Tuesday, April 24, 2012

దద్దుర్లు,బెందులు,Urticaria

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దద్దుర్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 దద్దుర్లు వ్యాధి చర్మ వ్యాధుల్లో ఒక రకమైన తరుణ వ్యాధి. దీనిలో అకస్మాత్తుగా, తెల్లగా, గులాబిరంగులో చిన్న చక్రాల వలె చర్మంపై వస్తాయి. ఇవి కొన్ని నిముషాలు, లేదా గంటలు లేదా కొన్నిరోజుల వరకూ ఉండవచ్చును. ఇవి వస్తూ, తగ్గుతూ ఉంటాయి. దురద, మంట ఉంటుంది. పలు సైజులలో కనబడుతుంటాయి.

ఎక్కువగా అలా పదేపదే వస్తూ పోతున్నప్పుడు వాటిని తీవ్రంగానే పరిగణించాలి. ఒక్కోసారి ఈ దద్దుర్లు లేదా బెందులు సొరియాసిస్‌కు దారి తీయవచ్చు. తొలిదశలోనే సమస్యను గుర్తించి చికిత్సలు తీసుకుంటే సొరియాసిస్ రాకుండా ముందే అరికట్టవచ్చు. నిజానికి దద్దుర్లు వల్ల సొరియాసిస్ రాదు. దద్దుర్లులతో చర్మం వ్యాధినిరోధక శక్తి కోల్పోయిన కారణంగా సొరియాసిస్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి శరీరంలో ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా యాంటీ-హిస్టామిన్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ యాంటీ-హిస్టామిన్‌లు మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ తరహా చర్మ సమస్యలు మొదలవుతాయి.

వ్యాధి కారణాలు
జీర్ణకోశ సంబంధ వ్యాధులతో వస్తాయి. కొన్ని రకాల ఆహారపదార్థాలు పడక, ఎలర్జీ కారణంగా వస్తాయి. కొంత నర్సస్‌గా ఉన్న వారిలో ఎక్కు వగా కనబడుతాయి. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు కూడా రావచ్చును.
లక్షణాలు
జీర్ణకోశ సంబంధమైన లక్షణాలతో, నీరసంగా, వికారంగా ఉంటుంది. వాంతులు అవవచ్చును. మలబద్ధకం లేదా విరేచనాలు కావచ్చును. చర్మంపై వివిధ సైజుల్లో దద్దుర్లు, దురదలు వస్తాయి. కొన్ని నిముషాలునుండి కొన్ని గంటల వరకూ కనపడి పూర్తిగా మాయ మవుతాయి. మళ్లీ ఇంకొకచోట మళ్లీ కొత్తగా వస్తాయి.  రుద్దినప్పుడు ఎక్కువవుతాయి. చిన్న పిల్లలలో వచ్చే దద్దుర్లను హైవ్స్‌ అని అంటారు. సాధారణంగా ఈ దద్దుర్లు పూర్తిగా నయమ వుతాయి. కాని కొన్నిసార్లు చాలా పసితనంలోనే కనిపిస్తాయి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడు తున్న పిల్లల్లోనూ ప్రమాదకరంగా మారవచ్చు.

చికిత్స :
ఇలాంటి స్థితిలో 'అవిల్' మాత్రలు గానీ,' సెట్రజిన్' మాత్రలు గానీ వేసుకుంటే తాత్కాలికంగా తగ్గుముఖం పడతాయి. ఆ తరువాత ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వస్తూనే ఉంటాయి.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.