Monday, September 30, 2013

Salt-Our health,ఉప్పు-మన ఆరోగ్యము




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Salt-Our health,ఉప్పు-మన ఆరోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు. ఇది ఉప్పుకు అతికినట్టు సరిపోతుంది. ఆహారంలో ఉప్పు వాడకం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ పెరిగిపోతాయి. కాబట్టి ఉప్పు (సోడియం) వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. దీన్ని కొద్దిమోతాదులో తగ్గించినా పెద్ద ఫలితం కనబడుతుంది. రోజుకి 3 గ్రాముల ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే.. పక్షవాతం, గుండెపోట్ల ద్వారా సంభవించే మరణాల రేటు 75-80% పడిపోయినట్టు ఫిన్‌లాండ్‌లో జరిగిన అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం అన్ని రకాల ఆహార పదార్థాల నుంచి రోజుకి 5 గ్రాముల కన్నా ఎక్కువ (ఒక చెంచా) ఉప్పును తీసుకోకూడదు. కానీ మనదేశంలో రోజుకి సగటున 9 నుంచి 12 గ్రాముల వరకు తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంటోంది కూడా. మనదేశంలో అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య 2025 వరకు 21.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం తక్షణావసరమని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మూలంగా శరీరంలోంచి నీరు బయటకు పోకుండా లోపలే ఉండిపోతుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. దీన్ని పంప్‌ చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఉన్న సోడియాన్ని బయటకు పంపించటానికి మూత్రపిండాలపైనా అధిక భారం పడుతుంది. సోడియం వాడకాన్ని రోజుకి సుమారు 2.2 గ్రాములు తగ్గిస్తే.. పదేళ్ల కాలంలో 2.8 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కూరల్లో పరిమితంగా ఉప్పును వేసుకోవటం.. ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, సాస్‌లకు దూరంగా ఉండటం.. పెరుగు, మజ్జిగ వంటివి తింటున్నప్పుడు అదనపు ఉప్పును కలుపుకోకపోవటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఉప్పు వాడకాన్ని తగ్గించుకునే వీలుందని సూచిస్తున్నారు.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 21, 2013

pulse,నాడి

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- pulse,నాడి -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. చేతి మణికట్టు దగ్గర గుండె పంప్ చేయుటను సిరలలో ఫీలవడాన్ని నాడి లేదా పల్స్ అంటాము . ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.

  • నాడి  (Nerve) జంతువుల శరీరంలో నాడీ వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు.(బహువచనం నాడులు)--తెలుగు భాషలో నరము- A vein or artery, a nerve మూడింటికి కలిపి ఉపయోగిస్తారు. చేతి పల్స్ చూడడాన్ని నాడిచూడు  అని అంటారు. కపాల నాడులు : మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నాడులు.    కశేరు నాడులు : వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నాడులు.    నవనాడులు : ప్రాచీన వేదాలలో పేర్కొన్న తొమ్మిది నాడులు.

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన  పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు  మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటివారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.

వేగాన్ని పెంచే కారకాలు

* ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది.

* శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది.

* భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది.

* వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు.

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?
వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

ఆరోగ్యస్థితిని అంచనా వేసే మార్గాల్లో నాడి చూసుకోవటం చాలా తేలికైంది. సమర్థవంతమైంది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలు కిందిభాగంలో గానీ మెడకు ఒక పక్కన గానీ రెండు వేళ్లతో ఒకింత గట్టిగా అదిమిపడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవటాన్ని గమనించొచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి, దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటివారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్నకొద్దీ గుండె సమస్యల ముప్పూ పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎన్నిసార్లు కొట్టుకోవాలి?
పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60-100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా.. 50-70 సార్లు కొట్టుకోవటమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా గలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగానూ.. రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టూ తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81-90 సార్లు నాడి కొట్టుకునేవారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునేవారిలో ఈ ముప్పు మూడింతలు అధికంగా ఉంటుండటం గమనార్హం.

వేర్వేరు సమయాల్లో..
గుండె వేగాన్ని ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గటానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించటానికి వారం మొత్తమ్మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాల్లో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఎప్పుడు చూసుకోవాలి?
శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత.. కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీది నుంచి దిగకముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవటం ఉత్తమం.

కొలెస్ట్రాల్‌ అదుపుతో మేలు
కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, రక్త ప్రసారం తగ్గుతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుకోవటం, వ్యాయామం ద్వారా గుండె వేగం పెరగకుండా చూసుకోవచ్చు.
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Presbiosmia,ప్రెస్బయోస్మియా,వృద్ధులలో ఘ్రాణ శక్తి తగ్గడం,వృద్ధులలో వాసనలు తెలియకపోవడం

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Presbiosmia,ప్రెస్బయోస్మియా,వృద్ధులలో ఘ్రాణ శక్తి తగ్గడం,వృద్ధులలో వాసనలు తెలియకపోవడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కాస్త 'వయసు మళ్లిన' వారికి రుచ్చ్చులు తినాలనిపెస్తుంది ...  నిజానికిది తిండి కోసం వెంపర్లాట కాదు. రకరకాల రుచుల కోసం పాకులాటా కాదు. వృద్ధాప్యానికి సంబంధించిన చాలా సమస్యల లాగే ... 'చవి చచ్చిపోవటమన్నదీ' అలాంటిదే. వృద్ధులకు 'రుచి' తెలియకపోవటం, 'వాసన' తెలియకపోవటమన్న సమస్యలు చాలా
ఎక్కువ. పైగా ఈ రెండూ ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడిన అంశాలు! ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతూ... వృద్ధాప్యంపై పరిశోధనలు, అధ్యయనాలు
విస్తృతమవుతున్న కొద్దీ మలి వయసుకు సంబంధించిన ఇటువంటి రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యపరంగా వీటిని ఎలా ఎదుర్కోవాలన్న చర్చలూ పెరుగుతున్నాయి.

రుచి, వాసన అన్నవి మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. ఆ ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్నిఅనుభవించలేం. ఇదొక్కటే కాదు.. కమ్మటి కాఫీ వాసన.. సుతిమెత్తటి గులాబీల పరిమళం.. మనం గుర్తించంగానీ ఇవన్నీ తెలియనప్పుడు జీవితం దుర్భరంగానే ఉంటుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ.. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత ఆఘ్రాణ శక్తి క్రమేపీ తగ్గుతుంది. చాలామంది వృద్ధులు ఈ విషయాన్ని గుర్తించను కూడా లేరు. అంత నెమ్మదిగా వస్తుందీ మార్పు. ఒక రకంగా వయసుతో పాటు మన చూపు, వినికిడి సన్నగిల్లినట్టే ఈ ఆఘ్రాణ శక్తీ తగ్గుతుందని భావించొచ్చు. అందుకే దీన్ని
'ప్రెస్బయోస్మియా' అంటారు. ఈ క్రమంలో చాలామంది తమకు తెలియకుండానే కుళ్లిన, బాగా చెడిపోయిన పదార్థాలను తినేస్తుంటారు. ప్రమాదకరంగా వంట గ్యాస్‌ వంటివి లీకవుతున్నా కనిపెట్టలేకపోతుంటారు. చాలాసార్లు ఇలాంటి ఘటనలేవైనా జరిగితేగానీ ఈ లోపం బయటపడదు. సాధారణంగా జలుబు చేసినప్పుడు, అలర్జీల వల్ల కూడా వాసనలు తెలియకపోవచ్చుగానీ అది తాత్కాలికం. ఆయా సమస్యలు తగ్గగానే ఆఘ్రాణ శక్తి తిరిగి మెరుగువుతుంది. అలాగే తలకు బలమైన దెబ్బల వంటివి తగిలినప్పుడూ, సైనస్‌ ఇన్ఫెక్షన్లు ముదిరినప్పుడూ వాసనలు తెలియని స్థితి ఎదురవ్వచ్చు. దానికి స్పష్టమైన కారణాలు మనకు కనబడుతూనే ఉంటాయి. కానీ వృద్ధుల్లో సమస్య ఇలా ఉండదు. అది క్రమేపీ వాళ్లకు కూడా తెలియకుండా పెరిగే సమస్య!

నోటికీ ఇబ్బందే!
వాసన కూడా రుచిలో భాగమే! ఒక పదార్థం వాసన ఏమిటో మనకు తెలియకపోతే దాని రుచిని పూర్తిగా ఆస్వాదించలేం. మన నోట్లోనూ, గొంతులోనూ ప్రత్యేకమైన రుచి
మొగ్గలుంటాయి. ఒక్కో రుచి మొగ్గలోనూ చాలా రుచి కణాలుంటాయి. మనం ఆహారం నమిలేటప్పుడు ఈ కణాలు ప్రేరేపితమై.. వీటికి అనుసంధానంగా ఉన్న నాడుల ద్వారా ఆ సమాచారం మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు రుచి భావన కలుగుతుంది. ఈ రుచి మొగ్గలు నాలుక మీదా, నోట్లో పైభాగంలోనూ, గొంతులో కూడా  ఉంటాయి. పుట్టినప్పుడు మన నాలుక, నోరు, గొంతు, అంగిట్లో దాదాపు 10,000 రుచిమొగ్గలుంటే 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ మొగ్గల సంఖ్య కొంత తగ్గటం మొదలవుతుందని అధ్యయనాల్లో గుర్తించారు. దీనివల్ల వీరి నోటికి చాలా పదార్థాలు 'చప్పిడి'గా అనిపిస్తుంటాయి. అయితే వృద్ధుల్లో రుచి తగ్గటమన్నది ఆఘ్రాణ శక్తి తగ్గటమంత ఎక్కువగా కనబడదు. రుచి కంటే వాసనలు తెలియకపోవటమన్నదే ఎక్కువమందిని వేధిస్తుంటుంది. ఈ రెంటి మధ్యా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వీటిని పూర్తిగా వేరుచేసి చూడలేం. అందుకే చాలామంది తమకు వాసనలు సరిగా తెలియటం లేదన్న విషయాన్ని గుర్తించక.. పదార్థాలు రుచి మళ్లిపోయాయని, నోరు చవి చచ్చిపోయందనీ.. రకరకాలుగా భావిస్తుంటారు.
గొంతు నుంచీ వాసనలు రుచికీ, వాసనకూ మధ్యనున్న బంధం చాలా బలమైనది. ఎందుకంటే వాసనలన్నవి ముక్కు ద్వారానే కాదు.. గొంతు లోపలి పైభాగం ద్వారా కూడా ముక్కు కుహరం పైభాగంలో ఉండే 'ఆల్‌ఫ్యాక్టరీ' కణాలను చేరతాయి. మనం ఆహారం నమిలేటప్పుడు, తినేటప్పుడు ఘుమఘుమలతో ఆ కమ్మటి రుచికరమైన భావన కలగటంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే ఆఘ్రాణ శక్తి సన్నగిల్లటం వల్ల వీరిలో 'రుచి' సమస్యలూ పెరుగుతుంటాయి. జలుబు వంటివి చేసినప్పడు ఈ మార్గం మూసుకుపోతుంది, అప్పుడు కూడా రుచి తెలియక 'ఏం తిన్నా మట్టితిన్న' భావన కలుగుతుంటుంది.

నష్టాలేమిటి?
* వాసనలు తెలియని కారణంగా చాలామంది వృద్ధులు- తమకు తెలియకుండానే ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది తిండి సహించక తిండి
తగ్గించేసి, చాలా కొద్దిగానే తినటం ఆరంభిస్తారు. మరికొందరు కడుపు నిండిన భావన కలగక.. ఎక్కువ తినటం ఆరంభిస్తారు. రెండూ కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే.

* వాసన తెలియక రుచిని పూర్తిగా ఆస్వాదించలేరు కాబట్టి రుచి బాగా తెలియటం కోసం పదార్థాల్లో తీపి, ఉప్పు మోతాదు పెంచుతుంటారు. పక్కనే డబ్బా పెట్టుకుని ఉప్పు మరికాస్త వేసుకోవటం, పంచదార నంజుకోవటం వంటివి చేస్తుంటారు. ఈ వయసులో చాలామందికి సహజంగానే మధుమేహం, హైబీపీ వంటివి ఉంటాయి, ఈ మారిపోయిన ఆహారపుటలవాట్ల వల్ల అవి అదుపు తప్పుతుంటాయి. ఫలితంగా గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర సమస్యల ముప్పూ పెరగుతుంటుంది.

* కొంతమందిలో వాసనలు తెలియక, తిండి సయించక మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) కూడా పెరుగుతుంటుంది.

* మనకు రుచులు సరిగా తెలియకుండా పోతే సాధారణంగా ఆకలి మందగిస్తుంది. దీనివల్ల తిండి తగ్గిపోయి పోషకాహార లోపం, బలహీనం,రోగనిరోధక శక్తి తగ్గిపోవటం,
రక్తహీనత వంటి రకరకాల సమస్యలు బయల్దేరతాయి.

* వాసనలు తెలియకపోవటం వల్ల చెడిపోయిన పదార్థాలను గుర్తించలేక తినేస్తుండటం, గ్యాస్‌ లీకేజీలను కనిబెట్టలేకపోవటం, వంట సరిగా చెయ్యలేకపోవటం వంటి ఇబ్బందులే కాదు.. కొన్నిసార్లు పెద్ద సమస్యలూ పొంచి ఉంటాయి. ముఖ్యంగా ఆఘ్రాణ శక్తి తగ్గటమన్నది కొన్నిసార్లు పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధ వ్యాధులకు తొలి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి వాసలు తెలియటం లేదని గుర్తించినప్పుడు తోసేసుకు తిరగకుండా ఒక్కసారి వైద్యులతో చర్చించటం కూడా అవసరం.

కారణాలేమిటి?
వయసుతో పాటు రుచి, వాసనలు మందగించటం సహజ పరిణామమే కావచ్చుగానీ మరికొన్ని ఇతరత్రా కారణాలు కూడా దీనికి దోహదం చెయ్యొచ్చు.

