Showing posts with label Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు. Show all posts
Showing posts with label Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు. Show all posts

Wednesday, August 5, 2015

Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




   అతిగా మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటున్నది తెలిసిందే. అయితే ఇదొక్కటే కాదు. మనం తినే పదార్థాలు, పానీయాలు కూడా కాలేయం దెబ్బతినటానికి దోహదం చేస్తాయి.

చక్కెర: మిఠాయిలు, చాక్లెట్ల వంటివి అతిగా తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. శుద్ధిచేసిన చక్కెరలను మితిమీరి తింటే కాలేయం జబ్బు ముంచుకురావొచ్చు. శరీరం వినియోగించుకోకుండా మిగిలిపోయిన కేలరీలు ఏవైనా కాలేయంలో కొవ్వురూపంలో పోగుపడతాయి. ఇది చివరికి కాలేయం కొవ్వు పట్టటానికి (ఫ్యాటీ లివర్‌) దారితీస్తుంది.

మోనోసోడియం గ్లుటమేట్‌: ప్రస్తుతం రుచికరంగా ఉండటానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం గ్లుటమేట్‌ (ఎంఎస్‌జీ) కలుపుతున్నారు. ఇది కాలేయంలో వాపు ప్రక్రియకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

విటమిన్‌ ఏ: కంటి ఆరోగ్యానికి, చూపు బాగుండటానికి విటమిన్‌ ఏ ఎంతగానో తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దాని కన్నా ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి హాని కలగజేస్తుంది.

కూల్‌డ్రింకులు: చక్కెర లేని లేదా డైట్‌ కూల్‌డ్రింకులైనా సరే. వీటిల్లో కృత్రిమ తీపి పదార్థాలతో పాటు కార్బన్‌ డయాక్సైడ్‌ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల కూల్‌డ్రింకులను అదేపనిగా తాగితే కాలేయ జబ్బుకు దారితీస్తుంది.

కుంగుబాటు మందులు: అరుదుగానే అయినా.. కుంగుబాటు మందులు కాలేయంలో విషతుల్యాల మోతాదులు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల వీటిని వేసుకునేవారు కాలేయ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఉప్పు: అధిక రక్తపోటుకు ఉప్పుతో సంబంధం ఉండటం తెలిసిందే. కానీ ఇది కాలేయ జబ్బునూ తెచ్చిపెడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పోగుపడటానికి దారి తీస్తుంది.

జంక్‌ఫుడ్‌: చిప్స్‌ వంటి ప్యాకేజ్డ్‌ పదార్థాల్లో ఉప్పుతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినటానికి మార్గం వేస్తాయి.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/