Wednesday, March 19, 2014

More sweting , Hyper Hydrosis,చెమట బాగా పోయడము

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చెమట బాగా పోయడము -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఉక్కపోయటం సహజం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థలోని భాగంగానే మనకు చెమట వస్తుంటుంది. ఎక్రైన్‌, అపోక్రైన్‌ అనే స్వేదగ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నాడీవ్యవస్థ స్పందించి.. చర్మం ఉపరితలం మీద నీటిని విడుదల చేసేలా ఎక్రైన్‌ గ్రంథులను ప్రేరేపిస్తుంది. తర్వాత ఆ నీరు ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. చెమటలో నీటితో పాటు ఉప్పూ ఉంటుంది. అలాగే శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రించే ఎలక్ట్రోలైట్ల ఆనవాళ్లు కూడా ఉంటాయి. ఇక అపోక్రైన్‌ గ్రంథులేమో నూనెతో కూడిన చెమటను విడుదల చేస్తాయి. చెమట పోసినప్పుడు చర్మం జిడ్డుగా ఉండటానికి కారణం ఇదే. వ్యాయామం చేసినప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు, జ్వరం వచ్చినపుడూ చెమట అధికంగా వస్తుండటం తెలిసిందే. నెలసరి నిలిచిపోయిన మహిళల్లోనూ ఎక్కువే. అయితే కొందరికి మామూలు సమయాల్లోనూ చెమట విపరీతంగా వస్తూనే ఉంటుంది. దీన్నే హైపర్‌హైడ్రోసిస్‌ అంటారు. ముఖ్యంగా పాదాలు, అరచేతులు, చంకల్లో ఎక్కువగా చెమట వస్తుంటుంది. ఇది ప్రమాదకరమైన సమస్యేమీ కాదు గానీ చాలా చికాకు కలిగిస్తుంది. కొన్నిసార్లు పనులకూ ఆటంకం కలుగుతుంది. కాగితాలు పట్టుకుంటే తడిసిపోవటం, మూతలు తీయటం వంటివి చేస్తుంటే పట్టుదొరక్కపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరైతే ఇతరులతో కరచాలనం చేయటానికీ వెనకాడుతుంటారు.

 చెమట అధికంగా పోసేవారి చర్మం ఒకరకమైన వాసన వేస్తుంటుంది కూడా. నిజానికి దీనికి కారణం చెమట కాదు. అసలు చెమట ఎలాంటి వాసనా వేయదు. స్వేదగ్రంథుల నుంచి విడుదలయ్యే కొవ్వు పదార్థాలను చర్మం మీదుండే
బ్యాక్టీరియా విడగొట్టే క్రమంలో ఇలా వాసన వేస్తుంటుంది. అసలు చెమట కన్నా ఈ వాసనే చాలా ఇబ్బంది పెడుతుందన్నా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా షూ ధరించేవారిలో ఇది మరింత అధికం.

ఎవరికి ఎక్కువ?
సాధారణంగా మన శరీరం నుంచి రోజుకి సుమారుగా ఒక లీటరు చెమట ఉత్పత్తి అవుతుంది. ఇది ఆయా వ్యక్తులు, వాతావరణం, చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే హైపర్‌హైడ్రోసిస్‌ బాధితుల్లో దీనికన్నా దాదాపు 2-3రెట్లు ఎక్కువగా చెమట ఉత్పత్తి అవుతుంది. దీనికి కొన్ని జబ్బులూ దోహదం చేయొచ్చు. వూబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వీటికి ఉదాహరణలు. అయితే వీటికి చికిత్స తీసుకుంటే స్వేద సమస్యా తగ్గుతుంది. చెమట ఉత్పత్తి కావటాన్ని నియంత్రించే నాడులు సరిగా పనిచేయకపోయినా.. ఆయా భాగాల్లో నిరంతరం చెమట పోయొచ్చు. చాలామంది చెమట సమస్యను వైద్యులతో చెప్పుకోరు. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించటం మంచిది. దీనికి ప్రస్తుతం మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవనశైలిలోనూ, చేసే పనుల్లోనూ కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకు ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

* కొందరికి మసాలాలు, మద్యం వంటివి తీసుకుంటే చెమట ఎక్కువ పట్టొచ్చు. అందువల్ల చెమటను ప్రేరేపించే వాటిని గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మేలు.
* శరీరం చెమట వాసన వేస్తుంటే డియోడరెంట్‌ స్ప్రేలను ఉపయోగించొచ్చు.
* నైలాన్‌ వంటి బిగుతైన దుస్తులను ధరించకపోవటం మంచిది.
* తెలుపు లేదా నలుపు రంగు దుస్తులను ధరిస్తే చెమట పోసినా బయటకు అంతగా కనబడదు.
* తేమను పీల్చుకునే మందంగా, మృదువుగా ఉండే సాక్స్‌ ధరించాలి. కనీసం రెండు రోజులకు ఒకసారైనా సాక్స్‌ను మారుస్తుండాలి.
* లెదర్‌, కాన్వాస్‌ షూ ధరించాలి.

Courtesy with : sukhibhava@eenadu news paper.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, March 18, 2014

Insulin in Diabetes necessity and myths,మధుమేహంలో ఇన్సులిన్‌ అవసరము-అపోహలు

  •  

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మధుమేహంలో ఇన్సులిన్‌ అవసరము-అపోహలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన శరీరం సజావుగా పనిచేయాలంటే శక్తి కావాలి. ఇది గ్లూకోజు నుంచే లభిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై.. గ్లూకోజుగా మారి, రక్తం ద్వారా ఒంట్లోని కణాలన్నింటికీ సరఫరా అవుతుంది. అప్పుడే శరీరం శక్తిని పుంజుకొని, జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. అయితే రక్తంలోని గ్లూకోజును కణాలు చక్కగా వినియోగించుకోవాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ తప్పనిసరి. దీన్ని మన శరీరంలోని క్లోమం ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ కొందరిలో తగినంత ఇన్సులిన్‌ తయారుకాదు. మరికొందరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయినా.. శరీరం దాన్ని సమర్థంగా వినియోగించుకోలేదు. దీని మూలంగా రక్తంలోని గ్లూకోజు కణాలను చేరలేక.. రక్తంలోనే ఉండిపోతుంది. ఇలా గ్లూకోజు వినియోగం కాకుండా, అధికస్థాయిలో రక్తంలో ఉండిపోవటాన్నే మధుమేహం అంటాం.

