Friday, September 28, 2012

Vertigo - వర్టిగో

 •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Vertigo - వర్టిగో-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిద్రలేచినప్పడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, ఒక పక్కకు తిరిగే ప్రయత్నంలో కానీ, ముందుకు వంగి పనిచేయడంలో కానీ, ఉన్నట్టుండి తల తిరగడం తద్వారా పడిపో వడం, వాంతులవడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను వర్టిగో అంటాం. ఇది డిజినెస్ (Dizziness) వ్యాధి ఉప విభాగము లలో ఒకటి . ఒక వ్యక్తి  స్థిరముగా ఉన్నప్పుడు తిరుగు తున్నట్లు అనుభూతిని పొందే దాన్నే వర్టిగో అంటాము . లోపల చెవి లోని వెస్టిబ్యులార్ సిస్టం లో పనిలో అసమతుల్యము వలన కలుగుతూ ఉంటుంది.


వర్టిగో చెవికి సంబంధిన వ్యాధి . చెవికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవడానికి ముందు చెవి చేసే పనులు ఏమిటనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. చెవి ప్రధానంగా వినికిడిని అంటే ధ్వనిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం సరిగ్గా నిట్టనిలువుగా నిలబడటానికి, అటూ ఇటూ తూలకుండా నడవడానికి కూడా చెవి ఉపయోగపడుతుంది. చెవిని వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి  అనే  భాగాలుగా విభజించొచ్చు.ఒక్కోక్క విభాగములో అనేక అవయవాలు సముదాయము ఉంటుంది.
మూడు రకాల వర్టిగో లుగా విభజించడం జరిగింది .
ఆబ్జక్టవ్ (Objective) రకము : ఇందులో వ్యక్తి తనచుట్టూ వస్తువులు తిరుగుతున్నట్లు అనుభూతిని పొందుతాడు .
సబ్జక్టివ్ (Subjective) రకము : ఇందులో వ్యక్తి తనే తిరుగుతున్నట్లు అనుభూతిని పొందుతాడు .
సూడోవర్టిగో(Pseudovertigo) రకము : వ్యక్తి తన తలలో ఒకరకమైన విపరీతమైన తిరుగుడు అనుభూతిని పొందడము.
Dizziness మరియు  Vertigo అన్ని వయసులవారిలోనూ కనిపెస్తూ ఉంటుంది. జనాభా లో సుమారు 20-30 శాతము ఉంటుంది . పిల్లలలో కంటే పెద్దవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

వివిధ కారణాల వల్ల వర్టిగో రావొచ్చు.
ముఖ్యము గా :
బినైన్‌ పారాక్షిస్మల్ పొజిషనల్ వర్టిగో(benign paroxysmal positional vertigo) , 
కంకషన్‌ (concussion),
వస్టిబ్యులార్ మైగ్రైన్‌ (vestibular migraine),
అరుదుగా : (rarely)
మినియర్స్ డిసీజ్ (meniere's disease),
వెస్టిబ్యులార్ న్యూరైటిస్ (vestibular nuritis),
అతిగా మద్యపానము (excessive alcohol intake),
చిన్నపిల్లలు తిరుగు ఆట (spinning game of children) , మున్నగునవి .

వర్టిగో వర్గీకరణ :
1)బాహ్య పరమైన వర్టిగో ,2)కేంద్ర పరమైన వర్టిగో .

బాహ్య పరమైన వర్టిగో : లోపల చెవి లేదా వెస్టిబ్యులార్ సిస్టం సమస్యల వలన అనగా సెమిసర్క్యులార్ కెనాల్ , ఆటోలిత్ మరియు వెస్టిబ్యులార్ నరము లతో కూడుకున్న సమస్యల వలన ముఖ్యము గా " బినైన్‌ పరాక్షిసమల్ పొజిషనల్ వర్టిగో() 32 శాతము , మీనియర్స్ సిండ్రోం , సుపీరియర్ కెనాల్ డెహిసెన్‌సు సిండ్రోం , లాబెరింతైటిస్ మరియు వీటి సంబంధిత జబ్బులు మూలాన కలుగును.  ఇది ఎక్కువగా జలుబు, ఫ్లూ జరాలు , లోపల చెవి లో తగిలిన గాయాలు అనగా రసాయనిక లేదా బయటి కపాలానికి తగిలిన గాయాలు , కొన్ని సమయాలలో ప్రయాణము ద్వారా వికారము వలన సంభవించును.  అసమతుల్యము , వికారము , వాంతి, వినికిడి లోపము , చెమిలో హోరు , చెవినొప్పి మున్నగు బాదలు కలుగును. పెరిఫెరల్ వర్టిగో సర్దుబాటు గుణము మూలంగా కొన్ని రోజులలో తగ్గి;ఫోవును లేదా అదుపులొనే ఉండును.

కేంద్ర పరమైన వర్టిగో .> ఇది చెవి సంబంధిత మెదడు భాగాలు సమస్యలు వల్ల కలుగును .కపాలము ఎముల ఫ్రాక్చర్స్ , మెదడులో రక్తస్రావము , మెదడులో కంతులు , మూర్చ , మెడ భాగం వెన్నుపూస సమస్యలు , మైగ్రైన్‌ తలనొప్పులు, లేటరల్ మెడుల్లరీ సిండ్రోం , మల్టిపుల్ స్క్లీరోసిస్ , పార్కి్న్‌సోనిజం మొకలైన వ్యాదుల ప్రబావము వలన కలుగును.  కేంద్రపరమైన వర్టిగో లో నరాలకు సంబందించిన ... మాటమేస , వస్తువు రెండుగా కనిపించడము , అసమతుల్యము కొన్ని సమయాలలో వ్యక్తి నవలేక పోవడము ... తూలిపోవడము జరుగును .

లక్షణాలు :
తూలిపోవడము , నడవలేకపోవడము , వికారము , వాంతి , నిలబడడములో సంతుల్యము లేకపోవడము , ఎక్కువ చెమట పోయడము , నినికిడి లోపము , చూపులోపాలు(డబుల్ విజన్‌) , మాటమేస , పరిసరాల గమనిక లోపము  మఒదలైనవి ఉంటాయి.

జాగ్రత్తలు

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తలతిరుగుడు సమస్య నుంచి బయటపడొచ్చు. వెర్టిగోతో బాధపడేవారు ఈత కొట్టకూడదు. మంట దగ్గర ఉండకూడదు. వాహనాలు నడపకూడదు. జంతువులతో ఆడకూడదు. బాత్‌రూంకు వెళ్లినప్పుడు తలుపు గడియపెట్టకూడదు. ఎందుకంటే ఈ సమయంలో కళ్లు తిరిగి పడిపోతే, సహాయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి. మానసిక ఒత్తిడి తగ్గంచుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. రక్తపోటు (బీపి), మధుమేహం ఉన్నవారిలో సెంట్రల్‌ వర్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని చెక్‌ చేసుకుంటుండాలి. ధూమాపానం, ఆల్కహాలు అలవాటు వల్ల సెంట్రల్‌ వర్టిగో వచ్చేందుకు ఆస్కారముంది. వీటిని వెంటనే మానాలి. జీవన శైలిలో మార్పులు రావాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. కనీసం రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్‌ చేయాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలో ఉండేట్లు చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న వారు పాలు, మీగడ, వెన్న, నెయ్యి వాటిని మితంగా తీసుకోవాలి. ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండాలి. రోజుకు రెండు నుంచి ఐదు రకాల పండ్లు తీసుకోవాలి.

వర్తిగో లక్షణాలు గల ఇతర వ్యాధులు : 

Benign paroxysmal positional vertigo,

Vestibular migraine,

Ménière's disease,

Vestibular neuritis,

Motion sickness.


Vertigo - వర్టిగో చికిత్స (మందులు):for general purpose->
 • సిన్నర్జిన్‌ – 25 మిల్లీ గ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు రోజూ రెండు సార్లు వాడాలి.
 • డోమ్‌పెరిడోన్‌ – 10 నుండి 20 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు వాడాలి.
 • బీటా హిస్టిన్‌ హైడ్రోక్లోరైడ్‌ – 8,16,24 మిల్లీగ్రాముల డోసులు రోజుకు 2 లేక 3 సార్లు వాడాలి.
 • యాంటి హిస్టమిన్‌సు అనగా సిట్రజైన్‌ 1-2 మాత్రలు రోజూ 10 రోజులు వాడాలి , 


 •  =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, September 27, 2012

Head Reeling - తలతిరగడం

 •  
 ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Head Reeling - తలతిరగడం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తలతిరగడం అనేది ఒక అనుభూతి . ఇందులో ఒకటి మీరు కదులుతు మీ చుట్టు ఉన్న వస్తువులు కదులుతున్నట్లు తిరగడము , రెండోది .. మీరు కదలక పోయినా చుట్టూ ఉన్నది కదులుతున్నట్లు మీ చుట్టూ తిరగడం అనే స్థితి. దీనివలన తూలి పడిపోవడము , స్పృహతప్పిపోవడము జరుగుతుంది. తలతిరగడము ఒక్కోసారి ప్రాణాంతకమూ కావవచ్చును. ఈ లక్షణము మానసికమైనదైనా కావచ్చు లేదా శారీరక వ్యాధి లక్షణమైనా కావచ్చు. దీనికి శరీరములో ముఖ్యముగా మూడు మండలాలు (systems) ప్రభావితమవుతాయి. 1) చెవి ,దానిసంబంధిత నాడీమండలము, 2)కన్ను మరియు దాని సంబంధిత నాడీమండలము .3) భాహ్య స్పర్శ నాడీమండలము -peripheral nervous system .

 • కారణాలు :

 • ఎక్కువ ఎండతీవ్రతకు గురి అయినప్పుడు - sun stroke/extreme exposur to Sun.
 • పనివత్తిడి వలన బాగా అలసిపోయినపుడు -a sign of fatigue and general weakness.
 • రక్తహీనత -Severe Anaemia
 • మానసికం గా స్థిరత్వం లేకపోవుడము- Anxiety/ nervousness
 • రక్తములో గ్లూకోస్ తక్కువ అయినప్పుడు - Hypoglycemia or low blood glucose levels
 • రక్తపోటు మరీఎక్కువ , మరీతక్కువ అయినపుడు -High or low BP
 • మెడ వెన్నుపూసలు నొక్కబడినపుడు -Cevical sondylosis or other causes compressing an artery in your neck.
 • కొన్ని చెవిలోపల కారణాలు - Causes inside your ear like vertigo, menieres disease etc.
 • కొన్ని మెదడు మరియు కపాలము లోపల జబ్బుల కారణములు-Causes inside ur skull/brain like Aneurysma, brain tumours. , migrine etc.
చికిత్స :
కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.

సాదారణము గా తలతిరగడం అదుపుచేయడానికి .
 tab.vertizac 1 tab 2 times /day ,
tab . Stemtil 5mg 1 tab 2-3 times / day,
tab . Diziron  1 tab 3 times / day. ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో వాడాలి
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 22, 2012

Nephrotic Syndrome in children-చిన్న పిల్లల్లో నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - చిన్న పిల్లల్లో నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఇది చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధి.

వ్యాధి లక్షణాలు:
ఈ వ్యాధి మొదటి దశలో తెల్లవారు జామున కళ్ళ చుట్టు వాపు వచ్చి సాయంత్రలోగా తగ్గిపోతుంది. క్రమేపి వాపు రోజంతా ఉంటుంది. కాళ్ళు , పొట్టలో
కూడా వాపు వస్తుంది. తరువాత దశలో మూత్రం కూడా తక్కు వగా వస్తుంది. కొంత మంది పిల్లలో మూత్రం సురుగులాగా, తెల్లగా వస్తుంది.

 •    ఉదయం సమయాలలో కళ్ళ చుట్టూ వాపు ఉంటుంది; ఆ తరువాత కాళ్ళు వాయటంతో శరీరం కూడా వాస్తుంది,
 •     మూత్రం నురుగు వలే లేదా బుడగల వలే వస్తుంది(మూత్రంలోని మాంసకృత్తుల కారణంగా వస్తుంది),
 •     అనవసరమయిన బరువును పొందటం (ద్రవం చేరిక ద్వారా),
 •     ఆకలిమాంద్య (ఆకలి లేకపోవటం),
 •     వికారం మరియు వాంతులు,
 •     వ్యాకులత (సాధారణ రోగ లక్షణం),
 •     అలసట,
 •     తలనొప్పి,
 •     తరచుగా ఎక్కిళ్ళు,
 •     సాధారణమైన దురదలు,


ఎలా నిర్దారిస్తారంటే....

