Monday, May 21, 2012

మసాజ్‌ చికిత్సా ప్రక్రియ,మసాజ్‌ థెరపీ,Massage therapyఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మసాజ్‌ థెరపీ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సమస్త మాన వాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వ ర ఉపసమనాన్ని ఇ చ్చేదిగా... సమర్ధవంత మైన చికిత్సా ప్రక్రియ గా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం. బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

అసలు ఇలా బాడీ మసాజ్‌ చేయటం అన్నది ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో కాన్పు జరిపినా... పుట్టిన బిడ్డ్డకి ఎముకల గట్టిదనం కోసం, మరిన్ని రుగ్మతల నుండి రక్షణ కోసం తైలాలతో మర్ధన చేయటం తప్పని సరిగా మారింది. మనిషి పుట్టుకే ఈ ప్రకృతి సహజ సిద్దమైన వైద్యంలో ప్రారంభమవుతోందని చెప్పొచ్చు. ఈ ప్రకృతి ప్రక్రియల్లో అవరాన్ని బట్టి వివిధ రకాల మర్ధ నలు చేయటం తప్పని సరి.

అనుభవమున్న ఎందరు వైద్యులున్నా... ఎన్ని రకా లుగా వైద్యం అభివృద్ధి చెందినా... పుట్టిన బిడ్డ ఎదిగే కొలదీ కాసేపు శరీరానికి మర్ధన చేయటం అనుభవమున్న మాతృమూర్తులు చేసే పని, ఈ విషయంలో అధిక ప్రాధాన్యత బాలింతలకు, తొలి చూలు మహిళలకు ఇలా మర్ధన చేయటం వారి ఆరోగ్య సమస్యలు తీర్చేదే. ఆరోగ్య పరమైన ప్రతిబంధకాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా పూర్వం నుండి మర్ధన కొనసాగుతోందనే చెప్పక తప్పదు.

మర్ధనం అంటే...

స్పర్శ ఇది చాలా సున్నితమైన అంశం. దు:ఖం, బాధ, తదితరాలు కలిగినప్పుడు ఊరడింపుని, అనున యాన్ని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషి నుండి లభించే స్పర్శ ఎంతో ఓదార్పునిస్తుందన్నది వాస్తవం. దీనివల్ల జరుగుతున్న ప్రయోజనాలని ఆధారంగా చేసుకుని పూర్వీకులు స్పర్శపై అనేక పరిశోధనలు చేసి వైజ్ఞానికంగా చేసిన అభివృద్ధి వల్లే మర్ధన ప్రక్రియని రూపొందించారు. దీని కోసం మసాజ్‌ థెరఫీ పేరుతో ఆయుర్వేదంలో ఏకంగా ఓ శాస్త్రమే ఉంది. ప్రకృతి వైద్య విధానానికి అను సంధానించి అన్ని వయసుల్లోని వారి శారీరక శ్రమల కారణంగా కండరాలు అలసిపోవటం వల్ల వచ్చే అనేక రుగ్మతలపై అధ్యయనం చేసి, వాటిని స్పర్శతో సేత తీర్చే లా ఈ ప్ర క్రియ ఉంటుంది. మన దేశంలో సాంప్రదాయ పద్ధతులలో శరీరాన్ని, కండలను పెంచేందుకు పూర్వ కాలం నుండి దండీలు, కుస్తీలు వంటి గ్రామీణ క్రీడలు సైతం ఆయుర్వేద వైద్య విధానంలోని పద్దతులే. వీటి వల్ల కలిగే కండరాల ఉపశమనానికి మర్ధనాన్ని వినియోగించే వారు.

మర్ధనలో జాగ్రత్తలు పాటించాలి....

ఓ పద్దతి ప్రకారం జరగాల్సిన మర్ధన ఇష్టాను సారం చేస్తే.... నొప్పి మరింత పెరిగి లేని పోని అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ మర్ధన చికిత్సపై ప్రత్యేకంగా నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్న వారి సహాయం తప్పని సరిగా తీసుకోవాల్సిందే.. శరీర నిర్మాణాన్ని పూర్తి స్ధాయిలో తెలుసుకుని ఎక్కడ ఏతరహాలో మర్ధన చేయాలన్నది ముఖ్యం.

ఎలాంటి ఆరోగ్య సమస్యలకి మర్ధన అవసరమంటే...

పక్షవాతం :

కొన్ని రకాల పక్షవాతాల బారిన పడిన వారిలో చచ్చు బడి పోయిన శరీర భాగాలపై తగిన ఆయుర్వేద తైలా లతో మర్ధన ప్ర క్రియ చేయటం ద్వారా తిరిగి పునర్జీవనం సాగించేలా చేయచ్చు. ధన్వంతరి తైలం, క్షీర బలా తైలాలు ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

తలనొప్పి :

మనలో చాలా మంది ఎప్పటికప్పుడు మాడునొప్పితో, విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటాం. ఇలా బాధపడేవారు స్వచ్చ మైన కొబ్బరి నూనెను తలపై మృదువుగా మర్ధన చేయించు కుంటే త్వరగా ఉపశమనం పొందొచ్చు. మరీ విపరీతమైన నొప్పితో బాధపడేవారు రాత్రుళ్లు పడుకునే సమయంలో మర్ధన చేయించుకోవటం మంచిది. ఒక్కోసారి శరీరం అంతా మర్ధన చేయాల్సి రావచ్చు. ఇందుకు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది ..

కీళ్ల వాతం :

చికెన్‌ గున్యా, మలేరియా, జ్వరం తదితర వ్యాధుల బారిన పడిన వారిలో కీళ్ల వాపులు, నొప్పులు అధికంగా ఉం టాయి. కీళ్లు బిగుసుకు పోయిన కారణంగా కాళ్లు కదపలేని స్దితి కూడా వస్తు ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా తగిన విధంగా మసాజ్‌ చేయించుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అధిక బరువు :

ప్రస్తుత ఫాస్టుఫుడ్‌ కల్చర్‌ కారణంగా ఊబకాయానికి లోనవుతున్న వారు కొందరైతే... దులవాట్లు, శారీరక శ్రమ తగ్గటం లాంటి కారణాల వల్ల, జీవనశైలిలో వచ్చిన మార్పులు వల్ల శరీరం భారీగా పెరిగి బాధ పడుతున్న వారు మరి కొందరు. వీరిలో పొట్ట పెరగటం బైటకు కనిపించే సమస్య అయితే, ఎసిడిటి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, పుల్లటి తేన్పులు, మలబద్దకం ఇలా చాలా అంతర్గత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి బాధలతో బాధ పడేవారి కోసం ప్రత్యేక రీతిలో మర్ధన చికిత్స చేస్తే ఊబకాయం తగ్గి శరీరానికి హాయి దక్కు తుంది.

ఉబ్బసం, ఆయాసం :

తీవ్రమైన జలుబు, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులు ఉన్న వారు ఆయుర్వేద చికిత్సలో వాడే సైంధవ లవణం కలిపిన నువ్వుల నూనెని గానీ, కార్పూర తైలాన్ని కానీ ఛాతిపైనా, వీపు పైనా మర్ధన చేసినట్లు రుద్ది వేడి నీళ్లతో కాపడం పెడితే తొందరగా ఉపశమనం లభిస్తుంది.

నరాల నొప్పి:

సయాటికా లాంటి నొప్పులకు, నొక్కుకు పోయే నరాల బాధల నుండి ఉపశమనం లభించడానికి మహానారాయణ తైలాన్ని రుద్ది తగిన రీతిన మర్ధన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయ టం వల్ల నరం వెళ్లే మార్గం, నరం పూర్తి స్ధాయిలో ఉత్తేజభరితమవుతాయి.

నిద్రలేమి :

నిద్ర పట్టక బాధ పడేవారికి మర్ధన చికిత్స బాగా ఉపయోగ పడుతుంది. నిద్ర మాత్రలు వేసుకుని లేని పోని రోగాలు తెచ్చుకునే కన్నా ఆరో గ్యవంతమైన ఈ ప్రకృతి వైద్య విధానంలో నిపుణుల సూచనల మేరకు మర్ధన చేయించుకునే స్లీప్‌ సైకిల్‌ క్రమబధ్ధీకరించబడి నిద్రలేమి పోతుంది.

మర్ధన వల్ల ప్రయోజనాలూ బోలెడు...

శరీరాన్ని అన్ని విధాలుగా మర్దించడం వల్ల చమట రూపంలో చర్మంలోని మాలిన్యం బైటకు రావ టం వల్ల కాంతి వంతంగా తయారవ్వటమే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా హాయిని గొలిపే ఈ ప్ర క్రియ వల్ల కండరాలు సేద తీర టమే కాకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంచు తుంది. వృధ్ధాప్యం కారణంగా వచ్చే అనేక సమస్యలకు సత్వర ఉపశమనం మర్ధన వల్లే సాధ్యం.

వీరికి మర్ధన చేయద్దు :

గర్భవతులైన మహిళల పొట్టపై ఎట్టి పరిస్ధితిలోనూ మర్ధన చేయకూడదు. అలాగే మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారిపైన మర్ధన ప్రయోగాలు చేస్తే ఉప శమనం మరో విపరీతానికి దారి తీస్తుంది.

-- సత్య గోపాల్‌ @ అంధ్రప్రభ ఆదివారము అనుబంధం
 • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, May 19, 2012

మోకీళు మార్పిడి శస్త్రచికిత్స, Knee replacement Surgery


 • image : courtesy with Eenadu News paper.


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మోకాలి మార్పిడి శస్త్రచికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • వయసు పైబడిన వారిని వేధించే సమస్య మోకాలి నొప్పి. దీనివల్ల పది అడుగులు వేయటం కష్టమైపోతుంది. నాలుగు మెట్లు కూడా ఎక్కలేకపోతుంటారు. రోజువారీ సాధారణ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. నొప్పి మూలంగా కింద కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. నేడు మనదేశం లో 15 శాతము మంది మోకాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు . వీరిలో దాదాపు 14 శాతము మందికి మందులతోనే ఉపశమనం కలుగుతుంది . మిగతా ఆ 1% మందికి కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప మరోమార్గము లేదు . ఇటువంటి వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఒక వరంలాంటిదంటున్నారు డాక్టర్ అఖిల్ దాడి. మోకాలి నొప్పితో బాధపడే వారు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవించవచ్చంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…

మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే కీళ్లవాతానికి గురవడం, ‘హైపోథైరాయిడిజం’ వల్ల మోకాలు త్వరగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మోకాలి నొప్పి మొదలవుతుంది. మోకాలి నొప్పికి మరొక ప్రధానకారణం స్థూలకాయం. అధిక బరువు వల్ల మోకాలు కీళ్లలో అరుగుదల ఎక్కువగా జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ప్రాథమిక దశలో మోకాలి నొప్పిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే మందులతోనే నయం అవుతుంది. ఆలస్యం చేస్తే కీళ్ల మధ్య అరుగుదల ఎక్కువయి సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుతం ఈ నొప్పులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు ''గ్లూకోజమైన్'' అనే మందులు వాడటం ద్వారా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, కీళ్లవాతానికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు.

 • ఎవరికి ఆపరేషన్ అవసరం
గత కొద్ది సంవస్తరాలుగా మోకీలు నొప్పితో బాధపడుచున్నవారికి ,
10 నిముషాలకంటే ఎక్కువ సమయము నిలబడలేకపోతున్నవారికి,
5-6 మెట్లు కూడా ఎక్కలేనివారికి , 
కనీసం 500 అడుగులు కూడా నడవలేని వారికి,
రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది.
నొప్పి నివారణ మాత్రలు వాడినప్పటికీ పనిచేయనపుడు,
మోకాలు మధ్యలో ఉండే గుజ్జు పూర్తిగా అరిగిపోయి తీవ్రమైన నొప్పలతో బాధపడుతున్నప్పుడు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడమే ఉత్తమం,
కాళ్లు వంగిపోయిన వారికి కృత్రిమ కీలు అమర్చడం చక్కని పరిష్కారం.

 • ఏది ఉత్తమం
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధనల అనంతరం వివిధ రకాల కృత్రిమ మోకాళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోగి సౌలభ్యాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని పరిశీలించి ఏ రకమైనది సరిపోతుందో వైద్యులు నిర్ధారిస్తారు. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 10 నుంచి 15 శాతం మందిలో లోహ సంబంధమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొందరిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అలర్జీలను నివారించే అధునాతమైన కృత్రిమ సిరామిక్ మోకాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది

 • a s knee
జర్మనీ వారి ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఈ కృత్రిమ సిరామిక్ మోకాలును తయారుచేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మోకాలు ఏడు పొరలుగా వివిధ ఔషధాలతో నిర్మాణం చేయబడి ఉంటుంది. ప్రధానమైన ఐదు పొరలు క్రోమ్ నైట్రేట్-తో తయారు చేయబడి ఉంటాయి. ఇది మోకాలుకు గట్టిదనాన్ని ఇస్తుంది. ఆరవ పొర జిర్కోనియమ్ నైట్రోజన్ - తో తయారుచేయబడి ఉంటుంది. దీని ద్వారా కృత్రిమ మోకాలు కఠినంగా తయారయి సిరామిక్ గుణం వస్తుంది. ఏడవ పొర జిర్కోనియమ్. ఏ ఎస్ నీ తయారీలో ఉపయోగించే జిర్కోనియమ్ లోహం మానవ శరీరంలోని ఎముకలకు చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి శరీరంలో త్వరగా కలిసిపోయే గుణం ఉంటుంది. మోకాలుకు శక్తిని, పటుత్వాన్ని ఇస్తుంది. ఏ ఎస్ నీలోని ఏడు పొరలలోని ఔషధాలు లోహం నుంచి విడుదలయ్యే అయానులు రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. దీనిద్వారా అలర్జీ రాకుండా ఉంటుంది. అరుగుదల కూడా తక్కువ ఉండి ఎక్కువ కాలం మన్నుతుంది. మిగతా సిరామిక్ మోకాళ్లతో పోలిస్తే తొడవైపు ఎముక భాగం మరియు కాలివైపు వెనక భాగానికి అంటే పూర్తి కాలుపై దీనికి పటుత్వం ఉంటుంది.

వెనుకవైపునకు జరిగే అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది.

 • ఆపరేషన్ సమయంలో…
తొడ ఎముక కింది భాగం, కాలు పైభాగం అరిగిపోవడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి మొదలవుతుంది. ఎముకల మధ్య ఉండే జిగురు తగ్గిపోవడం, ఎముక, వాషర్ అరిగిపోవడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. ఆపరేషన్‌లో భాగంగా ఎముక ఆరిగిన స్థానంలో మెటల్‌ను అమర్చడం జరుగుతుంది. రెండు వైపులా మెటల్ వేసిన తరువాత అరిగిన వాషర్ స్థానంలో కొత్త వాషర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. A.S.knee చూడటానికి బంగారం లాగా ఉంటుంది. తక్కువ అరుగుదలతో ఎక్కువ కాలం మన్నడం, పటుత్వం కలిగి ఉండటం, అలర్జీలు నివారించడం వల్ల మోకాలు నొప్పితో బాధపడేవారికి బంగారు మోకాలేనని చెప్పొచ్చు. శస్త్రచికిత్స తరువాత నొప్పి పూర్తిగా తగ్గిపోయి మామూలుగా నడవటం, రోజు వారి పనులు చేసుకోవడం సాధ్యపడుతుంది. మోకాలు మార్పిడి తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు పదిపదిహేనేళ్ల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.

