Saturday, March 31, 2012

Thinking once again is good,ఏదయినా ఓ అంశం తరచి చూస్తే కొంత లాభం


 • image : Courtesy with Eenadu news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Group discussion -సమిష్టి సమావేసము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఏదయినా ఓ అంశం, భావన చూసే కోణాన్ని బట్టి మంచిదవుతుంది. చెడ్డగా మారుతుంది. పగటి నిద్ర అస్సలు మంచిది కాదంటారు. కొన్ని ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు తెలిపాయి. ఆలోచిస్తే, మన దైనందిన జీవితంలో పూర్తిగా తప్పుబట్టే ఆలోచనలు, పక్కనబెట్టే అలవాట్లు చాలానే కనిపిస్తాయి. కానీ అవగాహన కలిగి, హద్దుల్లో ఉంటూ వాటిని ఆచరిస్తే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

 • 'కాళ్లకు చక్రాలున్నట్టు అటూఇటూ తిరిగేస్తుంటాడు. ఒక్క నిమిషం కుదురుండదు. ఒరేయ్‌, కదలకుండా కూర్చోవడం అలవాటు చేసుకో' అని ఇంట్లో పెద్దవాళ్లు, బడిలో ఉపాధ్యాయులు పిల్లలకు గట్టిగా చెప్పడం వింటూనే ఉంటాం. అక్కడ సందర్భం కొంత నిలకడ నేర్చుకొమ్మని, హడావుడి తగ్గించమని. నిజానికి కుదురుగా కూర్చోలేకపోవడం తప్పేం కాదు. అదీకాక ఎంచక్కా కలియతిరుగుతూ ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల మహిళలు, పెద్ద వాళ్ల ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. దానివల్ల ఎంచక్కా కెలొరీలు ఖర్చవుతాయి.
 • కాఫీ తాగాలని మనసు లాగుతుంది. తాగితే ఆరోగ్యానికి హాని అని చాలామంది మానేస్తారు. కానీ మితంగా ఓ కప్పు తాగితే శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుంది. జీవ క్రియలు వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా మహిళలు రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలిపిన విషయమిది.
 • పక్కింటి వాళ్ల గురించి, సహోద్యోగినుల గురించి అవీఇవీ మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఇలా చెప్పుకోవడం వల్ల ఇసుమంత లాభం లేదన్న వాదన ఉంది. కానీ అది సరికాదనీ, ఓ స్థాయి మేరకు అలాంటి మాటలకు చెవి ఒగ్గడం వల్ల అవి సృష్టించే వాళ్లు ఎదుటి వ్యక్తుల్లోని గోరంత లోపాన్ని కొండంతగా ఎలా చెప్పుకొస్తారో తెలుస్తుంది. అవి గుణపాఠాలుగా ఉపయోగపడతాయి. అయితే ఎవరికీ హాని కలిగించని, ఇబ్బంది పెట్టని అంశాలను మాట్లాడుకుంటున్నామా అన్న వివేచన ముఖ్యం.
 • పనిచేసే చోట చిన్నచిన్న మాటపట్టింపులు, మనస్పర్థలు వస్తుంటాయి. పోతుంటాయి కూడా! ఆ చేదు జ్ఞాపకాలను మనసులో అణిచిపెట్టుకొని దీర్ఘకాలం బాధపడితే ఎలా! అది అంతర్గతంగా ఒత్తిడి పేరుకుపోయేట్టు చేస్తుంది. కోపం వచ్చినప్పుడు చిన్నపాటి చిటపట. మరు నిమిషంలోనో, మర్నాడో చిరునవ్వుల పదనిస. మనసులోని భావాలను వెల్లడించడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.
 • ఎండాకాలంలో బకెట్ల కొద్దీ నీటితో రెండుసార్లు స్నానం చేసి, నాలుగుసార్లు ముఖం కడుక్కొని.. అదే శుభ్రత అనుకుంటే ఎలా? పొదుపుగా నీటి వాడకం ప్రకృతిని ప్రేమించడం. నీటి వృథాకు అవకాశం ఇవ్వకుండా పరిశుభత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • భావోద్వేగాలని అదుపులో ఉంచుకొన్నవారే నిజమైన విజేతలంటారు. కానీ వాటిని అతిగా అణిచిపెట్టడం కూడా ప్రమాదమే! ఎవరూ సరదాకి కంటతడిపెట్టరు కదా! అదో అసంకల్పిత చర్య. దానిని అలానే స్వీకరించాలి. దుఃఖం ముంచుకొచ్చినప్పుడు ఉద్వేగాన్ని ప్రకటించడమే సమంజసం! ఆ కన్నీళ్లతో పాటు కష్టం కూడా కొట్టుకుపోతుంది.
 • కాస్త ఎండలో తిరగాలంటే భయం. ఎక్కడ అతి నీలలోహిత కిరణాలు దాడిచేస్తాయో అని చెప్పి ఎప్పుడూ స్కార్ఫ్‌లు కప్పుకొంటూ, చేతికి గ్లవుజులు వేసుకొని తిరుగుతుంటాం. సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. కానీ ఎండలో తిరగడం వల్ల ఎముకల బలమే కాదు.. జలుబు వంటి చికాకులని కూడా తొలగించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా ఎండ ఉండే మన దేశంలో డి విటమిన్‌ లోపానికి అవకాశాలు తక్కువని మరిచిపోకూడదు.
 • ఆదివారం సెలవు. ముసుగుతన్ని నిద్రపోవడం, వ్యాయామం మానేయడం అందరూ చేసే పనే. ఏ సాయంత్రమో అయ్యాక సెలవంతా పాడయ్యిందే అనుకోవడం. ఇకనుంచీ అలా అనుకోకుండా ఓ అధ్యయనం బద్దకానికి మద్దతు పలుకుతోంది. అలా రోజంతా పరిమితుల్లేకుండా నిద్రపోవడం అనేది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
 • కొన్ని సమస్యలకు ఎంతగా బుర్రబద్దలు కొట్టుకొన్నా పరిష్కారాలు దొరకవు. అప్పుడు కాసేపు సేద తీరండి. నిద్రలో మీకు తెలియకుండానే అంతఃచేతనలో దాగిన ఆలోచనలు పరిష్కారాలని అందిస్తాయి. నిద్రకున్న శక్తి అది.

==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

అందం చెక్కుచెదరకుండా...జాగ్రత్తలు
 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అందం చెక్కుచెదరకుండా...జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పదహారేళ్ల ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు చర్మం ఎలా నిగారింపుతో వగలుపోతుందో.. అదే అందం, సొగసు పాతికల్లోనూ ఆపైనా కూడా కొనసాగాలంటేే కాస్త శ్రద్ధ, కొన్ని మెలకువలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

 • * పాలమీగడలాంటి నునుపైన చర్మానికి పైపై నగిషీలు ఎన్ని పెట్టినా సరిపోవు.. పోషకాహారమే దానికి మేలైన మార్గం. ఎన్ని పోషకాలు అందితే అంతగా చర్మం మెరిసిపోతుంది. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్‌ ఆహారానికి ఈ శక్తి ఉంది.
 • * శరీరంలో వ్యర్థాలు పేరుకొనేకొద్దీ క్రమంగా ముఖంలో కాంతి సన్నగిల్లుతుంది.. అందుకే ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించే డీటాక్సిఫికేషన్‌ ప్రక్రియ అవసరం. ఉదయాన్నే కప్పు కొత్తిమీర, కప్పు పుదీనా, కప్పు కరివేపాకు తీసుకొని గ్రీన్‌చట్నీ చేసుకొని టిఫిన్‌కి జతగా తింటే బరువు తగ్గడంతో పాటు వ్యర్థాలు తొలగుతాయి.
 • * ఏ వయసు వారికయినా వృద్ధాప్య లక్షణాలు నివారించడానికి సన్‌స్క్రీన్‌ వాడకం తప్పనిసరి.. ముందుగా సన్‌స్క్రీన్‌ రాసుకొని ఆ తర్వాతే అలంకరణ వేసుకోవాలి.
 • * రోజంతా కాలుష్యపూరిత వాతావరణంలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలానే నిద్రపోవడం కాకుండా.. ముందుగా ముఖంపై పేరుకొన్న మురికిని తొలగించడానికి డీప్‌క్లెన్సర్‌తో శుభ్రం చేయాలి. రాత్రిళ్లు అయితే టోనర్‌ని రాసుకొని పడుకోవాలి. తెల్లారి ముఖం తాజాగా ఉంటుంది.
 • * పాదాలు, చేతులకు నిత్యం మాయిశ్చరైజర్‌ని రాయడం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో ఇది తప్పనిసరి. అయితే మీరు వాడే మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా పోషకాలు నిండినదై ఉండాలి. కొబ్బరినూనె కూడా మేలైన మాయిశ్చరైజరే!
 • * తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల ముఖంలో టాన్‌ ఏర్పడుతుంది. దీని వల్ల ముఖంలో పిగ్మెంటేషన్‌ సమస్య తీవ్రమై క్రమంగా మచ్చలుగా మారతాయి. పండిన అరటిపండు, బొప్పాయి... ఏదయినా సరే.. ఆ పండు గుజ్జు తీసుకొని ఎండకి గురై నల్లగా మారిన ప్రాంతంలో పదినిమిషాల పాటు రుద్దితే టాన్‌ తొలగుతుంది.
 • * జుట్టు రాలిపోవడం, కళతప్పడం, పొడిబారడం జరుగుతుందంటే కారణం శరీరంలో థైరాయిడ్‌ సమస్యకానీ, ఆహారంలో ప్రొటీన్ల లోపం కానీ ఉన్నట్టు లెక్క. పోషకాహారం తీసుకొంటూనే గోరువెచ్చని నూనెతో తలకి మర్దన చేసుకొంటే మంచి ఫలితాలుంటాయి
 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

సహజసిద్ధమైన సౌందర్యం .., Natural beautyఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సహజసిద్ధమైన సౌందర్యం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందాన్ని పెంచేవాటిల్లో మేకప్‌ ప్రధానమైనది. అందులో ప్రస్తుతం అనేక రకాలు వచ్చాయి... వస్తున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి అనేక కాస్మొటిక్‌ కంపెనీలు ఆవిర్భవించాయి. కాటుక మొదలుకొని గోళ్లరంగు వరకు అనేక వెరైటీలు వచ్చేశాయి. ఇంతకు మునుపు ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఈ మేకప్‌ ప్రస్తుతం సామాన్యుల ఇళ్లలోకి కూడా ప్రవేశించింది. బయటకు అడగుపెట్టాలంటే మేకప్‌ తప్పనిసరి అంటున్నారు నేటి యూత్‌. అయితే మోడ్రన్‌ మేకప్‌ మీద ప్రస్తుత యువతకు విసుగెత్తింది. సహజసిద్ధమైన మేకప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లేవారు నేచురల్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రకృతిలో లభ్యమయ్యేవాటితో తమ శరీరాన్ని తేజోవంతంగా, ప్రకాశవంతంగా మార్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


-ముఖానికి, మేనుకు మేకప్‌లను ఉపయోగించడం క్రీ.పూ 3500 సంవత్సరం నుంచే ఉందని పురావస్తు శాఖవారి నివేదికల ప్రకారం తెలుస్తుంది. మొదటగా ఈజిప్షియన్లు తరువాత రోమన్‌లు, గ్రీకులు మేకప్‌ పట్ల ఆసక్తి కనబరిచేవారు 20వ శతాబ్దం ఆరంభంలో సామాన్య ప్రజలలోకి సైతం ఇది ప్రవేశించింది. ఈ ఆధునిక కాలంలో కాస్మొటిక్స్‌ను అనేక రసాయనాలను ఉపయోగించి తయారుచేయడం మొదలైంది. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఎక్కువగా ఉన్నా వీటినే వాడడం మొదలు పెట్టారు. అనునిత్యం ఫ్యాషన్‌, గ్లామర్‌ అంటూ పరుగులెత్తే నేటి యూత్‌ ప్రస్తుతం రసాయనాల మిశ్రమ మేకప్‌కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. సహజసిద్ధమైన అందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.

ఉల్లాసంగా ఉండాలి...
బాహ్య సౌందర్యమే కాదు మనసుకూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే అది నిజమైన అందం అంటున్నారు నేటి కుర్రకారు. ‘నేటి రోజుల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. నవీన నాగరికులం అనిపించుకోవాలంటే మంచి దుస్తులతో పాటు గ్లామర్‌గా కనిపించడమూ పరిపాటే. మనసుకు ఇంపైన సౌందర్యాన్ని అందం అంటాం. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాం. అందము ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంటుంది. ప్రతి మనిషి ఆడ, మగ అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు. ఉండాలని ప్రయత్నమూ చేస్తారు. అందమంటే శారీరక సౌందర్యమే కాదు, మానసికంగా పరిపక్వమూ, ఉల్లాసమూ కూడా ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైన అందమని చెప్పబడుతుంది. వీటికోసం మార్కెట్‌లో దొరికే అనేక సాధనాలను వాడుతుంటారు. కానీ నేడు వాటివల్ల సైడ్‌ఎఫెక్ట్‌‌స ఎక్కువగా కలుగుతోంది.

నిగనిగలాడుతుంది...
-అందంగా కనిపించాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధవహించాలి. బాహ్యసౌందర్యం బాగుండాలంటే శరీరంలో అందుకు తగిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సమ తుల్యమైన ఆహారము తీసుకోవాలి. విటమినులు ఉన్న ఆహారము తీసుకోవాలి. యాంటి యాక్సిటెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంటుంది. క్రొవ్వు పదార్థములు తక్కువగా తీసుకోవాలి. ఇలా శరీర నియంత్రను పాటిస్తే ఆటోమేటిక్‌గా మన అందం పెరుగుతుంది. అలాగే కొన్ని నియమాలను కూడా పాటించాలి. వేళకు నిద్రపోవాలి. వేళకు ఆహారము తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌ పడడం తగ్గిం చుకోవాలి. ఎక్కువ స్ట్రెస్‌, స్ట్రెయిన్‌కు గురికాకూడదు. ప్రతి రోజు మృదువైన సబ్బుతో స్నానం చేయాలి. మీ అందాన్ని ఇంకొకరి అందముతో పోల్చకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించడం మంచిది.

తెలుసుకుందాం...
సహజసిద్ధంగా ఎలాంటి వాటిని తీసుకోవాలో ప్రముఖ బ్యూటీషియన్స్‌ కొన్ని చిట్కాలను వివరిస్తున్నారు.
అలసిన కళ్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్లకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.కళ్లకు మేకప్‌ వేసుకనే ముందే చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పలమీద ఉంచుకోవాలి.

పొడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్‌ స్పూన్‌ చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మచుక్కలు, ఒక టేబుల్‌ స్పూన్‌ కిస్మిస్‌లు ఇవన్ని బాగా కలపాలి. మొహానికి రాసుకుని 20 నిమిషాలు అనంతరము గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

జిడ్డు చర్మానికి : పావు టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం లో రెండు టేబుల్‌ స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచెం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని బాడీ లోషన్‌గా కూడా వాడవచ్చు.

చక్కని స్కిన్‌ టోన్‌ కోసం : ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ సన్నగా తరిగిన కమలా పండు తొక్కలు, ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్‌ మీల్‌, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మృదువుగా మర్దన చేయాలి. చర్మం మీది మృత కణాలు, బ్లాక్‌ హెడ్స్‌ తొలగి పోతాయి. దీనిని రోజువారీ స్క్రబ్‌గా కూడా వాడవచ్చు.

శరీర కాంతి పెంచే చిట్కాలు...
నిమ్మరసం , మజ్జిగ సమభాగాలు కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛముగా కనిపిస్తుంది. ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతంగా అవుతుంది.

ముఖముపై ముడతలున్నట్లయితే రెండు చెంచాల గ్లిజరిన్‌లో సగం చెంచా గులాబీ నీరు, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి రాసుకుంటే ఉదయము లేవగానే చర్మపు రంగు నిగ్గుతేలి ముడతలు కనిపించకుండాపోతుంది.

చర్మానికికుంకుమ పువ్వు సొగసు : కుంకుమ పువ్వు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌందర్య సాధనంగా ప్రసిద్ధిపొందింది. ఈ పువ్వుతో తయారయిన పేస్టును ముఖము, చేతులపైన రాసుకుంటే చర్మానికి మృదుత్వము, బంగారు మెరుపును తెస్తుంది.

పసుపు, వేపల లేపనం : వందల సంవత్సరాలనుంచి భారతీయుల చర్మ సంరక్షణకు పసుపు, వేపలను ఎంతగానో నమ్ముతారు. పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని, హాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపుపొడి, కొంచెం కుంకుమ పొడి, ఒక చెంచా వేపచూర్ణము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము, ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.

గంధం పేస్టు : అందరికీ ఒకే రకమైన శరీర తత్వం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి చర్మము బాగా సున్నితంగా ఉంటుంది. ఏ మాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుంది. దురద, పొడిబారడం, పొరలుగా రావడం, బిరుసెక్కిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు గంధము పేస్టు ఆయిల్‌ చర్మాన్ని చల్లబరుస్తుంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనె గ్రంధులు ఉత్తేజితమైన తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మానికి హానిచేసే బ్యాక్టీరియాలను తొలిగిస్తాయి.
జుట్టుకు గొప్ప కండిషనర్‌ పెరుగు : అందానికి మెరుగులు దిద్దే ఉత్పత్తులలో పాల సంబంధిత పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అధిక శాతం ప్రొటీన్లు, విటమిన్లు ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. పెరుగు జుట్టును పొడిబారనీయకుండా చేస్తుంది. షాంపూతో తలంటుకున్న తరువాత ఐదునిమిషాలు పెరుగుతో తలకు మసాజ్‌ చేసుకుంటే పొడిబారిన జుట్టుకు చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టుకి మృదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకు ఉంది.