మూత్ర పరీక్షలో ప్రోటీన్‌ ''1+'' నుంచి ''2+'' వరకు ఉంటుంది. ఇలా ఉన్న పిల్లల్లో ఎంత ప్రోటీన్‌ పోతున్నది 24 గంటల తర్వాత మూత్ర పరీక్ష చేయాలి. మామూలు పిల్లల్లో రోజుకి 150 మిగ్రా కంటే తక్కువగా ప్రోటీన్‌ పోతుంది. నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలో 2 గ్రా నుండి 20 గ్రాముల వరకు పోతుం ది. రక్తంలో ప్రోటీన్‌ తగ్గుతుంది. అదే సమయంలో కొలెస్టరాల్‌ పెరుగుతుంది.


వ్యాధి వల్ల ఎదురయ్యే సమస్యలు...

సెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది.


చిన్న పిల్లల్లో నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ చికిత్స.....
ఈ వ్యాధి ఉన్నట్లు నిర్దారణ అయిన తరువాత డాక్టర్‌ పర్యవేక్షణలో మూడు నెలలు పాటు మందులు వాడాల్సి ఉంటుంది. మందులు ప్రారంభించే ముందు ఇన్‌ఫెక్షన్‌ లేదని నిర్ధార ణ చేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లయితే ఇన్‌ఫెక్షన్‌ తగ్గేందుకు మందులు వాడిన తర్వాతే వ్యాధి నయమయ్యేందుకు మందులు  వాడాలి. మొదటిసారిగా పూర్తిగా మూడు నెలలపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడాలి.


సపోర్టివ్ చికిత్స :
 •     పర్యవేక్షణ మరియు అంచనా (శరీరంలో ద్రవం యొక్క సరైన మొత్తం) నిర్వహించడం.
 •         BP క్రమం తప్పకుండా చూడడం , మూత్ర విసర్జన పర్యవేక్షణ.
 •         ఫ్లూయిడ్ 1 L. కు పరిమితం,
 •         డైయూరిటిక్లు ( furosemide).
 •     మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడం:
 •         రోజువారీ మరియు GFR గణన EUCs చేయండి.
 •     మరింత అథెరోస్క్లెరోసిస్ నివారించడానికి హైపర్లిపిడెమియా చికిత్స.
 •      ఏ సమస్యలు వచ్చినా చికిత్స లేదా ప్రివెన్‌షన్‌ చేయడము ,
 •      అల్బుమిన్  infusions లను సాధారణంగా ఉపయోగించరు,
 • రోగనిరోధక ప్రతిస్కంధకం కొన్ని పరిస్థితులలో సముచితం.

ప్రత్యేక చికిత్స :

    Glomerulonephritides కోసం రోగనిరోధకశక్తి అణచివేత (కార్టికోస్టెరాయిడ్లు,  ciclosporin). మొదటి భాగం కోసం ప్రామాణిక ISKDC పాలన: ప్రెడ్నిసొలోన్ 4 వారాలు ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఒక్క మోతాదు 40 mg/m2/day,
తర్వాత - 4 వారాలు 3 విభజించబడింది మోతాదులో -60 mg/m2/day.

    ప్రెడ్నిసొలోన్ 2 mg / మూత్రం వరకు kg / రోజు  పునఃస్థితులు ప్రోటీన్ వ్యతిరేక అవుతుంది. అప్పుడు, 1.5 mg / 4 వారాలు kg / day.     ద్వారా చికిత్స తరచుగా పునఃస్థితులు: సైక్లోఫాస్ఫామైడ్ లేదా నత్రజని ఆవాలు లేదా ciclosporin లేదా levamisole.

    రోగి డయాబెటిక్ ఉంటే మంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణ సాధించడం.

    రక్తపోటు నియంత్రణ. ACE ఇన్హిబిటర్స్ని వాడాలి.. , రక్తపోటును ఇండిపెండెంట్ గా మందులు వాడవలసి ఉంటుంది ,  ప్రోటీన్ నష్టం తగ్గించడానికి ప్రయంచాలి..


ఆహారం

రోజువారీ 1000-2000 mg కు సోడియం తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా కలిగిన ఆహారాలు ఉప్పు మిశ్రమాలు (వెల్లుల్లి ఉప్పు, Adobo, సీజన్ ఉప్పు, మొదలైనవి) తయారుగా చారు, టర్కీ, హామ్, బోలోగ్నా, మరియు సలామీ సహా ఉప్పు, విందు మాంసాలు కలిగి తయారుచేసిన  కూరగాయలు, PREPARED FOODS మసాలా వంట వాడరాదు  , ఫాస్ట్ ఫుడ్స్, సోయ్ సాస్, కెచప్, సలాడ్ డ్రెస్సింగ్.పనికిరావు .

ఆహార లేబుళ్లపై, అందిస్తున్న ప్రతి కెలోరీలు సోడియం మిల్లీగ్రాముల పోల్చండి. సోడియం కంటే తక్కువ లేదా అందిస్తున్న ప్రతి కేలరీలు సమానంగా ఉంటుంది.

భోజనం 3-5 ఔన్సులు (ప్రాధాన్యంగా లీన్ మాంసం యొక్క ముక్కలు, చేప, మరియు కోళ్ళ)తీసుకోవచ్చును.

వెన్న, జున్ను, వేయించిన ఆహారాలు, ఎరుపు మాంసం కొవ్వు కోతలు, గుడ్డు సొనలు, మరియు కోళ్ళ చర్మం సంతృప్త కొవ్వులు నివారించండి.

ఆలివ్ నూనె , కరగని క్రొవ్వు  తీసుకోవడం పెంచండి, చమురు, పీనట్ బటర్, avocadoes, చేపలు మరియు గింజలు , తక్కువ కొవ్వు డిజర్ట్లు బాగుంటుంది.

పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం పెంచండి.  పొటాషియం లేదా భాస్వరం పరిమితి అవసము లేదు .

అన్ని ద్రవాలు మరియు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవం అని FOODS కలిగి ద్రవం తీసుకోవడం లో జాగ్రత్త వహించాలి , . నెఫ్రోటిక్ సిండ్రోమ్ ద్రవ నిర్వహణ  ప్రత్యేకంగా జాగ్రత్త, ముఖ్యము గా వ్యాధి  తీవ్రమైన ఎక్యూట్  సమయంలోజాగ్రత్త  ఉండాలి .

కొంత మంది పిల్లల్లో మందులు మానగానే మళ్లీ ప్రోటీన్‌ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంత మందిలో మందుల వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశముంది. దుష్ఫలితాలు వచ్చినప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఈ వ్యాధి 12 నుండి 14 సంవత్సరాల వయసులో పూర్తిగా నయం అవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ.


చిన్న పిల్లల్లో నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌చికిత్స పర్యవేక్షణ.....

మందులు ప్రారంభించిన రెండు, మూడు వారాల తర్వాత మూత్ర పరీక్షలో ప్రోటీన్‌ పోవడం తగ్గిందని నిర్ధారించుకోవాలి. ప్రోటిన్‌ పోవడం తగ్గిన తర్వాత కూడా  నిర్ణీత వ్యవధి వరకు మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే వ్యాధి తిరిగివచ్చే   అవకాశం ఉంటుంది. చికిత్స సమయంలో జ్వరం లేదా దగ్గు, కడుపులోనొప్పి, మూత్రంలో మంట ఉన్నట్లయితే ఇన్‌ఫెక్షన్‌ఉండే అవకాశం ఉంది.

వ్యాధి సహజ క్రమం...
40 శాతం పిల్లల్లో మొదటిసారినిర్ణీత వ్యవధి వరకు మందులు వాడితే ఇది మళ్ళీ రాదు. మొదటి సారి మందులు వాడినట్లయితే కొందరిలో వ్యాధి 10-12  సంవత్సరాల వయస్సు వరకు మళ్ళీ మళ్లీ వస్తుంది. మందులు వాడడం నిలిపి వేసిన తర్వాత జలుబు, దగ్గు, లేదా వాంతులు, విరోచనాలు అయినప్పుడు మూత్ర పరీక్ష చేసి వ్యాధి మళ్ళీ వచ్చిందో తెలుసుకోవాలి. కొందరు పిల్లల్లో మందులు ఆపిన వారం రోజుల లోపు మళ్లీ వ్యాధి తిరగబడుతుంది. అలాంటి వారు డాక్టర్‌ పర్యవేక్షణలో తక్కువ మోతాదులో ఆరు నెలల నుండి సంవత్సరం వరకు  మందులు వాడాలి. కొందరు పిల్లల్లో మందులు వాడినప్ప టికీ మూత్రంలో ప్రోటీన్‌ పోవడం తగ్గదు.

బిపి ఎక్కువగా ఉన్నవారికి మూత్రం లో ప్రోటీన్‌ పాటు రక్తం కూడా పోతుంది. వారికి మందుల వల్ల వ్యాధి తగ్గదు. కిడ్నీ బయాప్సీ చేసి అందుకు అనుగుణంగా  మందులు వాడాలి. 95 శాతం పిల్లల్లో ఈ వ్యాది 10 -12 సంవత్సరాల వయస్సు వరకు పూర్తిగా తగ్గిపోతుం ది. వీరిలో దీర్ఘకాలికంగా కిడ్నీ పనిపై ఏ ప్రభావం ఉండదు. మిగిలిన 10 శాతం పిల్లలో కిడ్నీ ఫంక్షనింగ్‌ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

కిడ్నీ (మూత్రపిండాలు) పని శాతం 15 కంటే తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి నాలుగోదశ అంటారు. ఈ దశలో డయాలసిస్‌ అవసరం ఏర్పడుతుంది. ఒకసారి ఈ దశకు చేరుకున్న తర్వాత కచ్చితంగా వారినికి  మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవడం మంచిది. కొంత మంది ఒక సారి లేదా రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకున్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉండవు. కానీ క్రమం తప్పితే డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల ఇతర అవయవాల మీద దీని దుష్ఫలితాలు ఉంటాయి. ఇలా క్రమరహితంగా డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల గుండె పనిచేయడం తగ్గుతుంది. జీవన ప్రమాణాం తగ్గే అవకాశముంది.

తల్లిదండ్రులకు సూచనలు.....
* వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు తక్కువగా వాడాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న అహార పదార్థాలు తగ్గించాలి.
* చికిత్స ప్రారంభిన వారం రోజుల్లో మూత్రం లో ప్రోటీన్‌ పోవడం తగ్గినప్పటికీ నిర్ణీత వ్యవధి వరకు సక్రమంగా ముందు వాడాలి.
* జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పడు వ్యాధి తిరిగి వచ్చిందో తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.
* వాపు తగ్గడానికి, మూత్రం ఎక్కువగా వచ్చేందుకు మందులు ఎక్కువగా వాడరాదు.
* పరిశుభ్రతమైన నీరు వాడాలి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి (చికెన్‌ఫాక్స్‌, జలుబు, దగ్గు) పిల్లలను దూరంగా ఉంచాలి..


Courtesy with ...డా గందే శ్రీధర్‌-చీఫ్‌ నెఫ్రాలిజిస్ట్‌-అవేర్‌ గ్లోబల్‌ హాస్పటల్‌-హైదరాబాదు.
 • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 19, 2012

మూత్రపిండాల జబ్బులు...అవగాహన-kidney diseases...Awarenessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూత్రపిండాల జబ్బులు...అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఎర్ర రక్తకణాల తయారీలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఎముకల పటిష్టతను కాపాడాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బుపడితే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం...

దీర్ఘకాల మూత్రపిండాల (కిడ్నీలు) వ్యాధికి కారణం మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతిపెద్దది మధుమేహం. సుమారు 40 నుంచి 50 శాతం వరకు మూత్రపిండాల వ్యాధులు రావడానికి ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది. కిడ్నీలోని ప్రత్యేక ఫిల్టర్లను దెబ్బతీసే గ్లోమరూలార్‌ డిసీజ్‌ మూడవ ప్రధాన కారణం. ఈ జబ్బున్న వారికి మూత్రంలో ప్రోటీన్‌ ఎక్కువగా పోతుంది. ఫలితంగా కాళ్లల్లో వాపు, మొహం వాచినట్లుంటుంది. నురగగా మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవే కాకుండా ఎలాంటి కారణం లేకుండానూ కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలో మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటర్‌స్టిషియల్‌ వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు. కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బులు కూడా ఇతర కారణాలు. అయితే 80 శాతం మాత్రం మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు.