 • ఆపరేషన్ తరువాత…
మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాళ్ల వంకర కూడా తొలగిపోతుంది. కృత్రిమ కాలు ఎంతకాలం మన్నుతుంది అనే విషయం వారి అలవాట్లు, జీవనవిధానం, శస్త్రచికిత్సలో అమర్చే మెకాలుపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శస్త్రచికిత్స తరువాత ఎంత దూరమైన నడవచ్చు. ఎన్ని మెట్లయినా ఎక్కవచ్చు. కానీ కింద కూర్చునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలు మార్పిడి అనంతరం ఇరవై, ముఫ్పై ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చు.Courtesy with : డా. అఖిల్ దాడి ,నీ రీప్లేస్‌మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్,సికింద్రాబాద్ @sevalive.com

 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, May 18, 2012

Listen to what our body tell,శరీరము చెప్పేది వినాలి
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శరీరము చెప్పేది వినాలి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అందరూ ఆరోగ్యముగా ఉండాలనే కోరుకుంటారు . మన శరీరము ఓ పెద్ద కర్మాగారము . దానిలో అనారోగ్యకరమైన ఏ చిన్న మార్పునైనా కొన్ని సాంకేతికాల ద్వారా మనకు తెలియజేస్తుంది. వాటిని మనము అశ్రద్ధ చేయకూడదు . తరచూ తలనొప్పి వస్తూవుంటే నిద్రలేకపోవడం వల్ల అలా జరిగి వుండవచ్చునని భావిస్తారు . అలాగే ఎక్కువసార్లు నడుము నొప్పి వస్తూవుంటే జిమ్‌లో అధిక సమయము వ్యాయామము చేయడమే కారణమని భావిస్తారు . పెదవులు చిట్లుతూవుంటే చలువల్లో లేదా మరో కారణమనుకుంటారు . ఈ సమస్యలన్నీ చలా తరచుగా వస్తూవుంటే , శరీఏము లో మరేదో తీవ్రమైన సమస్య వుందని భావించవలసి వుంటుంది . సాధారణముగా కనిపించే లక్షణాలు అలా ఎందుకు వచ్చివుండవచ్చునన్న కారణాలను తెలుసుకుందాం .

 • విడవని తలనొప్పి :
అప్పుడప్పుడు తలనొప్పిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ వుంటారు . నిద్రలేమి , ఆకలి , మానసిక ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు . ఈ తరహా లాంటి వాటిని సాదారణమైన తలనొప్పిగా భావించవచ్చును. ఏ ధైనా నొప్పి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది .. కాని కొన్ని సమయాల్లో కొంతమందిలో భయంకరమైన వ్యాధులు ... మెదదులో ట్యూమర్లు , మైగ్రైన్‌ , మెదడు వాపు జబ్బులు అయివుండవచ్చు . అన్నివేళలా అశ్రద్ద చేయకుండా మంచి డాక్టర్ ని సంప్రదించాలి .

 • పెదవులు చిట్లడము :
సాధారణము గా పెదవులు చిట్లినట్లు గా తయారయితే మనకు మనమే తేలికగా చికిత్స చేసుకోవచ్చు . పెదవులు పగిలినప్పుడు మెడికల్ షాపు ల్లో లభించే లిప్ బామ్‌ వంటివి రాసి ఊరుకుంటాం . ఇదే సమస్య మల్లీ మల్లీ వస్తూఉంటే అలోచించాలి . విటమిన్లు బి, సి,డి, లు తగ్గినపుడు , ఎర్రరక్తకణాలు లోపించినపుడు , చర్మ ఎలర్జీ వలన పెదవులపై పొట్టు లేచిపోవడము జరిగితే కారణాలు తెలుసుకొని చితిత్సచేసుకోవాలి .

 • వీపు నొప్పి :
ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం , శక్తికి మించిన బరువులు ఎత్తడం , సక్రమముగా కుర్చోకపోవడము లాంటివాటివల్ల వీపునొప్పి రావచ్చు . కారణాన్ని సరిచేసుకుంటే తగ్గిపోతుంది . ఏదైనా పెయిన్‌ బామ్‌ వాడినా తగ్గిపోతుంది. . . కాని తరచుగా వస్తూ భరించరానిదిగా ఉంటే వెన్నుపాము చుట్టూ ఉండే డిస్క్ వాపు లేదా ముందుకు రావడము జరుగవచ్చు లేదా మెదడుకు , వెన్నుకు మధ్యబాగములో ఇంఫెక్షన్‌ రావడడము వల్ల అయివుండవచ్చును. ఇది చాలా సీయస్ వ్యాది . తగిన వైద్యనిపుణులతో చికిత్స చేయించుకోవాలి.

 • మితిమీరిన చెమట :
శరీర ఉష్ణోగ్రత సమతుల్యము గా ఉంచడానికి చెమటపోయడం సర్వసాధారణము . అయితే కోపము , భయము , నిస్సత్తువ , తీవ్ర ఆందోలన లాంటి భావోద్వేగమైన ఒత్తిడికి లోనయినప్పుడు శరీరము వేడెక్కుతుంది. అప్పుడు చెమట పోస్తుంది . దీనివలన ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉంది . ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్నపాటి విషయానికీ అందోళన చెందిన వారు సైకియాట్రిక్ డాక్టర్ని సంప్రదించాలి .

 • చర్మముపై కమిలిన గాయాలు :
చర్మము పై చిన్న చిన్న గాయాలు , గీచుకుపోవడము జరిగినపుడు ఎర్రగా లేదా గోధుమ రంగులో చర్మము కమిలి పోవడము సాధారణమే అయినా ... ఎలర్జీ వలన మాటిమాటికి ఇలా చర్మము పైన కమిలినట్లు , దురద పుట్టె మచ్చలు కనిపిస్తే మంచిది కాదు . కొన్ని ఎలర్జీ వ్యాధులకు సాంకేతికము అవవచ్చు. ముందుగానే వైద్యుని సంప్రదించి చితిత్స చేయించుకుంటే చాలా మంచిది.

 • కడుపులో తేడా:
Hurry , worry , curry .. మూలానా నేటి బిజీ జీవితంలో కడుపులో ఎన్నో తేడాలు , నొప్పి, అజీర్ణ బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంటాసిడ్స్ , జీర్ణం టానిక్ లూ వాడితె సరిపోతుంది . జీవన విధానము మార్పుచేసుకుంటూ బాధలు లేని జీవనాన్ని గడపాలి. కాని కొన్ని సమయాల్లో పేగుల్లో అల్సర్లు , క్యాన్సర్ లు ఇదే రకమైన లక్షణాలు తో కనిపిస్తాయి. బాగా ముదిరిపోతే వైద్యానికి కూడా అందవు . కావున చినపాటి కడుపులో తేడాలకు వైద్యుని సంప్రదించి మంచి సలహా తీసుకోవాలి .


 • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 15, 2012

Ejaculation problems,స్ఖలన సమస్యలుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -స్ఖలన సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శీఘ్ర స్ఖలనాన్ని- ప్రపంచవ్యాప్తంగా పురుషులను ఆవేదనకు గురి చేస్తున్న అతి పెద్ద లైంగిక సమస్యగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన అసంతృప్తికి తోడు.. తన కారణంగా భాగస్వామి కూడా అసంతృప్తికి లోనవ్వాల్సి వస్తోందన్న భావన మనసులో పీడిస్తుండటం దీని తీవ్రతను మరింత పెంచుతోంది.

స్ఖలనమన్నది మనసూ-శరీరం.. మెదడూ-కండరాలూ సమన్వయంతో సాధించే సంక్లిష్టమైన ప్రక్రియ, గాఢానుభూతి. లైంగిక సంతృప్తికి ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ అనూహ్యంగా, వేగంగా ముగిసిపోతే ఎంత వేదనకు లోనవుతారో సకాలంలో ఆ భావన కలగకపోయినా అంతే సమస్యగా తయారవుతుంది. నిజానికి శీఘ్రం, జాప్యం రెండే కాదు.. స్ఖలన సమయంలో నొప్పి, బాధ; ఒక్కోసారి వీర్యం బయటకు రాకుండా వెనక్కిపోవటం వంటి సమస్యలూ ఎదురవ్వచ్చు. వీటిని అధిగమించటంలో ఆధునిక వైద్యం మంచి పురోగతే సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్యల్లో చాలా సర్వసాధారణంగా, చాలా ఎక్కువగా కనబడే సమస్య- శీఘ్ర స్ఖలనం. ఎంతోమంది దీనితో లోలోపల అసంతృప్తికి లోనవుతూనే ఉన్నా బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. చిన్నతనంగా భావిస్తూ దీనికి చికిత్స తీసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరు. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఒకప్పుడు శీఘ్రస్ఖలనానికి సమర్థ చికిత్సలేవీ ఉండేవి కూడా కావు. వైద్యులు కూడా దీన్ని మానసిక సమస్యల గాటన కట్టేవారు. చాలాసార్లు దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేకపోయినా ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులే వాడేవారు. పరిస్థితి ఏమంత మెరుగవ్వకపోవటం మూలంగా ప్రజల్లో దీనికి సమర్థమైన చికిత్సలే ఉండవన్న భావన బలపడింది. కానీ ఇప్పుడీ విషయంలో వైద్యశాస్త్రం, పరిశోధనా రంగం ఎంతో అభివృద్ధి చెందాయి. నేరుగా స్ఖలనానికి సంబంధించిన మెదడు కేంద్రాల మీదే పని చేసే మందుల వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శీఘ్రస్ఖలనమన్న సమస్యను అర్థం చేసుకునే తీరులోనే ఎంతో మార్పు వస్తోంది.

 • ఆది నుంచీ అపోహలు!
వీర్యం కూడా ఇతరత్రా సాధారణ శారీరక ద్రవాల వంటిదే అయినా వీర్యంలో ఏదో మహత్తు ఉందని బలంగా విశ్వసించటం దాదాపు అనాదిగా అన్ని సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. వీర్యాన్ని శక్తికి చిహ్నంగా భావిస్తూ, శరీరంలో వీర్యం కొంత మోతాదులో నిల్వ ఉంటుందనీ, స్ఖలనమైనప్పుడల్లా అది కొంచెం కొంచెం తరిగిపోతుందనీ భావిస్తూ అలా వీర్యం పోవటాన్ని 'బలహీనత'కు చిహ్నంగా అపోహపడుతుండేవారు. నిజానికి వీర్యంలో ఏముంటుందో, అది సంతానానికి ఎలా కారణమవుతోందో మనిషికి చాలా శతాబ్దాల పాటు పెద్ద విస్మయంగానే ఉండేది. మొట్టమొదటిసారిగా 1674లో లీవెన్‌హక్‌ అనే శాస్త్రవేత్త వీర్యాన్ని మైక్రోస్కోపు కింద పరీక్షించి శుక్రకణాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ శుక్రకణం స్త్రీ అండాన్ని ఫలదీకరణం చెందించి సంతానికి కారణమవుతోందని 1779లో ''స్పాలెంజని'' నిర్ధారించాడు. అయినా ఇప్పటికీ వీర్యం గురించి మన సమాజంలో అపోహలు ప్రచారంలో ఉండటం విషాదకర వాస్తవం. శాస్త్రీయమైన అవగాహన లేని నాటువైద్యుల విస్తృత ప్రచారం కూడా దీనికి ఒక ముఖ్యకారణం. స్ఖలనం విషయంలో కూడా ఇటువంటి రకరకాల అపోహలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి స్ఖలనం అన్నది గాఢమైన అనుభూతికి కారణమయ్యే సంక్లిష్టమైన చర్య. లైంగికంగా రతిక్రియ ఒక దశకు చేరుకున్న తర్వాత శరీరంలో మెదడు, నాడీ మండలం, కండర వ్యవస్థ వంటివన్నీ కలిసి ఎంతో సమన్వయంతో దీన్ని సాధిస్తాయి. దీన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే దీనికి సంబంధించి రకరకాల సమస్యలూ తలెత్తుతుంటాయి.

 • పరిణామ ఫలం!
త్వరగా స్ఖలనమవటమన్నది పురుషులకు ప్రకృతి సహజంగానే.. పరిణామక్రమంలోనే వచ్చింది. ఆదిమకాలంలో స్త్రీపురుషులకు ఇప్పటిలా సురక్షితమైన ఇళ్లు, విశ్రాంతి సమయం ఉండేవికావు. వారు చాలావరకూ ప్రమాదరకర పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొనేవారు. పులులు, సింహాల వంటి క్రూర జంతువులు, ప్రకృతి వైపరీత్యాల భయం నిరంతరం వెన్నాడేది. ఇలా లైంగిక చర్య చాలావరకూ మానవ జాతి మనుగడకు ఆధారమైన పునరుత్పత్తి ప్రక్రియగానే కొనసాగింది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వీర్యం స్ఖలనమవటమనేది ప్రకృతి సిద్ధంగానే పురుషుడికి అలవడింది.. ఇదే ఆధునిక మానవుడికీ సంక్రమించింది. అయితే సురక్షితమైన ఇళ్లు, సదుపాయాలు, భయం కలిగించే వాతావరణం లేకపోవటం, ఆటంకం లేకుండా చూసుకోవటం వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనటం ఆరంభించారు. ఇది చాలాసేపు లైంగిక ఆనందాన్ని, అనుభూతులను పొందటానికి వీలు కలిగించింది.

ఒకప్పుడు సంతానార్థమే అయిన శృంగారం.. ఆనందకరమైన, మానసికోల్లాసానిచ్చే ప్రక్రియగా మారింది. ఇక్కడే అనాదిగా, పరంపరాగతంగా వస్తున్న శీఘ్రస్ఖలన పద్ధతికీ, ఆధునిక మానవుడి గాఢానుభూతి కాంక్షకూ మధ్య సంఘర్షణ మొదలైంది. అందువల్ల ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు తోడ్పడేలా శీఘ్రస్ఖలనానికి చికిత్సలు, మందుల వంటివి చర్చకు రావటం ఆరంభమైంది.

 • శీఘ్ర స్ఖలనం
శీఘ్రస్ఖలనమన్నది ఎంత సర్వసాధారణ సమస్య అంటే 75% మంది పురుషులు ఎప్పుడోకపుడు దీనికి గురయ్యేవారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతో పాటు వచ్చే 'స్తంభన, పటుత్వ లోపం (ఎరక్త్టెల్‌ డిస్‌ఫంక్షన్‌)' కన్నా దీనితో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ. సంభోగంలో పొల్గొన్నప్పుడు త్వరగా.. అంటే మరికాస్త సమయం లైంగిక చర్యలో పాల్గొనాలని అనిపిస్తున్నప్పటికీ కాస్త ముందుగానే స్ఖలనం అయిపోవటాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవచ్చు. ఇది ఏ వయసువారికైనా రావొచ్చుగానీ యువకులు, మధ్యవయసు వారిలో అధికం. వయసు పెరుగుతున్న కొద్దీ పరిస్థితి మెరుగుపడే అవకాశముంది కూడా. చాలామందికి చాలా సందర్భాల్లో స్ఖలనం మామూలుగానే అవుతుంటుందిగానీ కొన్నిసార్లు మాత్రం త్వరగా అయిపోతుండొచ్చు. దీనికి ఆయా పరిస్థితులు కారణమై ఉండొచ్చు. కొత్త ప్రదేశాల్లోనో, హడావుడిగానో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆత్రుత, భయం, ఆందోళన, ఆదుర్దా మూలంగా శీఘ్రస్ఖలనం జరగొచ్చు. దీనికి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు.
 • ఏది శీఘ్రం..?
నిజం చెప్పాలంటే శీఘ్రస్ఖలనాన్ని నిర్వచించటం కష్టం. కొందరికి అసలు లైంగిక భావనలు జ్ఞప్తికొస్తేనే స్ఖలనమైపోతుంది. మరికొందరి విషయంలో తమకు తృప్తి దక్కుతున్నా, భాగస్వామిని సంతృప్తిపరిచేంత సమయం ఉండకపోవచ్చు. అందుకే మొత్తమ్మీద సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భాగస్వామి ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ఏ వయసులోనైనా.. అంగప్రవేశానికి ముందు లేదా ప్రవేశమైన వెంటనే చాలా కొద్దిపాటి ప్రేరణలతోనే, తాను ఆశించిన దానికంటే చాలా ముందే స్ఖలనమైపోతుండటాన్ని శీఘ్ర సమస్యగా భావించొచ్చు. ఇతరత్రా శారీరక సమస్యలతో దీని బారినపడే అవకాశం లేకపోలేదుగానీ వారితో పోల్చుకుంటే ఎటువంటి సమస్యాలేకపోయినా శీఘ్రస్ఖలనంతో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ.

