Monday, July 7, 2014

Esophagial cancer,అన్నవాహిక యొక్క క్యాన్సర్

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Esophagial cancer,అన్నవాహిక యొక్క క్యాన్సర్ గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




ఏవో కొన్ని మినహా ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్లు నయమవుతున్నాయి. ఎంత ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను అంత సమర్థంగా నయం చేయవచ్చు. అందుకే ఆయా రకాల క్యాన్సర్ల లక్షణాలను తెలుసుకుని, వాటినిబట్టి క్యాన్సర్‌ను నిర్ధారణ చేయగలిగితే చికిత్స సమర్థంగా జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు. క్యాన్సర్‌లో కనిపించే ఇవే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న రుగ్మతలకూ కనిపిస్తాయి. కాకపోతే అదే లక్షణం తరచూ కనిపిస్తుంటే మాత్రం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుని, అది కాదని తెలుసుకుని నిశ్చింతగా ఉండటం ఉత్తమము ..

క్యాన్సర్ వ్యాప్తి భారతదేశంలో విపరీతంగా పెరుగుతోంది. 2014 నాటికి ప్రమాదాలు (ట్రామా), గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్)ను అధిగమించి క్యాన్సరే అత్యధికంగా ప్రాణాలు బలిగొనే వ్యాధి అవుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే క్యాన్సర్‌ను ముందే గుర్తించడం అవసరం.

గొంతు నుండి జీర్ణాశయానికి కలిపే గొట్టంపేరు అన్నవాహిక. దీనిలో నుండే మనము నమిలి మ్రింగిన ఆహారం నెమ్మదిగా క్రిందకు దిగి జీర్ణాశయంలోనికి చేరుతుంది. సాధారణంగా ఈ గొట్టములో ఏదైనా అడ్డు వున్న ఎడల ఆహారం మ్రింగటానికి ఇబ్బంది కలుగుతుంది. అది  ఇన్‌ఫెక్షన్‌  లేక క్యాన్సర్‌ గడ్డ వల్ల కావచ్చును.

పైన చెప్పిన కారణాలే కాకుండా, (1) ఎక్కువ కాలం పొగత్రాగటం వల్ల, మద్యం సేవించటం వల్ల, (2) హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల (3) మనం త్రాగే నీటిలో నైట్రేట్స్‌ శాతం ఎక్కువ వున్న యెడల (4) తినే ఆహార పదార్ధాలలో carcinogens ఉన్నప్పుడు - ఉదా: ఎక్కువ కాలం వుంచిన రొట్టె . వీటి వల్ల కూడా అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశము వుంది. ఇంకా కొన్ని రకాల అన్నవాహిక జబ్బులు కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చును. ఉదా:- హోవెల్‌-ఈవాన్స్‌ సిండ్రోమ్‌, ప్లమ్మర్‌ విల్సన్‌ సిండ్రోమ్‌, ఎకలేషియా,  మొదలగునవి.

తెలుసుకోవటం ఎలా : చాలా మందికి తొలిదశలో ఏమీ సింప్టంస్‌(symptoms) వుండవు. ఉన్నా కూడా గమనించనంతగా ఉంటాయి. అది పెరిగే కొద్దీ ప్రధానంగా ఆహారం మ్రింగటంలో ఇబ్బందిగా వుంటుంది. నెమ్మదిగా కొంత మందిలో మ్రింగేటపుడు నెప్పిరావచ్చును. కొంతమందిలో ఆహారం తీసుకోగానే వాంతి రావచ్చును. కొంత మందికి క్రమేణా ఘనపదార్ధాలు తినలేక, ద్రవపదార్ధాలు త్రాగటం, ఆ తర్వాత ద్రవపదార్ధాలు కూడ వెళ్ళలేకపోవటం జరుగుతుంది. కొంత మందిలో దగ్గు కూడా రావచ్చు.

కనుక్కోవటం ఎలా? : ఇలా ఉన్నవారు ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ., ఎండోస్కోపి ,అల్ట్రాసౌండ్‌, సి.టి. స్కాన్‌ మొదలగునవి చేయించుకోవటం వల్ల జబ్బు తెలుస్తుంది. బయాప్సీవల్ల క్యాన్సర్‌ అవునా కాదా, అయితే ఏ రకమైనది అను వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా స్క్వేమస్‌ సెల్‌ కార్సినోమా, ఎడినో కార్సినోమా, సార్కో మా, లింఫోమా అను రకరకాల క్యాన్సర్లు ఉంటాయి.

ట్రీట్‌మెంట్‌ : మొదటి భాగం, రెండో భాగం అన్నవాహిక క్యాన్సర్లను సాధారణంగా రేడియో థెరపి వల్ల, మరియు ఒక్కోసారి కీమోథెరపీతో అనుసంధానం చేసి వైద్యం ఇస్తుంటారు. అన్నవాహిక క్రింది భాగంలో క్యాన్సరుకు సాధారణంగా ఆపరేషన్‌ చేయవచ్చును. రేడియో థెరపీ కూడ ఇస్తారు. కొంత మందిలో అన్నవాహికలో క్యాన్సర్‌ వున్న ప్రదేశాన్ని బట్టి, Treatment    చేస్తారు .

అన్నవాహిక క్యాన్సర్‌ సాధారణంగా ముదిరిన తర్వాత తెలియటం వల్ల చాల మంది రోగులు ఎక్కువ కాలం బ్రతకటం కష్టమవుతుంది. ఏ ఇబ్బంది వున్నా, ఎండోస్కోపి పరీక్ష ద్వారా తొలిదశలో గుర్తించటం, తగిన వైద్యం తొలిదశలో చేయించుకుంటే రోగికి ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా ఉండే అవకాశ ముంది. క్యాన్సర్‌ గురించి ఏ అనుమానం వున్నా, క్యాన్సర్‌ వైద్యుని సంప్రదించి, అనుమానం తీర్చుకొనవచ్చును.

  • Dr..V.ch. rao,--క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.