Thursday, May 30, 2013

Hypothyroidism - హైపోథైరాయిడిజం

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hypothyroidism - హైపోథైరాయిడిజం:- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం

బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును. టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .
రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.
థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుంది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

  • Tab . Thyroxin (Elroxin, Thyrobest, Thyronil) 25 mcg to 100 mcg daily .
  •  
  • రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
  • సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

Diet treatment for Hypothyroidism, హైపోథైరాయిడిజం కు ఆహార చికిత్స

ఆహార మార్పులు చేయడం హైపో థైరాయిడిజం చికిత్సలో మొదటి భాగం. చక్కెర మరియు కెఫిన్ వంటి  పోషక రకాలను తీసుకోవటం వలన చాలా మంది హైపో థైరాయిడిజం ఫలితాలు, అలసట మరియు బ్రెయిన్ ఫాగ్ వంటి వాటితో బాధపడుతున్నారు.

 మీ శరీరంలో చక్కర శాతం పెంచే పిండి వంటి కార్బోహైడ్రేట్లు, కెఫిన్ మరియు చక్కెరలను పూర్తిగా తగ్గించాలి. మీ దృష్టి ధాన్యం ఆధారిత కార్బోహైడ్రేట్లను తక్కువ తీసుకోవటం, స్టార్చ్ లేని కూరగాయలను తినడం వంటి వాటి మీద నిలపండి.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ అన్ని కణజాలాలకు థైరాయిడ్ హార్మోన్ రవాణా చేయటానికి మరియు థైరాయిడ్ పనితీరును సాధారణీకరణ చేయటంలో సహాయపడుతుంది.

ప్రోటీన్లు, గింజలు మరియు నట్ బట్టర్స్, హార్మోన్ మరియు యాంటీబయాటిక్ లేని జంతు ఉత్పత్తులు (సేంద్రీయ, గడ్డి ఆధారిత మాంసాలు, గుడ్లు, మరియు సాగు చేప); మరియు
చిక్కుళ్ళు వంటి వాటిలో ఉన్నాయి.

కొవ్వు మీ స్నేహితుడు మరియు కొలెస్ట్రాల్, శాఖాహార కొవ్వులు  మీరు చాలినంత  కలిగి ఉండనట్లయితే, మీకు థైరాయిడ్ హార్మోన్లు కలిగి ఉన్న హార్మోన్ల అసమతుల్యత  పెరగవొచ్చు.
నెయ్యి , అవకాడొలు; అవిసె గింజలు, నట్ బట్టర్స్; హార్మోన్ మరియు యాంటీబయాటిక్-లేని పూర్తి కొవ్వు జున్ను, పెరుగు, కాటేజ్ చీజ్ మరియు కొబ్బరి పాల ఉత్పత్తులు, ఫ్లాక్స్ గింజలు వంటి వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

పోషకాలను ఎక్కువ తీసుకోండి. విటమిన్ D, ఇనుము, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, జింక్, రాగి, విటమిన్ A, B విటమిన్లు, మరియు అయోడిన్: పోషక లోపాలు,
తగినంతగా లేని సూక్ష్మపోషకాలు మరియు ఖనిజాలు 'థైరాయిడ్' కు కారణం కాకపోవచ్చు  కాని ఈ లక్షణాలను ఎక్కువ చేస్తాయి.

సాధారణంగా తగినంత అయోడిన్ లేని కారణంగా హైపో థైరాయిడిజం వొస్తుందని నమ్మకం. అయోడిన్ ముఖ్యంగా సముద్ర కూరగాయలు మరియు సీఫుడ్ లో ఉంటుంది. గుడ్లు, ఆకుకూర, తోటకూర, లిమా బీన్స్, పుట్టగొడుగులు, బచ్చలికూర, నువ్వు గింజలు, మరియు వెల్లుల్లి వంటి వాటిలో సాధారణంగా ఉంటుంది.

చేపలు, గ్రాస్సఫేడ్(grass feed) జంతువుల ఉత్పత్తులు, ఫ్లాక్స్ సీడ్స్ మరియు అక్రోట్లు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి , ఇది రోగనిరోధక చర్యను పెంచే హార్మోన్ల బ్లాక్స్ ను మరియు కణ పెరుగుదల నియంత్రించడానికి, థైరాయిడ్ పనితీరును మరియు థైరాయిడ్ హార్మోన్లు ప్రతిస్పందనకు సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.

100% బంక లేని వాటిని తీసుకోండి. థైరాయిడ్ కణజాలం పరమాణు కూర్పు, గ్లూటెన్ దాదాపు సమానంగా ఉంటుంది. గ్లూటెన్ ఆహారాన్ని తీసుకోవటం వలన మీ థైరాయిడ్ మీద
ఆటోఇమ్యూన్ దాడి పెరుగుతుంది.

థైరాయిడ్ పనితీరును జోక్యం చేసుకునే ఆహారాలు, గోయిట్రోజెన్స్ పట్ల జాగ్రత్త వహించండి.  బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే, కోహ్ల్రబి, రుటబగా, టర్నిప్లు, జొన్న, స్ట్రాబెర్రీ,
, వేరుశెనగ, రాడిషేస్, మరియు సోయాబీన్స్. వంటి వాటిలో గోయిట్రోజెన్స్ ఉన్నాయి.

 గ్లూటాతియోన్ కోసం వెళ్ళండి. గ్లూటాతియోన్ రోగనిరోధక వ్యవస్థ బలపరి్చే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆటో ఇమ్యూన్ మంటను తగ్గించడానికి దోహదపడుతుంది మరియు థైరాయిడ్ కణజాల రక్షణ మరియు తగ్గుదల మరియు రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తూ మీ శరీరం యొక్క సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. కొన్ని ఆహారాలు గ్లూటాతియోన్ కలిగి ఉండగా, ఆకుకూర, తోటకూర, బ్రోకలీ, పీచెస్, అవెకాడో పండు, బచ్చలికూర, వెల్లుల్లి, స్క్వాష్, ద్రాక్షపండు, మరియు ముడి గుడ్లు వంటి ఆహారాలు మీ శరీరం గ్లూటాతియోన్ పొందటానికి సహాయం చేస్తాయి.

కేవలం Hashimoto's thyroiditis ఉనికితో మీ యొక్క శరీరం థైరాయిడ్ మీద దాడి చేసినప్పుడు, మీ శరీరం తాపజనక ఆహారాల కొరకు చూస్తుంది మరియు స్వయం  ప్రతిరక్షక ప్రతిస్పందన ఎక్కువవుతుంది.

ఒక జీర్ణాశయ పరిశీలన చేయండి. థైరాయిడ్ పనితీరుకు 20 శాతం ఆరోగ్యకరమైన జీర్ణాశయ బ్యాక్టీరియా సరఫరా మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి ప్రోబయోటిక్స్ (స్నేహపూర్వక ప్రేగు బాక్టీరియా) అదనంగా తీసుకోవటం ఉత్తమం.

మీ ఒత్తిళ్లు మరియు ఆచరణలో ఉపశమనం కోసం చూడండి. థైరాయిడ్ చాలా సున్నితమైన గ్రంథి మరియు ఒత్తిడికి అనూహ్యంగా ప్రతిస్పందిస్తుంది.


  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 28, 2013

worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కడుపులోకి పురుగులు ఎలా చేరతాయి...
పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు  సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి . కడుపులో పురుగులున్నాయంటే అవి ప్రోటోజోవా, హెల్మింథస్‌ (ప్లాట్‌, నిమటోడ్‌) వర్గానికి చెందిన పరాన్న జీవులు అయ్యి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి... ఆస్కారిస్‌ వార్మ్స్‌, పిన్‌ వార్మ్స్‌, హుక్‌ వార్మ్స్‌, ఫ్లాట్‌ వార్మ్స్‌ (నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు) లాంటివి. పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణములు. చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

వివరణ-- కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి.సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి.

 బద్దెపురుగులు :

 ఇవి సరిగా ఉడికించని పోర్క్ వంటి ఆహారం వల్ల కడుపులో చేరే పరాన్న జీవులు. ఈ తరహా జీవులు ప్రధానంగా ఫ్లాటీహెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్ జాతికి చెందినవై ఉంటాయి. ఇందులో నులి పురుగు లేదా ఆస్కారిస్ వార్మ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా చిన్న పేగుల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు, సరిగా వండని ఆహారంతో ఈ క్రిములు వాపిస్తాయి.బద్దె పురుగులు-వీటిలో చాలా విభజనలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్వవస్ధలో చొచ్చుకుని పోతాయి. అక్కడ నుండి ఇవి ఆతిధేయులు (HOST) నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి(పీల్చుకుంటాయి).

పిన్ వార్మ్ లేదా త్రెడ్ వార్మ్ లేదా సీట్ వార్మ్:

ఇవి నిమటొడా వర్గానికి చెందిన జీవులు. మలద్వారం దగ్గరలో ఉండి దురదను పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టిలో తమ మర్మావయవాల వద్ద గోకి మళ్లీ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇవి వ్యాపిస్తాయి.

హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా):

ఇవి కూడా నిమటోడా వర్గానికి చెందినవే. ఇది చర్మం ద్వారా శరీరంలోకి పొడుచుకుని వెళ్ళి, రక్తనాళాల ద్వారా కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలో వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది.

ఎంటమీబా ,జియార్డియా :
 ఇది ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జియార్డియా వంటి ఏకకణ జీవులు పొట్టలోకి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతటా దురదలు పుట్టిస్తాయి.

వుకరేరియా బ్రాంకప్టై :
 ఫైలేరియాసిస్ (బోదకాలు) చాలా రకాల పరాన్న జీవుల చర్మాన్ని లిఫ్ గ్రంధులో చొచ్చు కొని పోయి ఆయా భాగాల్లో వాపును కలిగిస్తాయి.


    పరాన్నజీవులు ఆతిధేయులు ( Host ) శరీరంలో లోపల లేక వెలుపల కణాలలో కానీ శరీర భాగాలలో గానీ చొచ్చుకొని పోయి వాటి నుంచి ఆహార పదార్థాలను పీల్చుకుంటాయి. కొన్ని పరాన్నజీవులు ముఖ్యంగా ఏలిక పాముల వ్యాధి గ్రస్థులను చేసేస్తాయి. ఏలిక పాములు సన్నగా, పొడవుగా, ఎముకలు గానీ, ఏవిధమైన చర్మం గానీ లేకుండా పిల్లలను గుడ్ల నుంచి లార్వాల వరకు పొదిగి, పెరిగిన పాములు చర్మం, కండరాలు, ఊపిరితిత్తులు మరియు పేగులో స్థిరపడేటట్లు వదులుతూ వుంటాయి.

లక్షణాలు

    ఏ లక్షణాలు వుండవు, బహు కొద్ది లక్షణాలు వుండవచ్చును.
    కొన్నిమార్లు లక్షణాలు వెంటనే కలుగుతాయి. కొన్నిమార్లు 20 సం,, వరకు పడుతాయి.
    కొన్నిసార్లు ఈ పరాన్న జీవులు మొత్తంగా లేదా కొన్ని కొన్ని భాగాలుగా మల విసర్జన నుంచి బయట పడతాయి.
    అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, (అన్నాశయము, పేగులు, కాలేయము, పెద్దపేగు, గుదము).పై బాగాలలో వున్న ఏలిక పాములు కడుపులో నొప్పి కలిగిస్తాయి.
    బలహినత, విరేచనాలు, ఆకలి లేక పోవడం బరువు తగ్గిపోవడం, వాంతులు, రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, విటమిన్లు, ధాతువులలోపం, కొవ్వు పదార్ధాల, ప్రోటీన్ల లోపం వంట లక్షణాలు కలుగ చేస్తాయి.
గుద ద్వారము వద్ద దురద, మానము  వద్ద దురద, నిద్రలేమి, ప్రక్కలో మూత్రం పోయడం,కడుపులో నొప్పి వంటి లక్షణాలు నులి పురుగులు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కనబడుతాయి.
    చర్మం – వాపులు, నోటితో లేదా ద్రవంతో కూడిన తిత్తులు, బొబ్బలు, మొఖం వాపు, ముఖ్యంగా కండ్ల చుట్టూ కనబడుతుంది.
    అలర్జీ లక్షణాలు – చర్మం మీద దద్దుర్లు, చర్మంలో దురద, గుదద్వారం చుట్టూ దురద,
    అవర ప్లూక్సీ – కాలేయం వాపు, పెద్దగా పెరగడం,జ్వరం,కడుపు నొప్పి, విరేచనాలు, చర్మం పసుపు రంగులో మారడం.
    లింఫ్ గ్రంధులు ఏనుగు కాళ్ళు, (శోషరసనాళ గ్రంధులు) పురుష బీజాశయాలలో వాపు,
 ఇంకా->
నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గిపోతూ ఉండటం, విరేచనాలలో రక్తం, పురుగులు కనిపించడం, మర్మావయవాల వద్ద దురద, శ్వాసలో దుర్గంధం, కళ్ళ చుట్టూ నల్లటి చారలు, చిన్న పిల్లల్లో ముఖంపై తెల్ల మచ్చలు రావడం అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావడం, దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రంలో రక్తం పోవడం,  అనీమియాకు గురికావడం, నిద్రలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం. కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కారణాలు

    కణజాలాల్లో ఉండే ఏలిక పాములు మరియు బద్దె పురుగులు.    ప్రేగులలో ఉండే        ఏలిక పాములు – మలవిసర్జనం లో  ఏలిక పాములు గుడ్లు వుంటాయి. వీటితో  కలుషితం అయిన ఆహారం కానీ,నీరు కానీ యాధృచ్చికంగా మనుషులు తీసుకొనడం సంభవింవచ్చు.అప్పుడు అవి వారి శరీరంలోని ప్రేగులలో పెరిగి, రక్త ప్రసరణ ద్వారా శరీరం లోని ఇతర భాగాలకు ముఖ్యంగా ఊపిరితిత్తులకు చేరుతాయి. ఇవి 40cm వరకూ పెరుగుతాయి.