సమస్య చిరకాలమైనదైనప్పటికీ, దీనిపై విస్తృతంగా చర్చలు జరిగినప్పటికీ దీనికి చికిత్స మాత్రం అంత తేలికేం కాదన్నది వాస్తవం. కొన్ని దశాబ్దాల క్రితం దీన్ని ఎదుర్కొనటానికి మానసికమైన 'సైకోసెక్సువల్‌' చికిత్సలు కొన్ని ప్రయత్నించారు. ముఖ్యంగా హెలెన్‌ సింజెర్‌ కప్లాన్‌ వంటి వారు కొంతసేపు ప్రేరేపించి ఒక దశకు రాగానే ఆపటం, కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి ప్రేరేపణ ప్రారంభించటం వంటి 'స్టార్ట్‌-స్టాప్‌' టెక్నిక్‌లను, మాస్టర్స్‌-జాన్సన్‌ వంటివారు 'స్క్వీజ్‌' టెక్నిక్‌లను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చాలా శతాబ్దాలు చికిత్సారంగం వీటి చుట్టూతానే తిరిగిందిగానీ క్రమేపీ వీటి సమర్థతపై రకరకాల అంశాలు వెలుగులోకి రావటం ఆరంభమైంది. చాలా నింపాదిగా, ఓపికగా పాటించాల్సిన ఈ విధానాలు ప్రస్తుత హడావుడి, ఆధునిక కాలంలో ఎంతవరకూ సత్ఫలితాలనిస్తాయన్నదీ అనుమానంగా తయారైంది. అందుకే నేటి ఆధునిక వైద్య పరిశోధనా రంగం చాలావరకూ స్ఖలన ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే మెదడు, నాడుల నియంత్రణల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

ఇటీవలి వరకూ కూడా శీఘ్రస్ఖలనాన్ని మానసిక సమస్యగా భావిస్తూ శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఔషధ ప్రయోగాల్లో నిరూపణ కాకపోయినా ఆందోళన, చురుకుదనాన్ని తగ్గించే మందులు వాడేవారు. ఆత్మవిశ్వాసం పెంపొందేలా కౌన్సెలింగ్‌ కూడా ఇస్తుండేవారు. కానీ సమస్య పరిష్కారానికి ఇవేవీ సమర్థమంతమైన విధానాలు కావని రాన్రాను బయటపడుతూ వస్తోంది. అయితే ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల మూలంగానే శీఘ్రస్ఖలనం అవుతున్నట్టు గుర్తించిన వారిలో కౌన్సెలింగ్‌ కొంతమేరకు పనిచెయ్యచ్చు. సంభోగం సమయంలో ఆదుర్దా, ఆత్రుత, పనికిరాదని.. సంభోగానికి ముందు ముద్దు ముచ్చట్ల (ఫోర్‌ప్లే) వల్ల భావప్రాప్తి, తీవ్రత (ఇంటెన్సిటీ) మీద నియంత్రణ వస్తుందని.. అవగాహన పెంచటం వల్ల ఉపయోగం ఉండొచ్చు. కానీ ఈ పద్ధతి అందరికీ పనికిరాదు. ఫలితాలు అంతంత మాత్రమే. పైగా సంభోగానికి ముందు ప్రతిసారీ ఈ సూచనలు పాటించటం కుదరకపోవచ్చు. తమను తాము నియంత్రించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పద్ధతులకు భాగస్వామి సహకరించకపోవటం, అసంతృప్తికి లోనుకావటం వంటివీ జరగొచ్చు. అందువల్ల మందులతో ఫలితం కనబడనివారికి మాత్రమే ఇలాంటి సైకో సెక్సువల్‌ కౌన్సెలింగ్‌ సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుతం శీఘ్రస్ఖలన చికిత్సలో కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ''డెపాక్సటీన్‌ (ప్రిలిజీ)'' అనే మందు బాగా పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లోనూ, అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీన్ని ఇటీవలే చాలా ఐరోపా దేశాల్లో అధికారికంగా విడుదల చేశారు. త్వరలో దీనికి అమెరికా 'ఎఫ్‌డీఏ' అనుమతీ రావొచ్చు. ఇది మానసిక సమస్యల్లో వాడే మందుల్లా కాకుండా శీఘ్రస్ఖలన ప్రక్రియకు దోహదం చేసే మెదడులోని భాగాల మీద నేరుగా పనిచేస్తుంది. మున్ముందు ఈ తరహా మందలు మరిన్ని వచ్చే అవాకాశం కనబడుతోంది.
 • స్ఖలనం కాకపోవటం
కొద్దిమందికి అసలే స్ఖలనం కాదు. దీన్ని 'అనెజాక్యులేషన్‌' అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి నిజంగానే స్ఖలనం కాకపోవటం. దీనికి వీర్యం ఉత్పత్తి చేసే, దాన్ని నిల్వచేసే భాగాలు సరిగా అభివృద్ధి చెందకపోవటమో.. వీర్యం బయటకు వచ్చే మార్గంలో అడ్డంకులు ఏర్పడటమో కారణం కావొచ్చు. రెండోది నాడీ సంబంధ సమస్యలు. స్ఖలనాన్ని ప్రేరేపించేందుకు అవసరమైన నాడులు పని చేయకపోయినా అసలే స్ఖలనం కాకపోవచ్చు. ఇవి కాకుండా మానసిక సమస్యల కారణంగా భావప్రాప్తి లేక, స్ఖలనం కాకపోవటం కూడా జరగొచ్చు. కొందరికి ఒక భాగస్వామితో స్ఖలనం సాధ్యమైనా మరొకరి వద్ద స్ఖలనం కాకపోవటం, హస్తప్రయోగ సమయంలో స్ఖలనమవుతూ సంభోగంలో కాకపోవటం, తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్ల స్ఖలనం కాకపోవటం వంటివి జరుగుతాయి.

తీవ్రమైన మానసిక సమస్యల్లో ఉన్న కొందరు మెలకువగా, పూర్తి స్పృహలో ఉన్నప్పుడు స్ఖలించలేకపోవచ్చుగానీ వీరికి రాత్రి నిద్రాసమయంలో స్ఖలనాలు మామూలుగానే ఉండొచ్చు. వీరికి కారణాన్ని బట్టి కౌన్సెలింగ్‌, మందులతో ఉపయోగం ఉంటుంది. వైబ్రేటర్‌ థెరపీ ఇవ్వటం, విద్యుత్‌ ప్రచోదనాల ద్వారా ప్రేరేపణ ఇచ్చి స్ఖలమమయ్యేలా చెయ్యటం (ఎలక్ట్రోఎజాక్యులేషన్‌) వంటి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్ఖలన మార్గంలో అవరోధాల వంటివి ఉంటే సర్జరీతో సరిచెయ్యాల్సి ఉంటుంది.

 • జాప్య స్ఖలనం!
శీఘ్రస్ఖలనానికి పూర్తి భిన్నమైన సమస్య- జాప్య స్ఖలనం. చాలామంది దీంతో ఇబ్బందేంటని, సంభోగంలో మరికాస్త సమయం ఆనందంగా ఉండొచ్చు కదా అని ప్రశిస్తుంటారు. కానీ శృంగారంలో గాఢమైన అనుభూతికి, ఆనందానికీ- కేవలం అంగాన్ని ప్రవేశపెట్టటం, తుంటి కదలికలు మాత్రమే కారణం కాదు. పైగా దీర్ఘసమయం ఈ చర్యలతో భాగస్వామికి అసౌకర్యం, నొప్పి కూడా ఎదురవుతాయి. ఒకవేళ స్త్రీ అప్పటికే భావప్రాప్తి పొంది ఉంటే అంతే ఉత్సాహంతో సంభోగానికి సహకరించకపోవచ్చు. ఆమెలో మృదువైన కదలికలకు అవసరమైన స్రావాలూ తగ్గిపోతాయి. ఎంత ప్రయత్నిస్తున్నా స్ఖలనం జరగకపోవటం వల్ల పురుషుడికీ తృప్తికర అనుభూతులుండవు. ఇలా జాప్య స్ఖలనంతో అసౌకర్యమే కాదు, భాగస్వామితో సంబంధాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి చికిత్స తప్పనిసరి. ప్రధానంగా తరచుగా హస్తప్రయోగానికి అలవాటుపడిన వారు అంగంపై ఎక్కువ బిగువుగా, ఒత్తిడి ఇచ్చుకోవటానికి అలవాటుపడతారు. కానీ వాస్తవంగా సంభోగ సమయానికి వచ్చేసరికి భాగస్వామి నుంచి వారికి అదే తీరులో బిగువు లభించదు. దీనివల్ల స్ఖలనంలో జాప్యం
జరిగే అవకాశం ఉంటుంది. ఒకపక్క భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటూనే.. ఆ అనుభూతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా శృంగారానికి సంబంధించి మనసులో ఏవేవో ఊహించుకుంటూ, గత భావనలను గుర్తుచేసుకుంటూ, వాటి గురించి మధనపడుతుండటం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. లైంగిక భావనలకు, గాఢానుభూతికి శారీరక ప్రేరణల కంటే మానసిక భావోద్వేగాలూ కీలకమే. కాబట్టి సాధ్యమైనంత వరకూ వీరు శృంగార ప్రేరణనిచ్చే లైంగిక భావనల మీద దృష్టిపెట్టటం చాలా అవసరం. తన భాగస్వామిలో తనను ప్రేరేపించే అంశాల వంటివాటి మీద దృష్టి పెట్టటం, భాగస్వామిని కూడా ఇష్టమైన రీతిలో ప్రేరేపించమని కోరటం మంచిది. భాగస్వామిని తృప్తిపరుస్తున్నానా? లేదా? అన్న అంశం గురించి మరీ అతిగా మధనపడుతున్నారేమో చూసుకోవటం కూడా అవసరం. లైంగిక తృప్తి అన్నది కేవలం భాగస్వామికి ఇచ్చేదీ, ఇవ్వాల్సిందే కాదు, ఇందులో తాను పొందాల్సిందీ ఉందన్న భావన అలవరచుకోవాలి. నేరుగా సంభోగ సమయంలో అంగాంగ ప్రేరణకు పూనుకోవటం వల్ల సున్నితమైన భాగాలు మొద్దుబారి, స్పందించకుండా తయారయ్యే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ముందస్తు ముద్దుముచ్చటలకు, ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఎంత సమయం గడిపాం, టైమ్‌ ఎంత గడిచిందన్న భావనలను మనసులో నుంచి తుడిచిపెట్టెయ్యటం అవసరం. భాగస్వామి ఇబ్బందిపడుతూ ఫిర్యాదు చేస్తే తప్పించి లేకుంటే ఆనందించటం మీదే దృష్టిపెట్టటం మంచిది. సంభోగ సమయంలో కసిగా, ఆగ్రహంగా, ఆందోళనగా, భయంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల నాడీమండల స్పందనలు కొన్ని కొరవడి, స్ఖలనం, భావప్రాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండటం, ప్రశాంత చిత్తంతో ఉండటం, భాగస్వామితో కలిసిమెలిసి భావోద్వేగాలను పంచుకుంటూ ఉండటం ముఖ్యం.

 • వీర్యం వెనక్కిపోవటం
కొందరికి స్ఖలనమైనా వీర్యం బయటకు రాకుండా వెనక్కి మళ్లి... మూత్రాశయంలోకి వెళ్తుంది. దీన్ని 'రెట్రోగ్రేడ్‌ ఎజాక్యులేషన్‌' అంటారు.చూడటానికి ఇందులో పైకి అసలు స్ఖలనమే కానట్టుంటుంది. పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడుతుంది. వీరిలో వీర్యం తయారయ్యే భాగాలు సక్రమంగానే ఉంటాయి. భావప్రాప్తి బాగానే ఉంటుంది, వీర్యం స్ఖలనమైన భావన కూడా కలుగుతుంటుంది గానీ వీర్యం బయటకు రాదు. స్ఖలన సమయంలో మామూలుగా మూత్రాశయం చివ్వరి భాగం, అక్కడి స్ఫింక్టరు మూసుకుపోయి వీర్యం వెనక్కి.. మూత్రాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూంటాయి. కానీ వీరిలో అవి సరిగా పనిచేయకపోవటం మూలంగా వేగంగా బయటకు రావాల్సిన వీర్యం.. దారిమళ్లి మూత్రాశయంలోకి వెళుతుంటుంది. మూత్రాశయం చివరి భాగానికి ఏదైనా దెబ్బతగలటం, నాడీసంబంధ సమస్యల వల్ల ఆ ప్రాంతం పట్టుకోల్పోవటం వంటి కారణాల వల్ల తలెత్తే సమస్య ఇది. సంభోగానంతరం వీరు మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు అతి తెల్లగా, మబ్బుగా అనిపిస్తుంటుంది. మధుమేహం కారణంగా నాడీమండల సమస్యలున్న వారిలో ఇది ఎక్కవగా కనబడుతుంటుంది. అలాగే వెన్నుపాము సమస్యలు, వెన్నుకు సర్జరీలు, మూత్రాశయం ప్రోస్టేటు గ్రంథి సర్జరీలు చేయించుకున్న వారిలో ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. కొన్ని రకాల మందులూ దీనికి కారణం కావచ్చు. ఇమిప్రమైన్‌, ఎఫిడ్రిన్‌, ఫినైల్‌ప్రొపనోలమైన్‌ వంటి మందులతో దీనికి చికిత్స చేస్తారు. వీటితో చాలామందికి సమర్థమైన ఫలితాలు లభిస్తాయి. స్ఖలనం కాకపోవటం, వీర్యం వెనక్కి పోయే సమస్యలు సంతానలేమికి దోహదం చేస్తాయి. అయితే వీర్యం వెనక్కి మళ్లే వారిలో మూత్రాశయం నుంచి వీర్యకణాలు బయటకు తీసి ఐవీఎఫ్‌ వంటివిధానాల ద్వారా స్త్రీయోనిలోకి ప్రవేశపెట్టటం ద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంది.

 • స్ఖలనంలో నొప్పి
కొందరికి స్ఖలన సమయంలో నొప్పి వస్తుంటుంది. రక్తం కూడా పడుతుంది. కొన్ని రకాల వాపులు, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు దీనికి దోహదం చేయొచ్చు. అవన్నీ వ్యాధి సంబంధమైనవే కానీ శృంగార పరమైన స్ఖలన సమస్యలుగా భావించలేం. వీటిని గురించి వైద్యులతో చర్చించటం చాలా అవసరం.


Courtesy with : Dr.Sudhakar Krishna murty , sexual medicne Specialist, Andromeda Andrology Center, panjagutta - Hyd.@Eenadu sukhibhava.

