Wednesday, November 30, 2011

స్త్రీ పురుష లింగ బేధం , Female-Male Gender difference,మానవుల్లో లింగ భేదాల ప్రభావంఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --స్త్రీ పురుష లింగ బేధం , Female-Male Gender difference,మానవుల్లో లింగ భేదాల ప్రభావం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీ పురుష లింగ బేధం ఏ దశలో ఏర్పడుతుందనే విషయాన్ని అనేక పరిశోధనల ద్వారా తెలుసుకొన్నారు. పురుష బీజం స్త్రీ గర్భంలోని అండాన్ని చేరుకొన్న క్షణంలోనే స్త్రీ పురుష లింగ బేధం ఏర్పడుతుందని నిర్ధారించ బడింది. కాని భౌతికంగా బాహ్య చిహ్నాలు కన్పించటానికి కొంతకాలం పడుతుంది. గర్భం దాల్చిన ఆరు వారాలకు పురుషలింగ చిహ్నం కన్పిస్తుంది. స్త్రీ మర్మావయవాలు రూపురేఖలు దిద్దుకోవడానికి మూడు నెలలు పడుతుంది. మెదడు లింగబేధానికి అవసరమైన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి కార్యప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తుంది. గర్భస్త శిశువు తన భావిజీవితానికి అవసరమైన శక్తి యుక్తులను పుట్టకపూర్వమే సంతరించుకొంటుంది. అందువల్లే పుట్టిన క్షణం నుండి ఆడపిల్లల, మగ పిల్లల ప్రవర్తనలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జన్యుకణాల ద్వారాను, హార్మోనుల ద్వారాను గర్భస్థ శిశువు తన కవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొంటుంది.

ఆడపిల్లలకు తల్లులు అవవలసిన అవసరం వుంది. కాబట్టి పుట్టినప్పటి నుండి మాటలను విని మనుష్యులను గుర్తించగలుగుతారు. శబ్దాలకు త్వరగా స్పందిస్తారు. మాట్లాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తూ వివిధ శబ్దాలను చేస్తారు. నవ్వుతూ అందర్ని ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు. మగపిల్లలు మనుష్యుల పోలికను బట్టి వ్యక్తులను గుర్తిస్తారు. ఇంపైన రంగులను చూసినప్పుడు ఆనందిస్తారు. బొమ్మలంటే ఇష్టపడ్తారు. మగపిల్లలకు మనుష్యుల కంటే బొమ్మలు ఇస్తే వూరుకుంటారు. ఆడ పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఓదార్చితే వూరుకొంటారు. ఆడపిల్లలు ఎదుటివారి భావాలను తేలికగా అర్థంచేసుకోగలుగుతారు.

 • పరిణామ క్రమంలో
ప్రకృతి స్త్రీపురుషులకు వేరువేరు విధులను నిర్ణయించింది. మగవారు వేటాడి ఆహారాన్ని సంపాదించాలి కాబట్టి జంతువులకు తమకు వుండే దూరాన్ని అంచనా కట్టగల స్థోమత కలిగి వుంటారు. గురి చూసి బాణాన్ని వేయగల సామర్థ్యం వారికి వుంటుంది. అలాగే కుటుంబ పోషణ బాధ్యత వున్న స్త్రీలకు సమాజ స్పురణ, మాటల చాకచక్యం పుట్టుకతోనే వస్తాయి. మగ పిల్లలు ఆటలు, వ్యాయామ క్రీడల లోను యంత్రాలను ఉపయోగించటంలోను ప్రావీణ్యత కలిగివుంటారు. ఆడపిల్లలు ఇతరులను గౌరవించటంలోనూ, ఇతరులకు తమకు మధ్య వున్న అంతరాన్ని గుర్తించటంలోనూ చాకచక్యం చూపిస్తారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఎంపిక చేసుకొనే బొమ్మలలోను, ఆట వస్తువులలోను కూడా వ్యత్యాసం కనిపిస్తుంది.

 • మెదడు పనితీరులో
మగ పిల్లలకు, ఆడపిల్లలకు కొంత తేడా కనిపిస్తుంది. ఆడ పిల్లలు మొదటి సంవత్సరాంతానికి స్పష్టంగా మాటలు చెప్పగలుగుతారు. ఐదారు సంవత్సరాల మగపిల్లలు, అదే వయస్సు వున్న ఆడపిల్లల కంటే తక్కువ మాటలు చెప్పుతారు. ఆ దశలో ఆడపిల్లల విషయ పరిజ్ఞానం మగపిల్లల కంటే ఒక సంవత్సరం ఎక్కువ వున్నట్లు వుంటుంది. ఈ వ్యత్యాసం క్రమ క్రమంగా వృద్ధి చెంది 9 లేక 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒకటిన్నర సంవత్సరాలుగా తేడా కన్పిస్తుంది. 14 లేక 15 సంవత్సరాల ఆడపిల్లలు అదే వయస్సు వున్న మగపిల్లల కంటే 2 సంవత్సరాలు పెద్దవారిలా ప్రవర్తిస్తారు. సుమారు 20 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికీ మగ పిల్లలకు, ఆడ పిల్లలకు మధ్య తేడా అంతగా కనిపించదు. అప్పటికి ఇరువురు సమానంగా వ్యవహరిస్తారు.

 • ఆడపిల్లలు అన్నింటిలోనూ ముందుంటారు :
ఒక మగ పిల్లవాడు ఆడ పిల్ల కవలలుగా పుట్టారు. కూర్చోవటంలోను, ప్రాకటంలోను, నడవటంలోను ఆడ పిల్ల మగ పిల్లవాని కంటే మూడు నెలలు ముందువుందట. ఐదేళ్ళు వచ్చేటప్ప టికి ఆడపిల్ల అన్ని విషయాలలోను అక్కలాగ వ్యవహరించేదట. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నచెల్లిళ్ళ విషయంలో కూడా ఇట్టి తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సామాన్యంగా ఆడ పిల్లలు శైశవ దశలో మగ పిల్లలు కంటే దృఢకాయులుగా వుంటారు. మొదటి సంత్సరంలో తక్కువ జబ్బులు వస్తాయి.


తండ్రి బీజంలోని 'X' క్రోమోజం తల్లి అండం లోని 'X' క్రోమోజంతో కలిసి స్త్రీ శిశువు జనానికి కారణ భూతమౌతుంది. ఈ రెండు 'XX' క్రోమోజంలు ఒకదానికి ఒకటి వత్తాసుగా వుండి ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక క్రోమోజం లో ఏదయినా లోపం వుంటే రెండో క్రోమోజం ఆ లోపాన్ని సరిదిద్ది ఆడపిల్లల పురోభివృద్ధికి తోడ్పడుతుంది. స్త్రీలు ఇంకొక జీవిని ఉత్పత్తి చేయాలి కాబట్టి ప్రకృతి వారికి ఎక్కువ శక్తిని ప్రసాదించింది. అందువల్లే స్త్రీల సగటు ఆయుఃప్రమాణం పురుషుల కంటే సుమారు 6 లేక 7 సంవత్సరాలు ఎక్కువ వుంటుంది. ఈ వ్యత్యాసం అన్ని దేశాలలోను, అన్ని జాతులలోను స్పష్టంగా కన్పిస్తుంది.


తల్లి అండంలోని '×' క్రోమోజంతో తండ్రి బీజంలోని 'Y‌' క్రోమోజం కలిసినప్పుడు మగపిల్లవాడు పుడ్తాడు. 'Y‌' క్రోమోజం '×' క్రోమోజం కంటే చిన్నదిగా వుంటుంది. ఈ రెండు క్రోమోజంలు కలసి పని చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. అందువల్లే ఎక్కువ మంది మగశిశువులు పుట్టక ముందే చనిపోతారు. పుట్టిన తరువాత కూడ మొదటి వారంలో చనిపోయే శిశువులలో మగపిల్లల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

మగపిల్లలు ఎక్కువగా ఏడుస్తూ తల్లిని అంటిపెట్టుకొని వుంటారు. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మెదడు పనితీరు ఒక నెల వయస్సు వున్న మగపిల్లవాని మెదడులాగ పనిచేస్తుంది. మూడేళ్ళు వచ్చేటప్పటికి ఆడపిల్లలు చేతులతో చేసే పనులలో మగపిల్లల కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి వుంటారు. ముఖ్యంగా చేతివేళ్ళపై మంచి ఆధిక్యత కలిగి వుంటారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందు పుస్తకాలు చదవటం మొదలు పెడ్తారు. ఆడపిల్లలు శ్రద్ధగా వింటారు. తమకు తెలిసిన విషయాలను ఇతరులకు వివరంగా చెప్పగలుగు తారు. ప్రైమరీ విద్యాస్థాయి లో ఆడపిల్లలు లెక్కలలో ముందుంటారు. కాని హైస్కూలు స్థాయిలో మగపిల్లలు ముందుకు పోతారు.

 • ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు
మెదడు అన్ని అవయవాల పనితీరుని నిర్దేశిస్తుందని తెలుసు కదా! అయితే కొన్ని విషయాలలో ఆడవారు స్పందించే విధానానికి, మగవారు స్పందించే విధానానికి తేడా ఉంటుంది. దీనికి కారణం వారి మెదడులో జరిగే మార్పులే.
అనేకమంది మీద పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఆడ, మగ మెదళ్ళలోని కొన్ని తేడాలు కనిపెట్టారు. వీటిని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చదవచ్చు.

 • * మగవారి మెదళ్ళు పెద్దగా ఉంటాయి. కానీ వయసుతోపాటు, అదే వయసున్న ఆడవారి మెదళ్ల కంటే త్వరగా కుంచించుకు పోతాయి.
 • * ఆలోచించేటప్పుడు మగవారి కంటే ఆడవారు మెదడుని ఎక్కువగా వాడతారు.
 • * మన మెదడులో గ్రే మాటర్, వైట్ మాటర్ అని రెండు ఉంటాయి. గ్రే మాటర్ తార్కిక శక్తికి, వైట్ మాటర్ జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. మగవారి మెదళ్ళలో గ్రే మాటర్ ఆడవారి మెదళ్ళలో కంటే 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆడవారి మెదళ్ళలో వైట్ మాటర్ మగవారి మెదళ్ళలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిశోధకులు ఏమంటున్నారంటే మగవారు లెక్కలు వంటివాటిలో నిష్ణాతులని, ఆడవారు సాహిత్యం, భాష వంటివాటిలో పండితులని.
 • * ఆడవారి మెదళ్ళు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ గ్లూకోస్ ని వాడుకుంటాయి.
 • * "ఇంటలిజెన్స్" పత్రిక 2006 లో చేసిన సర్వే ప్రకారం జ్ఞాపకశక్తి పరీక్షల్లో మగవారు సగటున నాలుగు నుండి ఐదు పాయింట్లు ఎక్కువగా సాధించారు.
 • * మగవారు సెక్స్ గురించి చాలా ఎక్కువగా అంటే నిముషానికి ఒకసారి చొప్పున, ఆడవారు చాలా తక్కువగా అంటే ఒకటి లేక రెండు రోజులకు ఒకసారి చొప్పున ఆలోచిస్తారు.
 • * శిశువుల మీద చేసిన పరిశోధనలలో డిస్టర్బ్ చేసే ధ్వనులకు మగశిశువుల కంటే ఆడశిశువులు ఎక్కువ ప్రతిస్పందించారు.
 • * ఆడవారు మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు. దీనికి కారణం వారి మెదళ్ళలోని కొన్ని గ్రంధుల చర్యలే. ఆడవారు, మగవారు రోజూ మాట్లాడే మాటల మధ్య తేడా సగటున 1000 నుండి 10,000 వరకు ఉంటుంది.
 • * ఆడవారు మగవారి కంటే ఎక్కువగా స్పర్శకు ప్రభావితమవుతారు. 20 సెకండ్ల కౌగిలింత ఆడవారి మెదడులో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇది తనను కౌగిలించుకున్న వ్యక్తి మీద నమ్మకాన్ని కలిగించటానికి దోహదపడుతుంది.

సమస్త జీవరాశిలో బుద్దిజీవులు గొప్పవారనేది జగమెరిగిన సత్యం. ఈ బుద్దిజీవుల్లో ఆడ, మగలలో ఎవరు గొప్ప అనేది ఒక తమాషా ప్రశ్న. కాని ఆడ, మగ వీరిరువురిని అనేక కోణాల్లో పరిశీలించి విశే్లషించి వారి ప్రత్యేకతలు చెప్పుకోవచ్చు. స్ర్తిలు శారీరకంగా, మేథోపరంగా మగవారికి తీసిపోరని ఆధునిక పరిశోధనలు చెపుతున్నాయి. జన్యుపరంగా స్ర్తిలు మగవారికన్నా బలవంతులని తెలుస్తోంది. మనిషిలో ఉండే 46క్రోమోజోమ్‌లలో రెండు లైంగిక క్రోమోజోమ్‌లు. స్ర్తిలలో ఎక్స్,ఎక్స్, పురుషులలో ఎక్స్,వై లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి. రెండు ఎక్స్‌క్రోమోజోమ్‌లుగల స్ర్తిలు జన్యుపరంగా పురుషులకన్నా పటిష్టంగా ఉంటారని పరిశోధకుల అభిప్రాయం.


మగవారి మెదడుకన్నా ఆడవారి మెదడు చిన్నది కావున వారికి తెలివి తేటలు సాపేక్షంగా తక్కువగా ఉంటాయనేవారు కూడా వున్నారు. అయితే పరిశోధకులు నిర్వహించిన అనేక పరిశోధనల ఫలితంగా ఆడ-మగ మెదడుల మధ్య సున్నితమైన వ్యత్యాసాలు వున్నాయని, వాటికి ప్రాముఖ్యముందని అంటున్నారు. ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోవాలంటే పురుషులు మెదడులో ఎడమవైపున ఉండే చిన్న ప్రదేశాన్ని ఉపయోగించుకుంటారు. స్ర్తిలు ఈ ప్రదేశానే్న కాకుండా మెదడు కుడివైపున వున్న ఒక ప్రదేశాన్నికూడా ఉపయోగించుకుంటున్నారు.
 • ఆడవారు బలహీనులు
మగవారికన్నా ఆడవారి శరీర చట్రం చిన్నదిగా ఉంటుంది. పైగా మగవారి అవయవాలకన్నా ఆడవారి అవయవాలు చిన్నవి. మగవారితో పోలిస్తే ఆడవారిలో మెటబాలిక్ రేటు తక్కువ. స్ర్తిలకుండే రుతుస్రావం, సంతానోత్పత్తి ప్రక్రియలు, మెనోపాజ్ వంటి ప్రకృతిపరమైన సందర్భాలు కారణంగా పురుషులమాదిరి ఎల్లప్పుడూ శారీరక శ్రమతో కూడిన పనులు చేయలేరు. స్ర్తిలలో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వారిలో కండర శక్తి తక్కువగా ఉంటుంది.

 • స్ర్తి శక్తి
ఆడవారి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుచేత తిండి లేకపోయినా మగవారికన్నా బాగా తట్టుకోగలరు. స్ర్తిలలో ఎస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. అందువల్ల వారికి తొందరగా గుండె జబ్బులు రావు. ఆఫీసు, ఇంటిని ఒకేసారి మహిళలు సమర్ధవంతంగా నిర్వహించగలరు.
జీవ గడియారాలు
ఆడ- మగల్లో జీవ గడియారాలు భిన్నంగా ఉంటాయి. ఈ విషయం ఇటీవలనే శాస్తవ్రేత్తల దృష్టికి వచ్చింది. రుతుమార్పులకు మగవారికన్నా ఆడవారు బాగా స్పందిస్తారు. ఆడ-మగ రాత్రి సమయాల్లో సమాన కాలాలు నిద్రించవచ్చు. స్ర్తిలలో జీవ గడియారం సూర్యుడికి ప్రతిస్పందిస్తుంది. శీతాకాలంలో పగటికాలం తగ్గుతుంది. అటువంటప్పుడు స్ర్తిలలో రాత్రిపూట మెలటోనిన్ స్రావం ఎక్కువ అవుతుంది. వేసవిలో తగ్గుతుంది. మగవారిలో వేసవి, శీతాకాలాల్లో స్రవించే మెలటోనిన్ ఒకే విధంగా ఉంటుంది. శీతాకాలంలో ఆడవారు ఒక రకం డిప్రెషన్‌కు గురిఅవుతూ ఉంటారు.