హాని కలిగించే కారణాలు

    మల విసర్జనలో కలుషితం అయిన నీరు
    అపరిశుభ్ర వాతావరణం (పరిసరాలు)
    పచ్చి లేక పూర్తిగా ఉడకని, కూరగాయలు,చేపలు,మాసం తినడం,
    జంతువుల (గొర్రెలు, కోళ్ళు, బర్రెలు) ను అపరి శుభ్ర పరిసరాలలు,మానవాసాలకు దగ్గరగా ఉంచుకోవడం.
    ఎలుకలు క్రిమికీటకాలతో ఇన్ఫెక్షన్లు,
    పౌష్ఠికాహార లోపం మరియు ఇతర జబ్బులు వున్న వ్యక్తులు,
    దోమలు ఇతర కీటకాలు అధికంగా ఉన్న పరిసరాలు.
    ఆటస్ధలాలో పిల్లలు మట్టిలో ఆడడం మూలాన వాటిలో ఉన్న పరాన్న జీవులు చేతులకు అంటవచ్చును.

నివారణోపాయాలు

    ద్రవపదార్ధాలు
    విశ్రాంతి
    కుటుంబంలో అందరికి పరీ్క్షలు చేయించి వైద్యం చేయించడం.
    వైద్యం పూర్తయ్యే వరకు లోపలి బట్టలు, దుప్పట్లు, బట్టలు, వేడి నీటిలో ఉడక పెట్టడం,
    చేతులు తరచుగా పరిశుభ్రం చేసుకోవడం, పచ్చి కూరలు, పూర్తిగా ఉడకని ఆహారం తీసుకోకూడదు.
    నీటిని మరిగించి తాగాలి.
    పండ్లు,కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.

 కడుపులో పురుగుల నివారణకు ఆహారనియమాలు:

తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పళ్లు, క్యారట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా తేనె, పుప్పొడి పండ్ల విత్తనాలు శరీరంలో పురుగులను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే బవెల్(Bowel) కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి ఇందుకు దోహదపడే విధంగా మంచినీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలముద్వారా అవి బయటపడిపోతాయి.
ఆహారం జీర్ణం అవ్వడంలో తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్-సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కలుషితమైన నీళ్లను తాగకూడదు.

  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, May 24, 2013

Dehydration,నిర్జలీకరణం

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Dehydration,నిర్జలీకరణం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిర్జలీకరణం అనగా నేమి ?

శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. చాలా శరీరక శ్రమ చేసే వారికి దీనికి రెండు నుంచి మూడింతలు త్రాగవలసి వుంటుంది. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియలు అవసరమైన నీరు మనం అందించ వలసి వుంటుంది. తగిన మోతాదులో తీసుకొనక పోయినా, తీసుకొన్న దానికంటే అధికంగా నష్ట పోయినా నిర్జలీకరణం సంభవిస్తుంది.

నిర్జలీకరణకు కారణాలు   
అన్నవాహిక (జీర్ణ వ్యవస్ధ) నుంచి అధికంగా నీరు నష్టపోవడం మూలాన ఈ స్ధితి ఏర్పడవచ్చును.

దీనికి కారణాలు

  •  ప్రేగుల లోపల ఉపరితలంలో వాపు, హాని కలిగి ఉండడం.
  •  బాక్టీరియా,వైరసుల మూలంగా అధికంగా ద్రవం స్రవించడం, దీనిలో చూషణ (absorption) కన్నా స్రవించడం అధికంగా వుంటుంది.
  •  నోటి ద్వారా తీసుకునే నీరు సరిపడా లేకపోవడం, ఉదా: కడుపులో త్రిప్పుట, వాంతులు.
  • వడదెబ్బ (sun stroke) , 
  • కొన్ని దీర్ఘకాలిక వ్యాదులు (Diabetes , peptic ulcers ,T.B. etc.)

లక్షణాలు చిహ్నాలు

    నిర్జలీకరణకు గుర్తు కొద్ది రోజులలో అధికంగా బరువు తగ్గిపోవడం

(కొన్ని మార్లు కొద్ది గంటలలో త్వరిత గతిన బరువు తగ్గడం 10 శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు సమస్యకు తీవ్రంగా పరిగణించ వలసి వుంటుంది.
కొన్ని సార్లు వేరే జబ్బు లక్షణాలతో కలిసి వుండి గుర్తించడం కష్టం కావచ్చు.

  •     ఎక్కువ దాహం
  •     ఎండి పోతున్న నాలిక
  •     చర్మము ఎండి పొవుట
  •     తల తేలికగా అనిపించడం. (ముఖ్యంగా నిలుచున్నప్పుడు)
  •     బలహీనత
  •     మూత్రం రంగు ముదురు పసుపులో వుండడం లేక మూత్రం తక్కువ గా రావడం.
  •     నిర్జలీకరణ తీవ్రంగా వున్నప్పుడు శరీరంలో వుండే రసాయనాల మార్పు రావచ్చు. మూత్ర పిండాలు అసఫలిత కొద్ది సమయాలలో ప్రాణ హాని కూడా కలుగవచ్చు.

  • చికిత్స
వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు మన జీర్ణమండలము సరియైన రీతిలో పనిచేసే పరిస్థితిలో ఉండదు . కావున దానికి విశ్రాంతి అవసరము . విరోవనాలు + వాంతులు అవుతున్న రోగికి .... డీ హైడ్రేషన్‌ తీవ్రతను బట్టి మూడు రకాలు గా విభజించారు . 1.తక్కువ తీవ్రత(mild),2.ఒక మోస్తరు తీవ్రత (moderate) , ఎక్కువ తీవ్రత (severe) గలవి గా చెప్పబడినవి .

సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .

మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.

మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....

  • * రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్‌' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
  • * కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
  • * వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.

జాగ్రత్తలు--
  • తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
  • ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
  • ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
  • తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
  • వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.

వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.



Courtesy with : India Development Gateway
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కంటిలో ఒక లెన్సు ఉంది.. రానురాను ఈ లెన్సు పారదర్శకత్వాన్ని కోల్పోతుంది. చూపు మందగిస్తుంది. ఈ దశను క్యాటరాక్టు అంటారు.

క్యాటరాక్టు వచ్చిన వారికి ఈ క్రింది లక్షణములు ఉంటాయి :
          రాను రాను నొప్పి లేకుండా కంటిచూపు తగ్గుతుంది. దగ్గర దూర చూపులో వ్యత్యాసం దుర్లభం. రంగులు గుర్తు పట్టడంలో కష్టం, ఒకే దృశ్యం రెండుగ కనబడడం. కంటిపాప రంగుమారి తెల్లపడడం, మబ్బుమబ్బుగా ఉండడం.

క్యాటరాక్టును ఏవిధంగా చికిత్స చేయగలం?
సామాన్య కంటిచూపు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఒక సామాన్య ఆపరేషన్ ద్వారా కంటిలోని లెన్సు తొలగించడమే.

క్యాటరాక్టు ఆపరేషన్ దుష్పరిణామానికి దారితీస్తుందా?
          ఇదొక సామాన్యమైన ఆపరేషన్. ఇందులో నొప్పి ఉండదు. రోగికి స్పృహ లేకుండా చెయ్యరు. మత్తుమందు ఇవ్వనవసరము లేదు.
          కంటి సంరక్షణ కోసం, క్యాటరాక్టు వచ్చిన వారిని పరీక్షించడానికి, వారికి చికిత్స చేయడానికి, జిల్లా అంధత్వ నివారణ సంఘములను, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.
          స్వచ్ఛంద సేవా సం)స్థల ద్వారా నేత్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచితంగా కంటద్దాలు అందచేస్తున్నారు.

జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు :

    భారతదేశంలో క్యాటరాక్టు, అంధత్యానికి మూల కారణం. అంధులలో 85 శాతం, క్యాటరాక్టువల్ల చూపు కోల్పోయిన వారే.
    సరైన సమయంలో క్యాటరాక్టుకు చికిత్స చేయాలి. అశ్రద్ధ చేయవద్దు.
    క్యాటరాక్టు వృద్ధాప్యంలో వస్తుంది. కంటికి దెబ్బ తగిలిందంటే క్యాటరాక్టు ఏ వయస్సులోనైనా రావచ్చు.
    క్యాటరాక్టువల్ల ఆపరేషన్ సులభమైంది. నిశ్చింతగా చేయించుకోవచ్చు.
    ఆపరోషన్ తరువాత కంటి పరీక్ష చేయించుకొని సరైన కళ్ళజోళ్ళు వాడాలి.
    క్యాటరాక్టు వచ్చిన వ్యక్తి ఆత్మ స్థైర్యంతో ఆపరేషన్ చేయించుకొనేటట్లు చూడాలి.


  • Cataract surgery-శక్లాల సర్జరీ


విజ్ఞానశాస్త్రం విస్తరించిన కొద్దీ.. మన `దృష్టి' మెరుగవుతోంది! అందుకు ఆధునిక `శక్లాల' సర్జరీలే సాక్ష్యం! మలివయసులో చూపునకు పట్టే గ్రహణం.. శక్లం!
పుట్టుకతోనే మన కంటిలో ఉండి.. నిరంతరం మనకు లోకాన్ని చూపిస్తుండే సహజమైన `కటకం' ముదిరిపోయి.. మబ్బుగా.. కాంతి ప్రసరించనంతటి గట్టి `కొబ్బరి ముక్క'లా తయారవ్వటమే ఈ సమస్యకు మూలం!

సర్జరీ చేసి... మబ్బుగా ఉన్న ఈ శక్లాన్ని తొలగించి ఎంతోకొంత చూపు పునరుద్ధరించటం ఒక ముందడుగు. దాని  స్థానంలో కృత్రిమ కటకాన్ని అమర్చటం మరో గొప్ప పురోగతి.
అయితే.. ఈ ప్రయోగపరంపర ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కృత్రిమ కటకాలకు మరిన్ని మెరుగుదిద్దుతూ సానబెట్టే పని నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అందుేక ఇప్ఫుడు సాధ్యమైనంత సహజంగా.. మన్నికగా.. బహుళ ప్రయోజనాలను చేకూర్చే విధంగా రకరకాల కటకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
శక్లాల ఆపరేషన్‌ చాలా సాధారణమైపోయిన ఈ కాలంలో.. ఈ ఆధునిక కటకాలపై అవగాహన పెంచుకోవటం చాలా ఉపయోగకరం. అందుేక దీనిపై సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాం!

అసలేమిటి శక్లం?
మన కన్ను ఓ ెకమేరాలాంటి అమోఘమైన నిర్మాణం!
మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనేక ఉండే సహజ కటకం.. ఈ రెండూ బయటి నుంచి వచ్చే కాంతి కిరణలు కచ్చితంగా లోపలి రెటీనా పొర మీద ేకంద్రీకృతమయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర.. ఆ కిరణ బింబాన్ని విద్యుత్‌ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ళ ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండటానికి... కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం!
ఎప్ఫుడూ లేత ముంజిలా.. బయటి నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం.. వయసుతో పాటు.. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. బాగా ముదిరిపోయి కొబ్బరిముక్కలా తయారైపోతుంది. ఇదే శక్లం. దీని గుండా లోపలికి కాంతి కిరణాలు ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది!

ఎందుకిలా?
1. వయసుతో పాటు సహజంగానే రావచ్చు.
2. అతినీల లోహిత కిరణలు ఎక్కువగా సోకినప్ఫుడు
3. సహజ కటకానికి దెబ్బల వంటివి తగిలినప్ఫుడు
4. మధుమేహం వంటి సమస్యలున్నప్ఫుడు
5. స్టిరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్ఫుడు
... సహజ కటకం దళసరిగా తయారై శక్లం ఏర్ఫడొచ్చు. సాధారణంగా 50, 55 ఏళ్ళ తర్వాత వచ్చే శక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శక్లాలు ఏర్ఫడొచ్చుగానీ దీనికి చాలా వరకూ జన్యుపరమైన, వంశపారంపర్యమైన అంశాలే కారణం.
మధుమేహ బాధితులకు.. శక్లాలు ఏర్ఫడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తంలో చెక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆ చెక్కెర కటకం లోపలికి వెళ్థూవస్తూఉంటుంది. దానివల్ల క్రమేపీ కటకంలో తేడాలు వచ్చి పారదర్శకమైన కటకం.. శక్లంగా మారుతుంది. లేదా ఇప్ఫటిేక శక్లాలు ఏర్ఫడుతుంటే వాటిని త్వరగా ముదిరేలా చేస్తుంది.

శక్లం: లక్షణలేమిటి?
* చూపు మందగించి.. మబ్బుగా తయారవటం
* రంగుల మధ్య, తలాల మధ్య వ్యత్యాసం (కాంట్రాస్‌‌ట) సరిగా తెలియదు.
* అరుదుగా ఒక వస్తువు, ఒక కాంతి రెండు మూడుగా కనబడుతుండొచ్చు. ఉదా: చంద్రబింబాలు రెండుగా కనబడొచ్చు
* మిరుమిటు్ల గొల్ఫే కాంతిలో చూపు కష్టం కావచ్చు.
* కటకం మధ్యభాగం శక్లంలా మారటం వల్ల కొన్నిసార్లు తీƒణమైన వెలుతురులోకి వెళ్లినప్ఫుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. దీనివల్ల డ్రైవర్ల వంటివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
* కొందరిలో కటకం మధ్యభాగం బాగా దళసరిగా మారి మైనస్‌ పవర్‌ బాగా పెరుగుతుంటుంది, దీంతో దగ్గరి చూపు మెరుెగనట్టనిపించవచ్చుగానీ శక్లం కారణంగా మొత్తం మీద చూపు ఇబ్బందిగా తయారవుతుంది.