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 14, 2012

Stretch marks , స్ట్రెచ్ మార్క్స్


 • iamge : courtesy with Wikipedia.org/.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stretch marks , స్ట్రెచ్ మార్క్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


లావెక్కే క్రమంలో చర్మం తన ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. (ముఖ్యంగా గర్భవతుల ... అయితే ఒకసారి చర్మంపై పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గిండము కష్టము ..ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే స్ట్రెచ్‌ మార్క్స్‌... మొదటి దశలో పర్పుల్‌, పింక్‌ కలర్‌లో కన్పిస్తాయి.చివరకు తెల్లగా మారుతాయి. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందిపెడతాయి. సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట తొడలు, ఛాతీభాగాలలో ఈ మచ్చలు ఏర్పడతాయి.సాగిన గుర్తులు చర్మంపై ఏ ప్రదేశంలోనైనా ఏర్పడవచ్చు, అయితే అవి ఎక్కువగా కొవ్వు నిల్వ అధికంగా ఉండే భాగాలలో కనిపిస్తాయి. ఉదరం (ప్రత్యేకించి నాభి సమీపంలోని ప్రాంతం), రొమ్ములు, భుజముల పైన, భుజాల క్రింద, వీపు, తొడలు (లోపలి మరియు బయటి ప్రాంతాలు రెండూ), తొంటి, మరియు పిరుదులు అత్యంత సాధారణంగా వ్యాపించే ప్రదేశాలు. వాటి కారణంగా లేదా వాటితో ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదు, మరియు సాధారణంగా పనిచేసి, బాగుచేసుకొనే శరీర సామర్ధ్యానికి హాని కలిగించవు

మాతృత్వం.. ప్రతి మహిళ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది.. తన కడుపున జన్మించే బిడ్డ కోసం దేన్నైనా వదులుకోడానికి తల్లి సిద్ధపడుతుంది. అయితే చాల మంది మహిళలు తమ తొలి కాన్పుతోనే మునపటి వన్నెను కోల్పొయామాని చింతిస్తుంటారు. అయితే పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను పాటించటం వల్ల స్వల్ప వ్యవధిలోనే అమ్మలు వారి టినేజి యువ్వనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చంటున్నారు
బ్యూటీషియన్లు.

కారణాలు

చర్మంపై సాగినగుర్తులు కనబడటానికి అనేక కారణాలు ఉన్నాయి: ప్రసవించిన వెంటనే 324 మంది స్త్రీలపై జరిపిన అధ్యయనం, చిన్న వయసులో తల్లి కావడం, అధిక శరీర బరువు సూచిక, 15 కిలోగ్రాములు (31 పౌండ్ల) కంటే ఎక్కువ బరువు పెరగడం మరియు నవజాత శిశువు యొక్క బరువు అధికంగా ఉండటం గుర్తులు ఏర్పడటానికి విభిన్న స్వతంత్ర కారణాలుగా ఉన్నాయని సూచించింది. కౌమారదశలో ఉన్నవారు తీవ్రమైన గుర్తులు ఏర్పడే హానిని ఎక్కువగా కలిగిఉన్నారు.

వేగంగా పెరిగే చర్మాన్ని నియంత్రణలో ఉంచడానికి అవసరమైన కొలాజెన్ మరియు ఎలాస్టిన్ తంతువులను ఏర్పరచకుండా సాగిన గుర్తులు పెరగడానికి కారణమయ్యే గ్లూకోకోర్టికాయిడ్ హార్మోన్లు చర్మం పైపొరను ప్రభావితం చేస్తాయి. చర్మం సాగుదలతో, ఇది అనుకూల పదార్ధ లేమిని సృష్టించి, దానితో అంతర మరియు బహిశ్చర్మ చిరుగుదలకు దారితీస్తుంది.

దాని శక్తికి మించి చర్మం అధిక సాగుదల బలానికి గురైనపుడు అది చీరుకుపోతుంది. ఆహారం మరియు సాధ్యమైనంతవరకు వ్యాయామం వలెనే, హార్మోన్ల మార్పులు మరియు జన్యువుల ప్రభావం గుర్తులు ఏర్పడటం నుండి చర్మం తట్టుకునే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తాయి.


స్ట్రెచ్ మార్క్స్‌ మటు మాయం కావాలంటే...

* ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిరోజు ఆల్మండ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, కోకోవా బటర్‌లలో ఏదోఒకదానితో పొట్ట చర్మంపై గుండ్రంగా, మృదువుగా రాయాలి.

* డెలివరీ అయ్యాక కూడా స్ట్రెచ్ మార్క్స్ కోసం అందుబాటులో వున్న క్రీమ్స్ రెగ్యులర్‌గా వాడాలి. ఇలా చేస్తే సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

* డెర్మాంబరేషన్ అన్న మెడికల్ విధానం ద్వారా స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు.

* పంచదార, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ క్రీం, అలోవెరాజెల్ వీటిని సమభాగాలుగా కల్పి స్ట్రెచ్ మార్క్స్‌పైన మృదువుగా రాస్తూ వుండాలి. అలా ప్రతిరోజూ చేస్తుంటే క్రమంగా మచ్చలు తొలగిపోతాయి.

* కెమికల్ ఫీలింగ్ విధానాన్ని కూడా స్ట్రెచ్ మార్క్స్ తొలగించేందుకు వాడతారు.

* ఆముదాన్ని క్రమం తప్పకుండా మచ్చలు వున్న చోట రాస్తూ వుండాలి.

* అబ్బామినోప్లాస్టీ అనే వైద్య విధానంలోనూ వీటిని తొలగించుకునేందుకు వీలుంది. ఇది ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేస్తారు.

* క్యాలెందులా ఆయిల్‌తో మచ్చలపై మృదువుగా రోజూ రెండు పూటలా మసాజ్ చేస్తే మంచి ఫలితం వుంటుంది.

* లావెండర్ ఆయిల్‌ను రోజూ మూడు సార్లు మచ్చలపై మర్దనా చేసినా మంచి ఫలితం లభిస్తుంది.

* జింక్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గిస్తాయి.

* కడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలు వేయాలి. నీరు ఎక్కువగా తాగాలి.

* E-two Laser  ట్రీట్-మెంట్  4-5 సిట్టింగ్ అవసరముంటుంది. 
 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, May 13, 2012

ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం పది సూత్రాలు,Ten piont formula for Healty child.ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యవంతమైన బిడ్డకోసము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

1* ఒకరు లేక ఇద్దరు చాలు అనుకోండి. బిడ్డ బిడ్డకు కనీసం రెండేళ్లు ఎడం ఉంచండి. ఆడ పిల్లలకు 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయ్యండి. 20 నుండి 30 సంవత్సరాల వయసు గర్భధారణకు అనువైన సమయం.

2* గర్భిణీ స్త్రీ క్రమం తప్పకుండా ఆరోగ్య కార్యకర్తతో పరీక్షలు చేయించుకోవాలి. ఆసుపత్రి ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బిడ్డకు ఆరు నెలల వయసు పూర్తయ్యే వరకూ కేవలం తల్లిపాలు పట్టాలి. 6వ నెలలో ఇంటిలో తయారు చేసిన అదనపు ఆహారం మొదలు పెట్టాలి.

3* మూడేళ్లలోపు పిల్లలకు సుష్టిగా ఆహారం పెట్టాలి. నూనెలు, నెయ్యి, కూరగాయలు, కలిసిన ఆహారం రోజుకు ఐదారుసార్లు ఇవ్వాలి.

4* పిల్లకు విరేచనాల వ్యాధి వచ్చినప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా ఇవ్వాలి.

5పిల్లలకు సకాలంలో అన్ని రకాల టీకాలు వేయించాలి.

6* సాధారణ జలుబు, దగ్గులకు ఎలాంటి మందులు వాడనక్కరలేదు. శ్వాసపీల్చుకోవడం ఇబ్బంది అయితే వైద్య సలహా పొందాలి.

7* పిల్లలందరికీ కాచి చల్లార్చిన నీళ్లు తాపాలి.

8మలవిసర్జన తర్వాత ఆహారం తినే ముందు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడగాలి.

9* పిల్లలు ఏ జబ్బునుంచైనా నివారణ పొందిన తర్వాత రోజుకు ఒక మారు ఆహారం అదనంగా పెట్టాలి.

10* పిల్లలను తరచుగా తూకం వేయించాలి. ఈ సౌకర్యం అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి పొందండి. ఇందువల్ల ఆహారలోపాన్ని ముందే గుర్తించొచ్చు.


 • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

మెనోపాజ్‌ మహిళల్లో హృద్రోగాలు , Heart diseases in Women after menopauseఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో హృద్రోగాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషులతో పోలిస్తే.. మహిళల్లో హృద్రోగాలు తక్కువ. కానీ ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడా ప్రమాదం మహిళల్లోనూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతోన్న జీవనవిధానం.. క్రమపద్ధతిలేని నిద్రాహారనియమాలు.. పనుల ఒత్తిళ్లు.. వంటివన్నీ ఆ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఫలితంగానే గుండెజబ్బులు.
ఉన్నట్టుండి గుండెలో అసౌకర్యంగా అనిపించడంతో అప్పటికప్పుడు ఆసుపత్రికి పరుగెత్తింది యాభైఆరేళ్ల తులసి. వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి గుండె రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు నిర్థారించి చికిత్స చేశారు. ఈ రోజుల్లో రక్తపోటు, మధుమేహం, మరికొన్ని అనారోగ్యాల్లా మహిళల్లోనూ హృద్రోగాలు సర్వసాధారణమయ్యాయి. వాస్తవానికి వివిధ జబ్బులతో మరణించే మహిళల్లో గుండె రక్తనాళాలకు సంబంధించిన అనారోగ్యం కూడా ప్రధాన కారణమని అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు గుండెజబ్బులతోనే మరణిస్తున్నారు. మరో అధ్యయనం ప్రకారం.. సమస్యని సరిగ్గా గుర్తించకపోవడం, లేదా నిర్ధారణ కాకపోవడం వల్ల మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. మన దేశంలో కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నతహోదాలో సగటున నలభై ఏళ్ల వయసుండే స్త్రీలపై ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఏం చెబుతోందంటే.. దాదాపు నలభైనాలుగు శాతం మంది మెటబాలిక్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అది క్రమంగా హృద్రోగాలకు దారితీస్తుంది.

మధుమేహం.. అప్రమత్తం
మహిళల్లో వచ్చే హృద్రోగాల్లో గుండెకు రక్తసరఫరా అందించే రక్తనాళాలు సన్నగా కావడం లేదా మూసుకుపోవడంతో సమస్య ఎదురవుతుంది. కొరొనరీ ఆర్టరీ డిసీజ్‌గా పేర్కొనే ఈ ప్రమాదమే గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యంగా దాడిచేస్తుంది. మెనోపాజ్‌ తరవాత మాత్రం ఇది ప్రమాదంగా మారవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కొన్నిసార్లు అంతకన్నా ముందే కూడా ఎదురుకావచ్చు. ప్రమాద సూచికలు గమనిస్తే.. వయసు, కుటుంబ చరిత్ర, అధికరక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, స్థూలకాయం, క్రమపద్ధతిలేని జీవనవిధానం, ఒత్తిడి లాంటివన్నీ గుండెజబ్బులకు దారితీసే కారణాలే. వయసును బట్టి ప్రమాదం పెరుగుతుందని తెలుసుకోవాలి. మెనోపాజ్‌ తరవాత గుండె సమస్యలు ఎక్కువవుతాయి. దానికీ కారణం లేకపోలేదు. మలి వయసు వరకు స్త్రీ శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ హార్మోను గుండెకు, రక్తనాళాలకు రక్షణగా నిలుస్తుంది. అందుకే పురుషులతో పోలిస్తే.. నెలసరి వస్తోన్న మహిళల్లో గుండె రక్తనాళాలు మూసుకుపోయే సమస్య పెద్దగా కనిపించదు. అయితే మధుమేహం ఉన్న స్త్రీలలో మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా హృద్రోగాలు ఎదురుకావచ్చని మరవకూడదు.

మెనోపాజ్‌ తరవాత శరీరానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ తగ్గి చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరాయిడ్లు పెరుగుతాయి. వయసుతోపాటు అధికరక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ప్రమాదాన్ని సూచిస్తాయి. అయితే మలివయసులో హార్మోన్లు తీసుకుంటే ఆ ప్రమాదం ఉండదనుకుంటాం. అందులో వాస్తవం లేదు.

సమయానికి స్పందిస్తే.. తప్పే ముప్పు
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. ఇక, గుండెపోటు లక్షణాలంటే.. ఛాతిలో వచ్చే నొప్పి గురించే ఆలోచిస్తాం. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆ లక్షణాలు కొద్దిగా వేరుగానే ఉంటాయి. గుండె మధ్యభాగంలో మెలిపెట్టినట్లు మొదలయ్యే నొప్పి నెమ్మదిగా మెడ, లేదా భుజం, దవడ వరకు చేరడం, అదే సమయంలో విపరీతమైన చెమట, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం వంటి సమస్యలు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని క్లాసికల్‌ సింప్టమ్స్‌ అంటాం. అయితే యాభైశాతం మహిళల్లో అవే కనిపించాలని లేదు. ఏ మాత్రం ఛాతినొప్పి లేకపోయినా తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీసుకున్న ఆహారం జీర్ణం కాలేదనే భావన, పైపొట్టలో అసౌకర్యం, కేవలం దవడ దగ్గరే నొప్పి, గొంతు లేదా భుజం నొప్పి.. వంటివన్నీ కనిపిస్తాయి. దాంతో చాలామంది పై లక్షణాలను తేలిగ్గా తీసుకుంటారు. కానీ అవి గుండెనొప్పిని సూచించవచ్చు. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రమాదమే. అందుకే సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి.

నడకతో నిండునూరేళ్లు
వయసుతో నిమిత్తం లేకుండా ముందు నుంచీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే హృద్రోగాలను చాలామటుకు అదుపులో ఉంచవచ్చు.
* ప్రతిరోజు కనీసం అరగంట నడక లేదా పరుగు లాంటి ఎరోబిక్‌ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదుసార్లు ఈ వ్యాయామాలు చేసినా గుండెజబ్బుల ప్రమాదాన్ని చాలావరకు నివారించవచ్చు.

* ఆహారంలో ఉప్పుశాతాన్ని పరిమితం చేయాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్‌ , ట్రాన్స్‌ ఫ్యాట్లున్న ఆహారాన్ని తగ్గించాలి. మాంసకృత్తుల కోసం మాంసం, చేపలు, పాల ఉత్పత్తుల్ని ఎంచుకుంటాం. కానీ వాటిల్లో కొవ్వుశాతం అధికం. బదులుగా వెన్నలేని పాల ఉత్పత్తులు, స్కిన్‌లెస్‌ చికెన్‌ లాంటివి ఎంచుకోవాలి. సాల్మన్‌ వంటి చేపల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి.. ఇవి ట్రైగ్లిసరాయిడ్ల స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. ఫలితంగా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలు తగ్గుతాయి. చిక్కుడుజాతి గింజల్లోనూ కొవ్వు, కొలెస్ట్రాల్‌ శాతం పరిమితంగా ఉంటుంది. మాంసకృత్తులు అందించే మరో చక్కని ప్రత్యామ్నాయం సోయా. రాగి, జొన్నల నుంచి సమృద్ధిగా లభించే పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గిస్తుంది. అదే సమయంలో విటమిన్లు, ఖనిజలవణాలు వంటి పోషకాలు అందుతాయి.

* ఒత్తిడిని సాధ్యమైనంతవరకు తగ్గించాలి. రోజూ కనీసం పదినిమిషాలైనా ధ్యానం చేయాలి.

* నూనె పదార్థాలను పరిమితం చేయాలి. ఒక వ్యక్తి నెలలో అరలీటరుకు మించి నూనె వాడకుండా చూసుకోవాలి. కొన్ని పదార్థాలకు నూనె చెంచాల చొప్పున వేయడం కన్నా స్ప్రే చేయాలి. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. పదార్థాలను ఉడికించి తాలింపు వేసుకోవడం వల్ల నూనె వాడకాన్ని తగ్గించవచ్చు.

