Tuesday, February 26, 2013

Computer pains,కంప్యూటర్‌ నొప్పులు

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Computer pains,కంప్యూటర్‌ నొప్పులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.
  • ====================
 Visit my website - > Dr.Seshagirirao.com/

pulses are good for Diabetes,మధుమేహులకు పప్పుల ఆసరా

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- pulses are good for Diabetes,మధుమేహులకు పప్పుల ఆసరా-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధుమేహులు రక్తంలో గ్లూకోజు స్థాయులను నెమ్మదిగా పెంచే (లో గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌) ఆహారాన్ని తీసుకోవటం మంచిదన్నది తెలిసిన విషయమే. ఇలాంటి ఆహారంలో పప్పులు, బఠాణీల వంటివి కూడా పెద్దమొత్తంలో ఉండేలా చూసుకుంటే మరీ మేలని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో హెచ్‌బీఏ1సీ మోతాదులతో పాటు రక్తపోటు కూడా తగ్గుతున్నట్టు బయటపడింది. పప్పుల్లో గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. పైగా వీటిల్లో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహులపై పప్పులు ఎక్కువమొత్తంలో గల ఆహారం ప్రభావం గురించి ఇప్పటివరకు పెద్దగా అధ్యయనాలు జరగలేదు. అందుకే ఇటీవల టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ఒక అధ్యయనం చేశారు. టైప్‌2 మధుమేహం గల కొందరికి పప్పులతో కూడిన ఆహారం, మరికొందరికి ముడి గోధుమలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ రెండు రకాల ఆహారాలూ పీచు అధికంగా గ్త్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండేవే. మూడు నెలల అనంతరం పప్పులతో కూడిన ఆహారం తీసుకున్నవారిలో హెచ్‌బీఏ1సీ స్థాయులు 0.5% వరకు.. గోధుమల ఆహారం తీసుకున్నవారిలో 0.3% వరకు తగ్గినట్టు గుర్తించారు. పప్పుల ఆహారం తీసుకున్నవారిలో రక్తపోటు, గుండెవేగం, గుండెజబ్బు ముప్పూ తగ్గినట్టు తేలటం గమనార్హం.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Erectile dysfunction with gingivitis,చిగుళ్లవాపుతో స్తంభనలోపం

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Erectile dysfunction with gingivitis,చిగుళ్లవాపుతో స్తంభనలోపం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చిగుళ్లవాపు సమస్యను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. పెద్దగా దానిపై దృష్టిపెట్టరు. అయితే ఇలాంటి ధోరణి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 30ల్లో ఉన్నవారు ఏమాత్రం ఉపేక్షించటం తగదని సూచిస్తున్నారు. ఎందుకంటే చిగుళ్లవాపుతో అంగస్తంభనలోపం వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్ట తాజాగా బయటపడింది మరి. స్తంభనలోపంతో బాధపడుతున్న 30-40 ఏళ్ల వయసుగలవారిపై టర్కీ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. స్తంభనలోపం లేని అదే వయసు వ్యక్తులతో వారిని పోల్చిచూశారు. స్తంభనలోపంతో బాధపడుతున్నవారిలో 53% మంది చిగుళ్లవాపు సమస్యతో బాధపడుతుండగా.. స్తంభనలోపం లేనివారిలో 23% మందిలోనే చిగుళ్లవాపు కనబడింది. ఈ ఫలితాలను మరింత సహేతుకంగా పరిశీలించారు. గార మందం, రక్తస్రావం అవుతున్న తీరు, చిగురుకూ పంటికీ మధ్య దూరం, దంతాన్ని పట్టిఉంచే ఎముక లోపలికి క్షీణిస్తుండటం వంటి వాటి ఆధారంగా చిగుళ్లవాపు జబ్బు తీవ్రతను గణించారు. ఈ సమస్య చాలా తీవ్రంగా గలవారిలో స్తంభన సమస్యలు 3.29 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలటం గమనార్హం. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే చిగుళ్లవాపు మూలంగా దంతాలు, చిగుళ్లతో పాటు పంటిచుట్టూ ఉండే ఎముక కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా దీంతో బాధపడేవారిలో గుండె జబ్బుల వంటి వివిధ రక్తనాళ సమస్యలూ తలెత్తుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి స్తంభన సమస్యలతోనూ సంబంధం ఉంటోందని అధ్యయన నేత ఫెయిత్‌ ఓగజ్‌ అంటన్నారు. కాబట్టి చిగుళ్లవాపు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Treatment for gingivitis -> 1Gingivitis-3
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, February 25, 2013

Tips for curly and brisht hair, అలల్లా మెరిసేలా జుట్టు కోసము కొన్ని చిట్కాలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Tips for curly and brisht hair, అలల్లా మెరిసేలా జుట్టు కోసము కొన్ని చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 




    మరీ నిదానంగా ఎక్కడా చిన్నపాటి వంకీ కూడా లేని జుట్టు అంటే చాలామందికి నచ్చదు. అలా కాకుండా చెప్పినమాట వింటూ 

అక్కడక్కడా చివర్లలో కాస్త వంకీలు తిరిగితే ఎంత బాగుంటుంది! అయితే ఇలా చేసి చూడండి.

* అరకప్పు చొప్పున పాలూ, నీళ్లూ ఒక బాటిల్‌లో తీసుకోవాలి. తరవాత చిక్కుల్లేకుండా తల దువ్వుకోవాలి. ఇప్పుడు బాటిల్‌లోని 

మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేసి మళ్లీ మృదువుగా దువ్వాలి. అరగంటయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. తడి జుట్టుని పెద్దపళ్లున్న 

దువ్వెనతో దువ్వుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు అడుగు నుంచి వంకీల్లా తిరగడం మొదలవుతాయి.

* కప్పు ముల్తానీమట్టికి ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు టీ స్పూనుల బియ్యప్పిండీ, నీళ్లూ కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని 

తలకు రాసుకోవాలి. అరగంట తరవాత దువ్వుకుని రెండు గంటలయ్యాక తలస్నానం చేస్తే సరి వెంట్రుకలు వంకీల్లా తిరగడం 

మొదలవుతాయి.

* ఒక కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరి పాలూ, ఒక నిమ్మకాయ రసం కలిపి చిన్న డబ్బాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజుకి 

డబ్బాలోని మిశ్రమం క్రీమ్‌లా గట్టిగా అవుతుంది. ఆ క్రీమ్‌ని మాడుకీ, వెంట్రుకలకీ రాసుకుని వేణ్నీళ్లలో ముంచిన టవల్‌ని తలకు 

చుట్టుకోవాలి. గంట తరవాత నీళ్లతో కడిగేసి పెద్ద పళ్లున్న దువ్వెనతో దువ్వాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి 

ఫలితముంటుంది  వెంట్రుకలు వంకీల్లా తిరగడం మొదలవుతాయి..

* జుట్టుకి స్పూను తేనెని కప్పు నీళ్లలో కలిపి తలకి మసాజ్‌ చేయండి. అయిదు నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత సాధారణ నీళ్లతో 

స్నానం చేసేయండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు అడుగు నుంచి వంకీల్లా తిరగడం మొదలవుతాయి.



  • ==========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Sunday, February 24, 2013

Tips to lessen Backbone pain ,వెన్నునొప్పి తగ్గడానికి చిట్కాలు

  •  
 ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Tips to lessen Backbone pain ,వెన్నునొప్పి తగ్గడానికి చిట్కాలు  - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వెన్ను నొప్పి (దీన్నే డోర్సాల్జియా అని అంటారు) అనేది వీపులో వచ్చే నొప్పి. ఇది సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది.ఈ నొప్పిని తరచుగా మెడనొప్పి, వెన్ను పై భాగపు నొప్పి, వెన్ను దిగువ భాగపు నొప్పి) , హలాస్థి నొప్పి గా విభజిస్తుంటారు. ఇది ఆకస్మికంగా గానీ, ఎడతెగని నొప్పిగా గానీ ఉండొచ్చు. స్థిరంగా కానీ, విడతలు విడతలుగా వస్తూ పోతూ కానీ, ఒకే చోట కానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండొచ్చు. అది కొద్ది పాటి నొప్పిగా కానీ, పదునుగా, చీల్చుక పోతున్నట్టుగా కానీ, మంటతో కానీ ఉండొచ్చు. మోచేతి లోకి, చేతి)లోకి, వెన్ను పై భాగానికి, వెన్ను దిగువ భాగానికి కానీ నొప్పి వ్యాపించవచ్చు(కాలు, లేదా పాదంలోకి వ్యాపించవచ్చు). నొప్పితో సంబంధం లేని బలహీనత, మైకము, తిమ్మిరి కనిపించవచ్చు.

వెన్నునొప్పి అనేది మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. U.S.లో వైద్యుడిని కలవడానికి తరుచుగా చెప్పే కారణాలలో, వెన్ను దిగువ భాగాన తీవ్రంగా వచ్చే నొప్పి (దీన్నే నడుం నొప్పి) అంటారు) ఐదవది. పెద్ద వాళ్ళలో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి, జీవితంలో ఎప్పుడో ఒకసారి వెన్ను నొప్పి వస్తుంది. ప్రతి పదిమంది శ్రామికులలో ఐదు మందికి, ప్రతి సంవత్సరమూ వెన్ను నొప్పి కనపడుతుంటుంది.వెన్ను పాము అనేది నరాలు, కీళ్ళ, కండరాలు, స్నాయువు, అస్థి సంధాయకాలతో కూడిన సంక్లిష్టమైన అంతఃసంధాయక యంత్రాంగం. ఇవన్నీ నొప్పిని కలిగించే సామర్ధ్యం కలవి. వెన్నుపాము నుండి పుట్టిన పెద్ద నరాలు కాళ్ళలోకి, మోచేతులలోకి ప్రయాణించి నొప్పిని శరీరంలోని సుదూర ప్రాంతాలకు వ్యాపింపచేస్తాయి.

కాసేపు కదలకుండా కూర్చుంటే చాలు, కొంతమంది మహిళల్లో వెన్ను నొప్పి మొదలవుతుంది. దీనిని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే తరవాత సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కనుక నొప్పి అనిపిస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
  •  ఆఫీసులో గంటల కొద్దీ ఒకే భంగిమలో శిల్పంలా కూర్చోకూడదు. తరచూ కుర్చీలో అటూఇటూ కదలడం, అప్పుడప్పుడు ఒకవైపు ఒరగడం చేయాలి. లేకపోతే వెన్నెముకలో ఒకేచోట ఒత్తిడి పడి, ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశముంది.
  • వెన్ను నొప్పి తరచూ వచ్చే వాళ్లు తలని దాటి(తలకు మించిన -మోయలేని) బరువులు ఎత్తకపోవడమే మంచిది. అలాగే మీ శక్తి స్థాయిని బట్టి బరువులెత్తే ప్రయత్నాలు సరదాకి కూడా చేయొద్దు.

  • పడుకునే విధానం కూడా నొప్పికి కారణమవుతుంది. మీరు పొట్టపై భారం పడేట్టు పడుకునే వారయితే పొట్ట భాగంలో పల్చటి మెత్తటి దిండుని పెట్టుకుని పడుకోవాలి.
  •  విటమిన్‌ 'డి' తక్కువగా అందే వారిలోనూ వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఎండలో పది నిమిషాలు నిల్చుంటే కావాల్సిన 'డి' విటమిన్‌ అందుతుంది. చేపలూ, పాలూ, సోయా, కోడి గుడ్ల నుంచీ ఈ విటమిన్‌ లభిస్తుంది.

  •  స్విస్‌బాల్‌పై రోజూ ఇరవై నిమిషాల పాటు కూర్చోవాలి. దీనివల్ల వెన్ను కండరాలు బలంగా తయారవుతాయి. నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

  •  తరచూ క్రంచ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉంటే డెబ్భై ఐదు శాతం నడుం నొప్పి తగ్గుతుంది.

  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, February 23, 2013

Radiology,రేడియాలజీ

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Radiology,రేడియాలజీ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



రేడియాలజీ అనేది, శాస్త్రవేత్తలు మానవశరీరం లోపలి భాగాన్ని వివిధ కిరణాల నుండి చూడడానికి ఎక్స్-రేలను ఉపయోగించే విజ్ఞాన శాస్త్ర శాఖ. రేడియాలజిస్టులు వివిధ ఇమేజింగ్ టెక్నాలజీ (అల్ట్రాసౌండ్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT), న్యూక్లియర్ మెడిసిన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) వంటివి)లను ఉపయోగించి వ్యాధి నిర్ధారణ లేదా చికిత్స చేయడం జరుగుతుంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది (సామాన్యంగా చిన్న గాటు ద్వారా) ఇమేజింగ్ టెక్నాలజీల సాయంతో వైద్య ప్రక్రియలు నిర్వహించడం. మెడికల్ ఇమేజింగ్ పొందడం సామాన్యంగా రేడియోగ్రాఫర్ లేదా రేడియాలజిక్ టెక్నాలజిస్ట్ నిర్వహిస్తారు.

రేడియలాజికల్ చిత్రాల్ని పొందడం--ఈ క్రింది ఇమేజింగ్ పద్ధతులను రోగ నిర్ధారణ రేడియాలజీ రంగంలో ఉపయోగిస్తారు:

ప్రొజెక్షన్ (సమతల) రేడియోగ్రఫీ-- Projectional radiography

రేడియోగ్రాఫులు (లేదా రాంట్జెనోగ్రాఫులు, ఈ పేరు ఎక్స్-రేల ఆవిష్కర్త, విల్హేల్మ్ కాన్రాడ్ రాంట్జెన్ గౌరవార్థం పెట్టబడింది) అనేవి రోగి గుండా ఎక్స్-రేలను గ్రహణ ఉపకరణానికి ప్రసారం చేసి, అటుపై రోగనిర్ధారణ కొరకు దానిని చిత్రంగా మార్చడం జరుగుతుంది. అసలైనది మరియు నిశ్చలమైన సామాన్య ఇమేజింగ్, వెండి నిండిన ఫిలింలను ఉత్పన్నం చేస్తుంది. ఫిలిం-స్క్రీన్ రేడియోగ్రఫీలో, ఒక ఎక్స్-రే గొట్టం రోగికి గురిపెట్టి ఎక్స్-రేలను ఉత్పన్నం చేస్తుంది. రోగి గుండా ప్రసారమయ్యే ఎక్స్-రేలు పరిక్షేపాన్ని మరియు శబ్దాన్ని తగ్గించడానికి గాలనం చేయబడి, తరువాత డెవెలప్ కాని ఫిలింపై పడతాయి, ఈ ఫిలిం అనేది ఒక కాంతి-ప్రవేశించని కాసెట్ లో కాంతిని ప్రసరించే భాస్వరపు తెరకు గట్టిగా కట్టబడి ఉంటుంది. ఈ ఫిలింను అప్పుడు రసాయనికంగా డెవెలప్ చేయడం జరుగుతుంది మరియు ఫిలింపై చిత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం ఫిలిం-స్క్రీన్ రేడియోగ్రఫీకి బదులుగా డిజిటల్ రేడియోగ్రఫీ, DR, వాడడం పరిపాటి, ఇందులో ఎక్స్-రేలు సెన్సార్లు కలిగిన ఒక పళ్ళేన్ని తగులుతాయి, అప్పుడు ఉత్పన్నమైన సంకేతాలను డిజిటల్ సమాచారంగా మార్చి కంప్యూటర్ తెరపై చిత్రంగా చూపడం జరుగుతుంది. సమతల రేడియోగ్రఫీ అనేది రేడియాలజీ యొక్క మొదటి 50 ఏళ్ళలో అందుబాటులో ఉండిన ఏకైక ఇమేజింగ్ పద్ధతి. ఇప్పటికీ ఊపిరితిత్తులు, గుండె మరియు అస్థిపంజరం యొక్క పరిశీలనలో నిర్దేశించబడే మొదటి పరిశోధన, ఎందుకంటే అది ఎక్కువగా అందుబాటులో ఉండడం, వేగం మరియు పోల్చి చూసినపుడు తక్కువ ఖర్చు అవుతుంది ..

