Saturday, November 26, 2011

స్త్రీల క్యాన్సర్ వ్యాధులు , Gynaecological Cancer, women Cancerఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అండాశయ క్యాన్సర్ , Gynaecological Cancer, Overian Cancer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • మనదేశంలో మగవారిలోకన్నా ఆడవాళ్లలోనే క్యాన్సర్స్ ఎక్కువుగా వస్తున్నాయి అని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఆడవాళ్లలో క్యాన్సర్‌ని ప్రారంభదశలో కనుక్కోగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. అందుకు అవగాహన అవసరం. పాశ్చాత్య దేశాలలో సెర్వైకల్, యుటెరిన్ క్యాన్సర్ తగ్గుముఖం పట్టాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య పెరుగుతోంది. కానీ మన దేశంలో రెండురకాల క్యాన్సర్స్ పెరుగుతూనే వున్నాయి. స్నానంచేస్తూ ఒళ్ళు రుద్దుకునేప్పుడు స్ర్తిలు బ్రెస్ట్‌ని తడిమి చూసుకోవాలి, గడ్డల్లా తగిలితే వెంటనే వైద్యుణ్ణి కలుసుకోవడం మంచిది. ఆ గడ్డలు పెరుగుతున్నాయన్నప్పుడు ఇంకసలు ఆలస్యం చేయకూడదు.

ఇక గైనకాలజికల్ క్యాన్సర్స్ విషయానికికొస్తే గర్భాశయము, అండాశయము, ఎండోమెట్రియమ్, యోని రంధ్రమునుంచి లోపలకు వ్యాపించే దారి (cervix), యోని ప్రాంతాలలో క్యాన్సర్ రావచ్చు. ఇవి ఎక్కువగా వస్తుండడంతో మన కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము మార్చి 11వ తేదీన ‘గైనకాలజికల్ క్యాన్సర్ అవగాహన దినోత్సవం’గా పాటిస్తోంది.

  • గర్భాశయ క్యాన్సర్ వస్తే తెల్లటి ద్రావకం యోని నుంచి వస్తుంటుంది. అలా వస్తుంటే వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. అండాశయ క్యాన్సర్ ప్రారంభదశలో స్రావంకాకపోవచ్చు. పొత్తికడుపు వాపు కలుగుతుంది. అప్పుడు యోని స్రవాలు కనిపించవచ్చు. ఎండో మెట్రియమ్ క్యాన్సర్ ఉన్న వాళ్లలో బహిష్ట సమయంలో రక్తస్రావం చాలా అధికంగా అవుతుంది. ఈ క్యాన్సర్‌కి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి అతి చిన్న వయస్సులో పురుష సంగమం. ఎక్కువమందితో సంభోగం. భర్త విచిత్ర ప్రవర్తన (సంభోగ సమయంలో) కూడా కారణం కావచ్చు. సుంతి చేయించుకోని భర్తల వల్ల స్ర్తి జననాంగాలలోకి వైరస్ ప్రవేశించవచ్చు. హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ వల్లా రావచ్చు సెర్వైకల్ క్యాన్సర్. అండాశయ క్యాన్సర్ గర్భం ధరించని స్ర్తిలలో వచ్చే రిస్క్ ఎక్కువ. పిల్లలున్న స్ర్తిలలో ఈ రిస్క్ తక్కువ. అంతే కాకుండా పాలిచ్చిన టుబెక్టమీ చేయించుకున్న వాళ్లలోకూడా రిస్క్ తక్కువ.

హ్యూమన్ పాపిలోనూ వైరస్‌తో సెర్వికల్ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు వాక్సిన్‌కూడా అందుబాటులోవుంది. పెద్దవాళ్ళు కాకముందే అందరూ ఆడపిల్లలకు ఈ వాక్సిన్ ఇప్పించాలి. ముందు 0.5 మిల్లీ కండరాలలోకి ఇంజెక్టు చేయాలి. ఈ వాక్సిన్ 48 నెలలు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ వాక్సిన్ చేయించాలి.
  • ఈ క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోడానికి పాప్‌స్రియర్ పరీక్ష చేయించాలి. గర్భాశయ ప్రాంతంనుంచి పైనున్న కొన్ని కణాలలోనుంచి తీసి మైక్రోస్కోప్ క్రింద పరీక్షిస్తే తెలిసిపోతుంది. ఇది చాలా తెలిక, అతి చవకైన పరీక్ష. 21 సంవత్సరాలనుండి పైబడిన స్ర్తిలు అయిదేళ్లకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
అండాశయ క్యాన్సర్ తెలుసుకోవడానికి ప్రత్యేక క్యాన్సర్ పరీక్షలేమీ లేవు. లక్షణాలుండవు కాబట్టి బాగా పెరిగిన తర్వాతే ఈ క్యాన్సర్ తెలుస్తుంది. వైజైనల్ క్యాన్సర్ చాలా తక్కువుగా వస్తుంది. తెల్లబట్ట కావడంతో బాటు ఆ ప్రాంతంలో పుళ్ళున్నా అనుమానం రావాలి. పరిశుభ్రంగా మర్మావయవాల్ని ఉంచుకోవడంతో ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంటే "హ్యూమన్ పాపిలోమా వైరస్'' ప్రవేశించదు.