రక్తంలోని గ్లూకోజును కణాలు సమర్థంగా వినియోగించుకోవాలంటే తగినంత ఇన్సులిన్‌ ఉండాలి. ఒకరకంగా దీన్ని కణాలకు 'తాళంచెవి' లాంటిది అనుకోవచ్చు. ఇది ముందుగా వెళ్లి.. కణం తలుపును తెరిస్తేనే అందులోకి గ్లూకోజు వెళ్తుంది. లేకపోతే రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగిపోతుంది. కాబట్టే తగినంత ఇన్సులిన్‌ ఉత్పతి కానివారికి, మందులతో గ్లూకోజు నియంత్రణలోకి రానివారికి ఇన్సులిన్‌ ఇవ్వటం తప్పనిసరి అయ్యింది. అయితే ఇంతటి కీలకమైన ఇన్సులిన్‌ను తీసుకోవాలని డాక్టర్లు చెప్పగానే ఎంతోమంది.. 'వామ్మో.. ఇన్సులినా? వద్దండీ' అని అంటుంటారు. మధుమేహ చికిత్స చేసే వైద్యులకు ఇలాంటి అనుభవం తరచూ ఎదురయ్యేదే. ఇన్సులిన్‌ అనగానే ఎంతోమంది అదేదో పెద్ద భూతంలాగా భయపడి పోతుంటారు. 'ఇన్సులిన్‌ వద్దండీ.. ఇప్పట్నుంచి ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉంటాను. వ్యాయామం విషయంలో ఎలాంటి అశ్రద్ధా చేయను. రేపట్నుంచి రోజూ తప్పకుండా నడుస్తాను' అని చెబుతుంటారు. మరికొందరైతే.. 'పోనీ కొత్తగా వచ్చిన ఖరీదైన మందులు రాయండి. కానీ ఇన్సులిన్‌ మాత్రం వద్దు' అని అంటుంటారు. ఇన్సులిన్‌ అంత అవసరమా? కొత్త కొత్త మాత్రలు ఎన్నో వస్తున్నాయి కదా? వాటితో సరిపెట్టుకోలేమా? అని చాలామంది అడుగుతుంటారు.

ఎన్నెన్నో అపోహలు
అవసరమైనప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ అంటే ప్రజలు ఎందుకు భయపడతారు? దీన్ని విశ్లేషించి చూస్తే చాలామందికి ఇన్సులిన్‌ అంటే భయాలు, అపోహలు ఎన్నో ఉన్నాయని తేలింది.
* ఒకసారి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు మొదలెడితే జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందని ఎంతోమంది భయపడుతుంటారు. నిజానికి ఇన్సులిన్‌ను జీవితాంతం కాదు.. జీవితం అంతం కాకుండా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
* ఇన్సులిన్‌ తీసుకోవాల్సి వచ్చిందంటే మధుమేహం బాగా ముదిరిపోయిందని, మరణానికి చేరువయ్యామని మరికొందరు వణికిపోతుంటారు. ఇది నిజం కాదు.
* రెండు మూత్రపిండాలు చెడిపోతేనే ఇన్సులిన్‌ ఇస్తారని ఇంకొందరు అభిప్రాయపడుతుంటారు.
* ఇన్సులిన్‌ తీసుకుంటే రక్తంలో గ్లూకోజు తగ్గిపోయి ప్రమాదం వాటిల్లుతుందనీ కొందరు అపోహ పడుతుంటారు.
* ఇలాంటి అపోహలతో పాటు ఇంజెక్షన్‌ తీసుకోవటానికి భయపడేవారు ఇంకొందరు. ఇంట్లో ఇంజెక్షన్‌ ఇచ్చేవారుండరని, ప్రతీసారి ఆసుపత్రికి వెళ్లటం ఇబ్బందని భావిస్తుంటారు.

ఇన్సులిన్‌ ఎందుకు ఇవ్వాలి?
మధుమేహంలో రెండు రకాలున్నాయి. 1. టైప్‌1. 2. టైప్‌2..... టైప్‌1 చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. వీరిలో చాలామందికి ఇన్సులిన్‌ ఇవ్వక తప్పదు. ఎందుకంటే వీరిలో ఇన్సులిన్‌ తయారు కాదు. ఇక టైప్‌2 బాధితుల్లో ఇన్సులిన్‌ తయారవుతున్నా శరీరం దాన్ని సరిగా వినియోగించుకోలేదు. అందువల్ల ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో బయటి నుంచి ఇన్సులిన్‌ను తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఆడవాళ్లు గర్భం ధరించినప్పుడు వచ్చే జెస్టేషనల్‌ డయాబెటీస్‌లోనూ ఇన్సులిన్‌ తప్పక తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

పెద్దవారిలో ఎప్పుడు అవసరం?
  • * మాత్రలతో గ్లూకోజు అదుపులోకి రానప్పుడు.
  • * మాత్రలు సరిపడకపోయినప్పుడు.
  • * కిడ్నీ, లివర్‌ జబ్బులు గలవారికి.
  • * ఏవైనా ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చినపుడు.
  • * రక్తంలో గ్లూకోజు మోతాదు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.
  • * ఆహార నియమాలతో, వ్యాయామంతో, మందులతో కూడా రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గనపుడు.

