Showing posts with label Heart attack- symptoms. Show all posts
Showing posts with label Heart attack- symptoms. Show all posts

Friday, February 1, 2013

Heart attack- symptoms,గుండెపోటు-లక్షణాలు

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart attack- symptoms,గుండెపోటు-లక్షణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 గుండెపోటు - లక్షణాలు...
సుమారు అరవై శాతం పైగా గుండె నొప్పి లక్షణాలు, గుండెపోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలన లో తెలిసింది. కానీ తరచూ ముందుగా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలనలో తెలిసింది.గుండె నొప్పి ఎట్లా ఉంటుంది: గట్టిగా పిండినట్టు, తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. ఇలాంటి నొప్పి ఛాతీకి మధ్యలో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగంగా కొట్టుకోవడం అంటే సాధారణంగా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది.
డిస్కంఫర్ట్‌: గుండె నొప్పి తో పాటు చాలా డిస్కంఫర్ట్‌ కూడా వీరు అనుభవించవచ్చు.

మిగతా భాగాలలో నొప్పి: లోపలి కడుపు భాగంలో నొప్పి, ఈ నొప్పి పైభాగంలో ఉన్న గుండె నొప్పి కలిగించే ఒత్తిడి వల్ల, క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయంలో ఉన్నట్టు అని పించవచ్చు. అందుకనే ఇలాంటి నొప్పిని అ శ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్ద్‌ పెయిన్‌ అంటారు. (referred pain). ఎలాంటి నొప్పి భుజా లకూ ప్రత్యేకించి ఎడమ భుజానికీ, ఎడమ చేయికీ, ఎడమ ముంజేతికీ పాకవచ్చు. అలాగే వీపు భాగానికీ, రెండు చేతి రెక్కల మధ్య భాగానికీ పాకవచ్చు అంటే (between the shoulder blades). ఇలా గుం డెలో మొదలైన నొప్పి శరీరం లో మిగతా భాగాలకు పాకటానికి కారణం, గుండెకు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియ చేసే నాడులు ఒకటే అవటం వలన. ఊపిరి అంద కపోవడమూ, కళ్ళు తిరిగినట్టూ, తల తిరిగినట్టూ, ఆత్రుతగా ఉండడం, వాంతులు రావడమూ, ఒళ్ళు చమటలు పట్టడమూ, తిన్న ఆహారం అరగనట్టు అనిపించడము కూడా జరగవచ్చు.

ఈ లక్షణాలు, సాధారణంగా కనిపించేవి. కానీ హార్ట్‌ ఎటాక్‌ లేక గుండె పోటు లక్షణాలు కొద్ది తీవ్రత నుంచి, చాలా తీవ్రతతో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించవచ్చు. అలా కాకుండా, పురుషులలో సుమారు నాలుగోవంతు కేసులలో, ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇంఫార్క్షన్‌ అని అం టారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలూ చూపించకుండా నిశ్శబ్దంగా వస్తుంది కాబట్టి. అందువల్లనే ఛాతీలో నొప్పి ఎప్పుడు వచ్చినా, లేక అనుమానంగా ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

ప్రథమ చికిత్సే ఆపన్న హస్తం...
అన్ని రోగాల్లా చెప్పి వచ్చేది కాదు గుండె పోటు. టైమివ్వదు. ఎక్కువ సమయం గడి చిందంటే ప్రాణం పోవటం ఖాయం. ఇప్పటికీ గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు ఇవి అని కచ్చితంగా చెప్పటం కష్టం అంటున్నారు డాక్టర్లు. అయితే వైద్యరంగం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో గుండెపోటును ముందుగా గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవా? అంటే కొన్ని సూచనలు ఉన్నాయని వైద్యనిపు ణులు సెలవిస్తున్నారు.

-ఒక్కోసారి స్ట్రోక్‌ లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. అందులోనూ అవగాహన లేమి మరిం త ప్రమాదకరం. బాధితురాలు లేదా బాధితునితో ఆ సమయంలో ఉన్నవారు ఆ లక్షణాలు గ్రహించలేక పోతే స్ట్రోక్‌ వచ్చిన వారి మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రోగితోపాటు ఉన్నవారు మూడు లక్షణాలను బట్టి ఆ వ్యక్తి స్ట్రోక్‌కు గురయ్యారన్న విషయం గ్రహించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

* 1.ముందుగా ఆ వ్యక్తిని నవ్వమనండి.
* 2.ఆ వ్యక్తిని ఒక చిన్న వాక్యం స్పష్టంగా మాట్లాడమనండి. ఉదాహరణకు ఈరోజు భలే చలిగా ఉంది లాంటివి. ఈ మాటలు ఎలాంటి తడబాటు, వణుకు లేకుండా మాట్లాడుతున్నారో? లేదో గమనించండి.
* 3.రెండు చేతులూ పైకి ఎత్తమనండి. ఆమె గానీ, అతడు గానీ వీటిల్లో ఏ ఒక్క పనిలోనై నా విఫలం అయిన వెంటనే అంబులెన్స్‌ని పిలవండి. వారికి తక్షణం వైద్య సహాయం అందించండి.
* ముఖ్యంగా తెలుసుకోవలసింది. స్ట్రోక్‌కి గురైన వారిని నోరు తెరవమనండి. నాలుక మెలితిరిగివున్నా, ఏదో ఒక వైపుకి తిరిగి ఉ న్నా అది గుండెపోటుకి గుర్తుగా భావించి, నిమిషాల వేగంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేయండి. ఆలస్యం చేయకపోవటమే ముఖ్యం.

* అత్యవసర సర్వీస్‌ నంబర్‌కి ఫోను చేయండి.
* రోగి దుస్తులను వదులు చేయడము.
* రోగిని కంగారు పెట్టకుండ ధైర్యము చెప్పడము.
* కొంచము వంగి కూర్చున్న భంగిమను ఏర్పాటు చేయడము.
* అనవవసర కదలికలు చేయకూడదు.
* శ్రమపడితే ఆక్షిజన్‌ పెట్టే సదుపాయము చేయాలి.
* వెంటనే హృద్రోగ నిపుణులున్న హాస్పిటల్‌కి తరలించడము... ముఖ్యమైనవి.
* దొరికితే... సార్బిట్రేట్‌ మాత్ర నాలుక కింద పెట్టడం చేయాలి.

Courtesy with - డాక్టర్‌ చిన్మయిరథ-అబ్‌స్టెట్రిషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌-రెయిన్‌బో చిల్డ్రన్‌-హాస్పిటల్‌ అండ్‌-పెరినాటల్‌ సెంటర్‌-బంజారాహిల్స్‌, హైదరాబాద్‌,

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/