 • ఆడ-మగ తేడాలు
స్ర్తికి సిగ్గే అలంకారం. స్ర్తికి సిగ్గుపడని శరీర భాగం అంటూ ఉండదు. స్ర్తిజాతికి ప్రకృతి ఎన్నో కామ, ప్రణయ కేంద్రాలను ప్రసాదించింది. స్ర్తిలకు పెదవులు, చెక్కిళ్లు, పాల భాగం, ముంగురులు, అందమైన నాసిక, బొడ్డు, బాహుమూలలు, నడుము ఇవన్నీ ప్రణయ కేంద్రాలే. స్ర్తికంటే పురుషుడు బలవంతుడు.
మగవాని అంగాలు స్ర్తిల అంగాలకన్నా బరువుగా ఉంటాయి. ఒక యువకుని మెదడు బరువు సగటున 1380 గ్రాములు ఉంటే అదే వయసుగల యువతి మెదడు బరువు సగటున 1250 గ్రాములు ఉంటుంది.
యవ్వనంలో స్ర్తి, పురుషుల మర్మాంగాల వికాసం, వాటి బలిష్టత, ఎస్ట్రోజన్, ఆండ్రోజన్ హార్మోనుల చర్యపై ఆధారపడి ఉంటుంది. ఆడవారి విషయంలో పొత్తికడుపు చుట్టూ ఉండే అస్థిపంజరంలో ఎదుగుదల యవ్వన దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్ట్రోజన్ హార్మోనువల్ల పెరిగే ఎముకలు కొంతవరకు ఎదిగిన తరువాత ఎదుగుదల ఆగిపోతుంది. అందువల్లనే ఆడవారి శరీర నిర్మాణం మగవారి శరీర నిర్మాణాన్ని మించదు.

 • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కన్నీరు,The tearsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కన్నీరు,The tears-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...సినిమాలో హీరోహిన్‌ పడుతున్న కష్టాలు చూస్తున్న ప్రేక్షకులు కంటతడి పెడతారు . అదే సినిమాలో హాస్యనటులు కడుపుబ్బ నవ్విస్తుంటే ఆ సమయములోనూ ప్రేక్షకులవెంట కన్నీరు కారుతుంది . విషాదానికి , ఆనందానికి కూడా కన్నీరు కారుతుంది . మనసులో కలిగే భావోద్వేగాలను కన్నీళ్లు ప్రతిబింబిస్తాయి . అయితే భావోద్వేగాలు మనుషులకే కాదు ఇతరజీవులకు ఉంటుంది . . . కాని కంటివెంట నీరు కారదు . కంటినీరు పెట్టడము అనేది మానవ లక్షణము . తమ భాదను అరుపులు ద్వారా తెలియజేస్తాయి కోతులు , చింపాజీలు .

కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో lacrimation అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది. చాలా జంతువులలో lacrimation కు అవుసరమైన వ్యవస్థ (శరీర భాగాలు, గ్రంధులు) ఉన్నాయి. అయితే భావోద్వేగాల కారణంగా ఇలా కన్నీరు కార్చే క్షీరదం జాతి జీవి మానవుడే అని భావిస్తున్నారు.


 • కన్నీటిలో రకాలు
కన్నీరు స్రవించే విధానం బట్టి వాటిని మూడు విధాలుగా విభజిస్తారు.

1. శుభ్రం చేసే కన్నీరు (Basal tears): క్షీరదాలు తమ కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచడానికి, దుమ్మును నివారించానికి మరియు కొంత పోషక పదార్ధాలను అందించడానికి కన్నీటిని నిరంతరం స్రవిస్తాయి. ఈ కన్నీటిలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌లు, లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌లు, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉన్నాయి. కన్నీటిలో ఉన్న లవణాలు రక్తం ప్లాస్మాలో ఉన్న లవణాలకు ఇంచుమించు సరిమోతాదులో ఉన్నాయి. షుమారుగా 24 గంటలలో 0.75 నుండి 1.1 గ్రాముల వరకు స్రవిస్తాయి. వయసు పెరిగినకొద్దీ ఈ స్రావం తగ్గుతుంది.

2. కలక కన్నీరు (Reflex tears): ఏదైనా ధూళి వంటివి తగిలి కంటికి irritation కలిగినపుడు (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటినుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటిలి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఇలావే జరుగుతుంది. ఇలా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా కంటికి కలిగిన ఇర్రిటేషన్ పదార్ధాలను తుడిచి వేయడానికి కన్నీరు స్రావం జరుగుతుంది.


3. ఏడవడం వలన కన్నీరు (Crying or weeping (psychic tears)): బలమైన భావోద్వేగాలు, నొప్పి, తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది. మనుషులలో ఈ ప్రక్రియకు సమాంతరంగా ముఖం ఎర్రబడడం, గొంతులో గద్గదత, శరీరం కంపించడం కూడా జరుగుతాయి. పైన చెప్పిన రెండు విధాల కన్నీటిలో కంటె ఈ మూడవ తరహా కన్నీరులో ప్రోటీన్ సంబంధిత పదార్ధాలు, హార్మోనులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల కారణంగా ఇలా జరుగుతుంది.

 • కన్నీటి ఔషధ గుణాలు
"ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి. కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కన్నీళ్లలో ప్రొటీన్లు, మాంగనీసు, పొటాషియం, హార్మోన్లు, ప్రొలాక్టిన్ ఉంటాయి. మాంగనీసు అత్యవసరమైన పోషక పదార్థం. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపకరిస్తుంది.

 • శోకం బంధాన్ని పెంచుతుంది

ఏడుపుతో ఒంట్లో నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. మానసికోద్వేగాల పరంగానూ ఉపయోగాలున్నాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతంగానే కాకుండా, మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ, దుఖం, కన్నీరు ఎదుటి వారిని తృప్తి పరుస్తుంది, శత్రువుల నుంచీ సానుభూతి సంపాదిస్తుంది, బంధాన్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి. ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుందన్నది తెలిసిందే. అయితే.. అది వ్యక్తిగత సంబంధాలనూ మెరుగుపరుస్తుందట. ఏడిస్తే శత్రువు కూడా కరిగిపోయే అవకాశం ఉందని, కన్నీరు మనుషులను దగ్గర చేస్తుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఇతరుల కన్నీటికి కరిగిపోవడం మానవ నైజమని కూడా వారు గమనించారు. మానవ పరిణామక్రమంలో ఏడుపనేది.. మన అవసరాలను, విధేయతను తెలియజేస్తుందని, దీనితో సాంఘిక సంబంధాలు బలపడే అవకాశం ఉంటుందని బ్రిటన్‌లోని 'ఎవల్యూషనరీ సైకాలజీ' అనే జర్నల్‌లో ప్రచురించారు. ముఖ్యంగా పరుల నుంచి సానుభూతి సాధించడానికి, మన అవసరాలకు అనువైన సహాయాన్ని పొందడానికి ఏడుపు చక్కటి సాధనంగా పని చేస్తుందని పరిశోధకులు సెలవిస్తున్నారు. వివిధ సందర్భాల్లో స్పందించిన వ్యక్తుల నిజాయితీని వారి ఏడుపు కారణంగా ఇతరులు గ్రహించే అవకాశం ఉందని తేలింది.అంతే కాక, కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉందని తేలింది. అయితే.. ఎక్కడ పడితే అక్కడ ఏడిస్తే ఫలితం ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఉదాహరణకు మనం పని చేసే కార్యాలయంలో బక్కెట్ల కొద్దీ కన్నీరు కారిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మనతో ఏదో విధమైన అనుబంధం ఉన్న వారి దగ్గర ఏడిస్తేనే ఫలితం ఉంటుందన్న మాట.
 • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 29, 2011

పోలియో, Polioఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పోలియో, Polio-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పోలియో అని సాధారణంగా పిలవబడే 'పోలియోమైలెటిస్' (Poliomyelitis) అనే వ్యాధి వైరస్ ద్వారా కలిగి,నాడీ మండలాన్ని దెబ్బ తీసే ఒక వ్యాధి. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చే జబ్బులలో పోలియో వ్యాధి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. బిడ్డ చిన్నతనంలో అవగాహనా లోపంతో తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు కారణంగా బిడ్డ జీవితాంతం పోలియో వ్యాధిగ్రస్తుడుగా మిగిలిపోవల్సి రావడం నిజంగా దురదృష్టమే! అందుకే పోలియో వ్యాధి లక్షణాలనూ, పోలియో వ్యాధి రాకుండా తీసుకోవల్సిన ముందు జాగ్రత్తలనూ ప్రతి వ్యక్తీ
తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 • వ్యాపించే విధానము :
ముఖ్యంగా రెండు విధాలుగా ఈ జబ్బు రావచ్చు. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఇదొక రకం.
మరొక విధం ఏమిటంటే - ఈ వ్యాధి క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార

పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. మలం మీద వాలిన ఈగలు, మళ్ళీ ఆహార పదార్థాలమీద వాలడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. గొంతులో చేరిన క్రిములు , రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.

కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి క్రిములు ఒక సారి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్దిపొందుతూ, క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు

రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడి మండలం దెబ్బతిని కదల్చడానికి వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇది త్వరితగతిన సోకుతుంది. కాబట్టి అతి చిన్న శిశువు దశ నుండి బిడ్డకు రెండున్నర మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకూ వ్యాక్సిన్లు తీసుకోవడం అవసరం. అంతే కాకుండా శిశువైద్యనిపుణుల సలహాలను పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

 • లక్షణాలు :
పోలియో అనేది జ్వరం, జలుబు, వాంతులు, కండరాల నొప్పులతో ప్రారంభమవుతుంది. కొంతమందిలో ఈ లక్షణాలు మాత్రమే ఉండగా, ఇంకొంతమందిలో మాత్రం కొన్నిసార్లు శరీరంలో ఒక భాగం బలహీన మవుతుంది. సామాన్యంగా ఒక కాలికి గానీ, లేదా రెండు కాళ్ళకూ గానీ ఈ విధంగా జరగవచ్చు. కాలక్రమేణా శక్తివిహీనమైన కాలు రెండవ కాలు పెరిగినంత వేగంగా పెరగదు.

ఒకసారి ఈ జబ్బు వచ్చాక ఇంక ఏ మందూ అవయవం చచ్చుపడిపోకుండా నివారించలేదు. ఏంటీ బయోటిక్స్‌ పని చేయవు. నొప్పి పుట్టే కండరాలకు నొప్పి తగ్గించేందుకు మందులు వాడవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ మాత్రమే బిడ్డకు ఈ వ్యాధి రాకుండా నివారించే ముందు జాగ్రత్త చర్య! పోలియో వ్యాధి రావడానికి వైరస్‌ ప్రధాన కారణం. ఈ వైరస్‌ మన శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థలోకి ప్రవేశించడం వల్లనే పోలియో వ్యాధి వస్తుంది. వైరస్‌ ఎంత త్వరితంగా వ్యాప్తి చెందుతోందన్న దానినిబట్టే పోలియో ప్రభావం కూడా ఉంటుంది. కొందరిలో ఇది నరాల బలహీనతకు దారి తీస్తుంది. తద్వారా నరాలు బలహీనపడి కొద్దికాలానికి చచ్చుపడిపోతాయి.

కొంతమందిలో పోలియో పక్షవాతాన్ని పోలి ఉంటుంది. నిజం చెప్పాలంటే- పోలియో పక్షవాతం, రెండూ దాదాపుగా ఒకే లక్షణాలతో ఉంటాయి కూడా!

 • వ్యాధి నిరోధక శక్తి
ఒక విచిత్రం ఏమిటంటే , ఈ జబ్బు అశుభ్రవాతావరణంలో పుట్టి పెరిగిన పసిపిల్లలకి అనగా మురికి వాడలలోనూ, గుడిసెలలోనూ పుట్టి పెరిగిన పిల్లలకు సాధారణంగా రాదు. కాని మంచి పరిశుభ్రమైన వాతావరణంలో - ఆధునిక నగరాల్లో పుట్టి పెరిగే పిల్లలకే సులభంగా ఈ వ్యాధి సోకుతుంది. దీనికి కారణం ఏమిటో మీకు తెలుసా?.

అశుద్ధ వతావరణంలో పుట్టి పెరిగే పిల్లల కడుపులోకి ఈ క్రిములు ఆహార పానీయాదుల ద్వారా కొద్దికొద్దిగా ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పిల్లల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి క్రొత్తగావచ్చే క్రిముల్ని చంపి వేయడం జరుగుతుంది. అందుచేత ఈ పిల్లలకు పోలియోవ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువ.

పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కడుపుల్లో వ్యాధి క్రిములు ప్రవేశించి నిరోధక శక్తి ఏర్పడే అవకాశం లేదుగదా! అందువల్ల చుట్టుపట్ల ఈ వ్యాధి క్రిములు బాహాటంగా వ్యాపించినప్పుడు, పిల్లల కడుపులోకి ఆ క్రిములు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ పిల్లలకు పోలియో జబ్బు వస్తుంది.
 • వ్యాధి తీవ్రత
మొట్ట మొదటి 48 గంటల కాలం మిక్కిలి వేగంగానూ, ఆ తర్వాత 2, 3 రోజులపాటు కొంచెం మెల్లగానూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నాడీ మండలం, కండరాలూ దెబ్బ తినడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అప్పుడు జబ్బు తీవ్ర రూపం దాల్చినట్టు భావించాలి. బలహీనమైన కండరాలలో బాధ ఆరంభమవుతుంది. తర్వాత కండరాలు కుంచించుకుపోయి, బిగుసుకుపోతాయి. ఆ ప్రదేశాలను తాకితే విపరీతమైన నొప్పి కలుగుతుంది. తర్వాత రెండు మూడు రోజులలో ఆ కండరాలు బిగుసుకుపోవడం పోయి మళ్ళీ అవి సడలిపోతాయి.
మెడచుట్టూ వున్న కండరాల తాలుకు జీవకణాలూ, శ్వాసకోశాన్ని కదిల్చే కండరాల తాలుకు జీవకణాలూ దెబ్బ తిన్నప్పుడు మెడ వాలిపోవడం, శ్వాసకోశం , పనిచేయకపోవడం జరగవచ్చు. ఆహారం మ్రింగే ప్రదేశంలో వున్న కండరాలు దెబ్బ తిన్నప్పుడు మ్రింగడం కష్టమై, ఆహారం శ్వాసకోశంలోకి ప్రవేశించడం జరగవచ్చు. కొన్ని సందర్భాలలో శ్వాసకోసం పూర్తిగా మూసుకుపోవడం కూడ సంభవం! చివరికి శ్వాసకోశ కండరాలు బిగుసుకుపోయి, శ్వాసకోశం పని చేయడం నిలిచిపోవచ్చు. • కొన్ని ముఖ్య విషయాలు :
 • * పోలియో వ్యాధి పూర్తి పేరు-- Poliomyelitis.
 • * పోలియో దేని ద్వారా వ్యాపిస్తుంది-- వైరస్.
 • * పోలియో వ్యాధికి తొలిసారిగా వ్యాక్సిన్‌ను ఎవరు కనుగొన్నారు-- జోనస్ సాల్క్.
 • * జోనస్ సాల్క్ ఏ దేశానికి చెందినవారు-- అమెరికా.
 • * పోలియో వాక్సినేషన్ ప్రారంభమైన సంవత్సరం-- 1952.
 • * పోలియో వ్యాధికి ఓరల్ వ్యాక్సిన్ (చుక్కల మందు) కనుగొన్న శాస్త్రవేత్త-- ఆల్బర్ట్ సాబిన్.
 • * ఆల్బర్ట్ సాబిన్ పోలియో వాక్సిన్ రూపొందించిన సం.-- 1954.
 • * పోలియో వచ్చిన పిల్లలకు సాధారణంగా వచ్చే వ్యాధి-- కుంటితనం.
 • * పోలియో వైరస్ ఏ భాగంపై ప్రభావం చూపుతుంది-- నాడీమండలంపై.
 • * భారతదేశంలో తొలి పోలియో రహిత జిల్లా-- పతనంతిట్ట (కేరళ).