మందులున్నాయా?
వాస్తవానికి శక్లాలను కరిగించే ప్రామాణికమైన మందులేం లేవు. దీనికి ఆపరేషన్‌ ఒక్కటే ఉత్తమ మార్గం. కొందరు `యాంటీక్యాటరాక్‌‌ట' చుక్కలు వాడుతుంటారుగానీ వీటితో ఉపయోగం ఉన్నటు్ట శాస్త్రీయమైన ఆధారాలేం లేవు. పైగా ఈ మందులు చాలా రీదైనవి. వీటిని ఏళ్ళ తరబడి వాడినా ఏ ప్రయోజనమూ ఉండకపోవచ్చు. కాబట్టి పనిచేస్తాయో లేదో తెలీని ఈ మందులతో సమయాన్ని వృథా చేసుకునే కంటే ఆపరేషన్‌ చేయించుకోవటం ఉత్తమం.

ఆపరేషన్‌ ఎప్ఫుడు మంచిది?
శక్లం ముదిరే వరకూ వేచి ఉండాలన్నది ఒకప్ఫటి, పాతకాలపు ధోరణి. 15-20 ఏళ్ళ క్రితం శక్లాల ఆపరేషన్‌ను చాలా నాటుగా చేసేవాళ్లు. (ఇప్ఫుడూ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలాేగ చేస్తున్నారు.) వీటితో దుష్ర్ఫభావాలు తలెత్తి చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. అందుేక డాక్టర్లు శక్లం బాగా ముదిరినప్ఫుడు ఎలాగో ఏమీ కనబడదు కాబట్టి.. ఆ సమయంలో సర్జరీ చేస్తే ఫలితం ఉన్నాలేకున్నా నష్టం ఉండదని భావించేవారు. కానీ ఇప్ఫుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో... ఆల్ట్రాసౌండ్‌ తరంగాలతో `ఫేకోఎమల్సిఫిేకషన్‌' పద్ధతిలో శక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల కృత్రిమ కటకం (ఇంట్రా ఆక్యులర్‌ లెన్‌‌స-ఐఓఎల్‌) అమర్చటమన్నది చాలా ప్రామాణికమైన.. అద్భుతమైన విధానమని చెప్ఫవచ్చు. ఇది చాలా సురక్షితమైన, చక్కటి చూపునిచ్చే పద్ధతి. కాబట్టి ఇవాల్టి రోజున.. శక్లాలు ముదిరే వరకూ ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు! శక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఎప్ఫుడు ఇబ్బందికరంగా తయారవుతుంటే.. అప్ఫుడే సర్జరీ చేయించుకోవచ్చు, తొలిదశలో కూడా చేయించుకోవచ్చు.'

ఏమిటీ సర్జరీ?
సర్జరీకి ముందు... మధుమేహం, హైబీపీ ఉంటే సర్జరీకి వెళ్ళే ముందు వాటిని నియంత్రించుకోవటం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్ఫుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించటం కష్టం. అలాేగ రక్తాన్ని పల్చగా చేసే ఆస్ఫిరిన్‌ తరహా మందులు వాడుకుంటూ ఉంటే.. వాటిని తప్ఫనిసరిగా ఆపరేషన్‌కు రెండు మూడు ముందు నుంచీ మానెయ్యాలి.

ఆపరేషన్‌...
ఒకప్ఫుడు ేకవలం కంటిలోని శక్లాన్ని తొలగించి వదిలేసేవాళ్లు. దానివల్ల దాదాపు ప్లస్‌ 10 పవర్‌ ఉండే సోడాబుడీ్డ అద్దాలు పెటు్టకోవాల్సి వచ్చేది. ఈ అద్దాల్లేకపోతే ఏమీ కనబడేది కాదు. మెట్ల వంటివి దిగాలంటే మహా కష్టం. దీనికి విరుగుడుగా.. మొదటగా బ్రిటన్‌నేత్ర వైద్యుడు హెరాల్‌‌డ రిడ్లే 1948లో లోపలే కృత్రిమ కటకం (ఐఓఎల్‌) అమర్చటం ఆరంభించాడు. శక్లాల ఆపరేషన్‌లో ఇదో గొప్ఫ ముందడుగు. రెండోది- లోపలి శక్లాన్ని తీసి, కృత్రిమ కటకం అమర్చేందుకు కనుగుడ్డు మీద పెద్ద కోతబెట్టాల్సి వచ్చేది. ఈ పెద్ద కోత వల్ల కార్నియా బల్లబరుపుగా తయారై.. చూపు బాగా ప్రభావితమయ్యేది. దీనికి విరుగుడుగా- ఆల్ట్రాసౌండ్‌ పద్ధతిలో.. చాలా చిన్న కోత ద్వరానే శక్లాన్ని తొలగించే పద్ధతిని 1968లో ఛాల్‌‌స ెకల్మన్‌ అనే అమెరికా నేత్ర వైద్యుడు ఆరంభించాడు. తరువాత ఆ చిన్న కోత ద్వారానే కృత్రిమ కటకాన్ని మడతబెట్టి లోపలికి పంపించి.. అమర్చటమన్న అత్యాధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది! ఇదే ఇప్ఫుడు ప్రామాణిక చికిత్స!

  •  


కోత కీలకం!

కనుగుడ్డు కార్నియా పొర మీద ఎంత పెద్ద కోతబెడితే.. ఆ తర్వాత పెటు్టకోవాల్సిన అద్దాల పవర్‌ అంత పెరుగుతుంది. పెద్ద కోతబెట్టినప్ఫుడు.. పుండు మానిన తర్వాత కార్నియాలో ఆ కాస్త భాగం బల్లబరుపుగా తయారవుతుంది, దీంతో అద్దాల పవర్‌ ఇంకా పెరుగుతుంది. అందుేక సాధ్యమైనంత `చిన్న కోత' ద్వారానే లోపలి కటకం తొలగించటం, కొత్త కటకం అమర్చటం.. రెండూ పూర్తి చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు సాగాయి. ఆల్ట్రాసౌండ్‌ పరిజ్ఞానం సాయంతో `ఫేకో' పద్ధతిలో 2, 2.5 మిల్లీమీటర్ల చిన్నకోత ద్వారా లోపలి శుక్లాన్ని తొలగించటం తేలిక అయ్యిందిగానీ కొత్త కటకాన్ని ఆ చిన్న కోత ద్వారా లోపలికి పంపటం కష్టమైంది. కటకం పంపాలంటే కనీసం 6 మిల్లీమీటర్ల దారి అవసరమైంది. అందుేక దీనికి విరుగుడుగా మడతపెట్టే రకం `ఫోల్డబుల్‌' కృత్రిమ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సన్నటి కోత ద్వారా లోపలికి తోసి.. అక్కడ విచ్చుకునేలా చెయ్యచ్చు. 90ల నుంచీ ఈ రకం మడతపెట్టే లెన్సులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద కోత అవసరం తప్ఫింది.. అద్దాలు పెటు్టకోకున్నా కూడా చూపు కొంత మెరుగ్గా ఉంటుంది.

పదార్థమూ ముఖ్యమే!
కంట్లో అమర్చేందుకు కృత్రిమ కటకాలను ఏ రకం పదార్థంతో తయారుచేస్తే ఫలితాలు బాగుంటాయన్న దానిపై చాలా ప్రయోగాలు జరిగాయి. వీటిలో సిలికాన్‌, అక్రిలిక్‌ పదార్ధాలు ఉత్తమమైనవని గుర్తించారు. మళ్లీ ఈ అక్రిలిక్‌లో కూడా హైడ్రోఫిలిక్‌, హైడ్రోఫోబిక్‌ అనే రెండు రకాల పదార్ధాలతో తయారైన కటకాలున్నాయి. వీటితో ఆపరేషన్‌ తర్వాత.. శక్లాలకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ. ముఖ్యంగా శక్లం ఆపరేషన్‌ చేసిన తర్వాత రెండుమూడేళ్లు చూపు బాగానే ఉండి.. ఆ తర్వాత మళ్లీ తిత్తి మొత్తం దళసరిగా మారుతూ చూపు తేగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే `కాప్సులార్‌ ఒపేసిఫిేకషన్‌' అంటారు. ఈ రకం సమస్య అక్రిలిక్‌ కటకాలతో చాలా తక్కువనీ, ఈ కటకాల్లో కూడా వెనక భాగం పలకలుగా, ముందు భాగం గుండ్రంగా ఉండే కటకాలతో మరీ తక్కువని గుర్తించారు. కాకపోతే వీటి ఖరీదు కొంత ఎక్కువగా ఉంటుంది.

లెన్సులు
1. నాన్‌ఫోల్డబుల్‌:
* సాధారణంగా దీనితో కోత 5-5.5 మి.మీ. వరకూ అవసరమవుతుంది. కోత పెరిగిన కొద్దీ కార్నియా చదునుగా అయిపోతుంది, కోత మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్లాసుల పవర్‌ ఎక్కువ అవుతుంది. అద్దాలు పెటు్టకోకపోతే బాగా కనబడదు, కాబట్టి ఎప్ఫుడూ అద్దాలు పెటు్టకునే ఉండాలి.
* వీటిలో స్వదేశీ, విదేశీ కటకాలు రెండూ లభిస్తాయి. సాధారణంగా ఈ లెన్సుతో, ఫేకో పద్ధతితో సర్జరీ చేస్తే రూ.6-8 వేల వరకూ అవుతుంది.

2. ఫోల్డబుల్‌
చిన్నకోత ద్వరానే మడతపెట్టి లోపల అమర్చటానికి వీలైన ఈ లెన్సులను ఎ. సిలికాన్‌ బి. హైడ్రోఫిలిక్‌ అక్రిలిక్‌ సి. హైడ్రోఫోబిక్‌ అక్రిలిక్‌. అనే మూడు రకాల పదర్ధాలతో తయారైనవి దొరుకుతాయి.
మళ్లీ వీటిలో ప్రతి ఒక్కటీ- స్వదేశీ, విదేశీ తయారీలో ఉంటాయి, దీన్ని బట్టి వీటి రీదు కూడా మారుతుంది.

డిజైన్లూ ముఖ్యమే!
అంచులు:
ఈ కటకాలలో వెనక భాగం పలకలుగానూ, ముందు భాగం గుండ్రంగానూ ఉన్న వాటితో తిరిగి శక్లం తిత్తి దళసరిగా మారే అవకాశం తక్కువని, చూపు కూడా నాణ్యంగా ఉంటుందని గుర్తించారు. కాబట్టి ఏ పదార్థంతో తయారైన కటకాన్ని అమర్చుకున్నా కూడా... ఈ రకం డిజైన్‌ వాటిని ఎంచుకోవటం మంచిది.

ఉపరితలం:
సాధారణంగా మన కంటిలోని కార్నియా పొరకు +దృష్టిలోపం ఉంటుంది, కటకానికి -దృష్టిలోపం ఉంటుంది. ఈ రెండూ కలిసి న్యూట్రల్‌గా మారి మనకు చక్కటి చూపునిస్తాయి. కానీ వయసు పెరిగిన కొద్దీ శక్లం ఏర్ఫడితే కటకానికి ఉండే -దృష్టిలోపం తగ్గుతుంది, చూపులో అస్ఫష్టత పెరుగుతుంది. అలాేగ స్థాయీవ్యత్యాసాలూ (కాంట్రాస్‌‌ట) సరిగా తెలీవు. దీనికి విరుగుడుగా కొత్తగా కంటిలో అమర్చే కటకాలను `ఏస్ఫెరిక్‌' లేదా `ఆబరేషన్‌ ఫ్రీ' తరహా డిజైన్లలో తయారు చేస్తున్నాయి. అన్ని రకాల పదార్ధాల్లోనూ లభ్యమయ్యే ఈ డిజైన్లలో.. కటకం ముందు ఉపరితలం కొద్దిగా ఉబ్బుగా ఉంచుతారు. దీంతో రాత్రిపూట, డే లైట్‌లో కూడా చూపు మెరుగవుతుంది. మంచి కాంట్రాస్‌‌ట ఉంటుంది, వాహన ప్రమాదాలు తగ్గుతాయి.

మల్టీఫోకల్‌:
సాధారణంగా ఈ కృత్రిమ కటకాలన్నీ కూడా దీర్ఘదృష్టికో, హ్రస్వదృష్టికో.. ఏదో ఒక దాని మీద మాత్రమే ేకంద్రీకరించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదో ఒకదానికి పరిమితం కాకుండా వీటిని మధ్యేమార్గంగా కొంతకొంత రెంటికీ పనికొచ్చేలా అమరుస్తారు. దీంతో ఇంట్లో పనులన్నీ అద్దాల్లేకుండా చేసుకుంటారు, చదువుకూ, దూరపు చూపుకూ అద్దాలు వాడుకుంటారు. ఇవి మోనోఫోకల్‌ లెన్సులు. ఈ కాస్త ఇబ్బందినీ కూడా తగ్గించేందుకు ఇటీవలికాలంలో `మల్టీఫోకల్‌ లెన్సులు' వస్తున్నాయి. ఈ కటకాల మీద కొన్నికొన్ని వలయాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని దగ్గర చూపునకు, కొన్ని దూరపు చూపునకు ఉపయోగపడతాయి. దీంతో కళ్ళద్దాలు పెటు్టకోవల్సిన అవసరం అంతగా ఉండదు. కాకపోతే ఈ రకం డిజైన్‌ లెన్సులు పెట్టించుకుంటే రెండు కళ్ళకూ చేయించుకోవాలి. ఒక్క రాత్రిపూట డ్రైవింగ్‌ వంటివి చేసేవారికి మాత్రం వీటి వల్ల ేగ్లరింగ్‌ సమస్య రావచ్చు, కాబట్ట వారు మోనోఫోకల్‌ అద్దాలు పెట్టించుకోవటం మంచిది.

