Sunday, May 13, 2012

ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం పది సూత్రాలు,Ten piont formula for Healty child.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యవంతమైన బిడ్డకోసము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

1* ఒకరు లేక ఇద్దరు చాలు అనుకోండి. బిడ్డ బిడ్డకు కనీసం రెండేళ్లు ఎడం ఉంచండి. ఆడ పిల్లలకు 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయ్యండి. 20 నుండి 30 సంవత్సరాల వయసు గర్భధారణకు అనువైన సమయం.

2* గర్భిణీ స్త్రీ క్రమం తప్పకుండా ఆరోగ్య కార్యకర్తతో పరీక్షలు చేయించుకోవాలి. ఆసుపత్రి ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బిడ్డకు ఆరు నెలల వయసు పూర్తయ్యే వరకూ కేవలం తల్లిపాలు పట్టాలి. 6వ నెలలో ఇంటిలో తయారు చేసిన అదనపు ఆహారం మొదలు పెట్టాలి.

3* మూడేళ్లలోపు పిల్లలకు సుష్టిగా ఆహారం పెట్టాలి. నూనెలు, నెయ్యి, కూరగాయలు, కలిసిన ఆహారం రోజుకు ఐదారుసార్లు ఇవ్వాలి.

4* పిల్లకు విరేచనాల వ్యాధి వచ్చినప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా ఇవ్వాలి.

5పిల్లలకు సకాలంలో అన్ని రకాల టీకాలు వేయించాలి.

6* సాధారణ జలుబు, దగ్గులకు ఎలాంటి మందులు వాడనక్కరలేదు. శ్వాసపీల్చుకోవడం ఇబ్బంది అయితే వైద్య సలహా పొందాలి.

7* పిల్లలందరికీ కాచి చల్లార్చిన నీళ్లు తాపాలి.

8మలవిసర్జన తర్వాత ఆహారం తినే ముందు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడగాలి.

9* పిల్లలు ఏ జబ్బునుంచైనా నివారణ పొందిన తర్వాత రోజుకు ఒక మారు ఆహారం అదనంగా పెట్టాలి.

10* పిల్లలను తరచుగా తూకం వేయించాలి. ఈ సౌకర్యం అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి పొందండి. ఇందువల్ల ఆహారలోపాన్ని ముందే గుర్తించొచ్చు.


  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.