Tuesday, October 30, 2012

phobia(Fear)-ఫోబియా(భయం)


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -phobia(Fear)-ఫోబియా(భయం)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మనిషి కున్న అతి పెద్ద జబ్బు ఏమిటి? కాన్సరా? ఎయిడ్సా?  హృద్రోగామా? ఇవేవీ కాదు. మనిషిని పట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు పేరు "భయం". భయం లేని వాణ్ణి ఏ జబ్బూ ఏమీ చేయ లేదు. భయపడే వాడికి ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెట్టేదే! శరీరానికి జబ్బులు వస్తాయి. రాకుండా వుండవు. భయం మాత్రం మీకు రాకుండా చూసుకుంటే  మీ జీవితం హాయిగా  గడిచి పోతుంది.

మనిషి కున్న మహా భయం చావును గురించి, అట. మనిషికే గాదు, ప్రతి ప్రాణికీ చావంటే - భయం. కానీ - చాలా ప్రయోగాల ద్వారా తెలిసింది ఏమిటంటే - భయం లేని వాడికి, చావు చాలా సులభం, కష్టం లేనిదీ అని. ఎప్పుడో, రాబోయే దాన్ని గురించి యిప్పుడు భయపడడం, దుహ్ఖించడం - చాలా అవివేకం .భయానికి విరుగుడు - ధ్యానం. ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమే. ధైర్యం గా వుండే వాడే సంతోషంగా వుండగలడు. సంతోషంగా వుండడం అలవాటుగా మార్చుకోండి.

ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.

మానసిక సమస్యల్లో చాలా తరచుగా కనబడేదీ.. ఎక్కువ మందిని వేధించేదీ.. జీవితాల్ని చాలా ఇబ్బందికరంగా మార్చేదీ.. ఫోబియా! అంతే కాదు.. చికిత్సతో సంపూర్ణంగా నయమైపోయేది కూడా ఈ ఫోబియాలే కావటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం!

'ఫోబియా' అంటే ప్రధానంగా భయం! అది కూడా అర్థరహితమైన భయం!! సాధారణంగా ఎవరూ భయపడని, ఎవరికీ భయం కలిగించని వాటి పట్ల మనం భయపడుతుండటం..
 • ఫోబియాల ప్రత్యేకత. 
ఏదైనా ఒక వస్తువుపట్లగానీ, ఒక సందర్భం పట్లగానీ, పరిస్థితుల పట్లగానీ అసహజమైన భయాన్ని పెంచుకోవటాన్నే 'ఫోబియా' అంటారు. నిజానికి దాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి కూడా తెలుస్తూనే ఉంటుంది, ఆ భయానికి అర్థం లేదనీ, భయపడాల్సిన అవసరమే లేదని! అయినా కూడా ఆ సన్నివేశం, ఆ సంఘటన, లేదా ఆ వస్తువు ఎదురైనప్పుడు ఉన్నట్టుంది విపరీతమైన ఆందోళనకు గురవుతుంటారు. సాధ్యమైనంత వరకూ దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక దశలో దానికి దూరంగా ఉండేందుకు ఎన్ని కష్టాలకైనా సిద్ధపడుతుంటారు. దీనివల్ల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంటుంది. నిజానికి దీన్ని వదిలించుకోవటం కష్టమేం కాదు. ఈ విషయంలో మానసిక చికిత్సా రంగం మంచి ఫలితాలను అందిస్తోంది.
ఫోబియాల జాబితాకు.. భయానికి గురిచేస్తున్న అంశాలకు అంతులేదు. దాదాపు 500లకు పైగా భయాల గురించి తరచుగా వింటుంటాం. కానీ స్థూలంగా చెప్పుకోవాలంటే ఈ ఫోబియాలు రెండు రకాలు.
 • 1.నిర్దిష్టమైన అంశాలు, వస్తువులు, సందర్భాల పట్ల భయం. దీన్నే మానసిక చికిత్సా రంగంలో 'స్పెసిఫిక్‌ ఫోబియా' అంటారు. 
 • రెండోది- సామాజికంగా నలుగురిలోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే 'సోషల్‌ ఫోబియా'. చిన్న చిన్న అంశాల పట్ల భయాలు పెంచుకోవటమన్నది ఇతరులకు చాలా హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కానీ దాన్ని అనుభవించే వారికి మాత్రం అది నిజంగా పెను భూతమే!

* ఒక ఉదాహరణ: ఒకరికి కుక్కలంటే భయం అనుకుందాం. అంతా కుక్కలను పెంచుకుంటూనే ఉన్నారు, అదేమంత భయపడాల్సిన జంతువు కాదని వారికీ తెలుస్తూనే ఉంటుంది, వాళ్లూ మనసులో అనుకుంటూనే ఉంటారు. నిజంగా కుక్క ఎదురుగా కనిపించేంత వరకూ బాగానే ఉంటారు కూడా. కానీ ఒక్కసారి ఆ జంతువు ఎదురైతే మాత్రం.. తీవ్రమైన ఆందోళనలోకి, భయంలోకి జారిపోతారు. ఈ భయం ఎంత దూరం వెళుతుందంటే ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవటానికి కూడా ప్రయత్నిస్తారు. చివరికి ఎక్కడైనా కుక్క ఉందని ముందే తెలిస్తే.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనటానికి సిద్ధపడతారుగానీ ఆ ప్రాంతానికి వెళ్లటానికి మాత్రం ఇష్టపడరు.

* ఇంకో ఉదాహరణ: ప్రయాణమంటే భయం. ఊరొదిలి వెళ్లాలంటే భయం. ఉత్తప్పుడంతా బాగానే ఉంటారు. కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కడ లేని భయం ముంచుకొచ్చేస్తుంది. దీంతో మొత్తానికి ప్రయాణాలనే వాయిదా వేస్తుంటారు. ఇలా ఏళ్ల తరబడి రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కని వాళ్లు, ఊళ్లకెళ్లని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. విమానాశ్రయాల వరకూ వెళ్లి వెనుదిరిగి వచ్చేవారూ ఉన్నారు. ఉద్యోగరీత్యా క్యాంపులు, ప్రయాణాలు అనివార్యమైనా సరే.. భయానికి లొంగిపోయి చివరికి ప్రమోషన్ల వంటివి వదులుకునేళ్లు కూడా ఎంతోమంది. ఇలా వీళ్లు దైనందిన జీవితంలో భయాలను తప్పించుకు తిరిగేందుకు, సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి లిఫ్టులంటే భయం. లిఫ్టు ఎక్కకుండా ఉండేందుకు పదిపదిహేను అంతస్తులైనా మెట్లు ఎక్కటానికి సిద్ధపడుతుంటారు. పైగా తమ భయం బయటపడకుండా దాచిపెట్టుకునేందుకు.. మెట్లు ఎక్కితేనే ఆరోగ్యం.. ఇదే మంచిదని వాదన కూడా చేస్తుంటారు.

అనుకోకుండానో, బలవత్తరంగానో తమ భయకారకాలను ఎదుర్కొనాల్సి వస్తే ఒక్కసారిగా తీవ్ర భయంలోకి జారిపోయి, ఆందోళనలో కూరుకుపోయి, ఆగమేఘాల మీద అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే వీరిలో అసందర్భమైన భయాలు (ఇర్రేషనాలిటీ), వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు తంటాలు పడుతుండటం (అవాయిడెన్స్‌), బలవత్తరంగా వాటిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురైతే ఆందోళనలో కూరుకుపోవటం (యాంగ్త్జెటీ) అనే మూడు లక్షణాలూ ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. అలాగే వీరిలో చాలామందికి ఆందోళన (జనరలైజ్డ్‌ యాంగ్త్జెటీ), మానసిక కుంగుబాటు (డిప్రెషన్లు) కూడా కలగలిసి ఉంటాయి.

మరో రకం: సోషల్‌ ఫోబియాలు
నలుగురిలోకి వెళ్లటానికి భయం. అలా వెళితే అందరూ తనను చూసి ఎక్కడ నవ్వుతారో, అలా నవ్వేపని తాను ఎక్కడ చేస్తానోనని మనసులో భయం. తడబడటం, చెమటలు పట్టటం, నలుగురిలో ఏం చెయ్యాలన్నా ఇబ్బంది. చివరికి నవ్వులపాలయ్యే కంటే అసలు అక్కడికి పోకుండా ఉంటేనేనే మేలన్న భావనలోకి జారిపోతుంటారు.

చాలా రకాల ఫోబియాల్లో ప్రధానంగా కనబడేది.. తమ నియంత్రణలో లేని అంశాల పట్ల భయం పెంచుకోవటం. ఉదాహరణకు కొందరికి రైలు ప్రయాణాలంటే భయం. హఠాత్తుగా ఏదైనా జరిగితే రైళ్లను మనం నియంత్రించలేం, అది మన చేతుల్లో ఉండదని భయపడుతూ ఎంత దూరమైనా సొంతకార్లలో వెళుతుంటారు. ఇలా పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు, వాటిని మనం నిర్దేశించలేమన్న సందర్భాల్లో భయం, ఫోబియాలు ఎక్కువ అవుతుంటాయి.
 • భయంలో ఏమవుతుంది?
తమకు భయాన్ని కలిగించే సందర్భం ఎదురవగానే విపరీతమైన మానసికమైన ఒత్తిడి మొదలవుతుంది. గుండె దడ, నిస్సత్తువ, చెమటలు, ఊపిరి వేగంగా తీసుకోవటం, మరో ఆలోచన లేకపోవటం, ఇక్కడి నుంచి పారిపోకపోతే మరుక్షణంలో ఏదైనా అయిపోతుందన్న ప్రాణ భయం.. ఇవన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొంటాయి. ఈ సందర్భమేదో పది సెకండ్లే ఉన్నా.. అదే ఒక యుగంలా అనిపిస్తుంటుంది. ఈ ఫోబియాలు ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు తెచ్చిపెట్టకపోయినా జీవనశైలిని, దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి ఇబ్బందుల్లోకి నెట్టటం వీటిలో ముఖ్యాంశం.
 • సామాజిక సమస్యలు
భయాల వల్ల వీరు తరచుగా సామాజిక జీవనానికి, బహిరంగ జీవితానికి దూరమవుతుంటారు. ఉదాహరణకు ప్రయాణాలంటే భయం ఉన్నవారు.. ఇతరులను నొప్పించకుండా ఉండేందుకు రకరకాల కారణాలు చెబుతుంటారు. దీనివల్ల ఇతరులు వీరిని కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారని అపార్థం చేసుకునే అవకాశమూ ఉంటుంది. ఉదాహరణకు ఏళ్ల తరబడి విమానాలు ఎక్కకుండా ఉండిపోయేవాళ్లు.. విదేశాల్లో ఉన్న తమ పిల్లలు రమ్మంటున్నా వెళ్లకుండా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటుంటారు. రద్దీ ప్రాంతాలంటే భయపడేవారు పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల వంటి వాటికి వెళ్లటానికి వెనకాడుతూ భయంతో బిగుసుకుపోతుంటారు. దీనివల్ల ఎన్నో సామాజిక సమస్యలు, వృత్తిపరంగా, ఇతరత్రా సమస్యలు పెరుగుతాయి.

భయాలు.. రకరకాలు
 •     ఏక్రోఫోబియా (Acrophobia)     : ఎత్తైన ప్రదేశాలంటే భయం
 •     క్లాస్ట్రోఫోబియా (Claustrophobia): ఒంటరితనం అంటే భయం.
 •     నెక్రోఫోబియా (Necrophobia)     : చావు అంటే భయం
 •     పైరోఫోబియా (Pyrophobia)     : అగ్గి అంటే భయం
 •     హీమోఫోబియా (Hemophobia)     : రక్తం అంటే భయం
 •     హైడ్రోఫోబియా (Hydrophobia)     : నీరు అంటే విపరీతమైన భయం

* జంతువులంటే భయం: పులి అంటే ఎవరికైనా భయమే. అదంటే భయం లేకపోతే అసహజం. కానీ అలా కాకుండా చాలామంది బల్లులు, సాలీళ్లు, బొద్దింకల వంటివాటిని చూసి భయపడుతుంటారు.

* ఎత్తులంటే భయం: చాలామందికి ఎత్తులకు వెళ్లాలన్నా, ఇరుకు ప్రదేశాలన్నా తీవ్రంగా భయపడుతుంటారు. అసలా తలంపే వారిని తీవ్ర భయానికి లోను చేస్తుంటుంది.

* రక్తం, దెబ్బలంటే భయం: గాయాలు, దెబ్బలు, రక్తం వంటివి చూడలేకపోవటం ఎంతోమందిని ఇబ్బంది పెట్టే ఫోబియా.

* జబ్బులంటే భయం: చాలామందికి తాము ఎక్కడ జబ్బు పడతామో, ఎక్కడ జబ్బులు అంటుకుంటాయోనన్న భయం వేధిస్తుంటుంది. ఉదాహరణకు 'ఎయిడ్స్‌ ఫోబియా' ఉన్నవాళ్లు సెలూన్‌కు వెళ్లి గడ్డం చేయించుకోవటానికి కూడా భయపడుతుంటారు. ఎప్పుడైనా ఒక్కసారి వెళితే జీవితాంతం భయపడుతుంటారు. ఆసుపత్రులకు వెళితే అక్కడి జబ్బులు ఎక్కడ అంటుకుంటాయోనన్న భయం వంటివీ ఎందరినో బాధిస్తుంటాయి.

* పర్యావరణం: కొందరు ఉరుములు, మెరుపులు, వర్షాలకు విపరీతంగా భయపడుతుంటారు. ఆకాశం మేఘావృతమైనా వీరికి భయమే.

ఈ ఫోబియాల చిట్టా అనంతం! వీరు అనుభవించే భయమూ అనంతమే!

మూలాలెక్కడ
* జీవితంలో మనకు ఎదురైన సందర్భాల ఆధారంగా మనం ఏర్పరచుకునే ఫోబియాలు కొన్ని. ఉదాహరణకు ఒకసారి మనల్ని కుక్క కరిచినా, లేదా కుక్క ఎవరినైనా కరవటం మనం చూసినా కుక్కల పట్ల ఫోబియా పెంచుకునే అవకాశం ఉంటుంది.

* చిన్నతనంలో దయ్యం భూతం బూచాడంటూ మన ఇళ్లలో మనమే కొన్ని భయాలను పిల్లల మెదళ్లలో నాటుతుంటాం. ఇవి ఫోబియాలుగా స్థిరపడి, వ్యక్తితోపాటే పెరుగుతూ వస్తాయి, కొన్ని మధ్యలో కూడా రావచ్చు. అయితే కొన్ని ఫోబియాలు వయసుతో పోతాయి. ఉదాహరణకు చిన్నతనంలో చీకటంటే భయం.. పెద్దయితే అది ఉండకపోవచ్చు.

* చాలావరకూ మనం పుట్టిపెరిగిన, చూసిన, తిరిగిన వాతావరణంలో ఎటువంటి అనుభవాలను, సందర్భాలను ఎదుర్కొన్నామో వాటి ఆధారంగా కూడా కొన్ని ఫోబియాలు స్థిరపడతాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా కొన్ని భయాలుంటే ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకు కూడా ఫోబియాలు రావచ్చు.

* ఫోబియాలకు సంబంధించి.. 'జనరలైజేషన్‌' కూడా ఒక కీలకాంశం. ఉదాహరణకు ఒక దానితో భయం తలెత్తితే దాన్ని పోలి ఉన్న దేన్ని చూసినా భయాలు మొదలవుతాయి. ఉదాహరణకు బొచ్చుకుక్క అంటే భయం అయితే చివరికి బొచ్చు ఉన్న ఫర్‌క్యాప్‌ చూసినా కూడా భయం తలెత్తవచ్చు.

* జన్యుపరంగా, వ్యక్తిత్వంలో భాగంగా కూడా కొన్ని ఫోబియాలు రావచ్చు. అలాగే స్వతహాగానే భయస్తులైన వారికి ఆయా పరిస్థితులు కూడా తోడైతే భయాలు మరింత స్థిరపడతాయి.

* ముఖ్యంగా పరిణామక్రమంలో మనుగడ కోసం, ప్రాణ రక్షణ కోసం కూడా మనలో కొన్ని భయాలు చోటుచేసుకుని ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు విషపురుగులు, జంతువుల వంటి మనకు హానితలపెట్టే జీవులు; మనకు హాని జరగటానికి అవకాశముండే ఎత్తు ప్రదేశాలు, చీకటి వంటి పర్యావరణ అంశాలు; గాయాలు, రక్తం వంటి ప్రమాద ఘట్టాలు; ఇరుకు ప్రదేశాల్లో ఇరుక్కుపోవటం వంటి ప్రమాదకర పరిస్థితులు.. ఇవన్నీ పరిణామ క్రమంలో భాగంగానే మనలో భయాలకు తావిస్తుండొచ్చని విశ్లేషిస్తున్నారు.
చికిత్సతో పూర్తి ఫలితాలు
సెరౖన చికిత్స తీసుకుంటే ఫోబియాలను చాలా వరకూ పూర్తిగా పోగొట్టుకోవచ్చు. చికిత్సలో భాగంగా ముందు వీరికి ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గేందుకు 'యాంటీ యాంగ్త్జెటీ' మందులు, 'యాంటీ డిప్రసెంట్లు' ఇస్తారు. మానసికంగా విశ్రాంతిగా ఉండేలా.. 'రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌' నేర్పిస్తారు. వీటితో కొంత కుదుటపడిన తర్వాత.. ఫోబియాలు పోగొట్టేందుకు అత్యంత కీలకమైన 'బిహేవియర్‌ థెరపీ' ఆరంభిస్తారు. దీనిలో ప్రధానంగా రెండు విధానాలుంటాయి.

* మొదటిది: సాధారణంగా దేనికి భయపడుతున్నారో అదంటే భయాన్ని పోగొట్టేందుకు మానసికంగా ముందు సన్నద్ధం చేస్తారు. దీన్నే 'సిస్టమాటిక్‌ డీసెన్సిటైజేషన్‌' అంటారు. ఈ దశలో.. ఊహించుకోవటం ముఖ్యమైన దశ. ఉదాహరణకు లిఫ్ట్‌ ఎక్కటమంటే భయం అనుకుంటే ముందు లిఫ్ట్‌ ఎక్కుతున్నట్టుగా ఊహించుకోవటంతో మొదలుపెట్టిస్తారు. ఎక్కకపోతే పని జరగనట్లు, ఎక్కుతున్నట్టు ఊహించుకునేలా చేస్తారు. మామూలుగా ఇలా ఊహిస్తున్నప్పుడు కూడా వీరిలో ఆందోళన పెరుగుతుంటుంది. దీన్ని తగ్గించటానికి 'సైకలాజికల్‌ రిలాక్షేన్‌ టెక్నిక్స్‌' ఉపయోగిస్తూ ప్రయత్నిస్తారు. ఇలా క్రమేపీ ఊహల్లో భయం తగ్గుతున్నప్పుడు.. మెల్లగా వాస్తవికమైన పరిస్థితుల్లోకి తీసుకువెళతారు. 'లిఫ్ట్‌ ఎక్కద్దులే.. పక్కన నిలబడి చూడు.. తర్వాత ఎక్కి మొదటి అంతస్థు వరకే వెళ్లి వచ్చేద్దాం..' అంటూ పక్కన ఒకరిని తోడు ఇచ్చి పంపిస్తూ.. ఇలా క్రమేపీ వాస్తవానికి దగ్గరగా తీసుకువెళతారు. ఈ ప్రక్రియతో భయం తగ్గుతూ.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంటుంది. అలాగే భయపెడుతున్నదేమిటో రాయించి.. ఏ భయం ఎక్కువ ఆందోళన సృష్టించిపెడుతోంది? దేన్ని ముందుగా మనం ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. చివరికి ఆ వస్తువు, ఆ పరిస్థితి దగ్గరి వరకూ తీసుకువెళ్లి.. ఆ భయాన్ని సంపూర్ణంగా పోగొట్టటం ఇందులో ముఖ్యాంశం.