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

రోగనిరోధక శక్తి,immunity,రక్షణ కవచంఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రోగనిరోధక శక్తి,immunity,రక్షణ కవచం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


* రోజూ మన శరీరం ఎన్నో రోగాల బారి నుండి కాపాడబడుతుంది. నిత్యం ఎన్నో రోగక్రిముల నుండి రక్షింపబడుతున్నాము. ఈ ప్రక్రియ అనునిత్యం మన జీవితంలో ఒక భాగం. ఇవన్నీ మన శరీరధారుడ్యాన్ని బట్టి, మంచి అలవాట్లను బట్టి రోగనిరోధక శక్తి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను మనం దృఢపరచుకోవడానికి కొన్ని నియమాలు, అలవాట్లు పాటించాలి.

రోగ నిరోధక వ్యవస్థ శరీరమంతా వ్యాపించి వుంటుంది. ఈ వ్యవస్థ శరీరానికి సంబంధించిన కణాలు, బయట వుండే కొత్త కణాలేవో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతుంది. శరీరానికి సంబంధించిన కణజాలాల్ని సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటికి సరైన రీతిలో ప్రతిస్పందించి వాటిమీద దాడి చేస్తుంది. శరీరంలో ప్రతిబంధకాలు (యాంటి బాడీస్‌)ను వాటికి అనుగుణంగా సృష్టించుకుంటుంది. సూక్ష్మజీవులతో పోరాడుతుంది. వీటితో పోరాడే కణాల్ని ప్రేరేపించి రోగక్రిములను నశింపజేస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థకు ధైమస్‌గ్రంథి, లింప్‌ గ్రంథులు, లింప్‌ నాళాలు, ఎముకలోని గుజ్జు, ప్లీహం సహాయపడతాయి.

 • థైమస్‌ గ్రంథి
ఛాతి ఎముక వెనక వైపున వుండే ఈ గ్రంథి ఉత్పత్తి చేసే తెల్ల రక్తకణాలు టి. లింపో సైట్స్‌గా వృద్ధిచెందుతాయి.శరీరంలో ప్రవేశించిన బాక్టీరియాతో, వైరస్‌లతో పోరాడతాయి. టి సెల్స్‌ అనే ఈ కణాలకు మరికొన్ని కణాలు తోడై జంటగా కూడా పోరాడతాయి. సహయక టి.సెల్స్‌, కిల్లర్‌ టి-సెల్స్‌, సప్రసెర్‌ టి-సెల్స్‌ను జంటగా పోరాడే కణాలు అంటారు. ఆ బాక్టీరియా నశిస్తూనే పోరాటం ఆపాలనే సందేశం వాటికి అందుతుంది. కానీ కొన్ని సందర్భాలలో రోగనిరోధక కణజాలాలు మన శరీరంలో వుండే కణజాలాల మీదనే దాడికి దిగుతాయి. అప్పుడు శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడి వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు అంటారు. రుమాటాయిడ్‌ ఆర్థ్రయిటీన్‌ కీళ్లవ్యాధి ఈ విధంగానే వస్తుంది.

 • లింఫ్‌ గ్రంథులు
ఇవి బి-లింఫోసైట్స్‌ అనే రక్త కణాలను తయారు చేస్తాయి. వీటిపై భాగానా ఇమ్యూనోగ్లోబిన్స్‌ అనే ప్రోటీన్‌ వుంటాయి. ఇవి రోగక్రిములతో పోరాడే యాంటిబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి.

 • లింఫ్‌ నాళాలు
ఈ నాళాలు సూక్ష్మక్రిములను లింఫ్‌ గ్రంథుల వద్దకు చేర్చి, అక్కడ తయారయ్యే యాంటీ బాడీస్‌, సూక్ష్మక్రిములను నశింపజేస్తాయి.

 • ఎముక గుజ్జు
ఇది మన శరీరంలో రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ తెల్ల రక్తకణాలు శరీరంలో ప్రవేశించిన సూక్ష్మక్రిములతో పోరాడి వాటిని నశింపజేస్తుంది.

 • ప్లీహం
ఇక్కడికి రక్త ప్రసరణ ద్వార చేరిన సూక్ష్మక్రిములను, తెల్ల రక్తకణాల ద్వార నశింపజేస్తుంది.

 • రోగనిరోధక వ్యవస్థ రకాలు.--
రోగనిరోధక వ్యవస్థ రెండు రకాలు :
మొదటిది పుట్టుకతో వస్తుంది. అంటే తల్లి గర్భంలో వుండగా, తల్లి శరీరము నుంచి లభించే యాంటీబాడీస్‌ ద్వారా, తర్వాత తల్లి పాలనుండి లభించే యాంటి బాడీస్‌ ద్వారా రక్షణ కల్పించే వ్యవస్థ.

ఇక రెండోది అక్వైర్డ్‌ ఇమ్యూనిటి. ఇది మనిషి పెరిగి పెద్దయ్యే క్రమంలో మంచి మంచి అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటాం.

 • ఎలా సాధ్యం ?
రోగనిరోధక శక్తిని మనలో ఉంటుంది. ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. వివిధ సందర్భాలలో సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యవస్థ చురుకుంగా పనిచేసి వాటి నిర్మూలిస్తుంది. ఇదేలా సాధ్యమంటారా...
 • నోటిలో లాలాజలంలో వుండే ఎంజైమువల్ల.
 • ముక్కులోనికి దుమ్ము, ధూళి నాసికలలో వుండే కేశములవల్ల బయటికి తోసెయ్యబడతాయి. ఒక్కసారి ఈ సూక్ష్మక్రిములు ముక్కులోపల ప్రవేశిస్తే, తుమ్ము ద్వారాగాని, చీమిడి ద్వారాగాని బయటికి నెట్టివేయబడ్తాయి.
 • గొంతులోపల వుండే టాన్సిల్స్‌ ద్వారా నిరోధించబడ్తాయి.
 • జీర్ణాశయంలో, కడుపులో తయారయ్యే యాసిడ్స్‌వల్ల ప్రేగుల్లో ప్రవేశించినప్పుడు ఈ సూక్ష్మక్రిములను ఉపకారిక బ్యాక్టీరియా నశింపజేస్తుంది.
 • చర్మం తన స్వేదగ్రంథుల ద్వారా, నూనె గ్రంథులలో తయారయ్యే నూనె వల్ల చర్మం ద్వారా ప్రవేశించే సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి.
 • మూత్రనాళాలలో వుండే మంచి బాక్టీరియా ఈ సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి.
 • ఇలా మన శరీరంలో చొచ్చుకొని వచ్చే అపకారిక్రిములను చాలా వరకు నశింపజేస్తాయి.
 • మనం ఏం చేయాలి ?
మన చుట్టూ ఉండే వాతావరణంలో ఎన్నో రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌, పారసైట్లు వంటివి అదృశ్యంగా ఉంటాయి. ఆహారంతోపాటు మన శరీరంలోకి ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతుంటాయి. సాధారణ జలుబు నుండి ఫ్లూ వరకూ ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్‌ల కారణంగానే సోకుతాయి. వీటి బారినుండి శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ . ఈ దీన్ని పటిష్టపరుచుకోకుంటే మనం రోగాల బారినుంచి రక్షించుకున్న వాళ్లమవుతాయి.

 • పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌, దుంపలు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులు రాకుండా కాపాడుకోగలుతుగారు. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంలో ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు, ఖనిజాలు, బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి, ఫోలేట్‌, ఇనుము, మెగ్నీషియం, కెరోటినాయిడ్లు, ఫైటో కెమికల్స్‌, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 • ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్‌, ఖనిజల వణాలు కలిగిన పోషక పదార్థాలతో కూడిన సంతులిత ఆహారము వేళకు సరిగ్గా భుజించడము.
 • రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో చాలా చవకైనది వ్యాయామం. రోజు తప్పని సరిగా వ్యాయమం చేయడం అలవాటు చేసుకోవాలి. వయసు, సమయాన్ని బట్టి చేసే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. నడకగాని, జాగింగ్‌ సైక్లింగ్‌, స్విమింగ్‌ (లేదా ఆటలు) చేయాలి.
 • ఒత్తిడికి దూరంగా వుండాలి. ఒత్తిడి ఎక్కువైతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకని ఒత్తిడిని తగ్గించునే మార్గాలు ఎంచుకోవాలి. ప్రణాళికాబద్దంగా పనులు చేస్తే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
 • మద్యపానం, అతిగా టీ కాఫీలు సేవించడం మానాలి.
 • పొగ తాగడం, గుట్కా జర్దా వాడటంమానాలి.
 • కొన్ని ప్రాణాంతకమైన రోగాలకు తప్పని సరిగా వ్యాక్సీన్‌లు వేయించుకోవాలి.
 • పుట్టిన పిల్లలకు తర్వాత పెరిగే పిల్లలకు, నిర్దేశించబడిన సమయాలలో వ్యాక్సిన్‌ వేయించాలి. వీటిని పాటిస్తే మన ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా వుంటుంది.
 • రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేయాలి. కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. దీని వల్ల అలసిన శరీరానికి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 • రోజూ చాలినన్ని నీళ్లు తాగాలి. దాహం కాలేదని నీళ్లుతాగడం మరచిపోకూడదు. డీహైడ్రేషన్‌ వల్ల తలనొప్పి కలిగే అవకాశాలున్నాయి.
 • స్థూలకాయం కూడా రోగనిరోధక శక్తికి శత్రువు. ఎందుకంటే స్థూలకాయం తెల్లరక్తకణాలు పెరగడం, యాంటిబాడీల ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది.

 • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

క్లోమ గ్రంథి వ్యాధి,పేంక్రియాటిక్‌ గ్రంథి వాపు,ప్యాంక్రియాటైటిస్‌,Pancreatitis
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Pancreatitis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


క్లోమ గ్రంథికి వచ్చే వ్యాధుల్లో ఎక్యూట్‌ ప్యాంక్రియాటైటిస్‌ ఒకటి. వ్యాధిలో పేంక్రియాస్‌ తనలోని ఎంజైమ్‌తోనే జీర్ణించబడుతుంది. కానీ చాలా కేసుల్లో తర్వాత పేంక్రియాస్‌ మాములు పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఈ వ్యాధి ఎందు కొస్తుంది, కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి తెలుసుకుందాం..

 • కారణాలు
పేంక్రియాటిక్‌ గ్రంథి వాపుతో సమస్య మొదలవుతుంది. కొన్ని కేసులలో ఈ గ్రంధి క్షీణించి రక్తస్రావంతో కూడుకొని వుంటుంది.
 • పిత్తాశయంలో రాళ్లు.
 • అతిగా మద్యం తాగడం.
 • కడుపుకు దెబ్బతగలడం వల్ల.
 • ఆపరేషన్‌ జరిగిన తర్వాత.
 • ట్రైగ్లిసరైడ్సు ఎక్కువవడంవల్ల.
 • కాల్షియం ఎక్కువ వుండడం వల్ల.
 • కిడ్నిఫెయిల్యూర్‌.
 • వంశ పారంపర్యంగా కొందరిలో.
 • ఇన్‌ఫెక్షన్లవల్ల .
 • పేగులలో పాములవల్ల.
 • కొన్ని మందులవల్ల. సంతాన నిరోధక బిళ్ళల వల్ల. సల్ఫా మందులు వాడడం వల్ల. .
 • పెప్టిక్‌ అల్సర్‌ పేంక్రియాస్‌లో చొచ్చుకుపోవడంవల్ల కలుగుతుంది.

లక్షణాలు
 • కడుపులో తీవ్రమైన భరించలేని నొప్పి. వెల్లెకిలా పడుకొన్నప్పుడు నొప్పి ఎక్కువవడం. మద్యం సేవించిన 12 గంటలలోపే నొప్పిరావడం. కడుపునిండా భోంచేసిన తర్వాత వాంతులు. కడుపు ఉబ్బరించడం. విపరీతంగా చెమటలు పోయడం. రోగి షాక్‌లో వెళ్ళడం. పచ్చకామెర్లు కనిపించడం. కడుపునొక్కితే విపరీతమైన నొప్పి, కడుపు గట్టిగా వుండడం. చేతితో పరీక్షచేస్తే కడుపు వుండకట్టినట్టు తెలియడం. బొడ్డుచుట్టూ లేత నీలంరంగు కన్పించడం.

నిర్ధారణ
 • సీరం అమైలేజ్‌ మామూలు కన్నమూడురెట్లు ఎక్కు వగా వుంటుంది. తెల్లరక్త కణాల సంఖ్య పెరగడం. రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా వుంటుంది. సాధారణ కడుపు ఎక్సరే. సిటీ స్కానింగ్‌. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌. బేరియం ఎక్సరే లో ఈ వ్యాధిని నిర్ధారించొచ్చు.

నివారణ
 • పూర్తి విశ్రాంతి అవసరం.. జీర్ణాశయంలోని ద్రవాలను నాసల్‌ ట్యూబ్‌ ద్వారా బయటికి లాగాలి. ఇంజెక్షన్‌ పెథిడిన్‌ 100 మిల్లీ గ్రాములు అవసరాన్ని బట్టి ఇవ్వాలి. తాగడానికి, తినడానికి ఏమి ఇవ్వకూడదు. నరానికి గ్లూకోజ్‌ పెట్టాలి. షాక్‌కు తగిన చికిత్స చేయాలి. కాల్షియం 'ప్రోజన్‌ ప్లాస్మా' 'రక్తం' ఎక్కించాలి. రక్తంలో షుగర్‌ ఎక్కువుంటే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలి. 'సిమిటెడిన్‌', లేదా 'రానిటడిన్‌' ఇవ్వాలి. ఇన్‌ఫెక్షన్‌కు యాంటి బయాటిక్స్‌ వాడాలి. నాలుగు నుండి ఆరు రోజుల తర్వాత పేషెంట్‌ పరిస్థితి చూసి ద్రవపదార్థాలు ఇవ్వాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. పిత్తాశయంలో రాళ్లు వుంటే పాపిల్లాటమి ద్వారా తీసెయ్యాలి. మద్యపానం పూర్తిగా మానాలి.

ఇతర సమస్యలు
 • షాక్‌, పేగుల కదలిక లేకపోవడం గుండె ఊపిరి తిత్తుల సమస్యలు రావడం, డియోడినమ్‌ పసరతిత్తి నాళంలో అవరోధం ఏర్పడుతుంది. జీర్ణాశయంలో రక్తస్రావమవుతుంది. క్లోమగ్రంథిలో చీము చేరుతుంది. ఉదరంలో, ఊపిరితిత్తుల పొరలలో నీరు చేరుతుంది. అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ ఇవ్వాలి. స్టేరాయిడ్స్‌ అవసరమైతే వాడాలి. 100 రోజుల తర్వాత సిటీస్కాన్‌, ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి పాంక్రియాటైటిస్‌ ఎంత తగ్గిందో తెలుసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గేవరకు విశ్రాంతి అవసరం. యాంటిబయోటిక్స్‌ వాడాలి. మాంసకృత్తుల ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. పాంక్రియాటిక్‌ వాపు నొప్పి తగ్గకుంటే లాప రాటమి ఆపరేషన్‌ తప్పక చేయాలి.