ఫ్లోరోస్కోపీ-Fluoroscopy

ఫ్లోరోస్కోపీ మరియు ఆన్జియోగ్రఫీ అనేవి ఎక్స్-రే ఇమేజింగ్ యొక్క ప్రత్యేక ప్రయోగాలు, వీటిలో ఒక ప్రకాశవంతమైన తెర మరియు ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ ట్యూబ్ లు, ఒక క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ వ్యవస్థకు సంధానించబడి ఉంటాయి. ఇందువలన కదలికలో ఉండే లేదా ఒక రేడియోకాంట్రాస్ట్ పదార్ధం యొక్క స్వరూపాలను ప్రత్యక్షంగా ఇమేజింగ్ చేయవచ్చు. రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు ఇవ్వబడడం, తరచూ మ్రింగడం ద్వారా లేదా రోగి శరీరంలోనికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, దీని కారణంగా ప్రత్యుత్పత్తి-మూత్ర వ్యవస్థ లేదా జఠర-ఆంత్ర ప్రదేశంయొక్క నిర్మాణ వ్యవస్థ మరియు రక్త వాహకాల చర్య స్పష్టంగా తెలుస్తుంది. రెండు రేడియో-కాంట్రాస్ట్ లు ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. జఠర-ఆంత్ర ప్రదేశంయొక్క పరిశీలనకు, బేరియం (BaSO4 రూపంలో)ను నోటిద్వారా లేదా మలద్వారం గుండా ఇవ్వడం జరుగుతుంది. వివిధ స్వామ్య రూపాల్లో, అయోడిన్ ను, నోటి ద్వారా, మలద్వారం గుండా, ధమనులు లేదా సిరల మార్గాల గుండా ఇవ్వవచ్చు. ఈ రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు ఎక్స్-రే ప్రసారాన్ని తీవ్రంగా సంలీనం లేదా పరిక్షేపం చేస్తాయి, మరియు ప్రత్యక్ష ఇమేజింగ్ తోడుగా జీర్ణవ్యవస్థలోని ఆహారచలనక్రియ లేదా ధమనులు మరియు సిరల్లో రక్త ప్రసరణ వంటి గతిశీల ప్రక్రియలను ప్రదర్శించడం జరుగుతుంది. అయోడిన్-కాంట్రాస్ట్ కూడా సాధారణ టిష్యూలకన్నా అసాధారణ ప్రదేశాలలో కేంద్రీకృతం చేయడం ద్వారా అసాధారణతలను (కణితులు, తిత్తులు, వాపు) మరింత స్పష్టంగా చూపుతుంది. అదనంగా, ప్రత్యేక పరిస్థితులలో జఠర-ఆంత్ర వ్యవస్థకు గాలిని కాంట్రాస్ట్ పదార్థంగా మరియు సిరల వ్యవస్థకు బొగ్గుపులుసు వాయువును కాంట్రాస్ట్ పదార్థంగా వాడడం జరుగుతుంది; ఈ సందర్భాలలో, కాంట్రాస్ట్ పదార్ధం పరిసరాల్లో ఉన్న టిష్యూల కన్నా ఎక్స్-రే ప్రసారాల స్థిరత్వాన్ని బలహీనపరుస్తుంది.

ఇంటర్వెన్షనల్ రేడియాలజీ--(Main article) Interventional radiology

ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (సంక్షిప్తంగా IR లేదా కొన్నిసార్లు VIR అంటే వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ , దీనినే సర్జికల్ రేడియాలజీ లేదా ఇమేజ్-గైడెడ్ సర్జరీ అంటారు) అనేది రేడియాలజీ యొక్క ఉప-ప్రత్యేకత, ఇందులో ఇమేజ్ గైడెన్స్ ద్వారా అతితక్కువ గాటు ప్రక్రియలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల్లో కొన్ని కేవలం రోగనిర్ధారణ ప్రయోజనాలకై ఉంటాయి (ఉదా., ఆంజియోగ్రాం), కాగా కొన్ని మాత్రం చికిత్స ప్రయోజనాలకై చేయడం జరుగుతుంది (ఉదా., ఆంజియోప్లాస్టీ).

ఇంటర్వెన్షనల్ రేడియాలజీ యొక్క ప్రాథమిక భావన ఏమిటంటే వ్యాధివిజ్ఞానశాస్త్రంలో రోగ నిర్ధారణ లేదా చికిత్సను వీలైనంత అతితక్కువ గాటు ప్రక్రియ ద్వారా చేయడం. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు వివిధ అస్వస్థతలను నిర్ధారించి చికిత్స చేయడం జరుగుతుంది, ఇవి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రీనల్ ఆర్టేరీ స్టెనోసిస్, ఇన్ఫీరియర్ వీనా కావా ఫిల్టర్ ప్లేస్-మెంట్, గాస్ట్రోస్టమీ ట్యూబ్ ప్లేస్-మెంట్స్, బైలియరీ స్టెన్ట్స్ మరియు హెపాటిక్ ఇంటర్వెన్షన్స్. చిత్రాల్ని మార్గనిర్దేశనం కొరకు వాడతారు మరియు ప్రక్రియలో ఉపయోగించే ప్రాథమిక సాధనాలు, కాతటర్లుగా పిలిచే, సూదులు మరియు చిన్న గొట్టాలు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, సాధనాలని శరీరం గుండా వ్యాధి కలిగిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళడానికి ఈ చిత్రాలు ఉపకరిస్తాయి. రోగికి శారీరక బాధను తగ్గించడం ద్వారా, పెరిఫెరల్ ఇంటర్వెన్షన్లు ఇన్ఫెక్షన్ అవకాశాల్ని మరియు కోలుకునే సమయాన్ని తగ్గిస్తాయి మరియు ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గిస్తాయి. సంయుక్త రాష్ట్రాలలో ఒక శిక్షిత ఇంటర్వెన్షనలిస్టు కావడానికి, ఒక వ్యక్తి సాధారణంగా ఉన్నత పాఠశాల తరువాత పదిహేనేళ్ళు శిక్షణ పొందాలి, ఇందులో ఏడు సంవత్సరాలు రెసిడెన్సీలో గడపాలి.

CT స్కానింగ్--X-ray computed tomography

CT ఇమేజింగ్ శరీరాన్ని చిత్రించడానికి ఎక్స్-రేలను కంప్యూటింగ్ అల్గారిథంలతో కలిపి ఉపయోగిస్తుంది. CTలో, ఒక ఎక్స్-రే డిటెక్టర్ (లేదా డిటెక్టర్లు)ఎదురుగా ఉన్న ఒక ఎక్స్-రే ప్రసారం చేసే గొట్టం వృత్తాకారంలో ఉన్న పరికరం రోగి చుట్టూ తిరుగుతూ, కంప్యూటర్ ద్వారా ఉత్పన్నమయ్యే అడ్డు-కోత చిత్రాన్ని (టోమోగ్రాం) అందిస్తుంది. CT అనేది అక్ష తలంలో లభిస్తుంది, కాగా కరోనల్ మరియు సాగిట్టల్ చిత్రాలు కంప్యూటర్ పునర్నిర్మాణం ద్వారా లభిస్తాయి. రేడియో-కాంట్రాస్ట్ పదార్థాలు తరచూ CTతో శరీర వ్యవస్థ యొక్క మెరుగైన చిత్రణ కొరకు వాడతారు. రేడియోగ్రాఫులు అధిక విస్తరణ స్పష్టతను అందించినప్పటికీ, CT ఎక్స్-రేలను బలహీనపరచడం ద్వారా మరింత వివరమైన పరిక్షేపాల్ని కనుగొనగలుగుతుంది. రోగిని రేడియోగ్రాఫ్ కన్నా CT మరింత అయానీకరణ ప్రసారానికి గురిచేస్తుంది.

స్పైరల్ మల్టి-డిటెక్టర్ CTలో, రోగి యొక్క నిరంతర కదలిక సమయంలో ప్రసార కిరణం ద్వారా 8, 16, 64 లేదా ఎక్కువ డిటెక్టర్లను ఉపయోగించి, తక్కువ పరీక్ష సమయంలో మరింత నిశితమైన చిత్రాల్ని పొందవచ్చు. CT స్కాన్ సమయంలో త్వరితంగా IV కాంట్రాస్ట్ ఇవ్వడం ద్వారా, ఈ నిశితమైన చిత్రాల నుండి కేరోటిడ్, సెరిబ్రల్ మరియు కరోనరీ ధమనులు, CTA, CT ఆంజియోగ్రఫీలలో 3D చిత్రాలను పునర్నిర్మించవచ్చు.

CT స్కానింగ్ కొన్ని అత్యవసర మరియు తీవ్ర పరిస్థితులైన సెరిబ్రల్ హేమరేజ్, పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల ధమనులలో రక్తం గడ్డకట్టడం), అయోర్టిక్ డిసేక్షన్ (పుపుసధమని గోడ చీరుకుపోవడం), అపెండిసైటిస్, డైవర్టిక్యులైటిస్, మరియు అడ్డువచ్చే మూత్రపిండాల రాళ్ళ వంటి పరిస్థితులలో రోగ నిర్ధారణ కొరకు ఎంపిక చేసుకునే పరీక్షగా మారింది. CT టెక్నాలజీలో త్వరిత స్కానింగ్ సమయాలు మరియు మెరుగైన స్పష్టత వంటి నిరంతర అభివృద్ది కారణంగా CT స్కానింగ్ యొక్క నిర్దిష్టత మరియు ఉపయోగం గణనీయంగా పెరిగాయి మరియు ఫలితంగా వైద్య రోగానిర్దారణలో వాడకం పెరిగింది.

మొట్టమొదటి వ్యాపారపరంగా సాధ్యమైన CT స్కానర్ ను సర్ గాడ్ఫ్రే హౌంస్ఫీల్డ్, EMI సెంట్రల్ రిసెర్చ్ లాబ్స్, గ్రేట్ బ్రిటన్లో 1972లో కనుగొన్నాడు. ది బీటిల్స్ మ్యూజిక్ కు సరఫరా హక్కులను EMI కలిగి ఉండేది మరియు వారి పరిశోధనలకు నిధులు వారి లాభాల కారణంగా సమకూరేవి . సర్ హౌంస్ఫీల్డ్ మరియు అలన్ మెక్ లియోడ్ మెక్ కార్మిక్ కలిసి CT స్కానింగ్ ఆవిష్కరణకు గాను 1979లో వైద్యరంగంలో నోబెల్ పురస్కారం పొందారు. ఉత్తర అమెరికాలో మొట్టమొదటి CT స్కానర్, రోచెస్టర్, MN లోని మాయో క్లినిక్ లో 1972లో ప్రారంభించబడింది.

అల్ట్రాసౌండ్- Ultrasound

మెడికల్ అల్ట్రాసోనోగ్రఫీలో శరీరంలోని మెత్తటి టిష్యూ స్వరూపాల్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ (అధిక పౌనఃపున్యం కలిగిన శబ్ద తరంగాలు) ఉపయోగిస్తారు. ఎలాంటి అయానీకరణ ప్రసారం ఉండదు, కానీ అల్ట్రాసౌండ్ ఉపయోగించి రాబట్టిన చిత్రం యొక్క నాణ్యత చాలావరకూ పరీక్ష చేసే వ్యక్తి (అల్ట్రాసోనోగ్రాఫర్) నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక అల్ట్రాసౌండ్, గాలి (ఊపిరితిత్తులు, ప్రేవుల మెలికలు) లేదా ఎముక గుండా చిత్రం అందించే సామర్థ్యం లేకపోవడం అనే పరిమితి కలిగి ఉంటుంది. మెడికల్ ఇమేజింగ్ లో అల్ట్రాసౌండ్ ఉపయోగం చాలావరకూ క్రితం 30 ఏళ్ళలోనే అభివృద్ది చెందింది. మొట్టమొదటి అల్ట్రాసౌండ్ చిత్రాలు నిశ్చలమైనవి మరియు రెండు పరిమాణాలు కలిగినవి (2D), కానీ ఆధునిక అల్ట్రాసోనోగ్రఫీ 3D పునర్నిర్మాణాలను ప్రత్యక్షంగా చూడవచ్చు; ఇవి ప్రయోజనపరంగా 4D. అల్ట్రాసౌండ్ లో అయానీకరణ ప్రసారం ఉపయోగించకపోవడం వలన, రేడియోగ్రఫీ, CT స్కాన్స్, మరియు న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ పద్ధతుల లాగా కాకుండా, ఇది సాధారణంగా క్షేమకరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా, ఈ పద్ధతి ప్రసవ సంబంధ ఇమేజింగ్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. పిండం శరీర వ్యవస్థ అభివృద్ధిని నిశితంగా పరిశీలించే అవకాశం ఉన్నందువలన ఇందులో ఎన్నో పిండంలోని లోపాలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. సమయానుకూలంగా పెరుగుదలను నిర్ధారించవచ్చు, ముఖ్యంగా క్రానిక్ వ్యాధి లేదా గర్భధారణ-ఫలితా వ్యాధి కలిగిన వ్యక్తులలో, మరియు బహుళ గర్భధారణలలో (ఇద్దరు, ముగ్గురు కవలలు వగైరా.). కలర్-ఫ్లో డాప్లర్ అల్ట్రాసౌండ్ ద్వారా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ తీవ్రతను కొలవవచ్చు మరియు దీనిని హృద్రోగ శాస్త్రంలో గుండె, గుండెలోని నాళాలు మరియు ప్రధాన రక్తనాడులను చురుకుగా పరిశీలించడానికి వాడతారు. కేరోటిడ్ ధమనుల స్టెనోసిస్ కారణంగా మెదడుకు రక్తప్రసరణ దెబ్బతినవచ్చు (స్ట్రోక్స్). కాళ్ళలో DVTను అల్ట్రాసౌండ్ ద్వారం అది స్థానభ్రంశం పొంది మరియు ఊపిరితిత్తులకు ప్రయాణించక ముందే (పల్మనరీ ఎంబాలిజం) గమనించవచ్చు, దీనిని చికిత్స చేయకుండా వదలివేస్తే ప్రాణాపాయం కలగవచ్చు. అల్ట్రాసౌండ్ అనేది జీవాణువుల పరీక్షలు మరియు డ్రైనేజీలు థోరాసేన్టేసిస్ వంటివి) చిత్ర-మార్గనిర్దేశన ఇంటర్వెన్షన్లలో ఉపయోగకరం. చిన్న రవాణా అల్ట్రాసౌండ్ సాధనాలు ప్రస్తుతం పెరిటోనియల్ లవాజ్ ను, తీవ్రగాయాల బాధితుల చికిత్సలో ప్రత్యక్షంగా పెరిటోనియంలో ఏదైనా రక్తస్రావం ఉన్న విషయం పరీక్షించడానికి మరియు ప్రధాన ఉదరభాగాలు అయిన కాలేయం, క్లోమం మరియు మూత్రపిండాల సంపూర్ణత్వాన్ని పరిశీలించడానికి భర్తీ చేస్తున్నాయి. విస్తృత హెమోపెరిటోనియం (శరీర అంగం లోపల రక్తస్రావం) లేదా ప్రధానాంగాలకు గాయం తగిలినప్పుడు అత్యవసర శస్త్ర పరీక్ష మరియు చికిత్స అవసరమవుతాయి.

MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ )--Main article: Magnetic resonance imaging

MRIలో బలమైన అయస్కాంత క్షేత్రాలను, శరీరంలోని టిష్యూలలో అణు కేంద్రకాలు సమరేఖలో (సామాన్యంగా ఉదజని ప్రోటాన్లు) తీసుకురావడానికి ఉపయోగిస్తారు, అప్పుడు ఈ కేంద్రకాల భ్రమణ అక్షాన్ని చెదరగొట్టడానికి రేడియో సంకేతం ఉపయోగిస్తారు, మరియు కేంద్రకాలు మరియు అన్ని పరిసర ప్రాంతాల్లోని కేంద్రకాలు యథాస్థితికి వచ్చేప్పుడు ఉత్పన్నమయ్యే రేడియో పౌనఃపున్యం సంకేతాన్ని పరిశీలిస్తారు. ఈ రేడియో సంకేతాలు కాయిల్స్ గా పిలువబడే చిన్న ఆంటెనాల ద్వారా సేకరించబడతాయి, వీటిని కావలసిన ప్రదేశం వద్ద ఉంచుతారు. MRI యొక్క ఒక లాభమేమిటంటే అక్ష, కరోనల్, సాగిట్టల్ మరియు బహుళ వక్ర తలాల్లోని చిత్రాల్ని సునాయాసంగా అందించే సామర్థ్యం. MRI స్కాన్లు అన్ని ఇమేజింగ్ పద్ధతులలోనూ అత్యుత్తమ సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్ అందిస్తాయి. స్కానింగ్ వేగం మరియు చిత్రాల స్పష్టత అభివృద్ది చెందేకొద్దీ, మరియు కంప్యూటర్ 3D అల్గారిథంలు మరియు హార్డ్ వేర్ అభివృద్ది కారణంగా, MRI అనేది మస్కులోస్కెలిటల్ రేడియాలజీ మరియు న్యూరోరేడియాలజీలో సాధనంగా మారింది.

