Tuesday, February 26, 2013

pulses are good for Diabetes,మధుమేహులకు పప్పుల ఆసరా

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- pulses are good for Diabetes,మధుమేహులకు పప్పుల ఆసరా-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధుమేహులు రక్తంలో గ్లూకోజు స్థాయులను నెమ్మదిగా పెంచే (లో గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌) ఆహారాన్ని తీసుకోవటం మంచిదన్నది తెలిసిన విషయమే. ఇలాంటి ఆహారంలో పప్పులు, బఠాణీల వంటివి కూడా పెద్దమొత్తంలో ఉండేలా చూసుకుంటే మరీ మేలని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో హెచ్‌బీఏ1సీ మోతాదులతో పాటు రక్తపోటు కూడా తగ్గుతున్నట్టు బయటపడింది. పప్పుల్లో గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. పైగా వీటిల్లో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహులపై పప్పులు ఎక్కువమొత్తంలో గల ఆహారం ప్రభావం గురించి ఇప్పటివరకు పెద్దగా అధ్యయనాలు జరగలేదు. అందుకే ఇటీవల టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ఒక అధ్యయనం చేశారు. టైప్‌2 మధుమేహం గల కొందరికి పప్పులతో కూడిన ఆహారం, మరికొందరికి ముడి గోధుమలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ రెండు రకాల ఆహారాలూ పీచు అధికంగా గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండేవే. మూడు నెలల అనంతరం పప్పులతో కూడిన ఆహారం తీసుకున్నవారిలో హెచ్‌బీఏ1సీ స్థాయులు 0.5% వరకు.. గోధుమల ఆహారం తీసుకున్నవారిలో 0.3% వరకు తగ్గినట్టు గుర్తించారు. పప్పుల ఆహారం తీసుకున్నవారిలో రక్తపోటు, గుండెవేగం, గుండెజబ్బు ముప్పూ తగ్గినట్టు తేలటం గమనార్హం.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.