పిలిచిన వెంటనే పలకకపోయినపుడు ముందు చిన్నారికి వినబడుతుందో లేదో అన్న ఆలోచన రావాలి. కొంచెం పెద్దపిల్లలైతే వినబడటం లేదని చెప్పగలుగుతారు. కానీ పసిపిల్లల్లో లోపాన్ని గ్రహించాల్సింది పెద్దవాళ్లే. ఇప్పుడు వినలేకపోతే భవిష్యత్తులో మాట్లాడలేరు కూడా. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల పెరుగుదల, మానసిక వికాసం, వినికిడి శక్తి, మాటలు నేర్చుకోవడం, మాట్లాడటం మొదలైనవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రు లపై ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం అనుమానం కలిగినా చెవిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయ్యేందుకు చెవి, వినికిడికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. శబ్దాన్ని గ్రహించే శక్తి కొరవడటాన్ని లేదా శబ్దాన్ని అసలు వినలేకపోవడాన్ని చెవుడు అంటారు. కచ్చితంగా ఈ కారణంగా చెవుడు వచ్చిందని అన్ని సందర్భాల్లోనూ చెప్పడం కష్టం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు వినగలిగిందే తిరిగి మాట్లాడగలుగుతారు. అమ్మమ్మ, తాతయ్య ల్లాంటి వారు చెప్పే చిన్న చిన్న మాటలు తిరిగి చెప్పలేకపోతున్నారని గమనించకపోతే వారు మాటలు కూడా నేర్చుకోలేరు. ఎంత త్వరగా, ఎంత చిన్న వయసులో పిల్లలు వినటం లేదో వారి వినికిడి శక్తి ఎంత కొరవడిందో తెలుసుకుని వెంటనే వారికి వినబడేట్టు చేయడం వల్ల వారు మాట్లాడగలిగేట్టు చేయవచ్చు. వినికిడి శక్తి మాట్లాడ్డంపై ప్రభావం చూపిస్తుంది. వినికిడికి మాట్లాడటానికి అవినాభావ సంబంధం ఉంది. చిన్న పిల్లల్లో మాట్లాడటం రాని వయసులో వినికిడి లేదంటే వారికి మాట్లాడటం కూడా రాదు.తల్లిదండ్రులు ఎంత త్వరగా పిల్లలకు వినబడటం లేదో గ్రహించి, అంత త్వరగా ఇఎన్‌టి స్పెషలిస్టును కలిసి వినికిడి పరీక్ష చేయించడం అవసరం.
- చెవుడు.. రకాలు
- చిన్నారుల్లో చెవుడుకు కారణాలు..
- రుబెల్లా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, సిఫిలిస్ (తల్లిదంవూడుల ద్వారా సంక్రమించే వ్యాధి), హెర్పిస్ సింప్లెక్స్, గవదబిళ్లలు, తట్టు, మెదడువాపు లాంటి ఇన్‌ఫెక్షన్లు,
- స్ట్రెప్టోమైసిన్, ఫ్రూసిమైడ్, జెంటామైసిన్ లాంటి మందులు,
- రేడియేషన్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు, ప్రసవ సమయంలో హైపోక్సియా, హైపర్‌బిలిరూబినిమియా (తల్లిదండ్రుల రక్తం సరిపడని కారణంగా వచ్చే వ్యాధి), -అతితక్కువ బరువుతో (15 వందల గ్రాముల కన్నా తక్కువ) పుట్టడం,
- తల, మెడ, చెవి సరిగ్గా ఉండాల్సిన రీతిలో లేనప్పుడు ,
- కుటుంబంలో ఎవరికైనా చెవుడు ఉండటం ,
- డౌన్స్ సిండ్రోమ్, మార్‌ఫాన్స్ సిండ్రోమ్, గోల్డెన్ హార్స్ సిండ్రోమ్, పియరీ రాబిన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుసంబంధ వ్యాధులు చెవుడుకు కారణమవుతాయి.
- ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా, ఆస్టియోస్క్లీరోసిస్ లాంటి ఎముకల వ్యాధి వల్ల చెవిలోని ఎముకల గొలుసులో కంపనాలు ఏర్పడవు. దానివల్ల శబ్దం లోపలి చెవికి చేరదు.
- సెక్రిటరీ డైటిస్ మీడియా వల్ల మధ్యచెవిలో నీరు లేదా జిగురు లాంటి పదార్థం చేరుతుంది. శబ్ద ప్రకంపనాలు లోపలి చెవికి అందక సరిగ్గా వినపడదు.