ఎక్కడ తీసుకోవాలి?
ప్రస్తుతం ఇన్సులిన్‌ పెన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎవరికివాళ్లు తామే సొంతంగా ఇంజెక్షన్‌ చేసుకోవచ్చు. పొట్టమీద బొడ్డుకు అంగుళం దూరంలో ఇంజెక్షన్‌ చేసుకోవాలి. బొడ్డు చుట్టూ ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే తొడ వెలుపలి, మధ్య భాగాల్లోనూ ఇంజెక్షన్‌ తీసుకోవచ్చు.

ఇన్సులిన్‌ ఏం చేస్తుంది?
* ఇన్సులిన్‌ మన శరీరంలోని ప్రతి జీవకణంలోకీ గ్లూకోజ్‌ వెళ్లేలా చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
* రక్తంలోని కొంత గ్లూకోజును గ్త్లెకోజెన్‌ రూపంలోకి మార్చి నిల్వ చేస్తుంది. అవసరమైన సమయాల్లో (ఉదా: జ్వరం వచ్చి లంఖణం చేసినపుడు, ఉపవాసం చేసినపుడు) ఈ గ్త్లెకోజెన్‌ తిరిగి గ్లూకోజుగా మారి శరీరానికి ఉపయోగపడుతుంది.
* కొవ్వు, ప్రోటీన్లను మన శరీరం సరిగా వినియోగించుకునేలా చేస్తుంది.

సమస్యలు

ఇన్సులిన్‌ తీసుకోవటం వల్ల వచ్చే ప్రధాన సమస్య రక్తంలో గ్లూకోజు స్థాయి వేగంగా తగ్గిపోవటం (హైపోగ్త్లెసీమియా). అందువల్ల ఇది ఎవరికి, ఎప్పుడు వచ్చే అవకాశముందో తెలుసుకొని ఉండటం అవసరం.
* ఇన్సులిన్‌ మోతాదు ఎక్కువైనా.
* ఆహారం తక్కువగా తీసుకున్నా.
* ఇన్సులిన్‌ తీసుకొని తిండి తినకపోయినా.
* ఎక్కువగా వ్యాయామం చేసినా...
- ఇలాంటి సమయాల్లో హైపోగ్త్లెసీమియా వచ్చే అవకాశముంది.

ఆధునిక సంజీవని
ఇన్సులిన్‌ను కనిపెట్టటం వైద్యరంగ చరిత్రలో గొప్ప మేలిమలుపు. దీన్ని బ్యాంటింగ్‌, బెస్ట్‌ అనే శాస్త్రవేత్తలు 1921లో కనిపెట్టారు. కుక్కల క్లోమం నుంచి తొలిసారిగా ఇన్సులిన్‌ను వేరుచేసి కొత్త అధ్యాయానికి తెరతీశారు. తర్వాత పందుల నుంచి తీసిన ఇన్సులిన్‌ మనుషులకు బాగా సరిపడుతుందని గుర్తించారు. అనంతరం బర్రెల నుంచి.. ఇప్పుడు మనుషుల డీఎన్‌ఏను బ్యాక్టీరియాలో, శిలీంధ్రకణాల్లో ప్రవేశపెట్టి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇన్సులిన్‌ను కనుగొనకముందు చిన్న వయసులో మధుమేహం బారినపడ్డవారు 10-15 ఏళ్లలోపే మరణించేవారు. ఇన్సులిన్‌ను కనుగొన్న తర్వాత ఎంతోమందికి పునర్జన్మ లభించింది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన మందు ఇన్సులిన్‌.

 రకాలు

ఇన్సులిన్‌లో చాలా రకాలున్నాయి. ఇంజెక్షన్‌ తీసుకున్నాక... అతి త్వరగా, త్వరగా, మధ్యస్థంగా, రోజంతా.. ఇలా రకరకాలుగా పనిచేసేవి ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఏ ఇన్సులిన్‌ వాడాలో డాక్టర్లు నిర్ణయిస్తారు.
  • 15 నిమిషాల్లోనే పనిచేసేవి.. (ర్యాపిడ్‌ యాక్టింగ్‌)
* లిస్‌ప్రో, అస్పర్‌టేట్‌, గ్లుసిలైన్‌ : ఇవి 15 నిమిషాల్లోనే పనిచేయటం మొదలుపెట్టి, 2 గంటల సేపు గరిష్ఠస్థాయిలో (పీక్‌ యాక్షన్‌) పనిచేస్తాయి. 4 గంటల తర్వాత పని చేయటం మానేస్తాయి.
  • త్వరితంగా పనిచేసేది (షార్ట్‌ యాక్టింగ్‌, రెగ్యులర్‌)
* దీన్ని తీసుకున్నాక 30 నిమిషాల నుంచి గంట లోపు పనిచేయటం ఆరంభిస్తుంది. నాలుగు గంటల తర్వాత గరిష్ఠ స్థాయిలో పనిచేసే స్థితికి చేరుకుంటుంది. 6-8 గంటల లోపు పనిచేయటం మానేస్తుంది.
  • మధ్యస్థంగా పనిచేసేవి (ఇంటర్‌మీడియేట్‌ యాక్టింగ్‌)
* ఐసోఫేన్‌ (ఎన్‌పీహెచ్‌) ఇన్సులిన్‌ 2-4 గంటల లోపు పని మొదలెడుతుంది. 6-8 గంటల సమయంలో గరిష్ఠ స్థాయిలో పనిచేస్తుంది. సుమారు 10-12 గంటల వరకు పనిచేస్తుంది.
  • రోజంతా పనిచేసేవి (లాంగ్‌ యాక్టింగ్‌)
* గ్లార్‌గైన్‌: ఇది 2-4 గంటల లోపు పని చేయటం మొదలెట్టి.. రోజంతా ఒకే విధంగా పనిచేస్తుంది.
* డెటిమివ్‌: ఇది కూడా దాదాపు గ్లార్‌గైన్‌ మాదిరిగానే పనిచేస్తుంది.