ఒక్క లోపమేమిటంటే ఇమేజింగ్ జరిగేటప్పుడు, రోగి ఎక్కువ సమయం పాటు నిశ్చలంగా చాలా శబ్దం కలిగిన, ఇరుకైన ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది. క్లాస్ట్రోఫోబియా (ఇరుకైన ప్రదేశాలంటే తీవ్రమైన భయం) కారణంగా MRI పరీక్ష చేయలేని సందర్భాలు సుమారు 5% రోగుల్లో కనిపిస్తుంటాయి. అయస్కాంత రూపకల్పనలో బలమైన అయస్కాంత క్షేత్రాలు (3 టెస్లాలు), తక్కువ పరీక్షా సమయాలు, వెడల్పైన, చిన్నవైన అయస్కాంత రంధ్రాలు మరియు మరింత తెరచిన అయస్కాంత రూపకల్పనల వంటి ఇటీవలి అభివృద్ది వలన క్లాస్ట్రోఫోబిక్ రోగులకు కాస్త నిశ్చింత కలిగించాయి. కానీ, సమాన క్షేత్ర బలం కలిగిన అయస్కాంతాలలో, తరచూ చిత్ర నాణ్యత మరియు తెరచి ఉంచిన రూపకల్పనల మధ్య రాజీ పడాల్సి వస్తుంది. MRIలో మెదడు, వెన్ను, మరియు మస్కులో-స్కెలిటల్ వ్యవస్థలను ఇమేజింగ్ చేయడంలో గొప్ప లాభాలున్నాయి. ఈ పద్ధతిని ప్రస్తుతం పేస్ మేకర్లు, కాక్లియర్ ఇమ్ప్లాంట్లు, కొన్ని శరీరం లోపలి వైద్యసంబంధ పంపులు, కొన్ని రకాల సెరిబ్రల్ ఎన్యూరిజం క్లిప్పులు, కళ్ళలో లోహపు మూకలు మరియు కొన్ని లోహపు భాగాలు కలిగిన రోగులకు నిషిద్ధం, ఎందుకంటే శరీరం శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలకు మరియు బలమైన చలించే రేడియో సంకేతాలకు గురవుతుంది. అభివృద్ది అవకాశం కలిగిన రంగాలు ఫంక్షనల్ ఇమేజింగ్, కార్డియో-వాస్కులార్ MRI, ఇంకా MR ఇమేజ్ గైడెడ్ థెరపీ.

న్యూక్లియర్ మెడిసిన్--Main article: Nuclear medicine

న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ లో రోగి శరీరంలోనికి రేడియో-ధార్మిక ట్రేసర్ కలిగిన కొన్ని శరీర టిష్యూలకు ఆకర్షణ కలిగిన పదార్థాలు ఉండే రేడియోఫార్మాస్యూటికల్స్ పంపబడతాయి. ఎంతో సాధారణంగా ఉపయోగించబడే ట్రేసర్లు టెక్నీషియం-99m, అయోడిన్-123, అయోడిన్-131, గాలియం-67 మరియు థాలియం-201. ఈ పద్ధతులను ఉపయోగించి గుండె, ఊపిరితిత్తులు, థైరాయిడ్, కాలేయం, గాల్ బ్లాడర్, మరియు ఎముకలను సాధారణంగా ప్రత్యేక స్థితుల కొరకు పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశోధనలలో శరీరవ్యవస్థ వివరాలు పరిమితమైనప్పటికీ, న్యూక్లియర్ మెడిసిన్ అనేది దేహధర్మ కార్యకలాపాలను చూపేందుకు ఉపకరిస్తుంది. మూత్రపిండాల విసర్జన చర్య, థైరాయిడ్ యొక్క అయోడిన్ గాఢత, గుండె కండరాలకు రక్త ప్రసరణ వగైరా కొలవవచ్చు. ప్రధానమైన ఇమేజింగ్ పరికరం గామా కెమెరా, ఇది శరీరంలోని ట్రేసర్ ఉత్పన్నం చేసే ప్రసారాన్ని గ్రహించి దానిని చిత్రంగా చూపుతుంది. కంప్యూటర్ ప్రాసెసింగ్ తో, ఈ సమాచారాన్ని అక్ష, కరోనల్ మరియు సాగిట్టల్ చిత్రాలుగా చూపవచ్చు (SPECT చిత్రాలు, సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ). అత్యంతాధునిక పరికరాల్లో, న్యూక్లియర్ మెడిసిన్ చిత్రాలను CT స్కాన్ తో పోల్చి-సంధానం చేసి, రోగనిర్ధారణ ఖచ్చితత్వం మెరుగు పరచడం కొరకు దేహధర్మ సమాచారాన్ని శరీర వ్యవస్థ స్వరూపాలతో కలిపి లేదా నమోదు చేసి చూడవచ్చు.

పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET), స్కానింగ్ కూడా "న్యూక్లియర్ మెడిసిన్" విభాగం క్రిందికే వస్తుంది. PET స్కానింగ్ లో, ఒక రేడియో-ధార్మిక, జీవశాస్త్రపరంగా చురుకైన పదార్ధం, ఎంతో తరచుగా ఫ్లుడేయాక్సీగ్లూకోస్(18F), రోగికి ఇంజెక్ట్ చేయబడుతుంది మరియు రోగి ద్వారా ప్రసారం చేయబడిన వికిరణాన్ని కనుగొని శరీరం యొక్క బహుళ-తల చిత్రాల్ని ఉత్పన్నం చేయడం జరుగుతుంది. శరీరచర్యలలో మరింత చురుకైన కాన్సర్ వంటి టిష్యూలు, సాధారణ టిష్యూల కన్నా ఎక్కువగా చురుకైన పదార్థాన్ని కేంద్రీకృతం చేస్తాయి. PET చిత్రాల్ని ఒక శరీర ధర్మ ఇమేజింగ్ పరిశోధన (ప్రస్తుతం సాధారణంగా CT చిత్రాలు)లతో కలపవచ్చు (లేదా "మిశ్రమం చేయవచ్చు"), దీని ద్వారా మరింత ఖచ్చితంగా PET ఫలితాలను తెలుసుకోవడం తద్వారా రోగనిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం చేయవచ్చు.

టెలిరేడియాలజీ

టెలిరేడియాలజీ అనేది రేడియోగ్రాఫిక్ చిత్రాల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రేడియాలజిస్ట్ పరిశీలనకై పంపడం. దీనిని తరచుగా గంటల కొద్దీ జరిగిన సామాన్య శస్త్రచికిత్స తరువాత, రాత్రులు మరియు వారాంతాలలో అత్యవసర గది, ICU మరియు ఇతర అత్యవసర పరీక్షల త్వరిత పరిశీలన కొరకు వాడతారు. ఈ సందర్భాలలో చిత్రాల్ని తరచూ టైం జోన్ ల గుండా పంపించడం జరుగుతుంది (అంటే స్పెయిన్, ఆస్ట్రేలియా, భారత దేశాలకు), దీనివలన అందుకునే రేడియాలజిస్ట్ అతడి సాధారణ పగటి సమయంలోనే పనిచేయడం సాధ్యమవుతుంది. టెలిరేడియాలజీని ఒక సమస్యాత్మక లేదా కఠిన సందర్భంలో, ఒక నిపుణుడు లేదా సబ్-స్పెషలిస్ట్ సంప్రదింపులకు కూడా ఉపయోగించవచ్చు.

టెలిరేడియాలజీకి ఒక పంపే కేంద్రం, అధిక వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ఉన్నత నాణ్యతగల అందుకునే కేంద్రం అవసరం. ప్రసార కేంద్రంలో, ప్లెయిన్ రేడియోగ్రాఫులు ప్రసారానికి మునుపు ఒక డిజిటైజింగ్ యంత్రం గుండా పంపించడం జరుగుతుంది, కాగా CT స్కాన్లు, MRIలు, అల్ట్రాసౌండ్లు మరియు న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్లు అప్పటికే డిజిటల్ సమాచారం కావడం వలన నేరుగా పంపవచ్చు. అందుకునే ప్రదేశంలో కంప్యూటర్, వైద్య ప్రయోజనాలకు పరీక్షింపబడి మరియు అనుమతింపబడిన ఉన్నత-నాణ్యత ప్రదర్శన తెర కలిగి ఉండడం అవసరం. పరిశీలించే రేడియాలజిస్ట్ అప్పుడు రేడియాలజీ నివేదికను అభ్యర్థించిన వైద్యుడికి ఫాక్స్ లేదా ఇ-మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.

టెలిరేడియాలజీ యొక్క ప్రధాన లాభమేమిటంటే వివిధ టైం జోన్లను ఉపయోగించి ప్రత్యక్షంగా అత్యవసర రేడియాలజీ సేవలను ఎల్లవేళలా అందించడం. ఇందులోని నష్టాలేమిటంటే అధిక ఖర్చులు, అభ్యర్థించే వైద్యుడు మరియు రేడియాలజిస్ట్ మధ్య పరిమిత సంబంధం, మరియు స్థానిక రేడియాలజిస్ట్ కొరకు కావలసిన ప్రక్రియలకు సమర్థత లేకపోవడం వంటివి. వివిధ రాష్ట్రాల్లో టెలిరేడియాలజీకి సంబంధించిన చట్టాలు మరియు నియమాలు మారుతుంటాయి, కొన్ని రాష్ట్రాలలో రేడియలాజికల్ పరీక్ష పంపే రాష్ట్రంలో రాష్ట్రంలో వైద్యం చేసే అనుమతి పొంది ఉండడం అవసరం. కొన్ని రాష్ట్రాలలో టెలిరేడియాలజీ నివేదికను ప్రాథమికంగా పరిగణించి, అధికారిక నివేదికను ఆసుపత్రి సిబ్బంది రేడియాలజిస్ట్ జారీ చేయడం అవసరం.

రేడియాలజిస్ట్ శిక్షణ--అమెరికా సంయుక్త రాష్ట్రాలు

రేడియాలజీ అనేది వైద్యశాస్త్రంలో పోటీరంగం మరియు విజయవంతమైన అభ్యర్థులు తరచూ వారి వైద్య విద్యాలయ తరగతుల్లో, అత్యధిక శాతం మార్కులు సాధించిన వారి ఉంటారు. ఈ రంగం ఆధునిక ఇమేజింగ్ కు సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీలో అభివృద్ది కారణంగా త్వరితంగా విస్తారమవుతోంది. రోగానిర్ధారక రేడియాలజిస్టులు కనీసం 13 ఏళ్ళ ఉన్నత-పాఠశాల-తరువాతి విద్యతో పాటుగా, మునుపే అవసరమైన 4 సంవత్సరాల అండర్-గ్రాడ్యుయేట్ శిక్షణ, వైద్య కళాశాల లో 4 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేట్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. మొదటి పోస్ట్-గ్రాడ్యుయేట్ సంవత్సరం సామాన్యంగా వివిధ భ్రమణాల మార్పు సంవత్సరం, కానీ కొన్నిసార్లు మెడిసిన్ లేదా సర్జరీలలో ప్రాథమిక శిక్షణ. తరువాత నాలుగేళ్ల రోగనిర్ధారణ రేడియాలజీ రెసిడెన్సీ ఉంటుంది. ఈ రేడియాలజీ రెసిడెంట్ కు, ఒక వైద్య భౌతికశాస్త్రం బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం, ఇందులో అల్ట్రాసౌండ్ యొక విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికత, CTలు, ఎక్స్-రేలు, న్యూక్లియర్ మెడిసిన్ మరియు MRI ఉంటాయి. రేడియాలజిస్ట్ యొక్క ప్రాథమిక జ్ఞానంలో జీవ కణాలపై అయానీకరణ ప్రసారం ద్వారా కలిగే ప్రభావాల పరిశీలనకు చెందిన రేడియో-బయాలజీ ఉంటుంది. రెసిడెన్సీ పూర్తికావచ్చే సమయంలో, శిక్షణ పొందే రేడియాలజిస్ట్, అమెరికన్ బోర్డ్ అఫ్ రేడియాలజీ (ABR) నిర్వహించే వ్రాత మరియు మౌఖిక బోర్డ్ పరీక్షలకు అర్హుడు. 2010నుండీ, ABR యొక్క బోర్డ్ పరీక్ష స్వరూపం మారనుంది, ఇందులో రెండు కంప్యూటర్-ఆధారిత పరీక్షలు ఉంటాయి, ఒకటి రెసిడెన్సీ శిక్షణలోని మూడవ సంవత్సరంలో, మరియు రెండవది మొదటి దాని తరువాత 18 నెలలకు ఉంటాయి.

ది వేన్ స్టేట్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ మరియు ది యూనివర్సిటీ అఫ్ సౌత్ కరోలినా స్కూల్ అఫ్ మెడిసిన్ రెండూ, ఒక సమగ్ర రేడియాలజీ శిక్షణను వారి సంబంధిత MD కార్యక్రమాల్లో, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్ అల్ట్రాసౌండ్ ఇన్ మైక్రోగ్రావిటీ పరిశోధకుల నేతృత్వంలో GE మెడికల్ అనుసంధానం ద్వారా అందిస్తారు.

రెసిడెన్సీ శిక్షణ పూర్తయిన తరువాత, రేడియాలజిస్టులు వారి ప్రాక్తీసును ప్రారంభిస్తారు లేదా ఫెలోషిప్ లుగా పిలువబడే సబ్-స్పెషాలిటీ శిక్షణ కార్యక్రమాల్లో ప్రవేశిస్తారు. రేడియాలజీలోని సబ్-స్పెషాలిటీ శిక్షణకు ఉదాహరణలు అబ్డామినల్ ఇమేజింగ్, తోరాసిక్ ఇమేజింగ్, CT/అల్ట్రాసౌండ్, MRI, మస్కులోస్కేలిటల్ ఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరోరేడియాలజీ, ఇంటర్వెన్షనల్ న్యూరోరేడియాలజీ, పీడియాట్రిక్ రేడియాలజీ, మమ్మోగ్రఫీ మరియు విమెన్స్ ఇమేజింగ్. రేడియాలజీలో ఫెలోషిప్ శిక్షణ కార్యక్రమాలు సామాన్యంగా 1 లేదా 2 సంవత్సరాలు ఉంటాయి.

రేడియోగ్రాఫిక్ పరీక్షలు సామాన్యంగా సంయుక్త రాష్ట్రాలలో 2-ఏళ్ళ అసోసియేట్స్ డిగ్రీ మరియు UKలో 3 ఏళ్ళ ఆనర్స్ డిగ్రీ కలిగిన రేడియాలజిక్ టెక్నాలజిస్టులు, (వీరినే డయాగ్నస్టిక్ రేడియోగ్రాఫర్లు అని కూడా అంటారు) చేస్తారు.