- వెలుపలి చెవి లేదా మధ్యచెవిలో గానీ ఇన్‌ఫెక్షన్ వల్ల చీము చేరి రంధ్రం ఏర్పడుతుంది. తద్వారా వినికిడి శక్తి దెబ్బతింటుంది.
- చెవికి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా కర్ణభేరి పగిలిపోవడమో, ఎముకల గొలుసు అస్తవ్యస్తం కావడమో జరుగుతుంది. తల ఎముకలు చిట్లిపోవచ్చు. ఇలాంటప్పుడు వినికిడి పోతుంది.
- గింజలు, పూసలు, పుల్లల లాంటివి పిల్లలు తెలియక చెవిలో పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా వినికిడి పోయే ప్రమాదం ఉంది.
- పరిష్కారాలు...
చెవిలో ఇన్‌ఫెక్షన్లు చేరినప్పుడు సకాలంలో మందులు వేయడం, డ్రెస్సింగ్ చేయడం జరగాలి.
కొన్నిసార్లు చెవిలో అదనంగా కండరాలు పెరుగుతాయి. వీటిని మైక్రోసర్జరీ ద్వారా తొలగిస్తే వినకిడి శక్తి వస్తుంది. ఆటోస్క్లీరోసిస్ లాంటి వ్యాధి వల్ల చెవిలోని ఎముకలు బిగుసుకుపోయినప్పుడు, చెవిలో రంధ్రం పడినప్పుడు కూడా మైక్రోసర్జరీ అవసరం అవుతుంది. మధ్యచెవిలో నీరు చేరితే (సెక్షికిటరీ ఓటైటిస్ మీడియా) ఆ ద్రవాన్ని కర్ణభేరి ఆపరేషన్ ద్వారా బయటకు తీసేస్తారు. ఆపరేషన్ తరువాత మళ్లీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వరకు కర్ణభేరిలో ఒకరకమైన బటన్‌ను ఉంచుతారు. దీనివల్ల మధ్యచెవిలో తయారయ్యే ద్రవం బయటకు వెళ్లిపోతుంది. దీన్ని మెరింగాటమీ, గ్రొమెట్ ఆపరేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసినా చెవిలో ద్రవం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కారణాన్ని పరీక్షించి తదనుగుణమైన చికిత్స అందించాలి. మధ్యచెవిలో ద్రవం ఏర్పడటానికి యూస్టేషియన్ నాళానికి సంబంధించిన వ్యాధులు, ఎడినాయిడ్స్, ముక్కు వెనకాల ఉండే టాన్సిల్స్ లాంటి కండరాలు, సైనసైటిస్, టాన్సిల్స్,క్లఫ్ పాలెట్ మొదలైనవి ముఖ్యమైన కారణాలు. వీటన్నింటినీ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.
- ఎలా తెలుసుకోవాలి...?
మోరోరిఫ్లెక్స్ లేదా స్టార్టల్ రిఫ్లెక్స్ - పెద్దశబ్దం విన్నప్పుడు ఏడుస్తారు.
3 నెలలు...
శబ్దం విన్నప్పుడు కాళ్లూచేతులు ఆడిస్తూ ఆడుకునే పిల్లలు కదలిక లేకుండా ఆగిపోవడం లేదా కళ్లు మూసుకోవడం, భృకుటి ముడుచుకోవడం
5వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు కళ్లు తిప్పడం
6వ నెలలో..
శబ్దం వచ్చిన వైపునకు తల తిప్పడం
7 నుంచి 9 నెలలు...
శబ్దం చేస్తే అది ఎటువైపు నుంచి వస్తోందో సరిగ్గా గుర్తించడం
18వ నెలలో..
మనం అడిగే ప్రశ్నలు విని అన్నింటికి సమాధానాలు ఇవ్వడం. ఉదా.. ముక్కు, పిల్లి ఎక్కడ.. అంటే చేతితో చూపించడం ఇలా శబ్దం వచ్చినప్పుడు ఒక్కో వయసు పిల్లలు ఒక్కోలా స్పందిస్తారు. ఆ స్పందన సరిగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని బట్టి వినికిడి శక్తిని అంచనా వేయవచ్చు. ఇవే కాకుండా విజువల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ టెస్టు, కండిషనింగ్ ఆడియోమెట్రీ, స్పీచ్ పరీక్షలు, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఇవోక్ట్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు.
Courtesy with : Dr.Anil Vasireddy , MS-ENT(Sai ENT hos.Hyd.)
- ========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.