ఎవరికొస్తాయి ?

చిన్న పిల్లల్లో అయితే జన్యుపరమైన కిడ్నీలోపాలున్న వారికి వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వల్ల పెద్ద వాళ్లకు కిడ్నీలు దెబ్బతింటాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసే వారికి, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది.

లక్షణాలు

కాళ్లవాపులు, మొహం వాచినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, ఆగకుండా వాంతులవడం, నీరసంగా ఉండడం, ఆయాసం రావడం, రాత్రివేళ మూత్రం కోసం నిద్రలేవడం, తక్కువ మూత్రం రావడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలుంటాయి. 50 శాతం కిడ్నీలు పాడైతేనే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స

కిడ్నీ వంద శాతం పాడైనప్పుడు కిడ్నీ మార్పిడితో రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరికీ సాధ్యమవదు. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. దాత అవసరం అవుతారు. అరవై ఏళ్లుపైబడిన వారికి కిడ్నీ మార్పిడి చేయడం సాధ్యం కాదు. మార్పిడికి ప్రత్యామ్నాయం డయాలసిస్‌ (రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ) ఇది రెండు రకాలు. ఒకటి హీమో డయాలసిస్‌, రెండోది పెరిటోనియల్‌ డయాలసిస్‌.

హీమోడయాలసిస్‌

ఇది యంత్రం ద్వారా రక్తన్ని శుద్ధి చేసే ప్రక్రియ. కృత్రిమ కిడ్నీ ద్వారా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధిచేస్తారు. దీని కోసం వారానికి మూడుసార్లు రోజు విడిచి రోజు డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లాలి. సుమారు నాలుగు నుండి ఐదు గంటలు సమయం కేటాయించాలి.

పెరిటోనియల్‌ డయాలసిస్‌

ఇది ఇంట్లో చేసుకునే డయాలసిస్‌. దీన్నే 'కంటిన్యూయస్‌ అంబులేటరీ పెరిటోనియల్‌ డయాలసిస్‌' అని అంటారు. డయాలసిస్‌ ఒక ఆసరా. అంతేకాని పూర్తి ప్రత్యామ్నాయం కాదు. అయినా కొన్నిప్రత్యేక పరిస్థితుల్లో ఇంట్లో డయాలసిస్‌ చాలా ఉపయోగకరం. ఆహారంతో, తాగే నీటి పరిమాణంలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే యదేచ్ఛగా తినవచ్చు. తాగొచ్చు. పెరిటోనియల్‌ డయాలసిస్‌ ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు.

కిడ్నీ మార్పిడి

ప్రపంచంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమమైన విధానం కిడ్నీ మార్పిడి. కిడ్నీ మార్పిడి, హీమోడయాలసిస్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటికి ప్రత్యామ్నాయం ఇంట్లో చేసుకునే డయాలసిస్‌. దీనికి నెలసరి ఖర్చు తక్కువగా ఉంటుంది. నెలకు సుమారు రూ.12 వేల నుండి 15 వేల వరకు ఉంటుంది. ఆశావాద దృక్పథంతో శాస్త్రీయతను ఉపయోగించుకునే వారికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆరోగ్యకరమైన సాధారణ జీవితానివ్వగలదు.

కిడ్నీలో రాళ్లు - లక్షణాలు

* భరించలేనినొప్పి. మూత్రంలో రక్తం పడడం. ఈ పరిస్థితి కిడ్నీ, యూరేటర్‌, యూరెత్ర గోడల్లో ఏదో ఒకటికానీ, అన్ని కానీ దెబ్బతిన్నప్పుడు సంభవిస్తుంది.

* మూత్రంలో చీము రావడం.

* విసర్జనసమయంలో మార్గం మంటగా అనిపించడం. మూత్రంతోపాటు చిన్న రాళ్లు వచ్చినప్పుడు లేదా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు కనిపిస్తుంది.

* మూత్రం పరిమాణం తగ్గడం. యురెత్రాలో కానీ, మూత్రాశయంలోకానీ లేదా రెండింటిలో కానీ రాళ్లున్నప్పుడు జరగొచ్చు.

* తల తిరగడం, వాంతులవడం, చలి జ్వరం కూడా రావొచ్చు.

* రాయి యురేటర్‌ని బ్లాక్‌ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయడం.

* ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం.

* జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్త కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తిలేకపోవడం. బరువు తగ్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు

* ఎక్కువ నీళ్లు తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి.

* ప్రోటీన్‌, నైట్రోజన్‌, సోడియం ఉన్న పదార్థాలను తగ్గించాలి.

* ఆక్సిలేట్‌ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్‌, పాలకూర, చాక్లెట్లు వంటి వాటిని మినహాయించాలి.

* కాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి. అలాగే కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో ఆహార నియమాలను అనుసరిస్తే మంచిది. అరటి, నిమ్మ, క్యారట్‌, కాకరకాయ, పైనాపిల్‌, కొబ్బరినీళ్లు, బార్లి, ఉలవలు మేలు చేస్తాయి.

* ఆల్కహాలు తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌ కలుగుతుంది. క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడే అవకాశం ఎక్కువ.

* నారింజ పళ్ల రసానికి కాల్షియం ఆక్సిలేట్‌ రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది.

విటమిన్‌-సి ఎక్కువగా తీసుకోవడం కూడా రాళ్ల సమస్యకు దారితీసే అవకాశముంది. కూల్‌డ్రింకులను మినహాయించాలి.

కాఫీలోని కెఫిన్‌ అనే పదార్థం మూత్రంలోని కాల్షియం విసర్జనకు దోహదం చేస్తుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలోని నివారించుకోవచ్చని పరిశోధనలు వెల్లడించాయి.

source : Raksha@prajasakti news paper
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, September 17, 2012

లైపోసక్షన్‌-Lipo succtionఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లైపోసక్షన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...లైపోసక్షన్ చికిత్సలో సూక్ష్మగొట్టాలు, అల్ట్రాసోనిక్‌ తరంగాలు, ఇంజెక్షన్‌ వంటి వాటిని ఉపయోగించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు.

నేటి సమాజంలో ఊబకాయం ఓ పెద్ద సమ్యసగా మారింది. శరీరానికి తగినంత వ్యాయామం, శారీరక శ్రమ వుండక పోవటంతో ఏర్పడేదే ఊబకాయం! చాలామంది లావును తగ్గించుకోవాలని అనేక రకాలుగా కష్టపడు తుంటారు. తిండిమానేయడం వంటి కష్టాలు లేకుండా బరువు తగ్గాలని షార్ట్‌కట్స్‌ వెదుకు తుంటారు. అటువంటి వారి కోసం రకరకాల పరికరాలు మార్కెట్‌లో లభ్యమవు తున్నాయి. అయినా ఇంకా సులభమైన మార్గం కోసం వెదుకుతున్నారు. ఈ బిజీలైఫ్‌లో ఆ పరికరాలను ఉపయోగించడానికి కూడా సమయం లేదు. అటువంటి వారి కోసం ఆధునిక వైద్య శాస్త్రం ఓ సులువైన మార్గాన్ని మనముందుకు తెచ్చింది. ఇది ఓ శస్త్ర చికిత్స. దీని పేరు లైపోసక్షన్‌''!ఊబకాయం నుంచి విముక్తికి 'లైపోసక్షన్‌'-- అసలు స్థూలకాయం అంటే ఏమిటి? ఇది ఏరకమైన వ్యాధి? ఏ వయసు వారికి వస్తుంది?

శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు వున్న వారిని స్థూలకాయులు అంటారు. మనిషి ఎత్తును బట్టి బరువును లెక్కిస్తారు. మనిషి ఎత్తును సెంటీమీటర్లలో కొలిసి ... దానినుండి 100 ని తీసివేయగా వచ్చిన సంఖ్య సుమారుగా ఆమనిషి బరువు కి.గ్రా లో ఉంటుంది. శరీరం సంరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ శరీర బరువును పరీక్షించుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు, నియమావళితో బరువు తగ్గొచ్చు. ఎలా అంటే... ఓ ప్రణాళికాబద్ధంగా కొన్ని నియమనిబంధనలను తయారు చేసుకోవాలి, వాటిని తప్పక పాటించాలి. బరువు తగ్గాలనుకునేవారు ఆహార విషయంలో పూర్తి శ్రద్థవహించాలి. అలా అని తినడం మానేయడం, డైటింగ్‌ పేరుతో ఉపవాసముంటే లేనిపోని అనర్థాలను కోరి తెచ్చుకున్నవారౌతారు. ఆహారం ప్రణాళికాబద్ధంగా తినాలి. ప్రతిరెండుగంటలకు కొద్ది కొద్దిగా తింటుండాలి. తినేటప్పుడు ఆహారాన్ని మింగేయ కుండా ఎక్కువసేపు నమలాలి. రాత్రిళ్ళు 8 గంటలలోపుగా భోజనం ముగించిన, రెండుగంటల తర్వాత నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అంతేకాక అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. అదే క్రమంలో అధిక మోతాదులో మంచినీరు తాగాలి. అయితే నీరు తాగేందుకు పగటిపూటే అధిక ప్రాధాన్యతనివ్వాలి. కాని ఈ ప్రక్రియ ఈ నాటి బిజీలైఫ్‌లో కష్టతరంగా మారింది.

లైపోసక్షన్‌ : లైపోసక్షన్‌ ఎటువంటి శ్రమలేకుండా బరువు తగ్గేందుకు ఆధునిక వైద్యం సహాయ పడుతోంది. నగర జీవితాల్లో శారీరక శ్రమ తగ్గిపోవడంతోపాటు ఆహార అలవాట్లలో మార్పులు రావటంతో శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఒంట్లో పేరుకున్న కొవ్వును పెరిగిపోతున్న శరీర బరువును తగ్గించుకోవడానికి వాకింగ్‌, జాగింగ్‌, యోగా వంటి వ్యాయామాలను చేసేవారిని మనం రోజూ చూస్తున్నాం. ఏం చేసినా కొవ్వు కరగక పోవటంతో పలురకాల సమస్యలతో సతమత మవుతున్నారు కొందరు. ఇటువంటి వారి కోసమే 'లైపోసక్షన్‌' అందుబాటులోకి వచ్చింది.

లైపోసక్షన్‌ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం. ఇది ఓ రకమైన ఆధునిక శస్త చికిత్స. ఈ చికిత్సలో సూక్ష్మగొట్టాలు, అల్ట్రాసోనిక్‌ తరంగాలు, ఇంజెక్షన్‌ వంటి వాటిని ఉపయోగించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఏ ఏ శరీర భాగాలంటే బుగ్గలు, మెడ, చేతులు, నడుము, తొడలు, వంటిభాగాలనుండి లైపోసక్షన్‌ ద్వారా సులభంగా కొవ్వును తొలగించ వచ్చు. లైపోసక్షన్‌ ద్వారా సైడ్‌ఎఫెక్ట్స్‌ లేవు. ఎటువంటి బలహీనత రాదు. లైపోసక్షన్‌తో సన్నగా మారటంతో అధిక బరువు వల్ల వచ్చే బి.పి, మధుమేహం , గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా వుండవచ్చు. లావుగా వుంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని, వెంటనే సన్నగా మారేందుకు లైపోసక్షన్‌ చేయించుకోమని కొంతమంది వైద్యులు కూడా సూచిస్తున్నారు.

లైపోసక్షన్‌ ఎవరైనా చేయించుకోవచ్చా అంటే అవును, ఆరోగ్యంగా వున్నవారు ఎవరైనా చేయించు కోవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే షుగర్‌, బి.పి, థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అవి అదుపులో వుంటేనే ఈ చికిత్స సాధ్యం. అలా అని లైపోసక్షన్‌తో ఒక సిట్టింగ్‌లోనే శరీరంలో పేరుకున్న కొవ్వును తొలగించేస్తారు అనుకోవటం పొరపాటే. కొందరికి రెండు , మూడు సిట్టింగులు కూడా అవసరమవు తాయి.

ఏ వయసు వారికి ఎంత కొవ్వును తొలగించవచ్చు?

