Showing posts with label Health with gardening. Show all posts
Showing posts with label Health with gardening. Show all posts

Thursday, August 18, 2011

తోటపనితో ఆరోగ్యం, Health with gardening



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తోటపనితో ఆరోగ్యం, Health with gardening
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బిజీ జీవితం నుంచి విశ్రాంతి పొందాలంటే మంచి మార్గం ప్రకృతితో స్నేహం చేయడం. కాసేపు పూలతో, చెట్లతో ముచ్చట్లాడి వాటి బాగోగులు చూసుకుంటే చాలు ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది. వాటికి కాస్త సేవ చేస్తే ఇటు వ్యాయామమూ అవుతుంది. ఇలా తోటపని ఇష్టపడేవారు రైతులే కానవసరం లేదని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రుజువు చేశారు. తామెంత గొప్పవారమైనా ప్రకృతితో చెలిమి తమకెంతో ఇష్టమంటుంటారు. తాము పెంచుకునే మొక్కల మధ్యలో సమయం గడిపి సేదతీరుతారు. ఇలా పూల మొక్కల మధ్య తిరిగి, వాటి పెంపకం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు. గార్డెనింగ్‌ వారికి ఓ హాబీగా మారుతుండడం విశేషం.

ఉదయం, సా యంత్రం వేళల్లో కాసేపు మొక్కలకు పాదులు చే యడం, చెట్లకు నీళ్ల పట్టడం చేస్తే ఒంట్లోని క్యాల రీలు తెలియకుండా ఖర్చయిపోతాయి . దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలకి ఆరుబయట ఎక్కువసేపు గడపకపోవడమూ ఒక కారణమంటున్నారు వైద్యులు. వెలుతురూ, గాలీ బాగా ఉండే చోట రోజులో కొంత
సమయమైనా గడిపితే ఈ సమస్యలు రావంటున్నారు. వెుక్కల పెంపకం దీనికి మంచి మార్గమని సూచిస్తున్నారు. వెుక్కలకు పాదులు చేయడం, నీళ్లు పోయడం ఏ వయసువారికైనా ఆరోగ్యకరమైన అలవాటు. మెక్కలు పెంచుతున్నామంటే మనం ప్రకృతికి దగ్గరవుతున్నట్లు. ఈ అలవాటు మనకు తెలియకుండానే మన ఆలోచనా ధోరణిని మారుస్తుంది. పెరటి ఆకుకూరలతో ఆరోగ్యమూ పెరుగుతుంది. తోటపని వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. తోట అంటే విశాలమైనదే కానవసరం లేదు, వరుసగా కుండీలు పేర్చి వెుక్కలు పెంచినా మంచి ఫలితాలే ఉంటాయట. వెుక్కల పెంపకానికి వానాకాలంకంటే అనువైన సమయం ఉంటుందా చెప్పండి!

  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/