మూవీ అబ్జార్బింగ్‌ లెన్స్:
సాధారణంగా మన కంటిలోని సహజమైన కటకం.. అతినీల లోహిత కిరణలను కొంతవరకులోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కృత్రిమ లెన్సుకు ఈ స్వభావం ఉండదు. దీంతో ఈ కిరణాలు లోపలికి వెళ్లి రెటీనాను దెబ్బతీసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కృత్రిమ లెన్సులను కూడా అతినీలలోహిత కిరణాలు లోపలకు సోకకుండా ఉండేలా రంగు కలిపి.. తయారు చేస్తారు. మాక్యులర్‌ డీనరేషన్‌ వంటి సమస్యలు రాకుండా వృద్ధులకు ఇవి మంచివే. ఇవి అక్రిలిక్‌ లెన్సులన్నింటిల్లోనూ అందుబాటులో ఉంటాయి.
* కాబట్టి అన్ని కటకాలూ మంచివే అయినా ఇవాల్టి రోజున స్తోమతును బట్టి సాధ్యమైనంత మన్నికైన కటకానికి వెళ్ళటం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.
* ప్రస్తుతం శక్లాన్ని తొలగించేందుకు- `ఫేకోఎమల్సిఫిేకషన్‌' సర్జరీ పద్ధతి ఉత్తమం.
*దీనికి తోడుగా... దీర్ఘకాలం మన్నికైన, సురక్షితమైన ఫలితాల కోసం లోపల- ఫోల్డబుల్‌, ఎక్రిలిక్‌ హైడ్రోఫోబిక్‌ కటకాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్ఫవచ్చు.



Courtesy with : India Development Gateway

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Fever in Adults,పెద్దవాళ్ళలో జ్వరం

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fever in Adults,పెద్దవాళ్ళలో జ్వరం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 లేక 98.60ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50 (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50 c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి.
సాధారణ కారణాలు

    మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీరియా, వైరస్.

సాధారణ జ్వరం లక్షణాలు

    37.50 C లేదా 1000 F ఆ పైన జ్వరం నమోదు
    తలనొప్పి
    చలితో కూడిన జ్వరం
    కీళ్ళనొప్పులు
    నోరు చేదుగా ఉండుట
    అకలి తగ్గడం, మలబద్దకం
    కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి

జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు

    జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి
    సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది
    పలుచటి దుస్తులు వాడాలి
    పలుచటి దుప్పట్లు వాడాలి
    గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి
    నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి
    చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు
    జ్వరం వచినపుడు తీసుకోవలిసిన ఆహారము
    ఎక్కువ విశ్రాంతి తీసుకొని అధికంగా నీరు త్రాగాలి
    జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్ ,హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి
    బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి
    కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి
    పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును
    మాంసం ,గుడ్డు, వెన్న , పెరుగు ,నూనె పదార్దాలు తీసుకోరాదు


courtesy with : http://www.indg.in/india
  • ======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Fats and human health , కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fats and human health , కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





    కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము
    1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.
    vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.

    కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.
    veg-ఆయిల్ - మనము  తీసుకొనే  ఆహారంలొ  చాలా  ముఖ్యమైనది.

       దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,
      1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)
      2. పాలీ ఆన్ సాచ్యురేటడ్
       ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils
       సాచ్యురేటడ్ కొవ్వు అనగా - వెన్న, నెయ్యి

    పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.

    హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.

    వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.
    తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -

    ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -

    యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు  సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.
    పెద్దవాళ్ళకు - 20గ్రా రోజుకు.
    గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.

    గుర్తుంచుకోవలసినవి -

    1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.
    2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.
    3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.
    4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.
    5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు

source : http://www.indg.in/india
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 23, 2013

Role of Nutritional food in growth , పెరుగుదలలో పోషకాహారం పాత్ర

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Role of Nutritional food in growth , పెరుగుదలలో పోషకాహారం పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ లక్షణాలివీ :
కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు,ఖనిజాలు,విటమిన్లు,శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం

మనకు శక్తి ఎందుకు అవసరం? :

    మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం.శరీర ఉష్టోగ్రతను స్ధిరంగా ఉంచటానికి, జైవిక క్రియకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం,మన దేశంలో 50శాతం మంది మహిళలు,పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.

  --ఆహారంలో లభించే కాలరీలు : పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని ' క్యాలరీలు ' అంటారు. ఒక మనిషికి ఎంత శక్తి అవసరమనేది అతడు/ఆమె ప్రతి రోజు పడే శారీరక శ్రమ పై ఆధారపడి  ఉంటుంది. వయస్సు ,లింగ భేదం శరీర బరువు, పెరుగుదల, శరీరం పని పాటలు ఒత్తిడిని బట్టి ఇది మారుతుంటుంది. భారత దేశంలో 70-80 శాతం మంది ప్రధాన గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తున్నారు.
      --  పిల్లలు ,కౌమార దశ వారు 55-60/శాతం రోజువారి కాలరీలను పిండి పదార్ధాల ద్వారా పొందుతున్నారు. కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగటానికి ఎక్కువ కాలరీలు అవసరం. ఉదాహరణకు 16-18 ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజు కనీసం 2060కిలో క్యాలరీలు గల ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అదే వయస్సు అబ్బాయిలకైతే 2640 కిలో కాలరీలు అవసరం. గర్భవతులకు అదనపు క్యాలరీలు ఆహారం ఇవ్వాలి. పిండం ఎదుగుదలకు,గర్భవతి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే పోషణ లోపానికి దారి తీస్తుంది.అధికంగా తీసుకుంటే ఊబకాయం (లావు) కు దారి తీస్తుంది.    

అధిక శక్తిని ఇచ్చే ఆహర పదార్ధాలు :

        ప్రధాన గింజ ధాన్యాలు,చిరు ధాన్యాలు ,పప్పు దినుసులు,దుంప కాయగూరలు,వంట నూనేలు,వనస్పతి,నెయ్యి,వెన్న,నూనెలు విత్తనాలు,గింజకాయలు చెక్కర,బెల్లం తదితరాలు.
        మనకు కాలరీలు ఎక్కువగా గింజ ధాన్యాలు నుంచి లభింస్తున్నాయి.కనుక గింజ ధాన్యాలు,చిరు ధాన్యాల్లో వివిధ రకాలను వినియోగించేలా చొరవ చూపాలి. జోన్నలు,సజ్జలు లాంటి ముతక ధాన్యాలు,రాగులు లాంటి చిరు ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిచ్చేవి.   

    ఆహార పదార్ధాలు---     శక్తి (ప్రతి వందగ్రాములకు కి.కాలరిలలో)
    బియ్యం--- గోధుమ పిండి-----జొన్న---    సజ్జలు ---   రాగి---    మొక్కజొన్న  
    345----341-----------349---    361---    328---    342
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 21, 2013

Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి.

చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేది ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట అధికమయినప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారు
వేసవిలో వేడి మూలంగా చాలామందికి చర్మం పేలినట్లయి, చెమటకాయలు వస్తుంటాయి. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

చెమటకాయలు ఎలా వస్తాయి?

చర్మంలో ఎక్రైన్ స్వెట్‌గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు ఉంటాయి. ప్రతి గ్రంథికి ఎక్రైన్ అనే ఒక నాళం (డక్ట్) ఉంటుంది. మన చర్మంలో సహజంగా స్టెఫలోకాకస్ ఎపిడెర్మిడిస్ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల, మృత చర్మ కణాల వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్వెట్ డక్ట్‌ కు అడ్డుపడి, చెమటకాయలలాగ తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయలలో చీము కూడా చేరుతుంది. దీనిని‘మిలీరియా పస్టులోసా అంటారు.

ఈ చెమటకాయలను నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద పెద్ద గడ్డలుగా మారే అవకాశం లేకపోలేదు. దీన్ని పెరిపొరైటిస్ స్టెఫిలోజిన్స్ అంటారు. సాధారణంగా చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చెమట పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే పగిలినట్టుగా అయిన స్వేద నాళిక ) పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొద్దిరోజులు పడుతుంది. చెమట పట్టకుండా ఆగిపోవడానికి ఇదే కారణం.

ఎవరికి వస్తాయి?

ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.

    చిన్నపిల్లలకు, పెద్దవారికి

    ఎండలో ఎక్కువగా తిరిగేవారికి,
    చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లిన వారికి,
    బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు ధరించేవారికి,
    జ్వరం వచ్చినవారికి,

చెమట పడితేనే చికాకుగా ఉంటుంది. అటువంటిది చెమటకాయలు వస్తే? చికాకు రెట్టింపు అవుతుంది. అంతేకాక ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని చేసినప్పటికీ చెమటకాయలు ఎక్కువ బాధిస్తుంటే మాత్రం చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.

ఏయే ప్రదేశాలు

    చెమటకాయలు శరీరం మీద చాలా భాగాలలో కనిపిస్తాయి. ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్ర్తాల ఒరిపిడి ఉండే చోట.
    పిల్లలలో - వీపు, మెడ, గజ్జలు, బాహుమూలాలలో. పెద్దవారిలో - మెడ, తల, వీపు, బాహుమూలాలలో

జాగ్రత్తలు

    కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు.
    చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి,
    వేడి వాతావరణం లోకి వెళ్లకూడదు,
    చల్లటి ప్రదేశాలు లేదా ఏసి ఉన్నచోట ఉండాలి,
    మందంగా ఉండి, శరీరాన్ని చుట్టేసేలాంటి వస్ర్తాలు ధరించకూడదు,
    బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి,
    సాధ్యమయినంతవరకు పల్చగా ఉండే నూలు వస్ర్తాలు ధరించాలి,
    సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    సన్‌స్క్రీన్ లోషనులు వాడాలి,
    పిల్లలు ఎండలో చెమటపట్టేలాంటి ఆటలు ఆడకూడదు,
    ఎక్కువ మంచినీరు తాగుతుండాలి.,

చికిత్స

ప్రిక్లీ హీట్ పౌడర్: ఈ పౌడర్‌లో డ్రయింగ్ మిల్క్ ప్రొటీన్, ట్రైక్లోజాన్, మెంథాల్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలోని మిల్క్‌ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.

    తరచు స్నానం, అంటే రోజుకి మూడు నాలుగు సార్లు చన్నీటి చేస్తుండాలి. సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    క్యాలమిన్‌ లోషన్‌ను వాడాలి.
    జింక్ ఆక్సైడ్ వాడటం మంచిది,
    నిపుణుడైన వైద్యుని సలహా పై, ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా
    ట్రోపికల్ యాంటీబయాటిక్స్ వాడాలి.

పైన చెప్పిన వాటిలో మొదటి రెండింటి (క్యాలమిన్ లోషన్, జింక్ ఆక్సైడ్) తో సమస్య తగ్గకపోతే, చర్మవ్యాధుల నిపుణుని (డెర్మటాలజిస్టు) సూచన మేరకు మాత్రమే (ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ యాంటీబయాటిక్స్) వాడాలి.

* కొన్నిసార్లు చుండ్రు కూడా నుదురు, బుగ్గల మీద చెమటకాయలు రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలి. దిండు కవర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై జుత్తు పడకుండా చూసుకోవటమే కాదు.. చెమటకాయలు ఉన్నచోట స్క్రబ్స్‌ అసలే ఉపయోగించరాదనీ గుర్తుంచుకోవాలి.

* జిడ్డుచర్మం గల కొందరు పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదు. దీంతో చర్మంలో పీహెచ్‌ స్థాయులు అస్తవ్యస్తమవుతాయి. అయితే వాతావరణం బాగా వేడిగా, తేమగా ఉన్నపుపడు మామూలు నీటితో ముఖాన్ని తరచుగా కడుక్కుంటే ఇబ్బందేమీ ఉండదు.

* ఉదయం, రాత్రి రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దూదితో చర్మం బిగుతుగా ఉండేందుకు దోహదం చేసే (ఆస్ట్రింజెట్‌) లోషన్‌ లేదా దోసకాయ రసం రాసుకొని.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

* చెమటకాయలు వచ్చినచోట గోళ్లతో గోకటం ఏమాత్రం మంచిదికాదు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. బాగా దురద పెడుతుంటే మూడొంతుల నీరు, ఒకవంతు వెనిగర్‌ను కలిపి, అందులో దూదిని ముంచి దద్దు వచ్చినచోట అద్దాలి. ఇది దురద తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో కొద్దిగా బైకార్బోనేట్‌ సోడాను కలిపి కడుక్కునా దురద తగ్గుతుంది. జిడ్డు కూడా తొలగిపోతుంది.

* గంధం అన్నిరకాల చర్మాలకీ బాగా పనిచేస్తుంది. ఇది మంచి యాంటీసెప్టిక్‌ మాత్రమే కాదు.. చర్మంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దురదనూ తగ్గిస్తుంది.