 • ఒక సిట్టింగ్‌లో 25 నుండి 35 సంవత్సరాల వారికి 8నుండి 10 లీటర్ల వరకు కొవ్వును తొలగించవచ్చు. అదే 25 సంవత్సరాల లోపు వారికి 12 లీటర్ల వరకు తొలగించవచ్చు. ఇక 35 నుండి 45 సంవత్సరాల వారికి 8 లీటర్లు, 45 సంవత్సరాలు పై బడిన వారికి 5 లీటర్లు తీసి వేయవచ్చు. వయస్సును బట్టి' సిట్టింగ్స్‌ నిర్ణయిస్తారు .

చికిత్సా విధానం
 • లైపోసక్షన్ అంటే 3-4 మిల్లిమీటర్లు రంధ్రాలు చేసి చర్మం కింద కేంద్రీకృతమైన కొవ్వును ద్రవరూపంలో తీసే పద్ధతి. ఇది పూర్తిగా కాస్మొటిక్ సర్జరీ. లైపోసక్షన్ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.

శరీరంలో కొవ్వు ద్రవరూపంలో ఉండదు. దాన్ని లైపోసక్షన్‌లో ద్రవంగా మార్చి రంధ్రం ద్వారా వెలుపలికి తీయడం జరుగుతుంది. కొవ్వు పొరల్లోకి నార్మల్ సెలైన్ (ఎన్ఎస్) ఎక్కించడంతో అది నీటిలో ముంచిన స్పాంజి మాదిరిగా తయారవుతుంది. దానివల్ల కొవ్వు పొరలు వేరవుతాయి. రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి.

కొవ్వును చేతితో కాన్యులా సహాయంతో, అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా కరిగించి ద్రవరూపంలోకి మారుస్తారు. అల్ట్రాసోనిక్ తరంగాలు, శరీరంలో ఏ విధమైన దీర్ఘకాలిక మార్పులు, హాని చేయవని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది అచ్చం ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌లాగానే ఉంటుంది. మూడోది అల్ట్రాసోనిక్ పద్ధతి ద్వారా ద్రవరూపంలోకి మారిన కొవ్వును సక్షన్ పంప్ సాయంతో బయటకు లాగుతారు.

 • అల్ట్రాసోనిక్ లైపోసక్షన్
సాధారణ పద్ధతిలో కంటే అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ ద్వారా రక్తస్రావం చాలావరకు తగ్గుతుంది. నొప్పులు తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా విధులకు హాజరు కావొచ్చు. ఈ చికిత్స కూడా తక్కువ సమయంలో పూర్తవుతుంది. బరువు విషయంలోనే కాకుండా పురుషుల్లో ఛాతీ పెరుగుదలను అంటే గైనకోమాస్టియాతో బాధపడుతున్న వారికి కూడా ఈ పద్ధతిలో గ్రంధులు కరిగించడం వీలవుతుంది. దీనివల్ల మచ్చలు ఏర్పడవు.

 • దుష్ప్రభావాలు :
లైపోసక్షన్‌ ద్వారా ఎటువంటి నొప్పులు వుండవు. ఈ సర్జరీకి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్జరీ అనంతరం మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఎటువంటి నొప్పులు రావు, ఎప్పటిలాగానే పనులన్నీ చేసుకోవచ్చు. కొవ్వును తీసివేసినా చర్మం వదులుగా మారకుండా వుండేందుకు సర్జరీ అనంతరం 'ప్రెషర్‌ గార్మెంట్స్‌'నే ధరించాల్సివుంటుంది. వీటిని ధరించడం వల్ల చర్మం క్రిందిపొరకు అతుక్కు పోతుంది. ఈ చికిత్సలో శరీరంలో మూడు నుండి నాలుగు మి.మీ.ల చిన్నపాటి రంధ్రాన్ని చేస్తారు.అనంతరం అందులో నుండి వేజర్‌ ప్రోప్స్‌ను పంపించి కొవ్వును కరిగించి తీసేస్తారు. అల్ట్రాసౌండ్‌ ఎనర్జీతో సెకనుకు 36 వేల వైబ్రేషన్‌లతో వేజర్‌ప్రోప్‌ ద్వారా కొవ్వును తీస్తారు. దీనిలో రక్తస్రావం చాలా తక్కువగా వుంటుంది. ఒక లీటరు కొవ్వులో 10.మి.లీ.ల కంటే తక్కువ రక్తం పోతుంది. 10 లీటర్ల కొవ్వును తీసినప్పుడు కూడా 100మి.లీ.ల రక్తం పోతుందని వైద్యుల అంచనా.

 • జాగ్రత్తలు
లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత కంప్రెషర్ గార్మెంట్స్‌ను కనీసం రెండు వారాలు వేసుకోవాలి. ఈ దుస్తులు వేసుకోవడం వల్ల గాయం త్వరగా మానడమే కాకుండా, ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఏర్పడే వాపు, చీము పట్టడం లాంటి దుష్ప్ర్రభావాలు ఉండవు. ప్రత్యేకంగా మెష్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసే ఈ కంప్రెషర్ గార్మెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన ద్రవాన్ని తయారుచేసే లింఫాటిక్ వ్యవస్థను పరిరక్షించడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయి. తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామాన్ని రెండు వారాల తరువాత మొదలుపెట్టాలి.

అందాన్ని కాపాడుకోవాలనుకునేవాళ్ళూ, ఆరోగ్యం పట్ల అవగాహన వున్నవారు ఈ సర్జరీపట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్‌ వరల్డ్‌లో వున్నవారైతే వారి అవసరాలరీత్యా దీనిని ఆశ్రయిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా విదేశాల్లో లైపోసక్షన్‌ ఎక్కువగా చేస్తున్నారు. అమెరికా ప్లాస్టిక్‌ సర్జరీ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం గత ఏడాది 16 లక్షల మంది లైపోసక్షన్‌ చేయించుకున్నారు. మన దేశంలో కూడా గత ఏడాది 4 లక్షల మంది లైపోసక్షన్‌ ద్వారా లబ్దిపొందారు. చూడ చక్కని శరీరాకృతి కొరకు నేడు ఈ చికిత్స విదేశాల్లోనే గాక మన దేశంలోని ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి వచ్చేసింది. దీనిని ఆరోగ్యవంతులు ఎవరైనా చేయించుకోవచ్చు. అందమైన ఆకృతిని పొందవచ్చు. అనుభవజ్ఞుడైన కాస్మెటిక్‌ సర్జన్‌లు దగ్గరే ఈ చికిత్స చేయించుకోవాలి..

ఇది గుర్తుంచుకోవాలి!

ఒకసారి కొవ్వు తొలగించాక.. మళ్లీ అక్కడ కొవ్వు పెరగదన్నది పెద్ద అపోహ! ఆహార నియమాలు, వ్యాయామం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే తిరిగి కొవ్వు పెరుగుతుందని మరవకూడదు. నిజానికి మన చర్మంలో ఉండేది 80% కొవ్వే. చర్మం సజీవంగా ఉండాలంటే కొవ్వు తప్పనిసరి. కొవ్వు మొత్తం తీసేస్తే చర్మం కుళ్లిపోతుంది. అందుకే లైపోసక్షన్‌ చేసే సమయంలో కొంత కొవ్వు అక్కడ మిగిలి ఉండేలా జాగ్రత్త పడతారు. ఆపరేషన్‌ అనంతరం జీవనశైలి మార్చుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కొవ్వు మళ్లీ పెరిగి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. 
 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, September 16, 2012

హంటా వైరస్ , Hanta Virusఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -హంటా వైరస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వైరస్ వ్యాధులు లేదా వైరస్ల వల్ల మనుషుల్లో వచ్చే-- సాధారణ వ్యాదులలో జలుబు , ఫ్లూ , మశూచి ,చికెన్ పాక్స్ , చికెన్ గున్యా, డెంగూ జ్యరం ముఖ్యమైనవి.
ప్రాణాంతకమైన ఎబోలా , ఎయిడ్స్ , ఏవియన్ ఫ్లూ , రేబిస్ , వైరల్ హెపటైటిస్ , జపనీస్ ఎన్సెఫలైటిస్ మరియు సార్స్ కూడా వీటి ద్వారానే కలుగుతాయి. వైరస్లకుండే వ్యాధి కలిగించగలిగే లక్షణాన్ని పోల్చుకోవటానికి విరులెన్స్ అనే పదాన్ని వాడతారు. నాడీసంబంధ వ్యాధులకు ఏమయినా వైరస్లు కారకాలా అనేది ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది. మల్టిపుల్ స్క్లీరోసిస్ వంటివి. కాన్సర్ వ్యాధిని కలుగజేసే వైరస్ లూ ఉన్నాయి ఉదా: మానవ పాపిల్లోమా వైరస్.


హంటా వైరస్ : ఇవి ఆర్.ఎన్‌.ఎ. రకము వైరస్లు .Bunyaviridae ఫామిలీ చెందినవి. హంటర్ వైరస్ అనే కంప్యూటర్ వైరస్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు.

డెంగ్యూ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని.. మరో డేంజర్‌ వైరస్‌ - హంటా వైరస్ - టార్గెట్‌ చేసేందుకు సిద్ధమైంది.. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది... దీని లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయి.. ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ వైరల్ డ్రగ్‌ తీసుకుంటే ప్రమాదం లేదు. ఈ ప్రమాదకర రోగకారక వైరస్‌ ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది .. ఇది ప్రమాదకరమైన hemorrhagic fever, తద్వారా Renal syndrome , pulmonary syndrome లను కలుగజేస్తాయి.

ఈ వైరస్‌ సోకితే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి... ఈ హంటర్‌ వైరస్‌ లక్షణాలు హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిలో బయటపడ్డాయి. రాష్ట్రంలో ఇది మొదటి కేసని డాక్టర్లు చెబుతున్నారు. మొదట డెంగ్యూ జ్వరంగా భావించి చికిత్స చేసిన డాక్టర్లు... అది కాదని తేలడంతో ముంబయిలోని ల్యాబొరేటరీలో రోగి రక్త నమూనాల పరీక్షలు చేయించగా... హంటా వైరస్‌గా నిర్థారణ అయ్యింది.. ప్రాథమిక దశలోనే ఈ వైరస్‌ను గుర్తించకపోతే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు...


హంటా వైరస్‌ లక్షణాలు...----

 • తీవ్ర జ్వరం వస్తుంది----
 • ఉన్నట్టుండి కండరాల నొప్పి----
 • ఆ తర్వాత B.P. తగ్గుతుంది----
 • మూత్రపిండాల పనితీరులో మార్పులు , నీరుడు తక్కువగా అవడం , తరువాత ఫేజ్ లో నీరుడు ఎక్కువగా పోవడము , మూత్రపిడాలు పాడవడము .
 • ఊపిరితిత్తుల సంబంధించి .. ఊపిరి తీసుకోవడములో ఇబ్బంది, గుండె వేగముగా కొట్టుకోవడము , దగ్గు ఎక్కువగా బాదించడము జరిగి cardio- vascular shock కి గురిఅవడము జరుగును.

హంటా వైరస్‌ వ్యాప్తి ఎలా....
 • దక్షిణ కొరియా లో " హంటాన్‌ నది ప్రాంతములో గుర్తించడం వలన ఈ వైరస్ కి ఆ పేరు వచ్చినది. 1978 లో Ho-Wang Lee మరియు అతని సహచరులు కనుగొన్నారు. మొదటిలో ఈ వైరస్ వల్ల కలిగిన వ్యాది ని Korean hemorrhagic fever అనే పేరు ఉండేది. ఎలుకల నుంచి వైరస్‌ వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం.. మూత్రం, మలం ద్వారా వైరస్‌ విస్తరణ జరుగును . ఎలుకలు కరడము వలన వచ్చేఅవకాశమున్నది. ఈ వ్యాధి ఒకరినుండి ఒకరికి వ్యాప్తిచెందును.(Human to human transmission).

ముందు జాగ్రత్త చర్యలు... ఇళ్లు, పొలాల్లో ఎలుకలు లేకుండా
చూసుకోవాలి.. వాడుకలో లేని కిటికీలు, తలుపులు తెరచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి స్వచ్ఛమైన నీటిని తాగాలి. వ్యాక్యూమ్‌ క్లీనర్‌ వాడేటప్పుడు ముఖానికి ముసుగు వేసుకోవాలి జ్వరం ఏమాత్రం తగ్గకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి...