నీరు...
నీరు మనశరీరానికి ఎంతో అవసరము. సమాజములో దాదాపు ఎనభై శాతం మంది డిహైడ్రేషన్‌కి లోనవుతుంటారు. దీని వలన శరీరము ముడతలు పడి కాంతి విహీనంగా తయారవుతుంది. బుగ్గలు చొట్టలు పడి ముఖము అందవికారముగా తయారవుతుంది. మన శరీర బరువులో 70 శాతం ఉండే నీరు అందానికి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కావున ప్రతిరోజూ కనీసము రెండు లీటర్ల నీటిని త్రాగడం శరీరానికి ఎంతో మంచిది .
 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఉష్ణమాపి ,Thermometer

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఉష్ణమాపి ,Thermometer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 • ఉష్ణమాపి ,Thermometer

జ్వరము కొలిచే సాధనము ధర్మామీటరు .ఉష్ణమాపి (Thermometer) , సాధారణంగా ఇందులో పాదరసము ను ఉపయోగిస్తారు. పాదరసం సంకోచ వ్యాకోచాలను ఆధారంగా చేసుకొని ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. ఈ పరికరమును ముఖ్యముగా రెండు భాగములుగా విభజించవచ్చును, ఒకటి ఉష్ణోగ్రత Sensor (స్పర్శేంద్రియము) (పాదరస ఉష్ణమాపిలో ఉండే బల్బు), రెండవది కొలబద్ద. ఉష్ణోగ్రతను మనము సాధారణము గా entigrade(C) లోగాని Foren(F) లో గాని కొలుస్తాము. ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి.

"జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేద"న్నారు మన పెద్దవాళ్ళు....అప్పట్లో అంటే, సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓసారి అలా వచ్చి పలకరించి ఇలా వెళ్ళిపోయేవి జ్వరాలు...రోజూ కాయకష్టం చేసే వాళ్ళకి, అలా రెండ్రోజులు మంచం మీద పడుకుని, వేళకింత తింటూ(రోజూలా అదరాబాదరాగా కాకుండా) ఉంటే ప్రాణానికి కాసింత సుఖంగానే అనిపించేదేమో! కాని మన రోజులకి అది అంత సరిపడదేమో! ఒక్కరోజు ఆఫీసుకి వెళ్ళకపోయినా జీతంలో కోత! productivity తగ్గిపోతుందిగా మరి! పైగా నెలకోసారి వచ్చే జ్వరాలతో ఎలా?.......మరి ఇలాంటి జ్వరాలకి జరుగుబాటు ఎలా ఉంటే, మనసుకి,శరీరానికి కాస్త హాయిగా ఉంటుందో


అసలు ఈ జ్వరం అంటే ఏంటి? ఎందుకు వస్తుందో ముందు టూకీగా తెలుసుకుందాం........మన శరీరం యొక్క ఉష్ణోగ్రత (core body temperature) మామూలుగా రోజువారీ ఉండేతేడాలకన్నా(diurnal variations అంటే మన శరీర ఉష్ణోగ్రత ఉదయం పూట,రాత్రి పూట వేరువేరుగా ఉంటుంది) పెరిగితే దాన్ని జ్వరం అనొచ్చు....... అంటే శరీర సాధారణ ఉష్ణోగ్రత 37'c or 98.4'F అనుకుంటే, ఒక డిగ్రీ ఎక్కువ వరకూ నార్మల్ గా తీసుకోవచ్చు.(100'F వరకూ).........ఈ జ్వరం అనేది ప్రత్యేకమైన వ్యాధి కాదు...అంతర్గతంగా ఉన్న ఒక వ్యాధి యొక్క బాహ్య లక్షణం(DISEASE SYMPTOM) మాత్రమే.కాబట్టి జ్వరానికి కారణాలు ఏదైనా కావచ్చు.మామూలు వైరల్ ఫీవర్స్ దగ్గరనుంచి విషజ్వరాలు,క్యాన్సర్లు కూడా కావచ్చు...ఒక్కొక వ్యాధికి జ్వరలక్షణం ఒక్కోరకంగా ఉంటుంది.....అంటే, fever periodicity,high or low grade, associated with chills and rigors, other associated symptoms ఇలాంటివి అన్నమాట.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు సాధారణంగా ఒక అపోహ పడుతుంటారు..."జ్వరం బైటకి కనపడట్లేదు, ’లో జ్వరం’ ఉంది" అని....అలాంటిది ఏమీ ఉండదు..జ్వరం అంటే బయటికి కనిపించేది మాత్రమే....ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది "లోజ్వరం" ఉంది అని టాబ్లెట్లు మింగేస్తుంటారు..దాని వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది......

ఇక ఫీవర్ ఎంత ఉందో, కరెక్ట్ గా ఎలా చూడాలో చూద్దాం......ఈ రోజుల్లో రకరకాల థర్మామీటర్స్ దొరుకుతున్నాయి....డిజిటల్, ఊరక చేత్తో పట్టుకుని చూసేవి ఇలా......కాని అన్నిటికన్నా బెస్ట్ ఒన్, మన పాత గ్లాస్ థర్మామీటర్(దీన్నే CLINICAL THERMOMETER అంటారు).......body temperature is best measured when it is done per rectally.కాని అలా చెయ్యటం ప్రాక్టికల్ గా కుదరదు కాబట్టి, నాలుక కింద పెట్టి చూడటం(ఒక నిమిషం పాటు) ఉత్తమం....(చేతికింద అంటే చంకలో పెట్టి చూసిన రీడింగుకి ఎప్పుడూ ఒక డిగ్రీ ఎక్కవ కలపాలి.)......చూసే ముందు,తర్వాత థర్మామీటర్ ని శుభ్రంగా తుడవాలి....మరీ చల్లటి నీళ్ళని కాని, మరీ వేడి నీళ్ళని కాని ఉపయోగించవద్దు...దీనివల్ల తప్పు రీడింగు రావటమే కాకుండా, థర్మామీటర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది....చూసేప్పుడు థర్మామీటర్ టిప్ ని పట్టుకోవద్దు..దీనివల్ల చూసినవాళ్ళ బాడీ టెంపరేచర్ ట్రాన్స్మిట్ అయ్యి రీడింగు తప్పు వచ్చే అవకాశం ఉంది.

ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి

మౌత్ ధర్మామీటరు : ఒక చివర్ పాదరము బల్బ్ ఉంటుంది . ఈ బల్బ్ ను నోటిలో నాలుక కిందను పెట్టి ఉష్ణోగ్రతను కొలుస్తారు . చిన్నపిల్ల విషయము లో దీనిని వాడరు . కొరికే ప్రమాదము ఉన్నందున .

రెక్టల్ ధర్మామీటరు : పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకు ఈ ధర్మామీటరు ఉత్తమమైనది . పిల్లలను బోర్లా పడుకోపెట్టి థర్మామీటరు చివరిభాగములో పెట్రోలియం జెల్లీ రాసి అసనము లోకి అంగుళము మేర చొప్పించి ఉష్ణోగ్రత చూసే సమ్యము పూర్తయ్యే వరకు కాళ్ళు ఒక చేతితోపైకి పట్టుకోని , మరోచేతితో థర్మామీటరునూ పడిపోకుండా పట్టుకొని జ్వరము కొలుస్తారు .

చెవి థర్మామీటరు : ఈ రకమైన థర్మామీటరును అన్ని వయసులవారికి వాడవచ్చును . రెండు నిముషాలపాటు చెవిలో ఉంచి జ్వరము కొలుస్తారు . ఇది కూడా ఖచ్చితమైన ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది .

నోటిద్వారా చూసే డిజిటల్ థర్మామీటరు .: ఐదేళ్ళు .. ఆపైబడ్డవారికి దీనిని ఉపయోగిస్తారు . ఇది బేటరీ పై పనిచేస్తుంది . బేటరీ శక్తి తగ్గితే ఇది తప్పు రీడింగు చూపే ఆస్కారము ఉంది .

స్ట్రిప్ థర్మామీటరు : ముఖము ఫాలభాగము పైన ఈ థర్మామీటరు ఉంచి ఉష్ణోగ్రతను కొలుస్తారు . నోటిలో పెట్టడానికి వీలు పడనపుడు దీనిని వాడుతారు . ఇది ఖచ్చితమైన రీడింగ్ ఇవ్వక పోవచ్చును.
 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/

Thursday, March 29, 2012

Medicine Updates(in Telugu),ఛాతీమంట పంటికి నష్టము , Reflux Acidity bad to teethఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఛాతీమంట పంటికి నష్టము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • ఛాతీమంట పంటికి నష్టము , Reflux Acidity bad to teeth

చాలాకాలంగా ఛాతీమంటతో బాధపడుతున్నవారి ఆహారనాళానికే కాదు. దంతాలకూ ముప్పు తేగలదు . గొంతులోకి పుల్లటి త్రేన్పులు ఎగదన్నుకు రావటంతో ఛాతీమంటకు కారణమయ్యే గ్యాస్ట్రోఈసోఫేగల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (GERD‌) మూలంగా పళ్లూ తీవ్రంగా దెబ్బతింటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది . వీరిలో నోట్లోకి చేరుకునే యాసిడ్‌ వల్ల పళ్లు పలుచగా, వాడిగా అవటంతో పాటు వాటిపై చిన్న చిన్న రంధ్రాలూ పడుతున్నట్టు టెన్నెసీ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. రిఫ్లక్స్‌ డిసీజ్‌ గలవారిలో యాసిడ్‌తో పాటు జీర్ణాశయంలోని పదార్థాలు ఆహారనాళంలోకి ఎగదన్నుకు వస్తుంటాయి. చాలాసార్లు ఇవి నోట్లోకీ చేరుకుంటాయి. ఇందులోని యాసిడ్‌ దంతాల పైపొరపై దాడి చేయటం వల్ల పన్ను దెబ్బతినటానికి దారితీస్తోంది.


 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

అపెండిక్సు వలన లాభాలు , Benifits of Appendixఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Benifits of Appendix-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మన శరీరంలోని ఉండుకం (అపెండిక్స్‌) ఓ వ్యర్థ అవయమని, అవశేషమని చాలామంది భావిస్తుంటారు. చిన్నపేగూ, పెద్దపేగూ కలిసే భాగం మొదట్లో.. వేలు పరిమాణంలో ఉండే దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని అనుకుంటారు. కానీ తీవ్ర ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవటానికి ఇది మనకు తోడ్పడుతుందనే సంగతి మీకు తెలుసా? మనకు మేలు చేసే బ్యాక్టీరియాను నిల్వ చేసుకునే 'సహజ' కేంద్రంగా పనిచేస్తుందంటే నమ్ముతారా? కలరా వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు పేగుల్లో మనకు మేలు చేసే బ్యాక్టీరియా అంతా తుడిచిపెట్టుకుపోతుంది. దీంతో ఇతరత్రా తీవ్ర ఇన్‌ఫెక్షన్లూ తేలికగా దాడి చేయటానికి అవకాశముంటుంది. ఇలాంటి సమయాల్లో ఉండుకం తనలో దాచుకున్న సహజ బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపించి తిరిగి వృద్ధి చెందేలా చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని డ్యూక్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన బిల్‌ పార్కర్‌ చాలాకాలం కిందటే ప్రతిపాదించారు. దీనిపై విన్‌తోర్ప్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జేమ్స్‌ గ్రెండెల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సి.డిఫ్‌ బ్యాక్టీరియా మూలంగా పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిని ఎంచుకొని పరిశీలించింది. ఆసుపత్రుల్లో దీర్ఘకాలం యాంటీబయోటిక్స్‌ చికిత్స తీసుకుంటున్నవారిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తుంటుంది. పేగుల్లో సహజ బ్యాక్టీరియా బలంగా ఉన్నప్పుడు సి.డిఫ్‌ దాంతో పోరాడలేదు. అయితే సహజ బ్యాక్టీరియా తగిన సంఖ్యలో లేకపోతే అది త్వరత్వరగా వృద్ధి చెంది విజృంభిస్తుంటుంది. గ్రెండెల్‌ బృందం చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన అంశం బయటపడింది. అపెండిక్స్‌ గలవారితో పోలిస్తే.. వివిధ కారణాలతో అపెండిక్స్‌ను తొలగించిన వారిలో సి.డిఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ మళ్లీ రావటం రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. అంటే ఉండుకం మేలుచేసే బ్యాక్టీరియాను తిరిగి వృద్ధి చెందేలా చేస్తూ.. మన ప్రాణాలను కాపాడటంలోనూ తోడ్పడుతుందున్నమాట. అందువల్ల అత్యవసరమైతే తప్ప అనవసర కారణాలతో అపెండిక్స్‌ను తొలగించరాదని.. దాన్ని కాపాడుకోవటం కీలకమనీ ఈ అధ్యయనం రుజువు చేస్తోంది. అపెండిక్సు మంచి బ్యాక్టీరియా కేంద్రం.

నిజానికి ఉండుకం నిర్వర్తించే శారీరక ధర్మాలపైన ఇప్పటికీ మనకు అవగాహన తక్కువే. ఒకప్పుడు ఇదో నిరర్థక అవయవమని భావించేవాళ్లు. కానీ ఇటీవలి పరిశోధనలలో దీనికీ ప్రాధాన్యత ఉందనీ, ముఖ్యంగా దీనిలో ఉండే 'లింఫాయిడ్‌' ధాతువు కారణంగా శరీర రక్షణ వ్యవస్థలో దీనికి పాత్ర ఉందనీ గుర్తించడం జరిగింది.

 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 28, 2012

అత్యవసర గర్భనిరోధక మాత్ర ,ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్‌ పిల్ ,Emergency Contraceptive Pill


 • image : courtesy with Eenadu News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అత్యవసర గర్భనిరోధక మాత్ర- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మన దేశంలో అవాంఛనీయ గర్భాలు.. వాటి నుంచి తప్పించుకునేందుకు నాటు పద్ధతుల్లో, గోప్యంగా అబార్షన్లు చేయించుకోవటమన్నది చాలా ఎక్కువ. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. ప్రజల్లో గర్భనిరోధక విధానాల పట్ల అవగాహన పెరిగితే అసలీ పరిస్థితి ఉత్పన్నం కాదని, మరీ ముఖ్యంగా అత్యవసర గర్భనిరోధక విధానం పట్ల అవగాహన పెంచటం ఎంతో అవసరమని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా శృంగారంలో పాల్గొంటే తక్షణ గర్భనిరోధం కోసం ఉపయోగపడేది ఈ అత్యవసర గర్భనిరోధక మాత్ర. 'ఐ-పిల్‌' వంటి రకరకాల బ్రాండ్‌ పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ 'ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్‌ పిల్‌'ను 'మోర్నింగ్‌ ఆఫ్టర్‌ పిల్‌' అనీ పిలుస్తుంటారు. ఈ మాత్ర అత్యవసర సందర్భాల్లో అక్కరకొచ్చే మాట వాస్తవమేగానీ.. వీటిని సాధారణ గర్భనిరోధక పద్ధతులకు ప్రత్యామ్నాయంగా, తరచుగా వాడటం మాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అవసరమైతేనే 'అత్యవసరం'


అత్యవసర గర్భనిరోధక మాత్ర సమర్థంగా పని చెయ్యాలంటే దాన్ని అరక్షిత శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో లివనోర్‌జెస్ట్రల్‌, ప్రొజెస్టిన్‌, యులిప్రిస్టల్‌ ఎసిటేట్‌ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆ స్త్రీ రుతుక్రమంలో అప్పడున్న దశను బట్టి- వెంటనే అండం విడుదల కాకుండా జాప్యం చెయ్యటంగానీ, లేదంటే అండం-శుక్రకణాల సంయోగాన్ని (ఫలదీకరణాన్ని) అడ్డుకోవటంగానీ, ఒకవేళ అప్పటికే అండం ఫలదీకరణం చెంది ఉంటే అది గర్భాశయం గోడలకు అంటుకోకుండా, గర్భం కుదురుకోకుండా నిలువరించటం ద్వారాగానీ గర్భధారణను నిరోధిస్తాయి. ఒకవేళ కండోమ్‌ వంటి గర్భనిరోధక సాధనాలు వాడుతూ, అనుకోకుండా అవి విఫలమైపోయినప్పుడు కూడా అత్యవసర గర్భనిరోధక మాత్రతో ప్రయోజనం ఉంటుంది. అత్యవసర గర్భనిరోధక మాత్ర వేసుకున్న తర్వాత 2 గంటల్లోపు వాంతి అయితే.. మళ్లీ మాత్ర వేసుకోవాలా? అక్కర్లేదా? అన్నది వైద్యులతో చర్చించటం ముఖ్యం.

