Showing posts with label Medicine Definition. Show all posts
Showing posts with label Medicine Definition. Show all posts

Tuesday, September 29, 2009

Medicine Definition, వైద్యము నిర్వచనం,వైద్యవిధానాలు ,Medical Systmes




వైద్యము లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.

వివిధ రకాల వైద్యవిధానాలు

దారులు వేరైనా గమ్యము ఒక్కటే అన్నట్లుగా వైద్యవిధానాలు ఏవైనా రోగిని స్వస్థత చేకూర్చేందుకే అనే విషయము గుర్తించాలి .ఒక వైవిధానములో లొంగని జబ్బు మరొక విధానములో తగ్గవచ్చును . ఈక్రింద పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైనవి.