Saturday, February 9, 2013

Gene Treatment for Diabetes,మధుమేహానికి జన్యుచికిత్స

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gene Treatment for Diabetes,మధుమేహానికి జన్యుచికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 మధుమేహానికి జన్యుచికిత్స-కుక్కల్లో జబ్బు పూర్తిగా నయం-స్పెయిన్‌ పరిశోధకుల ఘనత

వాషింగ్టన్‌: మధుమేహంపై స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇక్కడి పరిశోధకులు జన్యుచికిత్స ద్వారా కుక్కల్లో పుట్టుకతోవచ్చే (టైప్‌1) మధుమేహాన్ని విజయవంతంగా నయం చేయగలగటం విశేషం. ఇది మనుషుల్లోనూ మధుమేహాన్ని నయం చేసే చికిత్సకు మార్గం వేయగలదని భావిస్తున్నారు. పెద్ద జంతువుల్లో మధుమేహాన్ని నయం చేయటం సాధ్యమేనని తేలటం ఇదే తొలిసారి. బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఫాతిమా బోష్‌ నేతృత్వంలో సాగిన ఈ అధ్యయనంలో కుక్కల కండరంలోకి 'గ్లూకోజు గ్రాహకం'ను ప్రవేశపెట్టటం కీలకమైన విషయం. ఈ జన్యుచికిత్సతో కుక్కలు మధుమేహం నుంచి పూర్తిగా కోలుకోవటమే కాదు.. నాలుగేళ్ల తర్వాత కూడా జబ్బు లక్షణాలు తిరిగి కనిపించకపోవటం గమనార్హం. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్కసారితో ముగిసిపోయే ఈ చికిత్సలో సాధారణ సూదులతో కుక్కల వెనక కాళ్లకు వివిధ రకాల ఇంజెక్షన్లను ఇచ్చారు. ఇన్సులిన్‌ జన్యువుతో పాటు రక్తంలోంచి గ్లూకోజును గ్రహించే ప్రక్రియను నియత్రించే గ్లూకోకైనేజ్‌ ఎంజైమ్‌ వ్యక్తం కావటానికి ఈ ఇంజెక్షన్ల ద్వారా కుక్కల్లోకి జన్యు వాహకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండూ కలసి 'గ్లూకోజు గ్రాహకం'గా పనిచేసి, రక్తంలో గ్లూకోజు మోతాదూ తగ్గటానికి తోడ్పడ్డాయి.

Courtesy with Eenadu Daily News-09/Feb/2013
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.