=================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 28, 2011

మహిళల్లో పురుష లైంగిక హార్మోనులు, Male sexual hormones in Females


 • image : courtesy with Prajashakti News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో పురుష లైంగిక హార్మోనులు(Male sexual hormones in Females)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీ పురుష లింగ బేధం ఏ దశలో ఏర్పడుతుందనే విషయాన్ని అనేక పరిశోధనల ద్వారా తెలుసుకొన్నారు. పురుష బీజం స్త్రీ గర్భంలోని అండాన్ని చేరుకొన్న క్షణంలోనే స్త్రీ పురుష లింగ బేధం ఏర్పడుతుందని నిర్ధారించ బడింది. కాని భౌతికంగా బాహ్య చిహ్నాలు కన్పించటానికి కొంతకాలం పడుతుంది. గర్భం దాల్చిన ఆరు వారాలకు పురుషలింగ చిహ్నం కన్పిస్తుంది. స్త్రీ మర్మావయవాలు రూపురేఖలు దిద్దుకోవడానికి మూడు నెలలు పడుతుంది. మెదడు లింగబేధానికి అవసరమైన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి కార్యప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తుంది. గర్భస్త శిశువు తన భావిజీవితానికి అవసరమైన శక్తి యుక్తులను పుట్టకపూర్వమే సంతరించుకొంటుంది. అందువల్లే పుట్టిన క్షణం నుండి ఆడపిల్లల, మగ పిల్లల ప్రవర్తనలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జన్యుకణాల ద్వారాను, హార్మోనుల ద్వారాను గర్భస్థ శిశువు తన కవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొంటుంది.


పురుషుల్లో బీజాల నుండి, ఎడ్రినల్‌ నుండి టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి అవుతుంది. పురుషుల మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైంది. ఇది లేకపోతే మీసాలు, గడ్డాలు పెరగవు. గొంతులో మార్పు రాదు. సెక్స్‌లోపం కూడా సంభవిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎడ్రినల్‌ గ్రంథుల నుండి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ప్రతి 100 మిల్లీలీర్ల రక్తంలో 300 నానోగ్రాముల నుండి 1200 నానోగ్రాముల దాకా టెస్టోస్టిరాన్‌ ఉంటుంది. మహిళల్లో ప్రతి 100 మిల్లీలీరట్ల రక్తంలో 15 నుండి 100 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్‌ ఉంటుంది.


ఆండ్రోజన్లు ... అంటే పురుషు లైంగిక హార్మోనులు మహిళల్లో లైంగిక వాంఛను, శక్తిని, ఎముకల సాంధ్రతను, కండరాల పటుత్వాన్ని పెంచుతాయి. అండాల్లోని పురుష హార్మోనుల చురుకుదనం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అండాశయంలో ఫాలికిల్స్‌ ఉంటాయి. ఇవి కూడా ఒక రకమైన కణాలు. ఫాలికిల్స్‌ నుండి అండాలు విడుదలవుతాయి. పురుష హార్మోనులు ఫాలికిల్‌ పెరుగుదల, ఎదుగుదల ,అభివృద్ధిని నియంత్రిస్తాయి. అదే సమయంలో పెరుగుతున్న అండాలు కలిగున్న ఫాలికిల్స్‌ క్షీణించడాన్ని నివారిస్తాయి.


ప్రయోజనం : టెస్టోస్టిరాన్‌, ఆండ్రోస్టెనిడియోన్‌ ప్రధానమైన ఆండ్రోజన్లు. ఇవి పురుషుల్లో అధికంగా ఉంటాయి. ఇవి మగతనానికి ప్రతీక. సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇతర ఆండ్రోజన్లు... డిహైడ్రోటెస్టోస్టిరాన్‌, డీహైడ్రో ఎపియన్‌డ్రొస్టిరాన్‌, డీహైడ్రో ఎపియన్‌డ్రొస్టిరాన్‌-సల్ఫేట్‌. ఈస్ట్రోజన్లుగా మారడమే ఈ ఆండ్రోజన్ల ప్రధాన ఉద్దేశం. వీటినే మహిళా హార్మోన్లని అంటారు. మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోను సంయోగానికి ఆండ్రోజన్ల అవసరం ఎంతైనా ఉంది. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో ఎముకల బలహీనతను, లైంగిక వాంఛ, సంతృప్తిని నివారించడంలో కీలక పాత్రపోషిస్తాయి. మెనోపాజ్‌కు ముందు, తర్వాత శరీర చర్యలను నియంత్రిస్తాయి.


ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే? : కొంత మంది మహిళల్లో ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే అది ప్రమాదానికి దారితీస్తుంది. మొటిమలు రావడం, పైపెదవి లేదా గడ్డంపై వెంట్రుకలు రావడం, వెంట్రుకలు పలుచబడడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. అత్యధిక స్థాయిలో టెస్టోస్టిరాన్‌ ఉన్న మహిళల్లో పాలిసిస్టిక్‌ ఒవరి సిండ్రోం రుగ్మత ఉంటుంది. దీని వల్ల పీరియడ్స్‌ వచ్చే క్రమం తప్పుతుంది. సంతానోత్పత్తి సమస్యలేర్పడతాయి. బ్లడ్‌షుగర్‌ వ్యాధులొస్తాయి. ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే, పాలిసిస్టిక్‌ ఒవరీ సిండ్రోమ్‌ ఉన్నా లేకున్నా మహిళల్లో తీవ్ర అనారోగ్య పరిణామాలు ఏర్పడతాయి. ఇవి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటుకు, గుండె జబ్బుకు దారితీస్తాయి.


ఆండ్రోజన్‌ స్థాయి తక్కువైతే..? : ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులొస్తాయని తెలుసుకున్నాం. మరి ఆండ్రోజన్‌ స్థాయి తక్కువైనా కూడా సమస్యలే. దీని వల్ల లైంగిక వాంఛ తగ్గుతుంది. అలసటగా ఉంటుంది. ఎముకల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా మహిళల్లో ఏ వయసులోనైనా తక్కువ ఆండ్రోజన్‌ స్థాయి ప్రభావం కనిపించొచ్చు. అయితే ముఖ్యంగా మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న తరుణంలో లేక మెనోపాజ్‌ దశకు ముందు ఎక్కువ కనిపించొచ్చు. 20 ఏళ్ల వయసుకు చేరుకునే సరికి ఆండ్రోజన్‌ స్థాయి తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుకునే సరికి యాభైశాతం తగ్గుతుంది.


చికిత్స : ఆండ్రోజన్‌ సమస్య ఉన్న వారికి నోటి ద్వారా లేదా ఇంజక్షన్‌ ద్వారా తీసుకునే ఈస్ట్రోజన్‌/టెస్టోస్టిరాన్‌ మందులు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రోజన్‌ లోపమున్న వారిలో లైంగిక వాంఛను, సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక ఎములక బలహీనత నుంచి రక్షణ పొందొచ్చు. అయితే ఈ మందుల వల్ల ఒక ప్రమాదముంది. వీటిని వాడడం వల్ల రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమే కాక, బ్లడ్‌ కొలెస్ట్రాల్‌, కాలేయం విషపూరితమవుతాయి. ఆండ్రోజన్‌ లోపానికి, భావోద్వేగానికి, ఆరోగ్యంగా ఉండడానికి సంబంధముంది. మెనోపాజ్‌కు ముందు, తర్వాత మహిళకు చేసే టెస్టోస్టిరాన్‌ థెరపీ ప్రయోజనం చూకూరుస్తుంది
 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎత్తును పెంచే మందులున్నాయా?,Height increasing medicinesఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ఎత్తును పెంచే మందులున్నాయా?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... • పుట్టినప్పటి నుంచి అబ్బాయిల్లో 18 ఏళ్ల వరకు, అమ్మాయిల్లో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. ప్రతి ఎముకలోను కింద భాగానా, పైభాగాన కల రెండు మెటాఫైసిస్‌ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్‌ప్లేట్‌ అంటారు. ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోను తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన (జీన్స్‌) అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకానీ రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి.

 • ఎత్తును పెంచే హార్మోన్‌ థెరపీ
కన్నబిడ్డలు నిలువెత్తు పెరగాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది.కానీ, కొంతమంది పిల్లల్లో ఆ ఎదుగుదల సవ్యంగా సాగకుండా ఏవో అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎత్తు పెరగడం అన్నది బాల్యంతో ముడిపడిన అంశం. అందుకే ఎదగడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే అన్ని చర్యలూ ఇప్పుడే చేపట్టాలి.

అందుకు పిల్లల ఎదుగుదలను పిన్న వయసు నుంచే నిశితంగా గమనిస్తూ ఉండాలి. లోపాలను చక్కదిద్దే విషయంలో ఏ ప్రయత్నం చేసినా 16 మహా అయితే 18 ఏళ్ల లోపే. ఆ వయసు దాటిపోతే ఇంక ఏ వైద్య విధానాలూ ఏమీ చేయలేవు. పిల్లలు ఏపుగా ఎదగాలని కోరుకుంటే సరిపోదు. అది కుంటుపడిపోతున్నపుడు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి ....

 • ఎలా తెలియాలి ? తమ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారో లేదో తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి రూపొందాయి. సాధారణంగా 4నుంచి 8 ఏళ్లలోపు పిల్లలంతా దాదాపుగా ఒకే ఎత్తుతో ఉంటారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే తమ పిల్లలు చదివే తరగతిలోని మిగతా పిల్లలందరితో అప్పుడప్పుడు పోల్చి చూస్తుంటే ఆ తేడా తెలిసిపోతుంది. తరగతిలోని 97 శాతం మంది పిల్లలు తమ పిల్లవాడి కన్నా ఎక్కువ ఎత్తుతో ఉంటే అప్పుడు ఇతన్ని పొట్టిగా గుర్తించాలనేది ఒక శాస్త్రీయ నిర్ధారణ, అయితే, తమకు తామే తమ పిల్లలు పొట్టి అనే భావనతో ఉండిపోవడం కాదు. పిల్లల వైద్యుడు గానీ, ఎండోక్రినాలజిస్టు గానీ పరీక్షలు నిర్వహించి ఆ విషయాన్ని నిర్ధారించినప్పుడే లోపాలు ఉన్నట్లు భావించాలి. తల్లిదండ్రుల ఎత్తు ,వారి నేపథ్యంతో పాటు ఒక నిర్థారిత పట్టికను అనుసరించి నిపుణులు మాత్రమే ఆ లోపాలను సరిగ్గా అంచనా వేయగలుగుతారు. ఎదుగుదలలో కనిపించే అన్ని లోపాలూ శాశ్వతమైనవేమీ కావు. దీర్ఘకాలికంగా వ్యాధులబారిన పడి ఉన్న పిల్లల్లో ఎదుగుదల కొంత కాలం ఆగిపోవచ్చు. అయితే వ్యాధి పూర్తిగా నయం కాగానే ఎదిగే వేగం మళ్లీ పుంజుకుంటుంది. ఎదుగుదలలో నిజంగానే ఏదైనా ఆటంకం ఉన్నట్లు పరీక్షల్లో తేలితే అప్పుడు ఆ మూలాలను పరిశీలించవలసి ఉంటుంది.

కారణాలు అనేకం : పలురకాల కారణాలు పిల్లల సహజమైన ఎదుగుదలకు అడ్డుపడుతుంటాయి. వాటిలో ముఖ్యంగా --

 • పోషకాహార లోపాలు,

పోషకాహారమే తీసుకుంటున్నా అని జీర్ణం కాకపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, క్షయ వంటి తీవ్రవ్యాధులతో శరీరం క్షీణించిపోవడం, రక్తహీనత, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్‌ సమస్యలు పొట్టి తనానికి దారి తీస్తాయి. అయితే, ఈ సమస్యలన్నీ వైద్య చికిత్సలతో సరిచేయగలిగేవే. సకాలంలో సమస్యను గుర్తించి పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తే పిల్లల ఎదుగుదల సహజవేగాన్ని పుంజుకుంటుంది. వ్యాయామం పాలు... ఎత్తు పెరగడానికి అవసరమయ్యే గ్రోత్‌ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎంతగా అందించినా వ్యాయామం లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. కండరాలు పెరగడానికేకాక ఎముకల వృద్ధికీ వ్యాయామం తప్పనిసరి.

 • మానసిక సమస్యలు :
ఎదుగుదల అన్నది పూర్తిగా శారీరకమేమీ కాదు. మానసిక ఒత్తిళ్ళు కూడా ఎదుగుదలను కుంటుపరుస్తాయి. శక్తికి మించిన మానసిక శ్రమ, కుటుంబసభ్యుల మధ్య నిరంతర కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడంతో పిల్లలు నిరాదరణకు గురికావడం, లేదా అనాథలుగా మిగిలిపోవడం వంటివి ఎదుగుదలను బాగా దెబ్బతీస్తాయి.

 • జన్యుమూలాలు :
తల్లిదండ్రులు, ఆపై వంశీకులంతా పొట్టివారైతే వారిపిల్లల్లో ఎక్కువ మంది ఆ లక్షణాలతో ఉంటారు. ఈ తరహా సమస్యలను సరిచేయడం మాత్రం కష్టమే. వంశీకులందరి ఎత్తు తక్కువే అంటే అది జన్యుపరమైన లక్షణమే తప్ప వ్యాధి కాదు. వీరికి జన్యుపరమైన చికిత్స చేసినా వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. తల్లిదండ్రులు ఇద్దరూ పొడుగ్గానే ఉన్నా పిల్లలు మాత్రమే పొట్టిగా ఉంటేఅప్పుడు ఆ లోపాలను పూర్తిగా పిల్లలకు సంబంధించినవిగానే భావించాలి. ఈ రకం లోపాలను చాలా సులభంగానే తొలగించవచ్చు. కాకపోతే చిన్న వయసులోనే ఆ ప్రయత్నాలు చేయాలి.