 • ఈ వైరస్ చరిత్ర : korean యుద్దము లో చాలా మంది అమెరికన్‌ సైనికులు రోగగ్రస్తులైనారు ..ఎంతోమంది చనిపోయారు . యుద్దం అనంతరము మనుషులలో ఈ వైరస్ కనిపెట్టడానికి సుమారు 25 సంవత్సరాలు పట్టింది. దక్షిణ కొరియా " హొ-వాంగ్ లీ " 1978 లో కనిపెట్టగలిగారు. 1993 లో

అమెరికాలో ఇది విజృంభించి చాలా గందరగొళం సృష్టించినది. ఇది చాలా దేశాలలో వ్యాప్తిచెందినది. ముఖ్యము గా చైనా, కొరియా , రస్యా,ఆర్జెంటైనా, చిలీ, బ్రెజిల్ , అమెరికా , ఇండియా మున్నగునవి.


చికిత్స : హంటా వైరస్ కి స్పెసిఫిక్ గా యాంటివైరల్ మందులు లేవు . ఈ వ్యాది ఉన్న వారిని హాస్పిటల్ లో ఉంచి ..
 • ఆయాసము నకు ... ఆక్షిజన్‌ ఇవ్వడము ,
 • జ్వరానికి ... జ్వరము తగ్గేందుకు మందులు ,
 • నీరు ఎక్కువగా తాగించడము ,
 • మిగతా జబ్బులేవీ సోకుండా పెన్‌సిలిన్‌ రకానికి చెందిన యాంటిబయోటిక్స్ ఇవ్వడము ,
 • డయాలిసిస్ అవసరాన్ని బట్టి చేయడము .
 • రొటీన్‌ యాంటివైరల్ మందులు .. ఉదా: Acyclovir, వాడుతున్నారు.
 • వి్శ్రాంతి తీసుకోవడం వలనే ఈ వ్యాది నుందు విముక్తి పొందుతారు.

 • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 15, 2012

దోమల దాడి నుంచి రక్షణ సాధనాల అవగాహన,Protection aids from mosquito bite-Awareness

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దోమల దాడి నుంచి రక్షణ సాధనాల అవగాహన,Protection aids from mosquito bite-Awareness - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • సాయంత్రం అయ్యిందంటే చాలు.. దోమల దాడి ప్రారంభం. ఒక్క దోమ కుట్టినా చాలు.. కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ఆస్కారముంది! అందుకే వీటి నుంచి రక్షణ పొందడానికి ఎక్కువ మంది దోమల చక్రాలు (మస్కిటో కాయిళ్లు), దోమల బిళ్లలు (మస్కిటో మ్యాట్లు) వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ బ్యాటులు, శరీరానికి రాసుకునే కొన్ని రకాల క్రీములనీ చాలామందే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రక్షణ సాధనాల నుంచి గరిష్ఠ ప్రయోజనం పొంది.. దోమలు పరార్‌ అయ్యేలా చేయాలంటే వీటికి సంబంధించి కచ్చితమైన అవగాహన కలిగి ఉండటం అవసరం.

వీటిని పూర్తిగా అరికట్టడం, సంపూర్ణంగా నివారించడం మాటలు చెప్పినంత సులువేం కాదు. వీలైనంత వరకు దరిచేరకుండా చూసుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తే, ఒంట్లోని రక్తాన్ని పీల్చేయడంతో పాటు భయంకరమైన వ్యాధులు వ్యాపించడానికి కారణం అవుతాయి. భూమిపై సుమారు 2,700 జాతుల దోమలున్నా అందులో హాని కలిగించేవి అనాఫిలెస్‌, క్యూలెక్స్‌ దోమలే. వీటి కారణంగా మలేరియా,ఫైలేరియా, ఎల్లోఫీవర్‌, డెంగ్యూ, ఎన్‌సఫైలిటిస్‌ వ్యాధులు వ్యాపిస్తాయి.
 • పరిశుభ్రతతో నియంత్రణ...
సాధారణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు దోమలు వృద్ధి చెందే ఆవాసాలు. అందుకే నీరు ఒకచోట నిల్వ ఉండకుండా చూడాలి. అది సాధ్యం కానప్పుడు ఆ నీటిలో క్రిమి సంహారకాలను కలపడం ద్వారా దోమలని దూరంగా ఉంచొచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకొన్నా అవి దాడి చేస్తున్నప్పుడు.. దోమల చక్రాలు, దోమల బిళ్లలు, మేని పూతలు, గదిలో వాడే రసాయన స్ప్రేల వంటి మార్గాలను అనుసరించాల్సిందే. బ్యాటుల వంటి ఎలక్ట్రికల్‌ పరికరాలు వాడుతున్నా అవి కొంత ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం, పైగా వినియోగంలో సౌలభ్యం తక్కువ. ఇవి కాకుండా ఖరీదైన ఫ్త్లెజాప్పర్‌, అల్ట్రావయెలెట్‌ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి దోమలని చంపకుండా దారి మళ్లిస్తాయి. మస్కిటో రిపల్లెంట్‌ క్రీములని ఒంటికి పూతగా రాసుకోవడం వల్ల దోమలు వాసన గ్రహించే శక్తిని కోల్పోతాయి. ఓ రకంగా.. వాటికి సరిగ్గా కనిపించం. అయితే ఈ క్రీమ్‌లని మోము, కళ్లు, నోటి భాగంలో రాసుకోకూడదు. తరవాత వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరిస్తే మేలు. ముదురు రంగువి ఎంచుకోకపోవడం మంచిది.


* దోమల చక్రాలని సాధారణంగా పైరెత్రమ్‌ అనే పూవు నుంచి తీసిన తైలానికి, రసాయనాలు కలిపి తయారుచేస్తారు. చక్రాల్లా ఉండే కాయిళ్లని ఒక్కసారి వెలిగిస్తే మొత్తం పన్నెండు గంటల పాటు వెలుగుతాయి. వీటికి విద్యుత్‌ వాడకం అవసరం లేదు. తేలిగ్గా ఉపయోగించుకొనే అవకాశం ఉండటంతో పల్లెల్లో వీటి వాడకం ఎక్కువవుతోంది. అయితే వీటి నుంచి వచ్చే పొగ కారణంగా త్వరగా అలెర్జీలు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు అందుబాటులోకి వస్తోన్న పొగరాని చక్రాల (నో స్మోక్‌ కాయిల్స్‌) గురించి తెలుసుకొని కొనుగోలు చేయాలి.

* వేపరైజింగ్‌ మ్యాట్లకి కూడా ఈ మధ్యకాలంలో ఆదరణ పెరిగింది. వీటిని సాధారణ విద్యుత్‌ సాకెట్‌లో ఉంచగానే, అది క్రమంగా వేడెక్కి దోమల కదలికలను నిర్వీర్యం చేసేలా పొగను విడుదల చేస్తాయి.

 • కొనేముందు పరిశీలించాలివి...
నిత్యం వేధించే దోమల సమస్య నుంచి బయటపడటానికి కొంత మొత్తం ఎలా కేటాయిస్తున్నామో, ఆయా ఉత్పత్తుల కొనుగోలుకు ముందు కూడా కొన్ని అంశాలపై దృష్టి కేటాయిస్తే నాణ్యమైన వాటిని ఉపయోగించగలం.

* దోమలను పారదోలే ఉత్పత్తుల్లో ఏయే పదార్థాలు ఉపయోగించారో గమనించాలి. అందుకోసం వాడే అల్లాత్రిన్‌, పారాల్లాత్రిన్‌ ఏ మోతాదులో వినియోగించారో ప్యాక్‌పై చూడాలి. అది తయారయిన చిరునామా, లైసెన్సు నంబరు, కాలావధి (డేటాఫ్‌ ఎక్స్‌పైరీ), ఉపయోగించే తీరుని కూడా పరిశీలించాలి.

* కాయిల్‌ని కొనే ముందు అది ఎంత సేపు వెలుగుతోంది, ఎంత సమయం దోమల నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తోంది.. అని గమనించాలి. దోమల చక్రాలను విడదీస్తుంటే అవి సులభంగా ముక్కలు కాకుండా రెండుగా రావాలి. ఒక డబుల్‌ కాయిల్‌ బరువు 25గ్రాములు కంటే తక్కువగా ఉండకూడదు. అది ఎనిమిది గంటల పాటు వెలగాలి. అదే 30 గ్రాములు ఉంటే పది గంటలు పాటు, 36 గ్రాములుండే జంబో కాయిల్‌ అయితే పన్నెండు గంటల పాటు నిరాటంకంగా వెలగాలి. ఇదే సమయంలో అవి దోమలని ఎంత వేగంగా, సమర్థంగా పారదోలుతున్నాయి అనేదీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే.
 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 12, 2012

Venerial Diseases(Sexually transmitted disease)Awareness, సుఖవ్యాధులు-అవగాహనఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు (Venereal or Sexually transmitted disease; VD or STD) ప్రధానంగా రతి క్రియ (Sex) ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవి అతి ప్రాచీనమైన వ్యాధులు. ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకుండా బయటకు ఆరోగ్యంగా కనిపిస్తారు. అందువలన వీరితో సంబంధమున్న వారికి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు. ఇలాంటి కొంతమంది సూది మందు ద్వారా మరొకరికి చేర్చే అవకాశం ఉన్నది. కొందరు స్త్రీల నుండి తమ పిల్లలకు కూడా ఇవి వ్యాపించవచ్చును.

ఆధునిక సమాజంలో సుఖవ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎయిడ్స్ ప్రబలక పూర్వం ఎక్కువగా వ్యాపించిన సుఖవ్యాధులు ఇప్పుడు అంత వేగంగా వ్యాపించడం లేదు. ప్రజలకు ఎయిడ్స్ అంటే భయం దీనికి కొంత వరకు కారణం కావచ్చు. మన సమాజంలో సుఖవ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ వ్యాధిపీడితుల్లో ఆందోళన పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సుఖవ్యాధులున్న ఇతర వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడం వల్ల వీరికి కూడా సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్ , క్లమీడియా వంటి సర్వసాధారణమైన సుఖవ్యాధులు .


 • సుఖవ్యాధులు-కారకాలు
బాక్టీరియా

 • బాక్టీరియల్ వజినోసిస్ (BV) - దీన్ని సహజంగా వెనీరియల్ జబ్బుల జాబితాలోనికి రాదు కాని సంపర్కం మూలంగానే వ్యాపిస్తాయి.. .
 • శాంక్రోయిడ్ (Chancroid) (Haemophilus ducreyi)
 • డోనోవానియోసిస్(Donovanosis) (Granuloma inguinale or Calymmatobacterium granulomatis)
 • సెగవ్యాధి (నిసీరియా గొనోరియా)
 • లింఫోగ్రాన్యులోమా వెనీరియం(Lymphogranuloma venereum) (LGV) (Chlamydia trachomatis serotypes L1, L2, L3. See Chlamydia)
 • నాన్‌ గోనోకోకల్ యురెత్రైటిస్ (Non-gonococcal urethritis (NGU) (Ureaplasma urealyticum or Mycoplasma hominis)Staphylococcal infection (Staphylococcus aureus, MRSA) - ఇవన్నీ ్కలయిక వలన ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయి ..
 • సవాయి రోగం (Treponema pallidum)

శిలీంద్రాలు-Fungus infections:

 • పరిశుబ్రత పాటించని వారిలో ఈ బూజు (శిలీంద్రాలు) తామర వంటి వ్యాధులు ఒకరినుండి ఒకరికి అంటుకుంటాయి. Tinea cruris "Jock Itch" (Trichophyton rubrum and others). - Sexually transmissible.Yeast Infection. వీటిని సునాయాసముగా నయము చేయవచ్చును. నోటిద్వారా కొన్ని మందులు ... ఉదా tab. U-CON 150 mg , tab .NUFORCE 150 mg . మరియు చర్మము పై పూతగా కొన్ని మందులు ... ఉదా: ointment -CANDID or KETO-B వాడాలి .

