Saturday, July 6, 2013

Doctors life and problems, జీవితములో వైద్య లు పడుతున్న ఇబ్బందులు

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పొద్దున లేపడం దగ్గర్నుంచి గోరుముద్దలు తినిపించి, జోలపాడి పడుకోబెట్టే అమ్మ... దగ్గరుండి ఆటలాడి, సరదాగా సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లే నాన్న.. ఏ పిల్లలకైనా ఇవి సాధారణ కోరికలు. ఈ పనులన్నీ చేయాలన్న ఆశ తల్లిదంవూడులది కూడా. కుటుంబానికి ప్రేమపునాది వేసే ఈ చిన్న చిన్న విషయాలే కొంతమంది జీవితాల్లో అరుదైన బహుమతులవుతాయి. అలాంటి కుటుంబాల్లో ముందు వరుసలో ఉండేది డాక్టర్స్ ఫ్యామిలీ. డాక్టర్ దగ్గరికి వెళ్లడం అంటే వెయిటింగ్.. వెయిటింగ్ అని విసుక్కుంటూ ఉంటాం కానీ వాళ్ల జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఎన్నో కోల్పోతున్నారని మనం గ్రహించం. వ్యక్తిగత ఆనందాలను ఎన్నో త్యాగం చేసి రోగుల సేవలకు తమ సమయాన్ని వెచ్చిస్తారన్న నిజాన్ని తెలుసుకోం. డాక్టర్ల జీవితాల్లో వాళ్లొక్కరే కాదు మొత్తం కుటుంబం కూడా తమ ఆనందాలను త్యాగంచేయాల్సి వస్తుంది. వైద్యం కార్పొరేటీకరణ అయిన తరువాత డాక్టర్ల పట్ల చాలామందికి గౌరవం సన్నగిల్లింది. కాని ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ వృత్తిలోకి రాలేరు. విధులు చేపట్టిన తర్వాత 24/7 ‘‘ఆన్ డ్యూటి ఎట్ యువర్ సర్వీస్’’ అనాల్సిందే. రోజురోజుకి పెరిగిపోతున్న శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన అధ్యయనం తప్పనిసరి విషయమే. ఇక దంపతులిద్దరూ డాక్టర్లే అయితే ఆ కుటుంబం పడే ఇబ్బందులు దేవుడికే తెలియాలి. ముఖ్యంగా లేడీ డాక్టర్లు ఒకచేత పిల్లలు, భర్త, మరో చేత పేషెంట్ల బాధ్యతలు తీసుకుని సవ్యసాచిలా ముందడుగు వేయాలి. నేడు (July 1st 2013) డాక్టర్స్ డే సందర్భంగా ఇలాంటి కొందరు వైద్య దంపతులు పడిన, పడుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు....Courtey with : Namasthetelangaana.com.

lalitha
పదిరోజులు పండగ!
వైద్యం ఉద్యోగం కాదు. ఇదొక వృత్తి. దీన్ని ఎంచుకునేటప్పుడే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడాలి. అందుకే జీవితాన్ని జీవించేందుకు వీలుండదని డాక్టర్‌ని పెళ్లి చేసుకోవద్దని అనుకున్నా. కాని తన కళ్లని చూసిన తరువాత వృత్తి అడ్డంగా కనిపించలేదు. కాని నేను భయపడినట్టుగా జీవితంలో ఏ లోటు రానివ్వకుండా అన్నీ తానే చూసుకుంది. నన్ను, పిల్లల్ని సౌకర్యవంతంగా ఉంచడం కోసం అందుకు అనుగుణంగా తన పనివేళల్ని మార్చుకుంది. నేను 8 నుంచి 10 వరకు పనిచేస్తున్నా తను 6 కల్లా పని ముగించుకుంటుంది. అవసరమైతే ఏ టైమ్ అయినా అటెండ్ కావాల్సిందే. అప్పుడిక నేను రంగంలోకి దిగుతాను అంటారు డాక్టర్ విష్ణుస్వరూప్‌డ్డి నవ్వుతూ. మన దేశంలో డాక్టర్లకు వీకెండ్స్ ఉండవు. ఏ రోజైనా, ఏ టైమైనా, ఏ పరిస్థితిలో ఉన్నా వెళ్లాల్సిందే. ఇంగ్లండులో మాదిరిగా ఇక్కడ కూడా వారానికి 5 రోజులే ఉంటే బావుండేది అనిపిస్తుంది. దీనివల్ల కొత్త టెక్నాలజీ నేర్చుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడానికి గాని, సదస్సుల నిర్వహణ కోసం గాని ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. కొంతవరకు వ్యక్తిగత జీవితమూ మిస్ కాకుండా చూసుకోవచ్చు. కాని ఇది ఆయనకు తీరని కోరికగానే మిగిలిపోయిందట. పిల్లలకు జబ్బు చేసినా, మాకు అనారోగ్యంగా ఉన్నా పేషెంట్లను వదిలేయలేని వృత్తి మాది. అందుకే రాత్రి-పగలు తేడా లేకుండా సర్జరీ ఉన్నా, పేషెంట్‌కి సీరియస్ ఉన్నా వెళ్లక తప్పదు. మేము జ్వరంతో ఉన్నా వెళ్లాల్సిందే. భర్త నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. నేను అలా ఎప్పుడు వెళ్లాల్సి వచ్చినా పాపం. తనే చూసుకునేవారు. తను ఊళ్లో లేనప్పుడు ఎమ్జన్సీ వస్తేనే చాలా కష్టం. రాత్రిపూట పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లలేను. అప్పుడు అమ్మ వాళ్లని రమ్మని పిలిచి నేను కేసు అటెండ్ అయ్యేదాన్ని. ఇంగ్లండులో ఉన్నప్పుడైతే వీకెండ్స్ 2 రోజులు డ్యూటీ ఉండేది కాదు. శని, ఆదివారాలు పిల్లలతోనే ఉండేవాళ్లం.పాపకు 9 ఏళ్లు వచ్చాక ఇండియాకు తిరిగి వచ్చేశాం. బాబు నెలల పిల్లవాడు. పదేళ్లు దాటితే మళ్లీ ఇక్కడికి అలవాటు పడలేరని ముందే వచ్చేశాం. ఇప్పుడు ఇక్కడ కుటుంబంతో గడిపే సమయం ఉండదు కాబట్టి వాళ్లు మమ్మల్ని మిస్ కాకూడదు కాబట్టి ఆరు నెలలకు ఒకసారి ఓ పదిరోజూలు లాంగ్ టూర్ వెళ్తాం. వాళ్లకి సెలవులు ఉన్నప్పుడు, పండగ రోజుల్లో కూడా మేము అందుబాటులో ఉండము కదా. నేను సాయంవూతాలు ప్రాక్టీస్ చేయకపోవడం చాలావరకు నా పిల్లలకు బెనిఫిట్ అయిందని చెబుతారు డాక్టర్ శాంతి. ఇంగ్లండులో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఈ డాక్టర్ జంట పడిన ఇబ్బంది ఇంతా అంతా కాదు. సాధ్యమైనంత వరకు ఇద్దరిలో ఒకరు పిల్లలతో ఉండే ప్రయత్నం చేసినా అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు కదా. అందుకే కొన్నాళ్లు మెయిడ్‌ని పెట్టి దెబ్బతిన్నారుట. అక్కడ వస్తువులు పోతాయేమో అన్న సమస్య ఉండదు. కాని పిల్లలను బాగా చూసుకోరేమో అన్న టెన్షన్ మాత్రం ఉంటుంది. ‘ఓ రోజు మేము వచ్చే సరికి బాబు పడుకుని ఉన్నాడు. పక్కన సోఫాలో కూర్చుని మెయిడ్ సిగట్ తాగుతూ ఉంది. పసివాడి దగ్గర అలా పొగ తాగకూడదని ఆమెతో గొడవ పడినా ప్రయోజనం లేదు. ఇక్కడైతే ఒక్కోసారి పిల్లల్ని నాతోపాటే హాస్పిటల్‌కి తీసుకెళ్తాన’న్నారు డాక్టర్ శాంతి.

