Friday, May 18, 2012

Listen to what our body tell,శరీరము చెప్పేది వినాలి




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శరీరము చెప్పేది వినాలి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అందరూ ఆరోగ్యముగా ఉండాలనే కోరుకుంటారు . మన శరీరము ఓ పెద్ద కర్మాగారము . దానిలో అనారోగ్యకరమైన ఏ చిన్న మార్పునైనా కొన్ని సాంకేతికాల ద్వారా మనకు తెలియజేస్తుంది. వాటిని మనము అశ్రద్ధ చేయకూడదు . తరచూ తలనొప్పి వస్తూవుంటే నిద్రలేకపోవడం వల్ల అలా జరిగి వుండవచ్చునని భావిస్తారు . అలాగే ఎక్కువసార్లు నడుము నొప్పి వస్తూవుంటే జిమ్‌లో అధిక సమయము వ్యాయామము చేయడమే కారణమని భావిస్తారు . పెదవులు చిట్లుతూవుంటే చలువల్లో లేదా మరో కారణమనుకుంటారు . ఈ సమస్యలన్నీ చలా తరచుగా వస్తూవుంటే , శరీఏము లో మరేదో తీవ్రమైన సమస్య వుందని భావించవలసి వుంటుంది . సాధారణముగా కనిపించే లక్షణాలు అలా ఎందుకు వచ్చివుండవచ్చునన్న కారణాలను తెలుసుకుందాం .

  • విడవని తలనొప్పి :
అప్పుడప్పుడు తలనొప్పిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ వుంటారు . నిద్రలేమి , ఆకలి , మానసిక ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు . ఈ తరహా లాంటి వాటిని సాదారణమైన తలనొప్పిగా భావించవచ్చును. ఏ ధైనా నొప్పి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది .. కాని కొన్ని సమయాల్లో కొంతమందిలో భయంకరమైన వ్యాధులు ... మెదదులో ట్యూమర్లు , మైగ్రైన్‌ , మెదడు వాపు జబ్బులు అయివుండవచ్చు . అన్నివేళలా అశ్రద్ద చేయకుండా మంచి డాక్టర్ ని సంప్రదించాలి .

  • పెదవులు చిట్లడము :
సాధారణము గా పెదవులు చిట్లినట్లు గా తయారయితే మనకు మనమే తేలికగా చికిత్స చేసుకోవచ్చు . పెదవులు పగిలినప్పుడు మెడికల్ షాపు ల్లో లభించే లిప్ బామ్‌ వంటివి రాసి ఊరుకుంటాం . ఇదే సమస్య మల్లీ మల్లీ వస్తూఉంటే అలోచించాలి . విటమిన్లు బి, సి,డి, లు తగ్గినపుడు , ఎర్రరక్తకణాలు లోపించినపుడు , చర్మ ఎలర్జీ వలన పెదవులపై పొట్టు లేచిపోవడము జరిగితే కారణాలు తెలుసుకొని చితిత్సచేసుకోవాలి .

  • వీపు నొప్పి :
ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం , శక్తికి మించిన బరువులు ఎత్తడం , సక్రమముగా కుర్చోకపోవడము లాంటివాటివల్ల వీపునొప్పి రావచ్చు . కారణాన్ని సరిచేసుకుంటే తగ్గిపోతుంది . ఏదైనా పెయిన్‌ బామ్‌ వాడినా తగ్గిపోతుంది. . . కాని తరచుగా వస్తూ భరించరానిదిగా ఉంటే వెన్నుపాము చుట్టూ ఉండే డిస్క్ వాపు లేదా ముందుకు రావడము జరుగవచ్చు లేదా మెదడుకు , వెన్నుకు మధ్యబాగములో ఇంఫెక్షన్‌ రావడడము వల్ల అయివుండవచ్చును. ఇది చాలా సీయస్ వ్యాది . తగిన వైద్యనిపుణులతో చికిత్స చేయించుకోవాలి.

  • మితిమీరిన చెమట :
శరీర ఉష్ణోగ్రత సమతుల్యము గా ఉంచడానికి చెమటపోయడం సర్వసాధారణము . అయితే కోపము , భయము , నిస్సత్తువ , తీవ్ర ఆందోలన లాంటి భావోద్వేగమైన ఒత్తిడికి లోనయినప్పుడు శరీరము వేడెక్కుతుంది. అప్పుడు చెమట పోస్తుంది . దీనివలన ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉంది . ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్నపాటి విషయానికీ అందోళన చెందిన వారు సైకియాట్రిక్ డాక్టర్ని సంప్రదించాలి .

  • చర్మముపై కమిలిన గాయాలు :
చర్మము పై చిన్న చిన్న గాయాలు , గీచుకుపోవడము జరిగినపుడు ఎర్రగా లేదా గోధుమ రంగులో చర్మము కమిలి పోవడము సాధారణమే అయినా ... ఎలర్జీ వలన మాటిమాటికి ఇలా చర్మము పైన కమిలినట్లు , దురద పుట్టె మచ్చలు కనిపిస్తే మంచిది కాదు . కొన్ని ఎలర్జీ వ్యాధులకు సాంకేతికము అవవచ్చు. ముందుగానే వైద్యుని సంప్రదించి చితిత్స చేయించుకుంటే చాలా మంచిది.

  • కడుపులో తేడా:
Hurry , worry , curry .. మూలానా నేటి బిజీ జీవితంలో కడుపులో ఎన్నో తేడాలు , నొప్పి, అజీర్ణ బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంటాసిడ్స్ , జీర్ణం టానిక్ లూ వాడితె సరిపోతుంది . జీవన విధానము మార్పుచేసుకుంటూ బాధలు లేని జీవనాన్ని గడపాలి. కాని కొన్ని సమయాల్లో పేగుల్లో అల్సర్లు , క్యాన్సర్ లు ఇదే రకమైన లక్షణాలు తో కనిపిస్తాయి. బాగా ముదిరిపోతే వైద్యానికి కూడా అందవు . కావున చినపాటి కడుపులో తేడాలకు వైద్యుని సంప్రదించి మంచి సలహా తీసుకోవాలి .


  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.