మనకు హాని చేసేదేనన్న భావన బలపడిపోయింది. సూక్ష్మజీవులంటే మనకు కీడు తలపెట్టేవేనన్న నమ్మకం బలపడింది. కానీ ఇది నిజం కాదు!

మన పేగుల నిండా కోటానుకోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరుగాడుతోంది. వీటిలో ఎన్నో రకరకాలున్నాయి. ఇవి ముఖ్యంగా పెద్దపేగు, చిన్నపేగులలో నివాసం ఉంటూ అనుక్షణం రకరకాలుగా మనకు మేలు, సహాయం చేస్తున్నాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం దగ్గరి నుంచీ.. భారీ సైన్యంలా పనిచేస్తూ హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులకు రక్షణగా పహారా కాస్తుండటం వరకూ ఎన్నో పనులు చేస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ల నుంచి, అలర్జీల నుంచిమనకు రక్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10 శాతం చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంది. దీని ప్రాబల్యం పెరిగితే- పొట్టలో గ్యాస్‌ పెరగటం, అజీర్ణం, విరేచనాల వంటివి చుట్టుముడతాయి, కొన్నిసార్లు ఇవి క్యాన్సర్లకూ కారణం కావచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండేందుకు- పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను రక్షించుకుంటూ చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. కానీ ఆధునిక కాలంలో మనం విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌ వాడుతుండటం, బాగా శుద్ధిచేసిన ఆహారపదార్థాలు ఎక్కువగా తింటుండటం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా బలహీనపడి, చెడ్డ బ్యాక్టీరియా బలోపేతమవుతోంది. ఫలితంగానే ఎన్నో వ్యాధులు పెరుగుతున్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వీటిపై విస్తృతంగా అధ్యయనాలు సాగుతున్నాయి.

వ్యాధులకు మూలం!
పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగటం వల్ల పేగుపూత (ఐబీడీ, ఐబీఎస్‌, అల్సరేటివ్‌ కోలైటిస్‌), పెద్దపేగు క్యాన్సర్ల వంటివి పెరుగుతున్నాయని పరిశోధనా ప్రపంచం ఇప్పటికే బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచటం ద్వారా ఈ వ్యాధులను ఎదుర్కొనాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మన పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి తలపడుతూ, నిరంతరం పోరాడుతూ, ఒక దాని స్థానాన్ని ఒకటి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువ ఉన్నంత వరకూ సమస్య ఉండదు. వీటిలో ఆమ్లాలను ఉత్పత్తి చేసి పేగులను కాపాడుతుండే లాక్టోబ్యాసిల్లస్‌, బిఫిడో బ్యాక్టీరియం వంటి రకాలను, అలాగే మీథేన్‌ను ఉత్పత్తి చేసే రకాలను ప్రధానంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకునే ఆహారం, లోపల ఉండే జీర్ణ రసాల ఆధారంగానే పెరుగుతుంటాయి. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే రసాయనాలు పేగుల లోపలి గోడను దెబ్బతీసి పూత వచ్చేలా చెయ్యటం, పుండ్లు పడేలా చెయ్యటం, డీఎన్‌ఏను దెబ్బతీసి క్యాన్సర్‌ గడ్డలు పెరిగేలా చెయ్యటం.. ఇలా రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధనా ప్రపంచం బలంగా విశ్వసిస్తోంది. 'అల్సరేటివ్‌ కోలైటిస్‌' వంటి సమస్యల్లో పేగుపూత, వాపు ఎందుకు వస్తోందన్నది చాలాకాలంగా పరిశోధనలకు కూడా అంతుబట్టని విషయంగా ఉంది. దీని వెనక ఈ బ్యాక్టీరియా ప్రభావం ఉండొచ్చని ఇప్పుడు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్టీరియా పెంచటం ద్వారా చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించాలని పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ప్రోబయాటిక్స్‌ వంటివన్నీ ఈ ప్రయత్నాల్లో భాగమే. అయితే ఈ ప్రోబయాటిక్స్‌ను నోటితో తీసుకున్నప్పుడు జీర్ణాశయంలోని ఆమ్లాల ధాటికి ఇవి అక్కడే చనిపోవచ్చు. కాబట్టి బయటి నుంచి పంపటం కాకుండా ఇప్పటికే పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా ప్రాబల్యాన్ని పెంచటం, లేదంటే ఈ రెండు మార్గాలనూ కలపటం వంటి రకరకాల పద్ధతుల ద్వారా ప్రిబయాటిక్స్‌, సింబయోటిక్స్‌ వంటివాటినీ అభివృద్ధిచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో మన చికిత్సా మార్గాలను, వైద్య విధానాలను కొత్త దారుల్లో నడిపించటం తథ్యమని భావించవచ్చు.


మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా panulu : -
* మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిండిపదార్ధాలను జీర్ణం చేసుకోవటంలో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా చిన్నపేగు పొడవునా ఉంటుంది.
* మన పేగులను హానికారక బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్నజీవుల వంటివిఆక్రమించుకోకుండా, వాటి ప్రభావం పెరగకుండా అడ్డుకుంటుంది.
* విటమిన్‌-బి12, విటమిన్‌-కె వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తుంది.
* సహజమైన యాంటీబయాటిక్స్‌, ఆమ్లాలు, హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ వంటివి ఉత్పత్తి చెయ్యటం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణగా నిలుస్తుంది.
* మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. రోగ కారకాలపై పోరాడే 'యాంటీబోడీ'ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విషతుల్యాలు, అలర్జీ కారకాలు, హానికారకమైన సూక్ష్మజీవులపై పోరాటానికి సిద్ధం చేస్తుంది.

పరిశోధనా ప్రపంచం:
* కోటానుకోట్ల సంవత్సరాలకు పూర్వం... ఈ భూమ్మీద తొలి జీవం ఆరంభమైంది అత్యంత సూక్ష్మమైన 'బ్యాక్టీరియా' రూపంలోనే! కానీ బ్యాక్టీరియా ఉనికి మన కంటికి చిక్కి కేవలం 300 ఏళ్లే అయ్యింది. డచ్‌ శాస్త్రవేత్త లీసివెన్‌హోక్‌ తన మైక్రోస్కోపుతో తొలిసారిగా బ్యాక్టీరియాను దర్శించిన నాటి నుంచీ మన ముందు ఓ సువిస్తారమైన 'సూక్ష్మ' ప్రపంచం ఆవిష్కృతం కావటం మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోపులతో మనం కోట్లాది బ్యాక్టీరియాను చూడగలుగుతున్నాంగానీ.. ఇప్పటికీ మనకు అదో మిస్టరీ ప్రపంచమే. దాని గురించి తెలియాల్సింది చాలా ఉంది.
* మన పేగుల్లో- మన శరీరంలో ఉన్న మొత్తం కణాలకు పదిరెట్లు ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉందని గుర్తించిన తర్వాత వైద్యపరిశోధనా రంగం.. వీటిపై మరింత లోతుగా పరిశోధనలు ఆరంభించింది.
* మానవ జీనోమ్‌లో కేవలం 23,000 జన్యువులు ఉండగా.. ఈ పేగుల్లోని బ్యాక్టీరియాలో కనీసం 33 లక్షల జన్యువులు ఉన్నాయని తాజాగా ప్రతిష్ఠాత్మక 'నేచర్‌' పత్రిక కీలకమైన అధ్యయనాన్ని ప్రచురించింది. అలాగే ఈ బ్యాక్టీరియా జాతులు దాదాపు అందరిలోనూ ఒకేలా ఉంటున్నాయనీ, ముఖ్యంగా వీటిలో క్యాన్సర్‌, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వంటి వ్యాధులను కలుగజేసే జన్యువులూ ఉన్నాయని వీరు గుర్తించారు.
* ఈ పేగుల్లోని బ్యాక్టీరియా మనలో ఆకలినీ, శరీరంలోని జీవక్రియలనూ, ముఖ్యంగా ఇన్సులిన్‌ నిరోధకతనూ ప్రభావితం చేస్తోందని, తద్వారా వూబకాయం పెరగటానికి ఈ పేగుల్లోని బ్యాక్టీరియా దోహదం చేస్తుందని తాజాగా 'సైన్స్‌' పత్రిక మరో అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో- ఊబకాయం నుంచి క్యాన్సర్‌ వరకూ చాలా వ్యాధులకు ఈ పేగుల్లో బ్యాక్టీరియా ఆధారంగా చికిత్స సాధ్యపడటం తథ్యమని అర్థమవుతోంది. ఇప్పటికే నోటి ద్వారా మంచి బ్యాక్టీరియాను ఇవ్వటం (ప్రోబయాటిక్స్‌) ముఖ్యమైన చికిత్సా విధానంగా ఆచరణలోకి రావటం ఇందుకు బలమైన ఆధారం!

జన్యువులు, పర్యావరణం :
ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుందన్నది కీలకమైన అంశం. ఇది పెరగటానికి జన్యుపరమైన అంశాలు కొంత వరకూ కారణమైతే పర్యావరణపరంగా- అంటే తినే ఆహారం, తాగేనీరు వంటివన్నీ కూడా కొంత వరకూ దోహదం చేస్తాయి. అందుకే తేన్పులు, గ్యాస్‌ ఎక్కువగా తయారవ్వటం వంటి ఒకే రకమైన జీర్ణ లక్షణాలు కొన్ని కుటుంబాల్లో కనబడుతుంటాయి.
* బిడ్డకు మొదటగా పేగుల్లో బ్యాక్టీరియా తల్లి నుంచి వస్తుంది. తల్లిపాలు తాగే బిడ్డల్లో బిఫిడో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది, అందుకే వీరిలో జీర్ణ సమస్యలు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.

అవసరమైతేనే ప్రోబయాటిక్స్‌ :
యాంటీబయాటిక్స్‌ తీసుకుంటే అవి పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది కాబట్టి ఆ ప్రభావాన్ని భర్తీ చెయ్యటానికి 'ప్రోబయాటిక్స్‌'తీసుకోవటం మంచిదన్న భావన చాలామందిలో ఉంది. కానీ ఇది సరికాదు. ఎందుకంటే- యాంటీబయాటిక్స్‌ కేవలం పొట్టలోని బ్యాక్టీరియానే కాదు, ఈ ప్రోబయాటిక్స్‌ను కూడా చంపేస్తాయి. కాబట్టి ఈ రెంటినీ కలిపి ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు, అసలా అవసరమూ లేదు. యాంటీబయాటిక్స్‌ వాడటం ఆపేసిన తర్వాత సహజంగానే కొద్దిరోజుల్లో మళ్లీ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ప్రోబయాటిక్స్‌ అవసరం లేదు. దీర్ఘకాలంగా నీళ్ల విరేచనాలు, చిన్నచిన్న పుళ్లుపడి పెద్దపేగు పూత (అల్సరేటివ్‌ కోలైటిస్‌), క్రోన్స్‌ వంటి వ్యాధులతో వచ్చే నీళ్లవిరేచనాల్లో మాత్రమే ప్రోబయాటిక్స్‌తో ప్రయోజనం ఉంటుంది. మొత్తమ్మీద- నీళ్లవిరేచనాల సమస్య మూడు వారాలకు మించి కొనసాగుతున్నప్పుడు మాత్రమే ప్రోబయాటిక్స్‌తో ఉపయోగం ఉంటుందన్నది ప్రస్తుత అవగాహన.
* ఆల్కహాల్‌ తాగకుండా కూడా కొందరిలో కాలేయం వ్యాధిగ్రస్తమవుతుంది(నాష్‌). బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొన్ని విషతుల్యాలు లివర్‌ను దెబ్బతియ్యటమే దీనికి కారణమని గుర్తించారు. ప్రోబయాటిక్స్‌ తీసుకుంటే ఇది నయమవుతుందని నిరూపణ అయ్యింది.

చెడ్డ బ్యాక్టీరియాకు చెక్‌
పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవటం చాలా అవసరం. అందుకు...
* యాంటీబయాటిక్స్‌: ఎంతో అవసరమైతే తప్పించి యాంటీబయాటిక్స్‌ను చీటికీమాటికీ విచక్షణా రహితంగా వాడెయ్యద్దు. అవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దాంతో పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగిపోయి నీళ్లవిరేచనాల వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి.
* ఆహారం: తీపి, చక్కెరలు ఎక్కువుండే పదార్థాలు, బాగా శుద్ధి చేసిన రిఫైన్డ్‌ పదార్థాలు ఎక్కువగా తినొద్దు. ఇవి పేగుల్లో పులిసినట్త్లె (ఫెర్మెంటేషన్‌) చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి. స్వీట్లు, కుకీస్‌, చిప్స్‌, పేస్ట్రీలు, ప్యాకెట్లలో దొరికే పదార్థాలు తగ్గించటం అవసరం.
ఆహారం బాగా నమిలి తినటం మంచిది. బీఫ్‌ ( goDDumaaMsamu ) వంటి పీచు తక్కువుండే మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి నైట్రోజమైన్స్‌ అనే రసాయనాలను ఏర్పరుస్తాయి. అవి పేగుల కణాల్లోని డీఎన్‌ఏ మీద పని చేసి క్యాన్సర్‌కూ కారణమవుతాయి. కాబట్టి బీఫ్‌ వంటి మాంసాలు సాధ్యమైనంత తక్కువ తింటూ, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం.. మంచి బ్యాక్టీరియా పెరగటానికి, తద్వారా క్యాన్సర్‌ వంటివి దరిజేరకుండా చూసుకోవటానికి ముఖ్యం.
* మద్యం: మద్యం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతియ్యటంతో పాటు చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండటం పొట్టకు మంచిది.
* మందులు: కొందరు చీటికీమాటికీ అసిడిటీ తగ్గించే యాంటాసిడ్‌ మందులు వాడేస్తుంటారు. పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఇది మంచిది కాదు. అలాగే విరేచనాలు ఎక్కువ అయ్యేందుకు మందులు (లాగ్జేటివ్స్‌) వేసుకోవటమూ మంచిది కాదు. దానివల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా కూడా కొట్టుకుపోతుంది. స్టిరాయిడ్‌ మందులు, గర్భనిరోధక మాత్రలు కూడా పేగుల్లో బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు మేరకే వాడుకోవాలి.
మన శరీరం మొత్తం మీద ఉన్న జీవకణాలు 100 ట్రిలియన్లు. కానీ మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా దానికి దాదాపు పది రెట్లు ఎక్కువ.. అంటే 1000 ట్రిలియన్లు. 10 కోట్ల కోట్లు!
తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవటం.. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తుంది.

--డా|| డి.నాగేశ్వరరెడ్డి--డైరెక్టర్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ--హైదరాబాద్‌.
  • ==================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 29, 2011

యవ్వనంలోనే పక్షవాతం , paralysis at an early age


  • -
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --యవ్వనంలోనే పక్షవాతం , paralysis at an early age-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పక్షవాతం అంటే ఇప్పటివరకు వృద్ధుల సమస్యగానే భావిస్తున్నాం. కానీ ఇప్పుడిది యవ్వనంలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. మనదేశంలో పక్షవాతానికి గురవుతున్న ప్రతి నలుగురిలో ఒకరు 40 ఏళ్లలోపు వారే ఉంటుండటం వైద్యులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విద్యార్థులు, గర్భ సంబంధ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలల్లో ఎంతోమంది ప్రస్తుతం పక్షవాతం బారిన పడుతున్నారు. భారత్‌లో మెదడు సంబంధ వ్యాధులపై ఎయిమ్స్‌ వైద్యులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నెలకు సుమారు 250-300 మంది పక్షవాతం బాధితులు కొత్తగా వస్తుంటే.. వారిలో 70-75 మంది యువకులే కావటం విశేషం. వీరిలో స్కూలు, కాలేజీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. ఇందుకు పొగ, మద్యపానం అలవాట్లు విపరీతంగా పెరిగిపోతుండటమే కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పొగ, మద్యం మూలంగా రక్తనాళాల గోడలు మందం కావటం.. శరీరంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయులు అస్తవ్యస్తం అవుతాయి. విద్యార్థుల్లో పక్షవాతానికి ఇదొక కారణమవుతోందని వైద్యులు వివరిస్తున్నారు. నిజానికి మనదేశంలో చాలా కుటుంబాల్లో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ గలవారు ముందునుంచే ఉంటున్నారు. దీనికి తోడు కొత్త తరం పాశ్చాత్య జీవనశైలిని అనుకరిస్తూ.. జంక్‌ఫుడ్‌, మద్యపానం, మాదకద్రవ్యాలకు అలవడుతున్నారు. దీంతో పక్షవాతంతో పాటు ఇతర మెదడు సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు. యువతుల్లో గర్భ నిరోధక మాత్రల వినియోగం పెరుగుతుండటమూ దీనికి కారణమవుతోంది.