* వయసును బట్టి వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.

* గుండెజబ్బులకు దారితీసే అంశాలపైనా దృష్టిసారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహం లాంటివి ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. వాటి లక్షణాలు పైకి కనిపించవు కానీ పరోక్షంగా గుండెజబ్బుకు కారణమవుతాయి. కాబట్టి ఆ సమస్యల్ని అదుపులో ఉంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించగలిగితే గుండెజబ్బుల వల్ల వచ్చే మరణాలను ఎనభైశాతం దాకా నివారించవచ్చు.

-- హృద్రోగ నిపుణులు డాక్టర్‌ రమేష్‌ గూడపాటి @ ఈనాడు సుఖీభవ .

 • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, May 12, 2012

వాంతులు-విరేచనాలు,Diarrhoea and Vomitings,D and V
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వాంతులు-విరేచనాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...కలుషితమైన ఆహార పదార్థాలు భుజించడం వల్ల గానీ, ఆహార పదార్థాల అలర్జీ వల్లగానీ, అతిసార, కలరా, షీగెల్లోసిస్‌, యెల్లో ఫీవర్‌ లాంటి జబ్బుల్లోను వాంతులు, విరేచనాలు వస్తుం టాయి. వాంతులు విరేచ నాలతో శరీరంలోని నీరు, లవణాలు నష్టపో వడంతో డీహై డ్రే షన్‌ ఏర్పడుతుంది.
కలుషిత ఆహారం వల్ల కలిగే దుష్పరిణామాలతో వాంతులు, విరేచనాలు లేదా ఈ రెండూ సంభవించవచ్చు. కడుపునొప్పి కూడా రావచ్చు. వాంతులు, విరేచనాలు అవుతుంటే శరీరంలోని ఖనిజలవణాలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి .

 • కారణాలు :
విరేచనాలు ఎంత సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యో కొన్నిసార్లు అంత క్లిష్టంగా కూడా పరిణమిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా విరేచనాలు వేధిస్తున్నప్పుడు శాశ్వత పరిష్కారం మీద దృష్టిపెట్టాలి.

మలవిసర్జన ఎక్కువసార్లు అవుతున్నా, మలం పలచబడినా (అవి పెద్ద విరేచనాలు కావచ్చు, చిన్నవీ కావచ్చు) విరేచనాలు అవుతున్నాయని వ్యవహరిస్తాం. కొన్ని సందర్భాల్లో విరేచనాలు, వాంతులు కలిసి కూడా అవుతుంటాయి.

పేగుల్లో పోషకపదార్ధాలు, లవణాలు జీర్ణం కాకపోయినా లేక లవణాలు, నీరు పేగులలోకి అధికంగా వచ్చి చేరినా విరేచనాలు అవుతుంటాయి. సాధారణంగా విరేచనాలను- పెద్ద విరేచనాలు, చిన్న విరేచనాలని రెండు తరగతులుగా వర్గీకరించవచ్చు. పెద్దపెద్ద విరేచనాలు చాలావరకూ నీళ్ల విరేచనాల రూపంలోనే ఉంటాయి. ఇవి పెద్ద పేగులోకి ద్రవ పదార్ధాలు ఎక్కువగా వచ్చి చేరిపోవటం మూలంగా సంభవిస్తుంటాయి. ఇక చిన్న విరేచనాలు పేగుల గోడల మీద పుండ్ల వంటివి పడటం మూలంగా అవుతుంటాయి. వీటిలో చీము, రక్తం లాంటివీ కనిపిస్తుంటాయి.

పెద్ద విరేచనాలను 'ఆస్మాటిక్‌ డయేరియా' అని వ్యవహరిస్తుంటారు. ఇవి చాలా వరకూ తరుణ (అక్యూట్‌) వ్యాధులై ఉంటాయి. వీటికి ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీరు వంటి బాహ్య అంశాలే కారణమవుతుంటాయి.

చిన్న విరేచనాలు చాలా వరకూ పేగుల్లో వ్యాధుల మూలంగా సంప్రాప్తిస్తుంటాయి. క్రోన్స్‌ వ్యాధి, అల్సరేటివ్‌ కోలైటిస్‌, అమీబియాసిస్... వంటివి ఈ కోవకు చెందినవే. ఈ రోగులకు ఆసనంలో నొప్పి, బట్టలకు మలం మరకలు అంటటం, రాత్రిళ్లు మలవిసర్జన కోసం లేవాల్సి వస్తుండటం కూడా జరగొచ్చు. ఈ తరహా వ్యాధులను దీర్ఘ వ్యాధులుగా పరిగణిస్తారు. ఇలా అంతర్గత కారణాల మూలంగా సంభవించే వ్యాధులను దీర్ఘవ్యాధులుగా గుర్తిస్తుంది వైద్య విధానం. ఈ రోగులలో రోగ లక్షణాలేకాక రోగి లక్షణాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. రోగి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే ఈ వ్యాధులను పూర్తిగా నయం చేయటం సాధ్యపడుతుంది.

 • డీ హైడ్రేషన్‌ లక్షణాలు

విపరీతమైన దాహం, నోరు ఎండిపోవడం, చర్మం పొడి బారడం, కళ్లు గుంతలు పడడం, మూత్ర విసర్జన తక్కువ కావడం, అలసట, తలనొప్పి, తలతిరగడం, కంటిచూపు మందగించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, కండరాలు పట్టేయడం కనిపిస్తాయి. కొన్ని సార్లు మృత్యువాత పడే అవకాశాలున్నాయి.

 • చికిత్స
వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు మన జీర్ణమండలము సరియైన రీతిలో పనిచేసే పరిస్థితిలో ఉండదు . కావున దానికి విశ్రాంతి అవసరము . విరోవనాలు + వాంతులు అవుతున్న రోగికి .... డీ హైడ్రేషన్‌ తీవ్రతను బట్టి మూడు రకాలు గా విభజించారు . 1.తక్కువ తీవ్రత(mild),2.ఒక మోస్తరు తీవ్రత (moderate) , ఎక్కువ తీవ్రత (severe) గలవి గా చెప్పబడినవి .

సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .

మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.

మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....

 • * రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్‌' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
 • * కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
 • * వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.

జాగ్రత్తలు--
 • తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
 • ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
 • ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
 • తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 • కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
 • వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.

వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

 • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, May 11, 2012

లివర్ క్యాన్సర్,Liver Cancer

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లివర్ క్యాన్సర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • -హెపటో లేదా హెపాటిక్ అని అంటుండడం వింటూనే ఉంటాం. దీనికి అర్థం కాలేయం అని జీవవూపక్షికియలలో కీలక పాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తించి పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. 1000కి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్ద (చర్మము తరువాత) అవయవమైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా కూడా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజించబడి ఉండే కాలేయం దాదపు ఒకటిన్నర కిలోల వరకు బరువు ఉంటుంది.
మనదేశంలో ప్రతి 20 మందిలో ఒకరు జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యకు లోనవుతున్నారు. గ్యాస్‌ సమస్య మొదలుకొని పెద్దపేగు క్యాన్సర్‌... పొట్ట ఇలా జబ్బుల పుట్టగా మారుతున్నది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో శుభ్రత పాటించకపోవడం, మన జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. చాలా మందిలో నెలలో ఒకటి, రెండు సార్లయినా పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గ్యాస్‌, కడుపులో నొప్పి, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, కడుపులో మంటలు ఈ సమస్యలు ఎక్కువమందిని వేధిస్తాయి. పొట్టలో కాస్త ఇబ్బంది కనిపించగానే కొందరు తమకు తోచిన టాబ్లెట్‌ వేసుకుంటారు. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన శాశ్వత పరిష్కారం కావు.

విషతుల్యమైన పదార్థాల వల్ల కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, స్మోకింగ్ వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దానిని హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్‌లు ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి, వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్‌లు సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. హెపటైటిస్‌-బి పాజిటివ్ ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ వేయిస్తే చాలా మంచిది. ఆకలి తగ్గటం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నపుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం వంటి సొంత వైద్యాలు చేసుకోకుండా కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్‌ఫెక్షన్స్ ఫ్యాటి లివర్, లివర్ వెబ్‌సెస్, విల్సన్ డిసీజ్, గిల్‌బర్డ్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి, సి, వైరస్ కలుగజేసే ఇన్‌ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తర్వాత కాలేయనాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం(సిరోసిస్) తర్వాత క్యాన్సర్‌కు దారితీయటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్-బి, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లివర్ క్యాన్సర్స్ ఎక్కువే. లివర్ క్యాన్సర్‌ లో హెపటోసెల్యులార్ కార్సినోమా, మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలుంటాయి. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్లు, ఇలా ఏ క్యాన్సర్స్ అయినా కాలేయానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. లేటుగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు.
 • -పొట్ట సంబంధిత క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు తర్వాత లివర్ క్యాన్సర్లు ఎక్కువ. ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్ -బి, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో ఈ క్యాన్సర్ తక్కువే అయినా హెపటైటిస్ - సి, వైరస్‌వల్ల , అధికబరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల ఈ క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య ఈ దేశాలలో కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా వంటి దేశాలలో స్థిరపడిన ఆసియా దేశస్థులలో హెపటైటిస్-బి ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. పుట్టినపుడే ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నా 30, 40 ఏళ్లలో లక్షణాలు బయటపడడం, క్యాన్సర్‌కు గురవటం జరుగుతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, హెపటైటిస్-బి పాజిటివ్‌కు ఆల్కహాల్ తోడయితే త్వరగా ముదిరిపోవడం, చికిత్సకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది.
చికిత్స :
 • కాలేయానికి వ్యాధి వచ్చిన 60 శాతం వరకు ప్రమాద విషయం తెలియదని, కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్‌ ‘బి’ లేక ‘సి’ లతో బాధపడుతున్న వారు అరువందల(600) మిలియన్ల దాకా ఉన్నారు. హెపటైటిస్‌ బి లేక సి తో బాధపడుతూ మరణిస్తున్న వారు ప్రతి సంవత్సరం 105 మిలియన్ల దాకా ఉన్నారు. అవగాహన కోసము ప్రతి సంవత్సరమూ 19-ఏప్రిల్ న ''వరల్డ్ లివర్ డే'' జరుపుకుంటున్నాం.


లివర్‌ దెబ్బతిన్నప్పుడు సాధారణంగా జాండిస్‌ వస్తుంది. లివర్ వ్యాధితో ఉన్నవారు బాగా విశ్రాంతి తీసుకోవాలి . ఎక్కువగా కాచి చల్లారిన లేదా మినరల్ వాటర్ .. నీరు త్రాగాలి. Liv-52 మాత్రలు రోజుకి 2 ఉదయము రెండు రాత్రి వాడుతూ ఉండాలి . జీర్ణశక్తి కి Digeplex (with sorbitol) వాడుతూ ఉండాలి. బి.కాంప్లెక్ష్ మాత్రలు రెగ్యులర్ గా తింటూ ఉండాలి. కొంతమంది వైద్యులు silmarin తో తయారుచేసిన మందులులు వాడమంటారు . Ursodeoxycholic acid, UDCA-(ursodiol) ని కొందరు డాక్టర్లు వాడమని సలహా ఇస్తారు . మంచిదే. హెపటైటిస్ -బి /సి కోసము యాంటి వైరల్ ప్రిపరేషన్స్ వాడాలి. సిర్రోసిస్ తో బాదపడుతున్నవారికి కాళ్ళు వాపులు కోసము తక్కువ మోతాదు లో Diuretics వాడాలి . ఏ మందులు వాడినా వైద్యుల సలహామేరకే తీసుకోవాలి.

 • సర్జరీ : శ్యాప్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, స్ప్లిట్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఆక్సిలరి లివర్ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి .
--Cortesy with Dr.Mohanavamsy ,chief oncologist ,Omega hos.Hyd.@Namste Telangana paper.
 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 9, 2012

Medicine update-జీవగడియారం గుండెలయకు ఆధారం,Cardiac Rythym depends on bio-clockఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జీవగడియారం గుండెలయకు ఆధారం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మనకు చీకటి పడగానే నిద్ర ముంచుకురావటం, తెల్లారగానే మెలకువ రావటం సహజమే. ఇలా వెలుతురును బట్టి మనలోని జీవగడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) శారీరక, మానసిక, ప్రవర్తన మార్పులను కలిగిస్తుంటుంది. అంతేకాదు దీనికి గుండెపోటుతోనూ సంబంధం ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గుండెపోటు రావటానికి గుండెలయ దెబ్బతినటమే (అరిత్మియా) ప్రధాన కారణమవుతోంది. గుండెలయ తప్పటమనేది సాధారణంగా తెల్లవారుజాముననే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చాలాకాలం కిందటే గుర్తించారు. మరికొందరిలో ఇది సాయంత్రం వేళల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ ఇందుకు ఏయే అంశాలు దోహదం చేస్తున్నాయో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఇది క్రపెల్‌-లైక్‌ ఫ్యాక్టర్‌ 15 (కేఎల్‌ఎఫ్‌-15) అనే ప్రోటీన్‌తో ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ కేఎల్‌ఎఫ్‌-15 జన్యువు సంకేతాలతో ఉత్పత్తి అవుతుంది. ఇది జీవగడియారంతో అనుసంధానమై గుండెలోని విద్యుత్‌ ప్రసారాన్ని నియంత్రిస్తున్నట్టు తాజాగా కనుగొన్నారు. కేఎల్‌ఎఫ్‌-15 మరీ ఎక్కువైనా, తక్కువైనా గుండెలో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది గుండెలయ దెబ్బతినటానికి కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు గుండె వైఫల్యం బారినపడ్డవారిలో కేఎల్‌ఎఫ్‌-15 లోపం ఉంటుండగా.. ఇది మరీ ఎక్కువగా గలవారిలో గుండె కొట్టుకునే వ్యవస్థలో మార్పులు కనబడుతున్నాయి. గుండెపోటు మరణాలను తగ్గించేలా కొత్త చికిత్సలు రూపొందించటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె వైఫల్యం బారినపడ్డవారికి మందులతో కేఎల్‌ఎఫ్‌-15 మోతాదు పెరిగేలా చేస్తే.. గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని ఆశిస్తున్నారు.

Source : Medical updates.com/
 • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 8, 2012

Chemical peels-awareness,కెమికల్‌ పీల్స్‌ - అవగాహన

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కెమికల్‌ పీల్స్‌ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చర్మం..మన శారీరక సంరక్షణకే కాదు.. మన సౌందర్యానికీ అదే చిరునామా. అందుకే చర్మం పట్ల ప్రతి ఒక్కరికీ అంత శ్రద్ధ! చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్‌ ప్రయత్నాల వరకూ రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అయితే మార్గం ఏదైనా.. అది సశాస్త్రీయమైనదైతే ఇబ్బందులుండవు. వైద్యపరంగా సురక్షితమని నిరూపణ ఐన వాటినే ఆశ్రయిస్తే తర్వాత బాధలు పడాల్సిన పని ఉండదు. ముఖ సౌందర్యాన్ని కాంతివంతం చేసేందుకు ఇటీవలి కాలంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన 'కెమికల్‌ పీల్‌' విధానానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ రసాయనాలు చాలా శక్తిమంతమైనవి. కాబట్టి వీటితో వచ్చీరాని ప్రయోగాలు చేస్తే విపరిణామాలు తథ్యం. వీటిని శాస్త్రీయంగా, అనుభవజ్ఞుల చేత చేయించుకోవటమే ఉత్తమం.

