Saturday, November 26, 2011

నిర్లక్ష్యము చేయకూడని ఆరోగ్య సమస్యలు , Health problems not to be neglected.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నిర్లక్ష్యము చేయకూడని ఆరోగ్య సమస్యలు , Health problems not to be neglected.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

శరీరమంతా నొప్పులు , ఒకటే బాధ, అంతుబట్టని నొప్పులతో ఏ పనీ మేయలేకపోతాము . ఇలాంటి అనుభవం కొన్నిసార్లు అందరికీ ఎదురవుయూనే ఉంటుంది . కారణం తెలియకుండా ఉబ్బంది పెడుతున్న నొప్పులు సాధారణమైనవేనని , అవే తగ్గిపోతాయిలే అనికూడా అనుకుంటాం . అయితె కాలము గడిచేకొలదీ ఒకచోట మొధలైన నొప్పి ఇతర అవయవాలకు విస్త్రరించవచ్చు. , అప్పుడు పైకి కనిపించేది నొప్పి అయినా అంతకంటే పెద్ద సమస్య ఏదో ముందని బాచించవలది ఉంటుంది . శరీరములో వచ్చే నొప్ప్పులు మామూలేనని పట్టించుకోకుండా ఉండడం కంటే వాటిని గురించి తెలుసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది . ఏ నొప్పిని వదిలేయాలి , దేన్ని పట్టించుకుని అవసరమైన పరీసలు , వైద్యచికిత్సలు చేయిందుకోవాలనేది అర్ధమవుతుంది . సాధారణము గా కొన్ని నొప్పులు పట్టించుకోకుండా వదిలేయరాదు .

చాతీ నొప్పి :
గుండేకు ఒక భాష ఉంటుంది . అది తనకు కలిగే ఇబ్బందికి సంబంధించిన సంకేతాలను తెలియజేస్తుంది. గుండెకు సంబంధించి ఎక్కువ కేసులలో నొప్పి ఉండదు . . . అసౌకర్యము కలుగుతుంది . చాతీ బాగా బరువుగా వున్నట్లు ఒత్తిడి కలుగు తున్నట్లు ఎక్కువమంది చెప్తుంటారు . చాతి నొప్పి ఒక్క గుండె నొప్పికె సాంకేతము కాదు . అది ఉబ్బసము , బ్రాంకైటిస్ మరియు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సిగ్నల్ కావచ్చు . గుండెకు సంబంధించిన నొప్పి అయినట్లైతే కింది దవడ , భుజము , మోచేయి , పొత్తికడుపు , గొంటు నొఫ్ఫులు కనిపించవచ్చును . అలాగే శ్వాస తీసుకోవదం లో ఉబ్బంది ఎదురవుతుంది ి పైన పేర్కోన్న ఏ అవయవానికి నొప్పి ఉన్నా ,లేదా సుగరు , బిపి , వారసత్వచరిత్ర ఉన్నవారిలో గుండె నొప్పి అయినా మీరు చేసే పనులన్ని ఆపి వెంటనే ఒకరి సాహాయము తో వైద్యుని సంప్రదించండి .

వీపు కింద భాగములో నొప్పి :
వీపు కిందభాగము లో వచ్చే నొప్పిని సరిచేసుకోవడము చాలా సులువే. శరీరములో పలు సంక్ష్లిష్టమైన అవయవాలు ఉన్న ప్రాంతము ఇది . ఈ ప్రాంతములో కండరాలు , కణజాలము , నరాలవ్యవస్థ , వెన్నెముక భాగము , వెన్నుపూసలు తదితర అవయవాలు ఉంటాయి. ఈ అవయవాల నిర్మాణ చట్రము లేకుండా శరీరంతా తన విధులు నిర్వర్తించడం సాధ్యముకాదు . సాధారణము గా కండరాలకు కలిగే నొప్పులు వల్లగానీ , నరాలవ్యవస్థపైన ఒత్తిడి , వెన్నెముక డిస్క్ సమస్యల మూలంగా గాని వీపు దిగువభావము లో నొప్పి కలుగుతుంది . కొన్ని సమయాల్లో మూత్రపిండలలో సమస్యల వల్ల కూడ నొప్పిరావచ్చును . ఒకవేళ మూత్రపిండాలే మూలముఅయిటె వాటికి వాపు వస్తాది ... వీపు దుగువు భాగమంతా అసౌకర్యము గా ఉంటుంది .

దంతాలనొప్పులు :
దంతాలు నొప్పిగా ఉన్నాయంటే వాటితో సంబందహము గల నరాల వ్యవస్థ దెబ్బతిన్నదని భావించాలి . నోటిలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది గనుక దెబ్బతిన్న నరాల వ్యవస్థ కు చికిత్స వెంటనే జరగాలి . లేకపోతే బ్యాక్టీరియా నరాలలొకి చొచ్చుకువెళ్ళి అక్కడ మరింగా పెరిగి శరీరంతటా విస్తరింస్తుంది . ఒకవేళ దంతాలకోకి బ్యాక్టీరియాచేరి ఇంఫెక్షన్‌ అయితే రూట్ కెనాల్ చికిత్స మంచిది . ఈ చికిత్సలో బ్యాక్టీరియా నిండిన పదార్ధము తొలగించి సిమ్మెంటు చేస్తారు .