కాన్పు సమయంలో అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ల వంటి గర్భ సంబంధ సమస్యలు.. బిడ్డ పుట్టిన కొద్దిసేపటి వరకు తల్లికి నీళ్లు తాగించకపోవటం వంటి వాటి వల్లా ఎంతోమంది స్త్రీలు పక్షవాతానికి గురవుతున్నారు. చాలామందికి పక్షవాతం లక్షణాలు తెలియకపోవటం వల్ల ఆసుపత్రికి వచ్చేసరికే సమస్య ముదిరిపోతోంది కూడా. అకస్మాత్తుగా, తీవ్రమైన తలనొప్పి, చూపు కోల్పోవటం, చెప్పటానికి అలవికాని మగత వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మంచి అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి సంబంధ జబ్బుల పట్ల అవగాహన పెంచుకోవటం వంటి వాటి ద్వారా ముందే ముంచుకొస్తున్న ఈ పక్షవాతం సమస్యను అడ్డుకోవచ్చనీ వివరిస్తున్నారు.

అప్రమత్త లక్షణాలు
* అకారణంగా హఠాత్తుగా, తీవ్రమైన తలనొప్పి
* అకస్మాత్తుగా చూపు తగ్గటం లేదా కోల్పోవటం (ముఖ్యంగా ఒక కన్నులో)
* మాటల్లో తడబాటు
* చెప్పటానికి వీల్లేని మగత, తూలటం, హఠాత్తుగా కింద పడిపోవటం
* శరీరంలో ఒకవైపు కాళ్లూ చేతులు, ముఖంలో బలహీనత లేదా మొద్దుబారటం

అడ్డంకులతోనే ఎక్కువ--
మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు పక్షవాతం వస్తుంది. ఇందుకు మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం కానీ.. మెదడులో, చుట్టుపక్కల రక్తనాళాలు దెబ్బతిని చిట్లి పోవటం వల్ల రక్తస్రావం కావటం కానీ కారణం కావొచ్చు. నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల 80-85 శాతం మందికి పక్షవాతం వస్తుంటే.. రక్తనాళాలు దెబ్బతిని రక్తస్రావం అవటం వల్ల సుమారు 15 శాతం మంది దీని బారిన పడుతున్నారు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ముప్పైల్లోనే మెనోపాజ్‌,Menopaus at 30 years,ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ముప్పైల్లోనే మెనోపాజ్‌,Menopaus at 30 years,ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మెనోపాజ్‌. ఎప్పుడో 45-55 ఏళ్ల మధ్య రావాల్సిన ఇదిప్పుడు ఎంతోమంది యువతులను ముప్పైల్లోనే భయపెడుతోంది. మనదేశంలో సుమారు 4% మంది 35 ఏళ్లకు ముందుగానే ముట్లుడిగిపోయే స్థితికి చేరుకుంటున్నారని బెంగళూరులోని సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ఛేంజ్‌ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దీంతో పిల్లలను కనే సామర్థ్యాన్ని కోల్పోయి కుమిలిపోతున్నారు. ముందే ముంచుకొచ్చే మెనోపాజ్‌కు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వీటిని ఆదిలోనే గుర్తిస్తే చాలావరకు సరిదిద్దొచ్చు. కానీ ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ (పీఓఎఫ్‌) కోవకు చెందినవైతే మాత్రం కష్టం. వీరిలో అండాలు అతి కొద్దిగానో, అసలే విడుదల కాకుండానో ఉంటాయి. పీఓఎఫ్‌ బాధితుల్లో మూడొంతుల మందిలో దీనికి జన్యు పరమైన అంశాలే కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

పీఎఫ్‌ఓలో జన్యువుల పాత్ర గురించి మనదేశంలో ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. ఇటీవల సీసీఎంబీ దీనిపై ఓ పరిశోధన చేసింది. పీఎఫ్‌ఓలో పాలుపంచుకుంటున్న జన్యువులకు అండాల విడుదలతో నేరుగా సంబంధమేమీ లేకపోయినా.. వాటి ఉత్పత్తి, విడుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టించటంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. బీసీఎల్‌ 2 జన్యువులోని ఉత్పరివర్తనలు అండాలు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే అండకణాల ఉత్పత్తి, వృద్ధికి సహకరించే ఎఫ్‌ఎస్‌హెచ్‌ హార్మోన్‌ విడుదల కావటంలో ఇన్‌హిబిన్‌ అనే జన్యువు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది. పీఓఎఫ్‌ బాధితుల్లో 10.5 శాతం మందిలో ఇన్‌హిబిన్‌ జన్యువు మార్పు చెందినట్టు తేలింది. లింగ నిర్ధారణ చేసే ఎక్స్‌ క్రోమోజోమ్‌.. అండాశయ పనితీరులోనూ కీలకపాత్ర పోషిస్తోంది. సహజంగా ఆడవారిలో రెండు ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కదానిలోనైనా తేడా ఉంటే పీఎఫ్‌ఓకు దారి తీస్తున్నట్టు తేలింది. ఈ పరిశోధన ఆధారంగా కొత్త నిర్ధరణ పరికరాలు రూపొందించి, పీఎఫ్‌ఓ రాబోయే మహిళలను ముందుగానే గుర్తించొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలాంటి వాళ్లు ముందుగానే సంతానం విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది.

గర్భస్థ పిండంలోనే అండాలు
తల్లి కడుపులో ఉండగానే ఆడశిశువు అండాశయంలో 20 వారాల సమయానికి 60-70 లక్షల అండ బీజకణాలు ఏర్పడతాయి. అయితే ఇవి వేగంగా తగ్గిపోతూ శిశువు పుట్టే సరికి కేవలం 10 లక్షలే మిగులుతాయి. రజస్వల వచ్చేసరికి వీటి సంఖ్య 3-5 లక్షలకు తగ్గిపోతుంది. తర్వాత అండాల ఉత్పత్తి ప్రక్రియలో నెలకు 1,000 చొప్పున తగ్గుతూ వస్తాయి. ఈ అండకణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే మెనోపాజ్‌ దశ వస్తుంది. అప్పుడు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం పోతుంది.

  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

సెర్వికల్ స్పాండిలైటిస్,Cervical Spondylytis



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెర్వికల్ స్పాండిలైటిస్,Cervical Spondylytis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?.---స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే  విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశము రాగల , వెన్నుపూసను ప్రబావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . ఇది మెడభాగము లో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

ఈమధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
తలవంచితే మెడనొప్పులే...ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువును మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి.
టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.. డిస్క్‌ల్లో తేడా రావడం, కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవడం దీని ప్రధాన లక్షణం. మెదడు, వెన్నుపూస నుంచి శరీరానికి సరఫరా అయ్యే ముఖ్యమైన నరాలు మెడ ఎముక ద్వారా సరఫరా అవుతుంటాయి. ఏదైనా కారణం వల్ల ఈ మెడ నరాలపైన ఒత్తిడి పెరిగినపుడు మెడ నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కండరాలు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎవరిలో ఎక్కువ
గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేసే వారిలో ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్ సెంటర్లలో పనిచేసే వారిలో, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. ద్విచక్రవాహనం ఎక్కువగా నడిపే వారిలోనూ ఈ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు మోసే వారిలోనూ ఈ వ్యాధి అరుదుగా కనిపిస్తుంది.

కారణాలు
వయసు పెరుగుతున్న కొద్దీ బయటపడే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇటీవలి కాలంలో మధ్యవయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఏఔఅఆ జన్యువులలో వచ్చిన మార్పుల ప్రభావం వల్ల ఈ సమస్య వస్తోందని ఒక అధ్యయనంలో వెల్లడయింది. కొంతమందిలో మెడ ఎముకల్లో అసాధారణ పెరుగుదల చోటుచేసుకోవడం వల్ల, గాయాల వల్ల స్పాండిలైటిస్ మొదలవుతుంది.

లక్షణాలు
తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.

నిరక్ష్యం చేస్తే...
సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

పరీక్షలు(గుర్తించడము ) :
ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ స్కాన్, సిటి స్కాన్ వంటి పరీక్షల ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్‌ను గుర్తించవచ్చు. కండరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు , మైలోగ్రామ్ మరియు ఇ.ఎమ్.జి వంటి పరీక్షల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. నిపుణులైన వైద్యులు రోగిని పరీక్షించడం ద్వారా వ్యాధిని సులభంగా గుర్తిస్తారు.

నివారణ(చికిత్స ) :
చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సరియైన భంగిమలో కూర్చోవాలి. ఎక్కువ సమయం చదువుతుండే పిల్లలను గంటకొకసారి నిలబడమనడం, కాసేపు పచార్లు చేయించడం వల్ల స్పాండిలైటిస్ రాకుండా చూసుకోవచ్చు. పిల్లలు గంటలతరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా నియంత్రించాలి. నిద్రపోయే సమయంలో తల కింద అనువైన దిండు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపాలి.

పర్సనల్‌ కేర్‌: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.

మందులు (Medicines):
Tab . IBUDOL PLUS (Tramadol+paracetamol) 1 tab 3 times /day 5-10 days,
Tab . DOLOMED MR(Ibuprofen+paracetamol+chrorzoxazone) 1 tab 3 times /day 5 -10 days.
Cervical neck collar bandage to restrict movements.


  • ================================

Ankylosing Spondylitis,ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రుమాటిజం
కీళ్లు, కండరాలతో పాటు కీళ్లు, ఎముకల ఆధార కణజాలాలు, మృదు కణజాలాల వంటి చలనాంగాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పి వంటి వాటిని వివరించేందుకు వాడే సాధారణ పదమే రుమాటిజం . గుండె కవాటాలను ప్రభావితం చేసే రుమాటిక్‌ జ్వరాన్ని వివరించేందుకు కూడా ఈ పదాన్ని వాడతారు. అయితే పలు రుమాటలజికల్‌ వ్యాధులను వివరించేందుకు ప్రత్యేక పదాలను వైద్య పరిభాషలో ఉపయోగిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆంక్లైజింగ్‌ స్పాండిలైటిస్, గౌట్‌, సిస్టెమిక్‌ లూపస్‌ ఎరిథెమాటసస్‌ వంటివి ఇందుకు ఉదాహరణ.
ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌! రుమాటిక్ డిసీజస్ గ్రూఫ్ లొ ఒక రకము . ఈ గ్రూఫ్ చెందిన వ్యాదలన్నిటినీ సముదాయము గా " స్పాండిలోఆర్థోపతీస్ " అని పిలుస్తారు . సాధారణంగా వెన్ను సమస్యలు పూసలు అరిగిపోవటం, వాటి మధ్య నుండే డిస్కులు దెబ్బతినటం వంటి కారణాల రీత్యా వస్తుంటాయి. కానీ ఈ సమస్య'' ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌'' మాత్రం.. మనలోని రోగనిరోధక వ్యవస్థ వెన్ను దగ్గరి కణజాలంపై దాడి చెయ్యటం మూలంగా తలెత్తుతుంది. ఇది తరచూ ఉద్ధృతమవుతుండటం, మళ్లీ ఆ ఉద్ధృతి తగ్గుతుండటం.. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని, ఈ వ్యాధి లక్షణమే ఇంతని తాజాగా బ్రిటన్‌ పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యాధికి కారణమవుతున్న కారకాల మీద ఆధారపడి దీని తీవ్రతలో మార్పులు వస్తున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కటి ప్రాంతంలోని కీళ్లు కూడా ప్రభావితమైన వారిలో 70 శాతం మందిలో ఇలాంటి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌ ముఖ్యంగా వెన్నెముక, కటి ప్రాంతంలోని కీళ్లను మాత్రమే కాదు.. కాళ్లూ చేతుల్లోని కీళ్లు, కళ్లు, పేగులనూ ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు కొందరిలో కొన్నిరోజుల పాటు పూర్తిగా కనిపించకుండా ఉంటుంటే.. మరికొందరిలో పెరుగుతూ, తగ్గుతుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం తెలియదు. దీనిని కనుగొనేందుకే స్వాన్‌సీ యూనివర్సిటీకి చెందిన కూస్కీ, బృందం అధ్యయనం చేసి, సుమారు 71.4 శాతం మందిలో వ్యాధి లక్షణాలు పెరుగుతూ, తగ్గుతున్నట్టు గుర్తించారు.

కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలనలోనికి తీసుకోవాలి .
  • ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌ కి కారణము గుర్తించుట ,
  • జబ్బును అధికము చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకొనుట ,
  • ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్ తో కూడా ఉన్న కాంప్లికేషన్‌స్ పరిశీలించడము ,
  • కీళ్ళ సంబంధిత కాంప్లికేషన్లు , బాదలు చూడడము .
The medications that are commonly prescribed to alleviate pain and reduce inflammation in people with ankylosing spondylitis, which may include:

* Non-steroidal ant-inflammatory agents (NSAID's)
* Disease modifying antirheumatic drugs (DMARD's)
* Corticosteroids
* Biphosphonates
* Anti-TNF alpha agents



The role of exercise, physiotherapy, and balneotherapy (spa therapy) in the management of patients with ankylosing spondylitis.
# The management of secondary complications that can develop in people with ankylosing spondylitis, including both joint-related complications and non-joint related complications.
# The role of surgery in the management of ankylosing spondylitis.
# A detailed overview of evidence-based recommendations published by an international expert panel in 2006 for the evaluation, monitoring, and treatment of patients with ankylosing spondylitis.


Recommendations for important lifestyle modifications that can help people with ankylosing spondylitis to better control their symptoms, including:

* Home modifications
* Workplace modifications
* Sleep modifications
* General lifestyle modifications

  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కాళ్లవాపులు , Leg Swellings


  • Courtesy with Eenadu news paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కాళ్లవాపులు , Leg Swellings-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఎందుకో తెలీదుగానీ.. ఈ మధ్యే కాళ్లు వాస్తున్నాయి. నొక్కితే గుంటలు పడుతున్నాయి. సాయంత్రానికల్లా కాళ్లు బండల్లా తయారై ఏదో తెలీని అసౌకర్యం. భయంతో మనసూ బరువెక్కుతోంది. ఏ పని చేస్తున్నా మనసు మాత్రం కాళ్ల మీదే ఉంటోంది. ఎందుకిలా..? ఈ వాపులు దేనికి సంకేతాలు..? కాళ్లవాపు తరచుగా కనిపించేదే అయినా అదంత తేలికగా తీసుకోవటానికి వీల్లేని సమస్య! ఎందుకంటే సర్వసాధారణమైన కారణాల నుంచి తీవ్రమైన వ్యాధుల వరకూ ఎన్నో సందర్భాల్లో కాళ్లవాపు కనిపిస్తుంది. చాలా వ్యాధులను పట్టుకునేందుకు అదో కీలకమైన లక్షణం! అందుకే కాళ్లు వాచినప్పుడు కారణమేమిటో తెలుసుకోవటం.. చికిత్స తీసుకోవటం చాలా అవసరం.
రెండు కాళ్లూ వాచటమన్నది చాలా వ్యాధుల్లో కనిపించే లక్షణం. ఇలాంటి సందర్భాల్లో దీనికి కారణమవుతున్న సమస్య ఏమిటన్నది గుర్తించటమే కీలకం.
రక్తహీనత: మనదేశంలో ఎక్కువ మందిలో కాళ్లవాపు రావటానికి ఈ రక్తహీనతే ముఖ్య కారణం. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం గణనీయంగా పడిపోవటం వల్ల రక్తంలో, ఒంట్లో నీటి శాతం పెరిగిపోయి కాళ్లు వాస్తుంటాయి. కాబట్టి కాళ్ల వాపు వచ్చినప్పుడు రక్తహీనత ఉందేమో చూడటం ముఖ్యం. మన దేశంలో స్త్రీలు, వృద్ధులతో సహా అన్ని వయసుల వారిలోనూ రక్తహీనత ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఇందుకు పోషకాహార లోపం, బీ12 విటమిన్‌, ఇనుము లోపించటమూ, పొట్టలో పురుగులుండటం వంటివి దోహదం చేస్తున్నాయి. ఇనుము లోపించినపుడు ఒంట్లో నీరు పెరిగి గోళ్లు పలుచబడి చెంచా ఆకారంలోకి మారటం, వెంట్రుకలు, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇక బీ12 లోపిస్తే పాలిపోవటంతో పాటు కాళ్లు, చేతులు, నాలుక నల్లబడతాయి. రక్తపరీక్ష ఆధారంగా రక్తహీనత గుర్తించి.. ఈ లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తే వీరికి కాళ్ల వాపులు తగ్గిపోతాయి.