* కొన్ని రకాల మందుల వల్ల రుచులు మందగిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు చాలారకాల మందులు వేసుకుంటూ ఉంటారు. హైబీపీకి, కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు వాడే మందుల వల్ల నోట్లో రుచి మారిపోవచ్చు. అలాగే యాంటీబయాటిక్స్‌, అసిడిటీ తగ్గటానికి వాడే మందులతో కూడా నోట్లో ఏదోగా అనిపించొచ్చు. అలాగే ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులతోనూ రుచులు మారిపోతాయి. కొన్ని మందులతో నోటిలో లాలాజలం వూరటం తగ్గి, నోరు పొడిబారుతుంటుంది. దానివల్ల రుచులు మారిపోతుంటాయి. కొందరికి నోరు ఎప్పుడూ 'అరుచి'గానే ఉంటుంది. కొందరికి ఏమీ తినకపోయినా కూడా ఎప్పుడూ నోట్లో ఏదో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. ఇంకొందరికి విపరీతంగా నీళ్లూరుతుంటాయి. కాబట్టి రుచి సమస్యగా ఉంటే వీటి గురించి వైద్యులతో చర్చించటం మంచిది. మరికొన్ని మందుల వల్ల ఆఘ్రాణ శక్తి తగ్గుతుంది. అలర్జీల వల్ల వాసనలు తెలియకపోతుంటే.. దానికి సంబంధించిన మందులు వేసుకోవటంవల్ల ఆ ఘ్రాణ శక్తి మెరుగుపడుతుంది కూడా.

* వృద్ధుల్లో చిగుళ్ల వ్యాధులు ఎక్కువ. అలాగే చాలామంది వృద్ధులు కట్టుడు పళ్లు పెట్టుకుంటుంటారు. వీటివల్లా రుచి సమస్యలు తలెత్తవచ్చు.

* పొగ తాగేవారిలో, వూపిరితిత్తుల్లో ఇన్షెక్షన్లు ఉన్న వారిలో కూడా రుచులు మారిపోవచ్చు. క్యాన్సర్‌ చికిత్స తీసుకునే వారిలోనూ రుచి సమస్యలు తలెత్తుతుంటాయి.

చికిత్సలున్నాయా?
* రుచిని పెంపొందింపజేసే చికిత్సలేవీ ప్రస్తుతానికి లేకపోయినా వైద్యులను సంప్రదిస్తే దానికి మూలకారణమేంటి? మనం వాడుతున్న ఇతరత్రా మందుల వల్ల సమస్యలేమైనా తలెత్తుతున్నాయా? ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? వాసనలు బాగానే చూడగలుగుతున్నారా? వంటివన్నీ పరిశీలించి తదనుగుణంగా చికిత్స అందించే
వీలుంటుంది.

* కేవలం రుచి సమస్య ఒక్కటే ఉంటే- పదార్థాలకు కమ్మటి వాసననిచ్చే సుగంధ ద్రవ్యాలను కలుపుకోవటం, ఆకర్షణీయంగా ఉండేలా వండుకోవటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. మొత్తమ్మీద రుచి తెలియటం లేదని తిండి మానేస్తే పోషకాహార లోపం తలెత్తుతుందన్న విషయం మాత్రం విస్మరించకూడదు. తిండి తినాలని అనిపించకపోతే... మనకు ఏదో జబ్బుచేసిన భావన కలుగుతుంది. రోజంతా అదే వేధిస్తుంటుంది. దానివల్ల కుంగుబాటు వంటి బాధలూ మొదలవుతాయి. కాబట్టి దీన్ని తోసేసుకు తిరగటం మంచిది కాదు.

పరిశోధనలు
ఆసక్తికరమైన అంశమేమంటే మన ఆఘ్రాణ శక్తికి మూలమైన ఆల్‌ఫ్యాక్టరీ కణాలు ముక్కు వెనకాల లోపలగా ఉంటాయి. అలాగే నాలుక మీది రుచి మొగ్గల్లో రుచి
కణాలుంటాయి. ఈ రెండు రకాల కణాలూ కూడా జీవితాంతం- పాతవి పోతూ, మళ్లీమళ్లీ కొత్తవి పుడూతూ ఉంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొత్త కణాల భర్తీ అనేది సన్నగిల్లుతుంటుంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 18, 2013

Drugs induced Gingivitis,మందులతో చిగుళ్ల సమస్యలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Drugs induced Gingivitis,మందులతో చిగుళ్ల సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చాలామంది శ్రద్ధ పెట్టటం లేదుగానీ అధిక రక్తపోటు(హైబీపీ)కు, గుండె జబ్బులకు, మూత్రపిండాల వ్యాధులకు వాడే మందులతో, అలాగే ముట్లుడిగిపోయే దశలో స్త్రీలకు వాడే ఈస్ట్రోజెన్‌ మాత్రలతో, అలర్జీ బాధితులు వాడే స్టిరాయిడ్లు, ఫిట్స్‌కు వాడే ఫెనటాయిన్‌ వంటి మందులతో... చిగుళ్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా- బీపీకి చాలా సర్వసాధారణంగా వాడుతుండే 'నిఫిడపిన్‌' వల్లకొన్నిసార్లు చిగుళ్లన్నీ కూడా చాలా పెద్దగా వాచిపోయి, నోరు తెరవటం, మూయటం కష్టంగా తయారవుతుంది. ఈ మందు వల్ల ఇలా జరగొచ్చని తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాగే మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి 'సైక్లోస్పోరిన్‌' అనే మందు నిరంతరాయంగా వాడుతుంటారు. దీనివల్ల చిగుళ్లు వాపు రావచ్చు. ఇక ఫిట్స్‌ వ్యాధిలో ఇచ్చే 'ఫినటాయిన్‌', 'సోడియం వాల్‌ప్రొయేట్‌' వంటి మందులతోనూ చిగుళ్లవాపు రావొచ్చు. ఇలా మందుల మూలంగా చిగుళ్లవాపు అందరికీ రావాలనేమీ లేదు. దీనికి జన్యుపరమైన అంశాలు దోహదం చేయొచ్చు. కొందరిలో మందు ఆరంభించిన పది రోజుల్లోనే చిగుళ్ల వాపు వస్తే మరికొందరిలో సంవత్సరమైనా రాకపోవచ్చు. మొత్తానికి బీపీ, మధుమేహం, కిడ్నీ జబ్బులు, ఫిట్స్‌ మందుల మూలంగా చిగుళ్ల వాపు వచ్చే అవకాశముందని గుర్తించాలి. వాపు మూలంగా సరిగా బ్రషింగ్‌ చేసుకోలేరు. దీంతో ఇన్‌ఫెక్షన్‌, చిగుళ్ల నుంచి రక్తం, చీము, నోటి దుర్వాసన, పళ్లు కదలటం.. ఇలా సమస్యలు వరుసపెడతాయి. కాబట్టి ఈ మందులు వాడేవారు తమ చిగుళ్లు ఎలా ఉన్నాయో తరచుగా గమనిస్తూ ఉండాలి. వాపు వస్తుంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసకువెళితే మందులను మార్చి, వేరేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. సైక్లోస్పోరిన్‌, నిఫిడపిన్‌ వంటి మందులను ఆపేసిన తర్వాత 6-8 నెలల్లోపు నెమ్మదిగా చిగుళ్ల వాపూ తగ్గుతుంది. మూర్ఛకు వాడే ఫినటాయిన్‌ మూలంగా వచ్చే వాపు ఆ మందులను ఆపేసినా తగ్గదు. వీరికి తప్పకుండా సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వైద్యులు కూడా సాధారణంగా దీనికి బదులు ప్రత్యామ్నాయ మందులను సూచిస్తుంటారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వాడేవారు కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా తమ చిగళ్ళు ఎలా ఉన్నాయో క్షుణ్నంగా పరీక్షించుకోవాలి. ఏమాత్రం వాపు కనిపించినా డాక్టరును సంప్రదిస్తే ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు.

 మరో సమస్య: మధుమేహం, హైబీపీ బాధితులు తీసుకునే మందుల వల్ల నోటిలో నీరు వూరటం తగ్గి తరచుగా పొడిబారుతుంటుంది. నిజానికి మన లాలాజలంలో చాలా రకాల రోగ నిరోధక కణాలుంటాయి. అటువంటి లాలాజలం తగ్గగానే నోటిలో నిరోధక శక్తి తగ్గుతుంది. రెండోది లాలాజలం దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటుంది కూడా. ఇది తగ్గగానే ఆహార పదార్థాలు దంతాలకు అతుక్కుపోవటం ఎక్కువ అవుతుంది. దీంతో చిగుళ్ల వ్యాధి ఆరంభమవుతుంది. కాబట్టి మధుమేహం, హైబీపీలకు సంబంధించిన మందులు వేసుకుంటున్నప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వీళ్లు- నీరు కాస్త ఎక్కువగా తాగటంతో పాటు ఉసిరికాయ ముక్కనుగానీ, నిమ్మ తొనను గానీ అప్పుడప్పుడు బుగ్గన పెట్టుకుంటే లాలాజల గ్రంథులు ఉత్తేజితమై లాలాజలం మరింత ఎక్కువగా ఊరే అవకాశం ఉంటుంది.

చికిత్స
చిగుళ్ల వ్యాధికి కారణమేమిటన్నది చూడటం ప్రధానం. ఏ చిగుళ్ల వ్యాధిని తీసుకున్నా కూడా అది ఆరంభమయ్యేది పంటి మీద పేరుకునే పాచి.. గారతోనే! కాబట్టి రక్తం వస్తున్న ఆ తొలి దశలో క్లీనింగ్‌/స్కేలింగ్‌ చేయించుకుంటే సరిపోతుంది. వైద్యులు ప్రత్యేక పరికరాలతో చేస్తేనే ఈ గార తొలగిపోతుందిగానీ ఎవరికి వారు తొలగించుకోవటం కష్టం. ఒకసారి గార శుభ్రం చేసేస్తే ఇక అక్కడి నుంచీ నిత్యం శుభ్రంగా బ్రషింగ్‌ చేసుకోవటం, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదు. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం మందులు వాడేవారు దీనిపై అవగాహన పెంచుకోవాలి. పైగా ఈ మందులు వాడే వారిలో చిగుళ్లు వాచే ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి వీరు తమ చిగుళ్లు సరిగ్గానే ఉన్నాయా? లేదా? అన్నది తరచుగా చూసుకుంటూ ఉండాలి. ఏ మాత్రం రక్తం వస్తున్నా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్‌ లోపలికి వెళుతుంది. ఈ దశలో కేవలం క్లీనింగ్‌, యాంటీబయాటిక్స్‌తో సరిపోతుందా? లేక సర్జరీ కూడా అవసరమవుతుందా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.

Courtesy with : Dr.P.kamaladevi -Proffessor , Govt.Dental college- Hyd.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, September 16, 2013

How to reduce belly?,బొజ్జ తగ్గేదెలా?

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How to reduce belly?,బొజ్జ తగ్గేదెలా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 బొజ్జ రావటానికి ఆహారంతో పాటు జీవనశైలీ దోహదం చేస్తుంది. బియ్యంలోని పిండి పదార్థాలు త్వరగా ఖర్చు కాకుండా కొవ్వు రూపంలో కడుపు వద్ద పేరుకుపోతుంటాయి. కాబట్టి అన్నం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. బొజ్జ తగ్గటానికి ఆహార నియమాలతో పాటు ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టటం మేలు.

ఒత్తిడికి దూరం
బరువు ఎక్కువగా లేకపోయినా బొజ్జ ఉన్నట్టయితే ఇందుకు ఒత్తిడి మూలంగా పేరుకునే కొవ్వు కారణం కావొచ్చు. ఒత్తిడి పెరిగినప్పుడు ఆకలిని పుట్టించే కార్టిజోల్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. దీంతో ఎక్కువెక్కువ తింటారు. ఇది కడుపు వద్ద కొవ్వు పేరుకోవటానికి దారితీస్తుంది.

మద్యపానానికి దూరం
మద్యం ద్వారా కేలరీలు అందటమే కాదు.. అది కొవ్వును శక్తిగా మార్చే శరీర సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. మద్యం శరీరంలో అసిటేట్‌గా మారుతుంది. అసిటేట్‌ మోతాదులు పెరిగితే కొవ్వు ఖర్చయ్యే ప్రక్రియ కూడా మందగిస్తుంది.

ఎముకల దృఢత్వం
ఎముకలు గుల్లబారితే వెన్నెముకలోని పూసలు నొక్కుకుపోయినట్లై వెన్ను పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా కడుపు భాగం ముందుకు తోసుకొచ్చి, కుచించుకుని బొజ్జలా రావొచ్చు. కాబట్టి ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం, విటమిన్‌- డి అందేలా చూసుకోవాలి.

మానెయ్యాల్సినవి
అతిగా శుద్ధిచేసిన పిండి పదార్థాలతో చేసిన బ్రెడ్డు, బిస్కట్లు, కేకుల వంటివి తగ్గించాలి. మేక, గొర్రె మాంసం.. చిప్స్‌, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌లో సంతృప్తకొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కడుపు వద్ద కొవ్వు పేరుకునేలా చేస్తుంది. కూల్‌డ్రింకులు, స్వీట్ల వంటివీ బొజ్జకు దారితీస్తాయి.

తినాల్సినవి
బాదంపప్పు, నువ్వులు, వేరుశనగలు, సోయా తినాలి. మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గల ఆవనూనె, తవుడు నూనె వంటివి వంటకు ఉపయోగించాలి. రోజుకి నాలుగైదు సార్లు కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిల్లోని పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీవక్రియను పెంచటానికి తోడ్పడతాయి. తేలికైన మాంసకృత్తులు గల గుడ్డులోని తెల్లసొన, చేపలు, కోడిమాంసం.. చిక్కుళ్లు, పొట్టుతీయని ధాన్యాలు కూడా బొజ్జ రాకుండా చూస్తాయి.