* రెండోది: ఏదంటే భయమో దాన్నే బలవంతంగా ముందు పెట్టేయటం మరో విధానం. దీన్నే 'ఫ్లడింగ్‌ టెక్నిక్‌' అంటారు. ఉదాహరణకు లిఫ్ట్‌ అంటే భయపడుతుంటే ఒక్కసారే దాన్లోకి తీసుకువెళ్లిపోతారు. ఒక్కసారే ఇలా జరిగే సరికి మొదట్లో కొద్దిగా ఆందోళనచెందినా.. క్రమేపీ అందులో ఎక్కినా తనకేం జరగటం లేదన్న నమ్మకం, ఇక తనకేం కాదన్న భరోసా కలుగుతుంది. దీంతో మనిషి క్రమేపీ వాస్తవికమైన పరిస్థితుల్లో భయం అక్కర్లేదని గుర్తిస్తారు. నిపుణులు పక్కన ఉండే ఇలా చేస్తారు.

* భయాలను 'సిస్టమాటిక్‌ డీసెన్సిటైజేషన్‌' ద్వారా చాలా వరకూ ఎదుర్కొనొచ్చు. దానికి కొన్ని వారాలు పట్టొచ్చు. అయితే ఫ్లడింగ్‌ టెక్నిక్‌లో మాత్రం ఒకటిరెండు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ చికిత్సా విధానాలు సమర్థంగా పని చేస్తాయి. అయితే ఓపిగ్గా చికిత్స తీసుకోవటం ముఖ్యం.

* కొందరికి 'కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ' బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఏ ఆలోచన భయాన్ని తెచ్చిపెడుతోందన్నది గుర్తించటం, దానిలోని అసంబద్ధతను చర్చించటం, ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటామన్నది శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఎంతోమంది ఫోబియాలతో నిత్యం సతమతమవుతున్నాగానీ చికిత్సకు ముందుకు రారు. ఫలితంగా హాయిగా జీవించే పరిస్థితి లేకుండా చేసుకుంటుంటారు. దీనివల్ల ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలూ పెరుగుతాయి. కాబట్టి ఇలాంటివి వదిలించుకోవటమే ముఖ్యమని గుర్తించాలి.

Courtesy with ; 
-Dr .K chandrasekhar , Psychiatrist , Asha hospital , Hyd.@Eenadu sukhibhava.

 • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Pulmonary congestion,ఊపిరితిత్తుల శోధము(Cadmiosis),శ్వాసకోశాల శోధము(Airway inflammation),ఊపిరితిత్తుల నెమ్ము(Lung dampness).


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pulmonary congestion,ఊపిరితిత్తుల శోధము(Cadmiosis),శ్వాసకోశాల శోధము(Airway inflammation),ఊపిరితిత్తుల నెమ్ము(Lung dampness).- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఊపిరితిత్తుల శోధము ఊపిరితిత్తుల కు సోకే సాధారణమైన సంక్రమిత జబ్బులలో ఒకటి శ్వాసకోశాల (ఊపిరితిత్తుల చిట్టచివర సూక్ష్మ దర్శినిలో చూడగలిగిన సూక్ష్మమైన వాయు కోశగోణులు వుంటాయి. వీటిని వాయు కోశాలు అంటారు. ఇక్కడ ప్రాణవాయుమార్పిడి జరుగుతుంది. శ్వాసకోశాల తో ఈ వాయు కోశాలు ఒకభాగంలో లేక ఒకటి కన్నా ఎక్కువ భాగాలలో శోధమునకు గురై ద్రవాలు చేరుతాయి. దీనిని కంజెషన్ (ఊపిరితిత్తులలో రక్తము చలనము లేకుండా నిల్వవున్న పరిస్ధితి) శ్వాసకోశాల శోధములో కనబడే లక్షణాలలో ఇది ఒకటి ఈ ద్రవాల చేరిక మూలంగా శ్వాసకోశాల విధి నిర్వహణలో అంతరాయం కలుగుతుంది.

శ్వాసకోశాల శోధము ఒకటి లేక రెండు ఊపిరితిత్తులను ప్రభావితం చేయవచ్చు. దీనికి కారణములు సూక్ష్మజీవులు, వైరస్ లు, శీలీంధ్రాలు కావచ్చు.సూక్ష్మ క్రిమి సంహారక మందులు కనుగొనక ముందు శ్వాసకోశాల నెమ్ము సోకిన రోగులు ఈ శోధముతో మరణించేవారు.

గడిచిన కొద్ది కాలం నుంచి ప్రతి సంవత్సరము ప్రపంచంలో పసిపిల్లలు 5 సంవత్సరాల లోపే వివిధ కారణాల వల్ల సోకే శ్వాసకోశాల నెమ్ము తో చనిపోతున్నారు. భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు జబ్బులతో చనిపోతున్నారు. వీరి సంఖ్య 4 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 2 లక్షల మంది న్యూమోకోకస్ అనే సూక్ష్మ క్రిమి శోధము మూలంగా జరుగుతున్నాయి.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల చావులు ఈ జబ్బులతో కావడం దరిదాపు మరచిపోతున్నారు. అయినా కూడా దీని మూలాన చావులు మలేరియా, తట్టు వలన కన్నా ఎక్కువగానే వున్నాయి.
సంవత్సరాలు గడిచే కొద్ది మందులకు లొంగని న్యూమోకోకస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల వచ్చే శ్వాసకోశాల నెమ్ము ఎక్కువవుతున్నట్టు గమనించడం జరిగింది. ఇది కొద్దిగా జాగ్రత్త పడవలసిన విషయంగా భావించారు.
ఈ జబ్బుకు కారణమై బీజములు ( ఇవి సూక్ష్మ క్రిములు లేదా శిలీంధ్రాలు లేక రసాయనాలు లేదా చికాకు కలిగించే పదార్ధాలు కావచ్చును.) గాలిలో నుంచి శ్వాస ద్వారా శ్వాసకోశములోకి తద్వారా శ్వాసవాహిక చిట్టచివరనున్న వాయు కోశ గోణులలోనికి చేరుతాయి. ( ఇవి ద్రాక్ష పళ్ళ గుత్తుల వలె ఉంటాయి. ఈ వాయు కోశ గోణుల వద్దే ప్రాణ వాయువుల మార్పిడి జరుగుతుంది.
 
ప్రాధమికంగా శ్వాసకోశ నెమ్ము ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులకు సంక్రమిస్తుంది. ఈ సంక్రమణకు కారణం జీవులు తో కూడుకొని వున్న బిందువులను శ్వాసద్వారా పీల్చు కొనడమే.
ఇవి జబ్బులతో భాద పడుతున్న వారు దగ్గినపుడు బిందువుల వలె బయటకు వస్తాయి. ఈ బిందువులు ఎదుట వ్యక్తి శ్వాసద్వారా లోనికి పీల్చినపుడు సంక్రమిస్తుంది.  సాధారణంగా  ఎక్కువ మంది ఒకే చోట నివసించే చోట ఇటువంటి జబ్బులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు  ఎక్కువ వుంటాయి. చలి కాలం వ్యాధి వ్యాపించడానికి ఎక్కువ అవకాశం వుంటుంది.

ఏదైనా అన్యమైన వస్తువు శ్వాసద్వారా శ్వాసకోశములోని తద్వారా వాయు కోశ గోణులలోనికి చేరుతాయి. అన్యమైన వస్తువు యొక్క ఉనికి సహజమైన ప్రతి ఘటన శక్తిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా శ్వాసకోశాలలో ద్రవ పదార్ధాలు, సూక్ష్మ క్రిములతో పాటు చేరడం జరుగుతుంది. వీటిలో తెల్ల రక్తకణాలు కూడా వుంటాయి. వీటి పర్యవసానంగా శ్వాసకోశాల వాపు, రక్తం నిల్వ వుండి పోవడం జరుగుతుంది. దీనినే న్యూమోనియా లేక శ్వాసకోశాల లేక ఊపిరితిత్తుల నెమ్ము అంటారు.

శ్వాసకోశాల నెమ్ము సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి సోకుతుంది. మీ శ్వాసకోశ వ్యవస్ధ సమక్రమితం లేక ఇతర వ్యవస్ధల యొక్క సంక్రమితం ముఖ్యంగా శరీరం యొక్క రక్షణ వ్యవస్ధలో కొరత వున్నప్పుడు ఇది న్యూమోనియా పరిణమిస్తుంది. నోటిలో, గొంతులో, ముక్కులో,  సాధారణంగా ఉండే సూక్ష్మ క్రిములు, వైరస్ లు వ్యాధి నిరోధక శక్తి క్షీణించినపుడు పై చేయి తీసుకొని శ్వాసకోశ వ్యవస్ధలోనికి ప్రయాణించి వ్యాధి సంక్రమింప చేస్తాయి. నిద్రలో వున్నపుడు నోటిలో గోందుతా, ముక్కులో వున్న గ్రంధ జనిత స్రావాలు గొంతు నుంచి ఊపిరితిత్తులలోకి వెళతాయి.