వెటరినరీ రేడియాలజిస్టులు అంటే ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్, MRI మరియు డయాగ్నస్టిక్ ఇమేజింగ్ లేదా జంతువులలో వ్యాధి చికిత్స కొరకు న్యూక్లియర్ మెడిసిన్ లో నైపుణ్యం కలిగిన జంతువైద్యుడు. వారు అమెరికన్ కాలేజీ అఫ్ వెటరినరీ రేడియాలజీ ద్వారా డయాగ్నస్టిక్ రేడియాలజీ లేదా రేడియేషన్ ఆంకాలజీలో యోగ్యతాపత్రం పొంది ఉంటారు.
జర్మనీ

వైద్య అనుమతి పొందిన తరువాత, జర్మన్ రేడియాలజిస్టులు 5-ఏళ్ళ రెసిడెన్సీని పూర్తీ చేయాలి, ఇందులో చివరగా ఒక బోర్డ్ పరీక్ష ఉంటుంది (దీనిని ఫచర్జ్టాస్బిల్డుంగ్ అంటారు).
ఇటలీ-2008 వరకూ, ఒక రేడియాలజీ శిక్షణ కార్యక్రమం నాలుగేళ్ల కాలంగా ఉండేది. ప్రస్తుతం, ఒక రేడియాలజీ శిక్షణ కార్యక్రమం అయిదేళ్ళ పాటు ఉంటుంది. రేడియో-థెరపీ లేదా న్యూక్లియర్ మెడిసిన్ లలో నైపుణ్యం కొరకు మరింత శిక్షణ అవసరం.

Source : Wikipedia.org
  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Angioplasty,యాంజియోప్లాస్టి

  •  




  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Angioplasty,యాంజియోప్లాస్టి-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




 రక్త నాళ కుడ్యాలలో కొవ్వు పేరుకు పోవడం వలన రక్త నాళాలు కుంచించుకపోయినపుడు, లేదా ఆటంకానికి గురైనపుడు, వాటిని యాంత్రికంగా వెడల్పు చేసే పద్ధతిని యాంజియోప్లాస్టీ అంటారు. మార్గదర్శిగా ఉన్న తీగపై, ఖాళీగా, ముడుచుకొని ఉన్న స్థితిలో ఉన్న బెలూన్‌ని బెలూన్ కెథటార్ అంటారు. దీనిని కుంచించుకపోయిన ప్రదేశాలలోకి చొప్పించి, ఆ తర్వాత, దానిలోకి మామూలు రక్త పీడనం(6-20 అట్మాస్పియర్లు) కన్నా 75 నుండి 500 రెట్లు ఎక్కువగా నీటి ఒత్తిడిని పంపి బెలూన్‍ను ఉబ్బేటట్లు చేస్తారు. అప్పుడు ఈ బెలూన్ కొవ్వు నిల్వలపై ఒత్తిడి కలుగజేస్తుంది. తద్వారా రక్తనాళాలు తెరుచుకునేలా చేసి రక్తప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. అలా చేసాక ఈ బెలూన్‌ని తిరిగి పూర్వపు స్థితికి తెచ్చి, దాన్ని ఉపసంహరిస్తారు.

ఈ పదము గ్రీకు భాషలోని  యగియోస్ , ప్లాస్టోస్ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. యగియోస్ అంటే "నాళము" అని అర్థం. ప్లాస్టోస్ అంటే "రూపొందిన', "మలచిన" అని అర్థం. యాంజియోప్లాస్టీ ద్వారా అన్ని రకాల ప్రసరణ సంబంధమైన సమస్యలను, రక్తనాళాల ద్వారా చొప్పించే విధానం ద్వారా గానీ, లేదా చర్మం ద్వారా చొప్పించే విధానం ద్వారా గానీ పరిష్కరించవచ్చు

చరిత్ర

యాంజియోప్లాస్టీని మొదట చార్లెస్ డాటర్ అనే ఇంటర్‌వెన్షనల్ రేడియాలజిస్ట్, 1964లో ఉపయోగించాడు. యాంజియోప్లాస్టీని, కెథటార్ ద్వారా చొప్పించే స్టంట్‌ని కనుగొనడం ద్వారా  డా.డాటర్ ఆధునిక వైద్య విధానానికి ఆద్యుడయ్యాడు. దీన్ని ఆయన పరిధీయ ధమని వ్యాధికి చికిత్స చేయడానికి వాడాడు. 1964, జనవరి 16లో, సాధారణ స్థితిలో కూడా రక్తం గడ్డకట్టే వ్యాధితో, మానని గాయంతో బాధ పడుతూ, కాలును తీసివేయడానికి అంగీకరించని 82 సంవత్సరాల స్త్రీకి, డా.డాటర్ చర్మం ద్వారా బెలూన్‌ని చొప్పించి, కుంచించుకపోయిన పరిధీయ ఊరుధమని(SFA)ని వెడల్పు చేసాడు. మార్గదర్శక తీగ, కోయాక్సియల్ టెఫ్లాన్ కాథటార్స్‌లతో కుంచించుకపోయిన ధమనిని వెడల్పు చేసాక, కాలులో తిరిగి రక్తప్రసరణ మామూలు స్థితికి వచ్చింది. ఇలా వెడల్పు చేసిన ధమని, ఆమె న్యుమోనియాతో చనిపోయేంతవరకూ, రెండున్నర సంవత్సరాల పాటు అలాగే పని చేసింది. చార్లెస్ డాటర్‍ను "ఇన్వెన్షనల్ రేడీయాలజీ పితామహుడ"ని పిలుస్తారు. ఆయన చేసిన కృషికి గాను, 1978లో వైద్యరంగంలో నోబెల్ బహుమతినోబుల్ ప్రైజ్కు ఎంపికయ్యాడు.

మొట్టమొదటి కరోనరీ యాంజియోప్లాస్టీని 1977లో జర్మన్ హృద్రోగనిపుణుడు యాండ్రెస్ గ్రుయెంట్‍జిగ్, మెలకువగా ఉన్న ఒక రోగికి చేసాడు.హృదయ
ధమని వ్యాధికి కారణాలు

అధిక రక్త పీడనము, మధుమేహం, కనీస వ్యాయమంలేని జీవితం, పొగతాగడం, కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, హృదయ సంబంధ వ్యాధులుండడం వలన ధమనులలో రక్త ప్రవాహం ఆటంక పరచబడుతుంది. యాంజియోప్లాస్టీ ద్వారా ఈ ఆటంకాలను తొలగించవచ్చు.యాంజియోప్లాస్టీ బైపాస్ శస్త్ర చికిత్స కన్నా సురక్షితం. ఈ విధానంలో చికిత్స చేయించుకున్న వారిలో 1% మంది మాత్రమే చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఈ క్రింద చెప్పిన సమస్యలు తలెత్తవచ్చు:
    ధమనికి గాయం కలగడం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోవచ్చు. హృదయ కుఢ్య కణక్షయం జరగవచ్చు. దీనిని సాధారణంగా స్టంట్తో బాగు చేస్తారు.
    గడ్డ కట్టిన రక్తం తొలగించడం వల్ల కొన్ని సందర్భాలలో గుండె పోటు రావచ్చు.( యాంజియోప్లాస్టీ చికిత్స తీసుకుంటున్న వారిలో 1%కంటే తక్కువ రోగులలో ఇలా జరిగింది.)
    కాథటర్ను అమర్చిన చోట రక్తం కారడం లేదా గాయం అవడం సంభవించవచ్చు:
    ఎక్స్-రే తీసేటప్పుడు దాని కోసం ఉపయోగించే అయోడిన్ కాంట్రాస్ట్ వర్ణకం వల్ల, మూత్ర పిండ వ్యాధి, మధుమేహం ఉన్న వారిలో మూత్ర పిండ సమస్యలు తలెత్త వచ్చు. ఇలాంటప్పుడు యాంజియోప్లాస్టీ చేయడానికి ముందుగాని, చేసిన తర్వాత గానీ రక్తనాళాలలోకి ద్రవాలను ఎక్కించడం ద్వారా , మందుల ద్వారా నష్టం కలిగే అవకాశాలను తగ్గిస్తారు.
    అరీథిమా (గుండె సరిగా కొట్టుకోకపోవడం);
    యాంజియోప్లాస్టీ చేస్తున్నప్పుడు వర్ణకం వల్ల వేదనాత్మక ప్రతిచర్య కలిగే అవకాశం ఉంది.
    3 నుండి 5% కేసులలో హృదయ కుఢ్య కణ క్షయం జరిగే అవకాశం ఉంది.
    ఈ విధానంలో హృదయ ధమనిని అత్యవసరంగా బైపాస్ పద్ధతిలో అతికించాల్సిన అవసరం ఏర్పడచ్చు. (2 నుంచి 4% మందిలో) ధమని మూసుకుపోయినపుడు ఇలా చేయాల్సి వస్తుంది:
    యాంజియోప్లాస్టీ చేసాక ఏర్పడే సాధారణ సమస్యలలో ధమని తిరిగి కుచించుకుపోవడం ఒకటి. యాంజియోప్లాస్టీ చేసాక కొన్ని వారాల తర్వాత గానీ, కొన్ని నెలల తర్వాత గానీ, రక్తనాళం క్రమంగా కుంచించుకపోవచ్చు. అధిక రక్త పీడనం మధుమేహం, ఛాతినొప్పి, మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో ఇలా జరగడానికి అవకాశం ఉంది.
    యాంజియోప్లాస్టీ చేసాక కొన్ని గంటల తర్వాత గానీ, కొన్ని నెలల తర్వాత గానీ స్టంట్‌లలో రక్తం ( స్టెంట్‍లో థ్రాంబోసిస్) గడ్డ కట్టవచ్చు. దీనివల్ల హృదయ కుఢ్య కణ క్షయం జరగవచ్చు.

యాంజియోప్లాస్టీ వల్ల, 75 ఏళ్ళకు మించినవారి లోనూ, మధుమేహ వ్యాధితో బాధపడే వారిలోనూ, తీవ్రమైన హృదయ సంబంధ వ్యాధులున్న వారిలోనూ, హృదయ ధమనులలో రక్తం గడ్డకట్టిన వారిలోనూ ఎక్కువగా సమస్యలు తలెత్తుతాయి. రక్త పంపిణి సరిగా లేని వారిలోనూ, స్త్రీలలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.

యాంజియోప్లాస్టీ వల్ల హృదయ కుఢ్య కణ క్షయం, గుండెపోటు, మూత్ర పిండ సమస్యలు చాలా అరుదుగా మాత్రమే తలెత్తుతాయి. దీనివల్ల చనిపోయే రోగుల శాతం కూడా చాలా తక్కువ. ఇది 0.1% మాత్రమే ఉంది.(బైపాస సర్జరీలో ఇది 1% నుంచి 2% వరకు ఉంది.) మొత్తం మీద యాంజియోప్లాస్టీ వల్ల తలెత్తే నష్టం, దాని వల్ల కలిగే ప్రయోజనంతో పోలిస్తే సాపేక్షికంగా తక్కువగానూ, ఆమోదయోగ్యంగానూ ఉంది (నష్టం కలిగే అవకాశం - ప్రయోజనాల నిష్పత్తి ).

వివాదం--గుండె నొప్పికి గురైన రోగులను కాపాడడంలో(ధమనిలో ఏర్పడిన ఆటంకాన్ని తక్షణం తొలగించడంలో) యాంజియోప్లాస్టీ ఉపయోగాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ యాంజియోప్లాస్టీ వల్ల తలెత్తే సమస్యలను తగ్గించే విషయంలోమాత్రం ఈ అధ్యయనాలు విఫలమయ్యాయి. యాంజియోప్లాస్టీ vs. ఛాతి నొప్పి స్థిరంగా ఉన్న రోగులకు చేసే వైద్య చికిత్సా విధానం. ధమనిని తెరిచే విధానం తాత్కాలికంగా ఛాతి నొప్పిని తగ్గిస్తుంది. కానీ అది ఎక్కువ కాలం నొప్పిని ఆపలేదు. "చాలా గుండెనొప్పులు ధమనులు కుంచించుకపోయి ఆటంకాలు ఏర్పడడం వల్లనే కలగవు".

పొగ తాగడం ఆపివేయడం, వ్యాయామం, రక్తపోటును నియంత్రించే మందులను వాడుతుండడం, తద్వారా కొలెస్టరాల్‍ను తగ్గించుకోవడం, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడం వంటి చర్యల ద్వారా రోగులలో గుండె నొప్పిని శాశ్వతంగా నివారించే వీలుంది.
ఈ విధానం తర్వాత యాంజియోప్లాస్టి చేసిన తర్వాతా చాలా మంది రోగులను రాత్రంతా పరిశీలనలో ఉంచుతారు. సమస్యలేవీ కనిపించనట్లయితే మరుసటి రోజు రోగిని ఇంటికి పంపిస్తారు.
కెథటార్ అమర్చిన ప్రాంతంలో రక్తస్రావం జరుగుతున్నదా, వాపు ఏమైనా వచ్చిందా, గుండె సరిగా కొట్టుకుంటుందా, రక్త పీడనం ఎలా ఉంది వంటి విషయాలను పర్యవేక్షిస్తారు. ధమనులు సంకోచించినపుడు సాధారణంగా మందులనుపయోగించి తగ్గిస్తారు. ఈ విధానం తర్వాత రోగులు ఆరు గంటల కల్లా అతి కష్టం మీద నడవగలుగుతారు. ఒక వారం తర్వాత మామూలు స్థితికి వస్తారు.

యాంజియోప్లాస్టీ అయ్యాక కొన్ని రోజుల పాటు శారీరక కార్యకలాపాలు ఆపాల్సి ఉటుంది. బరువులు ఎత్తకూడదని, చిన్నపిల్లలను కూర్చోబెట్టుకోకూడదని, కష్టతరమైన పనులు చేయకూడదని రోగులకు సలహా ఇస్తారు. సున్నితమైన బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కనీసం రెండు వారాల దాకా శరీరానికి కష్టం కలిగే పనులు, ఎక్కువ సేపు ఆటలాడడం వంటివి చేయకుండా ఉండాలి.

రోగులలో రక్త స్కందన నిరోధానికి ఎసిటైల్‍సాలిసిలిక్ ఆమ్లముతో పాటుగా అదే సమయంలో క్లొపిడోగ్రెల్ను ఇస్తారు. ఈ మందులను రక్త గడ్డ కట్టకుండా ఉండేందుకు ఇస్తారు. వీటిని చికిత్స చేయించుకున్న నాలుగు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో, రోగులు ఈ మందులను ఒక సంవత్సరం పాటు వాడుతుంటారు. దంత చికిత్సను చేయించుకుంటున్న రోగులకు ఎండోకార్డైటిస్ సమస్య తలెత్తే అవకాశం, గుండెలో సంక్రమణం వ్యాపించే అవకాశం ఉన్నందున ఆ చికిత్సను ఆపివేయమని రోగులకు సలహా ఇస్తారు.
స్టంట్ అమర్చిన చోట వాయడం, రక్తస్రావమవడం, నొప్పి కలగడం, జ్వరం రావడం, నిస్త్రాణ లేదా నీరసంగా అనిపించడం, శరీర ఉష్ణోగ్రతలో మార్పు, లేదా మోచేయి, కాలు రంగు మారిపోవడం, గాలి సరిగా ఆడకపోవడం , ఛాతినొప్పి కనిపించినట్లయితే వెంటనే వైద్య సలహా పొందాలి.

పరిధీయ యాంజియోప్లాస్టీ

పరిధీయ యాంజియోప్లాస్టీ అంటే హృదయ ధమనులకు బయట ఉన్న రక్త నాళాన్ని తెరిచేందుకు బెలూన్‌ని ఉపయోగించడం. ఉదరంలోనూ, కాలులోనూ,వృక్క ధమనులలోనూ కుఢ్యాలకు కొవ్వు పేరుకుని, అవి కుంచించుకుపోయినపుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. సిరలు కుంచించుక పోయినపుడు కూడా వాటిని నయం చేయడానికి PA పద్ధతిని ఉపయోగిస్తారు. పరిధీయ యాంజియోప్లాస్టీలో పరిధీయ స్టంటింగ్ తోపాటుగా అథరెక్టమిని కలిపి చేస్తారు.

