Saturday, March 31, 2012

ఉష్ణమాపి ,Thermometer

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఉష్ణమాపి ,Thermometer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  • ఉష్ణమాపి ,Thermometer

జ్వరము కొలిచే సాధనము ధర్మామీటరు .ఉష్ణమాపి (Thermometer) , సాధారణంగా ఇందులో పాదరసము ను ఉపయోగిస్తారు. పాదరసం సంకోచ వ్యాకోచాలను ఆధారంగా చేసుకొని ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. ఈ పరికరమును ముఖ్యముగా రెండు భాగములుగా విభజించవచ్చును, ఒకటి ఉష్ణోగ్రత Sensor (స్పర్శేంద్రియము) (పాదరస ఉష్ణమాపిలో ఉండే బల్బు), రెండవది కొలబద్ద. ఉష్ణోగ్రతను మనము సాధారణము గా entigrade(C) లోగాని Foren(F) లో గాని కొలుస్తాము. ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి.

"జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేద"న్నారు మన పెద్దవాళ్ళు....అప్పట్లో అంటే, సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓసారి అలా వచ్చి పలకరించి ఇలా వెళ్ళిపోయేవి జ్వరాలు...రోజూ కాయకష్టం చేసే వాళ్ళకి, అలా రెండ్రోజులు మంచం మీద పడుకుని, వేళకింత తింటూ(రోజూలా అదరాబాదరాగా కాకుండా) ఉంటే ప్రాణానికి కాసింత సుఖంగానే అనిపించేదేమో! కాని మన రోజులకి అది అంత సరిపడదేమో! ఒక్కరోజు ఆఫీసుకి వెళ్ళకపోయినా జీతంలో కోత! productivity తగ్గిపోతుందిగా మరి! పైగా నెలకోసారి వచ్చే జ్వరాలతో ఎలా?.......మరి ఇలాంటి జ్వరాలకి జరుగుబాటు ఎలా ఉంటే, మనసుకి,శరీరానికి కాస్త హాయిగా ఉంటుందో


అసలు ఈ జ్వరం అంటే ఏంటి? ఎందుకు వస్తుందో ముందు టూకీగా తెలుసుకుందాం........మన శరీరం యొక్క ఉష్ణోగ్రత (core body temperature) మామూలుగా రోజువారీ ఉండేతేడాలకన్నా(diurnal variations అంటే మన శరీర ఉష్ణోగ్రత ఉదయం పూట,రాత్రి పూట వేరువేరుగా ఉంటుంది) పెరిగితే దాన్ని జ్వరం అనొచ్చు....... అంటే శరీర సాధారణ ఉష్ణోగ్రత 37'c or 98.4'F అనుకుంటే, ఒక డిగ్రీ ఎక్కువ వరకూ నార్మల్ గా తీసుకోవచ్చు.(100'F వరకూ).........ఈ జ్వరం అనేది ప్రత్యేకమైన వ్యాధి కాదు...అంతర్గతంగా ఉన్న ఒక వ్యాధి యొక్క బాహ్య లక్షణం(DISEASE SYMPTOM) మాత్రమే.కాబట్టి జ్వరానికి కారణాలు ఏదైనా కావచ్చు.మామూలు వైరల్ ఫీవర్స్ దగ్గరనుంచి విషజ్వరాలు,క్యాన్సర్లు కూడా కావచ్చు...ఒక్కొక వ్యాధికి జ్వరలక్షణం ఒక్కోరకంగా ఉంటుంది.....అంటే, fever periodicity,high or low grade, associated with chills and rigors, other associated symptoms ఇలాంటివి అన్నమాట.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు సాధారణంగా ఒక అపోహ పడుతుంటారు..."జ్వరం బైటకి కనపడట్లేదు, ’లో జ్వరం’ ఉంది" అని....అలాంటిది ఏమీ ఉండదు..జ్వరం అంటే బయటికి కనిపించేది మాత్రమే....ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది "లోజ్వరం" ఉంది అని టాబ్లెట్లు మింగేస్తుంటారు..దాని వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది......

ఇక ఫీవర్ ఎంత ఉందో, కరెక్ట్ గా ఎలా చూడాలో చూద్దాం......ఈ రోజుల్లో రకరకాల థర్మామీటర్స్ దొరుకుతున్నాయి....డిజిటల్, ఊరక చేత్తో పట్టుకుని చూసేవి ఇలా......కాని అన్నిటికన్నా బెస్ట్ ఒన్, మన పాత గ్లాస్ థర్మామీటర్(దీన్నే CLINICAL THERMOMETER అంటారు).......body temperature is best measured when it is done per rectally.కాని అలా చెయ్యటం ప్రాక్టికల్ గా కుదరదు కాబట్టి, నాలుక కింద పెట్టి చూడటం(ఒక నిమిషం పాటు) ఉత్తమం....(చేతికింద అంటే చంకలో పెట్టి చూసిన రీడింగుకి ఎప్పుడూ ఒక డిగ్రీ ఎక్కవ కలపాలి.)......చూసే ముందు,తర్వాత థర్మామీటర్ ని శుభ్రంగా తుడవాలి....మరీ చల్లటి నీళ్ళని కాని, మరీ వేడి నీళ్ళని కాని ఉపయోగించవద్దు...దీనివల్ల తప్పు రీడింగు రావటమే కాకుండా, థర్మామీటర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది....చూసేప్పుడు థర్మామీటర్ టిప్ ని పట్టుకోవద్దు..దీనివల్ల చూసినవాళ్ళ బాడీ టెంపరేచర్ ట్రాన్స్మిట్ అయ్యి రీడింగు తప్పు వచ్చే అవకాశం ఉంది.

ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి

మౌత్ ధర్మామీటరు : ఒక చివర్ పాదరము బల్బ్ ఉంటుంది . ఈ బల్బ్ ను నోటిలో నాలుక కిందను పెట్టి ఉష్ణోగ్రతను కొలుస్తారు . చిన్నపిల్ల విషయము లో దీనిని వాడరు . కొరికే ప్రమాదము ఉన్నందున .

రెక్టల్ ధర్మామీటరు : పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకు ఈ ధర్మామీటరు ఉత్తమమైనది . పిల్లలను బోర్లా పడుకోపెట్టి థర్మామీటరు చివరిభాగములో పెట్రోలియం జెల్లీ రాసి అసనము లోకి అంగుళము మేర చొప్పించి ఉష్ణోగ్రత చూసే సమ్యము పూర్తయ్యే వరకు కాళ్ళు ఒక చేతితోపైకి పట్టుకోని , మరోచేతితో థర్మామీటరునూ పడిపోకుండా పట్టుకొని జ్వరము కొలుస్తారు .

చెవి థర్మామీటరు : ఈ రకమైన థర్మామీటరును అన్ని వయసులవారికి వాడవచ్చును . రెండు నిముషాలపాటు చెవిలో ఉంచి జ్వరము కొలుస్తారు . ఇది కూడా ఖచ్చితమైన ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది .

నోటిద్వారా చూసే డిజిటల్ థర్మామీటరు .: ఐదేళ్ళు .. ఆపైబడ్డవారికి దీనిని ఉపయోగిస్తారు . ఇది బేటరీ పై పనిచేస్తుంది . బేటరీ శక్తి తగ్గితే ఇది తప్పు రీడింగు చూపే ఆస్కారము ఉంది .

స్ట్రిప్ థర్మామీటరు : ముఖము ఫాలభాగము పైన ఈ థర్మామీటరు ఉంచి ఉష్ణోగ్రతను కొలుస్తారు . నోటిలో పెట్టడానికి వీలు పడనపుడు దీనిని వాడుతారు . ఇది ఖచ్చితమైన రీడింగ్ ఇవ్వక పోవచ్చును.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.