సహజంగా శరీరం యొక్క ప్రతి ఘటన శక్తి, వ్యాధి నిరోధక వ్యవస్ధ ఈ విధంగా బిడ్డ క్రిములను బయటకు తోయడానికి ప్రయత్నిస్తాయి. కాని వ్యక్తి ఇతర జబ్బుల కారణంగా బలహీనంగా వున్నప్పడు, న్యూమోనియా తీవ్ర రూపం దాల్చే అవకాశం వుంటుంది. గత కొద్ది కాలంగా వైరస్ వ్యాధులు సోకిన వారికి వేరే శ్వాసకోశ వ్యాదులువున్నవారు, గుండె జబ్బుల వారు, మింగడంలో సమస్యలు వున్నవారు, మధ్యపానం చేసేవారు, వేరే మందులు వాడే వారు, పక్షవాతం, ఫిట్స్ జబ్బు వున్న వారిలో శ్వాసకోశ నెమ్ము సాధారణ జనాభా కంటే ఎక్కువగా  వచ్చే అవకాశం వుంటుంది.

ఒకసారి ఈ క్రిములు ఊపిరితిత్తులలోకి చేరాక గాలితిత్తులలో స్ధిరపడి అతి వేగంగా సంఖ్యాకంగా పెరగడం మొదలుపెడతాయి. శరీరం వీటికి విరుద్దంగా పోరాడడం మొదలు పెట్టే సరికి ఊపిరితిత్తులలో చీము, నెత్తురు (తెల్ల రక్తకణాలు) నిలువ వుండడం మొదలైపోతుంది. దీనినే ఊపిరితిత్తుల నెమ్ము అంటారు.
శ్వాసకోశ నెమ్ము రెండు రకాలు. దీనిని ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్ధితిని బట్టి విభజిస్తారు. ప్రాధమికంగా శ్వాసకోశ నెమ్ము ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులకు వస్తుంది. ద్వితీయ శ్వాసకోశా నెమ్ము ముందుగానే పాడయిన శ్వాసకోశాలకు వస్తుంది. వ్యాధి సోకిన, ముందు గానే వున్న సంక్రమితం వల్ల చెడిపోయిన ఊపిరితిత్తులలో లేక పుట్టుకతో వున్న వైకల్యాలు వున్నప్పుడు వాటి మీద వచ్చే అవకాశం వుంటుంది.

గమనం లేకుండా పరాయి పదార్ధాల ఊపిరితిత్తులలోనికి పీల్చడం వల్ల వచ్చిన శ్వాసకోశాల నెమ్ము సాధారణంగా కండరాలు సంవరణి కండరాలు నోటి నుంచి ఊపిరితిత్తులలోనికి పదార్ధాలు  పోకుండా అడ్డుకుంటాయి. కాని ఇవి బలహీన పడినపుడు పదార్ధం ఊపిరితిత్తులలోనికి పీల్చబడతాయి. దీనినే పీల్చబడ్డ శ్వాసకోశాల నెమ్ము అంటారు. జీర్ణాశయంలోని పదార్ధాలు జీర్ణాశయ సంవరణి బలహీనంగా వుండడం మూలంగా వెనక్కు వచ్చి (సాధారణంగా ఒకసారి ఆహార పదార్ధాలు అన్నాశయంలోకి చేరాక సంవరణి మళ్ళీ తెరచుకోదు) ఊపిరితిత్తులలోనికి పీల్చబడతాయి.
 • ఎవరెవరిని ప్రభావితం చేస్తుంది.?
    2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు.పసి పిల్లలు, ముసలి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో సర్వ సాధారణంగా మరియు  పోషకాహారం లోపము వున్న పిల్లలలో ప్రమాదకరంగా వస్తుంది. గర్భిణీ స్త్రీలలో మధుపానం చేసే వారిలో కూడా కనబడుతుంది.

    క్రింద చూపిన పిల్లలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
    గ్రామీణ ప్రాంతాలలో ముక్కలోపల నూనెలు పోస్తారు. వారు అజ్ఞానంతో ముక్కులు శుభ్రం చేస్తున్నామనుకుంటారు.
    - పాలు సరియైన పద్దతిలో పట్టక పోవడం
    - అనుకోకుండా గడ్డినూనె పీల్చడం (విషం)
    వృద్దులలో క్రింది కారణాల వల్ల కావచ్చును.
    - తగ్గు ముఖం పట్టిన రోగనిరోధక శక్తి
    - దీర్ఘకాలిక వ్యాధులు ( చక్కెర వ్యాధి)
    - కండరాల బలహీనత, పార్కిన్ సొనికుమ (ఇది ఒక కండరాల జబ్బు)
    - ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఎయిడ్స్ వ్యాధిలో రోగనిరోధక శక్తి నశించి పోవడం మూలంగా సాధారణ వ్యక్తులలో హాని కలిగించలేని క్రిములు కూడా వీరిలో విజృంభిస్తాయి.
 • లక్షణాలు మరియు సంకేతాలు
    - ఇవి రోగి యొక్క వయసు తీవ్రత, వ్యాధి రోగనిరోధక శక్తి మీద ఆధారపడి వుంటాయి.
    - పిల్లలలో కనబడే లక్షణాలు సంకేతాలు
    - పిల్లలలో ప్రాధమిక దశలో  ఎక్కువ లక్షణాలు కనబడవు కాని జ్వరం, సుస్తీగా కనబడడం , నిరాసక్తతగా వుండడం వంటివి కనబడతాయి.కొంత తీవ్రత పెరిగాక శ్వాస తీసుకుంటున్నపుడు ఛాతీ లోపలకు గుంజుతున్నట్టు కనబడడం, శ్వాస వేగంగా, త్వరత్వరగా తీసుకుంటున్నట్టు వుండడం, చర్మం నీలంగా మారడం మొదట జలుబు చేసి తరువాత తీవ్రమైన జ్వరం రావడం దగ్గితే తెమడ పడడం ఈ తెమడ రంగు గోధుమ రంగులో(తుప్పు) లేదా రక్తంతో కూడి వుండవచ్చు.
    పెద్దవారిలో లక్షణాలు :
    శ్వాసకోశాల నెమ్ము సోకగానే ముందు జలుబు తరువాత తీవ్ర జ్వరం (104 కంటే ఎక్కువ)
    చలితో వణకడం
    తెమడ తో కూడిన దగ్గు తుప్పు రంగు లేదా రక్తంతో కూడిన తెమడ రావడం
    ఊపిరి పట్టనట్టుగా త్వరత్వరగా తీసుకోవడం
    ఛాతీ నొప్పి – ఊపిరితిత్తులను కప్పివున్న పొరలో సంక్రమితం ప్రాకినప్పుడు ఈ నొప్పి దీర్ఘంగా ఊపిరిలోనికి పీల్చినపుడు తీవ్రతరమవుతుంది. దీనినే శ్వాసకోశ తిత్తి నొప్పి అంటారు.
    రోగి పిల్లలైనప్పుడు వారిని గమనిస్తూ వుండాలి. పసి పిల్లలలో నెమ్ము లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయరాదు. చాలా త్వరగా ప్రమాద పరిస్ధితికి చేరుకుంటారు. నెమ్ముకు దారి తీసే ప్రమాదాల నుంచి పిల్లలను దూరంగా వుంచాలి.
 • నివారణ
        వ్యాధి గ్రస్తులైన వారికి దూరంగా వుండడం
        తల్లులకు పిల్లలకు పాలు పట్టే విధానం అవగాహన కలిగించాలి.
        నెమ్మును నివారించే టీకాలు ముఖ్యంగా వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా లేక మార్పు చెంది వున్న పిల్లలకు  వేయించాలి. (పోలిలేలెంట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్)
        కొంత మందిలో లక్షణాలు మెల్లమెల్లగా బయట పడుతూ పోతాయి.
        దగ్గు ఎక్కువవుతూ పోవడం తలనొప్పి, కండరాల నొప్పులు మాత్రం కనబడవచ్చు.
        కొంత మందిలో దగ్గు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సంక్రమితం ఊపిరితిత్తుల పెద్ద గాలి మార్గాలలో ఉండకపోవచ్చు.
        కొంత మందిలో చర్మం నీలంగా గోధుమ రంగుకు మారవచ్చు. దీనికి కారణం రక్తంలో  ప్రాణ వాయు శాతం తగ్గడమే
 • తీసుకోవలసిన జాగ్రతలు
    మొదటగా       
 • వ్యక్తిగత పరి శుభ్రత
 • నోటి మీద గుడ్డ (ముఖ్యంగా దగ్గు వచ్చినపుడు) కప్పుకోవాలి. దీని వల్ల వ్యాధి ఎదుట వారికి వ్యాపించ కుండా వుంటుంది.
 • తగినంత పోషకాహారం, గాలి ( పరిశుభ్రమైన) అవసరము .

 • =====================================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 20, 2012

Emotion - ఆవేశము
 •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Emotion - ఆవేశము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మనిషి ఎందుకు నవ్వుతాడు? ఎందుకేడుస్తాడు. హుషారుగా ఉంటాడెందుకని? కోపం తెచ్చుకుంటాడెందుకు? కొన్ని భయాలు మనిషిని ఎందుకు వెంటాడుతాయి? ఇవన్నీ మనుషుల్లో సాధారణంగా మనం గమనించే కొన్ని ఆవేశాలు. ఎందుకు ఇలా జరుగుతుందనే దృగ్విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఉదాహరణకు ఒక ప్రత్యేక సందర్భానికి స్పందించిన ఒక వ్యక్తి మరోసారి పిచ్చి కోపంగా ప్రవర్తిస్తాడు. సరిగ్గా అటువంటి సందర్భానికే మరొక వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. ఫోబియాలతో వ్యక్తిత్వాన్ని మసక బార్చుకుంటారు కొంతమంది. అసలు ఆవేశాలు అంటే ఏంటి? ఆలోచన, ఆవేశం మానవజాతి ప్రత్యేక సొత్తు. ఇదంతా మనసుకు సంబంధించిన వ్యవహారం. ప్రకృతిలో మానవజాతి అవతరించే వరకూ కూడా దేహం మాత్రమే పరిణామానికి గురవుతూ వచ్చింది. మానవావతవరణ నుండీ మనస్సు పరిణామం చోటుచేసుకొంది. ఇక్కడి నుంచీ వేదనలు, భావనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆవేశం వల్ల తీవ్రమైన కలతకు గురవుతాడు మనిషి. ఇవి మానసికంగా మొదలవుతాయి. ఫలితంగా  స్పృహలో ఉండే అనుభవాలతో, అంతరంగాలలో చర్యల ఫలితంగా ఈ ఆవేశాలు ఉత్పన్నమవుతాయి.ఉత్సాహం, సంతోషం, ఆశ, ప్రేమ,కోపం, అసూయ, అనుమానం, నిరాశ, భయం, నిస్పృహ.... ఆవేశాలు అంటే ఇవే. మనిషి ఆవేశాలు, దానితో ముడిపడి వున్న అతని ప్రవర్తన అటు మానసిక శాస్త్రవేత్తలకు ఇటు సామాన్య జనానికి ఆసక్తికరమైన అంశంగా తయారయింది. అయితే ఆవేశాల ప్రభావం మనిషి శారీరక, మానసిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటుందనే విషయం స్పష్టమయింది.