అత్యవసర గర్భనిరోధక మాత్ర వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వేసుకున్న ఒకటి రెండురోజుల పాటు వాంతులు, వికారం, తీవ్రమైన అలసట, తలనొప్పి, రొమ్ములు సలపరింతగా అనిపించటం, నెలసరికీ నెలసరికీ మధ్య ఎరుపు కనబడటం, నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువ కావటం, పొత్తికడుపులో నొప్పి లేదా అసౌకర్యం, నీళ్ల విరేచనాల వంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందిగానీ ఇవేవీ అంత తీవ్రమైనవి కావు. ఇవి కూడా కొద్దిరోజుల పాటే ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులేమైనా వారం మించి కొనసాగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించటం అవసరం. మొత్తమ్మీద ఈ మాత్రలతో తీవ్ర సమస్యలు ఎదురవటమన్నది అరుదు.

అబార్షన్‌ మాత్ర కాదు
అత్యవసర గర్భనిరోధక మాత్ర- అబార్షన్‌ మాత్ర వంటిది కాదు. అబార్షన్‌ మాత్ర ఇప్పటికే గర్భధారణ జరిగి, గర్భంలో కుదురుకుని పెరగటం ఆరంభించిన పిండాన్ని సైతం బయటకు పంపించివేస్తుంది. కానీఅత్యవసర గర్భనిరోధక మాత్ర అసలు గర్భధారణ జరగకుండానే, గర్భం రాకుండానే నిలువరిస్తుంది. ఈ మాత్ర తీసుకున్న తర్వాత ఆ దఫా నెలసరి ఒక వారం లేటుగా రావచ్చు. గడువు కంటే వారం దాటినా కూడా నెలసరి రాకపోతుంటే వెంటనే గర్భధారణ పరీక్ష చేయించుకోవటం అవసరం.

ప్రత్యామ్నాయం కాదు
అత్యవసర గర్భనిరోధక మాత్ర అప్పటి వరకే గర్భం రాకుండా చూస్తుందిగానీ ఇదేమీ దీర్ఘకాలం పని చేసేది కాదు. కాబట్టి ఈ మాత్ర వేసుకున్న తర్వాత కొన్ని రోజులకు, లేదా వారాలకు అరక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలుంటాయి. అలాగే ఈ మాత్రను మరీ తరచుగా వేసుకోవటం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అత్యవసర సందర్భంలో ఎప్పుడైనా ఈ మాత్ర వేసుకున్నా.. దీర్ఘకాలం గర్భనిరోధం కోసం వైద్యుల సలహా మేరకు సాధారణ గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు లేదా కండోమ్‌ల వంటి సాధనాలను వాడుకోవటమే ఉత్తమం.
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, March 27, 2012

Bleeding in Children , పిల్లలు లో రక్తం పడటంఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పిల్లలు లో రక్తం పడటం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...రక్తం మనకు ఎంత ప్రాణావసరమో.. అది కనబడితే అంత చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతుండదు. అభంశుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారుగానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారుపడిపోతుంటారు. పసిబిడ్డల ముక్కువెంట రక్తం చాలా తరచుగా కనబడే సమస్య. ఇంత తరచుగా కాకపోయినా.. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం కూడా అంతే ఆందోళన రేపుతుంది. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదకరమేం కాదుగానీ.. మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం కచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే.

*పుట్టి 6 రోజులు కాలేదు.. మలంలో రక్తం. ఆకుపచ్చని వాంతులు. తీవ్రమైన ఏడుపు. పరీక్ష చేస్తే.. కడుపులో పేగు మడతబడినట్టు బయటపడింది. వెంటనే శస్త్రచికిత్సతో సరిచేయాల్సి వచ్చింది.

* 8 నెలల పాప. హఠాత్తుగా కడుపు నొప్పితో ఏడుపు మొదలుపెట్టింది. కొద్దిసేపటికి తగ్గినా.. మళ్లీ మళ్లీ తెరలు తెరలుగా కడుపునొప్పితో పాటు ఆకు పచ్చని వాంతులు, మలంలో రక్తం పడటం ఆరంభమైంది. పరీక్షల్లో పేగులోని కొంతభాగం మరోభాగంలోకి చొచ్చుకుపోయినట్టు తేలింది. వెంటనే ఆపరేషన్‌తో సరిచేయాల్సి వచ్చింది.

* 5 ఏళ్ల బాబు. రెండు రోజులకు ఒకసారి మల విసర్జనకు వెళ్లేవాడు. పైగా మలం గట్టిగా వచ్చేది. కొన్ని రోజులకు మలద్వారం నుంచి రక్తం పడటం మొదలైంది. తల్లిదండ్రులు కంగారుపడిపోయి డాక్టర్‌కు చూపించారు. మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌) వల్లే రక్తం వస్తున్నట్లు గుర్తించారు. ....ఇలా పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటం తరచుగా కనబడే సమస్యే. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతుంటాయి కూడా.

కడుపులోని పేగుల్లో కింది భాగం నుంచి రక్తస్రావమైతే అది ఎర్రటి ఎరుపు రంగులో (హెమటోకేజియా) కనిపిస్తుంది. అదే ఎగువభాగంలో పేగుల్లో రక్తస్రామమైతే కొద్దిగా రంగుమారి (melina) ఉంటుంది. పేగుల్లో కొద్దిపాటి రక్తస్రావమైనా అది మలంతో కలిసినప్పుడు ఎంతో పెద్దమొత్తంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు బాగా కంగారుపడిపోతుంటారు. అదృష్టమేంటంటే.. పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలావరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకురావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటకు పోయినా ప్రాణాపాయం కలగొచ్చు. అందువల్ల రక్తస్రావాన్ని అరికట్టేందుకు తక్షణం తగు చికిత్స చేయటం అవసరం.

 • గుర్తించటం
1. రక్తం ఎంత మొత్తంలో పడుతుంది? రంగు ఎలా ఉంది? విరేచనంతో కలిసి వస్తోందా? విడిగా పడుతోందా? విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ పడుతోందా? వంటి వివరాల ద్వారా కొంత మేర సమాచారం తెలుస్తుంది.
2. పరీక్షించటం ద్వారా- కామెర్లు, రక్తహీనత, కడుపుబ్బరం, ఫిషర్స్‌, పొట్టలో గట్టిగా తగలటం వంటి వాటిని గుర్తించొచ్చు.
3. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్‌ పరీక్ష, కడుపు ఎక్స్‌రే, ఎండోస్కోపీ ద్వారా కచ్చితంగా నిర్ధరిస్తారు. కొందరికి యాంజియోగ్రఫీ కూడా అవసరమవుతుంది.

 • ఎప్పుడు ప్రమాదం?
* రక్తం ఆగకుండా పడుతున్నా,
* పెద్దమొత్తంలో రక్తస్రావం అవుతున్నా
* రక్తం పడటంతో పాటు నొప్పి, కడుపుబ్బరం, లోపలి అవయవాలు ఉబ్బటం వల్ల కడుపు పెద్దగా అవటం వంటివి కనిపించినా,

చాలావరకు మామూలువే చాలామంది పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటమన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతట అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ల వంటి అనుమానాలూ అవసరం లేదు. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతుంటాయి. రక్తం ఆగకుండా, ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా కారణాలను కచ్చితంగా గుర్తించొచ్చని గ్రహించాలి.

 • ముక్కు నుండి రక్తం

పిల్లల్లో ముక్కువెంట రక్తం పడటమన్నది చాలా తరచుగా కనిపించే సమస్య. ఈ సమస్య మండు వేసవిలో, చలికాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వైద్యపరిభాషలో దీన్ని 'ఎపిస్టాక్సిస్-(epistaxis)‌' అంటారు. ఇంటి వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్లినట్లవుతుంది. లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని వీటిని కెలుకుతుంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎక్కడి నుంచి?--మన ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలుంటాయి. ముఖ్యంగా ముక్కు కొనకు ఒక అంగుళం లోపలగా.. సిరలు పైచర్మం కిందే, చాలా సున్నితంగా కూడా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని 'లిటిల్స్‌ ఏరియా' అంటారు. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తుంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు.

 • కారణమేమిటి?---
* ముక్కులోపల వేలు పెట్టి కదిలిస్తుండటం,
* జలుబు, అలర్జీల వంటివి వచ్చినప్పుడు చాలా బలంగా తుమ్ములు రావటం, లేదా గట్టిగా చీదటం,
* వేసవిలో వేడి మరీ ఎక్కువగా ఉండటం
* ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్ల వంటి వస్తువులు పెట్టుకోవటం,
...ఈ సందర్భాలన్నింటిలోనూ 'లిటిల్స్‌ ఏరియా'లోని రక్తనాళాలు చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణం ఏం చెయ్యాలి?--కంగారు పడకుండా బిడ్డను సాంత్వన పరచటం ముఖ్యం. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకుని
ఉండేలా కూర్చోబెట్టి.. ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తిపట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు.

*ఇలా 10 నిమిషాలు ఒత్తిపట్టి ఉంచాలి. మధ్యమధ్యలో ఆగిందా? లేదా? అని వదిలి చూసే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. 10 నిమిషాల తర్వాత కూడా ఇంకా రక్తం వస్తుంటే మరో 10 నిమిషాలు పట్టుకుని ఉండాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చెయ్యద్దు. అప్పటికీ తగ్గకుంటే?---ముక్కును పైన చెప్పినట్లుగా పది పది నిమిషాల చొప్పున రెండు దఫాలుగా ఒత్తి పట్టినా కూడా రక్తం వస్తూనే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం మంచిది. ఇదే కాదు, మనకు తెలియకుండా లోపల ముక్కులో ఏదైనా ఉందన్న అనుమానం ఉన్నా, అలాగే కేవలం ముక్కు నుంచే కాకుండా చెవులు, చిగుళ్ల వంటి వాటి నుంచి కూడా రక్తం వస్తున్నా, రక్తం మరీ ఎక్కువగా వేగంగా పోతున్నా, లేదా ఆటల్లో పడిపోవటం, ముక్కుకు బలంగా దెబ్బతగలటం వంటి సందర్భాల్లో కూడా వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లటం మంచిది.

రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్‌ నైట్రేట్‌ సాయంతో లేదా విద్యుత్‌ పరికరాలతో ఆ ప్రాంతాన్ని 'కాటరైజ్‌' చేస్తారు. మొత్తానికి ముక్కు నుంచి రక్తం రావటమన్నది తల్లిదండ్రుల్లో భయాందోళనలను పెంచేదేగానీ మరీ అంత ప్రమాదకరమైనసమస్య మాత్రం కాదు.

 • నివారించేదెలా?----
* ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించెయ్యాలి.
* పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసెయ్యాలి.
* బలంగా ముక్కు చీదనివ్వద్దు.
* ముక్కు రంధ్రాల్లో పక్కులు ఎక్కువగా కడుతుంటే- ముక్కులో వేసేందుకు సెలైన్‌ చుక్కల మందులు దొరుకుతాయి, వాటిని రెండు పూటలా ముక్కులో వేసి, మెత్త బడిన

తర్వాత శుభ్రం చెయ్యటం మంచిది.
* వాతావరణం బాగా పొడిగా ఉండే వేసవిలోనూ, చలికాలంలోనూ పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ (వాజ్‌లైన్‌) రాయటం మంచిది.
* ఇంటి వాతావరణం మరీ పొడిగా ఉంటుంటే 'హ్యుమిడిఫైయర్స్‌' పెట్టటం ఉత్తమం.

మలంలో రక్తం: కారణాలేంటి?
* మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌): పిల్లల్లో ముఖ్యంగా తొలి రెండేళ్ల వయసువారిలో కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం కావటానికి ఇదే ప్రధాన కారణం. బయటకు వచ్చే
రక్తం చాలా ఎర్రగా ఉంటుంది. మల విసర్జన తర్వాత బొట్లు బొట్లుగా పడుతుంది. మలం పైన రక్తం చారికలు కూడా ఉండొచ్చు. సాధారణంగా ఇది మలబద్ధకం గలవారిలో మలం
పెద్దపెద్ద పెంటికలుగా బయటకు వచ్చిన అనంతరం కనబడుతుంది. మలద్వారం దగ్గరి పొరలు చిట్లి, చీలిక రావటం దీనికి మూలం. ఈ సమయంలో చాలా నొప్పి కలుగుతుంది.
దీంతో పిల్లలు మల విసర్జనను ఆపుకోవటానికీ ప్రయత్నిస్తారు. ఈ సమస్య రోజుల పిల్లల్లో కూడా ఎక్కువగానే కనబడుతుంటుంది. మలబద్ధకం తలెత్తకుండా చూడటం; మలం మెత్తగా, మృదువుగా వచ్చేలా మందులు వాడుకోవటం; బిడ్డను గోరు వెచ్చటి నీటి టబ్బులో కూర్చుండబెట్టటం, చీలికలు త్వరగా మానేందుకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆయింట్‌మెంట్లు రాయటం అవసరం. సాధారణంగా చీలికలకు సర్జరీ అవసరం ఉండదు.

* పేగుల్లో తిత్తి (మెకెల్స్‌ డైవర్టికులమ్‌): పిండ దశలో బొడ్డు ద్వారా పేగుల్లోకి వెళ్లే నాళం (ఓంఫాలోమెసెంట్రిక్‌ డక్ట్‌) పుట్టిన తర్వాత కూడా మూసుకోకపోవటం వల్ల తలెత్తే సమస్య ఇది. దీంతో నొప్పి లేకుండానే మలద్వారం గుండా పెద్దమొత్తంలో రక్తం పడుతుంది. కొందరు పిల్లలు పేగుల్లోని గోడకు తిత్తితో పుడుతుంటారు. ఈ తిత్తి నుంచి ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ.. దాని ప్రభావంతో దీని చుట్టుపక్కల చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్స్‌) పడుతుంటాయి. ఇది రక్తస్రావానికి కారణమవుతుంది. 2% మంది పిల్లల్లో ఇది కనబడుతుంది. ఇది సమస్యాత్మకంగా తయారైనప్పుడు సర్జరీతో ఆ కొంత మేరా పేగును తొలగించటం అవసరం.

* పేగు చొచ్చుకురావటం (ఇంటససెప్షన్‌): కొందరిలో ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకు పోతుంటుంది. ఇది రెండేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. 6-9 నెలల వయసులో ఎక్కువగా కనబడుతుంటుంది. ఎక్కువ మందిలో చిన్నపేగులోని కొంతభాగం పెద్దపేగులోకి తోసుకుపోతుంది. పేగులు కదిలిన ప్రతిసారీ ఇది మరింత ముందుకు వస్తుంది. దీనికి తక్షణం ఆపరేషన్‌ అవసరం. ఎందుకంటే చొచ్చుకొచ్చిన చిన్నపేగుకు రక్తసరఫరా నిలిచిపోయి అది కుళ్లిపోయే ప్రమాదం ఉటుంది.

హాయిగా ఉన్న పిల్లల్లో కూడా ఈ సమస్య హఠాత్తుగా తలెత్తవచ్చు. ఉన్నట్టుండి పిల్లలు తీవ్రంగా ఏడుస్తారు. కొద్దినిమిషాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుందిగానీ కొంత సమయానికి ఇది మళ్లీ వస్తుంది.దీంతో కడుపుబ్బరం, పసుపు లేదా ఆకుపచ్చగా వాంతులు, మలద్వారం గుండా రక్తం పడటం.. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వెంటనే అల్ట్రాసౌండ్‌ పరీక్ష తప్పనిసరి. దీన్ని 3-6 గంటల్లోపే గుర్తిస్తే ఆపరేషన్‌ అవసరం లేకుండా.. 'హైడ్రోస్టాటిక్‌ రిడక్షన్‌' పద్ధతిలో మలద్వారం గుండా పీడనంతో నీటిని పంపించటం ద్వారా దీన్ని సరిచెయ్యచ్చు. వేగంగా ప్రవహిస్తున్న నీరు.. పెద్దపేగులోకి చొచ్చుకొస్తున్న చిన్నపేగును వెనక్కి నెడుతుంది. ఇది సత్ఫలితాన్ని ఇవ్వకపోతే ఆపరేషన్‌ ద్వారా సరిచేయాల్సి ఉంటుంది.

*పేగుల్లో పిలకలు (జువెనైల్‌ పాలిప్స్‌): కొందరు పిల్లల్లో పేగుల్లోని గోడలకు చిన్న చిన్న పిలకలు మొలుస్తుంటాయి. ఇవి రక్తస్రావానికి దారి తీస్తాయి. ఆ రక్తం మలం పైన చారలుగా కనబడుతుంది. 2-8 ఏళ్ల మధ్యవయసు పిల్లల్లో నొప్పి లేకుండా మలద్వారం నుంచి రక్తం పడటానికి ఈ పిలకలే ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇవి చాలావరకు పెద్దపేగు చివరిభాగంలో (రెక్టో-సిగ్మాయిడ్‌) కనబడతాయి. ఈ పిలకలు తమకు తాముగా ఊడినప్పుడో, గట్టిగా మలవిసర్జన జరిగి ఇవి ఒరుసుకున్నప్పుడో వీటి నుంచి రక్తస్రావమవుతుంది. ఈ పిలకలు ఒకటే ఉంటే ఎండోస్కోపీ ద్వారాగానీ, సర్జరీతోగానీ తేలికగా తొలగించవచ్చు. చాలా పిలకలుండి, పేగుల్లో కొంతమేర ఆక్రమించి ఉంటే సర్జరీతో ఆ కొంతమేరా పేగును తొలగించాల్సి ఉంటుంది. పిలకలు ఎక్కువుంటే క్యాన్సర్‌ లక్షణాలున్నాయేమో చూడటమూ అవసరం.

*రక్తనాళాల లోపాలు (యాంజియో డిస్‌ప్లేసియా): పేగులకు రక్తసరఫరా చేసే నాళాల్లో లోపాలు కూడా మలద్వారం గుండా రక్తానికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు ఈ రక్తనాళాలు పేగుల్లో ఎక్కడోచోట ఉండలా బయటకు తోసుకొచ్చినట్లుంటాయి. అక్కడ పుండు పడటమో లేదంటే గాయం కావటం వల్లనో, ఇతరత్రా రక్తస్రావ సమస్యల వల్లనో రక్తం పడొచ్చు. ఎండోస్కోపీతో గానీ యాంజియోగ్రామ్‌ ద్వారా గానీ రక్తనాళాల లోపాలను గుర్తించొచ్చు. ఆపరేషన్‌ ద్వారా లోపాలు గల పేగు భాగాన్ని తీసేసి సరిచేస్తారు.

* పేగుల్లో వాపు, కణక్షయం (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌): సాధారణంగా ఇది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కనిపిస్తుంది. నెలలోపే.. పిల్లలకు పాలు పట్టిన తర్వాత మొదలవుతుంది. పాలు పేగుల్లో నిల్వ ఉండిపోవటం వల్ల.. పేగుల గోడల్లో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటం.. ఫలితంగా పుండు, రక్తస్రావం, రంధ్రం పడటం వంటి వాటికి దారితీస్తుంది.
పేగుల్లో వాపుతో బాధపడే పిల్లలు స్తబ్ధుగా ఉంటారు. పాలు తాగటానికి ఇష్టపడరు. కడుపుబ్బరం ఉంటుంది. తొలిదశలో పేగుల్లో వాపును గుర్తిస్తే యాంటీబయోటిక్స్‌ వంటివాటితో చికిత్స చేస్తే తగ్గిపోతుంది. కణాలు క్షీణిస్తుండటం, గ్యాంగ్రీన్‌ లేదా రంధ్రం పడటం వంటివి తలెత్తితే ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది.

*యాంటీబయోటిక్స్‌: కొన్నిసార్లు యాంపిసిలిన్‌, రిఫమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌, ఇనుము వంటి మందులతో పాటు చాక్‌లెట్లు, కొన్నిరకాల బీట్‌రూట్‌ దుంపల వంటివి తిన్నప్పుడూ మలంలో రక్తం మాదిరిగా ఎర్రటి చారలు కనిపిస్తాయి.

* పేగుల్లో అడ్డంకి: ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే పేగులు ఉబ్బటం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీంతో లోపల రక్తస్రావం కావటం, చివరికి రక్త ప్రసరణ తగ్గటం వల్ల పేగుల్లో గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. పేగుల్లో అడ్డంకి కారణంగా మలద్వారం నుంచి రక్తం పడుతోందంటే అప్పటికే గ్యాంగ్రీన్‌ ఉందని అనుకోవచ్చు.

*ఆహారం పడకపోవటం: ఫుడ్‌ అలర్జీ వల్ల కూడా మలంలో రక్తం పడుతుంది. వీరిలో ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతులు, విరేచనాలు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పోషణ లోపం కూడా ఉండొచ్చు. కొందరిలో ఆవు పాలు, సోయా ప్రోటీన్ల వంటివి అలర్జీకి కారణం కావొచ్చు.


 • --Dr.A,Narendrakumar (Paediatrician -Nelofer children hospital HYD)(Courtesy with Eenadu sukhibhava)

 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 26, 2012

Proteins,మాంసకృత్తులుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మాంసకృత్తులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శరీరంలోని ప్రతీ కణం మాంసకృత్తుల మీద ఆధారపడుతుంది. మాంసకృత్తులు కండరాలకు, ప్రతీ అంగానికి గ్లాండ్స్ కు అన్నీటికీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. శారీరక నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.

మాంసకృత్తులు జీవుల శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధాలు. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, లేదా ప్రోటీన్‌లు (Proteins) అనీ కూడ పిలుస్తారు. గ్రీకు భాషలో protos అంటే 'ముఖ్యమైనది' అనే అర్ధం వస్తుంది. సంస్కృతంలోనూ, తెలుగులోనూ ప్రాణ్యాక్షరాలు అంటే ముఖ్యమైన అక్షరాలు - లేదా - అచ్చులు అనే వాడుక ఉంది. భాష కట్టడికి అచ్చులు ఎంత ముఖ్యమో శరీర నిర్మాణానికి అంతే ముఖ్యమయిన ఈ రసాయనాలని 'ప్రాణ్యములు' అనటం సముచితం. పోషక పదార్ధాలయిన ఈ ప్రాణ్యములు మాంసంలో ఉంటాయి, పప్పులలో ఉంటాయి, పాలల్లో ఉంటాయి - ఆఖరికి చిన్న చిన్న మోతాదులలో బియ్యంలోనూ, గోధుమలలోనూ కూడ ఉంటాయి.
గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

చరిత్ర

కర్బన రసాయనం (organic chemistry), జీవ రసాయనం (biochemistry) దరిదాపుగా ఒకే సారి పుట్టేయనవచ్చు. సర్వసాధారణంగా వేడి చేసినప్పుడు ఘన పదార్ధాలు కరిగి ద్రవ రూపం చెందుతాయి. మంచు కరిగి నీరు అవుతుంది. వెన్న కాచితే నెయ్యి అవుతుంది. కాని కోడి గుడ్డుని కొట్టి సొనని పెనం మీద వేస్తే గట్టిపడుతుంది. రక్తాన్ని వేడి చేస్తే గడ్డ కడుతుంది. పాలని ఇగరబెడితే కోవా అవుతుంది. అంటే కొన్ని పదార్ధాలు వేడి చేస్తే కరుగుతాయి, కొన్ని వేడి చేస్తే పేరుకుంటాయి. ఇలా వేడి చేస్తే పేరుకునే పదార్ధాలకి సొనలు (albumins) అని పేరు పెట్టేరు. సొనల మీద పరిశోధన సాగిన కొత్తలో సొనలలో ఒక కొత్త రకం రసాయనం పదే పదే కనిపించటం మొదలయింది. దానిని విశ్లేషించి చూడగా దాని సాంఖ్యక్రమం (empirical formula) C40H62O12N10 అని తేలింది. అంటే ఒక బణువు (molecule)లో 40 కర్బనపు అణువులు, 62 ఉదజని అణువులు, 12 ఆమ్లజని అణువులు, 10 నత్రజని అణువులు ఉన్నాయన్న మాట. సొనలన్నిటిలోనూ తారసపడుతూన్న ఈ పదార్ధం కర్బనోదకం (carbohydrate) కాదు, కొవ్వు (fat) కాదు - ఎందుకంటే కర్బనోదకాలలోనూ, కొవ్వులలోనూ నత్రజని (nitrogen) ఉండదు. ఈ సొనలలో నత్రజని కనిపిస్తోంది. అంతే కాదు. ఈ కొత్త రకం బణువులు చాల పెద్దవిగా కూడ కనిపిస్తున్నాయి. ఇదేదో ముఖ్యమైన పదార్ధం అయి ఉండాలనిన్నీ, జీవి యొక్క జన్మ రహశ్యం మూడొంతులు ఇందులో ఇమిడి ఉండొచనిన్నీ ఊహించి బెర్‌జీలియస్‌ (Berzelius) దీనికి ప్రోటీన్‌ (అంటే, ముఖ్యమైనది) అని నామకరణం చేసేరు. బెర్‌జీలియస్‌ ఊహించినట్లుగా ఈ ప్రాణ్యం మన మనుగడకి చాల ముఖ్యమయిన పదార్ధం అని తేలింది. కాని, బెర్‌జీలియస్‌ అనుకున్నట్లు జీవి యొక్క రహశ్యం ఈ బణువులో లేదని కూడ తేలింది. ఆ గౌరవం DNA అనబడే మరొక బృహత్ అణువుకి దక్కింది.


ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :
* మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.

* శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు.
* ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
* వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.

*16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం.
* అదే విధంగా 16 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.
* గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక రోజుకు
* పాలిచ్చే తల్లులకు/బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు 1 రోజుకు

ఆహార పదార్ధాలు ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో
సోయాబీన్స్ --------------------------------43.2
శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు -- 22
వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు ----------------23
చేపలు --------------------------------20
మాంసము --------------------------------22
ఆవు పాలు --------------------------------3.2
గేదె పాలు --------------------------------4.3
కోడిగుడ్డు ( సుమారు 44 గ్రాములు) ----------------13.3 (ఒక గుడ్డుకు)

మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ముఖ్యంగా ఉండవలసిన పోషక పదార్ధాలు. నాణ్యతని బట్టి రెండు వర్గాలుగా విడగొడతారు. ప్రధమ శ్రేణి ప్రోటీన్లు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరులనుండి లభిస్తాయి. వీటిని ప్రధమ శ్రేణి అని ఎందుకు అన్నారంటే వీటన్నిటిలోనూ అత్యవసర నవామ్లాలు (essential amino acids) తప్పకుండా ఉంటాయి. మాంసాహారులు ఏ ఒక్క మాంసం తిన్నా అది సంపూర్ణ ఆహారంగా చెలామణీ అయిపోతుంది. ద్వితీయ శ్రేణి ప్రోటీన్లు- పప్పులు, కాయగూరలు, మొదలైన వాటిలో దొరికేవి. వీటిలో, ఏ ఒక్క దాంట్లోనూ, అత్యవసర (9)నవామ్లాలు అన్నీ లభించవు. కనుక శాకాహారులు నాలుగు రకాల వస్తువులు ఒకే భోజనంలో తింటే తప్ప నవామ్లాలన్నీ సరఫరా కావు. పక్కా శాకాహారులు (pure vegetarians or vegans) - అంటే జంతు సంతతికి చెందిన పాలు, వగైరాలు కూడ ముట్టని వారు - పోషణ విషయంలో అప్రమత్తతతో ఉండాలి. పప్పు, అందులో నెయ్యి, కూర, పచ్చడి, పులుసు, పాలు, పెరుగు, మజ్జిగ మొదలయిన హంగులన్నీ ఉంటే కాని శాకాహారం సంపూర్ణం కాదు.

మనం మాంసం తిన్నా, పప్పు, అన్నం తిన్నా అవి తిన్నగా రక్తంలో ప్రవేశించవు. మనం తిన్న పోషక పదార్ధాలలో ఉన్న సారాన్ని గ్రహించి, దాన్ని ముడి పదార్ధంగా వాడి శరీరం తనకి కావలసిన ప్రాణ్యములని తనే తయారు చేసికొంటుంది. చాలా వరకు సూక్ష్మజీవులు, మొక్కలు అన్ని నవామ్లాలని తయారుచేసుకోగలవు. కాని జంతువులు మాత్రం వీటిలో కొన్నింటిని ఆహారం ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఈ అత్యవసర నవామ్లాలు కొన్నింటిని, అవసరం కొద్దీ , తినే ఆహారంతో తప్పకుండా తీసుకోవాలి.


మనిషి శరీరానికి 22 రకాల అమీనో ఆమ్లాల కలబోతతో తయ్యారైన ప్రొటీను అవసరము .
రెండు రకాల అమీనో ఆమ్లాలు - అత్యవసరమైనవి(essential amino acids), అత్యవసరం కానివి (Non-essential amino acids). అవసరమైనవి శరీరం తయారు చేకోలేదు . వీటిని పౌష్టికాహారం ద్వారా పొందాల్సిందే. నాన్ ఎసన్షియల్ అమీనో ఆంమ్లాలు శరీరం తయారు చేస్కుంటుంది .

ప్రొటీనుల్లో రెండు రకాలు -
పూర్తి ప్రొటీను (కంప్లీట్ ప్రొటీన్లు ) - ఎసన్షియల్ అనగా అవసరమైన అమీనో ఆంమ్లాలు కలిగినవి. గుడ్లు, పాలు, చేపలు, మాంసం, ఇత్యాదివాటి నుండి పొందవచ్చు
అసంపూర్ణ ప్రొటీను(incomplete) - కావల్సిన అమీనో ఆంమ్లాలన్నీ లేనిది. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు లాంటివి.

ఇది గమనించండి - బరువు తగ్గే మార్గంలో ప్రొటీను ఎక్కువ కేలరీలలో తింటుంటే అది మూత్రపిండాలపై తీవ్ర ప్రతాపం చూపుతుంది .

మంచి ప్రొటీన్ మూలాలు -
బందికానాలో పెరగని కోళ్ళు- వాటి గుడ్లు,
హార్మోనులు ఇవ్వకుండా, యాంటి బైయాటిక్స్ ఇవ్వకుండా, సాధారణ స్థితుల్లో గడ్డి గాదెం తింటూ పెరిగిన వాటినుండి వచ్చిన మాంసం,
పాశ్చరైజ్ చేయని ముడి పాల ఉత్పత్తులు,
సముద్రంలో సహజమైన కండీషన్స్ లో పెరిగే మెర్కురీ లేని చేపలు,
మొలకెత్తిన విత్తనాలు,
బీన్స్,
ముడి ధాన్యాలు,

మరి బ్యాడ్ ప్రొటీన్ అనగానేమీ?
వ్యవసాయాధారిత పరిశ్రమల ఉత్పత్తులు పై గుడ్ ప్రొటీన్ ని బ్యాడ్ ప్రొటీన్ గా మారుస్తాయి.

ఉదహరణ -
ఒక ఎకరాకి పది జీవాలని పెంచవససిఉంటే , వంద జీవాల్ని కట్టేసి హార్మోన్స్ ఇచ్చి, అసహజ పద్ధతుల ద్వరా ఉత్పత్తి చెసే మాంసాహారాలు తక్కువ క్వాలిటీ ప్రొటీనుతో ఉంటాయి .

బంధికానాలో పెంచబడే కోళ్ళు, సహజసిద్ధమైన ఆహారం పెట్టకుండా పెంచినవి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంచితే అనారోగ్యాలతో ఉంటాయి అవి, కలుషిత ఆహారంగా మారతాయి.

మ్యాక్ డోనాల్డ్స్, కేయఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెణీలు అత్యంత హేయమైన కండీషన్స్ లో మాంసాన్ని ఉత్పత్తి చెస్తాయి.

ఫాం రైజ్ద్ చేపలు అసహజ వతావరణంలో పెంచబడినవాటిల్లో ఒమెగా-3 ఎసన్షియల్ ఫ్యాటీ ఆంలం అతి తక్కువ లేక అస్సలు లేకపోవతం కూడా జరుగుతుందట


ఇంకా కొంత సమాచారము కోసం చదవండి -> మాంసకృత్తులు .
 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, March 25, 2012

Acupuncture health system,ఆక్యుపంచర్ వైద్య విధానం .


 • image : courtesy with Wikipedia.Org.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -,ఆక్యుపంచర్ వైద్య విధానం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • చైనా సంప్రదాయ వైద్య విధానాలలో, ఆక్యుపంచర్‌ వైద్య విధానము ఒకటి . దీనిని భారతీయ ప్రాచీన వైద్య విధానం అని కూడా అంటారు . . చిన్న చిన్న వైద్యవిధానాలను అనుసరించి మనం ఆరోగ్యంగా ఉండవచ్హు. అందులో ఒక వైద్య విధానమే...ఆక్యుపంచర్.

మహాభారత యుద్ధకాలంలో భీష్ముడు అంపశయ్యపై ఊపిరిపోసుకున్న నేపథ్యంలో ఆక్యుపంచర్‌ వైద్యం ప్రాచుర్యం పొందిందనేది వైద్యుల మాట. అతి తక్కువఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఈ వైద్యం ద్వారా నయం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని వారికి ఆక్యుపంచర్‌ థెరపీ సంజీవని లాంటిది. అంతేకాదు లక్షలు వెచ్చించి వైద్యకోర్సులను అభ్యసించలేని వారికి ఆక్యుపంచర్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండి) వంటి పిజి కోర్సులను అభ్యసించిన పలువురు ఈ రంగంలో రాణిస్తున్నారు. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల వ్యాధులనుండి విముక్తి పొందవచ్చు. సామాన్యులకు అందుబాటులో లేని ఈ వైద్యాన్ని ప్రస్తుతం అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడ నగరంలో పవిత్ర అకాడమి వారు కళాశాలను ఏర్పాటు చేసారు. మొగల్రాజపురంలో పవిత్ర అకాడమి మెడికల్‌ ఆక్యుపంక్చర్‌ కళాశాలను నెలకొల్పారు.

 • ఆక్యుపంచర్-ప్రసూతి వైద్యం :
కొన్ని వేల సంవత్సరాలుగా బాధా నివారణకోసం, వ్యసనాల నుంచి విముక్తి చేయడంకోసం, వాంతుల నివారణకోసం, ఇంకా ఇతర వ్యాధుల చికిత్స కోసం సూదిపొడుపు వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రసూతి వైద్యంలో, ముఖ్యంగా నొప్పులను నియంత్రించడంలో దీని ఉపయోగం గురించి చెప్పుకోదగిన అద్యయనాలేవీ అందుబాటులో లేవు. ఎంత సమర్థంగా పనిచేస్తుందో రుజువు చేసే ఆధారాలు లేవు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతున్నది. శస్త్ర చికిత్స, నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఆ అసమతౌల్యం బాధను, ఇబ్బందిని కలిగిస్తుంది. శస్త్ర చికిత్స లేక నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులను పొడవడం ద్వారా శక్తిని సరైన మార్గంలోకి మళ్లేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంచనా ప్రకారం, ఆక్యుపంచర్ ఈ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. లేక శరీరంలో సహజంగానే బాధానివారణ రసాయనాలను ఉత్త్పత్తి చేస్తుంది.

