Sunday, March 25, 2012

Acupuncture health system,ఆక్యుపంచర్ వైద్య విధానం .


  • image : courtesy with Wikipedia.Org.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -,ఆక్యుపంచర్ వైద్య విధానం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • చైనా సంప్రదాయ వైద్య విధానాలలో, ఆక్యుపంచర్‌ వైద్య విధానము ఒకటి . దీనిని భారతీయ ప్రాచీన వైద్య విధానం అని కూడా అంటారు . . చిన్న చిన్న వైద్యవిధానాలను అనుసరించి మనం ఆరోగ్యంగా ఉండవచ్హు. అందులో ఒక వైద్య విధానమే...ఆక్యుపంచర్.

మహాభారత యుద్ధకాలంలో భీష్ముడు అంపశయ్యపై ఊపిరిపోసుకున్న నేపథ్యంలో ఆక్యుపంచర్‌ వైద్యం ప్రాచుర్యం పొందిందనేది వైద్యుల మాట. అతి తక్కువఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఈ వైద్యం ద్వారా నయం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని వారికి ఆక్యుపంచర్‌ థెరపీ సంజీవని లాంటిది. అంతేకాదు లక్షలు వెచ్చించి వైద్యకోర్సులను అభ్యసించలేని వారికి ఆక్యుపంచర్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండి) వంటి పిజి కోర్సులను అభ్యసించిన పలువురు ఈ రంగంలో రాణిస్తున్నారు. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల వ్యాధులనుండి విముక్తి పొందవచ్చు. సామాన్యులకు అందుబాటులో లేని ఈ వైద్యాన్ని ప్రస్తుతం అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడ నగరంలో పవిత్ర అకాడమి వారు కళాశాలను ఏర్పాటు చేసారు. మొగల్రాజపురంలో పవిత్ర అకాడమి మెడికల్‌ ఆక్యుపంక్చర్‌ కళాశాలను నెలకొల్పారు.

  • ఆక్యుపంచర్-ప్రసూతి వైద్యం :
కొన్ని వేల సంవత్సరాలుగా బాధా నివారణకోసం, వ్యసనాల నుంచి విముక్తి చేయడంకోసం, వాంతుల నివారణకోసం, ఇంకా ఇతర వ్యాధుల చికిత్స కోసం సూదిపొడుపు వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రసూతి వైద్యంలో, ముఖ్యంగా నొప్పులను నియంత్రించడంలో దీని ఉపయోగం గురించి చెప్పుకోదగిన అద్యయనాలేవీ అందుబాటులో లేవు. ఎంత సమర్థంగా పనిచేస్తుందో రుజువు చేసే ఆధారాలు లేవు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతున్నది. శస్త్ర చికిత్స, నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఆ అసమతౌల్యం బాధను, ఇబ్బందిని కలిగిస్తుంది. శస్త్ర చికిత్స లేక నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులను పొడవడం ద్వారా శక్తిని సరైన మార్గంలోకి మళ్లేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంచనా ప్రకారం, ఆక్యుపంచర్ ఈ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. లేక శరీరంలో సహజంగానే బాధానివారణ రసాయనాలను ఉత్త్పత్తి చేస్తుంది.

  • టెక్నిక్:

ఈ చికిత్సా విధానంలో నిపుణుడైన ఆక్యుపంచర్ వైద్యుడు పేషంటు దేహంలోని కీలకమైన శక్తి బిందువుల వద్ద చర్మం కింది భాగంలో శుద్దిచేసిన మంచి సూదులను గుచ్చుతారు. ఒక్కో బిందువు వద్ద ఒక్కో వ్యవధిలో సూదులను శరీరంలో ఉంచుతారు. కొన్నిసార్లు సూదుల ద్వారా తక్కువ తీవ్రతతో విద్యుత్ ప్రవాహాన్నీ పంపించి, బాధ తీవ్రతను నియంత్రించడానికి కృషి చేస్తారు. ప్రసూతికి చాలా వారాల ముందు నుంచే వారానికి గంట చొప్పున ఆక్యుపంచర్ చేయవచ్చు.

  • పరిమితులు:

* ఆక్యుపంచర్ వైద్యుడు మాత్రమే సూదులను ప్రయోగించవలసి ఉంటుంది.
* సూదులు గుచ్చిన చోట అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.
* నొప్పుల సమయంలో సూదులు గుచ్చితే,తల్లి అటూ ఇటూ కదలడం కష్టమవుతుంది.
* ఆక్యుపంచర్ వల్ల బాధ తగ్గడం కంటే, కడుపులో వికారం కలిగి తొందరగా ప్రసవం జరగడానికి వీలు కలిగే అవకాశం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
* ఆక్యుపంచర్ బాధా నివారణ ఔషధాల వినియోగం, స్థానికంగా మత్తు ఇవ్వడం(రీజినల్ అనస్తీసియా) వంటి వాటిని తగ్గించిన దాఖలాలు తక్కువ.

ఆక్యుపంచర్ వల్ల శరీరంలో సహజ బాధానివారణ రసాయనాలేవి(ఎండోమార్ఫిన్స్) జనించడంలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక ప్రసూతికి ముందు వారాల తరబడి
ఆక్యుపంచర్ చికిత్స తీసుకున్నవారిలో తొలిదశ నొప్పుల్ వ్యవధి తగ్గిపోయిందని కూడా ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను కచ్చితమైనవిగా పరిగణించడానికి లేదు. ఈ అంశంపై సందేహాలను తొలగించడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది. ఇటీవల స్వీడన్ లో ఒక అధ్యయనం జరిగింది. స్వీడిష్ ప్రసూతి వైద్యులు గర్భిణులపై నాలుగురోజులపాటు ఆక్యుపంచర్ ఉపయోగించి చూశారు. ఆక్యుపంచర్ తీసుకున్న మహిళలల్లో ఎప్పటిలాగే సగం మంది ఎపిడ్యురల్ అనస్తీసియాను కోరుకున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. బాధా నివారణకోసం నాడీ స్పందనలను పెంచే చికిత్సలనో, వేడి బియ్యం సంచిని ఉపయోగించే విధానాన్నో వారు కోరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలినట్టు బ్రిటిష్ జోర్నల్ ఆఫ్ అబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ తాజా సంచిక పేర్కొంది.

  • ---/భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.