వైరస్

 • Adenoviruses thought to contribute to obesity - venereal fluids (also fecal & respiratory fluids)
 • వైరల్ హెపటైటిస్ (Hepatitis B virus) - saliva, venereal fluids.
 • Herpes Simplex (Herpes simplex virus (1, 2)) skin and mucosal, transmissible with or without visible blisters
 • Herpes simplex virus 1 may be linked to Alzheimer's disease.
 • ఎయిడ్స్ (Human Immunodeficiency Virus) - venereal fluids HTLV 1, 2 - venereal fluids
 • Genital ఉలిపిరి కాయలు - ("low risk" types of మానవ పాపిల్లోమా వైరస్ HPV) - skin and muscosal,transmissible with or without visible warts
 • Cervical cancer, anal cancer - ("high risk" types of Human papillomavirus HPV) - skin and muscosal
Molluscum contagiosum (molluscum contagiosum virus MCV) - close contact
 • mononucleosis (Cytomegalovirus CMV - Herpes 5) - saliva, sweat, urine, feces and venereal fluids.
 • (Epstein-Barr virus EBV - Herpes 4) - saliva
 • Kaposi's sarcoma (Kaposi's sarcoma-associated herpesvirus KSHV - Herpes 8) - saliva

పరాన్నజీవులు

 • పేలు (Pubic lice), colloquially known as "crabs" (Phthirius pubis)
 • గజ్జి (Sarcoptes scabiei)ఈఒ´´ఊఊఊఇఒయ్త్గ్గ్గ్గ్ఫ్గ్య్ చు దె ఫ్రన్ సఒ వ్చ్స్

ప్రోటోజోవా

 • ట్రైకోమోనియాసిస్ (ట్రైకోమోనాస్ వజినాలిస్)
 • Sexually transmitted enteric infections Various bacterial (Shigella, Campylobacter, or Salmonella), Although the bacterial pathogens may coexist with or cause proctitis, they usually produce symptoms (diarrhea,fever, bloating, nausea, and abdominal pain) suggesting disease more proximal in the GI tract.

Sexually transmissible oral infections:
 • Common colds,
 • influenza,
 • Staphylococcus aureus,
 • E. coli,
 • Adenoviruses,
 • Human Papillomavirus, Oral Herpes (1, 2 & 4, 5, 8), Hepatitis B and the yeast Candida albicans can all be transmitted through the oral route.

హెర్పిస్
 • హెర్పిస్ సిప్లెక్స్ వైరస్ వల్ల స్త్రీ, పురుషుల జననాంగాలకు సంబంధించిన జనైటల్ హెర్పిస్ సంక్రమిస్తుంది. స్త్రీ,పురుషుల జననాంగాల పైన ఎర్రటి పొక్కులు వచ్చి చితికి మంటగా, దురదగా, నొప్పిగా ఉంటుంది. వీటితోపాటు జ్వరం వచ్చినట్లు శరీరంలో బడలిక, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. వ్యాధినిరోధకశక్తి తగ్గిన వారిలో హెర్పిస్ ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. గర్బిణీ స్త్రీలకు ఈ వ్యాధి సంక్రమిస్తే పుట్టబోయే శిశువుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హెర్పిస్ లక్షణాలు బయటపడడానికి 7 రోజుల నుంచి 10 రోజులు పడుతుంది.హెర్ఫిస్ అనే గ్రీకు మాటకి అర్థం – పాకడం. 1730 నాటికే ఈ వ్యాధి ఉందని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఈ వ్యాధి వైరస్ వల్ల కలుగుతుందని 20 వ శతాబ్దంలో గుర్తించారు. హెర్ఫిస్ సింప్లెక్స్ వైరస్-1, హెర్ఫిస్ సింప్లెక్స్ వైరస్-2 అనే రెండు రకాల వైరస్ లు హెర్ఫిస్ కు కారణమవుతున్నాయి. హెర్ఫిస్ సింప్లెక్స్ వైరస్-1 అనే వైరస్ వల్ల ముఖంపై, హెర్ఫిస్ సింప్లెక్స్ వైరస్-2 అనే వైరస్ వల్ల జననాంగాలపై పొక్కులు ఏర్పడతాయి. హెర్ఫిస్ సోకిందని ఏమాత్రం అనుమానం వచ్చినా భార్యతో కలవకుండా, వైద్యుని సంప్రదించడం మంచిది. హెర్ఫిస్ ను పూర్వం భయంకరమైన వ్యాధిగా పరిగణించేవారు. ఇప్పుడు ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.

గనేరియా
 • నైజీరియా గనేరియా వంటి బ్యాక్టీరియా వల్ల గనేరియా సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సంక్రమించిన 5 రోజుల నుంచి 10 రోజుల్లో లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. మగవారిలో గనేరియా సంక్రమించడం వల్ల మూత్రంలో మంట, దురద, మూత్రనాళం నుంచా తెల్లటి లేక పసుపుపచ్చని చీము లాంటి ద్రవం వస్తుంది.ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రోస్టేట్‌గ్రంథిలో వాపు, వృణణాలపైన కూడా దీని ప్రభావం పడడం వల్ల వీర్యకణాల్లో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలకు గనేరియా సంక్రమించడం వల్ల మూత్రం పోస్తున్నపుడు మంట, నొప్పి, వైట్ డిశ్చార్జ్ అవుతుంటాయి. శృంగారంలో పాల్గొన్నపుడు ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. గనేరియా వల్ల పెల్లోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం వల్ల సంతానలేమి సమస్యలకు కారణం అవుతుంది.

సిఫిలిస్
 • ఇది చాలా ప్రమాదకరమైన సుఖవ్యాధిగా చెప్పవచ్చు. ఇది 'ట్రెపోనమా పల్లాడం' లాంటి బ్యాక్టిరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన 10 రోజుల నుంచి 90 రోజుల లోపల వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. సిఫిలీస్ సంక్రమించడం వల్ల జననాంగాలపైన, మలద్వారాల పైన, నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. సిఫిలీస్ వ్యాధి 3 లేక 4 దశలతో సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల శరీరంలో మెదడు, నాడీవ్యవస్థ, గుండె, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది.

క్లమీడియా
 • సర్వసాధారణంగా సంక్రమించే వ్యాధి ఇది. క్లమీడియా ట్రాకోమోటీస్ లాంటి బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా జననాంగాలకు సంక్రమిస్తుంది. పురుషుల్లో క్లమీడియా సంక్రమించడం వల్ల మూత్రనాళంలో వాపు, మంట, వైట్ డిశ్చార్జ్ రావడం, బీజాల్లో నొప్పి రావడం సంభవిస్తుంది. స్త్రీలలో దీనివల్ల మూత్రంలో నొప్పి మూత్రం పదేపదే వచ్చునట్లు ఉండడం, కడుపు నొప్పి, శృంగారంలో పాల్గొన్నపుడు నొప్పి, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ వంటివి సంభవిస్తాయి.

వ్యాధి నిర్ధారణ
 • సుఖవ్యాధులతో బాధ పడే వారికి
 • మూత్ర పరీక్ష,
 • హెచ్ఎస్‌వి 1,2(HSV 1,2) పరీక్ష ,
 • హెచ్ఐవీ 1, 2(HIV 1,2) పరీక్ష,
 • వీడీఆర్ఎల్(VDRL),
 • HPV పరీక్షలు చేయడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.


 • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, September 10, 2012

Health foretellers, ఆరోగ్య శకునాలు


 • ఆరోగ్యమే మహాభాగ్యము.మ
 • నిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Health foretellers, ఆరోగ్య శకునాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆరోగ్యముగా ఉండడము ఎంత మహాభాగ్యమో అనారోగ్యము వస్తే కాని తెలియదు . ఎవరికి వారు ఆరోగ్యముగానే ఉన్నామని భావిస్తుంటారు . అనారొగ్య చిహ్నాలు కనిపిస్తున్నా వాటిని గుర్తించకుండా వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా నిత్యజీవితాన్ని గడిపేస్తుంటారు . వ్యాధి ముదిరేక గుర్తించి అప్పుడు చేసేదేమీ లేక చింతిస్తారు .

కొన్నిరకాల జబ్బులను చిన్న చిన్న లక్షణాలతోగుర్తించవచ్చు. బ్రెయిన్‌ ట్యూమర్ లాంటి పెద్ద జబ్బుని ఒక చిన్న షేక్ హ్యాండ్ తోనే నిపుణుడైన వైద్యుడు గుర్తించేస్తాడు . ఉదా: ముంబై లో ఒక డాక్టర్ తన స్నేహితుడికి ఓ రెస్టారెంట్ లో కలిసి షేక్ హేండ్ ఇచ్చాడు .అతని అరచేయి " ప్లెష్షీ" (fleshy) గాఉండడము తో డాక్టర్ కి అనుమానము వచ్చి ... బ్రెయిం ట్యూమర్ వచ్చిన వారి చేతుల్లో టిష్యూ ఎక్కువగా పేరుకుపోతుందనే విషయము గుర్తుకువచ్చి బ్రెయిన్‌ ట్యూమర్ టెస్ట్ లు చేయించాడు . పరీక్షల్లో డాక్టర్ అనుమానము నిజమని ధృవపడింది. వెంటనే ఆపరేషన్‌ కి ఏర్పాటులు చేసి ట్యూమర్ తొలగించారు . ప్రాణాంతకమైన జబ్బులను కూడా తొలిదశలో కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించే అవకాశము ఉందనే నమ్మకము ఈ ఉదాహరణ తో మనకు బోదపడుతుంది. అటువంటి వాటిలో కొన్ని :->
 • వెన్నునొప్పి :

వెన్నునొప్పి కిడ్నీలో రాళ్ళకు సంకేతము కావచ్చు . తుంటి ఎముకలకు , పక్కటెముకలకు (హిప్ , రిబ్స్ ) మధ్య నొప్పి జివ్వున లాగేస్తుంటే ఒకసారి డాక్టర్ ని సంప్రదించాల్సిందే ... ఈ నొప్పి ఒక్కోసారి తీవ్రంగా ఉండి , ఒక్కోసారీ తెలిసీ తెలీనట్లు గా పోతుంది . దీనివల్ల చాలామంది ఈ నొప్పిని తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యము చేస్తుంటారు ... ఏవో బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వచ్చిన నొప్పిలే అని కొట్టిపడేస్తారు . .. కాని అది మూత్రాయం లో రాళ్ళకు సంబంచిన ముందస్తు హెచ్చరిక అని గుర్తుపట్టరు . ప్రతి 10 మంది మగవాళ్ళలో ఓకరికి మూత్రాశయములో రాళ్ళ అనారోగ్యము వస్తుంది . ఆ జబ్బును నివారించకపోతే మూత్రము సాఫీగా రాదు . దానివల్ల మూత్రాశయం వాపు వచ్చి క్రమేపీ నొప్పి తీవ్రమవుతుంది .


ఏమి చేయాలంటే :
నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తున్నా లేదా గుదంలోకి పాకుతున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరియైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి. వారానికి మూడు సార్లు 45 నిముషాల పాటు కార్డియో ఎక్స్ ర సైజ్ లు చేయడము ,రోజూరెండున్న లీటర్ల నీరు తాగడము లాంటివి చేయాలి. ఇందువల్ల మూత్రాశయం లో రాళ్ళు పెరగకుండా అరికట్టవచ్చును.
 • పాదాల్లో నొప్పి :

డిస్క్ జారడము వల్ల కావచ్చు " హెర్నియేటెడ్ " లేదా " ప్రోలాప్సెడ్ డిస్క్ వల్ల పాదాల్లో నొప్పి వస్తుంది . సామాన్యము గా నొప్పి ఉదయము పూట ఎక్కువగా ఉంటుంది .కూర్చోవడము వల్ల నొప్పి తీవ్రమవుతుంది . వెన్నునొప్పి లేకపోవడము వల్ల దీన్ని డిస్క్ సమస్యగా సామాన్యముగా డాక్టర్ లు గుర్తించలేకపోతారు. ఈ సమస్యను నివారించకపోతే సయాటిక్ నరం మీద ఒత్తిడి ఎక్కువై ఆ కాళు అంతా తిమ్మిరి గాను , నొప్పిగాను వచ్చే స్థితి సంభవిస్తుంది. ఏమి చేయాలంటే : పొత్తికడుపు మీద పడుకుని కోబ్రా ఆసనాలు ఓ పదిసార్లు మృదువుగా చేయాలి. పిరుదులను నేలకు ఆనించి వీపుని మాత్రము బాణం లా వంచి చేతులను నెమ్మదిగా చాపాలి. ఈ ఎక్సర్ సైజ్ లు చేయడము వలన ఒత్తిడి తగ్గి నొప్పి కూడా తగ్గుతుంది. దిస్క్ సమస్యని కూడా ఇలా ఎక్సర్ సైజులతో తగ్గిందుకోవచ్చు. ఫిజియో థెరపీకి వెళ్ళేవరకు ఈ ఎక్సర్ సైజులు అవసరాన్నిబట్టి గంటకు ఒకసారి చేసుకుంటూ నొప్పిని తగ్గించవచ్చును.

