Sunday, May 31, 2015

colon hydro-therapy,కొలోన్‌ హైడ్రోథెరపీ.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కొలోన్‌ హైడ్రోథెరపీ.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...







ఎలాంటి కాలుష్యాలూ లేని అత్యంత పరిశుభ్రమైన `డిస్టిల్‌‌డ వాటర్‌'ను ఒకింత గోరువెచ్చటి ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది. మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయవచ్చు. కానీ... ఒకింత గోరువెచ్చని నీటి వల్ల ఆహ్లాదకరమైన అనుభూతి మరింత ఇనుమడిస్తుంది. అందుకే ఈ స్వల్ప ఉష్ణోగ్రత. ఈ నీటిని మలమార్గం(రెక్టమ్‌) ద్వారా పంపడానికి ఉపయోగించే పైప్‌ల ద్వారా లోనికి పంపుతారు. ఇవి మలమార్గంలోకి ఎంత తేలిగ్గా ప్రవేశస్తాయంటే... వీటి వల్ల ఎలాంటి నొప్పీ ఉండకపోగా... లోపల ఉన్న మాలిన్యాలు చాలా సాఫీగా బయటకు వెళ్లడమన్నది చాలా తేలిగ్గా జరిగిపోతుందన్నమాట. ఒకవైపు నుంచి లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుండగా... లోపలికి వెళ్లిన నీరంతా అక్కడ ఉన్న మలమాలిన్యాలను శుభ్రం చేసుకుంటూ మరో పైప్‌ ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. ఇలా మన కడుపులోని మాలిన్యాలు వెళ్లిపోవడాన్ని ఈ ఆధునిక యంత్రానికి ఉన్న పారదర్శక పైప్‌ల ద్వారా ఎవరికి వారు చూడవచ్చు కూడా. ఒక్కోసారి వాళ్లు ఊహించనంతటి మాలిన్యం బయటకు వెళ్లూ ఉంటుంది.

మరి ఇలా లోపలి మాలిన్యాలను బయటకు పంపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి అన్నదే ప్రశ్న. దీనికి చాలా సంతృప్తికరమైన సమాధానాలు ఉన్నాయి. చాలా సురక్షితమైన ఈ ప్రక్రియలో ఎలాంటి నొప్పి లేకుండానే లోపల ఉన్నదంతా కడిగేసుకుపోతున్న అనుభూతి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇది కేవలం మనకు కలిగే భౌతికమైన, బాహ్య అనుభూతి మాత్రమే. ఇక లోపల కలిగే ప్రయోజనా లెన్నో. ఉదాహరణకు... మలబద్ధకంతో బాధపడుతూ ఎంతో ముక్కుతూ, మూల్గూతూ మల విసర్జన చేసే వారు ఈ చికిత్స ప్రక్రియతో లోపల ఉన్నదంతా బయటకు వెళ్లడం వల్ల చాలా హాయిని పొందుతారు. కొలోన్‌ హైడ్రోథెరపీ ప్రక్రియ తర్వాత అంతా శుభ్రపడి, పెద్దపేగు (కొలోన్‌)లో ఒక మాలిన్యాలూ, విషపదార్థాలూ ఏవీ ఉండవు కాబట్టి చాలా పరిశుభ్రమైన రక్తం శరీరమంతటికీ సరఫరా అవుతుంది.

కొన్ని సందేహాలూ, సమాధానాలు
కొలోన్‌ హైడ్రోథెరపీ ప్రజల్లో కొన్ని సందేహాలూ, అపోహలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా...
పెద్దపేగుల్లోని మలాన్ని తొలగించడం కోసం కొలోన్‌ హైడ్రోథెరపీని మొదట అనుసరించడం వల్ల అదే అలవాటైపోయి... ఆ తర్వాత స్వాభావికంగా విరేచనం కాదన్న అపొహ చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఈ ప్రక్రియ ద్వారా మొదట అక్కడ గడ్డలు గడ్డలుగా చేరే మలం గట్టిపడి, ముందుకు జారకుండా మలబద్ధకం ఏర్పడుతుంది. అయితే ఒకటి రెండుసార్లు కొలోన్‌ హైడ్రోథెరపీ ద్వారా శుభ్రపరచే ప్రక్రియ తర్వాత ఇక అక్కడ మలం పోగయ్యే పరిస్థితి తప్పిపోతుంది. దాంతో స్వాభావికంగా విరేచనం కావడం సులభమవుతుంది. అంటే చాలా మంది అనుకున్నట్లుగా ఇది అలవాటుగా మారకపోవడం అటుంచి, మంచి శానిటరీ హ్యాబిట్‌ను పెంపొందిస్తుంది.