 • టెక్నిక్:

ఈ చికిత్సా విధానంలో నిపుణుడైన ఆక్యుపంచర్ వైద్యుడు పేషంటు దేహంలోని కీలకమైన శక్తి బిందువుల వద్ద చర్మం కింది భాగంలో శుద్దిచేసిన మంచి సూదులను గుచ్చుతారు. ఒక్కో బిందువు వద్ద ఒక్కో వ్యవధిలో సూదులను శరీరంలో ఉంచుతారు. కొన్నిసార్లు సూదుల ద్వారా తక్కువ తీవ్రతతో విద్యుత్ ప్రవాహాన్నీ పంపించి, బాధ తీవ్రతను నియంత్రించడానికి కృషి చేస్తారు. ప్రసూతికి చాలా వారాల ముందు నుంచే వారానికి గంట చొప్పున ఆక్యుపంచర్ చేయవచ్చు.

 • పరిమితులు:

* ఆక్యుపంచర్ వైద్యుడు మాత్రమే సూదులను ప్రయోగించవలసి ఉంటుంది.
* సూదులు గుచ్చిన చోట అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.
* నొప్పుల సమయంలో సూదులు గుచ్చితే,తల్లి అటూ ఇటూ కదలడం కష్టమవుతుంది.
* ఆక్యుపంచర్ వల్ల బాధ తగ్గడం కంటే, కడుపులో వికారం కలిగి తొందరగా ప్రసవం జరగడానికి వీలు కలిగే అవకాశం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
* ఆక్యుపంచర్ బాధా నివారణ ఔషధాల వినియోగం, స్థానికంగా మత్తు ఇవ్వడం(రీజినల్ అనస్తీసియా) వంటి వాటిని తగ్గించిన దాఖలాలు తక్కువ.

ఆక్యుపంచర్ వల్ల శరీరంలో సహజ బాధానివారణ రసాయనాలేవి(ఎండోమార్ఫిన్స్) జనించడంలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక ప్రసూతికి ముందు వారాల తరబడి
ఆక్యుపంచర్ చికిత్స తీసుకున్నవారిలో తొలిదశ నొప్పుల్ వ్యవధి తగ్గిపోయిందని కూడా ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను కచ్చితమైనవిగా పరిగణించడానికి లేదు. ఈ అంశంపై సందేహాలను తొలగించడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది. ఇటీవల స్వీడన్ లో ఒక అధ్యయనం జరిగింది. స్వీడిష్ ప్రసూతి వైద్యులు గర్భిణులపై నాలుగురోజులపాటు ఆక్యుపంచర్ ఉపయోగించి చూశారు. ఆక్యుపంచర్ తీసుకున్న మహిళలల్లో ఎప్పటిలాగే సగం మంది ఎపిడ్యురల్ అనస్తీసియాను కోరుకున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. బాధా నివారణకోసం నాడీ స్పందనలను పెంచే చికిత్సలనో, వేడి బియ్యం సంచిని ఉపయోగించే విధానాన్నో వారు కోరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలినట్టు బ్రిటిష్ జోర్నల్ ఆఫ్ అబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ తాజా సంచిక పేర్కొంది.

 • ---/భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

ప్రకృతి వైద్యము,Naturopathy


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ప్రకృతి వైద్యము-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఒక వైద్యవిధానములో లొంగని. జబ్బు మరొక విధానములో తగ్గవచ్చును . ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే. దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశం తో ఎర్పడింది. భూమి శరీరంలోని ఘన భాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరి ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని , ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది. పకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించడం మరియు రోగం నుండి విముక్తి కలిగించే శక్తి వుంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతి లో వుంది. ఆహారం మరియు పంచభూతాల చికిత్స తప్ప ఇంక వేరే మందులు వుండవు.

 • ప్రకృతి వైద్యము చికిత్స పద్ధతులు

మర్ధన : ఇది మనస్సుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగు మెరుగు చేస్తుంది. నొప్పిని తగ్గించటానికి, కొవ్వు కరిగించటానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది.

 • నీటి చికిత్స : నీటిని, వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు (ఆవిరి స్నానం , వెన్ను , తుంటి, చేయి, కాలు కోసం స్నానం), నీటితో ఎనీమా వివిధ రకాలు.

మన్ను చికిత్స : మన్ను శరీరంనుండి విష పదార్ధాలను గ్రహించి, చల్ల దనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులకు చంపే శక్తి కూడా మన్నుకి వుంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలెర్జీలకు బాగా పని చేస్తుంది.
 • ఫథ్యం చికిత్స : నియమిత ఆహారం ద్వారా అరోగ్యాన్ని పొందవచ్చు. వివిధరకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్లు వాడుతారు.

యోగా చికిత్స : ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి దీనిలో వున్నాయి.
 • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 24, 2012

మూలికా వైద్యము,హెర్బలిజం ,Herbalism
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూలికా వైద్యము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


హెర్బలిజం (Herbalism) అనేది మొక్కలు లేదా మొక్కల నుంచి సేకరించిన పదార్ధములను వాడి చేసే ఒక సంప్రదాయ వైద్య విధానము లేదా గ్రామీణ వైద్య విధానము. హెర్బలిజం ను బొటానికల్ ఔషదము , మెడికల్ హెర్బలిజం , మూలికా వైద్యము , హెర్బాలజీ మరియు ఫైటోథెరపీ అని కూడా అంటారు. మూలికా వైద్యములో
ఒక్కోసారి శిలీంద్ర సంబంధ పదార్దములు మరియు తేనే టీగల ఉత్పత్తులు ఇంకా ఖనిజ లవణములు, గుల్లలు మరియు కొన్ని జంతువుల ప్రత్యేక భాగములు వంటివి కూడా వాడబడతాయి. ఔషధ వృక్ష శాస్త్రం అనేది సహజవనరుల నుంచి తయారు చేయబడిన ఔషధాల గురించి చేసే ఒక అధ్యయనము.

సాంప్రదాయకముగా మందులను వాడడము అనేది భవిష్యత్తులో రాబోయే క్తివంతమైన మందుల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. 2001 లో , ఖ్యమైన
ఔషధములలో వాడబడిన 122 మిశ్రమ ధాతువులు "ఎథ్నోమెడికల్" మొక్కల నుంచి తీసుకోబడ్డాయి అని పరిశోధకులు కనిపెట్టారు; వీటిలో 80% వరకు మిశ్రమ ధాతువులు
సంప్రదాయ ఎథ్నో మెడికల్ వాడుక లానే వాడారు లేదా దానికి సంబంధము కలిగినట్లుగా వాడారు.

పురుగులు, శిలీంద్రాలు మరియు మొక్కలను తినే క్షీరదముల వలన జరిగే దాడుల నుంచి మొక్కలు తమను తాము రక్షించుకోవడానికి సహాయము చేసే రసాయనిక
మిశ్రమములను తమంత తామే తయారు చేసుకోగలిగిన శక్తిని పరిణామక్రమములో వికసింప చేసుకున్నాయి. అనుహ్యముగా ఇలా మొక్కలను తినే వాటికి విషంతో సమానము అయిన ఈ రసాయన పదార్దములు, అదే సమయములో మానవుల జబ్బులను నయం చేయడానికి వాడబడినప్పుడు ఎంతో ఉపయోగకరముగా ఉన్నాయి. అలాంటి ద్వితీయ వర్గమునకు చెందిన జీవన క్రియలో పాల్గొనే పదార్దములు వాటి నిర్మాణములో ఎంతో వ్యత్యాసము కలిగి ఉంటాయి, వాటిలో చాలా వరకు పరిమళ భరిత పదార్ధములుగా ఉన్నాయి, వాటిలో కూడా చాలా వరకు క్రిమి నాశినిలుగా కానీ లేదా ఎక్కువ ప్రాణ వాయువు నింపబడిన వాటి నుండి తీసుకోబడిన పదార్ధములుగా కానీ ఉంటాయి. ఇప్పటివరకు కనీసము 12,000 వరకు వేరు వేరుగా కనిపెట్టబడ్డాయి; ఈ సంఖ్య అసలు మొత్తము ఉన్న వాటిలో 10% కంటే కూడా తక్కువ అని అంచనా వేయబడినది. మొక్కలలోని రసాయనిక మిశ్రమములు మానవ శరీరములో లోని గ్రాహక కణములను కలిపి ఉంచడము ద్వారా తమ మధ్య ప్రభావమును చూపిస్తాయి; ఇది సంప్రదాయ ఔషధములలో చక్కగా అర్ధము చేసుకోబడి ఉన్న పద్ధతి లాంటిదే మరియు పని తీరు విషయములో మూలికా వైద్యము మరియు సంప్రదాయ వైద్యముల మధ్య ఎక్కువ తేడా ఏమీ ఉండదు. దీని వలన మూలికా వైద్యము సంప్రదాయ ఔషధముల లానే చాలా ముఖ్యమైనది అవుతుంది, అలానే పని చేస్తుంది మరియు వాటి లానే కొన్నిసార్లు అవాంఛనీయమైన దుష్పరిణామములు కలిగించగలదు కూడా. మానవుల చేత ఆహరమునకు అధిక హంగులు చేర్చడము కొరకు వాడబడే అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యములు వంటివి కూడా చాలా ఔషధ విలువలు కలిగి ఉంటాయి.

అలాగే డాక్టర్ చేత సూచించబడిన మందుల కంటే, పెద్ద సంఖ్యలో మూలికలు అవాంఛనీయ ఫలితములను కలిగిస్తాయి అని భావిస్తున్నారు. అంతే కాకుండా, "కల్తీ చేయబడడము, సరైన పాళ్ళలో మిశ్రమములు కలపబడక పోవడము లేదా మొక్క గురించి సరైన అవగాహన లేకపోవడము మరియు ఒక ఔషధము వేరే వాటితో కలిసినప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయము గురించి సరిగా తెలుసుకోకపోవడము వంటివి ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితికి లేదా పూర్తిగా ప్రాణము పోయేలా చేయగలిగిన అవాంఛనీయ ఫలితములకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, సంప్రదాయ ఔషధముల GP పరిశోధనలలో వచ్చే 20% ADR లతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ. ఇంకా ADR ల వలన వైద్యశాలలో చేరవలసిన అవసరము 6-7% వరకు కల్పించే వాటికంటే తక్కువ. చక్కగా తయారు చేయబడిన మూలికల ఉత్పత్తులు ఇతర ఔషధముల కంటే గణనీయముగా తక్కువ ADR మరియు/లేదా అవాంఛనీయ ఫలితములు కలిగి ఉంటాయి.

 • పరిశోధనా శాస్త్రము

అన్ని ఖండముల ప్రజలు వందలు మరియు వేల సంఖ్యలో తమ తమ స్వదేశీయ మొక్కలను ఎన్నో రకముల వ్యాధుల నివారణకు చరిత్రకు అందని సమయము నుంచి

వాడుతూనే ఉన్నారు. 5,300 సంవత్సరముల కంటే ఎక్కువ సంవత్సరముల పాటు ఒట్జాల్ ఆల్ప్స్ లోని మంచులో కూరుకు పోయిన ఓత్జి ది ఐస్మాన్ శరీరము యొక్క స్వంత ప్రభావములో వైద్యము కొరకు వాడబడే మూలికలు కనుగొనబడ్డాయి. ఈ మూలికలు అతని ప్రేగులలో ఉన్న పరాన్న జీవుల నుండి విముక్తి కల్పించడానికి వాడినట్లుగా కనిపిస్తున్నది. మానవ జాతులపై పరిశోధన చేసేవారు జంతువులు అనారోగ్యమునకు గురి అయినప్పుడు చేదుగా ఉండే మొక్కల భాగములు తినడానికి మొగ్గు చూపుతాయి అని ప్రతిపాదించారు. స్వదేశీ వైద్యము చేసేవారు తాము అనారోగ్యముగా ఉన్న జంతువులు అంతకు మునుపు సాధారణముగా తినడానికి ఇష్టపడని చేదు మూలికలను కొంచెం కొంచెంగా తినడము చూసి వైద్యము నేర్చుకున్నామని తరచుగా చెపుతూ ఉంటారు. ఫీల్డ్ లో తిరిగి చెప్పే జీవ శాస్త్రవేత్తలు తాము చింపాంజీలు, కోళ్ళు, గొర్రెలు మరియు సీతాకోక చిలుకలు వంటి వేరు వేరు జాతుల ప్రాణులను బాగా గమనించి బలమైన ఆధారములను ఇచ్చారు. లోవ్లాండ్ గొరిల్లా లు తమ ఆహారములో 90% వరకు ఆఫ్రామోముం మేలేగ్యుట పండ్ల నుంచి తీసుకుంటాయి, ఇవి అల్లము మొక్కకు సంబంధం కలిగినవి, ఇది చాలా గొప్ప సూక్ష్మ జీవుల నాశిని మరియు చీము, రక్తము కారడము, రక్త విరోచనములు అవ్వడము వంటి
వాటిని మరియు అలాంటి ఇతర సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధులను ఎంతో దూరంగా ఉంచగలుగుతుంది. ప్రస్తుతము జరుగుతున్న అధ్యనములు ఈ మొక్కలు బహుశా గొరిల్లాలకు సోకితే చాలా ప్రమాదకరము అయిన కారణము తెలియకుండా గుండె కండరముల అభివృద్దిని ఆటంకపరిచే జబ్బు నుంచి కూడా రక్షణ కల్పించ గలుగుతున్నదా అనే విషయము పై దృష్టి సారిస్తున్నాయి.

ఓహియో వెస్లియన్ విశ్వ విద్యాలయము నకు చెందిన పరిశోధకులు కొన్ని పక్షులు తమ పిల్లలకు హాని కలిగించే సూక్ష్మ జీవుల నుండి రక్షణ కల్పించడానికి గూడు అల్లేటప్పుడు పరాన్న జీవులను నాశనము చేయగలిగిన కారకములను చాలా ఎక్కువగా వాడతాయి అని కనిపెట్టారు. అనారోగ్యముతో ఉన్న జంతువులు టన్నిన్స్ మరియు ఆల్కలాయిడ్లు వంటి రెండవ తరహా జీవ క్రియకు చెందిన పదార్ధములను కలిగిన మొక్కలను మేతగా తీసుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఈ ఫైటో కెమికల్స్ లో సాధారణముగా యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ హెల్మిన్టిక్ లక్షణములు కలిగి ఉంటాయి కాబట్టి అడవిలో జంతువులు తమంత తామే వైద్యము చేసుకుంటున్నాయి అనడము హేతుబద్దము గానే ఉన్నది

చరిత్ర

మొక్కలను ఔషధములుగా వాడడము అనేది మానవ చరిత్ర వ్రాయడము మొదలు పెట్టక మునుపే మొదలైంది. ఉత్తర ఇరాక్ లోని 60 000-సంవత్సరముల పూర్వపు
నియాన్డేర్తల్ లను పూడ్చి పెట్టె స్థలము "షానిదర్-4 " లో ఎనిమిది రకముల మొక్కల యొక్క పుప్పొడి రేణువులు పెద్ద మొత్తములో దొరికాయి, వాటిలో 7 ప్రస్తుతము మూలికా వైద్యములో ఔషధముగా వాడబడుతున్నాయి. రాత పూర్వకముగా నమోదు చేయబడిన దాని ప్రకారము, మూలికలను గురించిన అధ్యయనము అనేది 5,000 ల పూర్వము సుమేర్ఎయన్స్ చేయబడినది, వీరు పొన్న చెట్టు వంటి ఒక చెట్టు, సోపు గింజలు మరియు వాము పువ్వు ఇచ్చే చెట్టు వంటి వాటి ఔషధ గుణములను చక్కగా అర్ధమయ్యేలా తెలిపారు. 1000 B.C. కు చెందిన ప్రాచీన ఈజిప్షియన్ ఔషధములు వెల్లుల్లి, నల్ల మందు , ఆముదము నూనె , ధనియాలు, పుదీనా, నీలిమందు మరియు ఇతర మూలికలను ఔషధములుగా వాడినట్లు తెలుస్తోంది, మరియు ఒక పాత శాసనము ప్రకారము మాన్డ్రేక్ చెట్టు , వేట్చ్ చెట్టు , సోపు గింజలు , గోధుమ, బార్లీ మరియు రై వంటి వాటితో సహా చాలా మూలికల వాడకము మరియు పెంపకము వంటి వాటి గురించి తెలుస్తోంది.

భారతీయ ఆయుర్వేద ఔషధములు పసుపు వంటి చాలా మూలికలను దాదాపు 1900 B.C. నుంచే వాడుతున్నారు. ఇంకా ఆయుర్వేదములో వాడబడిన వనమూలికలు మరియు ఖనిజ లవణముల గురించి ఆ తరువాతి కాలములో ప్రాచీన భారత దేశ మూలికా శాస్త్రవేత్తలైన చరకుడు మరియు సుశ్రుతుడు వంటివారు మొదటి మిలీనియం BC సమయములోనే వివరించారు . ఆరవ శతాబ్దము BC లోని సుశ్రుతునికి చెందినదిగా చెప్పబడుతున్న సుశ్రుత సంహిత పుస్తకం 700 ఔషధ మొక్కలు, ఖనిజ లవణముల నుండి తయారు చేసే 64 రకముల కషాయముల వంటి మందులు మరియు వివిధ జంతువుల ఆధారముతో చేసే 57 రకముల కషాయముల వంటి వాటిని గురించి వివరించింది. ఔషధములుగా వాడబడుతున్న మొక్కల ఉదాహరణలు

కొన్ని మూలికల వైద్యములు సరైన పరీక్ష లేని కారణముగా కావచ్చును, సరైన మంచి ప్రభావమును మానవులపై చూపలేవు. చాలా అధ్యయనములు జంతువులలో కానీ లేదా పరీక్ష నాళములలో కానీ జరుపబడినవి, కాబట్టి బలమైన ఆధారముగా సమర్ధన చేయలేవు.

* కలబంద సంప్రదాయముగా కాలిన గాయములు మరియు పుండ్లు తగ్గడానికి వాడబడుతున్నది. ఒక క్రమానుసారముగా చేసిన రివ్యూ (1999 నుండి) పుండును తగ్గించడములో కలబంద యొక్క సామర్ధ్యం స్పస్టముగా తెలియడము లేదు అని తెలిపింది, ఆ తరువాతి రివ్యూ లో (2007 లో) మొదటి మరియు రెండవ స్థాయిలో ఉన్న కాలిన గాయాలు తగ్గడానికి కలబంద సహకరిస్తుంది అని తెలపడానికి చాలా ఆధారములు ఉన్నట్లుగా తెలిపింది.

* పరీక్ష నాళికలో మరియు చిన్న క్లినికల్ అధ్యయనములో కనిపెట్టబడిన దాని ప్రకారము ఆర్టిచొక్(సినారా కర్డున్క్యులస్ ) లు క్రొవ్వు తయారు అవ్వడమును తగ్గిస్తుంది అని తెలుస్తోంది.
* బ్లాక్ బెర్రీ (రుబుస్ ఫ్రూటికోసస్ )ఆకు సౌందర్య ఉత్పత్తులు చేసేవారి దృష్టిని ఆకర్షించింది, ఎందుకు అంటే ఈ ఆకు చర్మము ముడుత పడేలా చేసే మెటల్లోప్రోటీన్స్ లో జోక్యము చేసుకుంటుంది.
* బ్లాక్ రాప్స్బెరీ (రుబుస్ ఒసిడేన్టలిస్) నోటి రాచ పుండు రాకుండా నివారించగలదు.
* బుఫోన్ (బుఫోన్ దిస్తిచ ) ఈ అత్యంత విష పూరిత మొక్క దక్షిణ ఆఫ్రికా సంప్రదాయ వైద్యములో మానసిక అనారోగ్యమును నయము చేయడానికి వాడబడుతుంది. పరీక్ష నాళములలో మరియు బయట చేసిన పరిశోధనలలో అది మానసిక కుంగుబాటుకు వ్యతిరేకముగా ప్రభావము కలిగి ఉంది అని వివరముగా తెలిసింది.

* కలేన్ద్యుల (కలేన్ద్యులా అఫిసినాలిస్) అనేది సంప్రదాయముగా ఉదర సంబంధ వ్యాధులు మరియు మల బద్దకము వంటి వాటి నివారణకు వాడబడుతున్నది. జంతువుల పై చేసిన పరిశోధనలలో కలేన్ద్యులా అఫిసినాలిస్ పూవుల నుంచి సేకరించబడిన ఆక్వియస్-ఈథనాల్ స్పస్మోలిటిక్ మరియు స్పస్మోజేనిక్ రెంటిపై ప్రభావము కలిగి ఉంది అని తెలుస్తోంది, కాబట్టి దీని యొక్క సంప్రదాయ ఉపయోగమునకు ఒక సాంకేతిక అన్వయమును ఇచ్చింది. రేడియేషన్ ద్వారా వచ్చిన చర్మ సంబంధ ఇబ్బందులపై ప్రభావము చూపించే విషయములో కలేన్ద్యులా సారము లేదా అంజనము పని చేస్తుంది అని అనడానికి "కొంచెం సాక్షము" మాత్రమే ఉన్నది.

* క్రన్బెర్రీ (వాసినియం ఆక్సికోకోస్) తరచుగా కనిపిస్తున్న లక్షణములతో స్త్రీలలో వచ్చే మూత్ర నాళ సమస్యల నివారణకు బహుశా ప్రభావవంతముగా ఉండవచ్చు.
* ఎచినాసియా (ఎచినాసియా ఆన్గస్తిఫోలియా, ఎచినాసియా పల్లిడా, ఎచినాసియా పుర్పురియా ) ల నుంచి తీసుకోబడినవి రైనోవైరస్ జలుబుల తీవ్రత మరియు వచ్చే సమయమును నియంత్రించగలుగుతాయి; ఏది ఏమైనప్పటికీ, మందుల దుకాణములో వైద్యుని సలహా లేకున్నా ఇచ్చే మందుల కంటే సరైన మోతాదు తెలియాలంటే ఇంకా పరిశోధన అవసరము ఉన్నది.

Source : http://Wikipedia.Org.

For more details - click here -- > Mమూలికా వైద్యము
 • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 21, 2012

cholesterol level in our body, కొలెస్టిరాల్ అటు...ఇటుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cholesterol level in our body, కొలెస్టిరాల్ అటు...ఇటు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..

 • మానవ శరీరములో సహజముగా తయారయ్యే కొవ్వు పదార్ధము ... కొలెస్టిరాల్ . కాలేయములో తయారై రక్తప్రసరణలోకి చేరే కొలెస్టిరాల్ శరీరానికి మేలుచేస్తుంది . ఎన్నో హార్మోనులు తయారీకి సహకరిస్తుంది. అయితే కొలిస్టరాల్ మోతాదు మించి తయారైతే గుండెజబ్బులు , గుండెపోటుకు కారణమవుతుంది.
 • మనము తీసుకునే కొన్ని ఆహారపదార్ధాలు కొలెస్టిరాల్ ఉత్ప త్తిని పెంచుతాయి. పాలు , నెయ్యి, వెన్న , కేక్ లు , పేస్టీలు , జంతు మాంసం ఉత్పత్తులు వల్ల కొలెస్టిరాల్ పెరుగుతుంది . సముద్రపు జీవులు , పచ్చసొన తీసేసిన గుడ్లు వల్ల అంతగా ప్రమాదము ఉండదు . క్లెస్టిరాల్ అదుపులో ఉండాలంటే కూరగాయలు , పండ్లు ఆహారములో ప్రధానము గా తీసుకోవాలి. మీగడ తీసిన పాలు , దంపుడు బియ్యము , దంపుదు గోధుమలు లతో చేసిన పదార్ధములు తినాలి.
 •  
Food hints to avoid High cholesterol,ఒంట్లో కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గించుకోవడానికి ఆహారం సూచన్లు

ఒంట్లో కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఇప్పటికే వ్యాయామాల వంటివీ మొదలుపెట్టి ఉంటారు కూడా. అదొక్కటే సరిపోదు. తినే తిండి విషయంలోనూ అదుపు పాటించటం ఎంతో అవసరం. ముఖ్యంగా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు, విందు వినోదాల పేరిట హోటళ్లకు వెళ్లినపుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఒకపక్క నూనెలో వేయించిన పిండి వంటకాలు మరోపక్క మాంసం వంటి కొవ్వు పదార్థాలు నోరూరిస్తుంటాయి. ఇలాంటప్పుడు జిహ్వ చాపల్యాన్ని కొద్దిగా పక్కనపెట్టి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

* నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు.

* కొవ్వు ఎక్కువగా గల పదార్థాల కన్నా తక్కువ కొవ్వు పదార్థాలను ఇష్టపడటం అలవాటు చేసుకోవాలి. వేపుళ్లకు బదులు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తీసుకోవచ్చు. పైన బటర్‌, క్రీమ్‌తో అలంకరించిన తినుబండారాలకూ దూరంగా ఉండొచ్చు.

* కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్‌ మోతాదు మరింత పెరిగే ప్రమాదముంది. కాబట్టి వాటికి బదులు చేపలు, చికెన్‌ వంటివి తీసుకుంటే మంచిది.

* కూరల్లో అదనంగా ఉప్పు వేసుకోవటం ఏమంత మంచి అలవాటు కాదు. దీంతో మరింత ఎక్కువగా లాగించే అవకాశముంది. కాబట్టి అసలు ఉప్పు గిన్నెను టేబుల్‌ మీది లేకుండా చూసుకోవటం మేలు.

* అలాగే ఆహారాన్ని బాగా నములుతూ నెమ్మదిగా తినాలి. దీంతో ఎక్కువెక్కువ తినకుండా చూసుకోవచ్చు.

* ఇక భోజనం ముగిశాక ఐస్‌క్రీం వంటివి కాకుండా తాజా పళ్ల ముక్కలను తినే అలవాటు చేసుకోవాలి.
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, March 18, 2012

పచ్చకామెర్లు , Jaundice,Hepatitis


 • image : courtesy with Andhraprabha News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పచ్చకామెర్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి.

కామెర్లకు ముఖ్య కారణాలు 3.
ఒకటి రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తిగావడం. దీన్ని 'హీమోలిటిక్‌ జాండిస్‌' అంటారు.
రెండోది- ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్‌ లివర్‌ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని 'హెపాటిక్‌ జాండిస్‌' అని వ్యవహరిస్తారు.
మూడోది - లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్‌) ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం . దీన్ని 'అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌' అంటారు.

లివర్‌ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే 'హెపటైటిస్‌' అని వ్యవహరిస్తారు. హెపటైటిస్‌ కేసుల్లో 'హెపాటిక్‌ జాండిస్‌' చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు - ఒకటి ఇన్ఫెక్షన్‌, రెండవది ఆల్కహాల్‌, మూడు పౌష్టికాహార లోపము (Nutritional jaundice)

ఇన్ఫెక్షన్‌ పరంగా 5 రకాల వైరస్‌లను -గుర్తించారు. ఇవి హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ.

హెపటైటిస్‌ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..

కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు.

నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే. లివర్‌ వ్యాధి బాగా ముదిరినా కూడా కొందరిలో ఇటువంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశమూ ఉంటుంది,

చికిత్సా విధానము :
పచ్చకామెర్ల వ్యాధికి అల్లోపతిలో సరైన ఔషధం లేదు. ఈ వ్యాధి నీటిద్వారా సోకుతుందని వైద్యులు అంటారు. ఈ వ్యాధి ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదన్న నియమంలేదు. అంతేకాదు ఇది శరీరంలో అత్యంత ప్రధానమైన 'లివర్‌'పై ప్రభావం చూపుతుంది. అందువల్ల విధిగా ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి.

* ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడపోసి, చల్చార్చి వాడడం మంచిది. లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
* పచ్చకామెర్ల వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణంకానివి ఏవీ వాడకూడదు. రెండు నెలలేకాదు కనీసం సంవత్సరం వరకు కూడా

ఆహారంలో నియమాలు తప్పక పాటించాలి.
* మజ్జిగ బాగా వాడాలి,
* అడపాదడపా కొబ్బరి బోండాలు తాగాలి,
* అరటిపళ్ళు బాగా తినాలి.
* మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి.
* గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి.
* ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లుకాదని భావించేవారు కొన్నాళ్ళు వాటికి గుడ్‌బై చెప్పాలి.
* కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
* డాక్టర్‌ సలహాలనుబట్టి లివ్‌-52 మాత్రలు మరికొన్నాళ్ళు వాడవచ్చు. అవి 'లివర్‌' పనితీరును మెరుగుపరుస్తాయి.
పచ్చకామెర్ల వ్యాధి పూర్తిగా ఆహారంపై నియంత్రణ ఉంటేనే తగ్గుతుందన్న విషయాన్ని ఏనాడూ మరిచిపోకూడదు . పదేళ్ళయిన తర్వాత కూడా కొన్ని

ఆహారపదార్ధాలను తీసుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలి .

గ్రుర్తించుకోవలసిన విషయాలు :
నాటు వైద్యులు ఆశ్రయించి కొంతమంది వెళ్లి పచ్చకామెర్ల వ్యాధికి పసరుమందు తాగడంతో పాటు మెడలో పేరు వేసుకుని నాటువైద్యాన్ని నమ్ముకోవడంతో

పచ్చకామెర్లు ముదిరి ప్రాణాలను హరించివేస్తున్నాయి. కల్తీ నూనెలతో పాటు ఇతర పదార్థాల ద్వారా ఈవ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పచ్చకామెర్ల

వ్యాధి నయం కావడానికి నూనెలను తక్కువగా కల్తీలేనివి వాడాలి .

* పచ్చకామర్లు తెలియని వారు ఉండరు. * పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది ఒక వ్యాధి లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలో

'కాలేయం' అనే అవయవం సూక్ష్మజీవుల బారినపడడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల మన

శరీరంలో ప్రవేశిస్తాయి.

* చాలా సందర్భాలలో దానంతట అదే తగ్గిపోతుంది.

* దీనికి ఆధునిక వైద్యంలో మందులు లేవంటారు చాలా మంది. అయితే పచ్చకామెర్లకు ఏ వైద్యంలో కూడా మందులు లేవు.

* పచ్చకామెర్లు ఎక్కువగా ఉంటే విశ్రాంతి ఎంతో ముఖ్యం.

* పచ్చకామెర్లు తక్కువగా ఉంటే సాధారణ పనులు చేసుకుంటే జీవించొచ్చు.

* మనం తీసుకునే చాలా మందులు కాలేయం ద్వారా పోతాయి. మనం అశాస్త్రీయంగా మందులు వాడితే ఆ మందులు కాలేయాన్ని మరింత పాడుచేస్తాయి.

* పచ్చకామెర్లు ముదరితే అన్ని వసతులున్న ఆసుపత్రిలో చేరాలి.

* కాలేయానికి మంచిది అని ప్రచారం చేసే మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

* పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల పచ్చకామెర్లను బాగా నిరోధించొచ్చు.

* 'పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుంది' అనేది నిజం కాదు.


Viral hepatic Jaundice:

శీతాకాలంలో అధికంగా నీటిప్రభావానికిలోనై వచ్చే వ్యాధులలో పచ్చ కామెర్లవ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుని సత్వరనివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలో అత్యంత ప్రధానభాగమైన కాలేయా న్ని పనిచేయ కుండా చేసి పరిస్ధితి అగమ్మగోచరంగా మార్చే ఆస్కారం ఉంటుంది. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్‌ ఎ,బి,సి,డి,ఇ, రకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి. వీటి గురించి ఓసారి తెలుసుకుందాం...

హెపటైటిస్‌-ఏ :

ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్‌ రూట్‌' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్‌-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.

హెపటైటిస్‌-బి

ఇదిహెపటైటిస్‌-ఏకన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వైరొకరికి ఎక్కించినపడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి.

ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఇక వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా ఈవ్యాధి వస్తుంది..

ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.

ఎయిడ్స తదితరాలులా ఇది కూడా ఎలాంటి చికిత్స లేని వ్యాధికావటం ఆందోళన కలిగించే విషయం, దీనికి నివారణాచర్యలు ముఖ్యమైనవి. కలుషిత సూదులు గుచ్చుకున్నా, వ్యాధికారకులతో లైంగిక సంపర్కం జరిపినా 14 రోజుల్లోగా వ్యాక్సిన్‌ని వేయించు కోవటం ద్వారా వ్యాధి కారకాలను నిలువరించవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో పాటు వైద్యుల సూచనల మేరకు ఇమ్యూనోగ్లోబిలిన్‌ని కూడా ఇవ్వాల్సి ఉం టుంది. ఈ వ్యాధి కార కాల గర్భిణీకి జన్మించిన బిడ్డకు పుట్టగానే వ్యాక్సిన్‌ ఇప్పించడం ద్వారా చాలామేరకు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెపటైటిస్‌-సి :

ఇది హెపటైటిస్‌-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్‌-బి కనీసం వ్యాక్సిన్‌ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్తలని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్‌-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్‌ సిరోసిస్‌గా, లివర్‌ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు.

లక్షణాలు :

ఈ వైరస్‌ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వికారంగా ఉండటం, విరేచనాలు కావ టం, ఆకలి లేకపోవటంతో పాటు మూత్రం పసుపు వర్ణంలో పోయటం, కళ్లు, నాలుక పచ్చగా మారిపోతుంది. చేతులు, కాళ్ల గోర్లు కూడా పచ్చగా మారుతుంటాయి. కాలేయ భాగం విపరీతమైన నొప్పిగా మారుతుంది. కాలయం కొద్దిగా కొద్దిగా పెరుగుతుంటుంది. దీని తో పాటు ప్లీహం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తాయి. నడి చేందుకు కూడా వెసులు బాటు ఇవ్వని కీళ్ల నొప్పులు, మలం ద్వారా తెల్లని పదార్ధం శరీరం నుండి బైటకు రావటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ--పరీక్షలివి...

ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కాలేయ పరిస్ధితిని నిర్ధారించుకోవచ్చు. మూత్ర పరీక్షలు చేస్తే అందులో బైల్‌ పింగ్మెంట్స్‌ కనిపిస్తాయి. అలాగే రక్త పరీక్షలలో సీరం ఎంజైమ్స్‌, సీరం బలురూబిన్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక లివర్‌ ఫంక్షన్‌ టెస్టుల్లోనూ మన కాలేయంలో జరిగిన పరిణా మాలను నిర్ధారించుకోవటమే కాకుండా లివర్‌ మార్కర్స్‌ ద్వారా వైరస్‌ కారకాలను ఇట్టే గుర్తించి నిపుణులైన వైద్యుల సలహా సూచనల మేరకు తగిన వైద్యాన్ని చేయించుకుంటే హెప టైటిస్‌-ఏ ని 4 వారాలలోనే తగ్గించుకోవచ్చు.

జాగ్రత్తలిలా...
హెపటైటిస్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్‌ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గానూ గ్లూకోజ్‌తో పాటు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అడపా దడపా తాగించాలి.

అవసరమైతే.. నరాల ద్వారా కూడా సిలెన్‌ రూపంలో గ్లూకోజ్‌ ఎక్కిం చాల్సి ఉంటుంది. అలాగే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పళ్లను గానీ, టాబ్లెట్లని ఇవ్వాలి. అలాగే అవసరం మేరకు విటమిన్‌ సి ఇంజక్షన్‌ ఇవ్వాల్పి ఉంటుంది.

ఇక హెపటైటిస్‌ సోకిన వ్యాధి గ్రస్తులలో విటమిన్‌ బి తక్కువగా ఉండటం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీనిని నుండి కాపాడుకునేందుకు విటమిన్‌ బి టాబ్లెట్లని ఎక్కువ వెూతాదులో ఇవ్వాలి.

శరీరంపై దద్దుర్లు, దురదల వస్తే 'కొలిస్టరిమిన్‌'ని ఇవ్వాల్సి ఉంటుంది. వీలైనంత వరకు విటమిన్‌- కెని కూడా ఇవ్వటమే కాకుండా మల్టీవిటమిన్‌ టాబ్లిట్లు మింగించాలి. ఇన్‌ఫిక్షన్లు సోకితే నియోమైసిన్‌, ప్రెడ్సిసలోన్‌, మెట్రోనిడజాల్‌ మాత్రలు ఇవ్వాలి. కొన్ని రకాల మందులు కూడా శరీర తత్వాన్ని బట్టి ప్రభావం చూపి ఇన్‌ఫిక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం మరింతగా దెబ్బతింటుంది. అందుకే మందులు వాడేటప్పుడు నిపుణులైన వైద్యుల సలహా సూచలను ఖచ్చితంగా తీసుకో వాల్సిందే..

ఆహారం...

ఈ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి దూరంగా ఉంచాలి. ఆకలిగా ఉన్నపడు అధిక ఆహారం ఇవ్వాలి. పళ్ల రసాలు, మజ్జిగ తదితరాలు ఎక్కు వగా ఇవ్వటమే కాకుండా కూరగాయలు, పప్పుదినులు బాగా ఉడక పెట్టి ఇవ్వటంతో పాటు పౌష్టికాహరం ఇవ్వటం ద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకుంటారు.


జాండీస్‌ నివారణకు ఆయుర్వేదిక్ చిట్కాలు


లివర్‌ పనితీరులో ఒడిదుడుకులు వచ్చినపుడు శరీరంలో వచ్చే మార్పులను లక్షణాలను కామెర్లు అంటాం. లివర్‌ను మామూలుగా పనిచేటట్లు చేయడమే దీనికి చికిత్స అది ప్రధానంగా ఆహారంతోనే సాధ్యపడుతుంది.

ప్రతిరోజు ఒక గాస్లు తాజా టమాటారసం తాగాలి. ఒకగ్లాసు రసంలో చిటికెడు ఉప్పు, మిరయాల పొడి కలిపి పరగడుపున తాగాలి.

పొట్ల ఆకులను ఎండబెట్టి పదిహేను గ్రాముల ఆకులను పావులీటరు నీటిలో వేసి మరిగించాలి. మరొక పాత్రలో అర లీటరు నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్‌ ధనియాలను వేసి, నీరు మూడు వంతులు వచ్చే వరకు మరిగించాలి. ఈ మిశ్రమంలో పొట్ల ఆకులను మరిగించిన నీటిని కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి. ఎండు ఆకులను బదులు తాజా ఆకులు వాడవచ్చు.

ముల్లంగి ఆకుల రసం తాగితే జాండీస్‌ అదుపులోకి వస్తుంది. తాజా ముల్లంగి ఆకులను గ్రైండ్‌ చేసి తాగాలి. మూడు లేదా నాలుగు దఫాలుగా రోజు మొత్తంలో అరలీటరు రసం తాగితే పది రోజుల్లో లివరు పనితీరు పూర్తిగా మెరుగయ్యి జాండీస్‌ తగ్గుతుంది.

నాలుగు స్పూనుల తాజా నిమ్మరసంలో తగినంత నీటిని కలిపి తాగితే జాండీస్‌ తగ్గుతుంది. నిమ్మరసం లివర్‌ కణాలను రక్షిస్తుంది.


 • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 17, 2012

బంక విరోచనాలు , Mucus Stools

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


బంక విరేచనాల వంటి దీర్ఘవ్యాధుల విషయంలో వ్యాధి లక్షణాలతోపాటు వ్యాధిగ్రస్థుల లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రోగికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది, వ్యాధి తిరగబెట్టకుండా ఉంటుంది.

జిగట విరేచనాలను బంక విరేచనాలని కూడా వ్యవహరిస్తారు. ఇది పెద్దపేగులకు సంబంధించిన వ్యాధి. క్రానిక్‌ అమీబియాసిస్‌, క్రోన్స్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కోలైటిస్‌ వంటి వేర్వేరు పేర్లతో వ్యవహరించే సమస్యలు ఈ తరగతికి చెందిన వ్యాధులే.

పెద్దపేగుల లోపలి జిగురుపొరలలో పుండ్లు (అల్సర్స్‌) ఏర్పడతాయి. ఈ లోపలి జిగురు పొరలను గీకినట్లుగా జిగురు (మ్యూకస్‌) వచ్చి చేరుతూ, జిగట విరేచనాలు కనిపిస్తాయి. కొద్దిపాటి జ్వరం, ఒంట్లో ద్రవాలు లవణాలు తగ్గి పాలిపోవటం, రక్తహీనత, నీరసం లాంటి శారీరక లక్షణాలు కీలకమైనవి. అమీబియాసిస్‌ కేసుల్లో లివర్‌ కూడా వ్యాధిగ్రస్థమయ్యే అవకాశం ఉంటుంది.

క్రానిక్‌ అమీబియాసిస్‌ రోగులలో ఎంటమీబా హిస్టొలిటికా ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ వ్యాధికి గురవుతున్నట్లు ఒక అంచనా.

శారీరక పరమైన బాధలే కాకుండా ఈ రోగులలో మానసిక ఒత్తిళ్లు కూడా కనిపిస్తాయి. వాస్తవానికి ఈ రోగ బాధలకు అవి ముఖ్య కారణం కావచ్చు కూడా. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించటం జరిగింది.

పైన చెప్పిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లయితే వారసత్వం, ఇన్ఫెక్షన్‌- ఉమ్మడిగా దీర్ఘ వ్యాధులకు ముఖ్యకారణంగా నిలుస్తున్నాయని గుర్తించవచ్చు.
 • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 10, 2012

హిస్టెరెక్టమీ తర్వాత సెక్స్‌ సమస్యలు అపోహలు ,Hysterectomy and sex problems-myths


 • image : courtesy with Surya daily news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --హిస్టెరెక్టమీ తర్వాత సెక్స్‌ సమస్యలు అపోహలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కొన్ని గైనిక్‌ సర్జరీల తర్వాత కొన్ని రకాల సెక్స్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణాలుగా అండాశయాల పనితీరు దెబ్బతిని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జెనైటల్‌ట్రాక్‌లో లేదా యోనిమార్గంలో నిర్మాణానికి సంబంధించిన మార్పులు సర్జరీ సమయంలో పేషెంట్‌ వ్యాధి తీవ్రతను తగ్గించడానికో ప్రాణాలు కాపాడ్డానికో చేయవలసిరావటంగా చెప్పవచ్చు. పేషెంట్‌ ఈ విషయాలు గమనించి డాక్టర్‌కో, సెక్సాలజిస్ట్‌కోఈ విషయాల్ని చెప్పగలిగినపుడు సరైన సూచనలు కొని మార్పుల ద్వారా మానసిక ఒత్తిడిని, ఆందోళనలను తగ్గించవచ్చును.

 • హిస్టెరెక్టమీ :
-తీవ్రమైన డిస్‌ఫంక్షనల్‌ యుటెరైన్‌ బ్లీడింగ్‌ ద్వారా రోగి తీవ్రమైన రక్తహీనతకు గురవుతున్నపుడు గర్భసంచిలో మల్టిపుల్‌ ఫైబ్రాయిడ్స్‌ ఉన్నపుడు, ఎండోమెట్రియాసిస్‌, సెర్వైకల్‌ కాన్సర్‌ ఒవేరియన్‌ కాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులున్నపుడు గర్భసంచిని శస్తచ్రికిత్స ద్వారా తొలగించడానినే హిస్టెరెక్టమీ అంటారు. చాలామంది స్ర్తీలు ఈ సర్జరీ అయిన తర్వాత కొన్ని రకాల దాంపత్య సమస్యలను ఎదుర్కొం టుంటారు. అదీ అపోహలతో అనుమానాల తో అశాస్ర్తీయమైన దృక్పథంతో! పైగా సర్జరీ ముందు తర్వాత కౌన్సెలింగ్‌ సరిగా చెయ్యకపోవడం కూడా ఒక కారణం! చాలామంది గర్భసంచి శరీరంలోంచి కోల్పోయిన తర్వాత దాంపత్యజీవితంలో శృంగారపర్వం ముగిసిపోయిందని తమకు శృంగారసమస్యలు వస్తాయని భ్రమపడుతూ భయపడుతుంటారు.


ఇది దంపతులు ఇరువురిలోనూ వస్తుంది. చాలామంది స్ర్తీలు డాక్టరు ఎంత చెప్పినా చాలాసార్లు హిస్టెరెక్టమీ చేయించుకోవడానికి వెనకాడతారు. కారణం- గర్భసంచి తో వుండటాన్ని స్ర్తీ పరిపూర్ణత్వంగా భావిస్తుంది. గర్భసంచి తొలగించిన తర్వాత శరీరంలో ఏదో ఖాళీ ఏర్పడినట్టు డొల్లతనంగా ఫీల్‌ అవటమే కాక డిప్రెషన్‌లోకి వెళిపోతుంటారు. భర్తకు తనపైన ఆకర్షణ, ప్రేమ తగ్గిపోయాయని భావిస్తూ చాలామంది భర్తలు కూడా స్ర్తీలు గర్భసంచి కోల్పోయిన తర్వాత శృంగార జీవితానికి పనికిరానివారైపోయారని ఆందోళన పడుతూ భార్యలను మానసికంగా హింసిస్తూ అవమానిస్తుంటారు. అందువల్లనే హిస్టెరెక్టమీ సర్జరీ ముందు, తర్వాత భర్తలకు కూడా కౌన్సిలింగ్‌ చాలా అవసరం. చాలామంది పురుషులు ఈ సర్జరీ తర్వాత భార్యతో శృంగారం పట్ల అనాసక్తిని ప్రదర్శించడమే కాకుండా పాల్గొనకుండా దాటివేయడం తమకు కూడా క్యాన్సర్‌ వస్తుందేమోనని, ఒకవేళ అదే కారణం గా గర్భసంచి తొలగిస్తే భయపడతారు. ఈ రకమైన అవమానాలు, భయాలతో భార్య ను గాయపర్చకుండా ఉండటం కోసం ప్రి అండ్‌ పోస్ట్‌ ఆపరేటివ్‌ కౌన్సెలింగ్‌ చాలా అవసరం.

 • మానసిక కారణాలు :
హిస్టెరెక్టమీ తర్వాత ఆఫెరెక్టొమీ(Oopherctomy) లేదా అండాశయాల్ని తొలగించి లేదా తొలగించకపోయినా పేషెంట్‌‌‌కు సరైన విధంగా హార్మోన్‌రీప్లేస్‌మెంట్‌ థెరపీ(హెచ్‌ఆర్‌టి) ఇచ్చిన తర్వాత కూడా ఆమె శృంగార సమస్యలను ఎదుర్కొంటుంది. అదే ప్రధాన కారణం. మానసిక పరమైనవే అయి వుంటాయి కచ్చితంగా. ప్రధానంగా గర్భసంచీని కోల్పోవటం వల్ల సంతానాన్ని పొందే శక్తిని స్ర్తీత్వాన్ని కోల్పోయినట్టుగా అనుకోవటం. అలాగే సంతానోత్పత్తికి పనికిరాని శృంగారం వృథా అనుకోవడం సరైనది కాదు. ఈ భావన వల్ల కూడా శృంగార వైఫల్యం కలుగుతుంది. సర్జరీకి ముందు ఒకవేళ పేషెంట్‌‌‌‌‌ తీవ్రమైన నొప్పి సంయోగ సమయంలో అనుభవించినట్లయితే సర్జరీ తర్వాత కూడా భయంతో శృంగారాన్ని తిరస్కరిస్తారు.


-అలాగే భర్తను మునుపటిలా సంతృప్తిపరచగలనా అని కూడా ఆందోళన చెంతుతుంటారు. తనలో కూడా శృంగార ప్రేరణలు తగ్గిపోయాయని దానికికారణం తనకు జరిగిన సర్జరీ అనే భావిస్తుంటారు. అలాగే సర్జరీ తర్వాత బరువు పెరుగుతామని హిర్యుటిసమ్‌(Hirsutism) అనే వ్యాధికి గురవుతామని దాంతోపాటు ముసలితనంలోకి త్వరగా వెళిపోతామని అపోహలకు, అర్ధం లేని భయాలకు లోనవుతుంటారు. హిస్టెరెక్టమీ జరిగిన మూడు సంవత్సరాలలోపు 70శాతం స్ర్తీలు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళుతున్నట్టు పోస్ట్‌ఆపరేటివ్‌ సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్స్‌ పరిశోధన సమాచారంలో బయటపడింది.

 • శారీరక కారణాలు :
వెజైనల్‌ లూబ్రికేషన్‌ తగ్గుతుంది. అది కూడా రెండు వైపులా ఉండే అండాశయాలు తొలగిస్తేనే ! దాని వల్ల యోనిమార్గం పొడిబారి సంయోగసమయంలో మంట, నొప్పి కలిగి శృంగారం పట్ల భయం ఏర్పడి విముఖత కలుగుతుంది. ఈ బాధ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స వల్ల తగ్గిపోతుంది. అయితే ఈ ఈస్ట్రోజన్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స శృంగార కోరికలు పెంచడానికో, భావప్రాప్తిని కలిగించడానికో ఇవ్వడం జరగదు. హెచ్‌ఆర్‌టి వల్ల ఎముకలు పెళుసుబారటం, ప్రిమెచ్యూర్‌ ఆర్టిరియల్‌ డిసీజ్‌ని తగ్గించడానికి వెజైనా పొడిబారడాన్ని తగ్గించి లూబ్రికేషన్‌ పెంచి అంగప్రవేశం తర్వాత మంట, నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈస్ట్రోజెన్స్‌ రిప్లేస్మెంట్ ఇవ్వకూడని పరిస్థితిలో కే-వై జెల్లీ లేదా సెన్సిలి జెల్లీ వెజైన్‌లో వాడవచ్చు.

అయితే కొంతమంది స్ర్తీలలో హిస్టెరెక్టమీ తర్వాత ఈస్ట్రోజన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వల్ల స్పర్శకు సంబంధించిన శృంగారోద్దీపనలు కలగటం గమనించారు. ఒకవేళ సర్జరీ తర్వాత ఏవైనా ఆరోగ్యసమస్యలు (పోస్ట్‌ ఆపరేటివ్‌ కాంప్లికేషన్స్‌) వస్తే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. దాంతోపాటుగా శృంగార జీవితం తిరిగి ఆరంభించడానికి సమయం పడుతుంది. వెజైనల్‌ కఫ్‌ని సుపీరియర్‌ పొజిషన్‌లో పెట్టేటపుడు సరైన శ్రద్ధతీసుకోకపోతే సంయోగం అపుడు స్నేర్డ్‌ ఏరియాలో రాపిడి వల్ల నొప్పి కలగవచ్చు.

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, March 8, 2012

పసి బిడ్డల కంట్లో నీటికాసులు(గ్లకోమా) ,Glaucoma in Neonatesఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పసి బిడ్డల కంట్లో నీటికాసులు(గ్లకోమా) ,Glucoma in Neonates- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కలవరపెట్టే సమస్యల్లో తప్పకుండా చెప్పుకోవాల్సింది నీటికాసులు! బిడ్డ పుడుతూనే కంట్లో నీటికాసులు ఉండొచ్చు.. లేదా పుట్టినప్పుడు బాగానే ఉన్నా తర్వాత మెల్లగా మొదలవ్వచ్చు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. దీనికి చక్కటి చికిత్సలున్నాయి. కాకపోతే దీన్ని సత్వరమే గుర్తించి.. వెంటనే వైద్యులకు చూపించటం, అవసరమైతే వెంటనే సర్జరీ చేయించటం.. బిడ్డ చక్కటి ఎదుగుదలకు చాలా చాలా అవసరం.