ఇవీ పనిచేస్తాయి
నవ్వినప్పుడు కడుపులోని అన్ని కండరాలూ పనిచేస్తాయి. కాబట్టి హాయిగా నవ్వేందుకు ప్రయత్నించండి. వీలుంటే ఈతకూ వెళ్లొచ్చు. ఈత మూలంగా కడుపులోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. స్ట్రెచింగ్‌ వ్యాయామాలు బొజ్జ తగ్గటానికి తోడ్పడతాయి. యోగాసనాలు కూడా కడుపు వద్ద కండరాలను దృఢంగా, బిగుతుగా చేస్తాయి.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Heart attack-bypass surgery awareness,గుండె పోటు - బైపాస్‌ ఆపరేషన్‌ అవగాహన

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart attack-bypass surgery awareness,గుండె పోటు - బైపాస్‌ ఆపరేషన్‌ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిడుగుపాటులా ముంచుకొచ్చే 'గుండె పోటు'  అనూహ్యంగా సంభవించే ఈ విలయాన్ని గుర్తించి తక్షణం నష్ట నివారణ చికిత్సలు మొదలుపెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు.. ఒకవేళ ప్రాణాలు దక్కినా విపరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. గుండెపోటు ముంచుకొచ్చిన తర్వాత గడిచే ప్రతి ఘడియా.. ప్రతి గంటా... గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. గుండె అనేది బిగువుగా, దృఢంగా, సమర్థంగా కొట్టుకుంటూ ఉండే కండరం. గుండెపోటు తర్వాత సమయం గడుస్తున్న కొద్దీ క్రమేపీ ఇది చచ్చుబడిపోవటం మొదలవుతుంది. ఒకసారి ఈ చచ్చుబడటం ఆరంభమైతే... దాన్ని తిరిగి కోలుకునేలా చెయ్యటం, మళ్లీ నిలబెట్టటం చాలా కష్టంతో కూడుకున్న పని.

కొన్నిసార్లు వెంటనే ఆపరేషన్‌ చేసి సరిచెయ్యటం కూడా సాధ్యం కాదు.తర్వాత కొంత కాలానికి సరిచెయ్యాలన్నా క్లిష్టంగా తయారవుతుంది.

దీనితో ఇన్ని విపత్తులుంటాయని తెలిసి కూడా... చాలాసార్లు గుండెపోటును గ్యాస్‌ సమస్యగానో, అసిడిటీగానో పొరబడి విలువైన సమయాన్ని వృథా చేసి... గుండెకు తీవ్రమైన చేటు చేసుకుంటున్న వారు నేడు ఎంతోమంది! అందుకే ఛాతీలో నొప్పులన్నింటినీ తేలికగా తీసుకోవటం సరికాదు .

మన ప్రాణానికి మూలంగా నిలుస్తూ... జీవితాంతం నిర్విరామంగా కొట్టుకుంటూ... శరీరంలోని కణకణానికీ నిరంతరాయంగా రక్తాన్ని పంపింగ్‌ చేస్తుండే మన గుండె... స్థూలంగా చెప్పాలంటే ఓ దృఢమైన కండరం! ఈ కండరం ఇలా సమర్థంగా, సజీవంగా పని చేస్తుండాలంటే.. శరీరం మొత్తానికీ అవసరమైనట్లే.. ఈ కండరానికీ రక్తం, నిరంతరాయమైన రక్తసరఫరా అవసరం. అందుకే ఈ గుండె కండరానికి రక్తాన్ని అందించేందుకు గుండె గోడల్లోనే ప్రధానంగా మూడు రక్తనాళాలుంటాయి, వీటినే 'కరోనరీ ధమనులు' అంటారు.

ఈ కరోనరీ ధమనుల్లో ఎక్కడైనా కొవ్వు పూడికలు వచ్చి.. వీటి గుండా రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే.. తక్షణం మన గుండెలో పెను విలయం తలెత్తుతుంది. దీన్నే 'గుండెపోటు' అంటాం. ఆ రక్తనాళం ద్వారం రక్తం అందుకుంటుండే గుండె కండర భాగమంతా... రక్తప్రవాహం అందక... నిమిషాలు, గంటల్లోనే చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే 'గుండె నొప్పి', 'గుండె పోటు' అన్న అనుమానం వచ్చినప్పుడు తక్షణం వైద్య సహాయం కోసం ప్రయత్నించాలి. ఆసుపత్రికి వెళ్లగానే ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్‌ వంటి రకరకాల పరీక్షలు చేసి అది నిజంగా 'గుండె పోటేనా?' అన్నది కచ్చితంగా నిర్ధారించి, వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెడతారు, దీనివల్ల గుండె తిరిగి మామూలు స్థాయికి చేరుకునే అవకాశముంటుంది.

ముఖ్యంగా- గుండెలోని ఒకటి లేదా రెండు రక్తనాళాల్లో మాత్రమే పూడికలుంటే 'యాంజియోప్లాస్టీ' ప్రక్రియ ద్వారా బయటి నుంచి గుండెలోకి ఒక తీగగొట్టం పంపించి, దాని సాయంతో పూడికను తెరుస్తూ.. అదే సమయంలో అక్కడ మళ్లీ పూడిక రాకుండా, అవరోధాలు ఏర్పడకుండా స్ప్రింగుల వంటి 'స్టెంట్లు' అమరుస్తారు. వీటితో సమస్య చాలావరకూ సర్దుకుంటుంది. అలా కాకుండా..... ఛాతీనొప్పి కొనసాగుతూ, యాంజియోగ్రామ్‌ పరీక్షలో మొత్తం మూడు కరోనరీ రక్తనాళాల్లోనూ పూడికలున్నట్టు కచ్చితంగా గుర్తిస్తే సత్వరమే రక్తాన్ని పునరుద్ధరించేందుకు 'బైపాస్‌' ఆపరేషన్‌ చేసి.. మరో రక్తనాళాన్ని తెచ్చి అతకటం ద్వారా.. గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోకుండా, అది చచ్చుబడకుండా కాపాడగలుగుతారు. ఈ ఆపరేషన్‌ను వీలైనంత త్వరగా చేస్తేనే ఫలితం ఉంటుంది. ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత తొలి 12 గంటల్లో గుండె కండరం బలంగానే ఉంటుంది. గానీ అక్కడి నుంచీ సమయం గడిచే కొద్దీ అది రకరకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గుండె పనితీరుకు, సామర్థ్యానికి తీవ్ర విఘాతం కలగొచ్చు. ఆ సమయంలో ఆపరేషన్‌ చేసి.. సరిచెయ్యటం కూడా కష్టం కావచ్చు. అందుకే ఇటువంటి సమయంలో వైద్యులు ముందు ఆ తీవ్ర విలయం నుంచి గుండెను బయటపడేసేందుకు.. స్థిరపరిచేందుకు కృషి చేస్తారు. తర్వాత...నెమ్మదిగా జరిగిన నష్టం ఏమిటి? ఎంత మేర జరిగింది? దాన్ని చక్కదిద్దేందుకు ఆపరేషన్‌ చెయ్యొచ్చా? చేస్తే మరమ్మతు ఎలా చెయ్యాలన్నది ఆలోచించి.. చికిత్స అందిస్తారు. గుండెపోటు వచ్చినప్పుడు సకాలంలో సత్వర చికిత్స అందించలేకపోతే.. గుండె కండరానికి ఎటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉందో చూద్దాం.

నష్టాలు :
గుండెలోని మూడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, గుండెపోటు వచ్చినప్పటికీ వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోకపోతే దీనివల్ల గుండెలో రకరకాల సమస్యలు తలెత్తచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి చూద్దాం.

* గుండె లోపల మచ్చ: మన శరీరం మీద ఎక్కడన్నా దెబ్బ తగిలి, మానిపోయిన తర్వాత అక్కడ మందపాటి మచ్చ మిగిలిపోతుంది కదా.. గుండెపోటు తర్వాత గుండె కండరం మీద కూడా ఇలాగే మచ్చ భాగం తయారవ్వచ్చు. ఎందుకంటే గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరంలో కొంత భాగానికి రక్తం అందక.. అది బలహీనపడి దెబ్బతింటుంది. క్రమేపీ 3-6 వారాల సమయంలో అక్కడ ఈ మచ్చలాంటి భాగం తయారవుతుంది. సమస్యేమంటే- పక్షవాతానికి గురైన అవయవంలాగా ఆ కాస్త భాగం పని చేయదు. ముఖ్యంగా కరోనరీ ధమనుల్లో కుడి ధమనిలో పూడిక మూలంగా గుండెపోటు వచ్చినవారు సాధారణంగా బాగానే కోలుకుంటారు.. వస్తే వీరిలో గుండె కొట్టుకునే లయకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మొత్తానికి వీరిలో గుండె కండరం పెద్దగా దెబ్బతినదు. కానీ ఎడమవైపు ఉండే ప్రధాన రక్తనాళంలో (ఎల్‌ఏడీ) పూడిక ఏర్పడి, దాని మూలంగా గుండెపోటు వస్తే మాత్రం- తక్షణ ప్రాణాపాయం సంభవించొచ్చు. ఒకవేళ దీన్నుంచి బయపడినా.. దీనివల్ల గుండె కండరానికి జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. అది బాగా దెబ్బతింటుంది.

* పంపింగ్‌ సామర్థ్యం దెబ్బతినం: గుండె కండరం దృఢంగా పనిచేసేదే రక్తాన్ని బలంగా 'పంపింగ్‌' చెయ్యటం కోసం. అలాంటి కండరం గుండెపోటు తర్వాత చచ్చుబడినట్త్లెతే.. దాని పంపింగ్‌ సామర్థ్యం బాగా దెబ్బతినొచ్చు. ముఖ్యంగా గుండెకు అవసరమైన శక్తిలో మూడోవంతు శక్తిని- గుండెలోని రెండు జఠరికల మధ్య ఉండే గోడ అందిస్తుంటుంది. గుండెపోటు మూలంగా ఈ గోడ భాగంలో మచ్చ ఏర్పడితే పంపింగ్‌ సామర్థ్యం పడిపోతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన గుండె పంపింగ్‌ సామర్థ్యం 60-65% ఉంటుంది. గుండెపోటు మూలంగా ఆ గోడ దెబ్బతింటే ఈ సామర్థ్యం 35 శాతానికి పడిపోతుంది. దీంతోఏమాత్రం పనిచేసినా.. చివరికి కాస్త దూరం నడిచినా ఆయాసం వస్తుంది. క్రమేపీ రోజువారీ పనులూ కష్టంగా తయారవుతాయి.

* రక్తం గడ్డకట్టటం: గుండెలో కొంతభాగం సరిగా కదల్లేక.. సంకోచ వ్యాకోచాలు సరిగా లేకపోవటం వల్ల కొంత రక్తం గుండె గదుల్లోనే నిల్వ ఉండిపోతుంటుంది. ఇలా పేరుకున్న రక్తం గడ్డకట్టే అవకాశమూ పెరుగుతుంది. ఇలా ఏర్పడ్డ చిన్నచిన్న రక్తం గడ్డలు.. రక్తప్రవాహంలో కలిసిపోయి బృహద్ధమనిలోకి, మెదడులోకి.. ఇలా శరీరంలోని ఏ భాగానికైనా చేరుకుని.. పక్షవాతం నుంచి రకరకాల తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టొచ్చు.

* కవాట ద్వార బంధనాలు తెగిపోవటం: గుండె గదుల మధ్య ఉండే కవాటాలకు రెక్కల్లాంటి ద్వారాలుంటాయి. అవి తెరుచుకుంటూ, మూసుకుంటూ ఉండటానికి వీలుగా కింది నుంచి వాటికి తాళ్లలాంటి నిర్మాణాలు అతుక్కుని ఉంటాయి. వీటినే 'పాపిలరీ మజిల్స్‌' అంటారు. గుండెపోటు కారణంగా గదుల మధ్య గోడ, కొంత కండరం దెబ్బతిన్నప్పుడు- ఈ తాళ్లు బలహీనపడి తెగిపోవచ్చు. దీంతో కవాటాల రెక్కలు తెరచుకోవటం, మూసుకోవటం కష్టమై లీకైపోతూ... రక్తం పంపింగ్‌ కష్టమై తీవ్ర విపత్తు రావచ్చు. దీన్ని 'సివియర్‌ అక్యూట్‌ ఎంఆర్‌' అంటారు.

* చినిగే గుండె: గుండెపోటు వచ్చిన తర్వాత ఎడమ జఠరికల గోడలు చచ్చుబడినట్త్లె బలహీనపడి క్రమేపీ పల్చబడి.. చిరిగిపోవచ్చు. దీన్నే 'ఫ్రీ వాల్‌ రప్చర్‌' అంటారు. దీంతో గుండెలో నుంచి రక్తం బయటకు, అంటే ఆ కుహరంలోకి వచ్చేస్తుంది. ఫలితంగా గుండె చుట్టూ రక్తం చేరిపోయి.. అసలు గుండెను వ్యాకోచించనివ్వకుండా నొక్కేస్తూ.. ప్రాణాల మీదికి వస్తుంది.

* మైట్రల్‌ కవాటం లీకేజీ: గుండె కండరానికి రక్త సరఫరా తగ్గి, కండరం బలహీనపడి.. కొంతభాగం మచ్చలా ఏర్పడి.. సమర్థంగా పనిచెయ్యనప్పుడు పంపింగ్‌ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల గుండెలో ఎక్కువ రక్తం నిల్చిపోతూ 3, 4 నెలల తర్వాత గుండె గది పెద్దగా అవుతుంది. క్రమేపీ మైట్రల్‌ కవాటం లీక్‌ కావటమూ ఆరంభమవుతుంది. దీన్ని 'ఇస్కీమిక్‌ మైట్రల్‌ రిగర్జిటేషన్‌' అంటారు. ఇది క్రమేపీ గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

* గోడకు రంధ్రం: కొందరికి గుండెపోటు తర్వాత గుండె లోపల ఒత్తిడి పెరిగి.. గదుల మధ్య ఉండే గోడలాంటి కండరానికి రంధ్రం పడొచ్చు. దీన్ని 'పోస్ట్‌-ఇన్‌ఫార్‌క్షన్‌ వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌' అంటారు.