aunty
పిల్లలకు ఆసుపత్రే ఇల్లు!
డాక్టర్లు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఎందుకంటే పీజీ అనేది కెరియర్‌లో కీలకమైన టైమ్. అప్పుడు పెళ్లి, సంసారం అన్న బాధ్యతలు డిస్ట్రబ్ చేస్తే ఇక కెరియర్ కొలాప్స్. ఇందుకు మా జీవితమే ఒక ఉదాహరణ. మాకు ఎంబీబీఎస్ చదివేటప్పుడే పెళ్లయింది. ఇద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి కష్టపడ్డాం. డాక్టర్లంటే బాగా సంపాదిస్తారు అనుకుంటారు గాని డిగ్రీలు అయ్యాకే సంపాదన. స్టైఫండ్ చాలా తక్కువ. మేము చదువుకునేటప్పుడు బండి పంక్చర్ అయితే బాగుచేయించుకోవడానికి పదిరూపాయలు లేక కష్టపడిన రోజులున్నాయి. నేను డిఎం ఎంట్రన్సు కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు తనకు డిజిఎం పరీక్షలు. అయినా నన్ను అన్ని సమస్యలూ తనే చూసుకుంది. పిల్లలకు జ్వరం వస్తే కూడా చెప్పలేదు. ఇప్పటికీ తను ఎంత బిజీగా ఉన్నా ఇంటా, బయటా అన్నీ చూసుకుంటుంది. తననుంచి సహకారం లేకపోతే నేను సక్సెస్‌ఫుల్ కార్డియాలజిస్ట్‌ను కాలేకపోయేవాడినంటారు డాక్టర్ మొవ్వా శ్రీనివాస్. వ్యక్తిగత జీవితం బాగుం వృత్తిజీవితంలో సక్సెస్ కాగలుగుతారన్నది ఆయన నమ్మే సిద్ధాంతం.

ఇలాంటి బిజీ ప్రొఫెషన్‌లో ఉన్న ఆడవాళ్లు రాణించాలంటే భర్త సహకారం తప్పనిసరి. చదువుకునే రోజుల నుంచి తను నా వెన్నంటే ఉన్నాడు. గురువై నేర్పాడు. తండ్రిలా ఆదరించాడు. మొదటి స్టైఫండ్‌తో ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్లి భర్తగానూ ఆనందింపచేశాడు. రాత్రి రెండు, మూడు గంటలకు కాల్ వచ్చినా నేను వెళ్లాల్సిందే అప్పుడు పిల్లల్ని శ్రీనివాస్ దగ్గరే వదిలి వెళ్లేదాన్ని. చుట్టాలొచ్చినప్పుడు కూడా పిల్లల్ని, వాళ్లని ఆయనకు అప్పజెప్పి నేను హాస్పిటల్‌కి వెళ్లిన సందర్భాలున్నాయి. కాస్త సెటిలయ్యాక హమ్మయ్య అనుకున్నానో లేదో రెండోరోజే ఫెలోషిప్ కోసం ప్యారిస్ వెళ్లాల్సి వచ్చింది.

సంవత్సరం పాటు నేను, పిల్లలు ఒంటరిగా. ఒకవైపు పేషెంట్లు, మరోవైపు పిల్లలు, కుటుంబ, ఆర్థిక సమస్యలు అన్నీ ఒక్కదాన్నే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడే కాస్త బాధపడ్డాను అంటారు డాక్టర్ మొవ్వా మాధురి. కొన్ని సంవత్సరాల వరకు సెల్ఫ్‌పిటీలో ఉండేవాళ్లం. చాలామంది జంటల్లాగా జీవితాన్ని ఆనందించలేకపోయామని బాధగా ఉండేది. చాలా కోల్పోయామని అనిపించేది. కానీ డాక్టర్‌గా అందుకుంటున్న సంతృప్తి దాన్ని అధిగమించింది. ఇప్పుడు బిజీలైఫ్‌లో కూడా ఎలా ఆనందించాలో నేర్చుకున్నాం. ఆసుపత్రి నుంచి థియేటర్‌కి వెళ్లి టికెట్స్ కొని రెడీగా ఉంటాను. ఆయన డైరెక్ట్‌గా వస్తారు. సినిమా అయిపోగానే మళ్లీ హాస్పిటల్. ఒకసారి థియేటర్‌లో ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. తను వెళ్లాల్సి వచ్చింది. నేను పిల్లలతో ఉండి సినిమా చూసి వచ్చేశాం. పెద్దవాడు మా బిజీని బాగా అర్థం చేసుకున్నాడు. సినిమా మధ్యలో వెళ్లాల్సి వస్తే ‘పర్లేదులే.. అందరం వెళ్లిపోదాం. నువ్వు కూడా వెళ్లాలి కదా’ అంటూ అడ్జస్టవుతాడు. తమ్ముడికి కూడా సర్దిచెబుతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కడుపుతో ఉన్నప్పుడు కూడా డాక్టర్ మాధురి పేషెంట్లను వదిలేయలేదు.

