Showing posts with label ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.. Show all posts
Showing posts with label ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.. Show all posts

Saturday, October 29, 2011

ముప్పైల్లోనే మెనోపాజ్‌,Menopaus at 30 years,ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ముప్పైల్లోనే మెనోపాజ్‌,Menopaus at 30 years,ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌.POF.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మెనోపాజ్‌. ఎప్పుడో 45-55 ఏళ్ల మధ్య రావాల్సిన ఇదిప్పుడు ఎంతోమంది యువతులను ముప్పైల్లోనే భయపెడుతోంది. మనదేశంలో సుమారు 4% మంది 35 ఏళ్లకు ముందుగానే ముట్లుడిగిపోయే స్థితికి చేరుకుంటున్నారని బెంగళూరులోని సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ఛేంజ్‌ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దీంతో పిల్లలను కనే సామర్థ్యాన్ని కోల్పోయి కుమిలిపోతున్నారు. ముందే ముంచుకొచ్చే మెనోపాజ్‌కు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వీటిని ఆదిలోనే గుర్తిస్తే చాలావరకు సరిదిద్దొచ్చు. కానీ ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ (పీఓఎఫ్‌) కోవకు చెందినవైతే మాత్రం కష్టం. వీరిలో అండాలు అతి కొద్దిగానో, అసలే విడుదల కాకుండానో ఉంటాయి. పీఓఎఫ్‌ బాధితుల్లో మూడొంతుల మందిలో దీనికి జన్యు పరమైన అంశాలే కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

పీఎఫ్‌ఓలో జన్యువుల పాత్ర గురించి మనదేశంలో ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. ఇటీవల సీసీఎంబీ దీనిపై ఓ పరిశోధన చేసింది. పీఎఫ్‌ఓలో పాలుపంచుకుంటున్న జన్యువులకు అండాల విడుదలతో నేరుగా సంబంధమేమీ లేకపోయినా.. వాటి ఉత్పత్తి, విడుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టించటంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. బీసీఎల్‌ 2 జన్యువులోని ఉత్పరివర్తనలు అండాలు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే అండకణాల ఉత్పత్తి, వృద్ధికి సహకరించే ఎఫ్‌ఎస్‌హెచ్‌ హార్మోన్‌ విడుదల కావటంలో ఇన్‌హిబిన్‌ అనే జన్యువు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది. పీఓఎఫ్‌ బాధితుల్లో 10.5 శాతం మందిలో ఇన్‌హిబిన్‌ జన్యువు మార్పు చెందినట్టు తేలింది. లింగ నిర్ధారణ చేసే ఎక్స్‌ క్రోమోజోమ్‌.. అండాశయ పనితీరులోనూ కీలకపాత్ర పోషిస్తోంది. సహజంగా ఆడవారిలో రెండు ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కదానిలోనైనా తేడా ఉంటే పీఎఫ్‌ఓకు దారి తీస్తున్నట్టు తేలింది. ఈ పరిశోధన ఆధారంగా కొత్త నిర్ధరణ పరికరాలు రూపొందించి, పీఎఫ్‌ఓ రాబోయే మహిళలను ముందుగానే గుర్తించొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలాంటి వాళ్లు ముందుగానే సంతానం విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది.

గర్భస్థ పిండంలోనే అండాలు
తల్లి కడుపులో ఉండగానే ఆడశిశువు అండాశయంలో 20 వారాల సమయానికి 60-70 లక్షల అండ బీజకణాలు ఏర్పడతాయి. అయితే ఇవి వేగంగా తగ్గిపోతూ శిశువు పుట్టే సరికి కేవలం 10 లక్షలే మిగులుతాయి. రజస్వల వచ్చేసరికి వీటి సంఖ్య 3-5 లక్షలకు తగ్గిపోతుంది. తర్వాత అండాల ఉత్పత్తి ప్రక్రియలో నెలకు 1,000 చొప్పున తగ్గుతూ వస్తాయి. ఈ అండకణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే మెనోపాజ్‌ దశ వస్తుంది. అప్పుడు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం పోతుంది.

  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/