మందులు: రక్తహీనత తర్వాత కాళ్ల వాపులు కనబడటానికి మరో అతి ముఖ్య కారణం రకరకాల సమస్యలకు వాడే మందులు! ముఖ్యంగా నొప్పులు తగ్గటానికి తరచూ వాడుతుండే 'నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఎన్‌ఎస్‌ఏఐడీ)' రకం మందుల వల్ల మన శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. దీంతో నీరు ఎక్కువగా లోపలే నిలిచిపోయి కాళ్లవాపు రావచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల బీపీ మందులు (అమ్లోడిపిన్‌, నిఫిడపిన్‌, డిల్టియాజమ్‌ వంటివి), స్టిరాయిడ్లు, మానసిక చికిత్స కోసం వాడే మందుల వల్ల కూడా కాళ్ల వాపులు రావచ్చు. గర్భ నిరోధక మాత్రలు, ఇతరత్రా హార్మోన్‌ మాత్రల వల్ల కూడా కాళ్లవాపులు రావచ్చు. ఈ మందులను గుర్తించి వైద్యుల సలహాతో వాటిని మార్చుకుంటే కాళ్ల వాపులు అవే తగ్గిపోతాయి.

కాలేయ వైఫల్యం: మన కాలేయంలో శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు (ప్రోటీన్లు) తయారవుతాయి. కాలేయానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఈ ప్రోటీన్ల తయారీ ప్రభావితమవుతుంది. ముఖ్యంగా కాలేయం గట్టిపడే సిరోసిస్‌ సమస్యలో రక్తంలో ప్రోటీన్లు తక్కువైపోయి, ఒంట్లో నీరు చేరి కాళ్లు వాస్తాయి.

కాళ్ల వాపులతో పాటు కళ్లు పచ్చబడటం, పురుషుల్లో జుట్టు రాలటం, రొమ్ములు పెద్దవవటం వంటి లక్షణాలు కూడా కనబడితే మనం లివర్‌ సమస్య ఏదైనా ఉందా? అన్నది అనుమానించాలి.

కిడ్నీ వైఫల్యం: మధుమేహం, హైబీపీ, నొప్పినివారిణి మందులు ఎక్కువగా వాడటం వీటన్నింటి వల్లా.. కిడ్నీలు దెబ్బతినొచ్చు. రక్తంలోని నీటిని బయటకు పంపటం కిడ్నీ ప్రధాన విధి కాబట్టి.. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఒంట్లో నీరు నిలిచిపోయి కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో 'అక్యూట్‌ గ్లోమరూలో నెఫ్రైటిస్‌' రకం కిడ్నీ సమస్యలో ఉన్నట్టుండి ఉదయాన్నే మొహం వాపు ఉంటుంది, క్రమేపీ మధ్యాహ్నానికి కాళ్ల వాపు ఎక్కువ వస్తుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల్లో కేవలం కాళ్లే వాస్తాయి.

మొత్తమ్మీద కాళ్లవాపుతో పాటు ఉదయం లేవగానే ముఖం ఉబ్బి ఉండటం, సాయంత్రానికి ముఖం ఉబ్బు తగ్గి కాళ్ల వాపు పెరగటం, శరీరం పాలిపోయినట్టుగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం, నిస్సత్తువ, రుచులు మారటం, కాళ్లల్లో చిరచిర (ఆర్‌ఎల్‌ఎస్‌-restless leg syndrome), కొందరిలో ఆయాసం.. ఇలాంటి వన్నీ ఉంటే కిడ్నీల్లో సమస్య ఉందేమో అనుమానించాలి.

గుండె జబ్బు: గుండె వైఫల్యం (కంజెస్టివ్‌ కార్డియాక్‌ ఫెయిల్యూర్‌) ఉన్న వారిలో గుండె సరిగా రక్తాన్ని పంపింగ్‌ చెయ్యలేదు. దానివల్ల వూపిరితిత్తుల్లోనూ, ఒంట్లోనూ నీరు బాగా చేరిపోతుంది. ఇలాంటప్పుడు కాళ్లు బాగా వాచి ఉబ్బినట్టు కనబడతాయి. కాబట్టి కాళ్లవాపుతో పాటు నడిస్తే ఆయాసం, మెడ దగ్గర నరాలు ఉబ్బి ఉండటం, పడుకుంటే ఆయాసం పెరిగి, కూర్చుంటే తగ్గుతుండటం.. దీనికి తోడు ఇప్పటికే హైబీపీ, మధుమేహం వంటివి కూడా ఉన్నాయంటే అది కచ్చితంగా గుండె జబ్బేమోనని అనుమానించాల్సి ఉంటుంది.

పోషకాహార లోపం: తీవ్రమైన పోషకాహార లోపం వల్ల కూడా రక్తంలో ప్రోటీన్లు, ఆల్బుమిన్‌ తగ్గి కాళ్ల వాపులు రావచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువ తీసుకుంటూ ఆహారం సరిగా తీసుకోకపోయినా కూడా కాళ్ల వాపులు రావచ్చు. థైరాయిడ్‌ సమస్యలున్న వారిలో కూడా కాళ్ల వాపులు రావచ్చు.

ఇంకా ఇంకా..
డీవీటీ(DVT): ఒకటే కాలు వాచినప్పుడు నొక్కితే నొప్పిగా ఉండటం, ఇటీవలే దూరాలు ప్రయాణం చేసి ఉండటం, పిక్కల నొప్పి కూడా ఉండటం... ఇలాంటి సందర్భాల్లో.. కాళ్లలోని సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయేమో (డీవీటీ) చూడటం తక్షణావసరం. ఎందుకంటే ఆ గడ్డ ఒక్కోసారి రక్తప్రవాహంలో కలిసిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరి.. 'పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం' అనే తీవ్రమైన సమస్యకు దారితియ్యచ్చు. ముఖ్యంగా ఇటీవల సుదీర్ఘ ప్రయాణాలు చెయ్యటం లేదా రోజంతా మంచాన పడుకుని ఉండటం వంటి చరిత్ర ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా 'డీవీటీ'ని అనుమానించాలి.

సెల్యులైటిస్‌: కాలు వాపుతో పాటు ఎర్రబడటం, నొప్పి, జ్వరం, ముట్టుకుంటే వేడిగా ఉండటం.. ఇవన్నీ కాలులో ఇన్ఫెక్షన్‌ చేరిందని (సెల్యులైటిస్‌) చెప్పటానికి కీలక లక్షణాలు. మధుమేహ బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే గుర్తు పట్టటం చాలా అవసరం.

వెరికోస్‌ వీన్స్‌: కొందరిలో కాళ్లలోని సిరలు బలహీనంగా ఉండి.. అవి కింది నుంచి (చెడు)రక్తాన్ని సరిగా పైకి తీసుకురాలేవు. ఫలితంగా రక్తం కిందే ఎక్కువగా నిలిచిపోతూ కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. దీన్నే 'క్రానిక్‌ వీనస్‌ ఇన్‌సఫిషియెన్సీ' అంటారు. ఈ రకం సమస్య రోజంతా నిలబడి ఉండే టీచర్లు, పోలీసులు, గార్డుల వంటివారిలో ఎక్కువ. దీన్ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకోకపోతే కాళ్ల మీద పుండ్లు పడటం, అవి మానకపోవటం వంటి రకరకాల తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి.

ప్రయాణంతో వాపు
* రాత్రంతా బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తాం. తెల్లవారే సరికి కాళ్లు పొట్లాల్లా వాచి ఉబ్బిపోతాయి. రోజంతా నిలబడి పని చేస్తాం. సాయంత్రానికి కొద్దిగా కాళ్లు వాయచ్చు. గంటల తరబడి విమానంలో ప్రయాణం చేస్తాం. క్యాబిన్‌లో వాయు పీడనం తక్కువ ఉండటం కారణంగా కాళ్లు కొద్దిగా ఉబ్బుతాయి. ఇది సహజం. కొద్ది గంటలు విశ్రాంతి తీసుకుంటే ఈ వాపులు తగ్గిపోతాయి. ఇవేమీ సమస్యలు కావు. వీటి గురించి ఆందోళన అవసరం లేదు.

* కొందరు స్త్రీలకు నెలసరి రావటానికి నాలుగైదు రోజులు ముందు నుంచీ హార్మోన్ల ప్రభావం కారణంగా కాళ్లవాపులు రావచ్చు. వీటిని గురించి ఆందోళన అవసరం లేదు.

గర్భిణుల్లో వాపు
గర్భిణుల్లో నెలలు నిండుతున్న కొద్దీ కాళ్లవాపు రావచ్చు. ముఖ్యంగా 6-9 నెలల మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భాశయం బాగా పెరిగి, కాళ్ల నుంచి రక్తాన్ని పైకి తెస్తుండే సిరలను నొక్కుతుండటం వల్ల రక్తం ఎక్కువగా కిందే చేరిపోయి.. కాళ్లలో నీరు చేరుతుంది. ఇది సహజమేగానీ వీటిని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం మంచిది.

ఒక కాలు వాపు
ఒక కాలు మాత్రమే వాస్తే ముందు- సమస్య ఆ కాలులోనే ఉందేమో ఆలోచించాలి. సాధారణంగా ఆ కాలుకి దెబ్బతగలటం, ఏదైనా గుచ్చుకోవటం, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్‌ చేరి చీముపట్టటం, లేకపోతే ఆ కాలులోని సిరల్లో రక్తం గడ్డకట్టటం (డీవీటీ) వంటి వాటివల్ల ఒకే కాలు వాస్తుంది. అలాగే బోదకాలు (ఫైలేరియాసిస్‌) కూడా ఒక కాలు వాపుతో ఆరంభం కావచ్చు. కాకపోతే కాలు వాపుతో పాటు చలి, జ్వరం వచ్చిపోతుండటం, గజ్జల్లో బిళ్ల కట్టటం వంటి లక్షణాలూ లక్షణాలూ ఉంటాయి.

అరుదుగా
అరుదే అయినా ఒక్కోసారి నొప్పి లేకుండా ఒకే కాలు వాస్తే పైన ఉండే లింఫు/రక్త నాళాల్లో ఏవైనా అవరోధాలు ఏర్పడి అవి మూసుకుంటున్నాయా? అన్నది చూడాలి. వాచిన కాలు వైపు పొట్టలో క్యాన్సర్‌ గడ్డల వంటివేమైనా ఏర్పడి, అవి లింఫునాళాలను గానీ, సిరలను గానీ నొక్కటం వల్ల కూడా ఒక్కోసారి రక్త ప్రసరణకు అడ్డు తగిలి కాలు వాపు రావచ్చు.

నొక్కితే గుంట
కాళ్లు వాచినప్పుడు నొక్కితే గుంట పడటం సహజమే. దానర్థం కాళ్లలో నీరు చేరిందని! మన శరీరంలో ఉండాల్సిన నీటి కంటే ఎక్కువగా నీరు చేరితే కాళ్లు ఉబ్బరించినట్టు కనబడతాయి. నిజానికి ఈ స్థితిలో కాళ్లతో పాటు ఒళ్లంతా కూడా కొద్దిగా ఉబ్బరంగా ఉండొచ్చు. కాకపోతే అన్నింటికంటే ముందు కాళ్లవాపు ప్రస్ఫుటంగా కనబడుతుంది. చాలా సమస్యల్లో ఇలా వాపు ఉన్నచోట నొక్కితే గుంట/సొట్ట పడుతుంది కాబట్టి ఈ వాపునకు కారణాలేమిటన్నది తరచి చూడటం అవసరం.

అది తాత్కాలికం
* చాలామంది కాళ్లు వాపు వస్తే- 'ఏం ఫర్వాలేదు' అంటూ మూత్రం ఎక్కువగా అయ్యేలా చేసే 'డైయూరిటిక్‌' తరహా (లాసిక్స్‌, లాసిలెక్టోన్‌ వంటివి) మందులు సూచిస్తుంటారు. కానీ అది సరికాదు. కారణం ఏదైనా ఆ మందులు వాడితే తాత్కాలికంగా వాపు తగ్గొచ్చు. డీవీటీ, వారికోస్‌ వీన్స్‌, ఫైలేరియాల్లో ఆ మాత్రం కూడా తగ్గకపోవచ్చు. ఈ మందుల కంటే కూడా అసలు సమస్య ఎందుకు వచ్చిందో చూడటం ముఖ్యం.

బీపీ - కాళ్లవాపులు
బీపీ ఉన్న వారికి కాళ్లవాపులు వచ్చాయంటే- వారికి కిడ్నీ వైఫల్యం వచ్చి, దాని కారణంగా కాళ్ల వాపులు రావచ్చు. అలాగే ఏ కారణంగా కిడ్నీ వైఫల్యం తలెత్తినా బీపీ పెరగొచ్చు. అలాగే బీపీ తగ్గించేందుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా కాళ్లవాపులు రావచ్చు. కాబట్టి వీటన్నింటి మధ్యా ఉన్న సంబంధాన్ని గుర్తించి.. బీపీ ఉన్నవారు, బీపీకి మందులు వాడేవారు.. ఏడాదికి ఒకసారైనా పరీక్షలు చేయించుకోవటం అవసరం.

పరీక్షలు :
కాళ్లవాపులు వచ్చినప్పుడు కొన్ని కనీస పరీక్షలు అవసరం.
ముందుగా మూత్రంలో ఆల్బుమిన్‌/ప్రోటీన్లు పోతున్నాయా? రక్తహీనత ఉందా? సీరం ప్రోటీన్ల స్థాయి ఎలా ఉంది? యూరియా క్రియాటినైన్‌ మోతాదులు ఎలా ఉన్నాయన్నది చూస్తారు. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే థైరాయిడ్‌ పరీక్షలు చేస్తారు. అవీ నార్మల్‌గా ఉంటే గుండె పనితీరు తెలుసుకునేందుకు ఈసీజీ, టూడీ ఎకో, ఛాతీ ఎక్స్‌-రే, పొత్తికడుపులో ఏవైనా రక్తనాళాలను నొక్కుతున్నాయేమో చూసేందుకు, లివర్‌ పరిస్థితి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగు.. వీటితో పాటు కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలేమైనా కట్టాయా? అన్నది తెలుసుకునేందుకు కాళ్లకు డాప్లర్‌ పరీక్ష.. అవసరమవుతాయి.

కాళ్లు వాస్తున్నప్పుడు ఎవరైనా..చేయవలసిన పనులు :
* ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం మంచిది.
* రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండటం తగ్గించుకోవాలి.
* కాళ్ల కింద ఎత్తు పెట్టుకోవటం మంచిది.
* ప్రయాణాలు ఎక్కువ చేసేవారు.. తరచూ లేచి నాలుగు అడుగులు వేయటం అవసరం. గంటల తరబడి విమానాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని వ్యాయామాలు చెబుతుంటారు, వాటిని చెయ్యటం అవసరం.
* రోజూ నడక చాలా మంచిది. దానివల్ల పిక్క కండరాలు బలపడి.. అవి రక్తనాళాలకు సహకరిస్తూ రక్తం చక్కగా పైకి వెళ్లేలా చూస్తాయి, దీంతో వాపు ముప్పు తగ్గుతుంది.
* సాధారణంగా రోజంతా కూర్చుని ఉంటే సాయంత్రానికి కొంత కాళ్లు ఉబ్బరించవచ్చు. ఇది సహజం. ఉదయం లేస్తూ కూడా వాపు ఉంటే దాన్ని వ్యాధిగా అనుమానించి వైద్యులను సంప్రదించటం అవసరం.
* వైద్యులు కాళ్లను గట్టిగా పట్టి ఉంచే ఎలాస్టిక్‌ స్టాకింగ్స్‌ సూచిస్తే వాటిని నిద్ర లేస్తూనే వేసుకోవాలి.

డా|| ఎం.వి.రావు-- కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌-- యశోదా హాస్పిటల్‌- హైదరాబాద్‌.

  • =================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

గూని (స్కోలియోసిస్‌) ,Scoliosis



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- గూని (స్కోలియోసిస్‌) ,Scoliosis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కుబ్జ... మనకు అందవికారిగానే తెలుసు! కానీ 'గూని' వల్ల కేవలం అందం తగ్గటమే కాదు.. శారీరక ఆరోగ్యమూ దెబ్బతింటుంది! గూని అన్నది ప్రధానంగా వెన్నెముక-వెన్నుపూసల నిర్మాణంలోనే పెరిగే సమస్య. అందుకే దీన్ని సరిచెయ్యటం చాలా అవసరం. అదీ వీలైనంత వరకూ సాధ్యమైనంత చిన్నవయసులోనే!

వెన్నుపూసల సమాహారమైన 'వెన్నెముక' నిటారుగా ఉంటేనే మన శరీరాకృతి సరిగ్గా ఉంటుంది. అది ఏమాత్రం పక్కకు తిరిగినా రూపం మారిపోతుంది. ముఖ్యంగా వెన్నుపూసల అమరిక వంపు తిరిగిపోవటం.. అదే గూని (స్కోలియోసిస్‌) తలెత్తితే కేవలం అందంగా లేకపోవటమే కాదు, క్రమేపీ రోజువారీ పనులు చేసుకోవటం కూడా కష్టంగానే పరిణమిస్తుంది. ఈ గూని అరుదైన సమస్యేం కాదు. ప్రతి 100 మందిలో కనీసం ముగ్గురు ఏదో ఒకరకమైన గూనితో బాధపడుతున్నారని అంచనా. కొందరిలో వెన్నెముక పక్కలకు తిరిగి ఉంటే.. మరికొందరిలో ముందుకు గానీ వెనక్కు గానీ తిరిగి ఉంటుంది. నిజానికి గూని స్వల్పంగా ఉంటే మరీ అంత ఇబ్బందేం ఉండదు. కానీ కొందరిలో వయసు పెరుగుతున్నకొద్దీ వంపు మరీ ఎక్కువై వెన్నెముక S ఆకారంలోకి గానీ, C ఆకారంలోకి గానీ మారిపోతుంది. దీన్ని కచ్చితంగా పట్టించుకోవాల్సిందే.

కారణాలు :---
గూని స్త్రీలలో ఎక్కువ. దీనికి కచ్చితమైన కారణమేదీ తెలియదు. కానీ చాలా అంశాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇది జన్యుపరమైన లోపం కావచ్చన్న భావన బలంగా ఉంది. కొందరిలో పుట్టుకలో లోపం వల్ల గూని వస్తుంది. ఇలాంటి పిల్లల్లో వెన్నెముక ఆకృతి సరిగా లేకపోవటం వల్ల.. వెన్నెముక కుడి, ఎడమల పెరుగుదలలో తేడాలు వస్తాయి. దీంతో వెన్నులో వంపులు తలెత్తుతాయి. మన రాష్ట్రంలో ఇలా పుట్టుకతో వచ్చే గూని సమస్య కూడా ఎక్కువగానే కనబడుతోంది. పిల్లలకు పుట్టుకతోనే గూని వచ్చినట్టు గుర్తిస్తే.. వెంటనే వెన్నెముక, గుండె, మూత్రపిండాల సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటం చాలా అవసరం. యుక్తవయసులో గూని వస్తే వెన్నెముకకు కండరరాలు అతుక్కుపోవటం (టెథెర్డ్‌ స్పైనల్‌ కార్డ్‌), నాడులు-కండరాలకు సంబంధించిన సమస్యలు కారణం కావొచ్చు. వెన్నెముకకు అతుక్కుపోయిన కండరాలు దాని కదలికలను అడ్డుకోవటం వల్ల ఇలాంటి గూని వస్తుంది. కారణమేదైనా.. గూని యుక్తవయసు పిల్లల్లో పెరుగుదలను దెబ్బతీస్తుంది.

గుర్తించటం తేలికే -- గూనిని తేలికగానే గుర్తించొచ్చు. వీరిలో వెన్నెముక వంపు తిరిగి.. శరీరం ఏదో వైపు ఒరిగి ఉంటుంది. చాలామంది పిల్లలో ఒక భుజం కిందికి, మరో భుజం పైకి ఉన్నట్టు కనిపిస్తాయి. లేదంటే నడుం భాగం ఏదో ఒక పక్కకు ఒరిగి పోతుంది. పిల్లలు దుస్తులు వేసుకుంటున్నప్పుడు వీటిని ఇట్టే గుర్తించొచ్చు. గూని లేకపోయినా.. ఒక కాలు పొట్టిగా ఉండటం, పక్కటెముకలు సవ్యంగా లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సత్వర చికిత్స అవసరం -- గూనికి సరైన చికిత్స చేయకపోతే మున్ముందు తీవ్రమైన వెన్నునొప్పి, అంద వికారం, మానసిక సమస్యల వంటివి మొదలవుతాయి. వూపిరితిత్తుల పనితీరు మందగించటం, గుండె కుడి భాగం విఫలం కావటం, వూపిరితిత్తుల్లో రక్తపోటు అనూహ్యంగా పెరిగిపోవటం వంటి తీవ్రమైన సమస్యలూ ఏర్పడొచ్చు. గూని వంపు 70 డిగ్రీల కన్నా ఎక్కువుంటే మూడింట ఒకరిలో వూపిరితిత్తుల పనితీరు మందగిస్తున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. మోపురంలా తోసుకువచ్చే గూనితో కాళ్లు చచ్చుబడే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి వారికి సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. ముదురుతున్న కొద్దీ వంపును, ఆకృతిని సరిచేయటం కష్టమవుతుంది.

చికిత్స:
పట్టీలు, ఆపరేషన్‌ --- గూని ఉంటే యుక్తవయసు వచ్చే వరకూ కూడా ఆగి, అప్పుడు చికిత్స చేయించాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పుట్టుకతో లేకుండా, ప్రత్యేకమైన కారణమేదీ లేకుండా గూని పెరుగుతున్న వారికి.. యుక్తవయసు వచ్చేవరకూ కూడా బిగువు పట్టీలు (బ్రేసెస్‌) వేస్తూ, ఆ తర్వాత కొంత కాలానికి ఆపరేషన్‌ చేసే మాట నిజమే గానీ.. పుట్టుకలో లోపాల కారణంగా గూని వచ్చినవారికి వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. కొందరికి 2-3 ఏళ్ల సమయంలోనే ఆపరేషన్‌ చేయాల్సిన అవసరమూ ఉంటుంది. గూని చికిత్స ప్రధానంగా- ముందు కొంతకాలం గమనిస్తుండటం, అవసరమైతే పట్టీలు వేయటం, లేదంటే శస్త్రచికిత్స చెయ్యటం.. ఇలా సాగుతుంది.
పరిశీలనలో ఉంచటం: వెన్నెముక వంపు చిన్నగా, 20 డిగ్రీల కన్నా తక్కువుంటే వైద్యులు వెంటనే చికిత్స ఆరంభించకపోయినా.. క్రమం తప్పకుండా ఆ వంపు ఎటు ఎలా మారుతున్నదీ గమనిస్తుంటారు.

పట్టీలు: పిల్లలు ఇంకా ఎదిగే వయసులో ఉన్నప్పుడు- గూని వంపు ఎక్కువగా పెరగకుండా.. చేయి కింది నుంచి నడుం కింది వరకు ప్రత్యేకమైన బిగువు పట్టీలను వేస్తారు. పెద్దల్లో వీటినే గూని నొప్పి తగ్గించేందుకు వాడుతుంటారు. కొందరిలో ఈ పట్టీలను మెడ వరకూ వేయాల్సి వస్తుంది. వెన్నెముక వంపు సరిచేసేందుకు, ఒత్తిడి పెంచే వీటిని దాదాపు రోజంతా వేసుకోవాలి. అప్పుడే ఇవి సమర్థంగా పనిచేస్తాయి. అయితే వీటిని రోజంతా వేసుకోవాల్సి ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా అసౌకర్యం కలిగిస్తాయి. పట్టీలు కడుపుపై ఒత్తిడి తెస్తాయి కాబట్టి శ్వాసలో ఇబ్బంది ఉంటుంది. ఇది పిల్లల్లో మరీ ఇబ్బంది పెడుతుంది. వెన్నెముక వంపు 25 డిగ్రీల కన్నా ఎక్కువున్నా, లేక ఇంకా ఎముకలు పెరిగే అవకాశం ఉండి వంపు 30-45 డిగ్రీల వరకూ ఉన్నా కూడా ఈ పట్టీలు వాడొచ్చు.

శస్త్రచికిత్స: గూని ఉన్నవారిలో వెన్నెముక లోపాలను సరిదిద్దటానికి, పక్క నుంచి చూసినపుడు నిటారుగా ఉండేలా చేయటానికి, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు, నొప్పిని తగ్గించేందుకు 'స్పైనల్‌ ఫ్యూజన్‌' శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 45-50 డిగ్రీల కన్నా ఎక్కువ వంపు ఉన్నవారికే ఆపరేషన్‌ సూచిస్తారు. ఎదిగే పిల్లలో వంపు పెరుగుతున్నా, పెద్దవారిలో అంద వికారంగా తయారవుతున్నా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్‌తో గూనిని పూర్తిగా సరిచెయ్యటం అసాధ్యమే అయినా చాలావరకూ వంపును సరిదిద్దొచ్చు. దీనికి ఇప్పుడు అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ శస్త్రచికిత్సలో శరీరంలోని ఇతర భాగం నుంచి గానీ, దాత నుంచి గానీ ఎముకను తీసి.. లోపం ఉన్నచోట వెన్నుపూసకు అతికిస్తారు. ఇది నయమయ్యాక ఒకే ఎముకగా స్థిరపడుతుంది. దీంతో వెన్నుపూస గట్టిపడి, వంపు పెరగకుండా ఉంటుంది. ఈ ఆపరేషన్‌ ద్వారా పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే నిపుణులైన వైద్యులు, అన్ని సౌకర్యాలు గల ఆసుపత్రుల్లోనే వీటిని నిర్వహించాలి.

పద్ధతులనేకం: ప్రస్తుతం చిన్నపిల్లల్లో వెన్నుపూసలు త్వరగా కలిసిపోకుండా చూస్తూ.. మరింతగా పెరిగేలా చేసే కొత్త పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆపరేషన్‌ చేసి లోపల అమరుస్తారు. వెన్నెముక వంపు తిరిగిన చోట పక్కటెముకలు ఊపిరితిత్తుల మీద ఒత్తిడి కలిగిస్తుంటాయి. దీంతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ భాగంలో పక్కటెముకలను దూరంగా జరిపేలా కృత్రిమ పక్కటెముకలను అమరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి ఛాతీ భాగాన్ని విస్తరించేలా చేసి, అన్నివైపుల నుంచి వెన్నెముక నిటారుగా పెరగటానికి దోహదం చేస్తాయి. కొందరిలో వెన్నెముక వంపు తిరిగిన ప్రాంతంలో రాడ్‌ని అమర్చి పూసలు కలిసిపోకుండా కూడా చేస్తారు. గూని పరిణామాలు వెన్నెముక వంపును బట్టి ఉంటాయి. చిన్న వంపుల కన్నా పెద్ద వంపులతో ముప్పు ఎక్కువ. అలాగే రెండు చోట్ల వంపు ఉన్నా ప్రమాదమే. ఎదుగుతున్న పిల్లల్లో వంపు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే గూనికి ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. పిల్లల్లో వెన్ను నిర్మాణ లోపాలను గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించటం మేలు. దీంతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దినవారవుతారు



డా. వి.సూర్యప్రకాశరావు-- స్పైన్‌ సర్జన్‌, కామినేని హాస్పిటల్స్‌-- కింగ్‌కోఠి, హైదరాబాద్‌.
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నీటి కాలుష్యము , Water pollution



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --నీటి కాలుష్యము , Water pollution-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అలసిన శరీరానికి గ్లాసుడు మంచినీరు అందిస్తే సులువుగా శరీరం సాధారణ స్థితికి వస్తుంది. నిజానికి మనం తాగే నీటిలో ఎటువంటి పోషక పదార్థాలు లేకపోయినా దాని పనితీరు ఎంతో

అద్భుతంగా ఉంటుంది. దాహం వేసినపుడు మనిషి మంచినీరు తాగకపోతే మానసికంగా ఎంతో ఆందోళనకు గురి అవుతాడు. శరీరానికి డీహైడ్రేషన్ వచ్చిందంటే ప్రమాదం ఎదురవుతుంది.

మనిషి ఆహారం లేకుండా కొద్దిరోజులు జీవించగలడు కాని నీరు తాగకుండా కొన్ని గంటలు గడపడం కష్టం.

నీటి కాలుష్యం (Water pollution) అనేది నీటి మరియు నీటి వనరులు కలుషితమైన ప్రక్రియ లేదా పరిస్థితి. ఈ వనరులు అనగా సరస్సులు, నదులు, సముద్రాలు,

ఇంకా భూగర్భజలాలు మనుషుల చర్యలవల్ల కలుషితమవుతాయి. ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది. నీటిని శుద్ధి చేయకుండా

కలుషితాలను నేరుగా నీటివనరులలోకి వదిలివేయడం వలన ఇది ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నీటి కాలుష్యం ఒక పెద్ద సమస్య. దీనివల్ల రోజుకు 14,000 మంది చనిపోతున్నారు.

మానవ శరీరంలో ఎన్నో పనులు చక్కబెట్టే రక్తంలో 83 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు పుణ్యమా అని శరీరంలోని వ్యర్థ పదార్థాలు చెమట, మూత్రం రూపంలో విసర్జించబడతాయి. తగినంత నీరు తాగకపోతే శరీరంలోని వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి విష పూరితంగా తయారవుతాయి. దానితో శరీర ఆరోగ్యం అదుపుతప్పుతుంది. ఆహారం జీర్ణం అయ్యేందుకు కావలసిన నీరు శరీరానికి అందకపోతే మలబద్ధకం వస్తుంది. పులిత్రేనుపులు మొదలవుతాయి. మనిషికి ప్రకృతి ప్రసాదించిన మంచి టానిక్ మంచినీరు.

జీవప్రక్రియలకు
సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం మూడు లీటర్ల నీటిని అనుదినం తాగాలి. మరీ ఎక్కువగా నీటిని తాగితే అధికంగా తీసుకున్న నీరు మూత్ర రూపంలో విసర్జించబడుతుంది. తగినంత నీటిని తాగకపోతే మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీర జీవప్రక్రియల నిర్వహణకు నీరు తప్పనిసరి. శరీరానికి కావలసిన నీటిని తాగమని రక్తం మెదడుకు సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. ఆ ప్రకారం మనిషికి దాహంవేసి నీరు తాగుతూ ఉంటాడు. త్రాగే నీరు స్వచ్ఛంగా ఉండక కలుషితమై ఉంటే రకరకాల వ్యాధులు స్వైరవిహారం చేస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 70శాతం రోగాలు కలుషిత నీటి వాడకంవల్ల వస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలలోను, పట్టణాలలోను రక్షిత నీటిని ప్రజలకు పైప్‌లైన్‌ల ద్వారా సరఫరాచేస్తున్నారు. ఈ నీటిలో సరియైన మోతాదులో క్లోరిన్‌ను కూడా కలుపుతున్నారు. అయినా తరచు నగరాల్లో చాలా ప్రాంతాల్లో నీరు కలుషితమవుతున్నట్లు ప్రజలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇలా రక్షిత మంచినీరు కలుషితం కావడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. మంచినీటి పైపులు లీకేజ్ కావడం, ఈ నీటి పైపులలో నెగిటివ్ ప్రెషర్ ఏర్పడడం, పైపుల జాయింట్‌లవద్ద లీకేజ్ వంటివి పేర్కొనదగినవి. ఈ సమస్యలకు తోడుగా మంచినీటి పైపులైన్లకు పక్కనే మురుగు నీటి పారుదల లైన్లు ఏర్పాటుచేయడం, లీకేజ్ పైపులను వెంటవెంటనే మరమ్మత్తులు చేసే చర్యలు చేపట్టకపోవడం ఈ కాలుష్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. రోడ్లను తరచు తవ్వి రకరకాల కేబుల్స్ ఏర్పాటుచేసే ప్రక్రియలో మంచినీటి పైపులు బద్దలవుతున్నాయి. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ జలాలు భూగర్భంలోకి పంపడంవల్ల కూడా సరఫరా జలాలు కలుషితం అవుతున్నాయి. ఇటువంటి వాటిపై సరియైన అజమాయిషీ లేకపోవడం మరొక కారణం. ప్రజలవద్దకు వస్తే వారి వ్యక్తిగత పారిశుద్ధ్యలోపంవల్ల, పేదలకు సరియైన మరుగుదొడ్లు లేకపోవడంవల్ల కూడా తాగు నీరు కలుషితమైపోతోంది.

పరిశ్రమల కాలుష్యం
సాధారణ జల వనరుల నుండి నీటిని తీసుకువెళ్లి తాగేవారు కూడా నీటి కాలుష్యం కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ నీటిని కలుషితం చేస్తున్న వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి రంగుల పరిశ్రమలు, ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు, రేయాన్, రాగి, గాల్వనైజింగ్ పరిశ్రమలు. ఇవి భార లోహ పదార్థాలను నీటిలో విడుదల చేసి కాలుష్యం కల్గిస్తున్నాయి.జపాన్‌లోని ‘మినుమహి’వద్ద పాదరస కాలుష్యం ఎంతో బీభత్సం సృష్టిం చింది. ఈ కాలుష్య ప్రమాదం గురించి ప్రపంచమంతా విపరీతంగా చెప్పుకున్నారు. పాదరస కాలుష్యం కాబడిన నీటిని తాగడంవల్ల మనుషులకు ‘సేవియర్ సిండ్రోమ్’ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్థులు మొదట్లో వికృతంగా ప్రవర్తించి చివరకు మరణిస్తారు. ఇది అత్యంత భయంకరమైన కాలుష్య ప్రమాదం. పాదరస కాలుష్యం చెందిన నీటిలో పెరిగిన చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిని తినడంవలన అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా పాదరస కాలుష్యం వలన తల్లి కడుపులోని పిండం పెరుగుదలలో మార్పులు వచ్చి వికలాంగ శిశువులు జన్మించే అవకాశం అధికమవుతుంది.

నీటి కాలుష్యానికి కారణాలు

నీటిని కాలుష్యం చేసే కొన్ని ఖచ్చితమైన కలుషితాలలో విస్తారమైన రసాయన రూపము, పేతోజెన్స్లు, మరియు భౌగోళిక మార్పులు అనగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇంకా రంగు మారటం ఉన్నాయి. ఆ సమయంలో చాలా రసాయనాలు ఇంకా పదార్దాల ప్రకృతి సిద్దమైన (కాల్షియం, సోడియం, ఇనుము, మాంగనీస్, ఇతరమైన వాటితో క్రమపరచబడతాయి. ఘనీభవనము తరచుగా నీటిలో ఏది కలుషితమో నిర్ణయించటానికి ముఖ్యమైనది. ఆక్సిజన్ తగ్గించే పదార్దాలు ప్రక్రుతిసిద్దమైనవి కావచ్చు, ఏవనగా మొక్కల భాగాలు (ఉదా. ఆకులు ఇంకా గడ్డి) అలానే మనిషి తయారు చేసే రసాయనాలు. మిగిలిన ప్రకృతి సిద్దమైన మరియు మానవసంభందమైన పదార్దాలు చిక్కగా (తెరలాగా) ఉండి కాంతిని అడ్డుకొని ఇంకా మొక్కల పెరుగుదలకు ఆటంకపరుస్తుంది, మరియు కొన్నిజాతి చేపల పొలుసులను అడ్డుకొంటుంది.
చాలా రసాయన పదార్దాలు విషపూరితమైనవి. మనుషులలో లేక జంతువులలో పతోజేన్స్ నీటిద్వారా వచ్చే వ్యాధులను ఉత్పత్తి చేయవచ్చు. నీటి భౌతిక రసాయన శాస్త్రమును మార్చటంలో ఆమ్లత్వముతో (pHలో మార్పు), ఎలెక్ట్రికల్ కన్డక్టివిటి, ఉష్ణోగ్రత మరియు యుత్రోఫికేషన్. యుత్రోఫికేషన్ అంటే ఉపరితల నీటిని |పోషకవిలువలతో సారవంతము చేయటము, ఇవి ఇంతకముందు అరుదైనవిగా ఉన్నాయి.

రోగకారక క్రిములు
నీటి కాలుష్యంలో బాక్టీరియాను గుర్తించటానికి కోలిఫాం బాక్టీరియా ఎక్కువగా వాడతారు. అయినా వ్యాధిని కనుగొనటానికి ఇది సరైన ఆధారం కాదు. మిగిలిన సూక్ష్మ జీవులు కొన్నిసార్లు ఉపరితల నీటిలో ఉండటం వల్ల మనుషుల ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి:

  • *entameba histolitica,
  • *క్రిప్టోస్పోరిడియం పార్వం,
  • * జియార్డియా లాంబ్లియా,
  • * సాల్మోనెల్లా,
  • * నోవోవైరస్ ఇంకా మిగిలిన వైరస్ లు,
  • * పరాన్నజీవి పురుగులు (హెల్మిన్త్స్).

పూర్తిగా శుద్ధి చేయని మురుగునీరు కారటం రోగ కారకాలు (పేతోజేన్స్) ఎక్కువ స్థాయిలో ఉండటానికి కారణమవ్వచ్చు. దీనికి కారణం మురికినీటి ప్లాంట్ నాసిరకంగా శుద్ధి చేయటం (అభివృద్ధి తక్కువగా ఉన్న దేశాలలో ఇది సాధారణం). అభివృద్ధి చెందిన దేశాలలోను, పాత నగరాలలో మురుగునీటి పరిశుభ్రత సదుపాయాలి పాతవి అయిపోయి మురుగునీరు పోయే వాటిలోంచి కారవచ్చు (పైపులు, పంపులు, వాల్వులు). వీటివల్ల మురుగునీరు కాలవ పొంగుతుంది. కొన్ని నగరాలలో వాన నీటికి, మురుగు నీటికి ఒకే ప్రవాహ మార్గం ఉండవచ్చును. ఇవి శుద్ధి చేయని మురుగును వాన ప్రవాహంలో కలుపుతుంది. రసాయన మరియు ఇతర కలుషితాలు వ్యర్ధపదార్ధాలు మేటలు వేసినందువలన నది నీరు కలుషితం అవుతుంది. కలుషితాలలో సేంద్రియ పదార్ధాలు (ఆర్గానిక్ కాంపౌండ్స్) మరియు అసేంద్రియ పదార్ధాలు (ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటాయి.

సేంద్రియ నీటి కలుషితాలులో:

* డిటర్జెంట్స్
* డిస్ఇన్ఫెక్షన్ బై-ప్రోడక్ట్ : రోగవ్యాప్తిని అరికట్టటం కోసం వాడే రసాయనాలు- ఉదా: క్లోరోఫాం లాంటివి.
* ఫుడ్ ప్రాసెస్సింగ్ : ఆహారం తయారు చేయడంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధ పదార్ధాలు. దీనిలో ఆక్సిజన్ అవసరమయ్యే పదార్దాలు కూడా ఉంటాయి, క్రొవ్వులు, జిడ్డు
* క్రిమి సంహారకాలు మరియు ఓషద హారులు, పెద్ద మొత్తంలో ఆర్గానో హాలైడ్s మరియు ఇతర రసాయన మిశ్రమాలలో ఉంటాయి.
* పెట్రోలియం హైడ్రోకార్బన్స్, వీటిలో ఇంధనాలు (గాసోలిన్, డీజిల్ ఇంధనం, జెట్ ఇంధనాలు, మరియు చమురు ఇంధనం) ఇంకా రాపిడి తగ్గించే తైలం (మోటార్

ఆయిల్), ఇంకా ఉప పదార్ధాల దహన ఇంధనం, మురుగునీరు పొంగటం ద్వారా వస్తాయి.
* దుంగలు చేయటానికి చెట్టు మరియు శకలాలు,
* వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ (VOCs), ఏవనగా సరిగా నిల్వచేయకపోవటంవల్ల, పారిశ్రామిక ద్రావకాలు. క్లోరినేటెడ్ ద్రావకాలు, ఇవి దట్టమైన , ఇవి ముద్దగా ఉన్న నీటి స్థితిలో లేని ద్రవాలు (DNAPLs), రిజర్వాయర్ అడుగుకి పడిపోవచ్చు, ఎందుకంటే ఇవి నీటితో కానీ ఇంకా కలవవు.
* వివిధ రసాయన మిశ్రమాలలో వ్యక్తిగత ఆరోగ్యం ఇంకా కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉన్నాయి.

అసేంద్రీయ నీటి కలుషితాలలో:
* పారిశ్రామిక విసర్జనలు ఆమ్లత్వం నాకు కారణమవుతాయి, (ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్)
* ఆహార తయారు విదానంలో వ్యర్ధం నుంచి అమ్మోనియా,
* పారిశ్రామిక ఉప-ఉత్పత్తులు నుంచి రసాయన వ్యర్ధం,
* ఎరువులలో ఉండే పోషకాలు - నైట్రేటులు మరియు ఫాస్ఫేటులు--వ్యవసాయంలో , ఇంకా గృహ మరియు వ్యాపార అవసరాలకి ఉండే ఇవి మురికినీటితో కొట్టుకుపోతాయి.
* వాహన యంత్రాలు నుంచి వచ్చేభారీ ఖనిజాలు(పట్టణ మురుగు నీరు పొంగడం ద్వారా) .
* కట్టడ ప్రదేశాల నుంచి కొట్టుకువచ్చిన మన్ను (మడ్డి), దుంగల కొరకు చెట్లను నరకడం ఇంకా కాల్చడం వంటి విధానాలు లేదా నేలను చదును చేయడం.

మాక్రోస్కొపిక్ కాలుష్యం --పెద్దవిగా కనిపించి నీటిని కలుషితం చేసే పదార్ధాలు --వీటిని నగర మురికినీటి విధానంలో "తేలిఉండేవి " అనవచ్చు, లేదా సముద్రంలో దొరికే సముద్ర శిధిలాలు మరియు వీటిలో క్రిందవి కూడా జతచేయవచ్చు:

* పనికిరానివి(e.g. పేపర్, ప్లాస్టిక్, లేదా ఆహార వ్యర్ధాలు) మనుషులచే నేల మీద పారవేయబడినవి, మరియు అవి వాన నీటికి మురుగు కాలవలో కొట్టుకుపోయి, దాని పర్యవసానంగా ఉపరితల నీటిలో పారుతుంది.
* నర్డిల్స్ , అంతటా ఉన్న చిన్న నీటి ప్లాస్టిక్ ఉండలు......మున్నగునవి .

కలుషిత నీరు మూలముగా అనేక రోగాలు వస్తాయి. ఒక జీవి ఇంకొకజీవిని తింటూ బ్రతుకుతుందని అంటారు .. ఇదేమరి .




  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్, Breast Cancer in Male



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్, Breast Cancer in Male-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అనేక చోట్ల విన్నాము . కానీ ఈ మధ్యకాలములో అత్యంత అరుధైన దదిగ్బ్రాంతికరమైన విషయము వెలుగుచూసింది . ... అదే మగవారిలో రొమ్ము క్యానసర్ . మొత్తము రొమ్ము క్యాన్సర్ కీసులలో మగవారి రొమ్ము క్యాన్సర్ కేవలము 1% మాత్రమే అయినప్పటికీ ఇద్ ఆశ్చర్యపరిచే విషయము . మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఇతిమిద్దము గా నిర్ణయించడం సాధ్యము కావడము లేదు . మగవారిలో 60 – 70 సం.ల వయసు ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాధి ఏ వయసులో వారికైనా రావచ్చు.


ఈ వ్యాధి మగవాళ్ళకు రావడానికి గల కారణాలు:
  • జన్యుపరమైన, వాతావరణపరమైన అంశాలు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
  • ఛాతీ ప్రాంతంలో ఎక్కువ రేడియేషన్ కు గురి అయిన వారికి వస్తుంది.
  • ప్రోస్టేట్ చికిత్సలో భాగంగా “ఫినాస్టిరాయిడ్” వంటి మందులను వాడి నప్పుడు ఈ వ్యాధి వస్తుంది.
  • అనువంశీకముగా ఆడవారిలో "bi.ఆర్.సి.ఎ 2 " అనే జన్యువు సంక్రమించినట్లైతే ... మగవారిలో 15% వరకు "బి.ఆర్.సి.ఎ 2 " జన్యువే కారణమని చెప్పవచ్చును .
  • ఫీమేల్ హార్మోన్‌ అయిన " ఈస్ట్రోజన్‌ " స్థాయి మగవారిలో ఎక్కువ ఉంటే కూడా రొ్మ్ము క్యాన్సర్ రావచ్చును .సాదారణము గా ప్రతి మగవాడిలోను స్వల్ప పరిమాణములో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది . . కొంతమంది లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడము వలన మగవారిలో రొమ్ము పరిమాణము పెద్దవిగా ఉండడము , ఊబకాయము రావడము .... ఈ రొమ్ము కాన్సర్ కి కారణము .


ఈ వ్యాధి లక్షణాలు:
  • ఛాతీ దగ్గర ఉన్న చనుమోనల కింద దళసరిగా కంద పెరిగినట్లైతే క్యాన్సర్ వచ్చిందని గుర్తించాలి.
  • చనుమొనలు ఎర్రగా మారడం, సొట్టలు పడి ఉండటం, రక్తం లేదా రసి కారడం వంటివి జరుగుతుంటాయి.
  • ఒక్కోసారి చంకలలో గడ్డలు కూడా వ్యాపించ వచ్చు.
  • క్యాన్సర్ సాధారణము గా ఒక రొమ్ముకే వస్తుంది . అరుదుగా రెండు రొమ్ములుకు వస్తుంది .
ఎలా గుర్తించడము :
ఆదవారిలో కంటె మగవారి రొమ్ములు చిన్నవిగా ఉండాయి కాబట్టి సులువుగా గడ్డలను గుర్తించవచ్చును. మగవారిలో ఇతర కండరాలకు , చెంకలో లింఫ్ గ్రందులకు సునాయాసము గా వ్యాపించడము జరుగుతుంది .. ఇట్టె గుర్తించవచ్చును . సి.ఏ.టి.,- పి.ఇ.టి.సి.టి., -యం.ఆర్.ఐ., -బయోస్పీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును.

ఈ వ్యాధి యొక్క చికిత్స:
స్త్రీల రొమ్ము క్యాన్సర్ చికిత్సలాగనే మగవారి లో క్యాన్సర్ ను నిర్ధారించిన తరువాత సాధారణంగా ‘రాడికల్ మాసక్టమి’ ద్వారా క్యాన్సర్ కు గురైన కణాలను తొలగించవచ్చును.
కిమోథెరపి, రేడియేషన్ వంటి వివిధ చికిత్స పద్ధతులను కూడా ఉపయోగిస్తారు.
క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండటానికి ‘హర్ సెప్టిన్’ వంటి కొన్ని ప్రత్యేక మందులు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయి. వీటిని ఇతర ట్రీట్ మెంట్ పద్ధతులతో కలిపి వాడటం వలన తక్కువ సైడు ఎఫెక్ట్స్ తో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు.
మగవారిలో రొమ్ము క్యాన్సర్ అరుదైనది అయినప్పటికీ తొందరగా గుర్తించడము ముఖ్యము . వ్యా ధి మొదటిలో 96% వరకు నివారించవచ్చును . ఆలస్యము అయినకొద్దీ ఇతర బాగాలకు వ్యాపించడము వలన చికిత్స కస్టమవుతుంది .

source : Wikipedia.org --- English article
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 28, 2011

వర్ణాంధత్వము , Color blindness,కలర్ బ్లయిండ్‌నెస్



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --వర్ణాంధత్వము , Color blindness,కలర్ బ్లయిండ్‌నెస్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వర్ణాంధత్వము అంటే కలర్ బ్లయిండ్‌నెస్. అంటే రంగులను గుర్తిచలేకపోవడం. ఈ వర్ణ దృష్టి లోపాన్ని 1794లో డాల్టన్ అనే శాస్తవ్రేత్త గమనించాడు. మనుషులకు ఈ లోపం పుట్టుకతోనే సంక్రమిస్తుంది. దీనికి నివారణోపాయం ఏమీలేదు. ఈ లోపం డాల్టన్‌కే ఉండడంవల్ల గుర్తించగలిగాడు.
ఈ కలర్ బ్లయిండ్‌నెస్ మగవారిలోనే ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా ఈ దోషం వస్తుందని అనుకునేవారు. ఆ తరువాత పరిశోధనలలో ఇది ఎక్స్-క్రోమోజోమ్‌వల్ల వస్తుందని తెలుసుకున్నారు. జన్యు లోపాల కారణంగా వర్ణద్రవ్యాల్లో సమతుల్యత దెబ్బతిని ఆకుపచ్చ లేదా ఎరుపు రంగును గుర్తించడంలో విఫలమవుతారు.
కంటి నిర్మాణంలో రెటీనా, రాడ్స్, కోన్స్ ముఖ్య భాగాలు. రెటీనా తెరపై వస్తు ప్రతిబింబాలు పడతాయి. రాడ్స్, కోన్స్ ప్రతిబింబాలు రెటీనాపై పడి వాటిని మనం గుర్తించేందుకు సహాయపడతాయి.
తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలము, పసుపు ముఖ్యమైనవి. ఈ రంగులను గ్రహించేందుకు వీలుగా రెటీనాలో వీటికి సంబంధించిన పిగ్మెంట్లు ఉంటాయి. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలము పిగ్మెంట్స్ ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో ఉన్నప్పుడే ఆ వర్ణ మిశ్రమం తెల్లగా కన్పిస్తుంది. ఈ రకమైన అమరికగల వారిని ‘సాధారణ ట్రైకోమేట్లు’ అంటారు.
మూడు పిగ్మెంట్సు
ఈ అమరికలో తేడా ఉంటే వారిని ‘అసాధారణ ట్రైకోమేట్లు’ అంటారు. ఉండాల్సిన మూడు పిగ్మెంట్సులో ఏ రెండు ఉన్నా కొందరు తెలుపు రంగును చూడగలరు. వీరిని ‘డైక్రోమేట్లు’ అంటారు.
ఇందులో ఎరుపు పిగ్మెంటు లేనివారిని ‘ప్రోటోనోపులు’ అంటారు. వీరు ఎరుపురంగు గుర్తించలేరు. ఆకుపచ్చ పిగ్మెంట్ లేనివారిని ‘డ్యుటిరోనోపులు’ అంటారు. వీరు ఆకుపచ్చ రంగు గుర్తించలేరు. నీలము పిగ్మెంటు లేని ‘ట్రెటనోపులు’ నీలం రంగును గుర్తించలేరు. అరుదుగా చాలా తక్కువమందిలో మాత్రమే ఏదో ఒక పిగ్మెంట్ మాత్రమే ఉంటుంది. వారిని ‘మోనోక్రోమేట్లు’ అంటారు. ఇటువంటివారే సంపూర్ణ వర్ణాంధులు. వీరు కేవలం తెలుపు, బూడిద రంగులు మాత్రమే చూడగల్గుతారు.
ఈ వర్ణాంధులలోని కళ్లల్లో కోన్స్ పూర్తిగా లేకపోవడం, ఉన్నా లోపభూయిష్టంగా ఉండడం జరుగుతుంది. వర్ణాంధత్వమువల్ల నిత్య జీవితంలో పనులకు పెద్ద ఇబ్బంది ఉండదు. కాని నగరాలు, పట్టణాలలో సిగ్నెల్ లైట్స్ సరిగా గుర్తించలేక ప్రమాదాలకు లోనుకావచ్చు. రైలు, ఇతర వాహనాలు నడిపేవారు, రక్షక దళాలలోనివారు ఇటువంటి దోషంవల్ల నష్టాలకు లోనవుతారు. వీరివల్ల వారికేగాక ఇతరులకు కూడా ప్రమాదాలు వస్తాయి.
డ్యుటిరోనోపులలో ఒక విచిత్ర లక్షణం ఇటీవల శాస్తవ్రేత్తలు గుర్తించారు. వీరు ఆకుపచ్చ రంగును కొంతవరకు గుర్తించగల్గుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇంతవరకు శాస్తవ్రేత్తలు కనిపెట్టలేకపోయారు. ఎరుపు పిగ్మెంట్ ఎక్కువ తరంగ పొడవుగల్గిన ఎరుపురంగును గుర్తించగలదు. ఎరుపు తరువాత ఎక్కువ తరంగ పొడవుగల్గినది ఆకుపచ్చ రంగు. అందుకే ఈ ఎరుపు పిగ్మెంట్ ఆకుపచ్చ రంగును కొంతవరకు గుర్తుపట్టడంలో సహకరిస్తుందని ఇప్పుడు కనుగొన్నారు.
మనిషి ప్రతి కణంలోను 46క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇందులో 22 జతలను ‘ఆటోసోమ్’లని మిగిలిన ఒక్క జతను సెక్స్‌క్రోమోజోమ్ అంటారు.
సెక్స్‌క్రోమోజోమ్‌లు
సెక్స్‌క్రోమోజోమ్‌లలో ఎక్స్ మరియు వై క్రోమోజోమ్‌లు ఉంటాయి. స్ర్తిలలో సెక్స్ క్రోమోజోమ్‌లు రెండూ ఎక్స్ తరగతికి చెందినవే ఉంటాయి. మగవారిలో ఒకటి ఎక్స్ మరియొకటి వై ఉంటాయి.
తల్లిదండ్రుల నుండి గర్భస్థశిశువుకు చెరొక ఎక్స్ క్రోమోజోమ్ సంక్రమిస్తే పుట్టే బిడ్డ ఆడశిశువు అవుతుంది. తండ్రినుండి వై-క్రోమోజోమ్, తల్లినుండి ఎక్స్-క్రోమోజోమ్ సంక్రమిస్తే మగబిడ్డ పుడుతుంది.
కలర్ బ్లయిండ్‌నెస్ అనేది ఆటోజోమ్‌ల ద్వారా సంక్రమిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరినుండి వర్ణాంధత్వం ఉండే ఆటోజోమ్‌లు బిడ్డకు సంక్రమించినప్పుడే బిడ్డకు సంపూర్ణ వర్ణాంధత్వం వస్తుంది. ఒక్కరినుండే సంక్రమిస్తేఈ లోపం బహిర్గతం కాదు. అందుకే ఈ కలర్ బ్లయిండ్‌నెస్ అరుదుగానే వస్తుంది.
ఎక్స్-క్రోమోజోమ్ ఈ లోపాన్ని రవాణా చేస్తుంది. ఆడవారిలో రెండు ఎక్స్-క్రోమోజోమ్‌లు వుండడంవల్ల ఒకదాని లోపాన్ని రెండవది బహిర్గతం కాకుండా చేస్తుంది. మగవారిలోని ఎక్స్-క్రోమోజమ్ లోపాన్ని సరిదిద్దగల క్రోమోజోమ్ లేదు. అందుకే మగవారిలో ఈ కలర్ బ్లయిండ్‌నెస్ అధికంగా కన్పిస్తుంది. స్ర్తిలలో సాపేక్షంగా చాలా తక్కువగా ఉంటుంది.
మగవారిలో కలర్ బ్లయిండ్‌నెస్ వచ్చిందంటే అది తల్లినుండి సంక్రమించినదే అవుతుంది. ఎందుకంటే తల్లి ఎక్స్-క్రోమోజోమ్, తండ్రి వై-క్రోమోజోమ్ అతడికి వచ్చాయి. ఆడవారిలో ఈ కలర్ బ్లయిండ్‌నెస్ తల్లిదండ్రులు ఇరువురినుండి సంక్రమిస్తుంది. మేనరికాలు చేసుకున్న వారిలో ఇటువంటి ఇబ్బందులు వారి పిల్లల్లో కన్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, October 27, 2011

పిల్లలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన , Awareness on Paediatric health problems.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పిల్లలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన దేశంలో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మన పరిస్థితి పొరుగున ఉన్న చిన్నచిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంకల కంటే కూడా హీనంగా ఉండటం మనందరికీ కూడా బాధాకరం.పుట్టగానే శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. 1. పుట్టగానే శ్వాస తీసుకోకపోవటం. ఇది పెద్ద సమస్య. కేవలం పుట్టగానే ఏడ్వక పోవటం, శ్వాస తీసుకోకపోవటం మూలంగానే ఎంతోమంది మరణిస్తున్నారు. ఇది తెలియక చాలామంది బిడ్డలు కడుపులోనే చనిపోయారని భావిస్తుంటారు కూడా. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇప్పుడు గట్టి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా- కాన్పు చేసే వారికి తగినంత నైపుణ్యం ఉంటే ఈ సమస్య తలెత్తకుండా ఎంతోమంది శిశువులను కాపాడొచ్చు. పుట్టగానే శిశువు ఏడ్వకుండా... తనంతట తానుగా శ్వాస తీసుకోలేకపోతుంటే.. వెంటనే 'బ్యాగ్‌-మాస్క్‌' పరికరంతో బిడ్డ శ్వాస తీసుకునేలా ప్రోత్సహించాలి. ఈ పని బిడ్డ పుట్టిన తొలి నిమిషంలోపే చెయ్యటం అవసరం. ఎందుకంటే బిడ్డ పుట్టిన తొలి నిమిషం చాలా కీలకం. అందుకే దీన్ని 'గోల్డెన్‌ మినిట్‌' అంటారు. ప్రసూతి నిపుణుల సంఖ్య పెరిగితే మనం ఈ పుట్టగానే శ్వాస సమస్యను చాలా వరకూ నివారించవచ్చు.

2. ఇన్‌ఫెక్షన్లు: పిల్లల విషయంలో శుభ్రత చాలా అవసరం. వారిని కనిపెట్టుకుని ఉండేవారు, తాకేవారు తమ చేతులను తప్పనిసరిగా సబ్బుతో 2 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. వూరికే చేతులు రుద్దుకుంటే చాలదు. పిల్లలకు తల్లిపాలు పట్టటం.. ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసే ముఖ్యమైన నివారణ చర్య. ఇదేమీ ఖర్చుతో కూడుకున్నది కాదు. తల్లుల్లో, కుటుంబాల్లో ఈ అవగాహన, చైతన్యం పెరిగితే చాలు.

3. తక్కువ బరువుతో పుట్టటం: పిల్లలు తక్కువ బరువుతో పుట్టటానికి ప్రధాన కారణం- యుక్తవయసు గర్భధారణే. ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చెయ్యటం ద్వారా ఈ సమస్యను చాలా వరకూ తొలగించవచ్చు. ఈ విషయంలో చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచటం ఎంతో అవసరం. కౌమారంలో ఉన్న ఆడపిల్లలకు, యవ్వన స్త్రీలకు రక్తహీనత తలెత్తకుండా 'ఐరన్‌' మాత్రలు ఇవ్వటం మంచిది. వారానికి 100 గ్రా. మోతాదు ఐరన్‌ మాత్ర ఒకటి ఇచ్చినా రక్తహీనత చాలావరకూ తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల భవిష్యత్తులో బరువు తక్కువ బిడ్డలు పుట్టటాన్ని అరికట్టొచ్చు.

పుట్టగానే శిశువుల మరణాలకు చాలా వరకూ ఈ మూడు అంశాలే కారణమవుతున్నాయి. కాన్పులు ఆసుపత్రుల్లో జరిగేలా చూడటం, బిడ్డ పుట్టిన 48 గంటల వరకూ అక్కడే ఉండటం, బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలివ్వటం ద్వారా ఎన్నో శిశుమరణాలను అరికట్టవచ్చు.

ఇక ఆ తర్వాతి దశలో పిల్లల మరణాలకు చాలా వరకూ కారణమవుతున్న అంశాలు న్యుమోనియా, డయేరియా. టీకాలతో నివారించదగ్గ వీలున్న జబ్బులతో మరణించే పిల్లల సంఖ్యా మన దగ్గర తక్కువేం లేదు. ముఖ్యంగా మీజిల్స్‌. వీటి గురించి వివరంగా చూద్దాం.

1. న్యుమోనియా: ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా బిడ్డను సంరక్షించుకోవచ్చు. బిడ్డ శ్వాస తీసుకునే వేగాన్ని బట్టి దీన్ని గుర్తించటం తేలికే. రెండు నెలల వయసు వరకూ పిల్లలు నిమిషానికి 60 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా, రెండు నెలల నుంచి ఏడాది పిల్లలు 50 కన్నా ఎక్కువ సార్లు గాలి తీసుకుంటున్నా, ఏడాది దాటిన తర్వాత 40 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా బిడ్డకు 'న్యుమోనియా' వచ్చిందేమోనని అనుమానించి ఆసుపత్రికి తీసుకువెళ్లటం మంచిది.

2. నీళ్ల విరేచనాలు: బిడ్డకు నీళ్ల విరేచనాలు అవుతుంటే ప్రధానంగా ఇవ్వాల్సింది 'చిటికెడు ఉప్పు-చారెడు పంచదార' మిశ్రమమైన ఓరల్‌ రీహైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌). దీనితో పాటు జింక్‌ కూడా ఇవ్వటం చాలా అవసరమని చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య అందరికీ నొక్కి చెబుతోంది. ఈ జింక్‌ మాత్రలు, సిరప్‌ల రూపంలో లభిస్తున్నా వైద్యులు దీన్ని అందరికీ ఇవ్వటం లేదు. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు దీన్ని 6 నెలలు దాటిన పిల్లలకు రోజుకి 20 మి.గ్రా మోతాదులో 14 రోజుల పాటు ఇవ్వాలన్నది సిఫార్సు. వీటిని తప్పకుండా ఇవ్వాలి. ఇక నీళ్ల విరేచనాలు అవుతుంటే యాంటీబయాటిక్స్‌తో ప్రయోజనం ఉండదు. రక్తబంక విరేచనాలు అవుతుంటేనే (డిసెంట్రీ) యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నీళ్ల విరేచనాలను తగ్గించటంలో 'ప్రోబయాటిక్స్‌' పాత్ర కూడా పెద్దగా లేదు. అయినా చాలామంది వైద్యులు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఈ విషయంలో వైద్యులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

3. టీకాలు: బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించటం ద్వారా కూడా శిశు మరణాల రేటును బాగా తగ్గించవచ్చు. ముఖ్యంగా పొంగు/తట్టు (మీజిల్స్‌) టీకాను 9 నెలల వయసులో పిల్లలందరికీ తప్పనిసరిగా ఇప్పించాలి. ఇది దాదాపు 15 ఏళ్ల నుంచీ ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇస్తున్నదే అయినా ఇప్పటికీ ఇది పిల్లలందరికీ చేరటం లేదు. ఈ టీకాలను బిడ్డకు జలుబు జ్వరం వంటివి ఉన్నప్పుడు కూడా ఇప్పించవచ్చు. అందుకే ఏ కారణంతో ఆసుపత్రికి వెళ్లినా వీటిని వేయించటానికి సందేహించాల్సిన పని లేదు. దీని విషయంలో శ్రద్ధ పెట్టాలి. బిడ్డ చక్కటి పోషకాహారం తింటుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. త్వరగా జబ్బుల బారినపడరు. బిడ్డను వెచ్చగా ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన రక్షణ చర్య.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 97 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తుండగా.. వీరిలో 21 లక్షల మంది మన దేశంలోనే మరణిస్తున్నారు.
మన దేశంలో ప్రతి 1000 మందిలో 37 మంది రోజుల బిడ్డలుగానే మరణిస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు.
దేశంలో ఏటా 2.7 కోట్ల కాన్పులు జరుగుతున్నాయి. కాన్పులు చేసే నిపుణులు సుమారు 3 లక్షల మందైనా కావాలి.
డయేరియాతో బాధపడే పిల్లల్లో సగటున 27% మందికే ఓఆర్‌ఎస్‌ ఇస్తున్నారు.
మన దేశంలో తట్టు/పొంగు (మీజిల్స్‌) కారణంగా ఏటా 2 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది మన దేశంలోనే అత్యధికం.

జ్వరమంటే భయమేల?---డా. జీసన్‌ ఉన్ని-కొచ్చి, ఔషధ సిఫార్సుల విభాగం, ఐఏపీ
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాభరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్‌' వేస్తుంటారు. నిజానికి అంత ఆదుర్దా అవసరం లేదు. ఎందుకంటే జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో మన శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలి. కేవలం ఒళ్లు వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్‌ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. చాలామంది ఒళ్లు వేడిగా ఉందనగానే వెంటనే థర్మామీటర్‌తో కొలవటం మొదలుపెట్టేస్తుంటారు. అంత అక్కర్లేదు. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నా ప్యారాసిటమాల్‌ వేయాలి. వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్‌ ఇవ్వచ్చు. ఈ రెండూ ఐపీఏ సూచిస్తున్న మందులు. ఒకవేళ వైద్యులు వైరల్‌ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే- ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయోటిక్‌ల వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డోసు యాంటీబయోటిక్‌ వాడితే మూత్ర, రక్త పరీక్షల్లో తేడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత్ర ఇన్ఫెక్షన్ల వంటివి ఉంటే గుర్తించటం కష్టం. కాబట్టి కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తెలుసుకోవాలి.

