Tuesday, February 26, 2013

Erectile dysfunction with gingivitis,చిగుళ్లవాపుతో స్తంభనలోపం

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Erectile dysfunction with gingivitis,చిగుళ్లవాపుతో స్తంభనలోపం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చిగుళ్లవాపు సమస్యను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. పెద్దగా దానిపై దృష్టిపెట్టరు. అయితే ఇలాంటి ధోరణి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 30ల్లో ఉన్నవారు ఏమాత్రం ఉపేక్షించటం తగదని సూచిస్తున్నారు. ఎందుకంటే చిగుళ్లవాపుతో అంగస్తంభనలోపం వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్ట తాజాగా బయటపడింది మరి. స్తంభనలోపంతో బాధపడుతున్న 30-40 ఏళ్ల వయసుగలవారిపై టర్కీ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. స్తంభనలోపం లేని అదే వయసు వ్యక్తులతో వారిని పోల్చిచూశారు. స్తంభనలోపంతో బాధపడుతున్నవారిలో 53% మంది చిగుళ్లవాపు సమస్యతో బాధపడుతుండగా.. స్తంభనలోపం లేనివారిలో 23% మందిలోనే చిగుళ్లవాపు కనబడింది. ఈ ఫలితాలను మరింత సహేతుకంగా పరిశీలించారు. గార మందం, రక్తస్రావం అవుతున్న తీరు, చిగురుకూ పంటికీ మధ్య దూరం, దంతాన్ని పట్టిఉంచే ఎముక లోపలికి క్షీణిస్తుండటం వంటి వాటి ఆధారంగా చిగుళ్లవాపు జబ్బు తీవ్రతను గణించారు. ఈ సమస్య చాలా తీవ్రంగా గలవారిలో స్తంభన సమస్యలు 3.29 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలటం గమనార్హం. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే చిగుళ్లవాపు మూలంగా దంతాలు, చిగుళ్లతో పాటు పంటిచుట్టూ ఉండే ఎముక కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా దీంతో బాధపడేవారిలో గుండె జబ్బుల వంటి వివిధ రక్తనాళ సమస్యలూ తలెత్తుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి స్తంభన సమస్యలతోనూ సంబంధం ఉంటోందని అధ్యయన నేత ఫెయిత్‌ ఓగజ్‌ అంటన్నారు. కాబట్టి చిగుళ్లవాపు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Treatment for gingivitis -> 1Gingivitis-3
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.