Wednesday, May 2, 2012

Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Facing of Medical emergency, వైద్యం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం , మెడికల్ ఎమర్జెన్సీ ని ఎదుర్కోవడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వైద్యము లో ప్రతి రోగము వెంటనే నయము చేసుకోవడము అవసరమే అయినా... కొన్ని వ్యాదులు వెంటనే తగిన చికిత్స చేయకపోతే ప్రాణాలు పోతాయి లేదా జీవితాంతము బాధతోను , ఆ జబ్బుతోను , ఆ జబ్బు మిగిల్చే శేషాలతోను బ్రతకవలసి ఉంటుంది . ఆ కోవలో ముఖ్యమైనవి ....
  • గుండె పోటు(Heart attack) ,
  • పక్షవాతము (Paralysis),
  • కాలిన గాయాలు(Burns) ,
  • శ్వాసించడము లో ఇబ్బంది (ఉబ్బసము - Asthma),
  • పాముకాటు (snake bite)

గుండెపోటు--
అంటురోగాలు , ఇతర రొగాలకన్నా గుండె జబ్బులు ప్రమాదకరమైనవి . తక్షణము వైద్య సహకారము అవసరమైనవి . నేడు సాధారణ గుండెజబ్బులను గుండెపోటు , గుండె ఆగిపోవడము , ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫ్రాక్షన్‌ అంటాము . శరీరము లో అంగాలన్నింటిలో కీలకమైనది గుండె . శరీర భాగాలన్నింటికి అవసరమైన రక్తాన్ని సమర్ధవంతము గా పంప్ చేసే అంగం గుండె .అటువంటి గుండెకండరాలకు తగినంత ఆక్షిజన్‌ సరఫరా అవనపుడు క్రమముగా గుండె కండరాలు దెబ్బతిని తెలియకుండానే గుండెపోటు తెస్తుంది .
  • గుండె పోటుకు కారణాలు :
ముఖ్యమైనవి -- ఎథెరొస్క్లిరోసిస్ , ఆర్టీరియో స్క్లిరోసిస్ , రక్తనాళాలలోపల ఏర్పడిన గార (ఎథిరోమ ). నస్టపరిచే ఇతర కారణాలు -- పొగతాగడము , హైపర్ లిపిడీమియా , ఒత్తిడి , అధిక స్థాయి కొలెస్టిరాల్ , అధిక రక్తపోటు , మధుమేహము , భారీకాయము .

లక్షణాలు : గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ కు హెచ్చరిక చాతి నొప్పి . ఆ నొప్పి సాధారణము గా పిండినట్లు గా ఉంటుంది . చాతీ బిగుసుకున్నటువంటి భావన లేదా బాగా ఒత్తిడి పడుతున్న భావన . సధారణము గా ఆ నొప్పి చాతీనుండి విస్తరిస్తుంది. ఎడమ చేతివైపుకు నొప్పి విస్తరణ సాధారణమైనప్పటికీ కింది దవడ , మెడ , కుడిచెయ్యి , వీపుకు విస్తరిస్తుంది . కడుపులో మంటను పోలిన బాధ కలుగుతుంది.

ఇతర లక్షణాలు : ఊపిరి అందకపోవడము , తీవ్రము గా చెమట పట్టడము , తల తేలిపోవడము , గుండెదడ , నీరసము , కడుపులో తిప్పడము , తలతిరగడము లేదా స్పృహ కోల్పోవడము .

గుండెపోటుకు ప్రాధమిక చికిత్స : గుండె పోటు వచ్చినవారిలో పైన చెప్పిన లక్షణాలు , సంకేతాలు కనిపిస్తాయి. వాటిలో తీవ్ర చాతీనొప్పి తట్టుకోలేనిది . అటువంటివారిని హాస్పిటల్ కి తరలించేలోగా సమయము వృధాచేయక ప్రాధమిక చికిత్స అందించాలి . గుండెపోటు కేసుల్లో సమయము చాలా కీలకము .ఆలస్యమైతే గుండె కండరము దెబ్బతింటుంది . చేయవలసినవి ...*అత్యవసర సర్వీస్ నంబర్ కి ఫోను చేయడం , *రోగి దుస్తులను వదులు చేయడము , *రోగిని కంగారు పెట్టకుండ ధైర్యము చెప్పడము , *కొంచము వంగి కూర్చున్న భంగిమ ను ఏర్పాటు చేయడము ,* అనవవసర కదలికలు చేయకూడదు , *శ్రమపడితే ఆక్షిజన్‌ పెట్టే సదుపాయము చేయడము , *వెంటనే హృద్రోగ నిపుణులున్న హాస్పిటల్ కి తరలించడము ... ముఖ్యమైనవి . దొరికితే .. సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెట్టడము చేయాలి .


పక్ష వాతము

మనిషి బ్రతికే ఉంచి అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు . శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.

ఏ కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది



కాలిన గాయాలు--
కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.
చెయ్యవలసినవి
*మంట ప్రభావాన్ని ముందుగా ఆపండి .*మంటనుండి మనిషిని బయటకు లాగడము లేదా మందమైన దుప్పటి తో కప్పి మంటలను ఆపాలి .*ప్రమాదము నుండి రోగిని దూరము గా తీసుకు వెళ్ళాలి .* కాలిన ప్రదేశము లో దుస్తులు లేదా నగలను తొలగించాలి . *కాలిన 20 నిముషాలలోపే ప్రభావితమైన శరీర భాగాలను చల్లని తేదా గొరువెచ్చని నీటితో10-30 నిముషాలు చల్లబరచాలి . * చర్మానికి తగలకుండా తెల్లటి పలుచని గుడ్డతో కపాలి. * హాస్పిటల్ కి వీలైనంత త్వరలో తీసుకు వెళ్ళాలి .
చెయ్యకూడనివి --
* ఐస్ లేదా ఐస్ నీళ్ళు లో కడగడం గాని తుడవడం గాని చేయవద్దు . * క్రీమ్స్ లేదా వెన్న వంటివి రాయడను , సిరా (పెన్ను ఇంక్ )లాంటివి పోయడము చేయవద్దు .



శ్వాసించడములో ఇబ్బంది --

ఊపిరి పీల్చ్లేకపోవడము లేదా ఊపిరి అందకపొవడానికి ఏ రోగి లోనైనా రెండు కారణాలుంటాయి. 1.శ్వాసనాళాలఓ అడ్డంకి . 2. శ్వాసనాళాలు మూసుకుపోవడము . కొద్ది సేపూ ఆక్షిజన్‌ మెదడకు అందకపోతే ప్రాణాపాయము కలుగుతుంది . కావున అన్ని సమయములో శ్వాస -నిశ్వాసలు సరిగా జరిగేటట్లు చుడాలి . వెంటనే దగ్గరగా ఉన్న వైద్యశాలకు తరలించాలి .


పాముకాటు :
సాదారణం గా పాములు సంతానోత్పత్తి కోసం వేసవి కాలం లో జత కడతాయి . తరువాత వర్షాకాలం లో గుడ్లలను పొదుగుతాయి . ఆయాసమయాల్లో అవి చాలా చిరాకుగా ఉండి తీవ్రం గా స్పందిస్తాయి . ఈ కారణం గానే వేసవి , వర్షాకాలం లో పశువులతో పాటు మనుషులు అధికంగా పాముకాటుకు గురిఅవుతారు .

పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.

పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే- విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.


  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.