కరోనరీ యాంజియోప్లాస్టీ

ఎడమ కరోనరీ ప్రసరణను చూపుతున్న కరోనరీ యాంజియోగ్రామ్ (హృదయ ధమనులలో తీసిన ఎక్స్ - రే, రేడియో ఒపెక్ కాంట్రాస్టుతో)దూరస్థ ఎడమ ప్రధాన హృదయ ధమని (LMCA) పటంలో ఎడమ పై భాగపు పావువర్తులంలో ఉంది. దీని ప్రధాన శాఖలలో (పటంలో కనపడుతున్నాయి) ఒకటి , ఎడమ సర్‌క్యుమ్‌ప్లెక్స్ ధమని (LCX)- ఇది పై నుంచి కిందికి, మధ్య నుండి కిందికి వ్యాపించి ఉంటుంది. రెండవది, ఎడమ పూర్వాంత అవరోహణ ధమని(LAD) , పటంలో ఎడమ నుండి కుడికి, మధ్య నుండి కిందికి దూరస్థ LCX కింది భాగంలో చూపించబడింది. LADకు పొడవైన రెండు ఐమూల శాఖలు ఉన్నాయి. ఇవి పటంలో మధ్య పై భాగంలోనూ, మధ్య కుడి భాగంలోనూ వ్యాపించి ఉన్నాయి.

 Percutaneous coronary intervention-పర్‌క్యుటేనియస్ కరోనరీ ఇంటర్‌‌వెన్షన్‍ ను (PCI ), సాధారణంగా కరోనరీ యాంజియోప్లాస్టీ అని పిలుస్తారు. ఈ చికిత్సా విధానాన్ని కరోనరీ గుండెజబ్బుకు, కుచించుకుపోయిన గుండెయొక్క హృదయ ధమనులను వెడల్పు చేయడానికి ఉపయోగిస్తారు. రక్తనాళాలు కొలస్టరాల్ కారణంగా కుచించుకపోతాయి. ఇది రక్త నాళ కుడ్యాలకు కొవ్వు పేరుకొని పోవడానికి కారణమవుతుంది. PCIని సాధారణంగా ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్నిర్వహిస్తాడు.

స్థిరమైన హృదయ ధమని వ్యాధి ఉన్నవారిలో PCI చికిత్స చేసి ఛాతినొప్పిని తగ్గిస్తాడు. అయితే , హృదయ కుఢ్య కణ క్షయం, ఇతర ప్రధాన హృదయ ప్రసరణ సంబంధమైన సమస్యలు కూడా తోడైనపుడు చనిపోయే అవకాశాన్నితగ్గించలేడు.

వృక్క ధమని యాంజియోప్లాస్టీ-- వృక్క ధమని కుఢ్యాలు కొవ్వుతో పేరుకుపోయి కుచించుకుపోయినపుడు వృక్క ధమని యాంజియోప్లాస్టీ నుపయోగించి చికిత్స చేస్తారు ( పర్‌క్యుటేనియస్ ట్రాన్సులుమినల్ రీనల్ యాంజియోప్లాస్టీ, PTRA ). వృక్క ధమని కుచించుకుపోవడం వల్ల, అధిక రక్త పీడనం, వృక్కాలు సరిగా పని చేయకపోవడం సంభవిస్తుంది.

కరోటిడ్ యాంజియోప్లాస్టీ-- చాలా ఆసుపత్రులలో, ప్రమాదం వాటిల్లే అవకాశం బాగా ఉన్న రోగులలో కుచించుకుపోయిన కరోటిడ్ ధమనిని యాంజియోప్లాస్టీ, స్టంటింగ్ చేసి బాగుచేస్తారు.

మస్తిష్క ధమనుల యాంజియోప్లాస్టీ--1983 లో రష్యా న్యూరో సర్జన్, జుబ్కోవ్ తన అనుచరులతో కలిసి కుచించుకుపోయిన రక్తనాళాలను అన్యురిస్మల్ SAH జరిపిన తర్వాత ట్రాన్సులుమినల్ బెలూన్ యాంజియోప్లాస్టీతో బాగు చేసినట్లుగా చెప్పాడు.

మూలము : వికిపెడియా అంతర్జాలము .
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, February 19, 2013

Pre-clinical Diabetes awareness,ముందస్తు మధుమేహం అవగహహన,ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌ అవగాహన

  •  



  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు  -Pre-clinical Diabetes awareness,ముందస్తు మధుమేహం అవగహహన,ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    మధుమేహం. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా దొంగదెబ్బ తీసే ఇది వచ్చాక ఎలాగూ జాగ్రత్తలు తీసుకోకతప్పదు. గ్లూకోజును అదుపులో ఉంచుకుంటూ.. గుండె, కిడ్నీ జబ్బుల వంటి ఇతరత్రా సమస్యల బారినపడకుండా చూసుకోకా తప్పదు. కానీ పరిస్థితి అంతవరకూ రాకముందే.. తొలి దశలోనే మధుమేహాన్ని ఎదుర్కోవటంపై ఆధునిక వైద్యరంగం ఇప్పుడు తీవ్రంగా దృష్టి సారించింది. మధుమేహం మొగ్గతొడిగే 'ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌' సమయంలోనే దాని ఆనుపానులను గుర్తించి, అవసరమైతే అప్పుడే చికిత్సలు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై సాగుతున్న పరిశోధనలూ.. పుట్టుకొస్తున్న ఆధునిక పరీక్షలూ.. చికిత్సలూ సరికొత్త ఆశలనూ రేకెత్తిస్తున్నాయి!

    నిజానికి మధుమేహులంతా ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌- ముందస్తు మధుమేహం- దశను దాటుకునే అందులోకి అడుగుపెడతారు. ఈ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహానికి కాస్తయినా అడ్డుకట్ట వేయొచ్చు. మనదేశంలో ముఖ్యంగా మనరాష్ట్రంలో ఇది అత్యంత అవసరం. ఎందుకంటే మనదగ్గర నానాటికీ ముందస్తు మధుమేహుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అన్నింటికన్నా మించి మధుమేహుల్లో కనిపించే సమస్యలు ప్రి డయాబెటీస్‌ బాధితుల్లోనూ కనిపిస్తుండటం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల మధుమేహానికే కాదు.. ముందస్తు మధుమేహానికీ చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. విదేశాల్లో ఇప్పటికే మొదలైన ఈ చికిత్సలను త్వరలోనే మనదగ్గరా ఆరంభించే సమయం ఆసన్నమైందని

మధుమేహం పెద్దవాళ్లనే కాదు.. అప్పుడే పుట్టిన శిశువులను సైతం వదలటం లేదు. దీన్ని కట్టడి చేయకపోతే శరీరం మొత్తాన్ని కబళిస్తుందనే విషయాన్ని అందరూ గుర్తిస్తున్నారు. కానీ మధుమేహానికి ముందు దశ అయిన ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌ను పెద్దగా పట్టించుకోవటం లేదు. నిజానికి దీనిపై సత్వరం దృష్టి పెట్టాల్సిన అవసరమున్నట్టు తాజా అధ్యయనాల అంచనాలు హెచ్చరిస్తున్నాయి. మధుమేహంపై ప్రస్తుతం మనదేశంలో మూడు సర్వేలు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా లక్షలాది మందికి పరీక్షలు చేస్తూ మధుమేహుల సంఖ్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓ ప్రైవేటు సంస్థ కూడా ఇందులో పాలు పంచుకుంటోంది. ఈ సర్వేల పూర్తి నివేదికలు ఇంకా వెలువడకపోయినప్పటికీ అంచనాలు మాత్రం ప్రమాద ఘంటికలనే మోగిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే మధుమేహుల సంఖ్య అధికమనే సంగతి తెలిసిందే. ఈ ధోరణి ఇప్పుడూ అలాగే కొనసాగుతుండటమే కాదు.. ఇప్పటికే మధుమేహం ఉన్నట్టు గుర్తించినవారికన్నా అంతకు రెట్టింపు మందిలో మధుమేహం రాబోతున్న లక్షణాలు కనబడటం ఆశ్చర్యకరం! ప్రస్తుతం పట్టణాల్లో నివసిస్తున్న 25 ఏళ్లు దాటిన వారిలో 15% మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. వీరికి తోడు మరో 30-40% మందిలో మధుమేహం వచ్చే లక్షణాలు కనబడుతున్నట్టు తాజా సర్వేల్లో కనబడుతోంది. అంటే 25 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది మధుమేహంతో గానీ ముందస్తు మధుమేహంతో గానీ బాధపడుతున్నారని అర్థం. ఇక 40-64 వయసు వారిని తీసుకుంటే ఇది 75 శాతం ఉంటోంది. 65 ఏళ్లు దాటినవారిలోనైతే దాదాపు అందరిలోనూ (100 శాతం) మధుమేహం గానీ ముందస్తు మధుమేహం గానీ కనబడుతోంది. 2000లో హైదరాబాద్‌లోనే చేసిన అధ్యయనంలో 25 ఏళ్లు పైబడినవారిలో 16% మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 34% మందికి మధుమేహం వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని బయటపడింది. ఇదిప్పుడు మరింత పెరిగినట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి.

ప్రి డయాబెటీస్‌ అంటే?
సాధారణంగా మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. దీన్ని శరీరం శక్తిగా మార్చుకొని వినియోగించుకుంటుంది. ఇందులో క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ కీలకంగా పనిచేస్తుంది. ఈ ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోయినా, తగినంత విడుదల కాకపోయినా.. మన శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయినా రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. అయితే దీనికన్నా ముందు దశ ఒకటుంది. అదే ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌. అందరూ దీన్ని దాటుకునే మధుమేహంలోకి అడుగుపెడతారు. ఈ ముందస్తు మధుమేహంలోనూ రక్తంలో గ్లూకోజు మోతాదు నార్మల్‌ కన్నా ఎక్కువగానే ఉంటుంది గానీ మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండదు. రక్తంలో గ్లూకోజు మోతాదు పరగడుపున 125 ఎంజీ/డీఎల్‌, భోజనం చేశాక 200 ఎంజీ/డీఎల్‌ కన్నా ఎక్కువుంటే మధుమేహంగా గుర్తిస్తారు. అయితే ముందస్తు మధుమేహుల్లో గ్లూకోజు మోతాదు పరగడుపున 100 నుంచి 125 మధ్యలో (ఇంపైర్డ్‌ ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌-ఐఎఫ్‌జీ).. ఆహారం తీసుకున్న తర్వాత 140 నుంచి 200 మధ్యలో (ఇంపైర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌- ఐజీటీ) ఉంటుంది. ఈ రెండూ గానీ రెండింట్లో ఏ ఒక్కటి గానీ ఉన్నా 'ప్రి క్లినికల్‌ డయాబెటీస్‌' ఉన్నట్టే.

ఏమిటీ ముప్పు?
ఇంకా మధుమేహంగా మారలేదు కదా అని ప్రి డయాబెటీస్‌ను తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మధుమేహుల్లో కనిపించే సమస్యలే ముందస్తు మధుమేహుల్లోనూ.. పైగా అదే నిష్పత్తిలోనూ కనిపిస్తుండటం గమనార్హం. రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటి కొవ్వులతో పాటు అధిక రక్తపోటు ఎక్కువ కావటం వల్ల వచ్చే రక్తనాళాల సమస్యలు ముందస్తు మధుమేహుల్లోనూ ఉంటున్నాయి. గుండెజబ్బులు, పక్షవాతం, కాళ్లలో రక్తనాళాల సమస్యలు, నెఫ్రోపతీ, కంటి రెటీనాలో రక్తనాళాలు దెబ్బతినటం వంటివీ వీరిలో బయటపడుతున్నాయి.

మన శరీరంలోని చక్కెర అణువులు, పిండి పదార్థాలు.. ప్రోటీన్లను పట్టుకునే గ్త్లెకేషన్‌, గ్త్లెకాసిలేషన్‌ ప్రక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ ప్రక్రియల ద్వారా ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా.. ఈ ఆమ్లాలు తిరిగి ప్రోటీన్లుగా మారుతుంటాయి. మధుమేహుల్లో ఇలా చక్కెరను పట్టుకున్న (గ్త్లెకాసిలేట్‌) ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటమే కారణమని అనుకుంటున్నప్పటికీ.. గ్లూకోజు నార్మల్‌గానే ఉన్నా కొందరిలో గ్త్లెకాసిలేట్‌ ప్రోటీన్లు ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వీరిలోని మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు ఎక్కువగా గ్లూకోజును పట్టుకునే గుణం కలిగుండొచ్చు. మన శరీరంలోని కణాల లోపలా బయటా, రక్తంలో, జీర్ణకోశవ్యవస్థలో జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లు.. జీవక్రియ సంబంధ హార్మోన్లు.. శరీరానికి అత్యవసరమైన విటమిన్లు.. ఇవన్నీ కూడా ప్రోటీన్లే. ఇవి గ్త్లెకాసిలేట్‌ కావటం వల్ల మధుమేహుల్లో కనిపించే లక్షణాలు, సమస్యలన్నీ ముందస్తు మధుమేహుల్లోనూ బయటపడుతున్నాయి. మధుమేహుల్లో అధికస్థాయిలో ఉండే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, యూరిక్‌ యాసిడ్‌, హోమోసిస్టీన్‌ మోతాదులతో పాటు లైపోప్రోటీన్‌ ఎ అనే బయోమార్కర్లు కూడా వీరిలో పెరుగుతున్నాయి. ఫలితంగా వీరికి కూడా రకరకాల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటోంది.

కారణాలేంటి?
మధుమేహం రావటానికి వూబకాయం, జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్ర వంటివన్నీ దోహదం చేస్తాయి. అయితే ఇవేవీ లేకుండానే ప్రస్తుతం ముందస్తు మధుమేహం, మధుమేహం ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవజాత శిశువుల్లోనూ మధుమేహం (నియోనేటల్‌ డయాబెటీస్‌) పెరుగుతోంది. దీనికి ఇదమిత్థమైన కారణాలేంటో తెలియవు. లావుగా ఉండటం, ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం, మానసిక ఒత్తిడికి లోనుకావటం వంటివి దీనికి దోహదం చేస్తాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్యం, ప్లాస్టిక్‌ పరిశ్రమలు, క్రిమి సంహారక మందుల వంటివీ వీటికి తోడవుతున్నాయని అనుమానిస్తున్నారు. ఇవన్నీ కాకుండా వంటకు ఉపయోగించే కిరోసిన్‌, బొగ్గు, కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగలను పీల్చటమూ మధుమేహానికి దోహదం చేస్తోందని భావిస్తున్నారు. వీటిపై పరిశోధకులు దృష్టి సారించారు. కారణాలు ఏవైనప్పటికీ మధుమేహం ముమ్మరంగా విజృంభిస్తోందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

నియంత్రణ కీలకం
కాలుష్యం, జన్యుపరమైన అంశాల విషయంలో మనం చేయటానికేమీ లేదు. కానీ బరువు పెరగకుండా చూసుకోవటం, ఆహార నియమాలు పాటించటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం మూలంగా మధుమేహం ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు. ముందస్తు మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజు మరీ ఎక్కువగా ఉండదు కాబట్టి గ్లూకోజును తగ్గించే మందులివ్వటం కుదరదు. రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 కన్నా ఎక్కువ, భోజనం చేశాక 200 కన్నా ఎక్కువగా ఉంటే తగ్గించుకోవటానికి రకరకాల మందులున్నాయి. కానీ వీటిని ముందస్తు మధుమేహులకు ఇవ్వలేం. వీరికి గ్లూకోజు తగ్గించే మందులిస్తే కలిగే అనర్థాలపై అధ్యయనం జరగలేదు. అందువల్ల ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు పాటిస్తూ అదుపులో ఉంచుకోవటం మంచిది.

ఆహార నియమాలు: ముఖ్యంగా కొవ్వు పదార్థాలు.. మాంసాహార సంబంధ కొవ్వులైనా, శాకాహార సంబంధ కొవ్వులైనా.. తగ్గించుకోవాలి. దంపుడు బియ్యం, గోధుమలు, జొన్నలు తినటమూ మంచిదే. వీటిల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చూస్తాయి.

వ్యాయామం: రోజూ కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. అలాగని పెద్ద పెద్ద వ్యాయామాలే చేయాల్సిన అవసరం లేదు. వేగంగా నడవటం, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి వ్యాయామాలు చేసుకోవచ్చు.

బరువు అదుపు: వూబకాయం మూలంగా ఇన్సులిన్‌ నిరోధకత పెరుగుతుంది. దీంతో కణాలు ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేవు. అందువల్ల ఆహారం, వ్యాయామం వంటి వాటితో బరువును అదుపులో ఉంచుకోవాలి.

రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటుకూ మధుమేహానికీ అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి అధిక రక్తపోటు గల ముందస్తు మధుమేహులు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే మందులూ వేసుకోవాలి.