ఒకవైపు నుంచి నీళ్లను లోపలికి ప్రవేశపెట్టడం వల్ల అవి లోనికివెళ్లాయి. అలా బయటకు వెచ్చేస్తాయి... మరి శుభ్రపరిచే ప్రక్రియెలా జరుగుతుంది... అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. బయటి నుంచి నీటిని మలద్వారం గుండా లోపలికి ప్రవేశపెట్టగానే ఆ నీరు లోపల పెద్దపేగుల పెరిస్టాలిటిక్‌ చలనపు స్పందనలకు అనుగుణంగా కదులుతుంది. దీనివల్ల ఆ నీటి సాయంతో పేగుల లోపల మూలమూలకూ కడిగినట్లుగా అయి మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి లోపలికి పైప్‌ను ప్రవేశపెట్టేటప్పుడు నొప్పిగా ఉంటుందా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా మృదువైన పైప్‌ల కారణంగా ఇది ఎంతమాత్రమూ బాధాకరంగా ఉండదు. కాకపోతే కొందరిలో కాస్తంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రధానంగా ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), క్యాండిడా వంటి రుగ్మతలతో బాధపడేవారు ఈ ఇబ్బందిని కాస్తంత ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే నీరు లోపలికి ప్రవేశించే వేగాన్ని నియంత్రించుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి మీ సమస్యను అధిగమించడాఇకి అవసరమైనంత వేగంగానే నీటి విడుదలను అనుమతించుకుంటూ ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎప్పటికప్పుడు మాలిన్యాలు కడుక్కుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గడం కూడా జరుగుతుంది.

ఎవరెవరికి సిఫార్సు చేయలేం?
ఇన్ని ప్రయోజనాలిచ్చే ఈ కొలోన్‌ హైడ్రోథెరపీని కొందరికి సిఫార్సు చేయలేరు. వాళ్లు...
గర్భవతులు, పెద్దపేగు, మలద్వారం క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్‌ హార్‌‌ట ఫెయిల్యూర్‌ రోగులు, అల్సరేటివ్‌ కొలైటిస్‌ బాధితులు, పైల్‌‌సతో బాధపడేవారు.

May 4, 2015-surya news paper
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Infertility as problem,సమస్యగా సంతానలేమి

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...






ప్రస్తుత కాలంలో సంతాన లేమి అన్నది ఒక సమస్య గా మారుతోంది. గత కాలంతో పోలిస్తే ఇప్పటితరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్య సహాయం తీసుకొంటే ఈ సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది..

వివాహం అనేది ఒక ధర్మ ప్రక్రియగా భారతీయులు భావిస్తారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, సంతానాన్ని కనటం విద్యుక్త ధర్మములుగా చెబుతారు. ఇందులో మొదటిది మన చేతిలో ఉన్నప్పటికీ, రెండోది మాత్రం ఒక్కోసారి మనుషుల పరిధిలో ఉండకుండా పోతుంది. పైగా సంతానం లేకపోతే వంశం నిలిచిపోతుందన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అందుచేత భారతీయ సమాజంలో సంతానాన్ని కనటం, పిల్లల్ని వ్రద్ది లోకి తీసుకొని రావటాన్ని తప్పనిసరి ప్రక్రియగా భావిస్తారు.
ఆధునిక కాలంలో రక రకాల కారణాలతో సంతాన లేమి అన్నది సమస్యగా మారింది. పెళ్లి అయ్యాక రెండు ఏళ్ల పాటు కలిసి కట్టుగా కాపురం చేసినా గర్భం దాల్చక పోవటాన్ని సంతాన లేమిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. యుక్త వయస్సులో ఉన్న దంపతుల్లో మూడు, నాలుగు సంవత్సరాల పాటు వేచి ఉండే ధోరణిని కూడా మనం గమనిస్తాం. అయినప్పటికీ కూడా గర్భం దాల్చకపోతే మాత్రం సంతానలేమి అన్న అనుమానం కలగక మానదు. అందుచేత ఈ సమస్యలకు దారితీస్తున్న పరిస్థితుల గురించి మ న సమాజంలో అవగాహన అవసరం.

సంతానం కలగక పోవటానికి సాధారణంగా దంపతుల్లో ఎవరో ఒకరిలో ఇబ్బంది ఉండటాన్ని కారణంగా చెబుతారు. సాధారణంగా మూడో వంతు దంపతుల్లో మహిళల్లో లోపం ఉంటే, మరో మూడో వంతు జంటల్లో పురుషుల్లో సమస్య ఉంటుంది. మరో మూడో వంతు మందిలో మాత్రం ఇద్దరిలో సమస్య ఉండటం కానీ, ఊహించని పరిణామం చోటు చేసుకోవటం కానీ సమస్యకు దారితీస్తుంది. అటువంటప్పుడు సమస్య ఎవరిలో ఉందో ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత ఆయా వ్యక్తుల్లో సమస్యను సరిదిద్దుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.నిర్దిష్టంగా ఒక కారణంతో సంతాన లేమి ఏర్పడుతుందని చెప్పటం కష్టం. కొన్ని అంశాలు ఈ సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. అంత మాత్రాన ఈ అంశాల కారణంగా పిల్లలు పుట్టరని తెగేసి చెప్పటం కూడా సరి కాదు. వివాహం అయిన తర్వాత క్రమం తప్పకుండా కాపురం చేసే జంటల్లో తొందరలోనే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఒక నెల నుంచి ఆరు నెలల కాలంలో ఫలితం వస్తుంటుంది. మరి కొందరిలో ఇందుకు సంవత్సరం నుంచి రెండేళ్ల కాలం పట్టవచ్చు. రెండు సంవత్సరాలు దాటినప్పటికీ గర్భం దాల్చకపోతే మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.

సాధారణంగా గర్భం దాల్చటానికి వయస్సు అనే దాన్ని ముందుగా గుర్తుచుకోవాలి. ముఖ్యంగా భారత్‌వంటి ఉష్ణ మండల దేశాల్లో 15,16 సంవత్సరాలకే యుక్త వయస్సు మొదలై పోతుంది. అంటే అప్పటి నుంచే సంతాన ఉత్పత్తికి తగినట్లుగా శరీరం లో సన్నాహాలు జరిగిపోతాయి. అప్పటి నుంచి 20 సంవత్సరాల నాటికి అన్ని అవయవాలు పూర్తిగా విస్తరించు కోవటం జరుగుతుంది. అప్పటి నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు సమ్రద్దిగా ఉండే వయస్సు అనుకోవచ్చు. అంటే ఈ పదేళ్ల కాలం వివాహానికి, సంతానాన్ని దాల్చేందుకు చక్కటి సమయం అనుకోవచ్చు. మహిళల్లో 32-35 సంవత్సరాలు దాటిన నాటి నుంచి ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వస్తుంది. పురుషుల్లో మాత్రం ఇందుకు తగిన వయస్సు 40 ఏళ్ల దాకా చెబుతారు. 40 దాటాక ఈ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకొనే వారిలో ఈ సమస్య ఏర్పడటానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.పొగతాగటం, మద్యం తాగటం వంటి దురలవాట్లు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ అలవాట్లు సాధారణంగా భారత్‌ వంటి సాంప్రదాయిక దేశాల్లో పురుషుల్లో ఎక్కువగా చూస్తు ఉంటాం. అందుచేత పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటంలో ఈ అంశాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి.

దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
శారీరక అంశాలు ఎంత ముఖ్యమో, మానసిక పరిస్థితి కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఆందోళన చెందేవారు, టెన్షన్‌ తో కూడిన పనులు చేసే వారు, అధికంగా ఒత్తిడిని
ఎదుర్కొనే వారిలో ఈ సమస్యను గుర్తించవచ్చు. దీంతో పాటు పిల్లలు పుట్టకపోతే ఆ దిగులు ను చాలా మంది మనసులో పెట్టేసుకొంటారు. దీంతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఆందోళనతో కాపురం చేసే వారిలో సరైన కలయిక సాధ్యం కాదు. దీంతో సంతాన లేమి అనేది మరింత పెద్ద సమస్యగా దాపురిస్తుంది. సంతాన లేమి అనేది ప్రధాన మైన సమస్య అనటంలో సందేహం లేదు. అంతమాత్రాన జీవితం నిస్సారం అయిపోయిందని మాత్రం భావించకూడదు. ఆధునిక కాలంలో ఈ సంతాన లేమికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అంతేకానీ, అదే పనిగా ఆందోళనను మనస్సులో పెట్టుకొని చికిత్సకు హాజరైనప్పటికీ ఏమాత్రం ప్రయోజనం ఉండదని గుర్తించు కోవాలి. ముఖ్యంగా భార్యా భర్తలు ఇద్దరు ప్రశాంతంగా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం ముఖ్యం. లోపం ఎవరిలో ఉన్నా, ఇద్దరు పరస్పర సహకారంతో మెలిగినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.

- డాక్టర్‌ వందన హెగ్డే, M.S.(OBG)F.R.M.,(infertility)-స్పెషలిస్టు ఇన్‌ రిప్రొడక్టివ్‌మెడిసిన్‌, అబ్‌స్ట్రెట్రిషియన్‌ - గైనకాలజిస్టు, క్లినికల్‌డైరక్టర్‌, హెగ్డే హాస్పిటల్సు-విఠల్‌రావు నగర్‌, మాధాపూర్‌-హైదరాబాద్‌ - 81.--May 4, 2015@sury newspaper.

  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/