 • గ్రోత్‌ హార్మోన్లు :
శరీరగ్రంథుల్లోంచి ఉత్సత్తి అయ్యే హార్మోన్లు నిరంతరం రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎత్తు పెరగడానికి సంబంధించిన థైరాయిడ్‌ హార్మోన్లు, సెక్స్‌ హార్మోన్లు, గ్రోత్‌హార్మోన్లు సంయుక్తంగా తమ విధులను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిలో గ్రోత్‌హార్మోన్లదే కీలక పాత్ర, మెదడు కింద అంటే నుదురు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి ఈ గ్రోత్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎదిగే వయసులో ఈ హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండి క్రమేపీ తగ్గి మామూలు స్థాయికి చేరుతుంది. గ్రోత్‌ హార్మోన్ల లోపం ఎదుగుదలలో పెద్ద అవరోధంగా ఉంటుంది. అయితే ఈ హార్మోన్ల లోపం కొందరిలో పుట్టుకతోనే ఉంటే కొందరిలో మధ్యలోనూ తలెత్తవచ్చు. పిట్యూటరీ గ్రంథిపైన కణుతులు ఏర్పడినా, తలకు బలంగా దెబ్బ తగిలినా హార్మోన్‌ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల గ్రోత్‌హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి, ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. ఎదుగుదలలో లోపం ఉందని అనుమానం కలిగిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. గ్రోత్‌ హార్మోన్‌ల లోపం వల్ల వచ్చే సమస్య ఎదుగుదల కుంటుపడటం ఒక్కటే కాదు. ఇది ఎముకలను బలహీనపరిచే ఆస్టియోపొరోసిస్‌ వ్యాధికీ, రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడానికి దారి తీస్తుంది. దీనితో పాటు కొలెస్ట్రాల్‌ పెరగడానికీ, గుండె రక్తనాళాలు గట్టిపడటానికి కూడా దారి తీస్తుంది. అలాగే ఆందోళన, వ్యాకులత, నిలకడలేనితనం వంటి మానసిక సమస్యలు కూడా గ్రోత్‌ హార్మోన్ల లోపం వల్ల సంక్రమిస్తాయి. అందుకే పిల్లల ఎదుగుదల లోపాలను పట్టించుకోకపోవడం అంటే అది మరికొన్ని ఇతర వ్యాధులను ఆహ్వానించడం కూడా అనే నిజాన్ని గ్రహించాలి. కృత్రిమ హార్మోన్లు ఇతర హార్మోన్లు కూడా కొంత తోడ్పడినా ఎత్తును పెంచడంలో గ్రోత్‌హార్మోన్లదే ప్రధాన పాత్ర. మొత్తం శరీర నిర్మాణంలోనూ ఈ హార్మోన్లే మూలధాతువుల్లా పనిచేస్తాయి. పొట్టితనానికి లోనయిన అత్యధికుల్లో ఈ హార్మోన్‌ లోపాలే ఉంటాయి. ఈ స్థితిలో కృత్రిమ గ్రోత్‌ హార్మోన్లను ఎక్కించడం ద్వారా ఈ సమస్యను తొలగించవచ్చు. జన్యువు మూల్యాంశాలతో ఈ హార్మోన్లను పరిశోధనాశాలల్లో కృత్రిమంగా తయారుచేస్తారు. వీటిని హ్యూమన్‌ రికాంబినెంట్‌ గ్రోత్‌ హార్మోన్లు అంటారు. ఇవి పూర్తిగా సురక్షితమైన ర్మోన్లు. గ్రోత్‌ హార్మోన్ల లోపంతో ఎదుగుదల నిలిచిపోయిన వారికి ఈ హార్మోన్లు సిరంజి ద్వారా ఇస్తారు. ఎదుగుదల సహజ స్థాయికి వచ్చేంత వరకు రోజు ఒకటి చొప్పున ఈ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కొంత ఎక్కువ కాలమే. ఈ చికిత్స అవసరమవుతుంది. హార్మోన్‌ లోపం లేని వారికి ఈ హార్మోన్లు ఇస్తే వచ్చే ఫలితం ఏమీ ఉండదు. గ్రోత్‌ హార్మోన్లు విటమిన్‌ మాత్రల్లాంటివి కావు.అనవసరంగా తీసుకుంటే వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. పిల్లలు లేత వయసులో అంటే 5 నుంచి 8 ఏళ్లలోపు ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అస్థిపంజరం లేతగా ఉన్న కాలంలో అయితేనే హార్మోన్‌ చికిత్స బాగా పని చేస్తుంది. అందుకే అనుమానం కలిగిన వెంటనే పిల్లల డాక్టర్‌ను గానీ, ఎండోక్రినాలజిస్టును గానీ సంప్రదించడం తప్పనిసరి. ఎక్కడో అరుదుగా తప్ప 16 ఏళ్లు దాటిన పిల్లల్లో చాలా మందికి హార్మోన్ల చికిత్స వల్ల పెద్ద ఫలితం ఉండదు. ఇక 18 ఏళ్లు దాటిన తరువాత ఎత్తు పెంచే మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎత్తును పెంచే ఇతరత్రా మందులు గానీ, మాత్రలు గానీ ఏమీ లేవు. హార్మోన్‌ చికిత్స ఒక్కటే ఇందుకు సరియైన మార్గం. అవసరమయ్యే గ్రోత్‌ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎంతగా అందించినా వ్యాయామం లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. కండరాలు పెరగడానికేకాక ఎముకల వృద్ధికీ వ్యాయామం తప్పనిసరి.
 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్లు , Joint Infectionsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్లు , Joint Infections- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • ప్రతి ఒక్కరిలో సహజ రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది మనల్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగనిరోధకశక్తి సన్నగిల్లుతుంది. ఈ సందర్భంలో జబ్బులు రావడం సహజం. ఇది శరీరానికే కాదు ఎముకలకు కూడా వర్తిస్తుంది. ఇన్‌ఫెక్షన్ల వల్ల ఎముకల్లో చీము చేరి ఎముక దెబ్బతినే ప్రమాదముంది. దీన్ని గుర్తించిన 24 గంటల్లోనే చికిత్స చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఎముకలో కొంత భాగాన్ని తొలగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎముకల్లో ఇన్‌ఫెక్షన్లు ఎందుకొస్తాయి, చికిత్స వివరాలు మీ కోసం..

ఎముకల్లోని ఏ భాగంలోనైనా వివిధ రకాల సూక్ష్మక్రిములు చేరి ఎముకను దెబ్బతీయడాన్ని, ఇన్ఫెక్షన్‌ కలుగజేయడాన్ని ఆస్టియో మయోలైటిస్‌ అంటారు. ఇందులో మూడు రకాలున్నాయి. అవి...
 • నాన్‌స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌.
 • స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌.
 • సెకండరీ ఆస్టియో మయోలైటిస్‌.
నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ సాధారణంగా 5 నుండి 12 ఏళ్ల వయసులో ఎక్కువగా ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, పెద్ద జబ్బు వచ్చినప్పుడు రక్తంలో స్టెఫైలోకోకస్‌ సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. ఇవి ఎముకల్లోని మైటాఫైసిస్‌ వద్ద చేరతాయి. అక్కడి నుండి డయాఫైసిస్‌లోనికి ప్రయాణిస్తాయి. ఫలితంగా నెమ్మదిగా ఎముక దెబ్బతింటుంది. చీము పడుతుంది. చిన్న పిల్లల్లో ఎముకపైన ఉన్న పెరిఆస్టియమ్‌ పొర మందంగా ఉంటుంది. మైటాఫైసిస్‌ వద్ద ఏర్పడిన చీము పెరియాస్టియా కిందుగా డయాఫైసిస్‌లోకి ప్రయాణించి ఎముక పొడవునా చీము ఏర్పడుతుంది. దీంతో ఎముక పూర్తిగా దెబ్బతిని బలహీనపడుతుంది. రక్త సరఫరా తగ్గి ఉపరితల ఎముక కణజాలం నశిస్తుంది.

 • లక్షణాలు
మొదటి దశ అంటే నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ విపరీతమైన జ్వరం, ఎముక చివరి తలలో వేడి, ఎరుపు, వాపు నొప్పి కలుగుతుంది. తీవ్రమైన ఎముక కీలునొప్పి వల్ల కాలు కదలించడం కూడా కష్టమౌతుంది. ఎముక కొనభాగం నుంచి నిదానంగా వాపు ఎముక పైభాగానికి పాకుతుంది. వైద్యం ఆలస్యమైనపుడు ఎముక పైభాగాన ఉన్న కండలలోనికి, చర్మం కిందికి పెరియాస్టియంలో రంధ్రాలు ఏర్పరచుకొని చీము బయటకు చేరుతుంది. చర్మంలో కూడా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి చీము బయటకు వస్తుంది. దీర్ఘకాలంగా ఇలా చీము బయటకు రావడంలో చర్మరంధ్రాలు చుట్టు ప్రక్కలగల చర్మం గట్టి పడుతుంది. దీనిని సైనస్‌ అంటారు. ఒక చోట రంధ్రం మూసుకొని ఒక్కోసారి వేరొక ప్రదేశంలో పక్కనే సైనస్‌ దగ్గర చర్మం ఫైబ్రస్‌ కణజాలంతో కప్పబడి గట్టిపడుతుంది. ఒక్కోసారి దెబ్బతిన్న ఎముక చిన్నచిన్న ముక్కలుగా మారి సైనస్‌ నుండి బయటకు వస్తాయి. ఒక్కోసారి రంధ్రం పెద్దదై లోపల పొడవునా కుళ్ళినప్పుడు ఎముక భాగం ఏకమొత్తంగా ఒక ట్యూబ్‌లాగా బయటపడుతుంది. ఈ దశలో తగినంత కొత్త ఎముక తయారవకుంటే ఎముక విరిగే ప్రమాదం వుంటుంది. ఈ రకంగా విరిగిన ఎముకను చాలా జాగ్రత్తగా, దీర్ఘకాలికంగా కట్టు స్పింట్స్‌, డ్రస్సింగ్స్‌ ద్వారా వైద్యం చేయడంతో ఎముక అతుక్కుంటుంది. సాధారణంగా ఎముక అతుక్కోవడానికి పట్టే సమయం కన్నా ఈ దశలో చాలా ఎక్కువ సమయం పడుతుంది. చాలా ఎక్కువగా మోకాలి దగ్గర గల ఫీమర్‌, టీబియా ఎముకల మెటాఫైసిస్‌లో, చేయి భాగంలో గల హ్యూమరస్‌ కింది భాగంలోనూ తరువాతి టిబియా క్రింద భాగంలోనూ ఎక్కువగా ఆస్టియో మయోలైటిస్‌ ఏర్పడుతుంది.

 • వైద్యం
నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ దశలో ఎక్కువ డోసులో పారా సిటమాల్‌ లేక మెఫినమిక్‌ ఆసిడ్‌ మాత్రలు జ్వరం కోసం వాడాలి. ఇన్ఫెక్షన్‌ కొరకు ఫ్లోరో అమైనోక్వినోలోన్స్‌ (సిప్రోఫ్లోక్సాసిస్‌, ఓఫోక్సాసిన్‌, స్పార్‌ఫ్లోక్సాసిన్‌, గాటిఫ్లోక్సాసిన్‌, జెమిఫ్లోక్సాసిన్‌) కానీ, లినెబోలిడ్‌, వాంకోమైసిన్‌, క్లిండామైసిన్‌, లింకోమైసిన్‌, కెఫిలోస్పోరిన్స్‌ (ముఖ్యంగా ఇంజెక్షన్‌ రూపంలో) ముందుదశలో వాడాలి. లోపలి నుండి చీమును 'నీడిల్‌ ఆస్పిరేషన్‌' ద్వారాతీసి, కల్చర్‌ సెన్సిటివిటీని బట్టి ఆంటీబయాటిక్‌ నిర్ధారించాలి. అదే సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాలి. పాలు, పెరుగు, పోషకాహారం ఇవ్వాలి. కాలికి చల్లటి తడిగుడ్డచుట్టి కీలు ముడుచుకుపోకుండా స్ప్లింట్స్‌ ఉపయోగించాలి.

 • శస్త్ర చికిత్స
అక్యూట్‌ ఆస్టియో మయోలైటిస్‌ దశలో వెంటనే ఆపరేషన్‌ చేస్తారు. ఎముకలోనికి డ్రిల్‌నుపయోగించి చిన్న రంధ్రాలు చేస్తారు. వీటిద్వారా చీము పూర్తిగా బయటకు వచ్చి ఎముక పూర్తిగా బాగవుతుంది. ఈ దశను గుర్తించిన 24 గంటలలోగా సర్జరీ చేస్తే పూర్తిగా ఇన్ఫెక్షన్‌ నిర్మూలించగలం. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్‌ క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌గా మారుతుంది. ఈ దశలో ఎముకలో ఏర్పడిన చీము మెటాఫైసిస్‌ నుంచి పెరియాక్టియం అంతర్భాగంలో పైకి ఎగబాకి డయాఫైసిస్‌ పొడవునా చేరుతుంది. దీని తర్వాత ఏర్పడే సిక్వెస్ట్రమ్‌ ద్వారా ఎముక శాశ్వత ఇన్ఫెక్షన్‌కు గురౌతుంది. దీనివల్ల సంపూర్ణ నివారణ దుర్లభమౌతుంది. క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ కోసం కుళ్ళిన ఎముకను ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తారు. కుళ్ళిన ఎముక పైభాగాన్ని తొలగించి ఎముక అంతర్భాగంలోని మూలుగలోని చెడు కణాను పూర్తిగా తొలగించాకా, ఎముకలోపలి చేరిన కుళ్ళిపోయిన ఎముకలను తొలగిస్తారు. తరువాత కొన్ని ద్రవాలతో ఎముక భాగాన్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. 2,3 నెలలు క్రమబద్ధంగా డ్రస్సింగ్‌ చేస్తారు. 90 శాతం కేసులలో ఈ విధంగా మంచి ఫలితాలుంటాయి. కాని 10 శాతం కేసులలో ఇన్ఫెక్షన్‌ తిరిగిరావచ్చు. అవసరాన్ని బట్టి ఆంటి బయాటిక్స్‌ దీర్ఘకాలం కూడా వాడాలి. కిడ్నీ ఫంక్షన్‌ జాగ్రత్తగా గమనిస్తూ వుండాలి. సహజరోగనిరోధక శక్తి తగ్గినప్పుడు క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌లో చేతి ఎముకలు, కాలి ఎముకల్లో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా వున్నప్పుడు కొంతభాగం ఎముకను తొలగించడం ద్వారా సంపూర్ణ రోగ నిర్మూలన సాధించవచ్చు.

/ డాక్టర్‌ జె. భాను కిరణ్‌-ఆర్థొపెడిక్‌ సర్జన్‌-డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌-సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ-బెంగళూరురోడ్డు, అనంతపురం.-ఫోన్‌ : 08854272881
 • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 27, 2011

గ్రామాల్లో ఆరోగ్యం, Health in Villages(India)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గ్రామాల్లో ఆరోగ్యం, Health in Villages(India)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • మనదేశంలో 60శాతం ప్రజలు పల్లెటూరి పరిసరాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నివసించేవారు వ్యవసాయంమీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో ఫాక్టరీల్లో కూడా పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యరీత్యా ఎలా నడుచుకోవాలనేది తెలిసుండాలి. ఎందుకంటే, వాతావరణ మార్పులు, మన ఆరోగ్యంమీద ప్రభావాన్ని చూపుతాయి కనుక.

పల్లెటూళ్లలో చెడు అలవాట్లు అంటే సారా, తాగుడు, గుట్కాలు తినడం, పాన్‌మసాలాలు తినడం ఎక్కువగానే కనిపిస్తుంది. అక్కడ చదువు తక్కువ, ధనార్జన తక్కువ. కానీ వ్యసనాలు ఎక్కువ. ధూమపానం, మత్తుపదార్థాలు విరివిగా దొరకడంవల్ల వాడకమూ ఎక్కువే. చదువు తక్కువ ఉన్నందువల్ల పరిసరాల అవగాహన తక్కువ. ఆరోగ్యంగా వుండాలంటే రోజూ ఉపయోగించే వాటిని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలి. గాలి, నీరు, ఆహారం, పురుగుమందుల వాడకంలో జాగ్రత్తలు, చేసే పనిలో, ఊళ్లో మంచి లేక అపాయాలు తెలిసుండాలి.

 • తాగే నీటిని గురించి: తాగే నీరు బావినుంచి గానీ, బోర్‌వెల్‌నుంచి గానీ లేక వేరే విధంగాగానీ లభిస్తోంది. అలా బైటినుండి వచ్చే నీటినుండి అందులో సూక్ష్మక్రిములు వుండొచ్చు.లేక వాటినుంచి వచ్చే కాలుష్యం తోడవవచ్చు. ఇక బావినీటిలో సూక్ష్మక్రిములు, పురుగుమందులు పొలాలనుంచి బావిలోకి చేరే ప్రమాదం వుంది. బైటి ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినపుడు పరిసరాలలో ఉన్న జలాలు కలుషితమయ్యే అపాయం వుంది. వ్యవసాయంతో వుండే కలుషితాలు, పురుగుమందులు, నైట్రోజన్‌, ఫాస్ఫర్‌, సూక్ష్మక్రిములు ఇవన్నీ చేపలను చంపొచ్చు.ఊళ్లో వ్యక్తిగత శుభ్రత లోపించినపుడు పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది పిల్లల్లో, పెద్దల్లో కూడా. పురుగుమందులు పొలంలో కొట్టినపుడు పిల్లలమీద ఎక్కువ ప్రభావం వుంటుంది. కళ్లు ఎర్రబడటం, దద్దుర్లు, కళ్లు తిరగడం, ఆయాసం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పురుగుమందులు చల్లేప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ మందులు పొలాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఎలుకలు, బొద్దింకలు చీమలు చంపడానికి ఉపయోగించే మందులు పిల్లలనుంచి దూరంగా ఉంచాలి. పొలంనుంచి తిరిగి వచ్చాక తమ బట్టలమీద, చెప్పులమీద పురుగుమందులు పొడి వుండే అవకాశం ఎక్కువ. అంటే ఆ మందులను అనుకోకుండానే ఇంటికి తీసుకొస్తున్నారు. అది అందరికీ నష్టమే. పురుగుమందులనుంచి ఎలా రక్షించుకోవాలో మన చేతిలో వుంది.