ఆవేశాలు - విశేషాలు

ఆవేశాలు మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. సామాజిక అనుబంధాలు, ఇతర ప్రేరణల కారణంగా మనిషి ఆవేశానికి లోనవుతాడు. ఆవేశానికి గురయిన వ్యక్తి ఆలోచనా, కారణాలను మర్చిపోతాడు. కోపంతో రగిలిపోతున్న వ్యక్తికి తార్కికవాదం పనిచేయదు. ఒక్కో ఆవేశానికి ఒక్కో రకంగా ప్రతి చర్య ఉంటుంది. మనిషి కోపంగా ఉన్నప్పుడు ఏ మాట విన్నా మరింత కోపోద్రిక్తుడవుతాడు. అదే మనిషి భయం పొరల్లో ఇరుక్కుపోతుంటే పారిపోయే ప్రయత్నంలో ఉంటాడు.

మానవ ఆవేశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. అనుకూల లేదా ఆనందకరమైన ఆవేశాలు. రెండవ రకం ప్రతికూల లేదా ఆనందరహిత ఆవేశాలు. ఆనందకరమైన ఆవేశాలంటే ఉత్సాహం, సంతోషం, ఆశ, ప్రేమ, అంగీకరించడం వంటివి. ఆనంద రహిత ఆవేశాలంటే కోపం, అసూయ, అనుమానం, నిరాశ, భయం, నిస్పృహ. ఈ ఆనంద రహిత ఆవేశాలు మనిషి మానసిక, శారీరక స్థితులకు హాని చేస్తాయి. ఉదాహరణకు మనిషి అసూయతో ఉన్నాడంటే అది అతని మానసిక ధోరణిని, ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇది ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చకపోగా అనారోగ్యాన్ని సృష్టిస్తుంది. అసూయ అనేది ఉద్యోగస్తులలోనే కాదు, సామాన్య జనంలో కూడా ఎక్కువగానే వుంటుంది. ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితుల ఉన్నతిని చూసి ఓర్వలేనివారు ఉంటారు. వీరు ఇతరులతో పోల్చుకుంటూ అసూయకు బానిసలై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు.

ప్రతి ఆవేశం ఒక్కొక్క రకమైన స్పందనను సృష్టిస్తుంది. భయం మనిషిలో 'తిరగబడు', 'పారిపో' అనే అనుక్రియలను కల్గిస్తుంది. కోపం కలహ ధోరణిని రెచ్చగొడుతుంది. సంతోషం, ప్రేమ వంటివి ... అభిమానాన్ని, ఆప్యాయతను సృష్టిస్తాయి. ఆవేశానికి లోనయిన మనిషి చేతులకు చెమట పడుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు ఎక్కువవుతుంది. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరాలో, ముఖ కవళికల్లో మార్పు కన్పిస్తుంది.

''షాక్‌ వార్త విని ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది'' అంటుంటారు. అంటే ఆవేశాలకు గుండె ఒక గుర్తు. మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆవేశం మార్పు తీసుకొస్తుంది. ఆవేశ, సందిగ్ధ పరిస్థితులలో మనిషికి శ్వాస స్థంభించినట్లవుతుంది. కనుపాపలు ఆవేశానికి ప్రతిరూపంగా కన్పిస్తాయి. కోపం, నొప్పి, ఉద్రేకం వంటివి వచ్చినప్పుడు కనుపాపలు పెద్దవవుతాయి. శరీరంలోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. నోరు పొడారిపోతుంది.

ఎక్కువ ఒత్తిడి, ఆతృత వల్ల శరీరంలో అల్సర్లు వస్తాయని వైద్య విజ్ఞానంలో నిరూపితమైంది. రక్తంలోని అంశీభూతాల నిర్మాణ నిష్పత్తిలో కూడా తేడాలు వస్తాయి. రక్తంలోకి విడుదలయ్యే అడ్రినల్‌ హార్మోన్‌ అవేశ సమయంలో మనిషి శారీరక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. ఆనందం, సంతోషం, ఉత్సాహం వంటి అనుకూల ఆవేశాలు శరీరానికి మేలు చేస్తాయి. సంతోషం స్థాయి ఉప్పొంగిపోయే స్థితి నుండి పారవశ్యం చెందేవరకు ఉండొచ్చు. ప్రతికూల ఆవేశాలు అయిన దుఃఖం, అసహ్యం, భయం, కోపం వంటివి వినాశనకర ఫలితాలు తెచ్చిపెడతాయి. నిద్రలేమి కల్గుతుంది.

ఏం చెయ్యాలి?

మనిషి తనను తాను అదుపు చేసుకోగల్గాలి. ప్రతికూల ఆవేశాలకు లొంగకుండా అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. ముఖ్యంగా మానసిక క్రమశిక్షణతో అసూయ, ఏవగింపు, కోపం, భయం వంటి ఆవేశాలను దరిచేరకుండా జాగ్రత్తపడొచ్చు. యోగా, ధ్యానం, సంగీతం వంటి వాటిని ఆశ్రయిస్తే ఈ ప్రతికూల ఆవేశాలను జయించగల్గుతారు. ఈ ప్రతికూల ఆవేశాలు తెచ్చే అనర్థాలను అర్థం చేసుకుని, వాటికి లొంగకూడదని నిర్ణయించుకుంటే సుఖసంతోషాలతో ఉండడమే కాక తమ మానసిక శక్తిని ఉత్పాదక పనులకు వినియోగించుకో గల్గుతాడు. ఆవేశాలను అర్థం చేసుకోవాలి. ప్రతికూల ఆవేశాల నుండి తప్పించుకోవాలనుకుని, వాటిని ఆచరణలో పెట్టాలి. దీనికి బోలెడంత కృషి కావాలి. కొంత సమయం పడుతుంది. అయినా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయి.

- C.V.Sarveswarasharma @prajasakti news paper... Edited / Dr.Seshagirirao -MBBS
 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 19, 2012

Electrophisiology theraphy for heart-ఎలెక్ట్రో ఫిజియాలజీ థెరపీ గుండె జబ్బులకోసం

 •  
 •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ఎలెక్టో ఫిజియోలజీ థెరపీ.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 గుండె వ్యాధులకు సంబంధించిన ఆధునిక వైద్య విధానము " ఎలెక్ట్రో ఫిజియోలజీ "  మనదేసములో ఇంకా పుర్తీ స్థాయిలో అందుబాటులోకి రాని ఈ చికిత్సా విధానము గుండె లయలో మార్పులను సరిచేస్తుంది .గుండెకు సంబందించిన వైద్యవిధానము ఆధునిక వైద్యము ఎలెక్టో ఫిజియోలజీ థెరపీ. దీన్నే ఎలెక్ట్రికల్ సిస్టం  ఆఫ్ ది హార్ట్  అంటారు . దీన్ని చికిత్స చేసే వైద్య్ నిపుణులను " ఎలెక్ట్రీషియన్‌స్  ఆఫ్ ది హార్ట్ " అంటారు .

గుండె లయలో మార్పులెందుకూ? :
గుండెను ఓక్ ఇంటితో పోల్చి చూసినప్పుడు .. ప్రతి ఇంటిలో ఒక విద్యుత్ జనరేటర్ , ఒక  ట్రాన్‌ఫార్మర్ , వైరింగ్ ఉన్నట్లే  ప్రతి మనిషికి గుండె లో పల్స్ జనరేటర్ ఉంటుంది . గుండే కొట్టుకోవడానికి అది తోడ్పడుతుంటుంది. దీన్ని " సైనో ఏట్రీల్ నోడ్ (SA node) అంటారు . అక్కడ నుంఛి విద్యుచ్చక్తి  ట్రాన్‌స్ ఫార్మర్ కు వచ్చి నట్లే  రక్తం అక్కడకు వస్తుంది . ఇక్కడ దీన్ని ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ (ఎ.వి.నోడ్ ) అంటారు . .దాని క్రింద వచ్చే వైరింగ్ అంటే రక్త సరఫరా జరిగే ప్రదేశాన్ని వెంట్రికల్ అంటారు . పైభాగాన్ని ఏట్రియం , కింది బాగం వెంట్రికల్ గా వ్యవహరిస్తారు .

