Monday, October 21, 2013

Crack lips,పెదవుల పగుళ్లు


-




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Crack lips,పెదవుల పగుళ్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




బ్రతికినంతకాలము మనిషి బాధలులేకుండా బ్రతకాలనే అనుకుంటారు . . . అనుకోవడమేమిటి అలానే బ్రతకాలి. పగిలి పెదవులు  బాధతో పాటు ముఖ అందాన్ని కూడా ప్రబావితం చేస్తాయి.  పొడి వాతావరణం పెదవుల పగుళ్ళకు ముఖ్యమైన కారణం. వాతావరణంలోని గాలి పొడిగా ఉన్నప్పుడు చర్మంలోని పై పొరలు ఆరిపోతాయి. పెదవులమీద ఉండే చర్మం సున్నితంగా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ముందుగా వాతావరణ ప్రతికూలతలు పెదవుల మీద పడతాయి.
పెదవులు పగులుతాయి. పెదవులు చిట్లిపోయి నొప్పిగా తయారవుతాయి. కొంతమంది పెదవులు తడారిపోతున్నప్పుడు వాటిని నాలికతో తడుపుతూంటారు. తడి ఆరిపోతూ పెదవుల్ని మరింత చిట్లిపోయేలా చేస్తుంది కాబట్టి ఇలాగా తడారిన పెదవుల్ని నాలికతో తడపకండి. దీనికి బదులు ఆముదాన్ని గానీ, వెన్నపూసను గానీ పెదవులకు రాసుకోండి. వీటితో పెదవుల మీద ఉండే తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఎండలోకి వెళ్ళినపుడు అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఉండేందుకుగాను సన్‌రిఫ్లెక్షన్‌ ఫ్యాక్టర్‌ కలిగిన క్రీముల్ని పైపూతగా రాసుకోండి.

శీతాకాలం వస్తే  చర్మాన్ని సంరక్షించుకోవడానికి అనేక పాట్లు పడుతుంతాం . అలాగే చలికాలంలో పెదవుల పగుళ్ల కోసం ఏవేవో చేస్తుంటాం. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. చర్మం పైన  పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే  పొరలు సున్నితం గా ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే పెదవుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి.

అల్లోపతి చికిత్స:
  • అల్లోపతిలో వేజలైన్‌ జెల్లీ పైపూతగా రాసుకోవడమే గాని స్పెషిఫిక్  గా ట్రీట్మెంట్ ఏమీలేదు. బి.కాంప్లెక్ష్ లోపము రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ఆయుర్వేదం చికిత్స :
  •  చండ్రబెరడు చూర్ణం చిటికెడు తేనె అరటీస్పూన్‌. రెంటినీ కలపండి. పేస్టులాగా తయారు చేయండి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవుల మీద పూసుకోండి.ఉదయం కడిగేసుకోండి. దీంతో పెదవుల పగుళ్లు తగ్గుతాయి.
  • చలికాలంలో వీసే గాలుల వల్ల మీ పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుతాయి. 8,9గంటలపాటు లిప్ స్టిక్ ఉంచుకుంటే పెదవులు పొడిబారతాయి. కాబట్టి లిప్ గార్డ్ గానీ, వాజలిన్ గానీ రాస్తే మంచిది.లిప్ స్టిక్ పెదవులపై ఎక్కువ సేపు ఉండాలంటే అదిపెట్టుకునే ముందు పెదాలపై పౌడర్ గానీ, లైట్ గా ఫౌండేషన్ గానీ వేసుకోవాలి. అప్పుడు లిప్ స్టిక్పెట్టుకుంటే చాలా సేపటివరకూ పోకుండా ఉంటుంది.మాయిశ్చరైజర్ లిప్ స్టిక్ పెదవులను మెరిసేలా చేస్తుంది.
  • పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్ రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.
  • నెయ్యిని రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రాసుకోవాలి.
  •  కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  • 2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి
  • చలికాలంలో మీ పెదవులకు అలొవెరా ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్స్‌ను వాడినా మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా మిల్క్‌ క్రీమ్స్‌ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.
  • నిమ్మరసం, ధనియాల పొడి కలిపి పేస్ట్‌ చేయండి. పెదవులపై ఈ పేస్ట్‌తో ప్రతిరోజూ పదినిమిషాలు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • నిమ్మరసం, గ్లిజరిన్‌, తేనె కలపి ఈ మిశ్రమంతో పెదవులపై పదినిమిషాలు మర్దన చేయాలి.
  • నిద్రించేముందు కొబ్బరి నూనెలో వైట్‌ పెట్రోలియం జెల్లీ కలపి, పెదవులకు రాయాలి.
  • కొత్తిమీర రసంతో పెదవులను మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
  • నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.
చిట్కాలు-జాగ్రత్తలు :    
చలికాలంలో తరచుగా పెదాలు పగలుతుండటం సహజమే. దీంతో మంట, నొప్పి, చిరాకు వంటివి వేధిస్తాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే పెదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

* చలి, పొడి వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు పెదాలకు సన్‌స్క్రీన్‌తో కూడిన క్రీమ్‌ రాసుకోవాలి. తర్వాత పెదాలను చేతి రుమాలుతో గానీ స్కార్ఫ్‌తోగానీ కప్పి ఉంచాలి. అలాగే ఆరుబయట ఎక్కువసేపు గడిపే సమయాల్లో తరచుగా పెదాలకు క్రీమ్‌ రాస్తుండాలి.

* పెదాలను తడిగా ఉంచుకోవటానికి కొందరు నాలుకతో అద్దుతుంటారు. ఇది సరికాదు. లాలాజలం త్వరగా ఆవిరవుతుంది. దీంతో పెదాలు అంతకుముందుకన్నా మరింత పొడిగా తయారవుతాయి.

* తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. చర్మంతో పాటు పెదాలూ నిగనిగలాడతాయి. వీలైనవారు ఇంట్లో తేమ తగ్గకుండా చూసే పరికరాలు (హ్యూమిడిఫయర్‌) కూడా వాడుకోవచ్చు.

* కొన్నిసార్లు అలర్జీ కారకాలు కూడా పెదాలు పగలటానికి దారితీయొచ్చు. కాబట్టి సౌందర్య సాధనాలు, రంగుల్లో శరీరానికి సరిపడని అలర్జీ కారకాలు ఉంటే.. వాటికి దూరంగా ఉండాలి.

* కొందరు తరచుగా నోటితో గాలిని పీల్చుకుంటూ ఉంటారు. దీంతో పెదాలు పొడి బారతాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి.

* చిన్న చిన్న చిట్కాలతో పెదాలు పగలటం తగ్గకపోతే వెంటనే డాక్టరుని సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు తీవ్రంగా పెదాలు పగలటమనేది ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా రావొచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడితే మంచిది.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.