ఆడుకునే పసివూపాయం, అభం శుభం తెలియని అమాయకత్వం క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియని బాల్యం కానీ ఇవేమీ క్యాన్సర్‌కు అడ్డుకాదు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లు పిల్లల్లో వచ్చే ప్రమాదం ఉన్నా కొన్ని క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి రక్త సంబంధిత క్యాన్సర్లు(లుకేమియా) మెదడులో వచ్చే కణితులు బెయిన్ ట్యూమర్లు) లింఫోమా, సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా, పిల్లల్లో క్యాన్సర్ ఎటువంటి లక్షణాలు కలిగించకుండానే అకస్మాత్తుగా జ్వరం వంటి లక్షణాలతో బయటపడవచ్చు. ఎన్నివిధాలుగా ఆలోచించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఒకరిని లేదా ఇద్దరిని అపురూపంగా పెంచుకునే తల్లిదండ్రులకు పాపకో బాబుకో క్యాన్సర్ అని తెలియగానే ఎంతో తల్లడిల్లి పోతారు. తీవ్రమైన మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. కాని కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే పిల్లల్లో క్యాన్సర్స్ చాలా వరకు పూర్తిగా నయం చేయదగినవే.
చిన్నపుడు 20 గ్రేల కంటే అధిక రేడియేషన్‌కు గురయినా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గ్రే అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్ధం. మామెక్షిగామ్ వంటి పరీక్షలు మరీ చిన్న వయసులో చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటే మంచిది.
పీడియాట్రిక్ క్యాన్సర్ చాలా వరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ భయపడి థెరపీకీ సహకరించకపోతే ఒక్కోసారి వారికి మత్తు ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాలు పైబడ్డాక అమ్మాయికి గాని అబ్బాయికి కాని క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ వల్ల పునరుత్పతత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అనుకుంటే ముందుగానే వారి అండాలను వీర్యకణాలను తీసి భద్రపరుస్తుంటారు.
పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్త కణాలను అడ్డుకొని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలాగ ఒక్కసారిగా జరగటం కాని లేదా దీర్ఘకాలికంగా కానీ జరగవచ్చు. చాలా వరకు నయం చేయగలిగే ఈ క్యాన్సర్‌కు చికిత్సలు కీమోథెరపీ, రేడియోథెరపీలతో ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాం స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదట బిడ్డకు రక్త సంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పిల్లలు పాలిపోయినట్లు ఉండడం, ఆకలి, బరువు తగ్గడం నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలు మచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తవూస్రావం, ఒంటినొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగను(bone marrow) పరీక్షించటం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు.
పెద్దవారిలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పుకోవచ్చు. పొద్దునే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారటం, ఆందోళన, ఫిట్స్, చూపు, మాట మందగించటం వంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. క్యాన్సర్ కణితి అయినా కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీ చేయవచ్చు లేదా ఇతర ట్రీట్‌మెంట్స్ చేస్తే మంచిదా అని నిర్ణయిస్తారు. ఒక్కొక్కసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్రపోషించే లింఫ్ నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హార్జ్‌కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జ్జల్లో, లింఫ్‌నాళాలు వాయటం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రుళ్లు చెమట, దగ్గు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం మొదలగు లక్షణాలతో లింఫోమాలు బయట పడుతుంటాయి. ఇతర టిష్యూలకు కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌ను సాఫ్ట్‌టిష్యు సార్‌కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ లక్షణాలు వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండడం వల్ల తొలి దశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌కు ప్రధానంగా సర్జరీ, తర్వాత లేదా ముందు అవసరాన్ని బట్టి రేడియో, కీమో థెరపిలుంటాయి. అండాలలో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ.
రెండు ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లల్లో అడ్రినల్ గ్రంథిలో, మెడ, ఛాతి, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణితలు బ్లాస్టోమాలు, ఎముకలు టిష్యూలలో వచ్చే ఈవింగ్ సార్కోమా, మూత్రపిండాలలో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా, పిల్లల్లో ఎక్కువగా కన్పించే క్యాన్సర్స్. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగే ఈ క్యాన్సర్లు పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం నయం చేయడం కష్టతరం అవచ్చు. పిల్లల్లో అరుదుగా కన్పించే మిగతా క్యాన్సర్స్ అదుపులో రావటం కష్టం కావటం, ఎంత ప్రయత్నించిన చికిత్సకు లొంగకపోవటం జరగవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు సంబంధమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్స్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండో వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలను గుర్తించి సరియైన ట్రీట్‌మెంట్స్ అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, ట్రీట్‌మెంట్స్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి.
Courtesy with : Dr.Ch.Mohana Vamsy- chief surgical Oncologist , Omega hospitals , Hyderabad.A.P_India.
- =====================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.