'బైపాస్‌' పని చేయదా?
గుండెలోని రక్తనాళాల్లో రక్తప్రవాహానికి పూడికలు అడ్డుపడుతుంటే... ఆ అడ్డును తప్పించి.. దానిలో తిరిగి రక్తం ప్రవహించేలా ఒక కొత్త రక్తనాళాన్ని అతకటం బైపాస్‌ ఆపరేషన్‌ లక్ష్యం. అయితే ఇలా ఒకసారి రక్తనాళాల్లో పూడికల కారణంగా గుండెపోటు వచ్చి.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతిన్నప్పుడు కేవలం రక్తాన్ని పునరుద్ధరించే బైపాస్‌ ఆపరేషన్‌ సరిపోదు. ఆ దెబ్బతిన్న భాగమేమిటో.. దానివల్ల తలెతున్న నష్టమేమిటో గుర్తించి.. దాన్ని కూడా చక్కదిద్దాల్సి ఉంటుంది. ఇదో రకంగా బాంబులు పడి దెబ్బతిన్న వూరిని బాగుచెయ్యటం లాంటిది! అందుకే ఇలాంటి సమయంలో చేసే సర్జరీని 'సంక్లిష్టమైనది'గా గుర్తించాల్సి ఉంటుంది. కేవలం రక్తనాళాల్లో పూడికలు మాత్రమే ఉండి, ఇతరత్రా సమస్యలేమీ లేనప్పుడు తేలికగా మరో రక్తనాళాన్ని తెచ్చి అతికితే సరిపోతుంది. దీన్ని 'సింపుల్‌ బైపాస్‌' అంటారు. వీరిలో 99% మంది ఎటువంటి సమస్యలూ లేకుండా బాగానే బయటపడతారు. అయితే ఇలా గుండెపోటు మూలంగా కండరం దెబ్బతిని, తీవ్ర నష్టం సంభవించినప్పుడు- రక్తసరఫరాను పునరుద్ధరించే బైపాస్‌ ఆపరేషన్‌తో పాటే.. జరిగిన నష్టాన్ని చక్కదిద్దేందుకు క్లిష్టమైన మరమ్మతూ చెయ్యాల్సి వస్తుంది. నేటి అత్యాధునిక వైద్యరంగం వీటన్నింటినీ సమర్థంగానే అధిగమించగలుగుతోంది. సమస్యను బట్టి మరమ్మతు ఆపరేషన్‌ చేస్తారు.

'మొన్నే గుండెకు బైపాస్‌ చేయించా..!'
 గుండెలోని రక్తనాళాలు ఎక్కువగా పూడుకుపోయి గుండెపోటు దాపురించినా, లేదా వచ్చే పరిస్థితి నెలకొన్నా.. దాన్నుంచి బయటపడెయ్యటంలో 'బైపాస్‌' ఆపరేషన్‌ ఎంతో అద్భుతంగా అక్కరకొచ్చే మాట నిజం. అయితే గుండెపోటు విషయంలో సకాలంలో స్పందించకుండా కాలయాపన చేస్తే... గుండె కండరం బాగా దెబ్బతిని... ఈ బైపాస్‌ ఆపరేషన్‌తో కూడా పరిస్థితిని చక్కదిద్దటం కష్టమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడా ఓటి గుండెను నానారకాల క్లిష్టమైన ఆపరేషన్లతో ఎలాగోలా నిలబెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొన్నిసార్లు అదీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే గుండెపోటు అనుమానం తలెత్తితే సత్వరమే స్పందించటం, వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం చాలాచాలా అవసరం.

మరమ్మతు ఎలా?
* గుండె కండరం చచ్చుబడినట్త్లె.. ఎక్కడ మచ్చ ఏర్పడినా ఆ కాస్త భాగాన్నీ తొలగించెయ్యక తప్పదు. లేకపోతే అది బాగున్న కండరాన్నీ సరిగా పనిచెయ్యనివ్వకుండా వెనక్కి గుంజుతుంటుంది. కాబట్టి మచ్చ పడిన భాగాన్ని సాధ్యమైనంత వరకూ కత్తిరించేసి, చివళ్లను లోనికి మడిచి కుట్టేస్తారు. దీనివల్ల క్రమేపీ గుండె ఆకృతి మెరుగుపడి, సమర్థంగా పనిచేస్తుంది. పంపింగ్‌ సామర్థ్యం 60 శాతానికి చేరుకోకపోయినా.. రోజువారీ పనులకు అవసరమైన 40% మేరకన్నా మెరుగవుతుంది. ముఖ్యంగా గుండెలో కదలికలేకుండా చచ్చుబడినట్లుండే (ఎకైనెటిక్‌) భాగమేదీ ఉండదు కాబట్టి రక్తం గడ్డకట్టే ముప్పు తప్పుతుంది.

* సాధారణంగా మన గుండె కింది భాగం శంఖంలా కోసుగా ఉంటుంది. అయితే గుండెపోటు వల్ల కండరం చచ్చుబడితే ఈ అడుగుభాగం గుండ్రంగా తయారైపోతుంది. అందుకే ఆపరేషన్‌ సమయంలో మచ్చ భాగాన్ని తొలగిస్తూనే, గుండె కింది భాగం తిరిగి సాధ్యమైనంత శంఖాకృతిలోకి వచ్చేలా చేస్తారు. ఇలాచేస్తే గుండె పంపింగ్‌ సామర్థ్యం మెరుగ్గా ఉంటోందని గుర్తించారు.

* గుండెపోటు మూలంగా గదుల మధ్య గోడకు రంధ్రాలు పడితే బైపాస్‌ ఆపరేషన్‌ సమయంలోనే వాటినీ మూసెయ్యటం, మైట్రల్‌ కవాటం నుంచి రక్తం లీకవుతుంటే తెగిన పాపిలరీ కండర తంత్రులను తిరిగి అతకటం వంటి మరమ్మతులూ చేస్తారు.

* ఎడమ జఠరిక చినిగిపోతే (రప్చర్‌ లెఫ్ట్‌ వెంట్రికల్‌) మాత్రం చికిత్స కష్టం. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తూ ఆ చిరిగినచోట రక్తం గడ్డకట్టి అంటుకుపోయినట్టుగా తయారవుతుంది. దాన్ని త్వరగా గుర్తించి ఆపరేషన్‌ చేస్తే ఫలితముంటుంది. ఇదే కాదు, గదుల మధ్య గోడకు రంధ్రం (వీఎస్‌డీ), తీవ్రమైన మైట్రల్‌ కవాటం లీకేజీ వంటి సమస్యలకూ అత్యవసరంగా ఆపరేషన్‌తప్పదు. లేకపోతే వూపిరితిత్తులూ సరిగా పనిచెయ్యలేని విపత్తు ముంచుకొచ్చేస్తుంది.

ఆపరేషన్‌ ఎప్పుడు?
గుండెపోటు వచ్చి 12 గంటలు దాటినా స్థిరంగా ఉండి, ఎడమ జఠరిక సరిగా పనిచేయకుండా ఉన్నవారికి.. కేవలం గుండె కండరం మాత్రమే దెబ్బతిని ఛాతీ నొప్పి, వూపిరితిత్తులు నిండిపోవటం వంటి ఇతరత్రా సమస్యలు లేనివారికి.. అలాగే వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాస కల్పించాల్సిన అవసరం లేకుండా కొంత బాగానే ఉన్న వారికి- ఆపరేషన్‌ విషయంలో కొంతకాలం వేచి చూడొచ్చు. ముందు వీరికి మందులతో చికిత్స చేసి కుదుటపడేలా చేస్తారు. ఓ వారంపది రోజుల తర్వాత ఎమ్మారై పరీక్ష చేసి- కండరం ఎంత దెబ్బతింది? మచ్చ ఎక్కడ పడిందన్నది తెలుసుకుంటారు. అప్పుడు దీన్ని ఎంతమేర తొలగించి సరిచెయ్యొచ్చో గుర్తించి... మెల్లగా ఆపరేషన్‌ చేస్తారు.

మందులు మానేస్తే మరీ అనర్థం
* కొందరికి గుండెపోటు వచ్చినా కేవలం ఒక రక్తనాళంలోనే పూడిక ఉంటుంది. ఇలాంటి వారికి వైద్యులు సాధారణంగా మందులతోనే చికిత్స చేస్తుంటారు. వీరికి స్టెంట్‌ అమర్చటం, ఆపరేషన్‌ వంటివేమీ అక్కర్లేదు. అయితే వీరు కొంతకాలం మందులు వాడి మానెయ్యటం వంటివి చేస్తే... మళ్లీ గుండెలోని రక్తనాళాలు పూడుకుపోవచ్చు. మళ్లీ గుండెపోటు రావొచ్చు. ఈ దఫా గుండె కండరంలో మిగతా భాగం దెబ్బతినొచ్చు. దీన్ని గుర్తించకపోతే 2, 3 వారాల తర్వాత తీవ్ర ఆయాసం వంటి లక్షణాలు బయటపడతాయి. వీరికి ఎమ్మారై పరీక్ష చేస్తే చాలాచోట్ల గుండెలో మచ్చలు కనబడతాయి. ఇలా గుండె కండరం చాలాచోట్ల దెబ్బతిని.. చాలాచోట్ల చచ్చుబడిన వారికి (మల్టీ టెరిటరీ నాన్‌ వయబుల్‌ మయో కార్డియం) బైపాస్‌ చేయటంగానీ, దెబ్బతిని మచ్చపడిన భాగాలను తొలగించటం గానీ కుదరదు. వీరికి బైపాస్‌ సర్జీరీ చేసినా గుండె సామర్థ్యం మెరుగు పడటానికి పెద్దగా అవకాశం ఉండదు. పైగా ప్రాణాలకు ముప్పూ చాలా ఎక్కువ. మచ్చల మూలంగా హఠాత్తుగా గుండె లయ దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి వారికి.. గుండె మీద ఎక్కువ భారం పడకుండా కేవలం మందులు, ఉప్పు తక్కువగా తినటం వంటి జాగ్రత్తలు మాత్రమే సూచిస్తారు. గుండెలో ఇలా చాలాచోట్ల మచ్చలు ఏర్పడినవారు ఎక్కువ కాలం జీవించటం కూడా కష్టం.

గ్యాస్‌ నొప్పే అనుకోవద్దు!-బైపాస్‌తో అయిపోతుందని భ్రమపడొద్దు!
ఛాతీనొప్పిగా అనిపించినప్పుడు.. ఒకవేళ అది అసిడిటీ నొప్పే అయినా గుండె పోటు కాదని నిర్ధారించుకోవటం అన్నివిధాలా మేలు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్లు గుండెనొప్పి విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. ఛాతీలో నొప్పి వస్తుంటే అదే తగ్గుతుందిలే అని తోసేయకుండా ఓసారి 'ఈసీజీ' వంటి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఒకవేళ అది గుండెనొప్పి అయితే సత్వర చికిత్సతో గుండెకు మరింత నష్టం జరగకుండా.. గుండె కండరం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గుండెనొప్పిని గ్యాస్‌ నొప్పిగా పొరబడి తోసేసుకు తిరుగుతుంటే.. రెండు మూడు వారాల తర్వాత పరిస్థితి మరింత విషమిస్తుంది. అప్పుడు గుండెకు క్లిష్టమైన మరమ్మతులు చెయ్యాల్సి రావచ్చు.. కొన్నిసార్లు ఆ అవకాశమూ ఉండకపోవచ్చు కూడా!

courtesy with Dr.Mannam  Gopichand -chief cardiologist , Star hospital , Hyd.@eenadu sukhibhava
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sleep Apnea,స్లీప్ అప్నియా

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Sleep Apnea,స్లీప్ అప్నియా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.

ప్రపంచంలోని ప్రతి జీవిని మైమరిపింపజేసేది నిద్ర. ప్రతిరోజూ మనల్ని నూతనోత్తేజంతో ఆవిష్కరింపజేసే నిద్ర ఎంత అమృత ప్రాయంగా ఉంటుందో నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. క్లాస్‌లో పాఠం వినేప్పుడు ఆవులింతలు తీయడం, ఏ సభకో, సమావేశానికో వెళ్లినప్పుడు ఒకరో ఇద్దరో ఓ మూల కూర్చుని గురకపెట్టడం గమనిస్తూనే ఉంటాం. రాత్రంతా గురకపెట్టి నిద్రపోయినా మర్నాటి ఉదయం మగతగా ఉండేవాళ్లూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటివాళ్లకు ఉండే సమస్యనే స్లీప్ అప్నియా సిండ్రోమ్ అంటారు. స్థూలకాయంతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది

స్లీప్ అప్నియా అనేది ఒక నిద్రా అవ్యవస్థ లేదా క్రమరాహిత్యం. ఇది నిద్రిస్తున్నప్పుడు శ్వాసలో అంతరాయాల ద్వారా ఏర్పడుతుంది. నిద్రలేమి నుండి, శ్వాస పీల్చడం వరకూ అప్నియా అని పిలువబడే ప్రతి ఘటన ., చాలా కాలం కొనసాగుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు శ్వాసలు తప్పిపోతాయి, అలాంటి ఘటనలు నిద్రాసమయం పొడవునా పదే పదే సంభవిస్తుంటాయి. ఏదైనా స్లీప్ అప్నియా ఘటనకు సంబంధించిన ప్రామాణిక నిర్వచనం శ్వాసల మధ్య కనీసం 10-సెకనుల విరామంతో కూడుకుని ఉంటుంది. నాడీశాస్త్రపరమైన మేల్కొలుపు , లేదా O2గా కొలవబడే EEG ఫ్రీక్వెన్సీలో 3 సెకనులు లేదా అంతకు మించిన మార్పు లేదా రక్తం ఆక్సిజన్ లో 3-4% లేదా అంతకు మించిన శాతం కోల్పోవడం లేదా పెంపు మరియు కోల్పోవడం అనే రెండు రూపాలలో ఇది ఉంటుంది. స్లీప్ అప్నియా అనేది పోలిసోమ్నోగ్రామ్, లేదా "నిద్రా అధ్యయనం అని పిలువబడే ఒక రాత్రిపూట నిద్రా పరీక్షతో వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.