ట్రైగ్లిజరైడ్లకు కళ్లెం: కొందరికి కొలెస్ట్రాల్‌ మామూలుగానే ఉన్నా రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉండొచ్చు. దీంతో గుండెజబ్బులు రావొచ్చు. రక్తనాళాలు దెబ్బతినొచ్చు. వీటి స్థాయి మరీ ఎక్కువైతే క్లోమగ్రంథి దెబ్బతిని 'పాంక్రియాటైటిస్‌' రావొచ్చు. కాబట్టి మందులతో ట్రైగ్లిజరైడ్లను అదుపులో ఉంచుకోవాలి.
లక్షణాలేవీ ఉండవు
ముందస్తు మధుమేహంలో ప్రత్యేకించి పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. 25 ఏళ్లు దాటిన వారిలో 15% మందికి మధుమేహం, మరో 30-40% మందికి ప్రి డయాబెటీస్‌ ఉండే అవకాశం ఉండటం వల్ల.. 25 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ ఏడాదికి ఒకసారైనా రక్త పరీక్ష చేయించుకోవటం మంచిది. ఇందులో గ్లూకోజు మోతాదు పెరుగుతున్నట్టు అనిపిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక ప్రయోగం
ముందుస్తు మధుమేహులకు మెంతులు, ఆహార నియమాలు, యోగా వల్ల కలిగే ఉపయోగాలపై నిమ్స్‌లో ఒక అధ్యయనం జరిగింది. మధుమేహాన్ని నివారించుకోవటానికి, మధుమేహం మూలంగా రక్తంలో కలిగే మార్పులు రాకుండా ఉండేందుకు ఇవి 30% వరకు ఉపయోగపడుతున్నట్టు వెల్లడైంది. అయితే ఈ ప్రభావం మూడేళ్ల వరకు మాత్రమే కనబడింది. ఆ తర్వాత మెంతులు తీసుకున్నవారికీ, ఆహార నియమాలు పాటించినవారికీ, యోగాసనాలు వేసినవారికీ, ఎలాంటి చికిత్స తీసుకోనివారికీ.. అందరికీ మధుమేహం వచ్చే అవకాశం ఒకే విధంగా ఉంటున్నట్టు బయటపడటం గమనార్హం.
చికిత్సల మార్గం
ప్రి డయాబెటీస్‌ గలవారికి మధుమేహులకిచ్చే మెట్‌ఫార్మిన్‌ మందును ఇతర దేశాల్లో చాలాచోట్ల ఇస్తున్నారు. ఇది రక్తంలో గ్లూకోజు ఎక్కువుంటే తగ్గిస్తుంది గానీ నార్మల్‌ కన్నా తగ్గించదు. ఇది ప్రి డయాబెటీస్‌ బాధితులను మధుమేహం బారినపడకుండా చూస్తున్నట్టు అక్కడి పరిశోధకులు గుర్తించారు. దీన్ని 250-500 మి.గ్రా. మోతాదులో రెండు పూటలా ఇచ్చి మంచి ఫలితాలు సాధించారు. రక్తంలో తలెత్తిన కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మార్పులనూ వెనక్కి మళ్లించగలిగారు. కానీ ప్రి డయాబెటీస్‌కు మెట్‌ఫార్మిన్‌ మందును వాడటంపై మనదగ్గర ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటివరకైతే దీన్ని ప్రి డయాబెటీస్‌ బాధితులకు ఇవ్వటం లేదు. అయితే మున్ముందు మనదగ్గరా త్వరలోనే దీన్ని వాడే అవకాశముంది. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదు మరింత పెరగకుండా, మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాగే మధుమేహానికి సంబంధించిన రక్తంలో మార్పులు (కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివి) పెరగకుండా ఉంటాయి.

* ఇతర దేశాల్లో రాసిగ్లిటజాన్‌ అనే మందు కూడా ఇస్తున్నారు. కానీ దీన్ని గుండెజబ్బు గలవారికిస్తే ఒంట్లో నీరు పోగుపడటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అందువల్ల మనదేశంలో దీన్ని వాడటం లేదు. ఈ మందును వాడాలంటూ నిపుణులు కూడా సలహా ఇవ్వటం లేదు.

* అకార్బోజ్‌, ఓగ్లిబోజ్‌, మిగ్లిటాల్‌ మందులు కూడా మధుమేహం రాకుండా చేస్తున్నట్టు ఇతర దేశాల్లో గుర్తించి వాడుతున్నారు. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మున్ముందు వీటిని ఇక్కడా ఆరంభించే అవకాశముంది.

* గ్లిప్టిన్స్‌: మనదేశంలోనూ త్వరలోనే ఈ రకానికి చెందిన ఒక మందును ముందస్తు మధుమేహులకిచ్చి ప్రయోగపరీక్షలు చేయనున్నారు.
విజయం తథ్యం!
మధుమేహానికి సంబంధించిన యాంటీబోడీ పరీక్షలు అందుబాటులోకి వస్తే రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవటమనేది దాదాపు కనుమరుగైపోతుందని చెప్పొచ్చు. వీటి ద్వారా ముందస్తు మధుమేహాన్ని చాలా ఏళ్లకు ముందే గుర్తించొచ్చు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఈ యాంటీబోడీలు పదేళ్ల ముందునుంచే కనిపించటం ఆరంభిస్తాయి. ఇవి క్రమక్రమంగా క్లోమగ్రంథిలోని బీటా కణజాలాన్ని నాశనం చేస్తుంటాయి. ఒకవేళ ఈ యాంటీబోడీల పరిమాణాన్ని తగ్గించుకోగలిగితే బీటా కణాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అప్పుడు ముందస్తు మధుమేహం గానీ మధుమేహం గానీ వచ్చే అవకాశమే ఉండదన్నమాట. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఇవ్వటం కుదరదు. దుష్ప్రభావాలు లేకుండా, రోగనిరోధకశక్తిని తగ్గించకుండా పనిచేసే కొత్త మందులు అందుబాటులోకి వస్తే.. ఈ యాంటీబోడీ పరీక్షలతో ముప్పును గుర్తించి అసలు మధుమేహం రాకుండానే చూసుకునే అవకాశముంది. అప్పుడు మధుమేహంపై పూర్తిగా విజయం సాధించటం తథ్యం అనుకోవచ్చు.
నిర్ధారణ ఎలా?
రక్త పరీక్షల ద్వారా ముందస్తు మధుమేహాన్ని గుర్తిస్తారు. ఫాస్టింగ్‌ ప్లాస్మా గ్లూకోజ్‌ (ఎఫ్‌పీజీ), ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (ఓజీటీటీ), గ్త్లెకేటెడ్‌ హీమోగ్లోబిన్‌ (హెచ్‌బీఏ1సీ) పరీక్షలతో దీన్ని నిర్ధరిస్తారు. ఎఫ్‌పీజీ, ఓజీటీటీ చేయించుకోలేనివారు హెచ్‌బీఏ1సీ పరీక్ష ఒకటే చేయించుకుంటే సరిపోతుంది.

ఎఫ్‌పీజీ: దీన్ని నిద్ర నుంచి లేచాక పరగడుపుననే చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజు మోతాదు 100-125 ఎంజీ/డీఎల్‌ ఉంటే ముందుస్తు మధుమేహంగా గుర్తిస్తారు.

ఓజీటీటీ: ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత దీన్ని చేస్తారు. గ్లూకోజు మోతాదు 140-200 ఎంజీ/డీఎల్‌ ఉంటే ముందస్తు మధుమేహం ఉన్నట్టే.

హెచ్‌బీఏ1సీ: మూడు నెలల సమయంలో సగటున రక్తంలో గ్లూకోజు మోతాదు ఎంత ఉందనేది ఇందులో బయటపడుతుంది. ఇది 5.7 నుంచి 6.5 మధ్య ఉన్నట్టయితే ప్రి డయాబెటీస్‌గా గుర్తిస్తారు. దీన్ని రోజులో భోజనానికి ముందు, తర్వాతా ఎప్పుడైనా చేయించుకోవచ్చు.

* అవసరమైతే రక్తంలో యూరిక్‌ యాసిడ్‌, హోమోసిస్టీన్‌, లైపోప్రోటీన్‌-ఏ.. అలాగే మూత్రంలో మైక్రో అల్బుమినూరియా పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. వీటిల్లో కిడ్నీజబ్బు వంటి ఇతరత్రా సమస్యలు తలెత్తుతుంటే ముందుగానే గుర్తించొచ్చు.
భవిష్యత్తు పరీక్షలు
ప్రి డయాబెటీస్‌, మధుమేహాన్ని చాలా ముందుగానే గుర్తించేందుకు మున్ముందు మరింత అధునాతన పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.

* గ్త్లెకాసిలేటెడ్‌ ప్రోటీయోం: ఇది మరింత కచ్చితమైన, అధునాతనమైన పరీక్ష. హెచ్‌బీఏ1సీలో 90 రోజుల కాలంలో జరిగిన మార్పులు తెలుస్తాయి. ఇందులోనైతే 15 రోజుల్లో జరిగిన మార్పులూ బయటపడతాయి. అందువల్ల దీంతో మరింత కచ్చితంగా గ్లూకోజు తీరుతెన్నులను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరీక్ష అందుబాటులో లేదు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

* ప్రస్తుతం ఎడిపోనెక్టిన్‌, ప్లాస్మినోజన్‌ యాక్టివేటార్‌ ఇన్‌హిబిటార్‌, ప్రొ-బీఎన్‌పీ, సీ రియాక్టివ్‌ ప్రోటీన్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముందస్తు మధుమేహుల విషయంలో వీటిని చేయటం లేదు. ఇప్పుడివి ముందుస్తు మధుమేహులకూ చేయాల్సిన అవసరం తలెత్తుతోంది. ఈ బయోమార్కర్లు ఉన్నట్టు తేలితే మధుమేహ సంబంధ సమస్యలు రావొచ్చని ముందుగానే పసిగట్టే వీలుంది.

* యాంటీబోడీ పరీక్షలు: భవిష్యత్తులో ఈ పరీక్షలే కీలకం కానున్నాయి. వీటిల్లో గ్యాడ్‌ యాంటీబోడీ, ఇన్సులిన్‌ యాంటీబోడీ, ఐలెట్‌ సెల్‌ యాంటీబోడీ, జింక్‌ ట్రాన్స్‌పోర్టర్‌ యాంటీబోడీ పరీక్షలు ముఖ్యమైనవి. ఇవి పాంక్రియాస్‌ బీటా కణాలకు సంబంధించిన పనితీరును తెలియజేస్తాయి. రక్తంలో గ్లూకోజు, బయోమార్కర్లు మామూలుగానే ఉన్నా.. ఇవి రాబోయే మార్పులను చాలా ముందుగానే తెలియజేస్తాయి. నిజానికి మధుమేహం బారినపడ్డవారికి పదేళ్ల ముందు నుంచే ఈ యాంటీబోడీలు పాజిటివ్‌గా ఉంటాయి. అంటే రక్తంలో గ్లూకోజు నార్మల్‌ కన్నా పెరగకముందే, బయోమార్కర్ల ఆనవాళ్లు కనిపించకముందే వీటి ద్వారా మధుమేహాన్ని, మధుమేహం మూలంగా వచ్చే సమస్యలను చాలాకాలం ముందుగానే గుర్తించే అవకాశముంది.

* అలాగే థైరాయిడ్‌ పెరాక్సిడైజ్‌ యాంటీబోడీ, థైరోగ్లోబ్లిన్‌ యాంటీబోడీ.. చిన్నపేగులకు సంబంధించిన యాంటీబోడీ అయిన టిష్యూ ట్రాన్స్‌ గ్లుటామినేజ్‌ పరీక్షలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి.

  • Courtesy with :
-డా.పి.వి.రావు -ప్రొఫెషర్ , హెడ్ ఆఫ్ డయాబెటాలజీ , నిమ్స్ -హైదరాబాద్@ఈనాడు సుఖీభవ.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, February 18, 2013