డెలివరీ చేసి ఇంటికి వచ్చిన రాత్రికే నొప్పులు వచ్చాయి. ఎమ్జన్సీ పరిస్థితి ఏర్పడింది. సిజేరియన్ అయింది. బాబు పుట్టిన వారానికి మళ్లీ డెలివరీలు యథాతథం. పిల్లల్ని పెంచడానికి మాత్రం ఈ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ‘పిల్లల్ని మాతో పాటే హాస్పిటల్‌కి తీసుకెళ్లేవాళ్లం. ఆపరేషన్ థియేటర్ సిబ్బంది బాబుకు సెరిలాక్ పెట్టేవాళ్లు. చిన్నవాడికి నెలల వయసప్పుడు ఓపీ పక్క రూమ్‌లో మెయిడ్‌తో బాబు ఉండేవాడు. అవసరమైనప్పుడల్లా కొన్ని కేసులు కాగానే మధ్యలో వెళ్లి బాబుకు పాలిచ్చి వచ్చేదాన్ని. అలా ఇద్దరు పిల్లలకూ విజయవంతంగా ఏడాదిన్నర పాటు తల్లిపాలే ఇచ్చాను. ఇందుకు శ్రీనివాస్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది సహకారం కూడా ఉంది. మా చిన్నవాడు దాదాపుగా ప్రైమ్ హాస్పిటల్‌లోనే పెరిగాడు. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కూడా వాళ్లని తీసుకునే హాస్పిటల్‌కి వెళ్లేవాళ్లం. మొదట్లో బాబును ఇంట్లో మెయిడ్ దగ్గర ఉంచి వెళితే ఆమె వాడిని బుగ్గల మీద గిచ్చేది. ఆ గాటు ఇంకా వాడి ముఖంపై ఉంది. ఇన్‌ఫెక్షన్ వస్తే యాంటిబయాటిక్ వేయొచ్చు. కాని వాళ్లకేమన్నా అయితే ఏమీ చేయలేం. అందుకే ఇక మెయిడ్‌పై నమ్మకాలు పెట్టుకోలేదు.