లక్షణాలు :
శరీరంలోని టాన్సిల్ సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంది. నిద్రలో దేహక్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటికీ ప్రమాదం. జీవ ప్రక్రియల వేగం పడిపోవడంతో శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం ఈ అప్నియా లక్షణం.  మతిమరుపు, మాట్లాడుతూనే నిద్రపోవడం, విపరీతంగా గురకపెట్టడం, పగటి సమయంలో మెలకువతో ఉన్నా మగతగా, అలసటగా కనిపిస్తారు. స్లీప్ అప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు.

అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరువై పగటిపూట కునికి పాట్లు తీస్తుంటారు. ఈ అప్నియాతో కోపం,అసహనం, గుండెజబ్బులు,  శరీరంలో కొలస్ట్రాల్ వల్ల ప్రాణాపాయం ఉండును . అయితే రక్తనాళాల బలహీనత గుండెకు సంబంధించిన జబ్బులు మాత్రం ఉంటే ప్రాణాంతకంగా మారవచ్చు.

 స్లీప్ అప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఆక్సిజన్ అవసరం కోసం కాస్త వ్యాయామ రీతిలో పనిచేయడం,
ఆల్కహాల్‌ను సేవించడం నిలిపివేయడం,
అతిగా భోజనం చేయకూడదు ,
క్రొవ్వు పదార్థాలను తక్కువుగా తీసుకోవడం,

చికిత్స
స్లీప్ అప్నియా - నిద్ర రుగ్మతలకు చికిత్సలను సాధారణంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు:

    ప్రవర్తన/ మానసిక వైద్య విధానాలు
    పునరావాసం/నిర్వహణ
    ఔషధాలు చికిత్స
    ఇతర శారీరక చికిత్సలు
ఈ సమస్యలకు చికిత్స పలురకాలుగా ఉంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవాళ్లకైతే ‘సిప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని సూచిస్తాం. దీన్ని నిద్రపోయే ముందు ముక్కుమీద గాని, ముఖం మీద గాని అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంపు చేస్తుంది. నాలుక గొంతులో అడ్డం పడకుండా చూస్తుంది. ఫలితంగా పేషెంట్‌కు గొప్ప రిలీఫ్ వస్తుంది. దశాబ్దాల నరకం నుంచి హఠాత్తుగా బయటపడినంత ఆనందం పొందుతారు. వాస్తవానికి ఈ సాధనాన్ని ఒక పరిమిత కాలానికి ఉద్దేశించి సూచిస్తాం. పేషెంట్ తన బరువు తగ్గించుకుంటే ఆపైన దీని అవసరం ఉండదు. ఈ సాధనం కూడా పెద్దగా రిలీఫ్ ఇవ్వలేకపోతే అప్పుడు మాత్రమే సర్జరీ అవసరం పడొచ్చు.
Treatment often starts with behavioral therapy. Many patients are told to avoid alcohol, sleeping pills, and other sedatives, which can relax throat muscles, contributing to the collapse of the airway at night. As sleep apnea is inherently worse in the supine position for many patients (positional sleep apnea), sleeping on one's side is often advised.

Possibly owing to changes in pulmonary oxygen stores, sleeping on one's side (as opposed to on one's back) has been found to be helpful for central sleep apnea with Cheyne–Stokes respiration.
Medications

Medications like acetazolamide lower blood pH and encourage respiration. Low doses of oxygen are also used as a treatment for hypoxia but are discouraged due to side effects.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Know your Diabetes,మీ డయబిటీస్ గురించి తెలుసుకోండి

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Know your Diabetes,మీ డయబిటీస్ గురించి తెలుసుకోండి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...






  •  

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hyperuricemia ,హైపర్ యూరిసేమియా

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hyperuricemia ,హైపర్ యూరిసేమియా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




  •  
  •  Courtesy with : Franco-Indian Pharmaceuticals pvt.Ltd.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 4, 2013

Psoriatic Arthritis,సొరియాటిక్ ఆర్థరైటిస్‌

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Psoriatic Arthritis-సొరియాటిక్ ఆర్థరైటిస్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సొరియాసిస్ ఒక తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే రోగనిరోధక శక్తికి తప్పుడు సంకేతాలు వెళ్లడం వల్ల మిత్ర కణాలనే శత్రుకణాలుగా పొరబడి దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే సొరియాసిస్ వస్తుంది. ఆ తర్వాత తెల్లటి పొలుసుల మాదిరిగా చర్మం రాలిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది.

మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటి పొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అని అంటారు. కణాలు డెర్మిస్ పొరలో పుట్టి ఎపిడెర్మిస్‌లోకి వస్తుంటాయి. ప్రతి 20-30 రోజులకొక సారి ఎపిడెర్మిస్‌లోని కణాలు డెర్మిస్‌లో తయారయిన కొత్త కణాలతో రీప్లేస్ చేయబడుతాయి. సొరియాసిస్ వ్యాధిలో కణాలు తయారయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొత్త కణాలు తయారయి చర్మం పై భాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారవుతాయి. ఇది కొన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరగడం, తగ్గడం జరుగుతుంది. చర్మం పొలుసుల మాదిరిగా రాలిపోతుండటంతో నలుగురిలో తిరగలేకపోతారు. ఉద్యోగం చేసుకోలేకపోతారు. మెల్లగా డిప్రెషన్ లోకి వెళతారు. దీని వల్ల వ్యాధి మరింత తీవ్రమవుతుందే తప్ప ఫలితం ఉండదు. సొరియాసిస్ చర్మానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు చాలా మంది. కానీ తిరిగి అదే ప్రదేశంలో లేక వేరే ప్రాంతంలో మరింత తీవ్రస్థాయిలో ఆ వ్యాధి బయటపడుతుంది. సొరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు భాగాలలో కనిపిస్తుంది. అంతేకాదు కాలిగోళ్లలోకి విస్తరిస్తుంది. సొరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీన్ని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు.

సొరియాటిక్ ఆర్థరైటిస్ - సొరియాటిక్ ఆర్థరైటిస్ మూలంగా కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి కలగడం జరుగుతుంటుంది. సొరియాసిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో గోళ్లలో సొరియాసిస్ కనిపిస్తుంది. సిమ్మెట్రికల్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో శరీరంలో రెండు వైపులా ఒకే ప్రదేశంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్స్‌పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నపుడు నడుము బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. సొరియాసిస్ వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

కారణాలు - ఆటో ఇమ్యూన్... సొరియాసిస్‌కు కారణమవుతుంది. శరీరంలో ఇమ్యూన్‌సెల్స్ పొరపాటున సొంతకణాలపై దాడి చేయడం వల్ల ఈ అసాధారణంగా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టొకాకల్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సొరియాసిస్‌కు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థతోనే ఈ అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడయింది.

సొరియాసిస్ రకాలు - ప్లేక్స్ సొరియాసిస్, గటెడ్ సొరియాసిస్, నెయిల్ సొరియాసిస్, ఫస్టులార్ సొరియాసిస్, జంబుష్ సొరియాసిస్.

సొరియాసిస్ లక్షణాలు - వ్యక్తికి, వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. సొరియాసిస్ విస్తరించిన ప్రదేశం, వ్యాధి ఉన్న కాలాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. ఎర్రని ప్యాచ్‌ల మాదిరిగా ప్లేక్స్ చర్మం పై ఏర్పడతాయి. గోకినపుడు దురద, మంటగా ఉంటుంది. చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్ల ఏర్పడటంతో పాటు రక్తస్రావం అవుతుంది. కీళ్లపై ప్రభావం పడినపుడు కీళ్ల దగ్గర వాపు, నొప్పి ఉంటుంది.

చికిత్స - సొరియాసిస్‌కు  చక్కని చికత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్స కణజాల స్థాయిలో పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.స్

Non steroidal anti-inflamatory drugs :
ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడానికే చికిత్స  చేస్తారు. నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందులు అనగా -- ihurofen , naproxen  వంటివి వాడాలి. గాస్ట్రిక్ ప్రోబ్లం రాకుండా పరగడుపు మాత్ర వాడాలి. 

Disease -modifying antirhematic drugs:
Methotrexate  of Leflunomide.

Biological response modifiers :
infliximab , Etanecept , golimumab , certolizumab Etc.

స్వంతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
కస్టముగా ఉన్న సీసా ,కుండీ మూతలు తీయడము , బరువైన వస్తువులు ఎత్తడము చేయకూడదు.
ఆరోగ్యకరమైన కీళ్ళ స్థితిని పాతించాలి. అంటే కీళ్ళ పై భారము పడేటట్లు ఉండకూడదు.
క్రమము తప్పకుండా వ్యాయామము 


  • ====================
 Visit my website - > Dr.Seshagirirao.com/

palpitation , గుండెద

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --palpitation , గుండెద-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




జీవిత కాల పర్యంతమూ అవిశ్రాంతంగా తన పని తాను చేసుకుపోయే గుండె తాలూకు స్పందనలను సాధారణ పరిస్థితులలో అయితే మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దానిని గుండె దడ అంటారు. గుండెదడ అనేది ఒక వ్యాధి కాదు; ఒక లక్షణం. అంతర్గత కారణాలకు ఒక వ్యక్తరూపం.
. భయాందోళనలకు, ఉద్రిక్తతలకు మనిషి అతీతుడు కాదు. వీటికి గురైనప్పుడు గుండె అదనపు వేగంతోనూ, అదనపు శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో జనించే ఒరిపిడి వలన ఎవరి హృదయ స్పందన వారికి తెలుస్తుంది. ఇదంతా విపత్కర పరిస్తితులను ఎదుర్కొనడానికి ఉద్దేశించినది. ఇలాంటి దడ తాత్కాలికంగా కనిపించి దానంతట అదే సద్దుమనుగుతుంది.

ఐతే, ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారినా, లేదా అడపాదడపా అనుభవమయ్యే గుండె దడ నిరంతర ప్రక్రియగా పరిణమించినా నిశ్చయంగా దానికి ప్రాముఖ్యతనివ్వాలి. లేకపోతే, చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతిచిన్న విషయము ఆందోళనను పుట్టిస్తుంటుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, కాఫీ, టీ, మద్యం వంటి ఆహారాలు ఇవన్నీ కూడా గుండె దడను కలిగించగలవనేది తెలియక వీరు విపరీతమైన అలజడికి, అశాంతికి లోనవుతుంటారు.

గుండె దడ సాధారణంగా మూడు విధాలుగా ఉంటుంది:

ఒకటో రకం: వేగవంతమైన స్పందనలతో కూడినది. ఆందోళనపడే మనస్తత్వం ఉండే వారిలో ఇది కనిపిస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలకు దోహదపడే అన్ని సందర్భాలు ఈ తరహా గుండెదడను కలిగిస్తాయి.

రెండవ రకం: అస్తవ్యస్త హృదయ స్పందనలతో కూడినది. సాధారణంగా వయసు మళ్లిన వారిలో ఈ తరహా గుండెదడ కనిపిస్తుంది, అలాగే థైరాయిడ్ గ్రంథి వికృతితో ఇది ప్రస్ఫుటమవుతుంది.

మూడవ రకం: అదనపు హృదయ స్పందనలతో కూడినది. దీనిని గుర్తించడానికి ఒక పద్ధతి ఉంది. హృదయ స్పందనను అనుసరిస్తూ టేబుల్ మీద మునివేళ్లతో కొడుతూ ఉండాలి. ఈ శబ్దాల లయలో అపశృతి కనిపిస్తే అది అదనపు హృదయ స్పందనను సూచిస్తుంది.

సాధారణంగా, ఆందోళనగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది. లేదా, గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కనిపిస్తుంది. గుండె దడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటప్పుడు సాధారణ రక్త పరీక్ష మొదలు ఇ.సి.జి. వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. కాగా, ఈ కింది పాయుంట్లను ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే మీ గుండెదడకు సాధారణ కారణాలు బోధపడే అవకాశముంది.

1. ఉత్ప్రేరకాల దుష్ప్రభావం:

రోజు మొత్తం మీద మీరు తాగే, కాఫీ, టీల సంఖ్య నాలుగైదు కప్పులకు పైచిలుకు ఉంటే, వాటిలోని కెఫిన్ మోతాదు మీ గుండెను ప్రమాదకరమైన స్థాయిలో ఉత్తేజ పరిచి, గుండె దడకు కారణం అవుతుందని గ్రహించాలి.

2. మానసిక ఒత్తిడి (స్ట్రెన్):

విపరీతమైన మానసిక ఆందోళనకు లోనయ్యే వారికి గుండె దడ ఇబ్బంది పెడుతుంది. ఈ రోజుల్లో చాలా రకాల వ్యాధులకు కారణం దైనందిన జీవితంలో ఎదురయ్యే టెన్షన్లే. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి అనేది వ్యాధులకు ప్రత్యేక కారణంగా నిలిస్తే మరికొన్ని సార్లు పరోక్ష కారణంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గుండె జబ్బులకు మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది కనుక ప్రశాంతతను అలవర్చుకోవాలి.

3. మొనోపాజ్ సమస్యలు:

కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశకు చేరుకున్నప్పుడు హార్మోన్ల విడుదలలో లోపం ఏర్పడటం వలన రక్త ప్రసరణ వ్యవస్థ గతి తప్పుతుంది. దీని పర్యవసానంగా గుండెదడ అనుభవమవుతుంది.

4. రక్తహీనత (ఎనీమియా):

గుండెదడకు ప్రధాన కారణం రక్తహీనత, రక్తాల్పత ప్రాప్తించినప్పుడు శరీర కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా కుంటుపడుతుంది. దీని కారణంగా శరీరం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడమే కాకుండా, అదనపు ప్రాణవాయువు కోసం ఆయాసం వస్తుంది. ముఖ్యంగా శ్రమ చేసినప్పుడు ఆయాసము, దాని అనుసరించి గుండె దడా వస్తాయి. ఇంతే కాకుండా అవసరానికి సరిపడేంత రక్త సరఫరా లేకపోవడం వలన గుండెనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి విటమిన్ లోపాల వల్ల (ముఖ్యంగా బి-విటమిన్ లోపం వల్ల) కూడా గుండె దడ వస్తుంటుంది. పాలిష్ పట్టని ముతక బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్య నుంచి బైటపడవచ్చు.