* గంధానికి కొద్దిగా రోజ్‌ వాటర్‌ను కలిపి ముద్దగా చేయాలి. దీన్ని చెమటకాయలు వచ్చినచోట అద్ది, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

* పిడికెడు వేప ఆకులు తీసుకొని నాలుగు కప్పుల నీటిలో వేసి సన్నటి మంట మీద గంటసేపు మరిగించాలి. దీన్ని రాత్రిపూట అలాగే వదిలేసి, తెల్లారాక ఆకులను వడగట్టి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను కూడా ముద్దగా నూరి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

* అయితే చెమటకాయలు, దురద తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించటం తప్పనిసరి.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 20, 2013

Age related problems and hints,వయసు తో వచ్చే చిక్కులకు సూచనలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Age related problems and hints,వయసు తో వచ్చే చిక్కులకు సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    నాలుగు పదుల వయసొచ్చిందంటే అనారోగ్య సూచనలు కనబడుతుంటాయి. 'వయసు పెరిగిపోతోందిలే...' అని సరిపెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.

*నిద్రపోయే ముందూ నిద్ర లేచాక కూడా చేయాల్సిన పనుల గురించి సతమతమయ్యే వారు చాలామందే. దీనివల్ల ఒరిగేదేమీ లేకపోయినా ఒత్తిడి పెరిగిపోతుంది. రక్తపోటు సమస్య ఇబ్బందిపెడుతుంది. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే ఉదయం కాసేపు వ్యాయామం చేయాలి. యోగాకు సమయం కేటాయించాలి. ఓ అరగంట మొక్కలకు నీళ్లుపెట్టడం, ప్రూనింగ్‌ చేయడం వంటి పనులు మనసుని తేలిక పరుస్తాయి. శరీరానికి చురుకుదనం వస్తుంది.

*పెరిగే వయసుని తెలిపేవి ముఖంపై ముడతలే. వయసు పెరిగే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. అందువల్లే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నీటి శాతం అధికంగా ఉండి చర్మాన్ని తాజాగా ఉంచే కీర, సొరకాయ, ఆకుపచ్చని ఆకు కూరల్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో మాంసకృత్తులు లభించే కోడి గుడ్డుని తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 15, 2013

Cirrhosis of Liver primary awareness ,సిర్రోసిస్ ఆఫ్ లివర్ ప్రాధమిక అవగాహన

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Cirrhosis of Liver primary awareness ,సిర్రోసిస్ ఆఫ్ లివర్ ప్రాధమిక అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కాలేయం విధులు :

అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారం జీర్ణం కావడంతో పాటు రక్తశుద్ధిలో తోడ్పడుతుంది. శక్తిని దాచి ఉంచి శరీరానికి అవసరమైనప్పుడు అందించడం -- దీని విధుల్లో ప్రధానమైనది. కాలేయ విధులను పరిశీలిస్తే... ఇది అనేక జీవరసాయనిక కర్మాగారంలా తోస్తుంది. మనం తీసుకునే ఆహారాలను పేగులే జీర్ణం చేస్తాయి. కానీ దాన్ని యథాతథంగా శరీర కణాలు స్వీకరించలేవు , ఉపయోగించుకోలేవు . ప్రతి ఆహారము కాలేయములో కొన్నిమార్పులు జరిగి మన శరీరము ఉపయోగించుకునే విధముగా తయారవుతుంది.  అలా జీర్ణమైన ఆహారాన్ని శరీర కణాలు తీసుకోగలగడానికి అనువుగా మార్చే ప్రక్రియలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. ఇవి  శక్తి సమతౌల్యాన్ని క్రమబద్దీకరించడంతో పాటు... రోగకారక క్రిములతో పోట్లాడటం హానికర విష పదార్థాలను వేరుపరచడం జీర్ణప్రక్రియకు తోడ్పడే బైల్ (పైత్యరసాన్ని)ను  ఉత్పత్తి చేయడం రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే (క్లాటింగ్ ఫ్యాక్టర్స్) పదార్థాలను తయారు చేయడం పోషకపదార్థాలను, విటమిన్లను నిల్వ చేయడం ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, క్లిష్టమైన కార్బోహైడ్రేట్ల తయారీ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వినియోగం అన్య పదార్థాల విసర్జన వంటి కార్యకలాపాల్లో ప్రధానపాత్ర వహిస్తుంది. అందువల్లనే కాలేయం పనితీరు / కాలేయ వ్యాధులను గుర్తించడానికి ఒక్క పరీక్ష సరిపోదు. ఇందుకు చేసే వేర్వేరు పరీక్షల సముదాయాన్ని ‘లివర్ ప్రొఫైల్’ అంటారు.

సిర్రోసిస్ ఆఫ్ లివర్



నిర్వచనము---    కాలేయానికి (లివర్ కు) దీర్ఝకాలిక వ్యాధులు సోకిన తరువాత కాలేయ కణాలు పనిచేయకపోవడం - తద్వారా కాలేయంలో కలుగు పరిణామాలను సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు.

కారణాలు


  •         దీర్ఝకాలిక లివర్ వ్యాధులు
  •         దీర్ఝకాలిక మధ్యం వాడకం
  •         హిపటైటిస్ - బి - ఇన్ ఫెక్షన్
  •         కొన్ని రకాల మందులు వాడకం
  •         వ్యాధి నిరోధక శక్తి లోపించుట
  •         పైత్యరస ప్రసరణలో అడ్డంకులు - వ్యాధులు


లక్షణాలు


  •         కడుపులో నీరు చేరుట,
  •         కాళ్లు చేతులు వాపు,
  •         వాంతిలో రక్తం పడుట,
  •         పచ్చ కామెర్లు,
  •         రక్త నాళాలు ఉబ్బడం,వంకర్లు తిరిగి ఉండటం,
  •         బరువు తగ్గడం,
  •         వాంతి అవుతున్నట్లు ఉండటం,
  •         ఆలోచనలలో తికమక,
  •         అలసి పోవడం,
  •         కొన్ని సందర్బాలలో మొలలు నుండి రక్తం కారుట,
  •         సంభోగంలో ఉత్సుకత లేకపోవుడం,
  •         పురుషత్వం కోల్పోవడం,
  •         మూత్ర విసర్జన తగ్గిపోవడం,
  •         మలము తెల్లగా రావడం,
  •         చిగుళ్ళలో , ముక్కులో రక్తం కారుట,
  •         సాధారణ జ్వరం,
  •         పురుషులలో స్ధనములు పెద్దగా వుండడం,


    పైన ఇవ్వబడిన లక్షణాలు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా వస్తుంటాయి.

పరీక్షలు


  •         కడుపును చేతులతో పరీక్ష చేసినపుడు కాలేయము (లివర్) పెద్దదిగా గుర్తించడం,
  •         కడుపులో నీరు నిండి ఉండి ఉబ్బరంగా వుండడం,
  •         కడుపు పై రక్త నాళాలు స్పష్టంగా కనపడటం,
  •         వృషణాలు చిన్నవిగా వుండడం,


    లాబ్ పరీక్షలు


  •         రక్త పరీక్ష - రక్త హీనతకొరకు, రక్తం గడ్డకట్టు కాలం కనుగొనుటకు,
  •         లివర్ ఎంజైములు పనితీరు కనుగొనుట,
  •         రక్తంలో బిలిరుబిన్ స్ధాయి కనుగొనుట,
  •         ‘x’రే పరీక్షలు,
  •         అల్ట్రాసౌండ్ స్కానింగ్
  •         ప్రత్యేకమైన సూది సహాయం తో లివర్ కణాలు తీసి పరీక్ష చేసిన వ్యాధి నిర్ధారించబడును.


నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు


  •  అధికంగా మద్యం సేవించరాదు,
  • రక్త నాళాల ద్వారా మందులు వాడకం తగ్గించాలి. హిపటైటిస్ బి మరియు హిపటైటిస్ సి నుండి రక్షణ పొందవచ్చు.
  • వ్యాధి నిరోధక టీకా ద్వారా హిపటైటిస్ బి వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
  • కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి
  • సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
  • సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు.
  • రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.


లివర్ వ్యాధులతో దాని కణాలకు జరిగే నష్టం ఎలా ఉంటుంది?
సిర్రోసిస్ : రోగ కారణంగా నష్టపడిన కాలేయ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే ఈ కణాలు సహజ ఆరోగ్య కాలేయ కణాలలా శక్తిమంతంగా పనిచేయవు.
అంతేకాదు... కాలేయంలోకి వచ్చే రక్తప్రసరణకు కూడా ఆటంకం కలిగిస్తాయి. కొత్త కాలేయ కణజాలం (స్కార్ టిష్యూ) పెరిగిన కొద్దీ కాలేయం సమర్థంగా తన విధులను నిర్వహించలేదు. ఈ స్థితినే సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ లక్షణాలు : ప్రాథమిక స్థితిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.

సిర్రోసిస్ పెరిగినకొద్దీ : తేలికగా రక్తస్రావం కావడం లేదా ముక్కు నుంచి రక్తం కారడం కాళ్లవాపు మందులకు తీవ్రంగా ప్రతిస్పందించడం సిరలలోనికి అదిక రక్తప్రసరణ జరిగి,
తద్వారా కాలేయంలోకి అధికంగా రక్తం ప్రవేశించడం ఈసోఫేగస్, జీర్ణాశయాలలోని సిరలు వ్యాకోచించడం సాధారణ లివర్ ద్వారా తొలగిపోవాల్సిన వ్యర్థ, హానికర పదార్థాలు
రక్తం ద్వారా మిగతా అవయవాలకు చేరి, వాటి పనికి ఆటంకం కలిగించడం. అరుదుగా ఈ సమస్యతో రోగి అపస్మారక స్థితి (హెపాటిక్ కోమా)లోకి కూడా వెళ్లిపోవచ్చు. సిర్రోసిస్‌తో బాధపడే రోగుల్లోని ఐదు శాతం మందికి కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

సిర్రోసిస్ ప్రాణాంతకమా? : సిర్రోసిస్ తీవ్రమైన కొద్దీ అది ప్రాణాంతకమే. ప్రారంభంలోనే గుర్తించి సాధారణ స్థితికి పునరుద్ధరించుకోకపోతే ఆధునిక వైద్య శాస్త్రప్రకారం కాలేయ
మార్పిడి శస్త్రచికిత్సే ఒక్కటే పరిష్కారం. అయితే కాలేయ మార్పిడి బాగా ఖర్చుతో కూడుకున్నది. దాత దొరకడం కూడా కష్టమే. అయితే అన్ని వేళలా ఇది సత్ఫలితాలను
ఇస్తుందని కూడా చెప్పలేం.

నివారణ :
సిర్రోసిస్ ని నివారించలేమా?...చాలా రకాల కాలేయ సంబంధిత వ్యాధులను చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. ప్రాథమిక స్థితిలోనే రోగ కారణం, రోగ స్థితిని గుర్తించి, అశ్రద్ధ చేయకుండా సకాలంలో చికిత్స తీసుకుంటే సిర్రోసిస్‌ను నివారించవచ్చు.

ఈ క్రింది వాటిని పాటించడము వలన సిర్రోసిస్ ని నివారింగలము  - రక్తంలోని ఎంజైముల పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కాలేయంలో వచ్చిన మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అప్పుడు... మద్యాన్ని పూర్తిగా మానేయాలి, కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 14, 2013

Deafness cause for decreased Mental Ability ,వినికిడిలోపంతో మేధోక్షీణత?

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Deafness cause for decreased Mental Ability ,వినికిడిలోపంతో మేధోక్షీణత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వినికిడిలోపం వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యే కావొచ్చు. కానీ దీంతో ఆలోచన, జాపకశక్తి సామర్థ్యాలూ తగ్గే అవకాశముందా? వినికిడి మామూలుగా ఉన్నవారితో పోలిస్తే వినికిడిలోపం గలవారిలో ఆలోచన సామర్థ్యం 30-40% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది, డెబ్బై ఏళ్లు పైబడినవారిలో మూడింట రెండొంతుల మంది వినికిడిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. అయినప్పటికీ ఇది వృద్ధాప్యంలో వచ్చే మామూలు సమస్యగానే భావిస్తూ చాలామంది చికిత్స తీసుకోవటం లేదు. వినికిడిలోపంతో ఇతరత్రా రకరకాల సమ్యలు వచ్చే అవకాశముందని గుర్తించటం అవసరం. వినికిడిలోపం గలవారికి మతిమరుపు (డిమెన్షియా) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గుతున్నట్టు తాజాగా తేలటమూ దీనినే నొక్కి చెబుతోంది. అదృష్టవశాత్తు వినికిడిలోపం గల చాలామందికి డిమెన్షియా రావటం లేదు గానీ కొంతకాలానికి ఎంతోకొంత విషయగ్రహణ లోపం ఏర్పడుతోందని అధ్యయన కర్త డాక్టర్‌ ఫ్రాంక్‌ లిన్‌ అంటున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించారు. వినికిడిలోపం గలవారిలో చాలావేగంగా మేధస్సు క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వినికిడిలోపం తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఆలోచన, జ్ఞాపకశక్తి మరింత వేగంగా తగ్గుతున్నట్టూ తేలటం గమనార్హం. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చని లిన్‌ చెబుతున్నారు. మన అంతర్‌ చెవిలోని కాక్లియా సంక్లిష్ట శబ్దాలను విద్యుత్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే సంకేతాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. అందువల్ల మెదడు వినటానికి, అర్థం చేసుకోవటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందని.. ఆ ప్రయత్నంలో ఆలోచన, జ్ఞాపకశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టటం తగ్గిపోతుందనేది ఒక భావన.