అవేంటంటే...
 • పొలంనుండి రాగానే చెప్పులు బాగా కడుక్కోవాలి.
 • వెంటనే స్నానంచేసి దుస్తులు మార్చుకోవాలి.
 • పొలంలో ధరించిన దుస్తులు విడిగా ఉతకాలి తప్ప అన్నింటిలోనూ కలపకూడదు.
 • ఆహారం తీసుకునేముందు శుభ్రంగా కాళ్లుచేతులు కడుక్కోవాలి. అలా కాకుండా ఆహారాన్ని ముందే ముట్టుకోకూడదు.
 • స్నానం చేయకుండానే పిల్లలను దగ్గరికి తీసుకోవడం, ఎత్తుకుని ముద్దుచేయడం కూడదు.

గ్రామాలలో వైద్యము - చికిత్స :
 • ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన వాటిలో అతి ప్రధానమైంది ఆరోగ్య భద్రత. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో బడ్జెట్ కేటాయింపులతోనే స్పష్టమౌతోంది. విదిల్చిన ఆ కొద్ది పాటిలో కనీసం 55 శాతం గ్రామీణ ప్రజల వైద్యసేవల కోసం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కోసం కేటాయించాలి. ఆ మొత్తం సక్రమంగా ఖర్చయితే... కనీసం ఆ మేరకైనా మేలు కలుగుతుంది. అదీ నిరాశగానే మిగులుతోంది. 30 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా వాటినెవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు.

తరచూ ప్రజల్ని పట్టిపీడించే వ్యాధుల్లో చాలా వాటికి మూల కారణాలు చాలా చిన్నవి. కొద్దిపాటి ముందు జాగ్రత్త వాటన్నింటినీ నివారించగలదు. పరిసరాల అపరిశుభ్రత, మురుగునీరు నిల్వ, చెత్తా చెదారం, తాగే నీటిని క్లోరినేషన్ , కాచి చల్లార్చిన నీటిని తీసుకోకపోవడం వంటి వాటిపై ప్రజల్ని చైతన్యపరిచే నాథుడు లేడు. వచ్చాక... ఏ పీహెచ్‌సీ, ఉప కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుందామంటే అక్కడ సిబ్బంది, వైద్యులు సక్రమంగా విధులకు రారు. వచ్చినా... రోగులను పరీక్షించి ఇచ్చేది రెండు గోళీలే! అందుకే తల తాకట్టు పెట్టైనా ప్రైవేట్ వైద్యుల దగ్గరకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి. ప్రజారోగ్యం కోసం బడ్జెట్‌లో ఏటా వేల కోట్ల రూపాయల కేటాయింపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య విధాన ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు... ఇవన్నీ ప్రభుత్వ ప్రకటనల్లో అద్భుతంగా కనిపిస్తాయి. వాస్తవానికి అందులో పదోవంతు కూడా ప్రజలకు అందవు.

 • నిబంధనల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో పని చేసే సిబ్బంది, ఇతర సిబ్బంది స్థానికంగా ఉండాలి. ఉదయం 9 - 12 గంటల వరకు, సాయంత్రం 4 -6 వరకు ఆరోగ్య కేంద్రాలు తెరచి ఉంచాలి. ఆరోగ్య సేవలు అందించాలి. నిరంతర ఆరోగ్య సేవా కేంద్రాల ద్వారా 24 గంటలూ వైద్య సేవలు అందాలి. ప్రతి గ్రామ పంచాయతీలోని అయిదు వేల జనాభాకు ఇద్దరు చొప్పున ఆరోగ్య కార్యకర్తలు (ఎఎన్ఎం) ఉంటారు. వీరు స్థానిక నివాసం ఉండాలి. ప్రతీ బుధవారం, శనివారం వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఏడు ప్రాణాంతక వ్యాధుల (క్షయ, ధనుర్వాతం, కోరింత దగ్గు, కంఠవాపు, పోలియో, తట్టు, పెపటైటిస్ 'బి')కు టీకాలు ఇవ్వాలి. గర్భిణులను గుర్తించి నెలల వారీగా ఆరోగ్య సేవలు అందించాలి. అవసరమైతే అంబులెన్స్‌లో సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసేవలు అందేలా చూడాలి. వారికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా సహకరించాలి. ఇవేవీ సక్రమంగా జరగవు... ఎందుకంటే వైద్యులు, అధికారులు, సిబ్బంది... ఒక్కరు కూడా స్థానికంగా ఉండరు. వీలున్నప్పుడు వస్తూ పోతుంటారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారన్న భయమూ లేదు. ఎందుకంటే ఆ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతాయని వాళ్లకు తెలుసు.

కుటుంబ నియంత్రణ
 • ఒకరు లేదా ఇద్దరు పిల్లల తరువాత ఈ ఆపరేషన్ చేయించుకున్న వారికి పారితోషికం ఇస్తారు. దీంతో పాటు జననీ సురక్ష యోజన డబ్బులు కూడా లబ్ధిదారులకు చాలా చోట్ల ఇవ్వకుండా మింగేస్తున్నారు.

దారిద్య్రరేఖకు ------దిగువ --------ఎగువ
పురుషులకు- రూ.1450 --------రూ.1100
స్త్రీలకు ------రూ.880 ---------రూ.250

 • సొమ్ములన్నీ హుష్ కాకి!
గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పథకం కింద ప్రతీ గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ.10,000 చొప్పున విడుదల చేస్తారు. వీటిని గ్రామ సర్పంచి ఎ.ఎన్.ఎం. ఉమ్మడి ఖాతాలో వేసి కాల్వలు శుభ్ర పరచడానికి, బ్లీచింగ్ పౌడర్ కొని, బావులను, మంచినీటి వనరులను క్లోరినేషన్ చేయడానికి వాడవచ్చు. కాని గ్రామ సర్పంచి ఎ.ఎన్.ఎంలు కలిసి పనులు చేయకుండా చేసినట్లు రికార్డులు సృష్టించి అందినంత దోచుకు తింటున్నారు.

 • మొక్కుబడి శిబిరాలు
వర్షాకాలంలో సాధారణంగా వచ్చేవి మలేరియా, డెంగీ, గన్యా, విష జ్వరాలు. కొద్ది పాటి ముందు జాగ్రత్త, సాధారణ చికిత్సలతో నయమవ్వాల్సిన వీటి వల్ల కూడా ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా అంటు వ్యాధులు ప్రబలే గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. మల, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తించి, చికిత్స అందించాలి. ఆ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తెలియజెప్పాలి. కానీ ఈ ఆరోగ్య శిబిరాలు తూతూ మంత్రంగా జరపడం, వైద్యులు రాకపోవడం, మందులు పంపిణీ చేయకపోవడం... రికార్డుల్లో బ్రహ్మాండంగా చేసినట్టు రాసుకోవడం సాధారణం.

 • సుద్ద గోలీలే దిక్కు
ధర్మాసుపత్రులకు మందులు సరఫరాలో లెక్కలేనన్ని అక్రమాలు! ప్రభుత్వ ఆసుపత్రులకు డ్రగ్ కార్పొరేషన్ నుంచి విడతల వారీగా మందులు సరఫరా చేస్తారు. కానీ కొందరు అధికారుల చేతి వాటం వల్ల వాటిలో చాలా భాగం నల్లబజారుకు తరలుతున్నాయి. అందువల్లనే ప్రజలకు ఏ జబ్బు వచ్చినా రెండు సుద్ద గోలీలే దిక్కవుతున్నాయి.

 • కమిటీలే సరిగా ఉంటే...
వైద్యశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతీ పి.హెచ్.సికి ఏటా రూ.1.75 నుంచి రూ. 2 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తుంది. పి.హెచ్.సి స్థాయిలో ఉండే సలహా సంఘం ఈ నిధులను ఖర్చు చేయాలి. కాని ఈ సంఘం సభ్యులు, వైద్యాధికారులు కుమ్మకై వాటిని స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల సభ్యులు, అధికారుల విభేదాలు కూడా చేటుగా మారాయి.

 • ఏం అడగొచ్చు?
* పీహెచ్‌సీ, ఉపకేంద్రాల్లో అందించే వైద్య సేవల వివరాలు, పని చేసే వేళలు
* రోగుల వైద్య సేవలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్లు
* సరఫరా అయిన వాక్సిన్‌లు, ఔషధాల నిల్వ, పంపిణీ చేసిన వాటి వివరాలు
* జననీ సురక్ష పథకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న లబ్ధ్దిదారుల జాబితా, వారికి చెల్లించిన ప్రోత్సాహకాల వివరాలు
* పీహెచ్‌సీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ఖర్చు నివేదికలు
* ఆసుపత్రి అభివృద్ధికి విడుదలైన నిధులు, ఖర్చు నివేదికలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు విడుదలైన నిధుల వివరాలు, ఖర్చు వివరాలు, బిల్లుల వివరాలు
* పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పేరు, హోదా, జీతభత్యాలు, వారి నివాసం వివరాలు
* డెంగీ, ఎయిడ్స్, క్షయ అనుమానితుల సంఖ్య, మరణాల సంఖ్య, నివారణా చర్యలు, ఖర్చు నివేదికలు... ఈ సమాచారాన్ని సహ ద్వారా పొందవచ్చు.

 • ఎవరిని ఆడగాలి
పీ.హెచ్.సి. డీఎంహెచ్‌వో
పీఐవో: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పరిపాలనా అధికారి
ఏపీఐవో: సీనియర్ అసిస్టెంట్ పర్యవేక్షకులు అప్పీలేట్
అధికారి: మెడికల్ ఆఫీసర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

 • ఇవన్నీ జరిగితే...!
అయిదువేల జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉండాలి. వీటిలో ఒక ఆరోగ్య కార్యకర్త / సహాయ మంత్రసాని (యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ ఎఎన్ఎం) పురుష ఆరోగ్య కార్యకర్త ఉంటారు. అంటే అయిదువేల జనాభాకు ఇద్దరు కార్యకర్తలు మాత్రమే వైద్యసేవలు అందిస్తుంటారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో 4 - 6 పడకలు ఉంటాయి. ఒక వైద్యాధికారి, 14 మంది పారా మెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు. ఇది ఆరు ఉపకేంద్రాలకు రిఫరల్ ఆసుపత్రిగా పని చేస్తుంది.
ఆశ: గ్రామ జనాభాను బట్టి ఒకరు లేదా ఇద్దరిని ఆశ కార్యకర్తలుగా ఎంపిక చేస్తారు. వీరు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, సంతాన నిరోధం, టీకాల అవశ్యకత తెలుపుతూ అతిసార రోగులకు వైద్య సహాయం, చిన్న గాయాలకు, జ్వరంతో బాధపడేవారిని వైద్య కేంద్రాలకు తీసుకెళ్లడం వంటి సేవలు చేయాలి.
సంచార వైద్యం: గిరిజన, మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్ సంచార వైద్యశాల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం మన రాష్ట్రానికి 92 సంచార వైద్య కేంద్రాల్ని మంజూరు చేశారు. 2007 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వాహనానికి ఏటా రూ.10 లక్షలు ఖర్చవుతున్నాయి. పర్యవేక్షణ కొరవడటంతో ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు.

 • జననీ సురక్ష యోజన
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు ఈ పథకం ద్వారా రూ. 700, 'సుఖీభవ' కింద రూ.300 మొత్తం రూ.1000 పారితోషికం ఇస్తారు (ఇద్దరు పిల్లలకు మాత్రమే). ఇవీ పక్కదారి పడుతున్నాయి.

370 కోట్లు!
పన్నెండో ఆర్థిక సంఘం తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు రూ.370 కోట్లు అందజేస్తోంది. వీటిలో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు మళ్లిస్తోంది. ఇక మిగిలిందే పంచాయతీలకు!

 • బడ్జెట్‌లో ఆరోగ్యం
రాష్ట్రం - రూ.3,821 కోట్లు
(ఇందులో ఆరోగ్యశ్రీకి - రూ.925 కోట్లు)
కేంద్రం: రూ21,113 కోట్లు

 • టోల్‌ఫ్రీ నంబర్లు
ఆరోగ్యశ్రీ: 1800-425- 7788,
భూమిక: 1800- 425- 2908,
హెచ్.ఐ.వి., ఎయిడ్స్ బాధితులకు: 1097,
అత్యవసర ఆరోగ్య రవాణా సర్వీసు (108),
ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసు (104),
 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

ప్రసూతి మరణాలు, Maternity Deaths


 • image : courtesy with ->http://topnews.ae/

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ప్రసూతి మరణాలు, Maternity Deaths- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 63 సం.రాలు దాటినా, రాజ్యాంగంలో జాతి, మతం, రాజకీయ, సాంఘీక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా వుండటం ప్రతిమానవుని హక్కుగా ఉటంకించినా నేటికీ అందరికీ ఆరోగ్యం అందనిద్రాక్షే? . ప్రపంచవ్యాప్తంగా లక్ష జననాలకు గాను 400 ప్రసూతి మరణాలు నమోదు అవుతుండగా భారత్‌లో అది 300 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక లక్ష డెలివరీలకు ప్రసూతి మరణాల రేటు 195 గా ఉంది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం సచివాలయంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమంపై సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, స్త్రీ,శిశుసంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఛాయారతన్‌, కమిషనర్‌ అనితా రాజేందర్‌ హాజరయ్యారు. చిన్నపిల్లలు, ప్రసూతి మరణాలను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల చర్యలనూ ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసే విధంగా గర్భిణీలకు అవగాహన కల్పించాలని, పౌష్టికాహారం తీసుకునే విధంగా సూచించాలని తెలిపారు. మన రాష్ట్రంలో ఏ కారణం చేత కూడా చిన్నపిల్లలు, ప్రసూతి మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్స్‌ సంస్థ ఉప్మా, కిచిడీ, హల్వామిక్స్‌ ఆహారపదార్థాలను తయారు చేసిందని, దీన్ని ఐఎస్‌ఓ సంస్థ కూడా ధ్రువీకరించిందన్నారు. దీన్ని ఇప్పటికే 213 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఈ ఆహారం మంచి పౌష్టికాహారంగా ఉంటుందన్నారు.

భారత్‌లో ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చేస్తున్న తలసరి వ్యయం ఎంతో తెలుసా? కేవలం 32 డాలర్లు (సుమారు రూ. 1,400) మాత్రమే. అదే సమయంలో ధనిక దేశాలు తమ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న తలసరి ఖర్చు దీనికి 140 రెట్లు (4590 అమెరికన్ డాలర్లు- అంటే సుమారు రూ. 2,06,000) ఎక్కువ. భారతీయుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ గణాంకాలు చాటుతున్నాయి. అంతేకాదు.. భారత్‌లో వ్యాధుల కారణంగా పేదలే కాదు.. ధనిక వర్గాలు సైతం రెండింతలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ పచ్చి నిజాలను
వెల్లడించింది.

 • * ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు గర్భధారణ, కాన్పు సమయంలో, ప్రసవానంతరం చనిపోతున్నారు.
 • * మన దేశంలో ఏటా దాదాపు 75 వేల ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి.
 • * 99 శాతం ప్రసూతి మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కలుగుతున్నాయి.
 • * ప్రసూతి మరణాలు మహిళలపై జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.
 • * ప్రసూతి మరణాలు భారత దే్శములో బాగా నిరోధించగల సమస్య.
 • * ప్రసూతి మరణాల విషయంలో సహస్రాబ్ది లక్ష్యాలు సాధించడంలో మనం చాలా దూరంగా ఉన్నాం.

ప్రసూతి మరణాలు తగ్గించడానికి మనం ఏం చేయాలంటే....
 • 18 సంవత్సరాల తర్వాతే స్త్రీలకు వివాహం చేయాలి.
 • 20 నుండి 30 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన సమయం. ఈ అంశాన్ని పాటించాలి.
 • కాన్పు-కాన్పు మధ్య ఎడం పాటించండి.
 • ఆడపిల్లలను బాగా చదివించండి.
 • గర్భధారణ సమయంలో ఆరోగ్య
 • కార్యకర్తతో పరీక్షలు చేయించుకోండి.
 • కాన్పు శిక్షణ పొందిన ఆరోగ్యకర్తతో చేయించుకోండి.
 • ఆరోగ్య కార్యకర్త నుండి ప్రసవానంతర సేవలు పొందండి.
 • బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు పట్టడం మొదలుపెట్టండి.

గర్భిణులకు ఉచిత ఆరోగ్య పర్యవేక్షణ కార్డులు

 • గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి వీలుగా, వారికి ఉచితంగా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2010 సెప్టెంబర్ నుంచి ఈ కార్డులను అందజేసారు. గర్భిణులు, శిశువులు నిర్ణీత పద్ధతిలో మందులు తీసుకునే విధంగా, వారికి సంబంధించిన అన్ని ముఖ్యమైన ఆరోగ్య సూచికలను ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆస్పత్రులలో నమోదుచేస్తారు. ఈ కార్డుల ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని తొమ్మిదినెలలపాటు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఐదేళ్ళపాటు పర్యవేక్షిస్తారు. ప్రసూతి మరణాల శాతం (ఎం ఎం ఆర్) లోను, శిశు మరణాల శాతం (ఐ ఎం ఆర్) తగ్గించడం లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి వున్నదని, ఈ కార్డుల జారీ ద్వారా ఈ వెనుకబాటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ పి. వి. రమేష్ తెలియజేశారు.

మనం ఇంతవరకూ ప్రసూతి మరణాలకు కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, స్త్రీలకు పోషకాహారలోపం వంటివే పరిగణనలోనికి తీసుకుంటున్నాం... కానీ 'రాజకీయ కులవివక్ష' వారి మరణాలకు మరో కారణమని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. భారతదేశములో రాజకీయ నాయకులు ప్రతినిత్యము ఎక్కడో ఒకచోట ఎన్నికల వ్యవహారములో బిజీ ఉండడము వలన అభివృద్ధి కుంటుబడుతుంది.
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌ , Malabsorption Syndrome


 • image : courtesy with http://www.beltina.org/

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌ , Malabsorption Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


బరువు క్రమేణా తగ్గడం, జిడ్డుతో కూడిన రంగు మారిన విరేచనాలు, ఆహారం తీసుకున్న కొద్దిసేపటికి విరేచనాలవడం వంటి లక్షణాలున్నప్పుడు దాన్ని మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌గా పరిగణించాలి. ఎన్నో వ్యాధుల కలయిక వల్ల ఇది వస్తుంది. ఆహారం జీర్ణమవుతున్నప్పుడు రక్తంలోనికి పేగుల ద్వారా ఆహారం శరీరంలోని కణజాలాలకు అందదు. సరిగ్గా లేని ఈ జీర్ణక్రియ వల్ల మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. కొవ్వు పదార్థాల జీర్ణక్రియ సరిగ్గా వుండదు. కొవ్వులో కరిగే విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటిమిన్‌-కె, కాల్షియం సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది.

 • వర్గీకరణ (classification) :
1. సెలక్టివ్ (selective) : ఇది లాక్టోజ్ మాల్ ఎబ్జార్పషన్ లో కనిపిస్తుంది .
2. పార్షియల్ (Partial) : దీనిని beta-lipoproteinaemia లో కనిపెట్టేరు .
3. టోటల్ (Total) : Coeliac disease లో చూడబడుతుంది .

 • మాల్ అబ్సార్పషన్‌ జీవ పక్రియ విధానము : (pathophysiology) :
ఆహారవాహిక ముఖ్యమైన పని జీర్ణ పక్రియ జరిపి పోషకాలు అయిన carbohydrates , proteins , fats and vitamins & minerala , water , electrolytes గ్రహించి (absorb) రక్తము లోనికి చేర్చడము . జీర్ణము ... మెకానికల్ అంటే నమలడము , అన్ని బాగా కలిసేటట్లు చేసి కైమ్‌ గా మార్చడము , రెండోది ఎంజైములతో కలిపి జీర్ణము చేయడము . మాల్ అబ్సార్పషన్‌ లో ఈ విధానము అస్తవ్యస్తము అయి తిన్నది సరిగా వంటపట్టదు . ఈ క్రింది కండిషన్లు మాలాబ్సాబ్ప్షన్‌ కి దోహదము చేస్తాయి .
 • మూకస్ పొర గాయాలు (mucosal damage ),
 • పుట్తుకతో వచ్చిన మార్పులు (congenital defects),
 • హైడ్రాలిసిస్ లో ప్రత్ర్యేక లోపాలు (defects of specific hydrolysis),
 • పాంక్రియాస్ గ్రంది లోపభూయిష్తము (pancreatic insufficiency),
 • గతితప్పిన ప్రేగుల-కాలేయ రక్తపరసరణ (impaired enterohepatic circulation),

 • కారణాలు :
 • బైల్‌ ఆమ్లాలు తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల కొవ్వు పదార్థాల జీర్ణ వ్యవస్థ లోపభూయిష్ట మవుతుంది.
 • జీర్ణకోశ ఆపరేషన్‌ జరిగినప్పుడు కొవ్వు పదార్థాలు పేగులలో పీల్చబడవు.
 • కొన్ని పేగుల వ్యాధులు అంటే, 'కాలన్స్‌ డిసీజ్‌', 'సీలియాక్‌ వ్యాధి' 'స్ప్రూ' 'లాక్టేజ్‌' లోపం, జెజునంలో లోపం.
 • కడుపులో ఏలికపాములు, జియార్థియాసిస్‌.
 • పేగులను కత్తిరించే శస్త్రచికిత్స వల్ల జీర్ణమైన ఆహారం రక్తంలోనికి చేరకపోవడానికి ముఖ్య కారణాలు.
 • whipple's disease ,
 • Intestinal T.B,
 • HIV related malabsorption ,

 • లక్షణాలు:
బరువు తగ్గిపోవడం. పిల్లలలో ఎత్తు పెరుగుదల ఆగిపోవడం. 'స్టిమోటోరియా' (జిడ్డుగా ఉండి, తెల్లగా దుర్వాసన కలిగిన విరేచనాలు). కడుపులో నొప్పిగా వుండటం. పోషక ఆహారపు లోపం వల్లే కలుగు లక్షణాలు (రక్తహీనత). విటమిన్‌- కె లోపం వల్ల కలిగే రక్తస్రావం. కాల్షియం లోపం వల్ల టెటాని అనే వ్యాధి లక్షణాలు కనిపించడం. 'ఆస్టియో మలేషియా' చిన్న పిల్లలో కలిగే 'రికెట్స్‌' అనే వ్యాధి. నోటి పూత. ప్రోటిన్‌ లోపంవల్ల కలిగే శరీరపు వాపు.

 • నిర్ధారణ :
బేరియమ్‌ మీల్‌తో ఎక్సరే. మలపరీక్ష. రక్తపరీక్ష. ఆహారం పేగుల్లో పీల్చబడే పరీక్ష. చిన్న పేగుల బయాప్సీ. క్లోమ గ్రంథిపరీక్షలు. కొలనోస్కోపి. పేగులోని ద్రావకాన్ని కల్చర్‌ పరీక్ష చేయడం. మల పరీక్షలో, ఏలికపాములు కనుక్కోవడం.

 • చికిత్స:
కాల్షియం, మెగ్నీషియమ్‌ విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటమిన్‌- కె, రక్తహీనతకు ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి2, బికాంప్లెక్స్‌ ఇవ్వాలి. ప్రోటీన్లు ఎక్కువ వుండే ఆహారం ఇస్తూ వుండాలి. గ్లూటెన్‌ కలిగిన పదార్థాలు (బార్లీ, ఓట్‌, గోధుమ) ఇవ్వకూడదు. పాల ఉత్పత్తులు మానాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. మెట్రోనిడోయోజల్‌ 400 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు ఒక వారం వాడాలి. టెట్రాసైక్లిన్‌ 250 మిల్లీగ్రాములు రోజూ 4 పూటలు మూడు వారాలు వాడాలి. విరేచనాలు తగ్గించడానికి లోపరమైడ్‌ మాత్రలు వాడాలి. పాంక్రియాటిక్‌ ఎంజైమ్‌ బిళ్ళలు వాడాలి. అవసరాన్ని బట్టి ప్రెడ్సిసలోన్‌ మాత్రలు వాడాలి.
 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, November 26, 2011

నడుము - మెడనొప్పి లకు ఆపరేషన్‌ విశ్వనీయత ఎంత?, Usefulness of operation for neck and back pains


 • image : courtesy with Prajashakti News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నడుము - మెడనొప్పి లకు ఆపరేషన్‌ విశ్వనీయత ఎంత?, Usefulness of operation for neck and back pains- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • నడుంలోని ఎముకల మధ్య డిస్క్‌లుంటాయి. వీటి మధ్య మెత్తగా ఉన్న జిగురు పదార్థం స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. సాధారణంగా వయసుతో ఏర్పడే డీ-జనరేటివ్‌ మార్పులననుసరించి బాహ్యమార్పులు.. చూపుతగ్గడం, బట్టతల, చర్మం మడతలుపడతాయి. వీటితోపాటు అంతర్గతంగా ఎముకలు బలహీనపడడం, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. అలాగే డిస్క్‌ల మధ్యలోగల 'న్యుక్లియస్‌ పల్పోసస్‌' గట్టిపడి డిస్క్‌ అరిగిపోతుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో నడుంలోని ఎల్‌4, ఎల్‌5 డిస్క్‌లు, మెడలోని సి6, సి7 డిస్క్‌లు ఈ మార్పులకు ఎక్కువగాలోనవుతాయి. వీరిలో కొద్ది మందికి డిస్క్‌ వెనకకుగానీ, ఎడమపక్క భాగానికి గానీ జరుగుతుంది. తద్వారా వెన్నుపామును కాని, వెన్నుపాము నుంచి శాఖలుగా విస్తరించిన నాడులపై ఒత్తిడిపెరుగతుంది. ఫలితంగా సయాటికా లేక బ్రేకియల్‌ న్యూరాల్జియా, మోటార్‌ నాడుల బలహీనత ఏర్పడుతుంది. 50 నుండి 60 ఏళ్లుపైబడిన వారిలో ప్రతి పది మందిలో కనీసం ఆరుగురి ఎక్స్‌రేలు, సిటి, ఎంఆర్‌ఐ స్కాన్‌లలో నడుం మధ్యగల డిస్క్‌ అణిగిపోవడం, కొంత వరకు వెనుకగల వెన్నపాముగానీ, నరాలపైన గల పొరలను ఒత్తిడికిగురిచేస్తాయి. ఈ కేసుల్లో కేవలం నొప్పి కొద్దిగా మొద్దుబారుతుంది. మోటార్‌ నాడలుపై ఒత్తిడిగానీ తద్వారా బలహీనతకానీ ఏ మాత్రం ఉండదు.

 • ఏం చేయాలి?

ఈ సమస్యను ఏ వ్యక్తైనా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. చేతివేళ్లు, కాలివేళ్లు, పాదాలు, ముందు చేయి పైభాగాన్ని బ్రష్‌ ద్వారా ముట్టినప్పుడు, చిన్న సూది ద్వారా గుచ్చినప్పుడు తెలిపే స్పర్శ, నొప్పి సరిగా ఉంటే, వేళ్లలోని మణికట్టు, పాదంలోని బలం బాగా ఉంటే ఆపరేషన్‌ ఏమాత్రం అవసరం ఉండదు. కేవలం మొదటిదశలో విశ్రాంతి, బెల్ట్‌ లేక కాలర్‌సపోర్ట్‌ అవసరం. రెండవ దశలో ట్రాక్షన్‌ వైద్యం, నడుం, మెడ వెనకగల కండరాలను గట్టిపరిచే వ్యాయామాలు (భుజంగాసనం, ఊర్థ్వాసనం) చేయాలి. సాధారణంగా యోగాలో ముందుకు వంగి చేసే వ్యాయామాల్ని పూర్తిగా మానాలి. అలాగే చేతులతో మరీ ముఖ్యంగా భుజం కీలు బిగుసుకుపోకుండా సపోర్టెడ్‌, ఇండిపెండెంట్‌ షోల్డర్‌ వ్యాయామాలు చేయాలి. చేతనైనంత వరకు మునికాళ్లమీద (కాలివేలకొనలపై) నిలబడి ఏదైనా కిటికి కడ్డీలు చేతితోపట్టుకుని సగం వరకు నిటారుగా ఉంటూ బస్కీలు (సగంవరకు మాత్రమే) చేయాలి. దీంతో కాలివేళ్లు, పాదం, పిక్క, తొడకండరాల బలం పెరుగుతుంది.

 • దుష్ఫ్రభావాలున్నాయా?

'లామినక్టమీ' శస్త్రచికిత్సలో నడుం లేక మెడ ఎముక భద్రతకు సంబంధించిన వెనక పక్కనగల ఎముకల అతకులను (లామినా), లిగమెంట్లను (లిగమెంటం ఫ్లేవం) పూర్తిగా తొలగిస్తారు. 'డిస్కెక్టమీ'లో వెన్నుపూసల మధ్యగల అనిగిన, ఎండిన, పక్కకు జరిగిన డిస్క్‌లను తొలగిస్తారు. దీనివల్ల శాశ్వత ప్రాతిపదికన నడుం బలహీనపడుతుంది. అంతేకాక భవిష్యత్తులో మిగిలిన డిస్క్‌లమీద లోడ్‌పెరిగి అవికూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. అంటే ఆపరేషన్‌ వల్ల సమీప భవిష్యత్తులోనే మిగిలిన డిస్క్‌లు దెబ్బతినడం, స్లిప్‌ అవడం జరుగుతాయి. నా వ్యక్తిగత వైద్య అనుభవంలో లామినెక్టమీ, డిస్కెక్టమీ చేయించుకున్న వారిలో చాలా మంది భవిష్యత్తులో శాశ్వతంగా బరువైన పనులు చేయలేరు. దాంపత్య జీవితంలో కూడా పెనుసమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో కనీసం ఆరుగురికి సమీప భవిష్యత్తులో 'సెకండరీ డిస్క్‌ప్రొలాప్స్‌' సంభవిస్తోంది. (ఆపరేషన్‌లో తొలగించిన డిస్క్‌లపైన, కింద ఉన్న డిస్క్‌లు దెబ్బతినడం). ఈ పరిణామాలను దృష్టిలోపెట్టుకుని ముఖ్యంగా, వ్యవసాయ, కార్మికవర్గానికి చెందినవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆపరేషన్లు ముఖ్యంగా నడుం, మెడలకు సంబంధించినవి చేయించుకోరాదు. ఉద్యోగరీత్యా, ఆరోగ్యశ్రీలోని 'రీ-ఎంబర్స్‌మెంట్‌'కు ఆశపడి ఇటువంటి శస్త్రచికిత్సలు చేయించుకోరాదు. వైద్య వ్యాపారంలో విపరీతమైన పోకడల వికృత పరాకాష్ట నడుం, మెడ నొప్పులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ లేనిరోజుల్లో ఈ సర్జరీ చిన్న ఆసుపత్రుల్లో కేవలం 10 నుండి 15 వేల రూపాయలలో నిర్వహించేవారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఈ సర్జరీకి రూ.45 వేల వరకు చెల్లిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం కేవలం నడుం, మెడ భాగాలకు చేసే డిస్కెక్టమీ, లామినెక్టమీ ఆపరేషన్లలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్‌ వైద్య సంస్థలకు 100 కోట్లకుపైగా చెల్లించిందని ఒక అంచనా. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించడం ఆరోగ్యశ్రీలోని ఉదాత్తతను అర్థం చేసుకుని వైద్య సమాజం ప్రవర్తించాల్సిన న్యాయహేతుబద్ధ సమాజంలోని మేధావివర్గ కనీస నైతిక బాధ్యత.