5. అతిభోజన దుష్ఫలితం:

సాధారణ స్థాయికి మించి భుజించినప్పుడు పేగులకు అదనపు రక్త సరఫరా అవసరమవుతుంది. ఫలితంగా కొంతమందిలో భోజనానంతరం గుండెదడ అనుభవమవుతుంది. ఆకలిని గుర్తెరిగి ఆహారాన్ని తీసుకోవాలంటుంది శాస్త్రం. అలాగే, ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానికి కూడా ఒక నియమావళి ఉంది. అమాశయాన్ని నాలుగు భాగాలుగా ఊహించుకోవాలి. రెండు భాగాలు ఘనాహారంతోనూ, ఒక భాగం ద్రవాహారంతోనూ నింపాలి. మిగిలిన ఒక భాగాన్ని గాలి కోసం వదిలేయాలి. దీని వలన వాయుసంచారానికి అవకాశమేర్పడుతుంది; గుండె మీద వత్తిడి పడకుండా ఉంటుంది.

6. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం):

గుండెదడ కనిపించే సాధారణ వ్యాధి హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి అధిక స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు అనూహ్యమైన రీతిలో బరువు తగ్గుతారు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు తరచుగా విరేచనాలవుతుండటం, గుండెలో దగడా అనిపించడం, నాడివేగం పెరగడం, ఆకలి ప్రజ్వరిల్లుతుండటం, చర్మం చమటతో తడిసిముద్దవుతుండటం వీటిని గమనించవచ్చు. అసాధారణ స్థాయిలో వేగాన్ని సంతరించుకున్న శారీరక క్రియలను  చికిత్సలు ,ఔషధాలను ప్రయోగించాల్సి వుంటుంది.

సూచనలు: క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అడుపుచేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్దిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను గోధుమలను, కెఫిన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ - సి కలిగిన టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, యష్టిమధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది.

7. మందుల దుష్ఫలితాలు:

అస్తమాలో వాడే సాల్బుటమాల్, థియోఫిల్లిన్ వంటి వాటికి, నొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులకు గుండెదడను కలిగించే నైజం ఉంది. మందులు వాడేప్పుడు మీకు గుండెదడగా కనుక అనిపిస్తే, ఆ విషయాన్ని మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి; ప్రత్యామ్నాయాన్ని సూచించడంగాని, మోతాదుగా తగ్గించడంగాని చేయాల్సి ఉంటుంది.

8. శారీరక క్రియ:

యవ్వనంలోకి అడుగిడిన వారిలో ముఖ్యంగా యువతలలో అప్పుడప్పుడూ గుండెదడ వస్తుంటుంది. ఇది నిరపాయకరమైనది. వ్యాయామంతో గుండెదడ తగ్గటం దీనిలో ప్రత్యేకత. దీని వెనుక గుండె జబ్బంటూ ఏదీ ఉండదు. కాకపొతే ఈ నిర్ణయానికి రావడానికి ముందు సమగ్రమైన పరీక్షలు అవసరమవుతాయి.

9. గుండె జబ్బులు (హార్ట్ డిసీజెస్):

గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు క్రియాహీనమవడం వంటి స్థితులు ప్రాప్తించినప్పుడు గుండెదడ ఉంటుంది. ఛాతీలో జనించే నొప్పినీ, అయాసాన్నీ, ముఖ్యంగా పడుకున్నప్పుడు శ్వాస అందనట్లు ఉండటాన్నీ, కళ్లు తిరుగుతున్నట్లు ఉండటాన్నీ, శరీరం తిమ్మిరి పట్టినట్లు ఉండటాన్నీ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అలాగే కళ్లు బైర్లు కమ్మడాన్ని కూడా.

సలహాలు:

1. గుండె దడగా అనిపిస్తున్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. అమితాశనం (ఎక్కువగా తినడం), అధ్యశనం (తిన్నది జీర్ణంకాక మునుపే వెంటవెంటనే తింటూ ఉండటం) ఈ రెండు మంచివి కావు.

2. మల మూత్ర విసర్జనల్లాంటి సహజకృత్యాలను ఆపుకోకూడదు.

3. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరకాలను వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరీ ప్రమాదకరం.

4. ధూమపానం చేయకండి. ఒకవేళ మీ పక్కనుండే వాళ్లు చేస్తుంటే వారిని నివారించండి.

5. మానసికంగా నిలకడగా, నిశ్చితంగా ఉండాలి.

6. బిగ్గరగా మాట్లాడకూడదు. మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదుభాషణం సర్వదా హితకరం.

7. నూనెలు, కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించాలి.

8. కడుపు ఉబ్బరంగా ఉండి దాని వలన గుండె దడ వస్తుంటే ppi tablets vaaDaali.

9. మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ను నలగొట్టి ఒక బ్యాగ్ లో వేసి ఛాతిపైన పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది.



  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Defects in Ovary-fertility,అండాశయంలో లోపాలు-సంతాన సాఫల్యము

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Defects in Ovary fertility,అండాశయంలో లోపాలు-సంతాన సాఫల్యము
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పుట్టేసమయానికే ఆడ శిశువులో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయం నిర్దేషితమై ఉంటుంది. గర్భాశయంలో ఎన్ని అండాలు ఉండాలో అన్ని ఉంటాయి. 20 వారాల పిండదశలో ఉన్నపుడే ఆడ శిశువు పిండంలో దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షల ప్రాథమిక అండాలు ఏర్పడుతాయి. కానీ పుట్టుక సమయానికి వాటి సంఖ్య 7లక్షల నుంచి 2 లక్షల వరకు మిగులుతాయి. ఇవి ప్రతి నెల విడుదలవుతూ ఆమె గర్భం దాల్చడానికి అవకాశం కల్పిస్తాయి. టీనేజ్ చివరి దశ నుంచి 20 వదశకం ప్రారంభ దశలో ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి చాలా అనువైన వయసు. 45 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది.

  • తక్కువ అండాలు ఎందుకు?
అండాశయంలో తక్కువ అండాలు కలిగి ఉండడం వల్ల సంతాన లేమి సమస్యలు రావచ్చు. పిండదశలో ఉన్నపుడు వారిలో అండాశయం ఏర్పడడంలో ఏదైనా లోపం ఏర్పడడం, అండాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం. ఇది సాధారణంగా ఎఫ్‌ఎస్‌హెచ్(ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

  • అండాలు తక్కువగా ఉండడానికి కారణాలు
వయసు ప్రభావం, కొన్నిసార్లు కారణం తెలియదు, ఫ్రాగిల్ ఎక్స్సిండ్రోమ్ వంటి జన్యుకారణాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, కీమోథెరపి, రేడియేషన్ లేదా ఏదైనా సర్జరీ జరగడం, ఎండోమెవూటియాసిస్‌కు చేసే లేజర్ చికిత్స వంటి లాటరోజెనిక్ కారణాలు

  • పరీక్షలు
ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్), నెలసరి మొదలైన మూడో రోజున ఎఫ్‌ఎస్‌హెచ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షించాలి. ఈ పరీక్ష తప్పకుండా నెలసరి రెండో రోజు లేదా మూడోరోజున మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది అండం విడుదలను అంత కచ్చితంగా నిర్ధారించే పరీక్ష కాదు కొన్ని  సార్లు ఎఫ్‌ఎస్‌హెచ్ స్థాయిలు మాములుగా ఉన్నప్పటికీ అండం విడుదల సరిగా ఉండకపోవచ్చు. ఆంట్రల్ ఫోలికిల్ కౌంట్ అల్ట్రాసోనోక్షిగఫీ ద్వారా ఆంట్రల్ ఫోలికిల్ కౌంట్ పరీక్ష చేస్తారు. యాంటిముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. ''ఇన్హిబిన్ బి'' బ్లడ్ స్థాయి పరీక్ష మొదలైన పరీక్షల ద్వారా అండం విడుదల తీరును పరీక్షిస్తారు.

  • చికిత్సలు
డీహెచ్‌ఈఏ- క్రమం తప్పకుండా మైక్రొనైజ్డ్ డిహెచ్‌ఈఏ 25 ఎంజీ వల్ల 35 సంవత్సరాలు పైబడిన మహిళల్లో గర్భస్రావాల రేటు చాలా తగ్గింది. డీహెచ్‌ఈఏ టాబ్లెట్లు 3-4 నెలల పాటు ఇవ్వడం వల్ల అండాశయాల పనితీరు మెరుగైన సందార్భలున్నాయి. అందువల్ల సంతానం కలుగడానికి అవకాశాలు మెరుగవుతాయి. అండం విడుదల సరిగా లేని వారిలో డీహెచ్‌ఈఏ చికిత్స ద్వారా 6-8 వారాలలో వారి అండం విడుదలయ్యే చక్రాన్ని సరిచేయడానికి అవకాశాలు ఉంటాయి. దుష్ప్రభావాలు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఐవీఎఫ్ ప్రొటోకాల్‌ను మార్చడం - ఎక్కువ మోతాదులలో గొనడోవూటాపిన్స్ ఇవ్వడం ఐవీఎఫ్ చికిత్స చేస్తున్న సమయాల్లో గ్రోత్ హార్మోన్లు ఇవ్వడం.

దాత నుంచి అండాన్ని స్వీకరించడం--దాతల నుంచి అండాన్ని సేకరించి సంతానాన్ని పొందడం అనే ప్రక్రియ మెనోపాజ్‌కు దగ్గరి వయసున్న మహిళలకు చాలా విజయవంతమైన ప్రక్రియ. కానీ ఇది చిట్టచివరకు అవలంబించాల్సిన ప్రక్రియ. మొదటి ఐవీఎఫ్‌కు వెళ్తున్న వారు మాత్రం వారి అండాలతో సంతానం పొందటానికి ప్రయత్నించడమే మంచిది. కానీ ఐవీఎఫ్‌లు పదేపదే విఫలమవుతున్నపుడు మాత్రం దాత నుంచి అండాన్ని స్వీకరించాల్సిందిగా నిపుణులు సలహా ఇస్తున్నారు. దాతల అండాలతో ప్రయత్నించినపుడు సఫలం కావడానికి 50 శాతం అవకాశాలు ఉంటాయి.

  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, September 1, 2013

DVT,Deep vein Thrombosis,సిరల్లో రక్తం గడ్డకట్టడము,డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్(డీవీటీ)

  •  

  • image - courtesy with : Eenadu News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -DVT,Deep vein Thrombosis,సిరల్లో రక్తం గడ్డకట్టడము,డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్(డీవీటీ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 మన కాళ్ల నుంచి రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువెళ్లే సిరల్లో... ఆ రక్తం ఎక్కడన్నా గడ్డకడితే.. ముంచుకొచ్చే ముప్పే ఈ డీవీటీ! ఒకప్పుడీ బాధ మన భారతీయుల్లో తక్కువ అనుకునేవారు. కానీ శారీరక శ్రమ లేకుండా కాలం గడుపుతున్నవారు... గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ... ఈ ప్రమాదకరమైన సమస్యా పెరుగుతోంది. దీన్ని విస్మరిస్తే విపత్తే!

నానాటికీ మన జీవనశైలి మారిపోతుండటం వల్ల... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువనుకునే సమస్యలన్నీ ఇప్పుడు మన దగ్గరా బాగానే పెరుగుతున్నాయి. శరీరానికి వ్యాయామం లేకుండా.. కాలికి తగినంత పని చెప్పకుండా.. నడక అనేదే లేకుండా.. గంటల తరబడి కంప్యూటర్ల ముందర కూర్చుండిపోతున్న వారి సంఖ్య మనదేశంలో చాలా పెరుగుతోంది. ఇటువంటి వారిలో ఉన్నట్టుండి ఒక కాలుగానీ, తొడగానీ ఎర్రగా కందిపోయి.. బాగా వాచి.. నడవటం కష్టంగా తయారైతే... వెంటనే అది 'డీవీటీ' సమస్యేమో అని అనుమానించటం చాలా అవసరం. కానీ ఇటువంటి లక్షణాలు కనబడుతున్నప్పుడు చాలామంది దాన్ని 'కాలు బెణికిందనో'.. 'నరం బెసిగిందనో'.. తెలియని 'కముకు దెబ్బ ఏదో తగలిందనో'.. ఇలా రకరకాలుగా సర్దిచెప్పుకొంటూ ఏవేవో తమకు తోచిన చిట్కాలను ఆశ్రయిస్తుంటారు. ఐస్‌ పెట్టుకోవటం, కాపడం పెట్టటం, మసాజ్‌లు చేయించుకోవటం, ఆకు పసర్లను ఆశ్రయించటం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు వైద్యులు కూడా దీన్ని బోదకాలు వ్యాధిగానో, సయాటిగా నొప్పిగానో, ఏదో తేలికపాటి చెడువాపుగానో పొరబడే అవకాశాలుంటాయి. దీనివల్ల విలువైన కాలమంతా వృథా అయిపోయి.. సమస్య మరింతగా ముదిరి.. అనూహ్యంగా ఎక్కడెక్కడికో విస్తరించి.. చివరికి ప్రాణాల మీదికి ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంటుంది. అందుకే 'డీవీటీ' తలెత్తినప్పుడు.. దాన్ని సత్వరమే గుర్తించటం, చికిత్స తీసుకోవటం అత్యవసరం.