పీల్చే ఇన్సులిన్‌

కొత్తగా ముక్కుతో పీల్చే ఇన్సులిన్‌ (ఎక్సూబెరా) కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది పీల్చిన తర్వాత 15-30 నిమిషాల్లోపు పని చేయటం ఆరంభించి, 1-2 గంటల సేపు గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. మొత్తం 4 గంటల వరకు పనిచేస్తుంది. కానీ రకరకాల కారణాల వల్ల పూర్తి వాడకంలోకి రాలేదు.

ఎలా తీసుకోవాలి?

* ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం చిన్న సైజు సూదులు, ఇన్సులిన్‌ సిరంజీలతో పాటు పెన్నులు కూడా అందుబాటులో ఉన్నాయి.
* సూది ఎప్పుడూ ఇంజెక్షన్‌ చేసే భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉండాలి.
* మందు చర్మం కిందికి (టిష్యూ సబ్‌క్యుటేనియస్‌) మాత్రమే వెళ్లాలి. లోతైన కండరంలోకి కాదు. అందువల్ల ఇంజెక్షన్‌ చేసే భాగాన్ని బొటనవేలు, చూపుడు వేళ్లతో పట్టుకొని కాస్త పైకెత్తి, ఇంజెక్షన్‌ చేయాలి.

హైపోగ్త్లెసీమియా లక్షణాలు
  • * చమటలు పట్టటం
  • * గుండెదడగా ఉండటం
  • * చూపు తగ్గినట్టు, బూజరబూజరగా ఉండటం
  • * మనసులో ఆందోళన, కంగారు కలగటం
  • * శరీరం నిస్సత్తువగా ఉండటం
  • * ఒకోసారి చేయి, కాలు చచ్చుబడిపోవటం
-ఇలాంటి లక్షణాలు కనబడితే ఇంట్లో వాళ్లు వెంటనే రెండు చెంచాల గ్లూకోజు గానీ పంచదార గానీ తినిపించాలి. మరీ అవసరమైతే డాక్టర్లు సెలైన్‌ ద్వారా గ్లూకోజు ఇస్తారు. అత్యవసరంగా గ్లూకోగాన్‌ 1 ఎం.జి. ఇంజెక్షన్‌ కూడా ఇస్తారు.

పెద్ద అపోహ

ఇన్సులిన్‌ మందు సీసాను ఇంటికి తెచ్చుకుంటే.. దాన్ని ఫ్రిజ్‌లో గానీ ఐస్‌ పెట్టెలోగానీ ఉంచాలని అనుకుంటుంటారు. అలా ఉంచకపోతే ఇన్సులిన్‌ చెడిపోయి, పనిచేయదని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఇన్సులిన్‌ సీసా మూతను తీసి వాడటం మొదలెట్టాక 28 రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకున్నా పనిచేస్తుంది. దీన్ని ఎండ తగలకుండా, వెలుతురు పడని చోట ఉంచి వాడుకోవచ్చు. పాడుకాదు.


Courtesy with : Dr Aswini kumar -professor of Medicine ,Ashram medical college ,Eluru.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, March 14, 2014

Kidney diseases with habits,అలవాట్లతో మూత్రపిండాల జబ్బులు ,అలవాట్లు మూత్రపిండాల పై ప్రభావం

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Kidney diseases with habits,అలవాట్లతో మూత్రపిండాల జబ్బులు ,అలవాట్లు మూత్రపిండాల పై ప్రభావం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    మూత్రపిండాలు నిరంతరం రక్తంలోంచి వ్యర్థాలను వడపోసి బయటకు పంపిస్తుంటాయి. రక్తపోటునూ నియంత్రిస్తుంటాయి. ఇంతటి కీలకమైన పనులు చేసే కిడ్నీలపై మన రోజువారీ అలవాట్లు గణనీయమైన ప్రభావం చూపుతాయి. అందువల్ల కిడ్నీలకు హాని చేసే అలవాట్ల గురించి తెలుసుకుని ఉండటం అవసరం.

ఎక్కువగా ప్రోటీన్‌ తీసుకోవటం: అధికంగా ప్రోటీన్‌ గల పదార్థాలను తింటే కిడ్నీలపై భారం పడుతుంది. రక్తంలో ఉండే యూరియా నైట్రోజెన్‌ను (బీయూఎన్‌- బ్లడ్‌ యూరియా నైట్రోజెన్‌) బయటకు పంపించటానికి కిడ్నీలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ క్రమంగా మందగిస్తుంది. కాబట్టి ప్రోటీన్‌ మోతాదు మితిమీరకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మీరు 72.5 కిలోల బరువుంటే.. ఆహారంలో రోజుకి 80 గ్రాముల ప్రోటీన్‌ కన్నా మించకుండా చూసుకోవాలి.

సమస్యలను నిర్లక్ష్యం చేయటం: దగ్గు, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్‌ వాపు వంటి సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని గుర్తించాలి. జలుబు, తలనొప్పి, వాంతి, వికారం, నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి ఒకట్రెండు వారాల్లో తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మంచిది.

ఉప్పు ఎక్కువగా తినటం: ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఉప్పును ఎక్కువ మోతాదులో తింటే రక్తపోటును నియంత్రించే కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటుతో కిడ్నీ వైఫల్యం ముప్పు పొంచి ఉంటుంది. అందువల్ల ఉప్పు వాడకంలో పరిమితి పాటించటం మంచిది.

కూల్‌డ్రింకుల వాడకం: రోజుకి 710 ఎం.ఎల్‌ కూల్‌డ్రింక్‌ తాగే అలవాటు గలవారి మూత్రంలో ప్రోటీన్‌ స్థాయులు చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఇది కిడ్నీజబ్బుకు ప్రధాన ముప్పు కారకమని గుర్తించాలి.

నొప్పి నివారణ మందులు: నొప్పిని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడినా, కొన్నిరకాల మందులను పెద్ద మోతాదులో వాడినా కిడ్నీ కణజాలం దెబ్బతినే ప్రమాదముంది. అలాగే కిడ్నీలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఈ మందుల ప్రభావం చాలాకాలం తర్వాత గానీ బయటపడకపోవటం గమనార్హం.

నీటి శాతం తగ్గటం: ఒంట్లో నీటి శాతం తగ్గిపోయినపుడు (డీహైడ్రేషన్‌) కిడ్నీ పనిచేయటానికి తగినంత ద్రవాలు అందుబాటులో ఉండవు. ఇక డీహైడ్రేషన్‌ మరింత తీవ్రమైతే కిడ్నీలు దెబ్బతినే ముందస్తు దశకూ దారితీస్తుంది.

పొగ, మద్యం: సిగరెట్లు, బీడీలు తాగటమనేది కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులతో బాధపడుతుంటే పొగ మూలంగా ఈ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది కిడ్నీ జబ్బులకు దోహదం చేస్తుంది. ఇక మద్యం అలవాటుతో మూత్రనాళాల్లో యూరిక్‌ యాసిడ్‌ పోగుపడటం ఆరంభమవుతుంది. ఫలితంగా మూత్రనాళాల్లో అడ్డంకులు తలెత్తి కిడ్నీ వైఫల్యమూ ముంచుకురావొచ్చు.

Courtesy with : sukhibhava@eenadu news paper
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, March 13, 2014

Nicotin Addiction ,నికోటిన్‌ మానలేని వ్యథ

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Nicotin Addiction ,నికోటిన్‌ మానలేని వ్యథ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



దాదాపు సిగరెట్టు తాగేవాళ్లందరికీ తెలుసు... అది మంచి అలవాటు కాదని! మరి ఎందుకు మానలేకపోతున్నట్టు??-ఎందుకంటే సిగరెట్టు తాగకుండా ఉండలేరు కాబట్టి. మరి ఎందుకు ఉండలేరు?
ఒక్కటే కారణం. నికోటిన్‌! ఇదో పెద్ద వల. నిజానికి నికోటిన్‌ దానికి అదేగా ఏమంత చెడేం చెయ్యదు. అది చేసేదల్లా మాటిమాటికీ సిగరెట్టు తాగాలని అనిపించేలా తహతహలాడించటమే! అయితే అదొక్కటి చాలు.. జరగాల్సిన నష్టం జరిగిపోవటానికి. ఎందుకంటే మనం నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ సిగరెట్టు తాగుతుంటే... దీంతో పాటే సిగరెట్టులో ఉండే బోలెడు హానికర వ్యాధి కారకాలు.. ముఖ్యంగా క్యాన్సర్‌ కారకాలు మన ఒంట్లో చేరిపోతుంటాయి. అవి చెయ్యాల్సిన నష్టం అవి చేసేస్తుంటాయి.

అంటే.. ముందు నికోటిన్‌ వల వేస్తుంటుంది... ఆ తర్వాత క్యాన్సర్‌ కారకాలు ఒళ్లంతా కబళిస్తుంటాయి! దీనర్థమేమిటి? మనం నికోటిన్‌ తహతహ నుంచి బయటపడగలిగితే చాలు.. సిగరెట్టుకు స్వస్తి చెప్పటం తేలిక. నికోటిన్‌ గురించి మరింత సమగ్రంగా తెలుసుకోవటం ద్వారానే ఇది సాధ్యం.
ఒకటి.. రెండు.. మూడు.. వేగంగా టకటకా పది అంకెలు లెక్కపెట్టండి. ఈ కొద్ది సమయం చాలు.. మనం పీల్చిన సిగరెట్‌ పొగ ద్వారా నికోటిన్‌ మెదడును చేరటానికి! ఒక్కసారి అది మెదడును చేరిందంటే వెంటనే చురుకుదనం పెరిగినట్లు అనిపిస్తుంది. ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఆందోళన ఏదో తొలగిపోయినట్లుగా కాస్త తృప్తిగా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇదే 'పొగ' తాగినప్పుడు కలిగే అనుభూతి. నికోటిన్‌ వల్ల ఇటువంటి అనుభూతి కలిగే మాట వాస్తవమేనని ఇప్పుడు వైద్యపరిశోధనా రంగం కూడా అంగీకరిస్తోంది. చిత్రమైన విషయమేమంటే నికోటిన్‌ ఇన్నాళ్లుగా అంతా అనుకుంటున్నంతటి చెడ్డ పదార్థమేమీ కాదని, కాకపోతే నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ ఈ క్రమంలో సిగరెట్లకు బానిస కావటమే అసలు సమస్య అని వీరు చెబుతున్నారు. ఎందుకంటే పొగాకులో నికోటిన్‌ ఒక్కటే కాదు.. దాదాపు 4,000 రకాల రసాయనాలుంటాయి. వీటిలో దాదాపు 19 క్యాన్సర్‌ కారకాలు, చాలా తీవ్రమైనవి ఉన్నాయి. పొగ తాగినప్పుడు నికోటిన్‌తో పాటే ఇవన్నీ కూడా ఒంట్లో చేరిపోతాయి. ఇదే అసలు సమస్య. నికోటిన్‌ కోసం తహతహలాడుతూ సిగరెట్లు తాగుతున్న కొద్దీ ఈ దుష్ప్రభావాల తీవ్రతా పెరిగిపోతుంటుంది.

'దమ్ము' లాగటంలోనూ!
నికోటిన్‌ కోసం తహతహ అన్నది క్రమేపీ పెరిగే రకం! అందుకే మొదట్లోరోజుకు ఒకటిరెండు సిగరెట్లు తాగినవాళ్లే క్రమేపీ సంఖ్య పెంచుకుంటూ పోతుంటారు. అలాగే పొగను కూడా అంతా ఒకే రకంగా పీల్చరు. కొందరు గాఢంగా, వూపిరితిత్తుల నిండా పీలిస్తే కొందరు పైపైన అలా పీల్చి, ఇలా వదిలేస్తుంటారు. పొగతాగే వారందరికీ కూడా- తమకు కావాల్సినంత స్థాయిలో నికోటిన్‌ను భర్తీ చేసుకోవటమన్న విద్య, ఆ నైపుణ్యం ఎంతోకొంత తెలిసే ఉంటుంది. అందుకే పొగను పీల్చే తీరు.. నికోటిన్‌కు ఏ స్థాయిలో బానిస అయ్యారన్న దాన్ని పట్టి చూపుతుంది. పొగను ఎలా, ఎంతగా, ఎంతసేపు పీలిస్తే తృప్తిగా ఉంటోందన్నది కీలకం. పొగ పీల్చినప్పుడు ఎంత నికోటిన్‌ వెళుతోంది? అది ఆశించిన స్థాయిలో ఉంటోందా? లేదా? అన్న దాని మీద ఆధారపడి ఉంటోందని గుర్తించారు మేయోక్లినిక్‌ పరిశోధకులు. ప్రతి సిగరెట్టులోనూ సుమారు 10 మిల్లీగ్రాముల నికోటిన్‌ ఉంటుంది. కానీ ఎవరూ మొత్తం పొగ పీల్చలేరు, అలాగే పిల్చిన మొత్తాన్ని వూపిరితిత్తులు గ్రహించలేవు కాబట్టి మొత్తమ్మీద ఒక సిగరెట్టు నుంచి 2-3 మిల్లీగ్రాముల నికోటిన్‌ మాత్రమే రక్తంలో కలుస్తుంది. చూడటానికి ఇది చాలా చిన్నమొత్తంగానే అనిపించొచ్చుగానీ మనల్ని బానిసగా మార్చుకోవటానికి ఈ మాత్రం చాలు. పైగా సిగరెట్టు తాగటం ఆరంభించిన 5 నిమిషాల్లోపే పొగతాగేవారి రక్తంలో నికోటిన్‌ మోతాదు 1-2 మిల్లీగ్రాములకు చేరుకుంటోందని పరిశోధకులు అంచనా వేశారు. కానీ చాలామందిలో సిగరెట్టు తాగిన సుమారు 2 గంటల్లోపే దీని స్థాయి సగానికి సగం పడిపోతోంది. దీంతో మళ్లీ నికోటిన్‌ కోసం శరీరం, మెదడు వెంపర్లాట ఆరంభిస్తాయి. అయితే శరీరం నుంచి నికోటిన్‌ పూర్తిగా ఎప్పటికి తగ్గిపోతుందన్నది వ్యక్తికీ, వ్యక్తికీ మారిపోతుంటాయి. చాలామందిలో ఒక్కసారి పొగ తాగిన తర్వాత నికోటిన్‌ 6-8 గంటల పాటు శరీరంలోనే ఉండిపోతోంది. వేగంగా నికోటిన్‌ ఒంట్లోంచి వెళ్లిపోయేవారు నికోటిన్‌కు బానిసలయ్యే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.

మరో ముఖ్య విషయం- పొగతాగే వారి మెదడులో నికోటిన్‌ను గ్రహించే రిసెప్టార్ల సంఖ్య 2-3 రెట్లు ఎక్కువగా పెరిగిపోతోంది. ఒకసారి వీటి సంఖ్య పెరిగితే ఇక మళ్లీ తగ్గటమంటూ ఉండదు. ఇవి నిరంతరాయంగా నికోటిన్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. అందుకే ఒకసారి నికోటిన్‌.. అంటే పొగకు బానిస అయినవాళ్లు దాన్ని మానటం చాలా కష్టంగా తయారవుతుంది.

మానాలంటే కష్టం
నికోటిన్‌ ఒకవైపు ఈ రిసెప్టార్లను ప్రేరేపిస్తూనే 'డోపమైన్‌' అనే రసాయనం ఉత్పత్తిని పెంచటం ద్వారా సంతోషం, తృప్తి వంటి భావనలు కలిగేలా కూడా చేస్తుంది. నికోటిన్‌ అందగానే మెదడు చురుకుదనం పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత, వేగం వంటివి పెరిగే మాటా నిజమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. నికోటిన్‌ అందితే అంతా బాగున్నట్టు అనిపించటం, నికోటిన్‌ అందకపోతే ఏదో చికాకుగా అనిపించటం.. ఇదీ పొగకు బానిసలను చేసే అంశం! అందుకే పొగ తాగే వారు, పొగకు బానిసలైన వారంతా 'నికోటిన్‌' వల నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించటం చాలా చాలా అవసరం. నికోటిన్‌ అందకపోతే.. అంటే సిగరెట్టు మానేస్తే క్రమేపీ ఒంట్లో నికోటిన్‌ స్థాయి తగ్గిపోయి.. రకరకాల ఇబ్బందికర లక్షణాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు, మగత, చికాకు, తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం వంటి సమస్యలు మొదలై.. ఇవి మరే పనీ చేసుకోనివ్వకుండా వేధిస్తాయి. దీన్ని తగ్గించేందుకు నికోటిన్‌ను ప్యాచ్‌ల వంటి రకరకాల రూపాల్లో ఇచ్చే ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయిగానీ వీటి ఫలితాలు ఏమంత ఆశాజనకంగా ఉండటం లేదు. అందుకే నికోటిన్‌ అవసరం లేకుండానే ఇటువంటి ప్రేరేపణ అందించే సురక్షిత విధానమేదైనా ఉందా? అన్న దిశగా నేటి వైద్యపరిశోధనా రంగం విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది.

అపోహలు
* టెన్షన్‌ తగ్గుతుందా?
పొగ తాగితే టెన్షన్‌ తగ్గి, హాయిగా విశ్రాంతిగా అనిపిస్తుందన్నది అపోహ. కేవలం నికోటిన్‌ కోసం వెంపర్లాటను మాత్రమే, అదీ కొద్దిసేపు మాత్రమే తగ్గిస్తుంది. ఆ తహతహ తగ్గి, కాస్సేపు హాయిగా అనిపిస్తుందో లేదో.. మళ్లీ చికాకు, తహతహ మొదలే!

* మజాగా ఉంటుందా?
దమ్ము లాగితే మజాగా ఉంటుందన్నది పెద్ద అపోహ. పొగ పీల్చటంలో హాయి ఏముండదు. పీల్చకపోతే హాయిగా ఉండదు కాబట్టి పీలుస్తారు. అంతే! రక్తంలో నికోటిన్‌ స్థాయి తగ్గటాన్ని భరించలేరు.

* ఎప్పుడన్నా ఒక్కటికేం?
పెద్ద అలవాటేం కాదు, సరదాకి ఏదో ఎప్పుడన్నా ఒక్కటి కాలుస్తానన్నది పెద్ద భ్రమ. నికోటిన్‌ అందుతున్న కొద్దీ శరీరం దానికి అలవాటుపడిపోతూ.. క్రమేపీ ఇంకా ఎక్కువ మోతాదులో అందితేగానీ తహతహ తగ్గదు. దీంతో రోజుకు ఒకటి కాస్తా రెండుమూడు, అరపెట్టె, పూర్తిపెట్టె.. ఇలా పెరిగిపోతుంటాయి.

వ్యసనంలా తయారయ్యే విషయంలో హెరాయిన్‌, కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలకు ఏమాత్రం తీసిపోదని, తనకు బానిసగా మార్చేసుకునే విషయంలో మద్యం కంటే కూడా నికోటిన్‌ మరింత ప్రభావవంతమైనదని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఒకసారి నికోటిన్‌కు బానిసలైతే దాన్ని వదిలించుకోవటం హెరాయిన్‌ కంటే కూడా కష్టం!
మున్ముందు ఇదే మందు?
మార్ఫీన్‌, కొకైన్‌ వంటివి మాదక ద్రవ్యాలే అయినా నొప్పి తెలియకుండా చెయ్యటం నుంచి రకరకాల వైద్యపరమైన ప్రయోజనాలకు వీటిని 'ఔషధం'గా వాడుతున్నారు. ఇప్పుడు నికోటిన్‌కు ఇటువంటి వైద్యపరమైన ప్రయోజనాలు కొన్ని ఉన్నట్టు గుర్తించటం విశేషం. ముఖ్యంగా మతిమరుపు వ్యాధులు, పార్కిన్సన్స్‌, మానసిక చిత్రభ్రాంతులు, స్కిజోఫ్రీనియా వంటి సమస్యలకు దీన్ని ఔషధంగా ఇవ్వటం వల్ల కొంత ప్రయోజనం ఉంటోంది. కాబట్టి మున్ముందు 'నికోటిన్‌' ఒక మందుగా మన ముందుకు రావటం ఖాయం. కాకపోతే ఈ నికోటిన్‌ కోసం పొగను ఆశ్రయిస్తే మాత్రం తిప్పలు తప్పవు.
నికోటిన్‌ దుష్ప్రభావాలు
* రక్తం: గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది
* వూపిరితిత్తులు: శ్వాసనాళాలు కుంచించుకుపోతుంటాయి
* కండరాలు: నొప్పులు, వణుకులు మొదలవుతాయి
* జీర్ణ మండలం: వికారం, నోరు పొడిబారటం, అజీర్ణం, గుండెల్లో మంట
* కీళ్లు: నొప్పులు
* మెదడు: తల తిరగటం, తలనొప్పి, నిద్ర చికాకులు, పిచ్చి కలలు
* గుండె: గుండె వేగం అస్తవ్యస్తం, బీపీ పెరిగిపోవటం, గుండెలోని కీలక రక్తనాళాలు సంకోచిస్తుండటం
* హార్మోన్లు: ఇన్సులిన్‌ స్థాయులు పెరిగిపోవటం లేదా ఇన్సులిన్‌ పనితీరు మందగించి నిరోధకత రావటం
ఎంతగా బానిసలయ్యారు?
* పొద్దున్నే లేవగానే సిగరెట్‌ ముట్టించాల్సి వస్తోందా?
* గుడి, బడి, లైబ్రరీ, బస్సులు, సినిమా హాళ్ల వంటి పొగ నిషిద్ధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు పొగ తాగకుండా ఉండటం కష్టంగా ఉంటోందా?
* రోజుకు ఒకటికి మించి సిగరెట్లు తాగొద్దన్నప్పుడు ఆ ఒక్కటీ మీరు పొద్దున్నే లేస్తూనే తాగెయ్యాలనుకుంటున్నారా?
* రోజు మొత్తమ్మీద మిగతా సమయంతో పోలిస్తే ఉదయం పూటే ఎక్కువ తాగుతున్నారా?
* జ్వరం, జలుబు వంటివి వచ్చినప్పుడు కూడా సిగరెట్లు ఆపలేకపోతున్నారా?
.... వీటిలో కొన్నింటికి సమాధానం 'అవును' అయినా మీరు నికోటిన్‌కు బానిస అవుతున్నారనే అర్థం!

స్థానం తప్పు
నికోటిన్‌ కొంత వరకూ మంచిదే గానీ... సమస్యంతా అది సిగరెట్లలో ఉంటుంది! అందుకే పొగ తాగేవారంతా నికోటిన్‌ను వేరుగా, సిగరెట్టును వేరుగా చూడలేకపోతున్నారు. నికోటిన్‌ను చర్మం మీద అంటించుకునే ప్యాచ్‌ల రూపంలో, లేదా బబుల్‌గమ్‌లు, ఇన్‌హేలర్లు, ముక్కు ద్వారా కొట్టుకునే స్ప్రేల వంటి రకరకాల రూపాల్లో ఇచ్చినా దాన్ని మానసికంగా తేలికగా ఆమోదించలేకపోతున్నారని పరిశోధకులు అంటున్నారు. కొందరు నికోటిన్‌ ప్యాచ్‌ల వంటివి వాడి, పొగ నుంచి బయటపడగలిగినా త్వరలోనే మళ్లీ పాత అలవాటుకు మళ్లిపోతున్నారు. అందుకే వైద్యులు మానసికంగా పొగను వదిలించుకునే సంసిద్ధత కూడా చాలా ముఖ్యమని, అందుకు కౌన్సెలింగ్‌ ఉపకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

source : Sukhibhava @eenadu news paper
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 5, 2014

Bleeding at menopause, మెనోపాజ్‌లో రక్తస్రావం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Bleeding at menopause, మెనోపాజ్‌లో రక్తస్రావం -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    నెలసరి సమయంలో రక్తస్రావం కావడం ఎంత సహజమో.. మెనోపాజ్‌ వచ్చాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాద సంకేతం. అంతకన్నా ముందు అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది.. దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం..

మెనోపాజ్‌ దశ అంటే స్త్రీ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి విడుదల ఆగిపోతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తస్రావం కొద్దిగానైనా సరే కనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే నలభైఏళ్లలోపు రుతుక్రమంలో మార్పు వచ్చినా క్యాన్సర్‌ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ.. ఏళ్లు గడిచేకొద్దీ ఆ ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా అయితే యాభై, అరవైఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే.. ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం పది నుంచి పదిహేను శాతం వరకూ ఉంటుంది. అలాంటప్పుడు మందులివ్వడం, డీఅండ్‌సీ చేయడం లాంటి చిన్న చికిత్సలు సరిపోవు. కూలంకషంగా పరిశీలించి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చేయించుకోవాల్సిన పరీక్షలు..
ఇలాంటి పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్‌, ట్రాన్స్‌వెజైనల్‌ స్కాన్‌ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరూ, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్‌ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు కాబట్టి ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి గురించి తెలుస్తుంది. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరగడం, కణుతుల్లాంటివి ఉంటే అసహజమని భావించాలి.

స్కాన్‌ కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్‌ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఎలాంటి మత్తూ, ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా చిన్న గొట్టం ద్వారా నమూనాను సేకరిస్తారు. అయితే దీనివల్ల సమస్య ఉన్న నమూనానే రాకపోవచ్చు. దాంతో రిపోర్టు తప్పుగా రావచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డీఅండ్‌సీ (డైలటేషన్‌ అండ్‌ క్యూరటార్జీ) పద్ధతిలో నమూనాలను సేకరించేవారు. అంటే విడివిడిగా గర్భాశయం పైభాగం, కిందిభాగం, గర్భాశయ ముఖద్వారం నుంచి సేకరించేవారు. అప్పుడూ నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పలేం.

ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. గర్భాశయ ముఖద్వారం నుంచి సన్నని టెలిస్కోప్‌ని లోపలికి పంపి, కెమెరా ద్వారా మానిటర్‌పై చూస్తారు. భూతద్దంలో చూసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సరైన చోటనుంచే సేకరించవచ్చు. గర్భాశయం లోపలి పొర మందం, పాలిప్‌, ఫైబ్రాయిడ్‌, క్యాన్సర్‌ కణితి లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చిన్నచిన్న పాలిప్స్‌, ఫైబ్రాయిడ్ల లాంటివి గుర్తించడంతోపాటూ అదే సమయంలో చికిత్స కూడా చేయొచ్చు. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్‌ ఇన్‌ఫ్యూజన్‌ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.

ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్‌ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు..

ఇతర కారణాలూ ఉంటాయి..
వృద్ధాప్యంలో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అందుకే వైద్యులు ముందు జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ వివరంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అవుతుంది.

జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్‌, ఉన్నా ఇలా జరుగుతుంది. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్‌ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది.

మెనోపాజ్‌ దశ దాటాక హార్మోన్లు (హెచ్‌ఆర్‌టీ) వాడే వారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ కోసం వాడే టామోక్సిఫిన్‌ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్‌, మరికొందరిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని 'లించ్‌ సిండ్రోమ్‌' అంటారు.

సాధారణ కారణాలే అయితే..
ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్‌ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ అని తేలితే మళ్లీ ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి ఆ క్యాన్సర్‌ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్‌ గ్రంథులూ, కాలేయం, వూపిరితిత్తులకూ చేరిందా అనేవి గమనిస్తారు వైద్యులు. దాన్ని బట్టి ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ ఉన్నా చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్‌, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది చెబుతారు. ఒకవేళ క్యాన్సర్‌ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే... పాలిప్స్‌, ఫైబ్రాయిడ్ల లాంటివి ఉంటే తొలగిస్తారు. ఎండోమెట్రియం పొర మందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్‌ హార్మోను సూచిస్తారు. లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి 'ఎట్రోఫిక్‌ ఎండోమెట్రియం' పరిస్థితి వస్తుంది. అప్పుడు హార్మోన్లు వాడమంటారు వైద్యులు.

ముందు జాగ్రత్తలు ముఖ్యమే..
అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం ఉన్నవారికి రెండు నుంచి నాలుగు రెట్లు సమస్య బారినపడే అవకాశాలెక్కువ. కాబట్టి వ్యాయామం చేయడం తప్పనిసరి.

పీసీఓడీ ఉన్న వారు తప్పనిసరిగా మందులు వాడాలి. పిల్లలు కలిగాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా మిరేనా(ప్రొజెస్టరాన్‌ లూప్‌)ని వాడటం వల్ల ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హెచ్‌ఆర్‌టీ తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి.

కుటుంబంలో లింఛ్‌ సిండ్రోమ్‌ ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకోవాలి.

  • Courtesy with Dr. prameladevi , Senior Gyanecologist ,Nellore
  • ================================
 Visit my website - > Dr.Seshagirirao.com/