ప్రతి మనిషి గుండె లో నాలుగు కవాటాలు ఉంటాయి. రెండు ఏట్రియాలు , రెండు వెంట్రికల్ లు  ఉంటాయి. శరీరములోని చెడు రక్తము ఏట్రియాకు వచ్చి అక్కడనుంచి కుడి వెంట్రికల్ కు వెళ్ళి అక్కడనుండి ఊపిరితిత్తులకు వెళుతుంది . అక్కడ శుద్ది చేసుకున్న రక్తము ఎడమవైపున ఉన్న ఏట్రియం కు వస్తుంది . , తరువాత ఎడమ వెంట్రికల్ కు వెళ్ళి అక్కడి నుంచి శరీరమంతటా సరఫరా అవుతుంది . దీన్నిబట్టి గుండెను ఒక మోటారు పంప్ తో పోల్చవచ్చును. వెంట్రికల్స్ అనేవి ఒక పంపులా పనిచేసి శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. గుండె కొట్టుకోవడంఉలో ఎటువంటి అసాధారణ క్రియనైనా సరిచేయడం ఎలెక్టోఫిజియాలజిస్టుల పని ,అంటే గుండె దడ , గుండె నెమ్మదిగా కొట్టుకోవడము , అపసవ్యము గా కొట్టుకోవడము , చాలా వేగంగా కొట్టుకోవడము , వంటివన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.

ఈ సమస్యలు ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఎస్.ఎ.నోడ్ సరిగా పనిచేయకపోవడము .. లేదా ఏ.వి.నోడ్ సరిగా పనిచేయకపోవడము .,లేదా కవాటాలకు రక్తసరఫరా సరిగా లేకపోవడము  వంటివి కావచ్చును . గుండె వేగము అపసవ్యము గా ఉండడానికి ఏట్రియం లో  లోపాలు కూడా కారణము కావచ్చును. అలాగే కింది కవాటం లోని వెంట్రికల్ లో లోపాలు కారణము కావచ్చు . వెంట్రికల్ లోని లోపాలవల్ల ఏర్పడే గుండె అపసవ్య గమనం అత్యంత ప్రమాదకరమని చెప్పవచ్చు .ఎందుకంటే వెంట్రికల్ నుంచే శరీరం మొత్తానికి రక్తము సరఫరా అవుతుంది . గుండె వేగము పెరిగినా , తగ్గినా ్...రక్తసరఫరా తగ్గిపోతుంది . దీనికి ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమవుతాయి.

వ్యాధి నిర్ధారణ ఎలా?

గుండె కొట్టుకునే వేగము ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే ఎలెక్ట్రోఫిజియోలాజికల్ (ఇసి)అద్యయనము చేయాల్సి ఉంటుంది . ఎస్.ఎ.నోడ్ దగ్గర ఏ.వి నోడ్ దగ్గర దానికింద వవాటాల దగ్గర క్యాథటర్స్ పెట్టి అధ్యయనము చేస్తారు . ఎందుకు గుండెదడ పెరిగింది ? , ఎందుకు గుండె దడ తగ్గిపోయింది? వంటి విషయాల్ని తెలుసుకుటారు . కణజాలములో లోపాలు ఉంటే ' రేడియో ఫ్రీక్వెన్‌సీ  అబ్లేషన్‌ (కాలచడము) చేస్తారు . లోపము ఎక్కడుందో తెలుసుకున్న తరువాత  ఆ ప్రదేశము లో గుండె వేగము లో మార్పులను తెస్తున్న కణాలను కాల్చివేయడం జరుగుతుంది . అలా కాల్చడానికి ఉపయోగించేదే ... " రేడియో ఫ్రీక్వెన్‌సీ ఎనర్జీ"  ఇందులోనే వేరే విధానాలు కూడా ఉంటాయి. క్రయో అబ్లేషన్‌ లో కణాలను శీతలము చేయడానికి ఐస్ ను ఉపయోగిస్తారు . కణజాలం లోని కణాలు శీతలానికి ఫ్రీజ్ అయి చనిపోతాయి.

చికిత్సా పద్దతులు :

గుండె వేగము పెరగడాన్ని   టెకీ కార్డియా అంటారు . ఇది ఏట్రియం వలన  లేదా  వెంట్రికల్ వలన రావచ్చును. వెంట్రికల్ నుండి వచ్చేదాన్ని వెంట్రుకులర్ - టెకీకార్డియా అంటారు . అందుకే వెంటనే చికిత్స ను అందచేయాల్సి ఉంటుంది. ఇది ముదిరితే  .. తలెత్తే వెంట్రికల్ ఫిబ్రిల్లేషన్‌ అనే పరిస్థితిలో రోగి హఠాత్తుగా చనిపోవచ్చు. గుండె కొట్టుకోవడము హఠాత్తుగా నిలిచిపోతుంది . ఎటువంటి కారణము లేకుండా హఠాత్తుగా గుండె పోటుతో మరణిచ్చేవారిలో అధిక శాతము వెంట్రికల్ ఫిబ్రిల్లేషన్‌ కారణము గానే మరణిస్తున్నారు . వీటికి చికిత్స చేసేదే ఎలెక్ట్రోఫిజియాలజీ థెరఫి . దీనికి కూడా వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి.
 •  త్రీడి వ్యాపింగ్ చేసి   చికిత్స చేయడము ఒక పద్దతైతే , పేస్మేకర్ లాగా ఉండే  ఐసిడి అనే పరికరము అవర్చడం మరోపద్దతి. 
 • గుండె వేగాన్నీ నియంత్రించడానికి పేస్మేకర్ ను ఉపయోగించడము అందరికీ తెలిసిందే . దీనికి ఒకటి  లేదా  రెండుచోట్ల వైర్లు ఉంటాయి. 
 • హార్ట్ ఫెయిల్యూర్ కేసులలో గుండె చాలా బలహీనపడి ఉంటుంది ... దానికి సపోర్ట్ చేయడానికి స్పెషల్ ఫేస్మేకర్ అమరుస్తారు . దీంట్లో మూడు వైర్లు ఉంటాయి . . . ఒకటి ఏట్రియం లో, రెండోది కుడివైపు వెంట్రికల్ లో , మూడోది ఎడమ వెంట్రికల్ లో అమరుస్తారు . దీన్ని కార్డియక్ రీసింక్రనైజేషని థెరఫీ(సి.ఆర్.టి) అంటారు . 
 • భవిష్యత్తులో కంప్యూటర్ నేవిగేటెడ్ రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రోగులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 
Courtesy with .. Dr.jayakeerthi Y.Rao - consultant Electrophysiologist  , Sunshine hospitals  HYD.

 • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/http://

Friday, October 12, 2012

సాధారణ కంటి సమస్యలు , Common Eye problems


 •  
 •  
 • కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు ఎంత చిన్నవి అయినా , చెంపకు చేరడేసైనా మనజీవతానికి అవే వెలుగు . కళ్ళు లేని జీవనాన్ని , జీవితాన్ని ఊహించలేము . కళ్ళు ఆత్మకు అద్దం పడతాయి. ఆనందాన్ని , ఆవేదనని వ్యక్తం చే్స్తాయి . సంతోషాన్నీ , సంతాపాన్ని వెల్లడిస్తాయి. , నవ్వులు కురిపిస్తాయి., కరుణని ఒలికిస్తాయి , కళ్ళు కళ్ళు కలిస్తే మాటలు మౌనమవుతాయి. చూసి అర్ధము చేసుకోగలిగితే కళ్ళు ఎన్నో ఊసులు చెబుతాయి. ఇలా ఆనందాన్ని , ఆహ్లాదాన్ని , సంతోషాన్ని వ్యక్తముచేసే కళ్ళు అంతరంగాన్ని కూడాఆవిష్కరిస్తాయి. అలసటకు అద్దం పడతాయి. వాటికీ ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని తెలుసుకొనే అవగాహనే ఈ వ్యాసము .
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సాధారణ కంటి సమస్యలు , Common Eye problems- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కంటి లెన్స్‌లు
కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్‌ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్‌ కె.ఎస్‌. పార్ధసారధి వెల్లడించారు.

సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్‌ ప్రభావాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగాలు విపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు.

శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్‌ ఆఫ్‌ రేడి యోలాజికల్‌ ప్రొటెక్షన్‌ (ఐసిఆర్‌పి) గాగుల్స్‌ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.

రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.

కాలుష్యంతో కంటి సమస్యలు
 ఇనుము కంపెనీ నుంచి వచ్చే వాయు కాలుష్యం వల్ల  కంటి చూపు సమస్యలు వస్తాయి.  కొన్ని హొటల్స్ , కుటీర పరిశ్రమల  నుంచి పెద్ద ఎత్తునా పొగ వెలువడి  ఒకరికొక్కరు కనబడని పరిస్థితి నెలకొంటుంది  . జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమలను సుప్రీం కోర్టు నిషేధించినప్పటికీ అమాయకులైన ప్రజలు ఇష్టారాజ్యము గా పొగ కాలుస్యాన్ని కలిగించే పరిశ్రమలు నిలకొల్పుతునే ఉన్నారు.

చిన్న పిల్లలకు వచ్చే సాధారణ కంటి సమస్యలివి...
సాధారణంగా చిన్నారుల్లో కనిపించే కంటిసమస్యలను ఆరు విభాగాలుగా చెప్పవచ్చు.
 • అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్: ఇందులో లక్షణాలు కంటికి కనిపించేది స్పష్టంగా లేకుండా మసకమసకగా ఉండటం (బ్లర్‌డ్ ్రవిజన్), ఏదైనా చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు కంటికి ఇబ్బందిగా ఉండటం, ఎక్కువసేపు చదివినప్పుడు కంటికి భారంగా అనిపించడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి మొదలైనవి. ఈ ఇబ్బందులను యాస్థెనోపిక్ సింప్టమ్స్ అంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే సరైన అద్దాలను ఉపయోగించడం ద్వారా పిల్లలకు స్పష్టంగా కనిపించేలా చేసి... సమస్య తీవ్రతరం కాకుండా కాపాడవచ్చు.

 • ఆక్యులార్ అలర్జీ: పిల్లలకు ఏవైనా సరిపడని పక్షంలో (అంటే ఇంట్లో ఉండే దుమ్ము ధూళి లేదా పూల పుప్పొడి వంటి వాటితో) కన్ను బాగా ఎర్రబారడం, కళ్లను తీవ్రంగా నలుపుకోవాలి అనిపించేలా కనురెప్పల చివరల్లో దురదలు, కళ్లలో నీరు రావడం వంటివి.