పసి బిడ్డలకు కళ్లు పెద్దగా ఉంటే అందంగానే ఉంటుందిగానీ అవి మరీ పెద్దగా ఉంటే మాత్రం సమస్య ఏదైనా ఉందేమో అనుమానించటం చాలా అవసరం. ఎందుకంటే పసివయసులో.. కనుగుడ్డు అసహజంగా, పెద్దగా ఉండటానికి 'నీటికాసులు' కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేని... బిడ్డ చూపును హరించివేసే సమస్య. దీన్నే 'గ్లకోమా' అంటారు. గ్లకోమా ఏ వయసులోనైనా రావొచ్చు. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఉండొచ్చు కూడా.

-
పుడుతూనే నీటికాసుల సమస్య ఉంటే దాన్ని 'కంజెనిటల్‌ గ్లకోమా' అంటారు. ఈ సమస్య ఉన్న పిల్లల కళ్లను చూస్తే చిత్రమైన లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో కనుగుడ్డు పెద్దగా, పూర్తిగా నీలి రంగులో, లేదా తెల్లగా ఉండొచ్చు. బయటి నుంచి కాంతిలోపలికి ప్రవేశించేలా పారదర్శకంగా ఉండాల్సిన కార్నియాపొర.. వీరిలో దళసరిగా, మబ్బు మబ్బుగా, తెల్లతెల్లగా గానీ నీలంగాగానీ ఉంటుంది. పిల్లలు కళ్లు తెరవలేరు (హైడింగ్‌). ముఖ్యంగా ఎండలోకి వస్తే కళ్లు గట్టిగా మూసేసుకుంటుంటారు (ఫొటో ఫోబియా). వెలుతురును కళ్లు తెరచి చూడలేరు. కంటిలోంచి నీరు కూడా కారుతుంటుంది. పసిబిడ్డల కంట్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే- తక్షణం వైద్యులకు చూపించటం, అదీ పిల్లల కంటి సమస్యలను చూసే ప్రత్యేక నిపుణులకు చూపించటం చాలా అవసరం. ఎందుకంటే పసిబిడ్డల్లో నీటికాసులు ఉంటే సత్వరమే చికిత్స ఆరంభించటం, అవసరమైతే వెంటనే సర్జరీ చెయ్యటం చాలా అవసరం. నీటికాసుల విషయంలో ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. ఆలస్యం చేసిన కొద్దీ.. బిడ్డ చూపు.. మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత వరకూ మందులతో చికిత్స చేసినా, పిల్లల్లో నీటికాసులకు చాలావరకూ శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. ఈ ఆపరేషన్‌ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెయ్యాలి. పిల్లలకు మత్తు తట్టుకునే శక్తి ఉంటే పుట్టిన రోజునే... లేకపోతే రెండు, మూడు రోజులబిడ్డకు కూడా సర్జరీ చెయ్యచ్చు. అయితే చాలామంది పిల్లలకు పుట్టిన రెండు మూడు వారాల్లోపు కామెర్లు వస్తుంటాయి. ఒకవేళ ఇలాంటి వారికి గ్లకోమా ఉన్నట్టయితే ఆ సమయంలో మందులతో చికిత్స చేసి, కామెర్లు నయమయ్యాక నీటికాసులకు సర్జరీ చేస్తారు.


కొన్నిసార్లు పుట్టినప్పుడు బాగానే ఉన్నా.. రెండేళ్లలోపు ఎప్పుడైనా నీటికాసుల లక్షణాలు హఠాత్తుగా రావచ్చు. దీన్ని 'ఇన్‌ఫెంటైల్‌ గ్లకోమా'అంటారు. దీన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోతే జబ్బు ముదిరిపోతుంటుంది. ఒకవేళ ఇది బాగా ముదిరిపోతే చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకని పిల్లల కళ్లలో సమస్యగా అనిపిస్తే వెంటనే స్పందించాలి. కొందరిలో కంటిమీద తెల్లటి పొర, నీలంపొర వంటివి లేకపోయినా కనుగుడ్డు పెద్దగా ఉండొచ్చు. కార్నియా విస్తీర్ణం పెద్దగా ఉంటుంది. ఇది కూడా నీటికాసుల ఆనవాళ్లను పట్టిచ్చే లక్షణమే. ఇలాంటి దాన్ని గుర్తిస్తే వెంటనే గ్లకోమా ఉందో లేదో నిర్ధారించుకోవటం ఉత్తమం.

నిర్ధారించేదెలా?
పిల్లలు అటూ ఇటూ కదులుతుంటారు కాబట్టి వీరిలో గ్లకోమా కంటి పరీక్షలు చేయటానికి ముందు కొద్దిగా మత్తు మందు ఇస్తారు. తర్వాత కంట్లో ఒత్తిడి ఎంత మేరకు ఉందో పరీక్షిస్తారు. కార్నియా చుట్టుకొలతను కొలుస్తారు. ప్రత్యేకమైన పరికరం సాయంతో దృశ్యనాడి మీద ఒత్తిడి పడుతోందా? అన్నదీ పరిశీలిస్తారు. దృశ్యనాడి 'కపింగ్‌' ఏర్పడిందేమో చూస్తారు. నీటికాసుల సమస్య ఉందని నిర్ధారణకు వస్తే- పిల్లలు సర్జరీ, మత్తు తట్టుకోగలరా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు మరికొన్ని రక్తపరీక్షలు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు వంటివీ పరీక్షిస్తారు. ఆ తర్వాతే మత్తుమందు ఇచ్చి కంటికి ఆపరేషన్‌ చేస్తారు.

* కొన్నిసార్లు బిడ్డల ముఖం ఆకృతి మారిపోవటం, ముఖంలో ఒక భాగం ఎర్రగా అవటం వంటివీ నీటికాసులతో ముడిపడిన లక్షణాలు కావచ్చు. కాళ్లూ చేతులు, కడుపులోని అవయవాలు సరిగా ఏర్పడకపోవటం వంటి ఇతర లోపాలతోనూ గ్లకోమా ముడిపడి ఉండొచ్చు.

* కొన్నిసార్లు హఠాత్తుగా కంట్లో ఒత్తిడి పెరిగి.. దాంతో నొప్పి, కళ్లు ఎర్రబడటం, అసౌకర్యం వంటి లక్షణాలు కనబడతాయి. నొప్పి మూలంగా వాంతులు కూడా కావొచ్చు. బల్బును చూసినపుడు దాని చుట్టూ ఇంధ్రధనుస్సు ఆకారంలో కాంతి కనిపిస్తుంది. సాధారణంగా ఇది గ్లకోమా తీవ్ర దశలో, అంతకు ముందు దశలో కనిపిస్తుంది.

* ఒక రకం నీటికాసుల్లో కనుగుడ్డు పెద్దగా ఉన్నా, అది పైకి అంతా బాగానే కనబడుతుంటుంది. అయితే ఐదారు నెలల తర్వాత కనుగుడ్డు హఠాత్తుగా మబ్బుమబ్బుగా మారుతుంది. కంట్లో ఒత్తిడి పెరిగి కార్నియా పొరలోకి నీరు చేరి.. కనుగుడ్డు మసకమసకగా కనబడుతుంది.

ఎందుకొస్తుంది?
సాధారణంగా మన కంట్లో నిరంతరం నీరు ఊరుతూ.. కొత్తది వస్తూ, పాతది బయటకు పోతుంటుంది. ఈ నీరు కంటిని శుభ్రం చేస్తూ, కంటికి కావాల్సిన పోషకాలు అందిస్తుంటుంది. ఈ నీరు బయటకు వెళ్లిపోవటానికికంట్లో ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. కానీ కొందరికి పుట్టుకతోనే ఈ బయటకు వెళ్లే మార్గం మూసుకొని ఉండొచ్చు. దీంతో కంట్లో నీరు వస్తూ, అది బయటకు వెళ్లే అవకాశం లేకపోవటం వల్ల అక్కడే నీరు చేరిపోతుంటుంది. ఫలితంగా కంట్లో ఒత్తిడి పెరిగిపోయి కనుగుడ్డు పెద్దగా అవుతుంది. పసిబిడ్డల్లో కనుగుడ్డు సైజు పెరగటంతో పాటు అది నీలంగా, లేదా తెల్లగా కనబడుతుంది. కనుగుడ్డు మామూలుగానే ఉన్నా కొందరిలో ఐదారు నెలల తర్వాతా బయటపడొచ్చు. నీరు బయటకుపోకుండా ఒత్తిడి పెరిగిపోవటం వల్ల... కంటిచూపునకు అత్యంత కీలకమైన దృశ్యనాడి దెబ్బతినిపోవటం ఆరంభమవుతుంది. దీన్ని 'కపింగ్‌' అంటారు, ఇది నీటి కాసులతో ఉన్న అత్యంత ప్రమాదకరమైన, చూపును హరించివేసే సమస్య. కొన్నిసార్లు ఈ డ్రైనేజీ మార్గం సక్రమంగా ఉన్నప్పటికీ అందులో అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా నీటికాసులు రావొచ్చు, సాధారణంగా పెద్దవారిలోకనబడే రకం ఇది!

చికిత్స ఏమిటి?
పెద్దవారిలో వచ్చే గ్లకోమాను చాలావరకూ మందులతో నియంత్రించొచ్చు, ఇందుకు కంట్లో ఒత్తిడిని తగ్గించేవి, నీరు ఎక్కువగా బయటకుపోయేలా చేసేవి.. ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు లేజర్‌ చికిత్స, దాంతోనూ ఫలితం ఉండదనుకుంటే సర్జరీ చేస్తారు. అయితే పుట్టుకతో వచ్చే నీటికాసులకు మాత్రం చాలావరకూ శస్త్రచికిత్స తప్ప మరో ఉత్తమ మార్గం లేదు. దీన్ని వీలైనంత త్వరగా చేయటం అవసరం. కంట్లో ఒత్తిడి ఎంతమేరకు ఉంది? దీన్ని దృశ్యనాడి ఎంత వరకు భరించగలదు? తదితర అంశాలను బట్టి శస్త్రచికిత్స చేస్తారు. శస్త్రచికిత్సలో భాగంగా మూసుకుపోయిన డ్రైనేజీ మార్గాన్ని తెరుస్తారు.

సర్జరీ ఫలితాలెలా ఉంటాయి?
శస్త్రచికిత్స తర్వాత చూపు తిరిగి వస్తుంది. అయితే ఇది గ్లకోమా తీవ్రతను బట్టి ఉంటుంది. ఒత్తిడి, కనుగుడ్డు పరిమాణం, లోపలి కోణంలో లోపం వంటి అంశాల ఆధారంగా గ్లకోమాను స్వల్ప, ఓ మోస్తరు, తీవ్ర రకాలుగా వర్గీకరిస్తారు. స్వల్ప, ఓ మోస్తరు నీటికాసులు గల పిల్లల్లో శస్త్రచికిత్స తర్వాత చూపు బాగా మెరుగవుతుంది. కనుగుడ్డు పెద్దగా అయిన వారికి చక్కటి చూపు కోసం మైనస్‌ పవర్‌ అద్దాలు అవసరమవుతాయి. పుట్టుకతో వచ్చే గ్లకోమాలో కనుగుడ్డు పెద్దగా అవుతుంది. సర్జరీ తర్వాత కూడా ఆ సైజు అంతగా తగ్గదు. కాబట్టి సర్జరీ తర్వాత 70-80% పిల్లలకు కళ్లద్దాలు అవసరమవుతాయి. ఆర్నెల్లు, ఏడాది పిల్లలకూ అద్దాలు సిఫారసు చేస్తారు. మొదట్లో వీళ్లు అద్దాలను పెట్టుకోవటానికి ఇష్టం చూపకపోయినా.. క్రమేపీ అద్దాలతో చూపు బాగా కనబడుతుంటే నెమ్మదిగా వాటికి అలవడతారు. కళ్లద్దాలు తీయటానికి ఇష్టపడరు కూడా.

అయితే గ్లకోమా తీవ్రంగా ఉన్నవారికి ఆపరేషన్‌ చేసినప్పటికీ అప్పటికే దృశ్యనాడి దెబ్బతిని ఉండటం వల్ల పోయిన చూపు తిరిగి రావటం కష్టం. ఇలాంటి వారికి ఆపరేషన్‌తో పాక్షికంగా మాత్రమే ప్రయోజనం ఉంటుంది, ముఖ్యంగా ఉన్న చూపును పరిరక్షించటం కీలకంగా మారుతుంది. ఉన్నచూపు మరీ దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ ఉన్న చూపుతోనే వాళ్లు చూడటం, చదవటం వంటివి ఎలా సాధ్యమో పరిశీలిస్తారు.

జీవితాంతం పరీక్షలు తప్పనిసరి..
ఒకసారి గ్లకోమా వస్తే- సర్జరీ చేసినా, చేయకున్నా ఎవరైనా సరే జీవితాంతం తరచుగా వైద్యులతో పరీక్షించుకోవటం తప్పనిసరి. తీవ్ర గ్లకోమా గలవారిలో చూపు విస్తీర్ణం తగ్గిపోతుంది. దీన్ని గుర్తించి సరిగ్గా చికిత్స తీసుకోకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదముంది. అందువల్ల తరచుగా డాక్టరుకి చూపించుకుంటూ కంట్లో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక కారణాల వల్ల మందులు వేసుకోలేని స్థితి ఉంటే ఆ విషయాన్ని ముందే డాక్టర్లతో చర్చించటం అవసరం. దీన్నిబట్టి అవసరమైతే వెంటనే శస్త్రచికిత్స చేయటానికి వీలుంటుంది. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత.. ఆపరేషన్‌ అయిపోయిందని సరిపెట్టుకోవటం తగదు. తర్వాత కూడా వైద్యులు చెప్పినట్టుగా కచ్చితంగా పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం.

ఒక కన్ను పెద్దగా ఉన్నా..
పిల్లల్లో ఒక కన్ను పెద్దగా ఉంటే కొందరు అది అందానికి చిహ్నమని భావిస్తుంటారు. నిజానికి ఇది గ్లకోమా ఉందనటానికి గుర్తు. అది అప్పటికి బయటపడక పోయినప్పటికీ 10, 12 ఏళ్లు గడిచేసరికి దృశ్యనాడి దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇది పెద్దవారిలో కనిపించే 'ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా'లా పరిణమిస్తుంది. దీన్ని పెద్దవారిలో మాదిరిగా మందులతో కొంతకాలం అదుపులో పెట్టొచ్చు గానీ శస్త్రచికిత్స చేయటమే ఉత్తమం.


మేనరికాలతో కష్టం
అమెరికా వంటి దేశాల్లో ప్రతి 15,000 మందిలో ఒకరు నీటికాసులతో పుడుతున్నారు. అదే మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో నీటికాసులతో పుట్టే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. 'ఆంధ్రప్రదేశ్‌ ఐ డిసీజ్‌ స్టడీ' ప్రకారం.. మన రాష్ట్రంలో ప్రతి 3,300 మంది పిల్లల్లో ఒకరు నీటికాసులతో పుడుతున్నట్టు అంచనా. అంటే పాశ్చాత్య, ఐరోపా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐదారు రెట్లు ఎక్కువన్న మాట. ఇందుకు మేనరికాలు, దగ్గరి సంబంధీకుల మధ్య వివాహాలు కూడా కారణమవుతున్నాయి. మేనరికం, దగ్గరి సంబంధీకులను వివాహం చేసుకున్నవారిలో తల్లి తరఫున గానీ తండ్రి తరఫున గానీ గతంలో ఎవరికైనా నీటికాసులు ఉండి ఉంటే వారి పిల్లలకూ వచ్చే అవకాశముంది. అలాగే నీటికాసుల బారినపడ్డ వారికి పుట్టే పిల్లలకూ నీటికాసులు వచ్చే అవకాశం ఉంది గానీ తప్పకుండా రావాలనేం లేదు. ఒక బిడ్డ నీటికాసుల సమస్యతో పుడితే- తల్లిదండ్రుల రక్తనమూనాలతో జన్యు పరీక్షలు చేసి, తర్వాత పుట్టే బిడ్డల్లో ఈ సమస్య వచ్చే అవకాశాలేమైనా ఉంటాయా? అన్నది కొంత వరకూ అంచనా వెయ్యచ్చు.

స్టిరాయిడ్లు.. ఇష్టారాజ్యంగా వాడొద్దు
కొన్నిసార్లు పిల్లలకు వాడే మందుల దుష్ప్రభావాలతో కూడా నీటికాసుల వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. పిల్లల్లో కంటి దురదలు, అలర్జీలకు కంటి వైద్యులు స్టీరాయిడ్‌ చుక్కల మందులు రాస్తారు. వీటిని వైద్యులు తగు మోతాదులోనే ఇస్తారు. కానీ తల్లిదండ్రులు వారి సూచనలు పాటించకుండా అవసరానికి మించి అధికమోతాదులో గానీ, దీర్ఘకాలంగానీ వాడితే నీటికాసులకు దారితీసే ప్రమాదముంది. దీన్ని 'డ్రగ్‌ ఇండ్యూస్‌డ్‌ గ్లకోమా' అంటారు. కాబట్టి కంటిచుక్కల మందులను వైద్యుల సలహాలు, సిఫార్సులు లేకుండా దుకాణాల్లో కొనుక్కుని వాడెయ్యద్దు.

---Dr.Anil-K,Mandal(eye specialist - LV prasad Eye Institute -Hyd)

 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/