 • కాళ్ళనొప్పులు :

నడిచేటప్పుడు , పరుగెత్తేటప్పుడు కాళ్ళ నొప్పులున్నాయంటే అది కార్డియోవాస్కులర్ జబ్బు లక్షణముగా గుర్తించవచ్చు. ఆర్థోపెడిక్ సమస్యవల్ల కూడా కాళ్ళ నొప్పులొస్తాయి. అయితే వెన్నుపూస కండరాలు కుంచించుకుపోవడము వల్ల ఆర్టరీస్ సమస్య వస్తుంది. నడవడం ,పరుగెత్తడం మానెయ్యగానే నొప్పి తగ్గిపోతుంది. బరువులు ఎత్తినా , వేగంగా నడిచినా మళ్ళీ నొప్పి వస్తుంటే గుండె పోటు వచ్చే ప్రమాదము తొలిదశలో ఉన్నట్లు సంకేతము . ఏం చేయాలంటే : కాళ్ళు నొప్పులు వస్తుంటే ఇంట్లో ఎవరికైనా గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉంటే గుండె జబ్బుల డాక్టర్ని కలవాలి .

 • మెడ,భుజము నొప్పి:

అది లైమ్‌ వ్యాధి కావచ్చు . కీఈళ్ళనొప్పుల వల్ల జిమ్‌ కి వెళ్ళ్డం మానేస్తున్నారా? సూదులతో పొడుస్తున్నట్లు తలనొప్పితో బాధపడుతున్నారా? ఫలానా చోట అని గుర్తు చెప్పలేం కాని మొత్తం గా నొప్పిఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక కాని లైమ్‌ వ్యాధిగ్రస్తులు డాక్టర్ దగ్గరకు రావడం లేదు . అందుకు మొదటి కారణం అనేక మంది మెడనొప్పిని మామూలు నొప్పి గా భావించి పెద్దగా పట్టించుకోకపోవడం . రాత్రి నిద్రసరిగా లేకపోవడం వల్ల మెడనొప్పి వచ్చి ఉంటుదనుకోవడము . అది తప్పు . అది మెనింజైటీస్ లేదా ఫేసియల్ పాల్సీ, తీవ్రమైన ఆర్థరైటిస్ కావచ్చు . కాబట్టి మెడనొప్పి , భుజాల నొప్పి అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయిందుకోండి. ఏమి చేయాలంటే : తలనొప్పి , కీళ్ళు నొప్పులు కనిపిస్తే ప్రమాదకరమైన జబ్బులేవీ లేవని డాక్టర్ ని సంప్రదించి నిర్ధారణ చేసుకోండి . కొన్ని రకాల జబ్బులకు నిర్ధారణ కొంచం కష్టం . నొప్పి ఎక్కడ , ఎప్పుడు , ఎలా వస్తుందో ఎంతసేపు ఉంటుందో గుర్తుపెట్టుకొని డాక్టర్ కి తెలియజేస్తే జబ్బు నిర్ధారణ సులువవుతుంది .

 • నోటి దుర్వాసన :


ఊపితి తిత్తుల వ్యాధి లేదా తొలిదశ మధుమేహం కావచ్చు . దంతాల చిగుళ్ళ వ్యాధి కావచ్చు . గతరాత్రి వెళ్ళుల్లి తిన్నాం కాబట్టి నోటి దుర్వాసన వచ్చిందనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. కాని అది తప్పు. టిక్ -టాక్ నోట్లో వేసుకుంటే పోయే దుర్వాసన కాకపోవచ్చు . కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు ... ఆస్మా , సిస్టిక్ ఫైబ్రోసిస్ , లంగ్ యాబ్సెస్ కావడం వలన వచ్చే దుర్వాసన అయిఉండవచ్చును . ఆ దుర్వాసన ఎంత యాసిడ్ తో కూడుకొని ఉంటుందో జబ్బు అంటతీవ్రమైనట్లు లెక్క . దాదాపు 90 శాతము నోటిదుర్వాసన కేసులు గమ్‌ (gums)సమస్యలవల్ల లేదా నోరు పరిశుబ్రము గా ఉంచుకోకపోవడం వల్ల వస్తుంది. మిగతా 10 శాతము ఊపిరితిత్తుల వ్యాధి , లివర్ వ్యాధి మదలైన వాటి మూలాన వస్తుంది. ఏమి చేయాలంటే : నొరు ఎండిపోవడం , సైనస్ , గమ్‌ వ్యాధులు , పొగ తాగడం లాంటి వాటివలన నోటి దుర్వాసన వస్తుందా? లేక మరేదైనా కారణమున్నదా ? అని వైద్యుని సంప్రదించి తెలుసుకోవాలి. నోటి కాన్సర్ తొలిదశలో దంత వైద్యులు గుర్తుపట్టి హెచ్చరిస్తారు. మొదటిలో అయితే చికిత్స చేయడం సులభం అవుతుంది.

 • నీళ్ళ విరోచనాలు :

హార్మోనులు సరిగా పనిచేయకపోవడం వలన ప్రతి 50 మందిలో ఒకరు ఈ నీళ్ళ విరోచనాల సమస్యతో బాధపడుతుంటారు. దీన్ని సరిగా నిర్మూలంచకపోతే చాలామంది యువకులు " గ్రేవ్స్ " జబ్బు బారిన పడతారు. దీని వల్ల కండరాల పనితీరు , పటుత్వము తగ్గిపోతాయి. జుట్టురాలిపోతుంది . తీవ్రమైన కంటిచూపు సమస్యలు వస్తాయి. నీళ్ళవిరోచల్లతో బరువు విపరీతం గా కోల్పోతారు . ఆకలి తగ్గిపోతుంది. ఏమి చేయాలంటే : -> నీళ్ళ విరేచనాలతో చాలా రొజులపాటు బాధపడటం తో పాటు నిద్రలేమి , ఎండకు తట్టుకోలేకపోవడం ఉంటే " థైరాయిడ్ " సమస్య అయి ఉండవచ్చు. జనరల్ ఫిజీషియన్‌ ని సంప్రదిస్తే తగిన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడును.

 • నపుంసకత్వ సమస్య :

ప్రపంచము లోనే ప్రతిష్టాత్మకమైన హార్వార్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం మగవాళ్ళలో నపుంసవత్వము కు కారణము " పార్కిన్‌ సన్స్ " వ్యాది తొలిదశ కావచ్చని సూచించారు. ఈ వ్యాధి - (నపుంసకత్వం) వచ్చిన వారిలో ఎక్కువందికి తర్వాత పార్కిన్‌సన్‌ వ్యాధి బయటపడినట్లు అంటారు. ఏమి చేయాలంటే : ఈ వ్యాధిని అరికట్టేందుకు సులువైన తెలిసిన మార్గం అంటూ ఏదీ లేదు. అమెరికాలోని కొంతమంది న్యూరాజిస్ట్ లు ప్రకారము జీన్స్ లో మార్పు వలన ఈ వ్యాది వస్తుందంటారు. మిలియన్ల కొద్దీ మగవాళ్ళు ఈ సమస్యతో బాధపడు తున్నట్లు అంచనాలు ఉన్నాయి. మంది డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి .


Note : ఇలా చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే డాక్టర్ ని సంప్రదించి పెద్దబబ్బుల... లేదా జబ్బు ముదిరి పోకుండా జాగ్రత్తవహించంది.


 • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 8, 2012

మానసిక ఆంధోళనతో లైంగిక సమస్యలు(Psychological Sexual problems)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...నవీనయుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన’ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటివారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచటానికి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడంవలన లైంగిక వైఫల్యాలనుండి విముక్తి పొందవచ్చును.

సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి.
మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్’ నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును.
తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్లపై ప్రభావం చూపి లైంగిక సామర్థ్యాన్ని తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తోపాటు ఒత్తిడిలేని మంచి జీవన విధానమును అలవరచుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30ని. నుండి 45ని.ల వరకు నడవటంవలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చు.

చికిత్స: ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తివంతమైన ఔషధాలెన్నో వైద్యంలో కలవు. వ్యక్తి యొక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకొని వైద్యం చేసినచో లైంగిక సమస్యలను త్వరితంగా నివారించవచ్చు.డయబిటీస్ పూర్తి కంట్రోల్ లో ఉంచుకోవాలి.

మందులు
Fludac caps :- నీరసం, నిస్త్రాణ ఎక్కువ శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నవారికి , శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పనిచేయును. అలాగే అంగం పూర్తిగా ఉద్రేకం చెందక ముందేగాని, లేదా అంగ ప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతూ, మధుమేహంతో మాధపడేవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

Tryptomer tablets: వీరికి లైంగిక వాంఛ అధికం. కాని సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించదగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సన్నిత స్వభాలు. ఎదుటివారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతిదానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి ‘డయాబెటీస్’ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

Awagandha : ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికిది ముఖ్యమైనది. అతిగా కామకలాపాల్లో పాల్గొనడంవల్ల, హస్తప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పోయిన వారికి ఈ మందు ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం, అహం పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదుటిపై ముడతలు పడతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంటతడిపెడతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు లైంగిక సామర్థ్యం కొరకు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

Viagra (sildenafil citrate): వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామవాంఛ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరచుగా జరుగును. వీరికి సంభోగవాంఛ కూడా ఉండకపోవుట గమనించదగిన లక్షం. ఇలాంటి లక్షణాలున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

Neurokind Gold caps : నిత్యం మద్యం సేవిస్తూ, సరైన నిద్ర లేక నరాల బలహీనత ఏర్పడి, సంభోగశక్తిని కోల్పోయిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

Fluoxetine:మానసికంగా కామవాంఛ కోరిక ఉన్నా శారీరకంగా అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధడేవారికి ఈ మందు ఆలోచించదగినది.

 • ================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, September 7, 2012

Ayurvedam and health_ఆయుర్వేదం లో మనఆరోగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సు, శక్తివంతమైన శరీరం ప్రధానం. మనస్సును శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని దీర్ఘకాలం జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆయుర్వేదం అందిస్తోంది. మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో ఆయుర్వేదానికి ఆదరణ లభిస్తోంది. ఇదొక విస్తారమైన మార్కెట్‌గా రూపుదాల్చింది. మన దేశీయ వైద్య విధానాల్లో ఆయుర్వేదానికి అగ్రస్థానం అయినప్పటికీ దీని విశిష్టతను ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. కనుకనే ఆరోగ్యానికి ఆయుర్వేదం ఏ విధంగా ఉత్తమమైందో వివరించే ప్రయత్నమిది.
ఆయుర్వేదం అంటే కేవలం రోగాలకు చికిత్స చేసే వైద్య విధానం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. మనిషి రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా జీవించడానికి అవసరమైన విధి విధానాల్ని నిర్దేశిస్తోంది. ఆధునికత చేసిన మేలుతో పాటు కీడు కూడా చాలానే వుంది. ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన అనర్థాలు ప్రతిఫలం అనుభవిస్తున్నాం. అభివృద్ధి పేరిట మనిషి తన సహజాత్యాలకు భిన్నమైన జీవన రీతుల్ని అనుసరిస్తున్నాడు. ఆధునికత తెచ్చిపెట్టిన అభివృద్ధి జరిగిన మేలు సంగతి అలా వుంచితే మన చుట్టూ వాతావరణ కాలుష్యం పెరిగింది. జీవన శైలిలో విపరీతమైన మార్పులొచ్చాయి. వీటితోపాటు కొత్త కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. సహజంగా వుండాల్సిన రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ఈ అవసర సమయంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు పాశ్చాత్య దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఆయుర్వేద వైద్య విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు.
గతంలో ఇంటింటా అమ్మమ్మల, నానమ్మల మందు భరిణాలు ఉండేవి. గృహ వైద్యంగా ఆ మందుల భరిణెలోంచి ‘దినుసుల వైద్యం’ చేసేవారు. ప్రశస్తమైన ఉగ్గుపాల సంప్రదాయం కనుమరుగయింది. దాని స్థానంలో అవసరం లేని ‘మల్టీ విటమిన్ డ్రాప్స్’ ఒరవడి అలవడింది. శిశువు జఠరశక్తి దీప్తికి, జీర్ణానికి మలవిసర్జనకు అనువైన ఉగ్గుపాలతో మిశ్రీతమయ్యే వచ, సన్నదుంపరాష్ట్రం, ఆముదం వంటివి పిల్లల ఆరోగ్యానికి ఉపకరించేవి.