 • స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ (మెల్లకన్ను): ఈ సమస్య ఉన్న పిల్లల్లో రెండు కళ్లలోని నల్లగుడ్డు ఒకేలా లేకపోవడం (అంటే ఒకటి ఒక పక్కకు గాని, లేదా రెండూ రెండు పక్కలకు గాని తిరిగి ఉన్నట్లు కనిపించడం). ఈ లక్షణాన్ని మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ ఐస్ అని పేర్కొనవచ్చు. దీన్ని వాడుక భాషలో మెల్లకన్ను అని వ్యవహరిస్తుంటారు. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మెల్లకన్ను అదృష్టసూచిక అని ఒక దురభిప్రాయం ఉంది. అయితే మన రెండు కళ్లలో చివరన ఏర్పడే ప్రతిబింబాలు రెండూ మెదడులో ఒకటిగానే కనిపించే ఏర్పాటు ఉండి... మనకు స్పష్టంగా కనిపిస్తుంది.స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ అని పిలిచే ఈ మెల్లకన్నుకు సరైన వయసులో సాధ్యమైనంత త్వరగా చికిత్స జరగకపోతే అది ఆంబ్లోపియా అన్న సమస్యకు దారితీసి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మెల్లకన్ను అదృష్టసూచిక కాదని గ్రహించి, పిల్లల్లో ఈ సమస్య ఉంటే వెంటనే కంటి వైద్యనిపుణులకు అందునా చిన్నపిల్లల కంటివైద్యుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించడం మంచిది.
 • రెటినల్ డిస్ట్రఫీస్ అండ్ డీజనరేషన్స్: ఈ తరహా జబ్బుల్లో కంటికి దగ్గర్లో ఉన్నవి లేదా దూరాన ఉన్నవి స్పష్టంగా కనిపించకపోవడం, రాత్రివేళల్లో లేదా పగటి వెలుతురు ఎక్కువగా ఉన్న సమయాల్లో స్పష్టంగా కనిపించకపోవడం, రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవేగాక మనకు కనిపించే కంటిచూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్) తగ్గుతూ పోవడం, ఒక్కోసారి కనుగుడ్లు అటూఇటూ వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం (వైద్య పరిభాషలో నిస్టాగ్మస్) వంటి లక్షణాలు ఉన్న సమస్యలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.

 • ల్యూకోకోరియా: ఇందులో కంటిపాప తెల్లగా కనిపిస్తుంది. మనలో చాలామందికి సాధారణంగా కంటిలోని తెల్లపువ్వు ఒక వయసు తర్వాతే వస్తుంటుందని భావిస్తుంటాం. కానీ కొందరిలో పుట్టుకతోనే కళ్లలో తెల్లపువ్వు (కంజెనిటల్ కాటరాక్ట్) ఉంటుందన్నమాట. అలాంటివే కంటిలో గడ్డలు (వైద్యపరిభాషలో ఇంట్రా ఆక్యులార్ ట్యూమర్స్) కనిపించే రెటినోబ్లాస్టోమా వంటి కేసులు కూడా ఉంటాయి. రెండు కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు లేదా తొమ్మిది నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రెటీనా దెబ్బతినే పరిస్థితి కూడా రావచ్చు. దాన్నే హాఫ్ ప్రీమెచ్యురిటీ రెటినోపతి అంటారు.

 • విటమిన్-ఏ లోపంతో వచ్చే కంటిసమస్యలు: కొందరు పిల్లల్లో పోషకాహారలోపం వల్ల కూడా కంటి సమస్యలు రావచ్చు. ఇటువంటివారిలో కళ్లు పొడిబారిపోవడం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీళ్లను పరిశీలిస్తే నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు (కార్నియల్ అండ్ కంజంక్టివల్ గ్సీరోసిస్) ఉంటాయి. దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటిలోని నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

వీలైనంత త్వరగా ఎందుకు...?
పిల్లల్లో కంటి సమస్య కనిపించిన వెంటనే వీలైనంత త్వరగా దాన్ని కనుగొనడానికి (డయాగ్నోజ్ చేయడానికి), చికిత్సకు ప్రయత్నించాలి. ఎందుకంటే మనం సముపార్జించే జ్ఞానంలో 80 శాతానికి పైగా మన జ్ఞానేంద్రియాలన్నింటిలోనూ ప్రధానమైన కంటి తో చూసి నేర్చుకునేదే. ఇక మన కంటి ద్వారా జరిగే చూపు ప్రక్రియలో చాలా ప్రక్రియలు ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జరుగుతుంటాయి. అందుకే ప్రక్రియలు జరిగే సమయంలో తలెత్తే లోపాలను ఎంత త్వరగా తెలుసుకుంటే వాటిని అంత త్వరగా సరిదిద్దవచ్చన్నమాట. తద్వారా పిల్లల్లో శాశ్వతంగా చూపుకోల్పోయే ప్రమాదాలను నివారించవచ్చు. అందుకే పిల్లల్లో చూపు సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

మనం రెండు కళ్లతో చూసే వేర్వేరు దృశ్యాలను ఒకటిగా చూసే యంత్రాంగం మెదడులో ఉంటుంది. రెండు కళ్లలో కనిపించే వేర్వేరు ప్రతిబింబాలను సమన్వయం చేసి ఒకే దృశ్యంగా చూసే ప్రక్రియలో ఒక్కోసారి మెదడు ఒక కంటి ప్రతిబింబాన్ని విస్మరించే ప్రమాదం ఉంది. అంటే... ఏదైనా కంటి నుంచి వచ్చే ప్రతిబింబం తాలూకు దృశ్యం అంత స్పష్టంగా లేనప్పుడు ఆ ప్రతిబింబాన్ని స్వీకరించేందుకు మెదడు నిరాకరిస్తుంటుంది. ఫలితంగా ఒక కంటి ప్రతిబింబాన్నే మెదడు కంటిన్యువస్‌గా స్వీకరిస్తూ రెండవ కంటి ప్రతిబింబాన్ని నిరాకరిస్తుంటుంది. ఇలా జరగడాన్నే వైద్యపరిభాషలో ఆంబ్లోపియా (లేజీ ఐ) అంటారు. దాంతో కొంతకాలం గడిచాక చూపు సరిగాలేని కంటికి వైద్యం చేసినా మెదడు దాన్ని నిరాకరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స చేయించడం అన్నది చాలా ప్రధానం.

పిల్లల్లో కంటిజబ్బులను గుర్తించడానికి ఏం చేయాలి?
సాధారణంగా పిల్లల్లో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో అన్న విషయాలు వారు చదివే పొజిషన్‌ను బట్టి తెలుస్తుంటాయి. పిల్లలు పుస్తకాలు చదివే సమయంలో సాధారణంగా ఒక అడుగు లేదా అడుగున్నర (12 నుంచి 18 అంగుళాల) దూరంగా పెట్టుకొని చదువుతుంటారు. చిన్నారులు తాము చదివే సమయంలో పుస్తకాన్ని మరీ దగ్గరగా పెట్టుకొని చదవడం లేదా దూరంగా పెట్టుకొని చదవడం, టీవీ బాగా దగ్గర్నుంచి చూడటం, మెల్లకన్ను పెట్టడం వంటివి చేస్తుంటే ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులను కలవాలి.

ఎప్పుడెప్పుడు?
చిన్నారుల్లో ఎలాంటి లోపాలు కనిపించకపోయినా స్కూల్లో చేర్పించే ముందు అంటే... మూడేళ్ల వయసులో ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులకు చూపించాలి. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో మరోసారి సంప్రదించాలి. ఇదిగాక పిల్లల్లో కంటికి సంబంధించి ఏ అసాధారణ లక్షణం కనిపించినా లేదా పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంప్రదించడం అవసరం.

పిల్లల్లో తల్లిదండ్రులు చూడాల్సిన అంశాలివే...
రెండు కళ్లలోని కనుగుడ్లు రెండూ ఒకేలా ఉన్నాయేమో చూడాలి.
రెండు కళ్లతో చూసినా మనకు కనిపించే దృశ్యం ఒకటిగానే ఉండాలి. (ఒకవేళ రెండు దృశ్యాలు వేర్వేగా ఉంటే దాన్ని డిప్లోపియా లేదా డబుల్‌విజన్ అంటారు. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి).
ఏ కంటితో చూసినా మనం చూసే దృశ్యం స్పష్టంగా ఉండాలి. ఒక కంటితో స్పష్టంగానూ, మరో కంటితో మసకగానూ ఉంటే వెంటనే చిన్నపిల్లల కంటివైద్య నిపుణులను సంప్రదించాలి.


టీచర్ల పాత్ర
సాధారణంగా పిల్లలకు కంటి సమస్య ఉన్నట్లుగా మొదట కనుగొనగలిగే అవకాశం ఉన్నది వాళ్ల ఉపాధ్యాయులకే. చదవడం, రాయ డం, బోర్డుపైన ఉన్న అంశాలను నోట్ చేసుకోవడం వంటివి వాళ్లు గమనిస్తుంటారు కాబట్టి మొదట తెలుసుకునే అవకాశం వాళ్లకే ఎక్కువ. ఈ సంగతి తెలియగానే టీచర్లు తల్లిదండ్రులకు విషయాన్ని వివరించాలి. దాంతో పిల్లల సమస్య మరింత తీవ్రతరం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది.