జ్వరం మరీ పెరిగితే ఫిట్స్‌ వస్తాయని భావించి తల్లిదండ్రులు వెంటనే ప్యారాసిటమాల్‌ వంటివి వేస్తుంటారు. నిజానికి జ్వరం ఒకేసారి అసాధారణంగా పెరిగినప్పుడు మాత్రమే ఫిట్స్‌ వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుందో ముందు గుర్తించటం కష్టం. అందుకని దాన్ని మనమెలాగూ నివారించలేం.

* ఒకవేళ ఫిట్స్‌ 15 నిమిషాల కన్నా ఎక్కువసేపున్నా, శరీరంలో ఒక భాగంలోనే వస్తున్నా, రోజుకి రెండుసార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, 6 నెలల్లో 4 సార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, కుటుంబంలో ఎవరికైనా ఫిట్స్‌ వ్యాధి ఉన్నా.. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమాల్‌ వంటి మాత్రలు వేయాల్సి అవసరం ఉంటుంది. అది కూడా ఆరేళ్ల వయసు వరకే. ఆ తర్వాత వారి మెదడు ఎదుగుతుంది. ఈ సమస్య చాలా వరకూ తొలగిపోతుంది.
జ్వరంలో ఫిట్స్‌ ఒకసారి వచ్చినంత మాత్రాన ఏ హానీ ఉండదు. తరచూ వస్తుంటే మాత్రం మున్ముందు అది 'మూర్ఛ'గా మారుతుందేమో గమనించాలి. జ్వరం వచ్చినవారిలో 3% మందిలోనే ఫిట్స్‌ వస్తుంటాయి. మళ్లీ వీరిలో కూడా అది మూర్ఛగా మారే అవకాశంకేవలం 0.2% మందిలోనే!

మన పిల్లలకు మన పాలు!--డా. గదాధర్‌ సారంగి--భువనేశ్వర్‌, ఐఏపీ
ఆవుపాలు ఆవుదూడల కోసమేగానీ.. మన పిల్లల కోసం కాదు! దీనర్థం మన పిల్లలకు కావాల్సిన పాలు తల్లుల నుంచే వస్తాయిగానీ వేరే వాటి నుంచి కాదు అని. మనకూ జంతువులకూ ఎంతో తేడా ఉంది. ఆవుదూడ పుట్టిన 6 గంటలకల్లా లేచి నిలబడి తల్లి నుంచి పాలు తాగుతుంది. మూడేళ్లకల్లా అది పాలివ్వటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన పిల్లలు అలా కాదే! పసిబిడ్డలు మొదటి ఆర్నెల్లూ తల్లిపాల మీదే ఆధారపడతారు. రెండేళ్ల వరకూ పాలు తాగుతారు, తాగాలి కూడా. మన పిల్లల మెదడు జంతువులమెదడు కన్నా వేగంగా, పెద్దగా ఎదుగుతుంది. ఏనుగు మెదడు 800 గ్రాములు కూడా ఉండదు. అదే పిల్లల్లో పుట్టేటప్పటికే 800 గ్రాములుంటుంది, మూణ్ణాలుగేళ్లకల్లా 1,400 గ్రాములకు చేరుకుటుంది. కాబట్టి మన మేధస్సుకు మించిన సామర్థ్యం మరే జంతువుకూ లేదు. మన అవసరాలు వేరు.

తల్లిపాలలో లాక్టోజ్‌ శాతం 7 గ్రాములు ఉంటుంది. అదే ఆవుపాలలో అయితే 3 గ్రాములే. ఈ లాక్టోజ్‌ తర్వాత దశలో గాలక్టోజ్‌గా రూపొందుతుంది. ఇది ఇతర హార్మోన్లతో కలిసి గాలక్టోలిపిడ్స్‌గా మారుతుంది. మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఇదే ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోతే నాడీ వ్యవస్థకు సరిపడిన ఆహారం లభించదు. పైగా తల్లీబిడ్డల మధ్య మానసిక బంధం కూడా అంతగా బలపడదు. ఇది కౌమారదశలో విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొదటి ఆర్నెల్లూ తల్లిపాలు, ఆ తర్వాత ఇతర పదార్థాలతో పాటుగా పాలివ్వటం అవసరం. ఆ తర్వాత కూడా పిల్లలకు ఆహారం ప్రేమగా, ఆప్యాయతతో పెట్టాలి. లేకపోతే వాళ్లు తిరస్కరిస్తారు. ఈ దశ ఏడాది వరకు కొనసాగుతుంది.

ఏడాది దాటేసరికి పిల్లలు తీపి, పులుపు, చేదు వంటి భిన్న రుచులను బాగా గ్రహించే స్థితికి చేరుకుంటారు. ఇష్టాయిష్టాలను బాహాటంగా ప్రదర్శిస్తారు. వీరికి ఇంట్లో తయారు చేసుకునే ఆహారం సరిపోతుంది. అయితే- పెరుగుతున్న పిల్లలకు శరీరం ఎదగటానికి అవసరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా అవసరమే. ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్‌, రాజ్మా, జొన్నలు, చేపలు, మాంసం, పాలు వంటి వన్నీ ప్రోటీన్లు ఇస్తాయి. పాలల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయిగానీ దాని నుంచి ఎక్కువ శక్తి కేలరీలు రావు. కాబట్టి తల్లిదండ్రులు ఎదిగే పిల్లలకు పాలు పట్టాల్సిందేగానీ కేవలం అదే సరిపోతుందని భావించకూడదు.
బిడ్డకు పుట్టిన గంటలోపే కేవలం 26-46% మందే తల్లిపాలు పడుతున్నారు.
* 22% తల్లులే బిడ్డకు ఆర్నెల్లు వచ్చే వరకూ కేవలం తల్లిపాలు పడుతున్నారు.
పిల్లలు ఏడుస్తుంటే తల్లులు తన పాలు సరిపోవటం లేదని భావిస్తూ డబ్బా పాలు మొదలెడుతుంటారు. దాని ఖర్చు చాలా ఎక్కువ. సరిగ్గా పడితే ఒక డబ్బా 2, 3 రోజులు కూడా రాదు. దీంతో నీళ్లెక్కువ, పొడి తక్కువేసి కలపటం మొదలుపెడతారు. అది పిల్లల అవసరాలకు చాలదు. పిల్లల్లో పోషకాహార లోపానికి తల్లిపాలివ్వకపోవటమే ముఖ్య కారణం. ఇలా 47% పిల్లలు బాధపడుతున్నారు.

పంజరం బంగారానిదే అయినా..!--డా|| పి.సుదర్శన్‌ రెడ్డి--హైదరాబాద్‌

*మన దేశంలో ఎదుగుతున్న పిల్లలను.. పోషకాహార లోపం తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా రక్తహీనత కారణంగా ఎంతోమంది చదువుల్లో వెనకబడుతున్నారు. వారిలో బుద్ధివికాసం మందగిస్తుంది. నీరసం, ఏకాగ్రత కుదరకపోవటం, చికాకు, మొండితనం, తిక్క.. ఇలాంటి ప్రవర్తన సమస్యలు పెరుగుతాయి. చక్కటి పోషకాహారం, ఐరన్‌ మాత్రలతో ఈ పరిస్థితిని చక్కగా నివారించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు దీనిపై దృష్టిపెట్టాలి. ఈ వయసు పిల్లలు కొత్తగా బయటకు వెళ్లటం, బయట తినటం, బయట నీరు తాగటం వంటివి చేస్తుంటారు కాబట్టి వీరికి 'శుభ్రతగా జీవించటం' నేర్పాలి.

* అన్నింటికంటే ఈ వయసులో ఎక్కువగా ఎదురయ్యేది- స్కూలు, చదువు సమస్యలు. 'మా పిల్లాడు సరిగా చదవటం లేదని' చదవమంటే కడుపునొప్పి, తలనొప్పి అంటారని.. తల్లిదండ్రులు రకరకాలుగా ఫిర్యాదులు చేస్తుంటారు. కొత్తగా మొదలైన స్కూలు, చదువు, పోటీ, పరీక్షలు, దండన, భయం, అపోహలు.. ఇవన్నీ కూడా ఈ వయసు పిల్లల్లో ఒత్తిడిని పెంచేవే. మరోవైపు తల్లిదండ్రులేమో- తమ చిన్నతనంలో తాము పొందలేకపోయిన వాటన్నింటినీ ఇప్పుడు తమ పిల్లలకు సమకూర్చి పెట్టినా వాళ్లెందుకు సరిగా చదవటం లేదని విపరీతంగా మధనపడుతుంటారు, పిల్లల మీద మరింత ఒత్తిడి పెడుతుంటారు. ట్యూషన్లు, చదువులు, పోటీల పేరుతో పసివయసులో వారి స్వేచ్ఛను, స్వతంత్రతను కట్టడి చేస్తుంటే వాళ్లు హాయిగాఉండలేరు. చక్కగా ఎదగలేరు. పంజరం బంగారంతో చేసినదే అయినా.. ఏ చిలకా దానిలో హాయిగా ఉండలేదన్న వాస్తవాన్ని తల్లిదండ్రులంతా గుర్తించాలి. వాళ్ల బాల్యాన్ని వాళ్లు హాయిగా ఆస్వాదించేలా చేసినప్పుడే చక్కగా ఎదుగుతారు. వారితో ఎక్కువ సమయం గడపాలి, వారి సాంగత్యాన్ని ఆస్వాదించాలి. వారి లేత మనసులను ఆప్యాయతతో గెలిచి.. ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవరచాలి. లేకపోతే పిల్లల్లో మానసిక, ప్రవర్తనాపరమైన సమస్యలు బయల్దేరతాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో మానసిక వైద్యనిపుణులను సంప్రదించే పిల్లల సంఖ్య పెరుగుతుండటాన్ని చూసి.. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది! 2-8 సంవత్సరాల పిల్లల్లో ఆహారపోషణ సరిగా లేక ఎదుగుదల లోపాలు ఎక్కువ. 50% మంది ఉండాల్సిన ఎత్తుబరువుల కంటే తక్కువవే ఉంటున్నారు. 70% రక్తహీనతతో బాధపడుతున్నారు.
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

హైపోస్పేడియాస్‌,Hypospadias




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --హైపోస్పేడియాస్‌,Hypospadias-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అన్నీ సజావుగా ఉంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఏదైనా చిన్న లోపంతో పుడితే ఆ క్షణంలో తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యథకూ అంతుండదు. ముఖ్యంగా పసిబిడ్డ అంతా చక్కగా ఉండి జననాంగాల దగ్గర సమస్యల వంటివి కనబడితే.. ఆ పిల్లవాడి భవిష్యత్తు గురించి ఇంటిల్లిపాదీ ఎంతో భయాందోళనలకు లోనవుతారు. మగపిల్లల్లో ఇలా పుట్టుకతో వచ్చే జననాంగ సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... హైపోస్పేడియాస్‌! అంటే మూత్ర రంధ్రం ఉండాల్సిన చోట కాకుండా.. పురుషాంగం మీద మరోచోట ఎక్కడో ఉండటం.. దానివల్ల పురుషాంగం స్వరూపమే తేడాగా ఉండటం ఈ సమస్యకు మూలం. మన సమాజంలో దీని గురించి బయట పెద్దగా చెప్పుకోకపోయినా... ఇది మరీ అంత అరుదైన సమస్యేం కాదు. దీన్ని చిన్నతనంలోనే చక్కదిద్దేందుకు చక్కటి సర్జరీ విధానాలూ ఉన్నాయి. అయినా దీనిపై అవగాహనా లేమి కారణంగా ఎంతోమంది... పెద్ద వయసులో కూడా దీనితో ఇబ్బందులు పడుతుండటం బాధాకరం.

బిడ్డ పండల్లే చక్కగా ఉంటాడు. ఎటువంటి సమస్యా ఉండదు. కానీ పురుషాంగం వైపు చూస్తే... దాని రంధ్రం ఉండాల్సిన చోట ఉండదు. అంగం మీదే మరెక్కడో కిందగా.. లేదంటే వృషణాల తిత్తి దగ్గర... ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుంది. బిడ్డ మూత్ర విసర్జన చేస్తుంటే.. మూత్రం అక్కడి నుంచే.. ఆ రంధ్రం నుంచే బయటకు వస్తుంటుంది. పూర్వచర్మం అంతా పైనే ఉండి శిశ్నం చిక్కుడు గింజలా కూడా కనిపించొచ్చు. దీన్ని చూస్తూనే తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటారు. ఇదేదో వింత సమస్య అనో.. పురుషాంగం సరిగా తయారవ్వలేదనో.. ఎక్కడా లేని ఈ సమస్య తమ బిడ్డకే ఎందుకు వచ్చిందనో.. రకరకాలుగా చింతిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది మరీ అరుదైన సమస్యేం కాదు. దీన్నే వైద్యపరిభాషలో 'హైపోస్పేడియాస్‌' అంటారు.

ప్రతి 250లో ఒకరు!--సాధారణంగా మూత్ర విసర్జన రంధ్రం... పూర్వచర్మంతో పూర్తిగా కప్పి ఉన్న గుండ్రటి శిశ్నం చివ్వర ఉంటుంది. కానీ ఈ హైపోస్పేడియాస్‌ సమస్యతో పుట్టిన పిల్లల్లో.. ఈ మూత్రం పోయే మార్గం పురుషాంగం చివ్వర కాకుండా.. శిశ్నం మధ్యలో కాకుండా.. దాని కింది భాగంలో మొదలుకొని వృషణాల తిత్తి వరకూ.. రకరకాల ప్రదేశాల్లో ఉండొచ్చు. మగపిల్లల్లో ప్రతి 250 మందిలో కనీసం ఒకరు ఈ తరహా సమస్యతో పుడుతున్నట్టు అంచనా. మన దేశంలో ప్రసవాల సంఖ్యను బట్టి చూస్తే ఇదెంత తరచుగా ఎదురయ్యే సమస్యో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యతో పుట్టే కొందరికి పూర్వచర్మం మొత్తం గూడులా పైవైపునే ఉండి.. కింద ఏమీ ఉండకపోవచ్చు. మూత్ర రంధ్రం కొందరికి బీర్జాల దగ్గరే కాదు.. అరుదుగా ఏకంగా మలద్వారం సమీపంలో కూడా ఉండొచ్చు. అయితే ఎక్కువ మందిలో ఈ రంధ్రం శిశ్నానికి కింది భాగంలోనే.. పురుషాంగం చివర్లోనే ఉంటుంది, దీన్ని సర్జరీతో సరిచేయటం కూడా కొంత తేలిక. రంధ్రం మరీ కిందగా ఉన్నప్పుడు కొంత క్లిష్టమైన సర్జరీలు, కొన్నిసార్లు దశలవారీగా కూడా చెయ్యాల్సి వస్తుంది.

ఏమిటి దీనితో సమస్య?
బిడ్డ హైపోస్పేడియాస్‌ తరహా సమస్యతో పుట్టినట్టు గమనించగానే.. తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. ముఖ్యంగా పిల్లవాడు సహజంగా ఎదిగి.. సాధారణ జీవితం గడపగలుగుతాడా? లేదా? అన్నది పెద్ద అనుమానం. తెరుచుకున్నట్లుగా ఉన్న మూత్రనాళాన్ని ఎలా సరిచేస్తారు? ఆపరేషన్‌ చేయించినా తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? అంగం మామూలుగానే కనబడుతుందా? పెద్దయ్యాక స్తంభన, సంతాన సామర్థ్యం ఎలా ఉంటాయి? ఇంత చిన్నబిడ్డకు సర్జరీ చేస్తే ఏమవుతుందో? అసలు ఆపరేషన్‌ చేయించకపోతే ఏమవుతుంది? ఇలా ఎన్నో సందేహాలు మనసులో తొలుస్తుంటాయి. సమస్యపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే వీటన్నింటికీ సరైన సమాధానం.