వినికిడి లోపంతో బాధపడేవారు నలుగురితో అంతగా కలవలేక ఒంటరిగా ఉండిపోవటం కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు మేధో క్షీణతకూ దోహదం చేస్తుండొచ్చనేది మరొక సిద్ధాంతం. మెదడులోని ఏదో ఒక ప్రక్రియ వినికిడి, మెదడు పనితీరు రెండింటినీ ప్రభావితం చేస్తుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా వినికిడిలోపంతో ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయన్నది మాత్రం తథ్యం. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

చాలాకాలం నుంచే..
నిజానికి వినికిడి సమస్య తీవ్రం కావటానికి 5-15 ఏళ్ల ముందు నుంచే రకరకాల ప్రభావాలు ఆరంభమవుతాయి. సాధారణంగా మన లోపలి చెవిలో సూక్ష్మమైన కేశాలు శబ్దాలకు కంపించి, మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఒకవేళ ఈ కేశాలు దెబ్బతింటే ఆ భాగంలో ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు సంకేతాలు సరిగా అందవు. ఫలితంగా కొన్ని స్థాయుల్లోని శబ్దాలు సరిగా వినవబడవు. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఆయా స్థాయుల్లోని శబ్దాల స్పందనలను అర్థం చేసుకోవటాన్ని మెదడు మరచిపోతుంది. దెబ్బతిన్న కేశ కణాలు తిరిగి కోలువకోవటమంటూ జరగదు. పెద్ద శబ్దాలతో వాటిని ప్రేరేపించినప్పటికీ మెదడు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు.

రకరకాల ఇబ్బందులు
వినికిడిలోపం రోజువారీ పనుల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. మాట్లాడటం కష్టంగా ఉండటం వల్ల ఒత్తిడి, చికాకు, నిరాశ వంటివి తలెత్తొచ్చు. ఇతరులు తమను చూసి గేలిచేస్తారనే భయం కలగొచ్చు. త్వరగా వృద్ధులమయ్యామని, వైకల్యం వచ్చిందనే భావనలో పడేయొచ్చు. నలుగురితో కలవలేక పోవటం వల్ల ఒంటరితనం.. వినటానికి ఎక్కువగా కష్టపడటం వల్ల శారీరకంగా అలసిపోవటం వంటివీ కనబడొచ్చు. వినికిడిలోపం గలవారికే కాదు వారితో సన్నిహితంగా మెలిగేవారికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వినికిడిలోపాన్ని తోసేసుకు తిరగకుండా తగు చికిత్స తీసుకోవటం మంచిది. వినికిడిలోపాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధునాతన పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించి అవసరమైతే వినికిడి యంత్రాలను వాడటం వల్ల ఇబ్బందులు దరిజేరకుండా చూసుకునే అవకాశం ఉది.

 courtesy with Eeanadu Telugu daily@సుఖీభవ,

   
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

MTP cum Abortion awareness,అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -MTP cum Abortion awareness,అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 
    అబార్షన్‌.. కొందరు అవాంఛిత గర్భాన్ని వద్దనుకోవడానికి చేయించుకుంటే.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి మరికొందరు. ఉన్నత చదువులూ, కెరీర్‌లో స్థిరపడాలనుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలూ... ఇలా కారణాలు ఏవయినా, అనుకోకుండా వచ్చే గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు  సమస్యల్నీ అంచనా వేసుకోవాలి. అవి ఇన్‌ఫెక్షన్ల నుంచి శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని కోల్పోయే దాకా ఉండొచ్చు.

కావాలనుకున్నప్పుడే తల్లయ్యేలా నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నా.. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలనుకునే స్త్రీలు.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి సమక్షంలో, ఏ పద్ధతిలో అబార్షన్‌ చేయించుకోవాలనేదీ ఎంటీపీ చట్టం తెలియజేస్తుంది. ఎందుకంటే.. సరైన పద్ధతుల్లో అబార్షన్‌ చేయించుకోని వాళ్లలో చాలామంది ఎన్నో సమస్యల్ని  ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు మరణిస్తున్నారు కూడా. అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు నాలుగు కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. అలా  చేయించుకునే వారిలో కొందరు జీవితకాలం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఏటా దాదాపు అరవై ఏడు వేలమంది కేవలం అబార్షన్ల వల్లే చనిపోతున్నారు. మన  దేశాన్ని మాత్రమే తీసుకుంటే ఏడాదికి ఒకటిన్నర కోట్ల అబార్షన్లు జరుగుతుంటే.. కోటి మంది ప్రమాదకర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకుంటున్నారు. దాంతో  అత్యధికంగా దాదాపు ఎనభై లక్షల మంది అబార్షన్ల వల్ల వచ్చే ఇతర సమస్యలతో జీవితాంతం బాధపడుతున్నారు. పదిహేను నుంచి ఇరవైవేల మంది మరణిస్తున్నారు.

గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికిగానీ, బిడ్డకు గానీ సమస్యలు ఎదురవుతాయి అనుకున్నప్పుడు అబార్షన్‌ చేయించుకోవాలి తప్ప.. అసలు అవాంఛిత గర్భాన్ని రాకుండా
చూసుకోవడమే మంచిది. ఒకవేళ వచ్చి అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నా దాన్ని కూడా సురక్షిత విధానంలోనే చేయించుకోవాలి.

సురక్షితమైన పద్ధతంటే..
అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నప్పుడు సొంతంగా తోచిన మాత్రల్ని వేసుకోకుండా మొట్టమొదటగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. దాన్ని కూడా అర్హత ఉన్న డాక్టర్‌ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. నెలల్ని బట్టి, ఇతర ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఏ పద్ధతిలో చేయించుకోవాలనేదీ డాక్టరే సూచిస్తారు. అలాగే గర్భస్రావం చేయించుకునే చోటూ, ఇతర పరిసరాలూ పరిశుభ్రంగా ఉండాలి. వాడే పనిముట్లన్నీ కూడా స్టెరిలైజేషన్‌ చేయాలి. అబార్షన్‌ చేస్తున్నప్పుడు ఆ స్త్రీకి అనుకోకుండా ఏదయినా సమస్య  ఎదురైతే మరో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లూ అందుబాటులో ఉండాలి. లాప్రోస్కోపీ, లాప్రోటమీ చేసి సమస్యను చక్కదిద్దే సౌకర్యం ఉన్న ఆస్పత్రినే ఎంచుకోవాలి.

వయసును బట్టి విధానం..
సాధారణంగా రెండు, మూడు నెలల లోపు చేయించుకోవచ్చు. ఒకవేళ ఇరవై వారాలు గడిచాక కూడా శిశువుకు ఏదయినా సమస్య ఉండి, అది తల్లి ప్రాణాలకు హాని  చేస్తుంది అనుకుంటే అప్పుడూ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం రెండో అభిప్రాయం కోసం మరో గైనకాలజిస్టు సలహా కూడా తీసుకోవడం చాలా అవసరం. ఇలా నెలల్ని బట్టి మందులు లేక శస్త్రచికిత్స పద్ధతిలో అబార్షన్‌ చేస్తారు. తొమ్మిది వారాల్లోపు అయితే మందులు వేసుకోవచ్చు. అయితే ముందు డాక్టర్‌ పరీక్ష చేసి  హిమోగ్లోబిన్‌ శాతం, ఇతరత్రా సమస్యలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి గర్భం గర్భాశయంలోనే ఉందా లేదా అన్నది తేల్చుకుంటారు. తప్పనిసరిగా డాక్టర్‌ సలహాతో ఆర్‌హెచ్‌  రక్తపరీక్ష కూడా చేయించుకోవాలి. ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అని వస్తే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో గర్భం (ఎక్టోపిక్‌  ప్రెగ్నెన్సీ) ఉన్నప్పుడు మాత్రల్ని వాడితే తల్లి ప్రాణాలకు ముప్పు రావచ్చు. కాబట్టి ఇవన్నీ పరిగణించే మందుల్ని ఎంత మోతాదులో ఇవ్వాలనేదీ వైద్యులు నిర్ణయిస్తారు.

వీటిని వేసుకోవడం సులువైనా కొన్ని సమస్యలు మాత్రం ఎదురవుతాయి. మాత్రల వల్ల నూటికి పది, పదిహేను శాతం మందిలో గర్భాశయంలో చిన్నచిన్న ముక్కలు  మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఎక్కువ రక్తస్రావం కావడం, నొప్పి లాంటి సమస్యలూ పెరుగుతాయి. దాంతో మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.  గర్భసంచిలో చిన్నచిన్న ముక్కలు మిగిలిపోయినప్పుడు అబార్షన్‌ పూర్తి కాదు కాబట్టి కొన్ని భాగాలకు చీము పడుతుంది. ఆ ఇన్‌ఫెక్షన్‌ కటివలయానికీ కూడా వ్యాపిస్తుంది.  ఆ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడానికి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. సమస్య ఉంటే వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో గర్భాశయాన్ని శుభ్రం చేస్తారు.

కొన్నిసార్లు గర్భాశయంలో రక్తం నిలిచి సంచిలా తయారవుతుంది. అలాంటప్పుడు ఆ రక్తాన్ని తొలగించి గర్భసంచిని శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే  ... మరికొన్నిసార్లు ఫెల్లోపియన్‌ ట్యూబులు, పొట్ట, కటివలయం, అండాశయాల్లాంటి భాగాలకు కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించవచ్చు. దాంతో ఆ భాగాల్లో చీము పడుతుంది.  ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫెల్లోపియన్‌ ట్యూబులు మూసుకోవడం వల్ల ఆ తరవాత గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు శాశ్వతంగా పిల్లల్ని కనే అవకాశాన్నీ కోల్పోవచ్చు. ఆ ఇన్‌ఫెక్షన్‌ దీర్ఘకాలికంగా కొనసాగి (క్రానిక్‌ పీఐడీ) జీవితాంతం సమస్యలు వేధించవచ్చు. ముఖ్యంగా విపరీతమైన పొత్తికడుపు నొప్పి, వైట్‌ డిశ్ఛార్జి, కలయిక సమయంలో నొప్పి.. నెలసరి తరచుగా, ఎక్కువగా అవుతుండటం లాంటివి బాధిస్తాయి.

శస్త్రచికిత్స: దీన్ని వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో చేస్తారు. జననేంద్రియ భాగం నుంచి సన్నటి ట్యూబ్‌ లాంటిదాన్ని ప్రవేశపెట్టి నెగెటివ్‌ ప్రెషర్‌తో గర్భాన్ని తొలగిస్తారు. దీనివల్ల ఎదురయ్యే నొప్పిని నివారించేందుకు మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స చేసిన రోజే  ఇంటికెళ్లిపోవచ్చు. అదే నెలలు గడిచేకొద్దీ దీన్ని చేయడం కూడా కష్టం అవుతుంది. గర్భాశయ ద్వారం తెరుచుకోవడానికి మందులు వాడి ఆ తరవాత చేయాల్సి రావచ్చు. ఇది కూడా కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే అబార్షన్‌ని  సురక్షితమైన పద్ధతుల్లో చేయించుకున్నా కూడా రెండు లక్షలమందిలో ఒకరికి దానివల్ల సమస్య తప్పదు.  

ప్రమాదకరం...
శస్త్రచికిత్స ద్వారా అబార్షన్‌ చేసేటప్పుడు అరుదుగా గర్భాశయం చిల్లులు పడి, విపరీతమైన రక్తస్రావం కావచ్చు. అలా జరిగినప్పుడు నెగెటివ్‌ ప్రెజర్‌ వల్ల గర్భసంచికీ, పేగులకీ, మూత్రాశయానికీ చిల్లులు పడే ప్రమాదం కూడా ఉంది. అలాంటివి నిర్థరించడానికి మళ్లీ లాపరోస్కోపీ చేయాల్సి ఉంటుంది. చిల్లులు పడిన చోట మళ్లీ కుట్లు వేయాలి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. నలభై ఏళ్ల క్రితం సెప్టిక్‌ అబార్షన్లు ఎక్కువగా ఉండేవి. అంటే సరైన సదుపాయాల్లేని చోట్ల ఎవరితో పడితే వాళ్లతో గర్భస్రావం చేయించుకోవడం అన్నమాట. దాంతో సెప్టిక్‌ షాక్‌ సిండ్రోమ్‌ సమస్యతో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే వాళ్లు. మరీ అంతటి సమస్యలు రావు కానీ సొంతంగా  మాత్రలు వేసుకోవడం, రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల అధికరక్తస్రావం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ తప్పవు. వాటి బారిన పడకుండా ఉండాలంటే, గర్భనిరోధక  సాధనాలు వాడుతూ అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యంగా ఉంటూ, అబార్షన్‌ అవకాశం ఉంది కదా అనుకోకూడదు.

-courtesy with Dr.Y.Savithadevi@Eenadu vasundara
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 9, 2013

Mental ability dicreases with defective hearing, వినికిడిలోపంతో మేధోక్షీణత?

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Mental ability dicreases with defective hearing, వినికిడిలోపంతో మేధోక్షీణత?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వినికిడిలోపం వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యే కావొచ్చు. కానీ దీంతో ఆలోచన, జాపకశక్తి సామర్థ్యాలూ తగ్గే అవకాశముందా? వినికిడి మామూలుగా ఉన్నవారితో పోలిస్తే వినికిడిలోపం గలవారిలో ఆలోచన సామర్థ్యం 30-40% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది, డెబ్బై ఏళ్లు పైబడినవారిలో మూడింట రెండొంతుల మంది వినికిడిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. అయినప్పటికీ ఇది వృద్ధాప్యంలో వచ్చే మామూలు సమస్యగానే భావిస్తూ చాలామంది చికిత్స తీసుకోవటం లేదు. వినికిడిలోపంతో ఇతరత్రా రకరకాల సమ్యలు వచ్చే అవకాశముందని గుర్తించటం అవసరం. వినికిడిలోపం గలవారికి మతిమరుపు (డిమెన్షియా) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గుతున్నట్టు తాజాగా తేలటమూ దీనినే నొక్కి చెబుతోంది. అదృష్టవశాత్తు వినికిడిలోపం గల చాలామందికి డిమెన్షియా రావటం లేదు గానీ కొంతకాలానికి ఎంతోకొంత విషయగ్రహణ లోపం ఏర్పడుతోందని అధ్యయన కర్త డాక్టర్‌ ఫ్రాంక్‌ లిన్‌ అంటున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించారు. వినికిడిలోపం గలవారిలో చాలావేగంగా మేధస్సు క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వినికిడిలోపం తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఆలోచన, జ్ఞాపకశక్తి మరింత వేగంగా తగ్గుతున్నట్టూ తేలటం గమనార్హం. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చని లిన్‌ చెబుతున్నారు. మన అంతర్‌ చెవిలోని కాక్లియా సంక్లిష్ట శబ్దాలను విద్యుత్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే సంకేతాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. అందువల్ల మెదడు వినటానికి, అర్థం చేసుకోవటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందని.. ఆ ప్రయత్నంలో ఆలోచన, జ్ఞాపకశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టటం తగ్గిపోతుందనేది ఒక భావన.