 • విటమిన్‌-సి లోపం

విటమిన్‌-సి లోపం వల్ల వచ్చే వ్యాధులను స్కర్వి అంటారు. ఎముకల కీళ్లలో విటమిన్‌-సి లోపం వల్ల వచ్చే జబ్బును సర్విటిస్‌/సర్విటిక్‌ ఆర్థ్రైయిటీస్‌ అంటారు. ఈ జబ్బు పిల్లల్లో ప్రధానంగా, పుట్టిన తర్వాత వారికి పాలివ్వడంలో ఉండే లోపాల వల్ల మొదలవుతుంది. ఫలితంగా పెరిగే వయసులో తీవ్ర ఎముకల కీళ్లలో మార్పులేర్పడి పెద్ద వయసులో చాలా నిస్తేజపూరిత కీళ్ల జబ్బులు ఏర్పడతాయి.

విటమిన్‌-సి (ఆస్కార్బిక్‌ ఆసిడ్‌) అనే పదార్థం తల్లిపాలలో విస్తారంగా ఉంటుంది. సమాజ పోకడలతో ఏర్పడుతున్న అవాంఛితమార్పు చాలా మంది తల్లులు పాలివ్వక నవజాతశిశువులకు పోతాపాలు, డబ్బాపాలకు అవాటు చేస్తున్నారు. సాధారణంగా తల్లిపాలు శుద్ధత, సాధారణ శారీరక ఉష్ణోగ్రత కలిగి ఉండి బిడ్డకు అవసరమైన పోషకాలు, విటమిన్‌-సి సమృద్ధిగా అందిస్తాయి. కానీ, కాచిన పోతపాలు, డబ్బాపాలు వాడడం వల్ల ఆ వేడికి విటమిన్‌-సి దెబ్బతిని బిడ్డ పెరుగుదలలో లోపం ఏర్పడి ముఖ్యంగా మోకాళ్లలో ఒక కాలు వారస్‌ బెండుకు, ఇంకోకాలు వాల్గస్‌ బెండుకు గురవుతుంది. దీన్ని 'టాకిల్డ్‌ డిఫార్మిటీ' అంటారు.

విటమిన్‌-సి లోపంతో రికెట్స్‌లో రెండు కాళ్లలోనూ వాల్గస్‌ లేక వారస్‌ వస్తుంది. దీన్లో ఒక్కోకాలు ఒక రకమైన తేడాఉండడం వల్ల ఎక్కువ కష్టంగా ఉంటుంది.
నివారణ : పోతపాలపై పెరిగే పిల్లలందరికీ క్రమబద్దంగా విటమిన్‌-సి అధికంగా కలిగిన విటమిన్‌ డ్రాప్స్‌ వాడాలి.
వైద్యం : రికెట్స్‌లోలాగా దీన్లో కూడా సర్జరీల ద్వారా బెండ్లు సరిచేసిన తర్వాత పిండికట్ల ద్వారా స్ప్లింట్స్‌ ద్వాఆర దీర్ఘకాల విశ్రాంతినివ్వాలి.


--డాక్టర్‌ జె. భాను కిరణ్‌--ఆర్థొపెడిక్‌ సర్జన్‌-డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌-సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ-బెంగళూరురోడ్డు, అనంతపురం.-ఫోన్‌ : 08854272881
 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

గాయం , Injury ,దెబ్బలుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గాయం , Injury ,దెబ్బలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం. రకాలు : 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు ,
 • మానసిక గాయాలు :
మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానును. మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము వరకు మాయదు. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియభాషణము చేతకనివారు మౌనము వహించుట ముఖ్యము.

 • శారీరక గాయము :
శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో , వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.

 • గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .

చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, పౌడర్‌ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
 • శారీరక గాయాలు రకాలు :

* బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
* గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
* బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
* బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్స లో చూడండి.

 • చికిత్స :
కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స

తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు.

* కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి.
* ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి.
* నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి.
ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి., మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.


 • తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమ చికిత్స

* తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి.
* గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి.
* పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు.
* గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి.
* ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది.
* గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి.
* వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి.

 • నొప్పినివారణ మందులు : అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4-5 రోజులు.
 • యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు .
 • పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి .


 • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

స్త్రీల క్యాన్సర్ వ్యాధులు , Gynaecological Cancer, women Cancerఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అండాశయ క్యాన్సర్ , Gynaecological Cancer, Overian Cancer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • మనదేశంలో మగవారిలోకన్నా ఆడవాళ్లలోనే క్యాన్సర్స్ ఎక్కువుగా వస్తున్నాయి అని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఆడవాళ్లలో క్యాన్సర్‌ని ప్రారంభదశలో కనుక్కోగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. అందుకు అవగాహన అవసరం. పాశ్చాత్య దేశాలలో సెర్వైకల్, యుటెరిన్ క్యాన్సర్ తగ్గుముఖం పట్టాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య పెరుగుతోంది. కానీ మన దేశంలో రెండురకాల క్యాన్సర్స్ పెరుగుతూనే వున్నాయి. స్నానంచేస్తూ ఒళ్ళు రుద్దుకునేప్పుడు స్ర్తిలు బ్రెస్ట్‌ని తడిమి చూసుకోవాలి, గడ్డల్లా తగిలితే వెంటనే వైద్యుణ్ణి కలుసుకోవడం మంచిది. ఆ గడ్డలు పెరుగుతున్నాయన్నప్పుడు ఇంకసలు ఆలస్యం చేయకూడదు.

ఇక గైనకాలజికల్ క్యాన్సర్స్ విషయానికికొస్తే గర్భాశయము, అండాశయము, ఎండోమెట్రియమ్, యోని రంధ్రమునుంచి లోపలకు వ్యాపించే దారి (cervix), యోని ప్రాంతాలలో క్యాన్సర్ రావచ్చు. ఇవి ఎక్కువగా వస్తుండడంతో మన కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము మార్చి 11వ తేదీన ‘గైనకాలజికల్ క్యాన్సర్ అవగాహన దినోత్సవం’గా పాటిస్తోంది.

 • గర్భాశయ క్యాన్సర్ వస్తే తెల్లటి ద్రావకం యోని నుంచి వస్తుంటుంది. అలా వస్తుంటే వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. అండాశయ క్యాన్సర్ ప్రారంభదశలో స్రావంకాకపోవచ్చు. పొత్తికడుపు వాపు కలుగుతుంది. అప్పుడు యోని స్రవాలు కనిపించవచ్చు. ఎండో మెట్రియమ్ క్యాన్సర్ ఉన్న వాళ్లలో బహిష్ట సమయంలో రక్తస్రావం చాలా అధికంగా అవుతుంది. ఈ క్యాన్సర్‌కి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి అతి చిన్న వయస్సులో పురుష సంగమం. ఎక్కువమందితో సంభోగం. భర్త విచిత్ర ప్రవర్తన (సంభోగ సమయంలో) కూడా కారణం కావచ్చు. సుంతి చేయించుకోని భర్తల వల్ల స్ర్తి జననాంగాలలోకి వైరస్ ప్రవేశించవచ్చు. హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ వల్లా రావచ్చు సెర్వైకల్ క్యాన్సర్. అండాశయ క్యాన్సర్ గర్భం ధరించని స్ర్తిలలో వచ్చే రిస్క్ ఎక్కువ. పిల్లలున్న స్ర్తిలలో ఈ రిస్క్ తక్కువ. అంతే కాకుండా పాలిచ్చిన టుబెక్టమీ చేయించుకున్న వాళ్లలోకూడా రిస్క్ తక్కువ.

హ్యూమన్ పాపిలోనూ వైరస్‌తో సెర్వికల్ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు వాక్సిన్‌కూడా అందుబాటులోవుంది. పెద్దవాళ్ళు కాకముందే అందరూ ఆడపిల్లలకు ఈ వాక్సిన్ ఇప్పించాలి. ముందు 0.5 మిల్లీ కండరాలలోకి ఇంజెక్టు చేయాలి. ఈ వాక్సిన్ 48 నెలలు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ వాక్సిన్ చేయించాలి.
 • ఈ క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోడానికి పాప్‌స్రియర్ పరీక్ష చేయించాలి. గర్భాశయ ప్రాంతంనుంచి పైనున్న కొన్ని కణాలలోనుంచి తీసి మైక్రోస్కోప్ క్రింద పరీక్షిస్తే తెలిసిపోతుంది. ఇది చాలా తెలిక, అతి చవకైన పరీక్ష. 21 సంవత్సరాలనుండి పైబడిన స్ర్తిలు అయిదేళ్లకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
అండాశయ క్యాన్సర్ తెలుసుకోవడానికి ప్రత్యేక క్యాన్సర్ పరీక్షలేమీ లేవు. లక్షణాలుండవు కాబట్టి బాగా పెరిగిన తర్వాతే ఈ క్యాన్సర్ తెలుస్తుంది. వైజైనల్ క్యాన్సర్ చాలా తక్కువుగా వస్తుంది. తెల్లబట్ట కావడంతో బాటు ఆ ప్రాంతంలో పుళ్ళున్నా అనుమానం రావాలి. పరిశుభ్రంగా మర్మావయవాల్ని ఉంచుకోవడంతో ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంటే "హ్యూమన్ పాపిలోమా వైరస్'' ప్రవేశించదు.

 • కొన్ని రకాల క్యాన్సర్లు అంటు వ్యాధులా?
క్యాన్సర్లలో ఏ రకమైనదైనా అంటువ్యాధి కాదు. ఒకే ఇంట్లో కలిసి ఉండటంవల్ల , లేదా బట్టలు, భోజనం వంటి వాటి వల్లక్యాన్సర్ ఒకరినుంచి ఒకరికి రాదు. అయితే రెండు వైరస్‌లు క్యాన్సర్‌ను కలిగిస్తాయి. హెచ్‌పీవీ, హెపటైటీస్-సీ వైరస్‌లు కలిగించే క్రానిక్ ఇన్‌ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కేవలం లైంగిక భాగస్వామ్యం వల్ల, రక్తమార్పిడి, సూదుల వల్ల మాత్రమే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి.

 • వంశపారంపర్యకారణాలు :
తల్లిదండ్రుల్లో ఎవరికి క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ తప్పకుండా వస్తుంది. ఇందులో కొంత వరకు నిజముంది. కొన్ని క్యాన్సర్లు అనువంశికంగా వస్తాయి. కానీ క్యాన్సర్ వంశపారంపర్యంగా సోకే అవాకాశం 10% కంటే తక్కువే. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ వంటివి అనువంశికంగా సోకే అవకాశం ఉంది. క్యాన్సర్‌ను కలిగించే జన్యువు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినప్పటికి క్యాన్సర్ సోకే లక్షణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనే అంశం మీద ఆధారపడి క్యాన్సర్ సోకుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

 • చికిత్స :
క్యాన్సర్‌కు చికిత్స లేదు. క్యాన్సర్ వచ్చిందంటే చావు తప్పదు, నిజమే క్యాన్సర్ ఒక భయంకరమైన జబ్బు. కానీ చాలా క్యాన్సర్లు త్వరగా కనుక్కున్నట్లయితే రోగుల జీవిత కాలాన్ని పెంచవచ్చు. 40% క్యాన్సర్ పేషెంట్ల జీవిత కాలాన్ని ఐదు సంవత్సరాలకు పైనే పెంచగలిగారు. థైరాయిడ్ క్యాన్సర్, ప్రారంభ దశలో ఉన్న సరై్వకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్‌లను పూర్తిగా తగ్గించవచ్చు.

క్యాన్సర్ చికిత్స, జబ్బు కంటే ఎక్కువగా బాధిస్తుంది. నిజం-- క్యాన్సర్ చికిత్స మూడు పద్ధతుల్లో జరుగుతుంది. 1. సర్జరీ, 2.కీమోథెరపీ, 3. రేడియేషన్ థెరపీ.చాలా సందర్భాల్లో రెండు లేదా మూడు పద్ధతుల్లో చికిత్స అవసరమవుతుంది. కొన్నిసార్లు చాలా కాలం చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. అటువంటపుడు పేషెంట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఒత్తిడికి లోను కావల్సిరావచ్చు. క్యాన్సర్‌కైనా ఇంకే జబ్బుకైనా చికిత్స తీసుకుంటున్నపుడు లాభాలతో పాటు కొన్ని తప్పనిసరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు ఇస్తున్న కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్‌తో ఎక్కువ ఫలితాలను ఇస్తున్నాయి. సర్జరీలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. కీహోల్ సర్జరీలు కూడా క్యాన్సర్ పేషెంట్లలో ఫలితాలిస్తున్నాయి.

క్యాన్సర్ ఉన్నట్టు ఒకసారి నిర్ధారణ జరిగిన తరువాత చాలా మంది కుంగిపోయి తమకు చావు తప్పదని ఓటమి ఒప్పేసుకుంటారు. అది అంత మంచిది కాదు. చికిత్స తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉంటే క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం ఎక్కువ. ఈ పాజీటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకోవడానికి యోగా ఉపకరిస్తుంది.

 • అండాశయ క్యాన్సర్‌ నివారణకు కొత్త ఔషదం
ఇటీవల కాలంలో అండాశయ క్యాన్సర్ అధికమవుతోంది. దీని నివారణకు ఔషదాలు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిని 33వ యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఓనకాలజీలో వీటి ఫలితాలను ప్రకటించారు. దీనిపై కెనడా పరిశోధకుడు డాక్టర్ బ్రాడ్లీ మంక్ మాట్లాడుతూ, ఇప్పటికే మూడవ దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోందన్నారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ ట్రాబెక్టెడిన్ తాజా ఔషదం అవుతుంది. తాము జరుపుతున్న పరిశోధనలో ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ చికిత్సను అమెరికా ఫుడ్ సంస్థ చాలా జాగ్రత్తగా ఎవాల్యూట్ చేయనున్నట్లు వివరించారు. మూడోదశలో చాలా మంది రోగులపై పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఈ మందు మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.

 • అండాశయ క్యాన్సర్‌ను నివారించే మధుమేహ మాత్ర


టైప్‌-2 మధుమేహ చికిత్సలో వాడే మాత్ర అండాశ క్యాన్సర్‌ను నివారిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఒక మాత్ర ఖరీదు రోజూ 8 పైసలు మాత్రమే. చాలా కాలంపాటు మెట్ఫార్మిన్‌ (Metformin)‌ మాత్రను తీసుకున్న 1600 మంది బ్రిటన్‌ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ 40 శాతం తగ్గింది. స్విట్జర్‌లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/