పొత్తికడువు నొప్పి :
ఎక్కువ సమయం విరామం తర్వాత ఆహారము తీసుకునా లేదా నిల్వౌన్న ఆహారము తిన్నా పొత్తికడుపులో అసౌకర్యము కలగవచ్చును . ఇతర సమయాల్లో కూడా ఈ నొప్పి వున్నట్లైయితే రకరకాల పొరపాట్లు జరిగిఉండవచ్చు . అలాగే మూత్రపిండాలు , ఊపిరితిత్తులు , గర్భాశన్నికి సమస్యలు ఉన్నపుడు కూడా ఈ నొప్పి ఉంటుంది . పొత్తికడుపు కుడివైపు కిందిభాగములో నొప్పి అనిపిస్తే ' అపెండిసైటిస్ ' కావచ్చు . దీనికి సర్జరీ అవసము అవుతుంది . కడుపు కుడి పైభాగములో నొప్పి అనిపిస్తే " గాల్ బ్లాడర్ లో " సమస్య కావచ్చు ను . పొత్తికడుపు పై భాగము లో నొప్పితో పాటు వీపు పైభాగములో నొప్పిఉన్నట్లైతే " ప్రాంకియాస్ " కి సంబంధిన సమస్య అవవచ్చును. లేదా గాస్ట్రిక్ సమస్య కావచ్చును . పేగులలో ఎవనా అడ్డంకులు ఉన్నా పొత్తికడుపులో అసౌకర్యము గా ఉంటుంది . సరైన సమయము లో వాటిని గుర్తించి తగిన వైద్యచికిత్స చేయించుకో్వాలి .

పిక్కల్లో నొప్పి :
అలవాటు లేని పని చేసినా లేదా ఎక్కువసేపు పని చేసిన తర్వాత అయినా పిక్కల్లో నొప్పి అనిపించవచ్చు . అయితే ఎలాంటి పని చేయకుండా , దెబ్బలు తగలుకుండా కూడా పిక్కలు నొప్పిగా ఉన్నట్లయితే ఎంతమాత్రము విస్మరించరాదు . పిక్కల్లో కారణములేకుండా నొప్పి ఉంటే లోపలి రక్తనరాల్లో రక్తము గడ్డకట్టి ఉండవచ్చు . కాలి రక్తనాళాల్లో రక్తము గడ్డకడితే ఆ ప్రాంతము వావు వస్తుంది . రక్తప్రసరణకు అడ్డంకి వచ్చి నొప్పికలుగుతుంది . బాగా నిద్రలేమి వలన , డీహైడ్రేషన్‌ మూలనా కూడా పిక్కల్లో నప్పి రావచ్చును . తగిన చికిత్స వైద్యుని సహాయము తో తీసుకోవాలి .

చేతుల్లో ,పాదాలలో మంటలు :
మనము ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చుని వున్నపుడు గాని , ఒక కాలు పై కాలు పెట్టి ఎక్కువసేపు కూర్చున్నపుడు గాని రక్తపరసరణ తగ్గి కొద్దిగా తిమిరి , మొస్సుబారినట్లు అవుతుంది . కాళ్ళు , చేతులు బాగా కదిలించినట్లయితే ఈ స్థితినుంచి బయటపడవచ్చు . మధుమేహము , బి12 లోపము , మితిమీరిన మద్యము సేవించడం వల్ల పెరిఫెరల్ న్యూరోపతి అనే సమస్య వస్తుంది . దీనిలో తిమిర్లు , నరాలమొద్దుబారడం జరుగుతుంది . నరాలవ్యస్థ దెబ్బతినకుండ ఉండాలంటే తగిన చికిత్స తీసుకో్వాలి .

పక్షవాతము సూచనలు :
పక్షవాతము ఒక తీవ్రమైన వైకల్యము . ఈ స్థితి కలిగిన వారు తక్షణము వైద్య సహాయము తీసుకోవాలి . అకస్మికముగా ముఖము మొద్దుబారడము , బలహీన పడడము , మోకాళ్ళు, మోకాళ్ళు ... ప్రత్యేకము గా శరీరము ఒక వైపు తిమిరి , మొద్దుబారడము వంటివి పక్షవాతం లక్షణాలు . అలాగే ఒకాసారిగా గందరగోళానికి గురికావడము , మాట్లాడలేకపోవడము , మాటలు అర్ధముచేసుకొలేకపోవడము , కళ్ళకు సంబంధించి చూపులో ఇబ్బంది . సమతుల్యము , సమన్వయము దెబ్బతినడం , ఎలాంటి కారణములేకుండ తీవమైన తలనొప్పి వంటివి పక్షవాత అక్షణాలలో కొన్ని . సరియైన వైద్యము అందకపోతే జీవితాంతము అవిటివారుగా బాధపడవలసిందే .

  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.