వినికిడి లోపంతో బాధపడేవారు నలుగురితో అంతగా కలవలేక ఒంటరిగా ఉండిపోవటం కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు మేధో క్షీణతకూ దోహదం చేస్తుండొచ్చనేది మరొక సిద్ధాంతం. మెదడులోని ఏదో ఒక ప్రక్రియ వినికిడి, మెదడు పనితీరు రెండింటినీ ప్రభావితం చేస్తుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా వినికిడిలోపంతో ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయన్నది మాత్రం తథ్యం. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

చాలాకాలం నుంచే..
నిజానికి వినికిడి సమస్య తీవ్రం కావటానికి 5-15 ఏళ్ల ముందు నుంచే రకరకాల ప్రభావాలు ఆరంభమవుతాయి. సాధారణంగా మన లోపలి చెవిలో సూక్ష్మమైన కేశాలు శబ్దాలకు కంపించి, మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఒకవేళ ఈ కేశాలు దెబ్బతింటే ఆ భాగంలో ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు సంకేతాలు సరిగా అందవు. ఫలితంగా కొన్ని స్థాయుల్లోని శబ్దాలు సరిగా వినవబడవు. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఆయా స్థాయుల్లోని శబ్దాల స్పందనలను అర్థం చేసుకోవటాన్ని మెదడు మరచిపోతుంది. దెబ్బతిన్న కేశ కణాలు తిరిగి కోలువకోవటమంటూ జరగదు. పెద్ద శబ్దాలతో వాటిని ప్రేరేపించినప్పటికీ మెదడు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు.

రకరకాల ఇబ్బందులు
వినికిడిలోపం రోజువారీ పనుల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. మాట్లాడటం కష్టంగా ఉండటం వల్ల ఒత్తిడి, చికాకు, నిరాశ వంటివి తలెత్తొచ్చు. ఇతరులు తమను చూసి గేలిచేస్తారనే భయం కలగొచ్చు. త్వరగా వృద్ధులమయ్యామని, వైకల్యం వచ్చిందనే భావనలో పడేయొచ్చు. నలుగురితో కలవలేక పోవటం వల్ల ఒంటరితనం.. వినటానికి ఎక్కువగా కష్టపడటం వల్ల శారీరకంగా అలసిపోవటం వంటివీ కనబడొచ్చు. వినికిడిలోపం గలవారికే కాదు వారితో సన్నిహితంగా మెలిగేవారికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వినికిడిలోపాన్ని తోసేసుకు తిరగకుండా తగు చికిత్స తీసుకోవటం మంచిది. వినికిడిలోపాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధునాతన పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించి అవసరమైతే వినికిడి యంత్రాలను వాడటం వల్ల ఇబ్బందులు దరిజేరకుండా చూసుకునే అవకాశం ఉది.

  • Courtesy with Dr. Ramakrishna ENT@Eenadu sukhibhava
 
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 8, 2013

Thalassemia disease,తలసీమియా వ్యాధి

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Thalassemia disease,తలసీమియా వ్యాధి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


   తలసీమియా వ్యాధి - మే 8న ప్రపంచ తలసీమియా దినం.

రక్తం కావాలి. అదీ ఒకసారో రెండుసార్లో కాదు. ఏడాదో రెండేళ్లో కాదు - జీవితాంతం!
తలసీమియా - జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి ... దురదృష్టం ఏమిటంటే, ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసీమియా జన్యు వాహకులైన తల్లిదండ్రులకు (తలసీమియా మైనర్‌) జన్మించే బిడ్డల్లో పాతికశాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్థులయ్యే (తలసీమియా మేజర్‌) అవకాశం ఉంది. మిగతా పాతికశాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. మరో యాభైశాతం కేవలం వాహకులుగానే (తలసీమియా మైనర్‌) మిగిలిపోవచ్చు. వీరికి పెద్దగా సమస్యలు ఉండవు కానీ, మరో వాహకుడి ద్వారానో వాహకురాలి ద్వారానో కలిగే సంతానానికి మాత్రం తలసీమియా వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసీమియా వాహకులు ఉన్నారు.

తలసీమియా ప్రభావం రక్తంపై పడుతుంది. నేరుగా హిమోగ్లోబిన్‌ మీద ఉంటుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును, రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. తలసీమియా రోగుల్లో...శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. తయారైనా, ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా, హిమోగ్లోబిన్‌ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ, కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే...ప్రాణాంతకమే! ఏటా దేశంలో పన్నెండువేల మంది చిన్నారులు తలసీమియాతో పుడుతున్నారనీ అందులో వేయిమంది మన రాష్ట్రంలోనే పుడుతున్నారనీ ఒక అంచనా. ఈ లెక్కలూ అర్ధసత్యాలే. కనీస వైద్యం కూడా కరవైన మారుమూల ప్రాంతాల్లో...ఎవరు రోగనిర్ధారణ చేస్తారు? వైద్యులకే అవగాహనలేని పరిస్థితుల్లో...ఎవరు చికిత్స అందిస్తారు? జ్వరమనో, విరేచనాలనో, పోషక విలువల లోపమనో... ఆ సమస్యకు ముద్రవేస్తారు. ఏడాది తర్వాతో, రెండేళ్ల తర్వాతో బిడ్డ ప్రాణాలు పోతే, భూమ్మీద నూకలు చెల్లాయని నిర్వేదంగా ఓ నిట్టూర్పు విడుస్తారు. అదేగా జరుగుతున్నది. మాయదారి జబ్బు ఎంతమంది చిన్నారుల్ని బలితీసుకుంటోందో! రక్తం అందక ఎంతమంది పసిమొగ్గలు మాడిమసైపోతున్నారో! ఎన్ని కుటుంబాల్లో కడుపుకోత మిగుల్తోందో! కచ్చితమైన లెక్కలు తీస్తేకానీ తలసీమియా ఉగ్రరూపమేమిటో తెలియదు.


 తలసీమియా రోగులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. మరో దార్లేదు. తలసీమియా రోగులకు తప్పనిసరైన 'సెలైన్‌ వాష్డ్‌ రక్తం' హైదరాబాద్‌లోనే ఉచితంగా దొరుకుతుంది మరి ఉన్నవారి సంగతి సరే. నిరుపేదల పరిస్థితేమిటి? పనులు వదులుకుని పట్టణాల చుట్టూ తిరగడం ఎలా సాధ్యం? రక్తం వరకూ హైదరాబాద్‌లోని తలసీమియా సొసైటీ సమకూరుస్తుందని ధైర్యంగా ఉన్నా, నెలనెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్‌ ఫిల్టర్స్‌ వాడాలి. క్రమం తప్పకుండా దంత పరీక్షలూ గుండె పరీక్షలూ మూత్రపిండాల పరీక్షలూ కాల్షియం, ఫాస్పరస్‌ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తూ ఉండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే, ఏదో ఓ మాయదారి రోగం ముసురుకుంటుంది. తలసీమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నెలకు ఐదు నుంచి పదివేల దాకా మందులకే ఖర్చవుతుంది. 'ఒకవైపు ఇద్దరు పిల్లల చదువులు, ఇంకోవైపు వీడి వైద్యం - నెలనెలా ఎంతోకొంత అప్పు చేయక తప్పడం లేదు' అని బాధపడతాడు ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తున్న రాజు. అలా అని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశమూ లేదు. ఎవరో ఒకరు తలసీమియా చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాలి. సాధారణంగా బిడ్డ బాధ్యత అమ్మలే తీసుకుంటారు. ఆర్థిక భారాన్ని నాన్నలు నెత్తినేసుకుంటారు. ఆడుతూపాడుతూ బడికెళ్లాల్సిన వయసులో ఆసుపత్రుల చుట్టూ తిరగడమేమిటంటూ...బంధువుల నుంచీ ఇరుగుపొరుగు నుంచీ ఒత్తిళ్లు. ఏవేవో గుసగుసలు. ఆ మాటల తూటాలు ముందుగా తాకేది కన్నతల్లినే. జన్యు సమస్య భార్యాభర్తలు ఇద్దర్లోనూ ఉన్నా...మగవాడిని వేలెత్తిచూపే సాహసం ఎవరికుంది? లోపమంతా ఆమెదే అన్నట్టు మాట్లాడతారు. అయినా, మౌనంగా భరించాల్సిందే. కొడుక్కి రెండోపెళ్లి చేస్తామంటూ ఇల్లాలిపై ఒత్తిడి తెచ్చే అత్తమామలూ ఉన్నారు. బిడ్డ పరిస్థితికి బాధపడాలో, బంధువుల అజ్ఞానానికి సిగ్గుపడాలో - తోచని దుస్థితి. అర్థంచేసుకునే భర్త ఉంటే, కొంతలో కొంత నయం. లేదంటే నరకమే. అలాంటి పరిస్థితుల్లోనూ కుమిలిపోతూ కూర్చోడానికి వీల్లేదు. పసివాడి వైద్యం కోసం పరుగులు తీయాల్సిందే. ఎన్ని అవరోధాలు ఎదురైనా, రక్తం పంచుకు పుట్టినవాడికి రక్తాన్ని సమకూర్చాల్సిందే. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు, మొదటి బిడ్డో రెండో బిడ్డో పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయినప్పుడు...సమీప బంధువులు తలసీమియా పసివాడి పట్ల వివక్ష చూపుతున్న దాఖలాలూ లేకపోలేదు. కన్నవారికి ఆ ఆలోచన లేకపోయినా, తాతయ్యలూ నానమ్మలూ మేనత్తలూ బాబాయిలూ తదితర బంధుగణం మాత్రం - ఆ పసివాడితోనో పసిదానితోనో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఉదంతాలూ అనేకం. నేడో రేపో మరణం ఖాయమన్నట్టు మాట్లాడుతున్న సంఘటనలూ అనేకం. ఆడపిల్లల విషయంలో అయితే ఈ వివక్ష మరీ ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో అమ్మ పాత్రే కీలకం. పసివాళ్లకు ఆ తేడా అర్థం కాకుండా జాగ్రత్తపడాలి. గుండెల్లో ధైర్యం నింపాలి. జీవితంమీద ప్రేమ కల్పించాలి.

ఎదిగేకొద్దీ...

తలసీమియా - అంటే గ్రీకుభాషలో సముద్రం. నిజంగానే సముద్రంలా అంతులేని సమస్య ఇది. సముద్రంలా ఆటుపోట్లతో కూడిన వ్యాధి ఇది. తలసీమియా పిల్లల జీవితాలు పౌర్ణమి-అమావాస్యల్ని తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు...బిడ్డ పున్నమి చంద్రుడే. కళకళలాడుతుంటాడు. హుషారుగా కనిపిస్తాడు. రక్తం తగ్గిపోయేకొద్దీ... అమాస చంద్రుడిలా నీరసించిపోతాడు. నిన్నమొన్నటిదాకా అవలీలగా మోసుకెళ్లిన పుస్తకాల సంచి కూడా కొండలా బరువెక్కినట్టు అనిపిస్తుంది. అడుగేస్తే ఆయాసం. అంతులేని నీరసం. జీర్ణశక్తి మందగిస్తుంది. పొట్ట లావెక్కుతుంది. ఎముకల్లో పటుత్వం సన్నగిల్లుతుంది. తనలో ఏదో లోపం ఉందన్న సంగతి మెల్లమెల్లగా అర్థమవుతుంది. 'చెల్లికెందుకు నాలా రక్తం ఎక్కించరు?', 'తమ్ముడెందుకు మాత్రలు వేసుకోడు?' ... ఇలా రకరకాల సందేహాలు. భోజనం విషయంలోనూ పరిమితులు. అందర్లా అన్నీ పెట్టకూడదు. ప్రొటీన్లూ కేలరీలూ పుష్కలంగా ఉండాలి. ఐరన్‌ అతి తక్కువగా ఉండాలి. 'అదెందుకు తినకూడదు, ఇదెందుకు తినకూడదు...' అన్న ప్రశ్నలొకటి. సమాధానాలు చెప్పలేక కన్నతల్లి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వైద్య పరీక్షల కోసం, రక్తం కోసం తరచూ ఏ హైదరాబాద్‌కో వెళ్లాల్సి రావడంతో...బడికి గైరు హాజరు తప్పదు. చదువుల్లో వెనుకబాటూ తప్పదు. మిగతా పిల్లలతో పోలిస్తే శారీరక ఎదుగుదల కూడా తక్కువే. దీంతో ఎక్కడలేని ఆత్మన్యూనతాభావం. సమూహాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఏ కంప్యూటర్‌ ముందో కాలక్షేపం చేస్తుంటారు. పెద్దయ్యేకొద్దీ అంతర్ముఖులుగా మారతారు.
తలసీమియా ఒంటరిగా రాదు. వస్తూవస్తూ అచ్చంగా తనలాంటి రాకాసి మూకనే వెంటబెట్టుకుని వస్తుంది. రక్తంతోపాటు శరీరంలోకి వెళ్లే ఇనుము - మూత్రపిండాలు, కాలేయం, మెదడు...ఇలా ఏదో ఓచోట పోగుపడిపోతుంది. దీంతో ఆ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. తరచూ ఎక్కించే రక్తంలో...ఏ హెచ్‌ఐవీ క్రిములో ఉంటే...మరో గండం! మధుమేహ పీడితులూ అధిక రక్తపోటు బాధితులూ ఇచ్చిన రక్తమైతే ఇంకేవో సమస్యలు. దాత రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే మరో ఇబ్బంది. ఉన్న రుగ్మతకు తోడు కొత్త రోగాలు. నిజానికి, పక్షానికోసారి జీవన్మరణ పోరాటమే! ఇన్ని గండాల్ని దాటేస్తూ... కౌమారానికి వచ్చేసరికి తలసీమియా పిల్లల్లో ఓరకమైన నైరాశ్యం కమ్మేస్తుంది. లోపాలు శాపాల్లా అనిపిస్తాయి. ఒకరిద్దరు ఆత్మహత్య దిశగానూ ఆలోచిస్తారు. పరిమితుల్ని అర్థంచేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఆశావాదంతో జీవించేవారూ ఉన్నారు. పెద్దచదువులు చదువుకుంటున్నవారూ ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ తక్కువేం కాదు. ఈ పిల్లలు ఎంతకాలం జీవిస్తారనడానికి...కచ్చితమైన కొలమానమేం లేదు. శరీర వ్యవస్థ సహకరించినంత కాలం, రక్తమూ మందులూ అందుతున్నంతకాలం, వైద్య పర్యవేక్షణ కొనసాగుతున్నంత కాలం... సవాళ్లను అధిగమిస్తూ బతుకుబండి నడిపిస్తారు.