ఏమిటీ 'డీవీటీ'?
మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ.. ప్రతి అవయవానికీ.. ప్రతి కణానికీ రక్త సరఫరా అవసరం. అందుకే మన ఒళ్లంతా రక్తనాళాలు ఉన్నాయి. వీటిలో ఆక్సిజన్‌ దండిగా ఉన్న మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా సరఫరా చేసే ధమనులుంటాయి, ఆ పక్కనే మన శరీరం ఆక్సిజన్‌ను వినియోగించేసుకున్న తర్వాత తిరిగి ఆ రక్తాన్ని శుద్ధి చేయటానికి గుండెకు తీసుకువెళ్లే సిరలుంటాయి. గుండెకు చేరిన ఆ రక్తం అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి వెళ్లి, అక్కడ శుద్ధి అయ్యి.. తిరిగి గుండెలోకి వచ్చి ధమనుల ద్వారా శరీరమంతా ప్రవహిస్తుంది. ఇలాకాళ్ల నుంచి రక్తాన్ని శుద్ధి కోసం వెనక్కి (అంటే పైకి) తీసువెళ్లే సిరల్లో రక్తం ఎక్కడన్నా 'గడ్డ' కట్టే అవకాశం ఉంటుంది. ఇలా రక్తం గడ్డ కట్టి, ప్రవాహానికి అవరోధంగా తయారైనప్పుడు.. ఇక ఆ రక్తనాళంలో రక్తప్రవాహం నిలిచిపోతుంది. కింది నుంచి ఇక రక్తం పైకి వెళ్లే పరిస్థితి ఉండదు. ఫలితంగా ఆ కింది భాగంలో చెడు రక్తం నిలిచిపోయి.. కాలు లేదా చెయ్యి వాచిపోతుంది. ఇదే 'డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌- డీవీటీ' సమస్యకు ఆరంభం! దీన్ని ఈ దశలోనే గుర్తించి సరైన చికిత్స ఆరంభించకపోతే ఆ కాలిని, లేదా చెయ్యిని కోల్పోవాల్సిన తీవ్ర పరిస్థితి తలెత్తచ్చు.. కొన్నిసార్లు ప్రాణాల మీదికీ రావచ్చు. అందుకే ఒక కాలు ఎర్రబడి, వాచిపోయి, జ్వరం కూడా తోడై, నడక బాధాకరంగా తయారైనప్పుడు దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. వెంటనే 'డీవీటీ'గా అనుమానించటం అన్ని విధాలా శ్రేయస్కరం!

ప్రమాదమేంటి?
డీవీటీతో తలెత్తే ప్రమాదాలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
* ఒకటి- గడ్డ కారణంగా కాలిలో సిర మూసుకుపోయి.. చెడు రక్తం కిందే నిలిచిపోతుంది, దాంతో పాటే నీరు, ఖనిజాలు, లవణాల వంటివీ అక్కడే నిలిచిపోతాయి. దీనివల్ల మొత్తం శరీర వ్యవస్థే అస్తవ్యస్తమవుతుంది. దీని కారణంగా అత్యంత ప్రమాకరమైన 'పీసీడీ' (ఫ్లెగ్మేసియా సీరులా డోలెన్స్‌) అనే సమస్య తలెత్తుతుంది. ఇలా చెడు రక్తం, నీరు, ఖనిజ లవణాలవంటివన్నీ అక్కడ అనూహ్యంగా పేరుకుపోవటం వల్ల కణజాలంలో ఒత్తిడి పెరుగుతుంది, ఈ ఒత్తిడికి పక్కనే మంచి రక్తాన్ని తెస్తుండే ధమనులూ నొక్కుకుపోతాయి. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోయి.. కాలు నల్లబడిపోయి.. కుళ్లిపోయే (గ్యాంగ్రీన్‌) ప్రమాదకర స్థితి తలెత్తుతుంది.

* రెండోది- అత్యంత ప్రమాదకరమైనది.. కాలిలోని సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్తప్రసారంలో కలిసి.. మెల్లగా పైకి ప్రయాణించి.. గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి వెళ్లి.. వూపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. అది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాపాయ స్థితి. దీన్నే 'పల్మనరీ ఎంబాలిజం' అంటారు. ఈ స్థితిలో రోగి శ్వాస తీసుకోవటం కష్టంగా తయారవుతుంది, బీపీ బాగా పడిపోతుంది. ఇటువంటి స్థితిలో వారిని తక్షణం అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స చెయ్యటం అత్యవసరం. లేదంటే ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది. అందుకే 'డీవీటీ'ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించటానికి లేదు.

చికిత్సలేమిటి?
డీవీటీని అనుమానించగానే అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రికి తీసుకువెళ్లటం ఉత్తమం. దీని నిర్ధారణ, చికిత్సల కోసం యాంజియోగ్రామ్‌, డాప్లర్‌, అవసరమైతే 'న్యూక్లియర్‌ మెడిసిన్‌' తదితర సదుపాయాలుండటం అవసరం. సాధారణంగా డీవీటీ బాధితులకు రక్తం పల్చగా ఉండేలా చూసే మందులను రక్తనాళాల గుండా ఇస్తారు. గడ్డలు వూపిరితిత్తుల్లోకి చేరాయని అనుమానిస్తే- గడ్డ కరిగించే మందులూ మొదలుపెడతారు. వీరికి కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ల వంటివీ అవసరమవ్వచ్చు. రోగి ప్రమాదకరమైన 'పీసీడీ' స్థితిలోకి వెళితే.. సర్జరీ చేసి పెద్ద సిరల్లోని గడ్డను తొలగించి, అవి మూసుకుపోకుండా, ప్రవాహం నిలిచిపోకుండా దగ్గర్లో ఉన్న ధమనులకు అనుసంధానించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

* కొన్ని ప్రత్యేక సందర్భాల్లో- రక్తనాళాల గుండా ఒక సూక్ష్మమైన జల్లెడ లాంటి పరికరాన్ని (ఐవీసీ ఫిల్టర్‌) పొత్తికడుపు దగ్గర ఉండే ప్రధాన సిరలో అమరుస్తారు. ఈ జల్లెడలు.. కాలి నుంచి లేదా తొడల నుంచి గడ్డలు పైకి ప్రయాణించకుండా, అవి గుండెలోకి, వూపిరితిత్తుల్లోకి చేరి సమస్యలు తెచ్చిపెట్టకుండా నిలువరిస్తాయి.

చాలామంది డీవీటీ బాధితుల్లో.. ప్రస్తుతానికి చికిత్సతో సమస్యను అధిగమించినా మున్ముందు కాళ్ల మీద సిరలు ఉబ్బిపోయే 'వెరికోస్‌ వెయిన్స్‌', కాళ్ల మీద మానని పుండ్లు పడటం (వీనస్‌ అల్సర్స్‌) వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. గడ్డల వల్ల సిరల్లో ఉండే కవాటాలు దెబ్బతింటాయి. దీనివల్ల కాలు-పాదాలు నల్లబారటం, ఎప్పుడూ కొద్దిగా వాచి ఉండటం, పుండ్లు పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. అందుకే ఒకసారి డీవీటీ బారినపడిన వారు.. వీటన్నింటినీ అధిగమించేందుకు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చెయ్యాల్సి ఉంటుంది.

నివారించుకునేదెలా?
కాళ్లలోని సిరల్లో ఈ రక్తపు గడ్డలు (డీవీటీ) రాకుండా ఉండేందుకు చక్కటి మార్గం... నిత్య వ్యాయామం! నడక చాలా ఉత్తమం. రోజూ 4-5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు తగ్గుతుంది. గర్భిణులు, ఇటీవలే కాన్పు అయిన వారు, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న స్త్రీలు.. వీరంతా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఒకసారి డీవీటీ బారినపడిన వారు కాళ్లు, పాదాలకు ప్రత్యేక వ్యాయామాలు కూడా చెయ్యాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండిపోతున్న పక్షవాతం, క్యాన్సర్‌ బాధితులు కూడా డీవీటీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తల గురించి వైద్యులతో చర్చించాలి.

* నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం వంటివి తలెత్తుతుంటే దాన్ని తేలికగా తీసుకోకుండా.. తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
పెరుగుతున్న ముప్పు
ఒకప్పటి కంటే ఇటీవలి కాలంలో మన దేశంలో డీవీటీ సమస్య బాగా పెరుగుతోంది. దీనికి మన జీవనశైలిలో వస్తున్న మార్పులనే ముఖ్యకారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ముప్పు ఎవరికి ఎక్కువంటే-

* నడక కరవై.. కాళ్లకు, పాదాలకు తగినంత వ్యాయామం లేనివారికి

* సుదీర్ఘ విమాన ప్రయాణాల్లోగానీ, కంప్యూటర్ల ముందరగానీ గంటల తరబడి కాళ్లకు కదలికలు లేకుండా కూర్చుండిపోతున్న వారికి

* ఏదైనా జబ్బు వల్ల లేదా ఆపరేషన్ల వంటివి చేయించుకోవటం వల్ల పూర్తిగా మంచం మీదే ఉంటున్న వారికి

* గర్భనిరోధక మాత్రలుగానీ, హార్మోన్‌ మాత్రలుగానీ ఇష్టం వచ్చినట్టు దీర్ఘకాలంగా వాడుతున్న స్త్రీలకు

* వూపిరితిత్తులు లేదా క్లోమ గ్రంథి క్యాన్సర్లతో బాధపడుతున్న వారికి..

* ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి..

-వీరందరికీ కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో కూడా 'డీవీటీ' వచ్చే అవకాశాలు ఎక్కువ. కాన్పు అయిన వెంటనే కూడా ఈ ముప్పు ఉంటుంది. పక్షవాతం బారినపడిన వారు చాలా సందర్భాల్లో అసలు కదలికలే లేకుండా పూర్తిగా మంచానికే అతుక్కుపోతుంటారు. అందుకే వీరిలో 'డీవీటీ' ఎక్కువగా కనబడుతుంటుంది.

* స్త్టెలు పేరుతో మడమలు చాలా ఎత్తుగా ఉండే చెప్పులు, బూట్ల వంటివి వేసుకుంటున్న వారికి కూడా, ముఖ్యంగా స్త్రీలకు ఈ డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటోంది.

Courtesy with : Dr.K.K.Pande -vascular,CT-surgeon,Appollo hos.Indraprasta , New Delhi.
  • =====================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Care in Cricket game,క్రికెట్‌ క్రీడతో జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Care in Cricket game,క్రికెట్‌ క్రీడతో జాగ్రత్తలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన ఆట క్రికెట్‌. ఇతర ఆటగాళ్లలాగనే క్రికెట్‌లో కూడా గాయాలవుతూనే ఉంటాయి. ఇదే వృత్తిని స్వీకరించిన ఆటగాళ్లు ఎక్కువ శిక్షణకి, ఆటకు సమయాన్ని కేటాయించడంతో రకరకాల గాయాలయ్యే అవకాశాలున్నాయి. క్రికెట్‌లో గాయాలు ఎవరికైనా కావచ్చు. బౌలింగ్‌, బ్యాంటింగ్‌, ఫీల్డింగ్‌ చేసేవాళ్లేవరైనా అలాగే గాయాలు శరీరంలో ఏప్రాంతంలోనేనా జరగవచ్చు. జగవల్‌ శ్రీనాధ్‌, కుంబ్లే, సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ వంటి వాళ్లందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు గాయాలైన వాళ్లే. గాయాలు ఎక్కువైన కొద్ది ఆటలో పాల్గొనటానికి ఆటంకాలు ఎక్కువవుతున్నాయి.


క్రికెట్‌లో సాధారణంగా అయ్యే గాయాల గురించి మాట్లాడుకుందాం. అలా మోకాళ్లు, చేతులు లాంటి వాటికి ఎంత రక్షణ ఇచ్చినా తల, కళ్లు, వేళ్లకి గాయాలవుతునే ఉంటాయి.క్రికెట్‌లో సాధారణంగా అయ్యే గాయాల బ్యాంటింగ్‌ చేసే వాళ్లల్లో అవుతుంటే వేళ్లకి గాయాల ఫీల్డింగ్‌ చేసే వాళ్లకి, వికెట్‌ కీపర్స్‌కి, బౌర్స్‌కి ఎక్కువగా కలుగుతుంటాయి. వికెట్ల మధ్య పరిగెత్తేటప్పుడు, బౌలింగ్‌ చేసేటప్పుడు కండరాలు పట్టేయవచ్చు. అలాగే బౌలింగ్‌ చేసేవాళ్లకి, బ్యాంటింగ్‌ చేసేవాళ్లకి కూడా భుజాల్లో ఉండే రొటేటర్‌ కఫ్‌ దగ్గర టెండాన్స్‌ లాంటివి దెబ్బతినవచ్చు. అలాగే మోకాళ్ల లిగమెంట్స్‌ దెబ్బతినవచ్చు. ఫాస్ట్‌ బౌలర్స్‌కి వెన్ను గాయాలై స్పాండిలోసిస్‌, స్పాండిలోలిస్థసిస్‌ లాంటి ఇబ్బందులు కలుగవచ్చు. గట్టిగా బ్యాట్‌తో బాల్‌ను కొడుతూ చేతుల్ని వేగంగా కదిలిస్తుండటంతో మోచేయి కండరాలు దెబ్బతిని, టెండాన్స్‌ లాంటివి దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ ఆటని ఎక్కువగా పగలు ఎండలో ఆడుతుంటారు కాబాట్టి శరీరంలో నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్‌తో నీరసం, నిస్త్రాణం కలుగుతాయి. ఏ ఆటగాడైనా తను అనుకున్న స్థాయిలో ప్రతిభను చూపించలేకపోతున్నపుడు, స్ఫూర్తి తక్కువైనపుడు, అతృత పెరిగినపుడు, నిద్ర సరిగ్గా పట్టనపుడు ఆకలి తగ్గి దాంతో పాటు బరువు తగ్గుతున్నపుడు శ్వాసకోశానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ తరచూ కలుగుతున్నపుడు, నాడి కొట్టుకోవడం ఎక్కువైనపుడు ఆటలకి సంబంధించిన వైద్యంలో నిష్ణాతులైన వారిని కలవడం మంచిది.

