Monday, May 21, 2012

మసాజ్‌ చికిత్సా ప్రక్రియ,మసాజ్‌ థెరపీ,Massage therapyఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మసాజ్‌ థెరపీ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సమస్త మాన వాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వ ర ఉపసమనాన్ని ఇ చ్చేదిగా... సమర్ధవంత మైన చికిత్సా ప్రక్రియ గా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం. బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

అసలు ఇలా బాడీ మసాజ్‌ చేయటం అన్నది ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో కాన్పు జరిపినా... పుట్టిన బిడ్డ్డకి ఎముకల గట్టిదనం కోసం, మరిన్ని రుగ్మతల నుండి రక్షణ కోసం తైలాలతో మర్ధన చేయటం తప్పని సరిగా మారింది. మనిషి పుట్టుకే ఈ ప్రకృతి సహజ సిద్దమైన వైద్యంలో ప్రారంభమవుతోందని చెప్పొచ్చు. ఈ ప్రకృతి ప్రక్రియల్లో అవరాన్ని బట్టి వివిధ రకాల మర్ధ నలు చేయటం తప్పని సరి.

అనుభవమున్న ఎందరు వైద్యులున్నా... ఎన్ని రకా లుగా వైద్యం అభివృద్ధి చెందినా... పుట్టిన బిడ్డ ఎదిగే కొలదీ కాసేపు శరీరానికి మర్ధన చేయటం అనుభవమున్న మాతృమూర్తులు చేసే పని, ఈ విషయంలో అధిక ప్రాధాన్యత బాలింతలకు, తొలి చూలు మహిళలకు ఇలా మర్ధన చేయటం వారి ఆరోగ్య సమస్యలు తీర్చేదే. ఆరోగ్య పరమైన ప్రతిబంధకాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా పూర్వం నుండి మర్ధన కొనసాగుతోందనే చెప్పక తప్పదు.

మర్ధనం అంటే...

స్పర్శ ఇది చాలా సున్నితమైన అంశం. దు:ఖం, బాధ, తదితరాలు కలిగినప్పుడు ఊరడింపుని, అనున యాన్ని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషి నుండి లభించే స్పర్శ ఎంతో ఓదార్పునిస్తుందన్నది వాస్తవం. దీనివల్ల జరుగుతున్న ప్రయోజనాలని ఆధారంగా చేసుకుని పూర్వీకులు స్పర్శపై అనేక పరిశోధనలు చేసి వైజ్ఞానికంగా చేసిన అభివృద్ధి వల్లే మర్ధన ప్రక్రియని రూపొందించారు. దీని కోసం మసాజ్‌ థెరఫీ పేరుతో ఆయుర్వేదంలో ఏకంగా ఓ శాస్త్రమే ఉంది. ప్రకృతి వైద్య విధానానికి అను సంధానించి అన్ని వయసుల్లోని వారి శారీరక శ్రమల కారణంగా కండరాలు అలసిపోవటం వల్ల వచ్చే అనేక రుగ్మతలపై అధ్యయనం చేసి, వాటిని స్పర్శతో సేత తీర్చే లా ఈ ప్ర క్రియ ఉంటుంది. మన దేశంలో సాంప్రదాయ పద్ధతులలో శరీరాన్ని, కండలను పెంచేందుకు పూర్వ కాలం నుండి దండీలు, కుస్తీలు వంటి గ్రామీణ క్రీడలు సైతం ఆయుర్వేద వైద్య విధానంలోని పద్దతులే. వీటి వల్ల కలిగే కండరాల ఉపశమనానికి మర్ధనాన్ని వినియోగించే వారు.

మర్ధనలో జాగ్రత్తలు పాటించాలి....

ఓ పద్దతి ప్రకారం జరగాల్సిన మర్ధన ఇష్టాను సారం చేస్తే.... నొప్పి మరింత పెరిగి లేని పోని అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ మర్ధన చికిత్సపై ప్రత్యేకంగా నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్న వారి సహాయం తప్పని సరిగా తీసుకోవాల్సిందే.. శరీర నిర్మాణాన్ని పూర్తి స్ధాయిలో తెలుసుకుని ఎక్కడ ఏతరహాలో మర్ధన చేయాలన్నది ముఖ్యం.

ఎలాంటి ఆరోగ్య సమస్యలకి మర్ధన అవసరమంటే...