తెలియక ముందే దిద్దుబాటు
వయసు పెరుగుతున్న కొద్దీ పసిపిల్లలకు తమ జననాంగాల గురించి అవగాహన పెరుగుతుంటుంది. వారికి ఈ విషయాలేవీ సరిగా తెలియక ముందే ఆపరేషన్‌ చేయటం మంచిది. ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత చేస్తే.. వయసు పెరుగుతున్నకొద్దీ తమ జననాంగాలపై ఏదో చేశారని పిల్లలు జీవితాంతం మానసిక క్షోభ పడే అవకాశం ఉంది. వీరిలో కొందరికి రెండు, మూడు సార్లు కూడా ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఏడాది లోపే చేయటం వల్ల వారికి ఊహ తెలిసేసరికి అంతా సజావుగా ఉంటుంది. రెండోది- సాధారణంగా రెండేళ్ల వయసు వరకూ పిల్లలకు మూత్ర విసర్జనపై పట్టు, నియంత్రణ ఉండవు. వచ్చినప్పుడు పోసేస్తుంటారు. రెండేళ్ల తర్వాత నియంత్రణ, పట్టు వస్తాయి. కాబట్టి ఆ తర్వాత సర్జరీ చేస్తే.. భయంతో వాళ్లు మూత్ర విసర్జనకు వెళ్లకుండా బిగబట్టేసుకుంటారు. ఇది కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. మూత్రం బయటకు రావటానికి లోపలికి గొట్టాల వంటివి వెయ్యాల్సి వస్తుంది, దీంతో సర్జరీ ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశమూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే వయసులో.. మూత్రవిసర్జన మిగతా పిల్లలందరిలా లేకపోవటంతో పిల్లవాడు మానసిక వేదన, నగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. ముఖ్యంగా 3-8 ఏళ్ల వయసులో పిల్లలకు జననాంగాల మీద ఆసక్తి, కుతూహలం ఎక్కువగా ఉంటాయి. ఆ వయసు వరకూ ఈ సమస్యను సరిచేయించకపోతే బిడ్డ మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అంగం వంకర (కార్డీ) కూడా ఉంటే సెక్స్‌లో సమస్యలు, స్ఖలనంలో ఇబ్బంది, రతిలో వీర్యం సరిగా బయటకు రాకపోవటం వంటి ఇబ్బందులు రావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- రెండేళ్ల లోపే ఆపరేషన్‌ చేస్తే ఈ తరహా సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఆపరేషన్‌ తర్వాత ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు.

ఎలా సరి చేస్తారు?
ఒకరకంగా హైపోస్పేడియాస్‌ను చేసే సర్జరీ.. ఉన్న లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని పునర్నిర్మించటం లాంటిది! దీనికోసం ఇప్పుడు ఎన్నో ఆధునిక విధానాలు ఉన్నాయి. లోపం తీరును బట్టి సర్జరీ ఎలా చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. మూత్ర రంధ్రం సరిచేయటం, అంగం వంగినట్లుంటే దాన్నీ సరిచేయటం.. రెండూ సర్జరీలో ముఖ్యాంశాలే. సాధారణంగా మూత్ర రంధ్రం శిశ్నం కిందే ఉండి.. చివరి వరకూ గాడిలా ఉంటే.. సర్జరీ సమయంలో దాన్నే గుండ్రటి మూత్ర మార్గంగా మలుస్తారు. దీంతో మూత్ర రంధ్రం... అంగం మధ్యకు, చివరకు వచ్చేస్తుంది. అంతా సహజంగా కనబడుతుంది. కొందరిలో ఇలా చెయ్యటానికి అనువుగా లేకుండా.. మూత్ర రంధ్రం మరీ కిందగా ఉంటే.. పురుషాంగం పైన గూడులా ఉన్న పూర్వచర్మం లోపలి పొరను.. ఇంకా అవసరమైతే పూర్వచర్మం పైపొరను కూడా మూత్రనాళంలా తయారు చేయటానికి ఉపయోగిస్తారు. కొందరిలో పూర్వచర్మం కూడా తగినంత లేకపోతే లోపలి బీర్జాల దగ్గరి సున్నిత చర్మం నుంచి, లేదంటే దవడ లోపలి మృదువైన చర్మాన్ని, కింది పెదవి లోపలి చర్మాన్ని తీసుకుని మూత్రమార్గంగా తయారు చేసే విధానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. వీటితో ఫలితాలు కూడా చాలా బాగుంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు.

ఫలితాలు తృప్తికరం
ఒకప్పుడు అనుసరించిన సర్జరీ విధానాలతో ఫలితాలు కొంత వరకే సంతృప్తికరంగా ఉండేవి. కానీ గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన విధానాలతో ఫలితాలు చాలా బాగుంటున్నాయని గుర్తించారు. నిపుణులైన సర్జన్లు చేసినప్పుడు వీటితో బిడ్డ పెరిగి పెద్దయినా ఎటువంటి ఇబ్బందులూ ఉండవని చెప్పచ్చు. పురుషాంగం కూడా చాలా వరకూ సహజంగా కనబడుతుంది. లైంగిక సామర్థ్యం, సంతానం వంటి వాటికేమీ ఇబ్బంది ఉండదు.

నివారించగలమా?
హైపోస్పేడియస్‌ రావటానికి కచ్చితమైన కారణమేంటో తెలియదు. ఇటువంటి లోపాలతో పిల్లలు అన్ని సమాజాల్లో, జాతుల్లో, వర్గాల్లో పుడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తండ్రికి ఈ సమస్య ఉంటే కొడుకుకూ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రధానంగా దీనికి జన్యుపరమైన అంశాలకు తోడు.. తల్లి గర్భంలో పిండం పెరుగుతున్న సమయంలో పర్యావరణ పరమైన ప్రభావాలు కూడా దోహదం చేస్తున్నాయని భావిస్తున్నారు. ఆడపిల్త్లెనా, మగపిల్లాడైనా తల్లి గర్భంలో పెరిగేటప్పుడు 9 వారాల వరకూ జననాంగం ఒకే తీరులా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ, పురుష అంగాలుగా మారి, హార్మోన్ల ప్రభావంతో ఎదగటం మొదలుపెడుతుంది. ఈ సమయంలో పురుష హార్మోన్‌లో తేడాల వల్ల పురుషాంగం సరిగా ఎదగక.. హైపోస్పేడియాస్‌ వంటి లోపాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి గర్భం తొలివారాల్లో గర్భిణులు పురుగుల మందులు, రసాయనాల వంటివాటికి దూరంగా ఉండటం.. శుభ్రమైన, సహజమైన ఆహారం తీసుకోవటం, కృత్రిమ రంగులు కలిపిన పదార్థాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండటం.. ఇలాంటి జాగ్రత్తలు కొంత వరకూ ఉపకరించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

నైపుణ్యం కీలకం!
పసిపిల్లలే సున్నితమనుకుంటే.. వాళ్ల పురుషాంగం మరింత సున్నితం. దీనిపై ఆపరేషన్‌ చేయటం.. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన లోపాన్ని చక్కదిద్ది బిడ్డ పూర్తి సహజంగా ఎదిగేలా చెయ్యటం మరింత సంక్లిష్టమైన అంశం. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకోవటం అవసరమని నొక్కిచెబుతున్నారు పిల్లల యూరాలజీ సమస్యల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డా. రమా జయంతి. మన విశాఖపట్టణానికి చెందిన ఈయన ఓహియో (అమెరికా) రాష్ట్రంలోని ప్రఖ్యాత నేషన్‌వైడ్‌ చిల్డ్రెన్స్‌ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

*హైపోస్పేడియాస్‌ సమస్యను చక్కదిద్దే సర్జరీ క్లిష్టమైనది దీనిలో ఉన్న ఇబ్బంది, ప్రత్యేకత ఏమిటి?
ఇది చాలా సున్నితమైనది, మిగతా వాటికన్నా చాలా భిన్నమైన సర్జరీ. ఉదాహరణకు కిడ్నీకి క్యాన్సర్‌ వచ్చిందనుకోండి. కిడ్నీని పూర్తిగా తొలగించేస్తారు. తీసేస్తే అయిపోతుంది. కానీ ఇందులో లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని మనం కొత్తగా ఏర్పాటు చెయ్యాలి. అలా చేసినది ఏ ఇబ్బందీ లేకుండా జీవితాంతం సంతృప్తికరంగా పని చెయ్యాలి. అందుకోసం సర్జరీలో కణజాలం ఎక్కడా దెబ్బతినకుండా అడుగడుగునా సున్నితంగా మరమ్మతు చెయ్యాల్సి ఉంటుంది. దీనికి చాలా నేర్పు, ఓర్పు కావాలి. ఇది హడావుడిగా చేసేసేది కాదు. సర్జరీ తర్వాత పురుషాగం సాధ్యమైనంత సహజంగా కనబడాలి, సహజంగా పని చేయాలి. అది ముఖ్యం.

* ఇది సున్నితమైన ఆపరేషన్‌ , మరి సర్జరీ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి?
హైపోస్పేడియాస్‌ విషయంలో మొట్టమొదట చేసే ఆపరేషన్‌ కీలకమైనది. దానిలోనే సమస్య సరి అయిపోవటం ఉత్తమం. మళ్లీ మళ్లీ సర్జరీలు చెయ్యాల్సి వచ్చిన కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సర్జరీ కోసం దీనిలో పూర్తిగా ప్రత్యేక నైపుణ్యం ఉన్న, నిపుణులనే ఎంచుకోవాలి. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది 'పిల్లలకు ఆపరేషన్లు చేయటమంటే ఏముంది, పెద్దవాళ్లకు చేసినట్టే.. కాస్త చిన్నపిల్లల మీద చేస్తారు.. అంతే కదా!' అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. మామూలు సర్జన్‌ ఎవరైనా చేసేసేది కాదిది. పిల్లల సర్జరీల్లో ప్రత్యేక నైపుణ్యం, తరచూ పిల్లల ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారే దీన్ని చెయ్యాలి. మొదటిసారే వాళ్లు చేస్తే.. తర్వాత్తర్వాత సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ!

* చిన్నపిల్లలకు, అదీ పురుషాంగం మీద చేసే సర్జరీ కదా.. తల్లిదండ్రుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. దీన్ని సరిదిద్దితే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియాస్‌.. సర్జరీతో పూర్తిగా చక్కదిద్దటానికి వీలైన సమస్యే. సర్జరీ చేయించుకున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక అందరిలా మామూలుగానే ఉంటారు. అందరిలా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలను కనొచ్చు. ఎలాంటి సమస్యలూ ఉండవు.

* సర్జరీ వల్ల ఒకవేళ సమస్యలు తలెత్తితే.. ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వచ్చు?
దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్నవాళ్లు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువనేగానీ.. అస్సలు ఉండవని చెప్పలేం! ముందే చెప్పుకొన్నట్టు ఇది క్లిష్టమైన సర్జరీ. ఎంత అనుభవం ఉన్నవాళ్లు చేసినా కొన్ని సమస్యలుండొచ్చు. ఆపరేషన్‌ తర్వాత తలెత్తే అవకాశం ఉన్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- మనం మరమ్మతు చేసిన ప్రాంతం సరిగా మానకపోతే మరోచోట రంధ్రం పడి, అక్కడి నుంచి మూత్రం బయటకు వస్తుండవచ్చు. మరో కీలకమైన సమస్య- మనం మరమ్మతు చేసిన చోట పుండు మానటంలో మందపాటి కణజాలం (స్కార్‌) ఏర్పడి.. మూత్రమార్గం అక్కడ మూసుకుపోయినట్లవ్వచ్చు (స్ట్రిక్చర్‌). ఇన్ఫెక్షన్లు వచ్చినా ఈ దుష్ప్రభావాలు తలెత్తచ్చు. అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్లయితే సాధ్యమైనంత వరకూ ఇలాంటివి తలెత్తకుండా చూడటం, ఒకవేళ వస్తే వీటిని సమర్థంగా ఎదుర్కొనటం వీలవుతుంది. పీడియాట్రిక్‌ యూరాలజిస్ట్‌గా మన లక్ష్యం- ఒకసారి ఆపరేషన్‌ చేసి, అది మానిపోయిన తర్వాత పిల్లవాడికి ఎటువంటి తేడా ఉండకూడదు. మళ్లీ మళ్లీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు.

* అవగాహనా లేమితో చిన్నతనంలో సర్జరీ చేయించకుండా వదిలేయటం వల్ల.. పెరిగి పెద్త్దె ఇబ్బందులు పడుతున్న వాళ్లు చాలామంది ఉంటున్నారు. దీన్ని ఏ వయసులో సరిచేయటం ఉత్తమం?
పెద్దయ్యాక ఆపరేషన్‌తో చక్కదిద్దటం కష్టం. ఇతరత్రా సమస్యలూ ఉంటాయి. కాబట్టి ఏడాదిలోపే ఆపరేషన్‌ చేయించటం ఉత్తమం. అయితే అంత చిన్నపిల్లల మీద సర్జరీ చేసే నైపుణ్యం గల పీడియాట్రిక్‌ సర్జన్లు, పిల్లల మత్తు డాక్టర్లు కూడా ఇందుకు అవసరం. చిన్నప్పుడే ఆపరేషన్‌ చేయటం వల్ల పిల్లలు యవ్వనంలో మానసిక క్షోభకు, నగుబాటుకు గురికాకుండా ఉంటారు.

* హైపోస్పేడియాస్‌ను చక్కదిద్దితే ఈ పిల్లలు పెద్త్దె పూర్తి సాధారణ లైంగిక జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియస్‌ అనేది మూత్ర మార్గం, ఇంకా చెప్పాలంటే.. మూత్రం బయటకు వచ్చే గొట్టానికి సంబంధించిన సమస్యేగానీ స్తంభన వంటి వాటికేం ఇబ్బంది ఉండదు. ఇదొక రకంగా మన ఇళ్లలో ఉండే నీళ్ల పైపులు సరిచేయటం (ప్లంబింగ్‌) లాంటిది! ఈ సమస్య ఉన్నా చాలామందిలో అంగ స్తంభన, వీర్య స్ఖలనం వంటివన్నీ మామూలుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం పురుషాంగం వంకర తిరగటం (కార్డీ) వంటి ఇబ్బందులుంటాయి. వాటినీ సరిచేస్తారు. ఆపరేషన్‌ సరిగా చేస్తే పురుషాంగం మీద మచ్చల్లాంటివీ ఉండవు.

* ఈ సమస్యను చిన్నతనంలో సరిచేయకుండా ఉండిపోయి.. దీనితోనే పెరిగి పెద్దయినవాళ్లు ఏం చేస్తే మంచిది?
హైపోస్పేడియాస్‌ రకాల్లో అన్నింటికన్నా ఎక్కువగా కనబడేది- మూత్ర రంధ్రం అంగం చివరిలో కాకుండా.. దాని కన్నా కొద్దిగా కింద ఉండే రకం. నిజానికి విసర్జన సమయంలో మూత్రం కిందికి పడుతుండటం తప్పించి.. దీంతో మరీ అంత పెద్ద సమస్యేం ఉండదు. ఆపరేషన్‌ చేయకపోయినా వీళ్లు మామూలుగానే ఉంటారు. పెద్దయ్యాక శృంగారపరంగానూ ఇబ్బందులేమీ ఉండవు. వీర్యం మామూలుగానే బయటకు వస్తుండటం వల్ల పిల్లలను కనటంలోనూ సమస్యలు ఉండవు. అయితే ఈ రంధ్రం ఇంకా కింద.. అంటే పురుషాంగం మధ్యలోగానీ.. వృషణాల వద్దగానీ అంతకన్నా కిందికి గానీ ఉంటే సమస్యలు ఎక్కువ. ఇతరత్రా సమస్యలతో పాటు వీరికి వీర్యం స్ఖలించినప్పుడు అది చేరాల్సిన చోటికి చేరదు కాబట్టి వీరికి సంతానావకాశాలూ కష్టం. కాబట్టి వీటికి ఆపరేషన్‌ తప్పనిసరి. వీరికి ఆపరేషన్‌ సరిగా చేయకపోతే మళ్లీమళ్లీ ఆపరేషన్లు చెయ్యాల్సి కూడా రావొచ్చు. కాబట్టి పెద్దవయసులో ఆపరేషన్‌ చేయించుకోవాలనుకున్నా.. వీళ్లు చిన్నపిల్లల మూత్ర సంబంధ వ్యాధులపై అవగాహన కలిగిన పీడియాట్రిక్‌ సర్జన్‌ను గానీ నిపుణులైన యూరాలజిస్టును గానీ సంప్రదించాలి. ఎందుకంటే ఇది పెద్దవయసు వరకూ అలాగే ఉండిపోయిన చిన్నపిల్లల సమస్య! కాబట్టి దీనిలో నైపుణ్యం ఉన్నవారినే ఎంచుకోవటం మంచిది.

--- డా.ఎ.నరెంద్రకుమార్ -నెలోఫర్ హాస్పిటల్ , హైదరాబాద్ : డా|| రమా జయంతి (అమెరికా), డా|| వేనాడ్‌ బెస్లే (న్యూజిలాండ్‌), డా|| టామ్‌ డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌), డా|| డేవిడ్‌ హ్యాచ్‌ (అమెరికా) (ఈనాడు దినపత్రిక సౌజన్యముతో ).
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/