Medicines in Health is Wealth,ఆరోగ్యమే మహాభాగ్యము లో ఔషధాలు

  •  


  •  
 
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Medicines in Health is Wealth,ఆరోగ్యమే మహాభాగ్యము లో ఔషధాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
  • "శారీరకంగాను ,
  • మానసికంగాను ,
  • శరీరకవిధులనిర్వహణలోను ,
  • ఆర్ధికంగాను ,
  • సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
  • (Mere absence of a disease in a person is not healthy. A person is said to be healthy " when is physically , mentally , physiologically , socially , financially " fit to live in his own circumstances .. then ... he / she is healthy)
 బతుకుకన్నా, బతికించుకోవడం కష్టమైపోయింది. ప్రాణం కన్నా ప్రాణాధార మందులు ఖరీదైపోయిన భావం ప్రజల్లో నెలకొంటోంది. కార్పొరేట్ విషవలయంలో చిక్కుకుని వైద్యం అణువణువూ ఖరీదైపోయింది. ఆరోగ్యమే మహా భాగ్యము అన్న నానుడి ఈ విధంగా నిజమైపోయింది. మందుల చీటి తాచుపాములా భయపెడుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా మందుల కంపెనీలు రకరకాల పేర్లు పెట్టి, కంపెనీ ఉద్యోగుల తెలివితేటలను, చాకచక్యాన్ని ఉపయోగించి, నారాయణుడిగా పేరొందిన డాక్టర్లను వీలయినంత ప్రలోభపెట్టి మందులమ్ముకునే రోజులొచ్చాయి. తాము అమ్మిందే మందు, తాము రాసిందే మాత్ర అన్న చందంగా వైద్యం తయారైపోయింది. మందుల దుకాణం అంటే డబ్బు లు కురిపించే చెట్టు అన్నంతగా పరిస్థితిని దిగజార్జేసారు. మందుల దుకాణం వాడు అడగకుండానే ఎమ్మార్పీపై పదిశాతం డిస్కౌంట్ ఇచ్చేస్తున్న రోజులు ఇవి. అంటే అప్పటికే కంపెనీ మందుల దుకాణం వాడి లాభం కాకుండా పది శాతం ధరను ఎమ్మార్పీగా కోట్ చేసినట్లేగా. ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాలి? మందులు తయారుచేయడానికి అవుతున్న ఉత్పాదక వ్యయం, అదనపు ఖర్చులు కలిసి, కనీస ధరను నిర్ణయించి, వాటిని దాటకుండా చూసి, సామాన్యుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? కానీ అలా జరగదు. ఇలాంటి తరుణంలో సామాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట జెనరిక్ మెడిసిన్. సాధారణంగా వివిధ ఫార్ములాలు ఉపయోగించి మందులు తయారుచేస్తారు. మాత్రలో ఏముందన్నది కొద్దిగా తెలియచేస్తూ, తమ కంపెనీ పేరునో, బ్రాండ్‌నేమ్‌నో కలసివచ్చేలా దానికి నామకరణం చేస్తారు. ఉదాహరణకు ప్యారాసెటిమోల్ మాత్రనే వివిధ కంపెనీలు వివిధ పేర్లతో విక్రయిస్తాయి. ఎవరి పేరును వారు వీలయినంత పబ్లిసిటీకి వాడుకుంటాయి. ఇందుకోసం ఫార్ములా ఎవరిదైతే వారి నుంచి పేటెంట్ హక్కుల వినియోగానికి కాను కొంత మొత్తం చెల్లించడం కూడా జరుగుతుంది. ఈ పేటెంట్ హక్కుల ఖర్చు, బ్రాండింగ్ ఖర్చు, పబ్లిసిటీ ఖర్చు కలసి, రోగి నెత్తిన గుదిబండగా మారుతున్నాయి. అదే కనుక పేటెంట్ కాలం తీరిపోయిన తరువాత, పెద్దగా బ్రాండింగ్ లేకుండా విక్రయించగలిగితే, రూపాయి మాత్ర పదిపైసలకు లభించే అవకాశం వుంది. అలాంటి అవకాశం నుంచి వచ్చినవే జెనరిక్ మందులు. నిజానికి ప్రభుత్వాలు కట్టుదిట్టంగా కృషిచేస్తే, మందుల ధరలు కట్టడి చేయడం అంతకష్టం కాదు. కానీ రాజకీయాలు, వ్యాపారాలు చెట్టాపట్టాలేసుకున్న ఈ కాలంలో అటువంటి అద్భుతాలు ఆశించడం అత్యాశ, అసాధ్యం కనుక ఇక సామాన్యుడికి కొంతలో కొంత జనరిక్ ఔషధాలే దిక్కు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ -ఇది సామెత కాదు. అక్షర సత్యం. జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చుగానీ - అనారోగ్యం కమ్ముకుంటే మాత్రం మానసికంగా కృంగి కృశించి మృత్యు దరిచేరటం సర్వసాధారణం. ఈ భయాన్నీ, బతుకు మీది తీపినీ ‘క్యాష్’ చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకొన్న మందుల కంపెనీలు మానవుణ్ణి ఆర్థికంగా మరింత దిగజారుస్తున్నాయి. ఆధునిక యుగంలో సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ - మానసిక వత్తిళ్ల నుంచీ తప్పించుకొనే మార్గాన్ని మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అనే్వషిస్తూనే ఉన్నాడు. వయసు ప్రమేయం లేకుండా హృద్రోగం.. మధుమేహం.. ఎయిడ్స్ - కేన్సర్- ఇలా వందల కొద్దీ రోగాలు మనిషిని అధః పాతాళానికి తీసుకెళ్తున్నాయి. ఇదే సూత్రాన్ని ఏళ్ల తరబడీ ఔపోసన పట్టిన మందుల కంపెనీలు ఔషధాల పేరిట జనాన్ని మోసం చేస్తున్నాయి. వాతావరణ రీత్యా వచ్చే జలుబు, దగ్గు, జ్వరంలాంటి సాధారణ రోగాలకు సైతం ‘యాంటీ బయాటిక్స్’ పేరిట ఖరీదైన మందులు వాడమంటూ ప్రేరేపిస్తోంది. ‘ఎందుకైనా మంచిది’ అన్న కానె్సప్ట్‌తో జన జీవన స్రవంతిలోకి అవి చొచ్చుకు పోతున్నాయి. అనారోగ్య సమస్య ఓవైపు.. ఆర్థిక సమస్య మరోవైపు సగటు మానవుణ్ణి మరింత కృంగదీస్తోంది. ఈ సమస్యకి పరిష్కారమే లేదా? అట్టడుగు వ్యక్తి సైతం చౌకగా మందులను కొనగలడా? ‘మెడిసిన్’ అన్నది అందని ద్రాక్షపండా? వీటన్నింటికీ ఒక్కటే సమాధానం. అదే ‘జెనరిక్ మెడిసిన్’. సామాన్యుడికి అతి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందించటమే వీటి లక్ష్యం. జెనరిక్ ఔషధాలను భారత్, చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని ఆరంభించారు. ఖరీదైన జబ్బులక్కూడా జెనరిక్ మందులు పనిచేస్తాయా? అన్న సందేహాన్ని పక్కనబెడితే - దీర్ఘకాలిక రోగాల నెన్నింటినో ‘జెనరిక్’ మందులు నయం చేసిన దాఖలాలు ఉన్నాయి. అన్ని కంపెనీల మందులకు మల్లే వీటి ఉత్పత్తికీ అయ్యే ఖర్చు సాధారణమయిందేం కాదు. పరిశోధనలకూ.. డాక్టర్లకూ.. సిబ్బంది జీతభత్యాలకూ, రవాణా ఖర్చులకూ ఎంతో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఈ కంపెనీలను వేధించే మరో సమస్య - పేటెంట్ హక్కు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను అధిగమించటానికి సైతం కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటికితోడు ‘జెనరిక్’ ప్రచారానికి మరింత వ్యయమవుతుంది. ఈ జెనరిక్ ఔషధాల ‘పేటెంట్’ హక్కులకు కాలపరిమితి ఉండటంవల్ల వాటిని తిరిగి పొందటానికి కూడా ఖర్చవుతుంది. ఈ వ్యయ ప్రయాసలను అధిగమించి సామాన్యుడికి ‘వైద్యాన్ని’ అందించాలన్న ఆకాంక్ష కొద్దీ ఈ ‘జెనరిక్’ కంపెనీలు ఉత్పత్తిని చేస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్ షాపుల్లో.. అనారోగ్యం అన్ని సమస్యల్లోకి అతి పెద్దది. ఆ భవసాగరాన్ని దాటితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అందుకే - జెనరిక్ ఔషధాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ మెడికల్ షాపుల్లో వీటి విక్రయాన్ని మొదలుపెట్టింది. దేశంలో సుమారు 300 పైచిలుకు సర్కారు మెడికల్ షాపులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర కార్యాలయాల్లోనూ సర్కారు మెడికల్ షాపులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. వీటిలో ‘జెనరిక్’ మెడిసిన్స్ విక్రయాలను చేపట్టి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్య ఏమిటంటే?.. భారతదేశంతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరప్ వంటి దేశాల్లో కొన్ని ‘జెనరిక్’ మందులపై నిషేధాన్ని విధించారు. కారణం ఏదైనప్పటికీ - 180 దేశాల్లో వీటి ఉత్పత్తిని నిలిపివేశారు. సమస్య ఏమిటంటే - జనం మనస్తత్వమే. ఖరీదైన మందులు వాడితేనే రోగం నయమవుతుందన్న నమ్మకం ఒకవైపు.. చౌకబారు మందులవల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్న అపోహ మరోవైపు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఉదాహరణకు - బ్రాండెడ్ పారాసిట్‌మల్ మాత్రల స్ట్రిప్ ఖరీదు 10 రూపాయలు ఉంటే.. జెనరిక్ మందు ఖరీదు కేవలం 2.50 మాత్రమే. ధర విషయంలో ఇంత వ్యత్యాసం ఉండటంతో ‘జెనరిక్’ మందులు పని చేయవేమోనన్న అపనమ్మకంతో అత్యధికులు బ్రాండెడ్ మందుల వైపు మొగ్గు చూపుతున్నారంటూ జెనరిక్ మందుల షాపుల సిబ్బంది వాపోవడం గమనార్హం. డాక్టర్లు కూడా ‘జెనరిక్’ మందులను ప్రిస్క్రైబ్ చేయక పోవటానికి కూడా ఇదే కారణం. సగటు మానవుని మనస్తత్వాన్నిబట్టి - ఎటువంటి రోగమైనా క్షణాల్లో నయం కావాలి. ఆట్టే శ్రమ పడకూడదు. రోగం నెమ్మదించటానికి రోజులూ నెలలూ పట్టకూడదు. వీటికితోడు అల్లోపతికి మించింది లేదన్న ప్రగాఢమైన నమ్మకం నరనరాల్లోనూ జీర్ణించుకు పోవటంవల్ల కూడా జెనరిక్ మందుల పట్ల మొగ్గు చూపకపోవటానికి ప్రధాన కారణం. ఇవన్నీ ఒక ఎతె్తైతే - డాక్టర్లూ.. ప్రముఖ మందుల ఉత్పత్తి కంపెనీల మధ్య ‘అనుసంధానం’ ఉండటం. దీంతో నాణ్యత విషయం పక్కనబెట్టి.. ఆయా ఉత్పత్తులను జనం నెత్తిన రుద్దటం జరుగుతోంది. ఇన్ని సమస్యల మధ్య ‘జెనరిక్’ మందుల గురించిన ప్రచారం అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఈ షాపుల వైపు ఎవరూ కనె్నత్తి చూడటం లేదని అంటున్నారు కొంతమంది వ్యాపారులు. తక్షణ కర్తవ్యం? ‘జెనరిక్’ మందుల ఉత్పత్తి ఈనాటిది కాదు. ప్రజల్లో వీటిపట్ల సరైన అవగాహన కల్పించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలూ కనిపించటం లేదు. ఇరవై ఏళ్ల క్రితమే దీని గురించి ఆలోచించి ఉంటే పరిస్థితి ఈనాటికి చక్కబడేదని కొంతమంది వాదన. ప్రముఖ మందుల కంపెనీల గుత్త్ధాపత్యం.. వ్యాపారవేత్తల మార్కెట్ పనితనం.. ప్రముఖ ఆస్పత్రులనూ.. వైద్యులను తమ వ్యాపార దృక్పథంతో ఆకట్టుకోవటం ఇవన్నీ ‘జెనరిక్’ మందులకు మైనస్‌లుగా పరిణమిస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవటం కష్టసాధ్యంగా మారింది. మరోవైపు రాజకీయ పలుకుబడి కూడా పనిచేస్తూండటంతో ‘జెనరిక్’ జన సామాన్యంలోకి వెళ్లలేకపోతోంది. దీనికి ఒక్కటే పరిష్కారం. ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. ప్రచారాన్ని ముమ్మరం చేయటం. వైద్య సిబ్బందిని ‘జెనరిక్’ మందులు రాసేట్టు ప్రేరేపించటం. ప్రభుత్వ నిర్ణయం! ‘జెనరిక్’ మందుల పట్ల జనానికి అవగాహన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో వీటిని ఉచితంగా అందించటం.. డాక్టర్లు కూడా ఈ మందులను మాత్రమే రోగులకు రాసేట్టు చేయటం. బ్రాండెడ్ మందులను వాడుతున్నట్టయితే - అవి ఏ నిమిత్తం వాడుతున్నారో? బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయంగా జెనరిక్ మందులు లేని సమయాల్లో మాత్రమే వీటిని వాడేట్టు చర్యలు చేపట్టారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ‘జెనరిక్’ మందుల లిస్ట్‌ను ఉంచాలన్న నియమం కూడా పెట్టారు. ప్రభుత్వం అనుసరించే ఈ విధానం వల్ల ప్రముఖ మందుల కంపెనీలు మూత పడే పరిస్థితి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్న మాట వినిపిస్తోంది. ఏటా భారతదేశం మార్కెట్‌లో సుమారు 600 కోట్ల రూపాయల మెడిసిన్ వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారు. లాభసాటి వ్యాపారం కాబట్టి వెనుకకు తగ్గే ప్రస్తావన ఉండదు. ఐతే - జెనరిక్ మెడిసిన్లు కనుక పూర్తి స్థాయిలో మార్కెట్‌లో ఉన్నట్టయితే.. 290 కోట్ల రూపాయల వ్యాపారం చేయొచ్చని ఒక అంచనా. అంటే ‘జెనరిక్’ మందులు సగానికి సగం మార్కెట్‌ని ఏలతాయన్న మాట వాస్తవం. ధరల్లో వ్యత్యాసం జెనరిక్ ఔషధాలు మార్కెట్లలో రెండు రకాలుగా లభ్యమవుతాయి. మొదటిది ‘రసాయనం’ పేరుతో ఉత్పత్తి అవుతుంది. ఉదా: పారాసిట్‌మల్, తదితరాలు. రెండవది ‘జెనరిక్’ పేరుతో మార్కెట్‌లో దొరుకుతాయి. ఉదా: పారాసిట్‌మల్ - సిప్లా, పారాసిట్‌మల్ - ర్యాన్‌బాక్సీ. జెనరిక్ మందుల ధరల్లో ఉండే వ్యత్యాసానికి కారణం ఏమిటంటే - బ్రాండెడ్ కంపెనీలు ఆయా మందుల పేటెంట్ హక్కు కాలపరిమితి ముగిసిన తర్వాత.. దాన్ని ‘జెనెరిక్’ పేరుతో మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. పేటెంట్ హక్కుల ఖర్చు తప్పుతుంది కాబట్టి దాన్ని తక్కువ ధరకు అమ్మే వీలుంటుంది. ఇక్కడ మళ్లీ ఒక తిరకాసు ఉంది. బ్రాండెడ్ కంపెనీల మందులు అమ్మటం ద్వారా వచ్చే కమిషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని మెడికల్ షాపుల్లో - జెనరిక్ మందులు లేవన్న బోర్డు ఉంచటం సర్వసాధారణమై పోయింది. ఇంకో మార్గంలో - బ్రాండెడ్ మందుల ఎంఆర్‌పి ధరకన్నా జెనరిక్ మందుల ఎంఆర్‌పి ధర ఎక్కువగా ఉన్నట్టు చూపించటం. ఇంత జరుగుతున్నా ఇది మోసం అన్న సంగతి ప్రజలు కనిపెట్టలేక పోతున్నారు. ‘కట్నం వద్దన్న పెళ్లికొడుకు’లో లోపాలను వెతికే తంతు మాదిరిగానే.. ధర తక్కువయినా జెనరిక్ మందుల జోలికి వెళ్లకపోవటం చూస్తూంటే ప్రజల అజ్ఞానానికి బాధపడాలో.. వారిని చూసి జాలి పడాలో అర్థం కావటం లేదని ఒక ప్రముఖ వైద్య శాస్తవ్రేత్త అంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ఆరోగ్యం గురించిన ఖర్చు? భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి నిర్ణీత వయో పరిమితిలో ఆరోగ్య సమతుల్యత కోసం తమ ఆదాయం నుండి సుమారు 78 శాతం ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అనారోగ్య స్థితిని అంచనా వేసేందుకు టెస్ట్‌లూ గట్రా చేయించుకొనే దానికన్నా కూడా 72 శాతం వరకూ మెడిసిన్స్ పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో మధుమేహం, కేన్సర్, హెచ్‌ఐవి లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే - దీర్ఘకాలిక రోగాలకు ‘జెనరిక్’ ఔషధాలు వరం లాంటివి. కేన్సర్ విషయానికి వస్తే - ఖరీదైన జబ్బు. 2008 మెకెన్సీ సర్వే ప్రకారం భారతదేశంలో ఒక కేన్సర్ రోగి చికిత్స నిమిత్తం ఖర్చు చేసేది సరాసరిన 3.27 లక్షల రూపాయలు. హార్ట్ పేషెంట్‌కి అయ్యే ఖర్చు 30 వేలు. ఇదీ కేవలం మందుల వరకూ మాత్రమే. మూత్ర పిండాల కేన్సర్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఒక నెలకి 120 మాత్రలకు అయ్యే ఖర్చు అక్షరాలా మూడు లక్షల రూపాయలు. ఇక్కడ జెనరిక్ మందులకూ.. కంపెనీ మందులకూ వ్యత్యాసాన్ని గమనించండి. ఆయా దీర్ఘకాలిక రోగాలకు జెనరిక్ మందుల ద్వారా 8-9 వేల రూపాయల మధ్య అవుతుంది. నాట్కో ఫార్మాకు ఈ మాత్రలను తయారుచేయడానికి అనుమతి ఉన్నప్పటికీ పేటెంట్ హక్కులు మాత్రం జర్మనీ బీయర్ కంపెనీకి ఉండటం వల్ల చట్టపరమైన సమస్యలు ఉత్పన్న మవుతాయి. స్థానిక కంపెనీ ఈ ఔషధాలను తయారుచేయడానికి అనుమతి ఉన్నప్పటికీ పేటెంట్ హక్కుల కోసం అయ్యే ఖర్చు తడిసి మోపెడంత. దీనిపై ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆపరేట్ బోర్డు మీద న్యాయ పోరాటం చేస్తే.. భారతదేశంలోని ‘జెనరిక్’ మందుల కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది సంతోషకర పరిణామం. అయితే ఇదే సందర్భంలో మరో విషయం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. భారత ఔషధ నియంత్రణ ఆదేశాల ప్రకారం జెనరిక్ పేరుకు ఔషధపరమైన అనుమతి ఇవ్వడం.. బ్రాండ్ లేదా ట్రేడ్ పేరున్న మందులకు అనుమతి లేకపోవడం గమనించాల్సిన విషయం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ధనిక వర్గానికీ పేదలకు అందరికీ ఒకే రీతిన చికిత్సలను అందిస్తారు. ఇక్కడ ఎక్కువగా జెనరిక్ మందులు వాడకంలో ఉంటాయి. భారతదేశంలో కూడా ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేసినట్టయితే అట్టడుగు వర్గాల వారు కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యుపిఎ ప్రభుత్వం ‘జెనరిక్’ వ్యవస్థకు గట్టి పునాది వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ‘జెనరిక్’ మందుల షాపులకు ప్రారంభోత్సవం చేసి పేదలకు ఉచితంగా ఆయా మందులను పంచిపెడుతున్నారు. ఐతే - రాబోయే ప్రభుత్వాలు ‘జెనరిక్’ను అమలు చేస్తాయా? లేదా అన్న వాదనలు వినపడుతున్నప్పటికీ.. నింగి కెగసిన బ్రాండెడ్ కంపెనీల మందుల ధరలు పేదవాడికి అతి చేరువలోకి వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. మందుల ఉత్పత్తి కంపెనీల గుత్త్ధాపత్యం నుండి రోగులను రక్షించటానికి ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని ఆచరించడానికి నిబద్ధతతో వ్యవహరించినప్పుడే ఏ పథకమైనా సత్ఫలితాల నిస్తుంది. కానీ కొరవడింది అటువంటి నిజాయితీనే? జెనరిక్ ఔషధాలు అంటే ఏమిటి? బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ సమర్పించిన ‘సత్యమేవ జయతే’ రియాల్టీ షోలో ఈ విషయం గురించిన సుదీర్ఘ చర్చ జరిగింది. భారతీయ వైద్య వ్యవస్థలో ఎన్నో అంశాలను ఈ షో వెలికి తీసింది. రోగికి అవసరం ఉన్నా లేకపోయినా శస్తచ్రికిత్సలు చేయడం. సాధారణ జ్వరానికి కూడా లెక్కకుమించి టెస్ట్‌లు రాయడం.. అవన్నీ తమతమ ల్యాబ్‌లలోనే చేయించాలని షరతు విధించటం. పొరపాటున వేరే ల్యాబ్‌లో పరీక్ష చేయించుకొని రిపోర్టు పట్టుకొస్తే.. ఆక్షేపించటం. మళ్లీ వేరే టెస్టులు రాయడం. మోతాదుకు మించి ఖరీదైన మందులు రాయడం. మెడికల్ షాపుల నుండి కమీషన్లకు, మందుల కంపెనీల నుండి ఆకర్షణీయమైన బహుమతులనూ, కమీషన్లను పొందటం కోసం ఆయా కంపెనీల ఉత్పత్తులను రోగులకు అంటగట్టడం. ఖరీదైన మందులూ యాంటీ బయాటిక్స్ రాయడం.. వంటి ఎన్నో అర్థంపర్థంలేని టెస్టుల బాగోతాన్ని తెర మీదికి తెచ్చింది. ఆ సంఘటనలను బేరీజు వేసుకొన్న కొంతమంది ‘జెనరిక్’ మందుల పట్ల ఆసక్తిని చూపటం ఆరంభమైంది. పేటెంట్ కాలపరిమితి ముగిసినప్పటికీ అదే ఫార్ములాని ఉపయోగించి అదే కంపెనీ అదే తరహాలో ఉత్పత్తి చేసే మందులను ‘జెనరిక్’ మెడిసిన్స్ అంటారు. జ్వరాన్ని తగ్గించటానికి వాడే మందు ‘పారాసిట్‌మల్’. ఇదొక రసాయన ఫార్ములా. ఈ ఫార్ములాని అనుసరించే వివిధ కంపెనీలు వివిధ పేర్లతో మందులను మార్కెట్‌లో రిలీజ్ చేస్తాయి. షుగర్ పేషెంట్లు వాడే ‘గ్లుకోఫేజ్’ అనే మందును స్విబ్ కంపెనీ తయారుచేస్తుంది. పేటెంట్ హక్కులు కాలపరిమితి ముగిసిన తరువాత అదే కంపెనీ అదే మందును ‘మెట్‌ఫార్మిన్’ అనే పేరున రసాయన సంయుక్తమైన పేరుతో మార్కెట్‌లో అమ్ముతోంది. ఈ జెనరిక్ ఉత్పత్తికి కంపెనీ పెట్టిన పేరు ‘మెట్-500’. ప్రతి కంపెనీ ఆయా మందులపై పేటెంట్ హక్కును కలిగి ఉంటుంది. కాల పరిమితి ముగియటమూ తెలిసిందే. అంటే - ప్రత్యేకించి ఆ మందుకి మరి ఎటువంటి ప్రయోగాలూ చేయటం ఉండదు. ఖర్చూ ఉండదు. కాబట్టి అదే ఫార్ములాని తక్కువ ధరకు అమ్ముకోవచ్చు. అంటే ఒక విధంగా పెట్టుబడిలేని వ్యాపారం. లాభాలూ వస్తాయి. కానీ - ఏదో కారణంగా ‘జెనరిక్’ మందులను జనంలోకి తీసుకెళ్లటానికి మందుల కంపెనీలు ముందుకు రావటంలేదు. ఒక వస్తువు తయారుచేయాలంటే ఎంతో కొంత ఖర్చవుతుంది. ఆ ఖర్చు మాత్రం ఎందుకు పెట్టాలి? ఎలాగూ బ్రాండ్ పేరుతో అమ్ముకొంటే వస్తూన్న లాభాలు చాలు అన్న ఉద్దేశంతో ‘జెనరిక్’ మందులపై ప్రముఖ కంపెనీలు సైతం అంతగా దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. అదే ఫార్ములాతో బ్రాండెడ్ కంపెనీ మందులు మార్కెట్‌లో లభ్యమవుతూంటే.. దీన్ని ఎందుకు తీసుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో పాతుకుని ఉండటంవల్ల కూడా ‘జెనరిక్’ పట్ల అనుకున్న ఫలితాలు రావటంలేదు. భారతదేశం విషయానికి వస్తే - కొన్ని ప్రముఖ కంపెనీలైన సిప్లా, రెడ్డీ ల్యాబ్స్, ర్యాన్‌బాక్సీ వంటివి తక్కువ ధరలో ‘జెనరిక్’ మందులను ఉత్పత్తి చేస్తూ కొంతలో కొంత తోడ్పడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే - ఆయా కంపెనీలు వాడే మందుల్లో ఏయే రసాయనాలూ ఫార్ములా ఉంటుందో.. అదే ఫార్ములా ‘జెనరిక్’ మందుల్లోనూ ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించగలిగితే చాలు - జెనరిక్‌కి ఇక తిరుగుండదు. భారతదేశంలో జెనరిక్ మందుల వినియోగం ఏటా పెరుగుతోంది. గత యేడాదితో పోలిస్తే ఇది 40 శాతానికి పెరిగింది. అదే పాశ్చాత్య దేశాల్లో 80 శాతం వరకు వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బ్రాండెడ్ ఎందుకు అంత ఖరీదు? ఒక మందును మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలన్నది పెద్ద ప్రాజెక్ట్. కొత్త ఔషధాన్ని కనిపెట్టాలంటే దానిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. దానికి శాస్తవ్రేత్తలు కావాలి. ల్యాబ్‌ల అవసరం ఉంటుంది. పరిశోధనలు జరిగినా కొన్నికొన్ని సందర్భాల్లో అవి సత్ఫలితాలను ఇవ్వవు. ఫార్ములా తయారైనా.. కొన్ని వికటించి.. మార్కెట్‌కి పంపక మునుపే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. వందల సంఖ్యలో ఉద్యోగులు. వారి జీతభత్యాలు. వైద్యులు తమ మందులను రాయడానికి వారికివ్వాల్సిన కమీషన్.. మెడికల్ షాపుల్లో అమ్మి పెట్టేందుకు కమీషన్లు.. ఇలా ఎనె్నన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒక టాబ్లెట్ తయారుచేయటానికి ఐదు రూపాయలు అయిందంటే.. దాని చుట్టూ అల్లుకున్న ఈ వలయాన్ని ఛేదించేప్పటికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనికి కంపెనీలను నిందించాల్సిన పనిలేదు. ఒక మందుల కంపెనీ సంవత్సరాల తరబడి పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక కొత్త ఔషధాన్ని కనిపెడితే, ఆ మందుపై పేటెంట్ కాలపరిమితి 10-15 సంవత్సరాల మధ్యకాలం వరకూ ఉంటుంది. కాలపరిమితి తీరిన వెంటనే ఫార్ములాని విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే - అదే ఫార్ములాతో మిగతా కంపెనీలు కూడా మందులను ఉత్పత్తి చేసుకోవచ్చు. మందులను రకరకాల పేర్లతో మార్కెట్‌లో ఆయా కంపెనీలు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) అనుమతితో విడుదల చేస్తాయి. విస్తృత ప్రచారం జెనరిక్ ఔషధాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంది. జెనరిక్ మెడిసిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. బ్రాండెడ్ ఫార్ములానే ‘జెనరిక్’లోనూ ఉపయోగిస్తారన్న నిజాన్ని ప్రజలకు వెల్లడించాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో ‘జెనరిక్’ మందులను ఉచితంగా పంపిణీ చేయటంవల్ల కొంతలో కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. ‘రోగం వస్తే కాటికే’ అన్న మాటను మరిచిపోయే రోజు ఎలా ఉంటుందో చెప్పాలి.