పిల్లల కంటివైద్యుల ప్రాధాన్యం
పిల్లల కంటి సమస్యలకూ సాధారణ కంటివైద్యులే చికిత్స చేయవచ్చు కదా! మరి పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ ఎందుకన్న ప్రశ్న తలెత్తవచ్చు. ఎందుకంటే... పెద్దల్లా పిల్లలు తమను బాధించే సమస్యను సరిగ్గా వివరించలేరు. పెద్దల్లా డాక్టర్లకు సహకరించకపోవచ్చు కూడా. వారు చెప్పని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, వైద్యపరీక్షల సమయంలో పిల్లలు సహకరించకపోయినా ఓపిగ్గా సమస్యను తెలుసుకొని చికిత్స చేసేలా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ శిక్షణ పొందుతారు.

పిల్లల్లో కనిపించే కంటి సమస్యల చికిత్సల్లో నైపుణ్యం ఉంటుంది. పిల్లల కంటివైద్యం కోసమే రూపొందించిన ప్రత్యేకమైన ఉపకరణాలను పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ కలిగి ఉంటారు. కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు పిల్లలను పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించడం మంచిది.

- డాక్టర్ రచనా, వినయకుమార్, పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్, స్క్వింట్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
     

 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Eye Care-కంటి జాగ్రత్తలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కంటి జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చదివేటపుడు- పుస్తకము 30 సెం.మీ. దూరము లో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి . కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది.
టెలివిజన్ చూస్తున్నప్పుడు-- ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు.
టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
చూసేటపుడు మనకు టీ.వీ. కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.

కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు
కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది.
రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మధ్యలో విరామము ఇవ్వాలి.
కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు.
మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.

బండి నడిపేటప్పుడు
బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి ,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.

Eye care in summer click for details->

Foreign bodies in Eye and care ->
 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, October 4, 2012

Arthritis medicine from sea plant,సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు,


 •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు--దుష్ఫలితాలు లేని మెరుగైన చికిత్స October/2012

కీళ్ల అరుగుదల (ఆర్థరైటిస్‌) వ్యాధితో బాధపడుతున్న రోగులకు మంచి ఉపశమనం కలిగించేలా సముద్రపు కలుపు మొక్క (సీ వీడ్‌) నుంచి తాము తయారు చేయించిన ఔషధం మంచి ఫలితాలను ఇస్తోందని 'కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ' (సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ.) డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సైదారావు వెల్లడించారు. మేరి కల్చర్‌ పేరుతో కొత్తగా సముద్రంలో చేయబోయే ప్రయోగాలను సమన్వయపరచే ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఆయన కోచి నుంచి విశాఖకు వచ్చారు. 'ఈనాడు-ఈటీవీ' ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పచ్చ ఆల్చిప్పల నుంచి తీసిన న్యూట్ర సీడికల్‌ను ఉపయోగించి ఆర్థరైటిస్‌కు మందును తొలుత తయారు చేసి ప్రయోగించాం. అది మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే అది మాంసాహారమనే ఉద్దేశంతో కొంతమంది రోగులు దానిని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో శాకాహారం నుంచి దీనిని తయారు చేయాలనే ఉద్దేశంతో సముద్రంలో లభ్యమయ్యే ఒక రకమైన కలుపుమొక్కని ఎంచుకున్నాం. దీని నుంచి తీసిన న్యూట్ర సీడికల్‌ను ఉపయోగించి తయారు చేసిన మందును వెయ్యి మంది రోగులకు ఉచితంగా ఇచ్చి పరీక్షింపజేశాం. 95% మంది మంచి గుణం ఇచ్చిందని చెప్పారు. ఇదో అద్భుతం. ఇంతటి విజయం గతంలో ఎవరికీ లభించలేదు. సాధారణంగా ఆర్థరైటిస్‌ రోగులకు నొప్పిని నివారించే మందుల్ని ఇస్తారు. దానివల్ల ఇతర సమస్యలు వస్తుంటాయి. మేం తయారు చేయించిన మందువల్ల అలాంటి సమస్యలు లేవు.

 • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, October 2, 2012

Meniere's Disease-మీనియర్స్ డిసీజ్

 

 •  Courtesy with : http://american-hearing.org/
 •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మీనియర్స్ డిసీజ్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చెవిలో గుయ్‌మనే శబ్దం, చెవిలో పూర్తిగా ఏ శబ్దమూ వినిపించదు.  చెవిలో ఎప్పుడూ హోరులాగా శబ్దం వినిపిస్తుంటుంది. దీనికి తగ్గట్లు  తరచుగా వాంతులు, వికారం వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నాయి.  సమస్యతో తీవ్రంగా నలిగిపోతారు.  ఈ వ్యాధి వయసుమళ్లిన వారిలోనే కనిపిస్తుంది. 40-50ఏళ్ల వయసులో ఎక్కువగా ఈ వ్యాధిని చూస్తుంటాము. చిన్న వయసువారిలో కనిపించదు. ఇది చెవి లోపలి భాగంలో తలెత్తే సమస్య. దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించే ఈ వ్యాధి లక్షణాలు అన్ని వేళలా కనిపించవు. "మినియర్స్ డిసీజ్"  చెవిలోపలి భాగంలో వచ్చే సమస్య. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో వ్యాధి లక్షణాలు ఎల్లప్పుడూ ఉండవు. అప్పుడప్పుడు లక్షణాలు అధికమవుతుంటాయి. లక్షణాలు సాధారణంగా 20 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి ఒక చెవికే వస్తుంది. ఇది ప్రాణాలకు హాని కలిగించే వ్యాధి కాదు.

కారణాలు :
ఇది లోపలచెవి సంభందించిన వ్యాధి. సాధారణంగా చెవి లోపలి భాగంలో ఉండే ద్రవపదార్ధం ఎక్కువ కావడం వల్ల వస్తుంది.ఈ వ్యాధిని ఒక ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుని " Prosper Ménière,''పేరున  పిలుస్తారు . దీనికి సరియైన కారనము తెలీదు . . . కాని ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ ములాన వచ్చే లోపలచెవి వ్యాధి. వర్టిగో రావడానికి ఒక ముఖ్యకారణము . ఇది 1860 ప్రాంతములో గుర్తించినా చాలాకాలము వరకూ ఎదోతెలియని వినికిడి జబ్బు గా పరిగణించబడినది. దీని లక్షణాలు ఒక్క సారిగా (సడన్‌) కనిపించవు .. ఒకటి ఒక్కటిగా క్రమేపీ ... వస్తూ పోతూ ... అప్పుడప్పుదు ఎపిసోడ్స్ లాగా ఉంటాయి.

లక్షణాలు :
తల తిరగడం, నడుస్తున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు కళ్లు తిరగడం వలన అదుపు తప్పి సరిగా నడవలేకపోవడం, చెవి లోపలి భాగంలో ఏదో బరువుగా ఉన్నట్లు, నిండినట్లు అనిపించటం, చెవిలో నుంచి శబ్దాలు వినిపించటం, బయటి శబ్దాలు సరిగా వినిపించకపోవటం, వికారంగా అనిపించటం, అది ఎక్కువై ఒక్కోసారి వాంతులు కావడం, చెమట పట్టడం (వ్యాధి తీవ్రత ఎక్కువైనపుడు).  తలనొప్పి, చిన్న శబ్దాలు కూడా తట్టుకోలేరు. సమస్యలు కళ్లు మూసినపుడు, వాహనంలో ప్రయాణిస్తున్నపుడు శబ్దాలకు ఎక్కువగా ఉంటుంది.  చిరాకు, నీరసం, వినకిడి కష్టంగా ఉండడం, నములుతున్నపుడు చెవిలో శబ్దాలు రావడం,

వ్యాధి నిర్ధారణ పరీక్షలు
చెవి వినికిడి శక్తిని పరీక్షించేందుకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రి పరీక్ష, రక్త పరీక్షలు, ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్. ఈ పరీక్షల వలన చెవి అంతర్భాగం, తలలో ఉండే సమస్యలను గుర్తించవచ్చు. చెవి డాక్టర్ ని సంప్రదించి ఆడియో మెట్రీ పరీక్షలు చేయించుకోవాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు
ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించటం, పొగ, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవటం, కాఫీని పరిమితంగా మాత్రమే తీసుకోవటం, యోగా, ధ్యానం లాంటి పక్రియల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకోవటం.

సమస్య అధికంగా ఉన్పప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వెల్లకిలా పడుకోవటం, తల తిరిగినట్లు అనిపించినప్పుడు ఏదైనా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించటం, చెవిలో శబ్దాలు వినిపించటాన్ని తగ్గించుకోవటం కోసం దూది పెట్టుకోవటం.

చికిత్స :
లోపల చెవిలో నీటి వత్తిడి కారణం గా వచ్చే వ్యాధి కనుక ... బి.పి. పెరగకుండా ఉప్పు తగ్గించి ఆహారము తీసుకోవాలి .
మధ్యపానము , ధూమపానము , కెఫినేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోరాదు . ఇవి మీనియర్స్ వ్యాధి లక్షణాలను బలోపేతము చేస్తాయి... హోరు ఎక్కువగా అనిపించును .
వికారము ,వాంతి తగ్గడానికి .. meclozine or dimenhydrinate, trimethobenzamide and other antiemetics, betahistine, diazepam, or ginger root, మున్నగునవి వాడవచ్చును .
యాంటిహెర్పిస్ మందు : "ఎసివిర్ " వాడే చరిత్ర ఉంది.

మీనియర్స్ వ్యాధి ఇబ్బంధికరమైన , అసహనానికి గురిచేసే వ్యాది కనుక మానసికం గా డిస్టర్బ్ అవకుండా '' యోగా''  అరోమా థిరఫీ వాడవచ్చును.

Intratympanic steroid treatments వాడే పద్దతి కూడా బాగా ప్రాచుర్యములోనికి వచ్చినది .
 labyrinthectomy సర్జరీ చేయడము ద్వారా హోరు తగ్గి ఉపసమనము ఇచ్చినా వినికి లోపము శాస్వితముగా కలుగును.


 • ============================

Visit my website - > Dr.Seshagirirao.com/