Showing posts with label హాయిగా నిదురపోవడానికి చిట్కాలు - Hints for good sleep. Show all posts
Showing posts with label హాయిగా నిదురపోవడానికి చిట్కాలు - Hints for good sleep. Show all posts

Thursday, March 8, 2012

హాయిగా నిదురపోవడానికి చిట్కాలు - Hints for good sleep


హాయిగా నిదురపోవడానికి చిట్కాలు
  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints for good sleep- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఉరుకుల పరుగుల జీవితం. ముంచుకొస్తున్న సమస్యలు. ఎన్నో నిద్ర లేని రాత్రులు. ఇవన్నీ మనసును పట్టి పీడిస్తుంటాయి. నిద్ర లేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచనా గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనికి పరిష్కారం తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది అంటున్నారు నిపుణులు.

* నిద్రపోవడానికి ఒక సమయం నిర్దేశించుకోండి. ఒక్కోసారి ఒక్కోలా నిద్రకు ఉపక్రమించడం వల్ల శరీరం క్రమగతి కోల్పోతుంది. ఫలితంగా పడుకోగానే నిద్ర పట్టదు. పగటి పూట కునుకు తీయడం చాలామందికి అలవాటు. అది కాసేపయితే సరే! అదే ఎక్కువ సమయమైతే రాత్రి నిద్రను హరించి వేస్తుంది. రోజంతా పనిచేసి విపరీతమైన అలసటతో విశ్రాంతి కోరుకుంటున్నప్పుడు ఓ పావుగంట, ఇరవై నిమిషాలు వరకు పగటి నిద్ర ఫరవాలేదు.

* శరీరానికి తగిన శ్రమ ఉంటే కంటి నిండా నిద్ర దొరుకుతుంది. రోజూ అరగంట సేపు వ్యాయామం తప్పనిసరిగా ఉండేట్లు దినచర్యను రూపొందించుకోండి. అలాని నిద్రపోయే ముందు ఏరోబిక్స్‌ చేయడం వల్ల శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టకపోవచ్చు. అందువల్ల వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం మాత్రమే వ్యాయామం చేయాలి.

* నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేయడం వల్ల కండరాలు విశ్రాంతి కోరుకుంటాయి. ఫలితంగా మంచి నిద్ర సొంతమవుతుంది. కనీసం పడుకోవడానికి రెండుగంటల ముందుగా భోజనం చేయండి. నిద్రకుపక్రమించే ముందు భోంచేయడం వల్ల మగతగా అనిపించినా, తరవాత మాత్రం జీర్ణం కాకపోవడం, కలత నిద్ర వంటివి ఇబ్బంది పెడతాయి.

* పడుకునే ముందు టీ, కాఫీ వంటి తేనీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు కాల్పనిక కథల పుస్తకాలను చదవండి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

* నిద్రించే గదిలోకి చల్లటి గాలి వచ్చేందుకు వీలుగా కిటికీలు తెరచి ఉంచండి. బెడ్‌ షీట్లు శుభ్రంగా ఉండేట్లు చూసుకోండి.


నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :

* రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
* రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
* రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
* రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
* పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
* పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
* నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
* నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,

* సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

o * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

o * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

o * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/