-నిర్మల@Andhrabhoomi Telugu daily
  • ===================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Acanthosis-nigricans , ఎకాంతోసిస్ నైగ్రికాన్స్

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Acanthosis-nigricans , ఎకాంతోసిస్ నైగ్రికాన్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ
వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి.  సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.

చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది  అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం  కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.

లక్షణాలు
చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు  చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా  దురదగా కూడా అనిపిస్తుంటుంది.

కారణాలు
ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్): క్లోమగ్రంథి  (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్‌ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం
గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల  మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది.

అధిక బరువు : స్థూలకాయుల్లో చర్మం ముడతలు మందంగా నల్లగా  తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ప్రధాన కారణం అధిక బరువు.  స్థూలకాయం షుగర్ వ్యాధికి ఒక ముఖ్యమైన ప్రేరకం.

హార్మోన్ సమస్యలు : అండాశయాల్లో నీటి బుడగలు పెరగటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథులు వ్యాధిగ్రస్తం కావటం వంటి కారణాలవల్ల చర్మపు ముడుతలు మందంగా, నల్లగా తయారవుతాయి.

మందులు : సంతాన నిరోధక మాత్రలు, కార్టికోస్టీరాయిడ్ మందులు, నియాసిన్ వంటి మందుల వాడకం వల్ల కూడా చర్మపు ముడతలు  నల్లగా మందంగా
తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్  రావచ్చు.

క్యాన్సర్ : శరీరపు అంతర్గ భాగాల్లో పెరిగే కాన్సర్ కణితులవల్ల కూడా చర్మం మీద ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ఆమాశయం, పెద్దప్రేగు, కాలేయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంటుంది.

ప్రేరకాలు (రిస్కులు):
అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.

పరీక్షలు- నిర్థారణ
ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు: -మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?
 -మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా? -మీకు అండాశయానికి, లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా?
-మీరు ఇతర వ్యాధులకు ఏవన్నా  మందులు వాడుతున్నారా?ఎప్పుడైనా స్టీరాయిడ్ మందును వాడాల్సిన అవసరం వచ్చిందా?
-ఈ లక్షణాలు ముందుగా ఎప్పుడు మొదలయ్యాయి?
-సమయం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరమవుతున్నాయా?
-మీ శరీరంలో ఏ భాగాలు వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి?
-మీకు గాని లేదా మీ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా గాని క్యాన్సర్ వచ్చిన ఇతివృత్తం ఉందా?


ఆయుర్వేద చికిత్సా వ్యూహం--/ -డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

చికిత్సల ఉద్దేశ్యం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను
సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం,  అమృత భల్లాతక లేహ్యం,  లంకేశ్వర రసం,  అరగ్వదాది ఉద్వర్తనం , మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలం

అల్లోపతిక్ చికిత్స :

కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులో ఉండేటట్లు , కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణము గా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే .
Restoderm or  Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూత గా రాస్తే కొద్దికాలము లో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును .
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, February 13, 2013

Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం?

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుగుమందుల ప్రభావంతో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే. అయితే వీటితో మధుమేహం కూడా వస్తుందా? ఆహారం, గాలి, నీరులోని నిరంతర సేంద్రీయ కాలుష్యకారకాలకూ (పర్‌సిస్టెంట్‌ ఆర్గానిక్‌ పొల్యూటెంట్స్‌-సీఓపీ) పెద్దవారిలో మధుమేహానికీ సంబంధం ఉంటున్నట్టు స్పెయిన్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డీడీటీ పురుగుమందులో ఉండే డీడీఈ అనే రసాయనం ఎక్కువ మోతాదులో గలవారికి మధుమేహం వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. వయసు, లింగభేదం, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి వంటి వాటి ప్రమేయం లేకుండానే ఇది కనబడుతుండటం గమనార్హం. మన శరీరంలోని కొవ్వులో ఈ కాలుష్య కారకాలు పోగుపడతాయి. అందువల్ల మిగతావారితో పోలిస్తే ఊబకాయుల్లో సీవోపీ స్థాయులు కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వీరికి మధుమేహం ముప్పు అధికంగా ఉండటానికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. ''మన శరీరంలోని కొవ్వు శక్తిని నిల్వ చేస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ కొవ్వు సీఓపీల వంటి హానికారకాలనూ నిల్వ చేసుకుంటుంది'' అని జువాన్‌ పెడ్రో అరెబోలా పేర్కొన్నారు. పురుగుమందులు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, గృహనిర్మాణానికి వినియోగించే పదార్థాల్లో సీవోపీలు ఉంటాయి. ఈ రసాయనాలు ఆహారం ద్వారానే కాదు.. చర్మం, పీల్చే గాలి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

--Courtesy with Eenadu sukhibhava
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Radiation Therapy Technology TrueBeam ,క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు ట్రూబీమ్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్యాన్సర్‌ చికిత్సలో రేడియేషన్‌ అత్యంత కీలకమైంది. శక్తిమంతమైన రేడియేషన్‌ను పంపించి, పక్క కణజాలం దెబ్బతినకుండా క్యాన్సర్‌ కణితి మాత్రమే ప్రభావితమయ్యేలా చేయటం చాలా ప్రధానం. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తోంది 'ట్రూబీమ్‌' యంత్రం.

అసాధారణ కణాలు అపరిమితంగా వృద్ధి కావటం. స్థూలంగా చెప్పాలంటే క్యాన్సర్‌ అంటే ఇదే. సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనంత మేరకు విభజన చెందుతుంటాయి. శరీరానికి వాటి అవసరం తీరిపోయాక చనిపోతాయి. అయితే కొన్నిసార్లు ఈ కణాలు అపరిమితంగా పెరుగుతూ, చాలా వేగంగా విభజన చెందుతూ కాన్యర్లుగా మారతాయి. వీటిని తొలిదశలో గుర్తిస్తే చికిత్స చేయొచ్చు గానీ ముదిరితే మాత్రం కష్టం. దీనిబారినపడి ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. అందుకే పరిశోధకులు దీన్ని జయించేందుకు కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. అలాంటి ఒక అధునాతన పరికరమే ట్రూబీమ్‌. దీంతో ఇమేజ్‌గైడెడ్‌ రేడియోథెరపీ, ఇంటెన్సిఫై మాడ్యులేటెడ్‌ రేడియోథెరపీ, ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ, గేటెడ్‌ ర్యాపిడ్‌ ఆర్క్‌ రేడియోథెరపీ వంటి రకరకాల శక్తిమంతమైన రేడియేషన్‌ చికిత్సలు చేయొచ్చు. ఇందులో కోన్‌ బీమ్‌ సీటీ స్కాన్‌ కూడా ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు స్కాన్‌ చేస్తుంది. రోగి పడుకున్న తీరును, కదలికలను పసిగడుతూ చాలా కచ్చితంగా మిల్లీమీటరు తేడా లేకుండా క్యాన్సర్‌ కణితులపై రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. సెకండుకు వందసార్లు కచ్చితత్వాన్ని బేరీజు వేసుకుంటూ పనిచేస్తుంది కూడా. దీంతో సమయమూ ఎంతో ఆదా అవుతుంది. ప్రస్తుతమున్న పరికరాలతో రేడియేషన్‌ చికిత్సకు అరగంట వరకు పడితే దీంతో కొద్ది నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. అధునాతమైన ఈ ట్రూబీమ్‌ పరికరాన్ని మన హైదరాబాద్‌లోని అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి పరికరాలు దేశంలో మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/