మన చర్మం.. పైకి కనిపించేదంతా పాతదే! ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. కింది పొరల్లో నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా చర్మకణాలు పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టుకొస్తున్నకొద్దీ.. పైచర్మం మనకు తెలియకుండానే పొట్టుపొట్టుగా రాలిపోతుంటుంది. ఇది నిరంతరం జరుగుతుండే ప్రక్రియే. సరిగ్గా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే.. పైచర్మం పైపైపొరలను తొలగించి.. చర్మానికి చక్కటి కొత్త నిగారింపును తెచ్చేందుకు వినియోగంలోకి దాదాపు వందేళ్ల క్రితమే వాడకంలోకి వచ్చిన ప్రక్రియ కెమికల్‌ పీల్స్‌! వైద్యరంగం కూడా దీనిపై రకరకాల అధ్యయనాలు చేసి.. సురక్షిత విధానాలను రూపొందించటంతో ఇటీవలి కాలంలో ఇది మరింత ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇలా చర్మం పైపొరలను తొలగించేందుకు వాడేవన్నీ కూడా రకరకాల సహజసిద్ధమైన పండ్లు, పదార్ధాల నుంచి తీసే ఆమ్లాలే. అయితే ఇవి చాలా శక్తిమంతమైనవి. అందుకే వీటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం.

 • 'పీల్స్‌' ఎందుకు?
వయసుతో గానీ, మొటిమల వల్లగానీ, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల కానీ చర్మంలో మార్పులొస్తుంటాయి. కొన్నిసార్లు బాగా ఎండలో తిరిగినా కూడా ముఖం నల్లబడటం, ముసలితనం ఛాయలు వస్తాయి. ఈ మార్పులు ప్రధానంగా మన చర్మం మీది పైపొరల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. ఇలాంటి మార్పులను తొలగించి, చర్మానికి తిరిగి కొత్త నిగారింపు, మంచి ఛాయ తీసుకురావటానికి 'కెమికల్‌ పీల్స్‌' ఉపయోగపడతాయి. వీటితో మన చర్మం పైపొర (ఎపిడెర్మిస్‌)లో వచ్చే మార్పులను, అలాగే దాని కింది పొర- డెర్మిస్‌లో తలెత్తే మార్పులను కూడా తొలగించవచ్చు.

 • వందేళ్ల చరిత్ర
కెమికల్‌ పీల్స్‌కు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ సౌందర్యరాశి క్లియోపాత్ర (ఈజిప్టు) స్నానం చేయటానికి అప్పట్లో 'సోర్‌ మిల్క్‌' (విరిగిన పాలు) ఉపయోగించేదని చెబుతుంటారు. ఒక రకంగా దీన్ని 'పీలింగ్‌' అనుకోవచ్చు. ఈ సోర్‌ మిల్క్‌లో లాక్టిక్‌ ఆమ్లం ఉంటుంది. అందువల్ల క్లియోపాత్ర స్నానం చేసిన తర్వాత ఆమె చర్మం నిగనిగలాడినట్టు కనిపించేది. ఫ్రెంచి వాళ్లు కూడా వైన్‌ సీసాల అడుగున పేరుకునే పాత వైన్‌ని చర్మంపై రాసుకునేవారు. ఇందులో 'టార్టారిక్‌ ఆమ్లం' చర్మం పైపొరను తీసేసేందుకు ఉపయోగపడేది. ఇక ఆధునిక వైద్యంలోకి వస్తే- 1882లో పాల్‌ గెర్సన్‌ ఉన్నా అనే జర్మన్‌ వైద్యుడు సాల్సిలిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌, ట్రైక్లోరో అసిటిక్‌ యాసిడ్‌, ఫైటిక్‌ యాసిడ్‌ వంటి వాటిని పీలర్లుగా ఉపయోగించటం ఆరంభించారు. అప్పట్నుంచి క్రమంగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది. ఆధునిక కాలంలో వీటిని కచ్చితంగా ఎంత మోతాదులో, ఎంత లోతు వరకూ చెయ్యచ్చన్నదంతా శాస్త్రీయంగా ప్రామాణీకరించటంతో వీటి వాడకం బాగా పెరిగింది.

 • ఇవెలా పని చేస్తాయి?
మన చర్మంలో ప్రధానంగా రెండు పొరలు ఉంటాయి. పైపొరను ఎపిడెర్మిస్‌ అంటారు, కింది పొరను డెర్మిస్‌ అంటారు. ఎపిడెర్మిస్‌లో కూడా మళ్లీ నాలుగు సూక్ష్మపొరలుంటాయి. వీటిలో పైపొరను 'స్ట్రేటమ్‌ కార్నియమ్‌' అంటారు. నిజానికిది మృత పొర (డెడ్‌ లేయర్‌). మనకు పైకి కనిపించే చర్మం ఇదే. మనకు తెలియకుండానే ఇది నిరంతరం ఊడిపోతుంటుంది. (వాతావరణంలో తేమ తగ్గిపోయే చలికాలంలో పొట్టులా ఊడిపోయేది ఈ పొరే). దీని స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. ఎపిడెర్మిస్‌ అడుగుభాగాన ఉండే 'స్ట్రేటమ్‌ బేసల్‌' నుంచి కొత్త చర్మ కణాలు నిరంతరం పుట్టుకొస్తుంటాయి. దీంతో పాత చర్మం పోతూ కొత్త చర్మం వస్తుంటుంది. కెమికల్‌ పీల్స్‌ ఈ పై పొరను తొలగించి మచ్చలు, గుంతలను తొలగిస్తాయి. ఇవి చర్మం పొరను తొలగిస్తూ కణాల్లోని ప్రోటీన్లను ఓ మోస్తరు స్థాయిలో దెబ్బతీస్తాయి. దీంతో అక్కడి చర్మం చక్కగా తనను తాను పునరుద్ధరించుకుంటుంది. ముడతలు, నలుపు మచ్చలు, మొటిమల కారణంగా ఏర్పడే గుంతల వంటివన్నీ కూడా చాలా వరకూ ఈ పైపొరల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ పైపొరలు తొలగిపోయేలా చేసి.. మచ్చలు, గంతల వంటివన్నీ తొలగిపోయేలా చేయటం 'కెమికల్‌ పీలింగ్‌' లక్ష్యం. కెమికల్‌ పీల్‌ తొలగించిన పొర స్థానంలోకి 48 గంటల్లో కొత్త కణాలు వచ్చి చేరతాయి. క్రమేపీ కొత్తపొర ఏర్పడుతుంది. అక్కడ రక్తనాళాలు చురుకుగా మారి చర్మానికి రక్త సరఫరా మెరుగవుతుంది.

ఇక మన చర్మం లోపలి పొరల అడుగున చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచే 'కొల్లాజెన్‌ ఫైబర్స్‌', ఎలాస్టిక్‌ ఫైబర్స్‌ వంటివి ఉంటాయి. సాధారణంగా యవ్వన దశలో ఈ ఫైబర్లన్నీ సమాంతరంగా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి అడ్డదిడ్డంగా అవుతాయి. దీంతో చర్మం వదులు కావటం, ముడతలు పడటం వంటి మార్పులు కనిపిస్తాయి. మనం పీల్స్‌తో పైపొరను తొలగించిన తర్వాత ఇవి తిరిగి సద్దుకుంటాయి. నాలుగైదు నెలల్లో చర్మం బిగుతుగా అవుతుంది. ముడతల వంటివి తగ్గి, ముఖంలో కొత్త కళ, కాంతి వస్తాయి.

 • పీల్స్‌లో వాడేవేమిటి?
వివిధ రకాల ప్రకృతి సిద్ధమైన పదార్ధాలు, పండ్ల నుంచి తీసే ఆమ్లాలనే పీల్స్‌గా వాడతారు. వీటిని 'ఫ్రూట్‌ యాసిడ్లు' లేదా 'ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్‌'.. అంటారు. ఉదాహరణకు గ్త్లెకాలిక్‌ యాసిడ్‌ అన్నది చెరుకు నుంచి తీస్తారు. లాక్టిక్‌ ఆమ్లం పాల నుంచి గ్రహిస్తారు, మాండలిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండ్ల నుంచి వస్తుంది. సిట్రిక్‌ ఆమ్లం పుల్లటి పండ్ల నుంచి వస్తుంది. అయితే ఇవి పండ్ల నుంచి తీసేవే అయినా వీటిని శాస్త్రీయంగా తీసి, శుద్ధిచేసి, మోతాదులు ప్రామాణీకరించి వీటినీ మందుల్లాగానే తయారు చేస్తారు. కాబట్టి వీటికి మూలం పండ్లే అయినా.. మనం నేరుగా పండ్ల రసాలను వాడితే ఇంత సమర్థంగా పనిచేయవు. శాల్సిలిక్‌ ఆమ్లం, బీటాహైడ్రాలిక్‌ ఆమ్లం, ట్రైక్లోరో అసిటిక్‌ ఆమ్లం, ఆల్ఫా కీటో ఆసిడ్స్‌.. ఇవన్నీ వివిధ శాతాల్లో, మోతాదుల్లో లభిస్తాయి. జస్నర్‌ సొల్యూషన్‌, ఎల్లోపీల్‌ వంటివి వంటివి వివిధ ఆమ్లాల మిశ్రమాలు.

 • పీల్స్‌ ఎవరికి?
* హైపర్‌ పిగ్మెంటేషన్‌.. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అక్కడంతా నల్లగా అవుతుంది. అలాంటివాటికి ఉపయోగపడుతుంది.

* పొగలోకి, ఎండలోకి వెళ్లినవారికి పైచర్మం కమిలినట్లుగా నల్లగా తయారవుతుంది(ట్యానింగ్‌). వీరికి పీల్స్‌ ఉపయోగపడతాయి.

* ఎండలోకి వెళితే ముఖం మీద ఒకరకమైన కాఫీపొడిరంగు మచ్చలు (ఫ్రెకిల్స్‌, లెంటిజెన్స్‌ మొ||) వస్తాయి. వీటిని తొలగించటానికి ఉపయోగపడుతుంది.

* మొటిమలు.. చర్మం జిడ్డుగా ఉండే వారికి మొటిమలు ఎక్కువ. ఇలాంటి వారికి శాల్సిలిక్‌ యాసిడ్‌ పీల్స్‌ బాగా ఉపయోగపడతాయి. అయితే మొటిమలు బాగా ఉద్ధృతంగా ఉన్నప్పుడు మొటిమలకు చికిత్స తీసుకుంటూ దాంతో పాటే ఈ పీల్స్‌ చేయించుకోవచ్చు.

* గుంటలు.. మొటిమలు వచ్చి తగ్గిపోయాక అక్కడ మచ్చలు, గుంతలు ఏర్పడొచ్చు. అలాగే మొటిమలు గిల్లటం వల్ల కూడా మచ్చలు వస్తాయి. ఇక ఆటలమ్మ (పొంగు) వచ్చాక మచ్చలు కనబడొచ్చు. ఇలాంటి మచ్చలు, గుంటలు తొలగించటానికి పీల్స్‌ ఉపయోగపడతాయి.

* వృత్తి వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల ముఖానికి ముడతలు వచ్చి, వయసు మీదపడిన భావన కలుగుతుంటుంది. (ఫోటో ఏజింగ్‌). దీన్ని కూడా కెమికల్‌ పీల్స్‌తో బాగా తగ్గించుకోవచ్చు.

* కొందరికి ముఖంపై మంగు మచ్చలు (మెలాస్మా) వేదనకు గురి చేస్తుంటాయి. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఈ మంగు మచ్చలు రావొచ్చు. ఇవి అంత ప్రస్ఫుటంగా కనబడకుండా తగ్గించేందుకు కూడా పీల్స్‌ ఉపయోగపడతాయి.

* కొందరికి చెంపల మీద స్వేద రంధ్రాల వంటివి పెద్దపెద్దగా కనబడుతుంటాయి (ఓపెన్‌ పోర్స్‌). వీటిని ఇబ్బందిగా భావించేవారు పీల్స్‌లో తొలగింపజేసుకోవచ్చు.

లోతు కూడా ప్రధానమే!
సమస్యను బట్టి, పైచర్మాన్ని ఎంత లోతు వరకూ తొలగించాలన్నదాన్ని బట్టి ఏ రకం పీల్‌ వాడాలి, దాన్ని కూడా ఎంత గాఢతలో వాడాలన్నది వైద్యులు నిర్ధారిస్తారు. ఎండలో తిరిగి నల్లబడటం వంటివాటికి పైపైన పొరలు తొలగిస్తే చాలు.. దీనికి శాల్సిలిక్‌ ఆమ్లం వంటివి, 30, 40 శాతాల్లో వాడినా సరిపోతుంది. ట్రైక్లోరో ఎసిటిక్‌ ఆమ్లం వంటివీ ఉపయోగపడతాయి. మరీ లోతుగా వెళ్లేందుకు (డీప్‌ పీల్స్‌) కోసం ఫీనాల్‌ 88% వరకూ వాడతారు.

ఎక్కువగా ఆశించ కూడదు!
ప్రంపచ వ్యాప్తంగా ప్రజల చర్మాలను సాధారణంగా 6 రకాలుగా వర్గీకరించారు. ఇందులో మన భారతీయుల చర్మం 4వ రకం. కాస్త దక్షిణాదికి వచ్చిన కొద్దీ కొద్దిగా నలుపుదనం పెరుగుతూ 4 నుంచి 5వ రకం వరకూ వెళుతుంటుంది. 5వ రకం వరకూ పీల్స్‌తో రిస్కు తక్కువ. 6వ రకం నుంచీ అసలు పీల్స్‌ చెయ్యకపోవటం ఉత్తమం. బాగా నల్లగా ఉన్నవారికి పీల్స్‌తో రంగు రావటం మాట అటుంచి, క్రమేపీ నలుపుదనం మరింత పెరుగుతుంది. పీల్స్‌లోని రసాయనాలు కింది చర్మకణాలను, ముఖ్యంగా ఆ రంగునిచ్చే మెలనోసైట్‌ కణాలను బాగా ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి నల్లగా ఉండే వారికి పీల్స్‌ చేస్తే మరింత సమస్యలు ఎదురవుతాయి. జన్యుపరంగా, జన్మతః వచ్చే రంగును ఏదీ మార్చలేదు. కాబట్టి సహజంగా ఉన్న నలుపు రంగును మార్చుకోవాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు.

 • పీలింగ్‌కు ముందూ.. తర్వాతా..
* పీల్స్‌ చేయించుకోవటానికి రెండు వారాల ముందు నుంచీ సన్‌స్క్రీన్‌ లోషన్లు తప్పనిసరిగా వాడాలి. ఒక వారం ముందు రెటినాయిక్‌ యాసిడ్స్‌ వంటివి వాడి.. తర్వాత ఒక వారం ఖాళీ ఇవ్వాలి. వీటివల్ల చర్మం రంగు ముందుగానే కొంత తగ్గుతుంది, పీల్స్‌లో వాడే రసాయనం ముఖానికి రాసినప్పుడు అది లోపలికి అంతా సమానంగా వెళుతుంది. వీటినే 'ప్రైమింగ్‌ ఏజెంట్స్‌' అంటారు.

* పీలింగ్‌ సమయంలో ముఖం మీద ఎటువంటి వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉండకూడదు. గతంలో బొల్లి వంటివి ఉండకూడదు. ఆస్థమా చరిత్ర, అటోపిక్‌ డెర్మటైటిస్‌, సోరియాసిస్‌, ఎగ్జిమా, పొడి చర్మం వంటివారు పీల్స్‌కు వెళ్లకపోవటం ఉత్తమం. మధుమేహం, థైరాయడ్‌ వంటి సమస్యలతో పొడిచర్మం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పీల్స్‌కు వెళ్లే ముందరే ఇటువంటి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవాలి. పీలింగ్‌ అశాస్త్రీయంగా ఎవరికివారే చేసుకోవటం ప్రమాదకరం.