స్వయంగా చూసుకోవడం మొదపూట్టాం’ అని చెబుతుంటే తల్లిదంవూడులుగా వాళ్లు ఎన్ని పాట్లు పడ్డారో అర్థమవుతుంది. పిల్లలకు ఏ పనైనా తల్లితో చేయించుకుం సంతృప్తి. ఈ విషయం ‘ఓపీ చూసుకుని వెళ్లి పిల్లలకు అన్నం పెట్టి, పడుకోబెట్టాలి. పొద్దున చిన్నవాడినైతే స్కూల్‌కి నేనే తయారుచేయాలి. నేను వేస్తే తప్ప వాడు యూనిఫాం వేసుకోడు’ అన్న డాక్టర్ మాధురి మాటల్లో స్పష్టమవుతుంది. పిల్లల కోసమే సొంత హాస్పిటల్ పెట్టారు ఈ జంట. ‘నిజానికి మేము చదువుకునేటప్పుడే నాకు బావుండేది. ఇప్పుడు శ్రీనివాస్ అస్సలు దొరకడు. నాకైతే ఆ లవర్‌బాయ్ శ్రీనే కావాలనిపిస్తుంది’ అంటారు డాక్టర్ మాధురి. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటే కుటుంబం, పిల్లలు ఏదీ ఎదుగుదలకు అడ్డంకు కాదు. జీవితభాగస్వామి సహకారం ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించేలా చేస్తుందన్నది ఆమె అభివూపాయం. ఇన్ని రకాలుగా కష్టపడి పేషెంట్ల కోసం సమయం వెచ్చిస్తున్నా డబ్బులు కట్టాం కదా.. ఇంత సేపు వెయిట్ చేయిస్తారు.. అని ఎవరైనా దురుసుగా మాట్లాడితే బాధగా ఉంటుంది. మా షెడ్యూల్ ఒక క్రమపద్ధతిలో ఉండదు. ఎప్పుడు ఎవరికి ఎమ్జన్సీ అవుతుందో తెలీదు. నిజానికి పేషెంట్‌కి ప్రాధాన్యం ఇవ్వని డాక్టర్ ఎవరూ ఉండరు. ఒకరు వెయిట్ చేయాల్సి వస్తోంది అంటే మరో పేషెంటు కోసం ఆ సమయం వినియోగించడం వల్లే కదా. పేషెంట్లు ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకుంటే బావుంటుందంటూ పేషెంట్లను కోరుతున్నది ఈ జంట.

poradu
సమన్వయం ముఖ్యం
జీవితం కొందరికి వరమైతే, కొందరికి పండగ. అలాంటి వారే డాక్టర్ లలిత, డాక్టర్ కేవీఆర్ ప్రసాద్. డాక్టర్ వృత్తి చేపట్టినపుడే వారు రోజులో 24 గంటలకు మించి పనిచేయకూడదని అనుకున్నారట. అందుకే వారి జీవితంలో జీవాన్ని వారు వృత్తిలోనే వెతుక్కునేలా ప్రణాళికాబద్ధం చేసుకున్నారు. ఒకరికి ఒకరు సమయం కెటాయించలేదని ఫిర్యాదు రాకూడదని అనుకున్నారు. ఇంటర్న్‌షిప్‌లో ఉండగా పెళ్లైంది వాళ్లకు. ఇద్దరూ పైచదువులు చదువుకోవాలి. కేవీ ప్రసాద్ అప్పటికే చండీఘర్‌లో యూరాలజిలో పీజీ చేస్తున్నారు. లలితకి ఇక్కడ స్టేట్‌లో సెకండ్ ర్యాంక్ వచ్చింది గైనకాలజిలో. కానీ ఆమె ఈ సీటు వదులుకొని చండిఘర్‌లో వచ్చిన సీటుకే ప్రాధ్యన్యత నిచ్చి అక్కడే చేరారు. కలిసి చదువుకోవచ్చునన్న ఆలోచనతో. అలా వృత్తిలోనే వారి సంతోషాన్ని వారు వెతుక్కొవడం ప్రారంభించారు.