ఆటల్లో దెబ్బతగిలితే ఏం చేయాలి ఆటల్లో దెబ్బతిన్న ఆటగాడికి రైస్‌ (ఆర్‌ఐసిఈ) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్‌ అంటే రెస్ట్‌(విశ్రాంతి) రెండు మూడు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ స్థితిలో కావడం పెట్టడం లాంటివి చేయకుడదు. ఐ... అంటే ఐస్‌ ... ఐస్‌ప్యాక్‌ని దెబ్బతిన్న ప్రాంతం మీద ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచి పదినిమిషాల పాటు కావడంలా పెట్టాలి. ఇలా రెండు గంటల కొకసారి చేయాలి. సి అంటే.. కంప్రెషన్‌... ఒత్తిడి కలిగించటం ఒత్తిడి కలిగించడం వల్ల వాపు రాకుండా చూసుకోవచ్చు. ఈ అంటే... ఎలివేషన్‌ దెబ్బతిన్న ప్రాంతం గుండెకన్న ఎత్తులో ఉండేటట్లుగా దిండ్లతో అమర్చుకొవాలి. ఇది రైస్‌ అంటే.

గాయాలు కలుగకుండా ఎలా చూసుకోవాలి ఆటకి ముందు తరువాత కూడా వార్మప్‌, కూల్‌డౌన్‌ జాగ్రత్తాగా చేయాలి. ఇది మరీ ముందు ప్రారంభించకూడదు, మరీ ఎక్కువ చేయకూడదు. వీపు మీద ఒత్తిడి పడకుండా టెక్నిక్‌తో ఆడాలి... మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండటం వల్ల డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుకొచ్చు. ఒక వేళ ఏదైనా గాయం అయితే దానికి సరైన చికిత్సను వెంటనే పొందాలి. నొప్పి అనేది మనకి కనిపించని శరీర ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది కలుగుతున్నపుడు తెలియజేసే లక్షణం. కాబాట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి సాయంతో వెంటనే ఎక్కడ దెబ్బతగిలింది తెలుసుకుని త్వరగ చికిత్స పొందాలి.

ఇవాళ క్రికెట్‌ ఎంతో శరీర దారుఢ్యం కావాలి. గాయాలపాలకుండా కపాడుకుంటుండాలి. చికిత్స చేసేవాళ్లకి ఆటగురించి , ఆటగాళ్ల గురించి, వాళ్లకి తగిలే దెబ్బల గురించి పరిపూర్ణంగా తెలిసుండాలి. కోచింగ్‌ గాయాల పాలుకాకుండా ఎలా ఆడాలో తెలుసుకుని క్రికెట్‌ దెబ్బలు తగిలి దూరంగా ఉండే రోజులు ఎక్కువ కాకుండా చూసుకుంటే ఆ ఆటలో బాగా రాణిస్తారు.

అజయ్‌ సింగ్‌ ఠాకూర్‌, అర్థోపెడిక్‌ సర్జన్‌, ఆలీవ్‌ ఆసుపత్రి,మెహదీపట్నం,
  • ============================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Role of parents and teachers in raising children,పిల్లల పెంపకములో పెద్దల ప్రవర్తన ,పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు టీచర్ల పాత్ర

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Role of parents and teachers in raising children,పిల్లల పెంపకములో పెద్దల ప్రవర్తన  ,పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు టీచర్ల పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 కొందరు పిల్లలైతే మరింత మెుండిగా ప్రవర్తిస్తారు. ఇటువంటి మెుండి పిల్లలతో పెద్దలు కూడా మెుండిగా ప్రవర్తిస్తే మెుత్తానికి చెడుతుంది. ముఖ్యంగా ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్న ప్రస్తుత న్యూక్లియర్‌ కుటుంబాల్లో ఇటువంటి ేకసులు చాలా కనిపిస్తున్నారుు. అటువంటి పిల్లలతో ఎలా మెలగాలి, వారి మనస్సుని నొప్పించకుండా ఎలా ప్రవర్తించాలి అనే దానిపై సైకాలజిస్టులు అనేక పరిశోధనలు చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకం అంటున్న సైకాజిస్టుల విశ్లేషణ -

ప్రస్తుతం ఇళ్లలో ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్నారు. అటువంటప్పుడు ఈ పిల్లల్ని ముద్దు చేయటం చాలా సహజం. ఈ గారాబం హద్దు దాటితే మాత్రం మొండితనానికి దారి తీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దల ప్రవర్తన కీలకంగా మారుతోంది. పిల్లల పెంపకం నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. ఇంకా చెప్పాలంటే సున్నితంగా మారుతోందని అనుకోవచ్చు. పిల్లల్ని పెంచే పద్దతుల్ని ప్రముఖ సైకాలజిస్టు డయానా బౌమ్‌రిండ్‌ కొన్ని పద్దతులుగా విభజించారు. పిల్లల పెంపకంలో డయానా ప్రచురించిన పరిశోధన వ్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచాయి. ఈ విభజన ప్రకారం
-మొదటిరకం పెంపకాన్ని అన్‌ ఇన్‌వాల్వుడ్‌ పేరంటింగ్‌ అని పిలుస్తారు.
పిల్లల్ని పెంచటంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమ తమ ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని గమనించవచ్చు. పిల్లల అవసరాల్ని ఎప్పటికప్పుడు గమనించేంత తీరిక దొరకదు. పోటీ ప్రపంచంలో కుటుంబాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన కనిపిస్తుంది. పిల్లల ఆశలు, అభిరుచుల్ని పక్కన పెట్టేసి ప్రవర్తిస్తుంటారు. అడపా తడపా మాత్రమే పిల్లల చదువులు, పురోగతిని పట్టించుకొంటారు. అప్పుడు మాత్రం సంబంధిత అంశాల మీద సీరియస్‌ అయిపోతారు. దీంతో పిల్లల ప్రవర్తన ను సునిశితంగా గమనించే అవకాశాన్ని కోల్పోతారు. అటువంటి చోట పిల్లలు స్నేహితులపై ఎక్కువ ఆధారపడటాన్ని గమనించవచ్చు. అంతేగాకుండా పిల్లలు స్నేహితుల్ని అనుసరించేందుకు, అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో నిర్లిప్త ప్రవర్తనను కొనసాగిస్తూ, బయట మాత్రం ఉత్సాహంగా వ్యవహరిస్తారు.

- రెండో రకం విధానాన్ని అథారిటేరియన్‌ పేరంటింగ్‌ అని పిలుస్తారు.
ముందు చెప్పిన విధానానికి ఇది భిన్న మైనది. ఇందులో తల్లిదండ్రులు... పిల్లల నుంచి చాలా ఆశిస్తారు. చెప్పిన పనిని పిల్లలు తూ.చ. తప్పకుండా పాటించాలని కోరుకొంటారు. సాధారణంగా తాము ఆశించిన ప్రొఫెషన ల్సుగా పిల్లలు ఎదగాలని కోరుకొంటారు. ఎట్టి పరిస్థిత్లులోనూ ఇంజనీర్లు లేదా డాక్టర్లుగా మారిపోవాలని నిర్దేశించుకొంటారు. ఇందుకు తగినట్లుగా పిల్లలపై ఒత్తిడి పెడుతుంటారు. నలుగురిలోనూ బాగా ఉండాలన్న తపన పడుతుంటారు. క్రమ శిక్షణ కన్నా శిక్షణ ఎక్కువగా అమలు చేస్తుంటారు. రూల్‌ అంటే రూల్‌ అన్నట్లుగా ప్రవర్తిస్తారు తప్పితే ఎందుకు ఆ రూల్‌ను అనుసరించాలన్న వివరణ ఉండదు. ఇంటా బయట కచ్చితమైన నియమాలు ఉంచుతారు. వీటిని పిల్లలు పాటించాలని ఆశిస్తారు. దీని ఫలితంగా పిల్లలు చదువులో బాగా రాణించవచ్చు గాక కానీ, వ్యక్తిత్వ వికాసం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

-మూడో రకం పెంపకాన్ని పెర్మిసివ్‌ పేరంటింగ్‌ అని పిలుస్తారు.
పిల్లల నుంచి పెద్దగా ఆశించకుండా గడిపేస్తారు. పరిణతి తో కూడిన ప్రవర్తన కనిపించదు. పిల్లలే సొంతంగా రుజు వర్తన పెంచుకోవాలని ఆశిస్తారు. ఇందుకు తగిన ట్లుగా అవకాశం ఇస్తున్నట్లు చెబుతారు. ఒక స్నేహితుని మాదిరిగా పిల్లలతో మెలిగేందుకు ఇష్టపడతారు. పిల్లల చేత ఏదైనా పని చేయించేందుకు చిన్న చిన్న బొమ్మలు, చాక్‌ లెట్లు ఆశ పెడుతుంటారు. ఇటువంటి చోట్ల పిల్లలు తమంతట తాము చక్కటి ప్రవర్తన అలవరచుకొంటే పర్వాలేదు కానీ దీన్ని పాటించక పోతే మాత్రం ఇబ్బంది తప్పదు. ఒక్కోసారి పిల్లలు గాడి తప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిందే.

-నాలుగో రకం పెంపకాన్ని అథారిటేటివ్‌ పేరంటింగ్‌ అంటారు.
ఇటువంటి తల్లిదండ్రులు పిల్లల నుంచి చాలా ఆశిస్తారు. ఇందుకు తగినట్లుగా పిల్లల చెప్పే విషయాలు ఆలకిస్తారు. వాటిని గుర్తుంచుకొనేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లకు ఉన్న స్వాతంత్ర భావాల్ని ప్రోత్సహిస్తారు. అవసరమైతే ఆయా విషయాల మీద చర్చిస్తారు. కానీ, పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి అనే దానిపై స్పష్టత ఉంటుంది. అందుకు తగినట్లుగానే ఉండాలని కోరుకొంటారు. ఇందుకు తగినట్లుగా పిల్లల్ని తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు దారి తప్పి నడుస్తుంటే మాత్రం సహించరు. అందుకు తగినట్లుగా వాళ్లకు కౌన్సిలింగ్‌ ఇస్తారు. పిల్లలు ఎదిగే తీరు లో తేడాలు వస్తే సైకాలజిస్టు సాయాన్ని కోరేందుకు కూడా వెనుకాడరు. పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే వాళ్ల ప్రవర్తనను సరిదిద్దుతారు. పెద్దలు నిజాయితీతో ఉండటంతో పిల్లలు కూడా చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు టీచర్లతో సంప్రదిస్తూ ఉండటంతో పిల్లలకు వాస్తవ పరిస్థితి బోధ పడుతూ ఉంటుంది.

సైకాలజీ పరిశోధనల ప్రకారం పిల్లలతో వ్యవహరించేందుకు ఐదు సూత్రాల్ని సూచిస్తున్నారు. ఇవీ ఇలాగే పాటించాలని కాదు కానీ వీటితో మెరుగైన ఫలితాలు అందుతాయని చెప్పవచ్చు.
(1) నిదానంగా ప్రవర్తించటం మేలు. పిల్లలు చెబుతున్నది ఎప్పటికప్పుడు ఆలకించాలి. వారు చెప్పినదాన్ని వెంటనే కొట్టి పారేయవద్దు. పిల్లల భావోద్రేకాల్ని పట్టించుకోవాలి. వాళ్లకు ఎదురవుతున్న సమస్యల్ని విశ్లేషించాలి. అవసరాన్ని బట్టి టీచర్‌ తో లేదా చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాలి. ఆ సమస్య గురించి చర్చించాలి. అదే సమయంలో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి టీచర్‌ ను లేదా చుట్టుపక్కల వాళ్లను నిలదీయటం, బెదిరించటం వంటివి చేస్తే మాత్రం కొందరు పిల్లలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
(2) పిల్లల విషయంలో మాట నిలబెట్టుకోవటం ముఖ్యం. ఒక పని చేస్తామని చెబితే సాధ్యమైనంత వరకు దాన్ని నిబెట్టుకొనేందుకు ప్రయత్నించాలి. దీంతో పిల్లలకు పెద్దల మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిజాయితీగా కల్పించుకోవాలి. పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నామన్న భావన రానీయకూడదు.
(3) పిల్లలతో నిజాయితీ గా వ్యవహరించాలి. చెబుతున్న మాటలు, చేస్తున్న పనుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అందుచేత వాళ్ల దగ్గర పెద్దల ప్రవర్తన నిజాయితీ గా ఉండాలి. అప్పటికప్పుడు అవసరాల్ని తీర్చేదిగా ఉండటం మంచిది కాదు.
(4) ఇప్పటి తరం పిల్లలతో నచ్చ చెప్పే విధంగా ప్రవర్తించటం మేలు. ఏది మంచి, ఏది చెడు అనేది విడమరిచి చెబుతుండాలి. ఈ విశ్లేషణ అన్నది పిల్లల వయస్సుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయా వయస్సుల్ని బట్టి చెప్పే తీరులో చెప్పాల్సి ఉంటుంది.
(5) ఏమైనా పిల్లల్ని అతి గారాబం చేయటం మాత్రం మంచిది కాదని గుర్తించుకోవాలి. పిల్లలకు అన్నీ సమకూరుస్తునే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దారి తప్పినప్పుడు పిల్లల్ని వెంటనే సరైన మార్గంలోకి తీసుకు రావటం అన్నది కూడా ముఖ్యమే అని గుర్తించుకోవాలి.

వాస్తవానికి ప్రతీ ఇంట్లో ఈ విధానాలు దోబూచులాడు తుంటాయి. అంతకు మించి పిల్లల ప్రవర్తనను గమనించుకొంటూ ఉంటే వారిని చక్కగా పెంచేందుకు వీలవుతుంది. ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉండే కుటుంబాల్లో పిల్లలను జాగ్రత్తగా పెంచాలని గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు పెద్దల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి నిజాయితీగా వ్యవహరించటమే మేలు. దీంతో పాటు స్నేహితులు, టీవీల్లో వచ్చే కథనాలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. అందుచేత పిల్ల పెంపకంలో బహుముఖంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

courtesy with - శ్రీమతి వై రమాదేవి, సీనియర్‌ ఫ్యాకల్టీ, హైదరాబాద్‌
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/