ఎలా చేస్తారు?
పీలింగ్‌ రోజున ఉదయం నుంచీ నీరు బాగా తీసుకోవాలి. పీలింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఎక్కువగా ఎండ పడకుండా వెళ్లటం ఉత్తమం. తర్వాత పోల్చుకోవటానికి వీలుగా- ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టేటప్పుడే ఒక ఫోటో తీసుకుని అప్పుడు పీలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందు ముఖమంతా 'అసిటోన్‌'తో క్లీన్‌ చేస్తారు, దాంతో ముఖం మీద ఉండే జిడ్డు, దుమ్ము వంటివన్నీ పోతాయి. తర్వాత స్పిరిట్‌తో తుడుస్తారు. ఇది చర్మాన్ని శుభ్రం చెయ్యటంతో పాటు ఎక్కడన్నా బ్యాక్టీరియా వంటివి ఉన్నా తొలగిస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తగా పీలింగ్‌ రసాయనాన్ని- నుదురు నుంచి మొదలుపెట్టి కళ్ల భాగం తప్పించి ముఖమంతా జాగ్రత్తగా రాస్తారు. పక్కనే 'టైమర్‌' పెట్టుకుని.. కచ్చితంగా ఎన్ని నిమిషాలు ఉండాలో అంతే సమయం ఉంచి.. వెంటనే.. దాని ప్రభావం పోగొట్టేందుకు 'న్యూట్రలైజింగ్‌ ఏజెంట్‌' రాసేస్తారు. ఇందుకోసం బాగా చల్లగా ఉండే నీరు లేదా కొన్నిసార్లు 'కార్బొనేట్‌' ద్రావణం కూడా వాడతారు. దీంతో పీలింగ్‌ రసాయనం ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత మాయిశ్చరైజింగ్‌ క్రీములు రాసుకోమని, తరచుగా సన్‌స్క్రీన్స్‌ రాసుకోమని సూచిస్తారు. ఎండలోకి వెళ్లకూడదు. ఇలా కనీసం ఐదారు దఫాలుగా చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు గానీ పూర్తి ప్రభావం తెలియదు.

* పిగ్మెంటేషన్‌కు సాధారణంగా నెలకోసారి చొప్పున ఐదారుసార్లు చేసిన తర్వాత ఫలితాలు స్థిరపడతాయి. ఎండలోకి వెళుతూనే ఉంటాం కాబట్టి మళ్లీ కొంత పిగ్మెంటేషన్‌ పెరిగే అవకాశం ఉంటుది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మెలాస్మా వంటివి ఉన్నవారు ఆర్నెల్లకు, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ఫలితాలు బాగుంటాయి.

ఉపయోగాలు
* ఇది సర్జరీలాంటి కోతలు, కుట్ల వంటి అవసరాలేమీ లేని తేలికపాటి ప్రక్రియ. చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.

* గత 30, 40 ఏళ్లలో పీలింగ్‌ రసాయనాల విషయంలో ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలు చేశారు. భారతీయ చర్మానికి ఏవి సరిపోతాయి, ఏవి సరిపడవన్నది సశాస్త్రీయంగా గుర్తించి దానికి అనుగుణంగానే విధానాలనూ అభివృద్ధి చేశారు. కాబట్టి ఇవి ఇప్పుడు చాలా సురక్షితంగా మారాయి.

* పీలింగ్‌తో పైచర్మంలో మార్పులు వెంటనే కనబడతాయి, చర్మం పొట్టులా రాలిపోయి ఛాయ పెరుగుతుంది. ఇది తక్షణ ఫలితం అనుకుంటే కింది పొరల్లో మార్పులు మెల్లగా వస్తాయి. నలుపు, గుంటలు, ముడతలు తగ్గుతాయి. ఇంకా లోపలగా ఉండే కొల్లాజెన్‌, ఫైబర్స్‌ రిపేర్ల వల్ల ముసలి రూపు తగ్గి చర్మం బిగువుగా మారుతుంది.

* దీన్ని లేజర్లు, బొటాక్స్‌, స్కిన్‌ పాలిషింగ్‌, ఫిల్లర్ల వంటి వాటితో కలిపి చేసుకోవచ్చు.

రిస్కులు
* పీలింగ్‌ అనుభవజ్ఞులైన వైద్యులు సశాస్త్రీయంగా చేస్తే రిస్కులు తక్కువ. జాగ్రత్తలు తీసుకోకపోతే దీనితో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

* పీలింగ్‌ చేసిన తర్వాత సాధారణంగా ఐదారు రోజులకు పైచర్మం పొట్టురాలిపోతుందిగానీ.. పొడిచర్మం ఉన్న వారికి- వారంపది రోజులకు ఊడిపోవాల్సింది ముందే ఊడిపోవచ్చు.

*పీలింగ్‌ లోతుగా చేసినప్పుడు ఎండలోకి వెళితే ముఖమంతా కందినట్లుగా ఎర్రగా అయిపోవచ్చు.

* వైద్యులు చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే- పిగ్మెంటేషన్‌ తక్కువ కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. ఇది రసాయనాన్ని బట్టి, లోతును బట్టి ఆధారపడి ఉంటుంది.

 • పరిమితులు
* ఇటువంటి సౌందర్య చికిత్సల గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ, వీటి నుంచి అవాస్తవికంగా, చాలా ఎక్కువ ఆశిస్తుంటారు. ఇది సరికాదు. వీటికి పరిమితులున్నాయి. శాస్త్రీయంగా ఎంత వరకూ సమంజసమో అంత వరకే చేయించుకోవాలి.

* కొందరు ఫలితాలు ఆశిస్తుంటారుగానీ వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించరు. పీలింగ్‌ చేయించుకోవటానికి ముందు వైద్యులు చెప్పినట్టుగా సన్‌స్క్రీన్‌ లోషన్లు, ప్రైమింగ్‌ అన్నీ కచ్చితంగా పాటించటం ముఖ్యం.

* చర్మం మీద దెబ్బలు తగిలినప్పుడు ఉబ్బెత్తు మచ్చలు (కీలాయిడ్స్‌) వచ్చే తత్వం ఉన్నవారు డీప్‌ పీల్స్‌ చేయించుకోకూడదు. అలాగే వృద్ధులకు చర్మం తిరిగి పూడుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వారికి 'డీప్‌ పీల్స్‌' అంత సమంజసం కాదు.
కంటిచుట్టూ వలయాలకూ!
కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలకు (డార్క్‌ సర్కిల్స్‌)కు 'ఆర్జినింగ్‌ పీల్స్‌' అందుబాటులోకి వచ్చాయి. వీటితో నల్ల వలయాలు బాగా తగ్గుతాయి. అయిత ఈ నల్ల వలయాలు రక్తహీనత, నిద్రలేకపోవం, జన్యుపరంగా, ఎండలోకి వెళ్లటం వల్ల కూడా రావచ్చు. కాబట్టి సరైన కారణాలన్నీ విశ్లేషించిన తర్వాతే, అవసరాన్ని బట్టే పీలింగ్‌ చెయ్యాల్సి ఉంటుంది


Article Courtesy with--Dr.Putta Srinivas ,Prof-Dermatology,Osmania Hos. Hyd.@Eenadu Sukhibhava
 • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Medicine update-ప్రేమ కాలం ఎంత?-How much is the life-span of Love?ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్రేమ కాలం ఎంత?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వాషింగ్టన్‌: మీరు ప్రేమలో ఉన్నారా? ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో తెలుసా? మీ రక్తంలో ఆక్సిటోసిన్‌ (ప్రేమ హార్మోన్‌) శాతం తెలుసుకుంటే అది తెలుస్తుందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్‌ శాతం ఎక్కువ ఉన్న జంటలు చాలా కాలం కలిసి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్‌కి చెందిన బార్‌-1 లాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్‌ శాతం ఎక్కువ ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. తక్కువగా ఉన్న వారు విడిపోయారని 'లైవ్‌సైన్స్‌' పేర్కొంది. జంటల మధ్య వచ్చిన విభేధాలు తగ్గడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ఆక్సిటోసిన్‌ చికిత్స అవసరమని... తాజా వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే బంధంలోనూ ఈ హార్మోన్‌ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం మొదలవుతున్న తొలినాళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.
 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Difference between Gastric Ulcer and Gastric Cancer,గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా.


 • image : Courtesy with http://gastriculcer.blogspot.in

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-నీరు తక్కువ తాగటం వల్లనో, లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి ఒక్కరు జీవితకాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవటం సహజమే. అందుకనే విద్యార్థులలో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాము. సాధారణంగా మూడు, నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్స్ అంతకంటే ఎక్కువగా ఉండి తరచుగా బాధిస్తూ ఉంటే ఎవ్వరినైనా అనేక అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నోటి పూతతో పాటు, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈసోఫీగల్ అల్సర్స్, కదలలేని పరిస్థితులలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి ఎస్‌టీడీ వల్ల, ఈస్పీ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల జెనిటల్ అల్సర్లు, డయాబెటీస్ వల్ల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా చూస్తూంటాము. చిన్న పేగు మెదట్లో ఉండే ఈ అల్సర్లను డుయోడినమ్ అల్సర్స్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత చాలా తక్కువగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది.

జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. పెప్టిక్ అల్సర్ల కంటే ఇవి తక్కువగా కనిపించినప్పటికీ గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ. అన్నవాహికలో అల్సర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. నోటిపూతకు స్ట్రెస్, విటమిన్ల లోపం, బి విటమిన్ లోపిం ప్రధాన కారణమైతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన మిగతా అల్సర్స్‌కు హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం.

1980 వరకు అల్సర్‌కు మసాలా ఆహారం, కారం, ఒత్తిడి అనుకునే వారు, ఆల్కహాల్ వల్ల పోట్ట, పేగులకు సంబంధించిన పూతకు కారణాలు అనుకునే వారు. దాదాపు వంద సంవత్సరాల వరకు అల్సర్లకు కారణాలు అదే అనుకుని వీలైనంత వాటికి దూరంగా ఉండమని సలహాలు ఇచ్చే వారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు డాక్టర్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లకు కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు. దీనికి వారికి నోబెల్ బహుమతి ప్రధానం కూడా జరిగింది. మన జనాభాలో 90 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాక్టీరియాకు గురవుతూ ఉంటారు. కానీ ఒత్తిడి, ఎసిడిటి, పొగతాగడం, ఆల్కహాల్ వంటి కారణాల వల్లనో లేకవారి శరీరతత్వాన్ని బట్టి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఉన్నపుడు వారికి ఈ బాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడటం జరుగుతుంది. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. జీర్ణవ్యవస్థలో అల్సర్ ఉన్నవారికి కడుపులో నొప్పితో పాటు ఆకలి తగ్గడం, వికారం, వెక్కిళ్లు, తేన్పులు, మలంలో రక్తం పడటం, రక్తపు వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ లక్షణాలు అల్సర్ ఏ స్థాయిలో ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మెదటి దశలో కడుపులో మంటగా ఉండటం ఏమైనా తినగానే కొంచెం సేపు తగ్గి, తర్వాత కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్ మందులు వాడటం వల్ల ఈ అల్సర్ పూర్తిగా నయమవుతుంది.

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్స్‌లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్. అందుకే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కనిపించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి తర్వాత తగ్గటం లేరదని డాక్టర్‌ను సంప్రదించడం జరుగుతుంది. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలు చేసి స్థాయిని నిర్థారిస్తారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, క్యాన్సర్ స్థాయి, వయసు, ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణిత వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి గ్యాస్ట్రెక్టమీ లేక పొట్టని మొత్తంగా తీసివేయటంతో పాటు చుట్టు ఉన్న లింఫ్‌నోడ్స్, చిన్న పేగులో కొంత భాగాన్ని అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేయటం జరుగుతుంది.

క్యాన్సర్‌ను కొంచెం ఆలస్యంగా గుర్తించినపుడు పొట్ట మొత్తాన్ని తీసివేసి అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకోలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ ముందు చేసి తర్వాత కీమో, రేడియో థెరపీలు ఇచ్చినా లేక కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత సర్జరీ చేసినా ఈ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 ఇంజక్షన్ల అవసరం చాలా ఎక్కువ. పొట్టని తీసివేసినపుడు ఆహారం నేరుగా చిన్నపేగులలోకి వెళ్లటం వల్ల డంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆహారం తక్కువగా, ఎక్కువ సార్లు తీసుకోవడం ఆహారం ముందు తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవటం వంటి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను మరీ లేటుగా గుర్తించడం జరిగి కణితి ఆహారం తీసుకోవడానికి అడ్డంకుగా ఉన్నపుడు, లేజర్ థెరపి, రేడియేషన్ థెరపీలలో కణితిని చిన్నగా చేసి పేగులలో స్టంట్‌ను అమరుస్తారు. మెటల్ లేక ప్లాస్టిక్‌తో తయారయిన ఈ ట్యూబ్ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు, క్యాన్సర్ మరీ ముదిరి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో అంత ప్రస్ఫుటంగా ఉండవు. అనుమానించేంత స్థాయిలో లక్షణాలు బయట పడ్డాయి అంటే క్యాన్సర్ స్థాయి పెరిగిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపితంగా దాదాపు 8 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

-హెలికో బ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా దాదాపు 60 -80 శాతం వరకు ఈ క్యాన్సర్‌కు కారణం. ఇంకా స్మోకింగ్, మద్యం, జన్యుపరమైన కారణాలు దోహదపడ్తాయి. కాబట్టి అల్సర్‌కు సరియైన చికిత్సలు తీసుకోవడం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తాజాగా ఉండే ఆహారం పరిశువూభమైన నీరు తీసుకోవడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కడుపుబ్బరం, తేన్పులు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఎవరికి వారు యాంటాసిడ్లు వాడటం కాకుండా ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపి చేయించుకోవడం మంచిది.

కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడ అందరూ ఎదుర్కొనేవే అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నా సరియైన పరీక్షలు, అవసరమైన మందులు వాడటం తప్పనిసరి అని అర్థం చేసుకోవడం మంచిది.


Article : Courtesy with Dr.Ch.Mohana Vamsy @NamastheTelangana.com

 • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎముకల్లో కణితులు,bone-cancerఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎముకల్లో కణితులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...కణవిభజనపై అదుపు తప్పి అసాధారణంగా కణాలు పెరగడం వల్ల వాపులా కనిపించే భాగాన్నే కణితి అంటారు. ఈ కణుతులు అన్నీ క్యాన్సర్‌వే కానక్కర లేదు. కొన్ని హానికరం కానివి కూడా ఉంటాయి. వీటిని బినైన్ ట్యూమర్లు అంటారు. ఇవి ఏర్పడిన చోట మాత్రమే ఉంటాయి. ఇతర భాగాలకు వ్యాపించవు. అందుకే బినైన్ కణుతుల వల్ల ప్రమాదం ఉండదు. మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్ కణుతులు అంటాం. ఈ కణుతులు అవి పుట్టిన భాగాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి అక్కడి కణాలకు కూడా హాని చేస్తాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.మాలిగ్నెంట్ కణుతులు ఎక్కడ పుట్టాయన్నదాన్ని బట్టి క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు సార్కోమా, కార్సినోమా, లుకేమియా. ఎముక కణజాలంలో కూడా రొమ్ములు, ప్రొస్టేట్, థైరాయిడ్, కిడ్ని, ఊపిరితిత్తుల మాదిరిగానే కణాలలో లాగే విభజన చాలా త్వరగా జరిగి త్వరగా వ్యాపిస్తుంది. ఎముకలో ఏర్పడే ట్యూమర్లు చాలా సందర్భాల్లో క్యాన్సర్ ట్యూమర్లు కాకపోవచ్చు. ఎముకలో ఏర్పడిన క్యాన్సర్ కణాలతో ఏర్పడిన ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు. ప్రైమరీ ట్యూమర్లను సార్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలేవీ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు.త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోవడానికి కారణమవుతాయి. చాలా త్వరగా పెరిగే ఈ ట్యూమర్ల వల్ల ముఖ్యంగా లక్షణాలు కనిపించనపుడు లేదా కనిపించిన చిన్న లక్షణాలు కూడా అశ్రద్ధ చేసినపుడు అంగవైకల్యం ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మరణం కూడా సంభవించవచ్చు.