'మా పిల్లలకు మేం, ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకు నిలబడే ధైర్యాన్ని నూరిపోస్తాం' అంటారు హైదరాబాద్‌లోని తలసీమియా సొసైటీ ప్రతినిధి రత్నావళి. దాదాపు ఇరవై ఏళ్లు తలసీమియాతో పోరాటం సాగించి... ఒకానొకరోజు అమ్మ ఒడిలో ప్రశాంతంగా కన్నుమూసిన రోహిత్‌ అనే కుర్రాడి తల్లి ఆమె. అప్పటికి, తలసీమియా అన్న మాటను ఎలా ఉచ్చరించాలో కూడా తెలియని అజ్ఞానం. చాలామంది డాక్టర్లకు అదో వ్యాధిపేరో మందుపేరో కూడా తెలియని రోజులవి. గడపగడపకూ వెళ్లి 'అమ్మా! నా బిడ్డకు రక్తదానం చేయండి...' అంటూ కొంగుచాచి అభ్యర్థించిన సందర్భాలెన్నో. ఆ కష్టం మరొకరికి రాకూడదన్న ఉద్దేశంతో తనలాంటి మాతృమూర్తుల్ని కలుపుకుని తలసీమియా సొసైటీని స్థాపించారు రత్నావళి. ఆ ఉద్యమంలో తొలి కార్యకర్త రోహిత్‌. అవగాహన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 'ఏం ఫర్వాలేదు. మీ పిల్లలకేం కాదు. నాకూ తలసీమియా ఉంది. అయినా చురుగ్గాలేనూ' అంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేవాడు. స్నేహితుల్ని ప్రోత్సహించి రక్తదానం చేయించేవాడు. సొసైటీ వెబ్‌సైట్‌ రూపకల్పనలోనూ పాలుపంచుకునేవాడు. మృత్యువు ఆ కుర్రాడి జీవితాన్ని చిదిమేయగలిగింది కాని, ఆశయాల్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడా సంస్థ రెండువేలమంది పిల్లలకు అండగా నిలుస్తోంది. ఉచితంగా రక్తాన్ని అందిస్తోంది, వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. తగ్గింపు ధరలకు మందులు ఇస్తోంది. పిల్లల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతోంది.
బాధ్యులెవరు...
అభంశుభం తెలియని పిల్లలకు అన్ని కష్టాలెందుకు? ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసులో సూదుల గాయాలేమిటి? పాలసీసాల ప్రాయంలో రక్తం ప్యాకెట్ల అవసరమేం వచ్చింది?...తరచి చూస్తే, నిజాయతీగా ఆలోచిస్తే - ఆ పాపం మనదే. మొత్తంగా సమాజానిదే. నిశ్చితార్థానికి ముందు వధూవరులు కంప్లీట్‌ బ్లడ్‌కౌంట్‌ (సీబీసీ), హెచ్‌బిఏ2 లెవెల్‌ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఇద్దర్లో కనీసం ఒక్కరైనా తలసీమియా వాహకులు కాదని తేలితే, నిరభ్యంతరంగా ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇద్దరూ వాహకులైతే... బిడ్డకు తలసీమియా వచ్చే అవకాశాలు యాభైశాతం. పసిగుడ్డు కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణకు వీలుంది. కనీసం ఇప్పుడైనా, పుట్టబోయే బిడ్డ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఓ ప్రాణికి అసంపూర్ణమైన, అనారోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే అధికారం ఎవరికీ లేదు - కన్నవారికైనా, చివరికి దేవుడికైనా!

నగలు కొనడానికి చెన్నై వెళ్తారు. పట్టుచీరల కోసం కంచికి ప్రయాణం అవుతారు. పెళ్లికార్డుల నుంచి విందు భోజనాల దాకా...ప్రతిదాని గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, తలసీమియా పరీక్ష విషయానికొచ్చేసరికి ... చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాలామందికి అదేమిటో కూడా తెలియదు. కుటుంబ వైద్యులు కూడా చెప్పరు. రక్త సంబంధీకుల్లో తలసీమియా లక్షణాలు ఉన్నాయంటే మరింత జాగ్రత్తపడాలి. బంధుమిత్రుల్లో అవగాహన కల్పించబోతే సంధ్యకు చివాట్లే మిగుల్తున్నాయి. 'నా బిడ్డ తలసీమియా బారినపడ్డాక ...మా దగ్గరి బంధువులందరికీ చెబుతున్నా పెళ్లికి ముందు పరీక్షలు చేయించుకోమని. ఎవరూ నామాట వినడం లేదు. అందరి బిడ్డలూ నీ బిడ్డలా పుడతారని ఎందుకు అనుకుంటావ్‌. అయినా, శుభమా అని పెళ్లి జరుగుతుంటే అపశకునపు మాటలేమిటి - అంటూ మందలించినవారే ఎక్కువ' అని వాపోతారామె. కొందరు తల్లిదండ్రులైతే తొలిచూలు బిడ్డ తలసీమియాతో బాధపడుతున్నా కూడా, ఎలాంటి వైద్యపరమైన జాగ్రత్తలూ తీసుకోకుండా రెండో బిడ్డనూ కంటున్నారు. యాభైశాతం సందర్భాల్లో ఇద్దరు పిల్లలూ తలసీమియా బాధితులే అవుతున్నారు. పలాస ప్రాంతానికి చెందిన తిలోత్తమకు ఇద్దరు పిల్లలు. తొలిబిడ్డ తలసీమియా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. రెండోబిడ్డకూ అదే సమస్య. పసివాడికి రక్తం అందించడానికి ఆమె హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నిజానికి, మొదటి బిడ్డ అనారోగ్యం పాలైనప్పుడు...అది తలసీమియా అన్న సంగతి ఆమెకు తెలియదు. వైద్యులూ గుర్తించలేకపోయారు. అప్పటికే ఒక తలసీమియా బిడ్డ ఉన్నప్పుడు రెండో సంతానం విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వైద్యుల పర్యవేక్షణలోనే ఆ నిర్ణయం జరగాలి. లేదంటే, తెలిసితెలిసీ మరో అమాయక ప్రాణిని ఆ రాకాసి రోగానికి బలిచ్చినవాళ్లం అవుతాం.

ఇప్పటిదాకా తలసీమియా రోగులకు అందుబాటులో ఉన్న ఒకే ఒక శస్త్రచికిత్స... ఎముక మూలుగ మార్పిడి. అందుకు, పది నుంచి పదిహేను లక్షల దాకా ఖర్చవుతుంది. రక్తసంబంధీకుల్లోంచి మూలుగ దాత అవసరం అవుతారు. చికిత్స విజయావకాశాలు ఎనభైశాతం. బిడ్డను కాపాడుకోవాలన్న తపన ఉన్నా, సామాన్యులు ఇంత ఖర్చు భరించలేరు. 'ఆరోగ్యశ్రీ' జాబితాలో తలసీమియా పేరు ఉన్నా లేనట్టే. రకరకాల నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. వైద్యుల అవగాహనాలేమి మరో సమస్య. నిబంధనల్ని మార్చాలంటూ ఎన్ని విజ్ఞాపనలు అందినా పాలకులు స్పందించడం లేదు. కనీసం, తలసీమియా రోగులకు అవసరమైన ఔషధాల విషయంలో అయినా రాయితీలు ఇవ్వడంలేదు. సొంత గల్లాపెట్టెలోంచి తీసివ్వాల్సిన పన్లేదు. ప్రజల సొమ్మును, ప్రజల కోసం ఖర్చుపెట్టడానికి ఇన్ని అడ్డంకులా? ఈ నిర్లక్ష్యం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ప్రతి మనిషికీ ఆరోగ్యంగా జీవించే హక్కుంది. దాన్ని కాలరాస్తే...నైతికనేరమే! మంత్రులైనా ముఖ్యమంత్రులైనా - పసివాళ్ల న్యాయస్థానంలో ప్రథమ ముద్దాయిలుగా నిలబడాల్సిందే.
మేమున్నాం..
మనసుంటే మార్గం ఉంటుంది. తలసీమియా చిన్నారులకు అండగా నిలబడటానికి ఎన్నో అవకాశాలు.

రక్తదాతలుగా...

తలసీమియా పిల్లలకు రక్తమే పెద్ద సమస్య. ప్రతి పసివాడికీ ఏడాదికి పాతిక ఇరవైమంది రక్తదాతల సహకారం అవసరం. రక్తదానం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. పరిపూర్ణ ఆరోగ్యవంతులు నిరభ్యంతరంగా దానం చేయవచ్చు.

దత్తత తీసుకుని...

ఒక్క తలసీమియా సొసైటీలోనే రెండువేలమంది పిల్లలున్నారు. చాలావరకూ పేదలే. రక్తం సమకూర్చలేకా, తగ్గింపు ధరలకు మందులు ఇవ్వలేకా...ఆ సంస్థ సతమతమవుతోంది. ప్రతి పసివాడిపై నెలకు ఐదు నుంచి పదివేల దాకా ఖర్చు అవుతోంది. వ్యక్తిగతంగానో బృందంగానో ఓ చిన్నారి బాధ్యత తీసుకోవచ్చు.

స్వచ్ఛంద సేవ

హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ తదితర నగరాల్లో అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలున్నాయి. ఆయా సంస్థల సహకారంతో తలసీమియా రోగుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించవచ్చు. పాఠశాలల్లో, కళాశాలల్లో, కాలనీ సంఘాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టవచ్చు.

జిల్లాల్లో...

ఇప్పటికీ వివిధ జిల్లా కేంద్రాల్లో తలసీమియా చిన్నారులకు రక్తం ఎక్కించడానికి తగిన సౌకర్యాల్లేవు. సాధారణ పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. దీంతో అనేక దుష్పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికారులూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తలసీమియా చిన్నారుల కోసం ప్రత్యేక బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేయవచ్చు.

చట్టపరంగా...

తలసీమియా పిల్లల హక్కుల కోసం పోరాటం సాగించవచ్చు. మానవ హక్కుల కమిషన్‌, సమాచారహక్కు చట్టం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం...తదితర మార్గాలను ఎంచుకోవచ్చు. స్థానికంగా తలసీమియా సంఘాన్ని ఏర్పాటు చేసి...బాధితుల్ని ఒకే తాటిపై తీసుకురావచ్చు.

వ్యవస్థ కదలాలి

రత్నావళి వంటి అమ్మలూ డాక్టర్‌ సుమన్‌జైన్‌ వంటి వైద్యులూ మరికొందరు సంఘసేవకులూ కలిసి 1998లో హైదరాబాద్‌లో తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీని స్థాపించారు. ఐదారుగురితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు... రెండువేలమంది పిల్లలకు అండగా నిలుస్తోంది. ప్రత్యేకంగా బ్లడ్‌బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. పాతబస్తీలో సంస్థ కార్యాలయం ఉంది. ''ఒక స్వచ్ఛంద సంస్థగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వపరంగా జరగాల్సింది చాలా ఉంది. ప్రజల్లో అవగాహన పెరగాలి. మరింత ప్రచారం జరగాలి. మండలస్థాయి వైద్యశాలల్లోనూ తలసీమియా పరీక్షా కేంద్రాలు ప్రారంభించాలి. ప్రతి ప్రభుత్వ ప్రకటన కిందా .. 'మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది..ఈరోజే తలసీమియా పరీక్ష చేయించండి' అన్న నినాదం జోడించాలి. దీనివల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. తలసీమియాను ప్రభుత్వం శారీరక వైకల్యంగా గుర్తిస్తే... ఆ చిన్నారులకు అన్నివిధాలా ఆసరా దొరుకుతుంది'' అంటారు సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ సుమన్‌జైన్‌-- (తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీ వెబ్‌సైట్‌: www.tscs.in ).

Courtesy with Eenadu Newspaper @ Sukhibhava

  • ===========================
 Visit my website - > Dr.Seshagirirao.com/