పీజీ పూర్తయిన తర్వాత సూపర్‌స్పెషాలిటి చదవాలనుకున్నపుడు లలిత తానుకూడా యూరాలజిస్ట్‌ను అయితే ఇక భర్తతో కలిసి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు వృత్తి జీవితంలో కూడా భాగం పంచుకోవచ్చనే ఆలోచన ఒకవైపు ఉంటే మరోవైపు యూరాలజిస్ట్‌లలో మహిళలు లేకపోవడం వల్ల మహిళా యూరాలజిస్ట్ అవసరం మరోవైపు ఉందన్న బాధ్యత కూడా మనసులో మెదులుతోంది. అందుకు తాను అహోరావూతులు శ్రమించారు. ఎందుకంటే పీజీ చండీఘర్‌లో చేసి ఉండడం వల్ల ఆమె అప్పుడు ఇక్కడ నాన్‌లోకల్ అవుతారు. అందువల్ల అనుకున్న సబ్జెక్టులో సీట్ రావాలంటే తనకు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు రావాలి. పిల్లలు, కుటుంబం కళ్లముందు మెదులుతుండగా లలిత పట్టుదలగా చదివారు అనుకున్నట్టుగానే ఫస్ట్‌ర్యాంకు సాధించారు. మొదట్లో ఐదేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ సర్వీసులో పని చేశారు లలిత, కానీ అక్కడ అంత సంతృప్తిగా అనిపించక ఆమె ప్రసాద్ పనిచేస్తున్న ఆసుపవూతిలోనే తాను కూడా పనిచేయడం వల్ల వృత్తిని, వ్యక్తిగతాన్ని సమన్వయ పరచవచ్చుననేది ఒక వైపుంటే, ప్రైవేట్ రంగంలో ఆధునిక పరిజ్ఞానం ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల వృత్తిలో మరింత ఎత్తుకు ఎదగవచ్చు అనే ఆలోచన మరోవైపు ఉండడం వల్ల ఆమె ప్రసాద్ పనిచేస్తున్న ఆసుపవూతిలోనే చేరారు. ‘‘వృత్తిజీవితం, వ్యక్తిగత జీవీతం రెండూ సమన్వయం చేసి జీవితపు బండి సవ్యంగా నడపాలంటే ముందు దంపతులనే రెండు చక్రాలు సమన్వయంతో ఉండాలి’’ అంటారు లలిత. ‘‘ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఇద్దరూ వృత్తి జీవితాల్లో ఉన్నపుడు తప్పనిసరిగా పిల్లల బెంగ కొంతైనా ఉంటుంది’’ అని ఆమె వ్యాక్యాన్ని ప్రసాద్ ముగిస్తారు. పిల్లలను పెంచడానికి అటెన్షన్ మాత్రమే కాదు, అఫెక్షన్ కూడా కావాలి. అందుకు పిల్లలు పసివారుగా ఉన్నపుడు ఆమె కొంత వరకు తన కేసులను ప్రసాద్‌కు అప్పగించడం వంటివి చేసే వారు.

కొంత సమయం పిల్లలకు ఇవ్వగలిగినప్పటికీ ఆమె డ్యూటిలో ఉన్నపుడు కొంత కాలం పాటు అత్తమామలు మరి కొంత కాలం పాటు తల్లిదంవూడుల సాహాయం తీసుకోక తప్పలేదంటారు లలిత. ‘ఎంత బాధ్యతలు పంచుకొని పనిచేసుకుంటూ వెళ్లినప్పటికీ అందరు పిల్లలకు వారి తల్లిదంవూడులు ఇచ్చినంత సమయం ఇవ్వలేకపోతునానమన్న దిగులు మాత్రం ఎప్పుడూ ఉండేది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నపుడు వాళ్లకు కూడా మాపట్ల చాలా ఫిర్యాదులు ఉండేవి, వాళ్లు పెద్దవాళ్లవుతున్న కొద్దీ మా వృత్తి స్వభావాన్ని, బాధ్యతను వాళ్లు కూడా గుర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు కూడా ఇదివరకటిలా కంప్టైంట్లు ఉండడం లేదు.’ అని చెప్తారు ప్రసాద్ తమ పిల్లల గురించి మురిపెంగా. పిల్లలతో గడపడమే లక్ష్యంగా సంవత్సరంలో కనీసం ఒకసరైనా ఒక పదిరోజుల పాటైనా సెలవు తీసుకొని ఏదైనా విహార స్థలంలో గడపడం ద్వారా పిల్లలకు తల్లిదంవూడులు తమకు సమయం ఇవ్వడంలేదన్న భావన రాకుండా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు వాళ్లు. ‘‘మేము అంతా కలిసి సినిమా మొత్తం చూడడం కొంచెం అరుదనే చెప్పాలి ఎందుకంటే సినిమా మధ్యలో ఎమ్జన్సీ వచ్చి ఇద్దరిలో ఒకరం హాస్పిటల్‌కు పరుగెత్తి రావాల్సి వస్తుంది. చాలా సార్లు ప్రసాద్ సినిమా చివరన మాతో కలుస్తారు. ఏదో ఒక విధంగా పిల్లలను మా పరిధి మేర సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని చెప్తారు లలిత. ఆమె జీవితంలోసాధించిన ప్రతి మెట్టుకి పునాది ఆయనే అనేది ఆమె భావన. ‘‘లలిత చాలా ఇంటలిజెంట్. తనకి 13 గోల్డు మెడళ్లు వచ్చాయి’’ అని చెప్తారు డాక్టర్ ప్రసాద్ మెరుస్తున్న కళ్లతో. వృత్తిపట్ల వారికున్న అంకిత భావం వారి పిల్లలకూ స్పూర్తిదాయకమే, అందుకే వారి చిన్నమ్మాయి యంగ్‌డాక్టర్స్ అసోషియేషన్‌లో సభ్యురాలు. తాను కూడా డాక్టర్‌ని కావాలని కలలు కంటోంది. ఆ కల నెరవేరాలని మరో అంకితభావం కలిగిన వైద్యరత్నం సమాజానికి అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