రకాలు :
ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా సామాన్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

లక్షణాలు :
సాధారణంగా ఇతర శరీర భాగాలలో కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. ఏర్పడినట్టు తెలిసేసరికే చాలా వరకు పరిమాణంలో పెద్దగా పెరిగిపోయి ఉంటాయి. కానీ ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధరణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి. కొన్ని సార్లు కాళ్లు చేతులు కదల్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో ఎముకలో క్యాన్సర్ ఎముక విరగటం ద్వారా బయటపడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్దీ దాని పరిసరాల్లో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి పెంచడం వల్ల వాపు, నొప్పి రావడం ప్రారంభమౌతుంది.

పరీక్షలు :

ఎముక క్యాన్సర్‌ను నిర్ధారించడానికి చాలా రకాల పరీక్షలు అంచెలంచెలుగా నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి
- పేషెంట్ పూర్తి ఆరోగ్య వివరాలు, ఏవైనా ఇతర సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు
- రక్తపరీక్షలు
- ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు
- బయాప్సీ : ఇది ఒక చిన్న సర్జరీ వంటి పరీక్ష. క్యాన్సర్‌గా భావిస్తున్న కణితి నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపుతారు.

క్యాన్సర్ స్థాయి :
ఏ క్యాన్సర్ చికిత్సలోనైనా క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధి ప్రారంభమైన చోటనే ఉందా లేక ఇతర అవయవాలకు వ్యాపించిందా అనే దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఎముక క్యాన్సర్‌లో క్యాన్సర్ స్థాయి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఛాతి, ఎముకలకు సీటీ స్కాన్, కొన్ని సార్లు పెట్ స్కాన్ అవసరముంటుంది. 90 శాతం ఎముక క్యాన్సర్లు ఇతర ఎముకలకు, ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

చికిత్స :
-ఎముక క్యాన్సర్ చికిత్సలో ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు డాక్టర్లు కూడా టీమ్‌గా కలిసి పనిచెయ్యాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేసి క్యాన్సర్ కణితికి చికిత్స చేస్తే, మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ద్వారా, రేడియాలజీ ఆంకాలజిస్ట్ రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ అన్ని చికిత్సల ద్వారా క్యాన్సర్‌కు చికిత్స అందించడమే కాదు ఎముక నష్టాన్ని కూడా నివారిస్తారు.

చికిత్సలో చేసే సర్జరీల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి పద్ధతిలో క్యాన్సర్ వచ్చిన ప్రదేశంలోని అవయవాన్ని కాపాడడానికి చేసే సర్జరి. ఇందులో కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగించి, ఎముక నష్టాన్ని నివారించడానికి కావల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అవయవాన్ని కాపాడతారు. దీనిని లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు.కొన్నిసార్లు వ్యాధి ముదిరిపోవడం వల్ల అవయవాన్ని కాపాడలేకపోతారు. అటువంటి సందర్భాల్లో ప్రాణాలు కాపాడడానికి ఆ అవయవాన్ని తొలగిస్తారు. దీన్ని ఆంప్యు అంటారు.
సర్జరీ, కీమో, రేడియోథెరపీలతో చికిత్స పూర్తయిందనుకుంటే అది తప్పే అవుతుంది. చికిత్స అనంతరం క్రమం తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం ఎందుకంటే పూర్తిగా నయమైందని అనుకున్న వారిలో క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. కాబట్టి డాక్టర్ అవసరం లేదని చెప్పే వరకు తరచుగా డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

క్యాన్సర్ కానీ ట్యూమర్లు చాలా రకాలుగా ఉండవచ్చు. మృదువైన కణజాలాల్లో ఏర్పడే ట్యూమర్లు చాలా వరకు ఎముకలో వచ్చే ట్యూమర్లలాగానే కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ ట్యూమర్లు కావచ్చు, కాక పోవచ్చు.
క్యాన్సర్ కానీ కణితుల్లో సాధరణంగా కణితి ఏర్పడిన ప్రాంతంలో సర్జరి చేసి కణితి తొలగించడం ద్వారా ఎముక లేదా కీలు నష్టాన్ని నివారించవచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత తేలికవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్లు మళ్లీమళ్లీ రావచ్చు. ఏది ఏమైనా సరియైన సమయంలో గుర్తించిన ట్యూమర్లకు చికిత్స సలభంగానే చేయవచ్చు.

-- Article : courtesy with Dr.Kishore @ Namasthe Telangana.com
 • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 7, 2012

Deafness in Children leads to Dumb,పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును


 • image : courtesy with Namaste Telangana.com/.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పసిపిల్లలో వినికిడిలోపము మూగకు దారితీయును - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిలిచిన వెంటనే పలకకపోయినపుడు ముందు చిన్నారికి వినబడుతుందో లేదో అన్న ఆలోచన రావాలి. కొంచెం పెద్దపిల్లలైతే వినబడటం లేదని చెప్పగలుగుతారు. కానీ పసిపిల్లల్లో లోపాన్ని గ్రహించాల్సింది పెద్దవాళ్లే. ఇప్పుడు వినలేకపోతే భవిష్యత్తులో మాట్లాడలేరు కూడా. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల పెరుగుదల, మానసిక వికాసం, వినికిడి శక్తి, మాటలు నేర్చుకోవడం, మాట్లాడటం మొదలైనవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రు లపై ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం అనుమానం కలిగినా చెవిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయ్యేందుకు చెవి, వినికిడికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. శబ్దాన్ని గ్రహించే శక్తి కొరవడటాన్ని లేదా శబ్దాన్ని అసలు వినలేకపోవడాన్ని చెవుడు అంటారు. కచ్చితంగా ఈ కారణంగా చెవుడు వచ్చిందని అన్ని సందర్భాల్లోనూ చెప్పడం కష్టం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు వినగలిగిందే తిరిగి మాట్లాడగలుగుతారు. అమ్మమ్మ, తాతయ్య ల్లాంటి వారు చెప్పే చిన్న చిన్న మాటలు తిరిగి చెప్పలేకపోతున్నారని గమనించకపోతే వారు మాటలు కూడా నేర్చుకోలేరు. ఎంత త్వరగా, ఎంత చిన్న వయసులో పిల్లలు వినటం లేదో వారి వినికిడి శక్తి ఎంత కొరవడిందో తెలుసుకుని వెంటనే వారికి వినబడేట్టు చేయడం వల్ల వారు మాట్లాడగలిగేట్టు చేయవచ్చు. వినికిడి శక్తి మాట్లాడ్డంపై ప్రభావం చూపిస్తుంది. వినికిడికి మాట్లాడటానికి అవినాభావ సంబంధం ఉంది. చిన్న పిల్లల్లో మాట్లాడటం రాని వయసులో వినికిడి లేదంటే వారికి మాట్లాడటం కూడా రాదు.తల్లిదండ్రులు ఎంత త్వరగా పిల్లలకు వినబడటం లేదో గ్రహించి, అంత త్వరగా ఇఎన్‌టి స్పెషలిస్టును కలిసి వినికిడి పరీక్ష చేయించడం అవసరం.

 • చెవుడు.. రకాలు
శబ్దం లోపలికి చేరకపోవడం వల్ల వచ్చే చెవుడును కండక్టివ్ చెవుడు (కండక్టివ్ హియరింగ్ లాస్) అంటారు. కొన్నిసార్లు బయటిచెవి, చెవినాళం, మధ్యచెవి బాగానే ఉంటుంది. శబ్దం కూడా ప్రసారం అవుతుంటుంది. కానీ ఆ శబ్దాన్ని లోపలి చెవి వినికిడి నరం, మెదడు గ్రహించలేకపోవడం వల్ల చెవుడు వస్తుంది. దీన్ని నరం చెవుడు (సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్) అంటారు.

 • చిన్నారుల్లో చెవుడుకు కారణాలు..
- కొందరిలో పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిన మందులు, ఇన్‌ఫెక్షన్లు, పిండం అభివృద్ధి చెందడంలో మార్పులు రావడం లాంటి కారణాల వల్ల లోపాలతో పుట్టవచ్చు.
- రుబెల్లా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, సిఫిలిస్ (తల్లిదంవూడుల ద్వారా సంక్రమించే వ్యాధి), హెర్పిస్ సింప్లెక్స్, గవదబిళ్లలు, తట్టు, మెదడువాపు లాంటి ఇన్‌ఫెక్షన్లు,
- స్ట్రెప్టోమైసిన్, ఫ్రూసిమైడ్, జెంటామైసిన్ లాంటి మందులు,
- రేడియేషన్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు, ప్రసవ సమయంలో హైపోక్సియా, హైపర్‌బిలిరూబినిమియా (తల్లిదండ్రుల రక్తం సరిపడని కారణంగా వచ్చే వ్యాధి), -అతితక్కువ బరువుతో (15 వందల గ్రాముల కన్నా తక్కువ) పుట్టడం,
- తల, మెడ, చెవి సరిగ్గా ఉండాల్సిన రీతిలో లేనప్పుడు ,
- కుటుంబంలో ఎవరికైనా చెవుడు ఉండటం ,
- డౌన్స్ సిండ్రోమ్, మార్‌ఫాన్స్ సిండ్రోమ్, గోల్డెన్ హార్స్ సిండ్రోమ్, పియరీ రాబిన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుసంబంధ వ్యాధులు చెవుడుకు కారణమవుతాయి.
- ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా, ఆస్టియోస్క్లీరోసిస్ లాంటి ఎముకల వ్యాధి వల్ల చెవిలోని ఎముకల గొలుసులో కంపనాలు ఏర్పడవు. దానివల్ల శబ్దం లోపలి చెవికి చేరదు.
- సెక్రిటరీ డైటిస్ మీడియా వల్ల మధ్యచెవిలో నీరు లేదా జిగురు లాంటి పదార్థం చేరుతుంది. శబ్ద ప్రకంపనాలు లోపలి చెవికి అందక సరిగ్గా వినపడదు.
- వెలుపలి చెవి లేదా మధ్యచెవిలో గానీ ఇన్‌ఫెక్షన్ వల్ల చీము చేరి రంధ్రం ఏర్పడుతుంది. తద్వారా వినికిడి శక్తి దెబ్బతింటుంది.
- చెవికి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా కర్ణభేరి పగిలిపోవడమో, ఎముకల గొలుసు అస్తవ్యస్తం కావడమో జరుగుతుంది. తల ఎముకలు చిట్లిపోవచ్చు. ఇలాంటప్పుడు వినికిడి పోతుంది.
- గింజలు, పూసలు, పుల్లల లాంటివి పిల్లలు తెలియక చెవిలో పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా వినికిడి పోయే ప్రమాదం ఉంది.

 • పరిష్కారాలు...
వెలుపలి చెవి పూర్తిగా లేని పిల్లల్లో మధ్యచెవి, లోపలి చెవి సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు పరిశీలిస్తారు. అవి బాగానే ఉంటే ప్లాస్టిక్ సర్జన్, ఇఎన్‌టి సర్జన్ కలిసి బయటిచెవిని, చెవినాళాన్ని కృత్రిమ పదార్థాలతో గానీ, శరీరంలోని ఇతర పదార్థాలతో గానీ రూపొందించి శబ్దం మధ్యచెవికి అందేవిధంగా చేస్తారు. తద్వారా వినగలుగుతారు. చెవిలో పెట్టుకునే గింజలు, పూసలు, పిన్నులు, దూది, స్పాంజి, పెన్సిల్ ముక్కలు, లేదా కీటకాలు చేరడం వల్ల వినికిడి తగ్గిపోతు ముందుగా కర్ణభేరికి అపాయం కలుగకుండా వాటిని బయటకు తీస్తారు. ఇలాంటప్పుడు ఏమాత్రం అజాక్షిగత్తగా ఉన్నా వినికిడి శక్తి మొత్తం పోవచ్చు.
చెవిలో ఇన్‌ఫెక్షన్లు చేరినప్పుడు సకాలంలో మందులు వేయడం, డ్రెస్సింగ్ చేయడం జరగాలి.
కొన్నిసార్లు చెవిలో అదనంగా కండరాలు పెరుగుతాయి. వీటిని మైక్రోసర్జరీ ద్వారా తొలగిస్తే వినకిడి శక్తి వస్తుంది. ఆటోస్క్లీరోసిస్ లాంటి వ్యాధి వల్ల చెవిలోని ఎముకలు బిగుసుకుపోయినప్పుడు, చెవిలో రంధ్రం పడినప్పుడు కూడా మైక్రోసర్జరీ అవసరం అవుతుంది. మధ్యచెవిలో నీరు చేరితే (సెక్షికిటరీ ఓటైటిస్ మీడియా) ఆ ద్రవాన్ని కర్ణభేరి ఆపరేషన్ ద్వారా బయటకు తీసేస్తారు. ఆపరేషన్ తరువాత మళ్లీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వరకు కర్ణభేరిలో ఒకరకమైన బటన్‌ను ఉంచుతారు. దీనివల్ల మధ్యచెవిలో తయారయ్యే ద్రవం బయటకు వెళ్లిపోతుంది. దీన్ని మెరింగాటమీ, గ్రొమెట్ ఆపరేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసినా చెవిలో ద్రవం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కారణాన్ని పరీక్షించి తదనుగుణమైన చికిత్స అందించాలి. మధ్యచెవిలో ద్రవం ఏర్పడటానికి యూస్టేషియన్ నాళానికి సంబంధించిన వ్యాధులు, ఎడినాయిడ్స్, ముక్కు వెనకాల ఉండే టాన్సిల్స్ లాంటి కండరాలు, సైనసైటిస్, టాన్సిల్స్,క్లఫ్ పాలెట్ మొదలైనవి ముఖ్యమైన కారణాలు. వీటన్నింటినీ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.

 • ఎలా తెలుసుకోవాలి...?
పుట్టగానే..
మోరోరిఫ్లెక్స్ లేదా స్టార్టల్ రిఫ్లెక్స్ - పెద్దశబ్దం విన్నప్పుడు ఏడుస్తారు.
3 నెలలు...
శబ్దం విన్నప్పుడు కాళ్లూచేతులు ఆడిస్తూ ఆడుకునే పిల్లలు కదలిక లేకుండా ఆగిపోవడం లేదా కళ్లు మూసుకోవడం, భృకుటి ముడుచుకోవడం
5వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు కళ్లు తిప్పడం
6వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు తల తిప్పడం
7 నుంచి 9 నెలలు...
శబ్దం చేస్తే అది ఎటువైపు నుంచి వస్తోందో సరిగ్గా గుర్తించడం
18వ నెలలో..
మనం అడిగే ప్రశ్నలు విని అన్నింటికి సమాధానాలు ఇవ్వడం. ఉదా.. ముక్కు, పిల్లి ఎక్కడ.. అంటే చేతితో చూపించడం ఇలా శబ్దం వచ్చినప్పుడు ఒక్కో వయసు పిల్లలు ఒక్కోలా స్పందిస్తారు. ఆ స్పందన సరిగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని బట్టి వినికిడి శక్తిని అంచనా వేయవచ్చు. ఇవే కాకుండా విజువల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ టెస్టు, కండిషనింగ్ ఆడియోమెట్రీ, స్పీచ్ పరీక్షలు, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఇవోక్ట్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు.


Courtesy with : Dr.Anil Vasireddy , MS-ENT(Sai ENT hos.Hyd.)

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/