  • కొన్ని రకాల క్యాన్సర్లు అంటు వ్యాధులా?
క్యాన్సర్లలో ఏ రకమైనదైనా అంటువ్యాధి కాదు. ఒకే ఇంట్లో కలిసి ఉండటంవల్ల , లేదా బట్టలు, భోజనం వంటి వాటి వల్లక్యాన్సర్ ఒకరినుంచి ఒకరికి రాదు. అయితే రెండు వైరస్‌లు క్యాన్సర్‌ను కలిగిస్తాయి. హెచ్‌పీవీ, హెపటైటీస్-సీ వైరస్‌లు కలిగించే క్రానిక్ ఇన్‌ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కేవలం లైంగిక భాగస్వామ్యం వల్ల, రక్తమార్పిడి, సూదుల వల్ల మాత్రమే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి.

  • వంశపారంపర్యకారణాలు :
తల్లిదండ్రుల్లో ఎవరికి క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ తప్పకుండా వస్తుంది. ఇందులో కొంత వరకు నిజముంది. కొన్ని క్యాన్సర్లు అనువంశికంగా వస్తాయి. కానీ క్యాన్సర్ వంశపారంపర్యంగా సోకే అవాకాశం 10% కంటే తక్కువే. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ వంటివి అనువంశికంగా సోకే అవకాశం ఉంది. క్యాన్సర్‌ను కలిగించే జన్యువు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినప్పటికి క్యాన్సర్ సోకే లక్షణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనే అంశం మీద ఆధారపడి క్యాన్సర్ సోకుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

  • చికిత్స :
క్యాన్సర్‌కు చికిత్స లేదు. క్యాన్సర్ వచ్చిందంటే చావు తప్పదు, నిజమే క్యాన్సర్ ఒక భయంకరమైన జబ్బు. కానీ చాలా క్యాన్సర్లు త్వరగా కనుక్కున్నట్లయితే రోగుల జీవిత కాలాన్ని పెంచవచ్చు. 40% క్యాన్సర్ పేషెంట్ల జీవిత కాలాన్ని ఐదు సంవత్సరాలకు పైనే పెంచగలిగారు. థైరాయిడ్ క్యాన్సర్, ప్రారంభ దశలో ఉన్న సరై్వకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్‌లను పూర్తిగా తగ్గించవచ్చు.

క్యాన్సర్ చికిత్స, జబ్బు కంటే ఎక్కువగా బాధిస్తుంది. నిజం-- క్యాన్సర్ చికిత్స మూడు పద్ధతుల్లో జరుగుతుంది. 1. సర్జరీ, 2.కీమోథెరపీ, 3. రేడియేషన్ థెరపీ.చాలా సందర్భాల్లో రెండు లేదా మూడు పద్ధతుల్లో చికిత్స అవసరమవుతుంది. కొన్నిసార్లు చాలా కాలం చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. అటువంటపుడు పేషెంట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఒత్తిడికి లోను కావల్సిరావచ్చు. క్యాన్సర్‌కైనా ఇంకే జబ్బుకైనా చికిత్స తీసుకుంటున్నపుడు లాభాలతో పాటు కొన్ని తప్పనిసరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు ఇస్తున్న కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్‌తో ఎక్కువ ఫలితాలను ఇస్తున్నాయి. సర్జరీలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. కీహోల్ సర్జరీలు కూడా క్యాన్సర్ పేషెంట్లలో ఫలితాలిస్తున్నాయి.

క్యాన్సర్ ఉన్నట్టు ఒకసారి నిర్ధారణ జరిగిన తరువాత చాలా మంది కుంగిపోయి తమకు చావు తప్పదని ఓటమి ఒప్పేసుకుంటారు. అది అంత మంచిది కాదు. చికిత్స తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉంటే క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం ఎక్కువ. ఈ పాజీటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకోవడానికి యోగా ఉపకరిస్తుంది.

  • అండాశయ క్యాన్సర్‌ నివారణకు కొత్త ఔషదం
ఇటీవల కాలంలో అండాశయ క్యాన్సర్ అధికమవుతోంది. దీని నివారణకు ఔషదాలు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిని 33వ యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఓనకాలజీలో వీటి ఫలితాలను ప్రకటించారు. దీనిపై కెనడా పరిశోధకుడు డాక్టర్ బ్రాడ్లీ మంక్ మాట్లాడుతూ, ఇప్పటికే మూడవ దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోందన్నారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ ట్రాబెక్టెడిన్ తాజా ఔషదం అవుతుంది. తాము జరుపుతున్న పరిశోధనలో ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ చికిత్సను అమెరికా ఫుడ్ సంస్థ చాలా జాగ్రత్తగా ఎవాల్యూట్ చేయనున్నట్లు వివరించారు. మూడోదశలో చాలా మంది రోగులపై పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఈ మందు మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.

  • అండాశయ క్యాన్సర్‌ను నివారించే మధుమేహ మాత్ర


టైప్‌-2 మధుమేహ చికిత్సలో వాడే మాత్ర అండాశ క్యాన్సర్‌ను నివారిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఒక మాత్ర ఖరీదు రోజూ 8 పైసలు మాత్రమే. చాలా కాలంపాటు మెట్ఫార్మిన్‌ (Metformin)‌ మాత్రను తీసుకున్న 1600 మంది బ్రిటన్‌ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ 40 శాతం తగ్గింది. స్విట్జర్‌లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.