Dr.Jahnavi
కొంత ప్లానింగ్ అవసరం
డాక్టర్లుగా విజయవంతం కావాలంటే జీవితంలో కచ్చితంగా ఎంతో కొంత త్యాగం చెయ్యడమైతే తప్పదు. కాకపోతే అన్నింటికి ప్లానింగ్ ముఖ్యం. కాస్త ప్లాన్ చేసుకోగలిగితే జీవితాన్ని కొంత ఇబ్బందిలేకుండా గడిపేందుకు అవవాశం ఉంటుంది. ‘‘పెళ్లైన కొత్తలో కొన్నాళ్లు మేము కూడా వ్యక్తిగత జీవితాన్ని కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. మాకు పీజీ రెండో సంవత్సరంలో ఉండగా పెళ్లైంది. అయితే జాహ్నవి విశాఖలో, నేను హైదరాబాద్ నిమ్స్‌లో పీజీ చేశాం.’’ ఆ రెండు సంవత్సరాల కాలం వాళ్లిద్దరూ ఫ్యామిలికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మాములుగా పసి పిల్లలను పెంచాలం పూర్తిగా సమయం వాళ్లకు కేటాయించాల్సి వస్తుంది. ఇక ఈ వైద్యజంటకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. ‘‘ మాఅదృష్టం ఏమిటంటే మాతల్లిదంవూడులు, జాహ్నవి తల్లిదంవూడులు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు. అందువల్ల వాళ్ల పెంపకం విషయంలో పెద్దగా కష్టపడలేదు.’’ ఇప్పుడు వాళ్ల వయసు 6 సంవత్సరాలు. ఇద్దరూ స్కూల్‌కు వెళ్తున్నారు. దంపతులిద్దరు ఉద్యోగస్తులైన వారికి పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో అనే బెంగ ఒక వైపు ఉంటూనే ఉంటుంది. ‘‘కానీ ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులం.’’ అంటారు నవీన్ కుమార్. పొద్దున ఏడున్నరకల్లా పిల్లలను స్కూల్‌కు పంపేసి డాక్టర్ జాహ్నవి డ్యూటీకి వెళ్లిపోతారు. సాయంత్రం మాత్రం పిల్లలను వాళ్ల నాన్నమ్మో, అమ్మమ్మో చూసుకుంటారు. ‘‘మా పిల్లలు కూడా ఈ విషయంలో అదృష్ట వంతులే.’’ అని తన పిల్లల అదృష్టానికి మురిసిపోతారు నవీన్ కుమార్. ఈరోజుల్లో చాలా మంది పిల్లలకు వారి నాన్నమ్మ అమ్మమ్మల ఒడిలో ఆడుకునే అవకాశం ఉండడం లేదు. వీళ్ల పిల్లలు మాత్రం వారి దగ్గర ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నారు. ‘‘వారి భద్రత, ఆనందాలకు లోటు లేదు కానీ మేము మాత్రం పిల్లలకు ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేకపోతున్నామని, వారి ముద్దు ముచ్చట్లను తనివితీరా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నామని అప్పుడప్పుడు జాహ్నవి వాపోతుంటుంది. వృత్తి అందించే తృప్తి ముందు కొన్నింటిని వదులుకోక తప్పదు మరి.’’ అని జీవితంలో సర్దుబాట్ల గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ నవీన్ కుమార్

Courtey with : Namasthetelangaana.com.
  • ====================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.