చరిత్రలోకి వెళితే
భరద్వాజ శిష్యుడైన ఆత్రేయముని ద్వారా ఆయన శిష్యులైన అగ్నివేశాది మహర్షులకు ఆయుర్వేదాన్ని ఉపదేశించటంతో అక్షర రూపంలో ఆయుర్వేదం అవతరించింది. అగ్నివేశ తంత్రంగా ప్రప్రధానంగా లోక ప్రచారంలోకి వచ్చింది.
కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ, శల్య, అగద, రసాయన వాజీకరణ విభాగాలలో అష్టాంగ ఆయుర్వేదం సమగ్రంగా నిలచింది. కొన్నాళ్ళ తరువాత అగ్నివేశ సంహితను చరకుడు సంస్కరించి చరక సంహితగా ప్రామాణిక గ్రంధం జాతికి అందించాడు. దీనికి చక్రపాణి దత్తు వ్యాఖ్యానం నేటికీ పరిశోధకులకు కరదీపిక. శస్త్ర చికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో విశేష ప్రజ్ఞ చూపి నేటి వైజ్ఞానికులకు సైతం విస్మయం కొలిపే విశేషాలను అందజేసిన సుశ్రుతుడు ‘సుశ్రుత సంహిత’ను అందజేసాడు.
ఋషిప్రోక్త వనౌషధులు భేషజ వేదంలో అపారంగా వున్నాయి. ఆయుర్వేద విజ్ఞానసంపద మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికి ఇప్పటికి చికిత్సకు నోచుకోని రోగాలు అనేకం వుంటూనే వున్నాయి. ఆయుర్వేద వైద్యులు వృక్ష శాస్తవ్రేత్తలు, బయోటెక్నాలజీ శాస్తజ్ఞ్రులు సమిష్టిగా కృషిచేస్తున్నప్పటికీ, పరిశోధనా సంస్థలు ఇంకా ఇంకా తీవ్ర పరిశోధనలు మముమ్మరం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

వేదాలలో ‘వేదిక ప్లాంట్స్’గా పేర్కొన్న ‘సోయిమిడా ఫ్రెబ్రిఫ్యూగా’ (మాంసరోహిణి) నిక్షిప్త భేషజంగా వేదాల్లో పేర్కొన్న పిప్పలి, అపామార్గ, వరుణ వంటి ఓషధులపై పరిశోనలు జరిపి వాటి విశిష్టతను డాక్టర్ ఇటికాల సంజీవరావుగారు వంటి శాస్తవ్రేత్తలు ప్రపంచానికి తెలియజేశారు.
పోషక విలువలతో కూడి వ్యాధి క్షమత్వ శక్తికి వ్యాధి నివారణకు ఉపయుక్తమైన ఇమ్యునోమాడ్యులెటర్ గుణాలుకలిగిన మొక్కలు అనేకం శ్రీశైలం, నల్లమల అడవులలో తిరుపతి కొండలలో వున్నాయని అధ్యయనంలో తెలిసింది.
మనం నిత్యం వాడే అనేక ఆహార పదార్థాలలో ఓషధీ విలువలు వున్నాయి. ఉసిరిక, వాము, అల్లం, జీలకర్ర, పసుపు, శొంఠి, ఇంగువ, కలబంద, వేప, పిప్పళ్లు, ద్రాక్ష, ఏలకులు, లవంగాలు, కర్పూరం మొదలైనవి ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడేవే! పంచగవ్యాలు (ఆవుపాలు, పెరుగు, పేడ, నెయ్యి, గోమూత్రం) విశిష్టతకు శాస్ర్తియమైనదిగా పేటెంట్ పొందడం నిదర్శనం. మూలికలు, ఆకులు, పూలు, మొక్కలు, శుద్ధమైన ధాతు లోహములలో తయారుచేయడం ఆయుర్వేద వైద్య విధానంలోని విశిష్టత.

ఎన్నో విష ఫలితాలను (సైడ్ ఎఫెక్ట్స్) మందుల లిటరేచర్‌పై సూచించినప్పటికీ తెలిసే వాటి వాటి వాడుకను ప్రోత్సహించే పద్ధతి అభ్యంతరకరం. ఇతర వైద్య విధానాలలోని ప్రామాణికతను శాస్ర్తియతను ప్రయోగాత్మకంగా పరిశీలించే అలవాటు ఏర్పరచుకుంటే, అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయుర్వేదం మీద నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా మానవాళికి ప్రయోజనం ఏర్పడుతుంది.
పాశ్చాత్య వైద్య విధానంవలన విసిగిపోయి వున్నవారు ఇవాళ ప్రత్యామ్నాయ వైద్య విధానాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. కార్పొరేట్ వైద్యం ఖరీదవడం, మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ వుండటం, కొన్ని మందులు జీవితాంతం వాడాల్సి రావడం వలన ఇతర వైద్య విధానాలవైపు సామాన్యుల దృష్టి సారిస్తున్నారు.
కనుక అందరికీ అందుబాటులో వుండే విధంగా వైద్య సంస్థలు వైద్యులు జాగ్రత్త వహించి అపోహలు తొలగించి మెరుగైన ఆయుర్వేద వైద్యాన్ని అందివ్వటం ఇవాళ్టి అవసరం.

అనంతరకాలంలో వాగ్భటుని అష్టాంగ హృదయం, భావప్రకాశం, బసవరాజీయం, మాధవ నిదానం వంటి గ్రంధాలు వచ్చాయి. శ్రీశైలంలో సిద్ధనాగార్జునుని సంప్రదాయంలో రసశాస్త్రం పరిఢవిల్లి నిత్యానంద సిద్ధుని రసరత్నాకరం, సిద్ధనాగార్జునుడి రసేంద్రమంగళం వంటి అమూల్య గ్రంథాలు జాతికి అందాయి. రస సంప్రదాయం ఐదు భాగాలుగా విభజించబడినది. రసఖండు, రసేంద్రఖండం, రసాయనఖండం, వాదఖండం, మంత్రిఖండం. అయిదు భాగాలతో ప్రసిద్ధ గ్రంధాలలో రసశోధన, అష్టాదశ సంస్కరములు, జారణ, మారణ భస్మవిధానాలు ఇందులో వివరించారు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నాలుగు సాంప్రదాయాలు అనాదిగా ప్రచారంలో వున్నాయి. అవి బ్రాహ్మీ సంప్రదాయం, శైవీ సంప్రదాయం, సుమంత భద్ర సంప్రదాయం, అగస్త్య సంప్రదాయము.
బ్రాహ్మీ సంప్రదాయంలో ఔషధ ప్రధానంగాను, శైవీ సంప్రదాయంలో రస, ధాతు, లోహ విధానాలు వైద్య విధానంలో వాడబడి శ్రీశైల ప్రాంతం నుండి విశేష ప్రాచుర్యం పొందింది.
విజ్ఞానపరంగా, ప్రకృతిపరంగా ఇంతటి అమూల్య సంపద ఉన్నప్పటికీ, విశేష పరిశోధనలు లేకపోవటంవలన చాలా కాలం పాటు వినియోగిచుకోలేకపోయాం.


డాక్టర్ డి. శ్రీరామమూర్తి--రాఘవేంద్ర నర్సింగ్ హోం-Hyd-500073@ ఆంధ్రభూమి దిన పత్రిక
 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 5, 2012

కాన్పు తర్వాత అందాలకు మమ్మీ మేక్ ఓవర్ విధానము
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కాన్పు తర్వాత అందాలకు మమ్మీ మేక్ ఓవర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • తల్లులందరూ తమ పిల్లల కోసము సమయము , శక్తి ,డబ్బులను ఖర్చు చేస్తారు . అలాచేయడంతో ఆనందం ఉంటుంది . వారి త్యాగాలన్నీ కుటుంబాన్ని ఆనందము గా , ఆరో్గ్యముగా ఉంచేందుకే . అయితే ఆ శ్రమ , త్యాగాలలో పడి వ్యక్తిగత శ్రద్ద మరిచిపోతారు . మీగురించి మీరు శ్రద్ద తీసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా పెంచవచ్చు . సరిగా ఆ విషయము తెలియచెప్పడమే మమ్మీమేకర్ ప్రొసీజర్ . వయసు తో , ప్రసవాలతో శరీరములో వచ్చిన అనవసరపు మార్పులను వదిలిందుకొని గతరూపము తెచ్చుకునేందుకు ... అనేక శస్త్ర చికిత్సావిధానాలు అందుబాటులోనికి వచ్చాయి.
 • కొంతమంది ఆడవారు కుటుంబం మీదకాక తమమీద శ్రద్ద పెందుకోవడము ఇబ్బంది కరమంటారు . ఇది ఎంతమాత్రము నిజము కాదు . అందముగా ఉండడము ఆరోగ్యములో ఒక భాగమే . చక్కని రూపంతో ఉండడము లో చాలా లాభాలు ఉన్నాయి. మీ పిల్లలు , భర్తల తో అన్యోన్యము గా ఉండి వారి ప్రవర్తనలొ మార్పులు రావడము ఈ లాభాలలో ఒకటి . మీలో ఆత్మవిశ్వాసము పెరగడము , సమాజములో ఒక ప్రత్యేకత ఉంటాయి.
మమ్మీ మేక్ ఓవర్(Mummy make-over) లో ఉపయోగించే సర్వ సాధారణ విధానాలు :
 • బ్రెస్ట్ ఆగ్మెంటేషన్‌(Breast Agumentation): సిలికాన్‌ లేదా సిలికాన్‌ ఇంప్లాంట్స్ అమరికతో్ స్తనాలు చక్కని రూపాన్ని సంతరించుకుంటాయి. దీనిలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ను సూచిస్తారు.
 • బ్రెస్ట్ లిప్ట్(Breat Lift) : స్థనాలను చాతీలో మరికొంచం పైభాగం లో అమర్చడాన్ని బ్రెస్ట్ లిప్ట్ అంటారు. ఈ ప్రక్రియలో స్థనాలకు యవ్వన రూపము ఇవ్వడము ముఖ్యమైనది .
 • బ్రెస్ట్ రిడక్షన్‌(Brest Reduction): గర్భానికి ముందు బాగా పెద్దస్థనాలు కలిగిన స్త్రీలకు ప్రసవం తరువాత కూడా అదే సైజ్ లో నిలిచి ఉంటాయి. వదులుగా కిందకి వ్రేలాడే విధం గా ఉంటాయి. కొద్దిపాటి శస్త్ర చికిత్స ద్వారా గుండ్రని , బిగుతైన , చిన్న స్థనాలను పొందవచ్చును.
 • అబ్డోమినో ప్లాస్టీ(Abdomino plasty) : స్త్రీలు ఎక్కువగా గమనించేది పొట్టను మాత్రమే . పొట్ట వదులుగా , లావుగా వ్రేలాడేదిగా తయాతవుతుంది . పొట్టమీద ముడతలు , చారలు వస్తాయి. మమ్మి టక్ ప్రక్రియలో కొద్దిపాటి సర్జరీ తో మంచి ఆకృతిని పొందవచ్చును.
 • లైపో సక్షన్‌ (Lipo sucction): ఇది ఒక కొత్త పద్దతి . దీనిలో కొవ్వును ఒక ప్రత్యేక పక్రియ ద్వారా తీసెస్తారు . కొన్నిచోట్ల సర్ది పెడతారు . చాతీ , నడుము మంచి ఆకృతిలోకి వస్తాయి.
 • జెనైటల్ రీజువెనేట్ సర్జరీ(Genital Rejuvunet surgery) : పురుడు తరువాత స్త్రీ జననేంద్రియాలు వదులుగా తయారవుతాయి. జెనైటల్ పార్ట్ లు టైట్ చేయడము ద్వారా మంచి ఆకృతిని పొందవచ్చును . దీనివలన తమ లైంగిక భాగస్వామికి మరింత ఆనందము అందుతుంది . వెజైనో ప్లాస్టీ ద్వారా ఇది వీలవుతుంది .

courtesy with Dr.Deepu Chundru-MS,Mch(plastic surgeon)sunshine hospital - Hyd.

 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/