Thursday, September 27, 2012

Head Reeling - తలతిరగడం

  •  
 ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Head Reeling - తలతిరగడం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తలతిరగడం అనేది ఒక అనుభూతి . ఇందులో ఒకటి మీరు కదులుతు మీ చుట్టు ఉన్న వస్తువులు కదులుతున్నట్లు తిరగడము , రెండోది .. మీరు కదలక పోయినా చుట్టూ ఉన్నది కదులుతున్నట్లు మీ చుట్టూ తిరగడం అనే స్థితి. దీనివలన తూలి పడిపోవడము , స్పృహతప్పిపోవడము జరుగుతుంది. తలతిరగడము ఒక్కోసారి ప్రాణాంతకమూ కావవచ్చును. ఈ లక్షణము మానసికమైనదైనా కావచ్చు లేదా శారీరక వ్యాధి లక్షణమైనా కావచ్చు. దీనికి శరీరములో ముఖ్యముగా మూడు మండలాలు (systems) ప్రభావితమవుతాయి. 1) చెవి ,దానిసంబంధిత నాడీమండలము, 2)కన్ను మరియు దాని సంబంధిత నాడీమండలము .3) భాహ్య స్పర్శ నాడీమండలము -peripheral nervous system .

  • కారణాలు :

  • ఎక్కువ ఎండతీవ్రతకు గురి అయినప్పుడు - sun stroke/extreme exposur to Sun.
  • పనివత్తిడి వలన బాగా అలసిపోయినపుడు -a sign of fatigue and general weakness.
  • రక్తహీనత -Severe Anaemia
  • మానసికం గా స్థిరత్వం లేకపోవుడము- Anxiety/ nervousness
  • రక్తములో గ్లూకోస్ తక్కువ అయినప్పుడు - Hypoglycemia or low blood glucose levels
  • రక్తపోటు మరీఎక్కువ , మరీతక్కువ అయినపుడు -High or low BP
  • మెడ వెన్నుపూసలు నొక్కబడినపుడు -Cevical sondylosis or other causes compressing an artery in your neck.
  • కొన్ని చెవిలోపల కారణాలు - Causes inside your ear like vertigo, menieres disease etc.
  • కొన్ని మెదడు మరియు కపాలము లోపల జబ్బుల కారణములు-Causes inside ur skull/brain like Aneurysma, brain tumours. , migrine etc.
చికిత్స :
కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.

సాదారణము గా తలతిరగడం అదుపుచేయడానికి .
 tab.vertizac 1 tab 2 times /day ,
tab . Stemtil 5mg 1 tab 2-3 times / day,
tab . Diziron  1 tab 3 times / day. ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో వాడాలి
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.