పక్షవాతం :

కొన్ని రకాల పక్షవాతాల బారిన పడిన వారిలో చచ్చు బడి పోయిన శరీర భాగాలపై తగిన ఆయుర్వేద తైలా లతో మర్ధన ప్ర క్రియ చేయటం ద్వారా తిరిగి పునర్జీవనం సాగించేలా చేయచ్చు. ధన్వంతరి తైలం, క్షీర బలా తైలాలు ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

తలనొప్పి :

మనలో చాలా మంది ఎప్పటికప్పుడు మాడునొప్పితో, విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటాం. ఇలా బాధపడేవారు స్వచ్చ మైన కొబ్బరి నూనెను తలపై మృదువుగా మర్ధన చేయించు కుంటే త్వరగా ఉపశమనం పొందొచ్చు. మరీ విపరీతమైన నొప్పితో బాధపడేవారు రాత్రుళ్లు పడుకునే సమయంలో మర్ధన చేయించుకోవటం మంచిది. ఒక్కోసారి శరీరం అంతా మర్ధన చేయాల్సి రావచ్చు. ఇందుకు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది ..

కీళ్ల వాతం :

చికెన్‌ గున్యా, మలేరియా, జ్వరం తదితర వ్యాధుల బారిన పడిన వారిలో కీళ్ల వాపులు, నొప్పులు అధికంగా ఉం టాయి. కీళ్లు బిగుసుకు పోయిన కారణంగా కాళ్లు కదపలేని స్దితి కూడా వస్తు ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా తగిన విధంగా మసాజ్‌ చేయించుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అధిక బరువు :

ప్రస్తుత ఫాస్టుఫుడ్‌ కల్చర్‌ కారణంగా ఊబకాయానికి లోనవుతున్న వారు కొందరైతే... దులవాట్లు, శారీరక శ్రమ తగ్గటం లాంటి కారణాల వల్ల, జీవనశైలిలో వచ్చిన మార్పులు వల్ల శరీరం భారీగా పెరిగి బాధ పడుతున్న వారు మరి కొందరు. వీరిలో పొట్ట పెరగటం బైటకు కనిపించే సమస్య అయితే, ఎసిడిటి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, పుల్లటి తేన్పులు, మలబద్దకం ఇలా చాలా అంతర్గత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి బాధలతో బాధ పడేవారి కోసం ప్రత్యేక రీతిలో మర్ధన చికిత్స చేస్తే ఊబకాయం తగ్గి శరీరానికి హాయి దక్కు తుంది.

ఉబ్బసం, ఆయాసం :

తీవ్రమైన జలుబు, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులు ఉన్న వారు ఆయుర్వేద చికిత్సలో వాడే సైంధవ లవణం కలిపిన నువ్వుల నూనెని గానీ, కార్పూర తైలాన్ని కానీ ఛాతిపైనా, వీపు పైనా మర్ధన చేసినట్లు రుద్ది వేడి నీళ్లతో కాపడం పెడితే తొందరగా ఉపశమనం లభిస్తుంది.

నరాల నొప్పి:

సయాటికా లాంటి నొప్పులకు, నొక్కుకు పోయే నరాల బాధల నుండి ఉపశమనం లభించడానికి మహానారాయణ తైలాన్ని రుద్ది తగిన రీతిన మర్ధన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయ టం వల్ల నరం వెళ్లే మార్గం, నరం పూర్తి స్ధాయిలో ఉత్తేజభరితమవుతాయి.

నిద్రలేమి :

నిద్ర పట్టక బాధ పడేవారికి మర్ధన చికిత్స బాగా ఉపయోగ పడుతుంది. నిద్ర మాత్రలు వేసుకుని లేని పోని రోగాలు తెచ్చుకునే కన్నా ఆరో గ్యవంతమైన ఈ ప్రకృతి వైద్య విధానంలో నిపుణుల సూచనల మేరకు మర్ధన చేయించుకునే స్లీప్‌ సైకిల్‌ క్రమబధ్ధీకరించబడి నిద్రలేమి పోతుంది.

మర్ధన వల్ల ప్రయోజనాలూ బోలెడు...

శరీరాన్ని అన్ని విధాలుగా మర్దించడం వల్ల చమట రూపంలో చర్మంలోని మాలిన్యం బైటకు రావ టం వల్ల కాంతి వంతంగా తయారవ్వటమే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా హాయిని గొలిపే ఈ ప్ర క్రియ వల్ల కండరాలు సేద తీర టమే కాకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంచు తుంది. వృధ్ధాప్యం కారణంగా వచ్చే అనేక సమస్యలకు సత్వర ఉపశమనం మర్ధన వల్లే సాధ్యం.

వీరికి మర్ధన చేయద్దు :

గర్భవతులైన మహిళల పొట్టపై ఎట్టి పరిస్ధితిలోనూ మర్ధన చేయకూడదు. అలాగే మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారిపైన మర్ధన ప్రయోగాలు చేస్తే ఉప శమనం మరో విపరీతానికి దారి తీస్తుంది.

-- సత్య గోపాల్‌ @ అంధ్రప్రభ ఆదివారము అనుబంధం
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.